LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో   అత్యంత కీలకమైన అంశం అమరావతి.  ఈ విషయంలో  వైఎసీపీ అధినేత  జగన్ మోహన్ రెడ్డి అవలంబిస్తున్న వైఖరి ఇప్పుడు ఆ పార్టీ నేతలను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ  అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏకగ్రీవ తీర్మానం ఆమోదించిన తరువాత.. వైసీపీలో అంతర్మథనం మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   జగన్ హయాంలో అప్పటికే జోరుగా నిర్మాణమౌతున్న అమరావతిని నిర్వీర్యం చేసి మూడు రాజధానులు అంటూ ఆరంభించిన మూడుముక్కలాట  కారణంగానే 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర  పరాజయాన్ని ఎదుర్కోవలసి వచ్చిందన్న అభిప్రాయం అప్పట్లోనే కాదు.. ఇప్పుడు కూడా వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రైవేటు సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. ఘోర ఓటమి తరువాత కూడా అమరావతి విషయంలో మాజీ సీఎం జగన్ వైఖరి మారకపోవడం  వచ్చే ఎన్నికలలో అంటే 2029 ఎన్నికలలో పార్టీకి మరింత నష్టం చేకూర్చడం ఖాయమని పలువురు వైసీపీ నేతలు వాపోతున్నారట.  అన్నిటికీ మించి తాజాగా అసెంబ్లీలో అమరావతిపై చర్చకు వైసీపీ గైర్హాజర్ పట్ల కూడా పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోందంటున్నారు. ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన వైసీపీ నేతలు ఇక ప్రజలకు తాము ముఖం చూపించగలిగే పరిస్థితి లేదని వాపోతున్నారంటున్నారు.  తమ పరిస్థితి అడకత్తెరలో పోక చెక్క మాదిరిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరవమంటే కప్పకు, వద్దంటే పాముకు కోపం అన్న చందంగా.. అమరావతికి అనుకూలంగా మాట్లాడితే అధినేతకు కోపం, వ్యతిరేకంగా ఉంటే ప్రజల నుంచి ఛీత్కారం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ అమరావతిపై వ్యతిరేకత మానుకోకుంటే పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయం వైసీపీయులలో వ్యక్తం అవుతోంది.   మరోవైపు కూటమి ప్రభుత్వం అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తించి, దానికి చట్టబద్ధమైన రక్షణ కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా మద్దతు ఇస్తున్నది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును వచ్చే నెల మొదటి తేదీనే లోక్ సభలో ప్రవేశ పెట్టనున్నట్లు ప్రకటించింది.  ఈ పరిస్థితుల్లో జగన్ తన అమరావతి వ్యతిరేకతను పట్టుకుని వేలాడితే మొదటికే మోసం తప్పదని మెజారిటీ వైసీపీయులు గట్టిగా భావిస్తున్నారు. తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమరావతి విషయంలో జగన్ వైఖరి మారకుంటే రానున్న రోజులలో కృష్ణా, గుంటూరు జిల్లాలో వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక మెజారిటీ వైసీపీయులు అయితే.. ఈ అంశంలో జగన్ వైఖరి మారకుంటే పార్టీలో భారీ చీలిక అనివార్యమని చెబుతున్నారు.  
 అస్సాంలో  యువశక్తి ఉరకలు వేస్తున్నది. అసోం అసెంబ్లీ ఎన్నికలలో నవతరం జోష్ ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికలలో రాజకీయంగా ఆసక్తికరమైన మార్పు స్పష్టంగా కనిసిస్తోంది.  ఎన్నికల బరిలో యువనేతల పెద్ద సంఖ్యలో బరిలోకి దిగుతున్నారు.  దాదాపు అన్ని ప్రధాన పార్టీలూ కూడా అభ్యర్థుల ఎంపికలో యువతకే పెద్ద పీట వేశాయి. అలాగే స్వతంత్ర అభ్యర్థులుగా కూడా పెద్ద సంఖ్యలో  యువత బరిలోకి దిగింది.   అసోంలో ఈ సారి అసెంబ్లీ ఎన్నికలలో పాతిక నుంచి  30 ఏళ్ల లోపు వయసున్న అభ్యర్థులే ప్రజలను ఆకర్షిస్తున్నారు. ప్రచారం నుంచి ప్రతి విషయంలోనూ వారి హవా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యువ నేతలు సోషల్ మీడియా వేదికలను తమ ప్రచార మాధ్యమాలుగా ప్రభావమంతంగా వినియోగించుకుంటున్నారు. అలాగే  క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను చర్చిస్తూ ప్రచారంలో దూసుకు పోతున్నారు. నిరుద్యోగం, విద్యా సౌకర్యాలు, డిజిటల్ విప్లవం వంటి అంశాలే అజెండాగా వీరు ముందుకు సాగుతున్న తీరు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది.  భిన్నమైన ఆలోచనా దృక్పథంతో ఉన్న  యువత, అస్సాం రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడం ఖాయమని అంటున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా యువత ఒక నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నది. జన్ జీ సరికొత్త ఆలోచనలతో నవశకం దిశగా మార్పును ఆహ్వానిస్తున్నది. అదే ఒకవడి అసోం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. ముఖ్యంగా యువత  గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పట్టణ ప్రాంతాల్లో ఐటీ అభివృద్ధి వంటి అంశాలను  బలంగా వినిపిస్తూ అసోం ఎన్నికల ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అసోం ఎన్నికల బరిలో యువత పెద్ద సంఖ్యలో నిలబడటం రానున్న సామాజిక మార్పులకు సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పోతే  అస్సాంలో యువ ఓటర్ల శాతం గణనీయంగా ఉండటం ఎన్నికల బరిలో నిలబడిన యువ అభ్యర్థులకు పెద్ద ప్లస్ గా మారింది.  తొలి సారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారు, సమకాలీన సమస్యలపై  అవగాహన ఉన్న యువత మద్దతుపై జన్ జీ అభ్యర్థులు ధీమాగా ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధాన పార్టీలు కూడా యువతకు అగ్రతాంబూలం ఇచ్చి వారినే పెద్ద సంఖ్యలో అభ్యర్థులుగా బరిలోకి దింపాయి.  ఇది అస్సాం రాజకీయ ముఖచిత్రాన్ని కచ్చితంగా మారుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.  రాజకీయ అనుభవం గల ఉద్ధండులను ఎదిరించి మరీ పెద్ద సంఖ్యలో యువత రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.  
తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి అన్నారు. తెలంగాణ ఉద్యమ కారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై శాసనమండలిలో   విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యమ కారులు ప్రాణాలకు తెగించి పోరాటం చేయకపోతే.. ఇప్పుడు ముఖ్యమంత్రులు, మంత్రులు ఉండేవారా అని  ప్రశ్నించారు. ఎన్నికల వేళ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని  డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై  శాసనమండలి వేదికగా విజయశాంతి తమ సొంత ప్రభుత్వానికి కీలక సూచనలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం   పోరాటం చేసిన ఉద్యమకారులకు.. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లైనా నెరవేర్చకపోవడాన్ని విజయశాంతి ఎత్తి చూపారు.  ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. అమరవీరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతోపాటు.. ఆ కుటుంబాలకు నెలకు పాతిక వేల చొప్పున పింఛన్‌ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసిన ఎమ్మెల్సీ విజయశాంతి.. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీలను నెరవేర్చాలన్నారు. అలాగే.. తెలంగాణ ఉద్యమకారులపై రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులను ఎత్తివేయాలనీ,  ప్రభుత్వ గుర్తింపు కార్డు  ఇస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని నెరవేర్చాలనీ డిమాండ్ చేశారు.  
