LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ చాలెంజ్ ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నేతలను డిఫెన్స్ లో పడేసింది. జనాలకు ముఖం ఎలా చూపించాలో తెలియనంతగా ఆత్మరక్షణలో పడ్డారు. మరీ ముఖ్యంగా మాజీ మంత్రి, ఉత్తరాంధ్రలో ఒకప్పుడు తిరుగులేని నేతగా చక్రం తిప్పిన ధర్మానను జగన్ తీరు మరీ ఇబ్బందుల్లోకి నెట్టేసింది. వైఎస్ హయాంలో ఉత్తరాంధ్రలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాలలో కూడా చక్రం తిప్పిన ధర్మా ప్రసాదరావు జగన్ మావిగన్ చాలెంజ్ పై అగ్గిమీద గుగ్గిలంలా మండి పడుతున్నారు.   2014 ఎన్నికలకు ముందు ధర్మాన ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీలో అత్యంత ప్రభావమంతమైన నాయకుడు.   ప్రజల్లో కూడా ఆయన పట్ల అభిమానం, గౌరవం ఉండేవి. తన వాగ్ధాటితో,  విశ్లేషణలతో ప్రజా సమస్యలపై అసెంబ్లీలోనూ, బయటా గళం విప్పి ప్రజామన్ననలు అందుకున్నారు. అయితే అదంతా గతం.  వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ధర్మాన ప్రభ రోజురోజుకూ తగ్గుతూ వచ్చింది. అందుకు కారణం.. జగన్మోహన్ రెడ్డి నాయకత్వ శైలిని, ఏకపక్ష పోకడలను  ధర్మాన ప్రసాదరావు అంతర్గతంగా విభేదించడమేనని వైసీపీ వర్గాలే చెబుతుంటాయి.    ఆ కారణంగానే  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా ధర్మానకు అంత సీనియర్ అయి ఉండి కూడా  తొలి మూడేళ్లలో  మంత్రి పదవి దక్కలేదు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ విస్తరణలో మంత్రి పదవి దక్కిందనుకోండి. అది వేరే సంగతి.   విశాఖపట్నం పరిపాలన రాజధాని అన్న జగన్ విధానాన్ని ధర్మాన బలంగా ప్రజలలోకి తీసుకువెళ్లడానికి శతధా ప్రయత్నించారు.  ఉత్తరాంధ్ర సెంటిమెంట్‌ను రగిలిస్తూ, గ్రామగ్రామాన సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారం చేశారు. అదేమీ ఫలించలేదని 2024 ఎన్నికల ఫలితాలు తేల్చేశాయి.  అయినా ధర్మాన ఉత్తరాంధ్ర సెంటిమెంట్ ను వదల లేదు. కానీ ఇప్పుడు జగన్  మావిగన్ అనడం ధర్మానకు మింగుడు పడటం లేదని ఆయన అనుచరులు చెబుతున్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనతో ధర్మాన పూర్తి ఆత్మరక్షణలో పడిపోయారనీ,  జగన్ తీరు కారణంగా తన సొంత ఇమేజ్ దెబ్బతింటోందని ఆయన సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారంటున్నారు.  నాడు విశాఖ రాజధాని అంశంపై గట్టిగా నిలబడిన తాను ఇప్పుడు జగన్ మావిగన్ అనడంతో ప్రజలలో చులకన అయ్యాననీ బాధపడుతున్నారని చెబుతున్నారు.  మొత్తం మీద జగన్ మావిగన్ నినాదంతో ధర్మాన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మావిగన్ ను బాహాటంగా వ్యతిరేకించాలన్న ఆగ్రహంతో ఆయన ఉన్నారని అంటున్నారు. 
ముద్రగడ పద్మనాభం.. కాపు ఉద్యమ నేతగా రాష్ట్రంలో ఈ పేరు చిరపరిచితం. 2024 ఎన్నికలలో వైసీపీ తరఫున క్రియాశీలంగా పని చేసిన ఆయన.. ఉమ్మడి తూర్పుగోదావరిలో వైసీపీకి అత్యంత కీలక నేతగా వ్యవహరించారు. వైసీపీ పరాజయం పాలైతే తన పేరు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించి, అంత పనీ చేశారు. అయితే ఆయన  విషయంలో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అనుసరించిన వైఖరి   ఎవరికీ అర్ధం కావడం లేదు. వైసీపీ కోసం ఎంతగానో పరితపించిన  ముద్రగడ..  కాపు రిజర్వేషన్ కోసం, కాపుల కోసం పోరాటం చేసి సంపాదించుకున్న ప్రాముఖ్యతనూ, ప్రతిష్టనూ..జగన్ కోసం ఔను కేవలం జగన్ కోసం వదులుకున్నారు.  అటువంటి ముద్రగడ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే…జగన్ ఆయనను కనీసం పరామర్శించను కూడా పరామర్శించలేదు.  పైగా జగన్మోహన్ రెడ్డి వస్తే తామే వద్దు అన్నాం అంటూ ఆయన కుమారుడితో  చెప్పించారు.  ముద్రగడ పద్మనాభంకు  రాజకీయ నాయకుడిగా కంటే.. కాపు రిజర్వేషన్ ఉద్యమ నేతగానే ఎక్కువ గుర్తింపు ఉంది. వైయస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుకు ముద్రగడ సమకాలీనుడు. వారితో పాటే..  1978లో అసెంబ్లీలో అడుగు పెట్టారు.  మంత్రిగా, ఎంపీగా కూడా పని చేశారు. అయితే తదననంతర పరిణామాలలో ఆయన ఎమ్మెల్యేగా కూడా పరాజయం పాలయ్యారు. దీంతో చాలా కాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అటువంటి ముద్రగడ..  2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత పొలిటికల్ గా యాక్టివ్ అవ్వడమే కాకుండా,   కాపు రిజర్వేషన్ ఉద్యమంతో ముందుకు వెళ్లారు. అయితే ఆ ఉద్యమం కాపులకు  ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదు సరికదా.. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ప్రయోజనం చేకూర్చింది. అసలు చంద్రబాబుకు వ్యతిరేకంగా, జగన్ కు అనుకూలంగా ముద్రగడ ఆ కాపు ఉద్యమాన్ని నడిపారన్న వాదన కూడా అప్పట్లో బలంగా వినిపించింది.  ఆ వాదనకు బలం చేకూర్చే విధంగానే.. 2019లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ముద్రగడ.. కాపు రిజర్వేషన్ నినాదాన్ని, ఉద్యమాన్ని పక్కన పెట్టేశారు.  ఇంత చేసినా ముద్రగడకు వైసీపీలో వీసమెత్తు ప్రాధాన్యత ఇవ్వలేదు జగన్.  అయినా కూడా ముద్రగడ.. 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. విస్తృతంగా ప్రచారం చేశారు. మరీ ముఖ్యంగా పవన్ కల్యాణ్ ను పిఠాపురంలో ఓడించకుండా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు. 2024 ఎన్నికలలో వైసీపీ ఘోరాతి ఘోరంగా ఓడిపోయింది. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కల్యాణ్ అద్భుతమైన మెజారిటీతో ఘన విజయం సాధించారు. దీంతో అన్నట్లుగానే ముద్రగడ తన పేరును ముద్రగడ పద్మనాభంగా అధికారికంగా మార్చుకున్నారు. జగన్ కోసం ఇంత చేసిన ముద్రగడకు.. జగన్ నుంచి వీసమెత్తు గుర్తింపు కూడా లేకుండా పోయిందని కాపు సామాజికవర్గ నేతలు, ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ముద్రగడను జగన్ కనీసం పరామర్శించను కూడా పరామర్శించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. జగన్ పరామర్శించకుంటే పోయె.. కానీ జగన్ తమకు అన్నివిధాలుగా అండగా నిలిచారనీ, ఆయన ముద్రగడను పరామర్శించడానికి వస్తానంటే.. తామే వద్దన్నామంటూ ముద్రగడ కుమారుడు వీడియో  విడుదల చేయడంపై కూడా సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.   అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని పరామర్శిస్తామంటే ఎవరైనా ఎలా, ఎందుకు వద్దంటారు? అంటూ, జగన్ ఒత్తిడి మేరకే ముద్రగడ కుమారుడు ఆ వీడియో విడుదల చేసి ఉంటారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ముద్రగడను పరామర్శించడానికి జగన్ రాకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
