LATEST NEWS
కోలీవుడ్ స్టార్ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్‌కు తమిళనాడు ప్రభుత్వం అనూహ్య షాక్ ఇచ్చింది. గత కొంతకాలంగా ఆయనకు కల్పిస్తున్న ప్రత్యేక భద్రతను ప్రభుత్వం  ఉపసంహరించుకుంది. ముఖ్యమంత్రి స్థాయి ప్రోటోకాల్‌తో కూడిన సెక్యూరిటీని తొలగిస్తూ హోంశాఖ తీసుకున్న   నిర్ణయం ఇప్పుడు రాజకీయ, సినీ పరిశ్రమలోనూ పెద్ద చర్చకు దారితీసింది. గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు..  ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే..  తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ వద్ద ఉన్న గన్‌మెన్లను వెనక్కి పిలిపించినట్లు తెలుస్తోంది.  ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని స్థాపించి, తొలి ప్రయత్నంలోనే అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే.  టీవీకే తాజా ఎన్నికలలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది.  అయితే ఆయనకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన వై కేటగరి భద్రత యథావిధిగా కొనసాగుతోంది.  ఈ పరిణామంపై అటు ప్రభుత్వం కానీ, ఇటు విజయ్ కానీ ఇప్పటివరకు స్పందించలేదు.  
తమిళనాడు రాజకీయాలు మరోసారి  ఉత్కంఠభరితంగా మారాయి.   కొత్త ప్రభుత్వం ఏర్పాటు విషయంలో ప్రధాన పార్టీల మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా క్యాంపు రాజకీయాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. తమ ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా కాపాడుకునేందుకు అన్నాడీఎంకే అధిష్టానం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా దాదాపు 15 మందికి పైగా ఎమ్మెల్యేలను బుధవారం ( మే 6) పొరుగు రాష్ట్రమైన పుదుచ్చేరిలోని ఒక రిసార్టుకు  తరలించింది. తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని ' తమిళగ వెట్రి కళగం  (టీవీకే) 108 స్థానాలతో  సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే..  ప్రభుత్వ  ఏర్పాటుకు  అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో  ఉంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకేకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవాలని టీవీకే ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరగడంతో అన్నాడీఎంకే  అప్రమత్తమైంది. సీనియర్ నేత సీవీ షణ్ముగం ఆధ్వర్యంలో పుదుచ్చేరిలోని  ది షోర్ త్రిశ్వమ్  రిసార్టులో దాదాపు 20 గదులను పార్టీ ముందుగానే బుక్ చేసినట్లు సమాచారం. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల తరలింపుతో ..  అటు టీవీకే కూడా తమ ఎమ్మెల్యేలను చెన్నై సమీపంలోని మామల్లపురం రిసార్టులకు తరలించింది. ఒకవైపు ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాడుతుంటే.. మరోవైపు బద్ధ శత్రువులుగా పేరున్న డీఎంకే మరియు అన్నాడీఎంకే నేతల మధ్య రహస్య చర్చలు జరుగుతున్నాయనే వార్తలు తమిళరాజకీయాలలో సంచలనం రేపుతున్నాయి.  ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని విజయ్ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్‌ను కోరగా.. సంపూర్ణ మెజారిటీ నిరూపించుకున్న తర్వాతే రావాలని గవర్నర్ పేర్కొన్నట్లు చెబుతున్నారు.  ఈ పరిణామాల మధ్య ఎమ్మెల్యేలను కాపాడుకోవడం పార్టీలకు సవాలుగా మారింది. రానున్న రెండు మూడు రోజుల్లో సంఖ్యా బలంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంత వరకూ తమిళనాట క్యాంపు రాజకీయాలు కొనసాగే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు.  
  శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ సంచలనం.. తమిళనాట తెలుగులో ప్రచారం.. శివకాశికి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు.. తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ, ఒక తెలుగు మహిళ సంచలన విజయాన్ని నమోదు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. కోలీవుడ్ స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ తరపున శివకాశి నియోజకవర్గం నుండి పోటీ చేసిన కీర్తన సంపత్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయ ఉద్దండులు తలపడిన ఈ ఎన్నికల్లో ఒక సామాన్య నేపథ్యం ఉన్న తెలుగు మహిళ విజయం సాధించడం ఇప్పుడు తమిళనాట హాట్ టాపిక్ గా మారింది. కీర్తన సంపత్ తన ఎన్నికల ప్రచారంలో అనుసరించిన వ్యూహం ఆమెను విజయతీరాలకు చేర్చింది. శివకాశి ప్రాంతంలో గణనీయంగా ఉన్న తెలుగు ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆమె 'తెలుగు'నే ఆయుధంగా మలుచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడుతూ, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా తెలుగు మూలాలున్న కుటుంబాలతో ఆమె పెంచుకున్న ఆత్మీయ బంధం ఓట్ల రూపంలో మారిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ అధినేత విజయ్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీర్తన సఫలమయ్యారు. విద్య, వైద్యం మరియు ఉపాధి అవకాశాలపై ఆమె ఇచ్చిన హామీలకు యువత మరియు మహిళా ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. శివకాశి లాంటి కీలకమైన పారిశ్రామిక నియోజకవర్గంలో పట్టు సాధించడం అంటే సామాన్యమైన విషయం కాదు, కానీ తనదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహించి ప్రత్యర్థులను చిత్తు చేశారు. ఈ విజయంపై కీర్తన సంపత్ స్పందిస్తూ.. ఇది తన గెలుపు మాత్రమే కాదని, తనపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క తెలుగు మరియు తమిళ సోదర సోదరీమణుల విజయం అని పేర్కొన్నారు. శివకాశి అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తానని, ముఖ్యంగా కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తానని ఆమె హామీ ఇచ్చారు. విజయ్ నాయకత్వంలో తమిళనాడులో నవశకం ప్రారంభమైందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ అభ్యర్థికి, అదీ తెలుగు ప్రచారంతో ఇంతటి ఆదరణ లభించడం విశేషం. ఇది భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో భాషా పరమైన వైవిధ్యానికి మరియు ప్రాంతీయ బంధాలకు అద్దం పడుతోంది. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా కీర్తన సంపత్ శివకాశి ముఖచిత్రాన్ని ఎలా మారుస్తారో చూడాలి. స్థానికంగా పెండింగ్‌లో ఉన్న మౌలిక సదుపాయాల కల్పన మరియు బాణాసంచా పరిశ్రమ కార్మికుల భద్రత వంటి అంశాలపై ఆమె తక్షణమే దృష్టి సారిస్తారని ప్రజలు ఆశిస్తున్నారు. ఒక తెలుగు మహిళగా తమిళ అసెంబ్లీలో ఆమె గళం ఏ విధంగా వినపడనుందో వేచి చూడాలి.
