LATEST NEWS
  దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం కీలకమైన సవరణ బిల్లులను చట్టసభల ముందుకు తీసుకురావడానికి సిద్ధం కాగా, ప్రతిపక్ష కూటమి ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సమాయత్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఉభయసభల తొలిరోజు కార్యకలాపాలు వాడివేడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. సమావేశాల తొలి రోజు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంప్రదాయబద్ధంగా మీడియాతో మాట్లాడనున్నారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా సభా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పార్లమెంట్ సజావుగా సాగడానికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరనున్నారు. మరోవైపు లోక్‌సభలో స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో ఇటీవల మరణించిన దివంగత సభ్యులకు సంతాప తీర్మానాలు సమర్పించి నివాళులు అర్పించనున్నారు. మొదటి గంట ప్రశ్నోత్తరాల అనంతరం సభలో వివిధ నివేదికల సమర్పణ కార్యక్రమం ఉంటుంది. ఇందులో భాగంగానే ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ కమిటీకి సంబంధించిన కీలక తీర్మానాన్ని పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్, అజయ్ భట్ లోక్‌సభలో ఉమ్మడిగా ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాతి సెషన్లలో ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణలపై విస్తృతమైన చర్చలు జరగనున్నాయి. ఈసారి వర్షాకాల సమావేశాల్లో భాగంగా మోదీ సర్కార్ అత్యంత కీలకమైన బిల్లులను ఆమోదించుకోవాలని చూస్తోంది. ముఖ్యంగా అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల భారాన్ని తగ్గించే లక్ష్యంతో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. దీని ద్వారా జడ్జీల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 33 నుంచి 37కి పెంచనున్నారు. అలాగే, వందేమాతరం గేయానికి అధికారికంగా జాతీయ గీత హోదా కల్పించే ప్రత్యేక చట్ట సవరణ బిల్లును హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వానికి ధీటుగా బదులిచ్చేందుకు విపక్షాలు బలమైన వ్యూహాలతో రంగంలోకి దిగుతున్నాయి. దేశవ్యాప్తంగా యువతను, విద్యార్థులను కుదిపేసిన నీట్ మరియు సీబీఎస్‌ఈ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని ప్రధానాస్త్రంగా మార్చుకున్నాయి. ఈ లీకేజీ కుంభకోణంపై పార్లమెంట్‌లో లోతైన విచారణ మరియు చర్చ జరగాలని విపక్ష నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు అయోధ్యలో విరాళాల దుర్వినియోగం మరియు చోరీకి సంబంధించిన నివేదికలపై కూడా రగడ రాజుకునేలా ఉంది. ఈ అంశాన్ని అత్యవసరంగా చర్చించాలంటూ ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాజ్యసభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చింది. దీనివల్ల తొలిరోజే సభలో తీవ్రమైన వాదోపవాదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే, తీవ్ర సంచలనం సృష్టించిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనుకడుగు వేసినట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రి లేదా ముఖ్యమంత్రి ఎవరైనా సరే, కనీసం 30 రోజుల పాటు జైలులో ఉంటే వారి పదవి ఆటోమేటిక్‌గా రద్దయిపోయేలా ఈ నిబంధనను ప్రతిపాదించారు.  అయితే, నేరం నిరూపితం కాకముందే కేవలం అరెస్ట్ ఆధారంగా పదవి నుంచి తొలగించడం రాజ్యాంగ ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమంటూ తీవ్ర చట్టపరమైన, రాజకీయపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. విపక్షాల నుండి గట్టి వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉండటంతో, ఈ సమావేశాల అధికారిక ఎజెండా నుండి దీనిని తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు సమాచారం. అయితే దీనికి బదులుగా, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేసే మరో రెండు అతిపెద్ద చారిత్రాత్మక బిల్లులను వ్యూహాత్మకంగా తెరపైకి తెచ్చేందుకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం కోటాను క్షేత్రస్థాయిలో అమలు చేయాలన్నా, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన లేదా డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలన్నా లోక్‌సభ స్థానాల సంఖ్య పెరగడం అనివార్యం. దీని కోసం కేంద్రం ప్రతిపాదిస్తున్న 'యూనిఫాం 50 శాతం సీట్ల పెంపు ఫార్ములా' ఇప్పుడు ప్రాంతీయ పార్టీలను సైతం తీవ్ర ఆలోచనలో పడేసింది.  గతంలో కేవలం జనాభా ప్రాతిపదికన మాత్రమే సీట్లు పెంచితే జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని, ఉత్తరాదికే భారీ లాభమని గగ్గోలు పెట్టిన దక్షిణాది ప్రాంతీయ పార్టీలు, ఇప్పుడు సరికొత్త వ్యూహానికి లోపాయకారీగా అంగీకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏ రాష్ట్రానికీ ఉన్న సీట్లు తగ్గకుండా, ప్రస్తుతం ఉన్న స్థానాలను ఏకంగా 50 శాతం పెంచే ఈ సమాన మోడల్‌కు దాదాపు అందరూ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఈ బిల్లు కనుక చట్టరూపం దాల్చితే, దేశవ్యాప్తంగా లోక్‌సభ స్థానాల సంఖ్య రికార్డు స్థాయిలో 800 దాటిపోనుంది. ఇది పార్లమెంట్‌లో ప్రాంతీయ పార్టీల ఉనికిని, వారి రాజకీయ బలాన్ని పూర్తిగా మార్చివేసే ఒక మైలురాయి కానుంది. దీనితో పాటు, బీజేపీ ఎప్పటి నుంచో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 'వన్ నేషన్.. వన్ ఎలక్షన్' బిల్లు కూడా ఇదే వర్షాకాల సమావేశాలలో పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. లోక్‌సభతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం దీని ముఖ్య ఉద్దేశం.  ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే, దేశంలో నిరంతరం సాగే ఎన్నికల కోడ్ హడావుడికి, వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా కావడానికి శాశ్వతంగా అడ్డుకట్ట పడుతుంది. అయితే, దీనివల్ల ప్రాంతీయ అంశాల కంటే జాతీయ అంశాలే ఎక్కువగా హైలైట్ అవుతాయని, ఇది దేశ ఫెడరల్ స్ఫూర్తికి గొడ్డలిపెట్టు అని ప్రతిపక్షాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి.రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ సమావేశాలలో ఆర్థిక, సామాజిక అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన ఘర్షణ వాతావరణం నెలకొననుంది.  ప్రజా సమస్యలపై చర్చలు జరగకుండా ప్రభుత్వం బిల్లులను ఏకపక్షంగా ఆమోదించుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని విపక్షాలు హెచ్చరిస్తున్నాయి.మొత్తానికి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశాలు ఉపయోగపడతాయా లేదా సభలు వాయిదాల పర్వానికే పరిమితమవుతాయా అనేది చూడాలి. ప్రజలు సైతం తమకు సంబంధించిన కీలక సమస్యలపై పార్లమెంట్‌లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. Parliament Monsoon Session 2026, Delimitation Bill India, One Nation One Election, 130th Constitutional Amendment Bill, Lok Sabha Seats Hike, Indian Politics News. Congress Adjournment Motion Rajya Sabha, NEET Paper Leak Debate, Supreme Court Judges Expansion Bill, Parliament Session, Latest Telugu News
