LATEST NEWS
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకున్న తరుణంలో అధికార తృణమూల్ కాంగ్రెస్, ఎన్నికల సంఘం మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రాష్ట్రంలో కేవలం తమ పార్టీ నేతల వాహనాలను మాత్రమే అధికారులు లక్ష్యంగా చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం (ఏప్రిల్ 15) ఉత్తర్ దినాజ్‌పూర్ జిల్లాలోని ఇస్లాంపూర్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె ప్రసంగిస్తూ, తన కారును తనిఖీ చేసేందుకు కేంద్ర బలగాలు ప్రయత్నించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని డమ్‌డమ్ విమానాశ్రయం సమీపంలో తన వాహనాన్ని నిలిపి  సోదాలు చేసేందుకు అధికారులు సాహసించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర బలగాలకు అంత దమ్ముంటే, తన కారును కేవలం ఒకసారి కాదు..  రోజూ తనిఖీ చేయంని సవాల్ విసిరారు.  ఎన్నికల వేళ కేవలం ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ఈ చర్యలు ఉన్నాయని ఆమె ఆరోపించారు. తృణమూల్ నేతల వాహనాలను సోదాలు చేస్తున్న అధికారులు,  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా,  ఇతర బీజేపీ కీలక నేతల కాన్వాయ్‌లను ఎందుకు తనిఖీ చేయడం లేదని నిలదీశారు. నిబంధనలు అందరికీ సమానంగా ఉండాలని, కానీ బెంగాల్‌ లో మాత్రం పక్షపాత వైఖరి కనిపిస్తోందన్నారు.  తాజాగా టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కారును కూడా అధికారులు తనిఖీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలను ప్రస్తావిస్తూ, బెంగాల్‌లో టీఎంసీని ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కోలేక, దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మమత మండిపడ్డారు. తనను భయపెట్టాలని చూస్తే భయపడే ప్రసక్తే లేదని, ఈ విషయాన్ని అధికారులకు ముఖం మీదే చెప్పానని ఆమె స్పష్టం చేశారు. బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో గతంలోనూ కేంద్ర బలగాల మోహరింపు, అధికారుల బదిలీలపై టీఎంసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రస్తుతం మమతా బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగి అధికారుల తీరును తప్పుబట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న రోజుల్లో ఈ తనిఖీల పర్వం మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఆరోపణలపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే మూడు అత్యంత కీలకమైన బిల్లులను కేంద్ర ప్రభుత్వం గురువారం (ఏప్రిల్ 16) లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రధానంగా మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించడం, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా ఏకపక్షంగా ప్రభుత్వం ఈ బిల్లులను ప్రవేశపెట్టిందని విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.   కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సభలో రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లును కూడా ప్రవేశపెట్టారు. అదేవిధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లును సభ ముందు ఉంచారు.  నారీ శక్తి వందన్ అధినియమ్  ద్వారా 2029 ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది.   2011 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది. ఈ ప్రతిపాదనలో భాగంగా లోక్‌సభ స్థానాల సంఖ్యను ప్రస్తుతమున్న 543 నుంచి   850కి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్ని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, ఆ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.   మహిళా రిజర్వేషన్లకు తాము వ్యతిరేకం కాదనీ, కానీ   డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేసే కుట్రను సహించబోమని చెబుతున్నాయి.  జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల విభజన చేపడితే, కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలు పార్లమెంటులో తమ ప్రాతినిధ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  ప్రభుత్వం డీలిమిటేషన్ పేరుతో రాజకీయ గిమ్మిక్కులకు పాల్పడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఇలా ఉండగా పార్లమెంటులో రాజ్యాంగ సవరణ బిల్లు పాస్ కావాలంటే.. సభలో మూడింట రెండు వంతుల మంది సభ్యులు మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే లోక్ షభలో కనీసం 360 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాల్సి ఉంటుంది. అయితే ఎన్డీయే కూటమికి సభలో ఉన్న బలం 292 మాత్రమే కావడంతో ఈ బిల్లు ఆమోదం పొందడం సులభ సాధ్యం కాదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.  
  నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలక నాయకుడు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, మంత్రిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నారా లోకేష్ జీవిత విశేషాలు ఎలాంటివో పరిశీలిస్తే..లోకేష్‌ టీడీపీ పార్టీ జనానికి ఒక ఏడాది తర్వాత జన్మించారు. ఆయన  జన్మదినం 1983 జనవరి 23. అదే టీడీపీ 1982 మార్చి 29న ఆవిర్భవించింది. అంటే పార్టీతో సమానంగా ఆయన జీవితం ఎదుగుతూ వచ్చింది.  ఇటు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మనవడిగా, మరో సీఎం చంద్రబాబు తనయుడిగా లోకేష్ జీవితం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది.  ఇక తల్లి నారా భువనేశ్వరీ దేవి, సతీమణి బ్రాహ్మణి. లోకేష్ కి ఒక కొడుకు దేవాన్ష్. నారా లోకేష్ విద్యాభ్యాసం హైదరాబాద్‌లోని భారతీయ విద్యాభవన్ లో సాగింది. గ్రాడ్యుయేషన్- అమెరికాలోని కార్నెగీ మెల్లన్ యూనివర్సిటీ నుంచి మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో డిగ్రీ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్- ప్రతిష్టాత్మకమైన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆపై ప్రపంచ బ్యాంకులో పని చేసిన అనుభవం సైతం సాధించారు.  ఇక రాజకీయ ప్రస్థానం విషయానికి వస్తే.. లోకేష్ నేరుగా పదవుల్లోకి రాకుండా, పార్టీ సంస్థాగతంగా బలోపేతం కోసం తెరవెనుక పని చేస్తూ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సంస్థాగత బాధ్యతలు ఎప్పుడు చేపట్టారో చూస్తే.. 2013లో పార్టీలోకి అధికారికంగా ప్రవేశించారు. టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధికి ఇన్‌చార్జ్‌గా ఉంటూ, వేలాది మంది కార్యకర్తలకు బీమా, ఇతర సౌకర్యాలు అందేలా చూశారు. మంత్రిగా సేవల విషయానికి వస్తే.. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై, చంద్రబాబు నాయుడు క్యాబినెట్‌లో ఐటీ, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో గ్రామాల్లో LED లైట్ల ఏర్పాటు, సిమెంట్ రోడ్ల నిర్మాణం.. ఐటీ కంపెనీలను విశాఖపట్నం, అమరావతికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2019లో అధికారం పోయాక.. మరీ ముఖ్యంగా తాను మంగళగిరిలో ప్రత్యక్ష ఎన్నికల్ల్లో ఓడిపోయాక.. నారా లోకేష్ లో తీవ్ర అంతర్మధనం మొదలైంది. తన బాడీ ఫిట్ నెస్ తో పాటు అన్ని అంశాల్లోనూ దృష్టి సారించారు. 2023లో యువగళం పాదయాత్ర మొదలు పెట్టారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర ఆయన రాజకీయ జీవితంలో ఒక మైలురాయి. కొన్ని అనివార్య కారణాల వల్లీ ఈ యాత్ర మధ్యలో ఆగినా దాని ఇంపాక్ట్ పార్టీలో, కేడర్లో చాలా పెద్దగానే ఉందని చెప్పాలంటారు విశ్లేషకులు. 2024 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించి, ప్రస్తుతం విద్యా, ఐటీ, మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పార్టీ పగ్గాలను చేపట్టారు. అసలు పార్టీ పరంగా ఇప్పటి వరకూ లోకేష్ ఏం చేశారో చూస్తే..  పార్టీ సభ్యత్వ నమోదును డిజిటలైజ్ చేయడంలో ఆయన కృషి అమోఘం. ప్రభుత్వ పరంగా పరిశీలిస్తే.. పంచాయతీ రాజ్ శాఖలో చేసిన సంస్కరణలకు గాను కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక ఎన్నికల విజయాల పరంగా చూస్తే.. 2019లో ఓటమి ఎదురైనా, పట్టు వదలకుండా ఐదేళ్ల పాటు అక్కడే ఉండి ప్రజలకు చేరువయ్యారు.  2024లో అదే నియోజకవర్గంలో 90,000 పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచి తన సత్తా చాటారు. నారా లోకేష్ తన విద్యా నైపుణ్యం, ఆధునిక ఆలోచనా ధోరణితో పార్టీని భవిష్యత్ తరాలకు సిద్ధం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన బాధ్యతలు చేపట్టడం పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.లోకేష్ తన పొలిటికల్ కెరీర్ మొదలు పెట్టిందే కార్యకర్తల నుంచి. పార్టీకి ఇదెంత మేలు చేస్తుందంటే.. కార్యకర్తల సంక్షేమంలో లోకేష్ ది కీలక పాత్ర కాబట్టి. పార్టీ అంటే కార్యకర్త కాబట్టి.. ఎంతైనా లోకేష్ కి వర్కింగ్ ప్రెసిడెంట్ అనే ఈ నిర్ణయం కార్యకర్తకొక పండగ రోజుగా భావిస్తున్నారంతా.  
