LATEST NEWS
ప్రముఖ ఆథ్యాత్మిక క్షేత్రం శ్రీశైలంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. శంకర్ అనే కానిస్టేబుల్ ఆత్మహత్య చేనుకున్నారు. మృతుడు శంకర్ శ్రీశైలం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ విశ్రాంతి గదిలో ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే సీఐ ప్రసాద్ రావు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు స్పందిస్తూ... శ్రీశైలంకు వెళ్తున్నానని, అక్కడకు వెళ్లిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తానని చెప్పారు. శంకర్ సూసైడ్ తో అక్కడ విషాదకర వాతావరణం నెలకొంది.  మృతుడు రక్తపుమడుగులో పడి ఉన్న ఘటనను పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలయలేదు. సమాచారం అందుకున్న సీఐ ప్రసాద్‌రావు అక్కడికి చేరుకొని ఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం విచారణ చేస్తున్నారు. ఆత్మకూరు డీఎస్పీ శ్రీనివాసరావు శ్రీశైలం చేరుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. 
ఏపీలో పోలింగ్ పూర్తయ్యింది. ఓటరు తీర్పు సురక్షితంగా ఈవీఎంలలో నిక్షిప్తమైంది. ఈవీఎంలు మరింత భద్రంగా స్ట్రాంగ్ రూమ్ లలో ఉన్నాయి. పోలింగ్ పూర్తై మూడు రోజులు గడిచినా రాష్ట్రంలో మాత్రం ఇంకా హై టెన్షన్ వాతావరణం అలాగే ఉంది. రాష్ట్రంలోని పల్నాడు, రాయలసీమలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. దాడులు, ప్రతి దాడులతో రగిలిపోతున్నాయి. సాధారణంగా పోలింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు నెలకొనడం ఆ తరువాత చల్లారిపోవడం సహజమే. అయితే ఈ సారి మాత్రం పోస్ట్ పోల్ హింస పెచ్చరిల్లుతోంది.  గత ఎన్నికల కంటే రెండు శాతానికి మించి అధికంగా పోలింగ్ జరగడం అధికార వైసీపీలో ఆందోళనకు కారణమైంది. అందుకే ఉదయం చెదురుమదురు సంఘటనలు వినా ప్రశాంతంగా సాగిన పోలింగ్ మధ్యాహ్నానికి వైసీపీ మూకలు చెలరేగిపోవడంతో  హింసాత్మకంగా మారింది. పోలింగ్ సరళిని బట్టి ఆందోళనకు గురైన వైసీపీ అధినాయకత్వం నుంచి వచ్చిన స్పష్టమైన ఆదేశాలతోనే వైసీపీ మూకలు పోలింగ్ సజావుగా జరగకుండా, ఓటర్లు ధైర్యంగా క్యూలలో నిలబడి ఓటు వేసే పరిస్థితి లేకుండా చేయడానికి ప్రయత్నించాయన్నది పరిశీలకులు విశ్లేషణ. సరే మళ్లీ అదే పరిశీలకులు హింసాకాండకు బెదరకుండా ఓటర్లు ధైర్యంగా, ఓపికగా క్యూలైన్లలో వేచి ఉండి మరీ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారనీ, ఇదే వారిలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత తీవ్ర స్థాయిలో ఉందో తెలియజేస్తోందని కూడా చెప్పారు. . అదే పోలింగ్ సరళి తెలుగుదేశం శ్రేణుల్లో ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసిం ది. ఇక అధికార పార్టీ ఆగడాలను మౌనంగా భరించనవసరం లేదన్న ధైర్యాన్ని నింపింది. పోలింగ్ తరువాత పల్నాడు, రాయల సీమలో  వైసీపీ నేతల దౌర్జన్యాలను ఎదుర్కోవడంలో తెలుగుదేశం శ్రేణులు నిర్భీతిగా ముందుకు కదలడానికి అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అదే సమయంలో పోలింగ్ తమకు వ్యతిరేకంగా జరిగిందని వైసీపీ కీలక నేతలు, కొందరు అభ్యర్థులూ మీడియా ముందు అంగీకరిస్తున్నారు. పోలీసులు తెలుగుదేశం కూటమికి అన్నివిధాలుగా మద్దతుగా నిలిచారనీ, తమను మాత్రం ఎక్కడికక్కడ నియంత్రించారనీ అంబటి, సజ్జల వంటి వారు ఆరోపణలు గుప్పించారు. సజ్జల అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలుగుదేశం కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం పని చేసిందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మాటలన్నీ వైసీపీలోని ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతున్నాయి. అలాగే వైసీపీ అడ్డాలుగా చెప్పబడే ప్రాంతాలలో పోలింగ్ అనంతర హింసాకాండను నిలువరించడంలో పోలీసులు ప్రేక్షక పాత్ర వహించినా తెలుగుదేశం కేడర్ ధైర్యంగా నిలబడి అడ్డుకోవడం ఆయా ప్రాంతాలలో మారిన రాజకీయ పరిస్థితికి అద్దం పడుతోంది. వైసీపీ కంచుకోటలను ఓటర్లు బీటలు వారేగా చేశాయనడానికి ఇదే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక ఎన్నికల తరువాత ఆ పార్టీ అధినేత జగన్ తీరు క్యాడర్ లో ఉత్సాహాన్ని చంపేసింది. ఆయన పూర్తిగా మౌనముద్రలోకి వెళ్లిపోవడం, రేపో మాపో విదేశీ పర్యటనకు రెడీ అయిపోవడంతో క్యాడర్ లో విశ్వాసం సన్నిగిల్లింది.  ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. రాష్ట్రంలో హింసాకాండను ఖండించాల్సిన బాధ్యత కలిగిన హోదాలో ఉన్నారు. అయినా ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రాలేదు. ఎందుకీ మౌనం అంటూ జగన్ ను వైసీపీ క్యాడర్ నిలదీస్తోంది. ఎన్నికల సమయంలో కష్టపడి పని చేసిన క్యాడర్ కు ఓదార్పు కలిగేలా ఒక్క మాట కూడా మాట్లాడకపోవడమేమిటన్న చర్చ పార్టీ వర్గాల్లోనే జరుగుతోంది.  మరోవైపు విపక్ష నేత చంద్రబాబు ఎన్నికల హింసను ఖండిస్తూ.. సాధారణ పరిస్థితులు నెలకొనేలా చేసేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఎన్నిలక సంఘానికి లేఖ రాశారు. కానీ జగన్ వైపు నుంచి అటువంటిదేమీ లేదు.  ఇదే ఆయనలోని నైరాశ్యానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కనీసం క్యాడర్ లో ధైర్యాన్ని, స్థైర్యాన్నీ నింపడానికైనా విజయం మనదే అన్న భరోసా ఇవ్వడానికి కూడా జగన్ ముందుకు రాలేదంటే ఫలితంపై ఆయన అభిప్రాయం ఏమిటన్నది అవగతమైపోతోందంటున్నారు.  ఇక జగన్ మౌత్ పీస్ లాంటి సజ్జల బెట్టింగులకు పాల్పడి ఆర్థికంగా నష్టపోకండి అంటూ వైసీపీ క్యాడర్ కు  సలహాలిస్తూ మన సీన్ అయిపోయిందన్న సంకేతాలిస్తున్నారు. 
