LATEST NEWS
2024 ఎన్నికలలో  ఓటమి తరువాత నుంచీ వైసీపీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారుతున్న పరిస్థితి. ఈ పార్టీ నేతలు  చట్టపరమైన, న్యాయపరమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. వైసీపీకి చెందిన  కీలక నాయకులు, మాజీ మంత్రులు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, కార్యకర్తలపై  వరుసగా కేసులు నమోదవుతుండటంతో పార్టీ భవిష్యత్తుపై  నీలినీడలు కమ్ముకున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం  కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు అవకతవకలు, అన్యాయాలు, అక్రమాలు, కుంభకోణాలపై  విచారణలు ముమ్మరమయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిబంధనలకు తిలోదకాలిచ్చి.. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన వైసీపీ ఇప్పుడు కేసుల చిక్కుల్లో నిండా ఇరుక్కుంది.  అధికారంలో ఉండగా చట్టాలకు మనం అతీతులం అన్నట్లుగా వ్యవహరించిన వైసీపీ నేతలకు ఒక్కరొక్కరుగా  పోలీసు కేసులను, సీఐడీ విచారణలను ఎదుర్కొంటూ, అరెస్టులు, బెయిళ్లు అంటూ  న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి పరిస్థితిలో ఉన్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికే నామమాత్రం అన్నట్లుగా వైసీపీ ప్రస్తుతం మిగిలింది.  వైసీపీయులపై  నమోదైన కేసుల తీరుతెన్నులను పరిశీలిస్తే, కేవలం ఉన్నత స్థాయి రాజకీయ నేతలే కాకుండా నియోజకవర్గ స్థాయిలో క్రియాశీలకంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు, సోషల్ మీడియా విభాగం సభ్యులు కూడా న్యాయపరమైన చిక్కుల్లో చిక్కుకున్నారు.   ఈ  కేసులతో వైఎస్సార్‌సీపీ చట్టపరమైన రక్షణ కొరకు ప్రతి జిల్లాలోనూ, ఉన్నత న్యాయస్థానాలలోనూ పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విచారణాధికారుల ముందర హాజరుకావడం, ముందస్తు బెయిల్స్ కొరకు పిటిషన్లు దాఖలు చేయడం, పోలీసుల కస్టడీని ఎదుర్కోవడం వంటి పరిణామాలు పార్టీ రోజువారీ కార్యకలాపాలను, రాజకీయ పోరాటాలను నామమాత్రం చేసేశాయి. దీంతో పార్టీ సంస్థాగతంలో బలహీనపడింది.  క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను నిర్వహించడానికి, ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తిని ఆసరాగా చేసుకుని ఉద్యమించడానికి పని చేసే నాయకులే వైసీపీలో కరవైయ్యారు. ఉన్న నేతల సమయం అంతా  లీగల్ వివాదాలలో కోర్టులు, న్యాయవాదుల చుట్టూ తిరగడానికే సరిపోతున్న పరిస్థితి.  కొన్ని జిల్లాల్లో నేతలు అరెస్టులకు భయపడి పార్టీ కార్యకలాపాలకు, రాజకీయాలకూ దూరంగా ఉంటున్నారు.  దీంతో పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేసే వారే కరవయ్యారు. ఈ పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి పార్టీని సంసిద్ధం చేయాలని భావిస్తున్న జగన్ కు అడుగు ముందుకు పడకుండా చేస్తోంది.  దీంతో రాష్ట్రంలో వైసీపీ భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   Ycp cadre in disarray, YSRCP Legal Troubles, YS Jagan Mohan Reddy, AP Politics,  , Legal Cases,  YCP Leaders
దేశవ్యాప్తంగా  విద్యార్థుల నిరసనలకు దారితీసిన నీట్   పరీక్షల నిర్వహణ వైఫల్యం ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారిందనడంలో సందేహం లేదు. పరీక్షా పత్రాల లీకేజీ, మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పై విద్యార్థులలో తీవ్ర స్థాయిలో అసంతృప్తి, వ్యతిరేకత వ్యక్తమౌతోంది. ఆయన రాజీనామాకు యువత పట్టుబడుతోంది.  అయితే ప్రధాని నరేంద్ర మోడీ మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న యువత డిమాండ్ ను పట్టించుకోవడం లేదు. నీట్ పై తొలి సారిగా స్పందించి, సోషల్ మీడియా వేదికగా న్యాయం చేస్తాననీ, లీకేజీ బాధ్యులను కఠినంగా శిక్షిస్తామనీ, అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామనీ చెప్పిన మోడీ.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీమానా చేయాలన్న యువత డిమాండ్ ను ఇసుమంతైనా పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో మోడీ ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు వస్తున్నారన్న చర్చ మొదలైంది.    జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనలు నానాటికీ తీవ్రరూపం దాల్చుతున్నా,  ప్రధాని నరేంద్రమోడీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను వెనకేసుకు రావడానికి కారణమేంటన్న చర్చ జోరుగా సాగుతోంది.  ప్రధాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) లో సుదీర్ఘకాలం పనిచేసిన  నాయకుడు కావడం, ఆర్‌ఎస్‌ఎస్ అగ్రనాయకత్వంతో ఆయనకున్నపటిష్ట సంబంధం అనుబంధం, అలాగే , పార్టీ పట్ల ఉన్న  విశ్వసనీయత ధర్మేంద్ర ప్రధాన్ కు రక్షణ కవచంగా మారాయని అంటున్నారు.  అదే విధంగా ఒడిశా రాష్ట్ర రాజకీయాల్లో బిజెపి సాధించిన చారిత్రాత్మక విజయాల్లో ధర్మేంద్ర ప్రధాన్ పాత్ర అత్యంత కీలకమైనది కావడంతో ఆయనను పక్కన పెట్టడానికి మోడీ వెనుకాడుతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అలాగే..  నిరసనకారుల  ఒత్తిడికి తలొగ్గి  ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయిస్తే.. ముందు ముందు ఇతర కేంద్ర మంత్రుల విషయంలో కూడా ఇటువంటి పరిస్థితే ఎదురు కావచ్చునని మోడీ భావిస్తున్నారని అంటున్నారు.    NEET exam controversy, Narendra Modi government, Jantar Mantar protests, BJP's Odisha politics, RSS links
 తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ముంబై నటి కాదంబరి జత్వానీ కేసు వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, పోలీస్ వర్గాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది. రోజుకో కొత్త మలుపు తిరుగుతున్న ఈ కేసులో సీఐడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేయడం, మరోవైపు తానూ బలిపశువునయ్యానంటూ లేఖలు బయటకు రావడం తీవ్ర సంచలనంగా మారింది.  తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ తెలుగు వన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కాదంబరి జత్వానీ   కేసులోని పలు కీలక అంశాలను వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటిని, ఆమె కుటుంబ సభ్యులను అక్రమంగా అరెస్టు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడంపై విచారణ వేగం పుంజుకుందన్న ఆయన.. గతంలో ఎన్నికల కోడ్ అమలులోకి రావడానికి సరిగ్గా రెండు నెలల ముందు ముంబైలో ఉన్న కాదంబరి జత్వానీని, ఆమె తల్లిదండ్రులను ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి..  ఫోర్జరీ భూలావాదేవీల కేసు సాకుగా చూపి దాదాపు 40 రోజుల పాటు జైలులో ఉంచారన్నారు.  అయితే, ముంబైలో దాఖలైన ఒక రేప్ కేసును ఉపసంహరించుకోవడానికి తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకే ఈ అక్రమ అరెస్టులు నిర్వహించారని విచారణలో తేలింది. దీని వెనుక ఐపీఎస్ అధికారుల నేతృత్వంలో ఒక ఆర్కెస్ట్రేటెడ్ ప్లాన్ నడిచిందని అప్పసాని రాజేష్ చెప్పారు.  ఏపీ సీఐడీ విచారణలో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయనీ,  కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు చేయకముందే సీనియర్ ఐపీఎస్ అధికారుల బృందం ముంబై వెళ్లేందుకు విమాన టికెట్లు బుక్ అయినట్లు తేలిందనీ గుర్తు చేసిన ఆయన, అప్పుడు  సీఎమ్‌ఓలో కీలక పాత్ర పోషించిన అధికారులు ఇచ్చిన ఆదేశాల మేరకే తమ బృందం ముంబై వెళ్లినట్లు అధికారులు విచారణలో వెల్లడించారని వివరించారు.  రాజకీయ ప్రయోజనాలు, మోరల్ పోలీసింగ్ కోసం అప్పటి వైసీపీ  ప్రభుత్వం అధికారులను దుర్వినియోగం చేసిందనీ, రాజకీయ నాయకుల ఆదేశాలు అమలు చేసి ఈ వ్యవహారంలో ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు పలువురు సీఐలు, ఎస్ఐ స్థాయి అధికారులు సస్పెన్షన్లకు గురై సీఐడీ కేసుల్లో ముద్దాయిలుగా మారారనీ చెప్పారు. కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ కోర్టును ఆశ్రయించి ఛార్జ్‌షీట్ సమర్పించడంతో విచారణ తుది దశకు చేరుకుంది. రాజకీయ లబ్ధి కోసం ఉన్నతాధికారులను బలిపశువులను చేసిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు ఎలా ఉండబోతున్నాయనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తికరంగా మారింది. నిబంధనలను పక్కనబెట్టి వ్యవహరించిన అధికారులపై సీఐడీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. Kadambari Jethwani Case, AP CID Chargesheet, AP IPS Officers Suspension, Tone News AP Politics, Kadambari Jethwani Latest News
మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి విషయంలో  తగ్గేదే లే.. అంటున్నారు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి నారా లోకేష్. ఈ విషయంలో  అవసరమైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు కేంద్ర ప్రభుత్వంతోనైనా పోరాడి నిధులు సాధిస్తానని ప్రకటించారు.  ఇటీవల మంగళగిరిలో జరిగిన ఒక  సభలో ప్రసంగించిన నారా లోకేష్..  తన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యమన్నారు. మంగళగిరి అభివృద్ధికి అవసరమైన నిధులు సాధించే విషయంలో, కొత్త ప్రాజెక్టులను మంజూరు చేయించుకోవడంలోనూ , పాలనాపరమైన అనుమతులను సాధించే దిశగా ముందుకు సాగడంలోనూ రాజీ ప్రశక్తే లేదన్నారు.  ఇందు కోసం అవసరమైతే ఎవరితోనైనా పోరాడతానన్నారు.  మంగళగిరి ప్రజలు 2024 ఎన్నికలలో తనపై చూపిన నమ్మకం, అఖండ మెజారిటీతో కట్టబెట్టిన విజయమే తనలో ఈ ధైర్యాన్ని నింపాయని చెప్పారు.   భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల రుణం తీర్చుకోవడం తన ప్రాథమిక బాధ్యతన్న ఆయన.. నియోజకవర్గ సమస్యల పరిష్కారంలో  వెనక్కు తగ్గేదే లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో కీలక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ..  తన సొంత నియోజకవర్గ ప్రయోజనాలు వచ్చేసరికి ఎంతటి పెద్ద నాయకుడినైనా ప్రశ్నించేందుకు, పట్టుబట్టి పనులు సాధించేందుకు వెనుకాడనన్నారు.   రాజకీయంగా ఈ వ్యాఖ్యలు  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కూటమి రాజకీయం, పార్టీ సమన్వయాన్ని కాపాడుకుంటూనే, ఒక ప్రజాప్రతినిధిగా తన సొంత నియోజకవర్గానికి  ప్రథమ ప్రాధాన్యత నిస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. లోకేష్ తన వ్యూహాన్ని రూపొందించుకున్నారు.  గత ఎన్నికల్లో మంగళగిరి స్థానం నుంచి నారా లోకేష్ సాధించిన చారిత్రాత్మక విజయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలేజీని ఇచ్చింది. గతంలో ఓటమిని చవిచూసిన చోటే ఐదేళ్ల పాటు నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమగ్ర ప్రచారంతో విజయం సాధించడం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఒక కీలక మలుపుగా మారింది. ప్రస్తుతం మంత్రిగా పలు కీలక శాఖలను పర్యవేక్షిస్తున్నప్పటికీ, మంగళగిరి అభివృద్ధిపై లోకేష్ చూపుతున్న ప్రత్యేక శ్రద్ధ  ఆయనను నియోజకవర్గ ప్రజలకు మరింత దగ్గర చేసింది. నియోజకవర్గంలో అందరి వాడుగా గుర్తింపు నిచ్చింది.  ఒకవైపు రాష్ట్రస్థాయి నిర్ణయాల్లో భాగస్వామి అవుతూనే, మరోవైపు తన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు శ్రమిస్తున్నారు లోకేష్.  ఆ క్రమంలోనే మంగళగిరిని రాష్ట్రానికే సరికొత్త మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా   మంత్రి నారా లోకేష్ ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి ప్రాతిపదికగా   ప్రగతి ప్రణాళికలను ఆవిష్కరించారు. నియోజకవర్గంలోని ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు, దశాబ్దాలుగా నలుగుతున్న భూహక్కుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు.  కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల దైనందిన జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.  మంగళగిరి,  తాడేపల్లి మండలాల పరిధిలో దశాబ్దాలుగా స్వంత ఇళ్లపై చట్టబద్ధమైన హక్కులు లేక ఆందోళన చెందుతున్న వేలాది నిరుపేద కుటుంబాలకు ఊరట కలిగిస్తూ, 'మన ఇల్లు - మన లోకేష్' కార్యక్రమం ద్వారా శాశ్వత ఇళ్ల పట్టాలు, ఆస్తి హక్కు పత్రాలను పంపిణీ చేశారు.  రవాణా, పారిశుధ్య సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు మంగళగిరి రూపురేకలను  మారుస్తున్నాయి.  నంబూరు, మంగళగిరి రైల్వే సెక్షన్ పరిధిలోని లెవల్ క్రాసింగ్ వద్ద దశాబ్దాలుగా వేలాది మంది ప్రయాణికులు  ఇబ్బందులు పడే వారు.   రోజుకు పదుల సంఖ్యలో రైళ్లు వెళ్లే సమయంలో గేటు పడి.. గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చే ఈ సమస్యకు చెక్ పెడుతూ..  142 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో  నిడమర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి పునాది రాయి పడింది.  767 మీటర్ల పొడవు, నాలుగు లేన్ల విస్తరణతో రూపుదిద్దుకుంటున్న ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జివల్ల  వల్ల మంగళగిరి, అమరావతి, తాడికొండ తదితర పరిసర ప్రాంతాల మధ్య రవాణా సులభతరం కానుంది. దీనితో పాటు మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలో మురుగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారంగా తొలి విడతలో దాదాపు 1,167 కోట్ల వ్యయంతో 531 కిలోమీటర్ల మేర భూగర్భ డ్రైనేజీ,   వ్యర్థ నీటి శుద్ధి కేంద్రాల  పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే.. కేంద్ర ప్రభుత్వ 'అమృత్ భారత్ స్టేషన్' పథకం కింద  12.56 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో మంగళగిరి రైల్వే స్టేషన్‌ను అత్యాధునిక హంగులు, ప్రయాణికుల సదుపాయాలతో  పునర్నిర్మించడం జరిగింది.  మరోవైపు.. పర్యావరణ పరిరక్షణ   ప్రజలలో  ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో కాజా తూర్పు చెరువు పార్కును శోభాయమానంగా అభివృద్ధి చేశారు. 17 ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ పార్కులో 1.7 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, పిల్లల ఆటస్థలాలు,  వేలాది మొక్కలతో కూడిన పచ్చదనాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఈ వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరిని కేవలం నివాస ప్రాంతంగానే కాక, ఆధునిక సదుపాయాలు కలిగిన పట్టణంగా నిలబెడుతున్నాయి. లోకేష్ నాయకత్వంలో మంగళగిరి వేగంగా అభివృద్ధి పథంలో దూసుకుపోతుండటంతో స్థానికులలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. మంగళగిరి నియోజకవర్గం సరికొత్త ప్రగతి శకానికి వేదికగా మారుతోందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.  Nara Lokesh, Mangalagiri Development, Chandrababu Naidu, Pawan Kalyan, AP Politics
కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత  రాహుల్ గాంధీకి మద్దతుగా తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి  భారీ ర్యాలీ నిర్వహించారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్‌లో జరిగిన ఈ ర్యాలీకి  నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో  కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు  గా తరలివచ్చారు. ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో  ప్రసంగించిన రేవంత్ రెడ్డి..  దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం పోరాటం చేస్తున్నారని కొనియాడారు. ఎంతటి ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రజల తరఫున నిలబడే ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ మాత్రమేనని చెప్పారు.  ఢిల్లీ లో  కాంగ్రెస్ చేపట్టిన ప్రధాని నివాస ముట్టడి కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎంపీ ప్రియాంక గాంధీ, ఇతర నేతల అక్రమ అరెస్ట్​ను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులు రాహుల్ గాంధీ పట్ల దురుసుగా వ్యవహరించి గాయపరచడాన్ని ఖండిచిన ఆయన రక్త గాయమైనా రాహుల్ గాంధీ వెనక్కు తగ్గకుండా పోరాట పటిమ చూపారని కొనియాడిన రేవంత్ రె్డి.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే ప్రాథమిక హక్కులపై కేంద్రం   ప్రత్యక్ష దాడికి పాల్పడిందని విమర్శించారు.  కేంద్ర ప్రభుత్వం యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నదని, వారి న్యాయమైన డిమాండ్లకు మద్దతుగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రాహుల్, ప్రియాంక, ఇతర నేతల అరెస్టు అప్రజాస్వామికమని రేవంత్ రెడ్డి మండిపడ్డారు.   Revanth  massive rally, support, Rahul, Kodangal, Condemn, Arrest, Lathicharge
ALSO ON TELUGUONE N E W S
Spider-Man: Brand New Day has unveiled its third and final trailer just days before its highly anticipated theatrical release. Starring Tom Holland, the film marks his fourth solo outing as the beloved superhero and picks up after the events of Spider-Man: No Way Home. The new trailer reaffirms that Peter Parker is still grappling with the heartbreaking consequences of the spell that erased him from everyone's memory, leaving him to navigate life completely alone. The trailer also explores Peter's pain of not being with the love of his life, MJ. The superhero goes down memory lane, revisiting his fond memories with MJ before accepting his new reality. The trailer reconfirms Tom Holland and Zendaya's tease that Spider-Man: Brand New Day will be an emotional watch.  It also confirms that Mark Ruffalo's Hulk will make an appearance in the film, setting the stage for an exciting new chapter in the Marvel Cinematic Universe. Directed by Destin Daniel Cretton, the film is written by Chris McKenna & Erik Sommers and Justin Kuritzkes.  Based on the MARVEL Comic Book by Stan Lee and Steve Ditko, the film has been produced by Kevin Feige, p.g.a., Amy Pascal, p.g.a., Avi Arad and Rachel O'Connor, p.g.a. Executive Producers are Louis D'Esposito and David Cain. The film stars Tom Holland, Zendaya, Sadie Sink, Jacob Batalon, Jon Bernthal, Tramell Tillman, Michael Mando and Mark Ruffalo. Spider-Man: Brand New Day is set to release on 30th July. The film is releasing in six languages in India. These include English, Hindi, Tamil, Telugu, Malayalam and Kannada. To make this experience truly unforgettable, the film is releasing on multiple Premium Large Format in India like 2D, 4DX 3D, 3D SCREEN X, DOLBY CINEMA 3D, ICE 3D, DOLBY CINEMA 2D, MX4D 3D, 3D, P[XL], and BIGPIX.      Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
