LATEST NEWS
  కర్ణాటక పాలిటిక్స్‌లోకి టీవీకే ఎంట్రీ సంచలన వ్యూహం.. దక్షిణాది సినీ రంగంలో తిరుగులేని చక్రవర్తిగా వెలిగి, ఇటీవల జరిగిన 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు సృష్టించిన కోలీవుడ్ సూపర్ స్టార్, 'దళపతి' విజయ్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. తమిళనాడులో తన సొంత పార్టీ 'తమిళగ వెట్రి కజగం' (TVK) తరఫున ఒంటరిగా బరిలోకి దిగి 34.9 శాతం ఓట్ల శాతాన్ని కొల్లగొట్టడమే కాకుండా, ఏకంగా 108 స్థానాలను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్, కాంగ్రెస్ మరియు సీపీఐ(ఎం) మద్దతుతో 118 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఫిగర్‌ను దాటి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.  అయితే తమిళనాడులో సాధించిన ఈ చారిత్రాత్మక విజయంతో ఆయన ప్రస్థానం ఆగడం లేదు. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టేందుకు దళపతి విజయ్ వ్యూహాత్మక అడుగులు వేస్తుండటం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ఈ వార్త రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు రేపుతోంది.  ముఖ్యంగా కర్ణాటకలోని బెంగుళూరు నగరంతో పాటు తమిళ ప్రజలు అధిక సంఖ్యలో నివసించే సరిహద్దు జిల్లాలను లక్ష్యంగా చేసుకుని విజయ్ తన 'టివికె' పార్టీని విస్తరించాలని యోచిస్తున్నారు.  కర్ణాటకలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ముఖ్యంగా బృహత్ బెంగళూరు మహానగర పాలిక (BBMP) మరియు గ్రామీణ స్థానిక సంస్థల (GBA) ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దించడానికి గ్రౌండ్ వర్క్ సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కర్ణాటక వ్యాప్తంగా విజయ్‌కు లక్షలాది మంది అభిమానులు ఉండటం, బెంగళూరులోని కొన్ని ప్రాంతాలలో తమిళ ఓటర్ల శాతం దాదాపు 25 నుండి 30 శాతం వరకు ఉండటంతో ఈ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకోవచ్చని టీవీకే అధినేత భావిస్తున్నారు.  ఈ పరిణామాలు కర్ణాటకలోని అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి మరియు ప్రతిపక్ష బీజేపీ-జేడీఎస్ కూటమికి పెద్ద తలనొప్పిగా మారేలా కనిపిస్తున్నాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఇప్పటికే అంతర్గత నివేదికల ద్వారా విజయ్ ఎంట్రీ ప్రభావంపై ఆరా తీస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. తమిళనాడులో 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టిన కేవలం రెండేళ్లలోనే ద్రావిడ దిగ్గజాలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలను మట్టికరిపించి 234 స్థానాల్లోనూ బలమైన ఉనికిని చాటుకున్న విజయ్ క్రేజ్ సాధారణమైనది కాదు.  గతంలో 2025 సెప్టెంబర్ 27న జరిగిన కరూర్ భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి 41 మంది అభిమానులు మరణించిన దురదృష్టకర సంఘటన జరిగినప్పటికీ, విజయ్ ప్రజాబలం ఏమాత్రం తగ్గలేదు. అటువంటి ప్రజాకర్షణ కలిగిన నాయకుడు బెంగళూరు రాజకీయాల్లో వేలు పెడితే, అది కర్ణాటక పాలిటిక్స్ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తుందనడంలో సందేహం లేదు. రాబోయే రోజుల్లో దళపతి విజయ్ కర్ణాటక పర్యటనకు రానున్నట్లు సమాచారం రావడంతో కన్నడ నాట రాజకీయం మరింత వేడెక్కింది  
  బీజేపీ ఎదుగుదలకు కాంగ్రెస్సే అసలు కారణమన్న మాజీ డిప్యూటీ సీఎం.. తమిళనాడు రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని 'తమిళగ వెట్రి కళగం' (టీవీకే) మైనారిటీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మద్దతు ప్రకటించింది. ఈ పరిణామంతో డీఎంకే కూటమిలో తీవ్ర అసంతృప్తి, అగ్నిపర్వతం బద్దలైంది. డీఎంకే యువజన విభాగం అధినేత ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమైన పార్టీ అంతర్గత సమావేశంలో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, హస్తం పార్టీకి కనీస కృతజ్ఞతా భావం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రతిష్ఠ, డీఎంకే కార్యకర్తల అహర్నిశల శ్రమ వల్లే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఐదుగురు శాసనసభ్యులను గెలిపించుకోగలిగిందని గుర్తు చేశారు. కానీ నేడు అధికార కాంక్షతో, తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా విజయ్ పార్టీ వైపు వెళ్లడం దారుణమన్నారు. కాంగ్రెస్‌ను ఒక 'వెన్నుపోటుదారు'గా అభివర్ణించారు. ఇకపై కాంగ్రెస్ పార్టీని ఎట్టిపరిస్థితుల్లోనూ నమ్మకూడదని, ఆ పార్టీని తమ దరిదాపుల్లోకి కూడా రానివ్వకూడదని డీఎంకే శ్రేణులకు ఉదయనిధి పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాలకు పాల్పడుతున్న వారికి తమిళనాడు ఓటర్లు త్వరలోనే సరైన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. దేశంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఇంతలా బలోపేతం కావడానికి నరేంద్ర మోదీ, అమిత్ షా కారణం కాదని, అసలు కారణం కాంగ్రెస్ చేతకానితనమేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో డీఎంకే పార్టీ ప్రత్యేక తీర్మానాలను ఆమోదించింది. కాంగ్రెస్ పార్టీని మిత్రపక్షాల శ్రమను దోచుకునే జలగలుగా ఆ తీర్మానంలో పేర్కొనడం గమనార్హం. గతంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఉనికిని కాపాడింది డీఎంకే అధినేత ఎంకే స్టాలినే అని పార్టీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే సుప్రీమో ఎంకే స్టాలిన్ సైతం సరికొత్త విజయ్ ప్రభుత్వంపై విమర్శల బాణాలు విసిరారు. నటుడు విజయ్ నేతృత్వంలోని ఈ సంకీర్ణ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని జోస్యం చెప్పారు. కేవలం 120 మంది ఎమ్మెల్యేల మద్దతుతో నడుస్తున్న ఈ సర్కార్ ఏ క్షణంలోనైనా కూలిపోవడం ఖాయమని అన్నారు. సీపీఐ, సీపీఎం, వీసీకే వంటి డీఎంకే పాత మిత్రపక్షాలన్నీ ఇప్పుడు మంత్రిపదవుల కోసం విజయ్ ప్రభుత్వంలో చేరడాన్ని స్టాలిన్ తప్పుబట్టారు. చిన్న పిల్లలకు కొత్త బొమ్మలు దొరికితే కొద్దిరోజులు ఆడుకుని బోర్ కొట్టినట్లు, ప్రజలకు కూడా ఈ నటుడి పాలనపై త్వరలోనే విరక్తి కలుగుతుందని ఎద్దేవా చేశారు. ప్రజలు మళ్లీ తమ వైపే చూస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తమిళనాడులో సరికొత్త రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. డీఎంకే ఒంటరి పోరాటానికి సిద్ధమవుతుండగా, విజయ్ నేతృత్వంలోని కూటమి తమ బలాన్ని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో తమిళ రాజకీయాల్లో ప్రజా తీర్పు ఎటువైపు మొగ్గుతుందో వేచి చూడాలి.  
