
ఎవరు ఊహించని విధంగా గత ఏడాది 'పుష్ప 2'(Pushpa 2)రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మరణించి, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడి మృత్యు కొరల నుంచి బయటకి వచ్చి ఇంటి దగ్గరే ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.
నిన్న శ్రీతేజ్ ని అల్లు అరవింద్, అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి కలిసి పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వారు, ఆ కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం శ్రీతేజ్ కోలుకుంటున్న తీరు పట్ల వారు సంతోషం వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ వారితో మాట్లాడుతూ శ్రీతేజ్ తో పాటు సోదరి విషయంలో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.శ్రీతేజ్ కి అయ్యే అన్ని ఖర్చులతో పాటు శ్రీతేజ్ సోదరి జీవిత కాలంలో విద్యాభ్యాసానికి అయ్యే పూర్తి ఖర్చుని నేనే చూసుకుంటాను. భవిష్యత్తులోను అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అల్లు స్నేహ రెడ్డి కూడా శ్రీ తేజ్ కుటుంబసభ్యులతో వ్యక్తిగతంగా మాట్లాడి అన్ని విధాలుగా తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
also read: Vijay: ఒక్క ఓటుతో విజయ్ ని గెలిపించిన అభిమాని.. సినిమా కాదు నిజం
గతంలో అల్లు అర్జున్ 1 కోటి, మైత్రీ మూవీ మేకర్స్ 50 లక్షలు, దర్శకుడు సుకుమార్ 50 లక్షలు ఇవ్వగా ఆ మొత్తం 2 కోట్ల రూపాయలని శ్రీతేజ్ కుటుంబం పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే 75,000 వడ్డీ శ్రీతేజ్ వైద్య ఖర్చులు మరియు కుటుంబ పోషణకి అందుతోంది. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ చికిత్సకి అయిన 70 లక్షల ఖర్చుని కూడా అల్లు అర్జున్ నే ఇవ్వడం జరిగింది





.webp)