హస్తినలో  రాజకీయ వేడి పీక్స్ కు చేరింది. కాక్రోచ్ జనతా పార్టీ   సోమవారం (జులై 29) చలో పార్లమెంట్ కు పిలుపు నిచ్చిన నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ  కార్యకర్తలు, మద్దతుదారులు ఢిల్లీ సరిహద్దులకు, సెంట్రల్ ఢిల్లీ వైపు చేరుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.   శాంతిభద్రతల విఘాతం కలగకుండా ఉండేందుకు  భద్రతను   కట్టుదిట్టం చేశారు. ముందస్తు భద్రతా వ్యూహంలో భాగంగా సెంట్రల్ ఢిల్లీని దాదాపు తమ అధీనంలోకి తీసుకున్నారు.   కాక్రోచ్ జనతా పార్టీ ఈ చలో పార్లమెంట్ కార్యక్రమానికి  అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అనుమతి లేని ఏ కార్యక్రమాన్ని కూడా రాజధాని వీధుల్లో కొనసాగనివ్వబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పార్లమెంట్ భవనం, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ వంటి ప్రాంతాలు ఉండే హైసెక్యూరిటీ జోన్‌లో   ర్యాలీ,  ధర్నాలకు అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదని కుండబద్దలు కొట్టారు. , ఈ ప్రాంతాకికి 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో  దాదాపు వంద బారికేడ్లు ఏర్పాటు చేశారు.  సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలో   అదనపు బలగాలను, పారామిలటరీ దళాలను   మోహరించారు. ప్రధాన రహదారులు, మెట్రో స్టేషన్ల వద్ద   తనిఖీలు ముమ్మరం చేశారు,   మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ  నాయకులు  తమ నిరసనను ఎట్టిపరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు,  లేదని భీష్మించుకూర్చున్నారు. తమ చలో పార్లమెంటు కార్యక్రమం  శాంతియుతంగా ముందుకుసాగుతామని వెల్లడించారు. ఈ నేపధ్యంలో  ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.  ఇలా ఉండగా.. సోనమ్ వాంగ్చుక్ 21  నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను ఆస్పత్రికి తరలించిన సంగతి తలిసిందే. అయితే ఆస్పత్రిలో కూడా నిరశన కొనసాగిస్తున్న సోనమ్ వాంగ్చుక్..  అక్కడి నుంచే చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.  నీట్ బాధితుల ఆక్రందనలు  కేంద్రానికి వినిపించేందుకు ఈ మార్చ్ ఒక పెద్ద వేదిక కావాలన్న సోనమ్ వాంగ్చుక్..ఈ ఉద్యమాన్ని రెండో స్వాతంత్ర్య పోరాటంగా అభివర్ణిస్తూ ఉద్వేగ పూరిత ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే హస్తిన లో తీవ్ర ఉద్రిక్త ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.   chalo parliament protest, cockroach janata party, delhi police alert, central delhi security, high security zone
తెలంగాణ రాజకీయాల్లో తనదైన విలక్షణ శైలితో నిత్యం వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేసినట్లేనా.. అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  గత కొంతకాలంగా ఆయన కారు దిగిపోనున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఆ ప్రచారానికి బలం చేకూర్చింది. సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం..  తెలంగాణ ముఖ్యమంత్రి   రేవంత్ రెడ్డి ప్రసంగిస్తున్న వేదికపై  ఎమ్మెల్యే మల్లారెడ్డి కూడా ఉన్నారు. ఆ వేదికపై ప్రసంగిస్తున్న రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై విమర్శలు గుప్పిస్తున్నా.. మల్లారెడ్డి పట్టించుకోకుండా చిరునవ్వులు చిందిస్తూ  ప్రశాంతంగా కూర్చుని ఉన్నారు.    సొంత పార్టీ అధినేతను అంతగా విమర్శిస్తున్నా మల్లారెడ్డిలో స్పందన లేకపోవడంతో ఆయన కారు దేగేయడం ఖాయమన్న ప్రచారానికి బలం చేకూర్చింది.  అలాగే ఇటీవలే.. ఆయన ఒక ప్రైవేటు కార్యక్రమంలో కూడా తాను బీఆర్ఎస్ ను వీడనున్నట్లు సంకేతాలిచ్చారు.  వాస్తవానికి..  గత ఎన్నికలలో పరాజయం పాలై బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన నాటి నుంచీ కూడా మల్లారెడ్డి పొలిటికల్ గా ఒకింత ఇనాక్టివ్ అయ్యారనే చెప్పారు.  చాలా కాలంగా మల్లారెడ్డి అధికార కాంగ్రెస్ లేదా కమలం గూటికి చేరే  అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా తన వ్యాపార, విద్యారంగ సంస్థల పరిరక్షణతో పాటు నియోజకవర్గంలో రాజకీయ ఉనికి కోసం ఆయన అధికార పార్టీతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నారని రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.   ఒకప్పుడు రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన చామకూర మల్లారెడ్డి.. ఇప్పుడు ఆయన ప్రసంగిస్తున్న వేదికపై కనిపించడం పట్ల కమలం శ్రేణుల్లో కూడా ఆగ్రహం వ్యక్తమౌతోంది.  మొత్తం మీద  మల్లారెడ్డి బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పడం ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతోంది. అయితే ఆయన కారు దిగి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారా? కాషాయ తీర్థం పుచ్చుకుంటారా అన్న విషయంపై అయితే రాజకీయవర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.  ఇప్పటికే అనేకమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కీలక నేతలు హస్తం గూటికి చేరిన నేపథ్యంలో, మల్లారెడ్డి కూడా అదే బాట పడతారన్న అభిప్రాయమే పరిశీలకులలో కూడా వ్యక్తమౌతోంది.  chamakura malla reddy latest news, medchal mla malla reddy, telangana political updates
  స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ కీలక సమీక్ష నిర్వహించింది. జూమ్ వేదికగా జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు, పార్టీ నేతలు పాల్గొన్నారు.ఎస్‌ఐఆర్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిన నేపథ్యంలో... ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.  రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలోనే ఉండి ఎన్నికల ప్రచారం తరహాలో పనిచేయాలని స్పష్టం చేశారు. చైర్మన్ పదవులు, పార్టీ పోస్టుల కోసం గాంధీభవన్ చుట్టూ తిరగొద్దని, రేపటి నుంచి ఆగస్టు 3 వరకు ఎవరూ గాంధీభవన్‌కు రావద్దని ఆదేశించారు. హైదరాబాద్‌లో కాకుండా నియోజకవర్గాల్లోనే ఉండి ప్రజల మధ్య పనిచేయాలని సూచించారు. సోమవారం నుంచి ఇన్‌చార్జ్ మంత్రులు జిల్లాల వారీగా ఎస్‌ఐఆర్‌పై సమీక్షలు నిర్వహించాలని, ఎంపీలు కూడా పార్లమెంట్ సమావేశాల మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం కొనసాగించాలని తెలిపారు. బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  బీఎల్‌ఓల నివేదికల కంటే బీఎల్‌ఏల నివేదికలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ తరఫున పనిచేస్తున్న బీఎల్‌ఏలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని సూచించారు. గాంధీభవన్ బృందం కూడా బీఎల్‌ఏ, బీఎల్‌ఓ నివేదికలను నిరంతరం పరిశీలించాలని ఆదేశించారు. ఈ నెల 30న మరోసారి పూర్తి స్థాయి సమీక్ష నిర్వహించి, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నివేదికలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అలాగే అత్యుత్తమంగా పనిచేసే 100 మంది బీఎల్‌ఏలకు రాహుల్ గాంధీని కలిసి ఫోటో దిగే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు. Congress SIR Review, CM Revanth Reddy Zoom Meeting, SIR Deadline Extended till August 3 Focus on Ground-Level Campaign, No Visits to Gandhi Bhavan, Stay in Constituencies, Priority to BLA Reports, Gandhi Bhavan  
  తెలంగాణ భారతీయ జనతా పార్టీల్లో ఒక్కసారిగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీలో అంతర్గతంగా ఉన్న విభేదాలను తొలగించి, నేతలందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి హైకమాండ్ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగానే తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ హైదరాబాద్‌ వేదికగా "ఆపరేషన్ సయోధ్య"ను అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అభయ్ పాటిల్ తెలంగాణ కమలం పార్టీ అగ్ర నేతలతో వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తూ రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్నారు. హైకమాండ్ నుంచి అందిన ప్రత్యేక ఆదేశాల మేరకు తెలంగాణకు వచ్చిన  పాటిల్, పార్టీలో నెలకొన్న తాజా పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా ఈరోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆయన ప్రత్యేకంగా బ్రేక్‌‌ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు.  