  బిహార్ రాజకీయ ముఖచిత్రం మరోసారి అనూహ్య మలుపు తిరిగింది. సుదీర్ఘ కాలం పాటు ఆ రాష్ట్ర రాజకీయాలను శాసించిన నితీష్ కుమార్ శకం ముగియగా, భారతీయ జనతా పార్టీ కీలక నేత సామ్రాట్ చౌదరి నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ కీలక పరిణామంతో బిహార్ రాజకీయాల్లో నవశకం ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా గతంలో నితీష్ కుమార్‌ను గద్దె దించే వరకు విశ్రమించనని శపథం చేసిన వ్యక్తి, నేడు ఏకంగా ఆ కుర్చీలోనే కూర్చోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గతంలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూతో విభేదించిన సమయంలో సమ్రాట్ చౌదరి ఒక సవాల్ విసిరారు. నితీష్ కుమార్‌ను ముఖ్యమంత్రి పీఠం నుండి దించే వరకు తాను ధరించిన తలపాగా (పగడీ) తీయనని, కాషాయ రంగు తలపాగాతోనే ఉంటానని 2023లో ప్రతిజ్ఞ చేశారు. అయితే మారుతున్న సమీకరణల దృష్ట్యా 2024లో బీజేపీ-జేడీయూ పొత్తు కుదరడంతో, అధిష్ఠానం ఆదేశాల మేరకు ఆయన తన శపథాన్ని పక్కనపెట్టి అయోధ్యలో శ్రీరాముడికి తన తలపాగాను సమర్పించారు. 57 ఏళ్ల సమ్రాట్ చౌదరి బలమైన రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చారు. వెనుకబడిన వర్గాల్లో (కుష్వాహా సామాజిక వర్గం) ఆయనకు మంచి పట్టు ఉంది. ఆయన తండ్రి శకుని చౌదరి బిహార్ రాజకీయాల్లో సీనియర్ నేతగా, ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తల్లి పల్లవి దేవి కూడా శాసనసభ్యురాలిగా సేవలందించారు. కుటుంబ వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చిన సమ్రాట్, అనతి కాలంలోనే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సమ్రాట్ చౌదరి రాజకీయ ప్రస్థానం పలు పార్టీల గుండా సాగింది. 1990లలో ఆర్జేడీలో చేరిన ఆయన, రబ్రీదేవి హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. అనంతరం జేడీయూలో చేరినప్పటికీ, అక్కడ ఇమడలేక 2017లో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీలో చేరిన తర్వాత ఆయన గ్రాఫ్ వేగంగా పెరిగింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా కూడా కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిణామాలను గమనిస్తే, నితీష్ కుమార్ రాజకీయాలకు స్వస్తి పలకడం లేదా కేంద్ర రాజకీయాల వైపు మళ్లడంతోనే సమ్రాట్ చౌదరికి ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది. గతంలో నితీష్‌ను వ్యతిరేకించిన నేతకే ఇప్పుడు అధికార పగ్గాలు దక్కడం బీజేపీ వ్యూహాత్మక విజయంగా రాజకీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సామాజిక సమీకరణలను సమన్వయం చేయడంలో సమ్రాట్ కీలకం కానున్నారు. ఈ మార్పు పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తుండగా, ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నాయి. నాడు శపథం చేసిన వ్యక్తి నేడు అదే నితీష్ మద్దతుతో లేదా ఆయన వారసుడిగా రావడం రాజకీయ అవకాశవాదమని ఆర్జేడీ నేతలు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా, సమ్రాట్ చౌదరి ముఖ్యమంత్రిగా బిహార్‌లో ఎలాంటి అభివృద్ధి పథకాలు చేపడతారో మరియు కుల రాజకీయాలను ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి. సమ్రాట్ చౌదరి నాయకత్వంలో బిహార్‌లో డబుల్ ఇంజిన్ సర్కార్ మరింత వేగంగా పనిచేస్తుందని ప్రజలు ఆశిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ, నిరుద్యోగ సమస్య పరిష్కారం మరియు పారిశ్రామిక అభివృద్ధి ఆయన ముందున్న ప్రధాన సవాళ్లు. కొత్త ముఖ్యమంత్రి రాకతో బిహార్ రాజకీయాల్లో స్థిరత్వం వస్తుందా లేదా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. 2024 ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టడం వెనుక నిస్సందేహంగా లోకేష్ యువగళం పాత్రదే ప్రధాన, కీలక భూమిక. తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో లోకేష్ అత్యంత క్రీయాశీల పాత్ర పోషిస్తున్నారడానికి ఇసుమంతైనా సందేహం అవసరం లేదు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం శ్రేణులూ, నేతలూ కూడా లోకేష్ కు పార్టీలో, ప్రభుత్వంలో మరింత కీలక స్థానం కల్పించాలని గత ఏడాదిన్నర పైగా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఈ విషయాన్ని చంద్రబాబు సమక్షంలోనే కొదరు స్పష్టంగా చెప్పారు కూడా. అలాగే తెలుగుదేశం శ్రేణులైనా ఒక సమయంలో లోకేష్ కు పార్టీలోనే కాదు, ప్రభుత్వంలో కూడా ప్రమోషన్ ఇవ్వాలనీ, ఆయన పార్టీ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ గా నియమించాలనీ, అలాగే ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనీ కూడా బాహాటంగానే డిమాండ్ చేశారు. మరీ ముఖ్యంగా కడప మహానాడుకు ముందు ఈ డిమాండ్ తెలుగు దేశం శ్రేణుల నుంచి చాలా చాలా గట్టిగా వినిపించింది. ఒక దశలో కడప మహానాడు వేదికగానే లోకేష్ ప్రమోషన్ ప్రకటన ఉంటుందని కూడా గట్టిగా వినిపించింది. అయితే కూటమి పరిమితుల కారణంగా అప్పట్లో చంద్రబాబు లోకేష్ ప్రమోషన్ విషయంపై బాహాటంగా ఎవరూ వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా మందలించారు కూడా.ఇప్పుడు లోకేష్ కు పార్టీలో ప్రమోషన్ లభించింది. తెలుగుదేశం పార్టీకి తొట్ట తొలి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ నియమితులయ్యారు.   నారా లోకేశ్ కు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అధికారికం నియామకం జరిగింది కానీ.. ఆయన చాలా కాలంగా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాలుగా అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో లోకేష్ ముద్రను బలంగా  ఉంది.  ఇక పార్టీ కేడర్ తో లోకేష్ రెగ్యులర్ గా టచ్ లో ఉంటారు. అన్నిటికీ మించి లోకేష్ యూత్ గా బాగా కనెక్ట్ అవుతారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం వర్కింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ నియామకం పార్టీ పరంగా ఆయన ఇమేజ్ ను మరింత పెంచుతుందనడంలో సదేహం లేదు.   పొలిట్ బ్యూరోతో పాటు పార్టీలోనూ యువతకు ప్రాధాన్యం ఇవ్వాలన్న లోకేష్ భావనకు అనుగుణంగానే ఇప్పుడు పార్టీ కమిటీల ప్రకటన కూడా ఉంది.   రెగ్యులర్ గా కార్యకర్తలకు అందుబాటులో ఉండే లోకేశ్ కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వడం పార్టీ మరింత బలోపేతం కావడానికి, కార్యకర్తలలో మరింత జోష్ నింపడానికి దోహదపడుతుందని తెలుగుదేశం సీనియర్లు గట్టిగా చెబుతున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  -విభిన్నషేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ తో దూసుకుపోతున్న సంయుక్త  -గోల్డెన్ లెగ్ అనే పేరు  -రీసెంట్ గా ఎమోషనల్ పోస్ట్  కొంత మంది తారలు సిల్వర్ స్క్రీన్ పైకి రావడం, తమ హవాని చాలా బలంగా చాటుతూ ఉండటం చకచకా జరిగిపోతుంటాయి. అలాంటి వాళ్ళల్లో సంయుక్త మీనన్(Samyuktha Menon)ఒకటి. గ్లామర్ రోల్స్ అయినా, పెర్ఫార్మ్ ఓరియెంటెడ్ రోల్స్ అయినా తన ఫిజిక్ ని ఏ తీరుగా కావాలంటే ఆ తీరుగా మార్చుకోగలదు. భీమ్లా నాయక్, బింబి సార, విరూపాక్ష, సార్, అఖండ 2 , నారీనారీ నడుమ మురారి,  అఖండ 2 లోని క్యారెక్టర్స్ నే ఉదాహరణ. గోల్డెన్ లెగ్ అనే టాగ్ లైన్ ని కూడా పొందిన సంయుక్త రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ చేసారు. మరి ఆ పోస్ట్ లో ఏముందో చూద్దాం. సంయుక్త మీనన్ అప్ కమింగ్ మూవీస్ లో 'బ్లాక్ గోల్డ్'(Block Gold)ఒకటి.  ఫస్ట్ టైం లేడీ ఓరియెంటెడ్ మూవీలో చేస్తుండగా చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీకి సంబంధించిన విషయాన్నే ఇన్  స్టాగ్రామ్ లోప్రస్తావిస్తూ ''బ్లాక్ గోల్డ్’కొత్త షెడ్యూల్ మంచిర్యాల(Manchiryala)లో జరిగింది. 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎండలు మండిపోయాయి. ఈ విషయంలో  టీమ్ అంతా ఇబ్బంది పడ్డాం. మంచిర్యాల మమ్మల్ని ఎన్ని విధాలుగా పరీక్షించినా మా టీమ్  ధృడంగా నిలబడింది. అలసట, వేడిని తట్టుకుని అంకితభావంతో పనిచేశారు. వాళ్ళ  పట్టుదలకి గర్విస్తున్నాను. aslo read: Trisha: త్రిషపై తమిళ దర్శకుడి కామెంట్స్.. షూట్ కంప్లీట్ అయినా సెట్ కి ఎందుకు వెళ్ళింది  వడదెబ్బ తగలడం, డీహైడ్రేషన్ బారిన పడటం లాంటివి జరిగినా, నా  పర్సనల్ టీమ్ తీసుకున్న జాగ్రత్తల వల్లే నేను నిలబడగలిగాను. డైరెక్టర్ యోగి గైడెన్స్, నమ్మకం ఎంతో బలాన్ని ఇచ్చాయి  హైదరాబాద్ నుంచి సపోర్ట్ అందించిన నిహారికకి, సెట్స్ లో అన్నీ తానై చూసుకున్న పార్ధుకి స్పెషల్ థాంక్స్ అని తెలిపింది. ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమా కోసం యూనిట్ ఎంత కష్టపడుతుందో అందరకి తెలిసినట్లయింది. యాక్షన్ డ్రామాగా బ్లాక్ గోల్డ్  తెరకెక్కుతుండగా ఈ సమ్మర్ కె పాన్ ఇండియా వ్యాప్తంగా ల్యాండ్ కానుంది. సంయుక్త ఖాతాలో నిఖిల్ ప్రెస్టేజియస్ట్ పాన్ ఇండియా మూవీ స్వయంభు కూడా ఉండగా దశాబ్దాల క్రితం నాటి యుద్ధ వీరురాలుగా కనిపించనుంది. దీన్ని బట్టి పైన మనం చెప్పుకున్న సంయుక్త యాక్టింగ్ కెపాసిటీని అర్ధం చేసుకోవచ్చు.     
