చిరు సినిమాకు రాని పవన్, నితిన్ ఆడియోకు వెళ్తున్నాడు..!
on Apr 30, 2016
పవన్ కళ్యాణ్ కు నితిన్ ఎంత వీరాభిమానో అందరికీ తెలిసిందే. అందుకే తన అ..ఆ సినిమా ఆడియో ఫంక్షన్ కు రావాల్సిందిగా నితిన్ కోరగానే పవన్ ఒప్పేసుకున్నాడు. నితిన్ తో పాటు ఆ సినిమా దర్శకుడు త్రివిక్రమ్ కూడా పవన్ కు చాలా క్లోజ్ కావడమే, అందుక్కారణం. కానీ విచిత్రమేంటంటే, నితిన్ ఆడియో ఫంక్షన్ కు రావడానికి ఒప్పుకున్న పవన్, చాలా కాలం తర్వాత తన అన్నయ్య స్టార్ట్ చేస్తున్న 150 వ మూవీ ఓపెనింగ్ కు మాత్రం రాలేదు. సాధారణంగా చిరు ఫంక్షన్లకు పవన్ రాకపోయినా ఎవరికీ పెద్ద పట్టింపుల్లేవు. ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు కదా అని అనుకునేవారు. కానీ చిరు 150 అనేది మెగా ఫ్యామిలీకి చాలా ప్రెస్టీజియస్ గా మారిన అంశం. దానికి తోడు కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పేరుతో నిర్మాణ సంస్థ ను ప్రారంభించిన కారణంగా, అల్లు కుటుంబంతో సహా మొత్తం మెగాఫ్యామిలీ హాజరైంది. అక్కడ కనిపించని వ్యక్తి, కనిపించిన లోటు ఒకటే. కొణిదెల కళ్యాణ్ బాబు అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.
సర్లే అనుకుని మెగాఫ్యాన్స్ సరిపెట్టుకుంటే, ఇప్పుడు సడెన్ గా నితిన్ ఆడియోకు హాజరవుతున్నాడన్న వార్త అందరికీ షాక్ ఇచ్చింది. " మేము రమ్మంటాం. కానీ వాడు మా ఫంక్షన్లకు రాడు. దానికి మమ్మల్నేం చేయమంటారు.." చిరు బర్త్ డే ఫంక్షన్లో నాగబాబు చెప్పిన విషయం ఇది. అందరి ఫంక్షన్లకూ హాజరయ్యే పవన్, తన కుటుంబ సభ్యుల్ని, ఫ్యామిలీ ఈవెంట్స్ ను ఎందుకు దూరం పెడుతున్నాడు అనేదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న కోటి డాలర్ల ప్రశ్న.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
