TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
Shivatandavam-Comedy Audio Serial
.png)
2వ భాగం.
పక్క ఊళ్ళో సభ కూడా పెద్ద ఎత్తునే జరిగింది. అక్కడ 'అఖిలాంధ్ర అప్పడాలూ మరియు విస్తళ్ల తయారీ' సంస్థను శివరామరావే ప్రారంభోత్సవం చేశారు.
“సోదరులారా! అప్పడాలు వత్తడం, విస్తళ్ళు కుట్టడం ఇత్యాది కుటీర పరిశ్రమలు ఆడవాళ్ల సొత్తని మన మగాళ్ళం ఉపేక్షించకూడదు. బ్రహ్మచారుల్లో నిరుద్యోగుల కిది చక్కని ఉపాధి కల్పనగా మనం భావించాలి. చేసుకున్నవారికి చేసుకున్నంత ఆదాయం. ఇక్కడ చేసిన అప్పడాళూ. విస్తళ్ళూ కొనసాగడానికి మగాళ్ళ హోటళ్ళు ఊరూరా అతి త్వరలో వెలుస్తున్నాయి. అందుచేత, డిమాండుకేమీ తక్కువ లేదని మనవిచేస్తున్నాను.
“ఆ మాటకొస్తే కొన్ని మన కుటీర పరిశ్రమలు...... వాటికి మరి కొన్ని అనుబంధ పరిశ్రమలు పెట్టేందుకు పెద్ద స్థాయిలో చర్చలు జరుపుతున్నాయి. అవన్నీ కూడా అతి త్వరలో కార్యరూపం దాల్చబోతున్నాయని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అఖిలాంధ్ర ద్వేషీ సమాజం"
“వర్ధిల్లాలి!”
“స్త్రీ ద్వేషీ ఉద్యమం"
“వర్ధిల్లాలి!”
"ఇక్కడ ఆడుదాం! ఆడవాళ్ల మీద ఇంత పెద్ద ఎత్తున దాడిచేస్తున్న ఈ. శివరామారావు ఎవరు? అతని కథ ఏమిటి? ఆ వివరాలకే ఈ 'శివతాండవం.' హైదరాబాదు. శ్రావణమాసం, పైగా శుక్రవారం, ఆడవాళ్ల పండగ. (మగాళ్ళకి ప్రత్యేకించి పండుగల్లేవు. అసలీ పండుగ సృష్టించిన పెద్దమనిషెవరో గానీ సదరు శాల్తీకూడా భార్యా విధేయుడే అయివుండాలి. వదిలేయండి - శివరామారావు ఉవాచ) సాయంత్రం, రోడ్లన్నీ పచ్చగా వున్నాయి. రంగు రంగుల చీరెలు రోడ్లమీద గొప్ప ముచ్చటగా తిరుగుతున్నాయి.
పసుపు రాసుకున్న పాదాలు. పాదాలకు గజ్జెల పట్టాలు. వాటి బహు శబ్దాలు రంగ రంగ వైభోగంగా వెలుగుతున్నాయి రోడ్లు. శ్రావణ లక్ష్మి చిందులు తొక్కుతోంది. గుమ్మాలకు మంగళ తోరణాలు కట్టేరు. ఇళ్ళల్లో శ్రావణ లక్ష్మిని కొలుస్తున్నారు. ఏ ఇంట్లో చూసినా పేరంటాళ్ళే. (ప్రతి ఇంటికి పేరంటాళ్ళు వస్తుంటారు.
కనుక ఆ ఇంట్లో మగాళ్ళు రోడ్ల మీద కాలక్షేపం చేయవలసి వస్తుంది. రోడ్లనగానే సినిమాహాలు, బారులు వుంటాయి. సినిమాల వరకు పర్లేదు. బార్లలో దూరిపోతే ప్రమాదం. ఈ ఆడవాళ్ల పండగల్లో మగాళ్ళు ఎక్కువగా బారుల్లోనే కనిపిస్తున్నారు.
ఈ పండగల పుణ్యమా అంటూ మగవాడు మందు కొట్టే ప్రమాదానికి కూడా గురవుతున్నాడు - శివరామారావు ఉవాచ) ఏ ఇల్లు చూసినా ఏముంది గర్వకారణమన్నట్టు ఆ ఇల్లు కేవలం ఆడవాళ్ళూ, కన్నెపిల్లలూ, పసిపిల్లలతో నిండిపోయి అంతులేని ముచ్చట్లతో, కేరింతలతో ఇళ్ళు హోరెత్తి పోతున్నాయి.
పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళికోసం పెళ్ళయిన వాళ్ళు అయిదోతనమో ఆరోతనమో వృద్ధి చెందేందుకు..... నగానట్రా పెరిగేందుకు... కట్టుకున్న వాడూ, కన్నవాళ్ళు క్షేమంగా వుండి తనకి బానిసలై పదికాలాల పాటు బతికేందుకు... ఇట్లా రకరకాల కోరికలతో ఆడవాళ్ళు శ్రావణలక్ష్మిని కొలుస్తున్నారు.
చిరుచీకట్లు పడేవేళ. పెరంటాళ్ల బేచ్ ఒకటి ఆ వీధి దాటుతూ హనుమాన్ భవన్ ముందు ఆగిపోయింది. ఆ ఇంటికి ఓ బోర్డుంది. ఆ బోర్డుమీద కె. శివరామారావు ఎం.ఎ (లిట్) అని వుంది. అని మాత్ర్రమే వుంటే పేరంటాళ్లు అక్కడ ఆగేగారు కాదు. దానికింద వారి వృత్తి కూడా రాసి వుంది. ఏమని? అధ్యక్షుడు. అఖిలాంధ్ర స్త్రీ ద్వేషీ సమాజం. పేరంటాళ్లు ఆ దిక్కుమాలిన బోర్డుని ఒకటికి పదిసార్లు చదువుకున్నారు.
మెటికలు విరిచేరు. పాపిష్టి వెధవని తిట్టుకున్నారు. వాడివల్ల ఇంట్లో మగాళ్ళు బాగా చెడిపోతున్నారని బాధపడ్డారు.
“వీడి జిమ్మడ! బోర్డు కూడాను వీడి మొహానికి? పెళ్ళీ పెటాకుల్లెకుండా అఘోరిస్తున్నది చాలక పెళ్ళయిన మగాళ్ళని కూడా చెడగొడుతున్నాడు దొంగచచ్చినోడు"
“గుమ్మం దగ్గిర చెప్పులు చూడు... గుట్టలు గుట్టలుగా పడివున్నాయి. లోపల మీటింగు జరుగుతుందేమో!”
“ఏం మీటింగో దిక్కుమాలిన మీటింగు! ఆ చెప్పేవాడు ఏ పురానమో, భాగవతమో చెప్పకూడదూ? సంసారాలు పాడుచేసుకోమని బుద్దులు చెబుతాడా బుద్దులు!”
“ఇట్లా ఎంతకాలం పెడతాడో సభలు!”
ఇదొక స్వగతం. (ఈ స్వగతం మిస్ మీనాకుమారిది. పెళ్ళికి ఎదిగిన ఆడకూతురు. శివుడి (శివరామారావుని చాలామంది శివుడనే సంబోధిస్తారు) బోధలు భూలోకంలో పురుష లోకాన్ని పాడు చేసేస్తే తనకిక పెళ్ళి కాదేమోనని భయం మిస్ మీనకుమారిది బాగా వుంది)
“అన్నయ్యగారు సభలో వుండేవుండొచ్చు!”
“ఆయన నొక్కడేనాన్న మాటేమిటి? మా అన్నయ్య కూడా వెళ్ళీవుంటాడు.” (వాళ్ల అన్నయ్యగారంటే రెండో ఆవిడ భర్త. మా అన్నయ్యంటే మొదటి ఆవిడ భర్త. ఇరుగు పొరుగు ఇళ్ళు గనుక ఈ వరసలు తప్పవు)
“వారు వీరు అనే మాటేమిటమ్మా! తోచని మగాళ్లంతా ఈ ఇంట్లోనే తగలడి వుంటారు" ఈ అభిప్రాయం ప్రకటించిన మహిళ పేరు దుర్గమ్మ. ఆమె ఒకానొక హెడ్ కానిస్టేబుల్ భార్య. భర్తని అదుపులో వుంచుకోవటం ఆవిడ ప్రత్యేకత.
అతన్ని హనుమాన్ భవన్లోకి అడుగు పెట్టకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటోంది.
ఆ తరువాత ఏం జరిగిందో NEXT EPISODE...
|
|