    ఇళయదళపతి విజయ్(Vijay)ఈ రోజు జననాయగన్ అలియాస్ 'జన నాయకుడు'(Jana nayakudu)గా వరల్డ్ వైడ్ థియేటర్స్ లో ల్యాండ్ అయ్యాడు. తెల్లవారుజాము నుంచే షోస్ పడటంతో థియేటర్స్ అన్ని విజయ్ అభిమానులతో, సినీ ప్రేమికులతో కళకళలాడుతున్నాయి. మూవీ చూసిన వాళ్లంతా  కొన్ని హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం. 1 . తండ్రిగా, పోలీస్ ఆఫీసర్ గా విజయ్ వన్ మాన్ షో  2 . మమిత భైజు, విజయ్ మధ్య వచ్చిన సీన్స్  3 . ప్రకాష్ రాజ్ క్యారక్టరయిజేషన్ 4 . బాబీడియోల్ క్యారక్టరయిజేషన్ 5 . ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్  6 . ఫొటోగ్రఫీ  7 . నిర్మాణ విలువలు  8 . దర్శకత్వ ప్రతిభ  9 . సెకండ్ హాఫ్  10 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్  also read: jana nayagan Movie Review In Telugu: జన నాయకుడు మూవీ రివ్యూ జన నాయకుడు చూసిన తెలుగు ప్రేక్షకులు మీడియాతో మాట్లాడుతు 'బాలకృష్ణ' వన్ మాన్ షో భగవంత్ కేసరి లా ఉండటం కాదు, భగవంత్ కేసరి కథనే మళ్ళీ తెరకెక్కించారు. కాకపోతే పొలిటికల్ అంశాలు, తీవ్రవాదం అనే అంశాలు యాడ్ చేసారు. విజయ్ పెర్ ఫార్మెన్స్ మాత్రం సూపర్ గా ఉందని అంటున్నారు.   
Cast: Thalapathy Vijay, Pooja Hegde, Bobby Deol, Mamitha Baiju, Prakash Raj Crew: Based on Bhagavanth Kesari Story: Anil Ravipudi Cinematography: Sathyan Sooryan Editor:    Pradeep E. Ragav Music Director: Anirudh Ravichander Director: H. Vinoth Producer: KVN Productions Jana Nayagan movie starring Thalapathy Vijay, in his highly anticipated final cinematic appearance before fully entering politics, released today in theatres. Pooja Hegde, Bobby Deol, and Mamitha Baiju are playing prominent roles. Let's discuss about the film in detail. Plot: Inspired by the core emotional thread of Bhagavanth Kesari, this political action drama revolves around a powerful protagonist, TVK (Thalapathy Vijay) locking horns with a ruthless antagonist (Bobby Deol). The story blends a poignant beginning involving Mamitha Baiju with intense political warfare and high-octane action sequences. Why does he take on this powerful system? Watch the movie to know more. Analysis: Vijay delivers a one-man show with his unmatched screen presence, energetic dance moves, and sharp political punch dialogues. Anirudh Ravichander’s background score elevates every mass scene, making the interval block a massive highlight that fans will love. However, the film suffers from forced political scenes intended to boost Vijay's real-life political entry, which disrupt the story's natural flow. H. Vinoth's signature gripping screenplay is noticeably missing, leaving the writing weak.  Bobby Deol's villain role is poorly developed and fails to create a strong impact. Additionally, the technical aspects, specifically the graphics and editing, are below par. While it provides great fan moments, the execution limits it to a standard commercial format. Overall, the movie is an average watch. Positives: Vijay's mass performance Excellent background score Thrilling interval block Negatives: Forced political elements Weak screenplay and villain track Sub-par technical values Bottomline: A massive treat for fans, but an average commercial entertainer for others Rating: 2.5/5   Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ వేదికలపై కొరియన్ డార్క్ ఫాంటసీ, హారర్ డ్రామాలకు విశేషమైన ఆదరణ లభిస్తోంది. కొరియన్ కథల్లోని సహజత్వం, ఆకట్టుకునే గ్రిప్పింగ్ టేకింగ్ ప్రేక్షకులను ఎంతగానో మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఈ క్రమంలోనే నెట్‌ఫ్లిక్స్ వేదికగా ఈ నెల 17 జులై 2026 నుండి తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతున్న సరికొత్త కొరియన్ డార్క్ ఫాంటసీ వెబ్ సిరీస్ 'ది ఈస్ట్ ప్యాలెస్' (The East Palace). నామ్ జూ హ్యూక్ (Nam Joo-Hyuk) ప్రధాన పాత్రలో నటిస్తూ, చోయ్ జంగ్-క్యూ దర్శకత్వంలో రూపొందిన ఈ 8 ఎపిసోడ్ల థ్రిల్లింగ్ సిరీస్‌కి ప్రముఖ క్రిటిక్స్ 5కి 3.0 రేటింగ్ ఇచ్చారు. రాజభవనం, వారసత్వ పోరాటాలు, క్షుద్ర శక్తులు మరియు దెయ్యాల కలబోతగా వచ్చిన ఈ సిరీస్ ప్రేక్షకులను ఎలా అలరించిందో చూద్దాం. ఈ కథ అంతా ఒక అందమైన ప్రాచీన రాజభవనం మరియు దాన్ని పరిపాలించే ప్రిన్స్ 'క్రౌన్' చుట్టూ తిరుగుతుంది. ఈ రాజభవనంలో గతంలో పాలించిన రాజుకు నలుగురు వారసులు ఉండగా, వారు ఒకరి తర్వాత ఒకరు అనుమానాస్పదంగా మరణిస్తారు. ఆ విషాదకర సంఘటనలు జరిగి సరిగ్గా 30 ఏళ్ల తర్వాత, ఇప్పుడు మళ్లీ అదే దారుణమైన మరణాల పరంపర పునరావృతమవుతుంది. రాజా క్రౌన్ ముగ్గురు కుమారులు దారుణంగా చనిపోగా, నాలుగో కుమారుడు అంటే ప్రస్తుత యువరాజు తీవ్ర అనారోగ్యంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. ప్యాలెస్‌లోని కోనేటి దెయ్యం లేదా పిశాచిగా మారిన ఒక రాజనర్తకి ఆత్మ ఈ వరుస మరణాలకు కారణమని అందరూ నమ్ముతుంటారు. చిన్నతనం నుంచే అతీంద్రియ శక్తులు కలిగిన 'గు-చోన్' (నామ్ జూ హ్యూక్) అనే సాధారణ యువకుడికి దుష్టశక్తులను, ప్రేతాత్మలను ఎదుర్కొనే ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. తన నాలుగో కుమారుడి ప్రాణాలను కాపాడుకోవడానికి రాజు క్రౌన్ గు-చోన్‌ను రహస్యంగా పిలిపిస్తాడు. కోనేటి దెయ్యాన్ని అంతం చేసి యువరాజును బతికించగలిగితే కోరిన బహుమానం ఇస్తానని చెబుతాడు. అయితే అసలు విషయాన్ని రహస్యంగా ఉంచి, గు-చోన్‌ను ఒక 'వాస్తు నిపుణుడు'గా ప్యాలెస్‌లోకి పంపిస్తారు. అదే సమయంలో ప్యాలెస్‌కి దూరంగా పెరిగిన రాజు కూతురు యువరాణి (రో యున్-సో)ని పిలిపించి, గు-చోన్‌కు సహాయం చేస్తున్నట్లుగా నటిస్తూ అతని కదలికలను నిఘా వేయమని ఆదేశిస్తాడు. ప్యాలెస్‌లో అడుగుపెట్టిన గు-చోన్, యువరాణి ఇద్దరూ కలిసి ప్యాలెస్‌లోని ప్రతి మూలను పరిశీలించడం ప్రారంభిస్తారు. పరిశోధనలో భాగంగా రాజభవనంలోని ఒక రహస్య కోనేరు, ఉప్పుగని ప్రాంతంలో దుష్ట ప్రేతాత్మల సంచారం ఎక్కువగా ఉన్నట్లు వారు గమనిస్తారు. అలాగే మంత్రించిన కుండల వెనుక ఏదో పెద్ద మర్మం దాగి ఉందని గు-చోన్ గ్రహిస్తాడు. యువరాజు ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్న ఆ పిశాచి మూలాలను వెతికేందుకు గు-చోన్ ప్రయత్నిస్తుంటే, అసలు రాజభవనంలో తన తల్లిని హత్య చేసిన అసలు నేరస్థుడెవరో తెలుసుకోవడానికి యువరాణి తనదైన శైలిలో అన్వేషణ సాగిస్తుంది. ఈ భయంకరమైన రాజభవనంలోని రహస్యాలను తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు ఎవరూ ప్రాణాలతో బయటపడరనే భయంకరమైన ప్రచారం రాజ్యంలో బలంగా ప్రచారంలో ఉంటుంది. దాంతో తాను వచ్చిన పనిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రాణాలతో బయటపడాలని గు-చోన్ భావిస్తాడు. కానీ తన తల్లి హత్య వెనుక ఉన్న నిజాలు తేలేవరకు ప్యాలెస్ వదలనని యువరాణి పట్టుబడుతుంది. వీరిద్దరి శోధనకు రాజమాత (జంగ్ యంగ్-నామ్) నిరంతరం అడ్డంకులు సృష్టిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో పిశాచిగా మారిన రాజనర్తకి ఎవరు, ఆ ప్యాలెస్ తూర్పు భాగంలో దాగి ఉన్న అసలు రహస్యమేమిటి అనే అంశాలు కథను ఊహించని మలుపులు తిప్పుతాయి. సాధారణంగా రాజులు, రాజభవనాల నేపథ్యం అంటే అధికారం కోసం వారసత్వ పోరాటాలు, క్షుద్ర పూజలు సహజమే. కానీ ఈ సిరీస్‌లో జానపద కథకు హారర్ మరియు ఫాంటసీ అంశాలను జోడించి నెక్స్ట్ లెవెల్‌లో రూపొందించారు. నైట్ ఎఫెక్ట్స్, భారీ విజువల్స్, అద్భుతమైన సెట్స్ సిరీస్‌కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా కథలోని 4వ ఎపిసోడ్ నాటికి అసలు కథ ముగిసిపోయిందేమో అనిపించినప్పటికీ, అక్కడి నుంచే కథ మరొక అనూహ్యమైన ట్విస్ట్ తీసుకుని ప్రేక్షకులను సీటు అంచున కూర్చోబెడుతుంది. ప్రేతాత్మలతో జరిగే యుద్ధ సన్నివేశాలు, చోయ్ జంగ్-క్యూ దర్శకత్వ ప్రతిభ, జంగ్ సే-రిన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ 8 ఎపిసోడ్ల సిరీస్‌ను తప్పక చూడాల్సిన డార్క్ ఫాంటసీగా తీర్చిదిద్దాయి.