ఆంధ్రప్రదేశ్ ఏకైక, శాశ్వత రాజధానిగా అమరావతిని శాశ్వతం చేసే దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రాష్ట్ర అసెంబ్లీ  ఇప్పటికే దీనిపై ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టీ కేంద్ర ప్రభుత్వం వైపు మళ్లింది. అమరావతికి కేంద్ర చట్టబద్ధత కల్పించే ప్రక్రియపై ఢిల్లీలోని అధికార వర్గాల్లో కీలక చర్చలు మొదలయ్యాయి. ఈ ప్రక్రియను వేగవంతం చేసి ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఇందుకు ఆమోదముద్ర వేసే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు వచ్చే నెల 1న లోక్ సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉందని మంత్రి నారా లోకేష్ అసెంబ్లీ వేదికగా చెప్పారు. కాగా ఈ అంశంలో కేంద్ర మాజీ మంత్రి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన వంతు సహకారం అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే వెంకయ్యనాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కీలక చర్చలు జరిపారు.   అమరావతికి సంబంధించిన కేంద్ర చట్టంపై వెంకయ్యనాయుడు అమిత్ షాతో చర్చించారు.  ఏపీ రాజధాని అమరావతికి సంబంధించి చట్టబద్ధత కల్పించే విషయంలో వేగంగా కదలాలని ఆయన ఈ సందర్భంగా అమిత్ షాను కోరినట్లు తెలుస్తోంది.  ఇందుకు సానుకూలంగా స్పందించిన అమిత్ షా.. ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఈ అంశానికి సంబంధించిన ఫైళ్లను క్లియర్ చేసిందని చెప్పారని విశ్వసనీయంగా తెలిసింది.   ఈ ప్రతిపాదనపపై కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర తరువాత బిల్లును సభలో ప్రవేశపెడతామని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది.  కేంద్ర స్థాయిలో వెంకయ్య నాయుడికి ఉన్న అనుభవం, సంబంధాలు, పలుకుబడి ఈ ప్రక్రియ మరింత వేగంగా పూర్తికావడానికి ఆయన జోకయం దోహదపడుతుందని పరిశీలకులు అంటున్నారు.  హోం శాఖ ఈ విషయంపై ఇప్పటికే క్లియరెన్స్ ఇచ్చేసిందనీ, ఇక కేబినెట్ ఆమోదమే తరువాయి అనీ అంటున్నారు.  అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు వచ్చే నెల 1న అమరావతికి సంబంధించిన అధికారిక ప్రతిపాదనను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ఢిల్లీ పర్యటనల ఫలితంగానే ఈ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వస్తే  నిధుల సమీకరణ, అంతర్జాతీయ సంస్థల నుంచి పెట్టుబడులు రాక సులభతరం అవుతుంది.  
పుదుచ్చేరిలో  వచ్చే నెల 9న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంటే  పీపుల్స్ పల్స్   సంస్థ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే ఔననే అంటోంది.  30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి వచ్చే నెల 9న జరగనున్న ఎన్నికలలో  ఎన్డీయే 14 నుంచి17 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని పీపుల్స్ పల్స్ సర్వే తేల్చింది. ఇక విపక్ష  ఎస్పీయే 9 నుంచి11,  నటుడు విజయ్ నూతనంగా స్థాపించిన టీవీకే పార్టీ 2 నుంచి4 స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. ఇతరులు ఒకటి నుంచి రెండు స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని సర్వే పేర్కొంది.   9నుంచి 11స్థానాలు కైవసం చేసుకుని ఎన్.ఆర్ కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్లు ఈ సర్వేలో వెల్లడయింది. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ బీజేపీ 5 నుంచి 7, ఎస్పీఏలో భాగస్వాములైన కాంగ్రెస్ 3నుంచి 5, డీఎంకే 6 నుంచి 8 స్థానాలు గెలుపొందే అవకాశాలు ఉన్నాయి.  పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం ఎన్డీయే 34 నుంచి 36 శాతం, ఎస్పీఏ 30- నుంచి 32 శాతం, టీవీకే 16నుంచి 18 శాతం ఒట్లు, ఎన్టీకే 4నుంచి 6 శాతం, వీసీకే 1నుంచి 3 శాతం, ఇతర పార్టీలు, ఇండిపెండెంట్లు కలిసి 2 నుంచి 5 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని పీలుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.   పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ఈ సర్వేను 16-23 మార్చి, 2026 మధ్య పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3 పోలింగ్ స్టేషన్లను ఎంచుకుని, ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి 20-25 శాంపిల్స్ ను సేకరించడం జరిగింది. ఈ సర్వేలో కులం, మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసుల వారిని పరిగణనలోకి తీసుకుని శాస్త్రీయ పద్ధతిలో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వే నివేదికను నిఖిల్ కుమార్ రూపొందించారు. డేటా ఎనాలిసిస్ ను, ఇతర సాంకేతిక సహకారాన్ని అవెల్జెన్స్ సంస్థ అందించింది.  ఎన్నికల షెడ్యూల్ ముందు ప్రతిపక్ష ఎస్పీయే కూటమి పట్ల ప్రజలు కొంత సానుకూలత చూపించినా... ఆ సానుకూలత ప్రస్తుతం కనిపించడం లేదు. టికెట్ల పంపకం తర్వాత ఆరుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కూటమిలో భాగస్వామి అయిన డీఎంకే పార్టీకి కేటాయించిన సీట్లలో నామినేషన్లు దాఖలు చేసి ఉపసంహరించుకోకపోవడంతో ఎస్పీఏకు  తీవ్ర నష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్... డీఎంకే పార్టీల నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం లోపించడంతో పుదుచ్చేరిలో ప్రస్తుత పరిస్థితులు ఎన్డీయేకు సానుకూలంగా మారాయి. ఎన్డీయే కూటమిలోని ప్రధాన పక్షమైన ఎన్.ఆర్ కాంగ్రెస్, బీజేపీ మధ్య సీట్ల పొత్తుల్లో కొంత ప్రతిష్టంభన ఏర్పడినప్పటికీ... దానిని అధిగమించి వారి మధ్య పొత్తు కుదిరింది. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయం ఉండటం సానుకూలంగా మారింది. దీంతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాలు, నగదు  ఎస్పీఏలో కుమ్ములాటలు, సినీ నటుడు విజయ్ పార్టీ, ఓట్ల చీలిక తదితర అంశాల కారణంగా ఎన్డీయేకూ సానుకూలంగా మారుతున్నాయి. ఎన్నికల నాటికి ఎస్పీయేలో అంతర్గత విభేదాలకు తోడు ఎన్డీయే వ్యతిరేక పక్షాలు ఎక్కువ ఓట్లు చీలిస్తే అవి ఎన్డీయేకు అనుకూలంగా మారి 20 సీట్లకు పైగా గెలుపొందినా ఆశ్చర్యపోనవసరం లేదు. 
ALSO ON TELUGUONE N E W S
- థియేటర్లలో దుమ్ములేపిన రాధిక సినిమా ఇక ఓటీటీలో - ‘తాయ్ కిళవి’ డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పటి నుంచంటే? - శివకార్తికేయన్ నిర్మించిన బ్లాక్ బస్టర్ మూవీ  ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకపోయినా కేవలం కథాబలంతో ప్రేక్షకులను మెప్పించి సెన్సేషన్ క్రియేట్ చేసిన లేటెస్ట్ తమిళ చిత్రం ‘తాయ్ కిళవి’ (Thaai Kizhavi). సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ఈ హార్ట్ టచింగ్ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో భారీ వసూళ్లు సాధించిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా బాక్సాఫీస్ ప్రయాణం ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. కేవలం 9 కోట్ల రూపాయల అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘తాయ్ కిళవి’.. ఏకంగా 75 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి కోలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించింది. స్టార్ హీరోలు లేకపోయినా, గ్లామర్ షోకు తావులేకపోయినా ఒక వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టేలా చేసింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థలు సొంతం చేసుకోగా, ఏప్రిల్ 10 నుండి జియో హాట్ స్టార్ (Jio Hotstar) మరియు సింప్లీ సౌత్ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్ కానుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో రాధిక శరత్ కుమార్ నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. 63 ఏళ్ల వయసులో ‘పవునుత్తాయి’ అనే వృద్ధురాలి పాత్ర కోసం ఆమె పడిన శ్రమ అమోఘం. ప్రతిరోజూ దాదాపు ఐదు గంటల పాటు ప్రోస్థటిక్ మేకప్ వేసుకుని ఆ పాత్రలో జీవించేశారు. రాధిక కెరీర్‌లోనే ఇదొక మైలురాయిగా నిలిచిపోతుందని సినీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆమెలోని అసలైన నటిని ఈ సినిమా ఆవిష్కరించింది. తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రానుండటం విశేషం. ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ దీని వెనుక ఉన్న నిర్మాణం. స్టార్ హీరో శివకార్తికేయన్ తన సొంత నిర్మాణ సంస్థపై ఈ సినిమాను నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు. శివకుమార్ మురుగేశన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఒక బామ్మ మరియు మనవడి మధ్య ఉండే అనుబంధాన్ని కామెడీ మరియు ఎమోషన్ కలగలిపి అద్భుతంగా చూపించింది. అందుకే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. సోషల్ మీడియాలో కూడా ఈ సినిమాపై పాజిటివ్ బజ్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఓటీటీలో వైవిధ్యమైన కంటెంట్‌కు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో, ‘తాయ్ కిళవి’ అక్కడ కూడా రికార్డులు సృష్టిస్తుందని ఆశిస్తున్నారు. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన వారు ఏప్రిల్ 10 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి రాధిక శరత్ కుమార్ చేసిన ఈ ప్రయోగానికి డిజిటల్ ఆడియన్స్ ఎలాంటి మార్కులు వేస్తారో చూడాలి. సినిమా సక్సెస్ చూస్తుంటే రాధిక మరిన్ని ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం కనిపిస్తోంది.