 ఎపిలో సార్వత్రిక ఎన్నికల్లో భారీగా పోలింగ్ జరగడంతో వైసీపీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహ నెలకొంది.      ప్రభుత్వ వ్యతిరేక ఓటు టిడిపికి పడినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్న నేపథ్యంలో కృష్ణ జిల్లా టిడిపి శ్రేణులకు చేదు వార్త ఇది.  కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు గుండెపోటు రావడంతో... కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందవద్దని కుటుంబ సభ్యులు తెలిపారు. కొనకళ్ల గుండెపోటుకు గురయ్యారన్న వార్తతో ఆయన అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత నారా లోకేశ్ ఆరా తీసినట్టు సమాచారం. 2009, 2014లో మచిలీపట్నం నుంచి టీడీపీ తరపున కొనకళ్ల ఎంపీగా రెండు సార్లు గెలుపొందారు. 2019లో అక్కడి నుంచే పోటీ చేసి వైసీపీ అభ్యర్థి బాలశౌరి చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో కొనకళ్లకు టికెట్ దక్కలేదు. వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలశౌరి కూటమి తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బాలశౌరితో పాటు కూటమి అభ్యర్థుల తరపున కొనకళ్ల పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
వైసీపీలో  నైరాశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. గెలుపుపై ఆశలు ఇసుమంతైనా కనిపించడం లేదు. పార్టీ అధినేత జగన్ నుంచి, ఆ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల వరకూ అందరూ మౌనముద్రలోకి వెళ్లిపోయారు. అంబటి వంటి ఒకరిద్దరూ, ఇంత కాలం పార్టీకీ, ప్రభుత్వానికీ  సలహాలిచ్చిన సజ్జల మాత్రం ఎన్నికల సంఘంపైనా, పోలీసులపైనా విమర్శలు గుప్పిస్తూ ఓటమికి కారణాలు వెతుక్కునే పనిలో పడ్డారు. ఇక  అవసరమున్నా లేకున్నా విపక్షంపై నోరేసుకు పడిపోయే రోజా, కొడాలి వంటి వారు ఆశ్చర్యకరంగా మౌనముద్రలోకి వెళ్లిపోయారు. పోలింగ్ రోజున తనకు సొంత పార్టీ వారే వ్యతిరేకంగా పని చేశారంటూ ఆరోపణలకు గుప్పించిన రోజా ఆ తరువాత మీడియా ముందుకు వచ్చిన దాఖలాలు లేవు. ఇక కొడాలి నాని అయితే పోలింగ్ రోజున తీరిగ్గా ఎప్పుడో సాయంత్రం వచ్చి కుటుంబంతో సహా ఓటేసి వెళ్లిపోయారు. ఎక్కడా ఎన్నికల తీరు గురించి మాట్లాడలేదు. తన విజయంపై ధీమా వ్యక్తం చేయలేదు. ఇక గన్నవరం ఎమ్మెల్యే వంశీ అయితే పోలింగ్ రోజున ఏదో హల్ చల్ చేయాలని ప్రయత్నించి భగంపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయినా ఆయనైతే పోలింగ్ కు ముందే ఇవే తన చివరి ఎన్నికలు, వచ్చే ఎన్నికలలో పోటీ చేయను అని ప్రకటించేసి ముందుగానే గెలుపు ఆశలు వదిలేసుకున్నారు.  దీంతో ఇప్పుడు రాష్ట్ర మంతటా వైసీపీ ఫైర్ బ్రాండ్ బ్యాచ్ గా పేరుపడ్డ ఈ నలుగురిపైనే చర్చ జరుగుతోంది. వీరి పరిస్థితి ఏమిటి? గెలుపా? ఓటమా? అన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది.  ఆ ఫైర్ బ్రాండ్ బ్యాచే  కొడాలి నాని, ఆర్కే రోజా, అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ. అనిల్ కుమార్ యాదవ్ వంటి వారు కూడా ఉన్నప్పటికీ, పార్టీ అధినేతే వారి గెలుపు చీటీ చింపేసి నియోజకవర్గం మార్చేశారు కనుక అటువంటి వారిపై పెద్దగా చర్చ జరగడం లేదు.   తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వీరు వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు. జగన్ మీద ఈగ వాలితే ఆ ఈగను కూడా చంద్రబాబే పంపించారు అనే స్థాయిలో విరుచుకుపడేవారు. అటువంటి ఈ నలుగురూ ఈ సారి తమతమ నియోజకవర్గాలలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నారని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.  ముందుగా కొడాలి నాని విషయానికి వస్తే ఆయన గుడివాడ నియోజకవర్గం నుంచి 2004నుంచి వరుసగా గెలుస్తూ వచ్చారు. మొదటి రెండు సార్లే తెలుగుదేశం అభ్యర్థిగా, ఆ తరువాత రెండు సార్లూ వైసీపీ అభ్యర్థిగా ఆయన విజయం సాధించారు.  జగన్  తొలి క్యాబినెట్ లో మంత్రిగా కూడా ఉన్నారు. అటువంటి నాని ఈ సారి గుడివాడలో విజయం సాధించే అవకాశాలు దాదాపు మృగ్యమనే చర్చ వైసీపీ లోనే జరుగుతోంది.  ప్రభుత్వ వ్యతిరేకతకు, నాని వ్యవహారశైలి, ఆయన అనుచిత భాషా ప్రావీణ్యంతోడైందనీ, అందుకే ఆయనకు నియోజకవర్గంలో గడ్డు పరిస్థితి ఎదురైందని అంటున్నారు.  ఇక రోజా విసయానికి వస్తే ఆమె నగరి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికలలో విజయం సాధించారు. జగన్ మలి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్నారు.   అయితే ఈ సారి మాత్రం ఆమె విజయం అంత సులువు కాదని అంటున్నారు. ప్రభుత్వ వ్యతిరేకతకు తోడు ఆమె వ్యవహారశైలి కారణంగా సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉండటంతో ఆమె విజయానికి పార్టీ పరంగా నగరిలో సహకారం కరవైందని అంటున్నారు. అంతే కాకుండా సొంత పార్టీ నేతలే తెలుగుదేశంకు అనుకూలంగా పని చేశారని అంటున్నారు. వేరే ఎవరో అనడం కాదు, పోలింగ్ రోజున స్వయంగా రోజాయే ఆ విషయం చెప్పి తన ఓటమిని పరోక్షంగానైనా ముందే అంగీకరించేశారు.   ఇక అంబటి రాంబాబు విషయానికి వస్తే సత్తెన పల్లిలో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది.  ఆయన వ్యవహారశైలి, ఇష్టారీతిగా నోరు పారేసుకునే విధానం కారణంగా సొంత పార్టీలోనే ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం అయ్యిందంటున్నారు. ఇక ఆయన కూడా పోలీసులు, ఈసీ తెలుగుదేశం కూటమికి అనుకూలంగా పని చేశాయని ఆరోపణలు గుప్పించి, తన ఓటమిని తానే చాటుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఇక చివరిగా గన్నవరం వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ విషయానికి వస్తే... తెలుగుదేశం అభ్యర్థిగా 2019లో విజయం సాధించిన వంశీ ఆ తరువాత వైసీపీ గూటికి చేరిపోయారు. చేరి ఊరుకోకుండా గన్నవరం తెలుగుదేశం శ్రేణులపై వేధింపులకు పాల్పడ్డారు. పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. ఈ సారి ఎన్నికల నామినేషన్ సందర్భంగానే వంశీ పట్ల నియోజకవర్గంలో ఉన్న వ్యతిరేకత ఏమిటన్నది గోచరమైంది. ఆయన నామినేషన్ ర్యాలీ నామ్ కే వాస్తేగా జరిగింది. పార్టీ శ్రేణులు కూడా దాదాపు ముఖం చాటేశాయని అప్పట్లో గట్టిగా వినిపించింది. మొత్తం మీద ఈ సారి వంశీ గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయమే వ్యక్తం అవుతోంది. 