  -సినిమా పేరు: జన నాయగన్ -న‌టీన‌టులు: జోసఫ్ విజయ్, పూజా హెగ్డే, మమితా భైజు, బాబీ డియోల్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, నాజర్, సునీల్  తదితరులు -సినిమాటోగ్ర‌ఫీ:సత్యన్ సూర్యన్ -ఎడిటింగ్: ప్రదీప్ ఈ  రాఘవ్  -మ్యూజిక్: అనిరుద్  -నిర్మాత‌:  వెంకట్ కె నారాయణ -బ్యానర్:  కేవిఎన్ ప్రొడక్షన్స్  -రచన,దర్శకత్వం: హెచ్ వినోత్. -రిలీజ్ డేట్ : జులై 23 ,2026  ఎట్టకేలకు ఈ రోజు దళపతి జోసఫ్ విజయ్(Vijay)'జననాయకుడు'(Jana Nayakudu)గా  థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. దీంతో అభిమానులు, మూవీ లవర్స్ థియేటర్స్ కి పోటెత్తారు. మరి మూవీ ఎలా ఉందో చూద్దాం. కథ ఒక ఊరి గ్రామప్రజలు గత ముప్పై ఏళ్లుగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి   భయపడుతూ ఉంటారు. దళపతి వెట్రి కొండన్( విజయ్) నాలుగు పదుల వయసు దాటిన సగటు వ్యక్తి. ఒక యాక్సిడెంట్ లో చనిపోయిన పోలీస్ ఆఫీసర్ కూతురు విజ్జి(మమితా బైజు)ని సొంత కూతురులా పెంచుతుంటాడు. విజ్జికి భయంతో పాటు ఆయాసం లాంటి హెల్త్ ప్రాబ్లెమ్ ఉంటాయి. కానీ విజ్జిని ఆర్మీ ఆఫీసర్ ని చెయ్యాలని వెట్రి ప్రయత్నిస్తుంటాడు. కానీ విజ్జికి మాత్రం ఆర్మీ ఆఫీసర్ అవ్వడం ఇష్టం ఉండదు. జాన్ హిమ్లర్(బాబీ డియోల్). అత్యంత క్రూరుడుతో పాటు అసాంఘిక శక్తి. శ్వాసినియా దేశంలోని ప్రజలు ఒకరికొకరు చంపుకునేలా చేసి ఆ దేశం నాశనమయ్యేలా చేస్తాడు. రోజా రంగ స్వామి  ( ప్రకాష్ రాజ్) సీనియర్ పొలిటికల్ లీడర్. ప్రతి పక్షంలో ఉన్నా సరే తమిళనాడు రాష్ట్రాన్ని శాసించే నియంత. తన తాత, తండ్రి, తనతో పాటు తన బిడ్డలు, మనవళ్ళు మాత్రమే తమిళనాడుని పరిపాలించాలనుకుంటాడు.  రోజాపై ఈగ వాలినా కొన్ని లక్షల  ప్రజలు ఊరుకోరు. వెట్రి కొండన్, జాన్ హిమ్లర్, రోజా రంగ స్వామి మధ్య నడిచే సంఘర్షణ, గతం తాలూకు ఘర్షణ ఏంటి అనేదే జన నాయకుడు కథ. ఎనాలసిస్   మూవీ చూస్తున్నంత సేపు గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ భగవంత్ కేసరి గుర్తుకొస్తూనే ఉంటుంది. పొలిటికల్ టచ్ తప్ప  మిగిలిన కథ మొత్తం ఇంచు మించు సేమ్.  ఆడవాళ్ళకి ఇన్ స్ప్రెషన్ గా నిలిచే డైలాగ్స్, ప్రజల వలన చెడ్డ రాజకీయనాయకుడు ఎలా పుట్టుకొస్తున్నారనే డైలాగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో వెట్రి  ఇంట్రడక్షన్, విజ్జి, వెట్రి మధ్య వచ్చిన సీన్స్ బాగున్నాయి. ఆ తర్వాత కథ కొంచం స్లోగా నడవడంతో పాటు సీన్స్ పెద్దగా వర్క్ అవుట్ కాలేదు.  కయల్ గా చేసిన పూజా హెగ్డే,  వెట్రి మధ్య పెద్దగా సీన్స్ నడవలేదు. శ్వాసినియా దేశానికీ సంబంధించిన ఎపిసోడ్ హైలెట్ గా ఉంది. సినిమా మొత్తానికి హైలెట్ అని చెప్పవచ్చు. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది.సెకండ్ హాఫ్ లో వెట్రి,  జాన్ హిమ్లర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పర్లేదు . ముఖ్యంగా హిమ్లర్ చెడ్డవాడిగా మారడానికి చూపించిన రీజన్ వెరైటీగా కొత్తగా ఉంది. మతాల మధ్య చిచ్చు అనేది రొటీన్ పాయింట్. కాకపోతే దర్శకుడు, ప్రొడక్షన్ వాల్యూస్, విజయ్ వల్ల సీన్స్ బోరు కొట్టకుండా సాగాయి.  నటీనటులు సాంకేతిక నిపుణుల పనితీరు వెట్రిగా విజయ్ పెర్ఫార్మ్ పతాక స్థాయిలో ఉంది. తన కూతురు కాకపోయినా విజ్జిని సొంత తండ్రిగా, ప్రాణానికి ప్రాణంగా పెంచే తండ్రిగా, మరో వెర్షన్ లో రాజకీయ నాయకుల అంతు చూసే పోలీస్ ఆఫీసర్ గా మెస్మరైజ్ చేసే పెర్ఫార్మ్ చేసాడు. ముఖ్యంగా  స్కూల్ వయస్సు ఉన్న  పాపతో పెదనాన్న అయినా బాబాయ్ అయినా, ఎవరైనా సరే నిన్ను మూడు చోట్ల  టచ్ చేస్తే అమ్మకి చెప్పాలి అనే సీన్ లో విజయ్ నటన నభూతో న భవిష్యత్. విజ్జి గా  మమితా భైజు  మెప్పించే నటనే ప్రదర్శించింది. బాబీడియోల్, ప్రకాష్ రాజ్ తో మిగతా నటీనటులు కూడా తమ కెరీర్ లో గుర్తుండిపోయే పెర్ఫార్మ్ చేశారు.  ముఖ్యంగా బాబీ డియోల్ హైలెట్ అని చెప్పవచ్చు. పూజా హెగ్డే తో తో పాటు మిగతా వాళ్ళ గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు. అనిరుద్ నుంచి వచ్చిన సాంగ్స్ లో మెరుపులు లేకపోయినా, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. వినోత్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. రచయితగా రొటీన్ సీన్స్ కావడం కొంచం మైనస్.  నిర్మాణ విలువలు. ఫొటోగ్రఫీ ప్లస్  బలాలు 1 . విజయ్ పెర్ ఫార్మెన్స్  2 .  శ్వాసినియా దేశం ఎపిసోడ్  3 . సెకండ్ హాఫ్ లోని కొన్ని సీన్స్  4 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్  5 . ఫొటోగ్రఫీ  6 . డైరెక్షన్  బలహీనతలు  1 . అందరూ చూసేసిన భగవంత్ కేసరి కథ కావడం  2 . ఫస్ట్ హాఫ్  3 . రొటీన్ సీన్స్  చివరిగా చెప్పాలంటే విజయ్ యాక్టింగ్, ప్రొడక్షన్ వాల్యూస్. వినోత్ దర్శకత్వ ప్రతిభ జననాయగన్ కి బలం. కానీ రొటీన్ సీన్స్ ,భగవంత్ కేసరి గా బాలయ్య ఇప్పటికే తెలుగు వారి ఇంట్లో తిష్ట వేయడం జననాయగన్ కి మైనస్. రేటింగ్ 2 .5 /5                                                                                అరుణాచలం   
మార్వెల్ స్టూడియోస్ తెరకెక్కించిన 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' సినిమా ఫైనల్ ట్రైలర్ విడుదలైంది. టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్‌గా నటిస్తున్న నాలుగో సోలో సినిమా ఇది. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ ట్రైలర్‌లో 'స్పైడర్-మ్యాన్: నో వే హోమ్' తర్వాత జరిగిన సంఘటనలను చూపించారు. అందరి జ్ఞాపకాల నుంచి పీటర్ పార్కర్ పూర్తిగా మాయమైన తర్వాత అతను ఒంటరిగా ఎలా జీవిస్తున్నాడో చూపించారు. అలాగే తన ప్రేమికురాలు ఎంజే (జెండయా)తో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యే సన్నివేశాలు ట్రైలర్‌లో ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఎమోషనల్‌గా ఉండబోతుందనే విషయం మరోసారి స్పష్టమైంది.  అలాగే ఈ ట్రైలర్‌లో మార్క్ రఫాలో హల్క్ పాత్రలో కనిపించనున్నట్లు కూడా అధికారికంగా చూపించారు. దీంతో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో మరో ఆసక్తికరమైన అధ్యాయానికి ఈ సినిమా నాంది పలకనుంది. ఈ చిత్రానికి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు. క్రిస్ మెకెన్నా, ఎరిక్ సోమర్స్, జస్టిన్ కురిట్జ్‌కెస్ కథను అందించగా కెవిన్ ఫైగీ, ఏమీ పాస్కల్, అవి ఆరాడ్, రాచెల్ ఓ'కానర్ నిర్మాతలుగా వ్యవహరించారు.  ఈ సినిమాలో టామ్ హాలండ్, జెండయా, సేడీ సింక్, జేకబ్ బటాలన్, జాన్ బెర్న్తాల్, ట్రామెల్ టిల్మన్, మైకేల్ మాండో, మార్క్ రఫాలో కీలక పాత్రల్లో నటించారు. 'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' జూలై 30న ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. అలాగే 2D, 3D, 4DX 3D, ScreenX, Dolby Cinema, ICE 3D, MX4D, P[XL], BIGPIX వంటి ప్రీమియం ఫార్మాట్లలో కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.   Spider Man Brand New Day, Final Trailer, Tom Holland, Spider Man