1. పెద్ది రిలీజ్ డేట్‌పై గందరగోళం: రామ్ చరణ్ 'పెద్ది' మూవీ రిలీజ్ డేట్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఏప్రిల్ 30 కి వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కి కూడా రావడం కష్టమే అంటున్నారు. రీసెంట్ గా ఒక మూవీ ఈవెంట్ లో నిర్మాత SKN కూడా.. 'పెద్ది' జూన్ 26న విడుదలవుతుందంటూ టంగ్ స్లిప్ అయ్యాడు. అదంతా తూచ్ అంటూ SKN మళ్ళీ వీడియో రిలీజ్ చేసినప్పటికీ.. పెద్ది పోస్ట్ పోన్ న్యూస్ కి మాత్రం బ్రేకులు పడట్లేదు. 2. అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్: ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'AA22' నుంచి ఒక పవర్-ప్యాక్డ్ వీడియో గ్లింప్స్ వస్తుందని ఫ్యాన్స్ ఆశపడ్డారు. కానీ, ప్రస్తుత సమాచారం ప్రకారం.. మూవీ టీమ్ కేవలం టైటిల్ పోస్టర్‌తోనే సరిపెట్టే అవకాశం ఉందట. వీడియో కంటెంట్ కోసం ఫ్యాన్స్ మరికొంత కాలం వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. అయితే బన్నీ బర్త్ డేకి రిలీజ్ చేయబోయే పోస్టర్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సమాచారం. 3. అక్టోబర్ నుంచి దేవర-2: ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోయే ‘దేవర-2’ కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తవగా, ప్రస్తుతం మ్యూజిక్ వర్క్ జరుగుతోందట. తారక్ డేట్స్ కన్ఫర్మ్ కావడంతో అక్టోబర్ మూడో వారం నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు టీమ్ ప్లాన్ చేస్తోంది.  4. ‘వారణాసి’ షూటింగ్ అప్డేట్: మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మహేష్ తన భాగాన్ని సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో పూర్తి చేసే అవకాశం ఉందని సమాచారం. షూటింగ్‌తో పాటు టెక్నికల్ వర్క్ కూడా సమాంతరంగా జరుగుతోంది. కీరవాణి త్వరలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనులు ప్రారంభించనున్నారు. రాజమౌళి పక్కా ప్లానింగ్‌తో ఎలాంటి ఆలస్యం లేకుండా సినిమా పూర్తి చేయాలని చూస్తున్నారు. 5. మాఫియా డాన్‌గా చిరంజీవి: 'వాల్తేరు వీరయ్య' తర్వాత చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న 'Mega 158' ప్రాజెక్టుకు సంబంధించి క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్‌లో చిరంజీవి 'మాఫియా డాన్'గా కనిపిస్తారని, ఆ సమయంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్‌లు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తాయని టాక్ వినిపిస్తోంది. 6. అనుష్క శెట్టి విశ్వరూపం: బాహుబలి తర్వాత అనుష్క శెట్టి మరో భారీ విజువల్ వండర్ 'కథనార్'తో అలరించడానికి సిద్ధమైంది. ఫాంటసీ థ్రిల్లర్ గా రూపొందుతోన్న ఈ మూవీ ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. మాయా ప్రపంచాన్ని చూపిస్తూ ట్రైలర్ అద్భుతంగా సాగింది. 19వ శతాబ్దపు కేరళ నేపథ్యంలో.. దట్టమైన అడవులు, ప్రాచీన ఆలయాల మధ్య సాగే ఈ కథలో విజువల్స్ పీక్ లెవెల్‌లో ఉన్నాయి. ఇక ట్రైలర్‌లో అనుష్క తనదైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో మరోసారి మ్యాజిక్ చేసింది. 7. జయలలిత భవనం సీజ్: హైదరాబాద్‌లో ఉన్న తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలితకు చెందిన భవనాన్ని జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. శ్రీనగర్ కాలనీలో జె.జయలలిత పేరుతో భవనం ఉంది. ఇందుకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలు 2017 నుంచి పేరుకుపోవటంతో.. జయలలితకు సంబంధించిన వ్యక్తులకు అధికారులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో తాజాగా అధికారులు భవనాన్ని సీజ్ చేశారు. 8. సల్మాన్ ఖాన్ సరసన నయనతార: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపొందనున్న క్రేజీ ప్రాజెక్టులోకి లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ 'జవాన్'తో నార్త్ ఆడియన్స్‌ను కూడా మెప్పించిన నయనతార.. సల్మాన్ ఖాన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ ఈ యాక్షన్ డ్రామా 2027 ఈద్ కి ప్రేక్షకుల ముందుకు రానుంది. 9. మణిశర్మ ఎమోషనల్ కామెంట్స్: "అవకాశాల్లేక ఈగలు తోలుకుంటున్నాను" అంటూ సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు. 'చెన్నై లవ్ స్టోరీ' సినిమాలోని 'గురుతుందా' సాంగ్ లాంచ్ సందర్భంగా మణిశర్మ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఈగలు తోలుకుంటున్న తన దగ్గరకు సాయి రాజేష్ వచ్చి, ఈ సినిమాకు మ్యూజిక్ చేయమని అడిగారని మెలోడీ బ్రహ్మ అన్నారు.  10. నాగార్జునకు జోడిగా ఐశ్వర్య రాజేష్: కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక 100వ సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ ను ఎంపిక చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఇదే వీరి కాంబినేషన్ లో మొదటి సినిమా కావడం విశేషం. తమిళ్ డైరెక్టర్ రా.కార్తీక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు 'లాటరీ కింగ్' అనే టైటిల్ ప్రచారంలో ఉంది.  
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ టోవినో థామస్(Tovino Thomas) విలన్ గా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. ఎన్టీఆర్ తో కలిసి టోవినో థామస్ షూటింగ్ లో పాల్గొన్నట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే తాజాగా 'డ్రాగన్' ప్రాజెక్ట్ పై టోవినో షాకింగ్ కామెంట్స్ చేశాడు. టోవినో థామస్ నటించిన 'పళ్లిచట్టంబి' మూవీ ఏప్రిల్ 10న పాన్ ఇండియా భాషల్లో విడుదలవుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా టోవినో థామస్ కు 'డ్రాగన్'కి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. "మీరు డ్రాగన్ సినిమాలో నటిస్తున్నారన్న వార్త నిజమేనా?" అనే ప్రశ్న ఎదురుకాగా.. టోవినో థామస్ ఊహించని సమాధానం ఇచ్చాడు. తాను డ్రాగన్ లో నటించట్లేదని చెప్పాడు. డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమైందని తెలిపాడు. దీంతో డ్రాగన్ లో టొవినో థామస్ నటించట్లేదని క్లారిటీ వచ్చింది.  కాగా, 'డ్రాగన్'లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. బిజూ మీనన్, అనిల్ కపూర్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. https://x.com/Theteluguone/status/2038940576482238693
  -ధురంధర్ 2 టోటల్ కలెక్షన్స్ ఎంత  -ఈ ప్రవాహం ఆగే ప్రసక్తే లేదా! -కర్ణాటకలో సాధించిన అరుదైన రికార్డు ఏంటి    ధురంధర్ 2(Dhurandhar 2)కలెక్షన్స్ దెబ్బకి ఆల్ ఏరియాస్ సాహో ధురంధర్ అని ముక్త కంఠంతో చెప్తున్నాయి. థియేటర్స్ ఓనర్స్ అయితే మా థియేటర్ లోనే ధురంధర్ 2 ఆడుతుందని చాలా గర్వంతో చెప్పుకుంటున్నారు. రెండు వారాలు దాటినా సోమవారం సెకండ్ షో   కూడా హౌస్ ఫుల్ అంటే  గర్వంగా చెప్పుకుంటారు కదా! ఇక ధురంధర్ 2 రీసెంట్ గా కర్ణాటక రాష్ట్రంలో ఒక హిస్టరీని క్రియేట్ చేసింది. కర్ణాటకే కాదు.. అన్ని స్టేట్స్ లోను  దాదాపుగా ఇదే పరిస్థితి. కాకపోతే మొదటి వంతు కర్ణాటక వచ్చింది. మరి ఆ న్యూస్ ఏంటో చూసేద్దాం.  ధురంధర్ 2 కర్ణాటకలో 100 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి చేరిన తొలి హిందీ మూవీగా నిలిచింది. పైగా రెండు వారాలకే ఆ ఘనతని అందుకోవడం రికార్డు అని చెప్పవచ్చు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే కన్నడ సినిమాలు కూడా అంత ఫాస్ట్ గా ఆ స్థాయి కలెక్షన్స్ ని అందుకోలేవు. మరి ఈ లెక్కన లాంగ్ రన్ లో ధురంధర్ 2  కన్నడ నాట ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. also read:  Chiranjeevi: చిరంజీవి సరసన స్వాతి.. వైరల్ అవుతున్న రౌడీ అల్లుడు ఓల్డ్ పేపర్ కటింగ్  ధురంధర్ 2 ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా 1390 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. మరి ఈ వాతావరణ సూచనలు ఎంత వరకు వెళ్లి ఆగుతాయో ప్రతి ఒక్కరు చాలా గట్టిగానే అంచనా వేస్తున్నారు. దీంతో ఎండింగ్ ఫిగర్ పై రోజు తమ కుటుంసభ్యులతో, ఫ్రెండ్స్ తో సినీ వాదన చేస్తు ధురంధరుడిలా ఫీల్ అయ్యే వాళ్ళు కోకోల్లలు. ప్రస్తుతానికి అయితే  కొన్ని భారీ చిత్రాల రికార్డ్స్ ధురంధర్ కి సెల్యూట్ చేస్తు పక్కకి జరిగాయి.  