జగన్ మావిగన్ సవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ చెబుతున్న మావిగన్ అంటే ఏమిటో భగవంతుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల.. వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అమరావతి పనుల్లో  విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.. ఆ అవినీతికి విరుగుడుగా.. తాను అధికారంలోకి వస్తే మావిగన్ ను రాజధాని చేస్తానని ప్రకటించారు. అదే తన ఎన్నికల నినాదమని చెప్పారు. సహజ వనరులు, ముందే సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల మావిగన్  లాభదాయకమన్నారు.  జగన్ మావిగన్ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.  తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లెలో జరిగిన విక్సిత్ భారత్-గ్రామ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలా మావిగన్ ఏమిటో  దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు.  అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారనీ,  ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్  రాగం అందుకున్నారని విమర్శించారు.  రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో 29 వేల మంది రైతులు  33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తు చేసిన ఆయన అటువంటి  అమరావతిని గత ప్రభుత్వం శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు.  రాజకీయ స్వార్థం కోసం చెరుకు తోటలకు నిప్పు పెట్టి, ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్రలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ లాంటి శాశ్వత రాజధానులు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి గత ఐదేళ్లలో దాపురించిందన్న చంద్రబాబు..  2026లో పార్లమెంటు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని ఆమోదించిందని, ఇది జూన్ 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రం అందించిన ఈ చట్టబద్ధమైన రక్షణతో అమరావతి ఎదుగుదలను భూమిపై ఏ శక్తి కూడా ఆపలేదన్న చంద్రబాబు..  రాజకీయ నాయకుడు మాట మీద నిలబడాలని.. పూటకో మాట  మార్చే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిని 2028 నాటికి క్వాంటం వ్యాలీగా, నాలెడ్జ్ హబ్‌గా పూర్తిస్థాయిలో నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. 
వైసీపీకి పెట్టని కోటగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోట అయిన  కడప  ఇప్పుడు ఆయన చేజారిపోయిందా?  అంటే ఇటీవలి పరిణామాలను గమనించిన పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం జిల్లాలో..  కేడర్ నుంచి లీడర్ల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. జగన్‌కు తన సొంత జిల్లాపైనే పట్టు సడలినట్లు కనిపిస్తోందన్న భావన రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.  అందుకు..   జగన్ కడప జిల్లాలో ఇటీవల జరిపిన మూడు రోజుల పర్యటన నిలువెత్తు నిదర్శనంగా  నిలుస్తోంది.  ఈ పర్యటనలో జగన్.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పార్లమెంటు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. సాధారణంగా పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే.. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీలో పండుగ వాతావరణం నెలకొంటుంది.  కానీ జగన్ తాజా పర్యటనలో అటువంటివేవీ కనిపించలేదు. పైపెచ్చు..  జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు.  కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.  అధినేత పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల వైసీపీ కడప జిల్లా నేతలలో నెలకొన్న నిర్లిప్తతకు, అసంతప్తికి పరిశీలకులు దీనినే కడప జగన్ చేజారిపోయిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు.   నిజానికి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. జగన్ శ్రద్ధపెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా.. పార్టీకి పెట్టని కోటలాంటి కడప, బలమైన పట్టు ఉన్న నెల్లూరులలోనే వైసీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది.  అయితే పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ కడప జిల్లాలో దయనీయంగా మారడానికి జగన్ స్వయంకృతాపరాథమే కారణమని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో లీడర్లను, క్యాడర్ ను దూరం చేసుకున్నారంటున్నారు.  గతంలో నాయకులను ఇష్టానుసారంగా మార్చడం, స్థానిక సమీకరణాలను పట్టించుకోకుండా, ఎవరికీ ఇష్టం లేకపోయినా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు సీనియర్లను నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుండా నివారించాయనీ, ఇక తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గానికి  ప్రాధాన్యత ఇవ్వలేదని వారిలో అప్పట్లో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పటికీ అలానే ఉందనీ అంటున్నారు.    మరోవైపు  కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ  క్రమంగా విస్తరిస్తుండగా,   కడపలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలమైన విజయాన్ని దక్కించుకుంది.  ఇంత జరుగుతున్నా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ, కనీసం కేడర్‌కు భరోసా ఇచ్చే  చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పరిస్థితి కడప జిల్లాలో నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందని వైసీపీ నేతలే అంటున్నారు.  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇటీవల బోడుప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ వద్ద చోటు తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరపాలంటూ సాగిన ఈ పోరాటంలో  టీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కవితను మహిళా పోలీసులు అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయారు. ఆ తరువాత ఆమెను అరెస్టు చేసిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్వకుంట్ల అరెస్టుకు సంబంధించిన విజువల్స్ లో   మహిళా పోలీసులు కవితను చుట్టుముట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ తీవ్ర తోపులాటలో కవితతో పాటు  మహిళా పోలీసులూ కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది.  ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. నెటిజనులైతే.. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా ఉందని ఫైర్ అవుతున్నారు.   కవితను పోలీసులు అరెస్టు చేసిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం టీఆర్ఎస్ శ్రేణులే కాదు.. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా  పోలీసుల తీరును తప్పుపడుతున్నారు.  జనసేన   తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి కవిత అరెస్టు సందర్భంగా పోలీసుల దురుసు వైఖరిని   తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, రాజకీయ వైరుధ్యాలు ఉండటం సహజమన్న ఆయన.. ఒక  మహిళా నేత పట్ల  ఇంత అగౌరవంగా, కనీస మర్యాద లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని, ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.   మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు  బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు  
