LATEST NEWS
  రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సాధారణమే. అయితే బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు ఓ కాంగ్రెస్ నేత బర్త్ డే గిఫ్ట్ గా ఓ వినూత్న గిఫ్ట్ పంపి సంచలనం సృష్టించారు. కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 (శుక్రవారం) ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు. ఈ విషయంపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన మెట్టు సాయి కుమార్..  ఇది కేటీఆర్‌కు మా బర్త్‌డే గిఫ్ట్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సన్నబియ్యం విలువ తెలుసుకోవాలనే కేటీఆర్ కు  ఈ కానుక పంపినట్లు చెప్పారు.  ఈ పాతిక కిలోలతో సరిపెట్టేయడం లేదనీ, అవసరమైతే.. ప్రతి నెలా ఈ రేషన్ ను కేటీఆర్ కు పంపేందుకు రెడీగా ఉన్నామని చెప్పారు.  దేశంలో ప్రజలకు సన్నబి య్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికీ నాణ్యమైన బియ్యం చేరుతోందని పేర్కొన్నారు.  ఒకప్పుడు సన్నబియ్యంతో వంట చేస్తే అది పండగ రోజు అనుకునేవారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతి ఇంట్లో ప్రతిరోజూ పండగేనని సాయికుమార్ చెప్పారు.  మొత్తం మీద సాయికుమార్ కేటీఆర్ కు పంపిన ఈ బర్త్ డే గిఫ్ట్ రాజకీయవర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతున్నాయి.   25kgs, sannabiyyam, rapido, telanganabhawan, Mettu Saikumar
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిర్వహించిన  క్యాబినెట్  సమావేశానికి   ఉప ముఖ్యమంత్రి,  పవన్ కళ్యాణ్ గైర్హాజరుపై పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా వైసీపీ పవన్ కల్యాణ్ గైర్హాజర్ ను కూటమి పార్టీల మధ్య విభేదాలుగా చిత్రీకరించి పొలిటికల్ మైలేజీ కోసం తాపత్రేయ పడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం   కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే   ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.    అయితే ఇక్కడే వైసీపీయులు కేబినెట్ భేటీకి గైర్హాజరై విశ్రాంతి తీసుకున్న పవన్ కల్యాణ్   కుంకీ ఏనుగులకు స్వాగతం పలకడానికి మాత్రం ఎలా రాగలిగారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే కుంకీ ఏనుగుల విషయంలో పవన్ కల్యాణ్ బయటకు వచ్చింది ఆరగంట సేపు మాత్రమేననీ, అదే కేబినెట్ భేటీ అయితే గంటల తరబడి ఉంటుందనీ,   కొంత కాలంపాటు అలా సుదీర్ఘ సమయం జరిగే సమావేశాలు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు విస్పష్టంగా చెప్పినందునే పవన్ కల్యాణ్  క్యాబినెట్ భేటీ హాజరు కాలేదనీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  Pawan Kalyan, Pawan Kalyan Shoulder Surgery, AP Cabinet Meeting,   Deputy CM Pawan Kalyan, Jana Sena Party
  మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు. ఆయన కుమారుడు ప్రమేయం ఉన్న ప్రమాదంలో ఒక గొర్రెల కాపరి మరణించడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు ఆంధ్రా రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని రేపాయి. ప్రమాద స్థలంలో నిజాలను దాచేందుకు వేరొక వ్యక్తిని నిలబెట్టారనే అభియోగాలు, నిందితుడిని తప్పించే ప్రయత్నాలు చేశారనే కోణంలో పోలీసులు సిదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. ఈ అంశంపై  టోన్‌ న్యూస్‌లో ఆసక్తికర విశ్లేషణ జరిగింది. ఈ పరిణామంపై వైసీపీ అధినేత జగన్ ఘాటుగా స్పందించారు. అప్పలరాజును పేద మత్స్యకార కుటుంబం నుంచి వచ్చిన వైద్యుడిగా, నిష్కళంకమైన నాయకుడిగా అభివర్ణిస్తూ, ప్రభుత్వం రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ప్రమాదాన్ని హత్యగా ఎలా చిత్రీకరిస్తారని, పిల్లాడి పొరపాటుకు తండ్రిని ఎలా బాధ్యుడిని చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ వరుస పరిణామాలు రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ మరియు కూటమి ప్రభుత్వం మధ్య రాజకీయ పోరాటాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ కేసును కేవలం ఒక సాధారణ రోడ్డు ప్రమాదంగా చూసేందుకు వీల్లేదు. దీని వెనుక స్పష్టమైన రాజకీయ వ్యూహాలు, ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.  తమ పార్టీ నాయకులపై ఏ చిన్న కేసు నమోదైనా, దాన్ని తక్షణమే "రాజకీయ కక్ష సాధింపు"గా మలిచే వ్యూహాన్ని వైఎస్సార్‌సీపీ అనుసరిస్తోంది. నాయకులకు శ్రేణుల స్థాయిలో అభయం ఇవ్వడం, పార్టీ శ్రేణులు అధైర్యపడకుండా కాపాడుకోవడం ఈ డిఫెన్సివ్   కేసు చట్టపరమైన లోతుపాతులతో సంబంధం లేకుండా, నాయకుడికి అధినేత పూర్తి మద్దతుగా నిలవడం ద్వారా పార్టీ కేడర్‌కు బలమైన సందేశం వెళ్తుంది. చట్టం ముందు తప్పు-ఒప్పుల కంటే, పార్టీ అండగా ఉందనే భావనను కలిగించడం ఇక్కడ ప్రాధాన్యంగా మారింది. కూటమి ప్రభుత్వ నిష్పాక్షిక ముద్ర: మరోవైపు, అధికారంలో ఉన్న తెలుగుదేశం-జనసేన-బిజెపి కూటమి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుపోతుందనే సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తున్నామని చాటడం కూటమి ప్రాథమిక లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మక ఘర్షణల్లో సామాన్య ప్రజలు, ముఖ్యంగా బాధితుల పట్ల మానవీయ కోణం మరుగునపడిపోతోందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అరెస్ట్ పరిణామం రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలు మార్పులకు బీజం వేసే అవకాశం ఉంది. నేరారోపణలు లేదా చట్టపరమైన చిక్కుల్లో ఉన్న నాయకులను రాజకీయంగా వెనకేసుకురావడం ద్వారా తటస్థ ఓటర్లలో (Neutral Voters) ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుందనేది కీలక అంశం.  చట్టాన్ని గౌరవించే ధోరణి లేకపోతే, మధ్యతరగతి మరియు మేధోవర్గం దూరమయ్యే ప్రమాదం ఉంది. చట్టబద్ధమైన పాలనను అందిస్తున్నామని చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పరీక్ష లాంటిది. కేసుల్లో ఎలాంటి పక్షపాతం లేకుండా, పారదర్శకంగా విచారణ పూర్తి చేయగలిగితేనే ప్రభుత్వానికి విశ్వసనీయత పెరుగుతుంది.  ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్‌సీపీకి ఈ తరహా అరెస్టులు ఒక రకంగా కేడర్‌ను రోడ్లపైకి తెచ్చే అవకాశాన్ని ఇస్తాయి. అయితే, ఇవి ప్రజల్లో సానుభూతిని తెచ్చిపెడతాయా లేదా పార్టీ ప్రతిష్టను దిగజారుస్తాయా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. సమగ్ర విచారణ ద్వారా న్యాయం జరగడం, చట్టం ముందు అందరూ సమానులే అనే సంకేతం సమాజంలోకి వెళ్లడం మాత్రమే ఈ వివాదానికి సరైన ముగింపు కాగలదు. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.   Seediri Appalaraju Arrest, YS Jagan Mohan Reddy, AP Political News, Seediri Appalaraju Son Case, AP Politics, YSRCP Strategy, AP Law and Order, CM Chandrababu Naidu
