బాలయ్య బిజినెస్ క్లోజ్ అయిపోయింది..
on May 16, 2016
.jpg)
నందమూరి బాలకృష్ణ అన్న పేరుకు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. జనం చేత విజిల్స్ వేయించాలన్నా, డైలాగ్స్ తోనే థియేటర్ లో కాక పుట్టించాలన్నా బాలయ్యకు సాటి లేరు. అయితే నటసింహానికి ప్లస్ తో పాటు మైనస్ కూడా ఇదే. మాస్ కు దగ్గరైతే, క్లాస్ కు దూరంగా వెళ్లే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. పూర్తి క్లాస్ సినిమాల్నే ఆదరించే ఓవర్సీస్ లో బాలయ్యకు సరైన మార్కెట్ ఉండకపోవడం వెనుక కూడా ఇదే కారణం. అయితే ఈ పరిస్థితిని మార్చేసింది గౌతమీపుత్ర శాతకర్ణి. గమ్యం నుంచి కంచె వరకూ, మంచి క్లాస్ సినిమాలు చేసిన క్రిష్ కు ఓవర్సీస్ లో ఉన్న మంచి పేరు ఇప్పుడు బాలయ్య సినిమా బిజినెస్ కు బాగా హెల్ప్ అయింది. బాలయ్య, క్రిష్ కాంబో, అది కూడా భారీ హిస్టారికల్ మూవీ. ఇదే ఫారిన్ మార్కెట్ లో వేవ్స్ క్రియేట్ చేసింది. లేటెస్ట్ గా రెండుటాప్ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, చివరి వరకూ శాతకర్ణి రైట్స్ కోసం ఫైట్ చేశాయని, చివరకు భారీ రైట్స్ కు శాతకర్ణి హక్కులు కొనుగోలు చేశారని సమాచారం. కరెక్ట్ ఫిగర్ బయటికి రానప్పటికీ, ట్రేడ్ వర్గాల ఇన్ఫర్ మేషన్ ప్రకారం 4 నుంచి 5 కోట్ల మధ్యలో ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయిందని అంటున్నారు. బాలయ్య సినిమాకు ఈ రేంజ్ రేటు పలకడం, ఇదే మొదటిసారి. మరి శాతకర్ణి అక్కడి ప్రేక్షకలను ఏ విధంగా ఆకట్టుకుంటాడో వేచి చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