పశ్చిమ బెంగాల్ సీఎం రేసులో ముందు వరుసలో కనిపిస్తున్న సువేందు అధికారి ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు.  ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి..  మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.  ఈ సందర్భంగా సువేందు స్పందిస్తూ.. తమ తదుపరి టార్గెట్ ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలేనని స్పష్టం చేశారు. వచ్చే ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో..  బీజేపీకి ప్రధాన ప్రతిపక్షంగా భావిస్తున్న సమాజ్‌వాదీ పార్టీ అధినేతను ఉద్దేశించి..  మమతా బెనర్జీ, తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీల పనైపోయిందని.. తర్వాతి వంతు అఖిలేశ్ యాదవేనని హెచ్చరించారు.  తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీతో పోల్చారు సువేందు. ఆప్‌లాగే టీఎంసీ కూడా అవినీతిమయమైందని, పతనం ఖరారైందని విమర్శించారు. ఆ పార్టీకి ఎలాంటి సిద్ధాంతాలు లేవని.. అందుకే నందిగ్రామ్‌ ప్రజలు మరోసారి తనను గెలిపించారన్నారు. దీదీ రాజకీయ బహిష్కరణ ఖాయమైందని పేర్కొన్నారు. త్వరలోనే టీఎంసీ ఎంపీలు బీజేపీలో చేరతారని   జోస్యం చెప్పిన సువేందు అధికారి.. ఇక తమ   దృష్టిపి  సమాజ్‌వాదీ పార్టీపై కేంద్రీకరిస్తామని అఖిలేశ్ యాదవ్‌కు హెచ్చరిక జారీచేశారు.  ఒకప్పుడు మమతా బెనర్జీకి కుడిభుజంగా.. తూర్పు మిడ్నాపూర్ వంటి జిల్లాలలో టీఎంసీ ఎదుగుదలలో సువేందు కీలక పాత్ర పోషించారు. కానీ.. 2020లో మమతతో విబేధించి బీజేపీలో చేరారు. ఆపై ఆమె ఓటమిని శాసించారు. నందిగ్రామ్‌లో టీఎంసీకి చెందిన పవిత్ర కర్‌ను కూడా సువేందు ఓడించారు. ఇప్పుడు బీజేపీ సీఎం రేసులో ఆయన పేరు ముందు వరుసలో ఉంది.
అస్సాం మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో   అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అక్రమాలకు పాల్పడిందనీ,  పద్ధతి ప్రకారం ఓట్ల చోరీని అమలు చేసిందనీ ధ్వజమెత్తారు.   కేంద్రంలోని అధికార పార్టీ తన బలాన్ని ఉపయోగించి ఓటర్ల తీర్పును తారుమారుచేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.  ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో  బీజేపీ  ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు. ఈ మేరకు సోమవారం (మే 4)   తన అధికారిక 'ఎక్స్' ఖాతాలో చేసిన ఓ పోస్టులో.. పశ్చిమ బెంగాల్‌లో వందకు పైగా సీట్లలో ఫలితాలను బీజేపీ తారుమారు చేసిందన్న తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపణలతో తాను ఏకీభవిస్తున్నానని పేర్కొన్నారు.  ఇది బీజేపీకి తెలిసిన పాత వ్యూహమేనని, గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా పద్ధతిని చూశామని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.  బీజేపీ ఎన్నికలనే కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థలను పరిరక్షించే వ్యవస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ధ్వజమెత్తారు.   
ALSO ON TELUGUONE N E W S
The Telugu film industry’s appetite for supernatural thrillers shows no signs of fading, and Agadha arrives as a promising new addition to the genre. The teaser for the film was released recently and made an immediate impression with its rich visual identity and atmosphere dense with mystery. Iconic legendary filmmaker MS Raju directs the project, a name synonymous with celebrated Telugu films such as Varsham, Okkadu, Devi, Manasantha Nuvve and Nuvvosthanante Nenoddantana.  His presence behind the camera naturally elevates expectations around the film’s narrative ambition. The teaser establishes its intentions from the very first frame.  The visual craftsmanship is polished and commanding, with each shot radiating a cinematic quality that positions Agadha as a supernatural thriller of considerable scale. The production design and lighting palette together construct a world that feels ethereal yet deeply foreboding. At the core of the story lies the enigmatic presence referred to as Agadha, a divine and mysterious force that appears to govern the boundary between life and death. The human characters drawn into its orbit face consequences far beyond their capacity to resist or comprehend. The teaser derives much of its impact from the seamless coordination between visuals and background score. The music actively amplifies every moment of dread and grandeur rather than merely accompanying the images. Glimpses of Kamakshi Bhaskarla, Shravan Reddy, Jovika who is the granddaughter of veteran actress Manjula, and Ulka Gupta each bring credibility to the mysterious world on screen. The teaser closes on the striking question “Who Is Agadha,” neatly crystallising the dramatic mystery the film intends to unravel. Agadha is produced by Kasi Visalakshi Balusu under Sri Adi Varaha Productions, with cinematography by Nani Chamidishetty, editing by Junaid Siddiqui and NVN Subbaraju serving as executive producer.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎం.ఎస్. రాజు మళ్ళీ ఒక ఆసక్తికరమైన కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. దర్శకుడిగా ఈసారి 'అగాధ' (Agadha) అనే హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ ద్వారా మనల్ని భయపెట్టేందుకు సిద్ధమయ్యారు. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో భారీ స్పందనను పొందుతోంది. టీజర్ ప్రారంభం నుండే ఒక విధమైన చీకటి, భయానక వాతావరణాన్ని సృష్టించడంలో దర్శకుడు విజయం సాధించారు. "ప్రకృతిని దాటి ఏర్పడే ఏ శక్తులనైనా మనం ఆత్మలని, ప్రేతాత్మలని నమ్ముతాం. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగి ఉన్నాయి. కొన్ని రక్షించేవైతే, కొన్ని వేధించేవి" అంటూ కామాక్షి భాస్కర్ల డైలాగ్ తో 'అగధ' టీజర్ మొదలవుతుంది. క్షుద్ర పూజలు, అడవిలో వింత సంఘటనలు, నిగూఢమైన రహస్యాల చుట్టూ కథ తిరుగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతోంది. మొత్తం టీజర్ నిడివి 1 నిమిషం 44 సెకన్లు. ప్రతి ఫ్రేములోనూ ఏదో ఒక ఉత్కంఠ. ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నట్టుగా, కొత్త మనుషుల్ని పరిచయం చేస్తున్నట్లుగా, అలాగే ఏదో కొత్త కథ చూస్తున్నట్టుగా ఒక మార్మికమైన అనుభూతితో ఉత్కంఠభరితమైన అనుభవానికి లోను చేస్తూ ఈ టీజర్ కొనసాగుతుంది.  ఆ విజువల్స్, ఆ ఎఫెక్ట్స్, ఆ గెటప్స్, ఆ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, భయం గొలిపే లొకేషన్లు, విచిత్రమైన ఎక్స్ప్రెషన్లు, మధ్య మధ్యలో ఆసక్తి రేకెత్తించే  డైలాగ్స్.. ప్రతిదీ ఆకట్టుకునేలా ఉన్నాయి. "ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా" అని అడిగితే, ఒక అమ్మాయి భయంతో వణికిపోతూ "అగ్... అగ్... అగధ" అని చెప్పడంతో 'అగధ' అంటే ఎవరు అనే ఆసక్తి కలుగుతుంది. "అగధ వచ్చేసిందమ్మా. 'అగధ' ముందు ఎవ్వరి ఆటలు సాగవు. రా... అగధా… రా" అంటూ వినిపించే డైలాగ్స్ తో టీజర్ తాలూకు ఉత్కంఠ పీక్ లెవెల్ కి చేరినట్టుగా అనిపిస్తుంది.  కామాక్షి భాస్కర్ల తన నటనతో, గంభీరమైన ముఖ కవళికలతో టీజర్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా కూడా కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. టీజర్‌లో చూపించిన విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉత్కంఠను రెట్టింపు చేశాయి. ముఖ్యంగా టీజర్ చివరిలో కనిపించే ఉద్వేగభరితమైన సీన్లు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. టోటల్ గా  టీజర్ చూస్తే 'దేవి', 'ఒక్కడు', 'వర్షం', 'మనసంతా నువ్వే' వంటి బ్లాక్ బస్టర్లు తీసిన నిర్మాత ఎమ్మెస్ రాజు స్టాండర్డ్స్ ని మించి ఈ విజువల్స్ ఉన్నాయా అనిపిస్తుంది.  'అగధ'ను ఆయన డైరెక్ట్ చేసిన తీరుకి, ఆ విజువల్ ట్రీట్ కి ఒక్కసారిగా థ్రిల్ అవుతాం. ఈ సినిమా ఏ లెవెల్ లో ఉండబోతుందో చెప్పడానికి ఈ టీజర్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్.  ఎం. ఎస్. రాజు రచన, దర్శకత్వం లో శ్రీ ఆది వరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కాశీ విశాలాక్షి బలుసు 'అగధ' చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషలలో ఏకకాలంలో భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్, సిజ్జు , రోషన్, శ్రేయరాణి రెడ్డి తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం.  మొత్తానికి 'అగాధ' మూవీ పక్కా హర్రర్ థ్రిల్లర్ ప్రియుల కోసం రూపొందిస్తున్నట్లు అనిపిస్తుంది. త్వరలోనే థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో వేచి చూడాలి.  
  సూర్య(Suriya)తో వివాహం తర్వాత  జ్యోతిక(Jyothika)నటనకి కొంత గ్యాప్ ఇచ్చినా సరే సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె నుంచి వచ్చిన తాజా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఆ డీటెయిల్స్ చూద్దాం. బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా(Sonakshi Sinha),జ్యోతిక కలిసి సిస్టమ్(System)అనే వెబ్ సిరీస్ తో ఈ నెల 22 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్నారు. రీసెంట్ గా సిస్టమ్ నుంచి మేకర్స్ ప్రమోషనల్ వీడియో రిలీజ్ చేసారు. సదరు వీడియోలో 'న్యాయం దేవుడి లాంటిది, వెతికి పట్టుకోవడం కష్టమనే వర్డ్ ఇప్పుడు అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటుంది . దీంతో సిస్టమ్ పై అందరిలో ఆసక్తి నెలకొని ఉండగా  అశ్విని అయ్యర్ తివారి దర్శకత్వంలో అన్యాయం, ఆశయం, అధికారం వంటి అంశాల నేపథ్యంలో కథనం ఉండబోతుంది. అశుతోష్ గోవర్కర్ , గౌరవ్ పాండే కీ రోల్స్. Also read: Sukumar: సుకుమార్‌ కి  కథ చెప్పడం రాదు.. ప్రముఖ హీరో షాకింగ్ కామెంట్స్   
  సుకుమార్(Sukumar)..ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్.. పాన్ ఇండియా డైరెక్టర్ అనే పేరే కాదు. పాన్ ఇండియా ప్రేక్షకులు సుకుమార్ సినిమా ఎప్పుడు సెల్యులాయిడ్ పై ఎంటర్ ఇస్తుందా అని ఎదురుచూసే పరిస్థితి. ఓవర్ నైట్ ఆ స్థాయిని సంపాదించుకోలేదు. రెండు దశాబ్డల కష్టం ఉంది. అసలు రోజులో రెండు గంటలు మాత్రమే నిద్రపోయి మిగతా సమయం మొత్తం సినిమా గురించే ఆలోచిస్తాడు. అందుకే పాన్ ఇండియా కట్ అవుట్ కి సూటయ్యాడు. వైవిధ్యమైన కథ, కథనానికి కూడా పెట్టింది పేరు. అలాంటి సుకుమార్ కి కథ చెప్పడం రాదని ఒక హీరో అంటున్నాడు. ఆ హీరో ఎవరో చూద్దాం జగపతి బాబు(Jagapathi Babu).. టాలీవుడ్ ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే గాని ఇలాంటి నటుడు పుట్టడు. ఈ నెల 8 న 'గోదారి గట్టుపైన’ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రమోషన్లలో   మాట్లాడుతు సుకుమార్  నాన్నకు ప్రేమతో కథ చెప్పడానికి తడబడ్డాడు. ‘రంగస్థలం’ కథని కూడా  వివరించడానికి గంటన్నర యోగా చేసి వచ్చి, చివరికి ఒక్క నిమిషంలోనే ముగించాడు.అసలు సెట్ లో  సీన్ పేపర్ ఇచ్చే వరకు నా క్యారక్టర్  తీవ్రత తెలియలేదు. సుకుమార్ కి ఒక కథని ఎగ్జైటింగ్‌గా నేరేట్  చేయడం అస్సలు రాదు. ఈ విషయాన్ని ఆయన కూడా ఒప్పుకుంటాడు. ఆయన ఏదో గందరగోళంగా చెబుతుంటే నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. కానీ, ఆయన మేకింగ్, విజన్ మీద నమ్మకం ఉంది. ఆయన ఏం తీస్తున్నారో ఆయనకి క్లారిటీ ఉంటుంది. అది చాలు. జగపతి బాబు పేర్కొన్నారు. Aslo read: VIjay: విజయ్ సిఎం అవ్వడు!. ప్రముఖ హీరో శపధం జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు సుకుమార్‌ని  విమర్శించడానికి చేసినవి కావు అని సరదాగా చేసినవని అప్పుడే పుట్టిన పసి పిల్లాడిని అడిగినా చెప్తాడు. ఎందుకంటే జగపతి బాబు అనే కట్ అవుట్ మంచి తనానికి, కల్మషం లేని మనసుకి ఫాంట్, షర్ట్ వేస్తే అది జగపతి బాబు. ప్రెజెంట్ సుకుమార్ సమర్పణలో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రామ్ చరణ్ (Ram Charan)వన్ మాన్ షో 'పెద్ది'(Peddi)లో పవర్ ఫుల్ రోల్ లో జూన్ 4 న తన హవా చాటనున్నాడు.         