ALSO ON TELUGUONE N E W S
  కోలీవుడ్ స్టార్ హీరో రవి మోహన్ (సినిమా ఇండస్ట్రీలో అందరికీ సుపరిచితమైన పేరు జయం రవి) నివాసంలో జరిగిన భారీ దొంగతనం ఉదంతం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో తీవ్ర సంచలనంగా మారింది. చెన్నైలోని అత్యంత విలాసవంతమైన ఇంజంబాక్కం ప్రాంతంలో ఉన్న ఆయన నివాసంలో విలువైన వజ్రాల హారంతో పాటు పెద్ద మొత్తంలో నగదు మాయమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంట్లో భద్రంగా దాచుకున్న సుమారు 10 లక్షల రూపాయల విలువైన వజ్రాల హారం (డైమండ్ నెక్లెస్), అలాగే దాదాపు 2.5 లక్షల రూపాయల నగదు కనిపించకుండా పోవడంతో హీరో జయం రవి మేనేజర్ వెంటనే అలర్ట్ అయ్యారు. ఈ భారీ చోరీపై జూన్ 22వ తేదీన చెన్నైలోని నీలాంగరై పోలీస్ స్టేషన్‌లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేశారు. ఈ హైప్రొఫైల్ దొంగతనం కేసును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగారు. దర్యాప్తులో భాగంగా జయం రవి నివాసంలో విధులు నిర్వహిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది, వంటవారు,డ్రైవర్లని  ఒక్కొక్కరిగా పిలిపించి సుదీర్ఘంగా విచారించారు. ఈ విచారణ ప్రక్రియ సాగుతుండగా, గత ఆరు నెలలుగా జయం రవి వద్ద వ్యక్తిగత కార్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజేష్ ప్రవర్తన పోలీసులకి  అనుమానాస్పదంగా అనిపించింది. అతడి హావభావాలు, సమాధానాలు పొంతన లేకుండా ఉండటంతో పోలీసులు తమదైన శైలిలో విచారణని తీవ్రతరం చేశారు. పోలీసుల గట్టి నిఘా మరియు ముమ్మర విచారణ ముందు డ్రైవర్ రాజేష్ ఎక్కువ సేపు నిజం దాచలేకపోయాడు. తానే ఆ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసుల ఎదుట లొంగిపోయి, నేరాన్ని  అంగీకరించాడు. జయం రవి ఇంట్లోని లాకర్‌ని  రహస్యంగా తెరిచి, అందులో ఉన్న నగదును కాజేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు తక్షణమే స్పందించి, దొంగిలించబడిన 2.5 లక్షల రూపాయల నగదును పూర్తిగా రికవరీ చేశారు. రికవరీ చేసిన ఆ నగదును తిరిగి నటుడి కుటుంబ సభ్యులకు భద్రంగా అప్పగించారు. అయితే, ఈ కేసులో అసలైన చిక్కుముడి 10 లక్షల రూపాయల విలువైన ఆ వజ్రాల హారం దగ్గరే పడింది. Also read: Preity zinta: హైకోర్టుకి ప్రీతీ జింటా.. తిక్క కుదిరింది! డ్రైవర్ రాజేష్ నగదు దొంగతనాన్ని ఒప్పుకున్నప్పటికీ, మాయమైన ఆ విలువైన డైమండ్ నెక్లెస్ ఎక్కడుందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. నగదు దొరికినప్పటికీ, వజ్రాల హారం కోసం పోలీసులు  గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉన్నారు.  ప్రస్తుతానికి నిందితుడు రాజేష్‌ని  పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేసి, న్యాయస్థానం ముందు హాజరుపరిచారు. కోర్టు అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించడంతో రిమాండ్‌కు తరలించారు. ఒక స్టార్ హీరో ఇంట్లోనే నమ్మకమైన డ్రైవర్ ఇలాంటి చోరీకి ఒడిగట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.   
  సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)విక్టరీ వెంకటేష్(venkatesh)లతో రాజకుమారుడు,ప్రేమంటే ఇదేరాతో జతకట్టి తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన హీరోయిన్ ప్రీతి జింటా. బాలీవుడ్ లో కూడా పలు చిత్రాల్లో చేసి అగ్ర హీరోయిన్ టాగ్ లైన్ పొందిన ప్రీతి జింటా తన  గుర్తింపుని  కాపాడుకోవడానికి సరికొత్త చట్టపరమైన పోరాటానికి తెరతీశారు.  ఆన్‌లైన్ వేదికలపై తన అనుమతి లేకుండా సృష్టిస్తున్న ఏఐ డీప్‌ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ ఫోటోలు, అసభ్యకరమైన మీమ్స్ తన పేరుతో నడుస్తున్న ఏఐ చాట్‌బాట్ ప్రొఫైల్స్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వ్యక్తిత్వ హక్కులు, కాపీరైట్ చట్టాలని ఎ ఐ   కంటెంట్ తీవ్రంగా ఉల్లంఘిస్తోందని, దీనివల్ల దశాబ్దాలుగా తాను సంపాదించుకున్న కీర్తి ప్రతిష్టలు, బ్రాండ్ వాల్యూ మంటగలుస్తున్నాయని ఆవేదన చెందుతూ బాంబే హైకోర్టుని  ఆశ్రయించారు. కేసుని విచారించిన బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాధవ్ జమ్దార్, జస్టిస్ అభయ్ అహుజా బెంచ్, ప్రీతి జింటా దాఖలు చేసిన పిటిషన్‌ని పరిగణించింది.  గూగుల్ ఎల్‌ఎల్‌సీ (Google LLC), మెటా ప్లాట్‌ఫామ్స్ (Meta), ఎక్స్ కార్ప్ (X Corp) వంటి దిగ్గజ సోషల్ మీడియా కంపెనీలతో పాటు సుమారు 12 కంటే ఎక్కువ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై అధికారికంగా సివిల్ సూట్ దాఖలు చేయడానికి కోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రీతి జింటా తరఫున వాదనలు వినిపించిన సీనియర్ అడ్వకేట్ వెంకటేష్ ధోండ్ మరియు రోహన్ కదమ్, ప్రస్తుతం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డీప్‌ఫేక్ కంటెంట్ నాణ్యత రోజురోజుకూ ప్రమాదకరంగా మారుతోందని కోర్టుకి  వివరించారు. ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులుతన క్లయింట్ ముఖాన్ని, వాయిస్‌ని వాడుకుని కంటెంట్ క్రియేట్ చేయకుండా శాశ్వత నిషేధ ఉత్తర్వులు (Permanent Injunctions) ఇవ్వాలని వారు కోరారు. Also read: Vijay: విజయ్, త్రిష విషయంలో ఒకరి అరెస్ట్.. అరెస్ట్ అయ్యింది ఎవరో తెలిస్తే షాక్ అవుతారు మరోవైపు టెక్ దిగ్గజాలైన గూగుల్, మెటా సంస్థల న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను వినిపించారు. హీరోయిన్ ప్రీతి జింటా ఫ్లాగ్ చేసిన లేదా గుర్తించిన వివాదాస్పద లింకులను, మార్ఫింగ్ చేసిన అసభ్యకర కంటెంట్‌ను తమ ప్లాట్‌ఫామ్‌ల నుండి వెంటనే తొలగించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కోర్టుకు తెలిపారు. అయితే, ఇంటర్నెట్‌లోని మొత్తం కంటెంట్‌ని  నిరంతరం పర్యవేక్షించడం లేదా ఎలాంటి ఆధారాలు లేకుండా ముందస్తుగానే కంటెంట్‌ని బ్లాక్ చేయడం సాధ్యం కాదని కోర్టుకి  అభ్యర్థించారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం, వివాదాస్పద కంటెంట్‌ను వెబ్‌సైట్ల నుండి సమర్థవంతంగా తొలగించడానికి (Takedown Mechanism) ఇరు పక్షాలు కలిసి ఒక నిర్దిష్టమైన ప్రణాళికను లేదా విధానాన్ని రూపొందించాలని సూచించింది.