టాలీవుడ్ నిర్మాతలు సి. కళ్యాణ్, బూరుగుపల్లి శివరామకృష్ణతో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదయ్యాయి. జూబ్లీహిల్స్‌లోని ఉమెన్స్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పరిధిలో ఉన్న ప్లాట్ నంబర్ 89 స్థలం కబ్జా యత్నానికి గురైందంటూ ప్రముఖ వ్యాపారవేత్త కంఠంనేని రవిశంకర్ పోలీసులను ఆశ్రయించడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వివాదాస్పద ప్లాట్ నంబర్ 89 స్థలానికి సంబంధించి ఇప్పటికే న్యాయస్థానంలో కేసు పెండింగ్‌లో ఉందనే విషయాన్ని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా, జూన్ 10న గౌరవ కోర్టు కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాల ప్రకారం, రవిశంకర్ స్వాధీనంలో ఉన్న భూమి విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోవద్దని, కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు (ఇంజక్షన్ ఆర్డర్) ఇస్తూ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులు అమలులో ఉన్నప్పటికీ, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తించారని రవిశంకర్ ఆరోపించారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ నిందితులు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారని రవిశంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులు దౌర్జన్యంగా ఆస్తి కాంపౌండ్ గేటు తాళాలు పగులగొట్టారని, గేటును తీవ్రంగా ధ్వంసం చేశారని ఆయన వివరించారు. ఆవరణలో ఉన్న సామాగ్రిని చెల్లాచెదురుగా పడేసి, అక్కడున్న భద్రతా సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేస్తూ బెదిరింపులకు పాల్పడ్డారని ఫిర్యాదులో వెల్లడించారు. అంతటితో ఆగకుండా, ఆ ప్లాట్‌లో నిర్మించిన ఒక గదిని కూడా నిందితులు ధ్వంసం చేశారని రవిశంకర్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.  https://x.com/Theteluguone/status/2080175511750443190   Kantamneni Ravi Shankar, Land Dispute, C Kalyan, Burugupalli Sivaramakrishna  
సమాజంలో జరుగుతున్న పరిణామాలపై పౌరుల మౌనం అత్యంత ప్రమాదకరమని, దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా గళం విప్పాలని ప్రముఖ సినీ నటి, నిర్మాత మంచు లక్ష్మి ఇచ్చిన పిలుపు ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కాలంలో మన చుట్టూ ఎన్నో సమస్యలు, అన్యాయాలు జరుగుతున్నా చాలామంది వ్యక్తులు "మనకెందుకులే" అనే ఉదాసీన వైఖరితో దాటుకెళ్తుంటారు. అయితే ఇటువంటి మనస్తత్వం కేవలం వ్యక్తులకే కాకుండా, మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తికే తీవ్ర విఘాతం కలిగిస్తుందని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఏ విపత్తు వచ్చినా, పర్యావరణానికి విఘాతం కలిగినా లేదా ప్రజా హక్కులకు భంగం వాటిల్లినా ఏమీ పట్టనట్లు ఉండటం పౌరులుగా మన విధి నిర్వహణలో ఘోరమైన వైఫల్యమని ఆమె చాలా భావోద్వేగంగా స్పష్టం చేశారు. లడఖ్ ప్రాంత రాజ్యాంగ హక్కులు, పర్యావరణ పరిరక్షణ మరియు స్థానిక సంస్కృతి రక్షణ కోసం సుదీర్ఘకాలంగా పోరాడుతున్న ప్రముఖ సామాజిక కార్యకర్త, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్‌చుక్‌కు మద్దతు ప్రకటిస్తూ మంచు లక్ష్మి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక సుదీర్ఘ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. నిస్వార్థంగా సమాజం కోసం, దేశం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం తమ జీవితాలను ధారపోసే వాంగ్‌చుక్ వంటి పోరాట యోధులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె వ్యాఖ్యానించారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పోరాడుతున్న నాయకులకు మద్దతు ఇవ్వకపోతే, భవిష్యత్తులో ప్రజల కోసం నిలబడే గొంతులు కరువైపోతాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. దేశ సమస్యలపై గళం విప్పడం అంటే అందరూ రోడ్లపైకి వచ్చి నేరుగా పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని మంచు లక్ష్మి వివరించారు. నేటి ఆధునిక డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని, కనీసం సామాజిక మాధ్యమాల ద్వారానైనా మన ఆలోచనలను పంచుకోవడం, సరైన విషయాలపై అవగాహన పెంచుకోవడం మరియు అన్యాయాలను నిలదీయడం పౌరులుగా మన ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను కేవలం వినోదానికే పరిమితం చేయకుండా, సామాజిక చైతన్యం కోసం ఉపయోగించాలని ఆమె కోరారు. మన దేశంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కేవలం రాజకీయ నాయకులను లేదా ప్రజాప్రతినిధులను వేలెత్తి చూపడంతో పౌరుల బాధ్యత తీరిపోదని మంచు లక్ష్మి అభిప్రాయపడ్డారు. దేశ భవిష్యత్తు మరియు రాబోయే తరాల శ్రేయస్సు కేవలం ప్రభుత్వాలపైనే ఆధారపడి ఉండదని, చైతన్యవంతమైన పౌర సమాజం క్రియాశీలకంగా మారినప్పుడే నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు. సమాజంలో చుట్టూ జరుగుతున్న అన్యాయాలను, పర్యావరణ విధ్వంసాన్ని చూస్తూ కూడా మౌనంగా ఊరుకోవడం తనను తీవ్రంగా కలచివేస్తోందని ఆమె చాలా నిరాశగా, భావోద్వేగానికి గురయ్యారు. సమాజంలో మార్పు రావాలంటే ముందుగా పౌరుల ఆలోచనా విధానంలో మార్పు రావాలని, మౌనాన్ని వీడి సమస్యలపై ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. లడఖ్ పర్యావరణం మరియు అక్కడ జీవిస్తున్న ప్రజల హక్కుల కోసం సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు లభించినప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నారు. కాబట్టి ప్రతీ పౌరుడూ సామాజిక స్పృహ కలిగి ఉండాలని, సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు గొంతును వినిపించాలని మంచు లక్ష్మి గట్టిగా ఆకాంక్షించారు.     Manchu Lakshmi, Sonam Wangchuk
తమిళనాడు రాజకీయ రంగ ప్రవేశం తర్వాత కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం కావడంతో ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’) పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి వచ్చింది. విజయ్‌ను వెండితెరపై చివరిసారిగా చూస్తున్నామనే భావనతో అభిమానులు థియేటర్ల వద్ద పండగ వాతావరణం సృష్టించారు.  ఈ సినిమా చూసిన నెటిజన్లు, సినీ ప్రియులు తమ రివ్యూలను, పబ్లిక్ టాక్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. తమిళ్ లో రెస్పాన్స్ ఎలా ఉన్నా, తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీపై పెదవి విరుస్తున్నారు. ప్లస్ లు కొన్ని ఉంటే, మైనస్ లు ఎన్నో ఉన్నాయని అంటున్నారు.  ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది దళపతి విజయ్ మాస్ ఇమేజ్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్. ముఖ్యంగా థియేటర్లలో అభిమానులకు పూనకాలు తెప్పించేలా డిజైన్ చేసిన 'ఫ్యాన్ మూమెంట్స్' సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారాయి. విజయ్ తనదైన శైలి నటన, ఆకర్షణీయమైన డ్యాన్స్ మూమెంట్స్, పొలిటికల్ పంచ్ డైలాగ్స్‌తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. దీనికి తోడు రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) ప్రతి మాస్ సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఇక ఇంటర్వెల్ బ్లాక్ సినిమాకే హైలైట్‌గా నిలిచిందని, సెకండ్ హాఫ్‌పై విపరీతమైన ఆసక్తిని పెంచేలా ఆ సన్నివేశాన్ని హెచ్. వినోద్ డిజైన్ చేశారని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, ఉత్సాహపరిచే మాస్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం కొన్ని ప్రధానమైన నెగెటివ్స్ ఎదుర్కొంటోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా విజయ్ నిజజీవిత రాజకీయ ప్రవేశానికి అనుగుణంగా బలవంతంగా ఇరికించిన 'పొలిటికల్ అడిషన్స్' కథా ప్రవాహాన్ని దెబ్బతీశాయని కామెంట్స్ వస్తున్నాయి. సహజత్వానికి దూరంగా కేవలం ప్రచారం కోసమే రాసుకున్నట్టు ఉన్న పొలిటికల్ సీన్లు సాధారణ ప్రేక్షకులకు కాస్త అసహనాన్ని కలిగిస్తాయి. దీనికి తోడు బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ పోషించిన విలన్ క్యారెక్టర్ ట్రాక్ చాలా బలహీనంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాబీ డియోల్ వంటి పవర్ ఫుల్ నటుడిని సరిగ్గా వాడుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడని, ఆయన పాత్రలో ఎలాంటి గూస్‌బంప్స్ ఇచ్చే విలనిజం కనిపించలేదని నెటిజన్లు చెబుతున్నారు. మరోవైపు హెచ్. వినోద్ మార్కు స్క్రీన్ ప్లే లోపించిందని, వీక్ రైటింగ్ సినిమా స్థాయిని తగ్గించేసిందని పబ్లిక్ టాక్ వస్తోంది. ఒక పక్కా పొలిటికల్ డ్రామాను అందించే క్రమంలో నాటకీయత లోపించి సాధారణ కమర్షియల్ ఫార్మాట్‌కే పరిమితమైనట్లు అనిపిస్తుంది. వీటితో పాటు టెక్నికల్స్ వాల్యూస్ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం సినిమాకు మరొక మైనస్ పాయింట్‌గా మారింది. గ్రాఫిక్స్, ఎడిటింగ్ విభాగాల్లో ఇంకాస్త శ్రద్ధ వహించి ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.  మొత్తానికి 'జన నాయకుడు' చిత్రం విజయ్ ఫ్యాన్స్‌కు అద్భుతమైన ఫ్యాన్ స్టఫ్ అందించినప్పటికీ, సాధారణ ప్రేక్షకులకు మాత్రం యావరేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గానే నిలిచిందని పబ్లిక్ టాక్ స్పష్టం చేస్తోంది.      Jana Nayakudu, Public Talk, Jana Nayagan, Telugu Review, Thalapathy Vijay  
వినూత్న కథాంశాలతో వచ్చే చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త సంచలనాలు సృష్టిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదే వరుసలో విభిన్నమైన టైటిల్, ఆసక్తికరమైన కంటెంట్‌తో విడుదల ముందే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్న తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు'.  వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ హారర్ కామెడీ ఫిల్మ్ బిజినెస్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.  ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు (ఓటీటీ రైట్స్) ఏకంగా 15 కోట్ల రూపాయల భారీ మొత్తానికి అమ్ముడుపోవడం ట్రేడ్ ను సైతం ఆశ్చర్యపరిచింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు కంటెంట్‌ను చాలా జాగ్రత్తగా పరిశీలించి మాత్రమే హక్కులను కొనుగోలు చేస్తున్నాయి. అటువంటిది 'కొరియన్ కనకరాజు' చిత్రానికి ఏకంగా 15 కోట్ల రూపాయల డిజిటల్ డీల్ కుదరడం అంటే ఈ సినిమా కంటెంట్ ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. భారీ ఓటీటీ డీల్ తో ఉత్సాహంలో ఉన్న నిర్మాతలు, ఇప్పుడు థియేట్రికల్ హక్కుల రూపంలో కూడా భారీ స్థాయిలోనే రాబట్టేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కుల ద్వారా భారీగా రాబట్టాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు.  ఆంధ్ర ప్రాంత థియేట్రికల్ రైట్స్ రూపంలో దాదాపు రూ.5 నుంచి 6 కోట్లు, సీడెడ్ ఏరియా నుంచి రూ.1.5 కోట్లు, నైజాం (తెలంగాణ) ప్రాంతం నుంచి రూ.4 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ ద్వారా సాధించాలని నిర్మాతలు పట్టుదలతో ఉన్నారు. మొత్తానికి ఆంధ్ర నుంచి 5-6 కోట్లు, సీడెడ్ నుంచి 1.5 కోట్లు, నైజాం నుంచి 4 కోట్లు, ఓటీటీ నుంచి 15 కోట్లు పొందుతూ 'కొరియన్ కనకరాజు' ప్రీ-రిలీజ్ బిజినెస్ 25 కోట్ల మార్కుని క్రాస్ చేయడం విశేషం. ఆగస్టు 7న థియేటర్లలో అడుగుపెట్టనున్న 'కొరియన్ కనకరాజు' మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.     Korean Kanakaraju, Business, OTT Rights, Varun Tej  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూలై 20న జరుపుకుంటారు . చెస్ అనేది మెదడును ఎక్కువగా ఉపయోగించే ఆట. అందువల్ల, చెస్ ఆడటం పిల్లల మేధస్సును పదును పెడుతుందని చాలా మంది చెబుతుంటారు. చాలా మంది తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ఆలోచనా, గ్రహణ సామర్థ్యాలను మెరుగుపరచడానికి పిల్లలతో చెస్ ఆడించాలని అనుకుంటారు. కానీ కేవలం చెస్ ఆడటం మాత్రమే మేధస్సును పదును పెడుతుందా? దీనిపై వైద్యులు ఏమంటున్నారో తెలుసుకుంటే.. ఆలోచించే అలవాటు.. చదరంగం ఆడేటప్పుడు పిల్లలు ప్రతి ఎత్తును జాగ్రత్తగా పరిశీలించాలి,.  ప్రత్యర్థి ఎలాంటి ఎత్తు వేస్తాడు అనే విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి,  ఇది పిల్లలు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే బదులు ముందుగా ఆలోచించేలా ప్రోత్సహిస్తుంది. క్రమంగా, వారు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించుకోగలుగుతారు. ఏకాగ్రత.. చదరంగం ఆడుతున్నప్పుడు పిల్లల పూర్తి ఏకాగ్రత ఆటపైనే ఉంటుంది. వారి ఏకాగ్రత ఒక్క క్షణం తగ్గినా,  లేదా డిస్టర్బ్ అయినా  వారు ఆటను ఓడిపోయే అవకాశం ఉంటుంది. అందువల్ల, ఈ ఆట పిల్లల ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందుకే చెస్ ఆడేటప్పుడు పిల్లలు ఏకాగ్రతగా ఉండటం వారి చదువులకు, ఇతర ముఖ్యమైన పనులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. జ్ఞాపకశక్తి.. చెస్ ఆడేటప్పుడు పిల్లలు అనేక ఎత్తులు, నియమాలు , చెస్ ఆడే ఇతర  పద్ధతులను గుర్తుంచుకోవలసి ఉంటుంది. దీనివల్ల వారి మెదడు నిరంతరం చురుకుగా ఉంటుంది. వైద్యుల ప్రకారం, ఇది వారి జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది , కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తిని కూడా పెంచుతుంది. సహనం.. చెస్ అనేది తొందరపడి ఆడే ఆట కాదు. ప్రతి ఎత్తుగడకు జాగ్రత్తగా ఆలోచన అవసరం. కొన్నిసార్లు, గెలవడానికి చాలాసేపు వేచి ఉండాల్సి వస్తుంది. ఇది పిల్లలకు సహనాన్ని నేర్పి, వాస్తవిక దృక్పథంతో నిర్ణయాలు తీసుకునే అలవాటును పెంపొందించడంలో సహాయపడుతుంది. పాఠాలు.. చెస్ అనే కాదు.. ఏ ఆటలో అయినా సరే.. ఎల్లప్పుడూ గెలవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఓడిపోతాం. కానీ ఓటమి పిల్లలు తమ తప్పులను అర్థం చేసుకోవడానికి సహాయపడుతుందని వైద్యులు చెబుతారు. ఇది తర్వాతిసారి మరింత మెరుగ్గా ఆడేందుకు వారిని ప్రోత్సహిస్తుంది. ఈ అలవాటు వారి చదువులో , ఇతర జీవిత పనులలో కూడా సహాయపడుతుంది. చెస్ మాత్రమే కాదు.. కేవలం చెస్  ఆడటం వల్ల మాత్రమే పిల్లల మెదడు పదునుదేరదని వైద్యులు చెబుతున్నారు. మంచి నిద్ర, సరైన పోషణ, రోజువారీ శారీరాన్ని చురుగ్గా ఉంచే ఇతర ఆటలు, చదువు కూడా చాలా అవసరం. ఇవన్నీ కలిసినప్పుడే పిల్లల మెదడు చక్కగా అభివృద్ధి చెందుతుంది. అందువల్ల, చదరంగంతో పాటు మంచి రోజువారీ అలవాట్లపై దృష్టి పెట్టడం ముఖ్యం.                                     *రూపశ్రీ.  
