LATEST NEWS
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థి  రోహిత్ వేముల దళితుడు కాదని, అతనికి సంబంధించిన కేసును మూసివేస్తున్నామని తెలంగాణ పోలీసులు హైకోర్టుకు తెలిపారు. రోహిత్ వేముల దళితుడు అని చెప్పడానికి ఆధారాలు లేవని పోలీసులు పేర్కొన్నారు. దళితుడు కాకపోయినప్పటికీ రోహిత్ వేముల తన కుల ధ్రువీకరణ పత్రాలను ఫోర్జరీ చేశాడని, తాను దళితుడు కాదని బయటపడే పరిస్థితులు రావడంతో భయపడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టులో పోలీసులు కేసు మూసివేత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఏవైనా అభ్యంతరాలు వున్నట్టయితే రోహిత్ వేముల కుటుంబ సభ్యులు కింది కోర్టులో సవాల్ చేసుకోవచ్చని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది. ఈ పరిణామంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిందితులుగా ఉన్న అప్పటి సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ, అప్పటి ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ వైస్‌ ఛాన్సలర్‌ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, పలువురు ఏబీవీపీ నేతలకు ఈ కేసు నుంచి విముక్తి లభించింది. అయితే తెలంగాణ పోలీసులు కోర్టుకు సంబంధించిన వివరాలు అవాస్తవాలని రోహిత్ వేముల కుటుంబ సభ్యులు అంటున్నారు.
మరో పది రోజుల్లో  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సంపన్న అభ్యర్థి ఎవరు అన్నది చర్చనీయాంశమైంది.  తెలంగాణలో లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. రెండు రాష్ట్రాల్లో వేల కోట్లకు అధిపతులతో పాటు సామాన్యులు కూడా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత శ్రీమంతులు ఎవరనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం.  తెలంగాణ విషయానికి వస్తే... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత సంపన్న వ్యక్తి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన తాతగారి పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. కెవి రంగా రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు.  విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ. 4,568 కోట్లు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ లో చూపించారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతరెడ్డిని ఆయన పెళ్లాడారు.  ఏపీ విషయానికి వస్తే... గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనిక అభ్యర్థి. 2014లోనే ఆయన టీడీపీ తరపున నర్సరావుపేట లోక్ సభ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండటంతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవడంతో చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది. చంద్రశేఖర్ కుటుంబ ఆస్తులు రూ. 5,705 కోట్లు. మన దేశంలో పోటీ చేస్తున్న అత్యంత ధనిక వ్యక్తుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.  ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన చంద్రశేఖర్ కష్టపడి డాక్టర్ పట్టా తీసుకున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. యూఎస్ లో 'యూ వరల్డ్ ఆన్ లైన్ ట్రైనింగ్' పేరుతో నర్సింగ్, న్యాయ, వాణిజ్య, అకౌంటింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థను ప్రారంభించారు. బిజినెస్ మెన్ గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ వేల కోట్లు సంపాదించారు.
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ ఒక వెరైటీ నిర్ణయం తీసుకున్నారు. కోటిన్నర విలువ చేసే తన వ్యక్తిగత ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి తీన్మార్ మల్లన్న శుక్రవారం నాడు నల్గొండలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా నల్గొండలో తీన్మార్ మల్లన్న భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ అనంతరం తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించనున్నట్టు తీన్మార్ మల్లన్న ప్రకటించారు. చీఫ్ సెక్రటరీ ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలసి వెళ్ళి ఆస్తుల పేపర్లను అప్పగిస్తానని తీన్మార్  మల్లన్న చెప్పారు. క్లీన్ రాజకీయాలు చేయాలన్న ఉద్దేశంతోనే ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తున్నట్టు ప్రకటించారు. తీన్మార్ మల్లన్న చేసినట్టుగా ఎలక్షన్లలో పోటీ చేసేవాళ్ళందరూ వాళ్ళ ఆస్తులను ప్రభుత్వానికి అప్పగిస్తే భలే వుంటుంది కదూ!
ఫ్యాక్షనిస్టు మద్దెలచెరువు సూరి ఇంట్లో పేలిన టీవీ బాంబు గురించి తెలుగువారికి తెలుసు. అప్పట్లో మద్దెలచెరువు సూరి ఇంటికి ఒక టీవీ పార్సిల్ వచ్చింది. దాన్ని కేబుల్ ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేయగానే టీవీలో వున్న బాంబు పేలి మద్దెలచెరువు సూరి కుటుంబ సభ్యులు చనిపోయారు. సరిగ్గా ఇలాంటి సంఘటనే గుజరాత్‌లో జరిగింది. ఈసారి పేలింది టీవీ కాదు.. టేప్ రికార్డర్.  గుజరాత్‌లోని వడాలిలో నివసించే జీతూభాయ్ వంజారా అనే వ్యక్తి ఇంటికి గురువారం నాటు ఒక టేప్ రికార్డర్ పార్సిల్ వచ్చింది. దాన్ని తీసుకున్న జీతూభాయ్, ఆయన కుమార్తె పన్నెండేళ్ళ భూమిక దాన్ని ఆన్ చేసే ప్రయత్నం చేశారు. అంతే టేప్ రికార్డులో వున్న బాంబు పేలి జీతూభాయ్ అక్కడికక్కడే మరణించాడు. భూమిక ఆస్పత్రిలో మరణించింది. అక్కడే వున్న జీతూభాయ్ మరో ఇద్దరు కుమార్తెలకు గాయాలవటంతో వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. టేప్ రికార్డర్ బాంబే పేలిన సమయంలో జీతూభాయ్ భార్య ఇంట్లో లేకపోవడంతో పోలీసులకు అనుమానాలు కలిగాయి. జీతూభాయ్ ఇంటికి పార్సిల్ డెలివరీ చేసిన రిక్షాపుల్లర్ని పట్టుకుని విచారణ జరిపితే, ఆ బాంబును పంపించింది బాలుసింగ్ పంజారా అనే వ్యక్తి అని తెలిసింది. పోలీసులు బాలూసింగ్‌ని అరెస్టు చేశారు. ఈ పేలుళ్ళ వెనుక జీతూభాయ్ భార్య ప్రమేయం ఏమైనా వుందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో వున్న బాలుసింగ్ ఈ దారుణానికి ఎందుకు ఒడిగట్టాడంటే, జీతూభాయ్ పెళ్ళి చేసుకున్న మహిళ బాలూసింగ్‌కి మాజీ ప్రియురాలు. తన ప్రియురాలిని పెళ్ళి చేసుకున్నాడన్న కోపాన్ని జీతూభాయ్ మీద పెంచుకున్న బాలూసింగ్, జీతూభాయ్‌ని చంపాలన్న ఉద్దేశంతో తానే స్వయంగా టేప్ రికార్డర్ బాంబు తయారు చేసి పంపించాడు. 
రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు.. అవమానాలు, అభినందనలు సర్వసాధారణమే. నాకు వాళ్లు గౌరవం ఇవ్వలేదు.. నన్ను వాళ్లు విమర్శించారంటూ.. వ్యక్తిగతంగా కక్ష పెంచుకుంటే సదరు నేతకు రాజకీయ భవిష్యత్తుతో పాటు.. మానసిక ప్రశాంతత కూడా దూరమవుతుంది. అదే పరిస్థితి ప్రస్తుతం మాజీ మంత్రి,  కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ఎదురవుతోంది. చంద్రబాబుపై కోపమో.. పవన్ కల్యాణ్ నన్ను మించి ఎదిగిపోతాడనే భయమో కానీ, ముద్రగడ పద్మనాభం గజిబిజి అయిపోతున్నారు. పవన్ కల్యాణ్ ను పిఠాపురం నియోజకవర్గంలో ఓడించడమే నా జీవిత లక్ష్యం అన్నట్లుగా ఊగిపోతున్నాడు. పవన్ ను ఓడించేందుకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ పిఠాపురం అభ్యర్థి వంగా గీత కూడా ముద్రగడ పద్మనాభంలా వ్యక్తిగతంగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. ముద్రగడకు పవన్, చంద్రబాబుపై కోపాన్ని వైసీపీ అధినేత చక్కగా వాడేసుకుంటున్నారు. అమ్మోరు వద్ద బలికి ఇచ్చే మేకపోతులా ముద్రగడను వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల్లో వైసీపీ గెలిచినా ముద్రగడకు పెద్దగా ఉపయోగం ఉండకపోగా, వైసీపీ ఓడిపోతే చిక్కుల్లో పడేది ముద్రగడనే అనే వాదన ఏపీ రాజకీయాల్లో వినిపిస్తోంది. ఇదే విషయాన్ని ముద్రగడ కుమార్తె క్రాంతికి అర్ధమైంది. తన తండ్రి ముద్రగడ పద్మనాభం తీరును పట్ల ఆమె అసహనం వ్యక్తంచేస్తూ ఏకంగా వీడియోను రిలీజ్ చేశారు. తన తండ్రిని జగన్, ఆయన టీం బాగా వాడుకుంటున్నారని, జగన్ మా నాన్నను వాడుకొని వదిలేయడం ఖాయమని చెప్పేశారు. ఏపీలో కాపులకు పెద్ద మనిషిలా ముద్రగడ పద్మనాభం చలామణి అవుతున్నారు. ముద్రగడ ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఏపీలోని కాపులందరూ అటువైపు ఉంటారనే అర్ధంపర్ధంలేని వాదన కూడా ఉంది. కానీ వాస్తవం  ఏమిటంటే.. ముద్రగడ ఏ పార్టీకి సపోర్టు చేస్తే ఆ పార్టీకి మెజార్టీ కాపులు వ్యతిరేకం అవుతారు. ఈ విషయం పలుసార్లు రుజువైంది. అయినా, తానే కాపు సామాజికవర్గానికి  పెద్దగా ఉండాలని ముద్రగడ తెగ ఆరాటపడిపోతుంటారు. గతంలో చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చిన సమయంలో గందరగోళానికి గురైన ముద్రగడ.. మళ్లీ పవన్ కల్యాణ్ రాజకీయంగా ఎదుగుతుంటేకూడా తెగ కంగారు పడిపోతున్నారు.   