LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారపగ్గాలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యింది. మరో మూడేళ్లలో మళ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ముందస్తుగానే రాష్ట్రంలో రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రానున్నాయా అన్న రేంజ్ లో  పొలిటికల్ హీట్ ఉంది. రాజకీయ క్షేత్రంలో ముందస్తు ఊహాగానాలు, భవిష్యత్ ఎన్నికల అంచనాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. ఈ నేపథ్యంలో సపోజ్ ఫర్ సపోజ్  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందన్న చర్చ జోరందుకుంది. రానున్న  రాజకీయ సమీకరణాలపై   చర్చోపచర్చలు మొదలయ్యాయి.   తెలుగుదేశం ప్రభుత్వ పనితీరుపై  వైసీపీ విమర్శలతో విరుచుకుపడుతోంది. అయితే.. అదే సమయంలో  వైసీపీ ఈ రెండేళ్లలో ఇసుమంతైనా పుంజుకోలేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రాని, ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం ఆ పార్టీ అసెంబ్లీని బహిష్కరించడంపై జన సామాన్యంలో కూడా అసంతృప్తి వెల్లువెత్తుదోంది. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికలలో విజయం సాధించి మళ్లీ సీఎంను అవుతానంటూ ధీమాగా ప్రకటనలు గుప్పిస్తున్న జగన్ పొలిటికల్ ఫ్యూచర్ పై రాజకీయ పండితులు, పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణలు చేస్తున్నారు.  ప్రస్తుత పాలనలోని కొన్ని అంశాలను తటస్థ వేదికలపై విమర్శించే విశ్లేషకులు సైతం..  రాబోయే ఎన్నికలలో వైపీపీ విజయం సాధించి అధికారంలోకి రావడం సాధ్యమేనా అంటే ఔనని చెప్పలేమంటున్నారు.   వైసీపీకి ఏ మాత్రం సానుకూల పరిస్థితి లేదని, వైసీపీ పుంజుకుని జగన్ మళ్లీ సీఎం అవ్వడం సులువు కాదని ఎలాంటి శషబిషలూ లేకుండా చెబుతున్నారు.  సాధారణంగా  పబ్లిక్ ఒపీనియన్ ను ప్రభావితం చేయడంలో పొలిటికల్ అనలిస్టుల పాత్ర కీలకంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా తటస్థ అనలిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ రకంగా చూసినా తటస్థ విశ్లేషకులు సైతం వైసీపీ తీరుపై పెదవి విరుస్తున్నారు. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణ ఆ పార్టీ చేసుకున్న సెల్ఫ్ గోల్ గా అభివర్ణిస్తున్నారు.   ప్రభుత్వ వైఫల్యాలు లేదా లోపాలను ఎత్తిచూపుతూనే విశ్లేషకులు  వైఎస్సార్సీపీకి అధికారంలోకి వచ్చే అవకాశాలు దాదాపు మృగ్యమన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.  గతంలో  అంటే 2014 నుండి 2019 మధ్యకాలంలో   తెలుగుదేశం   అధికారంలో ఉన్న సమయాన్ని గుర్తుచేసుకుంటే, నాటి రాజకీయ వాతావరణం వైసీపీకి   సానుకూలంగా ఉండేది. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న  వైసీపీ . ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడం, బలమైన మీడియా మద్దతు లభించడం మరియు అప్పటి జాతీయ సమీకరణాలు కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారాయి. ఆ కాలంలో ప్రతిపక్షంలో ఉన్న తీవ్రమైన దూకుడు, ప్రభుత్వ నిర్ణయాలను నిలదీసే నైతిక బలం జగన్ వైపు స్పష్టంగా కనిపించాయి. అంతేకాకుండా, 2014-2019 మధ్యకాలంలో నాటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మేధావులు, రిటైర్డ్ అధికారులు, తటస్థ విశ్లేషకులు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. ఉదాహరణకు, నాటి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా తప్పుపట్టిన పలువురు ప్రముఖులు, ఐఏఎస్ అధికారులు మరియు ఇతర రంగాల ప్రముఖులు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని బహిరంగంగానే  చెప్పారు.   అయితే, 2019 నుండి 2024 వరకు సాగిన ఐదేళ్ల  జగన్ పాలన తరువాత   పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆయన అధికారంలో ఉండా తీసుకున్న  వివాదాస్పద నిర్ణయాలు, పాలనా విధానాలు విధానాల కారణంగా ప్రజా వ్యతిరేకత అధికమైంది. అదే 2024 ఎన్నికలలో ప్రభుత్వ పతనానికి కారణమైంది. అన్నిటికీ మించి మూడు రాజధానులు, బాబాయ్ గొడ్డలి పోటు, మద్యం కుంభకోణం వంటి అంశాలు జగన్ క్రెడిబులిటీని కోలుకోలేనంతగా దెబ్బతీశాయి.   ఆ తరువాత అధికారం కోల్పోయిన తరువాత జగన్ ఎక్కువగా బెంగళూరు ప్యాలెస్ కే పరిమితం కావడం, వారానికోసారి చుట్టపు చూపుగా రాష్ట్రానికి వచ్చినా తాడేపల్లి ప్యాలెస్ లో మీడియా సమావేశాలతో సరిపెట్టేయడం వంటివి పార్టీ శ్రేణులలో నిరుత్సాహానికి కారణమయ్యాయి. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకలాపాలు నామమాత్రమయ్యాయి.  అన్నిటికీ మించి అధికారం కోల్పోయిన తర్వాత తిరిగి పుంజుకోవడానికి కావలసిన రాజకీయ వ్యూహాలు, ప్రజా విశ్వాసాన్ని చూరగొనే ప్రయత్నాలు జగన్ నుంచి కానీ, వైసీపీ నుంచి కానీ జరగలేదు. దీంతో పార్టీ ఇమేజ్ రోజురోజుకూ మసకబారుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ విధానాలను విమర్శించే మేధావులు కూడా వైసీపీకి అనుకూలంగా మాట్లాడలేని పరిస్థితి నెలకొంది.    Can Jagan Become CM Again, AP politics, YS Jagan Mohan Reddy, YCPs Future, AP elections, Telugu One
తెలంగాణ కాంగ్రెస్ లో  ఇటీవలి కాలంలో పెను సంచలనం సృష్టించిన కొండా సురేఖ ఎపిసోడ్ కు లాజికల్ కంక్లూజన్ దిశగా కాంగ్రెస్ హైకమాండ్ అడుగులు వేస్తున్నది.  పార్టీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వ్యవహరించారనే ఆరోపణలపై కొండా సురేఖపై చర్యలకు సిఫారసు చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నివేదిక సమర్పించిన సంగతి తెలిసిందే. దీంతో కొండా సురేఖపై వేటు తప్పదనీ, ఆమెకు క్యాబినెట్ నుంచి ఉద్వాసన తప్పదన్న ప్రచారం జోరుగా సాధింది. ఒక దశలో రేవంత్ కేబినెట్ లోకి సురేఖ స్థానంలో మరో ఫైర్ బ్రాండ్ నాయకురాలు విజయశాంతిని తీసుకోనున్నట్లు కూడా వార్తలు వినిపించాయి.  అయితే రక్షాబంధన్ రోజున కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డి అప్పాయింట్ మెంట్ తీసుకుని మరీ ఆయనతో భేటీ అవ్వడం, రాఖీ కట్టడం తెలిసిందే. ఆ తరువాత రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించిన ఆమె.. తన కుమార్తె  వ్యాఖ్యలతో తనకు ఎటువంటి సంబంధం లేదని క్లియర్ కట్ గా, క్లారిటీ ఇచ్చారు. ఈనేపథ్యంలోనే కొండా సురేఖపై వేటు విషయంలో పార్టీ హైకమాండ్ వైఖరి మారిందని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిస్తున్నది.    పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు ఆమెపై చర్య తీసుకోవడం ఖాయమే అని చెబుతూనే.. త్వరలో రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమెకు ఉద్వాసన చెప్పడం కాకుండా.. రాజీనామా కోరాలని హైకమాండ్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి కొత్తవారికి అవకాశం   పేరుతో కొండా సురేఖను రాజీనామా చేయాల్సిందిగా సూచించేందుకే హైకమాండ్ భావిస్తోందంటున్నారు. ఏది ఏమైనా రానున్న రెండు రోజుల్లో  ఈ విషయంపై క్లారిటీ వస్తుందని అంటున్నారు.   [Congress High Command Softcorner on Konda Surekha, Telangana Congress, CM Revanth, Cabinet Expanssion, Telugu One] 
