LATEST NEWS
విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ప్రభావం వైసీపీపై ఏ మేరకు ఉంటుందన్న చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. జగన్ రాజకీయాలలోకి ప్రవేశించడానికి ముందు నుంచి కూడా విజయసాయి అత్యంత సన్నిహితుడిగా ఉంటూ వచ్చారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో కూడా విజయసాయి సహ నిందితుడు. జగన్ ఏ1 అయితే విజయసాయి ఏ2గా ఉన్నాయి.   వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చిన విజయసాయి,  ఇప్పుడు  పరివర్తన రాజనీతి పార్టీ  పేరుతో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు.   దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా తన పార్టీ పనిచేస్తుందని విజయసాయి పార్టీ ప్రకటన సందర్భంగా చెప్పారు. పార్టీ అధికారిక ప్రకటనతో పాటు జెండాను కూడా ఆవిష్కరించిన విజయసాయిరెడ్డి, రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అడుగులు వేయడమే తమ   లక్ష్యమని ప్రకటించారు.  ఈ పరిణామం వైసీపీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే అంశంపై  సర్వత్రా ఆసక్తి నెలకొంది. అదే విషయంపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీలో అత్యంత కీలకంగా, పార్టీ నేతకు అధినేతకు అత్యంత విశ్వసనీయ వ్యక్తిగా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు  సొంత కుంపటి పెట్టుకోవడం ఆ పార్టీకి ఏదో మేరకు నష్టాన్ని కలిగించే అవకాశం ఉందన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తమౌతోంది.   ఇది కూడా చదవండి:  జయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.! పార్టీలో అసంతృప్తితో ఉన్న, అలాగే ఆయనతో సత్సంబంధాలు కలిగిన కొందరు నేతలు భవిష్యత్తులో వైసీపీని వీడి విజయసాయి పంచన చేరే అవకాశలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  అదలా ఉంచితే..  కొత్త పార్టీ ద్వారా ఆయన ఏ మేరకు ప్రభావం చూపగలరు, ప్రజాదరణను ఏ విధంగా సంపాదించుకుంటారు అనే విషయంలో కూడా రాజకీయవర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. రానున్న కాలంలో విజయసాయి రెడ్డి కొత్త పార్టీ పరివర్తన రాజనీతి పార్టీ (పీఆర్పీ)  ప్రయాణం అధికార, ప్రతిపక్ష పార్టీల వ్యూహాలను ఏ మేరకు ఎలా  ప్రభావితం చేస్తుందన్నది చూడాల్సి ఉంది. మొత్తం మీద చెప్పిన ముహూర్తానికి చెప్పినట్లుగా తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విజయసాయి, ముందు ముందు రాష్ట్ర రాజకీయాలలో  ఏ మేరకు ప్రభావం చూపుతారన్న ఆసక్తి సర్వత్రా వ్యక్త మౌతోంది.   మీకు నచ్చవచ్చు:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి   విజయసాయి పెట్టబోయే కొత్త పార్టీ: చేరబోయే కొత్త నేత.. ఎవరో తెలుసా.? [Effect of Vijayasai Reddy New Party onYCP, Parivarthana Rajaneethi Party, PRP, Political Impact, AP Politics, Telugu One]
ఉద్యోగం లేకపోయినా ఉద్యోగం ఉన్నట్లు సృష్టించారు.. జీతం రాకపోయినా వేలల్లో జీతం అందుతున్నట్లు నకిలీ పే స్లిప్పులు తయారు చేశారు. ఆధార్, పాన్ కార్డులను సైతం ఫోర్జరీ చేసి బ్యాంకు అధికారులను నమ్మించారు. ఇలా పక్కా స్కెచ్‌తో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు ఐసీఐసీఐ నుంచి ఏకంగా రూ.30 లక్షల రుణం పొందిన ముఠా బాగోతం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. సాధారణంగా బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం పొందాలంటే ఉద్యోగం, నెలవారీ ఆదాయం, గుర్తింపు పత్రాలు కీలకం. అయితే ఈ నిబంధనలనే తమ మోసానికి అవకాశంగా మలుచుకున్నారు నిందితులు. సుమిక్రో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీలుగా వ్యవహరిస్తున్న రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు ఈ మోసానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో గంటల శంకర్ అనే వ్యక్తిని బెంగళూరులోని ప్రముఖ కాప్‌కో టెక్నాలజీస్ సంస్థలో సీనియర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించేలా నకిలీ నియామక పత్రాలు, పే స్లిప్పులు సృష్టించారు. అంతేకాకుండా ఫోర్జరీ చేసిన ఆధార్, పాన్ కార్డులను కూడా సిద్ధం చేశారు. ఈ నకిలీ పత్రాలను అసలైనవిగా నమ్మించిన నిందితులు ఐసీఐసీఐ బ్యాంకులో శంకర్ పేరుతో ఏకంగా రూ.30 లక్షల వ్యక్తిగత రుణం పొందినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారంలో రుణం మంజూరయ్యేందుకు సహకరించినందుకు రామావత్ సురేష్‌కు రూ.6.70 లక్షలు కమీషన్‌గా చెల్లించినట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా, శంకర్ పేరు మీద జారీ అయిన క్రెడిట్ కార్డును ఉపయోగించి మరో రూ.3 లక్షల వరకు షాపింగ్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే రుణ చెల్లింపుల్లో తేడాలు రావడం, బ్యాంకు అంతర్గత తనిఖీలు చేపట్టడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. బ్యాంకు అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఇబ్రహీంపట్నం పోలీసులు దర్యాప్తు చేపట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రామావత్ గోపాల్, పులి సురేష్ బాబు, రామావత్ సురేష్, గంటల శంకర్, గంటల శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా ఇదే తరహాలో మరిన్ని బ్యాంకులను మోసం చేసిందా? నకిలీ పత్రాల తయారీలో ఇంకా ఎవరైనా సహకరించారా? ఈ వ్యవహారంలో బ్యాంకు సిబ్బంది పాత్ర ఏమైనా ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఉద్యోగం లేకుండానే ఉద్యోగం ఉన్నట్లు.. జీతం లేకుండానే భారీ ఆదాయం వస్తున్నట్లు నమ్మించి బ్యాంకుకే బురిడీ కొట్టించిన ఈ ముఠా వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.   ఇది కూడా చదవండి: రాహుల్‌కు ముందే పుట్టిన మగబిడ్డ.. తొలి కాన్పుపై సోనియా భావోద్వేగ జ్ఞాపకాలు.!   [ ICICI Bank Fraud, Ibrahimpatnam Crime, Fake Salary Slips, Fake Aadhaar Card, Personal Loan Fraud, Telangana Police ]  
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన  కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.   గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన  రాజ్యసభ సభ్యత్వానికి  రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు.   తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ  సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను  ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.  దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ  పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి,  రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు. ఇది కూడా చదవండి:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు,  విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.  ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.  రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.  మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!​ తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.! [Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేస్తూ తొలి ప్రయత్నంలోనే తన టీవీకే పార్టీని గెలిపించుకుని, తొలి ప్రయత్నంలోనే  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సుమారు 35 శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించారు. విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇటీవల కాలంలో టీవీకే ప్రభుత్వానికి చెందిన కొందరు నేతల వివాదాస్పద ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. గతంలో ఒక మంత్రి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో చిక్కుకోగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్,  సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్ దురుసు ప్రవర్తన వివాదంగా మారింది. తిరుచిరాపల్లి జిల్లాలో తమ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే  వ్యక్తిపై డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ భౌతిక దాడికి దిగారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం  దుమారానికి దారితీసింది. ఇది కూడా చదవండి: చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.? ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో హింసాత్మక మరియు ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఆయన ఆశయాలకు గండికొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది నెలలు మాత్రమే అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్, తప్పు చేసే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ పని తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపుతున్న వేగం, నిరాడంబరత ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, టీవీకే ఎమ్మెల్యేల తీరు, వారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా విజయ్ కూడా నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.! విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.! [TVK MLAS Crossing Line, Tamilnadu Government, CM Vijay, Deputy Speaker Ravi Shankar,  Controversy, Telugu One]
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశం ఇప్పుడు కూటమిలో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ, బీజేపీ నేతలు ఈ పదవిని ఆశిస్తుండటంతో కూటమి పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు పదవుల ఆశావహులు విజయవాడకు చేరుకున్నట్లు సమాచారం. కడప జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు వారు వచ్చినట్లు తెలుస్తోంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, వీరపునాయునిపల్లి జడ్పీటీసీ సభ్యుడు పుత్తా నరసింహారెడ్డి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నుంచి జమ్మలమడుగు నేత, జడ్పీటీసీ సభ్యుడు సి. రాజేష్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో కడప జడ్పీ పీఠం టీడీపీకి దక్కుతుందా? బీజేపీకి కేటాయిస్తారా? అన్న చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలు కూటమి పార్టీలకు కీలకంగా మారాయి. మొత్తం 28 జిల్లా పరిషత్‌లకు సంబంధించిన పదవుల కేటాయింపులో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భాగస్వామ్య పార్టీలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం చేసే కేటాయింపులపైనే కడప జడ్పీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆధారపడి ఉంది. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన రాజేష్ రెడ్డిలకు మంత్రి పదవి లేదా జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే మంత్రి పదవి విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతం నుంచి ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో మంత్రి పదవి సాధ్యమవుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో కూటమి బలాన్ని మరింత పెంచుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డికి ప్రాధాన్యం ఇస్తారా? లేక బీజేపీకి చెందిన యువ నాయకుడు రాజేష్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి పెద్దల నిర్ణయం కోసం ఆశావహులు ఎదురుచూస్తుండటంతో కడప జిల్లా రాజకీయాల్లో జడ్పీ పీఠం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.       [ Kadapa ZP Chairman, Putta Narasimha Reddy, C Rajesh Reddy, Adinarayana Reddy, TDP BJP Alliance, CM Chandrababu, Naralokesh, TDP, Telugu One, Telugu News ]
ALSO ON TELUGUONE N E W S
కరెక్ట్ గా తెరకెక్కిస్తే రాముడుకి వరల్డ్ బాక్స్ ఆఫీస్ ఏ విధంగా పట్టాభిషేకం చేస్తుందో రామాయణ నిరూపిస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా స్టిల్  823.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో దూసుకుపోతున్న రామాయణ తాజాగా సౌత్ ఇండియా మార్కెట్లో ఓ అరుదైన మరియు చారిత్రాత్మక రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.  బాలీవుడ్ నుంచి వచ్చి సౌత్ భాషల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా 'రామాయణ' సరికొత్త మైలురాయిని అధిగమించింది.  విడుదలైన కేవలం 6 రోజుల్లోనే  సౌత్ ఇండియన్ డబ్బింగ్ వెర్షన్ల ద్వారా ఏకంగా. 104.45 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. ఈ మొత్తం వసూళ్లలో దేశవ్యాప్తంగా నమోదైన  నెట్ కలెక్షన్లలో కేవలం సౌత్ డబ్బింగ్ వెర్షన్ల వాటాయే దాదాపు 23.7% ఉండటం విశేషం. దీనిని బట్టి హిందీ చిత్రాలకి  సౌత్ మార్కెట్లో లభిస్తున్న ఆదరణ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. ముఖ్యంగా కన్నడ వెర్షన్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా 41.20 కోట్లు రాబట్టి సౌత్ భాషల్లో అగ్రస్థానంలో నిలిచింది. కన్నడ తర్వాత తెలుగు ప్రేక్షకుల నుంచి కూడా ఈ చిత్రానికి అద్భుతమైన స్పందన లభించింది. కేవలం తెలుగు వెర్షన్ ద్వారానే 33 కోట్ల నెట్ వసూళ్లు నమోదయ్యాయి. ఇక తమిళంలో 17.35 కోట్లు, మలయాళ వెర్షన్‌లో 12.90 కోట్ల మేర కలెక్షన్లు వచ్చాయి. ఇది కూడా చదవండి : మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్: అన్నయ్య బరిలోకి దిగబోతున్నాడు..   దీపావళి పండుగ సీజన్ కావడంతో పాటు, ఇతర ప్రాంతీయ సినిమాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ సౌత్ భాషల్లో 'రామాయణ' సాధించిన ఈ వసూళ్లు అసాధారణమైనవిగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా నైట్ షోలలో థియేటర్ల ఆక్యుపెన్సీ గణనీయంగా పెరగడం ఈ చిత్ర విజయానికి మరింత ఊతమిచ్చింది. గతంలో వచ్చిన హింది చిత్రాల లైఫ్‌టైమ్ సౌత్ డబ్బింగ్ కలెక్షన్ల రికార్డులను ఈ చిత్రం కేవలం 6 రోజుల్లోనే తిరగరాసింది. 'ధురంధర్ 2' ( 68.54 కోట్లు), 'వార్ 2' ( 58.96 కోట్లు), 'జవాన్' (57.94 కోట్లు) వంటి చిత్రాల రికార్డులని అధిగమించి రామాయణ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మీకు నచ్చవచ్చు:రాముడు ఆస్కార్ ని అందుకుంటాడా! మీకు నచ్చవచ్చు: ఇయర్ ఎండ్ లో థియేటర్లని షేక్ చేయనున్న చిత్రాలు ఇవే!   [Ramayana South Collections, Ramayana Telugu Collections, Ramayana box office, Ramayana south collection, Ranbir Kapoor Ramayana,Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి నుంచి సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తుంటారు. అలాంటిది ఈసారి ఆయన ఏకంగా సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. యంగ్ హీరో రోషన్ మేకతో ఆయన తెరకెక్కించనున్న భారీ పాన్ ఇండియా సినిమా ఈరోజు ఘనంగా ప్రారంభమైంది. అశోక క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో రేఖా పాండే తెలుగు తెరకు పరిచయం అవుతుండగా, వినయ్ రాయ్ కీలక పాత్రలో నటించనున్నారు. గౌర హరి సంగీతం అందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ సినిమా ప్రకటనతో ఇప్పుడు అందరిలోనూ ఒకటే ప్రశ్న.. ఇదేనా ఇంద్రగంటి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జటాయు’? నిజానికి ‘జటాయు’ కథపై ఇంద్రగంటి మోహనకృష్ణ కొన్నేళ్లుగా వర్క్ చేస్తున్నారు. రామాయణంలోని జటాయువు పాత్ర చుట్టూ సాగే పౌరాణిక అంశాలతో, భారీ గ్రాఫిక్స్‌, యాక్షన్‌తో ఈ కథను తెరకెక్కించాలని ఆయన భావించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. మొదట ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో రూపొందించాలని అనుకున్నారు. అప్పట్లో హీరోగా విజయ్ దేవరకొండ పేరు కూడా వినిపించింది. ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్‌లో మరికొందరు స్టార్ హీరోల పేర్లు కూడా వినిపించాయి. కానీ, ఆ కాంబినేషన్లు కార్యరూపం దాల్చలేదు. చివరకు రోషన్ దగ్గరకు ఈ కథ వచ్చిందని ఇటీవల ప్రచారం జరిగింది. ఇప్పుడు రోషన్, ఇంద్రగంటి కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియా సినిమా అధికారికంగా ప్రారంభం కావడంతో ‘జటాయు’ వార్తలకు మరింత బలం చేకూరినట్లయింది. ఇది కూడా చదవండి: హారిక హాసినితో త్రివిక్రమ్‌ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.? అయితే ఈ సినిమా టైటిల్ ‘జటాయు’ అని మూవీ టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే గతంలో ప్రచారంలో ఉన్న దిల్ రాజు నిర్మాణం కాకుండా, తాజా ప్రకటనలో అశోక క్రియేషన్స్ పేరు కనిపిస్తోంది. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ‘జటాయు’నా లేక కొత్త కథనా? అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా, ఇంద్రగంటి తనకు అలవాటైన సున్నితమైన కథల నుంచి బయటకు వచ్చి భారీ స్థాయి సూపర్ హీరో యాక్షన్ అడ్వెంచర్‌ను ఎంచుకోవడం ఆసక్తికరంగా మారింది. రోషన్‌ను ఈ సినిమాలో ఎలాంటి కొత్త అవతారంలో చూపించబోతున్నారు? ‘జటాయు’గానే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందా? అన్నది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. మీకు నచ్చవచ్చు:  రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.! 30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.?       [Roshan Meka Indraganti Mohana Krishna Movie, Jatayu Movie, Roshan Meka, Indraganti Mohana Krishna, Telugu Superhero Movie, Pan India Movie, Vijay Deverakonda, Telugu Film News, Tollywood News]  
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన ప్రెగ్నెన్సీతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల ఆమె బేబీ బంప్ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ దానికి ‘మేటర్నిటీ ఫొటోషూట్‌గా భావించండి’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. దీంతో అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా సమంతకు కవల పిల్లలు పుట్టారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన ఓ బామ్మ నిజంగానే సమంతకు డెలివరీ అయిపోయిందని నమ్మేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సమంతకు ఇద్దరు పిల్లలు పుట్టారని, ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి కూడా వచ్చేసిందని ఓ బామ్మ తన మనవడితో చెబుతుంది. అయితే ఆమె చెప్పే విషయాలన్నీ నిజం కావు. కొందరు ఏఐ టెక్నాలజీని ఉపయోగించి సమంతకు కవల పిల్లలు పుట్టినట్లు నకిలీ వీడియోలు తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. వాటిని చూసిన ఆ బామ్మ నిజమేనని భావించి తన మనవడితో వాదించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చివరికి సమంత దృష్టికి కూడా వెళ్లింది. దీంతో ఆ వీడియో చూసిన ఆమె సరదాగా స్పందించారు. ‘ఇంకా లేదు అమ్మమ్మ’ అంటూ కామెంట్ చేశారు. అంటే తనకు ఇంకా పిల్లలు పుట్టలేదని, ఆ వీడియోలో ఉన్న సమాచారం నిజం కాదని ఆమె ఒక్క మాటతో స్పష్టం చేశారు. సమంత ఇచ్చిన ఈ సమాధానం ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇటీవల సమంత తన బేబీ బంప్ ఫొటోను షేర్ చేయడంతో పాటు ప్రెగ్నెన్సీ సమయంలో తన దినచర్యకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటున్నారు. వ్యాయామం చేస్తున్న వీడియోలు, తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి సరదాగా గడుపుతున్న క్షణాలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన ప్రతి విషయంపై అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కూడా చదవండి: ఇతర రాష్ట్రాల్లో ఒక్క రోజే.. హైదరాబాద్‌లో మాత్రం నెలల తరబడి! నిర్మాతలకు ఇదేం కష్టం? అయితే ఈ ఆసక్తిని కొందరు ఆకతాయిలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏఐ సాయంతో సెలబ్రిటీలకు సంబంధించిన తప్పుడు వీడియోలు తయారు చేసి నిజమైన వార్తల మాదిరిగా ప్రచారం చేస్తున్నారు. సమంతకు కవల పిల్లలు పుట్టారంటూ వచ్చిన వీడియో కూడా అలాంటిదే. ఈ విషయంలో సమంత స్వయంగా స్పందించడంతో అసలు విషయం బయటపడింది. ఇలాంటి వీడియోలను చూసి నిజమని నమ్మి ఇతరులకు షేర్ చేయకూడదనే విషయాన్ని కూడా ఈ ఘటన గుర్తుచేస్తోంది. ఇక సమంత, రాజ్ నిడిమోరు దంపతులు తమ జీవితంలోకి రాబోతున్న కొత్త అతిథి కోసం ఎదురుచూస్తున్నారు. డిసెంబర్‌లో సమంతకు డెలివరీ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆమె తన ప్రెగ్నెన్సీ సమయాన్ని ఆస్వాదిస్తూ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లో ఉంటున్నారు. మరి సమంత నుంచి అసలైన గుడ్ న్యూస్ ఎప్పుడు వస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మీకు నచ్చవచ్చు: ఇట‌లీ నుంచి నేరుగా పెళ్లి మండ‌పంలోకి.. ప్ర‌భాస్ ఏం చేయ‌బోతున్నారు.? రెండో పెళ్లి చేసుకునే అమ్మాయిలే టార్గెట్.. వరస హత్యల వెనుక అస‌లు కథ ఏమిటంటే.?     [Samantha Ruth Prabhu, Samantha Twins News, Samantha Pregnancy News, Samantha AI Fake Video, Samantha Responds to Twins Rumours, Samantha Not Yet Ammamma, Samantha Baby Bump, Samantha Raj Nidimoru, Samantha Viral Video, Tollywood Latest News]
మెగా అభిమానులకి గుడ్ న్యూస్.. గుడ్ న్యూస్ ఏంటి ఒక రకంగా పండుగే. అసలు ఇప్పుడు చెప్పుకోబోయే మాటర్ ని ముందుగానే తెలుసుకున్న వాళ్ళైతే  సంబరాల్లో కూడా మునిగిపోయారు. మరి ఆ ఆనందకర న్యూస్ చూసేద్దాం. చిరంజీవి అప్ కమింగ్ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర.. మెగాస్టార్ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌పై ప్రారంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. చాలా రోజుల నుంచి ఎలాంటి అప్ డేట్ లేదు. దీంతో అభిమానుల్లో విశ్వంభర బెంగ మొదలైంది. సినిమా నిర్మాణం ఏ దశలో ఉందనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో నటుడు ప్రవీణ్ కుమార్ తాజాగా డబ్బింగ్ సెషన్‌కి సంబంధించిన ఫొటోని  సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఒక్కసారిగా విశ్వంభర  మరోసారి వార్తల్లో నిలిచింది.