పవన్ కల్యాణ్ రాజకీయంగా బలపడితే కాపులందరూ తనను మర్చిపోతారేమోనన్న భయం ముద్రగడలో స్పష్టంగా కనిపిస్తున్నది. దీంతో, పవన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునేందుకు ముద్రగడ ఎంతదూరమైనా  వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే ఇటీవల ఓ ఛాలెంజ్ సైతం చేశాడు. పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించక పోతే తన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చేసుకుంటానని పెద్ద స్టేట్ మెంట్ ఇచ్చేశాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు ఎవరైనా ఇలా మాట్లాడతారా. పవన్ పై ఎంత కోపం ఉంటే ముద్రగడ కులాన్నే మార్చేసుకునే స్థాయికి వెళ్లిపోతారు. ముద్రగడ ప్రస్తుత మానసిక పరిస్థితిని చూసి ఆయన సొంత సామాజికవర్గం వారే జాలిపడుతున్నారు. జగన్ శిబిరంలో బలి పశువుల్లో ఒకరిగా ముద్రగడను చూస్తున్నారు. ముద్రగడ తీరుతో ఆయన కుమార్తె సైతం విసుగెత్తిపోయినట్లున్నారు. ఆమె ఏకంగా వీడియోను రిలీజ్ చేశారు. ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన తండ్రి తీరును తప్పుబట్టారు. కేవలం పవన్ కల్యాణ్ ను తిట్టించేందుకే సీఎం జగన్ తన తండ్రిని వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ గెలిస్తే పద్మనాభం రెడ్డిగా పేరుమార్చుకుంటానని మా నాన్న అనడం బాధాకరమైన విషయం. ఈ కాన్సెప్ట్ ఏంటో నాకు అస్సలు అర్ధం కాలేదు. వంగా గీతను గెలిపించేందుకు కష్టపడొచ్చు.. కానీ, పవన్, ఆయన అభిమానులను కించపరిచేలా  కామెంట్స్ ఉండకూడదు అంటూ ముద్రగడ కుమార్తె తండ్రికి సుద్దులు చెప్పారు. ఈ విషయంలో   నాన్నను పూర్తిగా వ్యతిరేకిస్తున్నా.. పవన్ గెలుపుకోసం నా వంతు కృషి చేస్తానంటూ ముద్రగడకు గట్టి షాక్ ఇచ్చారు ఆయన కుమార్తె కావ్య.  కుమార్తె క్రాంతి చేసిన వ్యాఖ్యలపై పద్మనాభం స్పందించారు. జనసేన నాయకులు తన కుటుంబంలో చిచ్చుపెట్టారని, తన కుటుంబంలో చిచ్చు పెట్టిన వ్యక్తికి ఆ భగవంతుడే శిక్ష విధిస్తాడని శాపనార్ధాలు పెట్టారు. నా కూతురుతో కూడా నాపై తప్పుడు ప్రచారం చేయించారు. నా కుమార్తెకి ఎప్పుడైతే పెళ్లయిందో అప్పటి నుంచి ఆమె తన ప్రాపర్టీ కాదని, తన కుమారుడు మాత్రమే తన ప్రాపర్టీ అంటూ పద్మనాభం మాట్లాడటం చూస్తుంటే.. పవన్ పై కోపాన్ని కక్షగా మార్చడంలో జగన్ శిబిరం ముద్రగడకు ఏ స్థాయిలో శిక్షణ ఇచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొత్తానికి పవన్ కల్యాణ్ పట్ల ముద్రగడ ప్రవర్తిస్తున్న తీరుతో జనసైనికులతో పాటు కాపు సమాజం మొత్తం చీదరించుకుంటున్న పరిస్థితి.  ముద్రగడలాంటి పాత కాపులను వైసీపీ ప్రయోగిస్తోంది.   సీరియస్ నేతగా ఇంతకాలం తన ముద్ర    నిలబెట్టుకున్న ముద్రగడ ఇప్పుడు జగన్ కోసం తనను తాను దిగజార్చుకున్నారు. అసలు ఆయన కాపు ఉద్యమ కారులకు జనసేన నాయకుడు, వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి ఉప్మా పెట్టాడంటూ గతంలో రాసిన లేఖతోనే కాపు సమాజంలో ఆయన ప్రతిష్ఠ పాతాళానికి దిగజారిపోయింది. అప్పట్లో కాపు యువత ఆయన ఇవిగో మేం తిన్న ఉప్మా డబ్బులు అంటూ మనీయార్డర్లు పంపించారు. అప్పడైనా ఆయనకు తన స్థితి, స్థాయి ఎంతగా దిగజారాయో అర్ధమై ఉండాల్సింది. కాలేదు. అయి ఉంటే ఇప్పుడు సొంత కుమార్తె తన తండ్రిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను, ఆయనను నమ్మెద్దంటూ వీడియో రిలీజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా?!  
ALSO ON TELUGUONE N E W S
సినిమా పేరు: బాక్ తారాగణం: సుందర్. సి, తమన్నా, రాశిఖన్నా, కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు సంగీతం: హిప్ హాప్ తమిజా సినిమాటోగ్రఫీ: కృష్ణస్వామి రచన, దర్శకత్వం: సుందర్. సి విడుదల తేదీ: మే 3, 2024 హారర్ కామెడీ ఫ్రాంచైజ్ 'అరణ్మనై' నుంచి వచ్చిన నాలుగో చిత్రం 'బాక్'. సుందర్. సి ప్రధాన పాత్ర పోషిస్తూ దర్శకత్వం వహించిన ఈ తమిళ సినిమాలో తమన్నా, రాశీ ఖన్నా నటించారు. మే 3న ఈ చిత్రం తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం. కథ: శివశంకర్(సుందర్. సి) ఓ లాయర్. తన చెల్లి శివాని(తమన్నా) ప్రేమ వివాహం చేసుకొని, పుట్టింటికి దూరమవుతుంది. అయితే కొంతకాలానికి శివాని ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమె భర్త కూడా అనుమానాస్పదంగా చనిపోతాడు. తన చెల్లి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని గట్టిగా నమ్మిన శివశంకర్.. ఆ ఇద్దరి మరణాల వెనక కారణాలను తెలుసుకోవడానికి రంగంలోకి దిగుతాడు. శివాని నిజంగానే ఆత్మహత్య చేసుకుందా? అసలు బాక్ అంటే ఏంటి? ఆ దుష్ట శక్తి శివాని కుటుంబాన్ని ఎందుకు టార్గెట్ చేసింది? చనిపోయాక కూడా శివాని తన పిల్లలని ఎలా కాపాడుకుంది? తన చెల్లి మరణానికి కారణమైన వారిపై శివశంకర్ ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? ఇందులో రాశిఖన్నా పాత్ర ఏంటి? అనేవి సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: కథగా చూసుకుంటే 'బాక్'లో కొత్తదనం లేదు. ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన దుష్ట ఆత్మను హీరో ఎలా అంతమొందించాడు అనేది ఈ కథ. ఈ తరహా కథతో ఇప్పటికే ఎన్నో సినిమాలు వచ్చాయి. గతంలో 'అరణ్మనై' ఫ్రాంచైజ్ లో వచ్చిన సినిమాలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి. అయితే కథలో కొత్తదనం లేనప్పటికీ.. హారర్ కామెడీ జానర్ సినిమాలతో మ్యాజిక్ చేయొచ్చు. ఓ వైపు నవ్విస్తూ, మరోవైపు భయపెడుతూ కథనాన్ని ఆసక్తికరంగా నడపవచ్చు. కానీ 'బాక్' విషయంలో ఆ మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. అటు నవ్వించడంలోనూ, ఇటు భయపెట్టడంలోనూ పూర్తిగా సక్సెస్ కాలేదు. అక్కడక్కడా మాత్రమే ఆకట్టుకుంది. శివానిది హత్యా ఆత్మహత్యా అనే విషయాన్ని బయటపెట్టే సన్నివేశాలు, బాక్ నేపథ్యం తెలిపే ఎపిసోడ్ మెప్పించాయి. తమన్నా పోషించిన శివాని పాత్రతో సెంటిమెంట్ బాగానే పండింది. ఇంటర్వెల్, క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. సినిమాకి అవే హైలైట్ గా నిలిచాయి. విజువల్ గా కూడా ఈ సినిమా బాగుంది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నంతగా ఉంది. కృష్ణ స్వామి కెమెరా పనితనం కట్టిపడేసింది. హిప్ హాప్ తమిజా సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. నటీనటుల పనితీరు: మరణించాక కూడా ఆత్మగా కనిపిస్తూ, పిల్లలను కాపాడుకునే శివాని పాత్రలో తమన్నా చక్కగా ఒదిగిపోయింది. డాక్టర్ మాయగా రాశిఖన్నా ఉన్నంతలో రాణించింది. శివశంకర్ గా సుందర్. సి నటన మెప్పించింది. కోవై సరళ, శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. కథాకథనాల్లో వైవిధ్యం లేదు. కొన్ని నవ్వులు, అక్కడక్కడా భయపెట్టే సన్నివేశాలు, విజువల్స్ కోసం ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5 
ప్రస్తుతం టాలీవుడ్ లో క్రియేటివ్ డైరెక్టర్ అంటే గుర్తుకొచ్చే పేరు సుకుమార్. లాజిక్స్ తో మ్యాజిక్ చేసే ఈ జీనియస్ డైరెక్టర్.. 'పుష్ప' సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి ఇండియన్ టాప్ స్టార్స్ సైతం ఆసక్తి చూపిస్తారు అనడంలో సందేహం లేదు. అయితే సుకుమార్ మాత్రమే కాదు.. ఆయన శిష్యులు సైతం సినీ పరిశ్రమలో దర్శకులుగా సత్తా చాటుతున్నారు. ఇతర టాప్ డైరెక్టర్ల అసిస్టెంట్స్ తో పోలిస్తే.. సుకుమార్ అసిస్టెంట్స్ టాలీవుడ్ లో తమ మార్క్ చూపిస్తున్నారు. 'కుమారి 21ఎఫ్' ఫేమ్ పల్నాటి సూర్యప్రతాప్, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు, 'దసరా' ఫేమ్ శ్రీకాంత్ ఓదెల, 'విరూపాక్ష' ఫేమ్ కార్తీక్ దండు.. ఇలా ఎందరో సుకుమార్ శిష్యులు దర్శకులుగా తమ మార్క్ చూపించారు. ఇప్పుడు ఈ లిస్టులో అర్జున్ వై.కె అనే మరో దర్శకుడు చేరాడు. ఈయన సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ప్రసన్న వదనం'కి దర్శకత్వం వహించాడు. శుక్రవారం(మే 3) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్ తెచ్చుకుంది. ఈ మూవీతో టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డైరెక్టర్ దొరికాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సుకుమార్ శిష్యులు దర్శకులుగా మారి తమ మార్క్ చూపిస్తున్నారు.
