LATEST NEWS
  నగరంలో రోజు రోజుకీ గంజాయి బ్యాచ్ లు రెచ్చిపో తున్నాయి. యువ కులు గంజాయి సేవించి ఆ మత్తులో తూగుతూ ఇతరు లపై దాడి చేస్తూ రోడ్డు మీద నానా హంగామా చేస్తున్నారు... ఈ గంజాయి బ్యాచ్ రోడ్డు మీద చేసే గొడవ వల్ల వాహ నదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు తాజాగా బండ్లగూడ పరిధిలో గంజాయి బ్యాచ్ నడిరోడ్డు మీద చేసిన హంగామా వల్ల అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇద్దరు యువకులు గంజాయి సేవించి ఆ మత్తులో తూలుతూ బండ్ల గూడ పరిధిలోని చాంద్రాయణ గుట్ట వద్ద ఉన్న ఏఎస్ఐ తో గొడవపడ్డారు. అంతటితో ఆగ కుండా ఏ ఎస్ ఐ చొక్కా పట్టుకొని నన్ను మీరు ఏమీ చెయ్యలేరు రా అంటూ రెచ్చిపోతూ అతనిపై దాడి చేశారు... దీంతో ఆగ్రహం చెందిన ఏఎస్ఐ గంజాయి మత్తులో ఉన్న ఇద్దరిని కొట్టాడు.  మమ్మల్ని కొడతావా అంటూ ఏ ఎస్ ఐ పై దాడి చేశారు. దీంతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకు న్నారు. ఈ దాడుల్లో గంజాయి మత్తులో ఉన్న యువకులకు గాయాలయ్యాయి. ఈ ఘటన స్థానికం గా హంగామా రేగ డం తో స్థానికులు పోలీసులకు సమా చారాన్ని అందిం చారు. హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయా లైన యువకులకు నచ్చజెప్పి పోలీస్ వాహనం ఎక్కించేం దుకు విశ్వ ప్రయ త్నం చేశారు.. అదే సమయంలో యువ కులు పోలీసుల ట్యాబ్ ధ్వంసం చేశారు. గంజాయి మత్తులో ఉన్న ఆ యువ కులు పోలీస్ వాహనం ఎక్కేం దుకు ససేమిరా అంటూ పోలీసు లకు చుక్కలు చూపించారు..  పోలీసు వాహనం ఎక్కకుండా దాదాపు అరగంట పాటు ఆ యువ కులు  పోలీసులను నానా తిప్పలు పెట్టారు. అయినా కూడా పోలీసులు ఓపిగ్గా ఆ ఇద్దరు యువకులకు పోలీస్ వాహనంలో తీసుకువెళ్లి చికిత్స చేపించి అనంతరం పోలీస్ స్టేషన్ కి తరలించారు.
  మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ దేశ సమగ్రత కోసం సద్భావన యాత్ర చేపట్టారని, ఆ స్ఫూర్తితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద జరిగిన రాజీవ్ గాంధీ సద్భావన యాత్ర సంస్మరణ కార్యక్రమంలో ఆయన తెలిపారు. “మూడు తరాలుగా గాంధీ కుటుంబం దేశ సేవలో అంకితమై ఉంది. దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలు ప్రాణత్యాగం చేశారు. భారతదేశానికి గాంధీ అనే పేరు పర్యాయ పదం” అని సీఎం రేవంత్ అన్నారు. సద్భావన అవార్డును సల్మాన్ ఖుర్షీద్‌కు అందజేసిన నిర్వాహకులను ఆయన అభినందించారు. “సల్మాన్ ఖుర్షీద్ కుటుంబానికి గాంధీ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉంది. ఈ అవార్డు ఆయనకు దక్కడం మనందరికీ గర్వకారణం” అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ స్ఫూర్తితో యువతకు అధిక హక్కులు కల్పించిన విషయాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి అన్నారు: “18 ఏళ్ల వయసులో ఓటు హక్కు కల్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ. ఇప్పుడు 21 ఏళ్లకే శాసనసభ్యుడిగా పోటీ చేసే అవకాశం కల్పించే రాజ్యాంగ సవరణ అవసరం ఉంది. అదే రాజీవ్ గాంధీ కల.” ఇక రాజకీయ అంశాలపై స్పందిస్తూ రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. “బీఆర్‌ఎస్ బీజేపీకి బీ టీమ్‌గా మారింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో రహస్య ఒప్పందంతో బీజేపీకి మద్దతిచ్చింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలోనూ అదే కుట్ర జరుగుతోంది.  వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీల్చే ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొడతారు” అని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ సందర్బంగా సల్మాన్ ఖుర్షీద్‌ మాట్లాడుతు తనకు ఎంతో ప్రత్యేకమని తన జీవితంలో దీనికి మించిన అవార్డు మరొక్కటి లేదన్నారు. రాజీవ్ గాంధీ దేశాన్ని ఒక్కటిగా చేయడానికి ఈ యాత్ర చేశారని ఇప్పుడు రాహుల్ గాంధీ ఇదే బాటలో నడుస్తున్నారని ఖుర్షీద్‌ తెలిపారు.
మంత్రి నారాయణ, పిఠాపురం తెలుగుదేశం ఇన్ చార్జ్ వర్మ మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి నారాయణ పిఠాపురంలో వర్మను జీరో చేసేశామని వ్యాఖ్యానించారంటూ, అందుకు సంబంధించిన ఆడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఆడియోపై స్పందించిన వర్మ కూడా ఒకింత ఘాటుగానే వ్యాఖ్యానించారు. ఎవరో ఏదో అన్నంత మాత్రాన తాను జీరో కానని అన్నారు. అయితే ఈ వివాదం టీకప్పులో తుపాను మాదిరిగా తేలిపోయింది. మంత్రి నారాయణ తాను టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడిన మాటలను ఎవరో ఎడిట్ చేసి, కట్ చేసి , పేస్ట్ చేసి తాను వర్మ విషయంలో ఏమో మాట్లాడినట్లుగా తప్పుడు ప్రచారానికి పాల్పడ్డారని   క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే  విశాఖ పర్యటనకు వచ్చిన మంత్రి నారాయణను వర్మ కలిశారు. ఈ సందర్భంగా ఆ వీడియోపై ఇరువురి మధ్యా చర్చ జరిగింది.  మంత్రి నారాయణ క్లారిటీ ఇవ్వడంతో వర్మ సంతృప్తి చెందారు. దీంతో వివాదం సమసింది. కాగా మంత్రి నారాయణ తాను ఆ టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినదంతా బహిర్గతం చేసి ఉంటే వక్రీకరణ ఎలా జరిగిందో, తాను అనని మాటలను అన్నట్లుగా ఎలా సృష్టించారో అర్ధమయ్యేదని వివరించారు.   అనని మాటలను అన్నట్లుగా వక్రీకరించి మా మధ్య విభేదాలు సృష్టించడం ఎవరి వల్లా సాధ్యం కాదని నారాయణ చెప్పారు. ఇక వర్మ వివాదమేం లేదని ప్రకటించడమే కాకుండా, పిఠాపురంలో తెలుగుదేశం, జనసేన మధ్య విభేదాలు లేవనీ, రెండు పార్టీలూ సమన్వయంతో పని చేస్తున్నాయనీ అన్నారు.  ఈ సందర్భంగా వర్మ చంద్రబాబు ఆగమంటే ఆగుతాను.. దూకమంటే దూకుతానని చెప్పారు. మంత్రి నారాయణ తన గురించి ఏవో వ్యాఖ్యలు చేశారంటూ అభూత కల్పనలు ప్రచారం చేశారనీ,  అటువంటి అసత్య ప్రచారాలను తాను పట్టించుకోననీ అన్నారు.   కూటమి పార్టీల మధ్య విబేధాలు సృష్టించడం ఎవరి తరం కాదని వర్మ పేర్కొన్నారు.  