The CBFC has once again become the talking point in the film industry. After Vijay's Jana Nayagan remained stuck in certification issues for months despite multiple attempts by the makers to resolve the objections, Salman Khan's Maatrubhumi has now landed in a similar situation. The latest reports suggest that the film is yet to receive its censor certificate, raising concerns about another prolonged delay. Interestingly, the makers have already made one major compromise. The film was originally announced as Battle of Galwan, but the title was changed to Maatrubhumi in an apparent bid to avoid controversy surrounding its sensitive subject. However, the move hasn't yielded the desired result. Despite the new title, the CBFC is yet to clear the film, leaving its release plans in limbo. The developments have inevitably drawn comparisons with Jana Nayagan. Vijay's political drama also ran into certification hurdles that snowballed into a legal battle. The delay forced the makers to postpone the release, revisit their promotional plans and wait for months before the film could move forward. Now, trade circles fear Maatrubhumi could be heading down a similar road if the certification issue isn't resolved soon. Unlike routine censor cuts, both films deal with subjects that demand greater scrutiny. Jana Nayagan reportedly attracted objections over its politically sensitive content, while Maatrubhumi, based on the Galwan Valley clash between Indian and Chinese soldiers, touches upon a real-life military conflict that continues to be a sensitive topic. That has made the certification process far more complex than usual. For Salman Khan, the timing couldn't have been worse. The film has already missed its original Eid release before shifting to Independence Day. If the CBFC clearance continues to remain pending, the makers may once again have to rethink their release strategy, resulting in additional financial pressure and a reshuffle of Bollywood's release calendar. The bigger question now is whether Maatrubhumi will eventually secure a straightforward clearance or if it too will have to take the legal route that Jana Nayagan did. Until the CBFC takes a final call, the similarities between the two films are becoming difficult for the industry to ignore. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
విజయ్(vijay),త్రిష(Trisha)కి మధ్య ఉన్న బంధమై ఆ ఇద్దరు నోరుమెదిపిన దాఖలాలు అయితే లేవు. ఇటీవల త్రిష మాత్రం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ' నాకు నచ్చిన వ్యకి ఇంకా దొరకలేదు. దొరకగానే పెళ్లి చేసుకుంటానని చెప్పింది.  ఇక తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేపుతూ ప్రతిపక్ష డీఎంకే పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి, ప్రస్తుత తిరుచెందూర్ శాసనసభ్యుడు అనితా ఆర్. రాధాకృష్ణన్‌ని ముఖ్యమంత్రి   విజయ్, త్రిష విషయంలో  పోలీసులు ఈరోజు అధికారకంగా అరెస్ట్ చేశారు.   విజయ్,త్రిషపై ఒక బహిరంగ సభలో ఆయన చేసిన తీవ్ర అభ్యంతరకర, వ్యక్తిగత వ్యాఖ్యలే ఈ అరెస్టుకి  దారితీశాయి. జూన్ 20వ తేదీన తూత్తుకుడి జిల్లా ఆత్తూరులో దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన ఒక ప్రజా సంక్షేమ కార్యక్రమం మరియు బహిరంగ సభలో రాధాకృష్ణన్ ప్రసంగిస్తూ హద్దులు మీరారు. సినిమా రంగం నుండి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని, వ్యక్తిగత జీవితాన్ని ఎద్దేవా చేస్తూ ఆయన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ బహిరంగ ప్రసంగంలో అనితా రాధాకృష్ణన్ మాట్లాడుతూ.. సీఎం విజయ్ అసెంబ్లీలో దిక్కుతోచని స్థితిలో కనిపిస్తున్నారని, ఒకప్పుడు నటి ఇంటి వద్ద ఎంతో సంతోషంగా గడిపిన వ్యక్తి, ఇప్పుడు ఇలా రాజకీయ ఉచ్చులో చిక్కుకుపోయానా అని లోపల తెగ బాధపడిపోతున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యాపారిగా కస్టమర్ ముఖం చూడగానే అతను అప్పు కోసం వచ్చాడా లేదా వస్తువులు కొనడానికి వచ్చాడా అనేది తాను చెప్పగలనని, అదేవిధంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి ముఖ కవళికలను చూస్తే ఆయన తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు స్పష్టమవుతోందని ఎగతాళి చేశారు. సీఎం విజయ్‌తో పాటు స్టార్ హీరోయిన్ త్రిష పేరును కూడా ఈ వివాదంలోకి లాగుతూ ఆయన చేసిన చౌకబారు వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించాయి. ఈ ప్రసంగంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఆత్తూరు పోలీస్ స్టేషన్‌లో రాధాకృష్ణన్‌పై ఐపీసీ మరియు భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. Also read: Akhil: టాప్ హీరోగా అవతరించబోతున్న అఖిల్ అక్కినేని! అరెస్ట్ భయంతో ఎమ్మెల్యే అనితా రాధాకృష్ణన్ వెంటనే మద్రాస్ హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ (Anticipatory Bail) కోసం పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు ఆయనకు ఎలాంటి ఉపశమనం కలిగించడానికి నిరాకరిస్తూ ముందస్తు బెయిల్ దరఖాస్తును శుక్రవారం ఉదయం పూర్తిగా తిరస్కరించింది. కోర్టు ఆదేశాలు వెలువడిన కొద్దిసేపటికే అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. ఆత్తూరు ప్రాంతంలో ప్రభుత్వ అభివృద్ధి పనులను పరిశీలించడానికి వెళ్లిన ఎమ్మెల్యేను పోలీసులు స్పాట్‌లోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీఎంకే పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి పోలీస్ వాహనాన్ని ముట్టడించి, అరెస్టును అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. టీవీకే (TVK) ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అయినప్పటికీ పోలీసులు సమయస్ఫూర్తితో వ్యవహరించి  అనితా రాధాకృష్ణన్ ని  స్టేషన్‌కి  తరలించారు.  
