LATEST NEWS
తమిళనాడు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ పూర్తి కావడంతో   ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను సోమవారం (ఫిబ్రవరి 23)   విడుదల చేసింది. సవరించిన జాబితా కింద రాష్ట్రంలోని 74 లక్షల మంది ఓట్లను ఓటర్ల జాబితా నుంచి ఈసీ తొలగించింది. తుది జాబితాలో మొత్తం 5.67 కోట్ల మంది   బాజితాలో ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు రాష్ట్రంలో 6.41 కోట్ల మంది రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారు. సోమవారం ఫిబ్రవరి 23)  చెన్నైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తమిళనాడు చీఫ్ ఎలక్షన్ అధికారి అర్చనా పట్నాయక్ ఈ జాబితాను విడుదల చేశారు. తాజా జాబితాలో 5.67 కోట్ల మంది ఓటర్లు నమోదు కాగా, వీరిలో 2.77 కోట్ల మంది పురుషులు, 2.89 కోట్ల మంది మహిళలు 7,617 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. క్లెయిమ్‌లు, అబ్జెక్షన్ పీరియడ్‌లో దాఖలు చేసిన దరఖాస్తులను సమీక్షించి మార్పులు చేసినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 2025 డిసెంబర్ 19 నుంచి 2026 జనవరి 30 వరకూ ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించాల్సిందిగా 4.38 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, వీటిలో 4.23 లక్షల ఎంట్రీలను వెరిఫికేషన్ అనంతరం తుది ఓటర్ల జాబితా నుంచి తొలగించామని పేర్కొంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాదేజరగనున్న సంగతి తెలిసిందే. అలాగే కేరళ, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, అస్సాం ఎన్నికలు ఈ ఏడాదే జరుగుతాయి. 
రాజమహేంద్రవరం జిల్లా జైలు నుంచి బెయిలుపై ఇటీవల విడుదలైన మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబును వైసీపీ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి సోమవారం (ఫిబ్రవరి 23) పరామర్శించారు. మాజీ మంత్రులు, వైసీపీనాయకులతో కలిసి గుంటూరులోని అంబటి నివాసానికి వెళ్లిన ముద్రగడ అంబటి రాంబాబును పరార్శించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభఉత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కాపు సామాజికవర్గం బానిస వర్గం కాదన్నారు. అరెస్టులకు భయపడేది లేదని ముద్రగడ ఈ సందర్భంగా చెప్పారు.  గతంలో చంద్రబాబు తనను, తన కుటుంబాన్నీ వేధించిన తీరు అందరికీ తెలుసునని చెప్పిన ఆయన  మాజీ మంత్రి ఇంటిపై ఏడు గంటల పాటు దాడులు చేయడం, అరెస్టులతో భయపెట్టాలని చూడటం ప్రజాస్వామ్యంలో సరికాదన్నారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో ప్రతిరోజూ అబద్ధాలాడుతున్నారంటూ చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై విమర్శలు గుప్పించారు.  ఇప్పటికైనా  భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  ఈ సందర్భంగా ముద్రగడ పద్మనాభరెడ్డి.. అంబటి రాంబాబు కుమార్తె మౌనికను ప్రత్యేకంగా పలకరించి.. ఆమె ధైర్యాన్ని అభినందించారు.  
రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి  నలుగురు మరణించిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కల్తీపాలు తాగి ఇద్దరు మరణించడమే కాకుండా పలువురు తీవ్ర అస్వస్థతకు గురికావడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో  ఈ ఘటనపై  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. ఈ ఘటనలో నలుగురు చనిపోయారని, మరో 8 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని అసెంబ్లీ వేదికగా ప్రకటించిన ఆయన మృతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. అస్వస్థతకు గురైన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అసెంబ్లీకి తెలిపిన ఆయన . కల్తీ పాల వల్లే వారు అనారోగ్యం పాలయ్యారని ప్రాథమికంగా నిర్థారణ అయిందన్నారు. అంతకుముందు   కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ, ఫుడ్ సేఫ్టీ అధికారులతో వర్చువల్ గా చంద్రబాబు సమావేశమైన చంద్రబాబు కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. పాల శాంపిల్స్ ఫలితాలు వచ్చిన తర్వాత పాలు అమ్మినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫుడ్ సేఫ్టీ, వైద్యారోగ్య శాఖ అధికారులు తక్షణం రాజమండ్రి వెళ్లాలని ఆదేశించారు. కల్తీ పాల కారణంగానే మరణాలు సంభవించినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చామని జిల్లా కలెక్టర్ చెప్పారు.  పాల శాంపిల్స్ సేకరించి పరీక్షల కోసం హైదరాబాద్ పంపించామని, రెండు రోజుల్లో నివేదిక వస్తుందని అన్నారు. ఈ ఘటన జరిగిన చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. బాధితులకు పాలు పోసిన వ్యాపారి గణేశ్ ను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు.  46 మంది రైతుల దగ్గర నుంచి పాలు సేకరించి ఆ పాలను 106 కుటుంబాలకు సరఫరా చేసినట్లు గుర్తించిన అధికారులు..  ఆయా ఇళ్లలోని వారి ఆరోగ్య స్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు.
ఇటీవ‌ల ఒక మీటింగ్ లో.. వంగ‌వీటి రాధా, జ‌క్కంపూడి రాజాకు కాపు సామాజిక వ‌ర్గం అండ‌గా  ఉండాల‌ని సూచించారు. దీంతో రాధా వైసీపీలో చేరిపోతున్నార‌హో! అంటూ పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు ప్రచారాలు, సంబ‌రాలు మొదలెట్టేశాయి.  అయితే రాజా కుటుంబంతో రంగా  కుటుంబానికి ఉన్న అనుబంధం కార‌ణంగా.. రాధా ఇలా అనాల్సి వ‌చ్చింది త‌ప్ప‌.. ఇందులో పార్టీల ప్ర‌మేయం లేద‌ని క్లారిటీ ఇస్తోంది  రాధా వ‌ర్గం.  ఇటీవ‌ల కిరాక్ ఆర్పీ.. వైసీపీ ఎమ్మెల్సీ, మండ‌లి ప్ర‌తిప‌క్ష నేత‌ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ను అవ‌హేళ‌న చేస్తూ మాట్లాడారు. ఆ వెంట‌నే కాపుల్లో  ఆగ్ర‌హం క‌ట్ట‌లు తెంచుకుంది. దీంతో దిగి  వ‌చ్చిన  ఆర్పీ క్ష‌మాప‌ణ చెప్పారు కూడా. అలాగ‌ని కాపులంతా వైసీపీకి స‌పోర్ట్ చేయ‌డం అని అర్ధం  కాదు క‌దా ? అంటున్నారు వంగవీటి రాధా అభిమానులు.   ఇది కూడా  అంతే..  రాజా కుటుంబంతో ఉన్న అనుబంధం కొద్దీ చేసిన ఈ కామెంట్ ని ప‌ట్టుకుని ఇలాంటి వాద‌న తెర‌పైకి తీసుకురావ‌డం తగదంటున్నారు. అదలా ఉంటే..  ఇదిలా ఉంటే రాధా కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీతో గ‌త కొంత‌కాలంగా  ఎంతో స్నేహంగా  ఉంటూ వ‌స్తున్నారు. దీంతో  తిరిగి వైసీపీలోకి వ‌చ్చేస్తార‌న్న టాక్ చాలా  పెద్ద ఎత్తున వినిపించింది. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఎందుకంటే జ‌గ‌న్  రాధాను అవ‌మానించిన తీరు ఎలాంటిదో.. ఇటీవ‌ల నాగ‌బాబు మాట‌ల‌ను బ‌ట్టి  తెలుస్తోంది. రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌ల‌కు వెళ్లొద్ద‌ని హుకుం జారీ చేయ‌డం వ‌ల్లే ఆయ‌న వైసీపీ  నుంచి బ‌య‌ట‌కొచ్చారు. అలాంటిది తిరిగి   వైసీపీలోకి ఎలా వెళ్తార‌ని ప్రశ్నిస్తున్నది రంగా- రాధా మిత్ర మండ‌లి.