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికలో మస్లిస్ పార్టీ మద్దతు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కే అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. బీజేపీని నిలువరించేందుకే తాము జూబ్లీలో పోటీ చేయకుండా, కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నట్లు ఒవైసీ తెలిపారు.  జూబ్లీహిల్స్ బైపోల్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ శుక్రవారం (అక్టోబర్ 17) నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. నామినేషన్ దాఖలుకు ముందు ఆయన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీనీ కలిసి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత అజారుద్దీన్ కూడా నవీన్ యాదవ్ వెంట ఉన్నారు.  ఆ సందర్భంగా ఒవైసీ నవీన్ యాదవ్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉందనీ, ఆ పదేళ్లూ కూడా జూబ్లీ నియోజకవర్గానికి ఆ పార్టీ అభ్యర్థే ఎమ్మెల్యేగా ఉన్నారన్నారు. అయితే నియోజకవర్గం మాత్రం ఇసుమంతైనా అభివృద్ధి చెందలేదని విమర్శించారు.  నియోజకవర్గ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్న అసదుద్దీన్ ఒవైసీ.. ఈ ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి ఒక అవకాశమన్నారు.   నియోజకవర్గంలోని అన్ని వర్గాలను కలుపుకుని ముందుకు సాగాలని నవీన్ యాదవ్‌కు సూచించారు. . నవీన్ యాదవ్ గతంలో మజ్లిస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటీచేసిన సంగతి తెలిసిందే.  గత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయన్న ఒవైసీ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్‌లో 37 శాతం ఓట్లు సాధించిన బీఆర్ఎస్ ఆ తర్వాత 5 నెలలకు జరిగిన లోక్ సభ ఎన్నికల్లో 15 శాతానికి పడిపోయిందని అసదుద్దీన్ గుర్తు చేశారు. నవీన్ యూదవ్ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మజ్లిస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి, మాగంటి గోపీనాథ్ చేతిలో ఓడిపోయారు. 2018లో నవీన్ యాదవ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యారు.  
ప్రధాని నరేంద్రమోడీ కర్నూలు పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ఆయన చేసిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నవ్యాంధ్రప్రదేశ్ లో నవశకానికి నాంది పలికిందన్న అభిప్రాయాన్ని పరిశీలకులు సైతం వ్యక్తం చేస్తున్నారు. భారీ ఎత్తున అభివృద్ధి పథకాలు జోరందుకోవడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. ఈ తరుణంలో వైసీపీ మళ్లీ తన ఫేక్ ప్రచారానికి తెరలేపింది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి విధానాలపై ప్రధాని నరేంద్రమోడీకి తాము ఒక మెమోరాండం ఇచ్చామంటూ వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు. ఆ మెమోరాండం కూడా ప్రధాని కర్నూలు పర్యటనలోనే ఇచ్చామని చెప్పుకున్నారు. అయితే తెలుగుదేశం ఈ ప్రచారాన్ని వెంటనే ఖండించింది.  అసలింతకీ విషయమేంటంటే..   ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ క‌ర్నూలు పర్యటన నేపథ్యంలో ఆయనకు స్వాగతం పలికేందుకు అధికార పార్టీ సహా స్థానిక ప్రజా ప్రతినిథులకు ప్రొటోకాల్ ప్రకారం ఆహ్వానాలు అందాయి. అందులో భాగంగానే  స్థానిక ఎమ్మెల్యే వైసీపీ నేత‌ విరూపాక్షి,   ఎమ్మెల్సీ మ‌ధుసూద‌న్‌, క‌ర్నూలు జడ్పీ చైర్మన్ కు కూడా ఆహ్వానాలు అందాయి. ఆ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు వారు వచ్చారు. ప్రధాని పుష్పగుచ్ఛం ఇచ్చారు.    కానీ వారు ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి తాను ప్రధాని మోడీకి   రాష్ట్రంలో  మెడిక‌ల్ కాలేజీల‌ ప్రైవేటీక‌ర‌ణ, ప్రభుత్వ విధానాలపై ప్రధానికి వినతిపత్రంలో ఫిర్యాదు చేశామని చెప్పుకున్నారు.  అయితే తెలుగుదేశం నాయకులు వెంటనే దీనిని ఖండించారు. వారు కేవలం ప్రొటోకాల్ ప్రకారం వచ్చి ప్రధానికి పుష్పగుచ్ఛం మాత్రమే ఇచ్చారని స్పష్టం చేశారు.  ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు ప్రధానికి వినతిపత్రం ఇచ్చామని చెప్పుకున్న వ్యవహారంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ఈ వ్యహారంపై ఇంటెలిజెన్స్ ను అలర్ట్ చేసింది. అసలు ఏం జరిగింది? ప్రధానికి వారు నిజంగానే వినతిపత్రం ఇచ్చారా? ఇస్తే ఆ వినతి పత్రాన్ని స్వీకరించిందెవరు? తదితర విషయాలపై నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ రాష్ట్ర డీజీపీని కోరింది. ఒక వేళ వైసీపీ నేతలది వినతి పత్రం విషయంలో ఫేక్ ప్రచారమే అని తేలిసే సీరియస్ గా చర్యలు తప్పవని కేంద్రం వర్గాలు హెచ్చరిస్తున్నాయి.  
ALSO ON TELUGUONE N E W S
రామ్‌గోపాల్‌వర్మ వివాదాలు కొత్తకాదు, పోలీస్‌ కేసులూ కొత్త కాదు. తాజాగా మరో వివాదంలో ఇరుక్కున్నారు వర్మ. స్వప్న వ్యాఖ్యాతగా చేసిన ఒక కార్యక్రమంలో హిందూ దేవుళ్ళపై రామ్‌గోపాల్‌వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పురాణ ఇతిహాసాలను అవహేళన చేశారంటూ రాజమహేంద్రవరంలో కేసు నమోదైంది. న్యాయవాది, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్‌ అధ్యక్షులు మేడా శ్రీనివాస్‌ వీరిద్దరిపై రాజమండ్రి త్రీ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసును స్వీకరించిన పోలీసులు ఆర్జీవీ, స్వప్నలపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.  ఇంటర్వ్యూలో యాంకర్‌ స్వప్న ఉద్దేశ పూర్వకంగానే వివాదాస్పద ప్రశ్నలు అడిగారని, దానికి కావాలనే ఆర్జీవీ విద్వేశపూరిత సమాధానాలు ఇచ్చారని శ్రీనివాస్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి మృగాలను అడవిలోనే ఉంచాలని, తెలుగు రాష్ట్రాల నుంచి ఇలాంటి వారిని బహిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వాలకు ఉందని అన్నారు. రామ్‌గోపాల్‌వర్మపై, అతన్ని సపోర్ట్‌ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మేడా శ్రీనివాస్‌ కోరారు.