సజ్జల రామకృష్ణారెడ్డి వాస్తవాలు చెప్పేస్తున్నారు. సూటిగా కాకున్నా సూచనలు, సలహాలంటూ రాష్ట్రంలో వైసీపీ మరో సారి అధికారం చేపట్టే అవకాశం లేదని పార్టీ క్యాడర్ ను ముందుగానే ప్రిపేర్ చేస్తున్నారు. గెలుపు ఓటములపై బెట్టింగులకు పాల్పడి నష్టపోవద్దంటూ పార్టీ కార్యకర్తలకు సూచలను ఇస్తున్నారు. సలహాలు చెబుతున్నారు. తద్వారా వైసీపీ గెలిచే అవకాశాలు మృగ్యమని వారికి సంకేతాలు పంపిస్తున్నారు. అదే సమయంలో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగలేదనీ, పోలీసులు తెలుగుదేశం కూటమికి కొమ్ము కాశారని ఆరోపణలు గుప్పిస్తున్నారు. సాధారణంగా పోలీసులు అధికారంలో ఉన్న తమకు కాకుండా విపక్ష కూటమికి కొమ్ము కాసారని చెప్పడం అంటే తమకు ఓట్లు పడలేదని అంగీకరించడమేనని, ఇలాంటి మాటలన్నీ సాధారణంగా ఓడిపోయే పాటి.. సాకులు వెతుక్కునే ప్రయత్నంగా చెబుతుందనీ రాజకీయ పండితులు అంటున్నారు.  అయితే సజ్జల అక్కడితో ఊరుకోకుండా పరిస్థితులను చూస్తుంటే ఓట్ల లెక్కింపు కూడా సక్రమంగా జరుగుతుందని అనిపించడం లేదంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మాటలు చెప్పడానికి ముందు వరకూ, అంటే పోలింగ్ కు ముందు వరకూ కూడా ఎన్నికల ప్రక్రియ అంతా తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి సజ్జల, వైసీపీ చేయని ప్రయత్నాలు లేవు. అవి ఫలించలేదని పోలింగ్ ప్రక్రియను గమనించిన వారికి స్పష్టంగానే అర్ధమైపోతోంది. ఇంకా అర్ధం కాని వారు ఎవరైనా ఉంటే వారికి అర్ధమయ్యేలా సజ్జల చెబుతున్నారు.  ఇన్ని ఆరోపణలు, నిష్టూరాలూ వేస్తూ ఎన్నికల ప్రక్రియ సరిగా జరగలేదనీ, ఎన్నికల సంఘం, పోలీసులు విపక్ష తెలుగుదేశం కూటమికి వత్తాసు పలికారనీ ఆరోపణలు గుప్పిస్తున్న సజ్జల చాలా జిల్లాల్లో అధికారులు చాలా వరకూ వైసీపీకే కొమ్ముకాసిన విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారు. అయినా  అధికార పార్టీ అయి ఉండీ దాడులకు వైసీపీ తెగపడిందంటేనే ఆ పార్టీకి గెలిచే అవకాశం లేదన్న విషయం పోలింగ్ రోజే స్పష్టమైపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు ఓటమికి సాకులు వెతుక్కునే క్రమంలో ఎన్నికల సంఘంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. తెలుగుదేశం ఆఫీసు నుంచి వచ్చిన ఆదేశాలను ఎన్నికల సంఘం అమలు చేసిందనీ, ఆ పార్టీ ఎలా చెబితే అలా వ్యవహరించిందనీ ఆరోపిస్తున్నారు.  ఓటమిని అంగీకరించడానికి ఇంత కన్నా ఇంకా చెప్పాల్సింది ఏముందని పరిశీలకులు అనడమే కాదు. వైసీపీ క్యాడర్ కూడా ఇదే విషయాన్ని చర్చించుకుంటోంది. ఎన్నికల్లో ఓడిపోతున్నామని చెప్పడానికి ఇంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని వైసీపీ నేతలు కూడా గుసగుసలాడుకుంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
రష్మిక (rashmika) సినీ ప్రయాణం ఇప్పుడు మంచి జోరు మీద ఉంది. వరుసగా హిట్ లు మీద హిట్ లు కొడుతు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. చాలా తక్కువ టైం లోనే ఆ ఘనతని సాధించడంతో పాటు  సెటిల్డ్ పెర్ ఫార్మెన్స్ తో భారీ స్థాయిలో అభిమానుల్ని పొందింది. తాజాగా  సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఇప్పుడు అది రాజకీయ వాసనని తెస్తుంది  అటల్ సేతు(atal setu)..దేశంలోనే అతి పెద్ద మూడవ బ్రిడ్జ్. జపాన్  దేశ సహకారంతో  ముంబై లోని సముద్రం మీద దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జ్ కి రష్మిక కి సంబంధం ఏంటనుకుంటున్నారా. రామ సేతు ని పొగుడుతు రష్మిక ట్వీట్ చేసింది.రెండు గంటల ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లో పూర్తి చేయడం అధ్బుతం. దేశంలో మౌలిక సదుపాయాలు, రహదారి ప్రణాళికలు బాగున్నాయంటూ ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ విషయం పైనే రష్మిక మీద కొంత మంది  విమర్శలు చేస్తున్నారు. పైగా ట్రోలింగ్ కూడా స్టార్ట్ చేసారు. మరో కంగనా రనౌత్ లాగా మారాలనుకుంటున్నావా,  ఒక వంతెనని చూపించి భారతదేశం ముందుకు వెళ్తుందని చెప్పడం అవివేకం. సాధారణ భారతీయుడు తన రోజు వారి జీవితాన్ని ఎలా గడుపుతున్నాడో తెలుసుకోవాలంటే లోకల్ ట్రైన్ లో ప్రయాణం చెయ్యి. తను చెప్తున్న మౌలిక సదుపాయల గురించి తెలుసుకోవాలంటే రష్మిక కారు దిగాలి. రష్మిక ఇన్ డైరెక్ట్ గా బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. రాజకీయాల్లోకి  వస్తుందేమో.. ఇలా రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. కొంత మంది నుంచి  సపోర్ట్ గా కూడా కామెంట్స్ వస్తున్నాయి.  అటల్ సేతు ఇరవై రెండు కిలో మీటర్ల పొడవుతో 18000 కోట్లతో నిర్మాణం అయ్యింది. సౌత్ ముంబై నుంచి నావి ముంబై కి వెళ్లాలంటే మినిమమ్ రెండు గంటల సమయం పడుతుంది.అలాంటిది  ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కేవలం 20 నిమిషాల్లో ఒక వైపు నుంచి ఇంకో వైపుకి వెళ్ళవచ్చు.ప్రధానమంత్రి నరేంద్ర  మోదీ (narendra modi) జనవరిలో ప్రారంబించాడు. ఇక రష్మిక ఇటీవల యానిమల్ తో భారీ విజయాన్ని అందుకుంది. పుష్ప 2 , గర్ల్ ఫ్రెండ్,కుబేర లు షూటింగ్ దశలో ఉన్నాయి  
అప్పట్లో సుచి లీక్స్ (Suchi Leaks) ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఈ లీక్స్ కోలీవుడ్ ని ఓ కుదుపు కుదిపేశాయి. సింగర్ సుచిత్ర, లీక్ చేసిందంటూ.. అప్పట్లో ధనుష్, శింబు, త్రిష, హన్సిక వంటి ఎందరో సెలబ్రిటీల ప్రైవేట్ ఫొటోలు, వీడియోలు విడుదలయ్యాయి. ఆ వీడియోలు నిజమని నమ్మిన వారున్నారు. ఫేక్ అని కొట్టిపారేసిన వారు కూడా ఉన్నారు. మరోవైపు సుచిత్ర మతిస్థిమితం కోల్పోయిందని, అందుకే తనకు తెలియకుండానే నిరాధార ఆరోపణలతో, సినీ తారలను టార్గెట్ చేస్తుందని ఆమె సన్నిహితులు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా అప్పట్లో సుచి లీక్స్ దెబ్బకి.. ఎందరో కోలీవుడ్ స్టార్స్ షేక్ అయ్యారు. అయితే కొంతకాలంగా సుచిత్ర సైలెంట్ గా ఉండటంతో.. ఇప్పుడు అంతా సెట్ అయిందని భావించారంతా. కానీ ఉన్నట్టుండి తాజాగా మరోసారి సుచి లీక్స్ తెరపైకి వచ్చింది. ధనుష్ (Dhanush), ఐశ్వర్య రజినీకాంత్ (Aishwarya Rajinikanth) జంట రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఇద్దరిపై తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సింగర్ సుచిత్ర షాకింగ్ కామెంట్స్ చేసింది. ధనుష్, ఐశ్వర్య ఒకరినొకరు చీట్ చేసుకున్నారని చెప్పింది. ఐశ్వర్య వేరే వారితో రిలేషన్ లో ఉందని, అలాగే ధనుష్ కి కూడా పలు ఎఫైర్లు ఉన్నాయని సుచిత్ర చెప్పుకొచ్చింది. ఇక ఇటీవల విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన జి.వి. ప్రకాష్, సింగర్ సైంధవిపై కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది సుచిత్ర. సింగర్స్ సైంధవి, కార్తీక్ మధ్య సీక్రెట్ రిలేషన్ ఉందంటూ కామెంట్స్ చేసింది. ఇక ధనుష్, జి.