Actor Vishnu Manchu is working ambitiously for his dream project Kannappa. The first look of the movie unveiled on the auspicious day of Mahashivaratri received a thumping response. The presence of several Pan India stars make this one of the most anticipated movies. It is known that, Akshay Kumar who is playing an important role joined the shoot a few days ago. Meanwhile, the actor wrapped up his part of shoot. Vishnu disclosed the news and also shared a pic with the Bollywood Superstar. "Kannappa" is poised to be a cinematic spectacle, delving into the story of a courageous warrior turned devout follower of Lord Shiva, Kannappa, whose unwavering faith continues to inspire across generations. Vishnu Manchu, renowned for his versatility and dedication, embodies this legendary character with fervor and reverence. Produced by Mohan Babu and directed by Mukesh Kumar Singh the movie has a stellar cast featuring Mohan Lal, Prabhas, and Sarathkumar in pivotal roles. The shoot of this Pan India project reached final stages.
Mass Maharaja Ravi Teja, who was last seen in Eagle, disappointed his fans and audiences big time. Hits or flops do not change the way Ravi Teja signs films in his career. He has three films on floors already. If this was not enough, the mass Maharaja has also signed a film in the direction of KV Anudeep, who gave the blockbuster hit Jathi Ratnalu and made Prince with Siva Karthikeyan. Prince became below average film in both Tamil and Telugu. According to our close sources, Raviteja wanted to act in an out-and-out comedy entertainer to entertain his ardent fans. Anudeep is re writing the same. The film is going to be full fun entertainer in vintage Raviteja's style. Makers considering the title Donga - Police for the film. Currently, the film's pre production work is going on, shoot begins by year end. Now, the film's production changed. Sithara Entertainments planned to produce the film, but dropped as they are busy with Raviteja 75. Now, People Media Factory which produced Dhamaka and Eagle. We hear is that the story will explore the fun relationship between a thief and police. Sandalwood beauties Shraddha Srinath and Rukmini Vasanth are in consideration for female lead roles. The word is also Raviteja will be playing thief character while heroine will be the Police.
సినిమా పేరు: శబరి తారాగణం: వరలక్ష్మీ శరత్ కుమార్, మైమ్ గోపి, గణేష్ వెంకట్రామన్, నివేక్ష, శశాంక్, మధునందన్ తదితరులు సంగీతం: గోపీ సుందర్ సినిమాటోగ్రఫీ: నాని చమిడిశెట్టి, రాహుల్ శ్రీవాత్సవ్ ఎడిటింగ్: ధర్మేంద్ర కాకరాల రచన, దర్శకత్వం: అనిల్‌ కాట్జ్ నిర్మాత: మహేంద్రనాథ్ కూండ్ల బ్యానర్: మహా మూవీస్ విడుదల తేదీ: మే 3, 2024 'క్రాక్', 'నాంది', 'వీరసింహారెడ్డి', 'హనుమాన్' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వరలక్ష్మీ శరత్ కుమార్ నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ 'శబరి'. ప్రచార చిత్రాలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: ప్రేమించి పెళ్లి చేసుకున్న అరవింద్(గణేష్ వెంకట్రామన్)ని కాదనుకొని.. తన కూతురు రియా(నివేక్ష)ను తీసుకొని ముంబై నుంచి వైజాగ్ వస్తుంది సంజన(వరలక్ష్మీ శరత్ కుమార్). తన స్నేహితుడు, లాయర్ రాహుల్(శశాంక్) సహాయంతో ఓ కంపెనీలో జుంబా ట్రైనర్ గా ఉద్యోగంలో చేరుతుంది. జీవితం సాఫీగా సాగుతుంది అనుకుంటున్న సమయంలో సంజనకు ఊహించని సమస్య ఎదురవుతుంది. సైకోగా మారిన సూర్యం(మైమ్ గోపి) అనే వ్యక్తి.. రియా తన బిడ్డని, తనకి అప్పగించకపోతే చంపేస్తానని బెదిరింపులకు దిగుతాడు. మరోవైపు సంజన భర్త అరవింద్ కూడా తన కూతురిని తనకి అప్పగించాలంటూ కోర్టుని ఆశ్రయిస్తాడు. అసలు రియా ఎవరి కూతురు? అరవింద్ కి, సూర్యంకి ఏమైనా సంబంధం ఉందా? అరవింద్ కి సంజన దూరం కావడానికి కారణమేంటి? తన కూతురు రియాని దక్కించుకోవడం కోసం సంజన ఎలా పోరాడింది? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: ఈ సృష్టిలో తల్లి ప్రేమని మించింది లేదు. అన్ని ప్రేమల్లోనూ తల్లి ప్రేమే గొప్పది. తన బిడ్డ కోసం తల్లి ఎవరినైనా వదులుకుంటుంది, ఎంత దూరమైనా వెళ్తుంది, ప్రపంచాన్ని అయినా ఎదిరిస్తుంది. అలాంటి ఓ తల్లి కథే ఈ 'శబరి'. అయితే దర్శకుడు దీనిని సైకలాజికల్ థ్రిల్లర్ గా మలిచాడు. ఈ తరహా సినిమాలలో బలమైన భావోద్వేగాలతో పాటు, ఊహించని మలుపులు కూడా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఈ విషయంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. చిన్నతనంలో తల్లి ప్రేమకు దూరమైన సంజనగా వరలక్ష్మీ శరత్ కుమార్ పాత్ర పరిచయం, ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు దూరమై ఒంటరిగా కూతురిని చూసుకోవడం.. వంటి సన్నివేశాలతో సినిమా ప్రారంభమైంది. సంజన పాత్రని, అందులోని ఎమోషన్ ని పరిచయం చేస్తూ.. నెమ్మదిగా కథలోకి వెళ్తుంది. సైకో సూర్యం పాత్ర రాకతో కథలో వేగం పెరుగుతుంది. తరువాత ఏం జరుగుతుందోనన్న ఆసక్తి కలుగుతుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశాలు కట్టి పడేశాయి. సెకండాఫ్ కూడా ఎంతో ఆసక్తికరంగా మొదలవుతుంది. సెకండాఫ్ లో ఒక్కో ట్విస్ట్ రివీల్ అవుతుంటే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. మొత్తానికి ఓ వైపు బిడ్డ కోసం తల్లి చేసే పోరాటం, మరోవైపు ఊహించని ట్విస్ట్ లతో సినిమా మెప్పించింది. అయితే సినిమాలో ప్రతిదీ డిటైల్డ్ గా చూపించే ప్రయత్నం చేయడంతో.. కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది. ఆ విషయంపై దృష్టి పెట్టినట్లయితే.. అవుట్ పుట్ ఇంకా మెరుగ్గా ఉండేది. సాంకేతికంగా ఈ సినిమా ఉన్నతంగా ఉంది. గోపిసుందర్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కథలోని భావోద్వేగాలకు తగ్గట్టుగా ఆయన నేపథ్యం సంగీతం ఉంది. రాహుల్, నాని కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: బిడ్డను కాపాడుకోవడం కోసం పోరాడే సింగిల్ మదర్ సంజన పాత్రకు వరలక్ష్మీ శరత్ కుమార్ పూర్తి న్యాయం చేసింది. తన సహజమైన నటనతో మెప్పించింది. సైకో సూర్యం పాత్రలో మైమ్ గోపి కూడా మ్యాజిక్ చేశాడు. అరవింద్ గా గణేష్ వెంకట్రామన్, రియాగా నివేక్ష ఆకట్టుకున్నారు. శశాంక్, మధునందన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. కూతురిని కాపాడుకోవడం కోసం తల్లి చేసే పోరాటమే ఈ 'శబరి' చిత్రం. కథనం కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ.. బలమైన భావోద్వేగాలు, ఊహించని మలుపులు సినిమాని నిలబెట్టాయి. హత్తుకునే మదర్ సెంటిమెంట్, థ్రిల్ ఇచ్చే ట్విస్ట్ ల కోసం ఈ సినిమాని హ్యాపీగా చూసేయొచ్చు. రేటింగ్: 2.75/5 