గొడ్డలి పార్టీ. ఈ పదం ప్రధానంగా వైసీపీని విమర్శించడానికి కూటమి నేతలు తరచూ వాడుతున్నారు. ఇక చంద్రబాబు అయితే.. సమాజానికి గొడ్డలి పార్టీ హానికరం అని మరో మారు కామెంట్ చేశారు. గొడ్డలి పార్టీ నెవర్‌ అగైన్‌ అనే క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు.  రప్పారప్పా రంకెలు.. జంతు రక్తంతో కటౌట్లకు అభిషేకాలా? సీబీఎన్‌ దగ్గర తోక జాడిస్తే.. ప్రజాహితం కోసం తోక కట్ చేస్తానని హెచ్చరించారు. గొడ్డలి పార్టీ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు, ప్రజాస్వామ్యంలో ఆ పార్టీకి చోటులేదని కూడా అన్నారు. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ప్రాణాలు, ఆస్తులకు రక్షణ ఇవ్వాలి. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రోజుకొక నాటకమాడుతున్నారు. అసత్య ప్రచారాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. కోడి కత్తి, గులకరాయి నాటకాలు గుర్తున్నాయి కదా? దళిత యువకుడు సుబ్రమణ్యాన్ని హత్య చేసి డోర్‌ డెలివరీ చేసిన వారికి సన్మానాలా? కుటుంబ బంధాలపై గొడ్డలి వేటు.. తల్లి, చెల్లికి ఆస్తులివ్వకుండా వేధించారు. తల్లి, చెల్లికి న్యాయం చేయలేని వారు.. ప్రజలను ఏం చూస్తారని ప్రశ్నించారు.  కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. నేను ప్రజల సేవకుణ్ణి.. పెత్తందారు కాదు. నిరంతరం పనిచేసి పేదల రుణం తీర్చుకుంటా. ప్రజల ఆస్తులు, ప్రాణాలకు రక్షణ కల్పించింది- ఎన్డీయే కూటమి  అంటూ కామెంట్ చేశారు ఏపీ సీఎం. దీనంతటికీ కారణం.. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో గొడ్డలి వాడకం తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటినుంచి ప్రత్యర్థి పార్టీలు వైసిపిని టార్గెట్ చేస్తూ గొడ్డలి పార్టీ అని, ఆ పార్టీ సంస్కృతిని గొడ్డలి సంస్కృతి అని పిలుస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు చంద్రాబు తదితర కూటమి పార్టీల నేతలు.. ఇక పోతే కాక్రోచ్ ఆర్ బొద్దింక. ఇటీవల దేశ రాజకీయాల్లో బాగా వైరల్ అయిందీ పదం. ఎలా పుట్టింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ? అని చూస్తే.. సుప్రీం కోర్ట్  కోర్టు విచారణల సందర్భంలో దేశంలోని నిరుద్యోగ యువతను, కొందరు సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉద్దేశించి బొద్దింకలు, సమాజ పరాన్న జీవులు అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆ తర్వాత ఆయన వివరణ ఇచ్చుకున్నా.. అది కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కొత్త రూపు తీసుకుని ఫాలోయర్స్ సంఖ్య అమాంతం పెంచుకుని కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుత కాలమాన పరిస్థితులపై ఒక వ్యంగ్యాస్త్రంగానూ నిలుస్తోంది.  ఇలాంటివే మరికొన్ని పదాలను చూస్తే.. పేటీఎం బ్యాచ్, రూ.5 బ్యాచ్.. ఇవి గత కొన్నేళ్లుగా ఉన్నా, ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న పదాల్లో కొన్ని.  ఒక పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడానికి, ట్రోల్స్ చేయడానికి డబ్బులు తీసుకునే వారిని,  మరీ ముఖ్యంగా వైసిపి సోషల్ మీడియా వింగ్‌ను, టిడిపి, జనసేన శ్రేణులు  పేటీఎం బ్యాచ్ అని పిలుస్తుంటారు. ప్రతి పోస్టుకు ఐదు రూపాయలు ఇస్తారనే ప్రచారంతో  ఐదు రూపాయల బ్యాచ్ అని కూడా అంటారు. ఇక పోతే ఇటీవలి కాలంలో బాగా ట్రెండింగ్ లోకి వచ్చిన ఇంకో పదం..  మెలోడీ- ఇది మరీ ఇంటర్నేషనల్ క్రేజ్. ఇది ఏ ఒక్క దేశానికో పరిమితమైన పదం కాదు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని పేర్లను కలిపి నెటిజన్లు సృష్టించిన   నేమ్ మెలోడీ.  అంతర్జాతీయ సదస్సుల్లో వీరిద్దరూ కలిసినప్పుడు దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహపూర్వక సంభాషణలు, నవ్వులను చూసి నెటిజన్లు  మెలోడీ అనే హ్యాష్‌ట్యాగ్‌తో వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ సృష్టించారు. స్వయంగా ఇటలీ ప్రధాని మెలోని కూడా ఒక సెల్ఫీ వీడియో పెడుతూ " హలో ఫ్రం మెలోడీ టీమ్’  అనడంతో ఈ పదం గ్లోబల్ ట్రెండ్ అయిపోయింది. టాఫీ డిప్లమసీ లేదా చాక్లెట్ రాజకీయం కూడా ఇదే కోవలోకి వచ్చే పదమే.  ఇక రీల్స్ మంత్రి, బిర్యానీ పాలిటిక్స్ అంటూ రకరకాల మీమ్స్ కమ్ వర్డ్స్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాయి. ఒకప్పుడు రాజకీయం అంటే కేవలం సీరియస్ ఉపన్యాసాలు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు.. గొడ్డలి పార్టీ, కాక్రోచ్ పార్టీ అంటూ సెటైరికల్ కామెంట్లతో పాటు మెలోడీ, టాఫీలాంటి సిల్లీ పదాల వల్ల పాలిటిక్స్ కాస్త ఎంటర్‌టైన్‌మెంట్‌గా, మీమ్స్ మెటీరియల్‌గా మారిపోయాయి.
తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట  పర్యటన తీవ్ర రాజకీయ దుమారానికి,  ప్రొటోకాల్ వివాదానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 100 కోట్ల రూపాయల వ్యయంతో ఆలయ పరిసరాల్లో ప్రతిష్టాత్మకమైన శంకుస్థాపనలు, అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేందుకు  శనివారం (మే23) యాదగిరిగుట్ట పర్యటన చేపట్టారు. అయితే..  అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ అధికారిక పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులకు,  కీలక అధికారులకు  సమాచారం ఇవ్వలేదనీ, తగిన ఆహ్వానం అందలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వల్లే ఈ   ప్రొటోకాల్ లోపం తలెత్తిందని ప్రతిపక్షాలు, కొందరు స్థానిక నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.   అదలా ఉండగా, సీఎం, మంత్రుల హెలికాప్టర్ పెద్దగుట్టపై ల్యాండ్ అయినప్పటికీ.. అక్కడ వారిని రిసీవ్ చేసుకోవడానికి కనీసం ఒక్క జిల్లా ఉన్నతాధికారి కూడా అందుబాటులో లేకపోవడం తీవ్ర కలకలం రేపింది. వేద పాఠశాల శంకుస్థాపన ప్రాంగణమైన పెద్ద గుట్టపై సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయినా,  అధికారుల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్, సమన్వయ రాహిత్యం కారణంగా ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు   కలెక్టర్ గానీ, ఎస్పీ గానీ, ఇతర ప్రోటోకాల్ అధికారులు గానీ సమయానికి అక్కడకు చేరుకోలేకపోయారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఏకంగా 15 నిమిషాల పాటు హెలికాప్టర్ లోనే వేచి ఉండాల్సి వచ్చింది. వీఐపీ పర్యటనలో స్థానిక యంత్రాంగం ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శించడంపై సచివాలయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన సీఎం పర్యటనలో జిల్లా కలెక్టరేట్, పోలీస్ యంత్రాంగం వైఫల్యంపై ఉన్నతాధికారులు నివేదిక కోరినట్లు సమాచారం. 
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మంత్రి నారా లోకేష్ విమర్శల వర్షం కురిపించారు. రాయలసీమ బిడ్డగా చెప్పుకునే జగన్ నిజానికి రాయలసీమకు పట్టిన క్యాన్సర్ అన్నారు.  కడప పర్యటనలో భాగంగా లోకేష్, రాయలసీమ అభివృద్ధి, గత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడారు.  జగన్   మాటలు తప్పడం, మడమ తిప్పడంలోనే దిట్ట అన్న లోకేష్..   ఐదేళ్ల వైసీపీ పాలనలో రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని, నిర్లక్ష్యాన్ని   గణాంకాలతో సహా ఎండగట్టారు. జగన్ హయాంలో సీమ ప్రాంత ప్రయోజనాలను పూర్తిగా విస్మరించారని విమర్శించారు.   రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో   టీడీపీ ప్రభుత్వానికి, వైసీపీ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని నారా లోకేష్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించారు. గతంలో అంటే 2014 - 2019 కాలంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాయలసీమ సాగునీరు, తాగునీటి ప్రాజెక్టుల కోసం ఏకంగా రూ. 11,000 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తుచేశారు.  అయితే.. సీమ బిడ్డనని గొప్పలు చెప్పుకునే జగన్ తాను సీఎంగా ఉన్న  ఐదేళ్ల ముఖ్యమంత్రి కాలంలో కేవలం రూ. 2,700 కోట్లు మాత్రమే కేటాయించి ఈ ప్రాంతాన్ని పూర్తిగా ఎడారిగా మార్చేందుకు ప్రయత్నించారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అప్పర్ తుంగభద్ర ప్రాజెక్టు కోసం రూ. 5,300 కోట్లు కేటాయించినప్పుడు, దానివల్ల రాయలసీమకు జరిగే నష్టాన్ని ఆపడంలో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. అన్నమయ్య ప్రాజెక్టు గేట్ల మరమ్మతులను సైతం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ రైతాంగానికి వెన్నుదన్నుగా నిలిచిన డ్రిప్ ఇరిగేషన్  అంటే బిందు సేద్యం ) వ్యవస్థను జగన్  రద్దు చేసి రైతుల పొట్ట కొట్టారని విమర్శించారు.   టీడీపీ  హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీతో, అలాగే మిగిలిన రైతులకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను అందించి అండగా నిలిచిందని గుర్తు చేశారు.  తన  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ డ్రామాలు ఆడుతున్నారని, ఆయన నటన చూస్తే  ఆయనకు భాస్కర్ అవార్డు ఖాయంగా వస్తుందని ఎద్దేవా చేశారు.  సొంత బాబాయ్ వివేకానంద రెడ్డి అత్యంత దారుణంగా హత్యకు గురైతే, ఆ ఘోరమైన నిజాన్ని కప్పిపుచ్చి రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబుపైకి నెట్టేందుకు జగన్ ఎంతటి డ్రామాలు ఆడారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు మంత్రి లోకేష్ స్పష్టం చేశారు.  మిషన్ రాయలసీమ  పేరుతో ఈ ప్రాంతాన్ని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్,  డిఫెన్స్ హబ్‌గా మారుస్తున్నామన్న లోకేష్ . పుట్టపర్తిలో  ఐదో తరం యుద్ధ విమానాల (ఎఎంసీఏ) తయారీ కేంద్రానికి రూ. 15,803 కోట్లతో శంకుస్థాపన చేయడం రాయలసీమ చరిత్రలోనే ఒక మైలురాయి అని పేర్కొన్నారు. జగన్ పాలన కేవలం ఫ్యాక్షనిజం, కమిషన్ల చుట్టూ తిరిగితే, తమ కూటమి ప్రభుత్వం ఫైటర్ జెట్ల తయారీతో సీమ యువతకు ఉపాధి కల్పిస్తోందని గర్వంగా ప్రకటించారు. రాబోయే రోజుల్లో రాయలసీమను రత్నాల సీమగా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని నారా లోకేష్ పునరుద్ఘాటించారు.