ఈ ఉదయపు అల్పాహార సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, నేతల మధ్య సమన్వయం మరియు రాబోయే పొలిటికల్ యాక్షన్ ప్లాన్ గురించి వారిద్దరూ సుదీర్ఘంగా చర్చించారు. హైకమాండ్ పంపిన ప్రధాన సందేశాన్ని రాష్ట్ర నాయకత్వానికి అభయ్ పాటిల్ ఈ సందర్భంగా స్పష్టంగా వివరించినట్లు తెలుస్తోంది. కేవలం ఈ ఒక్క సమావేశంతోనే కాకుండా, గత 24 నుండి 48 గంటలుగా అభయ్ పాటిల్ తెలంగాణ బీజేపీకి చెందిన కీలకమైన ముగ్గురు అగ్ర నేతలతో విడివిడిగా సమావేశమై సుదీర్ఘ మంతనాలు జరిపారు. నిన్ననే ఆయన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎంపీ ఈటల రాజేందర్‌లతో కీలక భేటీలు పూర్తి చేశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, క్షేత్రస్థాయిలో కేడర్‌ను సమాయత్తం చేయడం వంటి అంశాలపై వీరి మధ్య లోతైన చర్చ జరిగింది. ఈ ఇద్దరు కీలక నేతలతో భేటీ అనంతరం, అభయ్ పాటిల్ వెంటనే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో కూడా సమావేశమయ్యారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌తో జరిగిన భేటీలో అభయ్ పాటిల్ కొన్ని కీలక సూచనలు చేశారు. పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే అధికారిక సమావేశాలు, ప్రజా పోరాట కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని, నాయకులంతా సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు. పార్టీలో ఎలాంటి బేధాభిప్రాయాలు ఉన్నా వాటిని పక్కనపెట్టి, ప్రజాక్షేత్రంలో బీజేపీని నంబర్ వన్ స్థానంలో నిలబెట్టడమే పరమావధిగా పనిచేయాలని హైకమాండ్ ఆదేశాలను నొక్కి చెప్పారు. ఈ వరుస భేటీలు తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. త్వరలోనే తెలంగాణలో జరగబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల యాక్షన్ ప్లాన్‌పై కూడా ఈ సమావేశంలో లోతుగా విశ్లేషించారు. ప్రతిపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ బూత్ స్థాయి నుంచి ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలనే వ్యూహాలను ఇరు నేతలు పంచుకున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని మరింత దూకుడుగా ముందుకు తీసుకెళ్లే అంశాలు ఈ చర్చల్లో ప్రధాన పాత్ర పోషించాయి. ఈ భేటీ అనంతరం కాషాయ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేంద్ర పెద్దల మార్గదర్శకత్వంలో తెలంగాణలో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేయాలని, తద్వారా రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ అంతర్గత చర్చల ఫలితంగా త్వరలోనే పార్టీ పరంగా మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఈ బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కేవలం సాధారణ మర్యాదపూర్వక భేటీగానే బయటకు కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక మాత్రం గట్టి పొలిటికల్ స్కెచ్‌లు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ త్వరలోనే విసృత స్థాయి ప్రచార కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని బీజేపీ నాయకత్వం యోచిస్తోంది. Telangana BJP, Abhay Patil, Bandi Sanjay, MP Eatala Rajender, Dharmapuri Arvind, BJP Political News, Ramchandra Rao, GHMC elections
ALSO ON TELUGUONE N E W S
  ప్రపంచ సినీ ప్రేమికుల ఫేవరేట్ మూవీగా పిలవబడుతున్న 'ది ఒడిస్సీ' (The odyssey)మొన్న 17 న వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ అయిన విషయం తెలిసిందే. ఎలాంటి గ్రాఫిక్స్ జోలికి వెళ్లని వరల్డ్ లెజండ్రీ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలన్ మేధస్సు నుంచి పుట్టిన ది ఒడిస్సి ని చూడటానికి సినీ ప్రేమికులు ఉదయం ఆట నుంచే బారులు తీరారు. ఇప్పటికి ఇంగ్లీష్ వెర్షన్ కి సంబంధించిన టికెట్స్ దొరకని పరిస్థితి.   విడుదలైన మొదటి మూడు రోజుల్లోనే  $264.1 మిలియన్ల డాలర్లు అంటే 2 ,546 కోట్లు సాధించి  బాక్సాఫీస్ వద్ద పెను విధ్వంసం సృష్టించింది. దీంతో దర్శకుడు నోలన్ కెరీర్‌లోనే ‘ఒపెన్‌హైమర్’, ‘ది డార్క్ నైట్ రైజెస్’వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల రికార్డులని  అధిగమించి, అత్యధిక గ్లోబల్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా ‘ది ఒడిస్సీ’ సరికొత్త మైలురాయిని చేరుకుంది.  నార్త్ అమెరికాలోనే సుమారు $124.5 మిలియన్ల భారీ వసూళ్లను సాధించగా, అంతర్జాతీయ మార్కెట్ల నుండి మరో $139.6 మిలియన్లను కొల్లగొట్టింది. భారతీయ బాక్సాఫీస్ విషయానికి వస్తే, నోలన్ మ్యాజిక్  వర్కవుట్ అయింది. మొదటి రోజు ఇండియాలో 17.40 కోట్ల నెట్  వసూళ్లతో శుభారంభం చేసిన ఈ చిత్రం, రెండో రోజు శనివారం  22 కోట్ల నెట్ సాధించింది. దీంతో రెండు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్లు . 39.4 కోట్లకు చేరగా, గ్రాస్ వసూళ్లు  47.03 కోట్లు దాటాయి. వీకెండ్ ముగిసే సమయానికి మూడు రోజుల్లోనే ఇండియాలో ఏకంగా 70 కోట్ల గ్రాస్ మార్కును దాటి, ఇండియాలో క్రిస్టోఫర్ నోలన్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ సాధించిన చిత్రంగా రికార్డు నెలకొల్పింది. మన దగ్గర  మొదటి రోజు 8,413 షోలతో ప్రారంభమై, మరుసటి రోజు డిమాండ్ పెరగడంతో దేశవ్యాప్తంగా 8,791 షోలలో ప్రదర్శితమైంది.  also read: రాకాలో తెలుగు బ్యూటీ ఇండియాలో ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్  13.75 కోట్ల నెట్ వసూళ్లతో అగ్రస్థానంలో నిలవగా, హిందీ వెర్షన్  1.90 కోట్లు, తెలుగు వెర్షన్  1.10 కోట్లు, తమిళ వెర్షన్ . 65 లక్షల నెట్ వసూలు చేశాయి. ఐమాక్స్ స్క్రీన్లలో దాదాపు 74 శాతం అక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. మ్యాట్ డామన్, టామ్ హాలండ్, అన్నే హాత్వే మరియు జెండయా వంటి భారీ తారాగణంతో హోమర్ రాసిన ప్రాచీన గ్రీకు పురాణ కావ్యం ఆధారంగా ఒడిస్సిని  తెరకెక్కించారు. పూర్తి స్థాయిలో ఐమాక్స్  కెమెరాలతో చిత్రీకరించిన తొలి ఫీచర్ ఫిల్మ్ కావడంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. సుమారు 2,080 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. the odyssey, christopher nolan
After delivering just one theatrical release over the last two years, Prabhas appears to be making up for lost time with an ambitious lineup that could see three major films arrive within a span of just 12 to 16 months. Director Sandeep Reddy Vanga recently revealed that nearly 40 percent of Spirit has already been completed. He expressed confidence that the action drama is progressing according to plan and remains on track for its scheduled March 5, 2027 theatrical release. The film marks the first collaboration between Prabhas and the Animal director and is among the most anticipated pan-Indian projects currently in production. Meanwhile, Prabhas has resumed work on Fauzi, with the actor prioritising the period action drama to ensure it is ready for its December 3, 2026 release. The film has generated significant buzz ever since its announcement, and the makers are said to be moving ahead at a brisk pace to meet the release deadline. Production is also progressing steadily on Kalki 2898 AD: Part 2. While Prabhas is yet to join the shooting schedules, the makers have already completed two rounds of filming featuring Kamal Haasan. Amitabh Bachchan has also joined the shoot, allowing the team to continue filming key portions even before Prabhas returns to the sets. With Fauzi targeting December 2026, Spirit locked for March 2027, and Kalki 2 expected to follow thereafter, Prabhas is poised for one of the busiest phases of his career. If everything stays on schedule, the pan-India superstar could deliver three high-profile releases in little over a year, giving fans plenty to look forward to after an unusually long wait. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Ajun)అట్లీ(Atlee),సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ 'రాకా'. ప్రపంచ స్థాయి ఖ్వాలిటీ, ప్రపంచ స్థాయి టెక్నీషియన్స్ పని చేస్తుండటంతో 'రాకా' లో భాగస్వామ్యం కావాలని కోరుకుని నటులు లేరు. సోషల్ మీడియాకి కూడా పెద్ద అసెట్ గా నిలుస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి తాజాగా ఒక సెన్సేషనల్ అప్‌డేట్ బయటకు వచ్చింది.  ' పలు సినిమాల్లో విభిన్న క్యారెక్టర్స్ లో కనిపించిన అచ్చ తెలుగు భామ  సిరి హనుమంతు(Siri Hanumanth)రాకా'లో కీలక రోల్ లో కనిపించబోతుంది. ఇటీవల జరిగిన ఒక సినీ వేడుకలో ప్రముఖ నిర్మాత ఎస్.కె.ఎన్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు. దీంతో  ఈ న్యూస్ నెట్టింట  వైరల్ గా మారింది. ఒకవైపు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్‌గా రాణిస్తూ, మరోవైపు వెబ్ సిరీస్, సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీకి, అల్లు అర్జున్ లాంటి గ్లోబల్ స్టార్ నటిస్తున్న 100 శాతం భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో భాగం కావడం అంటే మామూలు విషయం కాదు.  దీంతో  సిరి హనుమంతు కెరీర్‌ కి రాకా టర్నింగ్ పాయింట్ గా మారనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. Also read: నిరాశపరుస్తున్న జననాయగన్ అడ్వాన్స్ బుకింగ్.. ఆ హీరో రికార్డుని దాటడం కష్టమేనా! ప్రస్తుతం రాకాకి సంబంధించిన షూటింగ్ ముంబైలో శరవేగంగా కొనసాగుతోంది. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ అగ్ర నటి దీపికా పదుకునే ఒక హీరోయిన్ గా చేస్తుండగా, మరింత మంది భామలు హీరోయిన్స్ గా చేస్తున్నారు. అయినప్పటికీ చిత్రబృందం ఇప్పటివరకు పూర్తి తారాగణం వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్, అల్లు అర్జున్ ఐకానిక్ స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిసిన 'రాకా' 2027 లో ప్రేక్షకుల ముందుకు రానుంది.  allu arjun, raaka, siri hanumanth, atlee, deepikapadukone    
సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్క దర్శకుడికి ఒక్కో రకమైన సెంటిమెంట్ ఉంటుంది. అలాగే దర్శకుడు సుకుమార్ కెరీర్ లో కూడా ఒక సెంటిమెంట్ సుదీర్ఘ కాలంగా కొనసాగుతోంది. అదేమిటంటే ఆయన తన కెరీర్ లో ఇప్పటివరకు ఏ ఒక్క హీరోయిన్ ను కూడా తన తదుపరి సినిమాల్లో రిపీట్ చేయలేదు.  'ఆర్య' సినిమాతో దర్శకుడిగా ప్రయాణం ప్రారంభించిన సుకుమార్, నిన్నమొన్నటి 'పుష్ప' సిరీస్ వరకు ప్రతి సినిమాకు ఒక కొత్త హీరోయిన్ ను ఎంచుకుంటూ వచ్చారు. అయితే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సుకుమార్ చేయబోయే సరికొత్త క్రేజీ ప్రాజెక్ట్ 'RC17'తో ఈ హీరోయిన్ సెంటిమెంట్ బ్రేక్ కాబోతుందా అనే ఆసక్తికరమైన చర్చ ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో సుకుమార్ ఎప్పుడూ ఒక హీరోయిన్ తో రెండోసారి పని చేయలేదు. కానీ రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో మాత్రం ఈ సెంటిమెంట్ కు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.  'రంగస్థలం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ కోసం సుకుమార్ ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్నను తీసుకుంటే బాగుంటుందని సుకుమార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  'పుష్ప' సిరీస్ లో రష్మిక హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఒకవేళ 'RC17'లో ఆమె ఫైనల్ అయితే.. సుకుమార్ తన కెరీర్ లోనే మొదటిసారి హీరోయిన్ ను రిపీట్ చేసినట్లు అవుతుంది.  మరి సుకుమార్ తన సెంటిమెంట్ ను బ్రేక్ చేసి రష్మికకే జై కొడతారా, లేక ఎప్పటిలాగే సరికొత్త ముద్దుగుమ్మను రంగంలోకి దించుతారా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.     Ram Charan, Sukumar, RC17 Update, Rashmika Mandanna  
Christopher Nolan has once again proved that his name alone can turn a film into a global theatrical event. His latest epic, The Odyssey, has exceeded early trade expectations by registering a phenomenal opening weekend across the world, while also delivering one of the biggest starts ever for a Hollywood film in India. According to official studio estimates, The Odyssey has grossed $264.1 million worldwide during its opening weekend. The film collected $124.5 million from the domestic North American market, while international territories contributed another $139.6 million, giving Nolan the biggest global opening of his career. India has emerged as one of the film's strongest overseas markets. After opening with an estimated ₹17.40 crore nett (₹20.76 crore gross) on Friday, the film witnessed a solid jump on Saturday with early estimates suggesting another ₹22 crore nett. This takes its two-day India total to nearly ₹40 crore nett, with Sunday expected to push the opening weekend comfortably past the ₹65-70 crore mark. The film's performance has been driven primarily by premium formats, especially IMAX, where demand has remained extraordinary. Strong word-of-mouth, glowing reviews and Nolan's massive fan following have helped The Odyssey outperform several pre-release projections despite its lengthy runtime and mature rating. With little major competition over the coming days, trade expects The Odyssey to enjoy a long theatrical run worldwide. If the current momentum continues, Nolan's mythological spectacle could be on course to emerge as one of the biggest global box office successes of 2026. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
రెబల్ స్టార్ ప్రభాస్, టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్'. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రోజు నుంచే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే గత కొన్ని రోజులుగా ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతోందని, అనుకున్న సమయానికి విడుదల కావడం కష్టమేనంటూ సోషల్ మీడియా వేదికగా అనేక రకాల రూమర్స్ హల్‌చల్ చేశాయి. ఈ వార్తలతో కాస్త నిరాశలో ఉన్న రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా స్వయంగా అదిరిపోయే స్పష్టత ఇచ్చారు. అమెరికాలో జరిగిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన, స్పిరిట్ సినిమా ప్రస్తుత పరిస్థితి, విడుదల తేదీపై ఉన్న అనుమానాలన్నింటికీ పటాపంచలు చేశారు. సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ, స్పిరిట్ సినిమా షూటింగ్ తాము పక్కాగా ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ ప్రకారమే ఎంతో వేగంగా సాగుతోందని వెల్లడించారు. ఇప్పటికే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన 40 శాతం షూటింగ్ విజయవంతంగా పూర్తయిందని ఆయన కన్ఫర్మ్ చేశారు. కేవలం 40 శాతం షూటింగ్ ముగిసిందని చెప్పడమే కాకుండా, మిగిలిన 60 శాతం బ్యాలెన్స్ షూటింగ్‌ను కూడా ఎలాంటి విరామం లేకుండా శరవేగంగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రాత్రింబవళ్లు శ్రమిస్తోందని పేర్కొన్నారు. ప్రొడక్షన్ వర్క్ లో ఎలాంటి ఆలస్యం జరగకుండా అనుకున్న సమయానికే ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు. ముందుగా ప్రకటించినట్టుగానే 2027 మార్చి 5న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. సందీప్ రెడ్డి వంగా మార్క్ యాక్షన్, ప్రభాస్ కటౌట్‌కు తోడైతే థియేటర్లు బద్దలైపోవడం ఖాయమని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డుమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ భారీ యాక్షన్ డ్రామాలో విలన్ పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్‌ను ఎంపిక చేశారు.  భద్రకాళి పిక్చర్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి 'యానిమల్' ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.     Prabhas, Spirit Movie, Sandeep Reddy Vanga, Tripti Dimri  