Mollywood seems ready to step onto a bigger stage with Kathanar: The Wild Sorcerer, an ambitious period fantasy that aims to push the boundaries of Indian cinema. Directed by Rojin Thomas, best known for #Home, the film features Jayasurya in the role of Kadamattathu Kathanar the legendary priest from Kerala whose stories are steeped in myth, magic, and folklore. The recently released trailer, a little over three minutes long, gives a clear sense of the film’s scale. It begins with the historic setting of Kanthalloor Saala and slowly moves into a darker, more atmospheric world set in ancient Venad. As a supernatural threat looms over the land, Kathanar emerges as its protector, setting up a narrative that blends legend with spectacle. Anushka Shetty’s presence adds further weight to the project, marking her Malayalam debut. She plays Kalliyankattu Neeli, a Yakshi whose haunting presence brings both mystery and tension to the story, standing in sharp contrast to Kathanar’s spiritual strength. The film is backed by producer Gokulam Gopalan under the Sree Gokulam Movies banner and is mounted on a scale rarely attempted in Malayalam cinema. The supporting cast includes Prabhu Deva, Sanoop Santhosh, Sandy, Devika Sanjay, Harish Uthaman, Vineeth, Nitish Bharadwaj, Srikanth Murali, and Kulprit Yadav. Rojin Thomas has co-written the screenplay with R. Ramanand, while Neil D’Cunha handles cinematography and Rahul Subrahmanian composes the music. The film makes extensive use of virtual production and VFX, aiming for a visual standard that matches international projects. Production design by Rajeevan adds depth and authenticity to its world. In line with its scale, Kathanar: The Wild Sorcerer is planned for a wide monsoon release and will be dubbed in 15 languages, including Malayalam, English, Tamil, Telugu, Hindi, Bengali, Kannada, Chinese, French, Korean, Italian, Russian, Indonesian, Japanese, and German. With its mix of folklore, scale, and technical ambition, Kathanar is shaping up to be one of the most interesting films to come out of Malayalam cinema in recent years.  
The film “Raakaasaa”, produced by Niharika Konidela in association with Umesh Kumar Bansal under the Pink Elephant Pictures banner and presented by Zee Studios, is directed by Manasa Sharma. Sangeeth Shobhan and Nayan Sarika play the lead roles. The glimpses, teaser, trailer, and songs released so far have impressed audiences. The movie is set to release on April 3. Ahead of the release, a grand pre-release event was held on Monday. Niharika Konidela said, "It gives me immense joy to collaborate with Zee Studios and Divya garu." Earlier, we produced a YouTube series titled Mad House, and it was during that time I first came across Manasa Sharma garu’s writing. I later met her in person; she is someone who speaks very little, yet is constantly immersed in deep thought. She lives and breathes cinema and storytelling 24/7. I strongly believe Manasa garu is destined to reach greater heights. I take great pride in introducing talents like Manasa garu, Mahesh garu, and Yadhu Vamsee garu. When we were making Committee Kurrollu, many questioned why we were working with 11–15 newcomers. During Rakasa, people asked why we were attempting something different instead of sticking to a safe path. Now, with Bhari, they question why we are working with family members. People will always have something to say but I will continue doing what I love. With every project, I learn something new. To me, the Konidela family and the Pink Elephant family are equally important. I am grateful to my parents for trusting me and giving me the freedom to pursue my passion. Mayam Ramesh garu has been a strong support system from the very beginning. Anudeep Dev garu is an exceptionally talented musician. Raju garu’s visuals always receive immense appreciation. Watching Vijay Master on set feels like seeing my own father. Anwar Ali garu goes far beyond his role as an editor, taking on multiple responsibilities. It is because of my father that I have met so many wonderful people Getup Srinu being one of them. He takes great care of me. Nayan Sarika is truly special and a wonderful person. Sangeeth is a rising star, and he deserves a major share of the credit for the success of RaaKaaSaa. We made this film with complete honesty and hard work, giving it our all to deliver a quality entertainer. My dream is that everyone associated with Pink Elephant should own a house, a car, and enjoy life with their families. Rakasa, releasing on April 3rd, is a complete entertainer from start to finish,” she said. Sangeeth Shobhan said, “Last April, Manasa garu, Niharika garu, and I took a picture together and shared it on Instagram." Now, our film is all set to release on April 3rd. From last year itself, we were determined to come before the audience with a truly good film. Once the movie releases, I am confident that everyone will be talking about Raju garu’s visuals and Anudeep garu’s music. It was because of Mahesh garu that I got the opportunity to work on Oka Chinna Family Story. As a director, Mahesh garu is all set to deliver a blockbuster with Itlu Arjuna. We shot a large portion of the film during winter nights, and I sincerely thank every artist who supported us throughout this journey. Nayan Sarika is immensely talented, and it was a pleasure working with her. Getup Srinu garu is a wonderful human being. Niharika Konidela garu is a very sensitive person who is deeply passionate about cinema. I share a great bond with Manasa garu ever since Oka Chinna Family Story. She is someone who wants the audience to do more than just watch the film she wants them to take it home, cherish it, and feel that it has done complete justice to the money they spent. She holds the audience in the highest regard. We are confident that we have made a good film. Rakasa will be worth every single penny the audience spends. It is releasing on April 3rd, and I urge everyone to watch it it will definitely not disappoint. We will continue striving to make meaningful and entertaining cinema. Also, our film Biker, produced by UV Creations and Sharwanand anna, is releasing on the same day. I hope audiences watch both films and make them successful,” he said. Nayan Sarika said, “This is my third project with Niharika’s Pink Elephant Pictures." My journey in cinema began with Hello World, and working with Niharika Konidela's has always brought me good luck. I’m truly happy to be collaborating with her once again on Rakasa. I would like to thank Ramesh garu for taking such great care of all of us. Manasa Sharma has immense clarity and focus when it comes to filmmaking. On set, Getup Srinu garu keeps the atmosphere lively and entertaining at all times. I share a very special rapport with Sangeeth something I haven’t experienced with any other co-actor. I’m confident that everyone will enjoy Rakasa. Please watch our film on April 3rd and support us,” she said. Director Manasa Sharma said, “Niharika garu has truly been our lucky charm.” At Pink Elephant Pictures, directing a series often leads to an opportunity to helm a feature film. After my project Bench Life, I was given the chance to direct Rakasa, and I owe my current position to Niharika garu. Raju garu brings immense passion to his work, and it was a wonderful experience collaborating with Anudeep garu. I would also like to thank Mahesh garu for partnering with me on the writing, and Anwar garu for his constant support throughout the process. It was a joy working with Nayan. I am grateful to Getup Srinu garu, Brahmaji garu, and Tanikella Bharani garu for their encouragement and support during this journey. Sangeeth Shobhan has been a great strength to me. “Our film is all set to release on April 3rd, and I sincerely request everyone to watch it,” she said. Yadhu Vamsee said, “Niharika garu invested a remarkable ₹9 crores in me for Committee Kurrollu. I was truly shocked when I came to know the budget of Rakasa. Niharika garu is her own biggest strength and a true inspiration to many young women. For newcomers and talented individuals, Niharika garu and Pink Elephant Pictures have become a go-to platform. It is because of her belief and support that RaaKaaSaa has reached this level. Music Director Anudeep garu is sure to scale even greater heights in the future. Anwar garu has worked tirelessly, day and night, for this film. Vijay Master is one of the biggest strengths of the movie. Manyam Ramesh always appreciates Raju’s visuals. Sangeeth Shoban has a unique sense of comedic timing, and Nayan Sarika garu looks absolutely stunning on screen. Rakasa, which is releasing on April 3rd, will surely leave audiences thoroughly entertained and laughing,” he said. Getup Srinu said, I request everyone to come together with their families and watch our RaaKaaSaa film. The audience will surely feel that every single penny they spend is truly worth it. Talent can only shine when given the right opportunity, and I would like to thank Niharika garu for consistently encouraging and providing such opportunities to new talent. Manasa garu is a director with great clarity and sensitivity. Anudeep Dev garu is an exceptional music director. It was a pleasure working with Nayan. My journey with Sangeeth began with Oka Chinna Family Story, and I was amazed by his talent. He is an actor who can excel across every emotion and every genre. I request everyone to watch and support Rakasa, releasing on April 3rd,” he said. Music Director Anudeep Dev said, “I would like to thank my entire team for supporting me in delivering the music for Rakasa. All the artists have performed wonderfully in the film. I did not compose music separately just for comedy; everything came together organically, and the humor works naturally. I would like to thank Ramesh garu for constantly pushing us to give our best and keeping us on our toes throughout the process. It was a great experience working with Manasa garu. Sangeeth is a very talented actor. I am grateful to Niharika garu for giving me this opportunity. Rakasa, which releases on April 3rd, is going to be a big hit,” he said.  