నిర్మాతలు మాములు వాళ్ళు కాదు. వాళ్ళని అసలు నమ్మకూడదు. తమ సినిమా ప్రమోషన్స్ కోసమే అదంతా సృష్టించే వాళ్ళు. ఇపుడు ఈ మాటలన్నీ చెప్తుంది ఎవరో కాదు. 2000 వ సంవత్సరంలో  సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వచ్చిన మురారి ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన అందాల భామ  సోనాలి బింద్రే సోనాలి బింద్రే కి  2002 లో గోల్డి బెహ్ల్ తో వివాహం జరిగింది. ఇక అప్పటినుంచి సినిమాల్లో చెయ్యడం తగ్గించింది. మళ్ళీ  2022 లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ది బ్రోకెన్ న్యూస్ సీజన్ 2 అనే వెబ్ మూవీలో నటిస్తుంది.  అందుకు సంబంధించిన  ప్రమోషన్స్ లో సోనాలి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. 1994 లో ఇండస్ట్రీ లోకి వచ్చాను. ఇప్పటితో పోలిస్తే అప్పటి పరిస్థితులు కొంచం భిన్నంగా ఉండేవి . నా సహనటులతో నాకు ఎఫైర్ ఉందనే రూమర్స్ వచ్చేవి. పైగా ఆ రూమర్స్ సృష్టించేది ఎవరో కాదు నా  నిర్మాతలే. సినిమా ప్రమోషన్స్ కోసమే వాళ్ళు అలా సృష్టించే వాళ్ళు. పైగా మీడియాకి కూడా వెల్లడించేవాళ్లు. మొదట్లో ఈ విషయం నాకు తెలిసేది కాదు. తర్వాత అర్ధమయ్యి షాక్ కి గురయ్యాను.అలాగే ఇండస్ట్రీకి వచ్చిన తొలి నాళ్లల్లో సన్నగా ఉండే దాన్ని. దాంతో  చాలా మంది నన్ను అవహేళన చేసేవారు. మిగతా హీరోయిన్లు  బొద్దుగా  ఉన్నారని నిర్మాతలు కూడా కామెంట్స్ చేసే వాళ్ళని చెప్పుకొచ్చింది .అలాగే ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడు అనుకోలేదు. డాన్స్ అండ్ యాక్టింగ్ కి ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. సినిమాల్లోకి వచ్చాకే నేర్చుకున్నానని కూడా చెప్పింది. 1994 లో వచ్చిన ఆగ్ ఆమె మొదటి సినిమా. నిజానికి ఆ సినిమాలో హీరోయిన్ దివ్య భారతి. ఆమె ఆకస్మిక మరణంతో సోనాలికి హీరోయిన్ గా అవకాశం వచ్చింది.చిరంజీవి, మహేష్ బాబు ,నాగార్జున,బాలకృష్ణ  వంటి టాప్ స్టార్ తో కలిసి నటించిన సోనాలి ఆల్ లాంగ్వేజెస్ కలుపుకొని 45 చిత్రాలకి పైనే చేసింది   
సినిమా పేరు: ఆ ఒక్కటీ అడక్కు  తారాగణం: అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిషోర్, వైవా హర్ష, జామీ లివర్, హరితేజ, అరియానా తదితరులు  దర్శకత్వం: మల్లి అంకం  సంగీతం: గోపి సుందర్  నిర్మాత:  రాజీవ్ చిలక  మాటలు: అబ్బూరి రవి  ఎడిటర్: చోట కె ప్రసాద్  కెమెరా: సూర్య  విడుదల తేదీ: మే 3  2024 అప్పట్లో కామెడీ హీరోగా తనదైన ముద్ర వేసిన అల్లరి నరేష్.. కొంతకాలంగా సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని 'ఆ ఒక్కటీ అడక్కు' అనే కామెడీ సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఎలా ఉంది? అల్లరి నరేష్ మునుపటిలా కామెడీతో మ్యాజిక్ చేశాడా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: గణపతి(అల్లరి నరేష్) సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో పని చేస్తుంటాడు. అతని తమ్ముడుకి పెళ్ళయ్యి, ఒక పాప కూడా ఉంటుంది. కానీ, ప్రభుత్వ ఉద్యోగమున్నా, పెళ్లి వయసు దాటిపోతున్నా గణకి మాత్రం వివాహం జరగదు. 50 సంబంధాలు చూసినా ఏదీ సెట్ అవ్వదు. బంధువులు, తెలిసినవాళ్లంతా "పెళ్ళెప్పుడు", "పప్పన్నం ఎప్పుడు పెడతావు" అని అడుగుతూనే ఉంటారు. అలాంటి గణ, అనుకోకుండా వివాహాలు కుదిర్చే హ్యాపీ మాట్రిమోనీని సంప్రదిస్తాడు. అక్కడ వచ్చిన వధువుల ప్రొఫైల్స్ ద్వారా సిద్ధి(ఫరియా అబ్దుల్లా) పరిచయమవుతుంది. అప్పటికే సిద్ధిని బయట చూసి, ఆమెపై సదాభిప్రాయమున్న గణ.. ఆమెనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. కానీ సిద్ధి మాత్రం గణని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించదు. గణకి సిద్ధి నో చెప్పడానికి కారణమేంటి? అసలు సిద్ధి ఎవరు? ఆమె గణ జీవితంలోకి ఎలా వచ్చింది? అసలు గణకి పెళ్లి ఆలస్యం అవ్వడానికి కారణమేంటి? చివరికి తాను ఇష్టపడిన సిద్ధిని పెళ్లి చేసుకోగలిగాడా? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: మాట్రిమోనీ పేరుతో బయట ఎన్నో మోసాలు జరగడం చూస్తున్నాం. దానిని కథా వస్తువుగా ఎంచుకున్నాడు దర్శకుడు. ఆ సీరియస్ పాయింట్ ని తీసుకొని, ఎంటర్టైనింగ్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లీడు దాటిపోతున్నా, ఇంకా సింగిల్ గా ఉండే యువకులకు సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో తెలిసిందే. తెలిసినవాళ్ళు తెలియనివాళ్ళు అనే తేడా లేకుండా అందరూ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నతో ఇబ్బంది పెడతారు. అలా ఇబ్బంది పడే ఓ యువకుడి పాత్రే ఈ సినిమాలోని కథానాయకుడిది.  ఓ వైపు పెళ్లికాని ప్రసాద్ లాంటి హీరో పాత్ర, మరోవైపు మాట్రిమోనీ పేరుతో మోసాలు.. ఈ రెండింటిని కలుపుతూ కథని అల్లుకున్నారు. కథ ఆలోచన బాగున్నప్పటికీ, దానిని ఆసక్తికరంగా మలిచి, ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం దర్శకుడు సక్సెస్ కాలేకపోయాడనే చెప్పాలి. అల్లరి నరేష్ కొంచెం గ్యాప్ తరువాత చేసిన కామెడీ సినిమా కావడంతో.. ప్రేక్షకులు కామెడీ ఓ రేంజ్ లో ఆశిస్తారు. అలా ఆశించిన ప్రేక్షకులకు నిరాశ తప్పదు. కామెడీ పెద్దగా వర్కౌట్ కాలేదు. అక్కడక్కడా మాత్రమే కొన్ని నవ్వులు ఉన్నాయి. మునుపటి అల్లరి నరేష్ సినిమాలతో పోలిస్తే కామెడీ డోస్ బాగా తగ్గిపోయింది. హీరో పెళ్లి గోల, హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలని హీరో అనుకోవడం వంటి సన్నివేశాలతో ఫస్టాఫ్ పరవాలేదు అన్నట్టుగా సాగింది. ఇంటర్వెల్ సన్నివేశం మాత్రం ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసే అవకాశముంది. ఓ రకంగా సినిమాలో అదే హైలైట్ అని చెప్పవచ్చు. సెకండాఫ్ లో కామెడీ డోస్ మరింత తగ్గింది. ముఖ్యంగా చివరి 30 నిమిషాల ఎమోషనల్ టర్న్ తీసుకుంది. ఒకట్రెండు సన్నివేశాలు కంటతడి పెట్టించేలా ఉంటాయి. మొత్తానికి కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లు అన్నట్టుగా సినిమా సాగింది. సన్నివేశాలను కొత్తగా రాసుకొని, కామెడీ డోస్ పెంచినట్లయితే.. సినిమా అవుట్ పుట్ మెరుగ్గా ఉండేది. నటీనటుల పనితీరు: అల్లరి నరేష్ ఎప్పటిలాగే తన టైమింగ్ తో ఆకట్టుకున్నాడు. ఎమోషనల్ సన్నివేశాల్లోనూ తన మార్క్ చూపించాడు. సిద్ధి పాత్రకు ఫరియా అబ్దుల్లా పూర్తి న్యాయం చేసింది. ఇక ఈ సినిమాలో అల్లరి నరేష్ మరదలు పాత్రలో నటించిన జామీ లివర్ సర్ ప్రైజ్ అని చెప్పవచ్చు. తనదైన కామెడీతో కట్టిపడేసింది. తెలుగులో ఆమెకి ఇంకా మంచి అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. వెన్నెల కిషోర్, వైవా హర్ష, అజయ్, హరితేజ, అరియానా తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. చాలారోజుల తర్వాత అల్లరి నరేష్ కామెడీ సినిమా చేశాడు.. ఓ రేంజ్ లో నవ్వుకోవచ్చు అనే అంచనాలతో వెళ్తే మాత్రం నిరాశ చెందుతారు. కొన్ని నవ్వులు, కొన్ని కన్నీళ్లతో పరవాలేదు అనేలా ఉంది. పెళ్లికాని యువకుల బాధని, మాట్రిమోనీ పేరుతో బయట జరుగుతున్న మోసాలను చూపించిన ఈ సినిమాను.. ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడొచ్చు. రేటింగ్: 2.5/5  - గంగసాని