వైసీపీలో ఎప్పుడు ఎవరికి అందలం దక్కుతుందో.. ఎప్పుడు ఎవరికి అధ:పాతాళమే దిక్కౌతుందో తెలియని పరిస్థితి ఉంది. జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆడింది ఆట, పాడింది పాటగా పెత్తనం చెలాయించారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ అండతో చెవిరెడ్డి పార్టీలో ఓ వెలుగు వెలిగారు. చెవిరెడ్డికి దక్కిన ప్రాధాన్యత వైసీపీలో మరెవరికీ దక్కలేదంటే అందులో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. అటుంటి చెవిరెడ్డి భాస్కరరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది.  గత సార్వత్రిక ఎన్నికల్లో  ఒంగోలు లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు అప్పగించడంతో సరిపెట్టకుండా, ఒంగోలు ఎంపీ టిక్కెట్ ఇచ్చి మరీ పోటీకి దింపారు జగన్. అటువంటి చెవిరెడ్డిని జగన్ ఇప్పుడు పూర్తిగా పక్కన పెట్టేశారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  జగన్ అధికారంలో ఉండగా జరిగిన ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి కీలకంగా వ్యవహరించారు. మద్యంవిధానంరూపకల్పన దగ్గరనుంచి డిస్టిలరీల వరకూ చెవిరెడ్డి అంతా తానే అన్నట్లుగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ కుంభకోణంపై ఈడీ దర్యాప్తుచేపట్టింది. అంతకు ముందే ఇదే కేసులో చెవిరెడ్డి అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉండి బెయిలుపై బయటకు వచ్చారు. ఇప్పుడు అదే కుంభకోణం చెవిరెడ్డిని జగన్ కు దూరం చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మద్యం కుంభకోణం వ్యవహారంలో జగన్ దృష్టికి కూడా రాకుండా చెవిరెడ్డి తన సొంతంకోసం సొమ్ములు వెనకేశారనీ, సిట్ దర్యాప్తులో భాగంగా చెవిరెడ్డిని అరెస్టు చేసి విచారించిన సందర్భంలో ఆ వివరాలు వెల్లడయ్యాయనీ  పార్టీ వర్గాల భోగట్టా. దీంతో మద్యం కుంభకోణం విషయంలో తన అనుకునన చెవిరెడ్డే తనను మోసం చేశారన్న అసంతృప్తితో జగన్ చెవిరెడ్డిని పూర్తిగా పక్కన పెట్టేశారని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి.   దీంతో ఒకప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లోనే తరచుగా కనిపించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఆ తలుపులు బంద్ అయ్యాయని అంటున్నారు. ఈ కారణంగానే గత కొంత కాలంగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి జగన్ దరిదాపుల్లో కూడా నిలబడలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నారనీ చెబుతున్నారు. ఇందుకు ఉదాహరణగాఇటీవలి కాలంల ో పార్టీ సమావేశాలకు కూడా ఆయనఎంట్రీని జగన నిేధించరనిపేర్కొంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డికి తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ దక్కే అవకాశాలు దాదాపు శూన్యమని పార్టీవర్గాలే చెబుతున్నాయి.   Jagan keeps Chevireddy at a distance, Ap Liquor cam, Chevireddy Bhaskarreddy, Cheating 
ఒక దేశంలోని 150 కోట్ల మంది ప్రజలను ఎల్లకాలం మోసం చేయడం సాధ్యమేనా? ఒక మహా సామ్రాజ్యాన్ని నిరంతరం ఏలగలరా? అంటే అది అసాద్యం అన్న సమాధానమే వస్తుంది.   నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ కాక్రోచ్‌ లు వీధుల్లోకి వచ్చాయి! ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ  కాక్రోచ్ జనతా పార్టీ  రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.   సరిహద్దు గోడలు, ముళ్ల కంచెలు, పోలీసు లారీలు, వాటర్ క్యానన్లు, లాఠీచార్జీలు... వీటివేవీ   యువత ఆక్రోశాన్ని, ఆగ్రహాన్నీ  ఆపలేకపోతున్నాయి. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీలు, వ్యవస్థాగత అవినీతి, ప్రశ్నించే గొంతుకలపై నిర్బంధాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ పోరాటం కేవలం ఒక మంత్రి రాజీనామాకో, పరీక్షల రద్దుకో పరిమితం కాదని, ప్రజాస్వామ్య పునరుద్ధరణే లక్ష్యమని ఉద్యమకారులు చెబుతున్నారు.   మతం, కులం, వర్గం ఆధారంగా పౌరుల మధ్య వ్యత్యాసం చూపే విభజన రాజకీయాలను ఎండగడుతూ, ఎలాంటి ఆయుధాలు లేకుండానే శాంతియుతంగా జరుగుతున్న ఈ ఉద్యమం ప్రస్తుత పాలక వ్యవస్థ పునాదులను కదిలించివేస్తున్నది.     Delhi students protest,  Cockroach Janata Party,  Competitive exam paper leak, Demand for Education Ministers resignation
ALSO ON TELUGUONE N E W S
  వాతావరణం చేంజ్ అయినా నాలో మాత్రం ఎలాంటి చేంజ్ లేదు, అంతకంత సినీ వినోదాన్ని అందివ్వడానికి ఓటిటి వేదిక డిజిటల్ వినోదాల పండుగలా మారబోతోంది. థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల్లోనే ఓటీటీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ సినిమాలు ఒకవైపు, వైవిధ్యమైన కథాంశాలతో ఉక్కిరిబిక్కిరి చేసే థ్రిల్లర్ సిరీస్‌లు మరొకవైపు డిజిటల్ వేదికలపై సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, ఈటీవీ విన్ వంటి దిగ్గజ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో ఏకంగా 25ki పైగా కొత్త సినిమాలు వెబ్ సిరీస్‌లు వివిధ భాషల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వీకెండ్‌లో ఇంటి పట్టునే ఉండి రిలాక్స్ అవ్వాలనుకునే సినిమా ప్రేమికులకు ఇది నిజంగానే ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు. ఈ వారం ఓటీటీలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న చిత్రాల్లో 'నాగబంధం' అగ్రస్థానంలో నిలుస్తోంది. విరాట్ కర్ణ కథానాయకుడిగా, నభా నటేష్, ఐశ్వర్య మేనన్ కథానాయికలుగా నటించిన ఈ పాన్-ఇండియా యాక్షన్ అడ్వెంచర్ మూవీకి అభిషేక్ నామా దర్శకత్వం వహించారు. జులై 3న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, కేవలం నెల రోజుల వ్యవధిలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా అందుబాటులోకి రావడం విశేషం. పురాతన నిధుల రహస్యాలు, నాగబంధం సంప్రదాయాలతో నిండిన ఈ విజువల్ వండర్ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చి రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకుపోతోంది. ఇక పోలీస్ డ్రామాలు, క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వీక్షకులకు ఈటీవీ విన్ (ETV Win) వేదిక సరికొత్త అనుభూతిని అందిస్తోంది. దేవి ప్రసాద్ శెట్టి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న కన్నడ సూపర్ హిట్ థ్రిల్లర్ 'కేస్ ఆఫ్ కొండాన' ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. విజయ్ రాఘవేంద్ర, భావన మేనన్ కీలక పాత్రల్లో జీవించిన ఈ సినిమా కథాంశం ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతుంది. తెలియక చేసిన ఒక చిన్న పొరపాటును కప్పిపుచ్చుకునేందుకు చేసే వరుస తప్పులు మనిషి జీవితాన్ని ఎంతటి ముప్పులోకి నెడతాయో ఈ చిత్రంలో అత్యంత ప్రతిభావంతంగా చూపించారు. మలయాళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన మరో అద్భుతమైన కథా చిత్రం 'పళ్లిచట్టంబి'. కేరళలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో టొవినో థామస్, కయాదు లోహర్ జంటగా నటించారు. డిజో జోస్ ఆంటోని నిర్దేశత్వంలో వచ్చిన ఈ యాక్షన్ డ్రామాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో మెరిశారు. థియేటర్లలో విశేష ఆదరణ పొందిన ఈ సినిమా ప్రస్తుతం సోనీలివ్ (Sony LIV) లో మలయాళంతో పాటు తెలుగు వర్షన్‌లోనూ స్ట్రీమింగ్ అవుతూ సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. మరోవైపు గ్లోబల్ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రేక్షకుల కోసం హిందీ మరియు తెలుగు భాషల్లో 'ముసాఫిర్ కెఫే' అనే డిఫరెంట్ ఎంటర్‌టైనర్‌ను అందుబాటులోకి తెచ్చింది. విక్రాంత్ మాస్సే, వేదికా పింటో, మహిమా మక్వానా ముఖ్య పాత్రలు పోషించిన ఈ సిరీస్‌ను రుచిర్ అరుణ్ తెరకెక్కించారు. టెరిబ్లీ టైనీ టేల్స్ సంస్థ నిర్మించిన ఈ డ్రామా యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. దీనితో పాటు అమెజాన్ ప్రైమ్ వీడియోలో పవన్ కల్యాణ్, సప్తగిరి, రాజ్‌కుమార్ కసిరెడ్డి ముఖ్య పాత్రల్లో రూపుదిద్దుకున్న 'పురుషః' చిత్రం మరియు హిందీ కామెడీ సిరీస్ 'ఆదర్శ బాల విద్యాలయ' కూడా వీక్షకులను అలరిస్తున్నాయి. Also read: పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ పై బాబీ డియోల్ షాకింగ్ కామెంట్స్  వీటితో పాటు అంతర్జాతీయ కంటెంట్ ఇష్టపడే వారి కోసం నెట్‌ఫ్లిక్స్‌లో 'ఎలైట్ ఫోర్స్', 'ద డెట్ కలెక్టర్', '1941', '72 అవర్స్' వంటి 8కి పైగా ఇంగ్లీష్, తమిళ చిత్రాలు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్‌లో 'ఇగో రమణ్', 'అనోమి' వంటి ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు సబ్‌స్క్రైబర్లను మైమరిపించేందుకు దాదాపు 25కు పైగా విభిన్న రకాల ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయి. ఈ శని, ఆదివారాల్లో మీకు నచ్చిన జానర్ కథలను ఎంచుకుని డిజిటల్ వినోదాన్ని ఆస్వాదించండి! naga bandham, ott movies, anomi, elite force
