Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా..!
posted on: Jul 24, 2026 4:28PM

భారతీయ కుటుంబాలలో అత్తాకోడళ్ల మధ్య సంబంధాన్ని చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ బంధం ప్రేమ, ఒకరికొకరు సహకారంగా ఉండటం, ఒకరినొకరు గౌరవించుకోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది. అయితే అత్త తరం వేరు, కోడలి తరం వేరు.. కొన్నిసార్లు తరాల మధ్య అభిప్రాయ భేదాలు లేదా ఆలోచనా విధానాలలో తేడాలు ఉంటాయి. ఈ తేడాలు విభేదాలకు దారితీయవచ్చు. దీని వల్ల ప్రతి కోడలికి తన మనసులో ఒక ప్రశ్న ఉండిపోతుంది. అత్తగారు చెప్పే ప్రతి విషయాన్ని కోడలు వినాలా? అత్త చెప్పిన ప్రతి విషయాన్ని కోడలు అంగీకరించాల్సిందేనా? అని. అయితే దీనికి సమాధానం అంత సులభమైనది కూడా కాదు. దీని గురించి లైఫ్ స్టైల్ నిపుణులు వివరణ ఇస్తున్నారు. ప్రతి కోడలు తెలుసుకోవలసిన ఈ విషయం గురించి తెలుసుకుంటే..
సెల్ఫ్ రెస్పెక్ట్.. ప్రవర్తన..
కొందరు అత్తలు చాలా దురుసుగా ఉంటారు. దుర్భాషలాడటం, ఎగతాళి చేసి మాట్లాడటం, అందరి ముందు కోడలిని అవమానించడం వంటివి చేస్తుంటారు. ఇలాంటివి ఎప్పుడూ ఎదుర్కొంటున్నట్లయితే కోడలు మౌనంగా ఉండవలసిన అవసరం లేదు. ఇలాంటి పరిస్థితులలో మొదట ప్రశాంతంగా మాట్లాడి, సరిగ్గా మాట్లాడమని, సరిగ్గా ప్రవర్తించమని అడగడం మంచిది. అత్తాకోడళ్ల బంధం బాగుండాలంటే.. రెండు వైపులా గౌరవం చాలా ముఖ్యం.
ఆరోగ్య సంబంధ విషయాలు..
అత్తల తరానికి, ఇప్పటి కోడళ్ల తరానికి చాలా తేడాలు ఉన్నాయి. వారి జీవనశైలి, ఆహారం వంటి విషయాలు ఇప్పట్లో లేవు. ఈ కారణంగా ఇప్పటి అమ్మాయిలలో అనారోగ్యం కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అనారోగ్యానికి చికిత్స, మందులు, విశ్రాంతి తీసుకోవడం, గర్భం దాల్చడం, మానసిక ఆరోగ్యం లేదా మరే ఇతర వైద్య సలహాలలో అయినా అత్తలు ఎప్పుడూ కోడళ్లను నిర్ల7్యంగా మాట్లాడకూడదు. మేము ఇంత పని చేసుకునేవాళ్లం, మాకేమీ సమస్య ఉండేది కాదు అనడం, పని తప్పించుకోవడానికి అనారోగ్యం అని చెబుతున్నావని నిందించడం చాలా మంది అత్తగార్లు చేస్తారు. కోడళ్లు అత్తగారి మాటల కంటే డాక్టర్ సలహాకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది. ఆరోగ్య నిర్ణయాలు కేవలం కుటుంబ ఒత్తిడి మీద కాకుండా, వాస్తవాలు , నిపుణుల సలహా ఆధారంగా తీసుకోవాలి.
విద్య, ఉద్యోగం..
నేటికాలంలో అమ్మాయిలు అబ్బాయిలకేమీ తీసిపోకుండా బాగా చదువుతున్నారు, ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. ఉద్యోగం , ఆర్థిక స్వాతంత్య్రానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రతి కోడలికి ఉంటుంది. కుటుంబ అంచనాలకు, వృత్తిపరమైన లక్ష్యాలకు మధ్య పొంతన కుదరకపోతే ఓపెన్ గా ఇంట్లో డిస్కస్ చేసి అందరికి నచ్చే విధంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. అంతేకానీ అత్తగారు చేప్పారు అని ఉద్యోగాలు వదిలేయడం, ఇంటికే పరిమితం కావడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. ఏకపక్ష ఒత్తిడితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం భవిష్యత్తులో మనస్పర్థలకు దారితీయవచ్చు.అంతేకాదు.. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలకు కూడా కారణం కావచ్చు.
వ్యక్తిగత హద్దులు..
ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత సమయం, వ్యక్తిగత స్వేచ్ఛ , వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే హక్కు ఉంటుంది. వ్యక్తిగత హద్దులను పదేపదే ఉల్లంఘించినా లేదా ప్రతి నిర్ణయంలో అనవసరమైన జోక్యం ఉన్నా, హద్దులను మర్యాదగా తెలియజేయడం మంచిది. ఇది అపార్థాలు, గొడవలు ఎక్కువ దూరం వెళ్లకుండా చేస్తుంది. కొందరు అత్తలు కోడళ్లకు ఎలాంటి పర్సనల్ స్పేస్ ఉండకూడదని, వారికి పర్సనల్ అంటూ ఏమీ అవసరం లేదని వాదిస్తారు. కానీ కోడళ్లకు పర్సనల్ స్పేట్ ఉండటం వల్ల కుటుంబం అంతా సంతోషంగా ఉండగలుగుతుంది.
ప్రొటెక్షన్, లీగల్ రైట్స్..
ఆడపిల్ల భద్రతకు, చట్టపరమైన హక్కులకు, లేదా నైతిక విలువలకు భంగం కలిగించే పని చేయమని అత్తగారు కోడలిని అడిగితే, దానికి తలొగ్గడం మంచిది కాదు. అలాంటి పరిస్థితిలో జీవిత భాగస్వామిని, నమ్మకమైన కుటుంబ సభ్యుడిని, లేదా అవసరమైతే చట్టపరమైన సహాయాన్ని తీసుకోవడం మంచిది.
*రూపశ్రీ.





