Home

»

Latest News

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, విజయ్ పై బాబీ డియోల్ షాకింగ్ కామెంట్స్

Jul 24, 2026 5:41PM

 


పాన్ ఇండియా సెల్యులాయిడ్ పై బాబీ డియోల్( దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకప్పటి హీరో కూడా అయిన బాబీ డియోల్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్‌లో విలక్షణమైన, అత్యంత పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్స్ చేస్తూ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే అత్యంత బిజీ నటుడిగా మారిపోయాడు. ప్రెజెంట్ నిన్న విడుదలైన జన నాయకుడుతో సందడి చేస్తున్నాడు. రీసెంట్ గా ఒక  ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు  వైరల్ అవుతున్నాయి.

ఆయన మాట్లాడుతు 'నేను దక్షిణాదిలో ఏ అగ్ర నటుడితో కలసి పనిచేసినా, వాళ్లంతా ఆ తర్వాత పొలిటికల్ గా పవర్ సీట్లలో కూర్చుంటున్నారు. మంత్రులు, డిప్యూటీ సీఎంలు, సీఎంలు అవుతున్నారు! ఇది నిజంగా చాలా విచిత్రమైన, అత్యంత సరదాగా అనిపించే యాదృచ్ఛిక విషయం. నందమూరి బాలకృష్ణతో కలిసి 'డాకు మహారాజ్' లో  బలవంత్ సింగ్ ఠాకూర్ అనే పవర్‌ఫుల్ రోల్ లో చేశాను. ఆయన ఇప్పటికే రాజకీయాల్లో ఎంతో చురుగ్గా ఉంటూ ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసారు. పవన్ కళ్యాణ్ తో  'హరిహర వీరమల్లు' లో  ఔరంగజేబు క్యారక్టర్  పోషించాను. ఈ ప్రాజెక్ట్ సమయంలోనే పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపముఖ్యమంత్రిగా (డిప్యూటీ సీఎం) బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు 'జన నాయగన్' లో విజయ్ తో చేశాను. సీఎం అయ్యారని బాబీ డియోల్  చెప్పుకొచ్చాడు. 

Also read: సినిమాగా తెరకెక్కకుండా 30 లక్షలు సంపాదించిన కథ.. ఆ రైటర్ ఎవరో తెలుసా!

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com