నారా రోహిత్ తన వైవిధ్యమైన కథా ఎంపికలతో ప్రేక్షకుల్లో ఎప్పుడూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటారు. విభిన్నమైన పాత్రలతో మెప్పించే ఆయన, ఈసారి మరొక సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నారా రోహిత్ హీరోగా నటిస్తున్న ఈ నూతన చిత్రాన్ని దర్శకుడు రామ్ గన్ని తెరకెక్కిస్తున్నారు. పోలీస్ బ్యాక్‌డ్రాప్ కి సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో భారీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.  శప్త అశ్వ మీడియా వర్క్స్ పతాకంపై కళ్యాణ చక్రవర్తి మంథెన, భాను కిరణ్ ప్రతాప ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, విజయ్ కృష్ణ లింగమనేని ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఉత్కంఠభరితమైన హారర్ కథలో నారా రోహిత్ సరసన అందాల నటి హన్సిక మోత్వాని హీరోయిన్ గా నటిస్తోంది. నారా రోహిత్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను చిత్రబృందం అధికారికంగా విడుదల చేసింది. సినిమా టైటిల్ తో పాటు అత్యంత భయానకంగా, ఆకట్టుకునేలా ఉన్న ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ అన్వీల్ చేశారు.  ఈ చిత్రానికి 'కపాలీ' అనే పవర్ ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. 'కపాలీ' అంటే పుర్రెను ధరించినవాడు అని అర్థం వస్తుంది. ఈ ఆధ్యాత్మిక, తాంత్రిక నేపథ్యం ఉన్న పేరుకు తగ్గట్టుగానే ఫస్ట్ లుక్ పోస్టర్ డిజైన్ కూడా ఉత్కంఠభరితంగా, భయం గొలిపే విధంగా రూపొందించబడింది. టైటిల్ లోని గూఢమైన అర్థాన్ని పోస్టర్ విజువల్స్ పర్ఫెక్ట్‌గా ప్రతిబింబిస్తున్నాయి. దీనికి తోడు 'ఏ జర్నీ ఇంటో ది అన్నోన్' (తెలియని ప్రపంచంలోకి ఒక ప్రయాణం) అనే ట్యాగ్‌లైన్ సినిమాలోని మిస్టరీ స్థాయిని మరింత పెంచుతోంది. మొత్తం మీద, ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ అత్యంత గ్రిప్పింగ్‌గా ఉంటూ ప్రేక్షకులలో విపరీతమైన క్యూరియాసిటీని కలిగిస్తోంది. మేకర్స్ త్వరలోనే ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.   Nara Rohith, Kapaali Movie, Hansika Motwani  
The makers of Nenu Ready have unveiled the film's latest single, Konchem Konchem Kothaga, offering a glimpse into the romantic side of the Havish-starrer. After the teaser and earlier promotional material generated interest, the new track shifts focus to the chemistry between the lead pair and presents a bold yet aesthetically shot romantic number. Composed by Mickey J. Meyer, the song is sung by Sameera Bharadwaj, while Ramajogayya Sastry has penned the lyrics. The track revolves around two lovers embracing their growing intimacy, with the music and lyrics complementing the mood without crossing into overtly provocative territory. Mickey's melody keeps the composition soft and melodious, making it an easy listen despite its sensual theme. Havish and Kavya Thapar share impressive on-screen chemistry, with the visuals capturing their romance in a stylish and artistic manner. Director Trinadha Rao Nakkina, known primarily for commercial entertainers, appears to have opted for a more restrained and visually elegant approach while picturising the song. The choreography and cinematography further add to the song's polished appeal. Adding to the excitement is Nargis Fakhri, who makes a special appearance in the film. Her presence in the song has become another talking point among viewers, hinting at an interesting role in the narrative. Produced by Kanchana Koneru, Nenu Ready is currently in the final stages of post-production. With its youthful vibe, polished visuals and music-driven promotions, the film is steadily building anticipation ahead of its release, the date for which is expected to be announced soon. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
విజయ్ ఆంటోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన రీసెంట్‌గా నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వంద దేవుళ్ళు' ఆగస్టులో తమ ప్లాట్‌ఫామ్‌లో ఓటీటీ ప్రీమియర్ కానుందని ZEE5 తెలుగు ప్రకటించింది. అధికారిక స్ట్రీమింగ్ తేదీని త్వరలో ప్రకటించనున్నారు.  ఇటీవల విడుదలైన 'పరిమళ & కో' ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంది. జయరామ్, ఊర్వశి నటించిన ఈ చిత్రంలో కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని రకాల అంశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు ZEE5 తెలుగు ఈ విజయ పరంపరను కొనసాగించేందుకు 'వంద దేవుళ్ళు'తో ముందుకు వస్తోంది. ఇది ఫ్యామిలీ అంతటినీ ఒకచోట చేర్చే సామర్థ్యం ఉన్న చిత్రం. ఈ మూవీలోని భావోద్వేగాలు పూర్తిగా భిన్నమైనవి. నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన 'వంద దేవుళ్ళు' చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది. తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు.   Vijay Antony, Vanda Devullu, OTT Update, ZEE5  
  పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై బాబీ డియోల్( దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకప్పటి హీరో కూడా అయిన బాబీ డియోల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన, అత్యంత పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్స్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ నటుడిగా మారిపోయాడు. ప్రెజెంట్ నిన్న విడుదలైన జన నాయకుడుతో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు  వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతు 'నేను దక్షిణాదిలో ఏ అగ్ర నటుడితో కలసి పనిచేసినా, వాళ్లంతా ఆ తర్వాత పొలిటికల్ గా పవర్ సీట్లలో కూర్చుంటున్నారు. మంత్రులు, డిప్యూటీ సీఎంలు, సీఎంలు అవుతున్నారు! ఇది నిజంగా చాలా విచిత్రమైన, అత్యంత సరదాగా అనిపించే యాదృచ్ఛిక విషయం. నందమూరి బాలకృష్ణతో కలిసి 'డాకు మహారాజ్' లో  బలవంత్ సింగ్ ఠాకూర్ అనే పవర్‌ఫుల్ రోల్ లో చేశాను. ఆయన ఇప్పటికే రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసారు. పవన్ కళ్యాణ్ తో  'హరిహర వీరమల్లు' లో  ఔరంగజేబు క్యారక్టర్  పోషించాను. ఈ ప్రాజెక్ట్ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా (డిప్యూటీ సీఎం) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు 'జన నాయగన్' లో విజయ్ తో చేశాను. సీఎం అయ్యారని బాబీ డియోల్  చెప్పుకొచ్చాడు.  Also read: సినిమాగా తెరకెక్కకుండా 30 లక్షలు సంపాదించిన కథ.. ఆ రైటర్ ఎవరో తెలుసా!  