చేసింది మూడు సినిమాలే. అందులో వెంకటేష్‌ హీరోగా చేసిన చింతకాయల రవి అతనికి మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత 2015లో జాదూగాడు అనే సినిమాను డైరెక్ట్‌ చేశాడు. ఈ సినిమా తర్వాత మళ్లీ మెగా ఫోన్‌ పట్టుకోలేదు. దాదాపు పదేళ్ల గ్యాప్‌ తర్వాత ఓ వయొలెంట్‌ స్టోరీని ఎంపిక చేసుకొని లేడీ సెంట్రిక్‌ మూవీతో వస్తున్నాడు. అతనే డైరెక్టర్‌ యోగి. భీమ్లా నాయక్‌, బింబిసార, విరూపాక్ష వంటి యాక్షన్‌ మూవీస్‌లో తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకున్న సంయుక్త మీనన్‌ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. సినిమా పేరు ‘ది బ్లాక్‌గోల్డ్‌’.  సంయుక్త, యోగి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ది బ్లాక్‌గోల్డ్‌’ ఫస్ట్‌ లుక్‌ను దీపావళి సందర్భంగా విడుదల చేశారు. హాస్య మూవీస్‌ పతాకంపై రాజేశ్‌ దండా నిర్మిస్తున్న ఈ సినిమాకు సింధు మాగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సంయుక్త హీరోయిన్‌గానే కాకుండా స్వయంగా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. ఫస్ట్‌ లుక్‌లోనే సినిమా ఏ జోనర్‌లో ఉండబోతోంది అనే విషయంపై క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్‌. చుట్టూ శవాలు, ఒళ్లంతా రక్తంతో, రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ మీద గన్‌ పట్టుకొని నిలబడిన సంయుక్త.. చాలా వయొలెంట్‌గా కనిపిస్తోంది.   తన ట్విట్టర్‌ పేజీలో ‘ది బ్లాక్‌ గోల్డ్‌’ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని పోస్ట్‌ చేస్తూ.. ‘అందరికీ దీపావళి శుభాకాంక్షలు. పండగ రోజున ‘ది బ్లాక్‌ గోల్డ్‌’ ఫస్ట్‌లుక్‌ని రివీల్‌ చేయడం సంతోషాన్ని కలిగిస్తోంది. నా హృదయానికి చాలా దగ్గరైన సినిమా ఇది. యాక్షన్‌, ఎమోషన్స్‌, హార్ట్‌ టచ్చింగ్‌ సీన్స్‌ అన్నీ ఈ సినిమాలో ఉన్నాయి. అవన్నీ మీకు బాగా నచ్చుతాయి’ అని తెలిపింది. 
  నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'అఖండ-2'. బాలయ్య-బోయపాటి కాంబోతో పాటు, బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'అఖండ'కి సీక్వెల్ కావడంతో అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. 14 రీల్స్ ప్లస్ నిర్మిస్తున్న ఈ మూవీ డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. (Akhanda 2 Thaandavam)   బాలయ్య-బోయపాటి కాంబో అంటే యాక్షన్ సీన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. 'అఖండ'లో యాక్షన్ సీన్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు 'అఖండ-2'లో అంతకుమించిన యాక్షన్ ఉండబోతుందట. ముఖ్యంగా 20 నిమిషాల ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ ఉంటుందట. ఈ ఎపిసోడ్ లో బాలయ్య తాండవం చూడనున్నామని, ఇది ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నారు.  
  ఇటీవల 'ఓజీ'తో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి, ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ విజయం మరిన్ని సినిమాలు చేయాలనే ఉత్సాహాన్ని పవన్ కళ్యాణ్ లో నింపింది. పవన్ అభిమానులు కూడా ఆయన రాజకీయాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సినిమాలకు పూర్తిగా దూరం కావొద్దని కోరుతున్నారు. (Pawan Kalyan)   ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫిల్మ్ ఉంది. దీనిని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే పవన్ 'ఓజీ-2' చేస్తానని మాట ఇచ్చారు. అయితే అంతకన్నా ముందు మరో రెండు సినిమాలు చేసే అవకాశముంది అంటున్నారు.   పవన్ కళ్యాణ్ గతంలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా ఒక సినిమా ప్రకటించారు. అయితే పవన్ ఏపీ డిప్యూటీ సీఎం బాధ్యతలు చేపట్టడంతో.. ఇక సినిమాలు చేయరని, 'ఉస్తాద్ భగత్ సింగ్' చివరి చిత్రమని ప్రచారం జరిగింది. కానీ, సురేందర్ రెడ్డి సినిమా చేసే ఆలోచనలో పవన్ ఉన్నారని తెలుస్తోంది. అంతేకాదు, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో ఒక సినిమా చేయనున్నారని సమాచారం. దీనికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారని న్యూస్ వినిపిస్తోంది.   'ఓజీ'లో పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్ కి, ఎలివేషన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలాంటిది లోకేష్ సినిమాల్లో ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలిసిందే. ఆ సీన్స్ పవన్ కళ్యాణ్ కి పడితే బాక్సాఫీస్ షేక్ అవుతుంది అనడంలో సందేహం లేదు. అందుకే పవన్-లోకేష్ కాంబో కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలయ్యాక ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. లోకేష్ తక్కువ రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తుంటాడు. అందుకే ఈ సినిమాకి పవన్ డేట్స్ ఇవ్వడం దాదాపు ఖాయమనే మాట వినిపిస్తోంది.  
  The much-anticipated cinematic venture, 'TRIMUKHA', today launched its powerful teaser, sending waves of excitement across the nation and beyond. The teaser offers a breathtaking first look at the film's high-octane action, intricate narrative, and stunning visual scale.   In a strategic move to connect with a diverse audience base, the teaser has been released simultaneously in five languages: Hindi, Tamil, Telugu, Malayalam, and Kannada. This multi-lingual approach underscores the film's pan-Indian appeal and grand vision.   Building on the momentum, the producers have officially announced that Trimukha will see a wide theatrical release across India and internationally in December 2025, also in all five languages.   Directed by Razesh Naidu and produced by Akhira Dream Creations Trimukha promises to be a groundbreaking film. The teaser hints at a compelling story of Crime, Suspense and Mystery, brought to life by a stellar cast including Sunny Leone, Yogesh, Aditya Srivastava, Akriti Agarwal, Motta Rajendran, Ashu Reddy and more.   Dr. Sridevi Maddali, Producer of the film, stated, “The release of the Trimukha teaser in five languages is a testament to our belief in the universal power of this story. We are crafting an immersive experience that we believe will resonate with audiences across the country. This is just the beginning, and we are thrilled to embark on this journey towards our December 2025 release.”   Director Razesh Naidu added, “With Trimukha, we are pushing the boundaries of Indian cinema. The teaser offers a glimpse into the world we have painstakingly created. Releasing it in five languages ensures that the raw emotion and scale of the film are accessible to everyone from day one. We can't wait for audiences to experience the full spectacle in theatres.”   The teaser has already garnered a phenomenal response, with fans and critics alike praising its technical prowess, gripping background score, and the intense performances of its cast.  