  ఇళయ దళపతి విజయ్(Vijay)అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. ఈ నెల 23 న 'జననాయగన్' (జననాయకుడు)తో థియేటర్స్ లో తిష్ట వేయడానికి  రాబోతుండటంతో అభిమానుల ముఖాలు మాములు ఆనందంతో లేవు. పైగా విజయ్ చివరి మూవీ కావడంతో భావోద్వేగ వాతావరణంలో థియేటర్స్ లోకి అడుగుపెట్టడం ఖాయం.  ఇక ఇండియాతో పాటు విదేశాల్లోను ఈ చిత్రానికి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ భారీ ఎత్తున ప్రారంభమయ్యాయి.  అయితే, ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో 'జననాయగన్' మొదటి రోజు కలెక్షన్లపై ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సాధారణంగా విజయ్ నటించిన గత చిత్రాలైన 'లియో' వంటి సినిమాలకు ఉన్నంత స్థాయి భారీ అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్, ఈ సినిమాకు డొమెస్టిక్ మార్కెట్‌లో కొంత నెమ్మదించినట్లు కనిపిస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా గతంలో ఈ సినిమా ఆన్‌లైన్‌లో లీక్ కావడం, విడుదల పలుమార్లు వాయిదా పడటం వంటి ప్రతికూల అంశాలు సినిమా ప్రీ రిలీజ్ హైప్‌ని  కొంతవరకు దెబ్బతీశాయని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. దీంతో బాక్సాఫీస్ వద్ద రజనీకాంత్ వన్ మాన్ షో 'కూలీ' లేదా విజయ్ సొంత చిత్రం 'లియో' సృష్టించిన ఆల్-టైమ్ రికార్డులను అందుకోవడం ఈ చిత్రానికి ప్రస్తుత ట్రెండ్ ప్రకారం కాస్త కష్టంగానే మారేలా కనిపిస్తోంది.  అయినప్పటికీ, అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే డొమెస్టిక్ మార్కెట్‌లో 'జననాయగన్' సుమారు రూ. 6.7 కోట్ల గ్రాస్ (బ్లాక్డ్ సీట్లతో కలిపి) వసూలు చేసి తన సత్తా చాటింది. కేవలం తమిళ వెర్షన్ లోనే 2,399 షోలకు గానూ 1.33 లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడై రూ. 3.86 కోట్ల మార్కును దాటింది. కర్ణాటకలో రూ. 2.59 కోట్లు, కేరళలో రూ. 1.32 కోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు కావడం విజయ్కున్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.  Also read: ది ఒడిస్సీ vs హైదరాబాద్.. షాక్ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులు! బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కొన్ని ప్రీమియం రిక్లైనర్ సీట్ల టికెట్ ధరలు ఏకంగా2,500 వరకు పలికినప్పటికీ, నిమిషాల్లోనే షోలు హౌస్‌ఫుల్ కావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎలాంటి ప్రభావం లేదు.  ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల గ్రాస్ ఓపెనింగ్‌ను సాధించగలదా అనే ప్రశ్న అందరిలోనూ నెలకొంది. రజనీకాంత్ 'కూలీ' సాధించిన రూ. 151 కోట్ల రికార్డు లేదా 'లియో' సాధించిన రూ. 148.5 కోట్ల గ్లోబల్ ఓపెనింగ్స్ రికార్డులను దాటడం పెద్ద సవాలే అని చెప్పాలి. అయితే థియేటర్లలోకి వచ్చిన తర్వాత మొదటి రోజే గనుక పాజిటివ్ టాక్ వస్తే మాత్రం, బాక్సాఫీస్ గమనం పూర్తిగా మారిపోతుందని, విజయ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా చరిత్ర సృష్టిస్తాడని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్ కీ రోల్స్ లో కనిపిస్తుండగా అనిరుధ్ మ్యూజిక్.   jananayagan, vijay, pooja hegde, mamintha bhaiju, anirudh
పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఈ మూవీతో యదు వంశీ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా 72వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటుకుంది. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో రెండు జాతీయ అవార్డులను ‘కమిటీ కుర్రోళ్లు’ కొల్లగొట్టింది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు ప్రెస్ మీట్ నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో మెగా ప్రొడ్యూసర్ నిహారిక కొణిదెల మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు చిత్రానికి జాతీయ అవార్డులు రావడంతో నా మనసు సంతృప్తితో నిండిపోయింది. నా 32 ఏళ్ల ఈ జీవితంలో ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకి ఓకే చెప్పడంతో గొప్ప నిర్ణయం. ఇది నా సినిమా, ప్రాణం పెట్టాలని అప్పుడే ఫిక్స్ అయ్యాను. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంలో అందరి కష్టం ఉంది. మంచి సినిమా తీసినప్పుడు ఇలాంటి ఓ గొప్ప ఫీలింగ్ కలుగుతుందంటే.. నా జీవితంలో ఎప్పుడూ ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లను. యదు వంశీ గారు ఎప్పుడూ నేషనల్ అవార్డ్ వస్తుందని చెబుతూనే ఉండేవారు. కానీ నేను ఒక నేషనల్ అవార్డ్ సినిమా తీయాలని ‘కమిటీ కుర్రోళ్లు’ని నిర్మించలేదు. ఈ జర్నీలో మాత్రం నేను కూడా జాతీయ అవార్డు రావాలని కోరుకున్నాను. 72వ జాతీయ అవార్డుల్లో మేం కూడా ఉండాలని అనుకున్నాను. నా కల నేడు నెరవేరింది. ఆర్టిస్టుల్ని 18 ఏళ్ల నుంచి 30 ఏళ్లుగా మారేందుకు ఎంతో మేకోవర్ జరిగింది. ఈ జర్నీలో రవి, అక్షయ్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రవికి నేషనల్ అవార్డ్ రావడం ఆనందంగా ఉంది.  మా నాన్న తీసిన ‘రుద్రవీణ’కి మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. మా పెదనాన్న గారు, బాబాయ్ గారు సినిమాకి సేవ చేశారు. నేను కొణిదెల ఫ్యామిలీ నుంచి వచ్చాను.. ఏదో ఒకటి చేశాను అని ఇప్పుడు అనిపిస్తోంది. నేను మెగా ఫ్యామిలీలో ఉన్నాను.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చాను అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఈ ఫ్యామిలీలో నేను ఉండేందుకు అర్హురాలిని అని ఇప్పుడు గర్వంగా చెప్పుకోగలను. సినిమా చూసిన తర్వాత మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ కూడా నేషనల్ అవార్డ్ వస్తుందని అన్నారు. మాకు రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. చిరంజీవి గారే అందరికీ గర్వకారణం అని నేను ఫీల్ అవుతుంటాను. ఆయనే నన్ను గర్వకారణం అని అనడంతో ఎంతో ఆనందంగా ఉంది. ‘రుద్రవీణకి మీ నాన్న (నాగబాబు) తీసుకున్నారు.. ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావ్.. మాకెంతో గర్వంగా ఉంది’ అని ఆయన అనడం నాకు మరింత గర్వంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు యదు వంశీ మాట్లాడుతూ .. ‘‘కమిటీ కుర్రోళ్లు నేషనల్ అవార్డ్ కొడుతుందని ముందు నుంచీ అందరికీ చెప్తూనే వచ్చాను. చాలా మంది ఈ మూవీని నిర్మించేందుకు ప్రయత్నించారు. కానీ ఎవ్వరి వల్లా కాలేదు. ఓ కొత్త సినిమాకి ఇంత బడ్జెట్ పెట్టేందుకు చాలా మంది సాహసించలేదు. కానీ మన్యం రమేష్ గారు నాకు సపోర్ట్ చేశారు. కొత్త వాళ్లతో అంటే ఎవరు మాత్రం ధైర్యంగా అడుగు ముందుకు వేస్తారు. కానీ నేను చెప్పిన ప్రతీ ఒక్క ఆప్షన్‌కి మన్యం రమేష్ గారు, నిహారిక గారు ఓకే చెప్పారు. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్ తమ తమ పాత్రల కోసం బరువులు తగ్గారు, పెరిగారు. మేకప్‌కి అవార్డు రావాలని చాలా కోరుకున్నాను. బెస్ట్ ఫిల్మ్ అంటే.. ప్రతీ ఒక్క ఆర్టిస్ట్, టెక్నిషయన్ బెస్ట్ ఇస్తేనే వస్తుంది. ఎవరెన్ని చెప్పినా కూడా నిహారిక గారు ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు. పెట్టిన 9 కోట్ల గురించి నిహారిక గారు ఎప్పుడూ ఆలోచించలేదు. ఒక్క రూపాయి బిజినెస్ కాకపోయినా ధైర్యంతో నిహారిక గారు అడుగు ముందుకు వేశారు. అలా ప్రారంభమైన ప్రయాణాన్ని ఆమె ఇప్పుడు జాతీయస్థాయిలో నిలబెట్టారు. మీడియా ముందు ఇప్పుడు నేను ఏడ్వలేను (నవ్వుతూ). నాకు ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కంగ్రాట్స్’ అని అన్నారు.     Committee Kurrollu, National Awards, Niharika Konidela, Yadhu Vamsee  