తమిళ చిత్రసీమతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'జననాయగన్'. దళపతి విజయ్ నటనకు స్వస్తి పలుకుతూ రాజకీయ రంగ ప్రవేశం చేసి తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన మొదటి, చివరి చిత్రం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ పవర్‌ఫుల్ పొలిటికల్ యాక్షన్ డ్రామా గురువారం, జులై 23న ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఎత్తున థియేటర్లలోకి వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచే తమిళనాడు వ్యాప్తంగా ఉన్న థియేటర్ల వద్ద అభిమానుల కోలాహలం, డప్పు చప్పుళ్లు, బాణసంచా కాల్పులతో పండగ వాతావరణం నెలకొంది. బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ఊహించని ఒక తీవ్రమైన సామాజిక, రాజకీయ వివాదంలో చిక్కుకుంది. సినిమా సాధిస్తున్న అపారమైన బాక్సాఫీస్ విజయంతో పాటు, ఒక తమిళనాడు మంత్రి చేసిన బాధ్యతారాహిత్య చర్య ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్రస్థాయి విమర్శలకు దారితీసింది. ఈ ఊహించని వివాదానికి ప్రధాన కారణం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్‌సీ) జారీ చేసిన సెన్సార్ సర్టిఫికేషన్. సినిమాలో ఉన్న తీవ్రమైన యాక్షన్ సన్నివేశాలు, కథాంశం ప్రాధాన్యతను బట్టి సెన్సార్ బోర్డు ఈ 'జన నాయగన్' చిత్రానికి 'A' (అడల్ట్ ఓన్లీ) సర్టిఫికెట్ మంజూరు చేసింది. భారతీయ సినిమా చట్టాలు, సెన్సార్ బోర్డు మార్గదర్శకాల ప్రకారం 'A' సర్టిఫికెట్ పొందిన సినిమాలను థియేటర్లలో ప్రదర్శిస్తున్నప్పుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న చిన్న పిల్లలను హాల్లోకి అనుమతించడం సంపూర్ణంగా చట్టవిరుద్ధం. ప్రవేశ ద్వారాల వద్ద ప్రేక్షకుల వయస్సును సరిచూడాల్సిన ప్రాథమిక బాధ్యత థియేటర్ యాజమాన్యాలపై స్పష్టంగా ఉంది. ఏ పరిస్థితుల్లోనూ మైనర్లను, చిన్న పిల్లలను ఇటువంటి సినిమాలకు అనుమతించకూడదనేది కచ్చితమైన నిబంధన. అయితే రామనాథపురంలోని ఒక ప్రముఖ థియేటర్‌లో గురువారం సాయంత్రం 4 గంటల ప్రదర్శన సమయంలో ఒక వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది. తమిళనాడు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రాజీవ్ తన కుటుంబంతో కలిసి ఈ సినిమా చూసేందుకు థియేటర్‌కు విచ్చేశారు. సాధారణంగా ప్రశాంతంగా సాగాల్సిన ఈ సినిమా వీక్షణలో మంత్రి రాజీవ్ తన భార్యతో పాటు తమ చిన్న పిల్లలను కూడా వెంటబెట్టుకుని నేరుగా థియేటర్ లోపలికి వచ్చి సీట్లలో కూర్చున్నారు. ప్రదర్శన జరుగుతుండగా మంత్రి 'A' సర్టిఫికెట్ ఉన్న సినిమాను చిన్న పిల్లలతో కలిసి వీక్షిస్తున్న దృశ్యాలు, ఫొటోలు, వీడియో క్లిప్‌లు మొబైల్ కెమెరాల్లో రికార్డ్ అయి క్షణాల్లో సోషల్ మీడియా వేదికలపైకి లీక్ అయ్యాయి. ఈ ఫొటోలు, వీడియోలు నెట్టింట ప్రత్యక్షం కావడమే ఆలస్యం నెటిజన్ల నుంచి, ప్రజా సంఘాల నుంచి తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తమయ్యాయి. "దేశంలో చట్టాలు, సెన్సార్ నిబంధనలు కేవలం సామాన్య పౌరులకేనా? విఐపీలకు, మంత్రులకు ఇవి వర్తించవా?" అని నెటిజన్లు నిలదీయడం ప్రారంభించారు. ఒక పర్యావరణ శాఖ మంత్రి స్థాయి వ్యక్తి అయి ఉండి, చట్టాన్ని గౌరవించాల్సిన స్థానంలో ఉన్న మంత్రి రాజీవ్ ఇలా బహిరంగంగా సెన్సార్ నిబంధనలను ఉల్లంఘించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ పౌరులు తమ పిల్లలతో వస్తే గేటు వద్దే నిలిపివేసే థియేటర్ సిబ్బంది, మంత్రి రాగానే నిబంధనలన్నింటినీ పక్కనబెట్టి చిన్న పిల్లలను లోపలికి ఎలా అనుమతించారంటూ థియేటర్ యాజమాన్యాల తీరుపై కూడా ప్రశ్నల వర్షం కురుస్తోంది. బాక్సాఫీస్ వద్ద 'జన నాయగన్' చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్నప్పటికీ, మంత్రి రాజీవ్ చుట్టూ ముసురుకున్న ఈ 'A' సర్టిఫికెట్ ఉల్లంఘన రగడ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు నిబంధనలను పక్కనబెట్టి ప్రవర్తించడం విఐపి సంస్కృతికి నిదర్శనమని ప్రజలు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై సెన్సార్ బోర్డు, సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.  
