LATEST NEWS
ముంబయిలోని కాలాచౌకి ప్రాంతానికి చెందిన ఉదయ్ పవార్ పట్టుదల, ఆచరణాత్మక ఆలోచనలతో చిన్న స్థాయి సేవను లాభదాయక వ్యాపారంగా తీర్చిదిద్దారు. కేవలం 11వ తరగతి చదువుతోనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టిన ఆయన, నేడు లక్షల రూపాయల టర్నోవర్ సాధిస్తూ పలువురు నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. తొలినాళ్లలో ఉదయ్ స్వయంగా కస్టమర్ల నుంచి దుస్తులు సేకరించి, ఇస్త్రీ చేసిన అనంతరం మళ్లీ వారి ఇళ్లకే వెళ్లి అందజేసేవారు. కాలక్రమేణా డిజిటల్ సౌకర్యాలను అందిపుచ్చుకుని ఆన్‌లైన్ ద్వారా ఆర్డర్లు తీసుకోవడం ప్రారంభించారు. ఈ విధానం కస్టమర్లకు సౌకర్యంగా ఉండటంతో సేవలకు ఆదరణ వేగంగా పెరిగింది. వినియోగదారుల స్పందనతో వ్యాపార పరిధిని విస్తరించిన ఆయన, కేవలం సాధారణ ఇస్త్రీకే పరిమితం కాకుండా లాండ్రీ, డ్రైక్లీనింగ్, స్టీమ్ ప్రెస్ వంటి సేవలను జోడించారు. వీటితో పాటు షూ క్లీనింగ్, సోఫాలు, కర్టెన్ల శుభ్రత వంటి ప్రత్యేక సేవలను కూడా అందుబాటులోకి తీసుకురావడం వ్యాపార వృద్ధికి దోహదపడింది. ప్రస్తుతం ఉదయ్ నిర్వహిస్తున్న 'ఐరన్ ఫీల్' సంస్థకు ముంబయిలోని కాటన్ గ్రీన్, సెవ్రీ, చించ్‌పోక్లీ ప్రాంతాల్లో శాఖలు విస్తరించాయి. మహానగరంలో వేగవంతమైన జీవనశైలి, సమయాభావం కారణంగా ఇంటి వద్దకే సేవలు అందించే లాండ్రీ, క్లీనింగ్ సంస్థలకు గిరాకీ పెరుగుతోంది. ఆదాయం ఆర్జించడమే కాకుండా స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తుండటం ఈ ప్రయాణంలో ప్రత్యేక అంశంగా నిలుస్తోంది. పెద్ద డిగ్రీలు లేకపోయినా సమస్యను గుర్తించి, దానికి సులభమైన పరిష్కారం చూపితే వ్యాపారంలో నిలదొక్కుకోవచ్చని ఉదయ్ ప్రయాణం నిరూపిస్తోంది. నగరంలో పెరుగుతున్న పట్టణీకరణ, డిజిటల్ బుకింగ్ అలవాట్ల నేపథ్యంలో 'ఐరన్ ఫీల్' మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని కొత్త సేవలు, ఉపాధి అవకాశాలతో ఈ సంస్థ మరింత ఎదిగే దిశగా సాగుతుందని స్థానికులు ఆశిస్తున్నారు. మీకు నచ్చవచ్చు: నాన్న ప్రాణాలకు ముప్పు ఉందని ముందే చెప్పా..రాజీవ్ హత్యపై రాహుల్ భావోద్వేగం.! మీకు నచ్చవచ్చు: 52 బంతుల్లో డబుల్ సెంచరీ.. క్రికెట్ చరిత్రలో వైభవ్ సరికొత్త రికార్డు.! [ Uday Pawar, Iron Felt Laundry, Mumbai Business Story, Online Laundry Services, Employment for Youth ]
పిల్లల కేరింతలు.. ఆటపాటలు.. ఆనందోత్సాహాల మధ్య సాగాల్సిన స్కూల్ పిక్నిక్ ఓ చిన్నారి కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. సరదాగా గడపాల్సిన విహారయాత్రలో మృత్యువు ఊయల రూపంలో దూసుకొచ్చింది. పది మంది పిల్లలు ఎక్కిన భారీ ఇనుప ఊయల.. చివరకు పదేళ్ల అభిరామ్ ప్రాణాలను బలిగొంది. బిడ్డను సంతోషంగా పిక్నిక్‌కు పంపిన తల్లిదండ్రులకు చివరకు కన్నీళ్లే మిగిలాయి. హైదరాబాద్‌లోని నార్సింగికి చెందిన హ్యాపీ స్కాలర్స్ స్కూల్ విద్యార్థులను యాజమాన్యం విహారయాత్ర కోసం మొయినాబాద్‌లోని లోటస్ పాండ్ పార్క్‌కు తీసుకెళ్లింది. అక్కడ పిల్లలంతా సరదాగా ఆడుకుంటున్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పార్క్‌లోని భారీ ఇనుప ఊయలపై సుమారు పది మంది చిన్నారులు ఎక్కారు. వెనుక వైపు నుంచి మరో నలుగురు విద్యార్థులు ఊయలను వేగంగా ఊపడంతో దాని వేగం క్రమంగా పెరిగింది. ముందుకు వేగంగా దూసుకెళ్లిన ఊయల.. అంతే వేగంతో వెనక్కి వస్తున్న సమయంలో సమీపంలో ఉన్న అభిరామ్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఊహించని ప్రమాదంతో అక్కడున్న చిన్నారులు భయాందోళనకు గురయ్యారు. ఊయల బలంగా తగలడంతో అభిరామ్ నుదురు, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. మరో విద్యార్థి యశ్వంత్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో పదేళ్ల అభిరామ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో విద్యార్థి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కాసేపటి క్రితం వరకు పిల్లల కేరింతలతో సందడిగా ఉన్న పిక్నిక్ ప్రాంగణం.. ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఈ ఘటనతో షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ ప్రమాదం వెనుక స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో పిల్లల వద్ద ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పర్యవేక్షణ లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పిల్లల భద్రతను పట్టించుకోకుండా వారిని గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడ చదవండి: ఈ నెల 26 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.! తమ బిడ్డను స్కూల్ యాజమాన్యాన్ని నమ్మి పిక్నిక్‌కు పంపిస్తే.. తిరిగి ప్రాణాలతో ఇంటికి రాలేదంటూ అభిరామ్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు పాఠశాల యాజమాన్యం, పార్క్ నిర్వాహకుల బాధ్యతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగిన విషయం బయటకు రాకుండా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయనే ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిర్లక్ష్యంతో బాలుడి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. పాఠశాలల విహారయాత్రల్లో విద్యార్థుల భద్రత, ఉపాధ్యాయుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండేలా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడవాల్సిన బాల్యం.. ఒక్క క్షణం ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసింది. స్కూల్ పిక్నిక్ అంటేనే ఉత్సాహంగా ఎదురుచూసే చిన్నారుల మధ్య జరిగిన ఈ విషాదం.. అభిరామ్ కుటుంబానికి జీవితాంతం తీరని వేదనగా మిగిలిపోయింది. పిల్లలను నమ్మకంగా పాఠశాలలకు పంపిస్తున్న తల్లిదండ్రులకు వారి భద్రతపై ఎన్నో ప్రశ్నలను మిగిల్చింది. మీకు నచ్చవచ్చు: Hyderabad: సెప్టిక్ ట్యాంక్‌లో పడి ముగ్గురు మృతి.! మీకు నచ్చవచ్చు: Nvidia CEO జెన్సన్ హువాంగ్  ప్రసంగిస్తుండగా  కౌగిలించుకున్న మహిళా ఉద్యోగి.!    [ Abhiram, Lotus Pond Park, Moinabad Accident, Bachupally School Picnic, Happy Scholars School, Narsingi, School Picnic Tragedy, Swing Accident, Iron Swing Accident, Ten Year Old Boy Dead, Student Death ]
కుటుంబాలను పోషించేందుకు రోజూ పనికి వెళ్లిన ఆ ముగ్గురు కార్మికులకు అదే పని చివరి రోజవుతుందని ఎవరూ ఊహించలేదు. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు లోపలికి దిగిన ఓ కార్మికుడు ప్రమాదంలో చిక్కుకున్నాడు. అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. రెప్పపాటులో ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో హైదరాబాద్‌లోని బాచుపల్లిలో తీవ్ర విషాదం నెలకొంది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ధాత్రి అపార్ట్‌మెంట్‌లో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్‌లో సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేసేందుకు షణ్ముఖ అనే కార్మికుడు తొలుత లోపలికి దిగాడు. అయితే కొద్దిసేపటికే అతడు ఊపిరాడక తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. లోపల చిక్కుకున్న షణ్ముఖను కాపాడాలనే ఆతృతతో సురేష్, పవన్ అనే మరో ఇద్దరు కార్మికులు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగారు. కానీ విధి మరోలా తలచింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ ట్యాంక్‌లోనే చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. ఒకరిని కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరూ చివరకు విగతజీవులుగా మారడం స్థానికులను కలచివేసింది. సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను బయటకు తీసేందుకు చర్యలు చేపట్టారు. ప్రాథమికంగా సెప్టిక్ ట్యాంక్‌లో వెలువడిన విషవాయువుల కారణంగా ఊపిరాడక ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. రోజువారీ కూలీ పనులతో కుటుంబాలను పోషిస్తున్న ముగ్గురు కార్మికులు ఇలా అర్ధంతరంగా ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిపోయాయి. ఇంటికి తిరిగొస్తారని ఎదురుచూస్తున్న కుటుంబ సభ్యులకు వారి మరణవార్త తీరని శోకాన్ని మిగిల్చింది. ఒకరి ప్రాణం కాపాడాలనే ప్రయత్నం ముగ్గురి జీవితాలను బలిగొంది. రెప్పపాటులో మూడు కుటుంబాల్లో చీకట్లు నింపిన ఈ ఘటన బాచుపల్లిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మీకు నచ్చవచ్చు: నీటితో నడిచే మెగా బ్యాటరీగా పోలవరం.. గ్రీన్ ఎనర్జీ హబ్‌గా ఏపీ.! మీకు నచ్చవచ్చు: ఈ నెల 26 కోటి మంది మహిళలకు చీరలు పంపిణీ.!    [ Bachupally Accident, Dhatri Apartments, Septic Tank Accident, Three Workers Dead, Shanmukh, Suresh, Pawan, Toxic Gas, Suffocation Deaths, Hyderabad News, Bachupally Police, Septic Tank Cleaning, Sanitation Workers ]
