ఐశ్వర్యారాయ్ లిప్ స్టిక్ ఇప్పుడు హాట్ టాపిక్..!
on May 16, 2016
ఐశ్వర్యారాయ్ కేన్స్ ఫెస్టివల్ లో సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారుతోంది. ప్రపంచ సినీ పరిశ్రమ అంతా గమనించే కేన్స్ లో ప్రతీరోజు, అద్భుతమైన డ్రస్సింగ్ తో మెరిసిపోతోంది బచ్చన్ వారి కోడలు. ఈ ఏడాది కేన్స్ ఫెస్టివల్ లో ఇప్పటికే ఐదు సార్లు రెడ్ కార్పెట్ మీద నడిచేసింది ఐష్. అయితే అన్నింటిలోకీ, ఆమె నిన్న వేసుకన్న మేకప్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దానికి కారణం ఆమె పెదాలే. సాధారణంగా ఎక్కువ శాతం సెలబ్స్ నార్మల్ రెడ్, బ్రైట్ రెడ్, పింక్ లిప్ స్టిక్స్ ను ప్రిఫర్ చేస్తుంటారు. అయితే ఐష్ మాత్రం, చాలా వైవిధ్యంగా పర్పుల్ లిప్ స్టిక్ వేసుకొచ్చింది. ఆమె పెదాల్ని చూసి ఫ్యాన్స్ మరింత ఫ్లాట్ అయిపోతే, క్రిటిక్స్ మాత్రం జోక్స్ వేసుకుని నవ్వుకున్నారు.
ఆదివారం జరిగిన ది ల్యాండ్ ఆఫ్ ది మూన్ సినిమా ప్రీమియర్ కు, అద్భుతమైన వర్క్ చేసిన బర్డోట్ రమీ కదీ డ్రెస్, పర్పుల్ లిప్ స్టిక్ వేసుకుని హాజరైంది ఐశ్వర్య. ఐష్ గెటప్ కు పొగడ్తలతో పాటు, ట్విట్టర్లో అనేక జోకులు కూడా పేలాయి. ఆమె మేకప్ ను ఏషియన్ పెయింట్స్ స్పాన్సర్ చేసిందని ఒకరు ట్వీట్ చేస్తే, ఆమె బ్లాక్ కరెంట్ ఐస్ క్రీమ్ తిని అవే పెదాలతో రెడ్ కార్పెట్ మీద నడిచిందని మరొకరు..ఇలా ట్వీట్స్ తో ఐష్ లిప్స్ పై జోకులు ట్రెండ్ అయ్యాయి. అయితే తానొక ప్రొఫెషనల్ ననీ, ఫ్యాషన్ ను ఆర్ట్ గా ట్రీట్ చేస్తానని ఐశ్వర్య వీటిపై రెస్పాండ్ అయింది. కాగా, ఒక్కసారి హాజరైతే ప్రతిష్టాత్మకంగా భావించే కేన్స్ ఫెస్టివల్, ఐష్ కు వరసగా పదిహేనో సంవత్సరం కావడం విశేషం.