చిన్నతనం అంటేనే ఆటలు, అల్లరి పనులు, చిన్న చిన్న గొడవలు. పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు స్నేహితులు, తమ తోటి పిల్లలతో ఆడుకుంటారు.. అలాగే కొన్ని సార్లు గొడవలు కూడా పడతారు.  పిల్లలు తప్పులు చ చేయడం సహజం. తోటి పిల్లలను బాధపెట్టడం కూడా సహజం. కానీ పిల్లలు మాత్రం  కొంత సేపు అయ్యాక లేదా ఒక రోజు తర్వాత అవన్నీ మర్చిపోయి తిరిగి కలిసి ఆడుకుంటారు, మళ్లీ గొడవలు కూడా పడతారు.  అందుకే పిల్లలను కల్మషం లేని వారు అని చెబుతూ ఉంటారు. అయితే గొడవలు పడినప్పుడో.. లేదా ఇతర పిల్లలు మీ పిల్లలను బాధపెట్టినప్పుడు, ఇతర పిల్లలు చేసిన తప్పులను మీ పిల్లలు మర్చిపోకుండా మనసులో ఉంచుకోవడం వంటివి చేసినప్పుడు అది మంచి విషయం కాదని పిల్లల పెంపకం నిపుణులు అంటున్నారు.   దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. కారణం.. పిల్లలు ప్రపంచాన్ని పెద్దల కంటే చాలా భిన్నంగా చూస్తారు. వారికి, ఒక బొమ్మను పగలగొట్టడం లేదా ఆటలో ఓడిపోవడం చాలా పెద్ద విషయం. అటువంటి పరిస్థితిలో, ఒక స్నేహితుడు వారి మాట వినకపోతే, వారు అభద్రతకు గురై, మోసపోయినట్లు భావిస్తారు. క్రమంగా, పిల్లలలో అహంభావం పెరుగుతుంది, దీనివల్ల క్షమాపణ చెప్పడం లేదా క్షమాపణ కోరడం ఒక కష్టమైన పనిగా అనిపిస్తుంది. ప్రవర్తనను మార్చడం వల్ల కలిగే ప్రభావం.. పిల్లవాడికి క్షమించే అలవాటు లేకపోతే, అతను క్రమంగా ఒంటరివాడు అవుతాడు. మనసులో పగను ఉంచుకోవడం అతని మానసిక ఒత్తిడిని పెంచుతుంది. దేనికీ సర్థుకుని పోలేని మనస్తత్వం,  ఇతరుల తప్పులను చూపించే కారణం వల్ల పిల్లవాడు ఎవరితో కూడా ఎక్కువకాలం స్నేహంగా ఉండలేడు.  పిల్లలు సున్నితమైన, అర్థం చేసుకునే వ్యక్తులుగా మారాలంటే,  క్షమించడం నేర్చుకోవాలి. తల్లిదండ్రులే సహాయం చేయాలి.. తల్లిదండ్రులు చిన్న విషయాలకే కోపగించుకుని, క్షమాపణ చెప్పకపోయినా లేదా క్షమించకపోయినా, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఒకవేళ తను తప్పు చేసి ఉంటే ఏమి ఆశించి ఉండేవాడో ఆ పిల్లవాడిని అడగాలి. ఇతర పిల్లల పరిస్థితిని అర్థం చేసుకునేలా పిల్లలను  ప్రోత్సహించాలి. ఇంట్లో చిన్న చిన్న గొడవలు జరిగినప్పుడు మీరు కూడా క్షమాపణ చెప్పి, ఎదుటి వ్యక్తిని క్షమించడం నేర్చుకోవాలి. క్షమాపణ చెప్పడం బలహీనతకు సంకేతం కాదని, గొప్పతనానికి సంకేతమని పిల్లలు  అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది. స్నేహాన్ని బలపరిచే విషయాలు.. ఎవరూ పర్పెక్ట్ కారని పిల్లలకు వివరించాలి. ప్రతిఒక్కరూ తప్పులు చేస్తారు,  కాబట్టి అందరిలో  తప్పులు మాత్రమే  చూడటం తప్పని పిల్లలకు చెప్పాలి. స్నేహ సంబంధం అనేది నమ్మకం , క్షమాగుణం అనే పునాదులపై ఆధారపడి ఉంటుంది. 'క్షమించండి' అని చెప్పడంలో ఉన్న  ప్రాముఖ్యతను పిల్లలకు  వివరించాలి.  క్షమించడం ఎంతో గొప్ప గుణం అని  చెప్పాలి. చిన్నతనంలో క్షమించడం నేర్చుకున్న పిల్లలు భవిష్యత్తులో మరింత సంతోషంగా, విజయవంతంగా ఉంటారని మనస్తత్వవేత్తలు నమ్ముతారు. కాబట్టి పిల్లలకు క్షమాగుణం అలవాటు చేయాలి.                                       *రూపశ్రీ.  
తిన్న వెంటనే గ్యాస్ వస్తుందా..అయితే మీరు చేస్తున్న తప్పులు ఇవే..! నేటి కాలంలో రోజులో మూడు పూటలా ఆహారం తీసుకోవడం కామన్.  ఉదయం టిఫిన్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తప్పకుండా చేస్తారు. చాలామంది ఉదయం సమయంలో టిఫిన్ స్కిప్ చేస్తే గ్యాస్ సమస్యలు వస్తాయని,  ఆహారం సమయానికి తినకపోతే గ్యాస్ సమస్యలు వస్తాయని చెబుతుంటారు. కానీ కొందరికి ఒక సమస్య ఉంటుంది. అదే ఆహారం తినగానే గ్యాస్ సమస్య రావడం. రోజూ మూడు పూటలా ఆహారం తింటున్నా సరే.. గ్యాస్ సమస్య ఎందుకు వస్తోంది అనేది చాలామందికి అర్థం కాదు.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. ఇప్పటి కాలంలో చాలామందికి తొందరగా తినడం అలవాటు.  ఆహారాన్ని వేగంగా మింగినప్పుడు దాన్ని సరిగ్గా నమలలేం. ఆహారాన్ని పూర్తిగా నమలడం అనేది జీర్ణక్రియలో మొదటి , అత్యంత ముఖ్యమైన దశ, ఎందుకంటే నోటిలోని లాలాజలం ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. ఆహారం సరిగ్గా నమలకుండా కడుపులోకి ప్రవేశిస్తే, దానిని జీర్ణం చేయడానికి కడుపు మరింత కష్టపడాల్సి వస్తుంది, దీనివల్ల గ్యాస్ , బరువుగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి చాలా మందికి భోజనం చేసేటప్పుడు లేదా తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. దీనివల్ల కడుపులోని జీర్ణరసాలు పలుచబడి, సరైన జీర్ణక్రియ జరగదు. ఫలితంగా గ్యాస్, అజీర్ణం కలుగుతాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగాలంటే, భోజనానికి సుమారు అరగంట ముందు లేదా భోజనం చేసిన గంట తర్వాత నీళ్లు తాగడం మంచిది. తిన్న వెంటనే మంచం మీద పడుకోవడం లేదా నిద్రపోవడం కూడా గ్యాస్ ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. పడుకోవడం వల్ల కడుపులోని ఆహారం , ఆమ్లం పైకి వచ్చి, కడుపు ఉబ్బరం, గ్యాస్ , గుండెల్లో మంటకు కారణమవుతాయి. తిన్న తర్వాత కనీసం 20 నుండి 30 నిమిషాల పాటు నిటారుగా కూర్చోవడం లేదా తేలికపాటి నడక  జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అతిగా వేయించిన, మసాలా దినుసులు లేదా నూనెతో కూడిన ఆహారాలు జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది . ఇవి కడుపుపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తాయి. ఈ ఆహారాలను అధిక పరిమాణంలో తినడం వల్ల గ్యాస్ ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. అంతేకాకుండా, రాజ్మా బీన్స్, శనగలు , క్యాబేజీ వంటి కొన్ని కూరగాయలు , పప్పుధాన్యాలు కూడా సహజంగా గ్యాస్ ను ఉత్పత్తి చేసే  ఆహారాలుగా  పరిగణిస్తారు, కాబట్టి వాటిని సరైన పరిమాణంలో , సరిగ్గా వండిన తర్వాత తినడం ముఖ్యం. ఆహారం తింటూ ఎక్కువగా మాట్లాడటం, వేగంగా శ్వాస తీసుకోవడం, లేదా స్ట్రాతో తాగడం వంటివి కూడా కడుపులోకి గాలి చేరడానికి కారణమవుతాయి. ఈ విధంగా మింగిన గాలి కడుపు ఉబ్బరానికి, గ్యాస్ కు కూడా కారణం కావచ్చు. అందువల్ల, నిశ్శబ్దంగా, సౌకర్యవంతంగా, తక్కువ మాట్లాడుతూ తినడం మంచిది. పైన చెప్పుకున్న ఐదు అలవాట్లు ఎవరిలో అయినా ఉంటే వారు తప్పకుండా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నెమ్మదిగా తినడం, ఆహారాన్ని బాగా నమలడం, భోజనాల మధ్య అధికంగా నీరు త్రాగకుండా ఉండటం, తిన్న వెంటనే పడుకోకుండా ఉండటం, బరువైన , వేయించిన ఆహారాలను తగ్గించడం,  నిశ్శబ్దంగా తినే అలవాటును అలవర్చుకోవడం వంటివి గ్యాస్ సమస్యను తగ్గించుకోవడంలో సహాయపడతాయి.                                  *రూపశ్రీ.  