వంగవీటి మోహనరంగా కుమార్తె వంగవీటి ఆశాలత తాను వైసీపీ గూటికి చేరుతున్నట్లుగా వస్తున్న వార్తలకు  ఖండించారు. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేశారు.  జిల్లా కంభం చెరువును సందర్శించిన సందర్భంగా ఆమె మీడియాతో ఆదివారం (ఫిబ్రవరి 22)  మాట్లాడారు. గత కొంత కాలంగా  తన రాజకీయ ప్రవేశంపై రకరకాల ఊగాహానాలు వస్తున్నాయన్న ఆశాలత..  కొందరు  సోషల్ మీడియాలో  పనిగట్టుకుని దుష్ప్రచారం  చేస్తున్నారన్నారు.   ప్రస్తుతం తన  దృష్టిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 'రాధా-రంగా మిత్రమండలిని ఏ బలోపేతం చేయడంపైనే కేంద్రీకృతం చేశానని ఆమె చెప్పారు. రాజకీయ ప్రవేశంపై తనకు ఆసక్తి ఉన్న మాట వాస్తవమేననీ, అయితే అందుకు ఇంకా సమయం ఉందన్నారు.  ఇప్పటికే ఆమె సోదరుడు వంగవీటి రాధా రాజకీయాల్లో చురుగ్గా ఉన్న సంగతి విదితమే. ఇప్పుడు ఆశాలత కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తుండటం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. 
ALSO ON TELUGUONE N E W S
The much-awaited #Nani34 has finally secured a title that matches its intense buzz: BLOODY ROMEO. Revealed today as a birthday gift to Nani's fans, the announcement video has already become a talking point for its "vibing" soundtrack and slick visuals. The "No.1 Gangsta" song featured in the clip is already being hailed as a potential chartbuster, setting a gritty yet stylish tone for the movie. Sujeeth’s mastery of presentation is evident in every frame of the teaser. Known for his ability to mount large-scale, stylish action dramas, he seems to be bringing a unique "witty action" approach to this project. The choice of Nani for this role reflects the actor's ongoing trend of picking boundary-pushing scripts. By portraying a character who balances the life of a chef with the world of a gangster, Nani is set to deliver a performance that is both fresh and fierce.   The visual identity of the film is further established by the title logo, which uses guns and roses to signify the "Bloody" and "Romeo" aspects of the protagonist's life. This collaboration, produced by Venkat Boyanapalli, represents a significant move for both the star and the director. With uncompromised production values and a banger of a soundtrack already in the works, BLOODY ROMEO is undoubtedly one of the most anticipated films currently in production.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -ఈ రోజు నాని పుట్టిన రోజు  -అభిమానులకి కానుకగా కొత్త సినిమా టైటిల్ ప్రకటన  - పాన్ ఇండియా మూవీ అని కూడా ప్రకటన  -మరి టైటిల్ ఏంటో చూసేద్దాం  కంటెంట్ తో కట్ అవుట్ రేంజ్ ని పెంచుకున్న హీరో నాచురల్ స్టార్ నాని(Nani).ఈ రోజు నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులు నానికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తు సోషల్ మీడియాని పూర్తిగా తమ ఆధీనంలోకి  తీసుకున్నారు. నాని కూడా అభిమానులకి ట్రీట్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో  ఓజి ఫేమ్ సుజిత్ తో కమిట్ అయిన కొత్త చిత్రం టైటిల్ ప్రకటించి వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసాడు. మరో ఆ టైటిల్ ఏంటో చూద్దాం. బ్లడీ రోమియో(Bloody Romeo)..నాని, సుజిత్(Sujith)కొత్త సినిమా టైటిల్ పేరు. నిమిషం ఇరవై ఐదు సెకన్ల నిడివి ఉన్న ఒక యానిమేషన్ వీడియోతో సదరు టైటిల్ ని అనౌన్స్ చేయడం జరిగింది. వీడియోలో గ్యాంగ్ స్టర్ డెన్ అంటూ ఒక పెద్ద ఇంటిని ఎస్టాబ్లిష్ చేసారు. వంటగదిలో ఒక వ్యక్తి తన గ్యాంగ్ కోసం నాన్ వెజ్ వంటకం చేస్తున్నాడు. డైనింగ్ టేబుల్ దగ్గర గ్యాంగ్ వెయిట్ చేస్తూ ఉంది.వంటకం రెడీ అయిన తర్వాత కుక్కర్ కి ఒక శక్తివంతమైన బాంబు ని అమర్చి బిల్డింగ్ మొత్తం పేలేలా చేసాడు. సదరు వ్యక్తి  మంటల్లో స్టైల్ గా నడుచుకుంటూ వచ్చాడు. ఆ వ్యక్తి నాని అని క్లియర్ గా అర్ధమవుతుంది. హి ఈజ్ నెంబర్ వన్ చెఫ్ అండ్  గ్యాంగ్ స్టర్ అని చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో ఫ్యాన్స్, నెటిజన్స్ ని విశేషంగా ఆకర్షిస్తుంది. also read: The kerala story part 2: దివాళా తీసిన ప్రకాష్ రాజ్.. ది కేరళ స్టోరీ పార్ట్ 2 డైరెక్టర్ వెల్లడి  నాని, వెంకట్ బోయినపల్లి సంయుక్త్గంగా నిర్మిస్తుండగా త్వరలోనే రెగ్యులర్ షూట్ కి వెళ్లనుంది. హీరోయిన్ తో పాటు మిగతా నటీనటుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి  పాన్ ఇండియా మూవీ అని  అనౌన్స్ మెంట్ ఇచ్చేసారు.     
  -కేరళ సద్య  ఇదే అంటూ ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్  -పోటీగా కౌంటర్ ఇచ్చిన డైరెక్టర్ కామాఖ్య నారాయణ్ సింగ్  -ప్రశ్నలు లేవనెత్తడమే నా పని  ది కేరళ స్టోరీ పార్ట్  2(The Kerala Story 2)ఈ నెల 27 న వరల్డ్ వైడ్ గా విడుదలకి రెడీ అవుతుంది.కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన ట్రైలర్ లో ఒక ముస్లిం కుటుంబం యువతికి బలవంతంగా బీఫ్ తినిపిస్తున్న సన్నివేశం ఉంది. సదరు సన్నివేశాన్ని ఉద్దేశించి ప్రకాష్ రాజ్(Prakash Raj)ఎక్స్ వేదికగా పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో శాఖాహార కేరళ సద్యతో పాటు బీఫ్, పోర్క్, చేపల వంటి వంటకాలతో కూడిన ఫోటోలని షేర్ చేస్తు, ఇవి నిజమైన  కేరళ రాష్ట్ర నిజమైన సంస్కృతిని, వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. అన్ని రకాల వంటకాలు కలిసి సామరస్యంగా ఉండటమే నిజమైన కేరళ స్టోరీ. దయచేసి ఆస్వాదించండనే క్యాప్షన్ ఉంచాడు. ప్రకాష్ రాజ్ ట్వీట్ పై కేరళ స్టోరీ పార్ట్ 2  డైరెక్టర్ కామాఖ్య నారాయణ సింగ్(Kamakhya Narayan Singh) స్పందిస్తు   ప్రకాష్ రాజ్ చాలా ఉన్నత స్థాయి నటుడు అని అనుకునేవాడిని. కానీ అతను మానవుడితో సమానంగా తక్కువ స్థాయిలో ఉన్నాడని భావిస్తున్నాను.బలవంతంగా గొడ్డు మాంసం తినిపించడం, మతమార్పిడిలు చేయడం తప్పు కాదా! ప్రకాష్ రాజ్  మనస్సాక్షిని ప్రశ్నిస్తున్నాను. ఇది ఎప్పటికీ ఆమోదయోగ్యం కాదు. భారతదేశంలోని నాగరిక సమాజం ఎవరినైనా తమ మతాన్ని మార్చడానికి బలవంతంగా గొడ్డు మాంసం తినమని చేయడాన్ని ఎప్పటికీ అంగీకరించదు. అతను మేధోపరంగా దివాలా తీసాడు. మాత మార్పిడులనే దుష్ట శక్తి త్వరగా అంతమవ్వాలనేది మా ఆశ. నా సినిమాలు ఎప్పుడు ప్రశ్నలు లేవనెత్తుతాయి అతను ఏమి తింటాడో నాకు తెలియదు. కానీ అతని ప్రకటనలు బట్టి ఏం తింటాడో అర్ధం చేసుకోవచ్చు.  also read: Malaika Arora: మళ్లీ ప్రేమలో పడిన మలైకా అరోరా! ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ తెలిస్తే షాక్ అవుతారు కేరళని  ఒక రాష్ట్రంగా లక్ష్యంగా చేసుకోవడం లేదు.కేరళ దేవుని దేశం. ఆ రాష్ట్రంలోని చెడుని  వీలైనంత త్వరగా నిర్మూలించాలని మేము కోరుకుంటున్నాని కామాఖ్య నారాయణ్ సింగ్  తెలిపాడు. అస్సాం క్యాప్టిల్ గౌహతి కి చెందిన కామాఖ్య నారాయణ్ సింగ్ ఇప్పటి వరకు డాక్యుమెంటరీ తో కూడిన ఐదు షార్ట్ ఫిల్మ్స్ తెరకెక్కించాడు. అవన్నీ కూడా సామాజిక ప్రయోజనంతో కూడుకున్నవే. 'జస్టిస్ డిలేయిడ్ బట్ డెలివర్డ్' కి నేషనల్ అవార్డు అందుకున్నాడు. కేరళ స్టోరీ పార్ట్ 2 నే తొలి చిత్రం.     