క్యారక్టర్ ఆర్టిస్ట్ కి కూడా స్టార్ డం తెచ్చిన నటి  వరలక్ష్మి శరత్ కుమార్. పాత్ర ఏదైనా సరే రఫ్ ఆడించడం ఆమె నైజం. తను ఉన్న సినిమా  ఖచ్చితంగా  బాగుంటుందనే ఆలోచనని కూడా ప్రేక్షకుల్లో కలిగించింది.పేరుకే తమిళ నటి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం తెలుగు నటే అని అంటారు. అంతలా అభిమానాన్ని పొందింది. తాజాగా తనకి ఎదురైన క్యాస్టింగ్ అనుభవం గురించి చెప్పింది ఇండస్ట్రీలో ఏ చిన్న సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా చాలు. ఆ తర్వాత  దూసుకుపోవచ్చని అంటారు. అలాంటిది వరలక్ష్మిది  మాములు బ్యాక్ గ్రౌండా. తండ్రి శరత్ కుమార్ తమిళనాట బడా స్టార్. కొన్ని లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక పొలిటికల్ పార్టీని  కూడా స్థాపించాడంటే ఆయన రేంజ్ అర్ధం చేసుకోవచ్చు.అంత పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికీ వరలక్ష్మి కూడా  క్యాస్టింగ్  కౌచ్ ని ఎదుర్కొంది. ఒక ప్రముఖ టెలివిజన్ ఛానెల్ హెడ్ ఒక సినిమా విషయమై తనతో  మాట్లాడేందుకు వచ్చాడు.డిస్కర్షన్  ముగిశాక మనం మళ్లీ బయట కలుద్దామని చెప్పాడు.ఎందుకని  అడిగితే వేరే పని కోసం అన్నాడు. రూం కూడా  బుక్ చేస్తానని చెప్పాడు. అప్పుడు గాని  వరలక్ష్మి కి విషయం అర్ధం కాలేదు. పైగా అతను వరలక్ష్మి ఇంటిలోనే ఆ విధంగా మాట్లాడాడు.దాంతో  సదరు వ్యక్తిపై పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.ఆ  తర్వాత  ఛానల్ కూడా అతన్ని   తీసేసింది ఇండస్ట్రీలో తనకు ఇదొక్కటే చేదు అనుభవం కాదు. కమిట్ మెంట్ కి ఒప్పుకోలేదని  కొన్ని సినిమాల నుంచి కూడా  తప్పించారు. అయినా సరే క్యారెక్టరే ముఖ్యం అని భావించి నేడు టాప్ స్టార్ గా వెలుగొందుతుంది.పైగా  వేరే అమ్మాయిలతో ఇండస్ట్రీ జనాలు ఎలా వ్యవహరిస్తారో అర్ధం చేసుకొని  శక్తి పేరుతో ఒక ఎన్జీవో పెట్టి ఇండస్ట్రీలో మహిళలకు అండగా నిలుస్తుంది. ప్రస్తుతం శబరి అనే మూవీ తో థియేటర్ లలో ఉంది. ఇటీవలే ముంబైకి చెందిన నీకొలాయ్ సచ్ దేవ్ తో ఎంగేజ్ మెంట్ జరిగింది. క్రాక్, వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పిఎస్, హనుమాన్ లాంటి హిట్ చిత్రాలు ఆమె ఖాతాలో ఉన్నాయి.   
భారతీయుల జీవన విధానంలో సినిమా అనేది నిత్యకృత్యమయిపోయింది. రోజుకి ఒక సినిమా అయినా చూడందే నిద్రపోనీ వాళ్ళు కోట్లల్లోనే ఉంటారు. ఇక సినిమా విడుదల రోజు చూడాలి. థియేటర్ ల దగ్గర  డాన్స్ లు,మేళతాళాల చప్పుళ్ళు   బాణాసంచా మోతలతో పెద్ద హడావిడే  చేస్తారు. మరీ ఇంతలా ఆనందాన్ని ఇస్తున్న సినిమా ఎప్పుడు విడుదలయింది. ఆ సినిమా ఏంటి మొట్టమొదటి భారతీయ సినిమా రాజా హరిచంద్ర. మే 3  1913 సంవత్సరం విడుదలైంది. అంటే నేటికీ  నూట పదకొండు సంవత్సరాలు అవుతుంది. అసేతు హిమాచలం సాక్షిగా  వెండి తెరపై సగర్వంగా ప్రదర్శితమయ్యింది. కాకపోతే  సైలెన్స్ చిత్రంగా తెరకెక్కింది. అంటే ఎలాంటి మాటలు, పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఉండవు. కేవలం పాత్రలు మాత్రమే కనపడతాయి. పురాణాల్లోని రాజా హరిచంద్ర జీవిత కథ ఆధారంగా నిర్మాణం జరుపుకుంది.మరాఠీ నటులు ఎక్కువ భాగం  నటించారు. ఇరవై వేలరూపాయిల బడ్జట్ తో  నలభై నిమిషాల నిడివితో తెరకెక్కింది దాదాసాహెబ్ ఫాల్కే ఈ చిత్రానికి  దర్శకత్వం వహించారు. దాంతో  ఇండియన్ సినిమా పితామహుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కారు. నేటికీ కేంద్ర ప్రభుత్వం ఆయన పేరు మీద అవార్డుల్ని ఇస్తుంది. ఆ అవార్డు అందుకోవడాన్ని సినీ ప్రముఖులు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఇక రాజా హరిచంద్ర ప్రీమియర్ షో ని కూడా జరుపుకుంది ఏప్రిల్ ఇరవై ఒకటిన ముంబైలో ని ఒలింపిక్ థియేటర్ లో ప్రదర్శితమయ్యింది. ఏది ఏమైనా తింటే గారెలు తినాలి..వింటే భారతం వినాలి.. చూస్తే సినిమా చూడాలి  
  సినిమా పేరు: ప్రసన్నవదనం తారాగణం: సుహాస్,పాయల్ రాధాకృష్ణ, రాశీ సింగ్,నితిన్ ప్రసన్న, నందు,  హర్ష వర్ధన్,వైవా హర్ష, సాయి శ్వేత  రచన, దర్శకత్వం : అర్జున్ వై.కె సంగీతం : విజయ్ బుల్గానిన్  నిర్మాతలు :మణికంఠ,ప్రసాద్ రెడ్డి  విడుదల తేదీ:  మే  3  2024  వరుస హిట్లతో దూసుకుపోతున్న సుహాస్ ఈ రోజు ప్రసన్నవదనం అంటు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరి సుహాస్ విజయపరంపర కంటిన్యూ అయ్యిందో లేదో చూద్దాం కథ తన తల్లి తండ్రులతో కలిసి కారులో వెళ్తున్న సూర్య ( సుహాస్ ) కారు  యాక్సిడెంట్ కి గురవుతుంది. ఆ ప్రమాదంలో తల్లి తండ్రులు ఇద్దరు చనిపోతారు. సూర్య  మాత్రం ఫేస్ బ్లైండ్ నెస్ అనే ఒక అరుదైన వ్యాధి బారిన పడతాడు. అంటే ఒక మనిషి ముఖం సూర్యకి రక రకాలుగా కనపడుతుంటుంది. సింపుల్ గా చెప్పాలంటే మనిషి ముఖం అతనికి గుర్తు ఉండదు. రేడియో మిర్చిలో జాకీగా పని చేస్తుంటాడు. సాటి వారి పట్ల జాలి దయ కల్గిన సూర్య మెంటాలిటీ నచ్చి  ఆధ్య   (పాయల్ రాధాకృష్ణ) ప్రేమిస్తుంది. సూర్య కూడా ఆమెని ప్రేమిస్తాడు. ఈ క్రమంలో అమృత (సాయిశ్వేత) అనే అమ్మాయి హత్య జరుగుతుంది . కాకపోతే ప్రపంచం మొత్తం యాక్సిడెంట్ అని నమ్ముతుంది. దాంతో  పోలీసులు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  వైదేహి (రాశీ సింగ్ )  ఆధ్వర్యంలో  కేసు క్లోజ్ చెయ్యాలని చూస్తుంటారు. కానీ అమృత ది  హత్యా అని సూర్య కంప్లైంట్ ఇస్తాడు. కానీ పోలీసులే  సూర్య మీద మూడు హత్యలు చేసినట్టు కేసు ఫైల్ చేస్తారు. వాళ్ళు అలా ఎందుకు చేసారు?  అమృత  కేసు విషయంలో  తనకున్న ఫేస్  బ్లైండ్ నెస్ అనే వ్యాధిని దాటుకొని అసలు నేరస్తుల్ని సూర్య  ఎలా పట్టుకున్నాడు?  