టైప్ 1 లేదా టైప్ 2 డయాబెటిస్.. ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రమాదం.! మధుమేహం అనేది వేగంగా పెరుగుతున్న ఒక  వ్యాధి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, భారతదేశంలో మధుమేహ రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ వ్యాధి బారిన 10 కోట్లకు పైగా యువకులు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ఒక్కసారి మధుమేహం వచ్చిందంటే.. దాన్ని నయం చేయలేము. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటే తప్ప దాన్ని నియంత్రణలో ఉంచుకోలేం. మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. టైప్ 1 ,  టైప్ 2 గా మధుమేహాన్ని పరిగణిస్తారు.  అయితే  వీటిలో ఏ రకం ఎక్కువ ప్రమాదకరం.. దీని గురించి వివరంగా తెలుసుకుంటే.. టైప్ 1 మరియు టైప్ 2 డయాబెటిస్ మధ్య తేడా..   టైప్ 1 డయాబెటిస్.. టైప్ 1 డయాబెటిస్‌లో, క్లోమం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేయడం పూర్తిగా ఆపేస్తుంది, దీనివల్ల రోగి ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవలసి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్.. టైప్ 2 డయాబెటిస్‌లో, శరీరం ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేస్తుంది, కానీ ఆ ఇన్సులిన్ సరిగ్గా ఉపయోగపడదు. ఈ పరిస్థితిని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. దీర్ఘకాలం పాటు ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఏది ఎక్కువ ప్రమాదకరమైనది? రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువ కాలం నియంత్రించకపోతే మధుమేహం ప్రమాదకరంగా మారుతుంది. ఈ నియంత్రణ లేకపోవడం వల్ల కళ్ళు, మూత్రపిండాలు, గుండె, మెదడు , ఇతర అవయవాలకు గణనీయమైన నష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. టైప్ 1 డయాబెటిస్‌లో, ఇన్సులిన్ తీసుకోకపోవడం వల్ల డయాబెటిక్ కీటోయాసిడోసిస్ అనే తీవ్రమైన పరిస్థితి వచ్చే ప్రమాదం పెరుగుతుంది, ఇది ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంటుంది. టైప్ 2 మధుమేహం సంవత్సరాల తరబడి ఎలాంటి లక్షణాలు లేకుండా ఉండవచ్చు. మూత్రపిండాలు, కళ్ళు, గుండె లేదా నరాలు వంటి ఇతర అవయవాలపై మధుమేహం ప్రభావం చూపినప్పుడు చాలా మందికి టైప్ 2 డయాబెటిస్ బయటపడుతుంది. టైప్ 2 మధుమేహం నియంత్రణ.. వైద్యుల ప్రకారం, టైప్ 2 మధుమేహాన్ని నియంత్రించడం వల్ల దాని ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలి,  బరువును అదుపులో ఉంచుకోవాలి,  సమతుల్య ఆహారం తీసుకోవాలి,   తగినంత నిద్రపోవాలి,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించాలి. టైప్ 1 డయాబెటిస్‌ను నియంత్రణ.. జీవనశైలి మార్పుల ద్వారా టైప్ 1 మధుమేహాన్ని నియంత్రించలేము. టైప్ 1 మధుమేహానికి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తప్పనిసరిగా తీసుకోవాలి.                                            *రూపశ్రీ.  
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే పప్పు ధాన్యాలు తినకూడదా..! కొందరికి కాలివేళ్లు , చేతివేళ్ల కీళ్లలో నొప్పి, మోకాళ్లు , చీలమండలలో వాపు, , నడవడంలో ఇబ్బంది వంటివి ఎదురవుతుంటాయి.  ఇవి యూరిక్ యాసిడ్ పెరగడానికి సంకేతాలు కావచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. యూరిక్ యాసిడ్ అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం. శరీరం ప్యూరిన్స్ అనే పదార్థాలను విచ్ఛిన్నం చేసినప్పుడు యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. సాధారణ పరిస్థితులలో, మూత్రపిండాలు దీనిని వడపోసి మూత్రం ద్వారా విసర్జిస్తాయి. అయితే, శరీరం దీనిని అధిక మొత్తంలో ఉత్పత్తి చేసినప్పుడు లేదా మూత్రపిండాలు దీనిని సరిగ్గా విసర్జించలేనప్పుడు, ఇది రక్తంలో పేరుకుపోవడం మొదలవుతుంది. శరీరంలో  యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే అనేక రకాల సమస్యలకు దారితీయవచ్చు. క్రమంగా, దాని స్ఫటికాలు కీళ్లలో పేరుకుపోయి, నొప్పి, వాపు , గౌట్ వంటి సమస్యలను కలిగిస్తాయి. సాధారణంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే, పప్పుధాన్యాలు తినడం మానేయాలని  కొందరు చెబుతూ ఉంటారు. అసలు యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగితే పప్పు ధాన్యాలు తినడం మానేయాలా? యారిక్ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవడానికి ఏం చేయాలి?  తెలుసుకుంటే.. యూరిక్ యాసిడ్ ఎలా పెరుగుతుంది?  ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరంగా లేకపోవడం,  బరువు పెరగడం, శారీరక శ్రమ తగ్గడం వల్ల యూరిక్ యాసిడ్ సమస్య గణనీయంగా పెరిగిందని వైద్యులు చెబుతున్నారు. గతంలో వృద్ధులకు వచ్చే వ్యాధిగా భావించిన ఈ సమస్య, ఇప్పుడు 30 ఏళ్లలోపు యువతలో కూడా బయటపడుతోంది. . కిడ్నీ వ్యాధులు,  డయాబెటిస్ మందులు,  మెటబాలిక్ సిండ్రోమ్,  కొన్ని రకాల మందులు కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతాయి. యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు పప్పు ధాన్యాలు తినకూడదా?  యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉంటే పప్పుధాన్యాలు తినడం మానుకోవాలా అని చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. కానీ పూర్తీగా మానేయడం అవసరం లేదని ఆహార నిపుణులు చెబుతున్నారు.  యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నప్పటికీ,  పప్పుధాన్యాలు తినడం ఆపాల్సిన అవసరం లేదు.  సరైన పప్పుధాన్యాలను ఎంచుకుని, వాటి పరిమాణం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుందట. ఇది  యూరిక్ యాసిడ్ స్థాయిపై కూడా ఆధారపడి ఉంటుందట. 8 కంటే ఎక్కువ యూరిక్ యాసిడ ఉంటే, తక్కువ ప్యూరిన్ ఉన్న పప్పు ధాన్యాలు తినడం మంచిది. పప్పుధాన్యాలు ప్రోటీన్, ఫైబర్ తో పాటు అనేక ముఖ్యమైన పోషకాలకు మంచి వనరు. పచ్చ పెసలు యూరిక్ యాసిడ్  ఉన్నవారికి చాలామంచివి.   అవి పోషకాలను అందించి, యూరిక్ యాసిడ్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.  వారానికి 3-4 సార్లు పెసరపప్పు, ఎర్ర కందిపప్పు తినడం ఆరోగ్యానికి మంచిది. యూరిక్ యాసిడ్ ఉన్నవారు ఏవి తినకూడదు? యూరిక్ యాసిడ్ అధికంగా ఉంటే, సముద్రపు ఆహారం, ఎర్ర మాంసం , మద్యం మొదలైనవి మానేయాలి.   తీపి పానీయాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన పానీయాలు , అధిక చక్కెర వినియోగాన్ని తగ్గించుకోవాలి. తగినంత నీరు త్రాగడం, సమతుల్య ఆహారం తీసుకోవడం మరింత ప్రయోజనకరం.                                      *రూపశ్రీ.