  -అర్జున్ కపూర్ తో విడిపోయాక ఒంటరిగానే ఉంటున్న మలైకా  -కెవ్వు కేక సాంగ్ తో తెలుగు ప్రేక్షకులకి సుపరిచయస్తురాలే  -రీసెంట్ గా బిజినెస్ మాన్ తో ప్రేమలో పడినట్టుగా పుకార్లు  -ఇంతకీ అతను ఎవరు  -ఏజ్ గ్యాప్ కూడా వైరల్   పవన్ కళ్యాణ్(Pawan Kalyan)తో కలిసి 'కెవ్వుకేక' సాంగ్ చేయడం ద్వారా ఓవర్ నైట్ తెలుగు ప్రేక్షకుల మనసులని గిలిగింతలు పెట్టింది మలైకా అరోరా(Malaika Arora).'మున్ని బదనాం హోయి' అని సల్మాన్ తో కూడా చిందులేసిన మలైకా సినీప్రస్థానానికి సుదీర్ఘ హిస్టరీ నే ఉంది. కాకపోతే స్పెషల్ సాంగ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పవచ్చు. గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన రష్మిక, ఆయుష్మాన్ ఖురానా 'థామ' లోని 'పాయిజన్ బేబీ' సాంగ్ లోను చేసి అభిమానులని మెస్మరైజ్ చేసింది. రీసెంట్ గా బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో మలైకా హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలోను సదరు వార్త వేడి వేడి న్యూస్. మరి సదరు న్యూస్ ఏంటో చూద్దాం. మలైకా అరోరా 2018 నుంచి ఏజ్ లో తనకంటే పన్నెండు సంవత్సరాల చిన్నవాడైన ప్రముఖ హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేసిన విషయం తెలిసిందే. శ్రీదేవి భర్త బోణి కపూర్ మొదటి భార్య కొడుకే అర్జున్ కపూర్. కానీ గత ఏడాది ఆ ఇద్దరు విడిపోయారు. అప్పట్నుంచి ఒంటరిగా ఉంటున్న మలైకా ఇప్పుడు హర్ష్ మెహతా తో డేటింగ్ లో ఉన్నట్టుగా బాలీవుడ్ సినీ సర్కిల్స్ భావిస్తున్నాయి. రీసెంట్ గా ముంబై లో  ఒక సంగీత కార్యక్రమం జరిగింది. అందులో ఈ ఇద్దరు జంటగా కనిపించడంతో పాటు సెల్ఫీ కూడా తీసుకున్నారు.సెల్ఫీ తీసుకుంటున్న మాత్రానికే ఇద్దరి మధ్య ఏదో ఉందని అనుకోవడమేనా అని అనుకోవచ్చు. మొన్న వాలైంటెన్స్ డే నాడు ఈ ఇద్దరు  ఫారిన్ లో ఉన్నట్లు చెప్తున్నారు. తరుచు ముంబైలో జరిగే పార్టీలకి కూడా  కలిసే హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ప్రముఖంగా వస్తుండటంతో అభిమానులు, నెటిజెన్స్ హర్ష్ మెహతా  గురించి సెర్చ్ చేయడం ప్రారంభించారు.  Also read: Samantha: నమ్మకం కోల్పోయానంటున్న సమంత.. చికాకు తెప్పించే జోడి! హర్ష్ మెహతా(Harsh Mehta)ఒక వజ్రాల వ్యాపారి. హర్ష్ సంకాస్ మేనేజ్‌మెంట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. హర్ష వయసు 33 సంవత్సరాలు. ఈ విషయాలన్నీ తెలుసుకొని ఒక్కసారిగా అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటే  మలైకా వయస్సు 52 సంవత్సరాలు. అంటే ఆ ఇద్దరి మధ్య 19 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. అభిమానులు మాత్రం ప్రేమకి ఏజ్ తో సంబంధం ఏముందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఒక్కటి మాత్రం నిజం. పర్సనల్ విషయాలని సైతం  డేర్ గా వెల్లడి చేయడంలో మల్లికా  స్పెషలిస్ట్. ఈ నేపథ్యంలో హర్ష్ మెహతా రిలేషన్ పై ప్రకటన చేస్తుందేమో చూడాలి. మలైకా 1998 లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ని వివాహం చేసుకుంది. చిరంజీవి నుంచి వచ్చిన జై చిరంజీవ మూవీలో అర్బాజ్ విలన్ గా చేసి మెప్పించాడు . 2017 లో ఆ ఇద్దరు విడాకులు తీసుకోగా ఒక కొడుకు కూడా ఉన్నాడు.  
The Telugu web series D/O Prasad Rao Kanabadutaledhu, starring Rajeev Kanakala, Udaya Bhanu, Vasanthika , and Sriram Venkat in prominent roles, is set to premiere on ZEE5 from February 27. Produced by K.V. Sriram under the South India Screens banner and directed by Krishna Poluru , the series had two episodes screened exclusively for the media ahead of its streaming debut, followed by a grand preview event attended by the cast and crew. Speaking about his role, Rajeev Kanakala described it as one of the most significant characters in his career. “I’ve played many roles over the years, but this one stands out as a milestone. The emotional transitions, the modulation, and the dialogue delivery are completely different from what audiences have seen from me so far. Krishna presented me in a refreshing way,” he said. He added that the narrative unfolds with consistent tension and unexpected turns. “It’s layered, intense, and emotionally grounded. Viewers will stay engaged till the last moment.” Director Krishna Poluru shared that the story began as a simple idea and gradually evolved into a fully fleshed-out script over nearly two years. “After Recce, I wanted to explore something emotionally powerful yet gripping as a thriller. It took time to shape the characters properly. I’m grateful to the team at ZEE5 for believing in the vision,” he said. He emphasized that the series balances sensitivity with suspense, ensuring both emotional resonance and narrative momentum. Udaya Bhanu expressed excitement about the release and said she connected deeply with her character. “I was waiting for audiences to watch this. The shoot moved quickly, but we ensured the emotional core remained intact. As a mother, several moments in the story felt very personal,” she said. She also mentioned that playing a police officer was a long-standing wish and that the role gave her the opportunity to portray both strength and vulnerability. Producer K.V. Sriram stated that the series would strongly connect with fathers and families. “When I watched the final output, I saw only the character — not the actor. That level of immersion is rare,” he said, referring to Rajeev’s performance. He added that each episode carries high intensity. “Every episode feels like a climax in itself. The thrill is maintained throughout.” He also thanked ZEE5 Telugu for their continued support. ZEE5 Telugu Senior Vice President Jayanth Raghavan said the series adds depth to their growing slate of Telugu originals. He shared that the father’s character personally resonated with him and praised the team’s collaborative effort. He highlighted the cinematography by Mahesh and dialogues by Shruti as strong pillars supporting the narrative. Cinematographer Mahesh noted that this marks his fourth collaboration with ZEE5 and another successful association with producer Sriram. “We completed the project swiftly but with total commitment. The visuals enhance the emotional and suspense elements,” he said. Dialogue writer Shruti described the series as emotionally intense and said she connected strongly with the story while writing. “The emotional weight of the characters stayed with me throughout. I hope viewers feel that authenticity,” she remarked. Actress Vasanthika shared that early viewers who watched the first two episodes appreciated her performance. She credited director Krishna for guiding her portrayal and said every character contributes meaningfully to the story’s progression. Actress Gayatri Bhargavi mentioned that although her role is brief, it is impactful. She thanked the makers and expressed confidence that the series will stand out as a gripping emotional thriller.     