ALSO ON TELUGUONE N E W S
Ananya Panday is facing severe backlash on social media for her dance sequence in the recently released romantic drama, Chand Mera Dil. A clip of her performing a fusion of Bharatanatyam and modern hip-hop in the film has gone viral, and netizens are not holding back their criticism. Many users trolled the actress for her stiff movements and lack of facial expressions, with one viral comment joking that she turned the sacred art form of "Bharatanatyam into Bharta." People called the performance robotic and accused her of disrespecting a 2000-year-old cultural legacy. Even prominent figures weighed in on the controversy.  Congress spokesperson Dr. Shama Mohamed tweeted that Ananya "killed" her favorite dance form, while acclaimed classical dancer Anita Ratnam remarked that it looked like Bharatanatyam was being "held hostage." As the trolling intensified, several users began sharing clips of Sai Pallavi from Shyam Singha Roy and Sridevi from Jaag Utha Insan to show how classical dance should actually be performed on screen. However, a few fans defended Ananya, pointing out that in the context of the film, the scene was meant to be an amateur college cultural fusion rather than a pure, professional classical recital. Directed by Vivek Soni, Chand Mera Dil stars Ananya opposite Lakshya and was released in theaters on May 22. Disclaimer: This news article is written based on information shared by various sources. The organization is not responsible for their factual nature. While we try to conduct thorough research, sources can sometimes misguide us. Therefore, we encourage viewers' discretion before reacting to the news.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య(Suriya)కు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉంది. అయితే గత కొంతకాలంగా సరైన థియేట్రికల్ సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సూర్యకు, తాజాగా విడుదలైన ఫాంటసీ యాక్షన్ డ్రామా ‘వీరభద్రుడు’ (తమిళంలో 'కరుప్పు') పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టింది. ఆర్జే బాలాజీ దర్శకత్వంలో త్రిష కథానాయికగా మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు వెర్షన్ 'వీరభద్రుడు' (Veerabhadrudu) బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచే రీతిలో కలెక్షన్ల వర్షం కురిపిస్తూ, మొదటి వారం ముగిసేసరికి బ్రేక్ ఈవెన్ మార్కును దాటి క్లీన్ హిట్ స్టేటస్ వైపు దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ‘వీరభద్రుడు’ చిత్రానికి రూ. 7.2 కోట్ల మేర థియేట్రికల్ బిజినెస్ జరగగా, రూ. 7.5 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ఈ సినిమా బరిలోకి దిగింది. అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా విడుదలై.. మొదటి రోజు నుంచే మాస్ ఎలిమెంట్స్, సూర్య వన్-మ్యాన్ షో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీనితో ఇప్పటికే ఈ సినిమా తెలుగునాట రూ.13 కోట్ల షేర్ రాబట్టి, భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది.  గ్రాస్ పరంగా చూసుకుంటే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో పది రోజుల్లోనే రూ.25 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుత జోరు చూస్తుంటే, తెలుగునాట రూ.30 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఒక్క తెలుగులోనే కాకుండా, తమిళ ఒరిజినల్ వెర్షన్ ‘కరుప్పు’ (Karuppu) కోలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టిస్తోంది. అక్కడ గత తొమ్మిది నెలలుగా ఉన్న బాక్సాఫీస్ డ్రై స్పెల్‌ను బ్రేక్ చేస్తూ, కేవలం 8 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇప్పటిదాకా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 235 కోట్లకు పైగా గ్రాస్ సాధించి, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది.  వరుస పరాజయాల తర్వాత సూర్య బాక్సాఫీస్ స్టామినా ఏంటో 'వీరభద్రుడు' నిరూపించింది. ప్రస్తుతం థియేటర్లలో పెద్దగా పోటీ లేకపోవడంతో, ఈ వారం కూడా ‘వీరభద్రుడు’ మరిన్ని లాభాలను అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  
    - కోకాపేటలో  రెండు ఎకరాల స్థలం తీసుకున్న ప్రభాస్  -ప్రభాస్ డ్రీమ్ మ్యాన్షన్ నిర్మాణం -గ్లోబల్ ఆర్కిటెక్ట్స్‌తో డిజైన్. -లోపల ఉండబోయే అల్ట్రా లగ్జరీ ఫీచర్స్ ఇవే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)హైదరాబాద్‌లోనే అత్యంత ఖరీదైన, లగ్జరీ లొకేషన్‌గా పేరుగాంచిన కోకాపేట(Kokapeta)ఏరియాలో తన సరికొత్త డ్రీమ్ హౌస్ నిర్మాణ పనులని  అధికారికంగా ప్రారంభించారు. రియల్ ఎస్టేట్ పరంగా దూసుకుపోతున్న కోకాపేట ఔటర్ రింగ్ రోడ్  ఎగ్జిట్ సమీపంలో ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ప్రభాస్‌కు చెందిన రెండు ఎకరాల భారీ స్థలంలో ఈ నూతన గృహ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఎకరం భూమి విలువ దాదాపు 150 కోట్లకి  పైగా ఉంది.  అంటే కేవలం ఆయన కొనుగోలు చేసిన ఈ రెండు ఎకరాల ఖాళీ స్థలం విలువే 300  కోట్లకి  పైమాటే. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం, ఈ భారీ స్థలంలో అన్ని రకాల అత్యాధునిక హంగులు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక 'అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్' రూపుదిద్దుకోబోతోంది. అంతర్జాతీయ ఆర్కిటెక్ట్స్ ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ లగ్జరీ ప్యాలెస్‌లో భారీ హోమ్ థియేటర్, అత్యాధునిక జిమ్నేషియం, అద్భుతమైన స్విమ్మింగ్ పూల్, ఇండోర్ స్పోర్ట్స్ ఏరియాని  ప్లాన్ చేశారు. వీటితో పాటు ప్రభాస్ తన సినిమాల సిట్టింగ్స్, కథల చర్చల కోసం ప్రత్యేకంగా ఒక ల్యావిష్ లాంజ్‌ ని  కూడా ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. Also read: 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీ.. ఓటీటీలో ఇదే నంబర్ వన్ ట్రెండింగ్ మూవీ  గతంలో ప్రభాస్ రాయదుర్గంలోని తన గెస్ట్ హౌస్‌ని వేడుకలకి  వేదికగా ఉపయోగించేవారు. అయితే ఆ ప్రాంతం క్రమంగా రద్దీగా మారడంతో, పూర్తి ప్రైవసీని ఇచ్చే పెద్ద స్థలం కోసం ఆయన వెతికారు. ఆ విధంగా  కోకాపేట స్థలాన్ని ఎంచుకున్నారు. ఈ అల్ట్రా ప్రైవేట్ ప్రాపర్టీ నిర్మాణం పూర్తిగా పూర్తి కావడానికి దాదాపు 2 సంవత్సరాల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. షూటింగ్స్ లేని సమయంలో ప్రశాంతంగా గడపడానికి, సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు గ్రాండ్ గా ఆతిథ్యం ఇవ్వడానికి ఈ లగ్జరీ ప్యాలెస్ కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది. ప్రభాస్ ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ, కల్కి పార్ట్ 2 చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.    
మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గుణగణాలపై చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ పాజిటివ్ టాక్ వినిపిస్తూనే ఉంటుంది. ఆయన సెట్స్లో తోటి నటీనటులతో ప్రవర్తించే తీరు, ఇచ్చే గౌరవం అద్భుతమని చాలా మంది చెబుతుంటారు. తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం చరణ్ సంస్కారాన్ని కొనియాడారు. చరణ్ రాబోయే భారీ చిత్రం ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా మెగాఫోన్ పట్టిన లేటెస్ట్ మూవీ ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ తాజా ఇంటర్వ్యూలో పోసాని మాట్లాడుతూ.. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పెద్ది’ సినిమా విడుదలకు అటుఇటుగా తమ సినిమా కూడా థియేటర్లలోకి రానుందని, అయితే చరణ్ సినిమా పెద్ద హిట్ కావాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌తో కలిసి తాను నటించిన సూపర్ హిట్ చిత్రం ‘నాయక్’ నాటి ఒక అపురూపమైన సంఘటనను పోసాని గుర్తుచేసుకున్నారు. వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాలో చరణ్ పక్కన పోసాని చేసిన కామెడీ ట్రాక్ థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయించింది. కొన్ని సీన్లలో హీరో కంటే తన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత లభించిందని, స్క్రీన్ స్పేస్ కూడా ఎక్కువగా దక్కిందని పోసాని పేర్కొన్నారు. సాధారణంగా ఏ స్టార్ హీరో అయినా తనను డామినేట్ చేసేలా సీన్లు ఉంటే ఈగో ఫీలవుతారని, కానీ చరణ్ మాత్రం ఎంతో గొప్పగా ప్రవర్తించారని పోసాని అన్నారు. ఆ సమయంలో చరణ్ తనను ప్రత్యేకంగా పిలిచి.. "పోసాని గారు.. నాన్న సినిమా చూశారు. మీ సీన్లు థియేటర్లలో బాగా పేలుతాయని చెప్పారు. మీ ఉన్న ఒక్క సీన్ కూడా ఎడిటింగ్‌లో తీసేయొద్దని నాన్న ఆర్డర్ వేశారు" అని ఎంతో సంతోషంగా చెప్పినట్లు పోసాని వెల్లడించారు. తోటి నటీనటుల ప్రతిభను అంతలా గౌరవించే గొప్ప మనసు, సంస్కారం రామ్ చరణ్ కి ఉన్నాయని పోసాని ప్రశంసించారు. అందుకే అంత మంచి వ్యక్తి నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పోసాని చేసిన ఈ వ్యాఖ్యలు మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఇంటర్వ్యూ క్లిప్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు, రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రంపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పోసాని ‘ఆపరేషన్ అరుణా రెడ్డి’తో పాటు చరణ్ ‘పెద్ది’ కూడా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
  నిజ జీవిత సంఘటనలు, యథార్థ నేరాల ఆధారంగా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకి  ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. సినిమా ప్రియులు అస్సలు మిస్ అవ్వకూడని టాప్ రేటెడ్ కంటెంట్‌గా డిజిటల్ ఆడియన్స్ నుండి దీనికి భారీ ప్రశంసలు దక్కుతున్నాయి. అదే బాలీవుడ్ వెరైటీ యాక్టర్ రణ్‌దీప్ హుడా కీ రోల్ పోషించిన  పవర్‌ఫుల్ వెబ్ సిరీస్ ‘ఇన్‌స్పెక్టర్ అవినాష్.  ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌లో విడుదలైన ఈ సిరీస్ సీక్వెల్, అంటే 'ఇన్‌స్పెక్టర్ అవినాష్ సీజన్ 2' ప్రస్తుతం నంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. ఉత్తరప్రదేశ్‌ పోలీస్ శాఖలో కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్లకి ,మాఫియా డాన్లకి  నిద్రలేకుండా చేసిన ఒక రియల్ సూపర్ కాప్ నిజ జీవిత కథ ఆధారంగా దర్శకుడు నీరజ్ పాఠక్ ఈ సిరీస్‌ని  అద్భుతంగా తెరకెక్కించారు. యూపీలో ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన పోలీస్ ఆఫీసర్ అవినాష్ మిశ్రా సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 150 మంది మాఫియా డాన్లు, రౌడీ మూకలని ఎన్‌కౌంటర్ చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ భీకరమైన 150 ఎన్‌కౌంటర్ల రియల్ పోలీస్ స్టోరీనే ఇప్పుడు మనకు కళ్ళకు కట్టినట్లు వెబ్ సిరీస్ రూపంలో చూపిస్తున్నారు. గత వారమే ఓటీటీలోకి అడుగుపెట్టిన ఈ సీజన్ 2, కేవలం కొద్ది రోజుల్లోనే అత్యధిక వీక్షణలతో టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఒరిజినల్ హిందీ కంటెంట్ అయినప్పటికీ, దక్షిణాది ఆడియెన్స్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి ఏడు ప్రముఖ భాషల్లో దీనిని అందుబాటులోకి తెచ్చారు. మాస్ మసాలా ఎలిమెంట్స్, అబ్బురపరిచే హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. Also read: udhayanidhi stalin: ఉదయనిధి స్టాలిన్ హీరో.. మరి విజయ్ పరిస్థితి ఏంటి  ఈ సిరీస్‌లో రణ్‌దీప్ హుడా తన పవర్‌ఫుల్ యాక్టింగ్‌తో ఇన్‌స్పెక్టర్ అవినాష్ క్యారక్టర్ కి ప్రాణం పోశాడు. ఆయనతో పాటు గ్లామరస్ బ్యూటీ ఊర్వశి రౌతేలా, షాలిన్ భానోత్ ముఖ్యమైన క్యారెక్టర్స్ లో మెప్పించారు. ఈ రెండో సీజన్‌లో మొత్తం 10 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ దాదాపు 40 నిమిషాల నిడివితో ఉత్కంఠభరితంగా సాగుతుంది. మొదటి సీజన్ భారీ విజయం సాధించగా, ఇప్పుడు సీజన్ 2 అంతకు మించిన మైండ్ బ్లోయింగ్ ట్విస్టులు, పొలిటికల్ డ్రామా,క్రైమ్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులని  కట్టిపడేస్తోంది. ఐఎమ్‌డిబి (IMDb)లో 7.6 రేటింగ్‌తో దూసుకుపోతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్, వీకెండ్‌లో ఒక మంచి యాక్షన్ సిరీస్ చూడాలనుకునే ఓటీటీ ప్రియులకి  బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతున్న ఈ రియల్ ఎన్‌కౌంటర్ థ్రిల్లర్‌ని అసలు మిస్ అవ్వకండి    
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సీనియర్ దర్శకుడిగా, నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు తమ్మారెడ్డి భరద్వాజ. టాలీవుడ్‌లో దశాబ్దాల అనుభవం ఉన్న ఆయన, చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులపై ఎప్పటికప్పుడు నిర్మొహమాటంగా స్పందిస్తూ ఉంటారు. తాజాగా ఆయన సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతూ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చిత్రసీమలో దాదాపు యాభై ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న తమ్మారెడ్డి భరద్వాజ, గత పదిహేనేళ్లుగా నిర్మాణ రంగానికి కాస్త దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 'వదలా' అనే సినిమా త్వరలోనే విడుదల కానుంది. సీనియర్ నటుడు జగపతిబాబు, ప్రముఖ నటి లయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆకెళ్ల వి. కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి టాలీవుడ్ బడ్జెట్ మరియు హీరోల రెమ్యునరేషన్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ప్రస్తుతం సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చిందని, కానీ మేకింగ్ పరంగా సమస్యలు కూడా అంతే స్థాయిలో పెరిగాయని అభిప్రాయపడ్డారు. పాత రోజుల్లో టెక్నాలజీ తక్కువగా ఉన్నప్పటికీ క్వాలిటీ విషయంలో అద్భుతమైన సినిమాలు వచ్చాయని గుర్తుచేశారు. అప్పట్లో హీరోలు ఏడాదికి ఎక్కువ సినిమాలు చేసేవారని, ప్రేక్షకులు కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు వచ్చేవారని, కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ గురించి మాట్లాడుతూ.. పరిశ్రమలో ఎప్పుడైనా సరే కేవలం ఐదు శాతం సినిమాలు మాత్రమే లాభాలను తెచ్చిపెడతాయని, మిగిలిన తొంభై ఐదు శాతం చిత్రాలు నష్టాలనే మిగులుస్తాయని భరద్వాజ పేర్కొన్నారు. అయినప్పటికీ నిర్మాతలు ఎంతో ధైర్యంతో ఇక్కడ పెట్టుబడులు పెడుతుంటారని, సినిమా ఫ్లాప్ అయితే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో పాటు ప్రొడ్యూసర్లు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. ముఖ్యంగా హీరోల పారితోషికాల విషయంలో నిర్మాతల వైఖరి మారాలని ఆయన గట్టిగా హితవు పలికారు. వరుస ఫ్లాపులు ఇస్తున్న హీరోలకు సైతం వందల కోట్ల బడ్జెట్ కేటాయించి, భారీగా రెమ్యునరేషన్లు ఇస్తున్న నిర్మాతలు నేడు ఇండస్ట్రీలో ఉన్నారని విమర్శించారు. హీరోలు తమ పారితోషికాన్ని తగ్గించుకోవాలని కోరడం కంటే, నిర్మాతలే వాళ్లకు ఇచ్చే అమౌంట్ తగ్గించుకుంటే టాలీవుడ్ బడ్జెట్ సమస్యలకు సగం పరిష్కారం దొరుకుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇండస్ట్రీలోని ప్రస్తుత బడ్జెట్ సంక్షోభంపై తమ్మారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆయన చెప్పిన మాటలు అక్షరసత్యాలని నెటిజన్లు మరియు విశ్లేషకులు మద్దతు తెలుపుతున్నారు. సినిమా బడ్జెట్ అదుపులో ఉంటేనే పరిశ్రమ బాగుంటుందనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ప్రస్తుతం 'వదలా' చిత్ర ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతుండటంతో, జగపతిబాబు మరియు లయ కలయికలో వస్తున్న ఈ సస్పెన్స్ డ్రామాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీ మరియు ఓటీటీ పార్ట్నర్ వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఉత్కంఠభరితమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా భరద్వాజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
టాలీవుడ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ (Bandla Ganesh) మరోసారి వార్తల్లో నిలిచారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పవర్ ఫుల్ పోలీస్ డ్రామా ‘టెంపర్’ (Temper) గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  ఒకప్పుడు ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ చిత్రం, ప్రస్తుతమున్న పాన్-ఇండియా మార్కెట్ పరిస్థితుల్లో విడుదలై ఉంటే ఏకంగా రూ.1000 కోట్ల వసూళ్లను సాధించి ఉండేదని బండ్ల గణేష్ అన్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న ఈ ఆసక్తికర విశేషాలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. "ఎన్టీఆర్ గారి కెరీర్‌లో నేను రెండు సూపర్ హిట్ సినిమాలు ఇచ్చాను. ‘బాద్‌షా’ సినిమాకు ముందు ఆయన వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో వచ్చిన బాద్‌షా అప్పటివరకు తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత మళ్లీ ఆయనకు రామయ్యా వస్తావయ్యా, రభస రూపంలో రెండు పరాజయాలు ఎదురయ్యాయి. ఆ సమయంలో మేము ‘టెంపర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాం" అని బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు. రచయిత వక్కంతం వంశీ ఈ సినిమా లైన్ చెప్పినప్పుడే ఇది ఒక ఇండస్ట్రీ హిట్ రేంజ్ సబ్జెక్ట్ అని తాను నమ్మానని బండ్ల గణేష్ తెలిపారు. ‘దయా’ పాత్రలో ఎన్టీఆర్ చూపించిన యాక్టింగ్ ఈ చిత్రానికి ప్రాణం పోసిందని కొనియాడారు. "టెంపర్ లాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాను గాని ఇప్పుడు కనుక థియేటర్లలోకి తెస్తే, ఈ రోజున్న మార్కెట్ రేంజ్‌కు సులువుగా రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టేది" అంటూ బండ్ల గణేష్ తనదైన శైలిలో స్టేట్‌మెంట్ ఇచ్చారు. బండ్ల గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘టెంపర్’ సినిమాలో తారక్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ అని, ఇప్పుడున్న పాన్ ఇండియా క్రేజ్ ప్రకారం ఆ సినిమాకు రూ.1000 కోట్లు రావడం పెద్ద విషయం ఏమీ కాదని సపోర్ట్ చేస్తున్నారు.  