వి. ప్రకాష్ గురించి ఆమె చేసిన గే కామెంట్ షాకింగ్ గా మారింది. తన మాజీ భర్త కార్తీక్ తో పాటు ధనుష్, జి.వి. ప్రకాష్ స్వలింగ సంపర్కులని బాంబు పేల్చింది. ధనుష్ కి తెల్లవారుజామున మూడు గంటల వరకు గడిపే ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పుకొచ్చింది. సుచిత్ర తాజా కామెంట్స్ మరోసారి కోలీవుడ్ ని కుదిపేస్తున్నాయి. అయితే ఆమె డిప్రెషన్ లో ఉందని, మానసిక స్థితి సరిగా లేకనే ఇటువంటి కామెంట్స్ చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Natural Star Nani who is riding high with consecutive hits is presently starring in a unique actioner Saripodhaa Sanivaaram being made under the DVV Entertainment banner. Recently the production house that offered Nani’s birthday special by unveiling a teaser has provided another pleasant surprise. They announced #Nani32 under the banner. Director Sujeeth will be helming the new movie to be bankrolled by DVV Danayya and Kalyan Dasari. Sujeeth who is making OG with Power Star Pawan Kalyan which is in the middle of the production will be joining forces with Nani for his next. Makers planned to go on floors, once Saripodhaa Savinaavaram is done with its shoot. The pre production works are going on. Due to the budget issues and considering the current market conditions, makers halted this project. Nani 32 movie billed to be a witty action ride has been announced through a concept video. When a violent man turns non-violent, his world turns upside down. That’s the basic line story of the movie. It’s unique and intriguing at the same time. #Nani32 will be released in 2025. More details of the project are awaited
Man of Masses NTR’s most awaited pan-Indian project, ‘Devara,’ directed by Koratala Siva, is being eagerly awaited by the fans. They were eagerly awaiting the film's first single, as Rockstar Anirudh Ravichander, known for viral chartbusters, is scoring the music. Delighting fans and music lovers, today the makers kickstarted the musical promotions with the announcement of the first single. The film's first song, titled "Fear Song," will be released on May 19th to amplify NTR's birthday celebration. Announcing the same, the makers wrote, "ALL SET for the mighty storm. #DevaraFirstSingle ~ #FearSong will unleash a tsunami of madness that will sweep through every coast on May 19th." Everyone is expecting a viral chartbuster from Anirudh, and the title suggests a mass number. Janhvi Kapoor is the heroine, while Saif Ali Khan will be seen as Bhaira in this movie. Heralded as India's most anticipated action epic in 2024, the film is set for a grand nationwide release on October 10th. Kalyan Ram presents this movie under ‘NTR Arts’ while Sudhakar Mikkilineni and Kosaraju Harikrishna are the producers. NTR Arts and Yuvasudha arts banrkolling the film. The film also stars Prakash Raj, Srikanth, Shine Tom Chacko and others in key roles. Anirudh Ravichander scoring the music.
Queen of Masses Kajal Aggarwal is going all out for her maiden female-centric movie ‘Satyabhama’ and set to showcase her fiery side in this gripping cop story. ACP Satyabhama, a character brought to life by Kajal Aggarwal for the first time. The recently released teaser hints at a thrilling narrative filled with mystery and intrigue. Today, makers unveiled the powerful and hard hitting track "Vethuku Vethuku." It was launched in Hyderabad with Kajal Aggarwal's fans. The song is sung by Oscar-winning musician M.M. Keeravaani garu. The poignant and meaningful lyrics, written by Chandrabose, make you think. It's an anthem for all the strong women out there. The song begins with the death of a girl at the hands of Satyabhama, which triggers her investigation. Sricharan Pakala's emotional tune tugs at your heartstrings. This promotional video showcases Kajal Aggarwal's simple dance moves and also explores the major themes discussed in the film. "Satyabhama" is poised to be the perfect summer blockbuster. Written and directed by Suman Chikkala, Satyabhama is produced by Bobby Tikka and Srinivas Rao Takkalapelly under the Aurum Arts banner. Sashi Kiran Tikka is the screenwriter, while Sricharan Pakala serves as the composer. B. Vishnu is handling the cinematography.
Star hero Vijay Devarakonda, on his birthday announced his next 2 projects along with VD12. The VD14 in collaboration with director Rahul Sankrityan, under the prestigious banner of Mythri Movie Makers, created lot of excitement. The film is set to be a period action drama, produced by Naveen Yerneni and Y Ravi Shankar with a huge budget around 100-120 crores. We've already reported that Vijay Deverakonda will be playing dual role in the film. He will be playing both father and son role. This period action drama is set in Rayalseema region and both characters will be using Rayalaseema dialect. This is the first time Vijay playing dual role in a film. Being crafted as a Pan-India movie, "VD 14" promises to blend historical elements with action-packed drama. Latest we hear is that director Rahul Sankrityan narrated this exciting script to the Kollywood brothers Suriya and Karthi and they liked the script but it didn't materialize due to unknown circumstances. Rahul changed few things in the script to match Vijay Deverakonda personality and narrated to Vijay. Impressed with the script, Vijay gave his nod for the project. This project marks the third collaboration between Mythri Movie Makers and Vijay Devarakonda, following the success of films like 'Dear Comrade' and 'Kushi.' Vijay Devarakonda and Rahul Sankrityan are teaming up once again after their previous superhit, 'Taxiwala.'