ఇది కేవలం ఒక డబ్బింగ్ సెషన్‌కు సంబంధించిన ఫొటో మాత్రమే అయినప్పటికీ.. సినిమా పనులు పూర్తిగా ఆగిపోలేదని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముందుకు సాగుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు . ఇది కూడా చదవండి: వివాదంలో కమల్ హాసన్ కొత్త మూవీ సండియర్‌ ముఖ్యంగా భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో తెరకెక్కుతున్న సినిమాకి  డబ్బింగ్, ఇతర సాంకేతిక పనులు కీలకం. అయితే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ అప్‌డేట్‌ను విడుదలకు సంబంధించిన సంకేతంగా భావించలేం. ‘విశ్వంభర’ఆలస్యానికి ప్రధాన కారణాల్లో భారీ వీఎఫ్‌ఎక్స్ పనులు ఒకటిగా ప్రచారం జరిగింది. సోషియో ఫాంటసీ కథాంశం కావడంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్రబృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే అనుకున్న సమయానికి రిలీజ్  చేయలేకపోయారు. ఏది ఏమైనా ప్రవీణ్ చేసిన పిక్ అభిమానుల్లో పండుగ వాతావరణం తీసుకొచ్చింది. అభిమానం అనేది అంత కల్మషం లేనిది మరి. విశ్వంభరని యువి క్రియేషన్స్ నిర్మిస్తుంది.   మీకు నచ్చవచ్చు:రామాయణకి ఆస్కార్ వస్తుందా? రాదా?  మీకు నచ్చవచ్చు:ప్రముఖ కెమరామెన్ మృతి!   [Chiranjeevi Vishwambhara Bubbing Update, Chiranjeevi Vishwambhara, Vishwambhara movie update, Vishwambhara release date, Vassishta Mallidi, Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]  
Naslen, who is currently earning appreciation for his performance in Scene, has silently wrapped up the shoot of his next film. The young actor has teamed up with Kumbalangi Nights director Madhu C Narayanan for the project, with producer Dr Ananthu announcing the shooting completion through his Instagram account. Madhu C Narayanan is returning to direction after a gap of nearly seven years. His debut directorial Kumbalangi Nights, released in 2019, earned widespread acclaim and established him as one of Malayalam cinema's promising filmmakers. Interestingly, despite the long gap between films, the director has managed to complete his latest project in just six months. The team reportedly wrapped up the entire shoot without much publicity. With filming completed, the makers are now gearing up to begin post-production work. The project is expected to enter its next phase as the team works towards bringing the film to audiences. Also Read: Priya Bhavani Shankar marries her beau Rajvel Raj There is speculation that the makers might target a January release, although no official release date has been announced yet. The team is yet to reveal its theatrical plans. The combination of Naslen's growing popularity and Madhu C Narayanan's return after Kumbalangi Nights has naturally raised curiosity. With Dr Ananthu sharing the latest update, audiences will now be looking forward to further announcements about the film. Check Out: Scene Movie Review                       Scene completes hat-trick hit for Suriya Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
తమిళ నటి ప్రియా భవానీ శంకర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. తన ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌తో ఆమె వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట నిరాడంబరంగా వివాహ వేడుకను జరుపుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రియా భవానీ శంకర్, రాజ్‌వేల్ రాజ్‌లకు కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి పదేళ్లకు పైగా కొనసాగింది. వీరిద్దరూ తమ బంధం గురించి గతంలోనూ పలుమార్లు మాట్లాడారు. అంతేకాదు.. 2022లోనే కలిసి ఓ ఇంటిని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లోనే వీరి పెళ్లిపై వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఎట్టకేలకు తమ ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్నారు. సినీ ప్రముఖుల హంగామా, భారీ ఆర్భాటాలకు దూరంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య వివాహం జరగడం విశేషం.  ప్రియా భవానీ శంకర్ మొదట న్యూస్ రీడర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత టెలివిజన్ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. 2017లో వచ్చిన ‘మేయాద మాన్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ‘డిమాంటీ కాలనీ’, ‘మాన్‌స్టర్’, ‘తిరుచిత్రంబలం’, ‘ఇండియన్ 2’ వంటి సినిమాలతో తమిళ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇది కూడా చదవండి: ‘జైలర్ 2’ ఓటీటీ వెర్షన్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.! తెలుగులో ‘కల్యాణం కమనీయం’, ‘జీబ్రా’ చిత్రాలతో పాటు ఇటీవల రవితేజ సరసన ‘ఇరుముడి’లోనూ నటించారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ పరంగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే వ్యక్తిగత జీవితంలోనూ కొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. మొత్తానికి పదేళ్లకు పైగా ప్రేమించిన వ్యక్తినే పెళ్లి చేసుకుని ప్రియా భవానీ శంకర్ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఈ అందమైన జంటకు అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మీకు నచ్చవచ్చు:  30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.? ‘మాతృభూమి’ ట్రైలర్.. తెలంగాణ రియల్ హీరో బయోపిక్‌లో సల్మాన్ ఖాన్.!       [Priya Bhavani Shankar Wedding, Priya Bhavani Shankar Marriage, Priya Bhavani Shankar Husband, Priya Bhavani Shankar Latest, Irumudi Actress, Priya Bhavani Shankar, Rajvel Raj, Telugu Film News]  
సినిమా నిర్మాణం అంటే నిర్మాతలకు ఎన్నో కష్టాలు ఉంటాయి. కథను సిద్ధం చేసుకోవడం దగ్గరి నుంచి నటీనటులను ఎంపిక చేయడం, షూటింగ్ పూర్తి చేయడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించడం వరకు కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. సినిమా పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటించి ప్రమోషన్స్ మొదలుపెడతారు. కానీ ఇప్పుడు టాలీవుడ్ నిర్మాతలకు సినిమా పూర్తయినా మరో సమస్య ఎదురవుతోందట. అదే హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంలో బ్యానర్ ఐడీల జారీకి జరుగుతున్న ఆలస్యం. ఈ వ్యవహారంపై పలువురు నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ బ్యానర్ ఐడీ అంటే ఏమిటంటే.. సినిమా నిర్మించే ప్రతి సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) వద్ద నమోదు చేసుకొని ప్రత్యేక గుర్తింపు కార్డు పొందాలి. 