బాలీవుడ్ లో ఘోరంగా దెబ్బతిన్న మహేష్ బావ..!
on Apr 30, 2016
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కు చేరుకోవడానికి ఇప్పటి వరకూ చాలా మంది ప్రయత్నించారు. కానీ సక్సెస్ అయిన వాళ్లు మాత్రం లేరు. చిరంజీవి, నాగార్జున, రామ్ చరణ్, లేటెస్ట్ గా సర్దార్ గబ్బర్ సింగ్ తో పవన్ కళ్యాణ్..ఇలా అందరూ బాలీవుడ్ లో పాగా వేయడానికి ట్రై చేసి విఫలమైన వాళ్లే. వీళ్లందరూ హీరోలుగా ట్రై చేస్తే, మహేష్ బాబు బావ సుధీర్ బాబు మాత్రం, కొత్త పంథాలో విలన్ గా ట్రై చేశాడు. బాఘీ సినిమాలో విలన్ రాఘవ్ పాత్రను సుధీర్ బాబు చేశాడు. ప్రమోషన్లో భాగంగా, సుధీర్ ఇంట్రడక్షన్ వీడియోను మూవీ టిం రిలీజ్ చేయగానే, అతనికి ప్రశంసల వర్షం కురిసింది. అందరూ సుధీర్ బాబు బాడీకి, మార్షల్ ఆర్ట్స్ టాలెంట్ కు ఫిదా అయిపోయారు. కానీ వర్షం రీమేక్ గా బాలీవుడ్ లో తెరకెక్కి, నిన్ననే రిలీజైన బాఘీ డిజాస్టర్ గా పేరు తెచ్చుకుంది. టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్ జంటగా తెరకెక్కిన బాఘీని, రివ్యూలన్నీ బిలో యావరేజ్ గా డిసైడ్ చేసేశాయి. అక్కడి జనాన్ని ఈ సినిమా ఏ మాత్రం మెప్పించలేకపోయింది. ఇక సుధీర్ బాబు పాత్రనైతే, కనీసం పూర్తిగా వాడుకోను కూడా లేదు. సినిమాలో సుథీర్ రోల్ కు ఎలాంటి సెన్సిబిలిటీ లేదు. ఇక్కడ గోపీచంద్ వేసిన ఆ పాత్రను రీమేక్ లో సరిగ్గా చూపించలేకపోయాడు దర్శకుడు. దీంతో, కనీసం సుధీర్ బాబు అయినా, బాలీవుడ్ లో తెలుగుజెండా ఎగరేస్తాడనుకున్న తెలుగు ప్రేక్షకులకు నిరాశే ఎదురైంది. అయితే, సినిమా పోయినప్పటికీ విలన్ పాత్ర కోసం సుధీర్ బాబు చేసిన హార్డ్ వర్క్, అతని డెడికేషన్ ను మెచ్చుకోవాల్సిందే..
Also Read