తమిళనాడు రాజకీయ, సినీ వర్గాల్లో స్టార్ హీరోయిన్ త్రిష  మరో సారి చర్చనీయాంశంగా మారారు. త్రిష పొలిటికల్ ఎంట్రీపై ప్రచారం  జోరుగా సాగుతున్న వేళ  ఆమె అభిమానులు త్రిష పేరుమీద   కొత్త వేదికను ప్రారంభించారు.  అక్కడితో ఆగకుండా ఆమెను దివంగత మాజీ ముఖ్యమంత్రి జె. జయలలిత రాజకీయ వారసురాలిగా అభివర్ణించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జయలలితకు ఉన్న  పురట్చి తలైవి బిరుదును గుర్తుచేసేలా,  ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై అనే పేరుతో ఈ సంస్థ ఏర్పాటు కావడం తమిళ సినీ, రాజకీయ వర్గాలలో ఓ రేంజ్ లో చర్చకు తెర లేచింది.  ఈ వేదిక నిర్వాహకులు విడుదల చేసిన వివరాల ప్రకారం..  త్రిష వ్యక్తిత్వం, దృఢత్వంలో జయలలిత లక్షణాలు కనిపిస్తాయి.   తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే  ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూనే..  భవిష్యత్తులో విజయ్‌తో కలిసి త్రిష కూడా రాజకీయ ప్రయాణం చేస్తే..  రాష్ట్రంలో జయలలిత తరహా  పాలన వస్తుందన్నది ఆ వేదిక నిర్వాహకుల అభిప్రాయం.   ప్రజా సంక్షేమ, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువవుతూ, త్రిష రాజకీయ ప్రవేశానికి అనుకూల వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే, ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా,  ఆమెకు ఈ వేదికతో   ప్రత్యక్ష సంబంధం ఉందా అనే అంశాలపై ఇంత వరకూ ఎటువంటి స్పష్టతా లేదు.  ఇప్పటివరకు నటి త్రిష స్వయంగా రాజకీయ ప్రవేశంపై గానీ, టీవీకే పార్టీలో చేరడంపై గానీ   అధికారిక ప్రకటన ఏదీ చేయలేదు.  కేవలం అభిమానుల ఆకాంక్షలు, కొత్త వేదిక ప్రారంభోత్సవ ప్రకటనల ఆధారంగానే ఈ రాజకీయ చర్చలు సాగుతున్నాయి. ఈ పరిణామాలతో పాటు జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌కు సంబంధించిన చర్చలూ తెరపైకి వచ్చాయి. గతంలో జయలలిత పాత్ర కోసం త్రిషతో సంప్రదింపులు జరుగుతున్నాయన్న వార్తలు వినిపించినప్పటికీ..  ఆ ప్రాజెక్ట్ లేదా నటీనటుల ఎంపికపై ఎటువంటి అధికారిక నిర్ధారణ వెలువడలేదు. అయినప్పటికీ.. జయలలితతో పోలికలు, బయోపిక్ ప్రస్తావనలు కలగలిసి త్రిష పొలిటికల్ ఎంట్రీపై తమిళనాట పెద్ద ఎత్తున ఊహాగాన సభలు జరుగుతున్నాయి.  ఇది కూడా చదవండి:  త్రిష రాజకీయరంగ ప్రవేశం: మీడియాతో రాజకీయాలపై త్రిష ఏం మాట్లాడిందంటే! దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.  , సినిమా షూటింగ్‌లు, వృత్తిపరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉండే త్రిష ఈ ఊహాగానాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.  ఏది ఏమైనా రానున్న రోజులలో ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై  తరఫున చేపట్టే కార్యక్రమాలు ఎలా ఉంటాయి, తమిళనాడు రాజకీయ వర్గాల నుంచి దీనిపై ఎలాంటి స్పందనలు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.  మొత్తంగా  జయలలిత వారసత్వం, సీఎం విజయ్‌తో రాజకీయ ప్రయాణ అంచనాల నేపథ్యంలో త్రిష పేరు చుట్టూ మొదలైన చర్చ తమిళనాడులో పొలిటికల్ హీట్ ను పెంచింది.  మీకు నచ్చవచ్చు:  విజయ్ ఇంటికి త్రిష.. సిఎం అవ్వబోతున్నాడా! విజయ్ ఈవెంట్‌లో త్రిష సడన్ ఎంట్రీ.. ఊహించని ట్విస్ట్‌తో షాక్ తిన్న ఫ్యాన్స్! [Actress Trisha, olitical Entry, Jayalalitha, Successor, Ilaiya Puratchi Thalaivi, Trisha Peravai, TeluguOne] 
చనిపోయిన రోగుల పేర్లపైనా బిల్లులు..ఏసీబీ దాడుల్లో బట్టబయలు.! రోగులకు మెరుగైన వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రిలోనే అక్రమాలు చోటుచేసుకున్నాయా? పేద రోగులకు అండగా నిలవాల్సిన ఆరోగ్యశ్రీ పథకం నిధులే పక్కదారి పట్టాయా? హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రి నిమ్స్‌లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో వెలుగుచూసిన అంశాలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. టెండర్ల నుంచి క్యాంటీన్ నిర్వహణ వరకు, మెడికల్ షాపుల నుంచి ఆపరేషన్ థియేటర్ల వరకు పలు విభాగాల్లో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా రోగులు మరణించిన తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించడం విస్మయానికి గురిచేస్తోంది. రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు.. ఆపరేషన్ థియేటర్లలోనే నిల్వ.! నిమ్స్‌లో అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్, కార్మిక శాఖ అధికారులతో కలిసి చేపట్టిన ఈ తనిఖీల్లో పలు కీలక అవకతవకలు బయటపడ్డాయి. ఆపరేషన్ థియేటర్లలో సుమారు రూ.5 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, ఇతర వైద్య పరికరాలను సరఫరాదారులు అనధికారికంగా నిల్వ చేసినట్లు గుర్తించారు. ఆసుపత్రి ప్రధాన స్టోర్ నుంచి సరైన ఇండెంట్ ప్రక్రియ లేకుండానే వైద్యులు, నర్సింగ్ సిబ్బంది నేరుగా సరఫరాదారుల నుంచి ఇంప్లాంట్లు తీసుకుంటున్నట్లు తేలింది. వాటిని వినియోగించిన తర్వాత యుటిలిటీ సర్టిఫికెట్లు జారీ చేసి బిల్లుల చెల్లింపులకు పంపుతున్నట్లు గుర్తించారు. వాస్తవంగా వినియోగించని ఇంప్లాంట్లకు కూడా బిల్లులు సృష్టించే అవకాశం ఉందని ఏసీబీ ప్రాథమిక పరిశీలనలో అనుమానించింది. చనిపోయిన రోగుల పేర్లతోనూ బిల్లులా.? బిల్లుల ప్రాసెసింగ్‌లో వెలుగుచూసిన అంశాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పొందిన రోగులు డిశ్చార్జి అయిన తర్వాత కూడా వారి పేర్లపై బిల్లులు ప్రాసెస్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని సందర్భాల్లో రోగులు మరణించిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు వెల్లడైంది. జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రోగుల డిశ్చార్జి అనంతరం సుమారు రూ.66 లక్షల విలువైన బిల్లుల ఎంట్రీలు చేసినట్లు ఏసీబీ గుర్తించింది. ఒక్క రోగికి వారంలో 800 గ్లౌజులా.? వైద్య సామగ్రి వినియోగానికి సంబంధించిన రికార్డుల్లోనూ అసాధారణ లెక్కలు బయటపడ్డాయి. ఒక్క రోగికి కేవలం ఒక వారంలోనే 800 సర్జికల్ గ్లౌజులు వినియోగించినట్లు నమోదు కావడం అధికారులను విస్మయానికి గురిచేసింది. ఇలాంటి అనుమానాస్పద లెక్కల్లో అధికభాగం ఆరోగ్యశ్రీ రోగులకు సంబంధించినవేనని గుర్తించారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలు.. లైసెన్స్ లేకుండానే క్యాంటీన్.! రోగులకు, వారి సహాయకులకు ఆహారం అందించాల్సిన ప్రధాన క్యాంటీన్‌లోనూ నిబంధనల ఉల్లంఘనలు బయటపడ్డాయి. అపరిశుభ్ర వాతావరణంతో పాటు గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ రిజిస్ట్రేషన్ లేకుండానే క్యాంటీన్ నిర్వహిస్తున్నట్లు తేలింది. కార్మిక చట్టాల ఉల్లంఘనలతో పాటు క్యాంటీన్ టెండర్లలో పోటీ వ్యతిరేక విధానాలు, బిడ్డర్ల మధ్య కుమ్మక్కు జరిగి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. టెండర్లు, నియామకాల్లోనూ నిబంధనలకు తిలోదకాలు.! 2019 నుంచి 2025 వరకు మ్యాన్‌పవర్ సేవలకు సంబంధించిన టెండర్ ప్రక్రియలో లోపాలు ఉన్నట్లు ఏసీబీ గుర్తించింది. కార్మికుల నియామకాలు, వారిని సెమీ స్కిల్డ్ కేటగిరీకి మార్చే విషయంలోనూ నిబంధనలు పాటించలేదని వెల్లడించింది. ఈ వ్యవహారంలో కుమ్మక్కు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారంటీ ఏమైంది.? నిమ్స్ భద్రతా సిబ్బంది సేవలకు సంబంధించిన టెండర్ల ఖరారులో అసాధారణ జాప్యం జరిగినట్లు, కాంట్రాక్టులను పదేపదే పొడిగించినట్లు అధికారులు గుర్తించారు. డిఫాల్ట్ అయిన ఓ ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారంటీని కూడా స్వాధీనం చేసుకోలేదని ఏసీబీ వెల్లడించింది. మెడికల్ షాపుల్లోనూ అక్రమాల అనుమానాలు.! ఆసుపత్రిలోని మెడికల్ షాపుల నిర్వహణలోనూ నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. తప్పనిసరిగా నిర్వహించాల్సిన విక్రయ రికార్డులను సక్రమంగా నమోదు చేయకపోవడంతో పాటు, అర్హతకు సంబంధించిన రిజిస్ట్రేషన్ లేని సిబ్బందిని నియమించుకున్నట్లు గుర్తించారు. మెడికల్ షాపుల కేటాయింపులకు సంబంధించిన టెండర్ ప్రక్రియపైనా అధికారులు దృష్టి సారించారు. ఏసీబీ చేతికి కీలక దస్త్రాలు.. మరింత లోతుగా దర్యాప్తు.! ఈ తనిఖీల సందర్భంగా నోట్ ఫైళ్లు, ఒప్పంద పత్రాలు, ఇతర కీలక దస్త్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వెలుగుచూసిన ఆరోపణల్లో వాస్తవాలను నిర్ధారించేందుకు ఈ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు కేటాయించే ప్రజాధనం, ఆరోగ్యశ్రీ నిధులు, వైద్య పరికరాల కొనుగోళ్ల చుట్టూ ఇన్ని అవకతవకల ఆరోపణలు వెలుగుచూడటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. రోగుల ప్రాణాలతో ముడిపడిన వైద్య వ్యవస్థలో ఇలాంటి నిర్లక్ష్యం, అక్రమాలకు బాధ్యులెవరు? కోట్లాది రూపాయల లావాదేవీల వెనుక అసలు కథేంటి? ఏసీబీ దర్యాప్తులో తేలాల్సి ఉంది. మీకు నచ్చవచ్చు: వెస్ట్ బెంగాల్ పేరు మార్పునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కొత్త పేరు ఇదే.! మీకు నచ్చవచ్చు: 11 రోజులకే రీఎంట్రీ.. మళ్లీ NVIDIA సీఈవోగా జెన్సన్ హువాంగ్.! [ NIMS, ACB Raids, NIMS Corruption, Medical Scams, Healthcare Fraud, Health Aarogyasri, Medical Implants, Surgical Gloves, Hospital Irregularities, Telangana ACB, Hyderabad NIMS, Hospital Billing Scam, Tender Irregularities, Government Hospitals ]  