  దళపతి విజయ్(VIjay)తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనే దివ్యమైన ముహూర్తం కోసం అభిమానులు వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. కానీ తమిళ రాజకీయాలు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. ప్రమాణ స్వీకారానికి అంతా సెట్ అయ్యింది అనుకునే లోపే తాజా న్యూస్ విజయ్ అభిమానులని కలవరపాటుకి గురి చేస్తుంది. Also read: Pushpa2: పుష్ప 2 శ్రీతేజ్ దగ్గరకి అల్లు స్నేహరెడ్డి..  కుటుంబానికి కొండంత అండ  ద్రావిడ పార్టీ లైన డిఎంకె, అన్నాడి ఎంకె లు తమ ద్రవిడ సిద్ధాంతానికి వ్యతిరేకంగా  కాంగ్రెస్ తోగాని, మరో పార్టీతో పొత్తుతో గాని విజయ్ ని సీఎం కాకుండా చూడాలనే వార్తలు వినిపిస్తున్నాయి.  ఇందుకు ప్రముఖ హీరో స్టాలిన్ కుమారుడు చెపాక్ డిఎంకె ఎంఎల్ ఏ ఉదయనిధి స్టాలిన్(Udayanidhi Stalin)చూస్తున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతుంది. విజయ్ పార్టీ 108 సీట్స్ లో గెలవగా ప్రభుత్వ ఏర్పాటుకి మరో 18 సీట్స్ కావాలి. డి ఎంకె 59 , అన్నా డిఎంకె 47 గెలుచుకున్నాయి. మొత్తం అసెంబ్లీ స్థానాలు 234 .  
  ఎవరు ఊహించని విధంగా గత ఏడాది 'పుష్ప 2'(Pushpa 2)రిలీజ్ సందర్భంగా హైదరాబాద్  సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి మృత్యు కొరల నుంచి బయటకి వచ్చి ఇంటి దగ్గరే  ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.  నిన్న శ్రీతేజ్ ని అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కలిసి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్న తీరు పట్ల వారు సంతోషం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ వారితో మాట్లాడుతూ శ్రీతేజ్ తో పాటు సోదరి విషయంలో ఎవరు  ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.శ్రీతేజ్ కి అయ్యే అన్ని ఖర్చులతో పాటు శ్రీతేజ్  సోదరి జీవిత  కాలంలో విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చుని నేనే చూసుకుంటాను. భవిష్యత్తులోను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అల్లు స్నేహ రెడ్డి కూడా శ్రీ తేజ్ కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.  also read:  Vijay: ఒక్క ఓటుతో విజయ్ ని గెలిపించిన అభిమాని.. సినిమా కాదు నిజం   గతంలో  అల్లు అర్జున్  1 కోటి, మైత్రీ మూవీ మేకర్స్  50 లక్షలు, దర్శకుడు సుకుమార్  50 లక్షలు ఇవ్వగా ఆ మొత్తం 2 కోట్ల రూపాయలని శ్రీతేజ్  కుటుంబం పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే  75,000 వడ్డీ  శ్రీతేజ్ వైద్య ఖర్చులు మరియు కుటుంబ పోషణకి  అందుతోంది. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్సకి అయిన  70 లక్షల ఖర్చుని  కూడా అల్లు అర్జున్ నే ఇవ్వడం జరిగింది  
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram). ఈ సినిమా కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ చిత్ర విడుదల తేదీకి సంబంధించి తాజాగా ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. నిర్మాణ సంస్థ ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. తొలుత ఈ చిత్రాన్ని మే 15వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ భావించారు. కానీ, తాజా నిర్ణయం ప్రకారం ఈ సినిమా ఇప్పుడు జూన్ 19న థియేటర్లలోకి రాబోతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఐపీఎల్ (IPL) సీజన్ క్రేజ్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వసూళ్లపై ఐపీఎల్ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో మేకర్స్ విడుదలను ఒక నెల వెనక్కి జరిపారు. 'ఓ బేబీ' తర్వాత సమంత, డైరెక్టర్ నందిని కాంబినేషన్ లో వస్తున్న చిత్రమిది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేశాయి. సమంత ఒక వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.  
