TeluguOne Services
Copyright © 2000 -
, TeluguOne - Comedy - All rights reserved.
.png)
గేటు దగ్గర కాపలాకాస్తున్న గూర్ఖా గజదొంగ మంగులు కంట పడ్డాడు. అతను మెల్లగా ఇంటి వెనక వైపుకి వెళ్ళి, కంపౌండ్ వాల్ జంప్ చేసి లోపలికెళ్ళాడు. అక్కడ డ్రయినేజ్ పైప్ లైన్ పట్టుకుని పైకి ప్రాకి బాల్కనీలోకి దుమికాడు. పోలీస్ కమీషనర్ బెడ్ రూమ్ ఎక్కడుంటుందో తన వేగులద్వారా గజదొంగ మంగులు తెల్సుకున్నాడు. ఒక్క బెడ్ రూంలోకి ఎంటరయ్యాడు. బెడ్ రూం కమీషనర్ పెట్టె గురకతో దద్దరిల్లిపోతోంది. శ్రీలక్ష్మి దీప కూడా గాడంగా నిద్రపోతున్నారు. మంచాన్ని సమీపించి మంగులు జేబులోంచి ఓ పొట్లం తీసి అందులోని పొడిని చేతిలో వేసుకుని దీప మొహంమీద చల్లాడు.
దీప మెడని ఓ పక్కకి వాల్చేసింది. మంగులు అతి జాగ్రత్తగా దీపని వాళ్ళిద్దరి మధ్యలోంచి తీసి తన భుజంమీద వున్న గోనెసంచిలో వేసుకుని గదిలోంచి బయటకి నడిచాడు. మెట్లమీంచి క్రిందకి దిగి, హాలు తలుపులు తీసుకుని బయటికొచ్చాడు. కాంపౌండ్ వాల్ గేటు దగ్గర గుర్ఖా వుంటాడని ఇంటి వెనక్కి వెళ్ళి అక్కడ గోడ ఎక్కి బయటికి గెంతాడు. కావీ మూత్ర విసర్జన కోసం అప్పుడే ఇంటి వెనక్కొచ్చిన గూర్ఖాకి ఇంట్లోంచి భుజంమీద మూటతో బయటికి దూకిన మంగులు కనిపించాడు. గూర్ఖా “చోర్... చోర్” అంటూ కంగారు కంగారుగా అరిచాడు అంతకంటే కంగారుగా విజిల్ వూదాడు. మంగులు భుజం మీది మూటతో పరుగు లంకించుకున్నాడు. బయటి గోలకి కమీషనర్ లింగారావ్ కి, శ్రీలక్ష్మి కి మెలకువ వచ్చింది. తమ మధ్య దీప లేకపోవడం వాళ్ళు గమనించారు. “అమ్మా దీపా...” అంటూ శ్రీలక్ష్మి బావురుమంది. ఇద్దరూ గబగబా మెట్లుదిగి హాల్లోకొచ్చారు. అప్పుడే బయటి నుండి లోపలికి గూర్ఖా వచ్చాడు. “షాబ్... మనదీ ఇంటీ గోడమీంచి ఒకా మన్షీ దూకీ బయటికి పోయాడు. షాబ్.... వాడ్కీ భుజం మీద ఓ పెద్ద మూట వుంది షాబ్...” ఆయాసపడుతూ చెప్పాడు.
“అమ్మా దీపా... ఆ మూటలో వున్నది నువ్వేనమ్మా....” అంటూ లక్ష్మి మళ్ళీ బావురుమంది. “నువ్వు వాడ్ని వెంబడించి పట్టుకోక వెనక్కివచ్చావేం?” అరుస్తూ అడిగాడు కమీషనర్. “నేను పరిగెత్తలేకపోయాన్ షాబ్” అన్నాడు గూర్ఖా. “ఏంటే... భుజంమీద పెద్ద మూటతో ... ఛీ... ఛీ.. ముటకాదు.... భుజంమీద దీపతో వాడు ఈజీగా పరిగెత్తాడు. నువ్వు పరిగెత్తలేకపోయావా? ఎందుకని... ఎందుకని... ఎందుకని?” చిరాగ్గా అరుస్తూ అడిగాడు లింగారావ్ తలమీద మొట్టుకుంటూ. “నాకూ జోరుగా బాత్రూం వస్తుంది షాబ్” అని చెప్పి-“బాప్ రే...” అంటూ రెండు అరిచేతులూ పొత్తికడుపు కింద అడ్డం పెట్టుకుని స్పీడ్ గా పరుగుతీశారు గూర్ఖా. “ఈస్పీడ్ లో వీడు ఇందాకే పరిగేట్టుంటే ఆ మంగులు దొరికేవాడే” విసుగ్గా అని టేబుల్ మీది వైర్ లెస్ పెట్ తీశాడు లింగారావ్. వైర్ లెస్ పెట్ లో అన్ని పోలీసు స్టేషన్ల కీ మంగులు దీపని ఎత్తుకెళ్లిన సంగతి చెప్పి, అన్ని దారులూ క్లోజ్ చేయమని ఇన్స్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు కమీషనర్ లింగారావ్. “దేవా... ఏడుకొండలవాడా... నా దీప నాకు క్షేమంగా దక్కితే మా వారి బొటన వేలిని సమర్పించుకుంటా స్వామీ....” అని మొక్కుకుంది శ్రీలక్ష్మి. అది విన్న కమీషనర్ లింగారావ్ నెత్తిమీద బాధగా ఠపా ఠపామని మొట్టేసుకున్నాడు. **** **** **** **** ****
|
|