కోలీవుడ్ యాక్టర్ ఆర్య హీరోగా రూపొందిన భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘మిస్టర్ ఎక్స్’ (Mr. X). ‘ఎఫ్.ఐ.ఆర్’ (FIR) సినిమాతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మను ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ మూవీ తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ సర్టిఫికెట్, రన్ టైమ్ సెన్సార్ బోర్డు ఈ సినిమాకు U/A (UA13+) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమాలో ఉన్న భారీ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన స్పై ఎలిమెంట్స్ కారణంగా ఈ సర్టిఫికెట్ కేటాయించినట్లు తెలుస్తోంది. సినిమా నిడివి రెండున్నర గంటలకు లాక్ చేశారు. చాలా షార్ప్‌గా, ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెట్టే విధంగా ‘మిస్టర్ ఎక్స్’ను మలిచారని సెన్సార్ సభ్యుల నుంచి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. కథా నేపథ్యం భారతదేశానికి సంబంధించి అదృశ్యమైన ఒక న్యూక్లియర్ డివైస్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. అది విదేశీ శక్తుల చేతుల్లోకి వెళ్లడంతో, దాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఇండియన్ స్పై ఏజెంట్స్ రష్యాలో ఒక రహస్య ఆపరేషన్ ప్రారంభిస్తారు. అయితే, ఈ మిషన్ ఫెయిల్ కావడంతో భారత ఏజెంట్లపైనే దేశద్రోహులు అనే ముద్ర పడే ప్రమాదం ఏర్పడుతుంది. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి హీరో ‘మిస్టర్ ఎక్స్’ ఎలా బయటపడ్డాడు? మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ఆ ముప్పును ఎలా అడ్డుకున్నాడు? అన్నదే ఈ సినిమా ప్రధాన కథాంశం. సినిమా హైలైట్స్ దర్శకుడు మను ఆనంద్ ఈ సినిమాను కేవలం కల్పిత కథగా కాకుండా, భారతదేశంలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించారు. అరుళ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయని ట్రైలర్ ద్వారా స్పష్టమైంది. దిబు నినన్ థామస్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ స్పై థ్రిల్లర్‌కు కావాల్సిన ఇంటెన్సిటీని పెంచింది. ఒక స్పై ఏజెంట్‌గా ఆర్య తన లుక్, నటనతో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మైనస్ 10 డిగ్రీల చలిలో, నీటి అడుగున చిత్రీకరించిన యాక్షన్ సీక్వెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. స్పై యాక్షన్ థ్రిల్లర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మిస్టర్ ఎక్స్’ ఒక మంచి విందు అని చెప్పవచ్చు. సెన్సార్ బోర్డ్ నుంచి వచ్చిన పాజిటివ్ ఫీడ్‌బ్యాక్, ఆర్య పడ్డ శ్రమ ఈ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఏప్రిల్ 17న తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.  
ప్రముఖ నటి పూర్ణ ప్రధాన పాత్రలో నటించిన ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’ (Dark Night). ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. వివాహేతర సంబంధాలు, నమ్మకద్రోహం, మానవ సంబంధాల మధ్య ఉండే సున్నితమైన గీతను ఈ చిత్రం ఆవిష్కరించింది. మరి ఈ ‘డార్క్ నైట్’ మూవీ ఎలా ఉందంటే..? కథ: అలెక్స్ (విధార్థ్) ఒక పేరున్న లాయర్. అతని భార్య హేమ (పూర్ణ) హౌస్ వైఫ్. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే, అలెక్స్ తన వృత్తిలో ఎంత బిజీగా ఉంటాడో, వ్యక్తిగత జీవితంలో తన భార్యకు అంత దూరంగా ఉంటాడు. పైగా తన ఆఫీసులో పనిచేసే సోఫియా (శుభశ్రీ రాయగురు)తో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుంటాడు.  భర్త ప్రవర్తనతో విసిగిపోయిన హేమ, ఒంటరితనంతో కుమిలిపోతుంది. ఈ క్రమంలో ఆమెకు రోషన్ (త్రిగుణ్) అనే యువకుడు పరిచయమవుతాడు. ఒక రోడ్డు ప్రమాదం వీరిద్దరినీ దగ్గర చేస్తుంది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారుతుంది. అయితే, ఇది కరెక్ట్ కాదని భావించి రోషన్ కు దూరంగా ఉండాలని హేమ నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలో ఒక షాకింగ్ సంఘటన వారి జీవితాలను ఊహించని మలుపు తిప్పుతుంది. అసలు హేమ జీవితంలో జరిగిన ఆ సంఘటన ఏమిటి? అలెక్స్ తన తప్పు తెలుసుకున్నాడా? రోషన్ నేపథ్యం ఏమిటి? అన్నదే మిగిలిన కథ. విశ్లేషణ: ‘డార్క్ నైట్’ రొటీన్ క్రైమ్ థ్రిల్లర్లకు భిన్నంగా, మానవ సంబంధాల మీద దృష్టి పెట్టిన చిత్రం. సమాజంలో జరుగుతున్న వాస్తవ సంఘటనల ఆధారంగా, ఎవరి విషయంలోనైనా జాగ్రత్తగా ఉండాలనే సందేశాన్ని ఇందులో చూడవచ్చు.  దర్శకుడు ఆదిత్య ఈ సినిమాను వైవాహిక జీవితంలోని చీకటి కోణాలను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. భార్యాభర్తల మధ్య నమ్మకం సడలినప్పుడు మూడో వ్యక్తి ప్రవేశం వల్ల కలిగే పరిణామాలు ఎలా ఉంటాయో చూపడానికి ప్రయత్నించారు.  ఫస్టాఫ్‌లో హేమ-రోషన్ మధ్య సాగే సీన్లు ఎమోషనల్ గా సాగుతాయి. సెకండాఫ్ లో భర్త పాత్ర ప్రవేశంతో కథలో ఉత్కంఠ పెరుగుతుంది. వైవాహిక బంధానికి కట్టుబడి ఉండాలా? లేక తనకు దక్కని ప్రేమ కోసం మరో దారి వెతుక్కోవాలా? అనే సందిగ్ధంలో ఉన్న మహిళ పరిస్థితిని సహజంగా చూపించారు.  కథ ప్రారంభంలో సాధారణంగా అనిపించినా ముందు వెళ్తున్న కొద్దీ ఆసక్తికరంగా మారుతుంది. అయితే, కథనం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగడం, క్లైమాక్స్ లో కొంత గందరగోళం ఉండటం సినిమాకు మైనస్ పాయింట్లు. అలాగే కొన్ని సన్నివేశాల్లో హద్దులు దాటినట్టు అనిపించే బోల్డ్ కంటెంట్ కుటుంబ ప్రేక్షకులకు కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు. ఈ సినిమాలో చూపించిన 'రీసెట్ బటన్' కాన్సెప్ట్ ఆకట్టుకుంది. జీవితంలో జరిగిన తప్పులను సరిచేసుకోవడానికి ఒక అవకాశం లభించినట్టుగా ఇందులో చూపించారు. అయితే, నిజ జీవితంలో "రీసెట్ బటన్ ఉండదు" అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇచ్చారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు: ఈ చిత్రానికి పూర్ణ నటన ప్రధాన ఆకర్షణ. హేమ పాత్రలో ఆమె అద్భుతంగా నటించింది. భర్త వల్ల మోసపోయిన భార్యగా, మానసిక సంఘర్షణకు గురయ్యే మహిళగా హేమ అద్భుతమైన నటనను కనబరిచారు. ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల్లో ఆమె నటన హైలైట్‌గా నిలిచింది. భార్యను నిర్లక్ష్యం చేసే భర్తగా విధార్థ్ తన పాత్రకు న్యాయం చేశారు. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆయన నటన సహజంగా ఉంది. రోషన్ పాత్రలో త్రిగుణ్ చక్కగా ఒదిగిపోయారు. కథను మలుపు తిప్పే కీలక పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. గ్లామర్ పరంగా సోఫియా పాత్రలో శుభశ్రీ ఆకట్టుకుంది. కార్తీక్ ముత్తుకుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మూడ్ కు తగినట్లుగా లైటింగ్, కలర్ గ్రేడింగ్ ఉన్నాయి. మిస్కిన్ అందించిన సంగీతం కథలోని ఎమోషన్స్‌ను ఎలివేట్ చేయడంలో తోడ్పడింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే..  ‘డార్క్ నైట్’ ఒక మంచి సందేశంతో కూడిన ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్. వివాహ బంధంలో నమ్మకం ఎంత ముఖ్యమో ఈ సినిమా చూపిస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి, సోషల్ మెసేజ్ కోరుకునే వారికి ఈ సినిమా ఒక మంచి ఛాయిస్. Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