వైసీపీ అధినేత జగన్.. తన వ్యాఖ్యలతో పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించేందుకు బొత్స రంగంలోకి దిగారు. నష్ట నివారణ కోసం ఆయన జగన్ వ్యాఖ్యలకు కొత్త భాష్యం చెప్పారు.  స్థానిక ఎన్నికలలో ఏకగ్రీవాలు ఉండడానికి వీల్లేదన్న జగన్ ఆదేశాలకు భిన్నంగా, బొత్స సత్యనారాయణ స్థానిక ఎన్నికలలో  ఏకగ్రీవాలు రెండు రకాలుగా ఉంటాయంటూ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.  వాటిలో ఒకటి.. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం వాటిని ప్రోత్సహించడం. మరొకటి, రాజకీయ ప్రయోజనాల కోసం అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలను నిర్వహించడమంటూ బొత్స చెప్పిన భాష్యంపై నెటిజనులు ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పిస్తున్నారు. ఇక వైసీపీ వర్గాలైతే.. అసలు బొత్స చెప్పిందేంటో అర్ధం కాక తలలు పగలకొట్టుకుంటున్నారు. ఇంతకీ బొత్స చెప్పినదేంటంటే.. జగన్ ఆదేశించినంత మాత్రాన ఏకగ్రీవాలు జరగకుండా పోవని, అంటే పార్టీ అధినేత మాటను ఆయన ఖండిచారన్న మాట.  ప్రభుత్వ మద్దతుతో జరిగే ఏకగ్రీవ ఎన్నికలు ఉంటాయన్న ఆయన రాజకీయ పార్టీ కోణంలో ఏకగ్రీవాలు ఉండకూడదని జగన్ అన్నారంటూ బొత్స  వివరణపై వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.   ఏకగ్రీవ ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల ప్రతినిధులకు తదుపరి ఎన్నికల్లో పార్టీ టిక్కెట్లు దక్కవంటూ జగన్ చేసిన హెచ్చరిక నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  అలాగే.. తాజాగా వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిపై కూడా బొత్స విరుచుకుపడ్డారు. విజయసాయిని ఆయన మరో కేఏపాల్ గా అభివర్ణించారు. విజయసాయి.. నోటికి వచ్చినట్లు మాట్లాడతారనీ, ఆయన మాటలకు ఇసుమంతైనా విలువ ఉండదని బొత్స అన్నారు.   అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయవచ్చన్న స్పీకర్ హెచ్చరికపై.. తనదైన శైలిలో సవాల్ విసిరారు... నిజంగా స్పీకర్ కు ఆ అధికారం ఉంటే రద్దు చేసుకోవచ్చన్నారు. సభ్యత్వాలు రద్దు చేస్తే.. వైసీపీ రాజ్యాంగ బద్ధంగా పోరాడుతుందన్నారు.   [Botsa New Interpretation on  Jagan Comments, Botsa, YS Jagan Mohan Reddy, YCP Unanimous Elections, Localbodies,   AP Politics, Telugu One]
  బహదూర్‌పురా నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్‌ను రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) నియమించింది. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ తరఫున సంస్థాగత కార్యక్రమాలను పర్యవేక్షించడంతో పాటు, పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో ప్రాతినిధ్యం వహించే బాధ్యతలను మహ్మద్ ముబీన్ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన AIMIM పార్టీ పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు మహ్మద్ ముబీన్‌తో సమన్వయం చేసుకుంటూ పార్టీ సంస్థాగత కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలని పార్టీ సూచించింది. నియోజకవర్గంలోని పార్టీ కార్యక్రమాలు, సమావేశాలు, ఇతర సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి ఆయనతో సంప్రదింపులు జరపాలని పేర్కొంది. ముబీన్‌కు అప్పగించిన కొత్త బాధ్యతలతో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలను మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టే అవకాశం ఉంది.   MLA Mohammed Mubeen, Rajendranagar  MIM in-charge, AIMIM, Asaduddin Owaisi,  MLC Rahmat Beg, Telugu news, Telugu one 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి అత్యంత బలమైన అనుకూల ప్రాంతంగా ఉంటూ వచ్చిన రాయలసీమలో 2024 ఎన్నికలలో ఆ పార్టీ దెబ్బతింది.  ముఖ్యంగా వైసీపీకి కొండంత అండగా నిలుస్తూ, ఆ పార్టీకి పెట్టని కోట లాంటి కడన జిల్లాలో కూడా వైసీపీ వెనుక బడింది. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని  మొత్తం పది అసెంబ్లీ స్ధానాలలో ఏడింటిని తెలుగుదేశం కూటమి కైవశం చసుకుంది.  ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ వైపీనీ కడప లోక్ సభ నియోజకవర్గాన్ని నిలబెట్టుకోగలిగింది.  అయితే ఇండియా టుడే ,  సి-వోటర్ సంయుక్తంగా నిర్వహించిన తాజా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఫలితాలు కడప లోక్ సభ స్థానానికి జగన్, ఆయన పార్టీ తిలోదకాలొదిలేయడం ఖాయమని పేర్కొంది.  ఏపీలో ఇప్పుడు గనక  ఎన్నికలు జరిగితే వైసీపీ  కడప పార్లమెంట్ స్థానంలో సైతం పరాజయం పాలౌతుందని సర్వే పేర్కొంది.  ఇండియా టుడే-సి ఓటర్ సర్వే అంచనాల ప్రకారం.. మొత్తం 25 లోక్‌సభ స్థానాలు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి  20 పార్లమెంట్ స్థానాలను దక్కించుకుంటుంది. ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న 4 ఎంపీ స్థానాల సంఖ్య మరో స్థానం పెరిగి 5 కి చేరుకునే అవకాశం ఉందదని సర్వే పేర్కొన్నప్పటికీ, వైసీపీ కంచుకోట అయిన కడపలో ఓటమి మూటకట్టుకోవడం ఖాయమని ఇండియాటుడే సర్వే పేర్కింది,   {India Today survey, Kadapa MP seat, YCP Kadapa Lok Sabha, India Today C Voter AP survey, TDP AP Lok Sabha seats,  AP politics news, Telugu One}
ALSO ON TELUGUONE N E W S
సాంకేతిక పరిజ్ఞానం రోజురోజుకూ ఎదుగుతున్నప్పటికీ, దాని వల్ల సెలబ్రిటీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పేరుతో కొందరు చేస్తున్న అకృత్యాలు సినీ పరిశ్రమలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా 'అర్జున్ రెడ్డి' సినిమాతో టాలీవుడ్‌లో సరికొత్త క్రేజ్ సొంతం చేసుకున్న కథానాయిక షాలిని పాండే కూడా ఈ డీప్‌ఫేక్ సంస్కృతికి బాధితురాలిగా మారారు. ఆన్‌లైన్ లో తన రూపంతో వైరల్ అవుతున్న ఒక ఫేక్ ఏఐ వీడియోపై షాలిని పాండే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఆ వీడియో పూర్తిగా కల్పితమని, అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు. ఆధునిక సాంకేతికతను ఈ విధంగా మహిళలను, సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని దుర్వినియోగం చేయడం తీవ్రంగా కలచివేస్తోందని ఆమె తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలు తీవ్రమైన వేధింపుల కిందకే వస్తాయని, సాంకేతికతను దుర్వినియోగం చేసే అలవాటు సమాజంలో సాధారణ విషయంగా మారకూడదని షాలిని ఘాటుగా హెచ్చరించారు. తన పేరుతో ప్రచారంలో ఉన్న సదరు వీడియోను ఎవరూ డౌన్‌లోడ్ చేయవద్దని, ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దని ఆమె