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'రావు బహదూర్' (Rao Bahadur) థియేటర్లలోకి వచ్చేసింది. నేడు(జూలై 3) విడుదలైన ఈ సైకలాజికల్ ఎమోషనల్ డ్రామా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. ప్రతి సినిమాలోనూ వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే సత్యదేవ్, ఈ చిత్రంలోనూ ఒక సరికొత్త రోల్‌లో పరకాయ ప్రవేశం చేసి ప్రేక్షకులను కట్టిపడేశారు. విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఒక భారీ ఓటీటీ డీల్‌ను క్లోజ్ చేసుకుని ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.  ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో మంచి టాక్ తెచ్చుకుంటున్న ఈ విలక్షణ చిత్రం డిజిటల్ స్క్రీన్‌పై ఎప్పుడు సందడి చేయనుందనే ఆసక్తి ఇటు సినిమా లవర్స్ లోనూ, అటు ఓటీటీ ఆడియన్స్ లోనూ విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా చిత్ర పరిశ్రమలో పెద్ద సినిమాలకు, క్రేజీ ప్రాజెక్ట్‌లకు అనుసరించే 4 నుంచి 6 వారాల విండో రూల్‌ను ఈ సినిమాకు కూడా వర్తింపజేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ థియేట్రికల్ అగ్రిమెంట్ ప్రకారం, జూలై 3న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ చిత్రం సుమారు ఒక నెల రోజుల పాటు బాక్సాఫీస్ రన్ పూర్తి చేసుకున్న తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుంది. ఆ లెక్కన చూసుకుంటే ఆగస్ట్ మూడో వారంలో ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.  Also Read: 'రావు బహదూర్' మూవీ రివ్యూ ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ ల జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో ఏ+ఎస్ మూవీస్, శ్రీచక్ర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై చింతా గోపాలకృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర సంయుక్తంగా నిర్మించారు. 'కేరాఫ్ కంచరపాలెం', 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' వంటి క్లాసిక్ సినిమాలతో టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసుకున్న దర్శకుడు వెంకటేష్ మహా ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం విశేషం. కథ విషయానికి వస్తే, రామప్ప రావు బహదూర్ అనే ఒక రాజవంశపు వారసుడి చుట్టూ ఈ కథ మొత్తం తిరుగుతుంది. అనుమానం పెనుభూతం అన్నట్టుగా.. తీవ్రమైన అనారోగ్యంతో మంచానపడ్డ రామప్ప, తన కుమారుడి పుట్టుకపై అనుమాన పడుతూ నిజానిజాలు తెలుసుకోవాలి అనుకుంటాడు. సత్యదేవ్ తన కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వగా, దీప థామస్, వికాస్ ముప్పాళ్ల, బాలా పరాసర్, ఆనంద్ భారతి, ప్రణయ్ వాక మరియు మాస్టర్ కిరణ్ వంటి నటీనటులు కీలక పాత్రలలో ఒదిగిపోయారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.     Rao Bahadur, Satyadev, Venkatesh Maha, Mahesh Babu, Netflix  
సినిమా ప్రపంచంలోకి వారసులు అడుగుపెట్టడం కొత్తేమీ కాదు. కానీ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కుమార్తె, గ్లామర్ ఫీల్డ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుండడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. తమిళనాడు మాజీ డీజీపీ శంకర్ జివాల్ కుమార్తె దౌదీ జివాల్ ఇప్పుడు వెండితెరపై హీరోయిన్‌గా మెరవబోతోంది. కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి నటిస్తున్న 34వ మైల్‌స్టోన్ చిత్రం 'కరాటే బాబు' ద్వారా ఆమె కథానాయికగా పరిచయమవుతోంది. గతంలో స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ రూపొందించిన 'ఎరిమలయిన్ మగళే' అనే మ్యూజిక్ వీడియోలో నటించి అందరి దృష్టిని ఆకర్షించిన దౌదీ, ఇప్పుడు ఏకంగా ఒక భారీ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 'దాదా' లాంటి సూపర్ హిట్ సినిమాను అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ గణేష్ కె. బాబు తెరకెక్కిస్తున్నారు. స్క్రీన్ సీన్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై నిర్మాత సుందర్ ఆర్ముగం అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జయం రవితో ఈ నిర్మాణ సంస్థకు ఇది 3వ ప్రాజెక్ట్ కావడం విశేషం. గతంలో వీరి కాంబినేషన్‌లో 'అగిలన్', 'బ్రదర్' సినిమాలు వచ్చాయి. 'కరాటే బాబు' కేవలం ఒక సాధారణ రాజకీయ చిత్రం మాత్రమే కాదు, ఒక శాసనసభ్యుడు జీవితంలోని వ్యక్తిగత భావోద్వేగాలు, బంధాలు, సంఘర్షణలను కళ్లకు కట్టేలా దర్శకుడు ఈ కథను మలిచారు. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం నమ్మకంగా చెప్తోంది. తాజాగా ఈ సినిమా అధికారిక థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారైంది. ఎన్నో వారాల సస్పెన్స్, ఊహాగానాలకు తెరదించుతూ మేకర్స్ ఈ సినిమాను ఆగస్టు 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇక్కడే బాక్సాఫీస్ వద్ద ఒక ఆసక్తికరమైన పోరు నెలకొంది. కన్నడ రాకింగ్ స్టార్ యష్ నటించిన అత్యంత ప్రతిష్టాత్మక పాన్-ఇండియా యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టాక్సిక్' ఆగస్టు 26న విడుదల కానుంది. అంటే 'టాక్సిక్' థియేటర్లలోకి వచ్చిన కేవలం 2 రోజుల వ్యవధిలోనే, ఆగస్టు 28న 'కరాటే బాబు' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇలాంటి హై-ప్రొఫైల్ బాక్సాఫీస్ క్లాష్ ఉన్నప్పటికీ, జయం రవి పొలిటికల్ రోల్ మరియు దౌదీ జివాల్ గ్లామర్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేసాయి. ఈ చిత్రానికి రత్నకుమార్, బాకియం శంకర్ సంయుక్తంగా స్క్రీన్‌ప్లే అందించగా, సామ్ సీఎస్ పవర్‌ఫుల్ సంగీతాన్ని సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్ 55 లక్షలకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ సినిమాలో సీనియర్ నటులు నాజర్, కె.ఎస్. రవికుమార్, శక్తి వాసుదేవన్, విటివి గణేష్, కాళీ వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. దిలీప్ సుబ్బరాయన్ మాస్టర్ నేతృత్వంలో యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయని తెలుస్తోంది. మాజీ డీజీపీ కుమార్తె దౌదీ జివాల్ మొదటి సినిమాతోనే ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో, అలాగే జయం రవి ఈ భారీ క్లాష్‌ను తట్టుకుని బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో కలెక్షన్ల వర్షం కురిపిస్తాడో చూడాలంటే ఆగస్టు 28 వరకు ఆగాల్సిందే!     Karathey Babu, Jayam Ravi, Daudee Jiwal, Shankar Jiwal Daughter, Karathey Babu Release Date, Toxic Movie Clash