2017లో కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నకిలీ నిర్మాణ సంస్థలను అడ్డుకోవడంతోపాటు సినిమా నిర్మాణంలో పారదర్శకత తీసుకురావడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ ఐడీ నంబర్ ఉంటేనే సంబంధిత సినిమా సెన్సార్ సర్టిఫికేషన్ ప్రక్రియకు ముందుకు వెళ్తుంది. అంటే బ్యానర్ ఐడీ రాకపోతే సినిమా సెన్సార్‌కు వెళ్లే విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే దేశంలోని ఇతర ప్రాంతీయ సెన్సార్ కార్యాలయాల్లో ఈ ఐడీ జారీ ప్రక్రియ ఒక రోజులోనే పూర్తవుతోందని నిర్మాతలు చెబుతున్నారు. ఆధార్, పాన్ కార్డు వంటి వివరాలు సమర్పిస్తే 24 గంటల్లోనే ఐడీ వస్తోందని అంటున్నారు. కానీ హైదరాబాద్‌లో మాత్రం వారాలు, నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదనంగా అఫిడవిట్లు అడగడం, ఆధార్ కార్డులో ఫొటో సరిగ్గా లేదని అభ్యంతరాలు చెప్పడం, పాత ఫొటోలు కాకుండా కొత్త పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు తీసుకురావాలని కోరడం వంటి కారణాలతో దరఖాస్తులు తిరస్కరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇది కూడా చదవండి: పెళ్లయ్యాక అలాంటి పాత్రలు చేయకూడదా? కియారా విషయంలో సిద్ధార్థ్ ఏమన్నారంటే.! ఈ సమస్యకు ప్రధాన కారణం హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ కార్యాలయానికి పూర్తిస్థాయి రీజినల్ ఆఫీసర్ లేకపోవడమేనని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. గతేడాది ఫిబ్రవరి నుంచి ఇక్కడ రెగ్యులర్ అధికారి లేకపోవడంతో అదనపు బాధ్యతలు అప్పగించి కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. దూరదర్శన్ విభాగంలో డైరెక్టర్ స్థాయి అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ రాహుల్ గౌలికర్‌కు ఈ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఫైళ్ల పరిశీలన, అనుమతుల జారీ నెమ్మదిగా సాగుతోందని నిర్మాతలు చెబుతున్నారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నా అపాయింట్‌మెంట్లు దొరకడం లేదని, ఫోన్లు కూడా స్పందించడం లేదని కొందరు వాపోతున్నారు. ఇక ఈ వ్యవహారంపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా దృష్టి పెట్టింది. హైదరాబాద్ సెన్సార్ కార్యాలయానికి వెంటనే పూర్తిస్థాయి రీజినల్ ఆఫీసర్‌ను నియమించాలని ఛాంబర్ భావిస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ సెన్సార్ బోర్డు చైర్మన్‌గా ఉన్న వెంపటి శశికుమార్ తెలుగు ప్రాంతానికి చెందినవారు కావడంతో, ఆయన దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆయన నుంచి సానుకూల స్పందన వస్తుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి. సినిమా నిర్మాణం కోసం నిర్మాతలు అప్పులు చేసి మరీ డబ్బులు ఖర్చు పెడుతుంటారు. షూటింగ్ పూర్తయిన తర్వాత విడుదల ఆలస్యమైతే అప్పులపై వడ్డీలు పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యానర్ ఐడీ కోసం కూడా నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తే చిన్న నిర్మాతలపై ఆర్థిక భారం మరింత పెరిగే అవకాశం ఉంది. అందుకే హైదరాబాద్ సెన్సార్ కార్యాలయంలో ఈ సమస్యకు త్వరగా పరిష్కారం చూపించాలని టాలీవుడ్ నిర్మాతలు కోరుతున్నారు. మరి ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మీకు నచ్చవచ్చు: ఇట‌లీ నుంచి నేరుగా పెళ్లి మండ‌పంలోకి.. ప్ర‌భాస్ ఏం చేయ‌బోతున్నారు.? ఓటీటీలో ‘జైలర్2’: సూపర్‌స్టార్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!       [Tollywood Producers, Hyderabad Censor Board, CBFC Banner ID, Banner ID Registration, Telugu Film Producers Problems, Hyderabad Censor Office, Tollywood Latest News, Film Certification Process, CBFC Regional Office, Vempati Sasikumar, Dr Rahul Gaulikar, Telugu Film Industry News]
లోక నాయకుడు కమల్ హాసన్ నుంచి సినిమా వస్తుంటే ఎంత క్యూరియాసిటీ ఉంటుందో తెలిసిందే.ఈ విషయంలో అభిమానులు ఎవరో, ప్రేక్షకులు ఎవరో తెలుసుకోలేని పరిస్థితి. అంతలా సుదీర్ఘ కాలం నుంచి సెల్యులాయిడ్ ని శాసిస్తూ వస్తున్నాడు. అలాంటి కమల్ హాసన్  తాజా చిత్రం ‘సండియర్‌’ చిత్రబృందం  కమల్‌ పుట్టినరోజు సందర్భంగా(నవంబర్ 7 ) ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ విడుదల చేసింది. పోస్టర్ తో పాటు 'ప్రతీకారం రక్తంతోనే తీరుతుంది' అనే సంభాషణ కూడా రిలీజ్ చేసారు.  అయితే  టైటిల్ అనౌన్స్ చేసిన క్షణం నుంచే తమిళనాడు రాజకీయ వర్గాల్లో మరియు సినీ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం చెలరేగింది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో శాంతిభద్రతలకు ఈ పేరు విఘాతం కలిగిస్తుందని, ఇది కుల ఘర్షణలకు దారితీసే అవకాశం ఉందని 'పుతియా తమిళగం పార్టీ' తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.  విడుదలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వకూడదని ఆ పార్టీ వ్యవస్థాపకుడు డాక్టర్ కె. కృష్ణస్వామి డిమాండ్ చేయడంతో పాటు పోలీసులను ఆశ్రయించారు. సినిమా టైటిల్‌లో ఉన్న రెచ్చగొట్టే సంభాషణలు హింసను ప్రోత్సహించేలా ఉన్నాయని రాజకీయ నేతలు మండిపడుతున్నారు. అయితే, ఈ వివాదం వెనుక దాదాపు 23 సంవత్సరాల చరిత్ర ఉంది. సరిగ్గా ఇదే టైటిల్‌ను గతంలోనూ కమల్‌హాసన్ ఒక సినిమా కోసం అనుకున్నారు. 2003-2004 కాలంలో కమల్ హీరోగా తెరకెక్కిన సినిమాకి మొదట ‘సండియర్‌’ అనే పేరునే పెట్టాలని భావించారు. కానీ అప్పట్లోనూ ఇదే తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. అప్పట్లో డాక్టర్ కె. కృష్ణస్వామి మరియు పలు సంఘాల నుంచి వచ్చిన తీవ్ర నిరసనల కారణంగా ఈ వివాదం అప్పట్లో తమిళనాడు ముఖ్యమంత్రి జె. జయలలిత వరకు వెళ్ళింది. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం స్పందించడంతో, చిత్రబృందం ఆ టైటిల్‌ను మార్చక తప్పలేదు. అలా ఆ సినిమా పేరును ‘విరుమాండి’గా మార్చి 2004 జనవరిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎలాంటి టైటిల్ వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించి అప్పట్లో భారీ విజయంగా నిలిచింది.  ఇది కూడా చదవండి: టాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా:ఇయర్ ఎండ్ లో థియేటర్లని షేక్ చేయనున్న చిత్రాలు ఇవే!  ఇప్పుడు రెండు దశాబ్దాలకు పైగా కాలం గడిచినా, మళ్లీ అదే పాత టైటిల్‌ను కమల్‌హాసన్ తన కొత్త ప్రాజెక్ట్ కోసం తెరపైకి తేవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కూడా అదే పేరును పునరుద్ధరించడంపై రాజకీయ నాయకులు, పలువురు సినీ దర్శకులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొద్దిమంది దర్శకులు ఇలాంటి పాత వివాదాస్పద పేర్లు మళ్లీ కుల అహంకారాన్ని, హింసా సంస్కృతిని ప్రోత్సహిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తుండగా, మరికొందరు మాత్రం కళను కళలా చూడాలని వాదిస్తున్నారు. రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మరియు టర్మరిక్ మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్‌కు రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సునీల్ కె.ఎస్. సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వివాదాల నడుమ రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా త్వరలోనే పూర్తిస్థాయిలో షూటింగ్ జరుపుకొని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సన్నాహాలు జరుగుతోంది.  అరుణ్‌కుమార్‌ దర్శకుడు.   మీకు నచ్చవచ్చు:సినిమాపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం! మీకు నచ్చవచ్చ:సూర్య కొత్త మూవీ భయ్యా: అదిరిపోయే జోనర్!   [Kamal Haasan sandiyar Controversy, Kamal Haasan, Sandiyar movie controversy, Kamal Haasan new film, Virumaandi title issue,Telugucinema news, TeluguCinema, Tollywood, Tollywood News]  