నందు, అవికా గోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'అగ్లీ స్టోరీ' (Ugly Story). తాజాగా 'భీమ్లా నాయక్' డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ట్రైలర్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంటెన్స్ నెరేషన్, బలమైన ఎమోషన్స్, ఊహించని ట్విస్టులతో నిండిన ఈ ట్రైలర్ సినిమా విజయాన్ని ముందే సూచిస్తోంది.  బుధవారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్లో మూవీ టీం సినిమా ఔట్ పుట్ పై సంతోషం వ్యక్తం చేసింది. సినిమా పట్ల తమ నమ్మకాన్ని తెలియజేసింది.  డైరెక్టర్ ప్రణవ స్వరూప్ మాట్లాడుతూ, "ప్రతి ప్రేమకు ఓ చీకటి వైపు ఉంటుంది. ఆ సత్యాన్ని బలంగా చెప్పడమే మా లక్ష్యం. నందు, అవికా నటన ఈ చిత్రానికి బలం చేకూర్చింది. మా ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు ఈ సినిమా క్వాలిటీ విషయంలో నాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. కచ్చితంగా ఈ సినిమా చూసి, ప్రేక్షకులు థియేటర్లలో మంచి అనుభవం పొందుతారు. ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు." అన్నారు. హీరో నందు మాట్లాడుతూ, "ఈ పాత్ర నాకు కొత్త ఛాలెంజ్. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ సీన్స్‌తో నిండిన స్టోరీ ఇది. అవికా మంచి ఎమోషనల్ డెప్త్ ఇచ్చింది. డైరెక్టర్ ప్రణవ గారు ఈ సినిమాని చాలా బాగా తీశారు. ప్రొడ్యూసర్లు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు అద్భుతమైన నిర్మాణ విలువలు అందించారు. ప్రేక్షకులు ఈ సినిమాని కచ్చితంగా ఆస్వాదిస్తారు" అన్నారు.  అవికా గోర్ మాట్లాడుతూ, "ఈ చిత్రం ద్వారా ప్రేమ యొక్క వాస్తవాలను చూపించాలనుకున్నాం. ట్రైలర్ చూశాక చాలా ఆనందంగా ఉంది. ఇంత అద్భుతమైన సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం. డైరెక్టర్ ప్రణవ గారికి, నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారికి రుణపడి ఉంటాను. మే 22న థియేటర్లలో కలుద్దాం" అని అన్నారు.  అలాగే నిర్మాతలు సుభాషిణి గారు, లక్ష్మణ్ గారు మాట్లాడుతూ..  సినిమా చాలా బాగా వచ్చిందన్నారు. డైరెక్టర్ ప్రణవ పనితనాన్ని.. నందు, అవిక ప్రదర్శనలను ఎంతగానో మెచ్చుకున్నారు. అలాగే ఈ మూవీకి మొదటి నుంచి ఎంతో సహకారం అందించిన బెక్కం వేణు గోపాల్ గారికి, ట్రైలర్ లాంచ్ చేసిన సాగర్ కె చంద్ర గారికి కృతజ్ఞతలు తెలిపారు.  నిర్మాత బెక్కం వేణు గోపాల్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం టీం చాలా కష్ట పడిందని, ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని, ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారని అన్నారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు. సాగర్ కె చంద్ర మాట్లాడుతూ, ట్రైలర్ చాలా బాగుందని టీం ని కొనియాడారు. ఈ సినిమాని తప్పకుండా ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. మూవీ టీంకి తన బెస్ట్ విషెస్ తెలిపారు.   
  సినిమాల్లో ఒక్క ఓటుతో గెలిచిన  సీన్స్ చాలానే చూస్తుంటాం. ఇళయ దళపతి విజయ్(Vijay)నుంచి వచ్చిన ఒక మూవీ కూడా మనిషి యొక్క ఓటు ఎంత గొప్పదో చెప్పింది. ఇప్పుడు ఆ ఒక్క ఓటుతోనే విజయ్ పార్టీ అభ్యర్థి గెలిచాడనే న్యూస్ ఫ్రెష్ నెస్ హోదాలో తెలుగు సోషల్ మీడియాకి నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. శివగంగై జిల్లా తిరుపత్తూర్‌లో టీవీకే అభ్యర్థి శ్రీనివాసకు 83,376 ఓట్లు రాగా డీఎంకే మంత్రి పెరియకరుప్పన్‌ కి 83,375 ఓట్లు వచ్చాయి. అంటే ఒక్క ఓటుతో టీవీకే  అభ్యర్థి గెలిచాడు.  మస్కట్ నుంచి వచ్చిన విజయ్‌ అభిమాని ఓటేయడంతో అతను వేసిన ఆ ఒక్క ఓటు టీవీకే అభ్యర్థిని గెలిపించినట్లయింది. అంటే ఎవరకి వారు నా ఒక్క ఓటే అనుకోవచ్చు. కానీ మస్కట్ నుంచి ప్రత్యేకంగా  ఓటు వేయడానికి అభిమాని రావడంతో గెలుపు క్రెడిట్ అతనికి ఇవ్వచ్చు. దీంతో  మస్కట్ అభిమాని అయిన మణికందన్ తనకు గర్వంగా ఉందని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ వైరల్ అవుతోంది.  Also read: VIjay: వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌ని నమ్మిన ఆర్ బీ చౌదరి.. దళపతి రేంజ్ మార్చేసిన సూపర్ హిట్స్ ఇవే  