ALSO ON TELUGUONE N E W S
Dhurandhar fame Sara Arjun has reportedly bagged her maiden Yash Raj Films project, marking an interesting new collaboration with filmmaker Maneesh Sharma. The director, known for films like Fan and Band Baaja Baaraat, is said to be returning with a musical love story. According to reports, Sara will headline the yet-to-be-titled project, which is expected to be directed by Maneesh Sharma. The film is said to be a fresh romantic musical, offering the actress a new opportunity following her recent success. Ambrish Verma, known for his work in Sapne Vs Everyone, is reportedly part of the cast and will be paired opposite Sara. The project is expected to bring together a new onscreen combination under the YRF banner. The film is reportedly scheduled to begin shooting in Punjab in January. Further details about the story, supporting cast and the film's title are currently being kept under wraps. Also Read:  Rajamouli thanks BTS for recreating RRR song Maneesh Sharma last directed Tiger 3 and has previously helmed films such as Fan, Band Baaja Baaraat and Shuddh Desi Romance. His return with a musical love story has generated curiosity, especially with Sara Arjun taking on the lead role. While an official announcement is awaited, the reported collaboration marks another significant project for Sara after Dhurandhar. The film is expected to be produced by Yash Raj Films, with more details likely to emerge in the coming months. Check Out:  Sampath Nandi promises Sharwa to surprise audiences                       Ramayana gets shortlisted in Critic Choice awards Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   https://www.instagram.com/p/DgH-Sj4gA0U
ప్రేమ ఎంత మధురం.. ప్రియురాలు అంత కఠినం. చేసినాను ప్రేమ క్షీర సాగర మధనం.. అనే పదం ఎంత పవిత్రత, త్యాగంతో కూడుకొని ఉందో కదా! కానీ కొంతమంది అభిమానులు హీరోయిన్ పై తమకున్న అభిమానాన్ని  చాలా దారుణంగా చూపిస్తూ ఉంటారు.    హీరోయిన్లకి  అభిమానులు ఉండటం సహజమే. కొందరు తమ అభిమానాన్ని పూలు, బహుమతుల రూపంలో చూపిస్తే.. మరికొందరు మాత్రం హద్దులు దాటేస్తుంటారు. అలాంటి ఓ వింత అనుభవాన్ని బాలీవుడ్ నటి పూజా బేడీ తాజాగా మరోసారి గుర్తుచేసుకున్నారు. 1993లో ఆమె ఓ సినిమాలో ధరించిన బికినీ వేలంలో అమ్ముడుపోవడం అప్పట్లో వార్తల్లో నిలిచింది. అయితే దాన్ని కొనుగోలు చేసిన వ్యక్తి ఆ తర్వాత చేసిన పనులు మాత్రం పూజా బేడీని చాలా కాలం పాటు ఇబ్బందులకు గురిచేశాయి. పూజా బేడీ 1993లో విడుదలైన ‘లుటేరే’ సినిమాలో బికినీ ధరించింది. అదే బికినీని 1993 మే నెలలో ముంబైలో నిర్వహించిన ‘ఫరెవర్ యువర్స్’ అనే వేలం కార్యక్రమంలో ఉంచారు. సెలబ్రిటీలు ఉపయోగించిన దుస్తులు, వస్తువులను వేలం వేసిన ఈ కార్యక్రమానికి నటి అర్చన పూరన్ సింగ్ హోస్ట్‌గా వ్యవహరించారు.   ఈ వేలంలో పూజా బేడీ బికినీని ఓ అభిమాని ఏకంగా రూ.1500 పెట్టి కొనుగోలు చేశాడు. అయితే అతను ఆ బికినీని కొనడంతో కథ ముగిసిపోలేదు. అసలు సమస్య ఆ తర్వాతే మొదలైంది. అంతేకాదు.. తరచూ ఫోన్లు చేయడం, రక్తంతో లేఖలు రాసి పంపడం వంటి పనులు చేసేవాడట. ఒకరోజు వేలంలో కొనుగోలు చేసిన బికినీని తీసుకుని ఏకంగా పూజా బేడీ ఇంటికే వచ్చేశాడట. అతడి ప్రవర్తనతో ఆమె తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఇది కూడా చదవండి: సీన్ ఓటీటీ రిలీజ్ డేట్ లాక్: ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఇదే! ఆ వ్యక్తిని కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించినప్పటికీ, అతడి వేధింపులు మాత్రం ఆగలేదని పూజా బేడీ గుర్తుచేసుకున్నారు. తనకు ఆమెను కౌగిలించుకునే అవకాశం లేకపోతే, ఆమె బికినీని అయినా కౌగిలించుకుంటానని ఆ వ్యక్తి చెప్పినట్లు ఆమె వెల్లడించారు. తన పెళ్లి అయ్యే వరకు ఆ వ్యక్తి నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపారు. సెలబ్రిటీలపై అభిమానం ఉండటం వేరు.. వారి వ్యక్తిగత జీవితంలోకి చొరబడి వేధించడం వేరు. అభిమానమనే పేరుతో హద్దులు దాటితే అది ఎంత ఇబ్బందికరంగా మారుతుందో పూజా బేడీకి ఎదురైన ఈ పాత అనుభవమే చెబుతోంది. పూజా బేడీ గతంలో ‘ది కపిల్ శర్మ షో’లో పాల్గొన్నప్పుడు ఈ ఘటన గురించి వివరించారు. ఆ అభిమాని తనపై విపరీతమైన అభిమానం పెంచుకున్నాడని, ఆమెకు ఇష్టమైన ‘అనైస్-అనైస్’ పర్ఫ్యూమ్ పేరునే తన పేరుగా పెట్టుకున్నాడని కూడా ఆమె వెల్లడించింది. అందుకే అంటారు మితిమీరిన ప్రేమ, అభిమానం ఎవరకి మనశ్శాంతిని ఇవ్వదు. కూరలో వేసుకునే ఉప్పు, కారం లాగా సమపాళ్లల్లో ఉండాలి.    మీకు నచ్చవచ్చు  ఫోక్సో కేసులో ప్రముఖ నటుడికి జైలు శిక్ష! భోగి ఫస్ట్ రివ్యూ: ఇన్ని ట్విస్ట్ లా!     [Pooja Bedi, Film Bikini, Fan, Tollywood]  
BTS member Kim Taehyung, popularly known as V, has revealed his admiration for Indian cinema, naming SS Rajamouli's RRR among his favourite films. The singer also shared that he has memorised the film's dance choreography, delighting Indian fans and bringing renewed attention to the global popularity of Naatu Naatu. During a recent interaction with fans on Weverse, V mentioned 3 Idiots, Dangal and RRR among his favourite Indian films. He added that he had learnt all the choreography from RRR, showcasing his familiarity with the film beyond its popular dance number. His comments have brought attention to a video of V and fellow BTS member Jung Kook performing the Naatu Naatu hookstep during their Arirang tour. The clip has been circulating among fans, with many celebrating the K-pop stars' enthusiasm for the Oscar-winning song. The official RRR social media account also shared the video and thanked both singers for their love. “ForeveRRR!! The #NaatuNaatu fever never stops! Thank you #Taehyung and #Jungkook, for the love,” the team wrote. Also Read: Sampath Nandi promises Sharwa to surprise audiences Jungkook had previously shown his fondness for Naatu Naatu during a Weverse Live session in 2023, when he played the song and grooved to it. V's latest revelation has added to the excitement among fans, connecting the worlds of Telugu cinema and K-pop once again. Featuring Ram Charan and Jr NTR, Naatu Naatu was composed by MM Keeravaani, with lyrics by Chandrabose and vocals by Rahul Sipligunj and Kaala Bhairava. The song won the Academy Award and Golden Globe for Best Original Song, while Prem Rakshith's choreography continues to inspire dance fans across the world. Check Out:   Ramayana gets shortlisted in Critic Choice awards                       AICWA seeks ban on Pakistani series Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