  'అ ఆ' అనే మూవీ పేరు వింటే చాలు ముందు నితిన్ తర్వాత సమంత ఆ తర్వాత హరితేజ రోల్స్ గుర్తొస్తాయి. హీరోయిన్ తర్వాత అంత మంచి పేరు తెచ్చుకున్న రోల్ హరితేజది. ఐతే రీసెంట్ గా ఈ రోల్ గురించి హరితేజ కొన్ని విషయాలను ఒక ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంది.    "ఈ మూవీలో నా రోల్ కి ఎవరు సరిపోతారా అని వెతుకుతూ ఉండగా ఏదో టీవీ షో చూస్తూ ఒక కుకరీ షో దగ్గర పాజ్ చేశారట. నేను వేసే జోకులు, నేను చేసే ఫన్ ఆ వంటల మీద వంకాయల మీద జోక్స్ చూసి ఈ అమ్మాయిని తీసుకురండి అన్నారట. త్రివిక్రమ్ సినిమా అంటూ నాకు ఫోన్ వచ్చేసరికి నా లైఫ్ మొత్తం పాజ్ ఐపోయినట్టుగా అనిపించింది. వెళ్లాను ఒక్కసారే ఆడిషన్ చేశారు. బాగుందో లేదో కూడా చెప్పలేదు. వారం పది రోజులు ఐపోయింది. మనకెప్పుడూ దరిద్రం బెస్ట్ ఫ్రెండ్, పక్కనే ఉంటుంది కదా.. ఆఫర్ మిస్ అయింది అనుకున్నాను. ఐతే ఆ తర్వాత డైరెక్ట్ గా ఒక మూడు నెలలకు డేట్స్ వచ్చాయి. నాకు క్యారెక్టర్ తెలీదు. అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇదేదో చాలా పెద్ద మ్యాటరే అని.  ఐతే త్రివిక్రమ్ గారు నాకు విషయం అంతా చెప్పలేదు. నాకు మొత్తం చెప్పేస్తే టూ మచ్ బర్డెన్ తో యాక్టింగ్ సరిగా రాదు అని. ఆ తర్వాత మూవీ రిలీజ్ అయ్యాక నాకు సక్సెస్ గురించి తెలిసింది. ఎక్కడికి వెళ్లినా ఈ మూవీ గురించే మాట్లాడేవాళ్ళు. ఈ మూవీ స్టేజి మీద త్రివిక్రమ్ గారు నన్ను పరిచయం చేస్తూ ఈమె యంగ్ సూర్యకాంతం అంటూ పొగిడారు. ఆరోజు నాకు నిద్ర పట్టలేదు. ఎంత ఏడ్చానో, ఎంత నవ్వానో నాకే తెలీదు. ఎం చేయాలో కూడా నాకే తెలీదు."అని చెప్పింది.    అప్పట్లో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఇంతా అని అడిగేసరికి "రోజుకు ఐదు వేలు తీసుకున్న. సీరియల్స్ మానేసే టైములో రోజుకు 12 - 13 మధ్య తీసుకున్నా ఐదారేళ్లకు ముందు" అని చెప్పింది.    
  బాహుబలి సినిమా రెండు పార్టులుగా గతంలో విడుదలైన విషయం తెలిసిందే. రెండు పార్టులు ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయో, అలాగే దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అండ్ టీమ్ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులారిటీ వచ్చిందో తెలిసిందే. ఈ సినిమా రెండు పార్టులు కలిపి ఇప్పుడు ఒకే పార్టు కింద ‘బాహుబలి: ది ఎపిక్’ పేరుతో ఈ నెల 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. దీనికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. దాని రన్ టైమ్ కూడా ఎంతనో చెప్పేశారు. అయితే ఇలా రెండు పార్టులను ఒకే సినిమాగా విడుదల చేయాలని బాహుబలి టీమ్ కి ఆలోచన ఎప్పుడొచ్చిందో తెలియదు కానీ.. ఎనిమిదేళ్ల క్రితమే ప్రముఖ పారిశ్రామిక వేత్త, లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు ఈ ఐడియా ఇవ్వడం విశేషం. (Baahubali: The Epic)   అసలు విషయం ఏంటంటే... బాహుబలి-2 (ఏప్రిల్ 28, 2017) విడుదలైన వారానికి లాయిడ్ గ్రూప్ అధినేత విక్రం నారాయణరావు ట్విట్టర్ లో దర్శకుడు రాజమౌళిని ట్యాగ్ చేస్తూ.. మే 6, 2017న ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సారాంశం ఏంటంటే... "రాజమౌళి గారు... బాహుబలి పార్ట్ 1,2 కలిపి ఎడిట్ చేసి ఒక సినిమాగా రిలీజ్ చెయ్యండి. ఇది ఇప్పటి వరకు ప్రపంచ సినిమా చరిత్రలో జరగని అద్భుతం. ఈ అద్భుతంతో మళ్లీ తక్కువలో తక్కువగా రూ.500 కోట్లు కలెక్షన్స్ రాబట్టవచ్చు. అలాగే ప్రేక్షకులకు మరో అద్భుతమైన అనుభూతిని మీ ఎడిటింగ్ సామర్థ్యాలతో చూపించవచ్చు" అని ట్వీట్ వేశారు.    ఎనిమిదేళ్ల క్రితమే ఇలా బాహుబలిని ఒకే సినిమాగా విడుదల చేయాలని ఐడియా ఇచ్చిన విక్రం నారాయణరావుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.    
AR Rahman doesn't need an introduction, he is the most celebrated legend of Indian Music Industry. He has delivering bangers from 90's and Ranjhaana has been one of his best albums. Now, he is composing music for spiritual sequel, Tere Ishk Mein, and he delivered an absolute banger to start with.  In Pop Rock style, he played with guitars and all instruments in his sytle. Arijit Singh's voice works like magic and the throw, he had in the entire song is another level. Guitar portions and violins make this song eerie and intense while also being melodious indicating a troubled romance.  Tere Ishk Mein stars Dhanush, Kriti Sanon in leading roles. We see their story going through huge emotional hues with Dhanush self-destructing himself and triggering the same path for Kriti, too. Aanand L Rai delievered a memorable film with Ranjhaana and we have to wait and see, what he has in store in more intense romance.  AR Rahman has created a huge anticipation with this banger for the film and it will be one of the most listened tracks in coming days. We have to wait and see, how rest of the tracks will play out as Ranjhaana is a musical blockbuster.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
The demand for the highly anticipated supernatural thriller, 'Shambhala: A Mystical World,' starring the young and versatile actor Aadi Sai Kumar, is currently skyrocketing. The promotional materials released thus far, including posters, a glimpse, a making video, and the teaser, have significantly heightened audience expectations. 'Shambhala' has already become a hot topic within trade circles. Extending Diwali wishes, the makers have also announced the film’s release date. Aadi's Shambhala will hit the screens for Christmas on December 25th, positioning Shambhala as one of the major contenders in the Christmas holiday box office race.The release date poster shows Aadi giving a stern gaze, accompanied by a loyal dog beside him. The background is filled with smoky and fiery effects, creating an intense and mystical atmosphere.  Directed by Ugandhar Muni, under the Shining Pictures banner,  the film has generated substantial buzz in the market, thanks to its compelling promotional content. This anticipation has significantly boosted its market value. The cast features Archana Iyer, Swasika, Ravi Varma, Madhunandan, and Siva Karthik, among others.   The producers, Rajasekhar Annabhimoju and Mahidhar Reddy, have spared no expense in its making, ensuring a massive budget and uncompromising production quality. The film is going to be a visual spectacle, offering a truly immersive cinematic experience. Currently, the post-production work is progressing at a rapid pace. Highlights of the movie are expected to be the compelling visuals provided by Praveen K Bangari and the gripping background music scored by Sricharan Pakala. With its subject matter and content deemed suitable for a Pan-Indian release, the filmmakers have announced the official release date.