-రౌడీ అల్లుడు సృష్టించిన సంచలనం తెలిసిందే -నేటికి చూసే వాళ్ళు ఎంతో మంది  -మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్ ఏంటి  ఆఫీస్ లో పనిచేసి ఇంటికొచ్చి రిలాక్స్ కోసం సోషల్ మీడియాలో తిష్టవేసి సినిమా వార్తలని ఒక్కొక్కటిగా చూస్తున్నాం. సడెన్ గా చిరంజీవి(Chiranjeevi),రాఘవేంద్రరావు(Raghavendrarao)హిట్ మూవీ 'రౌడీ అల్లుడు'(Rowdy Alludu)కి సంబంధించిన పేపర్ కటింగ్ క్లిప్ కనపడింది. పైగా హీరోయిన్ మ్యాటర్ కి సంబంధించి. దీంతో ఏం చేస్తాం, రోజు పోసుకునే నీళ్లు, రోజు తినే అన్నమే కదా అని ఎవరకి చెప్పకుండా గదిలోకి వెళ్లి ఆ న్యూస్ ని ఇండియాకి స్వాతంత్రం తెచ్చిన వాడిలా  ఆనందాన్ని ముఖంలో నింపుకొని పదే పదే చదువుతాం. ఇంతకీ ఆ మెగా వార్త ఏంటో విని మనం కూడా ఆ ఆనందం పొందుదాం. 'రౌడీ అల్లుడు'లో శోభన, దివ్యభారతి హీరోయిన్స్ గా చేసిన విషయం తెలిసిందే. శోభన ని ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేసినప్పుడే మరో హీరోయిన్ గా దివ్య భారతిని అనుకున్నారు. కాకపోతే ఆమె బిజీగా ఉంటే మెగాస్టార్ నుంచి వచ్చే సినిమా మరొకటి లేదు కాబట్టి, మూవీ  లేట్ అయితే ఫ్యాన్స్ ఒప్పుకోరు. కాబట్టి దివ్యభారతి ప్లేస్ లో మరో నాయిక 'స్వాతి'(Swathi)ని సెకండ్ హీరోయిన్ గా  ఫిక్స్ చేసి షూటింగ్ కి వెళ్లాలని 'రౌడీ అల్లుడు' టీం అనుకుంది. సదరు పేపర్ కటింగ్ లో ఈ విషయం మొత్తం స్పష్టంగా ఉంది. దీంతో సదరు వార్తని చూసి ఫ్యాన్స్ తో మూవీ లవర్స్ మురిసిపోతున్నారు. మరి ఈ రోజు రౌడీ అల్లుడు చూడటం పక్కా. ఇక స్వాతి ఎవరో కాదు టాప్ హీరోయిన్ గా తన సత్తా చాటిన టబు(Tabu).   also read:  Hansika: పాతికేళ్ల కుర్ర హీరోతో హన్సిక రొమాన్స్ 1991 అక్టోబర్ 18 న రిలీజైన రౌడీ అల్లుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనివిని ఎరుగని రికార్డ్స్ సృష్టించి రికార్డ్స్ యొక్క గౌరవాన్ని పెంచింది. చివరకి టబు స్థానంలో దివ్య భారతి(Divya Bharathi)నే ఎంపిక చేసారు. ఆమె పోషించిన 'రేఖ' రోల్ చాలా రఫ్ క్యారక్టర్. మాస్ క్యారక్టర్  ఆటో జానీకి జోడి కాబట్టి సదరు క్యారక్టర్ కూడా బబ్లీ లుక్ తో చిన్నపిల్ల అలవాట్లు ఇంకా  పోనీ చిలిపి పిల్లగా ఉండాలి. దివ్య భారతి పేస్ కట్టింగ్స్ అలాగే ఉంటాయి కాబట్టి  మేకర్స్ ఆమె కోసం ఆగడమో,లేదా తనే డేట్స్ ని అడ్జస్ట్ చేయడమో జరిగి ఉంటుంది. ఇక రౌడీ షూటింగ్ సమయంలోనే టబు చేసిన కూలీ నెంబర్ వన్ సినిమా రిలీజ్ అయ్యింది. 1991  జులై 12 రిలీజ్ డేట్. బహుశా ఆ మూవీ షూటింగ్ టైంలో తన పేరు స్వాతి నుంచి టబుగా మారిందేమో.       
  - వెంకటేష్ కామెడీ విశ్వరూపం.. త్రివిక్రమ్ పక్కా ప్లాన్! - 'నువ్వు నాకు నచ్చావు' రేంజ్ మ్యాజిక్ రిపీట్? - 'ఆదర్శ కుటుంబం'పై క్రేజీ అప్‌డేట్! విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ ఇద్దరి పేర్లు వింటేనే తెలుగు ప్రేక్షకులకు ఒక రకమైన ఉత్సాహం వచ్చేస్తుంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'నువ్వు నాకు నచ్చావు', 'మల్లీశ్వరి' వంటి సినిమాలు నేటికీ క్లాసిక్ కామెడీ ఎంటర్టైనర్లుగా నిలిచిపోయాయి. దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఇప్పుడు వీరిద్దరూ 'ఆదర్శ కుటుంబం' అనే సినిమా కోసం మళ్ళీ కలిశారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో త్రివిక్రమ్ ఒక అద్భుతమైన 'వింటేజ్' కామెడీ సీక్వెన్స్‌ను ప్లాన్ చేశారట. దాదాపు 20 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. గతంలో వెంకీ తనదైన కామెడీ టైమింగ్‌తో ఎలాగైతే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారో, మళ్ళీ అదే మ్యాజిక్‌ను రీక్రియేట్ చేసేలా ఈ సీన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సన్నివేశం కోసం త్రివిక్రమ్ తనదైన శైలిలో పదునైన డైలాగులను సిద్ధం చేశారని, థియేటర్లలో ఆడియన్స్ నవ్వులు ఆపుకోవడం కష్టమేనని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వెంకటేష్ సినిమా అంటేనే కుటుంబ ప్రేక్షకులకు మొదటి ఛాయిస్. ముఖ్యంగా సంక్రాంతి లేదా సమ్మర్ రేసులో వెంకీ సినిమాలు ఇచ్చే కిక్కే వేరు. 'ఆదర్శ కుటుంబం' పేరులోనే ఒక ఫ్యామిలీ ఎమోషన్ కనిపిస్తోంది. త్రివిక్రమ్ తన సినిమాల్లో కేవలం కామెడీ మాత్రమే కాకుండా, లోతైన మానవీయ సంబంధాలను కూడా అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఈ మూవీలో కూడా ఒక బలమైన ఫ్యామిలీ డ్రామా ఉంటుందని, దానికి వెంకటేష్ ఎనర్జీ తోడవ్వడం సినిమాకు ప్లస్ పాయింట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, నారా రోహిత్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. వెంకటేష్, రోహిత్ మధ్య వచ్చే గిల్లీకజ్జాలు, వారి మధ్య నడిచే సన్నివేశాలు కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. కథలో కొంత సీరియస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, సినిమా ఆద్యంతం వినోదానికే పెద్దపీట వేసినట్లు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బిజినెస్ క్రేజ్ నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ 'వింటేజ్ కామెడీ సీక్వెన్స్' గురించి చర్చలు మొదలయ్యాయి. "వెంకీ మామ టైమింగ్, త్రివిక్రమ్ పంచ్‌లు పడితే బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే" అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వెంకటేష్ కెరీర్‌లో మళ్ళీ ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రాబోతోందని అంతా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ పనులు వేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మళ్ళీ ఆ పాత రోజులను గుర్తుచేసి విక్టరీ వెంకటేష్‌ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్‌ను చేరుస్తుందో లేదో చూడాలి. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టీజర్ లేదా ఫస్ట్ లుక్ గ్లింప్స్ వచ్చే అవకాశం ఉంది.