  ఒక సినిమా హిట్ అవ్వడానికి ముఖ్యంగా కావాల్సింది కథ.. ఆ కథ తర్వాతనే హీరో, హీరోయిన్, దర్శకుడుతో పాటు ఇతర టెక్నీషియన్స్. ఆ అందరి పని తనం సినిమా విజయంలో కీ రోల్ పోషిస్తుంది. కానీ సినిమాకి అసలైన లివర్ మాత్రం 'కథ' మాత్రమే. కథ సరిగ్గా లేకపోతే కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టినా, భారీ స్టార్ కాస్టింగ్ ఉన్నా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే  ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది – "కథే నాయకుడు, కథే కథానాయకుడు" అని! ఈ నేపథ్యంలో కథ యొక్క గొప్పతనానికి సంబంధించిన న్యూస్ ఒకటి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ప్రముఖ దర్శకుల దగ్గర రచయితగా చేసిన రైటర్ ఒకాయన నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటనని ఆధారంగా చేసుకొని ఒక కథ తయారు చేసాడు. ఆ కథని టాప్ ప్రొడ్యూసర్ ల దగ్గరనుంచి, చిన్న ప్రొడ్యూసర్ ల వరకు అందరికి వినిపించాడు. అందరూ వినగానే మైమరచిపోయి లక్ష దగ్గర నుంచి ఐదు లక్షల దాకా అడ్వాన్స్ ఇచ్చారు. కానీ కథ మాత్రం ఇంతవరకు సినిమాగా తెరకెక్కలేదు. దాంతో ఆ రైటర్ తెరకెక్కని ఆ కథ వల్ల ముప్పై లక్షల వరకు సంపాదించాడు. సినీ రూల్స్ ప్రకారం అడ్వాన్స్ ఇచ్చి ఆ తర్వాత నెంబర్ ఆఫ్ డేస్ లో  తెరకెక్కించకపోతే  అడ్వాన్స్ డబ్బులు వెనక్కి ఇవ్వరు. Also read: Chiranjeevi: సెంటిమెంట్ నిజమైందా! అభిమానుల కన్నీళ్లు ఆ రైటర్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో తెలుగు వాడి సత్తా చాటుతున్న టాప్ దర్శకుడి తొలి సినిమాకి కథని అందించాడు. ఆ చిత్రంలోని హీరో కూడా పాన్ ఇండియా కట్ అవుట్ . ప్రస్తుతం ఆ రైటర్ తన భార్య పేరుతో సీరియల్స్ కి పని చేసుకుంటున్నాడు. cinema, story, director, hero      
Nara Rohith has unveiled his next project, Kapaali, on the occasion of his birthday, marking yet another unconventional choice in his filmography. Known for backing content-driven films, the actor is now stepping into the psychological horror genre with a story set against a police backdrop, promising a fresh cinematic experience for Telugu audiences. The announcement came with an intriguing first-look poster that immediately sparked curiosity. Designed in a dramatic sketch style, it features Nara Rohith with an intense, expressionless gaze and a haunting crown made of tree branches. The poster also includes a woman with glowing red eyes, a police van placed inside a fiery occult circle, police officers, and mysterious floating symbols, hinting at a supernatural mystery intertwined with an investigation. Written and directed by Raam Ganni, Kapaali is described as a psychological horror thriller that blends eerie supernatural elements with a police narrative. The makers promise a dark, suspenseful film that explores unexplored themes, while Rohith is said to be sporting a completely new look to suit the mysterious tone of the story. The film stars Hansika, Preneetha Patnaik, Lavanya, Chaitanya Sagiraju, Lakshman Meesala, and Sri Muktha Macha in key roles. It is produced by Kalyana Chakravarthy Manthina and Bhanu Kiran Pratapa, with Vijay Krishna Lingamaneni presenting the project. The makers are expected to announce the shooting schedule and other details in the coming weeks. With Kapaali, Nara Rohith continues his trend of experimenting with distinctive scripts instead of conventional commercial entertainers. If the first-look poster is any indication, the film is aiming to deliver a chilling psychological thriller with a unique visual identity. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
నటసార్వభౌమ నందమూరి తారక రామారావు సతీమణి నందమూరి బసవతారకం శతజయంతి సందర్భంగా నేడు ఆ కుటుంబ సభ్యులు ఆమె పేరుతో 'నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్' ప్రారంభించడం జరిగింది.  ఈ సందర్భంగా హైదరాబాదులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ఆమె జయంతి వేడుకలు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహణ బాధ్యతలను నందమూరి కుటుంబ సభ్యులు వహిస్తూ చైర్మన్ గా నందమూరి మోహనకృష్ణ, మేనేజింగ్ ట్రస్టీగా నందమూరి మోహన రూపా, ట్రస్టీలుగా నందమూరి సీమంతిని, తుమ్మల ప్రసన్నకుమార్ బాధ్యతలు చేపట్టారు.  ఈ సందర్భంగా నందమూరి మోహన కృష్ణ మాట్లాడుతూ... "మా అమ్మ గారి శత జయంతి సందర్భంగా నేడు ఆమె పేరిట ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. నందమూరి తారక రామారావు గారు సినీ రంగంలో అలాగే ప్రజలకు సేవ చేసే రాజకీయ రంగంలో ఎన్నో చూశారు. అటువంటి నాన్నగారి ప్రయాణాలలో అండగా నిలిచి తనదైన బాధ్యతగా మా అందరిని పెంచి పోషిస్తూ తీర్చిదిద్దారు. ఆమె రుణం మేము ఎప్పటికీ తీర్చుకోలేము. గ్రాండ్ మా హోమ్ లో మహిళ వృద్ధులకు పండ్ల పంపిణీ కార్యక్రమం, అలాగే అన్నదాన కార్యక్రమంతో ప్రారంభమైన ఈ సేవ ముందు ముందు అంచలంచలుగా పేదవారికి అన్ని రకాలుగా అండగా నిలబడుతూ వైద్యం అలాగే ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులను ప్రోత్సహిస్తూ మేమే తెలుసుకొని అవసరం ఉన్నవారికి అన్ని విధాలుగా అండగా నిలబడాలని మరిన్ని సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరుకుంటున్నాము. ఆ పుణ్య దంపతులు ఆశీర్వాదాలు మా కుటుంబ సభ్యులకు అలాగే తెలుగు వారందరికీ ఎప్పుడు ఉంటాయి" అన్నారు.  నందమూరి మోహన రూపా మాట్లాడుతూ... "నేడు పుణ్య దంపతులు నందమూరి తారక రామారావు గారు, బసవతారకం గారిని గుర్తు చేసుకుంటూ ఆమె శత జయంతి సందర్భంగా నందమూరి బసవరామతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది. తాతగారు ప్రజాసేవలో అలాగే నటన రంగంలో బిజీగా ఉన్నప్పటికీ నానమ్మ గారు తనదైన బాధ్యతగా తన సంతాన బాధ్యతలను తీసుకుని తన పిల్లల్ని పెంచి పెద్ద చేసి ఉత్తీర్ణులుగా తీర్చిదిద్దారు. ఆ పుణ్య దంపతులు ఎప్పటికీ మా మనసులో కొలువై ఉంటారు. తాత గారికి ప్రతి విషయంలో అండగా నిలిచి ఆయన ప్రతి అడుగులో వెంట నడుస్తూ సపోర్ట్ చేసిన మా నానమ్మ గారిని గౌరవించుకుంటూ ఈ ట్రస్టు ప్రారంభించడం జరిగింది. భవిష్యత్తులో ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నాము. పేదవారికి అండగా నిలుస్తూ విద్యారంగంలో స్కాలర్షిప్లు ఇవ్వడం లాంటి పనులు చేయనున్నాము. ఈ కార్యక్రమాలకు ప్రజలందరికీ సపోర్టు కావాలని కోరుకుంటున్నాము." అన్నారు.  నందమూరి సీమంతిని మాట్లాడుతూ... "నేడు బసవతారకం గారి శతజయంతి సందర్భంగా ట్రస్ట్ ప్రారంభించి అన్నదాన కార్యక్రమం చేయడం సంతోషంగా ఉంది. ఆ పుణ్య దంపతుల ఆశీస్సులు ఎప్పటికీ మన అందరికీ ఉంటాయి" అన్నారు.  తుమ్మల ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... "నేడు బసవతారకం గారి శత జయంతి సందర్భంగా ఆమె పేరిట నందమూరి బసవతారకం ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించడం ఆనందకరం. రామారావు గారు తన బాధ్యతలకు ఎంతో బిజీగా ఉన్న సమయంలో ఆమె తన సంతానం అందరిని పెంచి పెద్ద చేసి జీవితంలో క్రమశిక్షణ నేర్పుతూ ఉన్నత స్థాయికి చేరడంలో ఎంతో కృషిచేసి ఆ కుటుంబానికి, రామారావు గారికి అండగా నిలిచారు. రామారావు గారు తన విధినిర్వహణలవల్ల తన సొంత కుమారుడి పెళ్లికి రాలేకపోయినప్పటికీ ఆమె ఒంటరిగానే పెళ్లి బాధ్యతలు కూడా తన భుజంపై వేసుకుని పెళ్లి చేశారు. రామారావు గారు బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలబడి రాజకీయంగా కూడా ఎంతో మందిని ప్రోత్సహిస్తూ ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్లారు. ఈ ట్రస్ట్ ద్వారా ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయనున్నాము" అంటూ ముగించారు.     Nandamuri Basava Tarakam, Nandamuri Taraka Rama Rao, NTR, Nandamuri   
టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినీ ప్రియులతో పాటు ప్రతి ఒక్కరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. చందమామలా మెరిసే కాజల్ అగర్వాల్ వెండితెరపై ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి కోట్ల మంది అభిమానుల హృదయాలను గెలుచుకుంది. అయితే ఈసారి ఆమె కేవలం సినిమా విశేషాలతో మాత్రమే కాకుండా, మన వర్తమాన సమాజంలో అత్యంత ఆందోళనకరంగా మారిన 'ఆహార కల్తీ' అనే తీవ్రమైన సామాజిక రుగ్మతపై సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచింది. కల్తీ కాన్సెప్ట్‌ నేపథ్యంలో తెరకెక్కిన తన తాజా చిత్రం 'ది ఇండియా స్టోరీ' థియేటర్లలోకి విడుదలైన సందర్భంగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కాజల్ పంచుకున్న నిజాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మనదేశంలో ప్రతిరోజూ మనం తీసుకుంటున్న ఆహారంలో ఎంతటి భయంకరమైన రసాయనాలు కలసిపోతున్నాయో, దానివెనుక ఉన్న ఘోరమైన వాస్తవాలను ఆమె బహిర్గతం చేశారు. ప్రధానంగా మనం అనునిత్యం తాగే పాల గురించి కాజల్ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్క తల్లిని లోతుగా ఆలోచనలో పడేసేలా ఉన్నాయి. ప్రతి రోజూ మనం కొనుగోలు చేసి తాగే ప్యాకెట్ పాలు ఎంతమాత్రం సురక్షితమైనవి కావని, వాటిలో రసాయనాలు, పెస్టిసైడ్స్ అవశేషాలు ప్రమాదకర స్థాయిలో కలసిపోతున్నాయని ఆమె హెచ్చరించారు. ఈ నిజాలు తెలుసుకున్న తర్వాత తాను ఒక తల్లిగా తీసుకున్న నిర్ణయం చాలా మందికి వింతగా లేదా షాకింగ్ గా అనిపించవచ్చని ఆమె స్పష్టం చేశారు. "నన్ను ఎవరు ఏమనుకున్నా సరే, చివరికి అందరూ నన్ను కసాయి తల్లి అని నిందించినా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ నా చిన్నారి కుమారుడు నీల్ (Neil) కి మాత్రం బయట దొరికే కల్తీ పాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాగించను" అని కాజల్ తేల్చి చెప్పారు. కల్తీ పాల వల్ల పసిపిల్లల ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుందని, అందుకే తాను బయటి ప్యాకెట్ పాలను పూర్తిగా దూరంగా పెట్టి, ఇంట్లోనే స్వయంగా ఆర్గానిక్ పద్ధతిలో పన్నీరు, పెరుగు తయారు చేసి తన కుమారుడికి ఇస్తున్నానని వెల్లడించారు. 'ది ఇండియా స్టోరీ' సినిమా కోసం చేసిన సుదీర్ఘమైన రీసెర్చ్‌లోనే ఈ దారుణ నిజాలు తన దృష్టికి వచ్చాయని కాజల్ భావోద్వేగంగా వెల్లడించారు. ఈ సినిమా ప్రాజెక్ట్ కోసం అధ్యయనం చేస్తున్న సమయంలో మనదేశంలో ఆహార పదార్థాలు ఏ స్థాయిలో కల్తీ అవుతున్నాయో తెలుసుకుని తాను తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పాలు మాత్రమే కాకుండా, మనం పండించే కూరగాయలు, పండ్లు కూడా ఇంజక్షన్లు, రసాయనాలతో విషతుల్యమవుతున్నాయని తెలిపారు. ఇటీవల ఒక కేసుకు సంబంధించిన రీసెర్చ్ లో పుచ్చకాయల్లో రసాయనాలు కలపుతున్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత, తాను పుచ్చకాయ తినడమే పూర్తిగా మానేశానని కాజల్ చెప్పుకొచ్చారు. ఈ విధంగా ఆహారంలో కల్తీ విపరీతంగా పెరిగిపోవడం వల్లే నేటి యువతలో, చిన్న పిల్లల్లో సైతం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల కేసులు అత్యంత వేగంగా పెరిగిపోతున్నాయని ఆమె తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార కల్తీకి వ్యతిరేకంగా ప్రజల్లో పూర్తిస్థాయి అవగాహన పెంచాలనే ముఖ్యమైన ఉద్దేశంతోనే 'ది ఇండియా స్టోరీ' అనే సందేశాత్మక చిత్రాన్ని నిర్మించారని కాజల్ తెలిపారు. ప్రతి ఇల్లు, ప్రతి తల్లి ఈ విషయంలో తక్షణమే అప్రమత్తంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. వ్యాపార ప్రకటనలను, ఆకర్షణీయమైన ప్యాకింగ్‌లను గుడ్డిగా నమ్మి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లులు వీలైనంత వరకు ఆర్గానిక్ ఆహార పదార్థాలకే ప్రాధాన్యత ఇవ్వాలని, స్థానిక రైతు మార్కెట్ల నుండి మాత్రమే తాజా కూరగాయలు కొనుగోలు చేయాలని ఆమె సూచించారు. తాను సైతం ఆన్‌లైన్ గ్రోసరీ యాప్‌లపై ఆధారపడటం తగ్గించి, నేరుగా పరిశీలించి ఆర్గానిక్ వస్తువులను తెచ్చుకుంటున్నట్లు పేర్కొన్నారు. సినిమా ద్వారా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన తల్లిగా కాజల్ తీసుకున్న ఈ నిర్ణయం, ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.   Kajal Aggarwal, The India Story
భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు..  కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా?  అని.  అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు.  దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు.  ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే.. సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన.. కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు.   దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని  అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ  ఎదుర్కొంటున్నట్లయితే కోడలు  మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట  ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం. ఆరోగ్య సంబంధ విషయాలు..  అత్తల తరానికి,  ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి.  వారి జీవనశైలి,  ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు.  ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది.  ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు.  మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం,  పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు  అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి. విద్య, ఉద్యోగం.. నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు.  ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి  సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది.  కుటుంబ అంచనాలకు,  వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి  అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు.  ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు. వ్యక్తిగత హద్దులు.. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది.  వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా,  హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది.  కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు.  కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.   ప్రొటెక్షన్,  లీగల్ రైట్స్.. ఆడపిల్ల  భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.                                       *రూపశ్రీ.  
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
సల్వార్ సూట్‌లు భారతీయ మహిళలు చాలా ఇష్టపడే  సాంప్రదాయ వస్త్రాలలో ఒకటి. మారుతున్న ఫ్యాషన్ కు అనుగుణంగా సల్వార్ సూట్‌లను ధరించే విధానం కూడా చాలా మారింది. ఒకప్పుడు కేవలం పండుగలు,  పెళ్లిళ్లు, శుభకార్యాలు వంటి సమయాల్లో మాత్రమే ధరించినప్పటికీ, నేటికాలంలో మహిళలు ఆఫీస్, పార్టీలు, పండుగలు, నార్మల్ టూర్స్ వంటి వాటికి కూడా సల్వార్ సూట్ లు ధరించడానికి ఇష్టపడతారు.  అయితే ఇప్పట్లో సల్వార్ సూట్ అనేది ఓల్డ్ ఫ్యాషన్ లోకి మారింది. నేటికాలంలో మరింత ఫ్యాషన్ గా ఉన్న దుస్తులు రావడంతో సల్వార్ సూట్ కూడా సాధారణ దుస్తుల్లా మారిపోయింది.  కానీ సల్వార్ సూట్ ను కూడా ఫ్యాషన్ గా ధరిస్తే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండొచ్చు.  అందుకోసం సల్వార్ సూట్ ను ఎలా ధరించాలి?  తెలుసుకుంటే.. సల్వార్ సూట్ స్టైల్ గా ఉండాలంటే పాటించాల్సిన చిట్కాలు.. సరైన ఫిట్టింగ్..  సరైన ఫిట్‌తో సూట్‌ను ఎంచుకోండి. సల్వార్ సూట్ స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా కనిపించాలంటే, దాని ఫిట్టింగ్‌పై శ్రద్ధ పెట్టడం ముఖ్యం. చక్కగా సరిపోయే సూట్  చక్కగా కనిపించేలా చేస్తుంది, అలాగే చాలా ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది.  మరీ వదులుగా ఉండే సూట్ ధరించడం వల్ల దుస్తుల షేప్  పాడవుతుంది, అదే సమయంలో మరీ బిగుతుగా ఉండే సూట్ ఎబ్బెట్టుగా కనిపించేలా చేస్తుంది. అందుకే ఫిట్టింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుప్పట్టా.. సల్వార్ సూట్‌లో దుపట్టా చాలా ముఖ్యమైనది.  ఇది మొత్తం రూపాన్ని డిఫరెంట్ గా మార్చేసే కెపాసిటీ కలిగి ఉంటుంది. అంతేకాదు.. దుపట్టాను ధరించే విధానాన్ని మార్చడం ద్వారా ఒకే సూట్‌ను చాలా విధాలుగా దరించవచ్చు. దుప్పట్టాను  ఒక భుజంపై ఓపెన్ గా  వేసుకోవచ్చు, ముందు వైపు కుచ్చులతో ధరించవచ్చు, లేదా బెల్ట్‌తో కొత్త టచ్ ఇవ్వవచ్చు.   ఫ్యాషన్ జ్యువెలరీ.. సరైన జ్యువెలరీ  సాధారణ సల్వార్ సూట్‌ను కూడా స్టైలిష్‌గా, ఆకర్షణీయంగా మార్చగలవు.  సూట్ సింపుల్‌గా ఉంటే, ఆక్సిడైజ్డ్ చెవిపోగులు, చాంద్‌బాలీలు, ఒక స్టేట్‌మెంట్ నెక్లెస్ లేదా రంగురంగుల బ్రాస్‌లెట్‌లు ధరించి  లుక్‌ను మరింత మెరుగుపరుచుకోవచ్చు. అయితే, భారీ వర్క్  ఉన్న సూట్‌తో సింపుల్ ఆభరణాలు మరింత హుందాగా కనిపిస్తాయి. ఆభరణాలను ఎంచుకునేటప్పుడు, బాలెన్స్డ్  లుక్ కోసం సూట్  రంగు , డిజైన్‌ను పరిగణలోకి తీసుకోవాలి. .పాదరక్షలు.. సల్వార్ సూట్‌కు సరైన పాదరక్షలను ఎంచుకోవడం  మొత్తం రూపాన్ని మార్చేస్తుంది. సాంప్రదాయ రూపానికి, ఎత్నిక్ జుట్టీలు, కొల్హాపురి చెప్పులు , శాండల్స్ మంచి ఎంపికలు.  పార్టీకి లేదా ప్రత్యేక సందర్భానికి సూట్ ధరిస్తుంటే, లైట్ హీల్స్ మరింత అందాన్ని ఇస్తాయి.  హెయిర్ స్టైల్, మేకప్.. సరైన హెయిర్‌స్టైల్ , మేకప్ సల్వార్ సూట్‌తో  రూపాన్ని మరింత మెరుగుపరుస్తాయి. సాంప్రదాయ దుస్తులతో, లూజ్ హెయిర్ స్టైల్ కు స్మూత్  కర్ల్స్, లో బన్, గజ్రా స్టైల్ లేదా సైడ్ బ్రెయిడ్ వంటివి బాగుంటాయి. హెవీ మేకప్ లుక్ కంటే లైట్ గా , సహజమైన మేకప్ మరింత హుందాగా కనిపిస్తుంది.  డ్రెస్ రంగుకు అనుగుణంగా   లిప్ కలర్, ఐ మేకప్ , బిందీని సెలెక్ట్ చేసుకోవచ్చు.                                           *రూపశ్రీ.  
BMI వార్నింగ్..బిఎమ్ఐ ఎంత ఉండే జాగ్రత్త పడాలి తెలుసా.! బిఎమ్ఐ.. దీన్నే బాడీ మాస్ ఇండెక్స్ అని అంటారు. ఎత్తుకు తగ్గ బరువు  ఉన్నారా లేదా తెలుసుకోవడంలో ఇది సహాయపడుతుంది. నేటి కాలంలో అన్ని వయసుల వారిలో అధిక బరువు , ఊబకాయం సమస్య వేగంగా పెరుగుతోంది. అధిక బరువు ఎన్నో వ్యాధులకు ఒక కారణమని వైద్యులు చెబుతారు.  ఊబకాయం అనేది కేవలం శరీరాన్ని లావుగా చేస్తుందని చాలా మంది అనుకుంటారు.. కానీ నిజం దానికంటే చాలా భయంకరమైనది. ఇది హార్మోన్ల సమస్యలు, రోగనిరోధక వ్యవస్థ సమస్యలు,  మధుమేహం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని కూడా చాలా  పెంచుతుంది . చాలామంది బరువు చూసుకుని తాము ఎక్కువ బరువు ఉన్నామా, తక్కువ బరువు ఉన్నామా అని తెలుసుకుని సాటిసిపై అవుతుంటారు. కానీ నిజానికి వెయిట్ మిషన్ లో బరువు చూసుకోవడం అనేది ఆరోగ్యకరమైన బరువును నిర్థారించదు.  ఆరోగ్యకరమైన బరువును బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా నిర్ణయిస్తారు.  దీన్నే బిఎమ్ఐ అని కూడా అంటారు.  బిఎమ్ఐ ఎంత ఉంటే ఆరోగ్యం సేఫ్ గా ఉన్నట్టు? ఎప్పుడు జాగ్రత్త పడాలి? వివరంగా తెలుసుకుంటే.. బిఎమ్ఐ అంటే.. బాడీ మాస్ ఇండెక్స్ (BMI) అనేది  ఎత్తుకు తగ్గట్టు బరువు సాధారణంగా ఉందో లేదో తెలియజేసే ఒక కొలమానం. ఒక వ్యక్తి 70 కిలోగ్రాముల బరువు ఉండి, 1.70 మీటర్ల ఎత్తు ఉంటే, ఆ వ్యక్తి BMI సుమారుగా 24.2 ఉంటుంది. BMIని తెలుసుకోవడానికి,  బరువును (కిలోగ్రాములలో)  ఎత్తు యొక్క వర్గంతో (మీటర్లలో) భాగించాలి.ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 25 కంటే ఎక్కువ BMI ఉన్న వ్యక్తులు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. 18.5 కంటే తక్కువ ఉంటే..  తక్కువ బరువు. 18.5- 24.9 మధ్య ఉంటే.. సాధారణ బరువు. 25 29.9 మధ్య ఉంటే..  అధిక బరువు. 30 లేదా అంతకంటే ఎక్కువ  ఉంటే.. ఊబకాయం. బిఎమ్ఐ ఎక్కువ ఉంటే ఏమవుతుంది?  BMI ఎక్కువ ఉంటే తరచుగా శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినట్టు అర్థం. ఇది రక్తనాళాలు , గుండెపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు.   పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు శరీరంలోకి వాపును కలిగించే రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల ధమనులలో పాచి పేరుకుపోవడం, అధిక కొలెస్ట్రాల్ , అధిక రక్తపోటు వంటి ప్రమాదాలు పెరుగుతాయి. కాలక్రమేణా, ఈ పరిస్థితి కరోనరీ ఆర్టరీ వ్యాధి, గుండెపోటు , పక్షవాతం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు. శరీరంలో అదనపు కొవ్వు పేరుకుపోయినప్పుడు, కణాలు ఇన్సులిన్‌కు తక్కువ సున్నితంగా మారతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ బిఎమ్ఐ వల్ల సమస్యలు.. ఎక్కువ BMI ఉన్నవారికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనిని నియంత్రించకుండా వదిలేస్తే, అది కాలేయ వాపు, ఫైబ్రోసిస్ , సిర్రోసిస్‌ సమస్యలకు  దారితీయవచ్చు. ఊబకాయం వల్ల కనీసం 13 రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుందని అనేక  అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో  కొవ్వు శరీరంలో వాపుకు కారణమవుతుంది , ఇన్సులిన్, కొన్ని హార్మోన్ల స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల కణాలు అసాధారణఁగా పెరుగుతాయి.  ఇది చాలా ప్రమాదంగా మారుతుంది. బిఎమ్ఐ ను ఎలా నియంత్రించాలి? BMIని నార్మల్ గా ఉంచుకోవడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం ,  జీవనశైలి చురుగ్గా ఉంచుకోవడం చాలా కీలకమని వైద్యులు చెబుతున్నారు. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి, అదనంగా ఆహారంలో తృణధాన్యాలు, పప్పులు, పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. తగినంత నిద్ర పొవాలి,   ఒత్తిడిని నియంత్రించుకోవాలి. ఎందుకంటే ఈ రెండూ బరువుపై ప్రభావం చూపుతాయి.  BMI పెరుగుతూ ఉంటే లేదా 25-30 కంటే ఎక్కువగా ఉంటే వైద్యుడిని సంప్రదించాలి.                                  *రూపశ్రీ.  
ఆహారం మానెయ్యకుండా బరువు తగ్గడం ఎలా..Atkins Diet ప్లాన్ పూర్తి వివరాలు ఈ రోజుల్లో బరువు తగ్గడం అనేది చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. అయితే బరువు తగ్గడం కోసం ఇష్టమైన ఆహారాన్ని పూర్తిగా మానెయ్యాల్సిన అవసరం లేదని ప్రముఖ సీనియర్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ డాక్టర్ పి. జానకి శ్రీనాథ్ చెప్తున్నారు. తక్కువ కార్బోహైడ్రేట్లు, ఎక్కువ ప్రోటీన్లు ఉండే "అట్కిన్స్ డైట్" (Atkins Diet) విధానం ద్వారా ఆహార నియంత్రణల భయం లేకుండానే సులభంగా బరువు తగ్గవచ్చని ఆమె వివరించారు. అట్కిన్స్ డైట్ అంటే ఏమిటి? అట్కిన్స్ డైట్ అనేది ఆహారంలో పిండి పదార్థాలను (Carbohydrates) తగ్గించి, శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులను సరైన పరిమాణంలో అందించే ఒక ప్రత్యేకమైన డైట్ ప్లాన్. మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లు ఎక్కువ స్థాయిలో ఉంటాయి. అట్కిన్స్ డైట్‌లో వాటిని క్రమంగా తగ్గించడం వల్ల శరీరం శక్తి కోసం దాచుకున్న కొవ్వును (Fat) కరిగించడం ప్రారంభిస్తుంది. ఈ డైట్ ప్లాన్ వల్ల కలిగే ముఖ్యమైన ఉపయోగాలు: ఆకలి బాధలు ఉండవు: ఆహారం పూర్తిగా మానేయాల్సిన అవసరం లేకుండానే కేలరీలను సమర్థవంతంగా నియంత్రించవచ్చు. శరీరంలో కొవ్వు త్వరగా కరుగుతుంది: కార్బోహైడ్రేట్లు తగ్గడం వల్ల శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు శక్తిగా మారుతుంది. బ్లడ్ షుగర్ కంట్రోల్: రక్తంలో చక్కెర స్థాయిలను క్రమబద్ధీకరించడానికి కూడా ఈ డైట్ సహకరిస్తుంది. ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది: ఆహారంలో ప్రోటీన్ మోతాదు ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా నిరోధక శక్తి, ఉత్సాహం ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు తమ జీవన శైలికి మరియు ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా సరైన న్యూట్రిషనిస్ట్ సలహాతో ఈ డైట్ ప్లాన్‌ని పాటించడం మంచిది. సంపూర్ణ వివరాలు మరియు డాక్టర్ గారి పూర్తి సలహాల కోసం TeluguOne Health వీడియోను తప్పకుండా వీక్షించండి. గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు డైట్ ప్లాన్ ప్రారంభించే ముందు తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించండి.
అంతులేని అలసట వెనుక అసలు కారణం ఏమిటి..డాక్టర్ చెప్పిన నిజాలు.! రోజంతా అలసటగా, నీరసంగా అనిపిస్తుందా? ఎంత విశ్రాంతి తీసుకున్నా శరీరంలో శక్తి లేకపోతే, అది కేవలం సాధారణ అలసట మాత్రమే కాకుండా Chronic Fatigue Syndrome (CFS) అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చు. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డా. చిట్టిభొట్ల మధుసూదన శర్మ గారు Chronic Fatigue Syndrome గురించి సులభమైన భాషలో వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: Chronic Fatigue Syndrome అంటే ఏమిటి? సాధారణ అలసటకు, Chronic Fatigue Syndrome కు ఉన్న తేడా ఏమిటి? ఈ సమస్య వచ్చే ప్రధాన కారణాలు ఏమిటి? ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి? ఈ సమస్యను తగ్గించేందుకు జీవనశైలిలో చేయాల్సిన మార్పులు సరైన ఆహారం, నిద్ర, వ్యాయామం వల్ల కలిగే ప్రయోజనాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నిపుణుల సూచనలు ఎప్పుడూ అలసటగా ఉండటం, ఏ పని చేయాలన్నా శక్తి లేకపోవడం, ఏకాగ్రత తగ్గిపోవడం వంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. సరైన సమయంలో కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం TeluguOne Health ను ఫాలో అవుతూ ఉండండి. గమనిక: ఈ వీడియోలో అందించిన సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన సలహా, నిర్ధారణ లేదా చికిత్స కోసం వైద్య నిపుణులను సంప్రదించండి.