తమ ముందుకు వచ్చిన చిత్రం చిన్నదా,పెద్దదా, స్టార్ కాస్టింగ్ ఉందా లేదా అనేది చూడకుండా కంటెంట్, స్క్రీన్ ప్లే బాగుండటంతో ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టే చిత్రాలు అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతుంటాయి. అలాంటి ఒక చిత్రమే 'సు ఫ్రమ్ సో(Su from So).కన్నడంలో తెరకెక్కగా  తెలుగు నాట కూడా రిలీజయ్యి ఘన విజయాన్ని అందుకుంది. మిస్టరీ కామెడీగా తెరెకెక్కిన ఈ చిత్రంలో 'కరుణాకర్ గురూజీ' అనే క్యారక్టర్ లో అత్యద్భుతంగా నటించి అశేష అభిమానులని సంపాదించుకున్నాడు రాజ్ బి శెట్టి . దీంతో రాజ్ బి శెట్టి(Raj B Shetty)తదుపరి చిత్రం కోసం అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రాజ్ బి శెట్టి ప్రధాన పాత్రలో 'జుగారి క్రాస్'(Jugari Cross)అనే విభిన్న టైటిల్ తో కూడిన  చిత్రం రాబోతుంది. ఈ మేరకు ఈ చిత్రాన్ని అధికారకంగా ప్రకటిస్తు చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి టీజర్ రిలీజ్ చేసింది. సుమారు నిమిషం ముప్పై తొమ్మిది సెకన్ల నిడివి ఉన్న టీజర్ చూస్తుంటే మూవీ ఏ ఉదేశ్యంతో తెరకెక్కబోతుందో   అనే విషయం అర్ధమవుతుంది.సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా వీడియోలో చూపించిన పలు అంశాలు చూస్తుంటే ఒళ్ళు జలదరిస్తుంది. 'ఎవర్నైనా చంపుతున్నపుడు రక్షించడానికి ఈ ప్రపంచంలో ఏదైనా మతం ఉందా! అనే సంభాషణ ప్రధాన హైలెట్ గా ఉంది.   కన్నడ స్టార్ రచయిత 'కెపీ పూర్ణ చంద్ర తేజస్వి' రాసిన 'జుగారి క్రాస్' అనే నవల ఆధారంగా తీర్చిదిద్దుతున్నారు ప్రస్థుతానికి రాజ్ బి శెట్టి పేరు నే అధికారంగా ప్రకటించారు. మిగతా నటీనటుల వివరాలు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. గురుదత్త గనిగా(Gurudatha ganiga)దర్శకుడుగా వ్యవహరిస్తున్నాడు.          
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మన దేశంలో జరుపుకుంటున్నన్ని పండుగలు ఏ ఇతర దేశాల్లోనూ జరుపుకోరు. అయితే ఇన్ని పండుగలనూ, పర్వ దినాలనూ ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేమిటి? పండుగ రోజున అభ్యంగనస్నానం చేయడం, కొత్త బట్టలు ధరించడం, పిండి వంటలు చేసుకుని తినడం, బంధు మిత్రులతో సంతోషంగా గడపడం… పండుగలు జరుపుకోవడంలో ఇంతకన్నా వేరే ప్రయోజనాలు లేవా? అని తరచి చూస్తే.. సత్ప్రవర్తన, సదాచారాలను అలవరచు కోవడానికీ. సంస్కృతీ, సంప్రదాయాలను ఇనుమడింపజేసుకోవడానికీ ఉద్దేశించినవే పండుగలు. జీవితం అనే నదికి సంస్కృతీ సంప్రదాయాలు రెండు తీరాల లాంటివి. అందులో ప్రవహించే నీరే ధర్మం. మోక్షానికి ఆధారమైన ధర్మాన్ని ఆచరించినప్పుడే అనంతమయిన సముద్రంలో నది సంగమించినట్లు మానవుడు మాధవునిలో ఐక్యం చెందుతాడు. జీవాత్మ పరమాత్మలో లీనమవుతుంది. ఇదే మానవ జన్మ పరమార్థమైన 'మోక్షం'. దేశమంతటా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకొనే ముఖ్యమైన పండుగల్లో 'దీపావళి' ఒకటి. మన జీవితాల్లో దుఃఖమనే చీకటి పోయి సంతోషమనే వెలుగు వెల్లివిరియాలని, అజ్ఞానమనే చీకటి పోయి జ్ఞానకాంతులు విరాజిల్లాలనీ ఆకాంక్షిస్తూ జరుపుకొనే పండుగ 'దీపావళి'. మన జీవితాలు శాంతిసౌఖ్యాలతో విలసిల్లాలంటే మనలో సత్యధర్మాలు, త్యాగం, సేవాభావాలనే సుగుణాలు వికసించాలి. అలాగే అజ్ఞానం తొలగాలంటే ఆత్మజ్ఞాన ప్రాప్తికి సాధన చేయాలి. దీపావళి పండుగకు సంబంధించి అనేక కథలు మన పురాణాల్లో ఉన్నాయి. వాటిలో నరకాసురుని సంహారం ఒకటి. ప్రాగ్జ్యోతిష పురాన్ని నరకాసురుడు పాలించేవాడు. ఆ రాక్షసుడు దేవతల్ని హింసించేవాడు. నరకాసురుని బారి నుండి తమను రక్షించాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి వేడుకొన్నాడు ఇంద్రుడు. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామా సమేతంగా యుద్ధం చేసి, నరకాసురుణ్ణి సంహరించాడు. అసురులు పెట్టే బాధల నుండి విముక్తి కలిగిన శుభసందర్భాన్ని పురస్కరించుకొని ప్రతీ సంవత్సరం 'దీపావళి' పర్వదినాన్ని జరుపుకోవడం ఆచారంగా వస్తోంది. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సినది ఎంతో ఉంది..  శ్రీకృష్ణుడు నరకాసురునితో యుద్ధానికి సన్నద్ధమవుతున్నప్పుడు  దేవా! నీవు నిశాటసంఘముల నుద్దీపించి చెందాడ నీ ప్రావీణ్యంబులు సూడఁగోరుదుఁ గదా! ప్రాణేశ! మన్నించి నన్నీ వెంటం గొనిపొమ్ము.. అని సత్యభామ అడుగుతుంది.   