  ది ఒడిస్సీ vs హైదరాబాద్.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ ట్యాగ్  లైన్ ప్రధాన ఆకర్షణగా  కనిపిస్తుంది. ప్రధాన ఆకర్షణ అనే కంటే  ఒక రకంగా ది ఒడిస్సీ కి హైదరాబాద్ షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరంలోని సినిమా ప్రేమికులకి హాలీవుడ్ చిత్రాల పట్ల ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. భారీ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ యాక్షన్ ఎపిక్స్‌తో తెరకెక్కిన అంతర్జాతీయ ప్రతిష్టాత్మక చిత్రం 'ది ఒడిస్సీ'  కోసం రిలీజ్ కి ముందు నుంచే నగరంలోని సినీ ప్రేమికులు, ప్రేక్షకులు ఎంతగానో నిరీక్షించారు.  అయితే మూవీ రిలీజయ్యాక బాక్సాఫీస్ వద్ద ఒక విచిత్రమైన పరిస్థితి కనిపిస్తోంది. సాధారణంగా హైదరాబాద్ తో పాటు తెలుగు రాష్ట్రాల్లో హాలీవుడ్ చిత్రాలని మాతృభాష తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. కానీ 'ది ఒడిస్సీ' చిత్రానికి సంబంధించి హైదరాబాద్‌లోని థియేటర్లలో తెలుగు వెర్షన్ వైపు ప్రేక్షకులు అసలు అడుగు పెట్టడం లేదు. నిన్న ఆదివారం వీకెండ్ అయినప్పటికీ మెజారిటీ థియేటర్లలో తెలుగు షోలకి బుకింగ్స్ చాలా డల్స్ గా ఉన్నాయి. నగరంలోని ప్రముఖ బుకింగ్ యాప్స్ విశ్లేషిస్తే ఒక షాకింగ్ విషయం బయటపడింది. ప్రసాద్స్ మల్టీప్లెక్స్, ఏఎంబీ సినిమాస్, పివిఆర్ ఐనాక్స్ వంటి టాప్ సినిమా హాళ్లలో ఇంగ్లీష్ వెర్షన్‌కు దాదాపు 85% నుండి 90% వరకు అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. కానీ అదే సమయంలో తెలుగు డబ్బింగ్ వెర్షన్ ప్రదర్శిస్తున్న స్క్రీన్లలో కేవలం 10% కంటే తక్కువ ఆక్యుపెన్సీ నమోదు కావడం అందరిని ఆశ్చర్యపరిచింది. నగరంలోని ఐటి కారిడార్ పరిధిలో ఉన్న మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి వంటి ప్రాంతాల నుండి దాదాపు 75% మంది యువత కేవలం ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్‌ని  సబ్‌టైటిల్స్‌తో చూడటానికే మొగ్గు చూపారు. సినీ అడ్డాగా భావించే ఆర్ టి సి క్రాస్ రోడ్ లో సైతం ఇదే పరిస్థితి.  తెలుగు వెర్షన్‌ని ప్రేక్షకులు రిజెక్ట్ చేయడానికి ప్రధాన కారణం డబ్బింగ్ క్వాలిటీ లోపించడమేనని టాక్ నడుస్తోంది. భారీ డైలాగులు, గ్రీకు పురాణ నేపథ్యం ఉన్న కథని  తెలుగులోకి అనువదించేటప్పుడు సహజత్వం లోపించిందని, డైలాగ్ డెలివరీ సరిగ్గా సింక్ కాలేదని నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. దీంతో హలీవుడ్ సినిమాల్లో ఉండే ఒరిజినల్ సౌండ్ ఎఫెక్ట్స్  థియేట్రికల్ అట్మాస్ఫియర్ ఆస్వాదించాలంటే ఇంగ్లీష్ వర్షనే కరెక్ట్ అని మెజారిటీ ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. దీనివల్ల హైదరాబాద్‌లోని దాదాపు 50 కంటే ఎక్కువ థియేటర్లలో తెలుగు వెర్షన్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడింది. నిన్నటి ఒక్కరోజే తెలుగు షోల ద్వారా రావాల్సిన దాదాపు 15 లక్షల నుండి  20 లక్షల వరకు గ్రాస్ కలెక్షన్స్ డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మల్టీప్లెక్స్ ప్రతినిధుల సమాచారం ప్రకారం, తెలుగు వెర్షన్‌కి డిమాండ్ లేకపోవడంతో రాబోయే రోజుల్లో ఆ స్క్రీన్లను కూడా ఇంగ్లీష్ వెర్షన్‌గా మార్చాలని లేదా ఇతర ప్రాంతీయ సినిమాలకు కేటాయించాలని యాజమాన్యాలు భావిస్తున్నాయి. ఒకప్పుడు డబ్బింగ్ సినిమాలకు నీరాజనాలు పట్టిన తెలుగు ఆడియన్స్, ఇప్పుడు క్వాలిటీ లేకపోతే ఎంత పెద్ద సినిమానైనా సున్నితంగా తిరస్కరిస్తారని ఈ ఘటన మరోసారి నిరూపించింది. ఏదేమైనా 'ది ఒడిస్సీ' ఒరిజినల్ ఇంగ్లీష్ వెర్షన్ హైదరాబాద్‌లో దూసుకుపోతుంటే, తెలుగు డబ్బింగ్ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. the odyssey, the odyssey collections, hyderabad, Christopher Nolan  
కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియ జంటగా నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ ప్యూర్ రొమాంటిక్ డ్రామా 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాల ట్రెండ్ అవుతోంది. 'బేబీ' సినిమాని నిర్మించిన మాస్ మూవీ మేకర్స్, అమృతా ప్రొడక్షన్స్ బ్యానర్లపై SKN, సాయి రాజేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు.  గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచే 'చెన్నై లవ్ స్టోరీ'పై మంచి అంచనాలు ఉండగా, ఇప్పుడు విడుదలైన ట్రైలర్ ఆ అంచనాలను పెంచేసింది. జూలై 24న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రం, యువతను విశేషంగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం 'స్టీఫెన్' అనే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలో ఎలాగైనా దర్శకుడిగా రాణించాలనే బలమైన కోరికతో, హైదరాబాద్ కాకుండా సరికొత్త భావోద్వేగాల కోసం చెన్నైను ఎంచుకునే ఒక వైవిధ్యమైన పాత్ర ఇది. ఈ ప్రయాణంలో అతనికి ఒక సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్ అయిన శ్రీ గౌరిప్రియ పరిచయం అవుతుంది. చాలా ఫ్రీడమ్ కోరుకునే, స్వేచ్ఛగా బతికే అమ్మాయిగా గౌరిప్రియ పాత్రను చాలా సహజంగా డిజైన్ చేశారు. వీరిద్దరి మధ్య మొదట చిన్న చిన్న గొడవలతో ప్రారంభమైన పరిచయం, ఆ తర్వాత గాఢమైన ప్రేమగా ఎలా మారింది అనేది ట్రైలర్‌లో చాలా అందంగా చూపించారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరిప్రియల మధ్య ఉన్న కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ట్రైలర్ మొదటి సగం అంతా ఎంతో ఆహ్లాదకరంగా, యూత్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగిపోగా, ద్వితీయార్ధంలో కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ఇద్దరి వ్యక్తిత్వాల మధ్య వచ్చే తేడాలు, స్వతంత్రంగా ఉండే అమ్మాయి అలవాట్లను స్టీఫెన్ అంగీకరించలేకపోవడం వంటి అంశాలు వీరి మధ్య తీవ్రమైన ఎమోషనల్ ప్యాక్డ్ డ్రామాకు దారితీస్తాయి. ప్రేమ ఎంత మధురంగా ఉంటుందో, విడిపోతే వచ్చే గుండెకోత అంతకంటే తీవ్రంగా ఉంటుందని ట్రైలర్ లోని ఎమోషనల్ సీన్స్ స్పష్టం చేస్తున్నాయి. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ట్రైలర్‌లోని భావోద్వేగాలను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. విజువల్స్ కూడా ఎంతో రిచ్‌గా, కలర్‌ఫుల్‌గా ఉండి సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేస్తున్నాయి. 'చెన్నై లవ్ స్టోరీ' ట్రైలర్ కు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లో 1.5 మిలియన్ కి పైగా వ్యూస్ సాధించడమే కాకుండా, యూట్యూబ్ లో టాప్-2 లో ట్రెండ్ అవుతోంది. చూస్తూనే కిరణ్ అబ్బవరం ఖాతాలో మరో హిట్ పడేలా ఉంది.     Chennai Love Story Trailer, Kiran Abbavaraam, Sri Gouri Priya  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.  పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం  కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు.  అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.   దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం,  ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు.  పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే,  క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను  ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు  అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు,  కాబట్టి అందరిలో  తప్పులు మాత్రమే  చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న  ప్రాముఖ్యతను పిల్లలకు  వివరించాలి.  క్షమించడం ఎంతో గొప్ప గుణం అని  చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.                                       *రూపశ్రీ.  