The event was followed by a Q & A session. Q: Rajeev garu, why did you become so emotional while speaking about the project? Why do you say this series is important to you? And how do you stay connected with your daughter? Rajeev Kanakala: Like anyone else, I get emotional when I think about my parents. As a father of a daughter, there were many moments in this story that I personally related to. That’s why this project is very important to me. Nowadays, we mostly stay connected through phone calls, but whenever I get time, I tease her, irritate her, and enjoy those little moments. Q: Krishna garu, usually producers choose in-demand or popular faces. What was the reason behind your casting choices? Also, the episodes ended very strongly — can you talk about that? Krishna Poluru: Content, sir — content and characters dictated the casting. We followed what the story demanded. Regarding the episode endings, the credit goes to the entire team. You never truly know how everything will shape up until you see the final product, and thankfully it worked beautifully for us. I have known Rajeev for many years, but I was genuinely awestruck by his performance in this series. I told him almost every day how brilliant he was. Q: Jayanth garu, what were the elements that excited you when you first heard the story? Jayanth Raghavan: As Trivikram garu once mentioned, there are many stories centered around mothers, but very few that explore a father’s perspective. Fathers, especially at that age, carry emotions just as deeply as mothers do, even if they don’t express them openly. Once I heard that emotional angle, I decided we should move forward with it. Q: Udaya Bhanu garu, you have been seen in quite a few strong roles recently, and many resemble your real-life personality. What do you think about that? Udaya Bhanu: I feel very strong playing such characters. I truly believe I was born to rebel. Before becoming an anchor, I was an actress, and I am happy that I am getting more performance-oriented roles now. I enjoy portraying powerful women. Q: Rajeev garu, can you speak about the challenges of performing in the dialect used in the series? Rajeev Kanakala: I would say the difficulty was very minimal, and only at the beginning. Director Krishna was present throughout the shoot and has a strong command over the dialect. The makers were very clear about the character from the beginning. Once I got into costume — including the walk and mannerisms — everything felt natural and easy. Q: Krishna garu, after the success of Recce, people might compare this series to it. How did you handle that pressure? Krishna Poluru: It was definitely a tough challenge. After Recce, I did not work on anything for nearly two years. That is how much effort and thought went into shaping this project. I wanted to ensure it stands on its own merit. Q: The episodes seem very emotional. Is there any real-life inspiration behind the story? Krishna Poluru: One of my cousins once came from our native place to admit his daughter into a hostel here. I saw how tense he was about her safety and future. That emotional anxiety stayed with me and inspired the basic idea. Initially, it was just a line. With Jayanth garu’s support, it eventually became this full-fledged story. Q: Vasanthika, it looks like you’ve come back with a strong project after ‘90’s’. How relatable was this character to you personally? And how was it working with Rajeev Kanakala? Vasanthika: For many women, their father is their first hero and lifelong protector. So not just me — every daughter and woman will connect with this character. Rajeev sir is very jovial on set. There is so much to learn from his performance variations. Like Udaya ma’am mentioned, having him on set always kept the atmosphere lively. Q: Shruti gaaru even though the title suggests it is a father-centric story, it also presents the daughter’s perspective. Can you speak about that? Shruti: Essentially, this is a very emotional story. While I cannot reveal too much, the emotional richness from the daughter’s and female perspective is equally strong. It adds depth and balance to the narrative. Q: Vasanthika, what was your reaction — and your father’s — when you first heard the story? Vasanthika: My father was actually the first to hear the story before I did. After meeting the director, he told me it was a beautiful and emotional father-daughter story and encouraged me to take it up. Once I heard the narration, it was clear to both of us that I should sign the project. It may feel like a new story, but emotionally it is very touching. D/O Prasad Rao Kanabadutaledhu will stream exclusively on ZEE5 from February 27. With its layered writing, emotionally charged performances, and tightly woven suspense, the series promises to resonate deeply with families while keeping viewers invested at every turn. Blending a father’s silent anxieties with a daughter’s emotional journey, it stands poised to leave a lasting impact long after the final episode ends. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Dacoit starring Adivi Sesh and Mrunal Thakur with the acclaimed Anurag Kashyap in a prominent role, has stayed in the limelight with regular updates. An intense teaser, has further elevated intrigue about the film. Produced by Supriya Yarlagadda with Asian Suniel and presented by Annapurna Studios, the film is being helmed by director Shaneil Deo.  Now, the team has officially confirmed the release of the first single, Rubaroo, a soulful melody set to debut on February 27. This track promises to travel back to a time before the protagonist became a dacoit, showcasing a heart that once loved deeply and a soul that once believed in forever. The team has unveiled a captivating poster to announce the date, featuring Mrunal Thakur in elegant white alongside Adivi Sesh, who sports a new look. This glimpse into their on-screen romance has already sparked immense curiosity among fans. Dacoit is releasing for Summer 2026.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -వైరల్ గా మారిన సమంత మాటలు  -రాజ్ తో డిసెంబర్ 1 న పెళ్లి  -చికాకు తెప్పిస్తాం    సమంత ఇటీవల ప్రముఖ దర్శకుడు 'రాజ్ నిడిమోరు'(Raj Nidimoru)ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఆడంబరానికి దూరంగా అతి కొద్దీ మంది బందువుల సమక్షంలో వివాహం జరగగా సమంత(Samantha)కొత్త లైఫ్ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని ఆమె అభిమానులు కోరుకుంటూ వస్తున్నారు. రీసెంట్ గా సమంత ఒక ఆంగ్ల మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పిన కొన్ని విషయాలు వాళ్ల కోరికకి  వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తున్నాయి. సమంత ఏం చెప్పిందో చూద్దాం. సమంత మాట్లాడుతు నా మొదటి వివాహ బంధం నుంచి బయటకి వచ్చిన తర్వాత ఇక ఎవరిపై ఆధారపడకూడదని ఫిక్స్ అయ్యాను. అసలు ఇక ఎవర్ని నమ్మనేమో  అనిపించింది. ఎవరి స్నేహాన్ని,ప్రేమని ఆమోదిస్తానని కూడా అనుకోలేదు. కానీ రాజ్ తో పరిచయం, రిలేషన్ తర్వాత మార్పు వచ్చింది. అప్పటి వరకు ఉన్న నా రొటీన్ లైఫ్ మారిపోయి కొత్త అలవాట్లు వచ్చాయి. నేను రాజ్ పరస్పర అవగాహనతో అన్ని పనులు చేసుకుంటాం. నిజానికి మేము చికాకు తెప్పించే జోడి. నటిగాను నిడిమోరు నా పక్కన ఉన్నంత కాలం మరింత ముందుకెళ్తానని సమంత చెప్పుకొచ్చింది. also read: Sreeleela: ప్లాప్ మూవీతోనే వరుస ఛాన్సులు.. శ్రీలీల ని పరిశీలిస్తున్నారని టాక్! కెరీర్ విషయానికి వస్తే ప్రస్తుతం స్వీయ నిర్మాణంలో 'మా ఇంటి మహాలక్ష్మి' చేస్తుంది. రాజ్ నిడిమోరు దర్శకత్వంలోనే 'రక్త్ బ్రహ్మాండ్ అనే వెబ్ సిరీస్ ఉందనే వార్తలు ఎప్పట్నుంచో వస్తున్నాయి. రాజ్ నిడిమోరు దర్శకత్వంలో ఇప్పటికే ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ లో చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే ఆ ఇద్దరి మధ్య పరిచయం జరిగింది.  