నందమూరి బాలకృష్ణ అభిమానులకు మాస్ ట్రీట్ ఇవ్వడానికి ‘దాదా’ సిద్ధమవుతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే గత కొద్దిరోజులుగా సినిమా విడుదల తేదీపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. డిసెంబర్ 24 నుంచి సినిమా వాయిదా పడుతుందనే వార్తలు కూడా వినిపించాయి. తాజాగా ఈ ఊహాగానాలకు చిత్ర బృందం నుంచి మరోసారి సమాధానం వచ్చింది. డిసెంబర్ 24న ‘దాదా’తో జాతర ఉంటుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ‘దాదా’ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా వెల్లడించారు. ఓ అభిమాని ఏదైనా అప్డేట్ ఇవ్వాలని కోరగా.. ‘దాదా’తో కుమ్మేస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. అంతేకాదు.. డిసెంబర్ 24 తేదీని గుర్తుపెట్టుకోవాలని, ఆ రోజు ఒక సెలబ్రేషన్‌లా ఉంటుందని హైప్ ఇచ్చారు. దీంతో బాలయ్య అభిమానుల్లో కొత్త ఉత్సాహం మొదలైంది. నిజానికి ఈ సినిమా విడుదల తేదీపై గతంలోనే సందేహాలు మొదలయ్యాయి. బాలకృష్ణకు షూటింగ్ సమయంలో గాయం కావడంతో షూటింగ్ ఆలస్యమవుతుందనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి లేదా 2027లో మరో సీజన్‌కు సినిమాను వాయిదా వేయవచ్చనే ప్రచారం జరిగింది. అయితే మేకర్స్ మాత్రం డిసెంబర్ 24 విడుదల తేదీని కొనసాగిస్తామని గతంలోనే స్పష్టం చేశారు. ఇప్పుడు మరోసారి అదే తేదీని గుర్తుచేయడంతో వాయిదా ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. ఇక ‘దాదా’లో బాలకృష్ణ 1980ల ముంబై నేపథ్యంలో సాగే కథలో కనిపించనున్నారు. రెట్రో లుక్, గ్యాంగ్‌స్టర్ నేపథ్యం, పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో ఈ సినిమా మరోసారి బాలయ్య మార్క్ మాస్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందనే అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మంచు మనోజ్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇది కూడా చదవండి: కింగ్100 వాయిదా.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్.! బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మంచి మాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. దీంతో ఈ ఇద్దరి కలయికలో వస్తున్న రెండో సినిమాపై అంచనాలు సహజంగానే పెరిగాయి. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 24న విడుదలైతే క్రిస్మస్ సెలవులను టార్గెట్ చేసుకుని బాక్సాఫీస్ వద్ద సందడి చేయనుంది. అదే రోజున నాగార్జున ‘కింగ్ 100’, షారుఖ్ ఖాన్ ‘కింగ్’ సినిమాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఈ క్రిస్మస్ సీజన్‌లో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోటీ కనిపించనుంది. మరి బాలయ్య ‘దాదా’ థియేటర్లలో ఎలాంటి ర్యాంపేజ్ సృష్టిస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. వారణాసి కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.! మమితా బైజు అసభ్యకర AI వీడియో.. సోషల్ మీడియాలో వైరల్.!       [Dada Release Date, Nandamuri Balakrishna, Gopichand Malineni, Nagarjuna, King100]  
Director Sampath Nandi says Sharwanand will surprise audiences with his performance in Bhogi, an intense period action drama set in the 1960s. In a recent interaction, the filmmaker described the actor's performance as “a dynamite explosion” and said his every close-up has turned out exceptionally well. Sampath revealed that the story was inspired by a childhood memory involving a mysterious person near Ramagiri Gutta, around 50 kilometres from his village. He later combined that memory with another reported incident to create the fictional village of Boggu Gutta, where the film's story unfolds around blind beliefs and traditions. Bhogi revolves around a brother-sister relationship and the protagonist's mission to prove that certain beliefs followed by the village are wrong. Sampath clarified that the film is not a regular love story or a criminal drama, but a rooted narrative with strong emotional content. He said the action and violence are presented in a way that audiences can watch, while the emotional core will connect deeply. Sharwanand reportedly agreed to the film after Sampath narrated the story for just 15 minutes. The director said it took nearly two months to finalise the actor's look, with several trials before arriving at the rugged appearance. Sharwanand also worked on a different body language and delivered his dialogues in Telangana dialect. Also Read: Ramayana gets shortlisted in Critic Choice awards The film's world has been recreated through a 15-acre village set built for Boggu Gutta. Sampath said the project took three years and producer KK Radhamohan supported the film without compromising on its scale. Anupama Parameswaran and Dimple Hayathi play the leading ladies, with the film featuring a distinct rural love story. Bhogi is produced by KK Radhamohan under the Sri Sathya Sai Arts banner and presented by Lakshmi Radhamohan. Bheems Ceciroleo has composed the music, while Chandrabose penned the lyrics. The film is scheduled to release worldwide in theatres on November 27. Check Out:   AICWA seeks ban on Pakistani series                        Suriya next to be produced by Sun Pictures?     Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా సత్తా చాటుతూ ఉన్నాడు ప్రముఖ మలయాళ నటుడు  శ్రీజిత్‌ రవి. ఇప్పుడు ఈ  నటుడికి కోర్టు షాక్ ఇచ్చింది. ఇద్దరు మైనర్ బాలికలకి  సంబంధించిన పోక్సో కేసులో ఏడాది కఠిన కారాగార శిక్ష విధిస్తూ కేరళలోని త్రిసూర్ ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించడం ప్రధాన హాట్ టాపిక్. 2022 జూలై 4న కేరళలోని త్రిసూర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన 2022 జూలై 4న జరిగింది. త్రిసూర్‌లోని అరనాట్టుకరలో ఇ‍ద్దరు బాలికలు పాఠశాల నుంచి తమ ఇంటికి తిరిగి వస్తుండగా, శ్రీజిత్ రవి తన కారులో వారిని వెంబడించాడ. ఆ తర్వాత అపార్ట్‌మెంట్ కార్ పార్కింగ్ ప్రాంతంలో వారిని చూస్తూ తన ప్రైవేట్ పార్ట్స్ ప్రదర్శిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీనిపై కేసు నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో అతన్ని నటుడు శ్రీజిత్ రవిగా గుర్తించారు. ఇది కూడా చదవండి: అజిత్ డేర్ డెవిల్ లో సిఎం క్యామియో: ఫ్యాన్స్ ని ఆపడం ఇక ఎవరి తరం కాదు!    అయితే శ్రీజిత్ రవికి గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదని, ఈ కేసు ఆయన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొంటూ, శిక్షను తగ్గించాలన్న రవి తరపు న్యాయవాది అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. నిందితుడు ఇద్దరు పాఠశాల విద్యార్థినులను లక్ష్యంగా చేసుకున్నాడని.. ఈ ఘటన వల్ల వారిపై దీర్ఘకాలిక మానసిక ప్రభావం పడొచ్చని కోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. రవి నుంచి జరిమానా వసూలు చేస్తే.. నష్టపరిహారంగా  ఇద్దరు బాలికలకు సమానంగా పంచాలని కూడా కోర్టు ఆదేశించింది. శ్రీజిత్ రవి తండ్రి కూడా ప్రముఖ నటుడు టీజీ రవి. మీకు నచ్చవచ్చు  భోగి  ఫస్ట్ రివ్యూ వచ్చేసింది! బండ్ల గణేష్ మమ్మల్ని మోసం చేయలేదు: చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్!   [Sreejith Ravi POCSO Case, Mollywood, Tollywood, Tg Ravi]  