సినిమా ప్రియులకు, ముఖ్యంగా సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. థియేటర్లలో విభిన్నమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ చిత్రం 'హయగ్రీవ' (Hayagrriva) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేయడానికి సిద్ధమైంది. థియేట్రికల్ రన్‌ను విజయవంతంగా ముగించుకున్న ఈ సినిమా, తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ధన్వీర్ రాహ్ గౌడ (Dhanveerrah Gowda) పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. ఆయన సరసన సంజన ఆనంద్ కథానాయికగా నటించగా.. సాధు కోకిల, శరత్ లోహితస్వా, రవిశంకర్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించారు. మైథాలజీ అంశాలకు మోడరన్ సైన్స్‌ను ముడిపెడుతూ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రఘుకుమార్ ఓఆర్. కథ విషయానికి వస్తే.. నగరంలో వరుసగా జరిగే మిస్సింగ్ కేసులు, వింతైన హత్యల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. పురాణాలలోని పాత్రల ఆధారంగా హంతకుడు శస్త్రచికిత్సలు చేస్తూ మనుషులను వికృతంగా మారుస్తుంటాడు. ఈ మిస్టరీని ఛేదించే బాధ్యతను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిన అర్జున్ హయగ్రీవ (ధన్వీర్) తీసుకుంటాడు. ఒకవైపు క్లిష్టమైన కేసు, మరోవైపు వ్యక్తిగత జీవితంలో వచ్చే ఒడిదుడుకులను ఎదుర్కొంటూ హీరో ఈ క్రైమ్‌ను ఎలా అడ్డుకున్నాడనేదే అసలు కథ. గతంలో కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన పలు సస్పెన్స్ థ్రిల్లర్లు తెలుగు ప్రేక్షకులను సైతం ఎంతగానో మెప్పించాయి. అదే బాటలో విభిన్నమైన మెడికల్ మాఫియా బ్యాక్‌డ్రాప్‌తో, సరికొత్త స్క్రీన్‌ప్లేతో రూపొందిన ఈ 'హయగ్రీవ' కూడా సినిమా లవర్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇందులో విలన్ క్యారెక్టరైజేషన్, సైకలాజికల్ అంశాలు ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతిని ఇస్తాయి. ఈ సినిమా డిజిటల్ రిలీజ్ పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు, సినీ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లలో మిస్ అయినవారు ఈ వీకెండ్‌లో చూసేందుకు ఒక పర్‌ఫెక్ట్ క్రైమ్ థ్రిల్లర్ దొరికిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న ఈ మిస్టరీ డ్రామాను వీక్షించవచ్చు.
    తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత డిఎంకె ఎంఎల్ఎ ఉదయనిధి స్టాలిన్(udhayanidhi stalin)రాజకీయం కుటుంబానికి చెందిన వ్యక్తే అయినా, సినీ రంగంలోకి ప్రవేశించి ఎంతో మంది అభిమానులని సంపాదించుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన నుంచి సుమారు పన్నెండు చిత్రాలు రాగా అవన్నీ దాదాపుగా తెలుగులోను విడుదలయ్యాయి. కాబట్టి ఇక్కడి ప్రేక్షకులకి కూడా సుపరిచయస్తుడే. 2023లో వచ్చిన 'మామన్నన్' (తెలుగులో నాయకుడు) మూవీ  తన కెరీర్‌లో ఆఖరి చిత్రమని ఆడియో వేడుక సాక్షిగా ఉదయనిధి  స్వయంగా వెల్లడి చేసాడు. కానీ గత కొద్ది రోజులుగా కోలీవుడ్‌లో ఆయన రీఎంట్రీపై బలమైన ప్రచారం సాగుతోంది. ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్ ఉదయనిధికి  నచ్చిందని, దీంతో ఆయన మళ్ళీ మేకప్ వేసుకోవడానికి సుముఖత వ్యక్తం చేశారని తెలుస్తోంది. రాజకీయంగా తమిళనాడు అసెంబ్లీలో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీతో తీవ్రమైన రాజకీయ సమరం నడుస్తున్న ఈ తరుణంలో, ఉదయనిధి మళ్లీ సినిమాల్లోకి రావడం వెనుక బలమైన వ్యూహం ఉందనే చర్చ మొదలైంది. సాధారణంగా ఉదయనిధి స్టాలిన్ సినిమాలు సామాజిక స్పృహతో పాటు పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో  ఉంటాయి. గతంలో ఆయన నటించిన 15 చిత్రాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. ఇప్పుడు రాబోయే కొత్త చిత్రం కూడా ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా, ప్రజల్లోకి డీఎంకే సిద్ధాంతాలను బలంగా తీసుకెళ్లేలా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.  Also read: jetlee: జెట్ లీ ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. రికార్డు స్థాయిలో నాలుగు లాంగ్వేజెస్  అయితే, ఈ రీఎంట్రీ నిర్ణయం వెనుక ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ పెట్టిన ఒక ఆసక్తికరమైన షరతు ఉందని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ కూడా నడుస్తుంది. రాజకీయాల్లో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో సినిమాల వల్ల పార్టీ బాధ్యతలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని సీఎం స్టాలిన్ స్పష్టం చేసినట్లు టాక్. సినిమా షూటింగ్స్ అన్నీ కేవలం వీకెండ్స్ లో లేదా ప్రభుత్వ సెలవు దినాల్లో మాత్రమే జరుపుకోవాలని, రోజుకు 8 గంటల కంటే ఎక్కువ సమయం కేటాయించకూడదని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ షరతుకు ఉదయనిధి కూడా ఓకే చెప్పడంతో సినిమా పట్టాలెక్కేందుకు మార్గం సుగమమైంది. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేలా ఒక పొలిటికల్ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారట. ఈ భారీ ప్రాజెక్టుని  దాదాపు 80 కోట్ల బడ్జెట్ తో  రెడ్ జయంట్ మూవీస్ పై ఉదయనిధినే  నిర్మించనున్నట్లు సమాచారం.  మరి తన ప్రత్యర్థి  విజయ్(VIjay)జన నాయగాన్ తన ఆఖరి చిత్రమని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు  ఉదయనిధి  రీ ఎంట్రీ వార్తలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఆల్రెడీ కమల్, రజినీ తో రెడ్ జయంట్ మూవీస్ పై ఉదయనిధి భారీ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే.   