The powerhouse combination of Power Star Pawan Kalyan and director Harish Shankar, which previously gave us the cult blockbuster Gabbar Singh, is back with the highly anticipated Ustaad Bhagat Singh. The film’s second single, Aura of Ustaad, was released yesterday to massive acclaim, further fueling the frenzy surrounding the project.  However, the release also sparked discussions among some sections of the audience regarding the potential inclusion of political comments and satires aimed at elevating Pawan Kalyan’s real-life persona. Addressing these concerns directly, Harish Shankar released a special video to clarify the film’s stance. He revealed that Pawan Kalyan himself has been very clear that cinema and politics should remain distinct.  The actor specifically requested the filmmakers to avoid any political overtones or controversial dialogues that could be misconstrued. Harish Shankar further emphasized that he is well aware of Pawan Kalyan’s massive fan base, which transcends political affiliations and includes admirers from all parties. He stated that Ustaad Bhagat Singh has been crafted as a wholesome entertainer intended to delight everyone without hurting any sentiments.  While he promised that the "elevations" for PSPK will be on an entirely different level, he assured fans that these moments will not draw any political parallels. Produced on a grand scale by the renowned Mythri Movie Makers, the film features a high-energy soundtrack by Devi Sri Prasad.  With two chartbuster singles already ruling the airwaves, the anticipation is sky-high for the worldwide release on March 26, 2026. This clarification ensures that the focus remains on the cinematic spectacle and the high-octane performance of the Power Star. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  -ఉస్తాద్ భగత్ సింగ్ తో శ్రీలీల గోల్డెన్ లెగ్ అనిపించుకుంటుందా! -శ్రీలీల అప్ కమింగ్ సినిమాల లిస్ట్ ఏంటి! - ప్లాప్ లు వచ్చినా బడా సినిమాలు వస్తున్నాయా!  ప్రెజెంట్ సినీ పరిస్థితిని గమనిస్తే హిట్ కొట్టినా మరో సినిమా కోసం ఎదురుచూసే పరిస్థితి. కారణాలు తెలియదు గాని స్టార్స్ సైతం ఆ సిట్యువేషన్ ని ఎదుర్కుంటున్నారు. మరి  ప్లాప్ వస్తే ఇంకేమైనా ఉందా? కానీ శ్రీలీల(Sreeleela)మాత్రం ప్లాప్ లేదు గ్లిప్ లేదు. అలాంటి వన్ని నా దగ్గర నడవవు అంటూ వరుస ఆఫర్స్ ని దక్కించుకుంటుదనేది ఫిలిం సర్కిల్స్ టాక్. మరి ఆఫర్స్ తాలూకు విషయాలేంటో చూద్దాం. శ్రీలీల ఫస్ట్ టైం తమిళంలోకి ఎంట్రీ ఇచ్చి శివ కార్తికేయన్ తో 'పరాశక్తి'(Parashakthi)లో చేసిన విషయం తెలిసిందే. కానీ తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా నిలిచింది. కానీ ఈ ప్రభావం శ్రీలీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. చూడకపోవడమే కాదు ఏకంగా స్టార్ హీరో ధనుష్(Dhanush)55 వ చిత్రంలో స్థానాన్ని పొందింది. తమిళనాట తన  సత్తా చాటడానికి శ్రీలీల కి దొరికిన గోల్డెన్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఈ  గోల్డెన్ ఆఫర్ ని మించిన డైమండ్ ఆఫర్ ని దక్కించుకున్నటుగా, బిగ్గెస్ట్ స్టార్ అజిత్ పక్కన ఛాన్స్ పొందిందనే వార్తలు తమిళ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఎక్స్ క్లూజివ్ న్యూస్. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అజిత్(Ajith)కొంత గ్యాప్ తీసుకొని మళ్ళీ గుడ్ బ్యాడ్ అగ్లీ డైరెక్టర్ అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలోనే చేయబోతున్నాడని అంటున్నారు. ఇందులోనే శ్రీలీల  ని హీరోయిన్ గా ఫిక్స్ చేసే యోచనలో మేకర్స్ ఉన్నారనేది టాక్.  also read: The Kerala Story 2: కేరళ స్టోరీ 2 బీఫ్ వివాదం.. ప్రకాష్ రాజ్ అదిరిపోయే రిప్లై  శ్రీలీల తెలుగులో కొంత కాలంగా వరుస పరాజాయాలని చవిచూస్తు ఐరెన్ లెగ్ అనే పేరుకి ఆమడ దూరంలో ఉంది. మార్చి 26 న రిలీజ్ కాబోతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)వన్ మాన్ షో ఉస్తాద్ భగత్ సింగ్(Ustaad Bhagat SIngh)తో హిట్ కొట్టి గోల్డెన్ లెగ్ పోటీలో ఉండాలని  చూస్తుంది. హిందీలోను క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్న శ్రీలీల అజిత్ తో సినిమా నిజమైతే తమిళ చిత్ర సీమలో హవా చాటడం ఖాయమని సినీ పరిశీలకులు అంటున్నారు.    
ఈ ఏడాది సంక్రాంతికి 'మన శంకర వరప్రసాద్‌ గారు'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi). అదే ఉత్సాహంతో ఈ ఏడాది మరో సినిమాతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అదే 'విశ్వంభర'. (Vishwambhara) నిజానికి 'విశ్వంభర' మూవీ 'మన శంకర వరప్రసాద్‌ గారు' కంటే ముందే రావాల్సి ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైంది. ఇప్పుడు ఎట్టకేలకు రిలీజ్ కి రెడీ అవుతోంది. 'విశ్వంభర' టీజర్ విడుదలైనప్పుడు వీఎఫ్ఎక్స్ పై నెగటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది. దీంతో వీఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం తీసుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అవుట్ పుట్ అదిరిపోయేలా వస్తోందని, మూవీ టీమ్ సంతృప్తిగా ఉందని తెలుస్తోంది. 'విశ్వంభర' రిలీజ్ డేట్ ని కూడా లాక్ చేసినట్లు సమాచారం. జూలై 10న సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అనౌన్స్ మెంట్ కి కూడా ముహూర్తం ఖరారైనట్లు వినికిడి. ఉగాది కానుకగా మార్చి 19న 'విశ్వంభర' కొత్త విడుదల తేదీని ప్రకటించే ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఒక స్పెషల్ గ్లింప్స్ తో రిలీజ్ డేట్ ని రివీల్ చేయబోతున్నారట. ఈ గ్లింప్స్ తరువాత ఒక్కసారిగా 'విశ్వంభర'పై అంచనాలు పెరిగిపోవడం ఖాయమని అంటున్నారు. కాగా, 'విశ్వంభర' చిత్రానికి 'బింబిసార' ఫేమ్ మల్లిడి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సోషియో ఫాంటసీ ఫిల్మ్ ని యు.వి. క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. Also Read: బాలయ్య, పూరి కాంబోలో మరో మూవీ!