కింగ్ అక్కినేని నాగార్జున నటిస్తున్న ప్రతిష్టాత్మక 100వ సినిమా ‘కింగ్ 100’ విడుదల తేదీపై గత కొద్దిరోజులుగా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబర్ 24న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతుందంటూ ప్రచారం జరగడంతో అభిమానుల్లో సందేహాలు మొదలయ్యాయి. అయితే తాజాగా మేకర్స్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో ఈ వాయిదా వార్తలకు చెక్ పెట్టారు. సినిమా డిసెంబర్ 24నే థియేటర్లలోకి రానుందని మరోసారి స్పష్టం చేశారు. నాగార్జున కెరీర్‌లో 100వ సినిమా కావడంతో ‘కింగ్ 100’పై మొదటి నుంచే ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో నాగ్ స్టైలిష్ లుక్, కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించారు. అప్పుడే డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇటీవల సినిమా విడుదల తేదీ మారబోతుందనే ప్రచారం మొదలైంది. క్రిస్మస్ సీజన్‌లో పోటీ, సినిమా ప్రమోషన్ల విషయంలో కనిపిస్తున్న నిశ్శబ్దం వంటి కారణాలతో వాయిదా పడే అవకాశాలున్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీంతో నాగార్జున అభిమానులు సినిమా అనుకున్న తేదీకే వస్తుందా? లేదా? అని చర్చించుకున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా విడుదల చేసిన 30 డేస్ కౌంట్‌డౌన్ పోస్టర్‌తో స్పష్టత ఇచ్చారు. బ్లాక్ సూట్‌లో నాగార్జున స్టైలిష్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్‌తో డిసెంబర్ 24 విడుదల తేదీని మరోసారి గుర్తుచేశారు. దీంతో ఇప్పటివరకు వినిపించిన వాయిదా ప్రచారానికి చిత్ర బృందం సమాధానం ఇచ్చినట్లయింది. ఇది కూడా చదవండి: నాగార్జునను ఆందోళనకు గురిచేసిన చైతు.. పోకిరి చూశాకే ఆ నిర్ణయం తీసుకున్నారు.! ఈ సినిమాకు రా. కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ‘కింగ్ 100’లో నాగార్జునతో పాటు టబు, అశోక్ సెల్వన్, ఐశ్వర్య రాజేష్, సుష్మిత భట్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నాగార్జున, టబు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండటం కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యంగా టబు పోషిస్తున్న మహంతి ఝాన్సీ రాణి పాత్రకు సంబంధించిన గ్లింప్స్ ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ తీసుకొచ్చింది. ఇటీవల నాగార్జున కూడా సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని, ఒక పాటతో పాటు కొంత ప్యాచ్‌వర్క్ మాత్రమే మిగిలి ఉందని వెల్లడించారు. ఈ నెలాఖరుకు ఫస్ట్ కాపీ సిద్ధమయ్యేలా పనులు జరుగుతున్నాయని తెలిపారు. దీంతో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా విడుదల తేదీని దృష్టిలో పెట్టుకుని కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. మీకు నచ్చవచ్చు:  శ్రీవిష్ణుపై నాని ఫ్యాన్స్‌ ఫైర్.. మెగా ఫ్యాన్స్ కూడా హర్ట్ అయ్యారు.! ఎన్టీఆర్ ‘డ్రాగన్’ టైటిల్.. అసలు సీక్రెట్ బయటపెట్టిన డైరెక్టర్.!       [King 100, Release Date, December 24, Nagarjuna, Ra Karthik]  
స్టార్ హీరో అజిత్ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ తెలిసిందే. ప్రస్తుతం అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో 'డేర్ డెవిల్' అనే మూవీ అనౌన్స్ చేసాడు. గతంలో వీరిద్దరి కాంబోలో  వచ్చిన 'గుడ్ బ్యాడ్ అగ్లీ' మంచి క్రేజ్ సంపాదించడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారనే న్యూస్  సోషల్ మీడియాకి సరికొత్త పులకింతలు తీసుకొస్తుంది. అయితే ఆయన ముఖ్యమంత్రి గానా? లేక కథలో కీలకమైన మరో వ్యక్తిగా కనిపిస్తారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదు. ప్రస్తుతం ఈ వార్త కోలీవుడ్‌తో పాటు కన్నడ సినీ వర్గాల్లోనూ ఆసక్తి రేపుతోంది. ఒకవేళ ఇది నిజమైతే అజిత్ సినిమాతో డీకే శివకుమార్ వెండితెరపై కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అయితే ఇప్పటివరకు చిత్రబృందం కానీ, డీకే శివకుమార్ కానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.    అజిత్ కెరీర్‌లో 64వ సినిమాగా రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌ను ఆయన భార్య షాలిని అజిత్ కుమార్ బ్రేవ్‌హార్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. అజిత్‌కి జోడీగా శ్రీలీల కనిపిస్తుండగా ఉన్ని ముకుందన్, శివరాజ్ కుమార్, పార్తిబన్, ప్రభు, సునీల్, రెడిన్ కింగ్స్‌లీ వంటి ప్రముఖ నటులు కీ రోల్స్. ఇది కూడా చదవండి: బండ్ల గణేష్ చెక్ బౌన్స్ కేసులో బిగ్ ట్విస్ట్! ముఖ్యంగా కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అజిత్‌కు ఎదురుగా ఆయన చేసే పోరాట సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే 'జైలర్' సినిమాలో నరసింహ పాత్రతో ఇతర భాషల ప్రేక్షకులకు మరింత దగ్గరైన శివన్న.. ఇప్పుడు అజిత్‌తో స్క్రీన్ షేర్ చేసుకోబోతుండటం విశేషం.  నవంబర్ 2న పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో చిత్రీకరణ కొనసాగుతోంది. 2027లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అజిత్ యాక్షన్, అధిక్ రవిచంద్రన్ టేకింగ్, అనిరుధ్ సంగీతం.. ఇలా ఇప్పటికే సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. మీకు నచ్చవచ్చు భోగి ఫస్ట్ రివ్యూ! తెలుగు సినిమాలకి అనిరుధ్ మ్యూజిక్ కలిసి రావట్లేదా! [ DK Shivakumar, Ajith, Dare Devil,  Adhik Ravichandran, Tollywood, sreeleela]                
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘డ్రాగన్’. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి టైటిల్ విషయంలో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో #NTRNeel పేరుతో ప్రచారంలో ఉన్న ఈ సినిమాకు ‘డ్రాగన్’ అనే టైటిల్ ప్రకటించగానే అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ పవర్‌ఫుల్ టైటిల్ వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందని తాజాగా బయటపడింది. ఈ టైటిల్‌ను ఎన్టీఆర్ సినిమాకు అందించింది మరెవరో కాదు.. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, ప్రొడ్యూసర్ కరణ్ జోహార్. గోవాలో జరుగుతున్న 57వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పాల్గొన్న అయాన్ ముఖర్జీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ సినిమా కోసం సరైన టైటిల్ వెతుకుతున్న సమయంలో తాము ‘డ్రాగన్’ పేరును వారికి ఇచ్చామని ఆయన చెప్పారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రణ్‌బీర్ కపూర్ నటించిన ‘బ్రహ్మాస్త్ర’ సినిమాకు తొలుత ఈ ‘డ్రాగన్’ టైటిల్‌ను పెట్టాలని అయాన్ ముఖర్జీ భావించారట. ఆ సినిమా మొదట చిన్న కథగా ప్రారంభమైనప్పటికీ, క్రమంగా భారీ బడ్జెట్‌తో విజువల్ ఎఫెక్ట్స్‌కు ప్రాధాన్యత ఉన్న ఫాంటసీ అడ్వెంచర్‌గా రూపుదిద్దుకుంది. దీంతో కథ, సినిమా పరిధి పెరిగిన నేపథ్యంలో ‘బ్రహ్మాస్త్ర’ అనే పేరును ఖరారు చేశారు. అలా ‘బ్రహ్మాస్త్ర’ కోసం అనుకున్న ‘డ్రాగన్’ పేరు ఉపయోగించకుండా మిగిలిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం టైటిల్ వెతుకుతున్న సమయంలో అయాన్, కరణ్ జోహార్ ఆ పేరును చిత్ర బృందానికి అందించారు. ఈ విషయాన్ని అయాన్ స్వయంగా వెల్లడించడంతో ఇప్పుడు ఈ టైటిల్ వెనుక ఉన్న కథ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇది కూడా చదవండి: రెండేళ్లుగా ఎదురుచూపులు.. ఎట్టకేలకు దేవర శాటిలైట్ రైట్స్ సోనీ చేతికి.! ఇక ‘డ్రాగన్’ సినిమా విషయానికి వస్తే.. 1967 నేపథ్యంలో సాగే ఈ కథలో నల్లమందు వ్యాపారం, దాని చుట్టూ ఏర్పడే ఆధిపత్య పోరాటం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయి. ఎన్టీఆర్ ఇందులో లూగర్ అనే పాత్రలో కనిపించనున్నారు. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా, అనిల్ కపూర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌లో ఎన్టీఆర్ లుక్, ప్రశాంత్ నీల్ మార్క్ మేకింగ్ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో తనదైన యాక్షన్ ప్రపంచాన్ని సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఈసారి ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి నెలకొంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2027 జూన్ 11న విడుదల కానుంది. మీకు నచ్చవచ్చు:  మహేష్ ఫ్యాన్స్‌కి షాక్.. వారణాసి కొత్త రిలీజ్ ప్లాన్ ఇదే.! మమితా బైజు అసభ్యకర AI వీడియో.. సోషల్ మీడియాలో వైరల్.!       [Jr NTR, Dragon Title Story, Ayan Mukerji, Karan Johar, Prashanth Neel]  
