బ్రహ్మోత్సవం ఫైనల్ కాపీ ఈరోజే రెడీ..!
on May 16, 2016
సూపర్ స్టార్ మహేష్ బ్రహ్మోత్సవం సినిమా ఈ నెల 20న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ప్రొడక్షన్ చివరికి వచ్చేసిన ఈ సినిమాకు ఈరోజుతో గ్రాఫిక్స్ వర్క్ కూడా పూర్తవుతోంది. మధ్యాహ్నంతో ఫైనల్ కాపీ రెడీ అయిపోతుందని, సాయంత్రానికి సెన్సార్ కు వెళ్లనుందని సమాచారం. ఓవర్సీస్ ప్రింట్స్ కూడా ఈ రోజు రాత్రికే డిస్పాచ్ చేసేయబోతున్నారు. సినిమా చాలా బాగా వచ్చిందని యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. రీసెంట్ గానే మూవీ శాటిలైట్ రైట్స్ ను 11.20 కోట్ల భారీ మొత్తానికి జీ తెలుగు చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. మహేష్ సినిమాల్లో ఇదే అత్యధిక శాటిలైట్ రేట్. పెద్ద ఛానల్స్ అన్నీ రైట్స్ కోసం తలపడినా, చివరికి ఫ్యాన్సీ ఎమౌంట్ చెల్లించి హక్కుల్ని జీ దక్కించుకుంది. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన బ్రహ్మోత్సవం సినిమాకు టైటిల్ ప్రకటించినప్పటి నుంచే పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. కాజల్, సమంత, ప్రణీతలు మహేష్ సరసన సందడి చేయబోతున్నారు. పివిపి బ్యానర్ నిర్మించిన బ్రహ్మోత్సవం భారీ అంచనాల నడుమ ఈ శుక్రవారం విడుదల కాబోతోంది.
Also Read