    -సౌత్ లో త్రిషకి ఉన్న స్టార్ డమ్ తెలిసిందే  -విశ్వంభరతో త్వరలో రాక  -మే 14 న సూర్యతో కలిసి కరుప్పు తో కనువిందు -తెలుగు టైటిల్ వీరభద్రుడు  -అలాంటి టైంలో త్రిషపై ప్రముఖ దర్శకుడి వ్యాఖ్యలు వైరల్       త్రిష(Trisha).. ఈ పేరు వింటే చాలు లెక్కలేనన్ని సినిమాల్లో ఆమె పోషించిన క్యారెక్టర్స్ మనతో ఏవో ఊసులాడుతూ ఉంటాయి. అంతలా తన పెర్ఫార్మ్ తో మనల్ని తన వశం చేసుకోగలదు. సెకండ్ ఇన్నింగ్స్ లో  విజయ్(Vijay)తో చేసిన లియో, కమల్(Kamal)తో చేసిన థగ్ లైఫ్ తో తన జైత్రయాత్రని కొనసాగిస్తోంది. చిరంజీవి(Chianjeevi)విశ్వంభరలో కూడా త్రిషనే.  ప్రెజెంట్ తన అప్ కమింగ్ మూవీ 'కరుప్పు'(Karuppu). సూర్య(Suriya)హీరో కాగా తెలుగులో వీరభద్రుడు(Veerabhadrudu)టైటిల్ తో వస్తుంది. ఆ చిత్ర దర్శకుడు  త్రిష గురించి చేసిన వ్యాఖ్యలు ఆమెకి సినిమా, నటన పట్ల ఉన్న కమిట్ మెంట్ కి ఉదారణగా చెప్పుకోవచ్చు. ఆ వ్యాఖ్యలు చూద్దాం. వీరభద్రుడుకి దర్శకుడు ఆర్ జె బాలాజీ(RJ Balaji). రీసెంట్ గా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు గతంలో త్రిషతో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ సాధ్యపడలేదు. కానీ కరుప్పు కోసం సంప్రదించి స్క్రిప్ట్ ని వినిపించాను. దాంతో హీరోయిన్ గా చెయ్యడానికి ఒప్పుకుంది. పైగా తన క్యారక్టర్ కి సంబంధించిన షూట్ కంప్లీట్ అయినా మాతో కలిసి సెట్ కి వచ్చే వారని చెప్పాడు. ఇప్పుడు ఈ ఒక్క మాట త్రిష అభిమానులతో పాటు నెటిజన్స్ ని విశేషంగా ఆకర్షిస్తుంది. అంత కమిట్ మెంట్ ఉండటం వల్లనే త్రిష ఇన్ని సంవత్సరాల నుంచి తన హవా కొనసాగిస్తుందనే కామెంట్స్ చేస్తున్నారు. Also read: Ranbir Kapoor: 'రణబీర్'కి విలువైన బహుమతిని కట్టబెట్టిన రాముడు.. ఏకైక భారతీయనటుడిగా రికార్డు  వీరభద్రుడు మే 14 న వరల్డ్ వైడ్ గా రిలీజవ్వడానికి కావలసిన అన్ని కార్యక్రమాలని పూర్తి చేసుకుంటుంది. ప్రచార చిత్రాలు చూస్తుంటే ఈ సారి సూర్యకి పరాజయాలు కాన్ఫిడెన్స్ గానే గుడ్ బై చెప్పేలా ఉన్నాయి. ఆర్ జె బాలాజీ సినీ జాతకం ప్రెజెంట్ హిట్ మోడ్ లోనే ఉంది. అయితే ఈ చిత్రానికి ఉన్న స్పెషల్ ఏంటంటే 22 ఏళ్ళ తర్వాత సూర్య, త్రిష జంటగా చేస్తు సిల్వర్ స్క్రీన్ కి నూతన కాంతులని తీసుకురానున్నారు. ఈ ఇద్దరు 2005లో 'ఆరు' మూవీతో కనిపించారు. సదరు మూవీలోని 'చూడద్దే.. నను చూడద్దే.. సుర కత్తిలాగా నను చూడద్దే సాంగ్ నేటికీ చాలా మంది ఫేవరేట్ సాంగ్ హోదాలో తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూనే ఉంది.         
టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. గతంలో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు కలిసి నటించి మెప్పించారు. నేటి తరం హీరోలు కూడా దానిని కొనసాగిస్తున్నారు.  ఈ తరం స్టార్స్ లో మల్టీస్టారర్స్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) ఏ మాత్రం వెనకాడటం లేదు. ఇప్పటికే రామ్ చరణ్ తో కలిసి 'ఆర్ఆర్ఆర్' చేశారు. అలాగే బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తో 'వార్-2'లో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అయితే నిజానికి ఎన్టీఆర్ కి మహేష్ బాబు(Mahesh Babu)తో మల్టీస్టారర్ చేయాలనే కోరిక ఎప్పటినుంచో ఉంది. ఈ విషయాన్ని గతంలో జయప్రదం టాక్ షోలో స్వయంగా ఎన్టీఆర్ రివీల్ చేయడం విశేషం. ఎన్టీఆర్ మనసులో మాట "మీరు ఒకవేళ మల్టీస్టారర్ సినిమా చేయాల్సి వస్తే ఎవరితో చేస్తారు?" అని అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ తడుముకోకుండా "మహేష్ బాబు" అని సమాధానమిచ్చారు. మహేష్ బాబును ఆయన ప్రేమగా 'మహేష్ అన్న' అని పిలుస్తుంటారు. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. ఒకవేళ వీరిద్దరూ కలిసి సినిమా చేస్తే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని చెప్పవచ్చు. ‘దాన వీర శూర కర్ణ’ రీమేక్ సాధ్యమేనా? అదే ఇంటర్వ్యూలో తారక్ తన తాతగారైన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఏ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారని అడగ్గా, ఆయన "దాన వీర శూర కర్ణ" అని చెప్పారు. ఈ పౌరాణిక చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక అద్భుతం. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధనుడి పాత్రల్లో అద్భుతంగా నటించి మెప్పించడమే కాకుండా.. దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. బెస్ట్ డైరెక్టర్ ఎవరు? ఎస్.ఎస్. రాజమౌళి, వి.వి. వినాయక్, కృష్ణవంశీ ఈ ముగ్గురిలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు అని అడగగా.. ఇది ఛండాలమైన ప్రశ్న అని (నవ్వుతూ), ఎందుకంటే ముగ్గురు బెస్ట్ అని తారక్ చెప్పారు. యాక్టర్ గా తనను ముగ్గురూ బాగా ప్రొజెక్ట్ చేశారని తారక్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఆశపడినట్టుగా మహేష్ బాబుతో మల్టీస్టారర్, ‘దాన వీర శూర కర్ణ’ రీమేక్ రెండూ జరగాలంటే అది రాజమౌళి వల్ల సాధ్యమయ్యే అవకాశముంది. ఎందుకంటే రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం'. టాప్ స్టార్స్ తో మహాభారతాన్ని తెరకెక్కించాలి అనేది ఆయన ఆలోచన. అదే జరిగితే కృష్ణ, కర్ణ, అర్జున, దుర్యోధన వంటి పాత్రల కోసం ఎన్టీఆర్, మహేష్ వంటి స్టార్స్ రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికర ఇంటర్వ్యూలు, సినిమా అప్డేట్స్ కోసం మా 'తెలుగువన్ సినిమా' (TeluguOne Cinema) ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