  వయసు పైబడే కొద్దీ, చాలా మంది తల్లిదండ్రులకు రోజువారీ పనులలో సహాయం అవసరం అవుతుంది. ఉద్యోగాల రీత్యా పిల్లలు దూరంగా ఉండటం లేదా విదేశాల్లో ఉండటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో పిల్లలు తల్లిదండ్రుల కోసం పిల్లలు కేర్ టేకర్ ను నియమించుకోవాలని అనుకుంటారు.  తల్లిదండ్రులు చాలా పెద్దవారైపోయి,  వారికి వారి పనులు కూడా చేసుకోలేని పరిస్థితిలో చాలా కుటుంబాలు కూడా కేర్ టేకర్ ను నియమించుకోవాలి అనుకుంటాయి.  అయితే కేవలం అనుభవం ఉందనో లేదా తక్కువ  పేమెంట్ తో కేర్ టేకర్ వస్తున్నారనో  తల్లిదండ్రుల కోసం కేర్ టేకర్ ను నియమించడం మంచిది కాదని అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణుల.   తల్లిదండ్రుల ఆరోగ్యం, భద్రత , మానసిక ఆరోగ్యం  కోసం  మంచి కేర్ టేకర్ ను ఎంచుకోవడం చాలా ముఖ్యం. అందుకే కేర్ టేకర్ ను నియమించుకునే ముందు కొన్ని విషయాలు గుర్తు పెట్టుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే.. ముఖ్యమైన విషయం.. మొదట తల్లిదండ్రులకు ఎలాంటి సంరక్షణ అవసరమో నిర్ధారించుకోవాలి. వారికి అల్జీమర్స్, డిమెన్షియా లేదా మరో తీవ్రమైన అనారోగ్యం ఉంటే, శిక్షణ పొందిన కేర్ టేకర్  అవసరం అవుతారు. వారికి కేవలం సమయానికి మందులు వేసుకోవడం, ఆహారం తినడం లేదా రోజువారీ పనులు చేసుకోవడంలో సహాయం అవసరమైతే, ఒక సాధారణ కేర్ టేకర్ కూడా  సరిపోతారు. కేర్ టేకర్ ను  ఎంచుకునే ముందు, స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం, ఆహారం తినడం, మరుగుదొడ్డికి వెళ్లడం, మందులు వేసుకోవడం లేదా రాత్రిపూట వారికి ఎంత సంరక్షణ అవసరమో వంటి రోజువారీ అవసరాల లిస్ట్ ను తయారు చేసుకోవాలి. ఇది సరైన కేర్ టేకర్ ను  ఎంచుకోవడాన్ని సులభతరం చేస్తుంది. ప్రశ్నలు అడిగేటప్పుడు గుర్తుంచుకోవలసిన విషయాలు.. కేర్ టేకర్ ను ఇంటర్ప్యూ చేసే  సమయంలో అనుభవం గురించి అడిగితే సరిపోదు. వారు ఇంతకుముందు ఏ జబ్బు ఉన్న వ్యక్తులకు సర్వీస్ చేశారో,  మెడిసిన్ షెడ్యూల్ ను  నిర్వహించగలరో లేదో, అవసరమైతే భోజనం వండగలరో లేదో,  వైద్య అత్యవసర పరిస్థితిలో సరైన నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉందో లేదో కూడా తెలుసుకోవాలి.  వీల్‌చైర్ లో ఉన్న తల్లిదండ్రుల కోసం  లేదా మంచం నుండి లేవడానికి సహాయం అవసరమయ్యే వారి గురించి పై  విషయాన్ని ముందుగానే చర్చించాలి.   తల్లిదండ్రులను కలవాలి.. కేర్ టేకర్ ను నియమించాలనే నిర్ణయం తీసుకునే ముందు, కేర్ టేకర్ ను తల్లిదండ్రులకు తప్పకుండా పరిచయం చేయాలి. దీనివల్ల తల్లిదండ్రులు, కేర్ టేకర్ ఇద్దరూ  ఒకరితో ఒకరు కంఫర్ట్ గా ఉన్నారో లేదో అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. కొన్నిసార్లు, అనుభవం కంటే ప్రవర్తన , మాట్లాడే విధానం వంటివి ఎక్కువ ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ప్రతి కేర్ టేకర్ ట్రైనింగ్ తీసుకున్నవారే అయి ఉండరు అనే విషయం  గుర్తుంచుకోవాలి. చాలా మందికి వృద్ధులను చూసుకునే విషయంలో అనుభవం లేదా వైద్య శిక్షణ ఉండదు. అందువల్ల వృద్దులకు  ఇన్సులిన్ ఇవ్వడం, రక్తంలో చక్కెర స్థాయిలను చెక్ చేయడంలో,, గాయానికి కట్టు కట్టడం లేదా ఇతర నర్సింగ్ పనులు అవసరం అయితే.. వాటిని చేసేందుకు వీలుగా నర్సింగ్ శిక్షణ తీసుకున్న వారిని ఎంచుకోవాలి. కుటుంబ భాద్యత.. చాలామంది కేర్ టేకర్ ను నియమిస్తే.. ఇక తల్లిదండ్రుల విషయంలో ఎలాంటి బాధ్యత,   భయం లాంటివి తమకు లేనట్టే అని అనుకుంటారు.  కానీ కేర్ టేకర్ ఉన్నంత మాత్రాన కుటుంబ బాధ్యతలు పూర్తిగా  వదిలేయాలని అర్థం కాదు.. కేర్ టేకర్ తల్లిదండ్రులను సరిగా చూసుకుంటున్నారా లేదా అని చెక్ చేస్తూ ఉండాలి.  కేర్ టేకర్ తమను బాగా చూసుకుంటున్నారా లేదా అని పెద్దలను అడిగి తెలుసుకుంటూ ఉండాలి, అలాగే కొందరు పెద్దవాళ్లు చాదస్తంగా కేర్ టేకర్ లు ఎంత బాగా చూసుకున్నా తృప్తి పడరు. ఇలాంటి పరిస్థితులలో కేర్ టేకర్ ను అర్ఖం చేసుకోవడం,  కేర్ టేకర్ కు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం.                                 *రూపశ్రీ.  