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ఉద్యోగం చేస్తున్నాం అయినా సంపాదన సరిపోవడం లేదు.. ఈ మాట చాలామంది చెబుతూ ఉంటారు.  ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో అవసరాలు,  ఖర్చు,  కలలు ఎక్కువ.. కానీ సంపాదన మాత్రం అరకొరగానే ఉంటుంది. వచ్చే సంపాదన సరిపోక మెరుగైన సంపాద వచ్చే  ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉంటారు. కానీ చాలామంది చేసే మిస్టేక్.. సైడ్ ఇన్కమ్ కోసం ప్రయత్నించకపోవడం. ఉద్యోగం చేస్తూనే ఎక్స్టాగా ఇన్కమ్ సంపాదించడం వల్ల ఆర్థికంగా ఎంతో వృద్ధి చెందవచ్చు.  దీనికోసం మంచి మార్గాలు,  ఎక్ట్సా ఇన్కమ్ సంపాదించాలనుకునే వారు చేయకూడని తప్పులు తెలుసుకుంటే.. ఫ్రీలాన్సింగ్..  రైటింగ్, డిజైనింగ్, వీడియో ఎడిటింగ్, డిజిటల్ మార్కెటింగ్ లేదా కోడింగ్ వంటి స్కిల్స్  ఉంటే  ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు చేయవచ్చు. ఇది  మంచి ఆదాయాన్ని ఇస్తుంది. ఫ్రీలాన్సర్,  ఫైవర్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో క్లయింట్ లు ఉంటారు. వారానికి 10–12 గంటలు కేటాయించడం ద్వారా, ₹10,000 నుండి ₹25,000 వరకు సంపాదించవచ్చు. బ్లాగింగ్, కంటెంట్ క్రియేషన్.. రాయడం పట్ల మంచి అభిరుచి ఉంటే  బ్లాగింగ్, యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో కంటెంట్‌ను క్రియేట్ చేయవచ్చు. సబ్స్క్రైబర్స్,  వ్యూస్ బాగా వచ్చిన తరువాత  యాడ్స్ , స్పాన్సర్‌షిప్‌లు కూడా వస్తాయి. వీటి ద్వారా అదనపు ఆదాయం కూడా ఉంటుంది. అయితే దీనికి మంచి కంటెంట్, క్లిక్ అయ్యేవరకు సమయం అవసరం అవుతాయి. ఆదాయం వెంటనే ఉండదు. కాస్త ఓపిక అవసరం. ఆన్లైన్ ట్యూటరింగ్.. కోర్సెస్.. ఏదైనా ఒక  సబ్జెక్టులో బాగా గ్రిప్ ఉంటే అలాంటి వారు  ఆన్‌లైన్ క్లాసెస్ చెప్పవచ్చు.  లేదా డిజిటల్ కోర్సులను క్రియేట్ చేసి  కూడా టీచింగ్ చేయవచ్చు. YouTube, Unacademy వంటి ప్లాట్‌ఫామ్‌లలో చేరవచ్చు.  లేదా Google Meetలో స్వయంగా  క్లాసెస్ చెప్పవచ్చు. ఇది   విద్యార్థులకు,  టీచింగ్ చేసేవారికి కూడా  చాలా బాగుంటుంది. ఈ-బుక్స్.. రాయడం పట్ల మంచి అబిరుచి ఉంటే ఈ-బుక్స్  రాసి కిండిల్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో అమ్మడం ద్వారా మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇంటి నుండి వ్యాపారాన్ని ప్రారంభించడానికి రీసెల్లింగ్ లేదా ఈ-కామర్స్ కూడా ఒక గొప్ప మార్గం. ఈ కామర్స్-రీసెల్లింగ్.. అమెజాన్,  ఫ్లిప్‌కార్ట్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ఉత్పత్తులను అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు.  ఇంటి నుండి చిన్నగా ప్రారంభించవచ్చు. దుస్తులు, హస్తకళలు లేదా గృహోపకరణాలను అమ్మవచ్చు. ఇది క్రమంగా లాభదాయకమైన వ్యాపారంగా మారవచ్చు. ఇన్వెస్ట్మెంట్ ఇన్కమ్.. సైడ్ ఇన్‌కమ్ అంటే కేవలం పని చేయడం ద్వారా సంపాదించేది మాత్రమే కాదు, డబ్బు సంపాదించడం గురించి. మ్యూచువల్ ఫండ్ SIPలు, స్టాక్ మార్కెట్, బాండ్లు లేదా డిజిటల్ గోల్డ్‌లో  వంటి వాటిలో క్రమం తప్పకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల క్రమంగా అదనపు నిధులు వస్తాయి. సరైన సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల దీర్ఘకాలికంగా మంచి ఆదాయం సృష్టించవచ్చు. ఈ తప్పులు చేయకండి.. సైడ్ ఇన్‌కమ్‌ను మొదలుపెట్టే ముందు  త్వరగా డబ్బు సంపాదించాలనే లక్ష్యంతో  తరచుగా తప్పులు చేస్తాము. ఆ తప్పులేంటంటే.. తొందరపాటు చాలామందికి ఉంటుంది.  సైడ్ ఇన్కమ్ కావాలనే తొందరలో తప్పటడుగు వేయకూడదు. సైడ్ ఇన్కమ్ మీద ఆశతో ఎలాంటి పరిశోధనలు చేయకుండా లేదా డబ్బులు పెట్టుబడి పెట్టడం లేదా డబ్బు సరిగా చెల్లించని చోట వర్క్ చేయడానికి ఒప్పుకోవడం వంటివి చేయకూడదు. సైడ్ ఇన్కమ్ మోజులో పడిచాలామంది  ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎక్కువ లాభం వస్తుందని ఇచ్చే ప్రకటనలు చూసి మోసపోయి డబ్బులు పెట్టకూడదు. కేవలం అదనంగా చేసే పని ద్వారా సైడ్ ఇన్కమ్ ఉండేలా చూసుకోవాలి. అంతేకానీ డబ్బు కోసం ఎక్కువ ఒత్తిడి తీసుకుని పని చేయకూడదు. సైడ్ ఇన్కమ్ అయిన, ఉద్యోగం ద్వారా వచ్చే ఆదాయం అయినా కుటుంబం కోసమే.. కానీ పని కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. గొప్పలు చెప్పుకోవడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించడం మంచిది కాదు. భవిష్యత్ కోసం పొదువు చేయడానికి  సైడ్ ఇన్కమ్ సంపాదించాలి.                               *రూపశ్రీ.
కొత్త వస్తువులు కొంటేనే చాలామంది చాలా సంతోషంగా ఉంటారు.  ఇక మహిళలు అయితే వంటింటి వస్తువుల నుండి వారు కొనుగోలు చేసే వస్తువు పట్ల చాలా ఇష్టంతో ఉంటారు.  కానీ కొత్త వస్తువుల లుక్ పాడు చేసే వాటిలో వాటి మీద ఉండే స్టిక్కర్లు ప్రధానంగా ఉంటాయి.  స్టిక్కర్లను అలాగే ఉంచడం ఇష్టం ఉండదు, పోనీ వాటిని తీసేద్దాం అనుకుంటే స్టిక్కర్ల తాలూకు గమ్ వాటి మీద కనిపిస్తూ వస్తువుల లుక్ పాడు చేస్తుంది.  పైగా ఈ గమ్ మీద దుమ్ము దూళి చాలా తొందరగా పేరుకుపోతుంది.  అయితే కొత్త వస్తువుల మీద స్టిక్కర్లు సులువుగానే తొలగించవచ్చని చాలా మందికి తెలియదు. కేవలం కొన్ని టిప్స్ ఫాలో కావడం వల్ల స్టిక్కర్లను వాటి మూలాలు కనిపించకుండా తొలగించవచ్చు.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. హెయిర్ డ్రైయర్ వేడి.. స్టిక్కర్‌ను వేడి చేయడం వల్ల దాని జిగట మృదువుగా మారుతుంది, దీని వలన స్టిక్కర్ తీయడం సులభం అవుతుంది.  మీడియం వేడి మీద హెయిర్ డ్రైయర్‌ను ఆన్ చేయాలి. స్టిక్కర్ కు 2-3 అంగుళాల దూరంలో 30-40 సెకన్ల పాటు హెయిర్ డ్రైయర్ ను పట్టుకోండి. తర్వాత ఒక మూల నుండి స్టిక్కర్‌ను పట్టుకుని మెల్లిగా లాగితే   స్టిక్కర్ సులువుగా వచ్చేస్తుంది.  ఒకవేళ స్టిక్కర్ సరిగా రాకపోతే మరికొంతసేపు డ్రైయర్ తో స్టిక్కర్ ఉన్న ప్రాంతాన్ని వేడి చేయాలి. బేకింగ్ సోడా, నూనె పేస్ట్.. ఈ ఇంట్లో తయారుచేసిన బేకింగ్ సోడా,  నూనె పేస్ట్ స్టిక్కర్ల జిగటను తొలగిస్తుంది. బేకింగ్ సోడా,  వంట నూనె లేదా కొబ్బరి నూనె సమాన భాగాలుగా కలిపి పేస్ట్ లా చేయాలి. దానిని స్టిక్కర్ లేదా జిగురు మరక ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నిమిషాలు అలాగే ఉంచి, ఆపై ఒక గుడ్డతో రుద్దాలి.  ఎలాంటి ఆనవాళ్లు లేకుండా స్టిక్కర్ కానీ దాని తాలూకు జిగురు కానీ తొలగిపోతుంది. వెనిగర్ వాటర్.. వెనిగర్ స్టిక్కర్ మీద ఉన్న జిగురును వదిలిస్తుంది. ఒక కాటన్ బాల్ లేదా క్లాత్ ను వెనిగర్ లో ముంచి స్టిక్కర్ మీద ఉంచాలి. 10-15 నిమిషాల తర్వాత స్టిక్కర్ సులభంగా ఊడిపోతుంది. తర్వాత  మృదువైన గుడ్డతో ఆ ప్రాంతాన్ని తుడవాలి. నెయిల్ పాలిష్ రిమూవర్.. గట్టి స్టిక్కర్లకు నెయిల్ పాలిష్ రిమూవర్  ఒక గొప్ప ఛాయిస్. దీన్ని ఉపయోగించడానికి నెయిల్ పాలిష్  రిమూవర్‌ను ఒక కాటన్ బాల్‌పై అద్ది, స్టిక్కర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. 5-7 నిమిషాల తర్వాత  సున్నితంగా గీకాలి. జిగురు గుర్తులు పూర్తిగా మాయమవుతాయి. వేడినీరు..  వాటర్ ప్రూఫ్ ఉన్న ప్రాంతాలలో స్టిక్కర్లు ఉంటే వేడి నీరు చాలా బాగా సహాయపడుతుంది. దీని కోసం  గోరువెచ్చని నీటితో కొద్దిగా డిష్ సోప్ కలపాలి. ద్రావణంలో స్పాంజ్ ముంచి స్టిక్కర్ మీద సున్నితంగా రుద్దాలి. స్టిక్కర్ లేదా జిగురు   పదార్థం సులభంగా తొలగిపోతాయి.                                    *రూపశ్రీ.