  -రామాయణతో రాముడిని మరిపిస్తున్న రణబీర్  -అందరిలో భారీ అంచనాలు -ఇప్పుడు ఆ రాముడే 'రణబీర్'కి సాయం  -ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం    స్టార్ హీరో రణబీర్ కపూర్(Ranbir Kapoor)ప్రస్తుతం 'రామాయణ'(Ramayana)లో చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజైన ప్రచార చిత్రాలతో రాముడిగా కొన్ని తరాల పాటు తన 'రూపు'నే రామ భక్తుల్లో నిలబడి పోవడం ఖాయమనే సంకేతాలైతే చాలా బలంగా చెప్పాడు. అంతలా  అయోధ్య రాముడిగా పర్ఫెక్ట్ గా సూటయ్యాడు. ఇప్పుడు ఆ రాముడే రణబీర్ కి అత్యంత విలువైన బహుమతిని కట్టబెట్టాడు. మరి ఆ బహుమతి ఏంటో చూసేద్దాం. టైం మ్యాగజైన్(Time magazine).. అమెరికా దేశానికి చెందిన ఈ మ్యాగజైన్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతో పేరెన్నికగన్నది, ప్రతిష్టాత్మకమైనది. ప్రతి సంవత్సరం ప్రపంచంలోనే అత్యంత ప్రభావం చూపించే 100 మంది ప్రతిభావంతుల పేర్లని వెల్లడి చేస్తుంది. ఆ జాబితాలో చోటు సంపాదించాలంటే పెట్టి పుట్టాలనే మాట సెలబ్రిటీస్ నోటి వెంట వినిపిస్తు ఉంటుంది. ఇప్పుడు ఆ లిస్ట్ లో రణబీర్ నిలిచాడు. రణబీర్ తప్ప మరో భారతీయ నటులు 2026  టైమ్స్ జాబితాలో లేరు. ఓన్లీ రణబీర్ నే ఉన్నాడు. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే గత ఏడాది టైమ్స్ జాబితాలో సినీ పరిశ్రమ నుంచే కాకుండా ఏ రంగం నుంచి కూడా ఒక్క భారతీయుడు స్థానం సంపాదించలేదు. ఈ నేపథ్యంలో రణబీర్ కి ఆ అయోధ్య రాముడే టైం మ్యాగజైన్ 2026 లో చోటు కల్పించాడనే మాటలు అభిమానుల నుంచి వినిపిస్తున్నాయి. also read: Ott telugu: ఆ అడవిలోకి వెళ్తే తిరిగిరారు.. ఈ రోజే ఓటీటీలోకి వచ్చిన మలయాళం బ్లాక్ బస్టర్ రామాయణ వరల్డ్ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. రెండు భాగాలుగా తెరకెక్కనుండగా మొదటి భాగం 2026 దీపావళికి, రెండో భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. మరో వైపు లెజండ్రీ డైరెక్టర్ సంజయ్ లీలాభన్సాలీ(Sanjay leela bhansali)దర్శకత్వంలో 'లవ్ అండ్ వార్' ని కూడా రణబీర్ ఇప్పటికే ప్రకటించాడు.        
    -రెగ్యులర్ మూవీస్ చూసి బోర్ కొడుతుందా! -ఇంకెందుకు ఆలస్యం ఓటిటిలోకి వెళ్ళండి -మీ కోసమే వచ్చింది  దేవభూమిగా కేరళ రాష్టానికి ఉన్న కితాబు గురించి తెలిసిందే. చాలా ఏళ్ళ నుంచి సినీ ప్రియులకి అద్భుతమైన కథనంతో కూడిన సినిమాలని అందించే సినీభూమిగా కూడా కీర్తి గడించింది. మనుషుల్లో ఉండే మంచి, చెడులని బేసిక్ గా చేసుకొని ఎలాంటి భారీ తననానికి పోకుండా సృజనాత్మకత తో కూడిన చిత్రాలని మాత్రమే తెరకెక్కిస్తోంది. ఈ మధ్య కాలంలో హర్రర్, థ్రిల్లర్ సినిమాలని కూడా తెరకెక్కిస్తు పాన్ ఇండియా ప్రేక్షకులు తమపై పెట్టుకున్న నమ్మకానికి పది రేట్లు అధికంగా సినీ అనుభూతిని, వినోదాన్ని అందిస్తుంది. ఇప్పుడు అలాంటి ఒక చిత్రం సైలెంట్ గా ఓటిటిలోకి షిఫ్ట్ అయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. 'శంభవం ఆద్యం ఒన్ను'(sambhavam adhyayam onnu).. పక్కా మిస్టరీ థ్రిల్లర్.  గత నెల 6 న థియేటర్స్ లోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకుంది. ఊహకి అందని కథ, కథనం ,ట్విస్టులు, నటీనటుల పెర్ ఫార్మెన్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఫొటోగ్రఫీ ఇలా అన్ని అంశాలు ఒక రేంజ్ లో ఉంటాయి. టైమ్ లూప్ ఎలిమెంట్స్ జోడించడం స్పెషల్ ఎట్రాక్షన్. ఇప్పుడు ఈ మూవీ నిన్న అర్ధరాత్రి నుంచి  ఓటీటీలోకి వచ్చేసింది. ఐఎమ్డీబీలోను టాప్ రేటింగ్ దక్కించుకుందంటే 'శంభవం ఆద్యం ఒన్ను' క్వాలిటీని అర్ధం చేసుకోవచ్చు.  Also read: Dhurandhar 2: ధురంధర్ 2 ఫెయిల్ అవ్వాలని స్టార్ డైరెక్టర్స్ కోరిక.. కోహ్లి సంచలన కామెంట్స్ కథ విషయానికి వస్తే.. కేరళ, తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కాకి ఆకారంలో ఉండే ఓ రహస్య ఆలయం నేపథ్యంలో సాగుతుంది. ఇంతకంటే లోతుగా వెళ్లి కథ చెప్పడం సినీ దర్మం కాదు. మీరు కూడా వద్దనే అంటారనుకోండి. మరి లేటు చేయకుండా చూసెయ్యండి. అస్కర్ అలీ, వినీత్ కుమార్, సిద్దార్ధ్ భరతన్, సెంథిల్ కృష ముఖ్యమైన క్యారెక్టర్స్ లో కనిపించగా జీతు(Jeethu) దర్శకుడు. ఫరాజ్ మహమ్మద్, ఫాహద్, ఫయేజ్ మహమ్మద్ నిర్మాతలు. జియో హాట్ స్టార్ స్ట్రీమింగ్ కి సిద్ధం చేయగా తెలుగులో కూడా అందుబాటులో ఉంది.        
  -1712 కోట్ల గ్రాస్ తో దూసుకుపోతున్నా ధురంధర్ 2  -రెండు పార్టులు కలిపి 3000 కోట్లు  -ఫస్ట్ ఇండియన్ మూవీ కూడా  -ఈ నేపథ్యంలో కోహ్లి కామెంట్స్ వైరల్  -పూర్తి మాటర్ చూద్దాం ఒక పక్కన కింగ్ కోహ్లి(King Kohli)ఐపీఎల్ లో తన బ్యాటింగ్ విన్యాసాన్ని చూపిస్తూ పరుగుల వరద పారిస్తున్నాడు. తన దూకుడు చూస్తుంటే పలు రికార్డ్స్ స్వచ్ఛందంగాకోహ్లికి సరెండర్ అయ్యేలా ఉన్నాయి. మరోవైపు ధురంధర్ 2(Dhurandhar 2)పదిహేడు వందల పన్నెండుకోట్ల గ్రాస్ ని రాబట్టి మొత్తం రెండు పార్టులు కలిపి మూడువేల కోట్ల గ్రాస్ ని సాధించింది. ఆ ఫీట్ ని సాధించిన తొలి భారతీయ చిత్రం ధురంధర్ సిరీస్ నే. ఈ నేపథ్యంలో కోహ్లి ధురంధర్ 2 ప్లాప్ అవ్వాలని బాలీవుడ్ లో చాలా మంది కోరుకున్నారనే వ్యాఖ్యలు చేసాడనే న్యూస్  సోషల్ మీడియాలో హై ప్రొటెన్షన్ సెక్యూరిటీ మధ్య చక్కర్లు కొడుతుంది. మరి అసలు వాస్తవమేంటో చూద్దాం.  కోహ్లి అలియాస్ కునాల్ కోహ్లి(Kunal Kohli).. బాలీవుడ్ లో విశిష్ట దర్శకుడిగా పేరు గడించాడు. రీసెంట్ గా ఆయన మాట్లాడుతు బాలీవుడ్ లో చాలా మంది ధురంధర్ 2 ఫెయిల్ అవ్వాలని కోరుకున్నారు. అలా కోరుకున్న వాళ్ళల్లో స్టార్ డైరెక్టర్స్  ఉన్నారు. కనీసం సపోర్ట్ కూడా ఇవ్వలేదు. ఫస్ట్ డే టాక్ బాగానే వచ్చినా సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గడం ఖాయమని, దీంతో ధురంధర్ 2 పరాజయం అంచున నిలుస్తుందనేది వాళ్ళ భావన. కానీ వాళ్ళ అంచనాలు తప్పి సోమవారం నుంచి మరింత కలెక్షన్స్ తో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. సన్నీడియోల్ నుంచి వచ్చిన బోర్డర్ 2 ఫెయిల్ అవ్వాలని కూడా  కోరుకున్నారు. కానీ మంచి విజయాన్ని అందుకుంది. ఇండస్ట్రీ మీకు మద్దతు ఇస్తుందా లేదా అనేది ఇక్కడ ముఖ్యం కాదు. విజయం సాధించాలనేది మనకి ముఖ్యమని కునాల్ చెప్పుకొచ్చాడు. ఇక పలు సినీ సైట్స్, సోషల్ మీడియాలో కోహ్లి ధురంధర్ 2 గురించి మాట్లాడాడనే న్యూస్ వస్తుంటే అందరు విరాట్ కోహ్లీ అనుకున్నారు. కానీ అసలు నిజం కునాల్ కోహ్లి. కునాల్ సుదీర్గ కాలం నుంచి బాలీవుడ్ లో దర్శకుడిగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.  2002 లో హృతిక్ రోషన్, రాణి ముఖర్జీ ,కరీనా కపూర్ జంటగా వచ్చినా ముజ్ సే దోస్తీ కరే గే  తొలి మూవీ. 2004 లో సైఫ్ అలీ ఖాన్, రాణీముఖర్జీ తో 'హమ్ తుమ్' ని తెరకెక్కించగా ఉత్తమ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డుని అందుకున్నాడు. 2006 లో అమీర్ ఖాన్, కాజల్ తో 'ఫనా' తో పాటు పలు చిత్రాలు చేసిన కునాల్ గత ఏడాది ఫిబ్రవరిలో 'బాబీ ఔర్ రిషికి లవ్ స్టోరీ' అనే  వెబ్ సిరీస్ ని తెరకెక్కించాడు. ధురంధర్ 2 గురించి మాట్లాడే సందర్భంలో తను కూడా దర్శకుడిగా  సక్సెస్ అవ్వకూడదని ఇండస్ట్రీలో చాలా మంది తపన పడ్డారని చెప్పుకొచ్చాడు.      