సినీ పరిశ్రమలో విజయాలు, అపజయాలు సహజం. ఒక భాషలో కలిసిరాని లక్.. మరో భాషలో ఊహించని విధంగా తిరగబడటం మనం చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం టాలీవుడ్‌కు చెందిన ఇద్దరు క్రేజీ బ్యూటీస్ శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే విషయంలో ఇదే జరుగుతోంది. తెలుగులో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన ఈ భామలకు, పక్కనే ఉన్న కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం ఘన స్వాగతం పలుకుతోంది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లతో తమిళ తంబీలు ఈ ఇద్దరు ముద్దుగుమ్మలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. సంచలన డాన్సులతో, గ్లామర్‌తో టాలీవుడ్‌లో ఒకప్పుడు ఓ రేంజ్‌లో దూసుకుపోయిన శ్రీలీలకు ఇటీవలి కాలంలో వరుస పరాజయాలు ఎదురయ్యాయి. పెద్ద హీరోలతో పాటు యంగ్ స్టార్స్ పక్కన నటించినా లక్ కలిసి రాలేదు. దీంతో తెలుగులో ఈమెకు కొత్త అవకాశాలు తగ్గాయి. అయితే తమిళంలో ‘పరాశక్తి’ అనే చిత్రంతో వైవిధ్యమైన డీ-గ్లామర్ రోల్ చేసి అక్కడి మేకర్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీలీలకు కోలీవుడ్ నుంచి బంపర్ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న 55వ ప్రతిష్టాత్మక చిత్రంలో శ్రీలీలకు హీరోయిన్‌గా అవకాశం దక్కినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కేవలం ధనుష్ సినిమానే కాకుండా, తమిళ అగ్ర హీరో అజిత్ కుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో కూడా ఈ కిస్సిక్ బ్యూటీని కథానాయికగా లాక్ చేసినట్లు బలమైన టాక్ వినిపిస్తోంది. ఈ రెండు భారీ చిత్రాలు కనక సక్సెస్ అయితే కోలీవుడ్‌లో శ్రీలీల టాప్ లీగ్‌లోకి వెళ్లడం ఖాయం. మరోవైపు టాలీవుడ్‌లో సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే సైతం తమిళ ఇండస్ట్రీలో క్రేజీ ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకుంది. తెలుగులో ‘మిస్టర్ బచ్చన్’ తర్వాత ఈమె నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ఈ తరుణంలో కోలీవుడ్ వర్సిటైల్ స్టార్ శివకార్తికేయన్ సరసన నటించే భారీ లక్కీ ఛాన్స్ ఆమె తలుపు తట్టింది. శివకార్తికేయన్ హీరోగా రూపుదిద్దుకోనున్న ‘సియోన్’ అనే చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా ఎంపికైంది. ‘తాయి కిళవి’ చిత్రంతో తన ప్రతిభను చాటుకున్న శివకుమార్ మురుగేషన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, విశ్వనటుడు కమల్ హాసన్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తుండటం విశేషం. ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో భాగ్యశ్రీకి అవకాశం రావడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇద్దరు భామల కోలీవుడ్ ఎంట్రీపై సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. టాలీవుడ్‌లో లక్ కలిసిరాకపోయినా, వారిలోని టాలెంట్‌ను గుర్తించి కోలీవుడ్ మేకర్స్ పెద్ద ప్రాజెక్ట్స్ ఇస్తుండటంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో కచ్చితంగా ఈ ఇద్దరూ తమ సత్తా చాటుతారని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే ఇద్దరూ తమ కొత్త తమిళ చిత్రాల షూటింగ్స్‌తో బిజీ కానున్నారు. తెలుగులో దక్కని కమర్షియల్ సక్సెస్, స్టార్ స్టేటస్ తమిళ తంబీల ఇండస్ట్రీలో ఈ సుందరీమణులకు దక్కుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే!
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
భారతదేశంలో ధనికుల కంటే పేదవారే ఎక్కువ.  పేదవారిలో కూడా చాలా పేదవారు,  ఒక మోస్తరు పేదవారు అని కూడా ఉంటారు. అయితే కాలం ఎంత గడిచినా జీవితాలలో ఏ మాత్రం మార్పు లేకుండా పేదవారిగానే ఉండిపోయే  వారు ఎంతో మంది ఉన్నారు. సాధారణంగా కాలం గడిచేకొద్ది జీవితాలలో  ఎంతో కొంత ఎదుగుదల అనేది ఉండాలి.  అలా ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు.. కానీ పేదవాడిగా మరణించడం తప్పు అని ఒక వాక్యం ఉంది.  మనిషి జీవితంలో ఎదగాలని కాలంతో పాటు జీవితాన్ని మెరుగ్గా మార్చుకోవాలని ఈ వాక్యం చెబుతుంది, చాలామంది పేదవాళ్లుగానే మిగిలిపోవడానికి దారితీసే కారణాలు ఏంటో తెలుసుకుంటే.. టీవి, పోన్.. చాలామందికి రోజంతా టీవీ లేదా ఫోన్ చూస్తూ గడిపే అలవాటు ఉంటుంది.  టీవి, ఫోన్ వంటివి మనిషిని వ్యసనపరుడిగా మారుస్తాయి.  టీవిలో ఛానెల్స్ కానీ,  స్మార్ట్ ఫోన్ లో ఎంటర్టైన్మెంట్ యాప్స్ కానీ ఎంత సేపు అయినా అలా మార్చి మార్చి చూస్తుంటారు.  పోన్ లో అయితే స్క్రోల్ చేస్తూ ఉంటే అసలు సమయమే తెలియకుండా గడిచిపోతుంది.   జీవితంలో ఏమీ సాధించకుండా పేదవారిగా ఉండిపోవడానికి టీవి,  స్మార్ట్ ఫోన్ వంటివి ప్రధాన కారణాలు. అలవాట్లు,  అభిరుచులు.. ప్రతి ఒక్కరికి అభిరుచులు, అలవాట్లు అంటూ కొన్ని ఉంటాయి. జీవితంలో ఎదుగుదల ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉండిపోయినట్టు ఉన్నవారిని గమనిస్తే.. వారికి ఎలాంటి అలవాట్లు,  అభిరుచులు ఉండవు.  అందుకే వారికి జీవితంలో ఎదుగుదల లేకుండా కేవలం ఒకేచోట కూర్చుని కాలక్షేపం చేస్తూ అందులోనే సుఖం అనుభవిస్తూ ఉంటారు. లక్ష్యాలు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఏదో ఒక లక్ష్యం అనేది ఉండాలి.  లక్ష్యం లేని జీవితంలో ఎదుగుదల అనేది అసలు ఉండదు. లక్ష్యం ఉంటే కష్టపడటం,  జ్ఞానాన్ని ఆర్జించడం,  ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండటం వంటివి జరుగుతాయి. కానీ లక్ష్యం లేకపోతే జీవితం ఒకేచోట పాతిన స్ధంభంలా ఉండిపోతుంది. కంఫర్ట్ జోన్.. చాలామందికి సుఖంగా బ్రతకడం ఇష్టం.  ఛాలెంజ్ తీసుకోవాలన్నా, రిస్క్ చేయాలన్నా అస్సలు ఇష్టపడరు. ఉన్న సంతోషం,  ఉన్న సౌకర్యాలు చాల్లే అనుకుంటారు.  కొత్తగా అ ప్రయత్నం చేయాలన్నా అస్సలు సిద్దపడరు. అందుకే కాలం ఎంత గడిచినా అలాంటి వారు పేదవారిగానే ఉండిపోతారు తప్ప ధనవంతులు, గొప్ప వారు కాలేరు. అదృష్టం.. ప్రపంచంలో కష్టం కంటే అదృష్టాన్ని నమ్మేవారే ఎక్కువగా ఉన్నారు. ఏ అదృష్టమో వచ్చి తమను ధనవంతులను చేస్తుందని నమ్ముతూ.. కష్టపడకుండా, ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా అలాగే ఉండిపోతారు. జాతకాలలోనూ, రంగు రాళ్లలోనూ,  గ్రహాల మార్పులోనూ తమ భవిష్యత్తు ఆధారపడి ఉందని నమ్ముతూ ఉంటారు. ఇతరులను నిందించడం.. నన్ను బాగా చదివించి ఉంటే నేను పెద్ద  ఉద్యగం తెచ్చుకునేవాడిని,  నాకు  బాగా డబ్బు ఇచ్చి ఉంటే నేను మంచి వ్యాపారం చేసేవాడిని అని తల్లిదండ్రుల మీద నిందలు వేస్తూ జీవితంలో ఎదగకుండా ఆగిపోయిన వారు చాలామంది ఉంటారు.  తాము ఎదగకపోవడానికి కారణం పక్కవారే అని చెప్పి పేదవారిగానే ఉండిపోతున్న వారే ఎక్కువగా ఉన్నారు. జీవితంలో ఎదగడానికి కష్టపడేవారు చాలా తక్కువ ఉన్నారు.  పైన చెప్పుకున్న విషయాలే.. ఏ మనిషి అయినా పేదవాడిగానే ఉండిపోవడానికి అసలు కారణాలు.                            *రూపశ్రీ.