'ప్రభూ! నీవు రణరంగంలో విజృంభించి రాక్షసుల సమూహాలను చెండాడుతుంటే నీ ప్రావీణ్యం చూడాలని కోరికగా ఉంది. ప్రాణనాథా! నా మాట మన్నించి నన్ను దయతో నీ వెంట తీసుకొని పొమ్ము” అని సత్యభామ శ్రీకృష్ణుణ్ణి వేడుకుంది.  అప్పుడు శ్రీకృష్ణుడు రణరంగం విహార స్థలం కాదనీ అక్కడ వినిపించేవి తుమ్మెదల ఝంకారాలు కావనీ.. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలనీ.. అక్కడ ఉన్నవి రాజహంసలతో నిండిన సరోవరాలు కావు, రాక్షస సైన్య సమూహాలు అనీ సత్యభామను నిరుత్సాహపరుస్తాడు. అప్పుడు సత్యభామ దానవులైన నేమి? మఱి దైత్య సమూహము లైన నేమి? నీ మానితబాహు దుర్గముల మాటున నుండగఁ నేమి శంక?.. అని అంటుంది.  "ప్రభూ! దుర్గాల్లాంటి నీ బాహువులు నాకు అండగా ఉండగా రాక్షస సైన్యం వల్ల నాకేం భయం?”. అని శ్రీకృష్ణునిపై తనకున్న విశ్వాసాన్ని వ్యక్తపరిచింది. అందుకు శ్రీకృష్ణుడు సంతోషించి సత్యభామను తనతోపాటు యుద్ధ రంగానికి తీసుకువెళ్ళాడు. వీణను కూడా పట్టుకోవడం చేతకాని సత్యభామ విల్లును ఎలా పట్టుకుంటుందీ, దారానికి ముత్యాలు గుచ్చలేని కోమలి వాడి అయిన బాణాలను ఎలా సంధిస్తుందీ అని అందరూ సందేహించారు. అందరి సందేహాలూ పటాపంచలయ్యేలా సత్యభామ బాణాల వర్షం కురిపించి రాక్షస సైన్యాన్ని యుద్ధ రంగం నుండి పారిపోయేలా చేసింది. అప్పుడు 'విజయం నిన్నే వరించింది' అంటూ సత్యభామ ధైర్య సాహసాలను మెచ్చుకున్నాడు శ్రీకృష్ణుడు. అప్పటి వరకూ యుద్ధమంటే తెలియని సత్యభామ అంతటి పరాక్రమాన్ని ఎలా ప్రదర్శించగలిగింది? ఆమెకు ఆ శక్తి ఎలా వచ్చింది? సత్యభామకు ధైర్యసాహసాల్ని ప్రదర్శించే శక్తి శ్రీకృష్ణుని నుండి వచ్చింది. ఓ భార్యకు భర్త అండ ఉంటే దక్కిన విజయమది. స్త్రీలో అంతర్లీనంగా ఉన్న శక్తి బయటకు వచ్చి చేకూర్చిన విజయమది. ప్రతి మహిళకు ఇలాంటి సహకారం తప్పనిసరిగా అవసరం.                                   *నిశ్శబ్ద.
  నేటి బిజీ జీవితాల కారణంగా  చాలా మంది తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చుట్టూ పరిస్థితులు,  ప్రపంచంలో జరుగుతున్న మార్పులు, కొత్త పుంతలు తొక్కుతున్న సంస్కృతి మొదలైనవన్నీ నేటి తరం  మనస్సుల్లో  నెగిటివ్ ఆలోచనలకు  కారణం అవుతున్నాయి. వీటి కారణాల వల్ల చాలా మంది మనసులు మరింత అపవిత్రంగా మారుతున్నాయి. ఈ ఆలోచనలు మనస్సులో బాగా పాతుకుపోయిన కొద్దీ జీవితంలో ప్రశాంతత, ఆనందం మాయమవుతాయి. ఈ ప్రతికూల ఆలోచనల నుండి తమను తాము  ఎలా బయటపడేసుకోవాలో తెలుసుకుంటే.. ప్రతికూల ఆలోచనలు వదిలించుకునే మార్గాలు.. ప్రతికూల ఆలోచనలు పోవడానికి దైవ సహాయం చాలా బాగా సహాయపడుతుంది. ప్రతికూల ఆలోచనలను వదిలించుకోవడానికి దైవ ప్రార్థనలు,  జపం, భజనలు మొదలైనవాటిని  అనుసరించవచ్చు. ఇది మనస్సును చాలా వరకు క్లియర్ చేయడంలో  సహాయపడుతుంది.  రోజూ ఇలా చేస్తే నెగిటివ్  ఆలోచనలు వాటికవే క్రమంగా  మాయమవుతాయి. మనిషిని స్నేహం చాలా ప్రభావితం చేస్తుంది. చెడు సహవాసం  వ్యక్తి ఆలోచనలను,  మనస్సును ప్రభావితం చేస్తుంది. చెడు వ్యక్తుల స్నేహంలో, సాహచర్యంలో ఉంటే.. వారితో ఉండే వారి ఆలోచనలు కూడా చెడుగా మారతాయి.  నెగిటివ్ ఆలోచనలు సులభంగా పుట్టుకొస్తాయి.  అందుకే  మంచి వ్యక్తులతో సమయాన్ని గడపాలి. అది  మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. పుస్తక పఠనం  వల్ల  ఆలోచనలను సమతుల్యంగా ఉంచుకోవచ్చు.  మనస్సును పాజిటివ్ శక్తితో నింపుకోవడానికి, ఎల్లప్పుడూ గ్రంథాలను అధ్యయనం చేయాలి. ముఖ్యంగా ఆధ్యాత్మిక గ్రంథాలు, నైతిక విలువలు కలిగిన గ్రంథాలు,  గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు మొదలైనవి  చాలా సహాయపడతాయి. ఆలోచనలను శుభ్రంగా ఉంచుకోవాలన్నా,  చెడు తలపుల   నుండి దూరంగా ఉండాలన్నా ప్రకృతితో సమయం గడపడం చాలా సహాయపడుతుంది. ఇది  మనస్సును ఎల్లప్పుడూ స్వచ్చంగా  ఉంచడంలో సహాయపడుతుంది.   మనస్సులో వచ్చే చెడు ఆలోచనలను కూడా వదిలించుకోవచ్చు. దేవుని నామాన్ని జపించడం వల్ల నెగిటివ్  ఆలోచనలకు దూరంగా ఉండవచ్చు. దైవ నామ స్మరణ వల్ల సానుకూల ఆలోచనలు పెరుగుతూ,  నెగిటివ్ ఆలోచనలు మెల్లిగా తగ్గుతాయి.                                *రూపశ్రీ.