Young actor Roshan Meka is gearing up for a massive cinematic outing with an ambitious pan-Indian superhero film directed by Mohana Krishna Indraganti. The high-budget project, Production No. 3 of Ashoka Creations, was officially launched with a grand opening ceremony. Producers Ashok Vardhan Muppa and Sunil Balusu commenced the project with traditional rituals. Srikanth sounded the ceremonial clap, while Muppa Venkaiah Chowdary switched on the camera and handed over the script to the team. Mohana Krishna Indraganti has spent nearly one and a half years developing this ambitious superhero narrative. The director plans to present Roshan Meka in a powerful, never-before-seen avatar, with the young actor undergoing a major transformation for the role. The film promises a blend of engaging storytelling, emotional depth and extensive VFX work. Renowned cinematographer P. G. Vinda will handle the visuals, while Gowra Hari is composing the music. Also Read: Priya Bhavani Shankar marries her beau Rajvel Raj International action choreographer Lee Whittaker is collaborating with Rama Krishna to design the action sequences. Bollywood actress Rekha Pandey is making her Telugu debut, while Vinay Rai plays a pivotal role. Mounted on a grand scale, the film aims to offer a distinctive superhero experience to audiences across India. The makers are planning to begin shooting in the first week of December.   Check Out:  NBK's voice to make Dada real Dhamakhadar!                        Ramayana enters the Oscar race independently   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రూ.800 కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో మాత్రం అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ‘జైలర్ 2’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 12 నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు నిడివి విషయంలో కొన్ని సన్నివేశాలను కట్ చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఓటీటీలో అయినా ఆ తొలగించిన సన్నివేశాలను జోడిస్తారని అభిమానులు ఆశించారు. ముఖ్యంగా సినిమాలో మిస్ అయిన కీలక ఫుటేజ్‌ను ఓటీటీ వెర్షన్‌లో చూడొచ్చని భావించారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉంది. థియేటర్లలో ‘జైలర్ 2’ రన్‌టైమ్ 165 నిమిషాలుగా ఉండగా.. ఓటీటీ వెర్షన్ నిడివి 163 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే థియేటర్లలో చూసిన దానికంటే ఓటీటీలో మరో రెండు నిమిషాలు తక్కువగా ఉండనుంది. అదనపు సన్నివేశాలు వస్తాయని ఎదురుచూసిన అభిమానులకు.. ఉన్న నిడివిలోనూ రెండు నిమిషాలు తగ్గించడం నిరాశ కలిగించే విషయమే. అయితే ఈ రెండు నిమిషాలు ఏ సన్నివేశాలకు సంబంధించినవి? ఓటీటీ వెర్షన్‌లో ఎలాంటి మార్పులు చేశారు? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: 30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.? రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’కు సీక్వెల్ కావడంతో ‘జైలర్ 2’పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం, రజినీ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సన్ పిక్చర్స్ ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించింది. థియేటర్లలో మిస్ అయిన సీన్లను ఓటీటీలో చూడొచ్చని ఆశించిన అభిమానులకు ఇప్పుడు రన్‌టైమ్ సమాచారం నిరాశ కలిగిస్తోంది. మరి నవంబర్ 12న స్ట్రీమింగ్ మొదలైన తర్వాత ఈ మార్పులపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.! హారిక హాసినితో త్రివిక్రమ్‌ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?       [Jailer 2 OTT Release, Jailer 2 OTT Runtime, Jailer 2 OTT Update, Rajinikanth Jailer 2, Jailer 2 Movie, Amazon Prime Video, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander]  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం మన సంప్రదాయంలో ఎప్పట్నుంచో ఉంది. అయితే దీని వెనుక దాగున్న శాస్త్రీయ కారణాలు మరియు ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా పాలల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్ వంటి శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు అర చెంచా పసుపు చేర్చినప్పుడు ఈ పానీయం కాస్తా  గోల్డెన్ మిల్క్  లేదా అద్భుతమైన ఆరోగ్య అమృతంగా మారుతుంది. రాత్రి పూట ఈ పసుపు పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, అలసట పూర్తిగా తొలగిపోయి ప్రశాంతమైన గాఢమైన నిద్ర సొంతమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పసుపులో అత్యంత శక్తివంతమైన  కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో మరియు ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరానికి సహజసిద్ధమైన యాంటీ క్యాన్సర్ ప్రభావం అందుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, పసుపు పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ మిశ్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడంలో పసుపు పాలు గ్రేట్ రిజల్ట్ ఇస్తాయి. పసుపులోని యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళ దీన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందులో కొద్దిగా తేనె లేదా అల్లం కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. రోజూ ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడటంతో పాటు వైరల్ దాడి నుంచి రక్షణ లభిస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంలో పసుపు పాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. పసుపు జీర్ణక్రియను ఉత్తేజపరిచి, అజీర్ణం, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ శరీరం తీసుకునే ఆహారంలోని పోషకాలను మెరుగ్గా గ్రహించేలా తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా పసుపు పాలు తాగే వారిలో జీర్ణ సంబంధిత రుగ్మతలు చాలా వరకు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు ధృవీకరిస్తున్నారు. ఇది కూడా చదవండి:టైప్1 మరియు టైప్2 డయాబెటిస్‌కు, అద్భుతమైన ఇంటి చిట్కా! శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను, మెదడు పనితీరును మెరుగుపరచడంలో పసుపు పాలు ఎంతగానో సహాయపడతాయి. కుర్కుమిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమ్మినో ఆమ్లం, పసుపు గుణాలు కలిసి మెదడు నరాలను రిలాక్స్ చేసి నిద్రలేమి సమస్యను తరిమికొడతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలోనూ పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, మచ్చలు, చర్మంపై ముడతలు రాకుండా నివారించడంలో ఇవి సహాయపడతాయి. వయసు పెరుగుతున్న ఛాయలను తగ్గించి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన, నిండు నూరేళ్ల జీవితం కోసం ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగే అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోండి. మీకు నచ్చవచ్చు:కంటి నీరు, కారడం వెనుక ఉన్న అసలు రహస్యం: వైద్యుల సలహాలు                         ఉదయం, లేవగానే నీరు తాగడం వల్ల కిడ్నీలు మరియు జీర్ణవ్యవస్థకు కలిగే లాభాలు!     Turmeric Milk Benefits, Haldi Doodh At Night, Golden Milk Science, Improve Sleep Naturally, Anti Inflammatory Drinks, Doctor Health Advice, Health Tips In Telugu.  
వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే చాలు, తేళ్లు, పాములు వంటి విషసృపాలు తడి నేలల నుంచి బయటికి వచ్చి ఇళ్లలోకి, చీకటి మూలల్లోకి చేరుతుంటాయి. అయితే, చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఒక్కోసారి మనం తేలు కాటుకు గురికావాల్సి వస్తుంది. తేలు కుట్టిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్రమైన మంట, భరించలేని నొప్పి, తిమ్మిర్లు కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 రకాల తేలు జాతులు ఉండగా, కేవలం కొన్ని మాత్రమే ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేయగలవు. అయినప్పటికీ, తేలు కుట్టిన వెంటనే భయపడిపోకుండా కొన్ని అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు పాటించడం ద్వారా విషం ప్రభావాన్ని, తీవ్రమైన నొప్పిని గణనీయంగా తగ్గించవచ్చు. తేలు కుట్టిన వెంటనే చేయాల్సిన మొదటి పని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడం. కుట్టిన భాగాన్ని గోరువెచ్చని నీరు మరియు యాంటీసెప్టిక్ సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత, ఐస్ క్యూబ్స్‌ను ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి తేలు కుట్టిన ప్రదేశంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, విషం శరీరంలోకి వేగంగా పాకకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ చేయికి లేదా కాలికి కుట్టినట్లయితే, ఆ భాగాన్ని కదలకుండా కొద్దిగా ఎత్తులో ఉంచడం చాలా మంచిది. ఇక వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో కూడా తక్షణ ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని మాయం చేస్తాయి. కొద్దిగా పసుపును ఆవ నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి కుట్టిన చోట రాస్తే మంట త్వరగా తగ్గుతుంది. అలాగే బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి రాసినా చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండే ఉల్లిపాయ రుద్దడం లేదా నాటు వైద్యాలు వంటి శాస్త్రీయ ఆధారాలు లేని పద్ధతులను గుడ్డిగా నమ్మి కాలయాపన చేయడం ప్రాణాలకే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3,000 మంది తేలు కాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో దాదాపు 80 శాతం మంది చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. తేలు విషం పిల్లలపై, వృద్ధులపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బాధితుల్లో విపరీతమైన చెమటలు పట్టడం, తల తిరగడం, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు యాంటీ వినమ్ (Antivenom) మందులను అందించి ప్రాణాలు కాపాడుతారు. ఇది కూడా చదవండి:వైద్య రంగంలో సంచలనం: క్యాన్సర్ కణాల రహస్యాలను, బట్టబయలు చేసిన శాస్త్రవేత్తలు ఇంటి చుట్టూ తేళ్లు రాకుండా తగిన రక్షణ మరియు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను ముందే అడ్డుకోవచ్చు. ఇళ్ల పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, చెత్తాచెదారం, ఎండిన చెట్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంట్లోని గోడల్లో ఉండే పగుళ్లను సిమెంట్ లేదా మట్టితో మూసివేయాలి. రాత్రి సమయాల్లో లేదా చీకటి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కాళ్లకు బూట్లు, చేతులకు రక్షణ గ్లౌజులు ధరించడం చాలా ముఖ్యం. అలాగే, ఎక్కడైనా బూట్లు లేదా దుస్తులు బయట ఉంచితే, వాటిని వేసుకునే ముందు ఒకసారి గట్టిగా జాడించి చూసుకోవడం మంచి అలవాటు. తేళ్లు సాధారణంగా చీకటి ప్రదేశాలు, బూట్ల లోపల, మంచాల కింద దాక్కుంటాయి. కొద్దిపాటి అప్రమత్తత, సరైన సమయంలో అందించే ప్రథమ చికిత్స తేలు కాటు విష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి ప్రాణాలను కాపాడుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవడమే అత్యంత సురక్షితమైన మార్గం. మీకు నచ్చవచ్చు:గుండె వేగం, సాధారణంగా ఉన్నా పక్షవాతం రావచ్చా? వైద్యులు హెచ్చరిస్తున్న విషయాలివే!                పరగడుపున, టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!     Scorpion Sting First Aid, Scorpion Bite Remedies, Emergency Medical Tips, Insect Sting Treatment, First Aid Guide, Doctor Health Advice, Health Tips In Telugu.  
పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక పోషకాలను అందించడంలో ఇవి ముందుంటాయి. శీతాకాలంలో ఎదురయ్యే పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో నారింజ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో చాలామందిని ఇబ్బందిపెట్టే ప్రధాన సమస్యలు దగ్గు, జలుబు మరియు వైరల్ ఇన్‌ఫెక్షన్లు. నారింజ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ నారింజ తీసుకోవడం ద్వారా కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా సులభంగా రక్షణ పొందవచ్చు. అలాగే, చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. నారింజలో లభించే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది, ఇది చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా ఉంచడంలో కీలకమైనది. అంతేకాకుండా, ఇవి చర్మానికి ముడతలు రాకుండా కాపాడి, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా సహజమైన మెరుపును అందిస్తాయి. మరోవైపు, నారింజలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో, మలబద్ధకం సమస్యను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహార ఎంపికగా నిలుస్తుంది. ఇది కడుపు నిండిన భావనాన్ని కలిగించి అనవసరమైన ఆహారపు అలవాట్లను నియంత్రిస్తుంది. ఇది కూడా చదవండి:పండుగ, తిండి తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? ఎసిడిటీ ముప్పు తప్పదు! ఇవే కాకుండా, నారింజలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు కాబట్టి శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హైడ్రేషన్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు ఇతర పోషకాలు కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి. మొత్తంగా చూస్తే, శీతాకాలంలో ప్రకృతి మనకు అందించే ఒక ఆరోగ్యకరమైన వరం నారింజ పండ్లు. కేవలం రుచిలోనే కాకుండా, పోషకాల పరంగానూ ఇవి ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ఈ చలికాలంలో మీ రోజువారీ ఆహారంలో నారింజను కచ్చితంగా భాగం చేసుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి. మీకు నచ్చవచ్చు:బిల్వ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి మేలు? ఎవరికి డేంజర్?                                లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం!     Oranges In Winter, Cold And Cough Remedies, Immunity Boosting Foods, Vitamin C Health Benefits, Winter Health Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రతిరోజూ ఉదయం గొంతుకు హాయిగా ఉండేలా వేడి వేడిగా టీ తాగి రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే ఆ రొటీన్ టీకి బదులుగా అప్పుడప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు , మూలికలను జోడించి తయారు చేసుకునే పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెర్బల్ టీలు అని అంటారు.   మన వంటింట్లో సులభంగా లభించే మసాలా దినుసులతోనే ఈ టీల  ను తయారు చేసుకుని తాగవచ్చు. అలా వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఈ  అనాస పువ్వుతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిన్న పువ్వు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. అనాస పువ్వు టీ.. ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్స్ , ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.  జ్వరం లేదా  ఏదైనా వైరస్  లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు  ప్రకృతి మనకు ప్రసాదించిన అనాస పువ్వును ఉపయోగించి సులభంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. అనాస పువ్వును చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయోజనాలు.. వైరల్ ఫీవర్..  శ్వాసకోశ సమస్యలు.. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరస్ జ్వరాలు సర్వసాధారణం. అనాస పువ్వులో యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబయల్  గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే హానికారక వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగించి, గొంతు నొప్పి , ఊపిరితిత్తుల ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియ .. తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. అనాస పువ్వులోని పోషకాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది. ఇది కూడా చదవండి   షుగర్ పేషెంట్లు తప్పక తెలుసుకోవాలి ! ముఖ్యమైన డాక్టర్  సూచనలు రోగనిరోధక శక్తి పెంపు.. శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలు కూడా త్వరగా చుట్టుముడతాయి. అనాస పువ్వు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది. కీళ్ల నొప్పులు,  వాపులు తగ్గించడం.. శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ టీ సహజ నివారణగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వయసు మళ్లిన వాళ్ళలో లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతత , నిద్రలేమి నివారణ.. రోజంతా పడిన అలసట, ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అనాస పువ్వు టీలో ఉండే సువాసన , మృదువైన గుణాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది మనసును రిలాక్స్ చేసి చక్కగా నిద్ర పట్టేలా సహాయపడుతుంది. చర్మ సౌందర్యం.. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ హెర్బల్ టీ శరీరాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు    థైరాయిడ్ PCOS గట్ హెల్త్.. వీటి మధ్య సంబంధం ఏమిటి.!                                   మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అండాశయ క్యాన్సర్ లక్షణాలివే!   What Happens to Your Body When You Drink Star Anise Tea,Amazing Benefits Revealed,Star Anise Tea,Amazing Benefits for Your Body
షుగర్ రావడానికి ముందు కనిపించే చివరి వార్నింగ్ సిగ్నల్ ఇదే.. మన శరీరంలో ఎన్నో మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న సంకేతాలను మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆ చిన్న సంకేతాలే భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పెద్ద ముప్పునకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం లేదా షుగర్ వ్యాధి బారిన పడటానికి ముందు మన శరీరం కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలను జారీ చేస్తుంది. ఆ సంకేతాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ మహమ్మారికి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. ​మన దేశంలో దాదాపు పద్నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలు ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నారని పలు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు చాలా మందికి తమకు ఈ సమస్య ఉందనే విషయం కూడా అసలు తెలియదు. అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? డయాబెటిస్  కు ముందు శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. ప్రీ డయాబెటిస్.. రక్తంలో షుగర్ స్థాయిలు కొద్దిగా పెరిగి ఉంటాయి కానీ పూర్తిగా డయాబెటిస్ అని నిర్ధారించేంత స్థాయిలో ఉండవు. వైద్యపరంగా చూస్తే హెచ్‌బీఏ1సీ పరీక్షలో మూడు నెలల యావరేజ్ 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నా , లేదా ఖాళీ కడుపుతో చేసే ఫాస్టింగ్ షుగర్ వంద నుంచి నూట ఇరవై ఐదు మిగ్రాముల మధ్యలో ఉన్నా దానిని ప్రీ డయాబెటిస్ దశగా పరిగణిస్తారు. ​ఈ దశలోనే మన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ప్రారంభమవుతుంది.  డయాబెటిస్ రావడానికి ముందు సంకేతాలు.. కేవలం షుగర్ మాత్రమే కాకుండా గుండె జబ్బులు, బీపీ, ఫ్యాటీ లివర్ వంటి ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా సరిగ్గా ఇదే సమయం నుంచి పెరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. శరీరంలో పైన చెప్పుకున్న సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే.. డయాబెటిస్ రావడానికి కూడా అవకాశం ఉన్నట్టే..  అయితే దీనిని చూసి ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, ఇదొక చక్కటి సువర్ణావకాశం లాంటిదని నిపుణులు సూచిస్తున్నారు. ​ప్రపంచ ప్రఖ్యాత డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అధ్యయనం ప్రకారం, శరీర బరువులో కేవలం ఏడు శాతం వరకు తగ్గడం , వారానికి నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం ద్వారా టైప్ టూ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని యాభై ఎనిమిది శాతం వరకు సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ప్రీ డయాబెటిస్ దశను జీవక్రియ సంబంధిత వ్యాధుల చివరి రివర్సిబుల్ దశగా పిలుస్తుంటారు. ​ఇంటి గోడకు చిన్న పగులు కనిపించినప్పుడే దానిని సరిచేసుకోవడం చాలా సులభం, కానీ గోడ పూర్తిగా దెబ్బ తిన్న తర్వాత   బాగు చేయడం కష్టం. సరిగ్గా అలాగే ఆరోగ్యం పూర్తిగా క్షీణించే ముందే అప్రమత్తమవడం చాలా ముఖ్యం. అందుకోసం శరీర బరువును అయిదు నుంచి ఏడు శాతం వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది కూడా చదవండి  ఆరోగ్యానికి  శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే  సూత్రాలివి..! ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. మైదా వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు , కూల్ డ్రింక్స్, షుగర్ పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు హెచ్‌బీఏ1సి పరీక్షను చేయించుకుంటూ ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి.  డయాబెటిస్ వచ్చిన తర్వాత రకరకాల మందులతో దానిని నియంత్రించడం కంటే, అది రాకముందే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నప్పుడే దానిని అడ్డుకోవడం ఎంతో మేలు. ఇది ఆరోగ్యానికి ఎంతో సులువైన మార్గం కూడా. కాబట్టి శరీరం ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సంతోషంగా జీవించడమే మంచి మార్గం.                                                                                                                                               *రూపశ్రీ.​మీకు నచ్చవచ్చు  మొండి కఫాన్ని కూడా తరిమికొట్టే పానీయం.. ఇది తాగితే ఎంత రిలీఫ్ ఇస్తుందో!
ఆరోగ్యానికి  శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే  సూత్రాలివి..!   నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన అవగాహన లేకుండా చేసే కొన్ని పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రాణాలను బలిగొంటున్న సమస్య గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో,  వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. నీరు.. రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. కేవలం ఒకటి రెండు లీటర్లకే నీటిని తాగడం  పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ , ఇతర పానీయాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే లెక్కలోకి వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి. ఆహారం.. ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి ప్రొటీన్తో కూడిన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.  ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే! అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. ఏ ఆహారాన్ని అయినా ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ  అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు. అన్నం తినే విషయంలో కూడా వండే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుందట. వ్యాయామం.. ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్ లో  కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.   మీకు నచ్చవచ్చు   ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!                                                                                                                                            *రూపశ్రీ.