Home

»

Latest News

బ్రహ్మోత్సవం ఫస్టాఫ్ రిపోర్ట్..!

May 20, 2016

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మహేశ్ బ్రహ్మోత్సవం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అర్థరాత్రి నుంచే అభిమానులు ధియేటర్ల వద్ద సందడి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని సెంటర్లలో మొదటి షో పడి ఫస్టాఫ్ అయ్యింది. ఈ సందర్భంగా ఫస్టాఫ్ రిపోర్ట్ మీ కోసం.

శ్రీకాంత్ అడ్డాల అనగానే సంప్రదాయాలు, కుటుంబాల చుట్టూ కథ తిరుగుతుంది. ఆ ఆనవాయితీని కొనసాగిస్తూనే టైటిల్స్‌ దగ్గర నుంచే ఆయన మార్క్ కనపడింది. చాలా సాంప్రదాయపద్ధతిలో సింపుల్‌గా టైటిల్స్ వేశారు. టైటిల్ కార్డులు అవ్వగానే సమంత చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్న మన సూపర్‌స్టార్ మహేశ్ ఎంట్రీ. సింపుల్‌గా ఉన్నా ఓ రేజ్‌ అందంతో మరోసారి అమ్మాయిల హృదయాలు దోచుకున్నాడు. ఫస్ట్ సాంగ్‌ సంగీత్‌తో స్టార్ట్ అయ్యింది..పాట అవ్వగానే ఎన్‌ఆర్ఐగా కాజల్ ఎంట్రీ బాగుంది.

కాజల్‌ను చూడగానే మనోడు లవ్ ఎట్ ఫస్ట్ సైట్. కాజల్, మహేశ్‌ల మధ్య వచ్చిన రోమాంటిక్ టచ్ ఆకట్టుకుంది. నాయుడోరింటికాడ సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ సాంగ్‌లో మహేశ్ చుక్కల మధ్య చంద్రుడిలా ఉన్నాడు. కుటుంబ వాతావరణం కావడం అల్లరి ఇలా ఎక్కడా బోర్ కొట్టలేదు. మరో హీరోయిన్‌ ప్రణీత, మహేశ్‌ల లిటిల్ లవ్ ట్రాక్ , వారి మాటలు బావున్నాయి. మరోక పాట "ఆట పాటలాడు" పిక్చరైజేషన్ చాలా బాగుంది. కథ సాఫీగా సాగుతున్న టైంలో రావు రమేశ్ ఎంట్రీ ఇచ్చి సినిమాను మలుపు తిప్పాడు. ఈ మలుపు సెకండ్ హాఫ్‌పై మరింత హైప్ తీసుకొచ్చింది. ఇంటర్వెల్ ట్విస్ట్‌తో తర్వాత ఏం జరగబోతోందో అని ప్రేక్షకులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com