అభిమానులకు, నెటిజన్లకు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఆ వీడియోను సోషల్ మీడియాలో చూస్తే వెంటనే రిపోర్ట్ చేయాలని, ఆ వీడియోకు మరింత ప్రాచుర్యం కల్పించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని కోరారు. ఇంటర్నెట్ వాడుకరులు ప్రవర్తించే విధానమే ఇలాంటి అనైతిక చర్యలను అరికట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తన ప్రకటనలో గుర్తుచేశారు. https://www.instagram.com/p/DcsvwcTPkwK/ టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన 'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఘన విజయం అందుకున్న షాలిని పాండే, ఆ తర్వాత 'మహానటి', '118' వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆపై బాలీవుడ్ పై దృష్టి సారించిన ఈ భామ 'జయేశ్‌భాయ్ జోర్దార్', 'మహారాజ్' వంటి ప్రముఖ ప్రాజెక్ట్‌లతో హిందీ ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు. ఇటీవలి కాలంలో రష్మిక మందన్న, ఆలియా భట్, మృణాల్ ఠాకూర్ వంటి పలువురు నటీమణులు కూడా ఇలాంటి డీప్‌ఫేక్, ఏఐ టెక్నాలజీ దుర్వినియోగం వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు షాలిని పాండేకి ఎదురైన ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పలువురు నెటిజన్లు, అభిమానులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి సైబర్ నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్నాలజీ నిపుణులు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. తన కొత్త ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న షాలిని, ఈ సమస్యపై ధైర్యంగా స్పందించి అవగాహన కల్పించడాన్ని పలువురు అభినందిస్తున్నారు.     [Shalini Pandey, Shalini Pandey Fake AI Video, Deepfake Abuse, Arjun Reddy Heroine, Entertainment News Telugu]
  ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకొని ఉంటే గాని హీరోగా ఫుల్ పాపులారిటీ సంపాదించడనే నానుడి సినీ ప్రేమికుల్లో ఉంది. అందుకు రాకింగ్ స్టార్ యష్ ఒక ఉదాహరణ. ప్రెజెంట్ టాక్సిక్ తో హల్ చల్ చేస్తున్నాడు. కానీ నెగిటివ్ టాక్ రావడంతో చాలా థియేటర్స్ ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి.   ఆ ఇందులో ఏముంది, హిట్టు, ప్లాపు కామన్ అని అనుకోవచ్చు. కానీ ఒక వర్గం ప్రజలు, ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ సోషల్ మీడియా వేదికగా యష్ పై విమర్శలు చేస్తున్నారు.  వాళ్ళు మాట్లాడుతు సినిమా అనేది అందరు కలిసి చూసేలా ఉంటేనే విజయం సాధించడంతో పాటు నిర్మాతలకి కనకవర్షాన్ని కురిపిస్తుంది. కానీ టాక్సిక్ ఒక తండ్రి, కూతురు, అన్నా చెల్లెల్లు కలిసి చూడలేని విధంగా అర్ధం పర్థం లేని హై లెవెల్ రొమాన్స్ సీన్స్ తో నింపేశారు. పవిత్రమైన ప్రేమని నింపుకునే ప్రేమికులు కూడా ఆ సన్నివేశాలని చూడలేరు. శృంగారం అనేది పవిత్రమైన భావనతో కూడిన కడలి లాంటిదనే విషయాన్నీ మర్చిపోవడం దౌర్బాగ్యం. సెన్సార్ వాళ్ళు' A ' సర్టిఫికెట్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా అసలు ఇలాంటి సినిమాలు ముందు ముందు రాకుండా  చూడాలని వాళ్లంతా సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.      Also Read: కలెక్షన్స్ సునామీ: 17 రోజులకి ఎంతంటే!  సినిమాని సినిమాగానే  చూడాలని టాక్సిక్ ని సమర్ధించే వాళ్ళు కూడా లేకపోలేదు. ప్రస్తుతం టాక్సిక్ వరల్డ్ వైడ్ గా 285 కోట్ల గ్రాస్ మార్క్ దగ్గర ఉందనే మాటలు ట్రేడ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి .   [Toxic, Yash, Kaira Adwani, Tara Sutariya, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]      
Shiva Kumar Kasaram and Swetha Lakshman starrer Sahaa is heading for its theatrical release with positive censor reports. Directed by Nishanth Doti and produced by Tejeswar Velpucharla, the romantic drama has completed its censor formalities with a U/A 13+ certificate and zero cuts. The film has a runtime of 2 hours and 28 minutes and is slated to release on September 4. As per the reports, Sahaa keeps things light and entertaining in the first half with a breezy love story, humour and strong nostalgic elements. Shiva Kumar and Swetha Lakshman are said to be the major strengths of the film, with their performances helping the youthful romantic portions connect well with the audience. The film reportedly takes a significant turn after the interval, moving away from its lighter mood and developing into an intense emotional drama. The final 40 minutes are said to be the major highlight, with the screenplay exploring deeper relationships and pushing the lead actors into emotionally demanding situations. Music director Sekhar Chandra is another major asset according to the censor feedback. His background score is said to elevate the emotional portions and strengthen the impact of Nishanth Doti’s screenplay. With romance, nostalgia and an emotionally charged second half forming the core of the film, Sahaa is now gearing up to offer its complete theatrical experience.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
సామజవరగమన, సింగిల్ వంటి ఎంటర్‌టైనర్స్ తో యూత్ కి చేరువైన శ్రీ విష్ణు.. విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను అలరించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం 'కామ్రేడ్ కళ్యాణ్'తో పాటు, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ లో ఒక చేస్తున్నారు.  సితార బ్యానర్ లో ప్రొడక్షన్ నం.39 గా ఇది తెరకెక్కుతోంది. నేటి యువత జీవితంలో ఎదురయ్యే అనుభవాలు, భావోద్వేగాలు, కలలు, ఆశలు, ఆకాంక్షలు, సవాళ్లను ప్రతిబింబించే కథతో ఈ చిత్రం రూపొందుతోంది. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే సన్నివేశాలు, అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఓ సరికొత్త ప్రయాణాన్ని ఈ సినిమా ఆవిష్కరించనుంది. ఈ సినిమా ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మేకర్స్ తాజాగా ఓ గ్లింప్స్‌ను విడుదల చేశారు. యువత జీవితానికి దగ్గరగా ఉండే అంశాలతో రూపొందుతున్న ఈ గ్లింప్స్ సినిమాపై ఆసక్తిని పెంచడంతో పాటు, కథ ఎలా ఉండబోతుందనే విషయంపై మరింత క్యూరియాసిటీని కలిగిస్తోంది. సహజమైన భావోద్వేగాలతో కూడిన ఈ కథ ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భాన్ని గుర్తు చేసేలా ఉండబోతోంది. "చిన్నప్పుడు స్కూల్లో మనం చాలా కలలు కంటాం.. అది అయిపోవాలి, ఇది అయిపోవాలి అని. ఆ తర్వాత మన నాన్న స్థోమత మేరకు ఒక మామూలు కాలేజ్ లో చదువుకుంటాం. పెద్దయ్యాక కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగం చేయడం మొదలుపెడతాం. నచ్చినా నచ్చకపోయినా చేస్తూనే ఉంటాం. కానీ, ఈ ప్రయాణంలో మనం ఏమవ్వాలనేది మర్చిపోతాం. ఇది మన అందరి కథ" అంటూ వాయిస్ ఓవర్ తో సాగిన గ్లింప్స్‌ ఆకట్టుకుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. హారికా సూర్యదేవర నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. నాగ వంశీ సమర్పిస్తున్నారు. సన్నీ సంజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. యువతకు కనెక్ట్ అయ్యే కథాంశం, సహజమైన భావోద్వేగాలు, ఆహ్లాదకరమైన కథనంతో తెరకెక్కుతున్న ప్రొడక్షన్ నం.39 ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునేలా “ఇది మన అందరి కథ” అనే భావనను అందించనుంది.       [Sree Vishnu, Sithara Entertainments, Production No 39 Glimpse, Naga Vamsi, Telugu Film News, Telugu News]  