పిల్లలు జీవితంలోని ప్రతి దశలో  ఆత్మవిశ్వాసంతో, బాధ్యతాయుతంగా నిలబడాలని ప్రతి తల్లిదండ్రులు కలలు కంటారు. నేటికాలంలో మంచి పేరెంటింగ్ అంటే కేవలం మంచి విద్యను అందించడం లేదా మంచి గ్రేడ్‌లు సాధించడం అని చాలామంది అనుకుంటారు. కానీ పిల్లలలో  మానసిక బలాన్ని పెంపొందించడం, వారు భవిష్యత్తులో గొప్పగా ఎదగడం మరీ ముఖ్యంగా నాయకత్వ లక్షణాలతో ఉండటం చాలా ముఖ్యం.  ఆత్మవిశ్వాసం అనేది ఏ బిడ్డ వ్యక్తిత్వానికైనా పునాది. అది వారికి తమ మనసులోని మాటను నిర్భయంగా చెప్పే ధైర్యాన్ని, అలాగే వైఫల్యాల నుండి నేర్చుకుని ఓపికతో ముందుకు సాగే బలాన్ని ఇస్తుంది. ఆత్మవిశ్వాసం ఉన్న పిల్లలు కాలక్రమేణా బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదుగుతారు. అయితే, ఈ లక్షణాలు రాత్రికి రాత్రే పుట్టేవి కాదు.. వీటికి చిన్నతనం నుండే సరైన మార్గదర్శకత్వం అవసరం. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి వారిలో నాయకత్వ లక్షణాలు మెరుగుపడి వారు లీడర్లుగా తయారవ్వాలంటే.. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను పెంచే సమయంలో కొన్ని టిప్స్ పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెంచి నాయకత్వ లక్షణాలు పెంచే టిప్స్.. వ్యక్తీకరణ..  పిల్లలకు వారి అభిప్రాయాలను, భావాలను వ్యక్తపరిచే అవకాశం ఇవ్వడం వల్ల వారు స్వేచ్ఛగా తమను తాము వ్యక్తపరచుకోవడానికి , వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి సహాయపడుతుంది. విజయాల గుర్తింపు.. పిల్లలు ఒక చిత్రాన్ని గీసినా లేదా ఒక పద్యాన్ని చదివినా, వారి కృషిని ప్రశంసించాలి. ఇలా మెచ్చుకోవడం వల్ల  పిల్లలలో తాము గౌరవించబడుతున్నామనే భావన కలుగుతుంది, ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణను రెండింటినీ పెంచుతుంది. విలువలు,సంప్రదాయాలు.. పిల్లలను కుటుంబ సంప్రదాయాలు, పండుగలు , ఆచారాలతో అనుసంధానించడం వారిలో సాంస్కృతిక అవగాహనను పెంపొందించడానికి , వారి గుర్తింపు పట్ల విశ్వాసాన్ని పెంపొందించడానికి సహాయపడుతుంది. సహనం, ఓర్పు..  గెలవడం ఎల్లప్పుడూ అవసరం కాదని, వెంటనే  ఫలితాలు ఆశించాల్సిన అవసరం లేదని పిల్లలకు నేర్పించడం ముఖ్యం. ఓర్పు, సహనం వారు పరిణతి చెందడానికి సహాయపడతాయి. ఆరోగ్యకరమైన అలవాట్లు..  సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సమయానికి నిద్రలేవడం , రాత్రి సమయానికి నిద్రపోవడం,  వంటివి పిల్లలలో ఆత్మవిశ్వాసాన్ని అంతర్గతంగా బలపరుస్తాయి. ఇది క్రమశిక్షణ , ఆత్మనియంత్రణను కూడా నేర్పిస్తుంది. వైఫల్యాల నుండి నేర్చుకోవడం..  పిల్లలు చేసే  ఏదైనా పనిలో  విఫలమైతే, వైఫల్యం అనేది నేర్చుకోవడంలో ఒక భాగమని వారికి వివరించాలి. ఇది వైఫల్యం  తర్వాత తిరిగి లేచి ముందుకు సాగడాన్ని వారికి నేర్పుతుంది, ఇదే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి కీలకం అవుతుంది. చెప్పేది వినాలి..   పిల్లలతో నిష్కపటంగా మాట్లాడాలి. వారు చెప్పేది శ్రద్ధగా వినాలి. దీనివల్ల, వారు తమ సమస్యలను, ప్రశ్నలను  పంచుకోగలరనే నమ్మకం వారిలో పెరుగుతుంది . వినయం..  ఇతరులకు సహాయం చేయడం, చిన్న విషయాలకే కృతజ్ఞత చూపడం, అందరితో మర్యాదగా ప్రవర్తించడం పిల్లలకు నేర్పాలి. ఇవి వారు ఇతరులతో మమేకమవ్వడానికి, సమాజంలో గౌరవం సంపాదించుకోవడానికి సహాయపడతాయి. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో పైవన్నీ నేర్పిస్తూ ఉంటే.. పిల్లలు తప్పకుండా తమ జీవితంలో ఆత్మవిశ్వాసంలో ఉంటారు.  నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకుని వారి జీవితంలో ఎంతో ఉన్నత స్థానానికి ఎదుగుతారు.                                             *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
  వేసవికాలం అనగానే మండే ఎండలు గుర్తుకు వస్తాయి.  ప్రతి ఏడాది ఈ ఎండల ప్రభావం పెరుగుతూనే ఉంటోంది. ఈ కారణంగానే చాలామంది ఇళ్లలో ఏసీలు పెట్టించుకుంటారు.  అయితే ఏసీ పెట్టించుకునే అంత స్తోమత లేనివారు కనీసం కూలర్ అయినా వాడుతూ ఉంటారు. వేసవి కాలం వస్తోందని అనిపించగానే కూలర్లు సిద్దం చేస్తుంటారు. అయితే.. చాలామంది కూలర్ విషయంలో ఎదుర్కునే సమస్య చల్లదనం రాకపోవడం. కూలర్ ఎంత స్పీడ్ లో ఉన్నా చల్లదనం లేకపోవడం,  గదిలో ఉన్నవారికి చెమట పట్టడం, మరీ ముఖ్యంగా ముఖం మీద జిడ్డుగా మారడం వంటివి జరుగుతూ ఉంటాయి.  దీనికి కూలర్ సరిగా పనిచేయడం లేదని అనుకుంటూ ఉంటారు. కానీ దీనికి అసలు కారణం చాలామంది చేసే పొరపాట్లే..  ఆ పొరపాట్లు ఏంటో తెలుసుకుంటే.. గదిని పూర్తీగా మూసి ఉంచడం.. ఏసీ వాడేటప్పుడు గదిలోని కిటికీలు, తలుపులన్నీ ఎలాగైతే మూసి ఉంచాలో, కూలర్ విషయంలో కూడా అలాగే చేయాలని  తరచుగా అనుకుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. కూలర్లు గాలిలోకి తేమను విడుదల చేస్తాయి. గదిని పూర్తిగా మూసి ఉంచితే, ఆ తేమ బయటకు వెళ్లలేక, గాలిలో విపరీతమైన తేమ ఏర్పడుతుంది. అందువల్ల, గాలి ప్రసరణ జరిగేలా , గదిలోని నిస్సారమైన గాలి బయటకు వెళ్లేలా చేయడానికి, ఒక కిటికీని లేదా తలుపును కొద్దిగా తెరిచి ఉంచాలి. కూలర్ అమరిక.. కూలర్‌ను గది మధ్యలో లేదా గోడకు ఆనించి, దానికి స్వచ్ఛమైన గాలి అందని చోట ఉంచితే, అది గదిలోని వేడి గాలిని బయటకు పంపుతూనే ఉంటుంది. కూలర్‌ను ఎల్లప్పుడూ కిటికీ లేదా తలుపు దగ్గర ఉంచాలి. తద్వారా అది బయటి నుండి స్వచ్ఛమైన గాలిని లోపలికి లాగి, దానిని లోపలికి పంపుతుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్.. బయట విపరీతమైన వేడి, తేమ ఉన్నప్పుడు, కేవలం కిటికీ తెరవడం ద్వారా కూలర్‌లోని తేమను బయటకు పంపడం కష్టమవుతుంది. గదిలో తప్పకుండా ఒక చిన్న ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను అమర్చాలి.   కూలర్‌ను నడుపుతున్నప్పుడు, ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను కూడా ఆన్ చేయాలి. ఇది గదిలోని జిగటగా ఉండే వేడి గాలి మొత్తాన్ని బయటకు లాగి, గదిని చల్లగా ఉంచుతుంది. కూలర్ ప్యాడ్స్.. కొన్నిసార్లు  సంవత్సరాల తరబడి కూలర్ పక్క ప్యాడ్‌లను మార్చకుండా ఉంటారు.  వాటిపై దుమ్ము, ఉప్పునీరు పేరుకుపోయి, తెల్లటి పొరలా ఏర్పడుతుంది. దీనివల్ల గాలి లోపలికి వెళ్లదు,  కూలర్ ఫ్యాన్‌లా కేవలం వేడి గాలిని మాత్రమే బయటకు పంపుతుంది. అందువల్ల, ప్రతి సీజన్‌లో కూలర్ ప్యాడ్‌లను తప్పకుండా మార్చాలి. కూలర్ లో హనీకూంబ్ ప్యాడ్స్ ఉంటే వాటిని బయటకు తీసి బాగా శుభ్రం చేయాలి. సూర్యరశ్మి.. గది గోడలు లేదా కిటికీలపైకి నేరుగా సూర్యరశ్మి పడితే, అవి వేడెక్కుతాయి. కూలర్‌లోని గాలి వేడెక్కిన గోడలను తాకినప్పుడు దాని ప్రభావం తగ్గిపోతుంది. అందువల్ల, పగటిపూట కిటికీలకు మందపాటి, ముదురు రంగు కర్టెన్లను వేయాలి. ఇది సహజంగా గది ఉష్ణోగ్రతను తగ్గించి, కూలర్ వేగంగా చల్లబడటానికి సహాయపడుతుంది. వాతావరణం చాలా వేడిగా ఉంటే, కూలర్‌లోని వాటర్ ట్యాంక్‌లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేయాలి.  దీనివల్ల నీరు వెంటనే చల్లబడుతుంది. కూలర్ నుండి వచ్చే గాలి ఎయిర్ కండిషనర్ లాగా అనిపిస్తుంది.                                     *రూపశ్రీ.