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభానికి గుర్తుగా బుధవారం దేశంలో రంజాన్ చంద్రుడు కనిపించాడు. అంతకుముందు సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 17న చంద్రుడు కనిపించాడు.  ఫిబ్రవరి 18న అక్కడ రంజాన్ ఉపవాసం ప్రారంభానికి గుర్తుగా చంద్రుడు కనిపించాడు. భారతదేశంలో ఉపవాసం సాధారణంగా మరుసటి రోజు ప్రారంభమవుతుంది. రంజాన్ ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల.  దీనిని అత్యంత పవిత్రమైన మాసంగా  పరిగణిస్తారు. ఈ నెల చాలా ప్రత్యేకమైనది.  ఈ సమయంలోనే పవిత్ర ఖురాన్ అవతరణ ప్రారంభమైందని చెబుతారు. రంజాన్ ఉపవాసం,  దాహం గురించి మాత్రమే కాదు, రంజాన్ మాసంలో చెయవలసిన పనులు,  చేయకూడని పనులు కూడా ఉంటాయి.  అవేంటో తెలుసుకుంటే.. రంజాన్ ప్రాముఖ్యత.. రంజాన్ మాసం దయ, ఆశీర్వాదం,  క్షమాపణల మాసంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో ముస్లింలు ఉపవాసం ఉండి, తమ పాపాలకు క్షమాపణ కోసం అల్లాహ్‌ను ప్రార్థిస్తారు. ఉపవాసం సహనం, క్రమశిక్షణ,  స్వీయ నియంత్రణను నేర్పుతుంది. రోజంతా ఆకలితో,  దాహంతో ఉండటం వల్ల పేదవారి కష్టాలను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనుషులలో స్పందించే గుణం పెరుగుతుంది. రంజాన్ నెలలో జకాత్,  సదఖా (దానధర్మాలు) ఇవ్వడం  చాలా ముఖ్యమైనదిగా చెబుతారు. పేదలకు  ఆదాయంలో కొంత భాగాన్ని ఇవ్వడం సమాజంలో సమానత్వాన్ని,  సోదరభావాన్ని పెంపొందిస్తుంది.  రంజాన్ చివరి పది రాత్రులు ప్రత్యేకంగా పరిగణించబడతాయి. షబ్-ఎ-ఖదర్ రాత్రి వెయ్యి నెలల కంటే మెరుగైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్ మాసంలో ఏం చెయ్యాలి.. ఐదుసార్లు ప్రార్థన చేయడం చాలా ముఖ్యం అని చెబుతారు.  అది కూడా  సరైన సమయానికి చేయాలి. ప్రతిరోజూ ఖురాన్‌లో కొంత భాగం చదవడం లేదా వినడం చేయాలి. ఈ నెల ఖురాన్‌తో అనుసంధానం కావడానికి ఉత్తమ సమయం. ఖర్జూరం,  నీటితో ఉపవాసం విరమించడం సున్నత్‌గా పరిగణించబడుతుంది. జకాత్,  సదఖా ఇవ్వడం ద్వారా పేదవారికి సహాయం చేయాలి.  ప్రవర్తనను నియంత్రించుకోవాలి. కోపం, వాదనలు,  కఠినమైన మాటలు నివారించాలి. ఇఫ్తార్ సమయంలో  ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి,  సమతుల్య భోజనం తినాలి. రంజాన్ లో చేయకూడనివి.. అబద్ధాలు చెప్పడం, గాసిప్ చెప్పడం,  ఇతరులను   బాధపెట్టడం మానుకోవాలి. చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకోకూడదు. ఇఫ్తార్ సమయంలో ఆహారం వృధా చేయకూడదు.  లేదా వృధా ఖర్చులు చేయకూడదు. ప్రార్థనలో అజాగ్రత్తగా ఉండకూడదు. పనికిరాని కార్యకలాపాలలో లేదా చెడు అలవాట్లలో సమయాన్ని వృధా చేయకూడదు.                                                     *రూపశ్రీ
  నేటి వేగవంతమైన ప్రపంచంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం ఒక విలాసం కాదు, అది ఒక అవసరం. మీ ఫిట్‌నెస్ ప్రయాణాన్ని సరైన దిశలో నడిపించడానికి ఈ క్రింది సమగ్ర సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్యమే మహాభాగ్యం: మీ ఫిట్‌నెస్ ప్రయాణం ఇక్కడే మొదలు! మన పూర్వీకులు జిమ్ అంటే ఏంటో తెలియకపోయినా ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ఎందుకంటే వారి జీవనశైలిలో శారీరక శ్రమ ఒక భాగంగా ఉండేది. కానీ నేటి కాలంలో మనం చిన్న పనికి కూడా స్విగ్గీ లేదా జెప్టో వంటి యాప్స్ పై ఆధారపడుతూ, కనీసం నడవడానికి కూడా బద్ధకిస్తున్నాము. మన శరీరం కదలడానికి పుట్టింది, కూర్చోవడానికి కాదు. కదలిక లేని జీవితం వ్యాధులకు నిలయంగా మారుతోంది. మనం ఎందుకు వర్కవుట్ చేయాలి? • మనుగడ కోసం: నడక అనేది ఒక వ్యాయామం కాదు, అది మన మనుగడకు ప్రాథమిక అవసరం. మనం ఆరోగ్యంగా బతకాలంటే శారీరక కదలిక తప్పనిసరి. • ఒత్తిడిని జయించడానికి: నిత్యం ఉండే మానసిక ఒత్తిడి, ఆందోళనల నుండి ఉపశమనం పొందడానికి రెసిస్టెన్స్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు ఎంతో మేలు చేస్తాయి. • శరీర పునరుజ్జీవనం కోసం: సరైన వర్కవుట్ మరియు తగినంత నిద్ర మీ బాడీని రిజూవినేట్ (Rejuvenate) చేసి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి. ఏం చేయకూడదు?  • లిఫ్ట్‌లు మరియు యాప్స్ పై అతిగా ఆధారపడటం: చిన్న దూరాలకు కూడా వాహనాలు వాడటం లేదా లిఫ్ట్‌లు వాడటం మానేయండి. మెట్లు ఎక్కడం వంటి చిన్న చిన్న పనులను వ్యాయామంగా కాకుండా దైనందిన కృత్యంగా మార్చుకోండి. • రాత్రిపూట ఆలస్యంగా వర్కవుట్ చేయడం: వీలైనంత వరకు రాత్రి 7 గంటల తర్వాత భారీ వర్కవుట్స్ చేయకండి. దీనివల్ల బాడీలో కార్టిసోల్ లెవెల్స్ పెరిగి, మీ నిద్రకు భంగం కలిగే అవకాశం ఉంది. • నిద్రకు ముందు స్క్రీన్ చూడటం: నిద్రలేమి (Insomnia) సమస్యలను నివారించడానికి పడుకునే ముందు ఫోన్ లేదా టీవీ చూడటం మానేయాలి. • వర్కవుట్ సమయంలో నీళ్లు తాగకపోవడం: వర్కవుట్ చేసేటప్పుడు లిక్విడ్స్ తీసుకోకూడదనేది తప్పుడు ప్రచారం. నీరు తాగకపోతే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయి నీరసం (Dizziness) వచ్చే ప్రమాదం ఉంది. సరైన పద్ధతిలో వర్కవుట్ ఎలా చేయాలి? • సరైన సమయం: జిమ్ చేయడానికి ఉదయం 5 నుండి 9 గంటల లోపు అత్యంత అనుకూలమైన సమయం. • వ్యాయామ కాలపరిమితి: రోజుకు కనీసం ఒక గంట వెయిట్ ట్రైనింగ్ మరియు ఆ తర్వాత 20 నుండి 30 నిమిషాల కార్డియో చేయడం ఉత్తమం. మొత్తం మీద 1.5 గంటల రొటీన్ సరిపోతుంది. • సహజ ఎలక్ట్రోలైట్స్: వర్కవుట్ మధ్యలో ఉప్పు నీరు, నిమ్మరసం లేదా పుదీనా కలిపిన నీటిని సిప్ చేస్తూ ఉండటం వల్ల కోల్పోయిన లవణాలు తిరిగి లభిస్తాయి. • ఆహారం మరియు విశ్రాంతి: ఒకవేళ సాయంత్రం వర్కవుట్ చేసినా, ఆ తర్వాత ప్రోటీన్ మరియు ఫ్యాట్ అధికంగా ఉండే ఆహారం తీసుకుని, వేడి నీటి స్నానం చేసి పడుకోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ప్రశ్నలు - సమాధానాలు  1. నడకను ఫిట్‌నెస్‌లో భాగంగా చూడవచ్చా:  లేదు, నడక అనేది మన శరీరం ప్రాథమికంగా చేసే పని. ఫిట్‌నెస్ కోసం అదనపు వ్యాయామాలు అవసరం. 2. జిమ్ చేయడానికి రోజులో ఏ సమయం ఉత్తమం: ఉదయం వేళల్లో చేయడం వల్ల హార్మోన్ల సమతుల్యత బాగుంటుంది. అయితే సమయం లేని వారు తగిన జాగ్రత్తలతో సాయంత్రం కూడా చేయవచ్చు. 3. బాడీ రికవరీ అవ్వాలంటే ఏం చేయాలి: తగినంత నిద్ర చాలా ముఖ్యం. నిద్రలోనే శరీరం తనను తాను మరమ్మతు చేసుకుంటుంది. నిద్ర తగ్గితే 'బ్రెయిన్ ఫాగ్' మరియు నీరసం వచ్చే అవకాశం ఉంది. ముగింపు: మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కేవలం ఆహార నియమాలు పాటిస్తే సరిపోదు, తగినంత కదలిక మరియు వ్యాయామం కూడా ఉండాలి. సీడ్ ఆయిల్స్ మరియు కల్తీ పాల పదార్థాలకు దూరంగా ఉంటూ, ఒత్తిడిని నియంత్రించుకోవడం అలవాటు చేసుకోండి. మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం మా YouTube Channel (Video link: https://youtu.be/u4uDJUP7Fw0?si=j6YfUFILXu2eJwcc ) ని సందర్శించండి. అక్కడ మీకు ఉపయోగపడే మరిన్ని వీడియోలు మరియు వర్కవుట్ చిట్కాలు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా జీవించండి!