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో 'సూపర్ స్టార్' అనే పదానికి నిలువెత్తు రూపం రజనీకాంత్. ఆయన తెరపై కనిపిస్తే చాలు థియేటర్లు దద్దరిల్లిపోతాయి. కేవలం స్టైల్ మాత్రమే కాదు, భావోద్వేగాలను పండించడంలోనూ, శత్రువుల భ‌ర‌తం ప‌ట్టే యాక్షన్ సీన్లను పండించడంలోనూ ఆయనకు ఆయనే సాటి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, రజనీకాంత్ తన కుటుంబం కోసం సామాన్య వ్యక్తి నుంచి ఒక వీరుడిలా ఎలా మారాడో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తన శాంత స్వభావాన్ని వీడి, విశ్వరూపం చూపించిన ఆ సన్నివేశం అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ వీడియోలో ఒక రౌడీ ముఠా రజనీకాంత్ కుటుంబాన్ని, ముఖ్యంగా ఆయన చెల్లెలిని వేధిస్తూ, అవమానకరంగా మాట్లాడుతుంటారు. అంతకుముందు వరకు ఎన్నో అవమానాలను భరిస్తూ, స్తంభానికి కట్టేసి కొడుతున్నా మౌనంగా ఉన్న రజనీకాంత్, తన చెల్లెలి గౌరవానికి భంగం కలుగుతుందన్న తరుణంలో కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకుపడతాడు. ఆ రౌడీలను ఊచకోత కోస్తూ ఆయన చేసిన ఫైట్ చూసి అక్కడున్న వారంతా నిర్ఘాంతపోతారు. రజనీకాంత్ తనలోని ఈ కోణాన్ని ఇన్నాళ్లూ దాచి ఉంచడం చూసి ఆయన తమ్ముడు (పోలీస్ ఆఫీసర్) ఆశ్చర్యపోతాడు. హాస్పిటల్‌లో చావు బతుకుల మధ్య ఉన్న రౌడీల పరిస్థితి చూసిన డాక్టర్లు కూడా, "ఇవి సాధారణ వ్యక్తి కొట్టిన దెబ్బలు కావు, నరనరాల్లో పోరాడే శక్తి ఉన్నవాడు మాత్రమే ఇలా కొట్టగలడు" అని చెబుతారు. దీంతో ఆయన తమ్ముడు, "అన్నయ్య అసలు నువ్వు ఎవరు? బాంబేలో ఏం చేసేవాడివి?" అంటూ నిలదీస్తాడు. ఇన్నాళ్లూ తమ మధ్య ఒక సామాన్యుడిలా ఉన్న అన్నయ్య వెనుక ఇంతటి భీకరమైన గతం ఉందా అని కుటుంబం మొత్తం విస్మయానికి గురవుతుంది. తమ్ముడు తన అన్నయ్యను అనుమానిస్తున్న తరుణంలో, తల్లి జోక్యం చేసుకుని రజనీకాంత్‌కు మద్దతుగా నిలుస్తుంది. "ఈ కుటుంబం కోసం చెప్పులు అరిగేలా కష్టపడుతున్న వాడిని నేరస్తుడిలా నిలబెడతావా?" అని తమ్ముడిని గద్దిస్తుంది. వయసు వచ్చిన ఆడపిల్ల మీద చేయి వేస్తే ఏ మగాడైనా ఇలాగే స్పందిస్తాడని, తన కొడుకు చేసిన దానిలో తప్పేమీ లేదని స్పష్టం చేస్తుంది. ఈ సన్నివేశం కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, ఒక అన్నకు తన కుటుంబం పట్ల ఉన్న బాధ్యతను, ప్రేమను చాటి చెబుతుంది. రజనీకాంత్ సినిమాల్లో యాక్షన్ సీన్లు కేవలం కొట్లాటలు మాత్రమే కాదు, వాటి వెనుక బలమైన సెంటిమెంట్ ఉంటుంది. ఈ వీడియోలో కూడా తన గతాన్ని దాచిపెట్టి కుటుంబం కోసం మౌనంగా దెబ్బలు తిన్న ఒక అన్న, వారి గౌరవం కోసం పులిలా మారడం ప్రేక్షకులకు రోమాంచితమైన అనుభూతిని ఇస్తుంది. రజనీకాంత్ నటన, ఆ పవర్‌ఫుల్ డైలాగులు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇలాంటి మ‌రిన్ని అద్భుత‌మైన వీడియోల‌ను చూసేందుకు మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి. 
Satya Dev is trying something different with a never-seen-before character in the upcoming film Rao Bahadur. The makers have just released the first single, O Sundari, to kickstart the musical promotions. It is definitely a good attempt by music director Smaran Sai. He has crafted a pure classic composition, and Vijay Yesudas sang it brilliantly, pouring real emotion into the track. Lyricist Rehman also wrote great, meaningful lyrics that fit the mood perfectly. However, while the overall effort and musical rendition deserve high praise, the song seems a bit too classical for the latest Gen Z audiences taste, who usually lean towards more modern, fast-paced tunes. Visually, the song stands out thanks to the neat chemistry between the lead pair. Satya Dev carries his stylish vintage look with ease, and Deepa Thomas brings a graceful presence to the screen. Writer and director Venkatesh Maha always shows a penchant to deliver something unique, and his distinct aesthetic is quite visible here.  With presenter Mahesh Babu and producers Chinta Gopalakrishna Reddy, Anurag Reddy, and Sharath Chandra backing the project, the production values are undeniably strong. While O Sundari is a very well-made classical track, its reach among the regular commercial moviegoers will be interesting to observe.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
జీవితంలో ప్రతి ఒక్కరూ విజయం కోసం తహతహలాడుతూ ఉంటారు.  అందుకోసం చాలా ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. కానీ ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే.. చేసే కొన్ని తప్పులు వారికి ఎలాంటి విజయాన్ని ఇవ్వవు అని చెబుతాడు ఆచార్య చాణక్యుడు.  ఆచార్య చాణక్యుడు గొప్ప తత్వవేత్త.. వేల సంవత్సరాల కిందటే.. మనిషి వ్యక్తిత్వాన్ని, రాజనీతిని, ఆర్థిక సూత్రాలను ప్రపంచానికి అందించాడు.  అవి ఇవ్పటికీ ప్రజలు ఆచరించే విధంగా ఉన్నాయంటే.. ఆయన ఆలోచన,  ఆయన సిద్దాంతాలు ఎంత గొప్పవో అర్థం చేసుకోవచ్చు. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో.. సమాజంలో ఉండే కొందరు వ్యక్తులను అవమానించడం వల్ల  ఎంతో ఉజ్జ్వలమైన భవిష్యత్తును చీకటిలోకి నెట్టుకున్నట్టు అవుతుందని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఐదుగురు వ్యక్తులను అవమానించడం వల్ల జీవితంలో అసలు విజయాన్ని సాధించలేరని కూడా చెబుతాడు. ఇంతకీ ఎవరిని అవమానించకూడదు? ఎందుకు అవమానించకూడదు? తెలుసుకుంటే.. గురువు.. చాణక్య నీతి ప్రకారం గురువు అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంటారు, ఎందుకంటే గురువు  అజ్ఞానమనే చీకటి నుండి జ్ఞానమనే వెలుగులోకి నడిపిస్తాడు. గురువు మనకు అక్షరాస్యతను అందించడమే కాకుండా, జీవితంలోని సవాళ్లను ఎదుర్కోవడానికి ఎలాంటి విలువలు కలిగి ఉండాలో.. ఆ విలువలను నేర్పుతాడు. తమ గురువును లేదా మార్గదర్శకుడిని అగౌరవపరిచిన వారు తమ జ్ఞానాన్ని, విజయాన్ని కోల్పోతారని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. తల్లిదండ్రులను.. ఈ ప్రపంచంలో తల్లిదండ్రుల కంటే గొప్ప శ్రేయోభిలాషులు ఉండరు. తండ్రి కుటుంబానికి రక్షణ కవచం అయితే, తల్లి విలువలకు, ప్రేమకు ప్రతిరూపం. తల్లిదండ్రులకు మానసిక వేదన కలిగించే లేదా వారిని అగౌరవపరిచే పిల్లలు అదృష్టాన్ని, సంతోషాన్ని కోల్పోతారని చాణక్యుడు చెప్పాడు. చాణక్యుని ప్రకారం, పెద్దల కళ్లలో కన్నీళ్లు ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ నివసించదట. పండితులు.. చాణక్య నీతి ప్రకారం సమాజంలో అపారమైన అనుభవం, బోలెడు జ్ఞానం ఉన్నవారే పండితులు.  అలాంటి పండితుల సాంగత్యం అమూల్యమైనది. పండితులను ఎగతాళి చేయడం లేదా కించపరచడానికి ప్రయత్నించడం మేధో దారిద్య్రాన్ని ప్రతిబింబిస్తుందని చాణక్యుడు పేర్కొన్నాడు. పండితులను అవమానించడం ద్వారా, సరైన సలహా, మార్గదర్శకత్వం పొందే అవకాశాలను కోల్పోయి, చివరికి పతనానికి గురవుతారట. కష్టపడి పనిచేసేవారు, సేవాభావం గలవారు.. ఆచార్య చాణక్యుడు ఎల్లప్పుడూ కష్టానికి గౌరవం ఇవ్వాలని బోధించారు. పారిశుధ్య కార్మికుడైనా, సెక్యూరిటీ గార్డు అయినా, కూలీ అయినా.. సమాజాన్ని నడిపించడానికి కష్టపడే ప్రతి ఒక్కరూ గౌరవానికి అర్హులు. ఒకరి ఆర్థిక స్థితి లేదా హోదాను బట్టి వారిని అవమానించడం మనిషిలో అహంకారాన్ని ప్రతిబింబిస్తుంది. అటువంటి ప్రతికూల శక్తే  ఉంటే.. అదే వారి దురదృష్టానికి అతిపెద్ద కారణం అవుతుంది. సాధు స్వభావం ఉన్నవారు.. ధర్మం, సత్యం, నైతికత మార్గాన్ని అనుసరించేవారిని అసంతృప్తికి గురిచేయడం, అవమానించడం చాలా తప్పు. సద్గుణ, సత్ప్రవర్తన గలవారు ఎవరికీ కీడు కోరుకోరు, కానీ వారిని అవమానించడం జీవితంలోని సానుకూల శక్తిని నాశనం చేస్తుంది. మానసిక సమతుల్యత కావాలన్నా, ఇంట్లో శాంతికి లోటు ఉండకూడదన్నా సాధు స్వభావం గల వారిని గౌరవించడం చాలా అవసరం.                            *రూపశ్రీ.
ప్రతి వ్యక్తికి విభిన్నమైన వ్యక్తిత్వం ఉంటుంది; కొందరు చాలా కలివిడిగా ఉంటారు, మరికొందరు నిశ్శబ్దంగా, అంతర్ముఖంగా ఉంటారు. ఈ వ్యత్యాసం ఆధారంగా ఇంట్రోవర్ట్,  ఎక్స్ట్రోవర్ట్ అంటూ రెండు విభాగాలుగా విభజిస్తూ ఉంటారు. ఎక్స్ట్రోవర్ట్  లు అయితే బయటకు బాగా జాలీగా ఉంటూ, అందరిలో కలిసిపోతూ.. ఎక్కడైనా సరే ఇట్టే సర్దుకుపోయే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఇంట్రోవర్ట్ లు అలా కాదు.. వారు ఎవరి ముందూ ఏమీ ఎక్కువ మాట్లాడలేరు, కనీసం కావలసిన వస్తువులు,  అవసరమైన విషయాల దగ్గర కూడా వారు మాట్లాడలేకపోవడం వల్ల నష్టపోతూ ఉంటారు. ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఈ కారణంగా ఇంట్రోవర్ట్ లను చాలా కామెడీ చేస్తుంటారు. వారు సిగ్గుపడుతూ ఉంటారని, మొహమాటం ఎక్కువని కూడా ఆటపట్టిస్తూ ఉంటారు. అయితే.. ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.. నాణేనికి మరొక వైపు కూడా ఉంటుంది. అదే ఇంట్రోవర్ట్ లలో ఉండే బలం.  వారి వ్యక్తిత్వమే వారికి పెద్ద బలం అని చాలామంది కూడా అంటుంటారు. ఇంతకీ.. ఇంట్రోవర్ట్ లలో ఉండే బలాలు ఏంటో తెలుసుకుంటే.. ఒంటరితనం.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఒంటరిగా ఉన్నప్పుడు పునరుత్తేజం పొందుతారు. వారికి జనాల మధ్యలో ఉండటం అనే విషయం  త్వరగా విసుగు తెప్పిస్తుంది. అయితే ఇలా ఒంటరిగా ఎక్కువ గడపడం వల్ల వారికి వారి మీద నమ్మకం, వారి నిర్ణయాల పట్ల నమ్మకం, తమ వ్యక్తిత్వం పట్ల దృఢంగా ఉంటారు. లోతైన మాటలు.. ఇంట్రోవర్ట్ లు  చిల్లర మాటల కంటే అర్థవంతమైన సంభాషణలకు ప్రాధాన్యత ఇస్తారు. అదే పనిగా ఏదో ఒకటి మాట్లాడటం అనే దాని కంటే.. అవసరమైనప్పుడు అవసరమైన విషయాలు మాట్లాడటానికే వారు ఆసక్తి చూపిస్తారు. అతి ఆలోచనలు.. ఇంట్రోవర్ట్ లు ఒంటరిగా గడపడం ఎక్కువ కాబట్టి చాలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. ప్రతి విషయం గురించి లోతుగా ఆలోచిస్తారు ,  నిర్ణయాలను జాగ్రత్తగా పరిశీలిస్తారు. తక్కువే.. కానీ బలమైన స్నేహాలు.. ఇంట్రోవర్ట్ లకు ఎక్కువ మంది స్నేహితులు ఉండరు. వారి లిస్ట్ లో చాలా కొద్దిమంది మాత్రమే స్నేహితులు ఉంటారు.  కానీ ఆ కొద్ది మంది చాలా మంచి స్నేహితులై ఉంటారు.  వారి స్నేహం కూడా చాలా బలంగా ఉంటుంది. వారు పెద్దగా మాట్లాడరని అంటుంటారు.. కానీ వారి మనసుకు ఎవరైనా దగ్గరైనా,  ఎదుటి వారి వ్యక్తిత్వం వారికి నచ్చినా.. వారు బాగా మాట్లాడతారు. వినడానికి ప్రాధాన్యత.. ఎక్స్ట్రోవర్ట్ లు ఎప్పుడూ ఏదో ఒకటి వాగుతూ ఉంటే.. ఇంట్రోవర్ట్ లు మాత్రం ఎక్కువగా వినడానికే ఇష్టపడతారు. ఎవరైనా ఏదైనా మాట్లాడుతుంటే దాన్ని వినడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.  మౌనంగా ఉంటూ ఎదుటివారి మాటలను, వారి వ్యక్తిత్వాన్ని గమనించడానికి వీరు ఇష్టపడతారు.  వీరిలో పరిశీలనా శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది.                                 *రూపశ్రీ.
భారతదేశంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజు భారత రాజ్యాంగ నిర్మాత, సంఘ సంస్కర్త , గొప్ప ఆర్థికవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి జయంతి.  ప్రతి ఏడాది అంబేద్కర్ జయంతిని దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, గౌరవంతో , ఉత్సాహంతో జరుపుకోవడం కొనసాగుతుంది. భారతదేశ సామాజిక నిర్మాణాన్ని మార్చడంలో , సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి వాటిని బలోపేతం చేయడంలో బాబాసాహెబ్ అంబేద్కర్ కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగాలు అందడంలో అంబేద్కర్ చేసిన కృషి చాలా పెద్ది.  అంబేద్కర్ జయంతి సందర్బంగా ఒక్కసారి అంబేద్కర్ గారి జీవితం గురించి గుర్తు చేసుకుంటే.. అంబేద్కర్ గారు 1891 ఏప్రిల్ 14న మధ్యప్రదేశ్‌లోని మౌలో జన్మించారు. ఆయన తన జీవితాంతం సమాజంలో ప్రబలంగా ఉన్న అంటరానితనం, వివక్షలకు వ్యతిరేకంగా పోరాడారు. అంబేద్కర్ లక్షలాది మందిలో విద్య, హక్కుల పట్ల చైతన్యం కలిగించారు. ఆయన భారత రాజ్యాంగాన్ని రచించి, దేశానికి ప్రజాస్వామ్య, సమానత్వ వ్యవస్థను అందించారు. అంబేద్కర్ గురించి ఆసక్తికరమైన విషయాలు.. రాజ్యాంగ నిర్మాత.. భారతదేశ ప్రజాస్వామ్య స్వరూపాన్ని వ్యక్తం చేసేది భారత   రాజ్యాంగమే..  ఈ బారత రాజ్యాంగ  ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ అంబేద్కర్ పరిగణించబడతారు. ఆయన రాజ్యాంగ పరిషత్తు ముసాయిదా కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయనను భారత రాజ్యాంగ పితామహుడిగా , ప్రధాన రూపశిల్పిగా పిలుస్తారు. విద్యావంతుడు.. అంబేద్కర్ కొలంబియా విశ్వవిద్యాలయం , లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుండి ఉన్నత విద్యను అభ్యసించారు. డాక్టర్ భీమరావు అంబేద్కర్ మొత్తం 32 డిగ్రీలు పొందారు. ఆయన అత్యంత విద్యావంతులైన భారతీయులలో ఒకరు. ఆయన బి.ఏ, ఎం.ఏ, ఎం.ఎస్.సి, పి.హెచ్.డి, డి.ఎస్.సి, ఎల్.ఎల్.డి, మరియు బారిస్టర్ ఎట్ లా వంటి ప్రముఖ డిగ్రీలను పొందారు.  అంతేకాదు.. తొమ్మిది భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. 64 సబ్జెక్ట్స్ లో  నిపుణులు. ఆయన స్వతంత్ర భారతదేశానికి మొదటి  న్యాయశాఖ మంత్రి అయ్యారు. సామాజిక సంస్కర్త.. ఆయన తన జీవితాంతం అంటరానితనం, కులతత్వానికి వ్యతిరేకంగా పోరాడి, సమానత్వాన్ని బోధించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి బాబా సాహెబ్ మహాద్ సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. అంటరానివారికి ప్రభుత్వ చెరువుల నుండి నీరు తోడుకునే హక్కు, దేవాలయాల్లోకి ప్రవేశించే హక్కు కోసం ఆయన ప్రచారం చేశారు. హిందూ కోడ్ బిల్లు ద్వారా, ఆయన మహిళల విడాకుల , ఆస్తి హక్కులను సాధించడానికి ప్రయత్నించారు. భారతరత్న..  1990లో అంబేద్కర్ గారి మరణానంతరం భారతదేశపు అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేశారు. అప్పటి రాష్ట్రపతి ఆర్. వెంకటరామన్ ఈ పురస్కారాన్ని ఆయన సతీమణి సవితా అంబేద్కర్ కు అందజేశారు. సత్యాగ్రహి.. నీటి కోసం సత్యాగ్రహం చేసిన ఏకైక సత్యాగ్రహి అంబేద్కర్ గారు మాత్రమే. న్యాయ శాఖ మంత్రి..  అంబేద్కర్ గారు స్వతంత్ర భారతదేశపు తొలి న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు.                            *రూపశ్రీ.  
వెల్లుల్లితో కొలెస్ట్రాల్‌కు చెక్.. ఇలా వాడితే అద్భుత ఫలితాలు! మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి Dr Chittibhotla Madhusudana Sarma గారు వివరించిన మరిన్ని విషయాలను ఈ VIDEO ద్వార తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయే ప్రధాన అంశాలు: కొలెస్ట్రాల్ నియంత్రణ: రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను వెల్లుల్లి ఎలా కరిగిస్తుంది? గుండె ఆరోగ్యం: రక్తపోటును (High BP) అదుపులో ఉంచి గుండెపోటు రాకుండా వెల్లుల్లి చేసే మేలు. బరువు తగ్గడం (Obesity): శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించడంలో వెల్లుల్లి పాత్ర. మధుమేహం (Diabetes): రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి వెల్లుల్లిని ఎలా తీసుకోవాలి? సరైన పద్ధతి: వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలా లేక వేయించి తీసుకోవాలా? ఏ సమయంలో తీసుకుంటే ఫలితం ఎక్కువగా ఉంటుంది? వెల్లుల్లిని ఔషధంగా వాడేటప్పుడు పాటించవలసిన నియమాలు మరియు మోతాదు గురించి డాక్టర్ గారి సూచనలను ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. మీ ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరుచుకోవడానికి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది. మరిన్ని ఆయుర్వేద ఆరోగ్య రహస్యాలను వీడియో రూపంలో చూడాలనుకుంటే ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి. (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి, రాగి పాత్రలో నీళ్లు తాగడం కొంతమందికి హానికరం కావచ్చని నిపుణులు అంటున్నారు. ఇంతకూ రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? ఎందుకు తాగకూడదు? తెలుసుకుంటే.. రాగి పాత్రలో నీరు ఎవరు తాగకూడదు? రాగి నీరు ఎక్కువ ఆమ్ల గుణాన్ని కలిగి ఉండి, కడుపులోని సున్నితమైన పొరను ప్రభావితం చేస్తుంది. కడుపులో పుండ్లు లేదా గ్యాస్ సమస్యలు ఉన్నవారు రాగి పాత్రలో నీరు  తాగితే మంట, నొప్పి , ఎసిడిటీ పెరగడం జరిగే అవకాశం ఉంటుంది. సున్నితమైన జీర్ణవ్యవస్థకు రాగి పాత్రలో నీరు మరింత చికాకు పెడుతుంది. ఎసిడిటీ, అజీర్ణం.. ఇప్పటికే ఎసిడిటీ లేదా అజీర్ణంతో బాధపడుతున్న వారికి, రాగి నీరు తాగడం హాని చేస్తుందట. రాగి నీటిలోని కొన్ని పదార్థాలు కడుపులోని యాసిడ్  స్థాయిలను పెంచి, గుండెల్లో మంట, కడుపులో మంట , పుల్లటి త్రేన్పులకు దారితీస్తాయి. పిల్లలకు ఇవ్వకూడదు.. రోజుల వయసున్న శిశువుల నుండి   పసిపిల్లల వరకు.. వారి జీర్ణవ్యవస్థ ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. రాగి నీరు పిల్లలలో తేలికపాటి నుండి తీవ్రమైన జీర్ణ సమస్యలను కలిగించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు తాము తాగే నీటి పరిమాణాన్ని నియంత్రించుకోలేకపోవడం వల్ల ఈ ప్రమాదం మరింత పెరుగుతుంది. గర్భవతులు.. గర్భిణీ స్త్రీలు రాగి నీరు చాలా తక్కువ మాత్రమే తీసుకోవాలి.  అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా ఇతర జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు, ఇవి తల్లికి , పిండానికి హానికరం కావచ్చు.       లివర్, కిడ్నీ వీక్నెస్.. రాగి నీరు తాగాలని అనుకునే వారు ముందు వైద్యుడిని సంప్రదించాలి, ఎందుకంటే ఇది కాలేయం , మూత్రపిండాలపై అదనపు భారాన్ని మోపే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇది శరీరంలో టాక్సిన్లు తొలగించే ప్రక్రియకు ఆటంకం కలిగించి ఆరోగ్యానికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది.                                     *రూపశ్రీ.
మన భారతీయ సంప్రదాయంలో యోగాకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. యోగా కేవలం ఆసనాలకే పరిమితం కాదు, 'ముద్రలు' కూడా మన శరీర ఆరోగ్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. మన చేతి ఐదు వేళ్లు పంచభూతాలకు (అగ్ని, వాయువు, ఆకాశం, పృథ్వీ, జలం) ప్రతిరూపాలు. ఈ వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఉంచే పద్ధతినే 'ముద్ర' అంటారు. ఈ వీడియోలో TeluguOne Health మనకు కొన్ని ముఖ్యమైన యోగా ముద్రలను మరియు వాటి విశిష్టతను పరిచయం చేస్తోంది: ముఖ్యమైన ముద్రలు - ఉపయోగాలు: జ్ఞాన ముద్ర: జ్ఞాపకశక్తిని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. వాయు ముద్ర: గ్యాస్ సమస్యలు, కీళ్ల నొప్పులు మరియు పక్షవాతం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. శూన్య ముద్ర: చెవి సంబంధిత సమస్యలు మరియు ఎముకల బలహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది. పృథ్వీ ముద్ర: శరీరంలో విటమిన్ల లోపాన్ని సరిచేయడానికి, అలసటను తగ్గించి ఉత్సాహాన్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సూర్య ముద్ర: బరువు తగ్గాలనుకునే వారికి మరియు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలనుకునే వారికి ఇది చక్కటి పరిష్కారం. వరుణ ముద్ర: చర్మ సౌందర్యానికి, రక్త శుద్ధికి మరియు శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది. వీటిని ఎలా వేయాలి? ఈ ముద్రలను రోజుకు కనీసం 15 నుండి 30 నిమిషాల పాటు ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని సాధన చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఏ ముద్ర ఏ వేలితో వేయాలి మరియు అది చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చివరి వరకు చూడండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు ఇలాంటి అరుదైన వీడియోల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌లో చూడండి (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)