అసలు అమృత ఎవరు? తన లవ్ ఏమైంది ? అనేదే ఈ కథ  ఎనాలసిస్ :  ముందుగా ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడుకున్న  కథని ఎంచుకున్నందుకు దర్శకుడుకి కంగ్రాట్స్ చెప్పాలి. మూవీ చూస్తున్నంత సేపు ఎక్కడ  బోర్ కొట్టదు.కాకపోతే  ఫేస్ బ్లైండ్ నెస్ ఉన్న వ్యక్తి తన లోపాన్ని నయం చేసుకోవడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే బాగుండేది. ఈ యాంగిల్ ని ఫస్ట్ ఆఫ్ లో ఎంటర్ టైన్మెంట్ కోణంలో చెప్పుండాల్సింది. క్లైమాక్స్ లో ఇచ్చిన ట్విస్ట్ లాంటివి మధ్య మధ్యలో వచ్చి వచ్చి ఉంటే బాగుండేది.  హీరో హీరోయిన్ ల మధ్య కామెడీ ట్రాక్ ని నడిపే అవకాశం ఉన్నా ఎందుకనో ఆ దిశగా వెళ్ళలేదు.కాకపోతే  హీరో హీరోయిన్ల  పరిచయం సీన్స్ చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. ఇక సెకండ్ ఆఫ్ లో వచ్చిన చాలా  ట్విస్ట్ లు సినిమాకి చాలా హెల్ప్ అయ్యాయి.  ముఖ్యంగా రాశి సింగ్, సూర్య,  పాయల్ రాధాకృష్ణ,  నితిన్ ప్రసన్న ల మధ్య వచ్చిన సీన్స్ ప్రేక్షకులకి థ్రిల్ ని కలిగించాయి. కాకపోతే ప్రేక్షకుడికి సినిమా చూస్తున్నంత సేపు కూడా  మైండ్ లో ఒక ఆలోచన వస్తు ఉంటుంది. అబ్బా బడ్జట్ ఇంకొంచం ఎక్కువ ఉంటే సినిమా రేంజ్ వేరేలా ఉండేది అని. అది నూటికి నూరుపాళ్లు నిజం కూడా  నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు సుహాస్ మరోసారి తన సహజమైన నటనతో  అదరగొట్టాడు.ఫేస్ బ్లైండ్ నెస్ ప్రాబ్లం వల్ల  మనుషుల్ని గుర్తుపట్టలేని పరిస్థితిలో బాధపడే సన్నివేశాల్లో సూపర్ గా నటించాడు. తన కెరీర్ లో మొదటి సారి  యాక్షన్ సీక్వెన్స్ లో చాలా బాగా చేసాడు.ఇక హీరోయిన్  పాయల్ రాధాకృష్ణ తన పాత్ర పరిధి మేరకు చాలా చక్కగా చేసింది. అసలు ఆ పాత్ర తన కోసమే పుట్టిందేమో అనేలా చేసింది.క్లోజ్ షాట్స్ లో కూడా మంచి ఎక్సప్రెషన్స్ ని  పలికించింది. ఇక ఏసిపి క్యారక్టర్ లో రాశి సింగ్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తన నట విశ్వ రూపాన్ని ప్రదర్శించింది. వరలక్ష్మి శరత్ కుమార్ అవకాశాలని రాశి సింగ్ దక్కించుకునే అవకాశం ఉంది. ఎస్ఐ క్యారక్టర్ చేసిన  నితిన్ ప్రసన్న కూడా సూపర్ గా చేసాడు. ఫ్యూచర్ లో అతనికి మరిన్ని అవకాశాలు రావచ్చు. వైవా హర్ష,  నందు, సత్య లు కూడా తమ   పరిధిమేరకు చక్కగానే నటించారు.ఫొటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఇక మ్యూజిక్ ని అందించిన  విజయ్ బుల్గానిన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో  సినిమాని నిలబెట్టాడు.  సాంగ్స్ కూడా బాగున్నాయి.నిర్మాణ విలువలు మాత్రం సోసో గా ఉన్నాయి  ఫైనల్ గా చెప్పాలంటే ఎంత చెట్టుకి అంతే గాలి అనే సామెత ప్రసన్నవదనంతో  మరోసారి రుజువయ్యింది. సినిమా అయితే నాట్ బాడ్.. వెరైటీ కాన్సెప్ట్ తో కూడిన థ్రిల్లర్ మూవీ కాబట్టి టైటిల్ కూడా డిఫరెంట్ గా పెట్టుండాల్సింది. ప్రసన్న వదనం అంటే ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నవ్వు ముఖంతో ఉండటం  రేటింగ్ 2 .75 / 5                                                                                                    అరుణాచలం 
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతి వ్యక్తి జీవితాన్ని పెళ్లికి ముందు, పెళ్ళి తర్వాత అని చాలా స్పష్టంగా విభజించి చెప్పవచ్చు.  ఎందుకంటే పెళ్లికి ముందు ఉన్న చాలా విషయాలు పెళ్ళి తర్వాత మారిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో  అమ్మాయిలు, అబ్బాయిలు వ్యక్తిత్వం పరంగా చాలా ఆత్మగౌరవం కలిగి ఉంటారు. ఏ చిన్న విషయాల్లోనూ రాజీ పడటానికి సిద్దంగా ఉండరు. ఈ కారణంగా ఇప్పటి కాలంలో పెళ్లవుతున్న వారి మధ్య గొడవలు, విడాకులు ఎక్కువ. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలన్నా, వారి జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ పెద్ద గొడవలకు దారి తీయకుండా సింపుల్ గా పరిష్కారం కావాలన్నా కొన్ని గోల్డెన్ రూల్స్ ఫాలో అవ్వాలి. రిలేషన్షిప్ నిపుణులు చెప్పిన ఆ గోల్డెన్ రూల్స్ ఏంటో తెలుసుకుంటే.. పెళ్ళి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి. అమ్మాయిలకు అయినా, అబ్బాయిలకు అయినా భాద్యతలు పెరుగుతాయి. ఇల్లు, ఉద్యోగం, స్నేహితులు, ఇతర పనులలో భార్యాభర్తలు ఒకరినొకరు నిర్లక్ష్యం చేయకూడదు. ఎన్ని పనులున్నా సరే.. భార్యాభర్తలిద్దరూ కొంతసమయం కేటాయించుకోవాలి.  కలసి మాట్లాడుకోవడం, కలసి భోజనం చేయడం, కలసి చర్చించడం,  ప్రతిరోజూ కనీసం గంటసేపు అయినా మాట్లాడాలనే నియమం పెట్టుకోవాలి. ఇలా చేస్తే వారి మధ్య  ఏ సమస్యలున్నా వాటిని మాట్లాడుకుని పరిష్కరించుకోవచ్చు. అందుకే ఒకరికోసం ఒకరు సమయం కేటాయించుకోవడం ఎంతో ముఖ్యం. పెళ్ళికి ముందు కాబోయే జంట ఒకరి పట్ల మరొకరు చాలా ప్రేమగా ఉంటారు. ఒకరిని మరొకరు బుజ్జగించుకోవడం, ప్రేమ కురిపించడం, చాలా కేరింగ్ గా ఉండటం చేస్తారు. అయితే చాలామంది జీవతాలను గమనిస్తే పెళ్ళి తర్వాత ఈ సీన్ మొత్తం మారిపోతుంది.  కానీ ఇలా చేయడం మంచిది కాదు. పెళ్లి తర్వాత కూడా ఇద్దరూ ఒకరి పట్ల మరొకరు ప్రేమగా ఉండాలి. ఒకరి మీద మరొకరు అరుచుకోవడం, గొంతు పెంచి మాట్లాడటం వల్ల ఇద్దరి మధ్య  గొడవకు దారితీస్తుంది. భార్య చేసే ఏ పని అయినా భర్తకు నచ్చితే భార్యను మెచ్చుకోవడం అస్సలు మిస్ కాకూడదు.   భార్య వంట నచ్చినా, ఆమె ఇంటి పనిలో చలాకీగా ఉన్నా,  భర్తకు ప్రేమగా వడ్డించినా, ఇంటి పనిని, ఆఫీసు పనిని ఆమె సమర్థవంతంగా  బ్యాలెన్స్ చేస్తున్నా ఇలా ఏం చేసినా సరే భార్యను మెచ్చుకోవడానికి అస్సలు మొహమాటపడకూడదు. అలాగే  భర్త ప్రేమగా ఏం చేసినా భర్త వృత్తి, వ్యక్తిగతంగా ఏం చేసినా దాన్ని భార్య కూడా మెచ్చుకోవాలి. ఇలా చేస్తే భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి ప్రేమ పెరుగుతుంది. ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మాట్లాడే తీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిని మరొకరు ఎలా మాట్లాడుతున్నారు అనేది వారి మధ్య బంధాన్ని నిర్ణయిస్తుంది. ఒకరితో ఒకరు మాట్లాడటం, ఒకరి మనసులో విషయాలు మరొకరితో షేర్ చేసుకోవడం, ఒకరు చెప్పేది మరొకరు శ్రద్దగా వినడం ఇవన్నీ బంధం పదిలంగా ఉండటానికి అవసరం. భార్యాభర్తల బంధం అంటే ఇక ఒకరి జీవితం మరొకరు చేతుల్లోకి వెళ్లినట్టే అని అనుకుంటారు కొందరు. కానీ భార్యాభర్తలు అలా ఉండకూడదు. స్పేస్ అనేది చాలా ముఖ్యం. స్పేస్ లేకపోతే బంధం కష్టంగా అనిపిస్తుంది. భాగస్వామి జీవితాన్ని మరీ గట్టిగా బంధించినట్టు, తనకు అన్ని విషయాలు తెలియాలి అన్నట్టు ఉండకూడదు. ముఖ్యంగా కంట్రోల్ చేయడం, కమాండ్ చేయడం అస్సలు మంచిది కాదు. ఎవరి సొంత అభిప్రాయాలు, ఆలోచనలు, సంతోషాలు వారికి ఉండటం మంచిది.                                             *రూపశ్రీ. 