టాలీవుడ్ లో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన సినిమాల్లో '100% లవ్' (100% Love) ఒకటి. అక్కినేని నాగచైతన్య, తమన్నా భాటియా జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నేటితో 15 ఏళ్లను పూర్తి చేసుకుంది.  ఈ సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ (Geetha Arts) సోషల్ మీడియా వేదికగా ఒక ప్రత్యేక వీడియోను షేర్ చేస్తూ జ్ఞాపకాలను నెమరువేసుకుంది. "మనల్ని నవ్వించి, పులకింపజేసి, ప్రేమలో పడేలా చేసిన చిత్రం" అంటూ గీతా ఆర్ట్స్ ఈ సినిమాను అభివర్ణించింది.  https://x.com/GeethaArts/status/2051916822182797443 2011లో విడుదలైన '100% లవ్' బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని సాధించడమే కాకుండా, అప్పట్లో యువతకు ఒక కొత్త ఫీలింగ్ ను ఇచ్చింది. బాలుగా నాగచైతన్య, మహాలక్ష్మిగా తమన్నా మధ్య సాగే ఈగో క్లాషెస్, స్వీట్ మెమరీస్ ఇప్పటికీ ప్రేక్షకులకు తాజాగానే అనిపిస్తాయి. సుకుమార్ మార్క్ టేకింగ్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లాయి. ఈ మైలురాయి సందర్భంగా హీరో నాగచైతన్య కూడా స్పందించారు. అద్భుతమైన ఈ మూవీ టీమ్ కు, ప్రేక్షకులు అందించిన ప్రేమకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. "15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిన అందరికీ థాంక్స్" అంటూ ట్వీట్ చేశారు.   https://x.com/chay_akkineni/status/2051924875942469826
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  పుట్టిన తర్వాత పిల్లలు పెద్దగా అయినా.. వారు చదువులు పూర్తయ్యి,  పెళ్ళి చేసుకుని, వారు కూడా పిల్లలను కన్నా సరే.. తల్లిదండ్రులకు మాత్రం తమ పిల్లలు ఎంతవాళ్లైనా ఇంకా చిన్న పిల్లలు గానే అనిపిస్తూ ఉంటుంది.  ఎంత వయసు పెరిగినా తల్లిదండ్రులకు పిల్లల గురించి ఆలోచన ఉంటుంది.  అబ్బాయిల విషయానికి వస్తే..  18 ఏళ్లలోకి వచ్చినప్పుడు వారి జీవితం చాలా కీలకమైన మలుపు తీసుకుంటుంది.  18 ఏళ్లకు మేజర్ గా గుర్తించబడతారు.  చట్ట ప్రకారం పిల్లల నుండి వయోజనులుగా మారుతారు.  అదే విధంగా మానసికంగా కలిగే మార్పులు కూడా వారిని బాధ్యతగా ఉండటంలో, నిర్ణయాలు తీసుకోవడంలో ప్రభావితం చేయడమే కాకుండా.. చాలా వరకు ఇండిపెండెంట్ గా ఉండటానికి కూడా ఇక్కడే కీలక మలుపు వస్తుంది. 18 ఏళ్ల వయసులో పిల్లలకు మార్గదర్శకత్వం చాలా అవసరం అవుతుంది. తల్లిదండ్రులు ఈ వయసు పిల్లలతో ఎంత సున్నితంగా, ఎంత ఆలోచించే విదంగా మాట్లాడగలుగుతారో.. పిల్లలతో విషయాలను షేర్ చేసుకోగలుగుతారో..  పిల్లల జీవితం కూడా అంత సరైన దిశలో నడవడానికి సహాయపడుతుంది.   18 ఏళ్లు నిండిన పిల్లలకు తల్లిదండ్రులు చెప్పాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటో తెలుసుకుంటే.. బాధ్యత.. 18 ఏళ్లు రాగానే నువ్వేం పెద్దాడివి కాదు అని తరచుగా తల్లిదండ్రులు అంటూ ఉంటారు. కానీ ఇది తప్పు.. 18 ఏళ్ల వయసు పిల్లలు తమ నిర్ణయాలు తాము తీసుకోవడానికి అవకాశం దొరితే మొదటి దశ.. అయితే  తన నిర్ణయాలకు తానే బాధ్యత వహించాలని వారు తెలుసుకోవాలి. తన ఖర్చులను తాను చూసుకోవడం, , సమయాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం, ఇంటి పనులలో పాలుపంచుకోవడం వంటి చిన్న చిన్న పనులు 18 ఏళ్ల వయసు పిల్లలకు నేర్పిస్తే.. అవి అతన్ని బాధ్యత గల వ్యక్తిని చేస్తాయి. డబ్బు విలువ.. డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో, తెలివిగా ఖర్చు చేయడం, పొదుపు చేయడం కూడా అంతే ముఖ్యం. 18ఏళ్ల వయసులోనే పిల్లలకు స్నేహాలు, బయటటి ఖర్చులు వంటివి చాలా పెరుగుతాయి. నిజం చెప్పాలంటే.. డబ్బు కారణంగా పిల్లలు పాడైపోయే మొదటి దశ ఇదే.. అందుకే పిల్లలకు బడ్జెట్ రూపొందించుకోవడం, అనవసరమైన ఖర్చులను నివారించడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం వంటి అలవాట్లు నేర్పించాలి. ఇవి వారిని ఆర్థికంగా బలంగా చేస్తాయి. సరైన స్నేహాలు.. ఈ వయసులో స్నేహాలు, సంబంధాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి. మంచి స్నేహాలు..  నమ్మకమైన వ్యక్తులతో ఎలా ఉండాలో, మంచి స్నేహాలు ఎలా ఉంటాయో.. , చెడు స్నేహాలకు ఎలా దూరంగా ఉండాలో చెబుతూ ఉండాలి.  దీని వల్ల జీవితంలో వారు దెబ్బ తినే చాలా పెద్ద నష్టం నుండి బయటపడవచ్చు. డిజిటల్ జీవితం.. చిన్న పిల్లల్లా వారిని తిట్టి, కొట్టి కంట్రోల్ చేసే వయసు కాదు 18 ఏళ్ల పిల్లలది. అందుకే సోషల్ మీడియా , ఇంటర్నెట్‌ను తెలివిగా, అవగాహనతో ఉపయోగించడం చాలా ముఖ్యం.  అలాగే ఎలాంటి విషయాలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసుకోవాలి?  ఎలాంటి విషయాలను గోప్యంగా ఉంచాలి? సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి? సోషల్ మీడియా, ఇంటర్నెట్ ప్రభావం జీవితం మీద ఎంత వరకు ఉండాలి వంటి విషయాలు వారికి అర్థమయ్యే లాగా వివరించి చెప్పాలి. మోటివేట్.. జీవితంలో ప్రతిఒక్కరూ వైఫల్యాన్ని ఎదుర్కొంటారు. వైఫల్యం అనేది అంతం కాదని, అది నేర్చుకోవడానికి ఒక అవకాశమని వారికి వివరించాలి. ఎందుకంటే వైఫల్యాల కారణంగా తొందర పాటు నిర్ణయాలు తీసుకునే భావేద్వేగం వారిలో ఉంటుంది.  అందుకే ఎప్పుడూ స్పోర్టివ్ గా ఉండమని చెప్పాలి. ఈ ఆలోచన వారికి జీవితంలో ముందుకు  సాగడానికి బలాన్ని ఇస్తుంది.                             *రూపశ్రీ.
