Home

»

Latest News

"బ్రహ్మోత్సవాన్ని" మలుపు తిప్పిన వ్యక్తి ఈయనే..!

May 20, 2016

సూపర్‌స్టార్ మహేశ్- శ్రీకాంత్ అడ్డాల కాంబోలో రిలీజైన బ్రహ్మోత్సవం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఫస్ట్‌షో ముగిసి ఫ్యాన్స్‌ బయటకొస్తున్నారు. సినిమాలో అందరూ మహేశ్ గురించి మాట్లాడుకోవాలి..లేదంటే డైరెక్టర్ టాలెంట్‌పై డిబేట్ పెట్టాలి.

అయితే వీళ్లందరిని పక్కన బెట్టి. ఓ యాక్టర్ అందరి దగ్గర మార్కులు కొట్టేశాడు. ఆయన ఎవరో కాదు తెలుగు సినిమా లెజెండ్ రావు గోపాలరావు గారి అబ్బాయి...రావు రమేశ్. ఈ మూవీలో రావు రమేశ్ క్యారెక్టర్ మరోసారి అదిరిపోయింది. శ్రీకాంత్ గత సినిమాల్లోనూ రమేశ్‌కు మంచి క్యారెక్టర్లే వచ్చాయి. వాటన్నింటిని బీట్ చేసి రావు రమేశ్ బ్రహ్మోత్సవంలో ఒదిగిపోయాడంట. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు సినిమాను మలుపు తిప్పాడట. ఈ ఒక్క సీన్‌తో సినిమా ఓ రేంజ్‌కు వెళ్లిందట. క్లైమాక్స్‌లో వచ్చిన హెవీ ఎమోషనల్ సీన్స్‌లో తాను తప్ప వేరొకరు న్యాయం చేయలేరన్నంతగా నట విశ్వరూపాన్ని చూపించడట. రమేశ్ తన యాక్టింగ్‌తో ఇలా అందరిని ఇంప్రెస్ చేశాడన్న మాట.

g-news-banner

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com