కొంతమందికి ఎప్పుడూ ఏదో ఒక దెబ్బ తగులుతూ ఉంటుంది! ఒంటి మీద ఎప్పుడూ ఏదో ఒక గాయం కనిపిస్తూనే ఉంటుంది. వాళ్లని చూసి పాపం దురదృష్టవంతులు అని మిగతావారు జాలిపడుతూ ఉంటారు. కానీ తరచూ ఏదో ఒక ప్రమాదానికి లోనవ్వడానికీ మన వ్యక్తిత్వానికీ సంబంధం ఉండవచ్చని ఊహిస్తున్నారు మనస్తత్వ శాస్త్రవేత్తలు. ఇలాంటి మనస్తత్వాన్ని ‘Accident Prone Psychology’ అంటున్నారు. అదేమిటో తెలుసుకుంటే మనకీ కాస్త ఉపయోగపడుతుందేమో... ఓ ఆలోచన! తరచూ కొంతమందే ఎందుకు దెబ్బలు తగిలించుకుంటారన్న అనుమానం 19వ శతాబ్ది మొదటిలోనే వచ్చింది. దీని మీద మరిన్ని పరిశోధనలు చేసిన గ్రీన్‌వుడ్ వంటి నిపుణులు మన ఆలోచనా విధానానికీ, ప్రమాదాలకి సంబంధం ఉండే అవకాశం ఉందని తేల్చారు. ఆ తరువాత వచ్చిన ఎన్నో పరిశోధనల్లో ఓ 20 శాతం మంది వ్యక్తులే అధికశాతం ప్రమాదాలకి కారణం అవుతూ ఉంటారనీ... మొత్తంగా మన చుట్టూ జరిగే ప్రమాదాలలో దాదాపు 75 శాతం ప్రమాదాలు మానవ తప్పిదం వల్లే ఏర్పడతాయని చెబుతూ వస్తున్నాయి. ఈ పరిశోధనల శాస్త్రీయతని చాలామంది కొట్టిపారేసినా, వీటిలో స్పృశించిన చాలా అంశాలు చాలా తార్కికమైనవే! అందుకనే కొన్ని భీమా కంపెనీలు ప్రమాదభీమాను చెల్లించేటప్పుడు, ఉత్పాదక సంస్థలు తమ ఉద్యోగులను హెచ్చరించేందుకూ ఈ పరిశోధనలు ఉపయోగపడుతున్నాయి.   ప్రమాదాన్ని ఆశించే వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం మరీ ఎక్కువగా ఉన్నారు, దూకుడుగా ఉండేవారు, నిరంతరం కోపంతో రగిలిపోయేవారు... పోయి పోయి ఏదో ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారని తేలింది. మానసిక ఒత్తిడిలో ఉన్నవారు కూడా ప్రమాదాలకి త్వరగా లోనవుతారని చాలా పరిశోధనలు వెల్లడించాయి. ఏదన్నా కుటుంబంలో ఒకరి తరువాత ఒకరు ప్రమాదానికి లోనవడం మనం గమనిస్తూ ఉంటాము. ఆ కుటుంబానికి ఏదో శాపం తగిలిందనో, వారి గ్రహస్థితి బాగోలేదనో అనుకుంటాము. నిజానికి ఇలా కుటుంబంలో ఎవరన్నా ఒకరు తీవ్ర ప్రమాదానికి లోనైతే, ఆ ప్రభావం ఇతరుల మనసు మీద కూడా పడుతుందనీ... ఆ ఒత్తిడిలో మిగతా సభ్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశం 20 శాతం ఉంటుందనీ ఓ పరిశోధన తేల్చింది. ఎవరైతే ఇతరుల సలహాలను, సహాయాన్నీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉంటారో... వారు త్వరగా ప్రమాదాలకు లోనుకారని తేలింది. అహంకారం లేకుండా, తొందరపడకుండా ఉండేవారికి ప్రమాదాలు కూడా ఆమడదూరంలో ఉంటాయని 2001లో జరిగిన ఒక పరిశోధన రుజువు చేసింది. అంటే నిదానమే ప్రధానం, నోరు మంచిదైతే ఊరు మంచిది లాంటి సామెతలు యాంత్రిక జీవితానికి కూడా వర్తిస్తాయన్నమాట.     ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా తొందరపాటు, దూకుడు, ద్వేషం, అహంకారం... మనిషి విచక్షణను దెబ్బతీస్తాయి. తన మీద తనకి ఉండాల్సిన నియంత్రణను ప్రభావితం చేస్తాయి. దాంతో ఒక అనర్థం జరగడం సహజమే! కానీ ఇలాంటివారు కేవలం తమకి మాత్రమే ప్రమాదాన్ని తెచ్చుకుంటే ఫర్వాలేదు. అలా కాకుండా ఈ ‘Accident Prone Psychology’ ఉన్నవారు ఏ విమానాన్నో నడుపుతుంటే! అందుకే ఈ తరహా వ్యక్తిత్వం గురించి నానాటికీ ప్రచారం పెరుగుతోంది. మీది ప్రమాదాన్ని కొని తెచ్చుకునే వ్యక్తిత్వమేమో గమనించుకోండి అంటూ కొన్ని వెబ్‌సైట్లు పరీక్షలు పెడుతున్నాయి. మున్ముందు ఉద్యోగులకు కూడా ఇలాంటి పరీక్షలను నిర్వహించి విధుల్లోకి తీసుకునే పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు!   - నిర్జర.
ప్రేమ అనేది  ఇప్పట్లో చాలా కామన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమ అంటే అబ్బాయిలు మాత్రమే ధైర్యం చేసి చెప్పేది.. అమ్మాయిలకు అంగీకారం ఉంటే తదుపరి వారి బంధం మరో మలుపు తిరిగేది.. కానీ ఇప్పుడు అట్లా కాదు.. అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరూ ప్రేమ విషయంలో బాగా అడ్వాంటేజ్ గా ఉంటున్నారు. అయితే చిక్కల్లా ఒకమ్మాయి తమకు బాగా తెలిసి, తమతో సన్నిహితంగా ఉంటూ తమను లవ్ చేస్తుందా లేదా  అనే విషయం అర్థం కాక జట్టు  పీక్కునే అబ్బాయిల గురించే..   అయితే దీనికి ఈజీగానే చెక్ పెట్టవచ్చు అమ్మాయిలు తమను ప్రేమిస్తున్నారా లేదా అనే విషయాన్ని అబ్బాయిలు ఈ 7 విషయాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటంటే.. అమ్మాయిలు తమకు ఎంత పని ఉన్నా, ఎంత ఇబ్బందులు ఉన్నా వారి మనసులో ఒక అబ్బాయి పట్ల ప్రేమ ఉంటే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది. ఫోన్ లో అయినా, మెసేజ్ లో అయినా, వ్యక్తిగతంగా కలవడంలో అయినా తను ప్రేమించిన అబ్బాయిని ఎప్పుడూ లైట్ తీసుకోదు. తను ఇష్టపడుతున్న అబ్బాయితో సన్నిహితంగా ఉండటానికి అమ్మాయిలు అబద్దాలు చెప్తారు. మాట్లాడటానికో, కలసి నడుస్తున్నప్పుడో, పక్కపక్కన కూర్చున్నప్పుడో తాకడం, చెయ్యి పట్టుకోవడం, నవ్వడం, నవ్వించడం వంటివి చేస్తారు. ప్రతి అమ్మాయికి తను ఇష్టపడే అబ్బాయి మరొకరితో సన్నిహితంగా మాట్లాడితే కోపం వస్తుంది. అలాగే అసూయ పడుతుంది. ఒకమ్మాయి తను ఇష్టపడుతున్న అబ్బాయి ఇతర అమ్మాయిలతో మాట్లాడుతుంటే అలాగే ఫీలవుతుంది. కొన్నిసార్లు తను ప్రేమించిన అబ్బాయి  ముందు కోపాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. అమ్మాయి తను ప్రేమిస్తున్న అబ్బాయి కళ్లలోకి చూసి మాట్లాడాలంటే చాలా ఇష్టపడుతుంది. అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లలోకి చూస్తూ మాట్లాడుతుంటే ఆమెకు ప్రేమ ఉన్నట్టే. అమ్మాయిలు తాము ప్రేమిస్తున్న అబ్బాయిలు అందుబాటులో కాస్త దూరంగా ఉంటే ఇక చూపులన్నీ తను ప్రేమిస్తున్న అబ్బాయి వైపే ఉంచుతుంది. ఎలాంటి పరిస్థితిలో అయినా సరే.. అమ్మాయి తను ఇష్టపడే అబ్బాయి కదలికలను గమనించడానికి, అతన్ని చూడటానికి ఇష్టపడుతుంది. అబ్బాయికి నచ్చిన పని చేయడానికి, నచ్చిన వస్తువులు, నచ్చిన ఆహారం తీసుకొచ్చి ఇవ్వడానికి అమ్మాయి శ్రద్ద చూపిస్తున్నట్టైతే అది సాధారణ పరిచయం లేదా స్నేహం అనుకోవడానికి వీల్లేదు. ఏ మూలో అమ్మాయికి తప్పకుండా అబ్బాయి మీద ఇష్టముందని అర్థం. అమ్మాయిలు తమకు ఏ చిన్న బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా అబ్బాయితో చెబుతుంటే ఆమెకు అతను చాలా స్పెషలని అర్థం. అంతేకాదు తను ఇష్టపడుతున్న అబ్బాయి పక్కన ఉంటే ఆమె తన బాధలన్నీ మర్చిపోతుంది. అమ్మాయి ఇలా చేస్తుంటే ఆమె ప్రేమిస్తోందనే అర్థం.                                                         *నిశ్శబ్ద.  