టెలివిజన్ చరిత్రలో 90వ దశకంలో వచ్చిన 'మర్మదేశం' సీరియల్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. అప్పట్లో ఆ సీరియల్ అందించిన థ్రిల్, భయం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో అలానే నిలిచిపోయాయి. ఇప్పుడు అదే అద్భుతమైన మిస్టరీ, హారర్ వరల్డ్ బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్తగా రూపొందిన రీసెంట్ హారర్ థ్రిల్లింగ్ సిరీస్ 'వీరభద్రుని రహస్యం' (Veerabhadruni Rahasyam). 90ల నాటి క్లాసిక్ భయాన్ని ఇప్పటి జనరేషన్ ప్రేక్షకులకు మరింత ఆసక్తికరంగా పరిచయం చేసేందుకు ఈ సిరీస్ సిద్ధమైంది. సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సరికొత్త వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5 వేదికగా డిజిటల్ స్క్రీన్స్ పైకి వచ్చేసింది. ఈ మైండ్ బ్లోయింగ్ మిస్టరీ సిరీస్ ఏకంగా 60 ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అలరించడానికి ప్లాన్ చేయబడింది. శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమైన ఈ సిరీస్‌ను ఒకేసారి కాకుండా, ప్రేక్షకులలో ఉత్కంఠను మరింత పెంచేలా ప్రతీ వారం రెండు సరికొత్త ఎపిసోడ్స్‌ చొప్పున విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్ టీజర్ మరియు ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ హైప్ క్రియేట్ చేయడమే కాకుండా, వీరభద్రుని చుట్టూ ఉన్న ఆ గూఢ రహస్యం ఏంటో తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచేశాయి.  ఈ సిరీస్‌ను దర్శకుడు భీమగాని శ్రీవర్ధన్ రెడ్డి తెరకెక్కించారు. ఈ ప్రాజెక్ట్‌లో వెన్నెల అనే పవర్‌ఫుల్ పాత్రలో అన్నీ మెరిపించగా, యోగానందగా రఘుకుంచె పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే కార్తికేయగా రఘు, ఎస్సై అభినవ్‌గా రవి, నందగా కమల్ తూము, సింహవల్లిగా శిరీషతో పాటు అనురాధ, బాలచంద్ర, కల్కి కీలక పాత్రల్లో ఒదిగిపోయారు. ఈ కథ మొత్తం వీరభద్రపురం అనే ఒక మారుమూల గ్రామం చుట్టూ తిరుగుతుంది. ఆ ఊరిలో ఒక పెద్ద చెట్టు కింద ఎంతో పురాతనమైన వీరభద్రుని గుడి ఉంటుంది. ఆ గ్రామ పెద్దతో పాటు ఊరి ప్రజలందరూ ఆ స్వామిని తమ కులదైవంగా అమితంగా నమ్ముతుంటారు. కేవలం భక్తి మాత్రమే కాదు, ఆ ఊరిలో ఒక కఠినమైన మూఢనమ్మకం కూడా బలంగా నాటుకుపోయింది. ఊరిలో ఎవరైనా సరే తప్పు చేస్తే ఆ వీరభద్రుడే స్వయంగా వచ్చి శిక్షిస్తాడని అందరూ నమ్ముతారు. ముఖ్యంగా అర్ధరాత్రి వేళ ఆ గుడిలో గంట మోగితే, తప్పు చేసిన వాడి చావు ఖాయమనే భయంకరమైన నమ్మకం అక్కడ ఉంది. సరిగ్గా అదే సమయంలో ఊరిలో వరుసగా కొన్ని దారుణమైన హత్యలు జరుగుతాయి. ఊరి జనం అంతా ఈ చావులకు దైవాగ్రహమే కారణమని భయపడుతుంటే, సిటీ నుండి ఆ ఊరికి వచ్చిన ఒక ఆధునిక భావాలున్న అమ్మాయి మాత్రం ఈ మూఢనమ్మకాలను అస్సలు ఒప్పుకోదు. సైన్స్‌ను నమ్మే ఆమె, ఈ వరుస హత్యల వెనుక దేవుడు లేడని, ఎవరో బలమైన వ్యక్తి ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని గ్రహిస్తుంది. ఈ క్రమంలోనే ఆమె రహస్య విచారణ మొదలుపెడుతుంది. అసలు వీరభద్రుని పేరు చెప్పి ఆ ఊరిలో చంపేస్తోంది ఎవరు? ఆ దారుణ హత్యల వెనుక దాగున్న అసలు సూత్రధారి ఎవరు? వీరభద్రపురం దాచిపెట్టిన ఆ భయంకరమైన రహస్యం ఏంటి? ఆ ఊరి పెద్ద కుటుంబానికి, ఈ వీరభద్రుని గుడికి ఉన్న అసలు లింక్ ఏంటి? అనే అనేక ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న 'వీరభద్రుని రహస్యం' సిరీస్ చూడాల్సిందే.     Veerabhadruni Rahasyam, Web Series, Marmadesam, OTT, ZEE5  
  సినిమా సైతం తన ఒడిలో పలానా హీరో టాప్ రేంజ్ లో ఉండాలని ఆశపడుతోంది. అలాంటి వాళ్ళల్లో అఖిల్ ఒకడు.  అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున వారసుడిగా తను టాప్ రేంజ్ లో ఉండాలని అభిమానులు కూడా కోరుకుంటారు. కానీ అఖిల్  కెరీర్ మొదటి నుండి ఒడిదుడుకులతోనే సాగుతోంది. భారీ అంచనాలతో వచ్చిన 'అఖిల్' మొదలుకొని, గతేడాది విడుదలైన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఏజెంట్' వరకు సరైన  బ్రేక్ రాలేదు. ముఖ్యంగా దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన 'ఏజెంట్' చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈ పరాజయం తర్వాత అఖిల్ కెరీర్‌లో పెద్ద గ్యాప్ వచ్చింది. అయితే  కథల ఎంపికే కాకుండా, ఒక దురదృష్టకర ప్రమాదం కూడా గ్యాప్ కి కారణమని అఖిల్ స్వయంగా ప్రకటించాడు.ఇప్పుడు జూలై 10   'లెనిన్' తో సెల్యులాయిడ్ పై లాండ్ కాబోతుండటంతో  అభిమానులు లెనిన్ పై కొండంత ఆశలు పెట్టుకున్నారు. 'లెనిన్' చిత్రం అఖిల్ కెరీర్‌ను మలుపు తిప్పి, అతడిని టాలీవుడ్ టాప్ హీరోల లీగ్‌లో నిలబెడుతుందా అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇటీవల విడుదలైన 3 నిమిషాల నిడివి గల 'లెనిన్' ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. "ప్రేమ కంటే హింసాత్మకమైన యుద్ధం మరొకటి లేదు" అనే కాన్సెప్ట్‌తో, మహాభారత కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రస్తుత కాలానికి ముడిపెడుతూ డైరెక్టర్ కథని  అద్భుతంగా ఆవిష్కరించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. లెనిన్ తో  అఖిల్  మాస్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాడని నాగార్జున స్వయంగా ట్విట్టర్ వేదికగా భరోసా ఇవ్వడంతో పాటు   అవుట్‌పుట్ 100 శాతం పర్ఫెక్ట్‌గా రావడం కోసమే విడుదల తేదీని జూన్ 26 నుండి జూలై 10 కి వాయిదా వేసినట్లుగా కూడా తెలిపారు. బాక్సాఫీస్ ట్రెండ్స్ ప్రకారం, ఈ చిత్రం కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే అఖిల్ అక్కినేని మార్కెట్ వాల్యూ భారీగా పెరుగుతుంది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్ సినిమాలకి  తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ మంచి క్రేజ్ ఉంటుంది, పైగా థమన్ మాస్ సాంగ్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్  ప్రధాన బలం కానున్నాయి. అఖిల్ తన లుక్, డైలాగ్ డెలివరీ మరియు యాక్షన్ సీక్వెన్సెస్‌లో సరికొత్త మేకోవర్ చూపించడంతో కమర్షియల్ సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  Also read: కథ, కథనాన్ని గాలికి వదిలేసి విజువల్స్ వెంట పడటం కరెక్టేనా! టాలీవుడ్‌లో టాప్ లీగ్‌కి వెళ్లడానికి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ 'లెనిన్' లో పుష్కలంగా ఉన్నాయి. మరి జూలై 10 న థియేటర్లలోకి రాబోతున్న లెనిన్ అఖిల్ కల నెరవేర్చి, ఆయన్ను టాప్ హీరోల సరసన నిలబెడుతుందో లేదో చూడాలి. 'వినరో భాగ్యము విష్ణుకథ' ఫేమ్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకుడు కాగా టాలెంటెడ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మనం ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు.    akhil akkineni lenin movie update, lenin movie update, akhil about lenin  