The All India Cine Workers Association (AICWA) has written to Prime Minister Narendra Modi seeking a ban on Pakistani series Jo Bachay Hain Sang Samait Lo on Netflix India. The association has urged the government to prevent the show from streaming in the country ahead of its scheduled December 4 premiere. In its letter, AICWA called for strict implementation of the Ministry of Information and Broadcasting's May 2025 advisory on Pakistani-origin content. It has also demanded a permanent law prohibiting Pakistani entertainment content across Indian television, OTT platforms and theatres. The association argued that streaming the series in India would go against the spirit of the advisory and public sentiment. It has appealed to Netflix India and other streaming platforms not to feature Pakistani content in the country. Jo Bachay Hain Sang Samait Lo marks Netflix's first Pakistani original series. Based on Farhat Ishtiaq's bestselling Urdu novel, the drama follows six love stories across three generations. Also Read: Suriya next to be produced by Sun Pictures? The series features Fawad Khan and Mahira Khan in leading roles, alongside Ahad Raza Mir, Hamza Ali Abbasi, Hania Aamir and Sanam Saeed. The show has been produced by Momina Duraid Films, with Momina Duraid serving as showrunner. Netflix has announced December 4 as the premiere date, but the platform has not clarified whether the series will be available to Indian subscribers. AICWA's demand has brought the upcoming show into the spotlight ahead of its release. Check Out:  Megaverse Promo: Chiru takes over Netflix                       King 100: Nagarjuna dismisses postpone rumors Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మగాళ్ల రహస్యం..  భార్యకు,  కుటుంబ సభ్యులకు ఈ విషయాలు అస్సలు చెప్పరట..! మన సమాజంలో ఎన్నో ఏళ్లుగా మగవారికి ఒక రకమైన  నియమం ఉంది. ఎంత కష్టం వచ్చినా, ఎంత ఒత్తిడి ఉన్నా మొహంలో చిరునవ్వు చెరగకూడదు, ఎవరి ముందూ కన్నీళ్లు పెట్టుకోకూడదు, అన్ని బాధ్యతలను ఒంటిచేత్తో మోయాలి అనే మాటలు చిన్నప్పటి నుంచే వారి మనసులో బలంగా నాటుకుపోతాయి. ఉద్యోగంలో ఎదురయ్యే సమస్యలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, శారీరక అలసటైనా వాళ్లు చాలావరకు బయటకు చెప్పుకోరు. కానీ బయటకు గట్టిగా కనిపించే ప్రతి మనిషి లోపలా ఎన్నో సున్నితమైన భావోద్వేగాలు, చిన్న చిన్న ఆశలు దాగి ఉంటాయి. మగవారు తమ భార్య నుంచి, కుటుంబ సభ్యుల నుంచి మనసులో ఏం కోరుకుంటారో, కానీ బయటకు ఎందుకు చెప్పలేరో వివరంగా తెలుసుకుంటే.. అసలు మీరు ఎలా ఉన్నారు అని ఎవరైనా అడిగితే బాగుంటుందని.. కుటుంబంలోని ప్రతి ఒక్కరి బాగోగులు మగవారే చూసుకుంటూ ఉంటారు. పిల్లల చదువు, అమ్మానాన్నల ఆరోగ్యం, ఇంటి ఖర్చులు ఇలా అన్నింటి గురించి ఆలోచిస్తారు. కానీ వారిని ఎవరైనా ఒక్కసారి మీరు ఎలా ఉన్నారు, ఈరోజు మీకు ఎలా గడిచింది అని అడిగితే చాలా సంతోషిస్తారు. తమ మనసులోని మాటలను ఎలాంటి భయం లేకుండా, మొహమాటం లేకుండా చెప్పుకునే మనిషి ఒకరు పక్కన ఉండాలని వాళ్లు లోలోపల కోరుకుంటారు. ప్రతి సమస్యకు పరిష్కారం వాళ్లే చూపించాలని అనుకోరు.. ఇంట్లో ఏ చిన్న ఇబ్బంది వచ్చినా, ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినా అందరి చూపు ముందుగా ఇంటిలోని మగవారి వైపే ఉంటుంది. ఆర్థిక సమస్యలైనా, ఇతర కష్టాలైనా వాళ్లే పరిష్కరించాలని అందరూ ఆశిస్తారు. కానీ కష్టకాలంలో తమను ఒంటరిని చేయకుండా, కుటుంబ సభ్యులు కూడా అండగా నిలబడాలని, కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని వాళ్లు కోరుకుంటారు. ప్రతి భారాన్ని వాళ్ల మీదే వేయకుండా పంచుకుంటే ఎంతో ఊరటగా ఉంటుందని భావిస్తారు. చేసే కష్టానికి చిన్న మెచ్చుకోలు ఆశిస్తారు.. కుటుంబం కోసం మగవారు తమ సొంత ఆనందాలను, కోరికలను చాలాసార్లు పక్కన పెడతారు. రోజుల తరబడి కష్టపడి పని చేస్తారు. అయితే తమ పనికి పెద్ద పెద్ద బహుమతులు లేదా ఘనమైన సన్మానాలు ఏమీ ఆశించరు. కానీ మీ కష్టం నాకు కనిపిస్తోంది, మీరు చేస్తున్న పని చాలా గొప్పది లేదా ఒక్క చిన్న థ్యాంక్స్ వంటి మాటలు వినాలని మనసులో ఆశపడతారు. ఆ చిన్న ప్రశంస వాళ్లకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇది కూడా చదవండి  రోజూ వాకింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతున్నారా ఎలాంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా కాస్త విశ్రాంతి కావాలి.. సంపాదన, బాధ్యతలు అంటే జీవితకాలం పరుగెడుతూనే ఉండాలి అన్నట్టు కొందరు ప్రవర్తిస్తుంటారు. దానివల్ల కాసేపు తీరిక తీసుకుందామన్నా, సరదాగా గడుపుదామన్నా మగవారికి ఎక్కడో ఒక మూల తప్పు చేస్తున్నామనే భావన కలుగుతుంది. స్నేహితులతో కలవడమో, ఇష్టమైన సినిమా లేదా ఆట చూడటమో, లేదంటే కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా ఉండటమో వాళ్లకు కూడా అవసరం. ఏ విధమైన అపరాధ భావన లేకుండా అలాంటి సమయాన్ని కుటుంబం ఇస్తే వాళ్లు ఎంతో రిలాక్స్ అవుతారు. భావోద్వేగాలను తక్కువ చేసి చూడకూడదు.. చాలామంది మగవారు తమ బాధలను బయటకు చెప్పడానికి జంకుతారు. ఎక్కడ నన్ను బలహీనుడు అనుకుంటారో, ఎక్కడ హేళన చేస్తారో అనే భయం వారిలో ఉంటుంది. బాధ వచ్చినప్పుడు కన్నీళ్లు రావడం లేదా మనసు విప్పి మాట్లాడటం బలహీనత కాదు, అది సహజమైన మనిషి స్వభావం. తాము ఏడ్చినా, బాధపడినా దాన్ని తేలికగా తీసుకోకుండా, అర్థం చేసుకుని గౌరవించాలని వాళ్లు కోరుకుంటారు. భార్య, కుటుంబం నుంచి ప్రేమ, ఆత్మీయతతో కూడిన తోడు.. భార్యాభర్తల బంధం కేవలం ఖర్చులు, బాధ్యతలు, అవసరాలకే పరిమితం కాకూడదు అని ప్రతి భర్త కోరుకుంటాడు. ఇద్దరూ కలిసి మనసు విప్పి మాట్లాడుకోవడం, ఒకరికొకరు సమయం కేటాయించడం, కష్టసుఖాల్లో తోడుగా నిలబడటం ఎంతో ముఖ్యం. కుటుంబ సభ్యుల నుంచి కూడా ప్రేమ, నమ్మకం, ఆత్మీయత లభిస్తే ఆ మనిషికి అంతకంటే పెద్ద బలం మరొకటి ఉండదు. సొంత ఇష్టాలు, వ్యక్తిత్వాన్ని కూడా గౌరవించాలి.. పెళ్లయ్యాక, కుటుంబ బాధ్యతలు పెరిగాక చాలామంది మగవారు తమ సొంత అభిరుచులను, కలలను, ఇష్టాలను వదులుకుంటూ ఉంటారు. కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానో, బాధ్యతల మనిషిలానో కాకుండా, తమకూ ఒక వ్యక్తిత్వం ఉందని, సొంత ఇష్టాలు ఉంటాయని కుటుంబం గుర్తించాలని వాళ్లు ఆశిస్తారు. తమ కలలను, స్నేహాలను, ఆసక్తులను గౌరవిస్తే వాళ్లు మరింత సంతోషంగా, సంతృప్తిగా ఉంటారు. మొత్తానికి బయటకు ఎంత గట్టిగా, ధైర్యంగా కనిపించినా మగవారికి కూడా ప్రేమ, ఓదార్పు, విశ్రాంతి, అండ అవసరం. ఈ విషయాలను వాళ్లు మాటల్లో చెప్పకపోయినా, మనసులో మాత్రం ఎంతో బలంగా కోరుకుంటారు. ఇంటిల్లిపాది కలిసి ఆ చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకుంటే కుటుంబంలో ప్రేమ, సంతోషం ఇంకా పెరుగుతాయి.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు   ప్రేమ, నమ్మకం ఉన్నప్పటికీ.. లైఫ్ పార్ట్నర్ ఎందుకు మారిపోతారు.!                                    ఈ నాలుగు పాటిస్తే అత్తాకోడళ్ల మధ్య గొడవలే ఉండవు
చలికాలం రాగానే వాతావరణం చల్లగా మారుతుంది, ఎండ వేడి తగ్గినట్టు అనిపిస్తుంది. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు చాలామంది సన్‌స్క్రీన్ వాడటం ఆపేస్తారు. కానీ మన చర్మం థర్మామీటర్ చూసి స్పందించదు, కాంతికి స్పందిస్తుంది. మిద్దె మీద లేదా ఆరుబయట కొన్ని గంటలు గడిపితే చల్లని గాలిలో కూడా ముఖం, చేతులు నల్లబడతాయి. నిపుణుల ప్రకారం, సన్ ట్యాన్ వేడి వల్ల కాదు, అతినీలలోహిత కిరణాల (UV rays) వల్ల వస్తుంది. వేడిని మనం అనుభవించగలం కానీ UV కిరణాలను అనుభవించలేం. చలికాలంలో UVB కిరణాలు తక్కువగా ఉన్నా, వృద్ధాప్య ఛాయలు మరియు ట్యానింగ్‌కు కారణమయ్యే UVA కిరణాలు మాత్రం చురుకుగానే ఉంటాయి. ఇవి మేఘాలను మరియు కిటికీ అద్దాలను కూడా దాటుకుని చర్మాన్ని తాకుతాయి. దీనివల్ల చర్మం తనను తాను కాపాడుకోవడానికి మెలనిన్ (melanin) ఉత్పత్తి చేస్తుంది, అదే ట్యాన్‌గా మారుతుంది. చలికాలపు ఎండ బయటకు కనిపించినంత అమాయకంగా ఉండదు. చల్లని గాలి వల్ల వేడి హెచ్చరిక తెలియక మనం ఎండలో ఎక్కువ సమయం గడిపేస్తాం. స్పష్టమైన రోజుల్లోనే కాకుండా పలుచని మేఘాలు ఉన్నప్పుడు కూడా గణనీయమైన UV కిరణాలు కిందకు వస్తాయి. మంచు, నీరు, లేదా ప్రకాశవంతమైన ఉపరితలాలు UV కిరణాలను తిరిగి చర్మంపై ప్రతిబింబిస్తాయి. ఎత్తైన ప్రాంతాలు లేదా హిల్ స్టేషన్లకు వెళ్లినప్పుడు UV తీవ్రత మరింత పెరుగుతుంది. 