  బాదం ఒక డ్రై ఫ్రూట్ దీనిలో ఉండే  పోషకాలు శరీరానికి చాలా అవసరమైనవి. బాదంపప్పులో శక్తి, కొవ్వు, ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, ఫాస్పరస్, మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్,  ఐరన్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. అందుకే దీన్ని డైట్‌లో భాగం చేసుకోమని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఉదయాన్నే రాత్రి నానబెట్టిన బాదం పప్పులు కనీసం నాలుగైనా తినమని చెబుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బాదం పప్పు తినాలా వద్దా  కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంటుంది. దీని గురించి ఆహార నిపుణులు కింది విధంగా చెబుతున్నారు. బాదంపప్పును ఏ సీజన్‌లోనైనా తినవచ్చు.  అయితే ఏ సీజన్ అయినా వాటిని నానబెట్టి తినాలి.  అయితే వేసవి కాలంలో పచ్చి బాదం పప్పుులు మాత్రం తినకూడదు. ఇవి కడుపునొప్పికి కారణం అవుతాయి. బాదం పప్పు స్వభావం సహజంగా వేడిగా ఉంటుంది. వేసవి కాలంలో బాదం పప్పులు తినడం వల్ల పిత్త దోషం సంభవించే అవకాశం ఉంటుంది.  అందుకే రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును మాత్రమే తినడం అన్ని విధాలా శ్రేయస్కరం. రాత్రి నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల జీర్ణశక్తి బలపడుతుంది.  బాదం పప్పులో ఉండే మోనోఅన్శాచురేటెడ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సహాయపడుతుంది. నానబెట్టిన బాదం పప్పు తింటే శోషణ సామర్థ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది.  బాదం శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.   రోజుకు ఎవరు ఎన్ని బాదం పప్పులు తినాలంటే.. 5 నుండి 10 సంవత్సరాల పిల్లలు ప్రతి రోజూ 2 నుండి 4 బాదం పప్పులు తినవచ్చు.  జీర్ణశక్తి తక్కువగా పిల్లలు కనీసం రెండు కూడా తినలేకపోవచ్చు. కాబట్టి పిల్లల జీర్ణశక్తి సామర్థ్యం ను బట్టి బాదం పప్పులను ఇవ్వాలి. బాదం పప్పులు తినడం కొత్తగా మొదలుపెట్టేవారు రోజూ రెండు బాదం పప్పులతో మొదలుపెట్టాలి.  అవి బాగా అలవాటు అయ్యాక వాటి పరిమాణం పెంచుకోవచ్చు. అయితే రోజుకు 8 బాదం పప్పులకు మించి ఎప్పుడూ తినకూడదు.                                                    *నిశ్శబ్ద. 
భారతీయ వంటిల్లు గొప్ప ఔషదాల వేదిక. వంటింట్లో ఉండే ప్రతి మసాలా దినుసు, వంటకు ఉపయోగించే ప్రతి వస్తువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయ్యుంటాయి. వెల్లుల్లి, జీలకర్ర, అల్లం, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగం.. ఇలా చెప్పుకుంటూ వెళితే ప్రతి దానికి చాలా ప్రయోజనాలు ఉంటాయి. ఇక  రెస్టారెంట్లో భోజనానికి వెళితే చివరగా వాళ్లు ఇచ్చే సొంపు  లేదా సోపు కూడా చాలా ఇళ్లలో ఉంటుంది. భోజనం తరువాత పొట్ట సమస్యలు ఏవీ ఉండకూడదని, ఆహారం బాగా జీర్ణం కావాలని సోపు ఇస్తుంటారు. అయితే అది స్వీట్ సోపు.. సాధారణంగా ఇళ్లలో ఉండే ప్లెయిన్ సోపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే దీన్ని ఎప్పుడూ లైట్ తీసుకోరు.. సోపు వంటింటి  దినుసుల మధ్య ఉండే జీలకర్రను పోలి ఉంటుంది.  కానీ దీని సువాసన నుండి రుచి వరకు, ఆరోగ్య ప్రయోజనాల నుండి ధర వరకు అన్నీ వేర్వేరుగానే ఉంటాయి. ఎండలు దంచేస్తున్న ప్రస్తుత పరిస్థితులలో సోపును తీసుకోవడం వల్ల శరీరం చల్లబడుతుందని ఆయుర్వేద ఆహార నిపుణులు అంటున్నారు. సోపును వేసవి కాలంలో తీసకుంటే శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. సాధారణంగా వేసవికాలంలో బయటి వాతావరణం వల్ల శరీరం కూడా వేడెక్కుతుంది. కానీ ఈ వేడిని సోపు నియంత్రిస్తుంది. సోపులో శీతలీకరణ గుణాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇది శరీరాన్ని శాంతపరచడంతో పాటూ హీట్ స్ట్రోక్ నుండి శరీరాన్ని రక్షించడంలో కూడా మెరుగ్గా ఉంటుంది. కేవలం శరీరాన్ని చల్లబరచడం, హీట్ స్ట్రోక్ నుండి రక్షించడమే కాదు.. జీర్ణ లక్షణాలు కూడా సోపులో మెండుగా ఉంటాయి. ఈ కారణంగానే వేసవిలో ఎదురయ్యే జీర్ణ సంబంధ సమస్యలకు సోపు చెక్ పెడుతుంది. సోపును నేరుగా కానీ, సోపును నీటిలో ఉడికించి టీలా కానీ తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. సోపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే టాక్సిన్లను తగ్గించడంలోనూ, బయటకు పంపడంలోనూ సహాయపడతాయి. శరీరాన్ని శుద్ది చేసుకోవాలని అనుకునేవారు సోపు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పట్లో చాలామందిని వేధిస్తున్న సమస్య అధిక బరువు. సోపు టీని ఖాళీ కడుపుతో తీసుకుంటూ ఉంటే అధిక బరువు సమస్యకు చెక్ పెట్టవచ్చు.  ఇది శరీరంలోనూ, పొట్ట భాగంలోనూ పేరుకున్న అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయపడుతుంది.                                                  *రూపశ్రీ.
మనిషి శరీరానికి ఆహారమే గొప్ప ఔషదం. సరైన ఆహారం తిన్నా, సరైన వేళకు తిన్నా అది శరీరానికి చాలా బాగా పనిచేస్తుంది. గ్రామాల లైఫ్ స్టైల్ గమనిస్తే సాయంత్రం దీపాలు పెట్టే వేళకు వంట పూర్తీ చేయడం,  ఆ తరువాత రాత్రి 7 గంటల లోపే భోజనం చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఇరుగు పొరుగు వారు, కుటుంబ సభ్యులు కాసేపు కబుర్లు చెప్పుకుని 8 నుండి 9 గంటల్లోపు నిద్రపోయేవారు. తర్వాత ఉదయం నాలుగు గంటలకే లేచి పనులు చక్కబెట్టుకునేవారు. గ్రామాలలో ప్రజలు ఆరోగ్యంగా ఉండటానికి ఇది బలమైన కారణం. కానీ ఈ అలవాటు ఇప్పుడెక్కడా కనిపించట్లేదు..  గ్రామాలలో కూడా కాంక్రీటు సొగసులు అద్దుకుని తమ అలవాట్లను కూడా కోల్పోయాయి. అయితే  రాత్రి 7 గంటలలోపే భోజనం చెయ్యడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఒక్కసారి తెలుసుకుంటే... ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం ఉండాలని వైద్యులు చెబుతారు.   ఎందుకంటే తినడానికి నిద్రించడానికి మధ్య  సమయం ఉండచం వల్ల  ఆహారం జీర్ణం కావడానికి అనువుగా ఉంటుంది.  ఆహారం సరిగా జీర్ణమైతే జీర్ణాశయ సమస్యలు ఏమీ ఉండవు. జీర్ణాశయ సమస్యలు  లేకపోతే ఉదర ఆరోగ్యం బాగుంటుంది.  దీంతో నిద్ర కూడా బాగా పడుతుంది. రోజూ రాత్రి 7 గంటలలోపు తినడం అలవాటు చేసుకునే వారికి తరువాత రోజు ఉదయం 8 గంటలలోపు బాగా ఆకలి అవుతుంది. ఉదయం 8 గంటలలోపు అల్పాహారం కానీ లేదా ఇతర ఆహారాలు కానీ ఉదయాన్నే తింటారు. దీని వల్ల ఉదయం ఆహారం ఎగ్గొట్టే అలవాటు తప్పుతుంది. ఆకళి కూడా వేళకు ఠంచనుగా అవుతుంది.   రాత్రి నిద్రపోయే ముందు ఆహారం తినేటప్పుడు అదొక హడావిడి ఉంటుంది. సమయం అయిపోతోందని, తొందరగా నిద్రపోవాలని కంగారు పడేవారు కొందరు ఉంటారు. దీని వల్ల ఆహారాన్ని ఆస్వాదించలేరు. అదే 7 గంటలప్పుడు వాతావరణం బాగుంటుంది. ఆహ్లదకరమైన వాతావరణంలో తినడం వల్ల ఆహారం కూడా శరీరానికి ఒంటబడుతుంది. ఆహారం బాగా జీర్ణం కావాలంటే తిన్న వెంటనే పడుకోకూడదు. 7గంటలలోపు భోజనం చేస్తే పడుకునే లోపు ఏదో ఒక పని చేస్తూ సమయం గడుస్తుంది. దీనివల్ల తిన్న ఆహారం కూడా బాగా జీర్ణం అవుతుంది.  కడుపులో గ్యాస్, ఉబ్బరం, జీర్ణసమస్యలు వంటివి ఎదురుకావు. చాలామంది బరువు పెరగడానికి కారణం రాత్రి భోజన వేళలు సరిగా లేకపోవడమే. తిన్న వెంటనే కాసేపు నడక, ఇతర పనులు చేయడం వల్ల తిన్న ఆహారం జీర్ణం కావడానికి సమయం దొరకడమే కాకుండా  కేలరీలు కూడా బర్న్ అవుతాయి. జీవక్రియ బాగుండటం వల్ల బరువు పెరగే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి. ప్రతి వ్యక్తిలో సిర్కాడియన్ రిథమ్ అనే చక్రం ఉంటుంది. ఇది నిద్రా చక్రం నుండి జీవక్రియ వరకు చాలా విధులు సక్రమంగా ఉండేలా చూస్తుంది. రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్  ఆరోగ్యకరంగా ఉంటుంది.                                                           *నిశ్శబ్ద.