'Queen of Masses' Kajal Aggarwal stars in the lead role in the movie "Satyabhama", with Naveen Chandra playing the pivotal role of Amarender. Produced by Bobby Thikka and Srinivasa Rao Takkalapalli under the Aurum Arts banner, the film is directed by Suman Chikkala. Sashi kiran Tikka, director of the film "Major", served as presenter and provided the screenplay. The musical evening for "Satyabhama" was grandly organized in Hyderabad today, where the third single 'Vethuku Vethuku..' was released. A large crowd of young men and women participated in the event, creating a lively atmosphere. Music Director Sri Charan Pakala and his team entertained with their songs. Attendees enjoyed live performances by the singers accompanied by an orchestra. During the event, a special contest was held and prizes were awarded to the winners. On this occasion, heroine Kajal Aggarwal shared, "The 'Satyabhama' musical evening was joyful. 'Vethuku Vethuku' is my soul song. We enjoyed working on this song. Playing Satyabhama was challenging, and it's the first time I've tackled such a character in my career. Our film is filled with emotion, drama, and power. I sincerely believe 'Satyabhama' will be well-received by everyone. This project is special in my career, and I'm excited about the movie's release. This is the first film I've made since having my baby. The subject felt very purposeful and relevant. It's essential for girls to see this movie. We've shown how girls can use the She app to stay safe. More details about this will be revealed in the movie. What struck me in the story was the emphasis on the safety of our girls. We demonstrate that women are powerful, both physically and intellectually. I hope you watch 'Satyabhama' and share your reactions." The song 'Vethuku Vethuku' is sung by Oscar winner and renowned music director MM Keeravaani, with lyrics by Chandra Bose. It's inspired by police officer Satyabhama's determination to catch criminals after attempts on girls' lives. The lyrics aim to inspire.
తెలుగు సినిమా మంచి కోరుకునే వ్యక్తుల్లో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (natty kumar)కూడా ఒకరు. కొన్ని దశాబ్దాల నుంచే ఆయనకి సినీ పరిశ్రమతో అనుబంధం ఉంది.  విశాఖ టాకీస్ బ్యానర్ పై ఎన్నో విజయవంతమైన చిత్రాలని నిర్మించాడు. తాజాగా  పవన్ కళ్యాణ్ (pawan kalyan)అల్లు అర్జున్ (allu arjun)ల పై కొన్ని కీలక వ్యాఖ్యలు  చేసాడు. ఇప్పుడు అవి హాట్ టాపిక్ గా నిలిచాయి. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నట్టికుమార్ మాట్లాడుతు పిఠాపురం లో పవన్ గెలుపుకు తొంబై తొమ్మిది శాతం సపోర్ట్ ఉంది.అల్లు అర్జున్  వైసిపీ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం వెళ్లినా పవన్ కి వచ్చిన నష్టం లేదు. అయినా ఎవరి ఇష్టం  వారిది.  ఇందులో  బన్నీ ని  ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే  ప్రచారానికి వెళ్లే వెళ్లేముందు ఆలోచించాల్సింది. దాని వల్ల బన్నీఫోటోని వైసిపి పార్టీ సోషల్ మీడియాలో  ప్రచారానికి వాడుకుంది.ఈ విషయాన్నీ బన్నీ  విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)అనే ఒక మహా వృక్షం వల్లే   మెగా హీరోలు ఇండస్ట్రీలో ఎదిగారని కూడా తెలిపాడు.ఇక ఎన్నికల ఫలితాల గురించి కూడా వివరించారు.ఇచ్ఛాపురం నుంచి పిఠాపురం వరకు తిరిగి, స్వయంగా గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకుని మరీ చెబుతున్నాను. కూటమి  అభ్యర్థులు ఉత్తరాంధ్ర లో భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. 70 లక్షల ప్రజలు జన్మభూమి మీద అభిమానంతో ఎవరికి వారే  దేశవిదేశాల నుంచి వచ్చి , ఓటు హక్కు వినియోగించుకున్నారు..ఇంతకుముందెప్పుడు ఈ స్థాయిలో రావడం చూడలేదు. అధికార వైసీపీ పక్షం పైన వ్యతిరేకంతోనే వారంతా భారీగా వచ్చారు. అధికార పార్టీ మంత్రులు, క్యాబినేట్ మొత్తం  ఓటమి చవి చూడనుంది. అందుకే భయంతో  అధికార పక్షం వారు ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారు. కొందరు అధికారులు తొత్తులుగా మారి ఈ చర్యలకు సపోర్ట్ చేస్తున్నారు. వారిందరికకీ  శాశ్వతంగా రెస్ట్ వస్తుందని తెలిపాడు. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక . సినిమా పరిశ్రమ అభివృద్ధి కి కృషి చెస్తుంది. యువకులకు ఉపాధి అవకాశాలను కలిపిస్తుందని తెలిపాడు  అలాగే   తెలంగాణా ఎగ్జిబిటర్స్  అసోసియేషన్  హఠాత్తుగా  శుక్రవారం నుంచి సినిమా ధియేటర్స్ ను  తాత్కాలికంగా  మూసివేసేందుకు నిర్ణయించడం షాక్ కు గురి చేసిందని తెలిపారు. థియేటర్లలో ఆక్యపెన్సీ తగినంత లేకపోవడంతో    థియేటర్స్ ను బంద్ చేస్తున్నట్లు  అసోసియేషన్ వారు చెబుతున్నారు. ఉన్నట్లుండి సడన్ గా  ధియేటర్స్ మూస్తే ఇబ్బంది.మీ వల్ల నిర్మాతలకు ,మల్టీప్లెక్స్ లకు కూడా  ఇబ్బందే..నిర్మాతలు  కంటెంట్ సిద్ధం చేసుకున్నాక ఇలాంటి చర్యలు నష్టం కలిగిస్తాయి.   దీనివల్లప్రేక్షకులు  ఓటిటిలకు ఇంకా అలవాటుపడతారు. మరలా ధియేటర్స్ ఓపెన్ చేసినా ఆడియన్స్ వస్తారా లేదా అనేది  ఒక్కసారి ఆలోచించాలి.  కల్కీ, పుష్ప 2  ఓజి , దేవర  వంటి పెద్ద సినిమాలకు మాత్రమే. మాకు కావాలి చిన్న సినిమాలు వద్దని మీ ఉద్దేశమా అని కూడా నట్టి కుమార్ ప్రశ్నిస్తున్నాడు.  వెంటనే అత్యవసర జాయింట్ కమిటి మీటింగ్ ఏర్పాటు చేసి, దీనిపై అందరికీ ఆమోదయోగ్యమైన మంచి నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు 