చాలామందికి బాదం పప్పు గురించి తెలిసి ఉంటుంది. కానీ బాదం బంక అనే పేరు బహుశా చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది.  కానీ బాదం బంక ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు.  బాదం బంకను నీటిలో నానబెట్టుకుని తింటుంటారు.  ముఖ్యంగా వేసవి కాలంలో బాదం బంక వాడకం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది చిన్న బంక గడ్డల్లా ఉంటుంది. నీటిలో వేసి సుమారు 2 గంటల సేపు నానబెడితే బాదం బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది. దీన్ని నేరుగా తింటారు,  నీటిలో కలిపి తాగుతారు,  ఇందులో సబ్జా, పంచదార వంటివి కూడా కలుపుకుని తాగుతారు.  వేసవిలో పానీయాలలో బాదం బంకను యాడ్ చేసుకుంటారు. ఇది శరీరానికి చలువ చేస్తుందని చెబుతారు. అయితే.. బాదం బంక తినడం వల్ల మొటిమలు తగ్గుతాయని కొందరు అంటుంటారు.  దీని వెనుక గల నిజం ఏమిటో తెలుసుకుంటే.. మొటిమలకు కారణం.. చర్మం మీద మొటిమలు, కురుపులు వంటివి వేడి వల్ల వస్తాయి. దీని వల్ల చర్మం చాలా దెబ్బతింటుంది. ఈ వేడిని తగ్గించడం ద్వారా మొటిమలు, కురుపులు తగ్గించడంలో బాదం బంక చక్కగా.. ఔషధంలా పనిచేస్తుంది. బాదం బంక.. చర్మ ప్రయజనాలు.. బాదం బంకను తీసుకోవడం వల్ల చాలా రకాల చర్మ సమస్యలు తగ్గిపోతాయి.   బాదం బంకను రాత్రంతా నీటిలో నానబెట్టాలి.  ఉదయానికి ఈ బంక కాస్తా జెల్లీ లాగా మారుతుంది.  దీనికి కొంచెం చల్లని నీరు కలపాలి.  ఇందులో కొంచెం నిమ్మరసం కలపాలి.  దీన్ని డీహైడ్రేట్ పానీయంలా తీసుకోవాలి.  కనీసం 3 నుండి 4 రోజులు రెగ్యులర్ గా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. బాదం బంక ఎందుకు మంచిది? బాదం బంక తినడం వల్ల సహజంగానే శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇది చర్మాన్ని తేమ చేస్తుంది.  బాదం బంకలో ఉండే  యాంటీ-ఏజింగ్ లక్షణాల కారణంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఇది శరీరం లోపలి నుండి విషాన్ని తొలగిస్తుంది.  మొటిమలు, ముడతలు,  వడదెబ్బ వంటి సమస్యలను తగ్గిస్తుంది. బాదం బంక తినడం వల్ల  చర్మానికి మెరుపు, యవ్వనం   లభిస్తుంది. ఇది చర్మ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా శరీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.                                    *రూపశ్రీ.
నేటికాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడటం చాలా సాధారణం అయిపోయింది.   ఏ వయసు వారికైనా ఈ సమస్య కనిపిస్తూ ఉంటుంది. ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వల్ల పిల్లలు,  యువకులలో కిడ్నీలో రాళ్ల సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. నేషనల్ కిడ్నీ ఫౌండేషన్ ప్రకారం దాదాపు 10 మందిలో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కిడ్నీలో రాళ్ల సమస్యను ఎదుర్కుంటూ ఉన్నారట. ఈ సమస్యలు సాధారణంగా తేలికపాటి చికిత్స లేదా శస్త్రచికిత్స ద్వారా సులభంగా  పరిష్కారం అవుతాయి.  కానీ కొంతమందిలో రాళ్ల సమస్యలు తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారితీయవచ్చు. అసలు కిడ్నీలో రాళ్ల సమస్య ఎలా ఏర్పడుతుంది? బీర్ తాగితే కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుందనే మాట నిజమా? దీని గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి కారణాలు.. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడటానికి అతిపెద్ద కారణం తగినంత నీరు తీసుకోకపోవడం. తగినంత నీరు త్రాగనప్పుడు మూత్రం ఘాడతగా మారుతుంది.  దానిలోని ఖనిజాలు స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవే   కిడ్నీలో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి.    ఉప్పు అధికంగా తీసుకోవడం, ప్రోటీన్ అధికంగా తీసుకోవడం, ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలైన పాలకూర, చాక్లెట్  వంటివి తినడం,  అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా కిడ్నీలో రాళ్ల  ప్రమాదం పెరుగుతుంది. ఊబకాయం, మధుమేహం,  జీవక్రియ సమస్యలు కూడా రాళ్ళు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. మూత్రపిండాలలో రాళ్లు ఎలా నయమవుతాయి? వైద్యులు చెబుతున్న దాని ప్రకారం..  కిడ్నీలో రాళ్ళు సాధారణంగా  ఎక్కువ నీరు త్రాగడం ద్వారా వాటంతట అవే బయటకు వస్తాయి.  నొప్పిని తగ్గించడానికి,  రాళ్ల పరిమాణాన్ని తగ్గించడానికి వైద్యులు  మందులను సూచించవచ్చు. అయితే రాళ్ల పరిమాణం పెద్దగా ఉన్నప్పుడు  శస్త్రచికిత్స అవసరం ఏర్పడవచ్చు. కిడ్నీలో రాళ్లను ముందుగానే తొలగించడం చాలా ముఖ్యం ఎందుకంటే అవి కాలక్రమేణా కిడ్నీ లోపలి పొరను దెబ్బతీస్తాయి. బీరు తాగితే కిడ్నీలో రాళ్లు తగ్గుతాయా? బీరు తాగడం వల్ల మూత్ర ఉత్పత్తి పెరుగుతుందని, తరచుగా మూత్ర విసర్జన జరుగుతుందని,  రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడుతుందని  చాలామంది నమ్ముతారు. కానీ వైద్యులు  ఈ నమ్మకాన్ని తోసిపుచ్చుతున్నారు. బీరు తాగడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు బయటకు వెళ్లడానికి సహాయపడతాయనే నమ్మకం ప్రజలలో ఉన్నా.. బీరు తాగితే చాలు కిడ్నీలో రాళ్లు తొలగిపోతాయి అనుకోవడం చాలా తప్పని, అది వైద్యులు రికమెండ్ చేయరని చెబుతున్నారు. బీరు తాత్కాలికంగా మూత్ర ఉత్పత్తిని పెంచుతుంది, కానీ అది శరీరం డీహైడ్రేట్ అవ్వడానికి కారణం అవుతుంది.  ఇది రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది. బీరులో ప్యూరిన్లు కూడా ఉంటాయి, ఇవి యూరిక్ ఆమ్లాన్ని పెంచుతాయి, మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి, అప్పటికే కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు బీర్ తాగితే.. ఈ రాళ్ల ప్రమాదం మరింత పెరుగుతుంది. కాబట్టి కిడ్నీలో రాళ్ల సమస్యకు ఔషదంగా బీర్ ను తీసుకోవడం అస్సలు మంచిది కాదు.                            *రూపశ్రీ.