ఆంధ్రప్రదేశ్‌లో యూట్యూబర్ బచలకురి జోసెఫ్ అలియాస్ ‘ప్రశ్న’ రావణ్ అరెస్ట్ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ విధానాలపై, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడులపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో జూన్ 30న హైదరాబాద్‌లో పిఠాపురం పోలీసులు రావణ్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పిఠాపురం కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసినప్పటికీ, సర్పవరం పోలీసులు 2025 నాటి పాత కేసును తెరపైకి తెచ్చి వెంటనే రెండోసారి అరెస్ట్ చేశారు. ఆ కేసులోనూ కోర్టు రిమాండ్ తిరస్కరించి పర్సనల్ బాండ్‌పై జూలై 2న బెయిల్ ఇచ్చినప్పటికీ, కృష్ణా జిల్లా మచిలీపట్నం ఇనగుదురు పోలీసులు మూడో కేసులో అతడిని మళ్లీ అదుపులోకి తీసుకున్నారు. ఇలా వరుసగా 3 సార్లు అరెస్ట్ కావడం, కోర్టులు బెయిల్ ఇస్తున్నా విడిచిపెట్టకుండా వేరే ప్రాంతాల పోలీసులు స్టేషన్ల చుట్టూ తిప్పడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. జనసేన శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంపై జాతీయ అవార్డు గ్రహీత, ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, పోలీసుల తీరుపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు. "ఈ సిగ్గులేని కక్షసాధింపు చర్యలు దేనికి?" అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. న్యాయస్థానాలు ఒక కేసులో తప్పులేదని భావించి బెయిల్ ఇస్తుంటే, వెంటనే మరో పాత కేసునో, కొత్త కేసునో పెట్టి జైలుకు పంపడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఆయన మండిపడ్డారు. ప్రశ్న రావణ్‌ను కస్టడీలో ఉంచేందుకు ఏకంగా 30 కేసులు సిద్ధం చేశారని వింటున్నానని, మరి ఇంతలా కక్ష సాధిస్తూ అధికార బలాన్ని ఎక్కడివరకు తీసుకెళ్తారని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో విమర్శించే గొంతులను ఈ విధంగా అణచివేయడం సరికాదని, పాలకులు చేస్తున్న ఈ తప్పులన్నింటినీ ప్రజలు గమనిస్తున్నారని ప్రకాశ్ రాజ్ హెచ్చరించారు. కేవలం సోషల్ మీడియాలో మాట్లాడినందుకు ఒక వ్యక్తిని ఈ విధంగా వేధించడం శోచనీయమని, ఇప్పటికైనా ఈ రాజకీయ వేధింపులు ఆపి, ప్రశ్న రావణ్‌ను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ అరెస్టుల వెనుక ఉన్న రాజకీయ ప్రతీకారంపై నెటిజన్ల నుంచి కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.       Prakash Raj, Prashna Raavan Arrest, AP Police, Youtuber Joseph Ravan, Pawan Kalyan, Chandrababu Naidu
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల  ప్రకటనకు సమయం ఆసన్నమైంది. 2024 సంవత్సరంలో విడుదలైన వైవిధ్యభరితమైన భారతీయ చిత్రాలకు గానూ నేడు ఈ అవార్డుల అనౌన్స్‌మెంట్ రానుంది. అయితే ఈ అవార్డుల రేసులో ఎన్నో కేటగిరీలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం యావత్ సినీ ప్రపంచం దృష్టి మరియు సోషల్ మీడియా చర్చలు మొత్తం 'బెస్ట్ యాక్టర్' కేటగిరీపైనే కేంద్రీకృతమయ్యాయి. దీనికి ప్రధాన కారణం, ఈ ప్రతిష్ఠాత్మక రేసులో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు ప్రముఖంగా వినిపించడమే. పుష్ప సినిమాతో ఇప్పటికే జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, మరోసారి ఈ అవార్డును దక్కించుకుంటారా లేదా అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా అల్లు అర్జున్‌కి ఈసారి అవార్డు రావడం కష్టమేనంటూ ఒక ఆసక్తికరమైన కోణంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా ప్రముఖ సౌత్ ఫిల్మ్ మేకర్ జయరాజ్ వ్యవహరిస్తున్నారు. జ్యూరీ ఛైర్మన్ జయరాజ్ మలయాళీ కావడంతో, ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డు ఖచ్చితంగా మలయాళ చిత్ర పరిశ్రమకే దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. మలయాళ ఇండస్ట్రీ నుండి ఈ ప్రతిష్ఠాత్మక రేసులో ఇద్దరు దిగ్గజ నటులు గట్టి పోటీ ఇస్తున్నారు. 'భ్రమయుగం' సినిమాలో తన అద్భుత నటనతో మెప్పించిన మెగాస్టార్ మమ్ముట్టి, 'ది గోట్ లైఫ్' (ఆడుజీవితం) చిత్రంలో నటించిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ అవార్డు కోసం ప్రధాన పోటీదారులుగా నిలిచారు. వీరిద్దరిలో ఒకరికే, ముఖ్యంగా మమ్ముట్టికే ఈసారి ఉత్తమ నటుడి అవార్డు ఖరారు కావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టి ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కనుక ఈసారి బెస్ట్ యాక్టర్ అవార్డును గెలుచుకుంటే, అది టాలీవుడ్ చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమ నుండి ఏ ఒక్క నటుడు కూడా రెండు సార్లు జాతీయ ఉత్తమ నటుడి అవార్డును అందుకోలేదు. భారతదేశంలో అత్యధికంగా అమితాబ్ బచ్చన్ 4 సార్లు ఈ అవార్డు సాధించగా.. షబానా అజ్మీ, కమల్ హాసన్, మమ్ముట్టి, అజయ్ దేవగన్ లాంటి దిగ్గజాలు 3 సార్లు జాతీయ పురస్కారాన్ని ముద్దాడారు. ఒకవేళ అల్లు అర్జున్ ఈ ఘనత సాధిస్తే, రెండు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న ఏకైక టాలీవుడ్ హీరోగా చరిత్ర సృష్టిస్తారు. అయితే ఈ రేసు కేవలం సౌత్ హీరోల మధ్యే కాదు, బాలీవుడ్ నుండి అజయ్ దేవగన్, కార్తీక్ ఆర్యన్ కూడా ఉత్తమ నటుడి పోటీలో నిలిచి సస్పెన్స్‌ను మరింత పెంచుతున్నారు. జ్యూరీ తుది నిర్ణయం ఎలా ఉంటుందో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.       72nd National Film Awards, Allu Arjun Best Actor Race, Mammootty Bramayugam, Prithviraj Sukumaran The Goat Life, Jury Chairman Jayaraj, National Awards Telugu Updates
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు వాడమని చెబుతారు.  అయితే.. తన దగ్గరకు వచ్చిన రోగులకు జాగ్రత్తలు  చెప్పడానికి ముందు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు, మంచి అలవాట్లు ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే వారి మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం అనేది తొందరగా లభించేది కాదు.. అది రోజువారీ మంచి అలవాట్ల ద్వారా నిదానంగా సొంతమవుతుంది.  వైద్యులు తమ రోజువారీ జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్లు ఉన్నాయి.  వీటిని అందరూ పాటించవచ్చు.  ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. దీని వల్ల వైద్యుల లాగే ఓర్పు, సహనం వంటివి పెరుగుతాయి. ప్రతి ఏడాది డాక్టర్స్ దినోత్సవాన్ని జూలై 1 వ తేదీన జరుపుకుంటారు.  ఈ సందర్బంగా వైద్యులు పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుంటే.. నిద్ర.. ప్రతిఒక్కరికి కనీసం ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. "సమయానికి నిద్రపోవడం ద్వారా శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.  దీని వల్ల ఒత్తిడి  తగ్గుతుంది,  రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.  మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.   బ్లూ లైట్.. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్‌లు, కంప్యూటర్‌లు , ఇతర ఎలక్ట్రానిక్స్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతిని నివారించాలి. ఆహారం..  కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ వనరులు, ఆరోగ్యకరమైన కొవ్వులు , అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది. డిన్నర్ టైం.. రాత్రి భోజనాన్ని త్వరగా తినడం ఎంతో మంచిది.  రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించడం వల్ల శరీరానికి రాత్రంతా విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రాసెస్ ఆహారాలు.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరతో నిండిన డెజర్ట్‌ల విషయంలో చాలా మంది కంట్రోల్ గా ఉండలేరు. కానీ వాటిని నివారించడానికి  తీపి తినాలని అనిపించినప్పుడు, చక్కెరతో నిండిన ప్రాసెస్ చేసిన డెజర్ట్‌ల వైపు వెళ్లకుండా ఆయా కాలాల్లో లభించే తాజా పండ్లు తినడం, ఖర్జూరం,  డ్రై ప్రూట్స్ వంటి తినడం వల్ల తీపి తిన్న ఫీల్ వస్తుంది. ఆరోగ్యానికి పోషకాలు కూడా అందుతాయి. భోజనం ట్రిక్.. భోజనం తినే ముందు  కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ తినడం వల్ల, ఎక్కువ ఆహారం తినకుండానే కడుపు నిండుతుంది.  