యమదొంగ లో ఎనీ డౌట్స్ అనే  ఎన్టీఆర్ డైలాగ్ బాగా పాపులర్. ఇప్పుడు ఆ మాట  జబర్దస్త్ ఆర్టిస్ట్  అనసూయ(anasuya)కి పర్ఫెక్ట్ గా సూటవుతుంది. హండ్రెడ్ పర్సెంట్  సూటవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే  తన నట  విశ్వరూపాన్ని పాన్ ఇండియా ప్రేక్షకులు చూడబోతున్నారు  నిన్న అనసూయ బర్త్ డే. తన 39 వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఏ ముహూర్తాన సోగ్గాడే చిన్ని నాయన లో ఒక సాంగ్ చేసిందో గాని తన  నట సోయగంతో  తెలుగు ప్రేక్షకులని  ఫ్లాట్ చేసి పడేసింది.ఇక  అక్కడనుంచి సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటు వాల్యుబుల్ ఆర్టిస్ట్ గా మారింది. ప్రస్తుతం ఆమె పాన్ ఇండియా మూవీ పుష్ప  టూ (pushpa 2) లోచేస్తుంది.మేకర్స్ తన  పుట్టిన రోజు సందర్భంగా  అనసూయ  లుక్ ని రిలీజ్ చేసారు. పక్కా విలేజ్ టైప్ చీర కట్టుతో  నోట్లో పాన్ వేసుకొని ఒక టేబుల్ పై కూర్చొని ఉంది. దానిపై  ఆల్కహాల్ బాటిల్, ఒక సోడా ఉన్నాయి. పక్కన అనుచరులు కూడా ఉన్నారు. తన  ఫేస్ ఎక్స్ ప్రెషన్ చూస్తుంటే  చెప్పిన పని చెయ్యలేదని అనుచరుకులకి వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉంది.  ఇప్పుడు ఈ లుక్  సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మూవీని ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అనే ఆత్రుతని కూడా అందరిలో కలిగిస్తుంది  పుష్ప పార్ట్ వన్  లో అనసూయ క్యారక్టర్ పేరు  దాక్షాయణి. మంగళం శ్రీను భార్యగా పవర్ ఫుల్ గా నటించింది. అందులో పుష్ప  మంగళం శ్రీనుని ముప్పతిప్పలు పెడతాడు. దాంతో దాక్షాయణి పుష్ప మీద పగ పెంచుకుంటుంది.  ఇప్పుడు ఆమె లుక్ తో  పార్ట్ టూ  లో పుష్ప కి ఆమెకి మధ్య ఒక రేంజ్ లో కథ నడవబోతుందని తెలుస్తుంది. కాకపోతే  ఆగస్టు పదిహేను  దాకా ఆగాల్సిందే. అల్లు అర్జున్ (allu arjun)కెరీర్లోనే అత్యధిక బడ్జట్ తో తెరకెక్కుతుండగా  సుకుమార్ (sukumar)దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.రష్మిక, ఫాహద్ ఫాజిల్, సునీల్ కీలక పాత్రలని పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన పుష్ప పుష్ప అనే  సాంగ్ రికార్డు వ్యూస్ తో ముందుకు దూసుకుపోతుంది  
సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ హనుమాన్(hanuman)సిల్వర్ స్క్రీన్ వద్ద 350 కోట్ల రూపాయలకి పైగా వసులు చేసింది.దాన్ని బట్టి  హనుమాన్ స్టామినా ఏ పాటిదో  అర్ధం చేసుకోవచ్చు. ఓటిటి లోను తన సత్తా చాటింది. తాజాగా మరో అరుదైన రికార్డుని సాధించింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్,నాగార్జున, మహేష్ బాబు,పవన్ కళ్యాణ్,ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్ ల కే కాదు నాకంటూ ఒక  రికార్డు  ఉంటుందని  నిరూపించాడు  వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ హోదాలో హనుమాన్ ఇటీవల  ప్రముఖ టెలివిజన్ ఛానల్ జీ తెలుగులో ప్రసారం అయ్యింది.అందరి అంచనాలని తలకిందులు చేస్తు  11  టిఆర్పి రేటింగ్ ని దక్కించుకుంది. అసలు గత కొంత కాలం నుంచి ఎంత పెద్ద హీరో సినిమాకి అయినా టిఆర్ పి రేటింగ్స్  ఆరు కూడా దాటడం లేదు. అలాంటిది హనుమాన్  11 రేటింగ్ ని దక్కించుకుందంటే  ఎంతటి  ప్రేక్షక ఆదరణ పొందిందో అర్ధం చేసుకోవచ్చు. ప్రభాస్ సలార్  ఆరు రేటింగ్ ని   దక్కించుకుంది.  తేజ సజ్జా, అమృత అయ్యర్ హీరో హీరోయిన్లుగా చేసిన హనుమాన్ లో  వినయ్ రాయ్, వరలక్ష్మి శరత్‌కుమార్, సముద్ర ఖని తదితరులు  కీలక పాత్రల్లో నటించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మించగా  అనుదీప్ దేవ్, హరి గౌర, కృష్ణ సౌరభ్‌లు మ్యూజిక్‌ను ఇచ్చారు.హనుమాన్ శక్తీ ముందు ఎవరు తట్టుకోలేరని పురాణాల్లో ప్రస్తావించింది నూటికి నూరుపాళ్ళు నిజం   
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
నిస్సహాయత ఏమీ చేయలేని, చేయాలనే ఆరాటం ఉన్నా చేయడానికి అవకాశం లేని ఒకానొక ఒంటరి స్థితి. మనిషిని నిలువునా ఒత్తిడిలోకి తోసి, ఆత్మన్యూనతా భావాన్ని పెంచే పరిస్థితి. ప్రపంచంలో ఇలాంటి నిస్సహాయులు ఎందరో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరూ తిండి కోసం, ఉండటానికి నీడ కోసం ఎవరిని అడగాలో తెలియక, తమకు ఏమీ చేసే అవకాశాలు లేక అలా శూన్యం నిండిపోయినట్టు ఉండే స్థితి నిస్సహాయత. ఎందుకీ నిస్సహాయత?? ప్రపంచంలో మనిషి చేసుకుంటే ఎన్ని పనులు ఉండవు అని అనుకుంటారంతా. కానీ కొన్ని సార్లు అన్ని వైపుల నుండి తలుపులు మూసుకుపోయి చీకటిలో పడిపోయినట్టు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏదో ఒక చెయ్యి కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఆ తలుపులు ఎక్కడున్నాయో కనబడక, ఎవరైనా ఆ తలుపులు తీస్తారేమో అనే ఆశతో ఉంటారు. అందుకే ఏమీ చేతకానితనంతో అట్లా ఉండిపోతారు.  