స్మోకింగ్ మానాలంటే చాలా కష్టంగా ఉందా? ఇలా చేస్తే ఈజీగా మానేయవచ్చు..! ధూమపానం ఆరోగ్యానికి హానికరం.  ఈ విషయాన్ని పేపర్ లు,  టీవీ యాడ్స్ మాత్రమే కాకుండా ఏకంగా  సిగరెట్ ప్యాకెట్ ల పైన కూడా రాసి ఉంటుంది. ఇలా ఎవరు ఎంత చెప్పినా సరే.. చాలామంది స్మోక్ చేయడం మాత్రం మానరు. స్మోకింగ్ వల్ల ఎవరికి ఎంత సమస్య వచ్చినా దాని విషయంలో చాలా బలహీనంగా ఉంటారు. కానీ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ఆస్తమా, క్షయ,  క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులకు కూడా కారణం అవుతుంది. కేవలం ధూమపానం చేసేవారికే కాకుండా ఆ పొగను ఇతరులు పీల్చడం వల్ల ఇతరులకు కూడా సమస్య వస్తుంది. అయితే స్మోకింగ్ మానాలని మానలేకపోతున్న వారికి కొన్ని మంచి మార్గాలు ఉన్నాయి.  వాటిని పాటిస్తే స్మోకింగ్ మానేయడం చాలా ఈజీ.. ఆ మార్గాలు ఏెంటో తెలుసుకుంటే.. నిర్ణయం, కట్టుబడి ఉండటం.. ధూమపానం మానేయాలని నిర్ణయించుకుంటే మొదట ఎప్పటి నుండి మానేయాలి అనే విషయాన్ని నిర్ణయించుకోవాలి.  ఈ నిర్ణయం గురించి  కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా చెప్పాలి,  చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలి.  దీని వల్ల ఇతరులకు చెప్పాం కాబట్టి మానెయ్యాలి అనే ఆలోచన కూడా ఉంటుంది. పైగా ఫలానా రోజు నుండి మానేయాలి అని మనసును కూడా సన్నద్ధం చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు,  స్నేహితులు కూడా ప్రో్త్సహించే అవకాశం ఉంటుంది. కొత్త అలవాట్లు.. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం, యోగా లేదా వేగంగా నడవడం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. అంతేకాకుండా.. కొత్త అభిరుచిని అలవరచుకోవడం లేదా తమను తాము ఏదో ఒక పనిలో  నిమగ్నం చేసుకోవడం  కూడా ధూమపానం చేయాలనే కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్య సహాయం.. స్మోకింగ్ మానేయడానికి పదేపదే ప్రయత్నించినప్పటికీ  ధూమపానం మానుకోలేకపోతే, వైద్యుడిని లేదా స్మోకింగ్మ మానేయడానికి సహాయపడే నిపుణులను సంప్రదించాలి.  అవసరమైతే వారు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT), మందులు లేదా కౌన్సెలింగ్‌ను సిఫార్సు చేసే అవకాశం  ఉంటుంది.  వైద్యుడిని సంప్రదించకుండా ఎలాంటి మందులను వాడటం అయితే మంచిది కాదు. 4-డి సూత్రం.. "4-డి" సూత్రం అత్యంత ప్రభావవంతమైన పద్ధతిగా పరిగణించబడుతుంది. స్మౌకింగ్ చేయాలనే కోరికలు కలిగినప్పుడు, వెంటనే చేయకూడదు.. కొద్దిసేపు ఆగాలి, ఎందుకంటే అవి సాధారణంగా ఐదు నిమిషాల్లో తగ్గిపోతాయి, లోతైన శ్వాస తీసుకోవాలి, నీరు త్రాగాలి,  అదే ఆలోచనలో ఉండకుండావేరే పనులలో తమను తాము నిమగ్నం చేసుకోవడం లేదా స్నేహితులతో,  కుటుంబ సభ్యులతో మాట్లాడటం వంటి పనుల ద్వారా మైండ్ డైవర్ట్ చేసుకోవాలి.   స్మోకింగ్ మానడానకి  ప్రయత్నం చేసేటప్పుడు మొదట్లో చాలా కష్టంగా అనిపించవచ్చు.  కానీ పైన చెప్పుకున్నట్టు పాటిస్తూ ఉంటే తొందరలోనే స్మోకింగ్ మానేయవచ్చు.                                       *రూపశ్రీ.
వాము, జీలకర్రతో చేసే ఈ చూర్ణం గ్యాస్, అజీర్ణానికి ఎంత ఉపయోగమో తెలుసా.! గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి సమస్యలను సహజసిద్ధమైన ఆయుర్వేద పద్ధతిలో ఎలా తగ్గించుకోవచ్చో ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ ఈ వీడియోలో వివరించారు.   ఈ వీడియోలో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఒక ప్రభావవంతమైన ఆయుర్వేద చూర్ణం తయారీ విధానాన్ని చూపించారు. వాము, ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల ఉప్పు వంటి మన వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ చూర్ణాన్ని ఎలా తయారు చేయాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందో పూర్తి వివరంగా తెలిపారు. ఈ చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరచడంలో, గ్యాస్ సమస్యను తగ్గించడంలో, కడుపు ఉబ్బరాన్ని నియంత్రించడంలో, అసిడిటీ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు వివరిస్తున్నారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యమైన విషయాలు: గ్యాస్, అసిడిటీకి సహజమైన ఆయుర్వేద చిట్కా ఇంట్లోనే చూర్ణం తయారు చేసే విధానం వాము, జీలకర్ర, ధనియాలు, సోంపు ప్రయోజనాలు చూర్ణం తీసుకునే సరైన సమయం, మోతాదు జీర్ణక్రియను మెరుగుపరచే సహజ మార్గాలు మీరు తరచూ గ్యాస్, అజీర్ణం, అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడుతుంటే, ఈ వీడియోలో చెప్పిన సూచనలు మీకు ఉపయోగపడవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ఆయుర్వేద నిపుణులు అందించిన సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.      
మోకాళ్ల నొప్పి ప్రస్తుతం అన్ని వయస్సుల వారిలో కనిపిస్తున్న సాధారణ సమస్యగా మారింది. మెట్లు ఎక్కడం, నడవడం, ఎక్కువసేపు నిలబడటం వంటి రోజువారీ పనులు కూడా కష్టంగా అనిపిస్తాయి. ఈ వీడియోలో యోగా ఆచార్య ధాకారం గారు మోకాళ్ల నొప్పిని తగ్గించడంలో సహాయపడే సులభమైన యోగా ఆసనాలు మరియు వ్యాయామాలను వివరంగా చూపించారు. ఈ యోగా పద్ధతులను సరైన విధంగా, క్రమం తప్పకుండా చేస్తే మోకాళ్ల కండరాలు బలపడటంతో పాటు కీళ్ల కదలిక మెరుగుపడుతుంది. మోకాళ్లలో గట్టిదనం తగ్గి, నొప్పి నుంచి ఉపశమనం పొందేందుకు ఇవి ఉపయోగపడవచ్చు. వయస్సుతో వచ్చే మోకాళ్ల సమస్యలు, ఆస్టియోఆర్థ్రైటిస్ ప్రారంభ దశలో ఉన్నవారు లేదా ఎక్కువసేపు కూర్చునే ఉద్యోగాలు చేసే వారు కూడా ఈ వ్యాయామాల గురించి తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకునే అంశాలు: మోకాళ్ల నొప్పికి కారణాలు మోకాళ్ల కండరాలను బలపరిచే యోగా వ్యాయామాలు నొప్పిని తగ్గించే సులభమైన స్ట్రెచింగ్ పద్ధతులు నడవడం, మెట్లు ఎక్కడం సులభం కావడానికి ఉపయోగపడే సూచనలు మోకాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకునే యోగా చిట్కాలు గమనిక: మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న వారు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్య లేదా శస్త్రచికిత్స అనంతర పరిస్థితి ఉంటే, ఈ వ్యాయామాలను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి