LATEST NEWS
  గాంధీభవన్‌లో జరిగిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఐఆర్‌పై పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి అవగాహన కలిగి ఉండాలని సీఎం సూచించారు. ఎస్ఐఆర్ వల్ల పేదలు, దళితులు, మైనార్టీలు, మహిళలు, వలస కార్మికుల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 119 అసెంబ్లీ, 17 లోక్‌సభ నియోజకవర్గాలకు ప్రత్యేక ఇన్‌ఛార్జ్‌లను నియమించాలని ఆదేశించారు.  పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పనిచేస్తేనే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా కాపాడుకోవచ్చన్నారు. ప్రతి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్యక్రమాలకు కేటాయించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు సూచించారు. హైదరాబాద్ పరిధిలో ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో క్లస్టర్ వారీగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
  దొడ్డలహళ్లి కెంపేగౌడ శివకుమార్... డీకే శివకుమార్‌గా ఫ్యామస్..   కర్ణాటక సీఎంగా  పదవి అధిరోహించబోతున్న కాంగ్రెస్ ట్రంప్ కార్డ్. కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందారు. అపజయం ఎరుగని వ్యూహకర్తగా,  కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత నమ్మకస్తుడైన 'ట్రబుల్ షూటర్'గా పేరుగాంచారు . నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి రాష్ట్ర అత్యున్నత స్థాయి పదవుల వరకు ఎదిగారు. కనకపుర ప్రాంతంలో ఆయనకున్న తిరుగులేని పట్టు కారణంగా ఆయనను 'కనకపుర బండ' అని కూడా పిలుస్తారు. 1980వ దశకంలో కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్ఎస్‌యూఐ ద్వారా డీకే శివకుమార్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1984లో కర్ణాటక ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ కమిటీలో కీలక బాధ్యతలు చేపట్టారు. 1989లో తన 27వ ఏట సాథనూర్ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టారు. కర్ణాటక రాజకీయాల్లో ఎనిమిది సార్లు వరుసగా విజయం సాధించిన నేతగా రికార్డుల కెక్కారు.  1989 నుండి ఇప్పటివరకు జరిగిన అన్ని శాసనసభ ఎన్నికల్లో సాథనూర్,  కనకపుర నియోజకవర్గాల నుండి వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, ఓటమి ఎరుగని నాయకుడిగా నిలిచారు.  ఎస్‌.ఎం. కృష్ణ ప్రభుత్వంలో హోం శాఖ సహాయ మంత్రిగా, సిద్ధరామయ్య క్యాబినెట్‌లో ఇంధన శాఖ మంత్రిగా, ఆ తర్వాత భారీ నీటిపారుదల, వైద్య విద్యా శాఖల మంత్రిగా విజయవంతంగా పనిచేశారు. 2020లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు.  2023 మే నెలలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా,  బెంగళూరు అభివృద్ధి, జలవనరుల శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.  కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు సంక్షోభంలో పడినా డీకే శివకుమార్ ముందుండి పరిష్కరించేవారు. అందుకే ఆయనకు ట్రబుల్ షూటర్ అనే పేరు వచ్చింది. 2002లో మహారాష్ట్ర సీఎం విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొన్నప్పుడు, అక్కడి ఎమ్మెల్యేలను బెంగళూరు రిసార్ట్‌లో ఉంచి ప్రభుత్వాన్ని కాపాడారు. అహ్మద్ పటేల్ గెలుపు కోసం గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు. 2018లో  కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో అన్నీ తానే అయి నడిపించారు. తాజాగా కర్ణాటక కాంగ్రెస్‌లో ముందుగా కుదిరిన అధికార మార్పిడి ఒప్పందంలో భాగంగా, 2026 మే 28న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేశారు. దీనితో, సుదీర్ఘ కాలంగా పార్టీ కోసం శ్రమించిన ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి మార్గం సుగమమైంది. శివకుమార్ కర్నాటకలోని బెంగుళూరు సమీపంలోని కనకపురలో కెంపేగౌడ మరియు గౌర్ అమ్మ దంపతులకు జన్మించాడు . ఆయన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారు.  ఆయనకు డీకే సురేష్ అనే తమ్ముడు ఉన్నారు. ఆయన కూడా రాజకీయ నాయకుడే. శివకుమార్ 1993లో ఉషను వివాహం చేసుకున్నారు మరియు వారికి ఐశ్వర్య, ఆభరణ అనే ఇద్దరు కుమార్తెలు మరియు ఆకాష్ అనే కుమారుడు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వి.జి. సిద్ధార్థ కుమారుడైన అమర్త్యను వివాహం చేసుకుంది . డీకే భారతదేశంలోని అత్యంత ధనవంతులైన రాజకీయ నాయకులలో ఒకరవ్వడం విశేషం.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ అగ్రరాజ్యాధినేత వ్యవహారతీరుపై తెలుగువన్ ఇంటర్వ్యూలో ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఆయన మారుస్తున్న మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక నయా డిక్టేటర్ తరహాలో ఆయన వ్యవహరిస్తున్న తీరు గమనిస్తుంటే..  ప్రపంచాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టేలా ఉందని  ప్రముఖ సామాజిక, రాజకీయ విశ్లేషకుడు కిలారు నాగార్జున అన్నారు. తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన..   ఇరాన్ తో  ఉద్రిక్తతలు,  యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను భయపెడుతోందన్నారు. అయితే.. వ్యూహాత్మకంగా ఇరాన్ కీలకమైన హార్ముజ్ జలసంధిని తన అధీనంలో ఉంచుకుని అమెరికా పీక నొక్కడంతో ట్రంప్ కొంత వెనక్కి తగ్గారన్నారు. ఇరాన్ తో యుద్ధం వల్ల ఇప్పటివరకు అమెరికా సుమారు హాఫ్  ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 45 నుంచి 50 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయిందన్నారు.   యుద్ధం ముగిసిన తర్వాత ఏర్పడే అనంతర పరిణామాల వల్ల మరో  ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 95 లక్షల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉందని విశ్లేషించారు.  ఈ అంతర్జాతీయ ఉద్రిక్తతల ప్రభావం  అమెరికాపైనే కాకుండా  ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడింది. సహజంగా ఆయిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నప్పటికీ, అమెరికాలోనే చమురు ధరలు ఏకంగా 45 శాతం నుండి 50 శాతం వరకు పెరిగిపోవడం అక్కడ మధ్యతరగతి ప్రజల జీవితాలను అల్లకల్లోలం చేస్తోంది. లక్షలాది మంది అమెరికన్లు రోడ్లపైకి వచ్చి ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు భారత్ విషయానికి వస్తే, భారత్‌లో ఇంధన ధరల పెరుగుదల కేవలం 4 శాతం నుండి 4.5 శాతం వరకే పరిమితం కావడం కొంత ఊరట కలిగిస్తున్న అంశం. అయినప్పటికీ, అంతర్జాతీయ చమురు సంక్షోభం మన దేశాన్ని కూడా ప్రభావితం చేస్తోంది. రష్యాతో భారతదేశానికి ఉన్న పాత అనుబంధం, అక్కడి నుండి చౌకగా చమురు దిగుమతి చేసుకోవడంపై ట్రంప్ మొదట్లో తీవ్ర ఆంక్షలు విధించాలని చూశారు. రష్యా ఆయిల్ కొంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించిన ట్రంప్, ఆ తర్వాత భారత విదేశాంగ విధానం మరియు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గి నెల రోజుల పాటు మినహాయింపు ఇచ్చిన సంగతిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు ఆ  గడువును ఇప్పుడు మరో నెల రోజులు పొడిగించాల్సిన పరిస్థితికి ట్రంప్ వచ్చారంటేనే.. అమెరికా ఎంతగా తగ్గిందో అర్ధమౌతుందన్నారు.  భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా ద్వంద్వ నీతిని ఎండగడుతూ,  మా అవసరాలు మాకు ముఖ్యం, మమ్మల్ని ప్రశ్నించే ముందు యూరోపియన్ యూనియన్ సంగతి చూడండి అని గట్టిగా సమాధానం ఇవ్వడంతో ట్రంప్ నోరు మూతపడక తప్పలేదన్నారు.   అయితే, అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న భారతీయులపై ట్రంప్ కక్షసాధింపు చర్యలు దిగజారుడుతనానికి నిదర్శనంగా నిలుస్తుయని కిలారు అన్నారు.  భారతీయులను  చీప్ లేబర్ అని సంబోధిస్తూ, వారికి హెచ్-1బి వీసాలు ఇవ్వకూడదని, కొత్త వీసాలపై నిషేధం విధించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారన్నారు. ఒకవైపు భారత ప్రధాని మోదీని తన ఆప్తమిత్రుడు అని పొగుడుతూనే..  మరోవైపు ఇండియా ఒక డెడ్ ఎకానమీ అని, ఒప్పించడం చాలా కష్టమైన దేశమని ఉదయానికి ఒకలా, సాయంత్రానికి ఒకలా మాటలు మారుస్తూ ట్రంప్ మానసిక స్థిరత్వం కోల్పోయినట్లు ప్రవర్తిస్తున్నారని కిలారు చెప్పారు. రాబోయే రెండు మూడు నెలల్లో అంతర్జాతీయంగా ఈ సమస్యకు ఒక సామరస్యపూర్వక పరిష్కారం లభించకపోతే, ప్రపంచాన్ని ముంచెత్తబోయే భయంకరమైన ఆర్థిక మాంద్యం తీవ్ర నష్టాన్ని మిగులుస్తుందని విశ్లేషించారు. ఏది ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ ఇంకా దూకుడుగా వెళ్లే పరిస్థితి లేదని కిలారు నాగార్జున చెప్పారు. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మహానాడు 2026   సరికొత్త చరిత్రకు వేదికైంది. హైబ్రీడ్ పద్ధతిలో జరిగిన ఈ మహానాడులో   తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు పొట్లూరు దర్శిత్  ప్రసంగం అందరినీ ఉర్రూతలూగించింది.   2014 నాటి రాష్ట్ర విభజన పరిస్థితులను గుర్తుచేస్తూ సాగిన ఆయన  ప్రసంగం..  నాడు పరిశ్రమలు, ఉద్యోగాలు లేక ఆంధ్రప్రదేశ్ తీవ్ర అంధకారంలో మునిగిపోయిందనీ.. ఆ సంక్షోభ సమయంలో యువతకు నైపుణ్యాభివృద్ధిని అందించి ప్రపంచవ్యాప్తంగా అవకాశాలు సృష్టించడమే ధ్యేయంగా బ్రాండ్ సీబీఎన్ ముందుకు వచ్చారని దర్శిత్ కొనియాడారు. అంతర్జాతీయ సంస్థలైన సిమెన్స్ వంటి భాగస్వామ్యాలతో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, 2019 నాటికి లక్షలాది మంది విద్యార్థులను ఉన్నత వేతనాలతో కూడిన ఐటీ రంగ ఉద్యోగాల్లో నిలిపిన ఘనత చంద్రబాబుదేనని స్పష్టం చేశారు. ఇండియా స్కిల్ రిపోర్ట్‌లో సైతం ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఆ విజన్, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వ హయాంలో ఎలా నిర్వీర్యమైందో కళ్ళకు కట్టినట్లు వివరించారు. 2019  అధికారంలోకి వచ్చిన జగన్   ఐదేళ్ల పాలనలో రాష్ట్ర యువత అనుభవించిన నరకయాతనను దర్శిత్ గణాంకాలతో సహా వెల్లడించారు. చంద్రబాబు నాయుడు 2019కి ముందే 30 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తే..  వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా తుంగలో తొక్కారని విమర్శించారు. ఫలితంగా  ఉపాధి లేక, ఉద్యోగాలు రాక రాష్ట్రంలో ఏకంగా 2,400 మంది యువతీ యువకులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.  ఆ 2,400 అనేది కేవలం ఒక సంఖ్య కాదు.. అది 2,400 మంది కన్నతల్లుల కడుపుకోత, ఆ కుటుంబాల కళ్ళ ముందే జరిగిన అంత్యక్రియలు అంటూ దర్శిత్ భావోద్వేగంగా మాట్లాడినప్పుడు మహానాడులో ఉద్వేగ భరిత వాతావరణం నెలకొంది.  కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా చంద్రబాబు నాయుడిని 53 రోజుల పాటు అక్రమ స్కిల్ కేసులో జైల్లో పెట్టినప్పటికీ, ఆయన ఆలోచనలను మరియు విజన్‌ను మాత్రం ఆ బంధీఖానా నిర్బంధించలేకపోయిందని దర్శిత్ చెప్పారు. చంద్రబాబు  అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా కేవలం ఆంధ్రాలోనే కాదు..  ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు విజన్ వల్ల లబ్ధి పొందిన 79 దేశాలలోని తెలుగు యువత రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కక్ష సాధింపు, రివెంజ్ రాజకీయాలతో విసిగిపోయిన యువత, 2024 ఎన్నికల్లో ఒక అద్భుతమైన, విస్పష్టమైన తీర్పు  ఇచ్చిందని పేర్కొన్నారు.  మాకు రివెంజ్ పాలిటిక్స్ వద్దు.. రిజల్ట్స్ ముఖ్యం, కేసులు కాదు.. మాకు కెరీర్ ముఖ్యం  అని నినదిస్తూ  తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో యువత అత్యంత కీలక పాత్ర పోషించిందన్నారు. గత ప్రభుత్వం కులాలు, ఓట్లు, సీట్ల లెక్కల్లో మునిగిపోతే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం యువతలోని టాలెంట్, స్కిల్, పొటెన్షియల్‌ను నమ్మిందని, అందుకే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన మొట్టమొదటి నిర్ణయం  స్కిల్ సెన్సస్ అని కొనియాడారు. రాబోయే రోజుల్లో  స్కిల్ యూనివర్సిటీ  ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు వెతుక్కునే వారిగా  కాకుండా, ఉద్యోగాలు సృష్టించే వారిగా  మార్చడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని దర్శిత్ వెల్లడించారు. ఉత్తరాంధ్రను డిజిటల్ గేట్‌వేగా మారుస్తూ గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్, డెలాయిట్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీలను విశాఖకు తీసుకొస్తున్న యువ నాయకుడు నారా లోకేష్ శైలిని అభినందించారు. యువత చేతుల్లో కేవలం సర్టిఫికెట్లు మాత్రమే కాదు..  గౌరవప్రదమైన పే-స్లిప్పులు ఉండాలన్నదే లోకేష్ సంకల్పమన్నారు. గతంలో రాయలసీమను ఫ్యాక్షన్ సీమగా, రాళ్ల సీమగా గుర్తింపు పొందితే.. లోకేష్  ఆ ప్రాంతానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ మరియు డిఫెన్స్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమలను తీసుకొచ్చి 'రాయల్ సీమ - రక్షణ సీమ'గా మార్చారని ప్రశంసించారు. పదో తరగతి ఫలితాల ప్రకటనలో కూడా తన ప్రచారం చేసుకోకుండా, పేద విద్యార్థుల చిరునవ్వులనే హైలైట్ చేసిన లోకేష్ సంస్కారానికి, ఐదు పైసల పని చేయకుండా ఐదు వందల రూపాయల పబ్లిసిటీ చేసుకున్న జగన్ మనస్తత్వానికి ఆకాశానికి, పాతాళానికి ఉన్నంత తేడా ఉందన్నారు. చివరగా..  వైసిపి నేతలు మాట్లాడుతున్న ధర్మ సూత్రాలపై, లోకేష్   రెడ్ బుక్ పై వైసీపీ విమర్శలకు దర్శిత్ మహాభారత ఘట్టాన్ని ఉదహరిస్తూ గూస్‌బంప్స్ తెప్పించే విమర్శలు గుప్పించారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు చావు ముంగిట నిలబడి ధర్మం గురించి మాట్లాడినప్పుడు శ్రీకృష్ణుడు చెప్పిన సమాధానాన్ని గుర్తుచేశారు.  కౌరవ సభలో ద్రౌపదిని వివస్త్రను చేస్తున్నప్పుడు, పాండవులను అవమానిస్తున్నప్పుడు గుర్తురాని ధర్మం.. ఈరోజు నిన్ను కాపాడదు కర్ణా! ధర్మాన్ని నువ్వు పాటిస్తేనే అది నిన్ను కాపాడుతుంది అన్న కృష్ణుడి మాటలను నేటి రాజకీయాలకు అన్వయించారు. గత అసెంబ్లీలో 151 మంది కౌరవుల్లా కూర్చుని చంద్రబాబు నాయుడిని మానసిక క్షోభకు గురిచేసినప్పుడు, నారా భువనేశ్వరిని  అవమానించినప్పుడు, లోకేష్‌ను అవహేళన చేసినప్పుడు వైసిపి నాయకులకు ధర్మం గుర్తురాలేదా అని ప్రశ్నించారు. నాడు గుర్తురాని ధర్మం నేడు నెమరువేసుకుంటే లాభం లేదనీ.. ఎవడి కర్మకు వాడే బాధ్యుడు అన్న భగవద్గీత సూత్రాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా నారా లోకేష్ అమలు చేసి తీరుతారని హెచ్చరించారు.
కర్ణాటక రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ.. కాంగ్రెస్ విశ్వాసపాత్రుడు, ఆపద్బాంధవుడుగా నిలిచిన డీకే శివకుమార్ రాష్ట్ర అత్యున్నత పీఠాన్ని అందుకోనున్నారు. ప్రత్యర్థులకు  కనకపుర బండ, సొంత పార్టీకి  ట్రబుల్ షూటర్’గా గుర్తింపు తెచ్చుకున్న డీకే శివకుమార్ కర్నాటక సీఎంగా పదవీబాధ్యతలు చేపట్టనున్నారు.  కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో కుదిరిన ముందస్తు  ఒప్పందంలో భాగంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గురువారం (మే 28) తన పదవికి రాజీనామా చేశారు.  ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) అధ్యక్షుడు, ప్రస్తుత ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఖరారైంది.   ఇక డీకే ప్రస్థానం ఎలా సాగిందన్నది చూస్తే.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో  డీకే శివకుమార్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు.  80వ దశకంలో ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా  ప్రారంభించిన ఆయన..  1989లో తొలిసారి  శాసనసభకు  ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది, రాజకీయాల్లో  అపజయం ఎరుగని నేత   తిరుగులేని పట్టు సాధించారు.  ఒక్క కర్నాటక అనే కాదు.. దేశంలో ఎక్కడ, ఏ రాష్ట్రంలో  కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఏ కష్టం వచ్చినా.. ఆ కష్టం తీర్చేందుకు కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడూ డీకే శివకుమార్ వైపే చూసేది.   రిసార్ట్ రాజకీయాలైనా, ఎమ్మెల్యేలను కాపాడుకోవడమైనా ఆయన వ్యూహాలకు తిరుగుండేది కాదు. అందుకే ఆయనను పార్టీ   ట్రబుల్ షూటర్ గా భావించేది. డీకే శివకుమార్ రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనీలాండరింగ్ ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  ఆయనను అరెస్ట్ చేసి  50 రోజుల పాటు తిహార్ జైలులో ఉంచింది. ఆ అరెస్టుపై డీకే శివకుమార్ పలు సందర్భాలలో  తనకు రెండు దారులు చూపారనీ, వాటిలో ఒకటి బీజేపీలో చేరడం రెండో ది  జైలుకు వెళ్లడం.  అయితే తాను రెండో దారినే ఎంచుకున్నాననే ఆయన.. , జైలుకే వెళ్లాను కానీ పార్టీ మారలేదుచెప్పుకొచ్చారు.  ఆయన జైలులో ఉన్న సమయంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వయంగా తిహార్ జైలుకు వెళ్లి ఆయనను పరామర్శించడం అప్పట్లో దేశ రాజకీయాల్లో పెద్ద సంచలనంగా మారింది.  జైలు నుంచి విడుదలైన తర్వాత మరింత పట్టుదలగా పనిచేసిన శివకుమార్, కేపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని  అధికారంలోకి తీసుకురావడం కోసం అవిశ్రాంతంగా శ్రమించారు.  సిద్ధరామయ్య ప్రభుత్వంలో ఉపముఖ్యమంత్రిగా, బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ.. కాంగ్రెస్ ప్రకటించిన  ఐదు గ్యారెంటీల అమలులో  అత్యంత కీలకంగా వ్యవహరించారు.   గతంలో ఆయన ఇంధన శాఖ మంత్రిగా పనిచేసిన సమయంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద   పావగడ సోలార్ పార్క్' రూపుదిద్దుకుంది. ఇది ఆయన పాలనా దక్షతకు నిదర్శనంగా చెబుతారు పరిశీలకులు.  ఈడీ కేసులు, జైలు జీవితం, రాజకీయ వ్యూహాలు, సుదీర్ఘ నిరీక్షణల తర్వాత డీకే శివకుమార్  ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల తరువాత కర్నాటక సీఎంగా బాధ్యతలు చేపట్టనున్నారు. తన కలల పీఠాన్ని అధిరోహిస్తున్నారు. హైకమాండ్ ఆశీస్సులు,  కార్యకర్తల  అండతో    రానున్న రోజులలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే కాకుండా వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో  మరో సారి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని డీకే శివకుమార్ చెబుతున్నారు. 
ALSO ON TELUGUONE N E W S
A heartfelt social media appeal has now transformed into meaningful action. Within hours of publicly responding to concerns raised about the condition of legendary filmmaker Dasari Narayana Rao's samadhi, 'RawKing' Manoj Manchu personally visited the site and initiated cleaning efforts, reaffirming his respect for one of the most influential figures in the history of Telugu Cinéma. The gesture has drawn appreciation from film lovers and admirers of Dasari garu, whose contributions continue to inspire generations of filmmakers, actors, writers, and technicians. The initiative began after journalist and anchor Gautami shared a video highlighting the neglected condition of Dasari Narayana Rao garu's samadhi and expressed her disappointment at seeing the memorial in such a state. Deeply moved by the visuals, Manoj responded publicly on social media on Friday night, writing, "It genuinely felt very painful seeing the condition. Dasari Narayana Rao garu inspired generations and contributed immensely to Telugu cinema. Thank you for bringing this to everyone's attention. I promise this is the least I can contribute from my end." True to his word, Manoj arrived at the memorial by 7:00 AM the very next morning along with members of his team before heading to a scheduled film shoot. Speaking during the visit, he revealed that it had been three to four years since he last visited the samadhi. "I came across the video you posted and felt very bad seeing this. It's been three or four years since I visited. While crossing Chitrapuri Colony, I saw his statue and remembered the samadhi. Your video and my team showing it to me affected me deeply. I was unable to take it. That's why I made it a priority and came here before heading to my shoot," he said. Manoj and his team then undertook a thorough cleaning of the entire ghat area, clearing dried leaves and accumulated debris around the memorial premises. The effort was carried out with the intention of restoring cleanliness, dignity, and respect to a place associated with one of Telugu cinema's greatest visionaries. The visit also reflects the larger spirit behind AIKYA DHAIRYA SENA SAMITHI, the social service movement recently launched by Manoj and Mounika Bhuma Manchu with the motto Unity, Courage, Service, Impact. In recent weeks, Manoj has increasingly translated public concerns into direct action, whether through blood donation drives, humanitarian outreach, or support for people in need. His recent visit to MatruDevobhava Anadha Ashramam, where he personally helped rehabilitate and restore dignity to an abandoned and mentally distressed man named Santhosh, also drew widespread appreciation for its compassion and sincerity. Through AIKYA DHAIRYA SENA SAMITHI, Manoj has repeatedly stated that he wants to create a platform that serves as a voice for the voiceless and encourages collective social responsibility. His visit to Dasari Narayana Rao garu's samadhi now adds another dimension to that commitment - not only extending support to people in need, but also honouring and preserving the legacy of those who helped shape Telugu Cinéma itself. As his social outreach initiatives continue to expand, Manoj's latest gesture stands as a reminder that paying tribute is not merely about remembrance, but about responsibility. By turning a public concern into immediate action, he has ensured that the memory of a filmmaker who inspired generations is honoured with the dignity and respect it deserves. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
  30 ఇయర్స్ పృథ్వీ(Prudhvi Raj)కి నిజంగానే ఇండస్ట్రీలో  థర్టీ ఇయర్స్ ఎక్స్ పీరియెన్స్ ఉంది. పొలిటికల్ గాను కాక పుట్టే వ్యాఖ్యలు చేయడం పృథ్వీ స్పెషల్. సినీ కెరీర్ పరంగా చూసుకుంటే ఆయన అప్ కమింగ్ మూవీ రిస్క్. రీసెంట్ గా రిస్క్ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం జరిగింది.   ఈ ఈవెంట్ కి హాజరైన పృథ్వీ మాట్లాడుతూ మాట్లాడుతూ ఇటీవల కాలంలో చిన్న సినిమాల నుండి భారీ పాన్ ఇండియా చిత్రాల వరకు ప్రతి ఒక్కరూ కాలేజీ ఈవెంట్లని  నమ్ముకుని ప్రమోషన్లు చేయడం కొత్త ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ కాలేజీ వేడుకలు కేవలం కేరింతలు, కేకలకే పరిమితం అవుతున్నాయి. వీటి వల్ల థియేటర్లకి  ప్రేక్షకులని  రప్పించడం సాధ్యం కావడం లేదు. ఆ తరహా ప్రమోషన్ల వల్ల కలెక్షన్లకి పైసా ఉపయోగం ఉండటం లేదు. ప్రస్తుతం ఒక సినిమా బడ్జెట్‌లో దాదాపు 15 నుండి 20 శాతం వరకు కేవలం ప్రమోషన్ల కోసమే కేటాయిస్తున్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి కాలేజీ క్యాంపస్‌లలో నిర్వహించే ఆర్భాటపు వేడుకలు సోషల్ మీడియాలో కాసేపు హల్ చల్ చేయడానికి మాత్రమే పనికొస్తున్నాయి. ఒక సర్వే ప్రకారం, కాలేజీ ఈవెంట్లకి  హాజరయ్యే విద్యార్థులలో కేవలం 5 శాతం మంది మాత్రమే నిజంగా థియేటర్లకి  వెళ్లి సినిమా చూస్తున్నారని, మిగిలిన 95 శాతం మంది కేవలం సెలబ్రిటీలని  చూడటానికే వస్తున్నారని డేటా చెబుతోంది. కాబట్టి  కంటెంట్‌ బాగుంటేనే ప్రేక్షకులు సినిమాని  ఆదరిస్తారు. Also read: Amitabh bachchan: వైభవ్ సూర్యవంశీ ఆటపై అమితాబ్ బచ్చన్ షాకింగ్ ట్వీట్  గతంలో సినిమా ప్రమోషన్లు చాలా సహజంగా, ప్రజల్లోకి వెళ్లేలా ఉండేవి. కానీ నేడు డిజిటల్ వ్యూస్, యూట్యూబ్ ట్రెండింగ్, కాలేజీ ఈవెంట్ల చుట్టూనే ప్రమోషన్ల హడావుడి నడుస్తోంది. సినిమా బాగుంటే పబ్లిసిటీ లేకపోయినా 100 శాతం సక్సెస్ అవుతుందని, థియేటర్లలో సీట్లు నిండుతాయని ఆయన ఉదాహరణలతో వివరించారు. పృథ్వీ  రాజ్ తన మాటలతో  కాలేజీ ఈవెంట్లలో కనిపించే ఆ కాసేపటి క్రేజ్ చూసి సినిమా సూపర్ హిట్ అయిపోతుందని భ్రమపడొద్దని  గట్టి హెచ్చరిక ఇచ్చినట్లయిందని సినీ విశ్లేషకులు చెప్తున్నారు.  
  బిగ్ బి అమితాబ్ బచ్చన్ కి ఉన్న క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. ఎనిమిది పదుల వయసులోనూ మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. కల్కి 2 లో మరో సారి తన సత్తా చాటడానికి సిద్దమవుతున్న అమితాబ్ ఐ పి ఎల్ లో అదరగొడుతున్న  వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఆటతీరు చూసి చిన్న వయసులోనే ఇంతటి పరిణతితో, అంతర్జాతీయ స్థాయి బౌలర్లని ఎదుర్కొంటూ భారీ ఇన్నింగ్స్ ఆడటంపై బిగ్ బి ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  మ్యాచ్ ముగిసిన వెంటనే అర్ధరాత్రి తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతా ద్వారా వైభవ్‌ను ప్రశంసిస్తూ ఒక ప్రత్యేకమైన పోస్ట్‌ను షేర్ చేశారు. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్ల అద్భుతమైన సూర్యుడు. ఆ వయసులో అయితే మాకు కనీసం  గోళీలు, గల్లీ క్రికెట్ కూడా ఆడటం వచ్చేది కాదు. అలాంటిది అతను  అంతర్జాతీయ బౌలింగ్‌ను చీల్చి చెండాడుతున్నాడు" అంటూ అమితాబ్ బచ్చన్ చాలా సరదాగా, అంతే గౌరవంగా రాసుకొచ్చారు. అమితాబ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. Also read: Jayakrishna: తాత, తండ్రి, బాబాయ్ పేరు నిలబెడతాడా!.. శ్రీనివాస మంగాపురం ఏం చెప్పబోతోంది   
  -శ్రీనివాస మంగాపురం ఏం చెప్పబోతోంది  -ఘట్టమనేని మూడో తరం వారసుడు ఇండస్ట్రీని రూల్ చేస్తాడా! -తండ్రి రమేష్ బాబు దాటి జయకృష్ణ టాప్ బెర్త్ ని పొందుతాడా! -కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ కోరిక ఏంటి    ఘట్టమనేని(Ghattamaneni).. ఈ పేరు వినపడటం ఆలస్యం.. అభిమానులు, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో కృష్ణ ,మహేష్ తాలూకు వైబ్రేషన్స్ స్టార్ట్ అవ్వడం మొదలవుతాయి. అంతలా  సూపర్ స్టార్ కృష్ణ టాలీవుడ్‌లో సృష్టించిన ప్రభంజనం, ఆయన వారసుడిగా వచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు(Mahesh Babu)సృష్టిస్తున్న ప్రభంజనాలు గుర్తుకొస్తుంటాయి. అయితే కృష్ణ(Krishna)గారి పెద్ద కుమారుడు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు(Ramesh Babu)హీరోగా ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. దురదృష్టవశాత్తూ ఆయన ఇప్పుడు మధ్య లేరు. కానీ ఆయన సినీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని 'శ్రీనివాస మంగాపురం(Srinivasa Mangapuram)అనే చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు ఈ చిత్రం నుంచి ఇప్పటి వరకు వచ్చిన ప్రచార చిత్రాలు చూస్తుంటే డాన్స్,లవ్,  రొమాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లో జయకృష్ణ ఒక రేంజ్ లో మెస్మరైజ్ చేయబోతున్నట్టుగానే ఉంది. దీంతో ఘట్టమనేని ఫ్యామిలీ నుండి వస్తున్న ఈ మూడో తరం వారసుడిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఇప్పుడు అభిమానుల్లో మెదులుతున్న ఒకే ఒక్క ప్రశ్న.. "జయకృష్ణ తన తండ్రి రమేష్ బాబు పేరుని నిలబెడతాడా?" అని. ఎందుకంటే కృష్ణ మొదటి వారసుడిగా రమేష్ బాబు హీరోగా కొన్ని సినిమాలు చేసాడు. కానీ లాంగ్ రన్ పరంగా సక్సెస్ కాలేకపోయాడు. దీంతో ఇప్పుడు అభిమానులు జయకృష్ణ ఇండస్ట్రీలో పూర్తి స్థాయిలో నిలదొక్కుకోవాలని కోరుతున్నారు. ఈ విషయంలో బాబాయ్    మహేష్ సపోర్ట్ జయకృష్ణకి వంద శాతం ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో  బాబాయ్ మార్గదర్శకత్వంలో, తండ్రి సాధించలేని దానిని  జయకృష్ణ టాలీవుడ్‌లో  సాధిస్తాడని ఘట్టమనేని  ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.  Also read: Peddi: పెద్దికి బిగ్ షాక్: హైకోర్టులో పిటిషన్ వేసి మళ్ళీ వెనక్కి తీసుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ  శ్రీనివాస మంగాపురం విషయానికి వస్తే ఆర్ ఎక్స్ 100 ఫెమ్ అజయ్ భూపతి దర్శకుడు కాగా రషా తడాని హీరోయిన్. ఈమె ఎవరో కాదు ఒకప్పటి అగ్ర హీరోయిన్ రవీనా టాండన్ కూతురు.  అశ్వని దత్, జెమినీ కిరణ్ నిర్మాతలు. రిలీజ్ డేట్ త్వరలోనే రానుంది.    
Tejaswini Nandamuri, daughter of Nandamuri Balakrishna, has become the latest talking point on social media after a dance video featuring her alongside Bhanu Master went viral. Known for maintaining a low public profile, Tejaswini surprised many with her effortless grace, expressive movements, and natural confidence on the dance floor. While fans are familiar with her work behind the scenes, few expected to see her display such ease in front of the camera. The video quickly gained traction online, with viewers praising her elegance and screen presence. Many fans remarked that she carried herself with remarkable poise, making every step look effortless. What makes the response particularly interesting is that Tejaswini has largely stayed away from the spotlight despite belonging to one of Telugu cinema's most prominent families. Her appearance in the dance video offered a rare glimpse of a side that audiences had never really seen before. In an era where viral moments are often manufactured, Tejaswini's performance struck a chord because it felt unexpected and genuine. For many viewers, it wasn't just the dance that stood out—it was the quiet confidence with which she owned the moment. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)వన్ మాన్ షో పెద్ది(Peddi)ఇంకో నాలుగు రోజుల్లో థియేటర్స్ లో సందడి చేయడానికి రెడీ అవుతుంది. జూన్ 4 రిలీజ్ డేట్ అయినా మూడవ తారీకు నుంచే ప్రీమియర్స్ పడనున్నాయి. అయితే సినిమా రిలీజ్ సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో ఈ చిత్ర నిర్మాణ సంస్థకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  నైజాం ఏరియాలో సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ పెద్ది నిర్మాణ సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ని  చిత్ర బృందం తెలంగాణ హైకోర్టు నుంచి హఠాత్తుగా ఉపసంహరించుకుంది. దీంతో తెలంగాణలో సాధారణ ప్రభుత్వ ధరలకే పెద్ది విడుదల కావడం దాదాపు ఖాయమైపోయింది. సినిమా నిర్మాణ వ్యయం భారీగా పెరగడంతో, సినిమా విడుదలైన మొదటి వారం రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని  మేకర్స్ ఈ నెల 15న మరియు 25న రెండు సార్లు రాష్ట్ర హోమ్ సెక్రటరీకి అధికారికంగా వినతిపత్రాలు సమర్పించింది. అయితే ప్రభుత్వం నుండి ఎలాంటి సానుకూల స్పందన రాకపోవడంతో, చిత్ర యూనిట్ తరపున యలమంచిలి రవిశంకర్ అత్యవసరంగా తెలంగాణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సుద్దాల చలపతిరావు నేతృత్వంలోని వెకేషన్ బెంచ్ ఈ పిటిషన్‌పై శుక్రవారం సుదీర్ఘంగా విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎం.వి. ప్రతాప్ కుమార్ వాదనలు వినిపిస్తూ, టికెట్ ధరల పెంపుపై ప్రభుత్వ అధికారులు సకాలంలో నిర్ణయం తీసుకోవడం లేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, హోమ్ డిపార్ట్‌మెంట్ తరఫు న్యాయవాది మహేష్ రాజే దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పటికే టికెట్ ధరల పెంపునకు సంబంధించిన పలు కేసులు డివిజన్ బెంచ్ మరియు సింగిల్ బెంచ్ల ముందు పెండింగ్‌లో ఉన్నాయని, గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఇప్పుడు అత్యవసరంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే తీవ్ర గందరగోళం నెలకొంటుందని కోర్టుకు వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు, ఈ దశలో ఎలాంటి అనుకూల ఆదేశాలు ఇవ్వడానికి మొగ్గు చూపలేదు. పైగా తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. సినిమా జూన్ 4నే థియేటర్లలోకి వస్తుండటంతో, జూన్ 6న జరిగే కోర్టు విచారణ వల్ల చిత్ర యూనిట్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒకవేళ రిలీజ్ ని  వాయిదా వేస్తే  బిజినెస్ పరంగా భారీ నష్టం వాటిల్లుతుందని మైత్రీ మూవీ మేకర్స్ భావించింది. దీంతో కోర్టు అభిప్రాయాన్ని గౌరవిస్తూ, ఈ పిటిషన్‌ని  పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలియజేయగా, అందుకు కోర్టు అనుమతించింది. Also read: Ntr: కాలిఫోర్నియాలో ఎన్టీఆర్ 103వ జయంతి వేడుకలు..వైరల్ అవుతున్న పూర్తి మ్యాటర్  మరోవైపు పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ‘పెద్ది’కి భారీగా టికెట్ రేట్ల పెంపుతో పాటు స్పెషల్ షోలకి  కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 3న రాత్రి 8 గంటలకే ఏపీలో పెయిడ్ ప్రీమియర్ షోలు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను ఏకంగా జీఎస్టీతో కలిపి 600 రూపాయలుగా నిర్ణయించారు. అంతేకాకుండా, మొదటి వారం రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్ లలో 100 రూపాయలు, మల్టీప్లెక్స్‌లలో 125 రూపాయల చొప్పున అదనంగా టికెట్ ధరలను పెంచుకునేందుకు, రోజుకు 5 షోలు ప్రదర్శించుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో మాత్రం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ పర్సంటేజ్ సిస్టమ్ విధానంపై పట్టుబడుతుండటం, రేట్ల పెంపునకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం కూడా చిత్ర బృందానికి ప్రతికూలంగా మారింది. ఏదేమైనా నైజాం ప్రాంతంలోని మెగా అభిమానులకి, సాధారణ ప్రేక్షకులకి ఎలాంటి అదనపు భారం లేకుండా సాధారణ ధరలకే పెద్దిని చూడటం పెద్ద ఊరట అని చెప్పవచ్చు.   
  విశ్వంలో తెలుగు జాతి నమూనా అనేది ఉన్నంత కాలం ప్రతి తెలుగు వారి నోటి వెంట నిత్యం నానుతుండే పేరు ఎన్టీఆర్(Ntr). పంచభూతాలు ఎన్టీఆర్ అనే వర్డ్ కి దాసోహమన్నట్టుగా సినీ, రాజకీయాల్లో నడిచిన ఆయన అజమాయిషీ నడుస్తున్న కలియుగానికి  ప్రత్యేకమైన గుర్తింపుని సైతం తీసుకొచ్చింది. మొన్న మే 28 న ఆ మహానుభావుడి  103వ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరిగాయి.  కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, సరిహద్దులు దాటి అమెరికాలోని కాలిఫోర్నియా (California) నగరంలో ప్రవాసాంధ్రులు నిర్వహించిన ఈ ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలిఫోర్నియాలోని 'బే' ఏరియాతో పాటు ప్రముఖ నగరాల్లో నివసిస్తున్న వందలాది తెలుగు కుటుంబాలు, నందమూరి అభిమానులు ఈ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి, 'జోహార్ ఎన్టీఆర్' అంటూ ప్రవాస తెలుగు వారు చేసిన నినాదాలతో కాలిఫోర్నియా వీధులు మారుమోగిపోయాయి. ఈ 103వ జయంతి వేడుకలలో భాగంగా ఎన్టీఆర్ గారు తెలుగు సమాజానికి, ముఖ్యంగా రాజకీయ రంగానికి మరియు సినిమా పరిశ్రమకి చేసిన అసమానమైన సేవలని వక్తలు గుర్తుచేసుకున్నారు. కేవలం 9 నెలల్లోనే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి, 2 రూపాయలకే కేజీ బియ్యం వంటి చారిత్రాత్మక సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టి పేదల గుండెల్లో 'అన్న'గా నిలిచిన తీరుని  ప్రవాసాంధ్రులు కొనియాడారు. ఈ వేడుకల సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎన్టీఆర్ సినీ వైభవాన్ని కళ్ళకి కట్టినట్టుగా చూపించాయి. దాదాపు 300 పైగా చిత్రాల్లో నటించి, పౌరాణిక, జానపద, సాంఘిక పాత్రల్లో మెప్పించిన ఆయన సూపర్ హిట్ పాటలకు స్థానిక తెలుగు యువత  పిల్లలు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కాలిఫోర్నియా ఈవెంట్‌లో అన్నగారి స్మారకార్థం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. అమెరికాలోని ప్రతినిధులు స్థానిక స్వచ్ఛంద సంస్థల సహకారంతో 1000 మందికి పైగా నిరుపేదలకు ఆహార వితరణ (Food Donation) కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలోని తెలుగు రాష్ట్రాల్లో కూడా నందమూరి కుటుంబ సభ్యులు, నారా బ్రాహ్మిణి గారు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకి  పండ్లు పంపిణీ చేయగా, ఇటు కాలిఫోర్నియాలోనూ అదే సేవా స్ఫూర్తిని ప్రదర్శించడం విశేషం. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలని ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలు, రాబోయే తరాలకు ఎన్టీఆర్ గారి ఆదర్శాలని, తెలుగు భాషా ప్రాముఖ్యతని  తెలియజేసేలా ఉన్నాయని పెద్దలు అభిప్రాయపడ్డారు. Also read: Ajith Kumar: అజిత్ ఇంట్లో తీవ్ర విషాదం.. శోక సంద్రంలో అజిత్  ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా అమెరికాలో స్థిరపడిన దాదాపు 50 కి పైగా ఐటీ మరియు వ్యాపార రంగ ప్రముఖులు హాజరై అన్నగారితో తమకున్న అనుబంధాన్ని, చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు. ఆయన క్రమశిక్షణ, సమయపాలన నేటి యువతకి ఎంతో మార్గదర్శకమని పేర్కొన్నారు. ఈ ఉత్సవాలు కేవలం ఒక పుట్టినరోజు వేడుకలా కాకుండా, కాలిఫోర్నియాలోని తెలుగు వారందరినీ ఒకే తాటిపైకి తెచ్చిన ఒక గొప్ప పండుగలా సాగాయి. చివరగా కేక్ కట్ చేసి, అన్నగారి అమరత్వానికి నివాళులర్పించడంతో ఈ సుదీర్ఘ వేడుక అత్యంత ఘనంగా ముగిసింది.  
    -అగ్ర హీరో అజిత్ ఇంట్లో విషాదం  -తల్లి మోహినీ మణి కన్నుమూత  కోలీవుడ్ స్టార్ హీరో, తెలుగుప్రేక్షకులకి  కూడా ఎంతో సుపరిచితులైన నటుడు అజిత్ కుమార్(Ajith Kumar)ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అజిత్ కుమార్ మాతృమూర్తి మోహినీ మణి (84) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా వృద్ధాప్య రీత్యా వచ్చే  అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ వార్త తెలియడంతో అజిత్ అభిమానులతో పాటు యావత్ సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది.   మోహినీ మణి (Mohini Mani) కోల్‌కతాకి  చెందిన సింధీ కుటుంబానికి చెందిన మహిళ. ఆమె కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన పి.ఎస్. మణిని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి అనూప్ కుమార్, అజిత్ కుమార్, అనిల్ కుమార్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. గత ఏడాది 2023 మార్చి 24న అజిత్ తండ్రి పి.ఎస్. మణి (85) అనారోగ్యంతో మరణించిన సంగతి తెలిసిందే. సరిగ్గా మూడేళ్ల వ్యవధిలోనే అజిత్ తల్లి కూడా మరణించడంతో ఆ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయినట్లయింది. తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోయిన అజిత్ కుమార్ తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.  అజిత్ కుమార్ తల్లి మోహినీ మణి మరణవార్త తెలుసుకున్న తమిళ, తెలుగు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ సానుభూతిని ప్రకటిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అజిత్ కుటుంబానికి ధైర్యం చెబుతూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.  also read:  తెర లోపల నుంచి ప్రేక్షకుల్లోకి దూసుకొచ్చిన కారు..ముమ్మాటికీ ఇది వాళ్ళ పనే చెన్నై పాలవాక్కంలోని అజిత్ నివాసానికి పలువురు సినీ నటులు చేరుకుని భౌతికకాయానికి నివాళులర్పిస్తున్నారు. అయితే, అజిత్ కుటుంబ ఆచారం ప్రకారం అంత్యక్రియలు అత్యంత సాదాసీదాగా, కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ కష్టసమయంలో తమ వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని అజిత్ కుటుంబ సభ్యులు కోరారు.తమ అభిమాన హీరో తల్లి మరణించారనే వార్త వినగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజిత్ కుమార్ (AK) అభిమానులు సోషల్ మీడియాలో 'RIP Amma' అంటూ పోస్టులు పెడుతున్నారు. అమ్మపై అజిత్‌కు ఉన్న ప్రేమాభిమానాలు అందరికీ తెలిసినవే కావడం వల్ల, ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆ భగవంతుడు అజిత్‌కు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. సినిమా షూటింగులలో ఎంత బిజీగా ఉన్నా కుటుంబానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చే అజిత్, తన మాతృమూర్తి కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.  
A wave of grief has swept through the Tamil film industry following the passing of Mohini Mani, the mother of actor Ajith Kumar. She breathed her last on Saturday at the age of 84, reportedly due to age-related health complications. For Ajith Kumar and his family, the loss is particularly heartbreaking as it comes just three years after the death of his father, P. Subramaniam Mani, in March 2023. The family is now mourning the passing of the woman who stood at its centre for decades. Born into a Sindhi family in Kolkata, Mohini built a life rooted in family and quiet resilience. She is survived by her three sons — Anup Kumar, Ajith Kumar and Anil Kumar. While Ajith's stardom has placed the family in the public eye, they have consistently chosen to keep their personal lives away from attention, facing both milestones and hardships with remarkable privacy and dignity. As news of her demise spread, condolences poured in from across the film fraternity and from countless fans. Social media was flooded with messages remembering Mohini and offering strength and prayers to the bereaved family. Though she remained largely away from the spotlight, many acknowledged the invaluable role she played in shaping and supporting one of Indian cinema's most beloved stars. The family is expected to perform the final rites in a private ceremony attended by close relatives and loved ones. At a time of immense personal loss, the thoughts of the film industry and Ajith Kumar's admirers remain with the family as they bid farewell to a beloved mother and matriarch. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), 'ఉప్పెన' ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ శరవేగంగా దూసుకుపోతుండగా, సీనియర్ యాక్టర్ జగపతి బాబు సినిమా కోర్ ప్లాట్‌కు సంబంధించిన ఒక సంచలనమైన విషయాన్ని లీక్ చేశారు. తాజాగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన జగ్గు భాయ్, 'పెద్ది' సినిమా అసలు కథ దేని చుట్టూ తిరగబోతుంది, అలాగే రామ్ చరణ్ మరియు తన పాత్రల మధ్య ఎలాంటి బంధం ఉండబోతుందనే క్రేజీ అప్‌డేట్‌ను బయటపెట్టారు. ఈ చిత్రంలో జగపతి బాబు 'అప్పలసూరి' అనే కీలక పాత్రను పోషిస్తున్నారు. చెదిరిన జుట్టు, ఒత్తైన గడ్డం, దారంతో కట్టిన విరిగిన కళ్లజోడుతో నేషనల్ అవార్డ్ విన్నింగ్ మేకప్ ఆర్టిస్ట్ రషీద్ డిజైన్ చేసిన ఈ రా అండ్ ఇంటెన్సివ్ గెటప్ ఇప్పటికే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.  ఈ పాత్ర గురించి జగపతి బాబు వివరిస్తూ.. “సినిమాలో రామ్ చరణ్ 'పెద్ది' అనే టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. వయసు రీత్యా అతనికంటే చాలా పెద్దవాడైన 'అప్పలసూరి' పాత్రలో నేను కనిపిస్తాను. వయసులో ఇంత వ్యత్యాసం ఉన్నప్పటికీ, సినిమాలో మా ఇద్దరి క్యారెక్టర్ల మధ్య బాండింగ్ చాలా క్లోజ్ గా ఉంటుంది. ఏకంగా ఒకరినొకరు 'అరేయ్.. ఒరేయ్' అని పిలుచుకునే రేంజ్‌లో ఈ రిలేషన్ ఉంటుంది. ఈ ఇద్దరి మధ్య సాగే బాండింగ్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడమే కాకుండా సినిమాకే ప్రధాన హైలైట్‌గా నిలుస్తుంది” అని స్పష్టం చేశారు. అంతేకాకుండా, 'పెద్ది' సినిమా నడిచే మెయిన్ థీమ్ ఏంటనే అసలు రహస్యాన్ని కూడా జగపతి బాబు వెల్లడించారు. “ఈ రోజుల్లో సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య 'గుర్తింపు'. ప్రతి ఒక్కరికీ ఈ సమస్య ఏదో ఒక రూపంలో నిత్య జీవితంలో కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఒక జెన్యూన్ ఐడెంటిటీ ప్రాబ్లం మరియు సమాజంలో ఒక వ్యక్తి తన గుర్తింపు కోసం పడే తపన చుట్టూనే బుచ్చిబాబు సన ఈ కథ మొత్తాన్ని అద్భుతంగా అల్లారు.” అంటూ స్టోరీ ఎలా ఉండబోతుందో చెప్పారు జగపతి బాబు. గతంలో రామ్ చరణ్ సరసన 'రంగస్థలం'లో ప్రెసిడెంట్ పాత్రలో విలనిజం పండించిన జగపతి బాబు, ఈ రూరల్ డ్రామాలో అంతకుమించి అప్పలసూరిగా విశ్వరూపం చూపించబోతున్నట్లు తెలుస్తోంది.  జగ్గు భాయ్ లీక్ చేసిన ఈ ఐడెంటిటీ క్రైసిస్ పాయింట్, రామ్ చరణ్ తో ఆయనకున్న 'అరేయ్ ఒరేయ్' రిలేషన్ షిప్ ఎపిసోడ్స్ థియేటర్లలో ఏ రేంజ్ ఎమోషన్ పండించబోతున్నాయో అని మెగా అభిమానులు జూన్ 4 కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
పెళ్లి ఈ ప్రపంచంలో ఎంతో గొప్ప వేడుక. భారతీయులకు అయితే పెళ్లి అనేది జీవితంలో అతిపెద్ద పండుగ అని చెప్పవచ్చు.  కానీ నేటికాలంలో ఆ వైవాహిక బంధం మసకబారింది. కొత్తగా పెళ్లైనవాళ్లు ఏడాది కూడా గడపకుండానే విడిపోతున్నారు, ఇదే విడ్డూరం అనుకుంటే.. పెళ్లై ఏళ్ల తరబడి కాపురాలు చేసిన వారు కూడా విడాకులు తీసుకుంటున్నారు. వివాహం అనేది ఎంత సంతోషకరమైన విషయమో.. విడిపోవాలని నిర్ణయించుకోవడం,  విడాకులు తీసుకోవడం అంతకంటే బాధాకరమైన విషయం. ఒకరికి ఒకరు అనుకుని, జీవితాంతం కలిసి ఉండాలనుకుని భార్యాభర్తలుగా మారిన ఇద్దరు వ్యక్తులు విడిపోవాలని అనుకునే ముందు కొన్ని ప్రశ్నలు తమకు తాము వేసుకోవాలని అంటున్నారు  అవేంటో తెలుసుకుంటే.. విడిపోవడం.. చాలామంది భార్యాభర్తలు విడిపోవడం అంటే  కేవలం ఒక భావోద్వేగ ప్రతిచర్యగా కొట్టిపారేస్తుంటారు. కేవలం వారే కాదు.. చుట్టూ ఉన్న వ్యక్తులు, కుటుంబ సభ్యులు కూడా అలాగే అనుకుంటారు. కానీ విడిపోవడాన్ని కొద్దిపాటి అవగాహనతో, స్పష్టతతో ఆలోచించటం వల్ల విడిపోయిన తర్వాత పశ్చాత్తాపం పడకుండా  చూసుకోవచ్చు.  కొన్నిసార్లు కష్టంగా అనిపించినా, విడిపోవడం అనుకునే ఆలోచన ఆపుకోవడం అనేది సరైన నిర్ణయం అవుతుంది. అసలు సమస్య.. విడిపోవాలని అనుకునే నిర్ణయం కేవలం అలసట వల్ల లేక విసిగిపోవడం వల్ల లేక మరేదైనా తాత్కాలిక భావోద్వేగం వల్ల వచ్చిన ఆలోచనా లేదా నిజమైన సమస్యా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు లేదా గృహ సమస్యలు  సంబంధంపై ఒత్తిడిని కలిగించవచ్చు. కానీ  ఆలోచనలు, లక్ష్యాలు , పద్ధతులు భిన్నంగా ఉంటే, అది అంతకంటే లోతైన అగాధం అని అర్థం. ప్రేమ.. ప్రేమ అనేది కేవలం ఒక ఎమోషన్ మాత్రమే కాదు, అది మెదడులోని ఒక రసాయన అనుసంధానం కూడా. ఒక బంధం ముగిసినప్పుడు, ఏదో ఒక అలవాటును తెంచుకుంటున్నట్లుగా శరీరం ప్రతిస్పందిస్తుంది. దీనివల్ల, హఠాత్తుగా ఫోన్ చేయాలనే లేదా తిరిగి వెళ్లాలనే కోరిక కలగవచ్చు, కానీ వాస్తవానికి అది కేవలం ఒక శారీరక ప్రతిచర్య మాత్రమే. కాబట్టి లేని ప్రేమను ఉందని అనుకోవడం కూడా భ్రమే...  ఉన్న ప్రేమను చంపేసుకోవడం కూడా తప్పే.. పరిస్థితి.. విడిపోవాలని ఆలోచన ఏదైనా గొడవ లేదా సంఘర్షణ వంటివి జరగడం వల్ల వస్తాయి.  అలాంటివి జరిగినప్పుడు మిమ్మల్ని మీరు అప్పటికే విడిపోయామని  ఊహించుకోండి అంతా ముగిసిపోయిందని, మీరు ఒంటరిగా కూర్చున్నారని ఊహించుకోండి. మీకు లోపల విచారం లేకుండా ఏదో బరువు దిగిపోయినట్టు, జీవితం ఇక సాఫీగా ఉంటుందని.. ఇలా  తేలికైన భావన కలిగితే, ఆ బంధం అప్పటికే ముగిసిపోయిందనడానికి సంకేతం. అలా కాకుండా విడిపోయామని ఊహించుకున్నప్పుడు జీవితం అర్థం లేకుండా ఏదో కోల్పోయినట్టుగా,  భాగస్వామి ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా అనిపిస్తే అప్పుడు విడాకుల ఆలోచన తప్పని అర్థం. మనసే కాదు.. ఒక సంబంధాన్ని ముగించడం అనేది కేవలం మనసుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, దానిలో జీవితంలోని అనేక అంశాలను వదులుకోవడం కూడా ఉంటుంది. డబ్బు, స్నేహితులు, రోజువారీ అలవాట్లు అన్నీ మారిపోతాయి. తరచుగా, ఈ భయం ప్రజలను తిరిగి అదే సంబంధంలోకి వెళ్ళేలా చేస్తుంది. స్పష్టత.. అత్యంత ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే,  చెప్పాలనుకున్న విషయాన్న భాగస్వామికి  సరిగ్గా తెలియజేశారా? తమ  అవసరాలను, ఆందోళనలను భాగస్వామికి స్పష్టంగా తెలియజేయకపోతే, 'ఒకవేళ అలా జరిగి ఉంటే?' అనే సందేహాలు మిగిలిపోతాయి. అందువల్ల, ఒక నిర్ణయం తీసుకునే ముందు మీతో మీరు నిజాయితీగా ఉండటం చాలా ముఖ్యం.                          *రూపశ్రీ.
ప్రతి తల్లిదండ్రులు తమ కూతురు జీవితంలో విజయవంతంగా, బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని కోరుకుంటారు. దీనికి మంచి విద్య, మంచి విలువలు చాలా అవసరం. ఇవన్నీ ఉన్నా సరే.. కొంతమంది అమ్మాయిలు తమ జీవితంలో చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వివాహం తర్వాత అమ్మాయిల జీవితం తమ చేతుల్లో నుండి జారిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అమ్మాయిలు తరచుగా ఇతరులను సంతోషపెట్టడానికి తమ కోరికలను, భావోద్వేగాలను అణచివేసుకుంటారు. ఈ అలవాటు క్రమంగా వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది.  అందుకే అమ్మాయిలకు విలువలు,  మంచి విద్య మాత్రమే కాదు.. ఎంత కష్టంలో అయినా నిలబడాలంటే.. ప్రతి తల్లి తన కూతురికి కొన్ని నేర్పించాలి. వాటిలో  ముఖ్యమైనది.. ఏదైనా కరెక్ట్ కాని విషయానికి " నో " చెప్పడం.  ఇలా ఏదైనా సరికాని విషయానికి నో చెప్పడం అమ్మాయిలను ఎందుకు బలంగా ఉంచుతుంది? దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. "నో" అని చెబితే.. ఒక అమ్మాయి 'కాదు' అని చెప్పడం నేర్చుకున్నప్పుడు, ఆమె సంబంధాలలో, వృత్తిలో , సమాజంలో తనను తాను గౌరవించుకోవడం కూడా నేర్చుకుంటుంది. ఈ ఒక్క అలవాటే ఆమెను మానసికంగా దృఢంగా, స్వయం సమృద్ధిగా , ఆత్మవిశ్వాసంతో ఉండేలా చేస్తుంది. ఇది  జీవితంలో ముందుకు సాగడానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఆత్మగౌరవం పెరుగుతుంది.. ఆడపిల్ల తన ఇష్టాయిష్టాలను బయటకు  వ్యక్తపరిచినప్పుడు, ఆమె తన ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటుంది. దీనివల్ల ఆమెకు ఆత్మగౌరవం పెరుగుతుంది. తప్పుడు వ్యక్తుల నుండి దూరం.. మొహమాటంతోనో లేక ఇతరులను సంతోషపెట్టాలనో ప్రతి దానికి సరే అని చెప్పే అలవాటు.. ఎదుటివారు అమ్మాయిలను  స్వార్థం కోసం ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. 'కాదు' అని చెప్పడం  భద్రతను ఇస్తుంది. అమ్మాయిలకు ఏదైనా సరికాదు అనిపిస్తే మొహమాటం లేకుండా నో చెప్పడం వల్ల జీవితంలో ఎన్నో సమస్యలను నివారించవచ్చు. నిర్ణయాలలో ఆత్మవిశ్వాసం.. తన మనసులోని మాటను చెప్పడానికి భయపడని అమ్మాయి జీవితంలోని అతిపెద్ద నిర్ణయాలను కూడా ఆత్మవిశ్వాసంతో తీసుకోగలదు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది.. అందరినీ సంతోషంగా ఉంచాలని ప్రయత్నించడం ఒత్తిడిని పెంచుతుంది. అందుకే ప్రతి అమ్మాయి తన  స్వంత బౌండరీస్ ను నిర్దేశించుకోవడం మనశ్శాంతిని ఇస్తుంది. బలమైన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తుంది.. స్పష్టమైన ఆలోచన , ముక్కుసూటితనం ఉన్న అమ్మాయిలు సమాజంలో ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టిస్తారు. పొగరు, లెక్కలేనితనం.. ఇలాంటి మాటలు అనుకునేవారు కూడా ఉంటారు.  కానీ వ్యక్తిత్వం, మంచితనం,  నిర్ణయాలు సరిగా తీసుకోవడం వంటివి జరుగుతూ ఉంటే.. విమర్శించిన వారే మెచ్చుకునే రోజులు వస్తాయి. దీని వల్ల వ్యక్తిత్వం బలంగా మారుతుంది. ఎలా నేర్పాలి.. ఏదైనా విషయం సరికాదు అనిపిస్తే దానికి నో చెప్పడం ఎలా అనే విషయాన్ని తల్లులు తమ కూతురికి నేర్పాలి.  కానీ ఎలా నేర్పాలో కొందరికి అర్థం కాదు. తల్లి కూతురి దగ్గర స్నేహితురాలిగా ఉండి మనసు విప్పి మాట్లాడాలి.  దీనివల్ల కూతురి ఏ విషయాన్ని అయినా మనసు విప్పి పంచుకోగలుగుతుంది. అందరినీ సంతోషపెట్టడం కోసం అన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదని అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఆడపిల్ల అభిప్రాయానికి, నిర్ణయాలకు విలువ ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలలో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి.  తీసుకున్న నిర్ణయాలు సరిగా లేకపోయినా,  వాటిలో ఏవైనా ఇబ్బందులు ఎదురైనా.. వాటిని వివరించి చెప్పాలి. తప్పు చేసినప్పుడు లేదా తప్పు నిర్ణయాలు తీసుకున్నప్పుడు తిట్టడానికి బదులుగా వాటి పర్యావసానాలు వివరించి చెప్పాలి.  ఎలా నిర్ణయం తీసుకుంటే బాగుండేదో.. ఎలా ఉండాలో చెప్పాలి. ఆడపిల్ల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం తప్పు విషయం కాదని,  అది తన వ్యక్తిత్వాన్ని  తెలియజేస్తుందని వివరించాలి.  అప్పుడే అబిప్రాయాలు, నిర్ణయాలు ఎలా ఉండాలో.. ఎలా ఉండే తన వ్యక్తిత్వం మంచిగా ఉంటుందో వారికి అర్థమవుతుంది.                           *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే, చెమట నీళ్ళు కుమ్మరించినట్టు కారిపోతూ ఉంటుంది.  ఎంతమంచి బట్టలు వేసుకున్నా చెమట కారణంగా పాడైపోతూ ఉంటాయి.పైగా చెమట కారణంగా దుర్వాసన కూడా వస్తుంది. చెమట వాసన చాలా మందికి పెద్ద సమస్యగా మారుతుంది. ముఖ్యంగా  ఎక్కువ సేపు బయట ఉండాల్సి వచ్చినప్పుడు లేదా తీవ్రమైన వేడిలో పని చేస్తున్నప్పుడు, శరీర దుర్వాసన చాలా ఇబ్బంది పెడుతుంది.  చాలా మంది ఖరీదైన డియోడరెంట్లు , పెర్ఫ్యూమ్‌లను ఉపయోగిస్తారు, కానీ వాటి ప్రభావం కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. శరీరంలోని బ్యాక్టీరియా చెమటతో కలిసి దుర్వాసనను ఉత్పత్తి చేసినప్పుడు అసలు సమస్య మొదలవుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా శరీర దుర్వాసనను వదిలించుకోవాలనుకుంటే, కొన్ని ఇంటి చిట్కాలు సహాయపడతాయి.  ఆ సులభమైన ఇంటి చిట్కాలేంటో తెలుసుకుంటే.. వేసవిలో శరీర దుర్వాసన ఎందుకు పెరుగుతుంది? వేసవిలో శరీరానికి ఎక్కువగా చెమట పడుతుంది. ఈ చెమట చర్మంపై ఉండే బ్యాక్టీరియాతో సంపర్కంలోకి వచ్చినప్పుడు, దుర్వాసన వెలువడుతుంది. శరీరాన్ని సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే లేదా చెమట ఎక్కువసేపు శరీరంపై ఉండిపోతే, శరీర దుర్వాసన సమస్య పెరుగుతుంది. శరీర దుర్వాసన రాకూడదంటే.. స్నానం నీటిలో వీటిని కలపాలి.. నిమ్మరసం.. బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది శరీరానికి తాజా అనుభూతిని కలిగిస్తుంది. చెమట వాసనను తగ్గించవచ్చు ఒక బకెట్ నీటిలో ఒకటి రెండు స్పూన్ల నిమ్మ రసం కలుపుకుని స్నానం చేయడం వల్ల రిఫ్రెషింగ్  అనుభూతి కలుగుతుంది. రోజ్ వాటర్.. గులాబీ నీరు చల్లదనాన్ని, తేలికపాటి సహజ సువాసనను అందిస్తుంది.  స్నానపు నీటిలో 3-4 టీస్పూన్ల రోజ్ వాటర్ కలపాలి.  ఇది చర్మానికి తాజా అనుభూతిని కూడా కలిగిస్తుంది. వేసవిలో శరీర జిగట తగ్గిస్తుంది. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా శరీర దుర్వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో సహాయపడుతుంది.  అయితే దీన్ని అధిక పరిమాణంలో ఉపయోగించకూడదు.  సున్నితమైన చర్మం ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వాడాలి. పటిక.. పటికలో యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉంటాయి.  ఇది చెమట వాసనను తగ్గించడానికి సహాయపడుతుంది. వేప నీరు.. వేప నీరు చర్మ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. దురద , బ్యాక్టీరియాను తగ్గించడంలో సహాయపడుతుంది.  వేప ఆకులను ఉడకబెట్టి, ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకోవచ్చు.                                  *రూపశ్రీ.  
ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘ఐబీఎస్’ (Irritable Bowel Syndrome - IBS) ఒకటి. దీనినే తెలుగులో ‘పేగుల్లో గడబిడ’ లేదా జీర్ణకోశ సమస్య అని అంటారు. కొంతమందికి ఆహారం తీసుకోగానే మోషన్స్‌కు వెళ్లాల్సి రావడం, మరికొందరిలో విపరీతమైన మలబద్ధకం, కడుపు ఉబ్బరం, కడుపులో నొప్పి వంటి లక్షణాలు ఈ సమస్య ఉన్నవారిలో కనిపిస్తాయి. దీనివల్ల శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు.  మరి ఈ ఐబీఎస్ సమస్య నుండి సహజంగా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా ఉపశమనం పొందాలి? ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిట్టిభొట్ల మధుసూదన శర్మ (MD-Ayurveda) గారు ఈ వీడియోలో ఒక అద్భుతమైన ఆయుర్వేద గృహ వైద్య చిట్కాను వివరించారు.    ఐబీఎస్‌కు అద్భుతమైన 'మజ్జిగ' చిట్కా: ఆయుర్వేదం ప్రకారం ఐబీఎస్ లేదా 'గ్రహణి' వ్యాధికి మజ్జిగ (Buttermilk) ఒక సంజీవని లాంటిది. అయితే ఈ మజ్జిగను ఎలా తీసుకోవాలో డాక్టర్ గారు చక్కగా వివరించారు: పలుచని మజ్జిగ: పెరుగును బాగా చిలికి, వెన్న తీసేసి, తగినన్ని నీళ్లు పోసి పలుచని మజ్జిగను సిద్ధం చేసుకోవాలి. ఔషధాల మిశ్రమం: ఈ మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి (వేయించిన జీలకర్ర పొడి అయితే మరింత మంచిది), కొద్దిగా శొంఠి పొడి లేదా అల్లం రసం, మరియు రుచికి తగినంత సైంధవ లవణం (Rock Salt) వేసి బాగా కలపాలి. ఎప్పుడు తీసుకోవాలి?: ఈ ప్రత్యేకమైన మజ్జిగను రోజూ ఉదయం, మధ్యాహ్నం భోజనం తర్వాత లేదా రోజంతటా కొద్దికొద్దిగా తీసుకుంటూ ఉంటే పేగుల్లో ఉండే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఈ చిట్కా ఎలా పనిచేస్తుంది? మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) జీర్ణవ్యవస్థను, పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. జీలకర్ర మరియు శొంఠి జీర్ణక్రియను వేగవంతం చేసి, గ్యాస్, కడుపు ఉబ్బరం మరియు కడుపునొప్పిని తగ్గిస్తాయి. ఇది పేగుల కదలికలను క్రమబద్ధీకరించి, అటు విరేచనాలు, ఇటు మలబద్ధకం సమస్యలను అదుపులోకి తెస్తుంది. దీనితో పాటు మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండటం వల్ల ఐబీఎస్ సమస్య నుండి త్వరగా కోలుకోవచ్చని డాక్టర్ గారు సూచించారు.  మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి! గమనిక: తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు వైద్యులను నేరుగా సంప్రదించి, మీ శరీర తత్వానికి తగినట్లుగా చికిత్స పొందడం శ్రేయస్కరం.
వేసవిలో ఎండలో తిరిగి అలసటతో  ఇంటికి తిరిగి రాగానే చాలా మందికి ఫ్రిజ్‌లోంచి చల్లటి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. తీవ్రమైన ఎండ, చెమటల తర్వాత చల్లటి నీరు తాగితే చాలా రిలాక్స్ గా ఉపశమనంగా అనిపిస్తుంది.   బాగా చల్లగా ఉన్న  నీరు శరీరానికి  మేలు చేయదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, తీవ్రమైన వేడి వల్ల శరీరం ఇప్పటికే వేడెక్కి ఉన్నప్పుడు, అకస్మాత్తుగా బాగా చల్లగా ఉన్న నీళ్లు తాగడం చాలా మందికి అసౌకర్యాన్ని, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందట.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ఎండ నుండి వచ్చాక చల్లని నీరు ఎందుకు తాగకూడదు? వైద్యులు చెబుతున్న వివరాల ప్రకారం ఎండలో నుండి లోపలికి వచ్చినప్పుడు, శరీరం తనను తాను చల్లబరుచుకునే ప్రక్రియలో నిమగ్నమై ఉంటుంది. ఈ సమయంలో రక్త ప్రసరణ పెరుగుతుంది , శరీరం తన ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో అకస్మాత్తుగా చాలా చల్లటి నీటిని తాగడం వల్ల ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పు  కలగవచ్చు. దీన్నే టెంపరేచర్ షాక్ అని అంటారు.   దీనివల్ల రక్తనాళాలు అకస్మాత్తుగా సంకోచించి, తలనొప్పి, కళ్లు తిరగడం లేదా అసౌకర్యం వంటి సమస్యలకు దారితీయవచ్చు. సమస్య ఇదే.. చల్లటి నీరు నోరు, గొంతుకు తక్షణ చల్లదనాన్ని ఇస్తుంది. అందుకే చల్లనీరు తాగితే హాయిగా ఫీలవుతారు. అయితే, శరీరం నెమ్మదిగా చల్లబడాలి. అతి చల్లటి నీరు జీర్ణవ్యవస్థను తాత్కాలికంగా మందగింపజేస్తుంది. దీనివల్ల జీర్ణ ఎంజైమ్‌ల పనితీరు తగ్గి, ఆహారాన్ని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుందని  వైద్య నిపుణులు చెబుతున్నారు. కొంతమందికి కడుపు ఉబ్బరం, అజీర్ణం, కడుపు నొప్పి వంటి లక్షణాలు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. చెమట పట్టగానే చల్లనినీరు తాగితే సమస్యే.. చెమట పట్టిన వెంటనే చల్లటి నీళ్లు తాగడం వల్ల గొంతులో చికాకు వస్తుందని  వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల గొంతు నొప్పి, శ్లేష్మం అధికంగా ఉత్పత్తి కావడం, దగ్గు, , గొంతులో అసౌకర్యం వంటివి కలగవచ్చు. చల్లని పదార్థాల వల్ల సులభంగా ప్రభావితమయ్యే వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ఏం చేయాలి? అతి చల్లగా ఉన్న నీరు కొంతమందిలో బ్రెయిన్ ఫ్రీజ్, అంటే ఆకస్మిక తలనొప్పిని ప్రేరేపిస్తుందట. నోరు , గొంతులోని సున్నితమైన నరాలపై చల్లని  నీరు అకస్మాత్తుగా ప్రభావం చూపినప్పుడు ఇది జరుగుతుంది. ముందు నుంచే గుండె జబ్బులు ఉన్నవారికి కూడా చాలా చల్లటి నీరు సరిపడదు. ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు వేగస్ నాడిపై ప్రభావం చూపి, తాత్కాలికంగా హృదయ స్పందన రేటు , రక్తపోటును ప్రభావితం చేస్తాయి. ఎండలో నుండి వచ్చిన వెంటనే అతి చల్లని నీరు తాగే బదులు, కొన్ని నిమిషాలు విశ్రాంతి తీసుకుని, ఆ తర్వాత నెమ్మదిగా నార్మల్ వాటర్ కొద్దిగా తాగి ఆ తర్వాత చల్లని నీరు తాగాలని వైద్యులు  చెబుతున్నారు. మట్టి కుండ నీరు, నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీరు , ఓఆర్ఎస్ వంటివి శరీరానికి మరింత మెరుగ్గా తేమను అందించడంలో సహాయపడతాయి. కాబట్టి చల్లనీరుకు బదులు ఇవి ట్రై చేయడం ఆరోగ్యానికి, ప్రాణానికి మంచిది.                               *రూపశ్రీ.
మారుతున్న కాలం, పెరిగిపోతున్న కాలుష్యం కారణంగా ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ‘సైనస్’ (Sinusitis) ఒకటి. సాధారణ జలుబులా ప్రారంభమై.. క్రమంగా ముక్కు మూసుకుపోవడం, ముఖంపై ఒత్తిడి, తీవ్రమైన తలనొప్పి వంటి లక్షణాలతో ఇది నరకం చూపిస్తుంది. చాలా మంది దీనిని కేవలం మామూలు జలుబే కదా అని నిర్లక్ష్యం చేస్తుంటారు. అసలు సైనస్ అంటే ఏమిటి? ఇది మన శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? దీని నుంచి ఉపశమనం పొందడం ఎలా? అనే విషయాలపై హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్, రావుస్ ఈఎన్‌టీ హాస్పిటల్ (Rao's ENT Hospital) అధినేత డాక్టర్ జి.వి.ఎస్. రావు (Dr. GVS Rao) గారు ఈ VIDEO ద్వారా అందించిన పూర్తి వివరాలు మీకోసం.. అసలు సైనస్ అంటే ఏమిటి? మన పుర్రె ఎముకలలో ఉండే గాలితో కూడిన ఖాళీ గదులనే సైనసెస్ (Sinuses) అంటారు. ఇవి మనం పీల్చే గాలిని వేడి చేయడానికి, ముక్కులో తడి ఆరిపోకుండా జిగురు లాంటి పదార్థాన్ని (Mucus) ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి. అయితే, ఏదైనా ఇన్ఫెక్షన్ లేదా అలర్జీ వల్ల ఈ గదుల లోపలి పొర వాచిపోయి, ఆ జిగురు పదార్థం బయటకు రాకుండా లోపలే నిలిచిపోతుంది. దీనినే 'సైనసైటిస్' లేదా 'సైనస్ ఇన్ఫెక్షన్' అంటారు. సైనస్ ప్రధాన లక్షణాలు: తీవ్రమైన తలనొప్పి: ముఖ్యంగా నుదురు, కళ్ల కింద, ముక్కు ఇరువైపులా విపరీతమైన నొప్పి లేదా ఒత్తిడి ఉంటుంది. తల ముందుకు వంచినప్పుడు నొప్పి మరింత పెరుగుతుంది. ముక్కు బ్లాక్ అవ్వడం: ముక్కు దిబ్బడ వేయడం వల్ల శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ముక్కు కారడం: ముక్కు నుండి పచ్చగా లేదా పసుపు రంగులో గట్టి ద్రవం కారుతుంటుంది. వాసన తెలియకపోవడం: సైనస్ తీవ్రత ఎక్కువైతే ఆహార పదార్థాల వాసన, రుచి కూడా తెలియకుండా పోతుంది. దగ్గు మరియు గొంతు నొప్పి: ముక్కు వెనుక భాగం నుండి ద్రవం గొంతులోకి చేరడం (Post-nasal drip) వల్ల రాత్రి వేళల్లో దగ్గు ఎక్కువగా వస్తుంది. సైనస్ రావడానికి కారణాలు: వైరల్ మరియు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు: సాధారణ జలుబు ఎక్కువ రోజులు తగ్గకుండా ఉంటే అది సైనస్‌గా మారే ప్రమాదం ఉంది. అలర్జీలు: దుమ్ము, ధూళి, పొగ, పెంపుడు జంతువుల వెంట్రుకల వల్ల వచ్చే అలర్జీలు. ముక్కు ఎముక వంకరగా ఉండటం: ముక్కు లోపలి మధ్య ఎముక వంకరగా (Deviated Nasal Septum) ఉండటం వల్ల కూడా గాలి రాకపోకలకు ఆటంకం కలిగి సైనస్ వస్తుంది. ముక్కులో కండలు పెరగడం: ముక్కు లోపల పాలిప్స్ (Nasal Polyps) అనబడే చిన్న చిన్న మాంసపు ముద్దలు పెరగడం వల్ల ఈ సమస్య వస్తుంది. ఇంటి వద్దే లభించే తక్షణ ఉపశమనాలు (Home Relief): ఆవిరి పట్టడం: రోజుకు రెండు మూడు సార్లు వేడి నీటి ఆవిరి పట్టడం వల్ల ముక్కులో పేరుకుపోయిన ద్రవం కరిగి శ్వాస సులువవుతుంది. సెలైన్ నాసల్ స్ప్రే: ఉప్పు నీటి స్ప్రేలు ఉపయోగించడం ద్వారా ముక్కు మార్గాలను శుభ్రం చేసుకోవచ్చు. గోరువెచ్చని నీరు తాగడం: నిరంతరం గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటుంది మరియు లోపలి జిగురు పలుచబడుతుంది. వైద్య చికిత్సలు మరియు శాశ్వత పరిష్కారం: సైనస్ సమస్య ప్రాథమిక దశలో ఉన్నప్పుడు వైద్యులు యాంటీబయాటిక్స్, యాంటీ-అలర్జీ మందులు మరియు నాసల్ స్ప్రేల ద్వారా నయం చేస్తారు. ఒకవేళ సమస్య దీర్ఘకాలికంగా మారి (Chronic Sinusitis), ముక్కులో కండలు పెరగడం లేదా ఎముక వంకర వంటి కారణాలు ఉంటే.. అధునాతన 'ఫెస్' (FESS - Functional Endoscopic Sinus Surgery) విధానం ద్వారా ఎలాంటి కుట్లు, గాయాలు లేకుండా లోపలి బ్లాక్‌లను తొలగించి శాశ్వత ఉపశమనం కలిగిస్తారు. గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యకు నిపుణులైన వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!