బ్రహ్మోత్సవం తమిళఫ్యాన్స్ కు షాక్..!
on May 20, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు కు కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే కాక, ఇండియా వైడ్ ఫాలోయింగ్ ఉంది. బాలీవుడ్ తో సహా, అనేక వుడ్లలో మహేష్ ను అభిమానించేవాళ్లున్నారు. తాజాగా శ్రీమంతుడుతో తమిళ వెర్షన్ డైరెక్ట్ గా రిలీజ్ చేసిన మహేష్, బ్రహ్మోత్సవాన్ని కూడా అలాగే చేస్తాడని ఆశించారు మహేష్ తమిళ అభిమానులు. అయితే వాళ్లందరికీ షాక్ ఇస్తూ, కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే రిలీజ్ చేసింది మూవీ టీం. తమిళ్ కు ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరగలేదని, వీలైనంత త్వరలో కంప్లీట్ చేసి జూన్ లో తమిళనాట భారీగా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో మహేష్ సినిమాను తెలుగు వారితో పాటు తాము కూడా ఒకేసారి ఎంజాయ్ చేద్దామనుకున్న మహేష్ తమిళ ఫ్యాన్స్ కు నిరాశే ఎదురైంది. అయితే చెన్నైలో ఉన్నవాళ్లకు మాత్రం, తెలుగు వెర్షన్ సినిమా చూసే అవకాశం ఉంది. చెన్నై లో తెలుగువాళ్లు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తెలుగు వెర్షన్ బ్రహ్మోత్సవాన్ని విడుదల చేశారు. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమాలో తొలిసారి మహేష్ ముగ్గురు హీరోయిన్లతో నటించడం విశేషం.