  కరుప్పు( వీరభద్రుడు) ఇచ్చిన 'జోష్' తో సూర్య ఈ నెల 14 న 'విశ్వనాథ్ అండ్ సన్స్'  తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.  సూర్యతో పాటు హీరోయిన్ మమితా భైజు పెర్ ఫార్మెన్స్, వెంకీ అట్లూరి దర్శకత్వ ప్రతిభ, సితార 'నాగవంశీ' నిర్మాణ విలువలు  'విశ్వనాథ్ అండ్ సన్స్ ని హిట్ తీరాలకి చేర్చింది.  తాజాగా ఈ సినిమా 17 రోజులు పూర్తి చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ క్లబ్‌లో అధికారికంగా అడుగుపెట్టింది. 17వ రోజున తమిళ వెర్షన్  1.35 కోట్ల నెట్ రాబట్టగా, తెలుగు వెర్షన్ సైతం 1.20 కోట్ల నెట్ వసూళ్లని రాబట్టడం గమనార్హం. దీంతో సూర్యకి  ఉన్న తెలుగు మార్కెట్ స్టామినా పవర్ ఎంతో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాలోనే   కాకుండా ఓవర్సీస్ లోను  హవా కంటిన్యూ అవుతుంది. 17వ రోజున విదేశాల్లో దాదాపు .50 లక్షల గ్రాస్ రాబట్టడంతో, మొత్తం ఓవర్సీస్ గ్రాస్ వసూళ్లు  63.20 కోట్లకు చేరుకున్నాయి. ఈ విధంగా ఇండియా గ్రాస్  134.30 కోట్లతో వరల్డ్ వైడ్ గా  200 కోట్లు దాటింది. విడుదలైన మూడో వారంలోకి అడుగుపెట్టినప్పటికీ థియేటర్లలో ఆక్యుపెన్సీ 25% కంటే ఎక్కువగా ఉండటం విశేషం. ఈ లెక్కన లాంగ్ రన్‌లో విశ్వనాథ్ అండ్ సన్స్ మరిన్ని కొత్త రికార్డులని తిరగరాస్తుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తు వస్తున్నారు. Also read: మాజీ బిఆర్ఎస్ ఎంపీ: చిరంజీవి చేతుల మీదుగా 'సీడ్ గణేశ’ప్రచారానికి శ్రీకారం!       [ Viswanath And Sons, 17 Days Collections, Suriya, Mamitha Bhaiju, TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]  
Nivin Pauly, Mamitha Baiju’s Bethlehem Kudumba Unit directed by Girish AD, is showing no signs of slowing down. The Malayalam family entertainer has crossed the Rs.202 crore gross mark worldwide in 11 days, with the film putting up another strong performance on its second Monday. The latest numbers underline just how extraordinary its hold throughout Onam holidays. The film had already emerged as Nivin Pauly’s biggest grosser in Kerala by the end of its second weekend. According to trackers, Bethlehem Kudumba Unit had collected Rs.78.45 crore gross in Kerala in 10 days, including a sensational ₹28.70 crore from its second weekend. It also managed to collect over Rs.9 crore on four consecutive days, a clear indication that the film is being driven by sustained audience demand rather than an opening-week spike. Now, with its second Monday showing another major hold and advance bookings remaining exceptionally strong, the film is heading rapidly towards the ₹100 crore Kerala gross milestone. The bigger discussion has already begun in trade circles: can Bethlehem Kudumba Unit go beyond that landmark and challenge the existing Kerala box-office benchmark set by Vaazha 2? Vaazha 2 finished with around ₹127.68 crore from Kerala, making it the current benchmark for an all-time Kerala grosser. That possibility will largely depend on how the film performs through the coming weekdays. The encouraging sign is that Bethlehem Kudumba Unit has maintained unusually high occupancies well into its second week. Trackers predict that the film appears headed for a long run, with its next major test expected to come from Dulquer Salmaan’s I’m Game. I’m Game is scheduled to arrive on September 3, with a wider simultaneous release in Malayalam, Tamil, Telugu, Hindi and Kannada. That will inevitably put pressure on Bethlehem Kudumba Unit in terms of screens and shows, but the Nivin Pauly starrer has already built enough momentum to enter its third week with considerable strength. The movie Telugu and Tamil versions are simultaneously releasing on 4th September, those versions can add to All-India gross of the film.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
టాలీవుడ్‌లో మరో లవ్ స్టోరీ అఫీషియల్‌ అయింది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వార్త నిజమేనని తేలిపోయింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి తనయుడు, సింగర్ కమ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, 'బలగం' ఫేమ్ నటి కావ్య కళ్యాణ్‌రామ్ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందంటూ ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి. తాజాగా కాలభైరవ షేర్ చేసిన ఒక బ్యూటిఫుల్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌తో వీళ్లిద్దరి రిలేషన్‌షిప్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోయింది. కావ్యతో దిగిన క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ, గుండెల్లోని భావాలన్నింటినీ ఒక పోయెటిక్ అండ్ మెలోడియస్ నోట్‌లా రాసుకొచ్చారు కాలభైరవ . "కావ్య బాబు.. నీతో గడిపే ప్రతి క్షణం పర్వతాల మధ్య కూర్చుని ప్రశాంతమైన నీటి ప్రవాహాన్ని  చూస్తున్నట్లు ఉంటుంది" అంటూ ఎంతో రోమాంటిక్‌గా తన ప్రేమను వ్యక్తం చేశారు. అంతేకాదు.. నీతో కలిసి ఏ పని చేసినా అదొక ముగింపు లేని సుదీర్ఘమైన వెకేషన్‌లా అనిపిస్తుందని, చలికాలంలో పొద్దున్నే తాగే హాట్ కాఫీలా నీతో సంభాషణలు హాయినిస్తాయని చెప్పారు. "నాలో కలుగుతున్న ఈ మధురానుభూతికి ఇన్నాళ్లూ పేరు పెట్టలేకపోయాను.. కానీ మన ప్రయాణంలో నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే.. ఇది 'సొంత ఇల్లు' అనే భావన. నిన్ను మొదటిసారి కలిసినప్పుడు ఒక కొత్త వ్యక్తిని కలిసినట్లు అనిపించలేదు, సొంత ఇంటికి తిరిగొచ్చినట్లే అనిపించింది. ఇక ఆ ఇంటిని వదిలి నేనెప్పుడూ బయటకు వెళ్లలేదు" అంటూ కాలభైరవ రాసిన ఆ పదాలు నెటిజన్ల హృదయాలను పిండేస్తున్నాయి. ఎం.ఎం. కీరవాణి వారసుడిగా టాలీవుడ్‌లో సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాలభైరవ.. అటు 'గంగోత్రి'లో బాలనటిగా నటించి, ఆ తర్వాత 'మసూద', 'బలగం' సినిమాలతో హీరోయిన్‌గా మెప్పించిన కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఏడడుగులు వేయబోతుండటం విశేషం. వీళ్ల జంట నిజంగానే ఎంతో చూడముచ్చటగా ఉందంటూ సినీ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. https://www.instagram.com/p/DcsymQIgbQN/       [Kaala Bhairava, Kaavya Kalyanram, Relationship, Love Story, Wedding, MM Keeravani, Telugu Film News, Telugu News]  
      వినాయక చవితి(సెప్టెంబర్ 14 ) మరికొన్ని రోజుల్లో రాబోతున్న విషయం తెలిసిందే . దీంతో తెలుగు రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం లాగానే పండుగ వాతావరణం స్టార్ట్ అయ్యింది. రెండు రోజుల నుంచే  లారీల్లో, ఆటోల్లో అయితే లంబోదరుడి విగ్రహాలు తన నివాస స్థలానికి బయలుదేరుతున్నాయి. అయితే, ఈ వేడుకల వెనుక పర్యావరణానికి జరుగుతున్న తీవ్ర విఘాతం గురించి మనం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్  విగ్రహాల విపరీతమైన వాడకం వల్ల మన నీటి వనరులు కలుషితమై జలచరాల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ విషయాన్ని గమనించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు, బిఆర్ఎస్ మాజీ ఎంపీ, కె సి ఆర్ తోడల్లుడు కొడుకు జే సంతోష్ కుమార్ పర్యావరణ హితమైన వినాయక చవితి వేడుకల కోసం ‘సీడ్ గణేశ’ (విత్తన గణపతి) ప్రచారాన్ని రూపొందించారు. ఈ బృహత్తర కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి తన హైదరాబాద్ నివాసంలో శ్రీకారం చుట్టి పర్యావరణ పరిరక్షణపై పిలుపునిచ్చారు.  ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతు కెమికల్స్ తో కూడిన విగ్రహాలని నిమజ్జనం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు పర్యవరణం తీవ్రంగా దెబ్బతింటుంది. దీంతో నా మిత్రుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ఆలోచన మేరకు సహజ పదార్ధాలతో, విత్తనాలతో సీడ్ గణేష్ విగ్రహాలని రూపొందించారు. 'వినాయకుడి పూజ ముగిసిన తర్వాత నీటి వనరుల్లో కాకుండా ఇళ్లలోనే విగ్రహ నిమజ్జనం చేసుకోవాలి. నా    విత్తన గణపతులను సహజసిద్ధమైన మట్టి, కోకో పీట్, కొబ్బరి పీచులతో తయారు చేయడంతో పాటు, వాటిలో వేప మరియు చింత వంటి దేశవాళీ వృక్షాల విత్తనాలను అమర్చడం విశేషం. పూజ అనంతరం ఇంట్లోనే కుండీలో నీటిని చల్లి నిమజ్జనం చేయడం వల్ల ఆ విగ్రహం కరిగి, అందులోని విత్తనం మొలకెత్తి పచ్చని మొక్కగా మారుతుంది. "స్వయంగా ఆ విఘ్నేశ్వరుడే ఒక మొక్క రూపంలో మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పండుగలు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా ప్రతీ ఇంట్లో ఆరోగ్యంతో పాటు భగవంతుడి ఆశీస్సులని నింపాలని చిరంజీవి చెప్పుకొచ్చాడు.  Also Read: 'ప్రేమ' కి క్యాన్సర్ అంటూ ప్రచారం.. 70 ఏళ్ల వయసులోనైనా పెళ్లి చేసుకుంటానంటూ కామెంట్స్  2018లో ప్రారంభమైన ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఏకంగా 19.60 కోట్లకు పైగా మొక్కలు నాటడం గమనార్హం. ‘ఒక్కరు 3 మొక్కలు నాటాలి, వాటిని 3 ఏళ్ల పాటు సంరక్షించాలి, అలాగే మరొక ముగ్గురిని నాటమని నామినేట్ చేయాలి’ అనే సరళమైన 3x3x3 సూత్రంతో ఈ ఉద్యమం కొనసాగుతోంది. ఇక 2020 కొవిడ్ పాండమిక్ సమయంలో ప్రారంభమైన ‘సీడ్ గణేశ’ వినూత్న ప్రచారం ద్వారా ప్రతీ సీజన్‌లోనూ ఉచితంగా సుమారు 1.5 లక్షల మట్టి గణపతులను భక్తులకు పంపిణీ చేయడం విశేషం.       [ Chiranjeevi, Seed Ganesha, Green India , TeluguCinema, TelugucinemaNews, TollywoodNews, Tollywood]  
"నా కొడుకేం ఉగ్రవాది కాదు. ఒక బస్ డ్రైవర్ కొడుకుగా తన కష్టాన్ని నమ్ముకుని పైకొచ్చినోడు". ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. కన్నడ రాకింగ్ స్టార్ యశ్‌ తల్లి పుష్ప. యశ్ లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'టాక్సిక్' సినిమా విడుదలయ్యాక ఎలాంటి ట్రోలింగ్, విమర్శలు వచ్చాయో తెలిసిందే. అయితే తాజాగా ఈ విమర్శలపై యశ్ తల్లి స్పందిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా "KGFకి ముందు యశ్ ఎవరు?" అంటూ గతంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ కి కూడా ఆమె కౌంటర్ ఇచ్చారు. "వాడు ధనిక కుటుంబంలో పుట్టలేదు. కష్టపడి ఈ స్థాయికి వస్తే, వాడి ఎదుగుదలను కొందరు ఓర్చుకోలేకపోతున్నారు" అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా 'కేజీయఫ్'కి ముందు యశ్ ఎవరు? అనే మాటలపై స్పందిస్తూ.. 'కేజీయఫ్' కంటే ముందే యశ్‌కు వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి. అతనేం టెర్రరిస్ట్ కాదు. 'కేజీయఫ్'కి ముందు యశ్ ఎవరు? అని అనాల్సిన అవసరం ఏంటి?. అందరి హీరోల్లా యశ్ ధనిక కుటుంబంలో పుట్టలేదు. రాత్రికి రాత్రే ఈ విజయం రాలేదు, ఎన్నో ఏళ్ల కష్టానికి 'కేజీయఫ్' ఫలితమని ఒక తల్లిగా గర్వంగా చెప్పుకొచ్చారు. అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు కూడా ఇవి కౌంటర్ లా ఉన్నాయని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఒక తల్లిగా కొడుకుపై విమర్శలు వచ్చినప్పుడు బాధగా కలగడం సహజమే. ఈ క్రమంలోనే ఆమె 'టాక్సిక్' ట్రోల్స్ పై మండిపడ్డారు. అంతవరకు బాగానే ఉంది కానీ, గతంలో ఎప్పుడో అల్లు అరవింద్ వేరే ఉద్దేశంతో చేసిన కామెంట్స్ ని.. ఇప్పుడు 'టాక్సిక్'కి ముడిపెడుతూ ఆమె విమర్శించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు. 'కేజీయఫ్'కి యశ్ తెలుగు ప్రేక్షకులకు తెలీదు. అయినప్పటికీ ఆ సినిమా తెలుగునాట ఘన విజయాన్ని సాధించింది. అదే విషయాన్ని అల్లు అరవింద్ ప్రస్తావిస్తూ.. హీరో కంటే కంటెంట్ ముఖ్యమని అన్నారు. ఆ ఓల్డ్ వీడియో క్లిప్ ను చూసి.. యశ్ తల్లి తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు.       [Toxic Movie, Controversy, Yash Mother Pushpa, Allu Aravind Comments, Telugu Film News, Telugu News]  
Music composer and singer Kaala Bhairava, son of veteran composer MM Keeravaani, has made his relationship with actress Kavya Kalyanaraman official on Instagram. The couple shared a series of pictures together, accompanying them with deeply personal notes about what they mean to each other. Kaala Bhairava’s caption was particularly emotional as he described how his feelings for Kavya gradually became something much deeper than he could initially define. Addressing her as “Kaavyaa baabu,” he wrote, “Spending time with you feels like sitting by the mountains, watching a stream of water. Doing stuff with you feels like a vacation you don’t want to end.” He went on to compare their conversations to “having my favourite coffee on a winter early morning.” The composer then revealed what he believes that feeling truly was. “For the most part, I couldn’t name that feeling. I couldn’t. But somewhere along our journey, I finally realised what it was. The feeling. It was the feeling of ‘home’.” He added, “When I first met you, I didn’t meet a new person. I came home and never left it since,” before announcing that they have “a lifetime of being home together.” Kavya, meanwhile, shared her own playful and affectionate perspective on the relationship. “Life update: I found My Yellow Paper Daisy,” she wrote, adding that some people “make us feel like we are God’s favourite child!” She also thanked Kaala Bhairava for “lighting up my most mundane days and making me feel like the luckiest girl ever.” Ending on a lighter note, Kavya wrote, “Here’s to many many more years of you knowing that I want that Diet Coke even after I said No!” Their posts effectively turned a relationship reveal into a celebration of the affection, comfort and familiarity they have found in each other. Kaala Bhairava sang songs in films like Baahubali and composed music for Color Photo, Mathu Vadalara kind of films.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   https://www.instagram.com/p/DcsymQIgbQN/
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నాన్ వెజ్ ప్రియుల ఆహారపు అలవాట్లలో చికెన్‌కి ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఉంటుంది. రుచికరమైన రకరకాల వంటకాలు చేసుకోవడానికి చికెన్ అనువుగా ఉండటమే కాకుండా, మన శరీరానికి అవసరమైన అత్యంత విలువైన పోషకాలను కూడా ఇది అందిస్తుంది. చికెన్ కేవలం రుచికి మాత్రమే కాకుండా సరైన పద్ధతిలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ అజ్మీరా భగత్ సింగ్ స్పష్టం చేశారు. రోజూవారీ ఆహారంలో చికెన్ చేర్చుకోవడం వల్ల మన శరీరంలో ఎలాంటి సానుకూల మార్పులు వస్తాయో, అది ఏ విధంగా కండరాల బలానికి మరియు గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుందో తెలుసుకోవడం ఎంతో అవసరం. చికెన్ గురించి మాట్లాడగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది అందులో ఉండే అత్యధిక ప్రొటీన్. చికెన్‌లో హై క్వాలిటీ ప్రొటీన్ లభిస్తుంది. ఇది మన శరీరంలోని కండరాల పెరుగుదలకు మరియు వర్కవుట్స్ లేదా కష్టమైన పనుల వల్ల దెబ్బతిన్న కండరాలు త్వరగా కోలుకోవడానికి (మజిల్ రికవరీ) అద్భుతంగా తోడ్పడుతుంది. అందుకే క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లేవారు, క్రీడాకారులు తమ డైట్‌లో చికెన్ బ్రెస్ట్ భాగాన్ని తప్పనిసరిగా చేర్చుకుంటారు. అంతేకాకుండా రోజంతా తీవ్రమైన నీరసంతో బాధపడేవారికి చికెన్ ఒక మంచి శక్తి వనరుగా పనిచేస్తుంది. చికెన్‌లో నియాసిన్ అని పిలిచే విటమిన్ B3 మరియు విటమిన్ B6 పుష్కలంగా ఉంటాయి. మనం తీసుకునే ఆహారాన్ని శరీరానికి కావలసిన శక్తిగా మార్చడంలో ఈ విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఫలితంగా బద్ధకం తగ్గి, రోజంతా ఉత్సాహంగా మరియు ఎనర్జెటిక్‌గా ఉండేందుకు ఇది దోహదపడుతుంది. చికెన్ తింటే బరువు పెరుగుతారనేది సమాజంలో ఉన్న ఒక పెద్ద అపోహ మాత్రమే. నిజానికి సరైన పద్ధతిలో వండుకుని తింటే చికెన్ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. చికెన్ లోని ప్రొటీన్ వల్ల కొద్దిగా తినగానే కడుపు నిండిన భావన (సృప్తి) కలుగుతుంది. దీనివల్ల పదే పదే అనవసరమైన స్నాక్స్ తినాలనే కోరిక తగ్గి, కేలరీల స్వీకరణ అదుపులోకి వస్తుంది. ఫలితంగా శరీర బరువును వేగంగా మరియు ఆరోగ్యకరంగా నియంత్రించుకోవచ్చు.       Chicken for bone density and heart health,healthy ways to cook and eat chicken.
మన తాతముత్తాతల కాలం నుండి భారతీయ సాంప్రదాయ ఆహారంలో నల్ల శెనగలు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. నిత్యం మనం తీసుకునే ఆహారంలో లభించే పోషకాల కంటే నల్ల శెనగలు అందించే పోషక విలువలు ఎంతో ప్రత్యేకమైనవి. ప్రతిరోజూ మనం 10 గుడ్లు తినడం ద్వారా లేదా లీటర్ పాలు తాగడం ద్వారా పొందే శక్తిని, కేవలం కొద్దిగా ఉడకబెట్టిన నల్ల శెనగలను తినడం ద్వారా డబుల్ చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బలహీనతతో బాధపడేవారికి, కండరాల బలం పెంచుకోవాలనుకునేవారికి మరియు ప్రతిరోజూ ఉత్సాహంగా ఉండాలనుకునేవారికి ఇది ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్‌గా నిలుస్తుంది. ఈ శెనగలను వివిధ రూపాల్లో ఆహారంగా తీసుకోవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట నానబెట్టిన శెనగలను ఉదయాన్నే లేదా సాయంత్రం వేళల్లో ఉడకబెట్టి గుగ్గిళ్ల మాదిరిగా తాలింపు పెట్టుకుని తింటే శరీరానికి అవసరమైన పుష్కలమైన ప్రోటీన్ లభిస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉండి తరచూ నిరసించిపోయే వారికి నానబెట్టిన లేదా వేయించిన నల్ల శెనగలు తిరుగులేని శక్తిని అందిస్తాయి. వీటిలో లభించే పీచు పదార్థం (ఫైబర్) జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణక్రియ సులభతరం కావడమే కాకుండా కడుపులో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపి కడుపును పరిశుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా బరువు తగ్గాలనుకునేవారికి నల్ల శెనగలు ఒక దివ్యౌషధంలా పనిచేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల వీటిని కొద్దిగా తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది, తద్వారా పదేపదే ఆకలి వేయకుండా ఉండి అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. రక్తం లోని గ్లూకోజ్ లేదా షుగర్ లెవెల్స్ సమతుల్యంగా ఉంచడంలో ఇవి ఎంతో తోడ్పడతాయి. అందువల్ల మధుమేహం ఉన్నవారు అలాగే గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారు వీటిని తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా హృద్రోగాల ప్రమాదం కూడా గణనీయంగా తగ్గుతుంది.         black chickpeas for weight loss and health, black chickpeas nutrition benefits in Telugu.
వాతావరణంలో హఠాత్తుగా సంభవిస్తున్న మార్పులు మరియు రుతుపవనాల ప్రభావంతో మనదేశంలో H1N1 ఇన్ఫెక్షన్లు లేదా స్వైన్ ఫ్లూ కేసుల సంఖ్య అత్యంత వేగంగా పెరుగుతోంది. ఆసుపత్రుల్లో సాధారణ జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో చేరే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో పాటు ఫ్లూ వ్యాక్సిన్ కోసం జనం క్యూ కడుతున్నారు. ప్రారంభంలో ఇది ఒక సాధారణ జలుబు లేదా ఇన్ఫ్లుయెంజాలా కనిపించినప్పటికీ, కొందరిలో ఈ వైరస్ తీవ్రంగా మారి ఊపిరితిత్తులపై దాడి చేసి తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో H1N1 నివారణకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు ఫ్లూ వ్యాక్సిన్ ఎవరెవరు తప్పనిసరిగా తీసుకోవాలో వైద్య నిపుణులు స్పష్టమైన సమాచారాన్ని అందించారు. స్వైన్ ఫ్లూ బారిన పడిన సాధారణ లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు అవసరం లేదని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. కానీ కొన్ని రకాల తీవ్రమైన ప్రమాదం ఉన్న హై రిస్క్ వర్గాల ప్రజలకు లక్షణాలు కనిపిస్తే మాత్రం వెంటనే పరీక్ష చేయించుకోవడం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా ఆస్తమా, సీఓపీడీ, గుండె సంబంధిత సమస్యలు, మధుమేహం లేదా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. అదేవిధంగా 65 ఏళ్లు పైబడిన వయోవృద్ధులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే 5 ఏళ్ల లోపు చిన్న పిల్లలలో ఈ ప్రమాదం చాలా ఎక్కువ. గర్భధారణ సమయంలో మహిళల్లో రోగనిరోధక వ్యవస్థలో అనేక మార్పులు వస్తాయి కాబట్టి, గర్భిణీలకు స్వైన్ ఫ్లూ సోకితే శ్వాసకోశ కాంప్లికేషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. జ్వరంతో పాటు తీవ్రమైన అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన వారికి సరైన నివారణ చికిత్స అందించడానికి వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారు. ఫ్లూ ఇన్ఫెక్షన్ తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడానికి ఫ్లూ టీకా ఒక గొప్ప రక్షణ కవచంలా పనిచేస్తుంది. వైద్య నిపుణుల ప్రకారం 6 నెలల నుండి 5 ఏళ్ల వరకు ఉన్న చిన్న పిల్లలకు ఈ వ్యాక్సిన్ వేయించడం చాలా అవసరం. 65 ఏళ్లు పైబడిన వృద్ధులలో వయస్సు పెరిగే కొద్దీ సహజ నిరోధక శక్తి తగ్గుతుంది కాబట్టి వీరు ముందస్తుగా ఫ్లూ షాట్ తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు తమ భద్రతతో పాటు కడుపులోని బిడ్డ క్షేమం కోసం ఈ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమని నిపుణులు చెబుతున్నారు. ఆస్తమా, బిపి, షుగర్ వంటి దీర్ఘకాలిక జబ్బులు ఉన్నవారితో పాటు, రోజూ ఆసుపత్రుల్లో రోగుల మధ్య ఉండే డాక్టర్లు, నర్సులు మరియు హెల్త్‌కేర్ సిబ్బందికి ఈ వ్యాక్సిన్ వేయించుకోవడం అత్యంత ఆవశ్యకం.           Annual flu shot importance H1N1, swine flu prevention high risk groups.
భారతీయ సాంప్రదాయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పిప్పళ్లకు ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. నల్లగా, చిన్న పొడుగు ఆకారంలో ఉండే ఈ పిప్పళ్లు కేవలం వంటగదిలోని దినుసు మాత్రమే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్న దివ్యౌషధం. శతాబ్దాల నుంచి మన పెద్దలు, ఆయుర్వేద నిపుణులు రకరకాల ఆరోగ్య సమస్యల నివారణకు పిప్పళ్లను ప్రధానంగా ఉపయోగిస్తూ వస్తున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. పిప్పళ్లు చేసే మేలు.. పిప్పళ్లలో ఉండే కెమికల్ కాంపౌండ్ పైపరీన్ శరీరంలో జీవక్రియలను వేగవంతం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యానికి పిప్పళ్లు చేసే మేలు అపారం. జలుబు, దగ్గు, ఉబ్బసం, గొంతు నొప్పి, ఆస్తమా వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి పిప్పళ్లు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి. పిప్పళ్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కఫం సులభంగా బయటకు వచ్చేస్తుంది. పిప్పళ్ల గురించి ఆయుర్వేదం ఏం చెబుతుంది? ఆయుర్వేదంలో పిప్పళ్లను రసాయన మూలికగా వర్గీకరించారు. అంటే ఇవి శరీరానికి పునరుజ్జీవనాన్ని అందిస్తాయి. ఆయుర్వేదంలో దీనిని త్రిదోషాలలో ప్రధానమైన కఫ, వాత దోషాలను సమతుల్యం చేయడానికి ఉపయోగిస్తారు. శరీరంలో జఠరాగ్నిని అంటే జీర్ణశక్తిని రగిల్చే గుణం పిప్పళ్లకు ఉంది. తిన్న ఆహారం సరిగ్గా అరగకపోయే సమస్యను, ఆకలి మందగించడాన్ని ఇది నివారిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లేదా విష పదార్థాలను బయటకు పంపడంలో ఆయుర్వేద వైద్యంలో పిప్పళ్లను క్రియాశీలకంగా ఉపయోగిస్తారు. పిప్పళ్ల వల్ల కలిగే మరికొన్ని ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. జీర్ణ వ్యవస్థ మెరుగుపడటం..  గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను పిప్పళ్లు త్వరితగతిన నివారిస్తాయి. జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి ఆహారం వేగంగా అరిగేలా చేస్తాయి. రోగనిరోధక శక్తి పెరుగుదల..  యాంటీఆక్సిడెంట్లు, యాంటీమైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉండటం వల్ల ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. తరచూ వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. బరువు నియంత్రణ..  శరీరంలో జీవక్రియల వేగాన్ని పెంచి, చెడు కొవ్వును కరిగించడంలో పిప్పళ్లు ఎంతో సహాయపడతాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి సహజ నివారణి. నొప్పులు , వాపుల నివారణ..  పిప్పళ్లలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాతపు నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. కాలేయ ఆరోగ్యం.. కాలేయంలోని వ్యర్థాలను తొలగించి, కాలేయం సరిగ్గా పనిచేయడానికి పిప్పళ్లు తోడ్పడతాయి. పిప్పళ్లను నిత్య జీవితంలో తగిన మోతాదులో వాడటం వల్ల అనేక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ఇవి శరీరంలో వేడిని పెంచే గుణం కలిగి ఉంటాయి కాబట్టి, పిత్త ప్రకృతి ఉన్నవారు లేదా గర్భిణులు ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని తీసుకోవడం మంచిది.                        *రూపశ్రీ.  
కొలెస్ట్రాల్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన కొవ్వు పదార్థం. ఇది శరీరంలోని కణాల నిర్మాణానికి మరియు కొన్ని రకాల హార్మోన్ల తయారీకి ఎంతో అవసరం. అయితే, రక్తంలో కొలెస్ట్రాల్ పరిమాణం ఉండాల్సిన దానికంటే ఎక్కువగా పెరిగితే అది గుండె ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల రక్త ప్రసరణకు అడ్డంకులు ఏర్పడి, గుండెపోటు , పక్షవాతం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ప్రస్తుతం కాలంలో ఉన్న జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, పోషకాహార లోపం , తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో కొలెస్ట్రాల్ సమస్యలు తలెత్తుతున్నాయి. అయితే సరైన ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడమే కాకుండా, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు తీసుకోవాల్సిన ముఖ్యమైన ఆహారాలు ఏమిటో, అవి ఎలా సహాయపడతాయో తెలుసుకుంటే.. ఫైబర్.. కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో  పీచు పదార్థం లేదా ఫైబర్ పాత్ర చాలా కీలకమైనది. ముఖ్యంగా కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ఓట్స్ , బార్లీ వంటి ధాన్యాలలో కరిగే ఫైబర్  ఎక్కువగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించి, శరీరం నుండి దాన్ని బయటకు పంపడానికి సహాయపడతాయి. రోజూ ఉదయం అల్పాహారంలో ఓట్స్ లేదా బార్లీ చేర్చుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు క్రమంగా తగ్గుతాయి. పప్పుధాన్యాలు, గింజలు.. వివిధ రకాల పప్పుధాన్యాలు , గింజలు కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఎంతో మేలు చేస్తాయి. శనగలు, పెసలు, రాజ్మా, మినుములు , కందిపప్పు వంటి వాటిలో ప్రోటీన్లు, విటమిన్లు , పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, అనవసరమైన కేలరీలు తీసుకోకుండా నిరోధిస్తాయి. అలాగే నట్స్ అని పిలిచే బాదం, వాల్‌నట్స్ , పిస్తా పప్పులు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఉండే అసంతృప్త కొవ్వులు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. కాకపోతే వీటిని పరిమిత పరిమాణంలోనే తీసుకోవడం మంచిది. తాజా కూరగాయలు , ఆకుకూరలు.. రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా తాజా కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలి. పాలకూర, తోటకూర, మెంతి కూర వంటి ఆకుకూరలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. బెండకాయ, వంకాయ, క్యారట్ , బీట్‌రూట్ వంటి కూరగాయలలో కరిగే పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కొలెస్ట్రాల్ శోషణను అడ్డుకుంటాయి.  వెల్లుల్లి.. వెల్లుల్లి రక్తనాళాలను శుభ్రపరచడంలో , కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో ఎంతో ప్రసిద్ధి చెందింది. రోజూ ఒకటో రెండో వెల్లుల్లి రెబ్బలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం కూడా తగ్గుతుంది. పండ్లు.. పండ్లు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. బొప్పాయి, ఆపిల్, నారింజ, జామ, దానిమ్మ  వంటి పండ్లలో పెక్టిన్ అనే ప్రత్యేకమైన కరిగే పీచు పదార్థం ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శోషణను తగ్గించడంలో ఎంతగానో దోహదపడుతుంది. అలాగే పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడతాయి.  నిమ్మజాతి పండ్లు.. నిమ్మ జాతి పండ్లలో ఉండే విటమిన్ సి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. హెల్తీ ఫ్యాట్స్.. చేపలు , ఆరోగ్యకరమైన నూనెలు కూడా కొలెస్ట్రాల్ నిర్వహణకు సహాయపడతాయి. ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే చేపలను తినడం వల్ల రక్తంలో ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలు తగ్గుతాయి. వంటల కోసం ప్రాసెస్ చేసిన నూనెలకు బదులుగా ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె లేదా ఆవనూనె వంటి వాటిని పరిమితంగా ఉపయోగించడం మంచిది. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను పెంచకుండా కాపాడతాయి. ఈ ఆహారాలు తినకూడదు.. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు కొన్ని ఆహారాలకు పూర్తిగా దూరంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. వేయించిన ఆహారాలు, ప్రాసెస్ చేసిన మాంసం, మైదాతో చేసిన పదార్థాలు, తీపి పదార్థాలు, బేకరీ ఆహారాలు , పూర్తి కొవ్వు ఉన్న పాల పదార్థాలను తగ్గించాలి. వీటిలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ , సంతృప్త కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను వేగంగా పెంచుతాయి. ఆహారాలు మాత్రమే కాదు.. ఇవి కూడా ముఖ్యమే.. కేవలం మంచి ఆహారం తీసుకోవడమే కాకుండా, రోజువారీ జీవనశైలిలో చిన్నచిన్న మార్పులు చేసుకోవడం అవసరం. ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు నడక లేదా ఇతర వ్యాయామాలు చేయడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని తగ్గించుకోవడం , మంచి నిద్ర వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. సరైన ఆహార నియమాలు , ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తే కొలెస్ట్రాల్‌ను సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు.                         *రూపశ్రీ.
ఒమేగా3 కొవ్వు ఆమ్లాలు మన ఆరోగ్యానికి చాలా అవసరం. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మెదడు పనితీరును పెంచడంలో , శరీరంలో మంటను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సాధారణంగా ఒమేగా3 అనగానే ఖరీదైన సప్లిమెంట్లు లేదా సాల్మన్ వంటి పెద్ద చేపలే గుర్తొస్తాయి. కానీ మనకు సులభంగా , తక్కువ ధరలో లభించే ఆహార పదార్థాల ద్వారా కూడా ఒమేగా3 ని పొందవచ్చు. ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. అవిసె గింజలు.. అవిసె గింజలు ఒమేగా3 పొందడానికి అత్యంత చౌకగా లభించే పదార్థం. వీటిని కాస్త వేయించి పొడి చేసుకుని రోజువారీ ఆహారంలో, పెరుగులో లేదా నీటిలో కలుపుకుని తీసుకోవచ్చు. ఇవి గుండె ఆరోగ్యాన్ని ఎంతో మెరుగుపరుస్తాయి. చియా విత్తనాలు.. శాకాహారులకు ఇవి మంచి ఎంపిక. వీటిని నీటిలో నానబెట్టి స్మూతీలు, జ్యూస్‌లు లేదా మజ్జిగలో కలుపుకుని తాగవచ్చు. ఇవి ఒమేగా3 తో పాటు శరీరానికి కావలసిన పీచు పదార్థాన్ని కూడా అందిస్తాయి. చిన్న చేపలు (సార్డిన్స్, మకేరల్).. ఖరీదైన విదేశీ చేపల జోలికి వెళ్లకుండా  స్థానిక మార్కెట్లలో దొరికే చిన్న రకం చేపలను ఎంచుకోవచ్చు. సార్డిన్స్, మకేరల్ వంటి చిన్న చేపల్లో ఒమేగా3 సమృద్ధిగా ఉంటుంది. ఇవి ధరలో తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. సోయాబీన్స్.. మొక్కల ఆధారిత పోషకాల్లో సోయాబీన్స్ ఒకటి. వీటిని కూరగాయల రూపంలో లేదా సోయా పాలు, తోఫు రూపంలో తీసుకోవడం వల్ల ఒమేగా3 తో పాటు మంచి ప్రొటీన్ లభిస్తుంది. నువ్వులు.. భారతీయ ఇళ్లలో సాధారణంగా వాడే నువ్వులు కూడా మంచి పోషకాలను అందిస్తాయి. వీటిని వివిధ వంటకాల రూపంలో తీసుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన కొవ్వు ఆమ్లాలు లభిస్తాయి. పాలకూర మరియు ఆకుకూరలు.. రోజువారీ వంటల్లో వాడే ఆకుకూరలు, ముఖ్యంగా పాలకూరలో కొంత పరిమాణంలో ఒమేగా3 లభిస్తుంది. ఇవి శరీరానికి ఇతర విటమిన్లు , ఖనిజాలను కూడా అందిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోజువారీ ఆహారంలో ఈ సాధారణ పదార్థాలను చేర్చుకోవడం ద్వారా ఒమేగా3 లోపాన్ని నివారించి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                                                                                                                                          *రూపశ్రీ.