జీవితంలో విజయం సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ విజయం కొందరే సాధిస్తారు. దీనికి కారణాలు చాలా ఉంటాయి.  అయితే జీవితంలో విజయం సాధించాలంటే.. కొన్ని పనులను అస్సలు వాయిదా వేయకూడదని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప ఆధ్యాత్మిక వేత్త,  తత్వవేత్త.. మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలను ఆయన రెండు వేల సంవత్సరాల క్రితమే ఎంతో క్షుణ్ణంగా వివరించి చెప్పాడు.  లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఏ పనులను వాయిదా వేయకూడదు? ఆచార్య చాణక్యుడు ఏం చెప్పాడు? తెలుసుకుంటే.. ముఖ్యమైన పనులు.. ఒక మనిషి  సక్సెస్ ఫుల్  వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తి తన ముఖ్యమైన పనులకు చాలా ప్రాధాన్యత ఇవ్వాలి.  తమకు ముఖ్యమైన పనుల విషయంలో  వారు చూపించే చురుకుదనమే వారిని ఆ పనిలో విజయం సాధించేలా చేస్తుంది.ముఖ్యమైన పనులు ఏవైనా సరే.. మళ్లీ చేద్దాంలే అనే ఆలోచనతో వాయిదా వేయకూడదు.  సమయం చాలా విలువైన ఆస్తి అని,  పనులను వాయిదా వేయడం వల్ల ఎంతో గొప్ప ఆస్తిని కోల్పోయినట్టేనని, దీని వల్ల  ఒత్తిడి పెరగడమే కాకుండా భవిష్యత్తులో పెద్ద సమస్యలు కూడా తలెత్తుతాయని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. నేర్చుకోవడం.. నేర్చుకోవడాన్ని అభ్యాసం అని అంటారు. చాణక్యుడి  ప్రకారం, జ్ఞానమే మనిషి  నిజమైన శక్తి. విజయవంతమైన వ్యక్తులు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపరు. వారు ప్రతిరోజూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి, తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేస్తారు. ఎందుకంటే, ఈ రోజు తాము సంపాదించే జ్ఞానమే రేపటి విజయానికి పునాది వేస్తుందని వారికి తెలుసు. కష్టం.. విజయానికి కష్టపడటమే ఏకైక, ప్రధాన  మార్గం. సక్సెస్ కావాలంటే.. పనులను భారంగా కాకుండా.. వాటిని చాలెంజ్ గా తీసుకుని పూర్తీ చేయాలి. తమకు ఎదురొచ్చే ప్రతి పని, తమ ఎదుగుదలకు ఒక గొప్ప మార్గంగా చూడాలి. సోమరితనం , వాయిదా వేయడం మానవ పతనానికి దారితీస్తాయి. అందుకే చాణక్యుడు ప్రతి  పనిని సమయానికి పూర్తి చేయమని సలహా ఇస్తాడు. తప్పులు.. తప్పు చేసినప్పుడు దాన్ని సరిదిద్దుకోకుండా పారిపోవడం  వైఫల్యానికి ప్రదాన కారణం అవుతుంది.   తన తప్పుల గురించి తెలుసుకుని,  వెంటనే వాటిని అంగీకరించి, ఏమాత్రం సమయం వృథా చేయకుండా సరిదిద్దుకునే వ్యక్తి జీవితంలో విజయం సాధించగలుగుతాడు. తప్పులను సకాలంలో సరిదిద్దుకోకపోతే, అవి భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చు. అవకాశాలు.. జీవితంలో సువర్ణావకాశాలు కాలంతో పాటు వస్తూ ఉంటాయి. అలాగే కాలంతో పాటు చేజారి పోతాయి కూడా. ఒకసారి అవకాశం చేజారితే అది తిరిగి రాదని తెలిసి, దానిని గుర్తించి ఆలస్యం చేయకుండా వినియోగించుకోవడంలో నేర్పరి అయినవాడే విజయం సాధిస్తాడని చాణక్య నీతి చెబుతుంది.                            *రూపశ్రీ.
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం,  ఎదుగుదల మందగించడం జరుగుతుంది.  అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా,  ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది.   అదేంటో తెలుసుకుంటే.. మజ్జిగ.. భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది.  కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది? కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో  మజ్జిగను పోసినప్పుడు నేల  pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. నత్రజని ఇస్తుంది.. కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కీటకాల నుండి రక్షణ.. కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది. పోషకాలు.. మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి  మజ్జిగను ఉపయోగించవచ్చు.                               *రూపశ్రీ.
మధుమేహం (Diabetes) ఉన్నవారు చేసే మొదటి పని అన్నం మానేసి చపాతీలు తినడం. మరి నిజంగా చపాతీ తింటే షుగర్ తగ్గుతుందా? అన్నం తింటే పెరిగిపోతుందా? ఈ విషయంలో చాలా మందిలో అనేక అపోహలు ఉన్నాయి. వీటన్నింటికీ ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.జి.వి. సత్య (Dr. SGV Satya) గారు ఈ వీడియోలో శాస్త్రీయమైన సమాధానాలు ఇచ్చారు.       ఈ వీడియోలో ముఖ్యంగా చర్చించిన అంశాలు: 👇 అన్నం vs చపాతీ: రెండింటిలో ఉండే కార్బోహైడ్రేట్లు మరియు గ్లైసీమిక్ ఇండెక్స్ మధ్య తేడాలు. సరైన ఆహార విధానం: షుగర్ ఉన్నవారు అన్నం తినాలనుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ముఖ్యమైన సూచనలు: క్వాంటిటీ (పరిమాణం) మరియు క్వాలిటీ (నాణ్యత) విషయంలో మనం చేసే తప్పులేమిటి? షుగర్ కంట్రోల్ చిట్కాలు: రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉండాలంటే భోజనంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలి? మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి వేగవంతమైన ఒత్తిడితో కూడిన జీవితంలో ఆందోళన ఒక సాధారణ సమస్యగా మారింది. కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలు కూడా మనసును అశాంతపరిచి, నిద్ర, ఆహరం, రోజువారీ జీవనశైలిపై  ప్రభావం చూపుతాయి. ఆందోళన సహజమైనదే అయినప్పటికీ, దానిని కొనసాగనివ్వడం మానసిక,  శారీరక ఆరోగ్యానికి హానికరం.  నేటికాలంలో చాలా మంది ఈ ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకుంటున్నారు.  