దంతాల నొప్పి (Toothache) అనేది ఈ రోజుల్లో చాలా మందిని వేధించే ఒక సాధారణ సమస్య. పంటి నొప్పి వస్తే ఆ బాధ వర్ణనాతీతం. ఒక్కోసారి రాత్రి వేళల్లో అకస్మాత్తుగా నొప్పి వస్తే ఏం చేయాలో తోచక ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి సమయంలో మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే జామ ఆకులు (Guava Leaves) అద్భుతమైన ఔషధంగా పనిచేస్తాయని ప్రముఖ హెర్బలిస్ట్ చెబుతున్నారు.  తెలుగువన్ హెల్త్ (TeluguOne Health) ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆస్ట్రేలియన్ హెర్బల్ క్లినిక్ & మెడిసిన్ కన్సల్టెంట్ హెర్బలిస్ట్ డాక్టర్ జి. లక్ష్మణరావు, Ph.D (Australia) గారు జామ ఆకుల విశిష్టతను, వాటితో దంతాల నొప్పిని ఎలా నయం చేసుకోవచ్చో క్లియర్ గా ఈ వీడియోలో వివరించారు.  జామ ఆకుల్లోని ఔషధ గుణాలు: జామ ఆకుల్లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ (Anti-inflammatory), యాంటీ మైక్రోబియాల్ (Anti-microbial) మరియు అనల్జెసిక్ (నోప్పి నివారణ) గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి నోట్లోని బ్యాక్టీరియాను నశింపజేసి, చిగుళ్ల వాపులను మరియు పంటి నొప్పిని తక్షణమే తగ్గించడంలో సహాయపడతాయి. డాక్టర్ లక్ష్మణరావు గారు సూచించిన సులువైన ఇంటి చిట్కాలు: జామ ఆకులను నమలడం: లేత జామ ఆకులను శుభ్రంగా కడిగి, నోట్లో వేసుకుని బాగా నమలాలి. ఆ రసం పంటి నొప్పి ఉన్న భాగంలోకి చేరడం వల్ల నొప్పి నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది.  జామ ఆకుల కషాయం (మౌత్ వాష్): కొన్ని జామ ఆకులను నీళ్లలో వేసి బాగా మరిగించాలి. ఆ నీరు గోరువెచ్చగా అయిన తర్వాత కొద్దిగా ఉప్పు కలిపి, నోట్లో పోసుకుని పుక్కిలించాలి (Gargling). ఇది సహజసిద్ధమైన మౌత్ వాష్‌లా పనిచేసి చిగుళ్ల వాపులను, నోటి దుర్వాసనను దూరం చేస్తుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఎండల ప్రభావం వల్ల లేదా మనం తినే ఆహారపు అలవాట్ల వల్ల చాలామందిలో శరీర ఉష్ణోగ్రత (Body Heat) అకస్మాత్తుగా పెరిగిపోతూ ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారం దీనిని 'పిత్త దోషం' అధికమవ్వడం అంటారు. శరీరం వేడెక్కినప్పుడు కళ్ల మంటలు, కాళ్లల్లో నొప్పులు, నీరసం, చర్మంపై చెమటకాయలు, అజీర్తి వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. మరి ఈ సమస్య నుండి ఎలాంటి మందులు వాడకుండా, ఇంట్లోనే ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఎలా ఉపశమనం పొందాలో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో క్లియర్ గా వివరించారు. 👇 🌟శరీరంలో వేడి తగ్గడానికి ముఖ్యమైన ఆయుర్వేద చిట్కాలు: మజ్జిగ మరియు సబ్జా గింజలు: ప్రతిరోజూ పల్చటి మజ్జిగ తాగడం లేదా నీళ్లలో నానబెట్టిన సబ్జా గింజలను తీసుకోవడం వల్ల శరీరం తక్షణమే చలవబడుతుంది. ధనియాల నీరు: రాత్రి పూట ఒక గ్లాసు నీటిలో చెంచా ధనియాలు నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి తాగడం వల్ల పిత్త దోషం అదుపులోకి వస్తుంది. కొబ్బరినీళ్లు: వారంలో కనీసం రెండు లేదా మూడు సార్లు కొబ్బరినీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్స్ అంది, వేడి తగ్గుతుంది. తీసుకోవలసిన ఆహారాలు: పుచ్చకాయ, కీరదోసకాయ, సొరకాయ, బీరకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు, పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలి. దూరంగా ఉంచాల్సినవి: మిరపకాయలు, మసాలాలు, పచ్చళ్లు, టీ మరియు కాఫీలను కాస్త తగ్గించడం చాలా మంచిది. మీ శరీర తత్వాన్ని బట్టి పిత్త దోషం తీవ్రత మారుతూ ఉంటుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! 🙌
అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైన విభాగంగా పరిగణించబడుతుంది, ఎందుకంటే ఇది శరీరానికి రోజంతా అవసరమైన శక్తిని అందించడంలో సహాయపడుతుంది. అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల, చాలా మంది శరీరానికి మేలు చేయడానికి బదులుగా హాని కలిగించే  పదార్థాలను బ్రేక్పాస్ట్ లో తింటారు. ఖాళీ కడుపుతో కొన్ని రకాల బ్రేక్పాస్ట్ లను  తినడం  జీర్ణవ్యవస్థపై నేరుగా ప్రభావం చూపుతుంది. రోజంతా నీరసంగా, చిరాగ్గా  ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆరోగ్యకరమైన, సమతుల్యమైన అల్పాహారం శక్తిని అందించడమే కాకుండా, బరువు నియంత్రణ, మెరుగైన జీవక్రియ , మానసిక ఏకాగ్రతకు కూడా సహాయపడుతుంది. బ్రేక్పాస్ట్ లో  ఏ పదార్థాలను నివారించాలో , ఏ అలవాట్లు  ఆరోగ్యానికి హాని కలిగిస్తాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అవేంటో తెలుసుకుంటే.. వేయించిన, నూనే ఆహారాలు.. ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేయించిన, నూనెతో కూడిన ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల జీర్ణవ్యవస్థపై అదనపు ఒత్తిడి పడుతుంది. పూరీలు, కచోరీలు, సమోసాలు,  బజ్జీలు  వంటి వేయించిన ఆహారాలు  కడుపులో భారంగా అనిపించేలా చేస్తాయి. దీనివల్ల జీర్ణక్రియ ఆలస్యం అయి, ఎసిడిటీ, గ్యాస్, నీరసం పెరగవచ్చు. దీర్ఘకాలంలో, ఇలాంటి అలవాట్లు బరువు పెరగడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి కూడా దారితీయవచ్చు. ప్యాకింగ్ జ్యూసులు.. ఉదయం పూట తీపి బ్రెడ్ లేదా తృణధాన్యాలతో చేసిన బ్రెడ్ వంటివి లేదా  ప్యాక్ చేసిన జ్యూస్‌లు తాగడం ఆరోగ్యకరమని చాలామంది అనుకుంటారు.  కానీ వీటిలో చక్కెర అధిక మొత్తంలో ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగి, కొద్దిసేపటికే అకస్మాత్తుగా పడిపోతాయి. ఇది శరీర శక్తి స్థాయిలను ప్రభావితం చేసి, త్వరగా ఆకలి వేయడానికి దారితీస్తుంది. అధిక చక్కెర ఉన్న ఆహారాలను  క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఊబకాయం , మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. టీ, కాఫీలు.. చాలామంది  రోజును కేవలం టీ లేదా కాఫీతో గడిపేస్తుంటారు. మరికొంతమంది  ఉదయాన్నే టీ, కాఫీలు తాగుతూ ఉంటారు. వీటి  వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందవు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ లేదా కాఫీ తీసుకోవడం వల్ల ఎసిడిటీ , గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ఇది నీరసం, అలసట , ఏకాగ్రత లోపానికి దారితీయవచ్చు. ఇలా ఎక్కువ కాలం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా ప్రభావితం అవుతుంది. ప్రాసెస్ ఫుడ్స్.. ఇన్‌స్టంట్ నూడుల్స్, ప్రాసెస్ చేసిన స్నాక్స్ , ప్యాక్ చేసిన ఆహారాలలో ప్రిజర్వేటివ్‌లు , సోడియం అధికంగా ఉంటాయి. ఇవి తగినంత పోషణను అందించవు . పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ ఆహారాలను క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణశక్తి బలహీనపడి, పోషకాహార లోపాలకు దారితీస్తుంది.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...