RELATED NEWS
NEWS
382 మైళ్ళ గోల్డెన్ గేట్ రిలే లో తెలుగు కోసం పరుగిడిన సిలికానాంధ్ర మనబడి బృందం !


382 మైళ్ళ గోల్డెన్ గేట్ రిలే లో తెలుగు కోసం పరుగిడిన సిలికానాంధ్ర మనబడి బృందం  !
 

సాన్ ఫ్రాన్సిస్కో - అమెరికా : తెలుగు ను ప్రాచీన భాష నుంచి ప్రపంచ భాషగా మార్చాలని పరితపిస్తూ, మాతృభాషను భవిష్యత్తు తరాలకి అందించడం కోసం కల్పించే ప్రాచుర్యం లో భాగంగా, ప్రవాసం లోని తెలుగు పిల్లలకు తెలుగు నేర్పించే సిలికానాంధ్ర మనబడి మరో విశిష్ట ప్రాచుర్య కార్యక్రమం ద్వారా తెలుగు భాషాప్రేమికులను అలరించింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లో ప్రతి ఏటా అత్యంత ప్రతిష్టాత్మంగా నిర్వహించే  'గోల్డెన్ గేట్ రిలే ' పరుగు పందెం లో, వెంకట బట్టరం గారి నాయకత్వంలో.  వీర గుండు  కెప్టెన్ గా మనబడి ప్రవేశం,   భవ నీలకంఠి  కెప్టెన్ గ మనబడి ప్రసూనం అనే రెండు జట్లుగా ఏర్పాటయిన 24 మంది సభ్యుల బృందం,  కలిస్తోగా నగరం నుంచి శాంతాక్రూజ్ నగరం వరకు గల 191 మైళ్ళు దూరాన్ని,  రెండు జట్లుగా మొత్తం 381 మైళ్ళ దూరాన్ని కొండలు గుట్టలు,అడవులు,ఎండ,చలి,రాత్రిళ్ళు లెక్కచేయకుండా ౩౩ గంటలు నిర్విరామంగా పరిగెత్తి  లక్ష్యాన్ని అధిగమించింది.

పందెం లో పాల్గొనే బృందాన్ని అనుసరించే వాహనాలను, ‘మనబడి’, ‘తెలుగుకు పరుగు’ అనే తోరణాలతో అలంకరించటం  తెలుగు వారినే కాకుండా , అమెరికన్లను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. దారి పొడుగునా ఎంతోమంది తెలుగు వారు ముందుకి వచ్చి, పరుగెత్తే సభ్యులకు హర్షాతిరేకాలతో వారి సంఘీభావం తెలియచేశారు.తెలుగు భాషను ముందు తరాలకు అనించదానికి  సిలికానాంధ్ర చేస్తున్న కృషిని ముఖ్యంగా మనబడి కార్యక్రమం ద్వారా అమెరికా మరియు ఇతర దేశాలలో  పిల్లలకు తెలుగు నేర్పటానికి పడుతున్న శ్రమని అభినందించారు.



 

ఈ సందర్భంగా సిలికానాంధ్ర మనబడి డీన్ రాజు చమర్తి మాట్లాడుతూ భాషా సేవయే భావి తరాల సేవ అన్న స్ఫూర్తితో తెలుగు భాషకు ప్రపంచ వేదికపై పట్టం కట్టే బాధ్యతను మోస్తున్నందుకు ఆనందంగా ఉందని , కేవలం 20 మంది తో ప్రారంభమైన మనబడి ఇప్పుడు 6000 మందికి పైగా విద్యార్ధులతో 1000 మందికి పైగా భాషా సైనికుల బోధనలో యూరోప్, ఉక్రైన్,కువైట్,స్కాట్లాండ్,హంగ్ కాంగ్,సౌత్ ఆఫ్రికా, సింగపూర్ వంటి ఎన్నో దేశాలకు విస్తరించిందని తెలిపారు. మే నెల లో జరిగే వార్షిక పరీక్షలు నిర్వహించఛానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి అధికారులు అమెరికా చేరుతున్నారని.

అమెరికా వ్యాప్తంగా 24 ప్రాంతాలలో 1025 మంది విద్యార్ధులు పరీక్షకు హాజరవనున్నారని, ఉత్తీర్ణులైన విద్యార్ధులకు, మే నెల 24 వ తేదీన క్యాలిఫోర్నియా లో జరిగే స్నాతకోత్సవంలో తెలుగు విశ్వవిద్యాలయం అధికారుల చేతులమీదుగా పట్టాలు అందజేస్తామని తెలిపారు.  వచ్చే సెప్టెంబర్ నుంచి ప్రారంభమయ్యే నూతన విద్యాసంవత్సరానికి ప్రవేశములు జరుగుతున్నవని, ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు మనబది.సిలిచొనంధ్ర.ఒర్గ్  లేదా టోల్ ఫ్రీ నంబర్ 1-844-626-2234 (BADI)సందర్శించవచ్చని తెలిపారు. 

 

మనబడి బృందం లోని స్నేహ వేదుల  మాట్లాడుతూ, ఇప్పటికే మనబడి ద్వారా పిల్లలకు తెలుగు బోధనే కాకుండా బాలానందం, సాంస్కృతికోత్సవాలు, తెలుగు మాట్లాట, పలుకు బడి, పిల్లల పండుగ  వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లలలో స్ఫూర్తి నింపుతున్నామని. ఈ తెలుగుకు పరుగు కార్యక్రమం ద్వారా మనబడి కార్యకలాపాలు మరింతమంది కి చేరువవుతాయని భావిస్తున్నామని వచ్చే విద్యాసంవత్సరానికి 10000 మంది విద్యార్ధులకు తెలుగు నేర్పించే లక్ష్యంగా మనబడి బృందం పనిచేస్తోందని తెలిపారు. ఈ పరుగులో Jayachandra Yanamandala, Prashant Ghattamaneni, Anuradhika kandula, SubbaLakshmi Dhulipala, Vishal Sodem, Harsha Nagaraju, Rajaraman Karuppiah, Bhava Nelakanti, Sivaram Chamiraju, Aravind Srinivasan, Tara  Nelakanti, Satish Ananthanarayana, Veera  Gundu, Venkata Battaram, Puttapiah  Muniyappa, Kishore Varanasi, Raju    Chamarthi, Satya vaddavalli, Purna Chitneni, Shobha Charagondla, Gopal  Parakulum, Madhu Nagaram, Balaji Subramanyam, Snehalata Vedula పాల్గొన్నారు. 

TeluguOne For Your Business
About TeluguOne
;