Home

»

Latest News

'రణబాలి'లో రశ్మిక 'జయమ్మ' క్యారెక్టర్ షూటింగ్ పూర్తి, ఎమోషనల్ సెండాఫ్ ఇచ్చిన టీమ్!

Sep 13, 2026 6:38PM

 

విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ "రణబాలి". ఈ చిత్రంలో రశ్మిక రణబాలి జోడీగా జయమ్మ క్యారెక్టర్ లో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ అయ్యింది. షూటింగ్ సెట్ నుంచి చిత్రబృందం ఎమోషనల్ గా ఆమెకు సెండాఫ్ ఇస్తున్న వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. 

"రణబాలి" సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై "రణబాలి" సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా "రణబాలి" సినిమా రూపొందుతోంది. 

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా అక్టోబర్ 16న విజయదశమి పర్వదినం సందర్భంగా వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్ హ్యూజ్  రెస్పాన్స్ తెచ్చుకుంటూ యూట్యూబ్ లో  నెం.1 ప్లేస్ లో ట్రెండింగ్ అవుతోంది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com