  శ్రీకృష్ణదేవరాయలు 1471 జనవరి 17 (తదితరాభిప్రాయాల ప్రకారం) జన్మించి, 1529 అక్టోబరు 17లో మరణించినవాడయ్యారు. విజయనగర సామ్రాజ్యాన్ని 1509–1529 మధ్య పాలించారు. తుళువ వంశానికి మూడవ రాజుగా ఆయన రాజ్యపీఠాన్ని పొందాడు.  ఆయనకు “ఆంధ్ర భోజుడు”, “కన్నడ రాజ్య రమారమణ”, “మూరు రాయల గండ” వంటి బిరుదులు కూడా ఉన్నాయి. చరిత్రలో సరిగా పొందుపరచబడని కొన్ని విషయాలు.. రాయల మరణ తేదీ.. 2020లో కర్ణాటకలో హొన్నెనహల్లి గ్రామంలోని ఒక శిలాశాసనం ద్వారా శ్రీకృష్ణదేవరాయల మరణ తేదీ ప్రామాణికంగా తేలింది — 1529 అక్టోబర్ 17 న ఆయన మరణించినట్టు శాసనంలో ఉంది.  ఈ శాసనంలో, “కృష్ణదేవరాయ” మరణం తర్వాత హొన్నెనహల్లు గ్రామాన్ని, విష్ణుహనుమంతుని పూజారులకు దీనంగా బహుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.  ఈ శాసనం ద్వారా  కృష్ణ దేవరాయల మరణం గురించి ఖచ్చితమైన సమాచారం లభించింది.  వజ్రశక్తి బిరుదు.. “మూరు రాయల గండ” అంటే.. మూడు రాజుల అధిపతి అనే బిరుదు రాయల వారికి  ఉంది. అంటే మూడు శక్తులను  ఏకంగా ధిక్కరించిన రాజు అని భావించబడుతుంది. అయితే, “ముగ్గురు రాయల గండ”గా ప్రస్తావించబడటం అనేదే కాకుండా.. రాయల వారి సామ్రాజ్య విస్తీర్ణం, రాజకీయ ప్రభావం, మౌలిక సైనిక శక్తి అనే మూడు శక్తుల సమన్వయం కూడా ప్రతిబింబిస్తుందని చెబుతారు. ఉండంతుల జీవనకవి.. ఒక  కథనం ప్రకారం, ఒక చాకలి వ్యక్తి   చిన్న పద్యం  చెప్పినప్పుడు  ఆ పద్యం విన్న కృష్ణదేవరాయలు కలింగ మీద విజయం సాధించాడట.  ఒక సాధారణ వ్యక్తి మాటలు కూడా రాజును ప్రభావితం చేయగలవని, రాజు ప్రజాభిప్రాయానికి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా ఉండాలని అంటుంటారు.  సైన్య ఎంపిక.. ప్రాచీన కాలంలో శత్రురాజులు మత బేధాలు సృష్టించి దాడులకు పాల్పడే వారు. కానీ కృష్ణదేవరాయలు తన సైన్య ఎంపికలో మత పరిమితి లేకుండా  ప్రతిభ ఉన్న అన్ని మతాల వ్యక్తులను ఎంపిక చేశారని  కొన్ని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. కృష్ణదేవరాయలు విజయాలకు గల కారణాల్లో సైన్యం ఎంపిక కూడాీ ఒక కారణం అని అంటారు. అంతేకాదు.. యుద్దంలో  వారిని వైద్యం కోసం తీసుకెళ్లడానికి అంబులెన్స్ తరహా పద్దతి  ఉండేదట.  వైద్యులు, విదేశీ సైనిక సలహాదారులు కూడా ఉండేవారని అంటారు . “విజయనగరం – అత్యుత్తమ నగరం”.. పోర్టుగీసు ప్రయాణికుడు డొమింగో పేస్ వ్రాసిన రచనలో, అతను విజయనగరం గురించి “the best provided city in the world” అని వ్యాఖ్యానించాడు. ఆయన ఉహించిన ఆహార, వాహన వ్యవస్థలు, నీటి సరఫరా, స్ధానిక సంస్థలు.. ఇతర అవసరాల కేటాయింపు విషయాలు, నగర నిర్మాణ వ్యూహాలు.. ఇలా చాలా అంశాలు విజయ నగరాన్ని అప్పట్లో అత్యుత్తమ నగరం అని,  సంపన్న నగరం అని పేర్కొంటున్నాయి.                                         *రూపశ్రీ.
భారతదేశంలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 45 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 20% మంది దీని బారిన పడ్డారు. దీని అర్థం భారతదేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్ కలిగి ఉన్నారు. అయితే డయాబెటిస్ ఉంది కదా అని కొన్ని సంతోషాలు వదిలేసుకోలేం. వాటిలో పండుగ నాడు తీసుకునే ఆహారం ప్రథమ స్థానంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో నోరు కట్టేసుకున్నా.. పండుగ రోజుల్లో మాత్రం తప్పనిసరిగా నోటికి రుచులతో వింధు చేయాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం తీసుకునే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది ఏకంగా స్వీట్లు తినాలి,  ఆరోగ్యం పాడవ్వకూడదు అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. షుగర్  షాక్.. దీపావళి వంటి పండుగల సమయంలో ఇంట్లో చాలా స్వీట్లు ఉంటాయి. రసగుల్లా, గులాబ్ జామున్ లేదా లడ్డులో చక్కెర,  నెయ్యి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలు శరీరంలోకి గ్లూకోజ్‌ను త్వరగా విడుదల చేస్తాయి, దీనివల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది.  డయాబెటిస్ ఉన్నవారిలో ఇది ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే, మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు పండుగల సమయంలో 20-30% పెరుగుతాయి. స్వీట్లతో పాటు, వేయించిన చిరుతిళ్లు,  ఒత్తిడి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు. పండుగ సందర్భంలో స్వీట్లు తినే మార్గం.. ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా రుచికరంగా ఉండే విధంగా స్వీట్లు  తినడం ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం మితంగా స్వీట్లు తినడం. ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు.  స్వీట్లు తినడం  కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. వాటిని తినడానికి ముందు తగినంత ప్రోటీన్,  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంటే  సలాడ్ లాంటివి  తిన్న తర్వాత కొద్దిగా స్వీట్లు తినవచ్చు. స్వీట్లు తినడానికి మంచి చిట్కాలు.. ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు.. ఖాళీ కడుపుతో స్వీట్లు తినడం వల్ల గ్లూకోజ్ త్వరగా రక్తప్రవాహంలోకి విడుదలై చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. కడుపులో కొంత ప్రోటీన్ లేదా ఫైబర్ ఉన్నప్పుడు స్వీట్లు తింటే చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది. భోజనంలో ముందుగా స్వీట్లు తినకూడదు.. ప్రధాన భోజనానికి ముందు స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. కూరగాయలు, పప్పులు లేదా సలాడ్లు ముందుగా తినడం వల్ల గ్లూకోజ్ శోషణ నెమ్మదిస్తుంది. ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు.. ఎక్కువ తీపి పదార్థాలు తినడం వల్ల ఇన్సులిన్ పై అకస్మాత్తుగా ఒత్తిడి పడుతుంది. శరీరం దానిని నియంత్రించలేకపోతుంది.  చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి. భోజనానికి ముందు ప్రోటీన్, ఫైబర్ తినాలి.. ప్రోటీన్,  ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తాయి.  ఇన్సులిన్ బాగా పనిచేయడానికి సహాయపడతాయి. కొవ్వు తక్కువగా ఉండే స్వీట్లను ఎంచుకోవాలి.. డ్రైఫ్రూట్స్,  స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి. అకస్మాత్తుగా  చక్కెర పెరగడాన్ని నివారిస్తాయి. కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు వద్దు.. కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  బరువు పెరగడానికి దారితీస్తుంది. కృత్రిమ తీపి పదార్థాలు కలిగిన స్వీట్లు వద్దు.. కృత్రిమ తీపి పదార్థాలు కొంతమందిలో గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. సహజమైన,  తక్కువ చక్కెర కలిగిన స్వీట్లు మంచివి. పడుకునే ముందు స్వీట్లు తినకూడదు.. రాత్రిపూట రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుంది. రాత్రి స స్వీట్లు తినడం వల్ల ఉదయం హైపర్గ్లైసీమియా వస్తుంది. నిద్రలో ఇన్సులిన్ స్థాయిలు  సరైనవి కావు. భోజనం తర్వాత 1 టీస్పూన్ వెనిగర్ తీసుకోవాలి..  ఎక్కువగా స్వీట్లు తిన్నట్లయితే.. తిన్న తర్వాత అర కప్పు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి త్రాగాలి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  సీజన్‌ను బట్టి మార్కెట్లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. వాటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఆ సీజన్ లో వచ్చే  అనారోగ్యాలకు ఆ సీజన్ లో లభించే పండ్లే చెక్ పెడుతుంటాయి.  వీటిలో ఒకటి వాటర్ చెస్ట్‌నట. ఇది  శీతాకాలపు సూపర్‌ఫుడ్‌.  ఇతర సీజన్ లలో డ్రై ఫ్రూట్ రూపంలో కూడా లభిస్తుంది. వాటర్ చెస్ట్ నట్ ఆరోగ్యానికి చాలా చక్కని ఔషదం అని, దీంతో అనేక ఆరోగ్య ప్రయోజాలు ఉన్నాయని అంటున్నారు. దీని గురించి  తెలుసుకుంటే.. వాటర్ చెస్ట్ నట్ లో పోషకాలు.. ఈ పండులో అనేక విటమిన్లు, ఖనిజాలు, పోషకాలు,  యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. దీనిలోని ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు,  యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని వివిధ వ్యాధుల నుండి రక్షించడంలో,   ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో పాత్ర పోషిస్తాయి.   ఆయుర్వేదంలో వాటర్ చెస్ట్ నట్స్ కు చాలా   ప్రాముఖ్యత కలిగి ఉంది, ఈ పండు రుచిగా మాత్రమే కాదు, ఆరోగ్య ఔషధం కూడా. పిసిఓఎస్ మహిళలకు.. PCOS, లేదా పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది  హార్మోన్ సమస్యల వల్ల వచ్చే  సమస్య. దీనిలో హార్మోన్ల స్థాయిలు అసమతుల్యమవుతాయి,  అండాశయాలలో తిత్తులు ఏర్పడతాయి. ఇది నెలసరి సరిగా రాకపోవడం,  పిల్లలు పుట్టడంలో ఇబ్బందులు, , అవాంఛిత రోమాలు, మొటిమలు,  బరువు పెరగడం వంటి లక్షణాలకు దారితీస్తుంది.  PCOSతో బాధపడేవారు వాటర్ చెస్ట్‌నట్‌లను తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది,  సంతానోత్పత్తికి సపోర్ట్  ఇస్తుంది. డయాబెటిస్.. వాటర్ చెస్ట్‌నట్‌లు డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, ఇది చక్కెర పెరుగుదలను నివారిస్తుంది . వీటిలో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం సులభం చేస్తుంది. జీర్ణక్రియ.. వాటర్ చెస్ట్‌నట్‌లు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.  ఎందుకంటే వాటిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు సపోర్ట్  ఇస్తుంది. జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.  వీటిని తినడం వల్ల అసిడిటీ,  గుండెల్లో మంట నుండి ఉపశమనం లభిస్తుంది. ఎముకలు, జుట్టు ఆరోగ్యం.. వాటర్ చెస్ట్‌నట్‌లు ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి కూడా తోడ్పడతాయి. వాటర్ చెస్ట్‌నట్‌లలో కాల్షియం, మెగ్నీషియం,  భాస్వరం వంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా,  బలంగా ఉంచడానికి సహాయపడతాయి. దంతాలు,  జుట్టును కూడా బలోపేతం చేస్తాయి. బలహీనత, అలసట.. వాటర్ చెస్ట్‌నట్‌లను తీసుకోవడం వల్ల సాధారణ బలహీనత,  అలసట నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ పండు శరీరానికి సమృద్ధిగా పోషణను అందిస్తుంది, ఎనర్జీని  పెంచుతుంది.                       *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  బాదం, జీడిపప్పు లాగా వాల్నట్స్ ను కూడా చాలామంది డ్రై ఫ్రూట్ గా తింటారు.  ఇవి ధర కాస్త ఎక్కువే కానీ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.  మెదడు ఆకారాన్ని పోలి ఉండే ఈ వాల్నట్స్ ను రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకుంటే అద్బుతమైన ప్రయోజనాలు ఉంటాయి. సాధారణంగా ఎండు వాల్నట్స్ మాత్రమే ఎక్కువ అందుబాటులో ఉంటాయి. కానీ నిజానికి వాల్నట్స్ ను పచ్చిగా ఉండగానే తింటే దాదాపు వెనీలా సువాసనతో చాలా రుచిగా ఉంటాయి.  అసలు వాల్నట్స్ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. బ్రెయిన్ పవర్.. చూడ్డానికి అచ్చం మెదడు ఆకారాన్ని, మెదడుకు ఉన్న మలుపులను పోలి ఉండే వాల్నట్స్ తింటే బ్రెయిన్ పవర్ పెరుగుతుంది. వాల్నట్స్ లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి.  ఇవి జ్ఞాపకశక్తిని,  ఆలోచనా సామర్థ్యాన్ని పెంచుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగ్గా ఉండటానికి వాల్నట్స్ బాగా సహాయపడతాయి. గుండె ఆరోగ్యం.. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 ప్యాటీ కొవ్వులు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి.  ఇవి గుండెకు చాలా అవసరం.  గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.  ముఖ్యంగా ఆరోగ్యకరమైన కొవ్వులు శరీరానికి అందుతూ ఉంటే.. శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా నెమ్మదిగా తగ్గుతుంది.  అంటే.. వాల్నట్స్ తింటే చెడు కొవ్వులను కూడా తగ్గించుకోవచ్చు. ఫైబర్, ప్రోటీన్.. వాల్నట్స్ లో ఫైబర్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిని తినడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీల్ ఇస్తుంది. పదే పదే ఆకలి కావడం,  ఎక్కువగా తినడాన్ని నివారించడంలో సహాయపడుతుంది. తద్వారా బరువు కూడా తగ్గవచ్చు. జీర్ణక్రియ.. వాల్నట్స్ లో మంచి మొత్తంలో ఫైబర్ ఉంటుంది.  ఇది జీర్మవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్దకం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. బోన్ స్ట్రెంత్.. వాల్నట్స్ లో కాల్షియంతో పాటు ఇతర ఖనిజాలు కూడా ఉంటాయి.  ఇవి ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండటంలో కూడా సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వాల్నట్స్ లో ఉండే సమ్మేళనాలు మానసిక స్థితిని మెరుగుపరచడంలో అద్భుతంగా సహాయపడతాయి.  ఇవి మెదడు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి కాబట్టి మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతాయి.  చిరాకు, అసహనం,  ఒత్తిడి వంటి వాటిని అదుపులో ఉంచుకునే దిశగా మెదడుకు ఓదార్పును ఇస్తాయి. హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తిలో సహాయపడుతుంది. నిద్ర.. వాల్నట్స్ లో మెలటోనిన్ అనే పదార్థం ఉంటుంది.  ఇది నిద్ర నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. సాయంత్రం వాల్నట్స్ తింటే రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవచ్చు. ఇమ్యూనిటీ.. వాల్నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  ఇవి శరీరంలో హానికరమైన కణాలతో పోరాడి శరీరాన్ని వ్యాధుల బారి నుండి రక్షిస్తాయి.                           *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...