ఆందోళన అనే ఉచ్చులో చిక్కుకున్నాక జీవితం చిన్నాభిన్నం అవుతుంది.  ఆందోళన ఉచ్చులో పడకుండా ఉండాలంటే.. కొన్నిమార్గాలు అనుసరించాలి.  దీని వల్ల  మానసిక ఒత్తిడి తగ్గి, ఆందోళనకు గురి కాకుండా ఉండగలుగుతారు. లోతైన శ్వాస.. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి, రోజుకు 5-10 నిమిషాల పాటు దీర్ఘ శ్వాస తీసుకోవడం అత్యంత సులభమైన మార్గం.  లోతుగా, నెమ్మదిగా శ్వాస తీసుకున్నప్పుడు, శరీరంలో ఆక్సిజన్ ప్రవాహం పెరిగి మనస్సు ప్రశాంతమవుతుంది.  ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితికి తీసుకువచ్చి, శరీరంలోని ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది.  ఉదయం నిద్రలేచిన తర్వాత లేదా రాత్రి పడుకునే ముందు ఇలా చేయడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ద్యానం.. ప్రతిరోజూ 15-20 నిమిషాలు ధ్యానం చేయడం మానసిక ఆందోళనను తగ్గిస్తుంది.  ఇది మానసిక ఏకాగ్రతను పెంచి, ప్రతికూల ఆలోచనలను నియంత్రించడంలో సహాయపడుతుంది.  క్రమంగా సాధన చేయడం ద్వారా  మనస్సు మరింత ప్రశాంతంగా, సమతుల్యంగా మారుతుంది. యోగా, వ్యాయామం.. యోగా మరియు తేలికపాటి వ్యాయామం శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్లను పెంచుతాయి. ఈ హార్మోన్లు సహజంగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. క్రమం తప్పకుండా నడవడం, శరీరాన్ని సాగదీసే స్ట్రెచ్చింగ్ వ్యాయాలు లేదా సాధారణ యోగాసనాలు వేయడం వల్ల శరీరం, మనస్సు రెండూ చురుకుగా ఉంటాయి. ప్రతికూల ఆలోచన.. ప్రతికూల ఆలోచనల స్థానంలో సానుకూల ఆలోచనలను నింపడం మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యమైన మార్గం.  ఎవరికి వారు ప్రోత్సాహకరమైన మాటలు చెప్పుకోవాలి,   దేనికి కృతజ్ఞతతో ఉన్నారో గమనించాలి.  ఇది ఆందోళనను,  భయాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్ర, ఆహారం.. మానసిక ఆరోగ్యానికి తగినంత నిద్రపోవడం, సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం.  నిద్రలేమి ఆందోళనను పెంచుతుంది. కెఫీన్, చక్కెర అధికంగా తీసుకోవడం, ఆల్కహాల్‌కు దూరంగా ఉండడం వంటివి  మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటంలో సహాయపడతాయి. సహకారం.. మానసిక స్థితి చాలా బాగోలేదని అనిపించినప్పుడు, ఎప్పుడు ఆందోళనగా అనిపిస్తూ ఉన్నప్పుడు  కుటుంబ సభ్యులతో లేదా స్నేహితులతో మాట్లాడాలి. అవసరమైతే, మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. ఒంటరిగా బాధపడటం కంటే నచ్చిన వారి దగ్గర మనసు విప్పి మాట్లాడటం ద్వారా ఊరట పొందవచ్చు.                              *రూపశ్రీ.
కాలం మారినా మనిషి జీవన పోరాటం మాత్రం మారదు.  కొందరు కాలంతో పోటీ పడి ఎండ, వాన, చలి వంటి వాటిని లెక్క చేయకుండా సాగుతూ ఉండాలి. లేకపోతే వారితో పాటు వారిని నమ్ముకున్న కుటుంబాలు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.  ఇక ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.  ఈ వేసవి కాలంలో అడుగు బయట పెట్టాలంటే భయపడాల్సి వస్తోంది. కానీ కొందరు మాత్రం ఎండలో కూడా బయటకు వెళ్లాలి,  ఎండలో తిరిగి పనులు చేయాల్సి వస్తుంది.  చాలామంది బయటి పనులకు బైక్ వాడుతూ ఉంటారు. సాధారణ రోజులలో బైక్ ప్రయాణం ఏమంత సమస్య అనిపించదు. కానీ.. వేసవిలో,  తీవ్రమైన ఎండలో మాత్రం బైక్ ప్రయాణించే వారు చాలా జాగ్రత్త పడాలి. లేకపోతే వడగాలులు,  డీహైడ్రేషన్ సమస్య చాలా తొందరగా దెబ్బతీస్తాయి.  బైక్ రైడర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసుకుంటే.. సరైన దుస్తుల ఎంపిక.. ఎండలో ప్రయాణించేటప్పుడు సురక్షితమైన దుస్తులు , హెల్మెట్ ధరించడం అత్యంత ముఖ్యం. చెమట త్వరగా ఆవిరైపోయి, శరీరాన్ని చల్లగా ఉంచడానికి తేలికైన, గాలి ప్రసరించే దుస్తులు ధరించాలి.  హెల్మెట్ సరిగ్గా బిగువుగా సరిపోయేలా ,  తలను ఎండ నుండి రక్షించేలా  ఉండేలా చూసుకోవాలి. నీరు..  తగినంత నీరు , ఎలక్ట్రోలైట్లను తీసుకోవడం చాలా ముఖ్యం. వేడిలో, శరీరం నుండి నీరు , ఖనిజాలు వేగంగా నష్టపోతాయి, దీనివల్ల డీహైడ్రేషన్ , బలహీనత ఏర్పడతాయి. నీటితో పాటు కొబ్బరి నీరు లేదా ఎలక్ట్రోలైట్ పానీయాలను తీసుకోవడం శరీరంలోని నీరు , ఖనిజాల సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సమయం.. ఎక్కువ సేపు ఎండలో బైక్ డ్రైవ్ చేయడం మానుకుంటే మంచిది. తెల్లవారుజాము లేదా సాయంత్రం వంటి చల్లని సమయాల్లో బైక్ డ్రైవింగ్ మేలు. దీనివల్ల ఎండ వేడిమి, అలసట తగ్గుతాయి. మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ఎండ తగలకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. విశ్రాంతి.. తప్పనిసరి పరిస్థితిలో బయటకు వెళితే..  బైక్ వేగాన్ని అదుపులో ఉంచుకోవాలి.  విశ్రాంతి తీసుకోవడానికి, శరీరాన్ని  చల్లార్చుకోవడానికి అక్కడక్కడా ఆగుతూ,  విశ్రాంతి తీసుకుంటూ వెళ్లడం మంచిది. ఎక్కువ సేపు అధిక వేగంతో ప్రయాణించడం వల్ల శరీర వేడి పెరిగి అలసటకు దారితీస్తుంది. చిన్న చిన్న విరామాలు తీసుకోవడం శరీరాన్ని కూల్ చేసుకోవడానికి, సురక్షితమైన ప్రయాణానికి సహాయపడతాయి. గ్లౌజులు,  సన్ స్క్రీన్.. తీవ్రమైన ఎండ  నుండి ప్రొటెక్షన్ కోసం సన్‌స్క్రీన్ , చేతికి గ్లౌజులు వాడాలి. సన్‌స్క్రీన్ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తుంది, అదే సమయంలో గ్లౌజులు  బైక్ నడుపుతున్నప్పుడు  చేతుల చర్మాన్ని రక్షిస్తాయి. ఇది చర్మం కాలిన గాయాలు , నష్టం కలిగే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.                               *రూపశ్రీ.