The buzz around #SVC63 is soaring, and the project has now taken an even bigger leap forward. What began as a massive announcement yesterday has already positioned itself as one of the most keenly awaited films in Indian cinema. Bringing together Salman Khan, National Award-winning filmmaker Vamshi Paidipally, and leading producer Dil Raju under the prestigious Sri Venkateswara Creations banner, the film has ignited nationwide excitement from the moment it was revealed. Adding further fire to the anticipation, the makers have now officially confirmed that Lady Superstar Nayanthara has joined the film as the leading lady opposite Salman Khan. Fresh off her blockbuster Bollywood debut in Jawan, Nayanthara’s presence elevates the project’s scale and appeal, making this collaboration even more formidable. Director Vamshi Paidipally is well known for presenting his heroines with strong, impactful characterizations. With the female lead playing a crucial role in this narrative, the team has zeroed in on a performer of Nayanthara’s calibre, making the pairing of Salman and Nayanthara a major talking point across the industry. The film, mounted on a grand canvas, is already being hailed as a complete package- one that blends star power, scale, and solid storytelling. Each update from the team only amplifies the momentum, with expectations rising for a high-intensity action drama crafted for big-screen spectacle. Pre-production is currently in full swing, with regular shooting scheduled to begin in April. Slated for a 2027 theatrical release, #SVC63 promises to be one of the most talked-about and eagerly awaited films in the coming years. More exciting updates from the team are on the way.
      -ఈ సారి తనకి కలిసొచ్చేనా  -గ్యారంటీగా లక్కీ హీరో -తన ప్లేట్ మారబోతుందా!  ఎప్పుడో మరుగునపడిపోయిన 'లక్కీ హీరో' అనే వర్డ్ మళ్ళీ వెలుగులోకి వచ్చిందంటే అందుకు పుణ్యం కట్టుకున్న హీరో నస్లేన్(naslen)..ప్రేమలు, ఆలప్పుళ జింఖానా, కొత్త లోక ఛాప్టర్ 1 తదితర వరుస బ్లాక్ బస్టర్స్ నే ఉదాహరణ. మరి ఈ లెక్కన లక్కీ హీరో అనకపోతే సినిమానే అలిగే పరిస్థితి. అందుకే ఆ పరిస్థితి రాకుండానే నెటిజన్స్ తో పాటు, మూవీ లవర్స్ సైతం లక్కీ హీరో అంటు తన తదుపరి సినిమాల అప్ డేట్స్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆసక్తికర న్యూస్ ఒకటి వాళ్లందరిలో జోష్ తెప్పిస్తుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం. బ్యాచిలర్ పార్టీ డీలక్స్( Bachelor Party D'eux).. నస్లేన్ నుంచి సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ కాబోయే మూవీ.  హీరోయిన్ గా సోషల్ మీడియాఇన్ ఫ్లూయెన్సర్ గా ఫుల్ క్రేజ్ ని పొందిన  హన్సిక కృష్ణ(Hansika krishna) చేస్తుంది. హన్సిక ఎవరో కాదు ప్రముఖ మలయాళ నటుడు కృష్ణ కుమార్ కుమార్తె. ఈ మూవీలో నస్లేన్ గర్ల్ ఫ్రెండ్ గా రొమాన్స్ చేయబోతునట్టుగా తెలుస్తుంది. మరి అక్కడుంది నస్లేన్ కాబట్టి ఈ సారి హన్సిక తన పెర్ఫార్మ్ తో సౌత్ సినీ ప్రేమికుల హార్ట్స్ లో తన రూపాన్ని ఉంచుకోవడం ఖాయం. 2019 లో వచ్చిన లూకా అనే మూవీతో హన్సిక కృష్ణ మలయాళ సినీరంగ ప్రవేశం చేసింది. Also read: Balakrishna: బాలయ్య సినిమా రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్! బ్యాచిలర్ పార్టీ డీలక్స్ లో నస్లేన్, హన్సిక తోపాటుగా కున్చాకో బోబన్, టోవినో థామస్, సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భసి, షైన్ టోమ్ చాకో, నదియా మోయిదు, జ్యోతిర్మయి, రజిషా విజయం తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ లో చేస్తున్నారు. అమల్ నీరధ్ దర్శకుడు కాగా 2012 లో రిలీజై విజయదుంధుబి మోగించిన  బ్యాచిలర్ పార్టీ మూవీకి  కొనసాగింపుగా తెరకెక్కుతోంది. నిత్య మీనన్ ప్రధాన క్యారక్టర్ లో కనిపించింది.     
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భార్యాభర్తల బంధం చాలా ప్రత్యేకమైనది. నేటికాలంలో భార్యాభర్తల బంధం పెళుసుగా మారిందని చెప్పవచ్చు.  బార్యాభర్తలు గొడవ పడటం అనేది చాలా కామన్ గా మారింది.  అయితే కొన్నిసార్లు గొడవలు కాస్తా బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా కూడా సాగుతాయి.  చాలామంది భార్యాభర్తలు గొడవలు జరిగిన తర్వాత ఇద్దరి మధ్య దూరం పెరిగిందని చెబుతూ ఉంటారు. కానీ నిజానికి గొడవలే కాదు.. భార్యాభర్తల మధ్య దూరం పెరగడానికి ఇతర కారణాలు కూడా ఉన్నాయి. కొన్ని అలవాట్లు భార్యాభర్తల మధ్య బంధాన్ని విచ్చిన్నం చేస్తాయని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.  బంధాన్ని నాశనం చేసే అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. తప్పులు వెతకడం.. భార్యాభర్తల బందం ముడిపడింది అనగానే పూర్తీగా ఒకరి చేతిలో బంధం కంట్రోల్ లో ఉండాలని అనుకుంటారు కొందరు. మరీ ముఖ్యంగా భర్తలు ఇలా ఎక్కువ చేస్తారు. వారు నిలబడే తీరు, ధరించే దుస్తులు, చేసే పనులు ఇలా.. ప్రతి విషయంలో తప్పులు వెతకడం చేస్తుంటారు. అలా తప్పులు చూపించడం తమ గొప్ప అని వారు అనుకుంటారు. కానీ ఇలా చేయడం వల్ల లైఫ్ పార్ట్నర్ చాలా ఇబ్బంది పడతారు. ఇదే విధంగా ఎక్కువ కాలం సాగితే.. మా ఇద్దరికి సెట్ కావడం లేదు అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇది కాస్తా బంధం పెళుసుబారడానికి దారితీస్తుంది. మౌనం.. భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరైనా సరే.. ఏదైనా తమకు నచ్చని పని జరిగినప్పుడు లేదా తమకు ఏ విషయంలో అయినా అసంతృప్తి ఏర్పడినప్పుడు దాని గురించి మాట్లాడటం కంటే.. మౌనంగా ఉండి భాగస్వామిని సాధిస్తూ ఉంటారు. ఈ పద్ధతి చాలా హానికరమైనది.  