ఎక్కడెక్కడ?? నిస్సహాయతకు చోటు లేని ప్రదేశమంటూ లేదు. చోటివ్వని మనిషంటూ లేడు. చిన్న పిల్లాడి నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతోమంది ఉంటారు. అయితే చాలా వరకు యూత్ లోనూ, మహిళల్లోనూ ఈ నిస్సహాయత బాధితులు ఎక్కువగా ఉంటున్నారు అనేది నమ్మితీరాల్సిన నిజం. మరీ ముఖ్యంగా కట్టుబాట్ల కంచెల మధ్య నలిగిపోతున్న ఎంతో మంది మహిళలు ఏదో చెయ్యాలని, తమ జీవితాలను మార్చుకోవాలని ఉన్నా అందరికీ పైపైన కనబడే విషయాలు వీళ్ళకేం బాగున్నారులే అనిపించేలా చేస్తున్నాయి. కానీ పైకి కనిపించేది వేరు, లోపల వాళ్ళ సంఘర్షణ వేరు. చేయూత!! నిస్సహాయంగా ఉన్న ఇలాంటి వాళ్ళ సంఘర్షణను గుర్తించే కొన్ని మహిళా స్వచ్చంధ చేయూత సంస్థలు ఆవిర్భవిస్తున్నాయి. అయితే ఇలాంటివి అందరికీ అందుబాటులో ఉండటం లేదు. కొన్ని మహానగరాలకు పరిమితమైతే మరికొన్ని దూరప్రాంతాలలో ఉండటం వల్ల ఎంతోమంది ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. నిజం చెప్పాలంటే దిగువ తరగతి  కులాల మహిళల కంటే, ఉన్నత కులాల మహిళలలో ఇలాంటి నిస్సహాయులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ పరువు, సమాజం, గౌరవం అనే గీతల వెనుక నిస్సహాయంగా నిలబడుకుని శూన్యపు చూపులు చూస్తుంటారు. మధ్యలోనే చదువు ఆగిపోయి, సంప్రదాయాలలో చిక్కుకుపోయి, గడప దాటి బయటకు వెళ్లే స్వేచ్ఛ లేని స్త్రీ సమాజం ఎంతో ఉంది. ఒక్క తలుపు తెరవండి!! ఇలాంటి సమస్యలో చిక్కుకుని మానసికంగా నలిగిపోయేవాళ్లకు సొంత ఆలోచన క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ఏమి చేయలేకపోతున్నామనే చేతగాని తనమే అలాంటి అజ్ఞానపు వృత్తంలో పడిపోవడానికి కారణం అవుతుంది. అయితే నీ చుట్టూ బోలెడు ప్రపంచం ఉందని, అవకాశాలు ఉన్నాయని, దారి కూడా ఉందని చెబుతూ నువ్వున్నది ఓ చిన్న గది  మాత్రమే ఒక్కసారి మొత్తం తరచిచూస్తే ఎక్కడో ఒకచోట తలుపులు చేతికి దొరుకుతాయి అని మాటలతో భరోసా నింపితే ఆంజనేయుడికి  గుర్తుచేయగానే శరీరం పెరిగినట్టు వీళ్లకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలా మెల్లిగా మీ మాటలతోనే ఒక తలుపు తెరిచి వాళ్లకు చూపించినట్టవుతుంది కూడా.  ప్రపంచం పెద్దది!! మనుషులే చిన్నతనంతో ఉన్నారు!! ఆలోచిస్తే ఇదే నిజమని అనిపిస్తుంది. నిజానికి ఒకమనిషి బాగుపడితే చూసి సంతోషించేవాళ్ళు ఎక్కువ లేరు ఈ ప్రపంచంలో. ఎప్పుడూ అవతలి వాడిని ఎలా ముంచుదామా, వాడిది ఎలా లాక్కుందామా అనే ఆలోచనే తప్ప  అయ్యో ఇలా చేస్తే దారి కనబడుతుంది కదా వెళ్లి చెబుదాం అనుకునేవాళ్ళు ఎవరూ ఉండటం లేదు. ఎక్కడో, ఎవరో నూటికి ఒక్కరు ఉన్నా వాళ్ళ సాయం అందుకునే వాళ్ళు ఏ కొద్దీ మందో అంతే. మిగిలినవాళ్లకు పైన చెప్పుకున్నట్టు సంఘర్షణే మిగుల్తోంది. అందుకే మనుషులు తమ మనసును కాసింత పెద్దగా చేసుకోవాలి. అందులో ఎన్నో హృదయాలకు ప్రేమను పంచాలి. ఆ ప్రేమను అందుకున్న వాళ్ళు నిస్సహాయత నుండి బయటకొస్తారు నేస్తాల్లారా!! ◆వెంకటేష్ పువ్వాడ.
ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అంటారు. అందుకే అవతార పురుషుడైనా ఓ అమ్మకు కొడుకే అంటూ పాటను రాశారు రచయితలు. బ్రహ్మకు మారు పేరు అమ్మ. మనకు దెబ్బ తగిలినా వెంటనే అమ్మా అని అంటాము. అంటే మనకు ఆనందం కలిగినా..బాధ కలిగినా వెంటనే అమ్మ గుర్తొస్తుంది. రెండు గంటల పాలు మనల్ని వినోదంలో ముంచెత్తే మన తారలైనా అమ్మకు ముద్దుల బిడ్డలే. మన తెరవేల్పుల్లో చాలా మంది అమ్మతో అనుబంధం గురించి వేదికలపైనో ప్రెస్ మీట్‌లలోనో చెబుతూ ఉంటారు. మన హీరోలు వాళ్ల అమ్మతో దిగిన చిత్రమాలిక మీ కోసం..   అమ్మ రమాబాయితో  రజనీకాంత్ అమ్మ అంజనాదేవితో  చిరంజీవి, నాగబాబు    అమ్మ అంజనాదేవితో  పవన్ కళ్యాణ్  అమ్మ ఇందిరాదేవితో  మహేశ్  అమ్మ షాలినితో ఎన్టీఆర్ అమ్మ రాజ్యలక్ష్మీతో  రవితేజ అమ్మ శివకుమారితో  ప్రభాస్  అమ్మ సురేఖతో రామ్‌చరణ్ అమ్మ నిర్మలతో అల్లు అర్జున్, అల్లు శిరీష్ అమ్మ విజయలక్ష్మీతో నాని
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
భోజన ప్రియులకి నెయ్యి లేదా అంటూ ఉంటారు. నెయ్యి లేనిదే ముద్ద దిగదు.నెయ్యి తో పోపు పెట్టిన ఆహారం,నెయ్యితో కాల్చిన చపాతి నెయ్యితో కాల్చిన పెసరట్టు తప్ప మరేది వద్దు అంటూ ఉంటారు.ఇక కొంతమంది అయితే ముఖ్యంగా స్వీట్స్ లో నెయ్యి కారుతూ ఉండాలి. ముఖ్యంగా బొబ్బట్లు, బూరెలు  కూడా నెయ్యి తో చేసినవే బాగుంటాయి అంటారు భోజన ప్రియులు నెయ్యితో చేసిన పదార్ధాలు ఆస్వాదిస్తూ తిన్నప్పుడే వాటి మజా ఉంటుందని నిపుణులు అభిప్రాయ పడ్డారు. ముఖ్యంగా దక్షణాది రాష్ట్రాలలో కుటుంబంలో పెళ్ళి ళ్ళు శుభకార్యాలలో సంబంధాలు కోసం వెళ్ళినప్పుడు మా నానమ్మ నెయ్యి వెన్నతో పెట్టింది.మీరేం పెడతారు చెప్పండి అంటు అడగడం అనాదిగా వస్తున్న ఆచారం. అయితే మీరు ఇలాగే గనక నెయ్యి తింటే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తెలిస్తే ఇకమీరు నెయ్యి జోలికే వెళ్ళరు. నెయ్యి ఆరోగ్యానికి ఎలా దోహదం చేస్తుందో మీకు బాగా తెలుసు.వినిఉండచ్చు. ఇది కేవలం యాంటి ఏజింగ్ మాత్రమే కాదు మనసు మెదడు ఆరోగ్యంగా ఉండడానికి లాభం కలిగించే అంశం అయితే నెయ్యి ప్రతి ఒక్కరికి సరిపడదు. అని అంటున్నారు నిపుణులు. భారత దేశం లో నెయ్యి చాలా ప్రాచుర్యం లో ఉంది.నెయ్యి కొంతమంది ప్రతిరోజూ తమ భోజనం లో చేరుస్తారు. నెయ్యి వాడడం కూడా చాలా కష్టం నేతిని బ్రెడ్ లో లేదా చపాతీలో పప్పు కూరలో నెయ్యిని ఎక్కువగా వినియోగిస్తారు. నెయ్యిని ఆయుర్వేదం లో ఎక్కువగా వాడడం గమనించవచ్చు.నెయ్యి ఆరోగ్య పరంగా మంచి ఉపయోగాలు ఉన్నాయి. గుండె సంబందిత ఆరోగ్యానికి లాభదాయకంగా ఉంటుంది.ఖాళీ పొట్టతో నెయ్యి తీసుకోవడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. శరీరంలో ఉన్న పంచెంద్రియాలలో శుభ్ర పరిచి ఉపసమనం ఇస్తుంది. నెయ్యిలో యాంటి ఏజింగ్ మరియు గుండె ను ఆరోగ్యంగా ఉంచే గుణాలు ఉంటాయి. కంటి ఆరోగ్యానికి నెయ్యి చాలా మంచిది దీనితో పాటు నెయ్యి మెదడు,జ్ఞాపక శక్తిని పెంచి పంచేంద్రియాలు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.