దీనివల్ల ఆహారం అతిగా తినడం నివారించవచ్చు.  భోజనానికి కనీసం 20 నిమిషాల ముందు సలాడ్‌ తినడం చాలా మంచిది. చురుగ్గా ఉండాలి.. లైఫ్ స్టైల్ చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  క్రమం తప్పకుండా కార్డియోవాస్కులర్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే వ్యాయామం వల్ల ఓర్పు కూడా పెరుగుతుంది.   స్ట్రెంత్ ట్రైనింగ్.. క్రమం తప్పకుండా శరీరాన్ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఫుషప్స్,  బైసెప్స్ తో పాటు ఇతర స్ట్రెంట వ్యాయామాలు కూడా శరీరం బలంగా మారడానికి సహాయపడుతుంది.  ఇవి కండరాలు బలంగా మారడానికి సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వైద్యులకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం,యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేస్తారు.   రిలేషన్స్.. వైద్యులు కేవలం సమాజం కోసం మాత్రమే కాదు.. తమ కోసం తాము కూడా బ్రతకాలి.  వారికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం,  సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడం వంటివి వారు వృత్తిలో రాణించడానికి సహాయపడతాయి. కనీసం రోజుకు గంట సేపు అయినా కుటుంబంతో సంతోషంగా గడపడం చాలా ముఖ్యం. పైన చెప్పుకున్నవన్న ఎంతో మందివైద్యులు తప్పకుండా తమ జీవితంలో రోజూ పాటించే అలవాట్లు. ఇవి సాధారణ వ్యక్తులు కూడా పాటించవచ్చు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి. అప్పుడే వారు వృత్తికి సరైన న్యాయం చేయగలరు.                                       *రూపశ్రీ.
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే.. జీతం.. ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు. పెళ్ళెప్పుడు.. పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు. వయసు.. వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది. పిల్లలు.. భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.                                 *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆడవారిలో గర్బం నిలవకపోవడం లాగానే.. మగవారిలో వీర్యకణాల సమస్య వంటివి పిల్లలు పుట్టడంలో ఆటంకాలు కలిగిస్తాయి. కొందరికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొందరికి వీర్యం సరిగా ఉత్పత్తి కాకపోవడం లాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. అయితే మగవారిలో కొన్ని  అలవాట్లు వారిలో సంతాన అవకాశాలు తగ్గించేస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వేడి అసలు కారణం.. జీవశాస్త్రపరమైన కారణం వల్ల వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని వైద్యులు చెబుతారు. వీర్య కణాల ఉత్పత్తి ఉత్తమంగా జరగాలంటే , వృషణాల ఉష్ణోగ్రత శరీర అంతర్గత ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 4°C తక్కువగా ఉండాలట. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం కొద్దిగా తగ్గినా కూడా, అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వీర్య కణాలను ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం జరుగుతుందట. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, వీర్యకణాల DNA దెబ్బతింటుందట. భారతీయ పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి వేడికి గురికావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ్య కారణాలని చెబుతున్నారు. ఒడిలో ల్యాప్టాప్.. చాలా మంది మగవాళ్లు ల్యాప్‌టాప్‌ను నేరుగా తమ తొడలపై ఉంచుకుని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలక్రమేణా వృషణాల ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచడానికి దారితీస్తుంది. కానీ వేడి ఒక్కటే సమస్య కాదు, ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం , ఫోన్‌ను ప్యాంటు జేబులో ఉంచుకోవడం వల్ల విద్యుదయస్కాంత వికిరణానికి గురై పిల్లలు పుట్టడంలో సమస్యలు   పెరగవచ్చట. లోదుస్తులు, జీన్స్..  బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించే పురుషులతో పోలిస్తే, వదులుగా ఉండే బాక్సర్ షార్ట్స్ ధరించే పురుషులలో మొత్తం వీర్య కణాల సంఖ్య 17% ఎక్కువగా , చురుకుగా ప్రయాణించే వీర్య కణాలు 33% ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. స్కిన్నీ లేదా బిగుతుగా ఉండే జీన్స్ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆయన ఇంకా తెలిపారు. అవి రోజంతా వృషణ ప్రాంతాన్ని శరీరానికి దగ్గరగా నొక్కి ఉంచుతాయి, దీనివల్ల వేడి లోపలే నిలిచిపోయి, శరీరం  ఉష్ణోగ్రత నియంత్రణకు అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడూ అవే ధరించడం వల్ల, కాలక్రమేణా ఈ ప్రభావం పెరిగి సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. సహాయపడే మార్పులు.. వదులుగా ఉండే బాక్సర్ షార్ట్‌లకు మారడం,  ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది.  ల్యాప్‌టాప్‌ను  ఒడిలో కాకుండా బల్లపై ఉంచుకోవడం మంచిది. వేడి ప్రాంతాలలో ఎక్కువ సేపు గడపకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది.                            *రూపశ్రీ.
 నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం  మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.    కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా..  ఈ రెండింటిలో  గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది?  తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ  ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో  చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది.  జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.  తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను  కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా  కార్డియో వ్యాయామాలు చేస్తే  గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను  కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే  యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.  అయితే యోగా  గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక  విధాలుగా కూడా  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా  ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని  మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు.  ఈ విషయాన్ని ఆరోగ్య  నిపుణులే చెబుతున్నారు.  ఆరోగ్య  నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి  కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి  తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని  గుండె ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.  ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్  ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్,  కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని ,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                       *రూపశ్రీ.