భాగస్వామిని పట్టించుకోకుండా  మానసిక హింసకు గురి చేయడం లాంటిది ఇది. ఆరోగ్యకరమైన సంబంధానికి,  మనసు విప్పి ఓపెన్ గా మాట్లాడటం చాలా అవసరం. మౌనంగా ఉండటం వల్ల  భాగస్వామి అభద్రతా భావానికి లోనయ్యే అవకాశం ఎక్కువ, అంతేకాదు.. ఇలాంటి ప్రవర్తన వల్ల బంధంలో దూరం పెరుగుతుంది. పాత  విషయాలు.. గొడవల సమయంలో బార్యాభర్తలలో చాలామంది పాత విషయాలను బయటకు లాగి వాటిని తమకు అనుగుణంగా ఉండేలా చేసుకుంటారు. భాగస్వామి చేసిన తప్పును ఒకసారి క్షమించేశాక.. తరువాత వాదన జరిగిన ప్రతిసారీ ఆ విషయాన్ని తిరిగి ప్రస్తావించకూడదు. ఇలా చేయడం వల్ల  భాగస్వామి నమ్మకం దెబ్బతింటుంది,   ఇంకా పాత విషయాలను మనసులో పెట్టుకున్నారని, బంధంలో అర్థం చేసుకునే తత్వం లేదని అనుకుంటారు. ఆధిపత్యం.. ప్రేమ అంటే  భాగస్వామి ఫోన్‌ను నిరంతరం రహస్యంగా చూడటం, వారు స్నేహితులతో ఎలా ఉంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు గమనించడం, గూఢచర్యం చేసినట్టు బిహేవ్ చేయడం, ఇవన్నీ కాదు.. చాలామంది ఇవన్నీ చేస్తూ ఆధిపత్యం ప్రదర్శిస్తూ దాన్ని ప్రేమ అని అనుకుంటారు. కానీ ఇలా ప్రవర్తిస్తే అది వ్యక్తి స్వేచ్ఛను హరించినట్టే.. ఇలా చేయడం వల్ల ఎదుటి వ్యక్తికి బంధంలో నమ్మకం పోతుంది. పోలిక.. లైఫ్ పార్ట్నర్ ను ఇతరులతో పోల్చడం మంచిది కాదు.  భాగస్వామిని స్నేహితులు, వారి భాగస్వాములు,  అక్క చెళ్లేళ్లు,  అన్నదమ్ములు ఇలా అందరితో  పోల్చడం మంచిది కాదు. ప్రతి వ్యక్తికి బలాలు, బలహీనతలు ఉంటాయి. పోలికల వల్ల  భాగస్వామి బాధపడవచ్చు.  బంధంలో ఎప్పటికీ వ్యక్తిని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలగాలి.అప్పుడే బంధం బాగుంటుంది. లేదంటే బంధం విచ్చిన్నమవుతుంది.                                            *రూపశ్రీ  
వేసవి వచ్చేసింది.. ఈ మండే ఎండల వల్ల ప్రతిఒక్కరూ చాలా ఇబ్బంది పడతారు, వేసవికాలం చాలా ఆరోగ్యపరంగా చాలా   ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన కాలం. మధ్యాహ్నం పూట ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడమే ఒక పెద్ద పనిగా మారుతుంది.  మండే ఎండల్లో బయటకు వెళ్లిరావడం అంటే పెద్ద యుద్దం చేసిన ఫీలింగ్ వస్తుంది. ప్రభుత్వాలు కూడా ప్రజలను జాగ్రత్తగా ఉండమని చెబుతాయి.   ఇంత కఠినమైన వేసవి ఎండలో బయటకు వెళ్తే ప్రతి ఒక్కరు తమకు తాము రక్షణ కల్పించుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.  లేకపోతే  అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. వేసవి ఎండలో ఇంటి నుండి బయటకు వెళ్లే అవసరం వస్తే.. మరీ ముఖ్యంగా మద్యాహ్నం ఎండ ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే.. తప్పకుండా కొన్ని వస్తువులు వెంట తీసుకెళ్లాలని, అది వారికి ఎంతో సహాయపడతాయని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు. ఇంతకూ వేసవి ఎండలో బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసిరిగా వెంట తీసుకెళ్లాల్సిన వస్తువులు ఏంటో.. వారి ఉపయోగం ఎంటో తెలుసుకుంటే.. వాటర్ బాటిల్.. మండుటెండలో  ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే అనేక అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఉంది. బయటకు వెళ్లేటప్పుడు  బ్యాగ్‌లో ఒక వాటర్ బాటిల్  ఉంచుకోవాలి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా ముఖ్యం, లేకపోతే డీహైడ్రేషన్ తీవ్రమై  అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఎక్కువ. సన్ గ్లాసెస్.. వేసవిలో బయటకు వెళ్ళినప్పుడు  బ్యాగ్‌లో సన్ గ్లాసెస్ తప్పకుండా ఉంచుకోవాలి. ఎండ నుండి  కళ్ళను కాపాడుకోవడానికి ఇవి చాలా అవసరం. ఇవి కంటి ఇన్ఫెక్షన్లను నివారించడంలో కూడా సహాయపడతాయి. సన్‌స్క్రీన్ క్రీమ్.. వేసవి ఎండలకు సన్‌స్క్రీన్ క్రీమ్ చాలా ముఖ్యం. సూర్యుని హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్ స్క్రీన్ వెంట ఉంచుకోవాలి. ఒకవేళ  చర్మం పొడిబారడం లేదా గరుకుగా మారడం మొదలైతే వెంటనే సన్ స్క్రీన్  రాసుకోవచ్చు. గొడుగు.. వానలో తప్ప ఎండలో గొడుగు వాడటం తెలియని వారు ఉన్నారు. ఈ మండుటెండలో బ్యాగ్‌లో తప్పకుండా ఒక గొడుగు ఉంచుకోవాలి. ఇది  ఎండ నుండి కాపాడటానికి సహాయపడుతుంది. స్కార్ఫ్ లు.. అమ్మాయిలు బయటకు వెళ్లే ముందు తమ బ్యాగ్‌లో తప్పకుండా స్కార్ఫ్ ఉంచుకోవాలి. ఇది  తీవ్రమైన ఎండ నుండి కాపాడుతుంది, అలాగే ఎండదెబ్బ,  చర్మం నల్లబడటాన్ని కూడా నివారిస్తుంది.                                     *రూపశ్రీ.
వేసవి అంటేనే కూలర్లు,  ఏసీలు గుర్తుకు వస్తాయి.  మధ్య తరగతి కుటుంబాలు కూడా వేసవి వేడి భరించలేక  ఏసీ పెట్టించుకోవడానికి ప్రయత్నం చేస్తాయి. అయితే ఏసీ పెట్టించుకోవడం ఒక ఎత్తైతే.. ఏసీ వినియోగం తర్వాత నెల ఆఖరున వచ్చే విద్యుత్ బిల్లు ఒక ఎత్తు.  చాలా మంది విత్యుద్ బిల్లుకు భయపడి ఏసీ వినియోగించే విషయంలో వెనకడుగు వేస్తారు.  అయితే ఇలాంటి వాటికి సోలార్ ఏసీ ఒక పర్మినెంట్ సొల్యూషన్ ఇస్తుంది. ఇవి హైబ్రిడ్ టెక్నాలజీని ఉపయోగించి పనిచేస్తాయి. పగటిపూట సూర్యరశ్మితో, రాత్రిపూట గ్రిడ్ లేదా బ్యాటరీ బ్యాకప్‌తో నడుస్తాయి. ఇవి ఆర్థికంగా తక్కువ ఖర్చుతో కూడుకున్నవి మాత్రమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడటం ద్వారా పర్యావరణానికి కూడా మేలు చేస్తాయి. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎంత ఏసీకి ఎంత సోలార్ సెటప్ ఉండాలి? 1 టన్ను సోలార్ ఏసీని ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, అది సరిగ్గా పనిచేయడానికి కనీసం 1.5KW (1500 వాట్స్) సామర్థ్యం గల సోలార్ ప్యానెల్ అవసరం అవుతుంది. పగటిపూట సూర్యరశ్మి  తీవ్రంగా ఉన్నప్పుడు, ఏసీ పూర్తిగా సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌తో పనిచేస్తుంది.  ఇది నేరుగా DC పవర్‌పై పనిచేసే మోడళ్లలో మరింత ప్రభావవంతంగా ఉంటుంది, ఎందుకంటే ఇది పవర్ నష్టాన్ని తగ్గించి, మెరుగైన కూలింగ్  పనితీరును అందిస్తుంది. నైట్ బ్యాకప్ సెలక్షన్.. సోలార్ ఏసీ  అతిపెద్ద ప్రయోజనం దాని సౌలభ్యం. అంటే, ఒకవేళ రాత్రిపూట  బ్యాటరీ బ్యాకప్ అయిపోతే,  దానిని విద్యుత్‌తో నడపవచ్చు. ఈ సాంకేతికత రాత్రిపూట కూడా  ఏసీ పనితీరుకు ఎలాంటి సమస్య ఉండదని హామీ ఇస్తుంది.  సులభంగా చెప్పాలంటే,  సౌరశక్తితో పాటు విద్యుత్తుతో కూడా ఏసీని నడపవచ్చు. పైన పేర్కొన్న సోలార్ ఏసీ ని ఆన్లైన్ మార్కెట్లో అయినా, ఆఫ్ లైన్ మార్కెట్ లో అయినా కొనుగోలు చేయవచ్చు. ఇంటి పైకప్పు మీద తగినంత స్థలం ఉంటే.. సోలార్ ఏసీ ఎంపిక చాలా మంచిది.                                         *రూపశ్రీ.
భారతీయులు చాలామంది రాత్రి పడుకునే ముందు పసుపు కలిపిన పాలు తాగుతూ ఉంటారు. ఆయుర్వేదపరంగా పసుపు పాలు ఎంతో ఆరోగ్యకరమైనవి.  పసుపు పాలలో ఉన్న ప్రయోజనాల కారణంగా వీటిని గోల్డెన్ మిల్క్ అని పిలుస్తారు. అంటే.. బంగారం అంత మన్నికైనవని అర్థం.  చాలామంది చలికాలంలో పసుపు పాలు తాగుతారు.  అనారోగ్యాల నివారణకు పసుపు పాలు ప్రసిద్ధి చెందాయి. పసుపు పాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి,  వాపును తగ్గిస్తాయి,  నిద్రను ప్రోత్సహిస్తుంది. అయితే పసుపు పాలు తాగడం  అందరికీ సురక్షితం కాదని అంటున్నారు.  కొంతమందికి పసుపు పాలు తాగడం వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి.  ఇంతకీ పసుపు పాలు తాగడం వల్ల కలిగే నష్టాలేంటి?  పసుపు పాలు ఎవరు తాగకూడదు? తెలుసుకుంటే.. పసుపు పాలు ప్రయోజనాలు.. రోగనిరోధకశక్తి.. పసుపులో లభించే కర్కుమిన్ ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్,  యాంటీ బాక్టీరియల్ పదార్థం. ఇది శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది.   వాతావరణం మారినప్పుడు జలుబు, దగ్గు రాకుండా నివారించడంలో ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా  ఉంటుంది. జలుబు, దగ్గు.. పసుపు పాలు గొంతు నొప్పి, దగ్గు,  జలుబు నుండి ఉపశమనం కలిగిస్తాయి.  దీని వేడి చేసే గుణం శ్లేష్మాన్ని వదులు చేసి, గొంతుకు ఉపశమనం కలిగిస్తుంది. వాపులు.. పసుపులో ఉండే శోథ నిరోధక గుణాలు శరీరంలో వాపు, కీళ్ల నొప్పులు,  కండరాల బిగువును తగ్గించడంలో సహాయపడతాయి. గాయం లేదా వ్యాయామం తర్వాత పసుపు పాలు తీసుకోవడం వల్ల వేగంగా కోలుకుంటారు. పసుపు పాలు ఎవరు తాగకూడదు? జీర్ణసమస్యలు ఉన్నవారు.. తరచుగా గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం లేదా విరేచనాలతో బాధపడుతుంటే, పసుపు పాలు  సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుంది. పసుపు యొక్క వేడి స్వభావం,  పాల యొక్క బరువైన స్వభావం జీర్ణక్రియను ప్రభావితం చేస్తాయి. రక్త సంబంధ వ్యాధుల మందులు.. పసుపు రక్తాన్ని పలుచగా చేయడానికి పనిచేస్తుంది.  ఇప్పటికే రక్తాన్ని పలుచబరిచే మందులు వాడుతున్నట్లయితే, పసుపు పాలు తాగడం వల్ల రక్తస్రావ ప్రమాదం పెరగవచ్చు. మధుమేహ రోగులు.. పసుపు రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించగలదు.  మధుమేహం రోగులు ఇప్పటికే మందులు తీసుకుంటున్నట్లయితే, వాటి ప్రభావం అధికంగా ఉండి, చక్కెర స్థాయి చాలా తక్కువగా పడిపోవచ్చు. మూత్రపిండాలలో రాళ్లు ఉన్న రోగులు.. మూత్రపిండాల్లో రాళ్ల సమస్య ఉన్నవారు పసుపును ఎక్కువగా తీసుకోవడం మానుకోవాలి. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఉంటుంది, ఇది రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతుంది. గర్భిణీ స్త్రీలు.. గర్భధారణ సమయంలో పసుపును అధిక మోతాదులో తీసుకోవడం సురక్షితం కాదు.  దీనివల్ల హార్మోన్ల మార్పులు కలగవచ్చు, కాబట్టి డాక్టర్ సలహా లేకుండా గర్భిణి స్త్రీలు పసుపు పాలు తీసుకోకూడదు.                              *రూపశ్రీ.
గుండె శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయవాలలో ఒకటి. దానిని సరిగ్గా జాగ్రత్తగా చూసుకోకపోతే గుండె జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలామంది తమకు తెలియకుండానే కొన్ని అలవాట్లు అలా కంటిన్యూ చేస్తుంటారు. పైగా అవన్నీ చాలా ఆరోగ్యమైనవే అని అనుకుంటూ ఉంటారు. అయితే  గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి రాత్రిపూట నివారించాల్సిన కొన్ని అలవాట్లు ఇక్కడ ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. రాత్రి భోజనం.. రాత్రిపూట భోజనం గురించి చాలామందికి ఒక నిర్లక్ష్యం ఉంటుంది.  చాలామంది బాగా పుష్టిగా తింటుంటారు.  కానీ రాత్రి బోజనం అతిగా తినడం గుండె ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే రాత్రి బోజనం  అతిగా తినకూడదు. రాత్రి అతిగా తింటే  జీర్ణ సమస్యలు తలెత్తి, రక్త ప్రసరణ,  గుండె పనితీరు ప్రభావితం కావచ్చు. కాఫీ.. కొందరికి గంట గంటకు కాఫీ తాగే అలవాటు ఉంటుంది.  రాత్రి భోజనం చేసిన తర్వాత కూడా కాస్త కాపీ సిప్ చేస్తుంటారు. కానీ కాఫీలో కెఫీన్ ఉంటుంది. ఇది  నిద్రను ప్రభావితం చేస్తుంది. తగినంత నిద్ర లేకపోతే గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. ఫోన్.. రాత్రి పూర్తీగా కళ్లు మూత పడేవరకు పోన్ ను వాడేవారు చాలా మంది ఉంటున్నారు.  అయితే రాత్రి పడుకునే ముందు  ఫోన్‌ను ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి పూట పోన్ ఎక్కువ చూస్తే ప్రశాంతమైన నిద్ర పట్టదు.  పైగా మెదడు, కళ్లు చాలా అలసిపోతాయి.  గుండె ఆరోగ్యాన్ని కూడా  ప్రభావితం చేస్తుంది. చిరుతిళ్లు.. కొంతమందికి రాత్రి భోజనం తర్వాత కూడా కాఫీ తాగే అలవాటు ఉంటే.. మరికొందరికి నిద్రపోయే ముందు చిరుతిండి తినే అలవాటు ఉంటుంది. దీనివల్ల  ఆకలి తగ్గడమే కాకుండా,  నిద్ర కూడా ప్రభావితం అయ్యే ప్రభావం ఉంటుంది. తగినంత నిద్ర లేకపోవడం  గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఒత్తిడి.. నేటి కాలంలో చాలా మంది చేస్తున్న ఫిర్యాదు ఒత్తిడి.  అధిక ఒత్తిడి చాలా ప్రమాదం. అధిక ఒత్తిడి ఉన్నప్పుడు, కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది అధిక రక్తపోటుకు,  గుండె ఆరోగ్యం దెబ్బతినడానికి దారితీయవచ్చు. మద్యం.. రాత్రి పడుకునే ముందు మద్యం సేవించడం చాలామంది మగవారికి అలవాటు.  ఈ అలవాటు వల్ల  రక్తపోటు పెరిగి గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి మద్యం సేవించడాన్ని మానుకోవడం మంచిది.                                  *రూపశ్రీ.
భారతీయ వంటగదిలో వెల్లుల్లి ఒక ముఖ్యమైన పదార్థం. వెల్లుల్లి లేకుండా చాలా కూరలకు ఆ రుచి ఉండదు. కానీ వెల్లుల్లి కేవలం రుచిని పెంచేది మాత్రమే కాదు, చాలా వ్యాధులకు ఔషధం కూడా. ఆయుర్వేదం వెల్లుల్లిని వైద్య చికిత్సలో ఉపయోగిస్తుంది.  వెల్లుల్లి వాసన, ఘాటైన రుచితో ఆహారానికి రెట్టింపు రుచిని ఇస్తుంది.  అయితే  వెల్లుల్లి తినడం కంటే.. వెల్లుల్లి నీటిని తాగడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు.  ఇంతకీ వెల్లుల్లి నీరు ఆరోగ్యానికి  చేసే మలు ఏమిటి? వెల్లుల్లి నీటిని ఎలా తయారు చేసుకోవాలి?  పూర్తీగా తెలుసుకుంటే.. రోగనిరోధక శక్తి.. వెల్లుల్లి నీరు రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే ఒక పానీయం. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇది వైరస్‌లు, బ్యాక్టీరియా మరియు ఫంగస్ వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి బలాన్ని ఇస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు తాగడం గుండె ఆరోగ్యానికి మంచిది. వెల్లుల్లికి రక్తపోటును తగ్గించే సామర్థ్యం ఉంది. ఇది రక్తనాళాలను విస్తరింపజేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. దీనివల్ల గుండెపోటు మరియు పక్షవాతం వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది వెల్లుల్లి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ప్రేగుల నుండి వ్యర్థాలను తొలగించి, జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. అజీర్ణం, గ్యాస్,  మలబద్ధకం వంటి సమస్యలకు ఇది ఒక మంచి ఔషదంగా పనిచేస్తుంది.. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వెల్లుల్లి నీరు తాగితే చాలా మంచిది. బరువు.. వెల్లుల్లి నీరు బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఇది శరీర జీవక్రియను పెంచి కొవ్వును కరిగిస్తుంది. ఆకలిని నియంత్రించడం ద్వారా   పదే పదే ఏదో ఒకటి తినాలని అనిపించే వారికి చాలా చక్కగా సహాయపడుతుంది. అందువల్ల, బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక మంచి డ్రింక్. వ్యాధులు.. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. వెల్లుల్లి నీరు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది,   చర్మం మీద ముడుతలు వంటివి పడకుండా చర్మం యవ్వనంగా ఉండటంలో సహాయపడుతుంది. వెల్లుల్లి నీరు ఎలా తయారు చేసుకోవాలంటే.. రెండు వెల్లుల్లి రెబ్బలను దంచి, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలిపి పరగడుపున తాగాలి. కొన్ని రోజుల్లోనే చాలా మంచి ఫలితాలు ఉంటాయని అంటున్నారు.                                      *రూపశ్రీ.