  శరీరంలో ప్యూరిన్ పెరుగుదల కారణంగా యూరిక్ యాసిడ్ పెరగడం ప్రారంభమవుతుంది. అధిక యూరిక్ యాసిడ్‌తో బాధపడేవారు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. తినడం,  త్రాగడంలో ఏ కొంచెం అజాగ్రత్తగా ఉన్నా కీళ్ళు,  ఎముకలలో నొప్పి, వాపు, పెరుగుతుంది. ప్యూరిన్ అనే రసాయనం శరీరంలో విచ్ఛిన్నమైతే, యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అతిగా తాగడం, తక్కువ శారీరక శ్రమ, ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, ఆహారపు అలవాట్లలో అజాగ్రత్త కారణంగా యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. వేసవిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న రోగులు ఏ పండ్లు తినాలో తెలుసుకుంటే.. బ్లాక్బెర్రీస్.. బ్లాక్బెర్రీస్  వేసవిలో సీజన్లో అందుబాటులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ లు అధికంహా ఉన్న బెర్రీ పండ్లు  అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారికి  ప్రయోజనకరంగా ఉంటాయి.  బెర్రీలు జీవక్రియను పెంచడంలో,  శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడతాయి. ఇది శరీరంలో వాపును తగ్గిస్తుంది.  యాసిడ్ స్థాయి కూడా సమతుల్యంగా ఉంటుంది. అధిక యూరిక్ యాసిడ్ ఉన్నవారు  బ్లాక్బెర్రీస్ తినవచ్చు. చెర్రీలు.. యూరిక్ యాసిడ్ రోగికి చెర్రీలు కూడా  చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఆమ్లాన్ని నియంత్రించే మూలకాలు చెర్రీస్‌లో ఉంటాయి. విటమిన్ బి-6, విటమిన్ ఎ, విటమిన్ కె, విటమిన్ సి, విటమిన్ ఎ,  విటమిన్ బి రెడ్  చెర్రీస్‌లో ఉంటాయి. చెర్రీస్ అధిక యూరిక్ యాసిడ్‌ను తగ్గించే అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. అరటిపండు.. యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని నివారించాలనుకుంటే రోజూ అరటిపండ్లను తినడం మంచిది. అరటిపండ్లలో ప్యూరిన్ తక్కువగా ఉంటుంది. అరటిపండ్లు తినడం ద్వారా అధిక యూరిక్ యాసిడ్ తగ్గుతుంది. గౌట్ సమస్యలో అరటిపండ్లు కూడా మేలు చేస్తాయి. అరటిపండ్లు తినడం వల్ల శరీరానికి తక్షణ శక్తి కూడా అందుతుంది. కివీ.. పుల్లటి,  జ్యుసి పండ్లను తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంటే వాటి స్థానంలో  కివీని తినవచ్చు. కివి వినియోగం యూరిక్ యాసిడ్‌ను నియంత్రిస్తుంది. కివి తినడం వల్ల విటమిన్ సి, విటమిన్ ఇ, పొటాషియం,  ఫోలేట్ లభిస్తాయి. దీని వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ తొలగిపోతాయి. కివిని రోజూ తినడం వల్ల యూరిక్ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. యాపిల్.. ఎండాకాలం అయినా, చలికాలం అయినా పండ్ల దుకాణంలో యాపిల్స్ ఎప్పుడూ దొరుకుతాయి. యాపిల్ ఫైబర్ అధికంగా ఉండే  పండు. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాపిల్ రక్తంలో యూరిక్ యాసిడ్ పేరుకుపోకుండా నిరోధిస్తుంది. యాపిల్ తినడం వల్ల యూరిక్ యాసిడ్ ప్రభావం తగ్గుతుంది.  రోజువారీ పనులు చేయడానికి తగినంత  శక్తి అందిస్తుంది. ప్రతిరోజూ ఒక యాపిల్ తినాలని వైద్యులు సూచిస్తున్నారు.                                                *రూపశ్రీ.  
అరటి చాలా  శక్తివంతమైన పండు. దీన్ని తినడం వల్ల శరీరానికి ప్రాణశక్తి లభిస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు ఓ అరటిపండు తింటే చాలాసేపటి వరకు ఆకలి బాధ దూరంగా ఉంటుంది. ఇది మెత్తగా ఉండటం వల్ల చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు ప్రతి ఒక్కరూ తినదగిన పండు. జీర్ణం కావడానికి సులువుగానే ఉంటుంది. ఎక్కువసేపు ఆకలిని అదుపులో ఉంచుతుంది. కండరబలాన్ని, పోషకాలను ఇస్తుంది. వర్కౌట్ తర్వాత అరటిపండు తినడం ఫిట్నెస్ ఫాలో అయ్యేవారికి తప్పనిసరి. పైపెచ్చు అరటిపండు మిగిలిన పండ్లతో పోలిస్తే ధర తక్కువే. కాబట్టి అందరూ కొనుక్కుని తినగలుగుతారు. కానీ  అరటిపండు అందరికీ మంచిది కాదు. ఆయుర్వేదంలో అరటిపండు కొంతమందికి ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? దీన్ని ఎవరు తినకూడదో  తెలుసుకుంటే.. పోషకాలు.. అరటిపండు తినడం వల్ల  విటమిన్ సి, ఫైబర్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ బి6తో పాటు గ్లూటాతియోన్, ఫినాలిక్స్, డెల్ఫిడినిన్, రుటిన్, నారింగిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. 80వ్యాధులకు చికిత్స చేయగలదు.. పోషకాహార నిపుణులు అరటిపండులో ఉన్న గొప్పదానాన్ని చెబుతూ ఇది 80రకాల వ్యాధులకు చికిత్స చేయగలదని పేర్కొన్నారు. అరటి పండు వాత పిత్త దోషాన్ని సమతుల్యం చేస్తుంది. వాతం క్షీణించడం వల్ల దాదాపు 80 రకాల వ్యాధులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్పబడింది. ఇది పొడిబారడం, ముడతలు పడటం, ఎముకలలో అంతరం, మలబద్ధకం, చేదు రుచి మొదలైన అనేక సమస్యలు ఇందులో ఉన్నాయి. వీటన్నింటికి అరటిపండు చికిత్స చేయగలుగుతుంది. అరటిపండు ఎవరు తినాలంటే.. ఆయుర్వేదం ప్రకారం అరటిపండు  చల్లని గుణం కలిగి ఉంటుంది. ఇది  జీర్ణం కావడానికి బరువుగా ఉంటుంది.   ఇది లూబ్రికేషన్‌గా పనిచేస్తుంది. శరీరం ఎండిపోయి, ఎప్పుడూ అలసిపోయినట్టు, బాగా నిద్రపోనట్టు, శరీరంలో ఎప్పుడూ మంటగా ఉన్నట్టు అనిపించేవారు, చాలా దాహంతో ఉన్నవారు,  ఎక్కువ  కోపంగా ఉన్నవారు అరటిపండును తినాలి. దీనివల్ల ఆ కోపస్వభావం, అతిదాహం వంటి సమస్యలు అణిచివేయబడతాయి. ఎవరు తినకూడదంటే.. అరటిపండు కఫ దోషాన్ని పెంచుతుంది. కాబట్టి అధిక కఫ శరీర తత్వం గలవారు దీనిని తినకూడదు. పెరిగిన కఫం కారణంగా జీర్ణాశయంలో  అగ్నితత్వం  బలహీనంగా ఉంటే అరటి పండు దానిని మరింత నెమ్మదిస్తుంది. అధిక కొవ్వు, దగ్గు,  జలుబు ఉన్నవారు, ఆస్తమా రోగులు దీనిని తినకూడదు. ఒకవేళ తినాలని అనిపిస్తే  చాలా ఆలోచించి దీని పర్యావసానాలు ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉంటేనే తినాలి.                                              *నిశ్శబ్ద