2024లో ప్రచురించబడిన ఒక అధ్యయన సమీక్ష ప్రకారం, UVA కిరణాలు మరియు దృశ్య కాంతి మేఘాలు, కిటికీ అద్దాల గుండా ప్రయాణించగలవు, అలాగే మెలస్మా వంటి నల్లటి మచ్చల సమస్యలో సూర్యకాంతి కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ చర్మతత్వానికి చలికాలపు ఎండ వల్ల అదనపు జాగ్రత్తలు అవసరం. ముదురు చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా కమిలిపోదు కానీ సులభంగా ట్యాన్ అవుతుంది మరియు నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చలికాలపు ఎండ ముఖం, చేతులు, మెడను నల్లబర్చడమే కాకుండా, మెలస్మా (బుగ్గలు, నుదురుపై గోధుమ లేదా బూడిద రంగు మచ్చలు)ను తీవ్రతరం చేస్తుంది మరియు మొటిమల మచ్చలను ఎక్కువకాలం ఉంచుతుంది. 2022లో జరిగిన ఒక సమీక్ష ప్రకారం, దృశ్య కాంతి మరియు దీర్ఘ తరంగ UVA కిరణాలు మెలస్మాకు ముఖ్య కారణాలుగా నిలిచాయి, అయినప్పటికీ మెలస్మా ఉన్నవారిలో ఎక్కువమంది సూర్యరశ్మి నుంచి రక్షణ చర్యలు సరిగ్గా పాటించడం లేదని తేలింది. అందుకే చలికాలంలోనూ ప్రతిరోజూ ఉదయం కనీసం SPF 30 మరియు PA+++ లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉన్న బ్రాడ్-స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్ తప్పనిసరిగా వాడాలి. సన్‌స్క్రీన్ వాడటంలో సంఖ్య కంటే వాడే పద్ధతి, మోతాదు చాలా ముఖ్యం. ముఖం మరియు మెడ కోసం సుమారు రెండు వేళ్ల పొడవు (two finger lengths) అంత సన్‌స్క్రీన్ తీసుకోవాలి. బయట ఉన్నప్పుడు ప్రతి రెండు నుంచి మూడు గంటలకు ఒకసారి మళ్లీ రాయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య నీడలో ఉండటం మంచిది. టోపీ, సన్‌గ్లాసెస్, ఫుల్ స్లీవ్ దుస్తులు ధరించాలి మరియు చేతుల వెనుక భాగం, చెవులు, మెడను కూడా కవర్ చేసుకోవాలి. చల్లని గాలి వల్ల చర్మం పొడిబారి సున్నితంగా మారుతుంది కాబట్టి మాయిశ్చరైజర్ కూడా వాడాలి. ఉష్ణోగ్రత కంటే వాతావరణ యాప్‌లో UV ఇండెక్స్ చూసి ప్రణాళిక వేసుకోవాలి. ఇది కూడా చదవండి:జలుబు, పొడి దగ్గు వేధిస్తోందా? ఇంట్లోనే ఈ సులభ పరిష్కారాలు విటమిన్ D కోసం గంటల తరబడి ఎండలో నిలబడాల్సిన అవసరం లేదు; అలా చేస్తే పిగ్మెంటేషన్ మరియు చర్మ సమస్యలు పెరుగుతాయి. విటమిన్ D లోపం గురించి ఆందోళన ఉంటే వైద్యుడిని సంప్రదించి రక్త పరీక్ష చేయించుకోవడం ఉత్తమం. 2021లో ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో వచ్చిన సమీక్ష ప్రకారం, ముదురు చర్మం ఉన్నవారికి అదే స్థాయిలో విటమిన్ D ఉత్పత్తి కావడానికి ఎండలో ఎక్కువ సమయం పట్టవచ్చు, కాబట్టి అంచనా వేయడం సరికాదు.  అలాగే, విస్తరిస్తున్న లేదా తగ్గని నల్లటి మచ్చలు, ఆకారం లేదా రంగు మారుతున్న పుట్టుమచ్చలు, చర్మం కాలిపోవడం లేదా పొట్టు ఊడటం, లేదా సన్‌స్క్రీన్ వాడినా పెరుగుతున్న పిగ్మెంటేషన్ కనిపిస్తే వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. చలికాలంలోనూ రోజూ సన్‌స్క్రీన్ రాయడం, చర్మాన్ని కప్పి ఉంచడం ద్వారా మీ చర్మాన్ని ఆరోగ్యంగా మరియు కాంతివంతంగా ఉంచుకోవచ్చు. మీకు నచ్చవచ్చు:ఆంధ్ర స్టైల్, మిరపకాయ బజ్జీ కూర.. సింపుల్ టిప్స్‌తో పర్ఫెక్ట్ గ్రేవీ!                              ఈజీగా చేసుకునే, రుచికరమైన పొట్లకాయ పచ్చిశనగపప్పు, కూర విధానం           Winter Sun Tan, Sun Tan In Winter Causes, Dermatologist Skincare Tips, Winter Sunscreen Tips, UV Rays In Winter, Prevent Tanning In Cold Weather, Skincare Tips In Telugu.
శీతాకాలం మొదలవగానే ఉదయాన్నే చల్లగాలి వణుకు పుట్టిస్తుంది, ఆ వెంటనే జలుబు, దగ్గు, నీరసం, మోకాళ్లు మరియు కీళ్ల నొప్పులు వంటి సమస్యలు చాలామందిని ఇబ్బంది పెడతాయి. చలి వాతావరణంలో శరీరానికి లోపలి నుంచి వెచ్చదనం, స్థిరమైన శక్తి మరియు బలం అవసరమవుతాయి. అలాంటి కాలానికి మన సంప్రదాయ వంటకాలలో గోందు లడ్డూ ఒక అద్భుతమైన బలవర్ధక ఆహారంగా నిలుస్తుంది. ఇందులో ఉపయోగించే గోందు ప్రత్యేకమైన చెట్ల నుంచి లభించే సహజ జిగురు కాగా, ఆయుర్వేదంలో దీనిని శతాబ్దాలుగా ఆరోగ్యాన్ని కాపాడే ఔషధంగా వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వేసవిలో చలవ కోసం వాడే గోందు కతీరాకు భిన్నంగా, సాధారణ గోందు శీతాకాలంలో శరీరానికి వేడిని, బలాన్ని అందించడానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ గోందు లడ్డూల తయారీలో ప్రతి కొలత, ప్రతి దశ కూడా రుచి మరియు ఆరోగ్యాన్ని సమతుల్యం చేస్తుంది. ముందుగా 1 కప్పు గోధుమపిండిలో 1 స్పూన్ నెయ్యి, చిటికెడు ఉప్పు వేసి, 2 టేబుల్ స్పూన్ల కాచి చల్లార్చిన పాలను కొద్దికొద్దిగా చల్లుతూ పిండి ముద్ద కాకుండా 15 నిమిషాలు నానబెట్టి, ఆపై జల్లెడ పడితే అది చక్కటి రవ్వలా మారుతుంది. తర్వాత కడాయిలో 1 స్పూన్ నెయ్యి వేసి పావు కప్పు గోందును తక్కువ మంటపై వేయించాలి; అది వడియాల్లా ఉబ్బి తెల్లగా మారేవరకు లోపలి వరకు వేయించడం చాలా అవసరం, లేదంటే తినేటప్పుడు పళ్లకు జిగురుగా అంటుకుంటుంది. అదే కడాయిలో కొద్దిగా నెయ్యితో జీడిపప్పు పలుకులు, కిస్మిస్‌లు, పుచ్చగింజలు, బాదం పలుకులు, అలాగే అర చిప్ప తురిమిన ఎండుకొబ్బరిని కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక గోధుమపిండి రవ్వను మరొక 1 స్పూన్ నెయ్యిలో లో ఫ్లేమ్ మీద రంగు మారి సువాసన వచ్చేవరకు వేయించి చల్లారనివ్వాలి. వేయించిన గోందును చేతితో మెత్తగా క్రష్ చేసి, దానికి అర స్పూన్ యాలకుల పొడి, వేయించిన డ్రై ఫ్రూట్స్, ఎండుకొబ్బరి, గోధుమపిండి మిశ్రమాన్ని కలపాలి. మరోవైపు ముప్పావు కప్పు బెల్లంలో 2 టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి తక్కువ మంటపై తీగపాకం వచ్చేవరకు కరిగించి, ఆ పాకాన్ని మిశ్రమంలో వడకట్టి వేయాలి. వేడిగా ఉన్నప్పుడే గరిటెతో కలిపి, తర్వాత చేతితో గట్టిగా నొక్కుతూ లడ్డూలుగా చుట్టాలి. ఇలా తయారు చేసిన గోందు లడ్డూలను ఫ్రిజ్‌లో పెట్టకుండానే 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. పోషకాల పరంగా చూస్తే, సుమారు 30 గ్రాముల నుంచి 35 గ్రాముల బరువున్న ఒక గోందు లడ్డూ దాదాపు 160 నుంచి 180 క్యాలరీల శక్తిని అందిస్తుంది (సైజు మరియు నెయ్యి, బెల్లం మోతాదును బట్టి 60 గ్రాముల లడ్డూలో 287 క్యాలరీల వరకు ఉండవచ్చు). గోధుమపిండి మరియు బెల్లం నుంచి కార్బోహైడ్రేట్లు, నెయ్యి మరియు బాదం, జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ నుంచి ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఈ, ఖనిజాలు లభిస్తాయి. చలికాలంలో రోజుకు కేవలం 1 గోందు లడ్డూ తీసుకోవడం ద్వారా శరీరానికి తక్షణ శక్తి అందడమే కాకుండా, ఎముకలు మరియు కీళ్ల దృఢత్వానికి తోడ్పడుతుంది. ఇది కూడా చదవండి:రోజూ ఒక్క కివీ లేదా ఉడికించిన టమాటో: కణాల ఆరోగ్యంపై డాక్టర్ సూచనలు ఈ లడ్డూలు చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయుక్తంగా ఉంటాయి, ముఖ్యంగా ప్రసవం తర్వాత మహిళలకు నడుము మరియు ఎముకలు గట్టిపడటానికి, శరీరం త్వరగా కోలుకోవడానికి సంప్రదాయకంగా వీటిని తినిపిస్తారు. రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, శీతాకాలపు నీరసాన్ని తగ్గించడంలోనూ ఇవి మంచి తోడ్పాటు అందిస్తాయి. అయితే ఇందులో నెయ్యి, బెల్లం, గోధుమపిండి ఉండటం వల్ల క్యాలరీలు మరియు సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి; కాబట్టి మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ లేదా బరువు నియంత్రణలో ఉన్నవారు మితంగా, వైద్యుల సలహా మేరకు తీసుకోవడం మంచిది. మొత్తానికి, సరైన మోతాదులో తీసుకుంటే గోందు లడ్డూ శీతాకాలంలో రుచిని, ఆరోగ్యాన్ని కలబోసే విలువైన సంప్రదాయ ఆహారం. బయట దొరికే అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా, ఇంట్లోనే సులభంగా చేసుకునే ఈ లడ్డూను రోజుకు 1 చొప్పున 10 రోజుల పాటు నిల్వ ఉండేలా సిద్ధం చేసుకుంటే చలికాలపు సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. సహజ పదార్థాల మేళవింపుతో రూపొందే ఈ లడ్డూ మన జీవనశైలిలో భాగమైతే శరీరానికి బలం, మనసుకు తృప్తి రెండూ దక్కుతాయి. మీకు నచ్చవచ్చు:పిల్లల స్నాక్ బాక్స్ కోసం, క్విక్ అటుకుల మిక్చర్.. నెల రోజులు నిల్వ                                  వేడి అన్నంలో నెయ్యి, చిక్కుడుకాయ కూర.. బాల్యపు రుచి మళ్లీ!       Winter Gond Laddu, Gond Laddu Benefits, Strong Bones In Winter, Immunity Boosting Laddu, Edible Gum Laddu, Winter Wellness Tips, Health Tips In Telugu.  
అందంగా కనిపించాలని, చర్మం కాంతివంతంగా ఉండాలని చాలామంది రకరకాల Skin Care Products, Beauty Treatments ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు, వైరల్ అవుతున్న Skincare Trends చూసి కొత్త కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయడం, రకరకాల Skin Treatments చేయించుకోవడం ఇటీవల ఎక్కువైంది. అయితే సోషల్ మీడియాలో కనిపించే ప్రతి Skin Care Product మన చర్మానికి సరిపోతుందా? ప్రతి Beauty Treatment సురక్షితమైనదేనా? అనే విషయాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ వీడియోలో ప్రముఖ చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ మౌనిక చర్మ సంరక్షణకు సంబంధించిన పలు ముఖ్యమైన విషయాలను వివరించారు. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Skin Care Products, Creams, Serums వంటివి ఉపయోగించే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రకటనల్లో చూపించే ఫలితాలను ఎంతవరకు నమ్మవచ్చు? మన చర్మతత్వానికి సరిపోని ఉత్పత్తులను ఉపయోగిస్తే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? అనే విషయాలను తెలియజేశారు. అలాగే ముఖంపై ముడతలు తగ్గించుకోవడానికి, యవ్వనంగా కనిపించడానికి ఉపయోగించే Botox Treatment, Facial Fillers గురించి కూడా వివరించారు. ఈ చికిత్సలు అంటే ఏమిటి? వీటిని చేయించుకునే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? సరైన అర్హతలు లేని వ్యక్తుల దగ్గర చికిత్సలు చేయించుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావచ్చు? అనే అంశాలను చర్చించారు. ఒకరికి మంచి ఫలితాన్ని ఇచ్చిన Skin Care Product లేదా Treatment మరొకరికి కూడా సరిపోతుందని అనుకోవడం పొరపాటు. ప్రతి ఒక్కరి చర్మతత్వం, చర్మ సమస్యలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు, ప్రకటనలు చూసి గుడ్డిగా ఉత్పత్తులు కొనడం లేదా చికిత్సలు చేయించుకోవడం మంచిది కాదు. చర్మ సంరక్షణకు సరైన ఉత్పత్తులను ఎలా ఎంచుకోవాలి? సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Beauty Products విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? Botox, Facial Fillers వంటి చికిత్సలు చేయించుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? చర్మ సమస్యలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? వంటి ముఖ్యమైన సందేహాలకు ఈ వీడియోలో డాక్టర్ మౌనిక సమాధానాలు ఇచ్చారు. అందం కోసం చేసే ప్రయోగాల కంటే చర్మ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ చర్మతత్వాన్ని అర్థం చేసుకుని, అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుల సలహాతోనే Skin Care Products, Treatments ఎంచుకోండి. సోషల్ మీడియా Skincare Trends, Beauty Products, Botox, Facial Fillers గురించి డాక్టర్ మౌనిక ఏం చెబుతున్నారో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోండి.  గమనిక: ఈ వీడియో కేవలం సమాచార, అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే. సోషల్ మీడియాలో ప్రచారమయ్యే Skin Care Products లేదా Beauty Treatments అందరికీ సరిపోతాయని భావించకండి. కొత్త ఉత్పత్తులు ఉపయోగించే ముందు, Botox, Facial Fillers వంటి చికిత్సలు చేయించుకునే ముందు అర్హత కలిగిన చర్మవ్యాధి నిపుణుడి సలహా తీసుకోండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మునగాకు (Moringa Leaves) అంటే కేవలం ఒక ఆకు కూర మాత్రమే కాదు.. ఎన్నో పోషక విలువలు కలిగిన ఆహారం. మన రోజువారీ ఆహారంలో మునగాకును చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి. ముఖ్యంగా మునగాకు పొడితో తయారుచేసే మునగాకు లడ్డూలు ఆరోగ్యకరమైన ఆహారంపై ఆసక్తి ఉన్నవారికి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. మరి మునగాకు లడ్డూల ప్రత్యేకత ఏమిటి? వీటిని తినడం వల్ల ఎలాంటి పోషక ప్రయోజనాలు లభిస్తాయి? మునగాకులో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఉంటాయి. ఐరన్, కాల్షియం, విటమిన్ ఏ, విటమిన్ సి వంటి పోషకాలు మునగాకులో లభిస్తాయి. అందుకే మునగాకును పోషకాల గనిగా పిలుస్తారు. మునగాకును నేరుగా కూరగా తీసుకోవడమే కాకుండా, ఎండబెట్టి పొడిగా తయారుచేసి కూడా ఆహారంలో ఉపయోగించుకోవచ్చు. మునగాకు పొడితో తయారుచేసే లడ్డూలు ఎలా ఉంటాయి? వీటిని తయారుచేయడానికి ఎలాంటి పదార్థాలు ఉపయోగిస్తారు? మునగాకు పొడిని లడ్డూల రూపంలో తీసుకోవడం వల్ల కలిగే ప్రత్యేకత ఏమిటి? రోజువారీ ఆహారంలో మునగాకు పొడిని ఎలా చేర్చుకోవాలి? రోజుకు ఎన్ని మునగాకు లడ్డూలు తీసుకోవచ్చు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో Green Alchemy Founder అరుణ గారు మునగాకు పొడి తయారీ విధానం, దాని పోషకవిలువలు, మునగాకు లడ్డూల తయారీ ప్రత్యేకతలు, వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. మునగాకు లడ్డూల్లో ఉపయోగించే పదార్థాలు, వాటి పోషక ప్రాధాన్యత, రోజూ రెండు లడ్డూలు తినడం వెనుక ఉన్న ఆలోచన వంటి విషయాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మునగాకు, మునగాకు పొడి, మునగాకు లడ్డూల గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూడండి. గమనిక: మునగాకు పోషకాలు కలిగిన ఆహారమే అయినప్పటికీ, మునగాకు లడ్డూలు తీసుకోవడం వల్ల నిర్దిష్ట ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.  వీటిని సమతుల్య ఆహారంలో భాగంగా మాత్రమే తీసుకోవాలి. ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు వైద్యుల సూచనలను పాటించాలి. మరిన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు, పోషకాహార విశేషాలు, సహజ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకునే మార్గాల కోసం తెలుగు వన్ హెల్త్ (TeluguOne Health)ను అనుసరించండి.
ఈ ఒక్క పోషకం లోపిస్తే నిద్ర, గుండె ఆరోగ్యం, కండరాల బలహీనత.. ఇలా ఎన్ని సమస్యలో తెలుసా? ఉదయం లేచినప్పటి నుంచీ ఏదో తెలియని అలసట, రాత్రిళ్లు సరిగ్గా నిద్ర పట్టకపోవడం, అప్పుడప్పుడు కండరాలు పట్టేయడం లేదా బలహీనంగా అనిపించడం.. వీటిని మనం చాలామంది రోజువారీ ఒత్తిడి లేదా పని భారం వల్ల వచ్చిన సాధారణ విషయాలుగా కొట్టిపారేస్తాం. కానీ వీటన్నింటి వెనుక మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం లోపం ఉండొచ్చు. అదే మెగ్నీషియం. మన ఆరోగ్యానికి విటమిన్లు ఎంత అవసరమో, ఖనిజాలు కూడా అంతే అవసరం. వాటిలో మెగ్నీషియం పాత్ర ఎంతో కీలకమైనది. శరీరంలోని కండరాలు, నరాలు, ఎముకలు, గుండె సరిగ్గా పనిచేయడానికి ఇది తోడ్పడుతుంది. మన శరీరంలో శక్తి తయారవ్వాలన్నా, రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలన్నా, రక్తపోటు సమతుల్యంగా ఉండాలన్నా మెగ్నీషియం ఎంతో అవసరం. సాధారణంగా పెద్దవారికి రోజుకు సుమారు 310 నుంచి 420 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం అవసరం అవుతుందని వైద్య నివేదికలు చెబుతున్నాయి. ఇంత తక్కువ మోతాదులో అవసరమయ్యే ఈ పోషకం శరీరానికి సరిపడా అందకపోతే, చాలామందిలో మెల్లమెల్లగా లోపం తలెత్తుతుంది. మెగ్నీషియం లోపం ఎక్కువ కాలం కొనసాగితే శరీరంలో రకరకాల ఇబ్బందులు మొదలవుతాయి. కండరాలు బిగుసుకుపోవడం, పట్టేయడం, కొందరిలో వణుకు రావడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శరీరంలో నీరసం, బలహీనత, అలసట ఎక్కువగా అనిపించడం కూడా దీని వల్ల జరగవచ్చు. కండరాలు సాధారణంగా పనిచేయడానికి, వాటికి విశ్రాంతి కలగడానికి మెగ్నీషియం సహాయపడుతుంది. అందుకే దీని లోపం ఉన్నప్పుడు కండరాలకు సంబంధించిన సమస్యలు త్వరగా బయటపడతాయి. నరాల పనితీరు సక్రమంగా సాగడానికి, శరీరంలో శక్తి ఉత్పత్తి జరగడానికి కూడా మెగ్నీషియం అవసరం. ఇది తగ్గిపోయినప్పుడు కొందరిలో మనసు ప్రశాంతంగా లేకపోవడం, చిరాకు, చికాకు కలగడం వంటివి కనిపిస్తాయి. దీని ప్రభావం నిద్ర మీద కూడా పడుతుంది. రాత్రి పూట సుఖంగా నిద్ర పట్టకపోవడం లేదా నిద్రలో అంతరాయాలు కలగడం వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది కూడా చదవండి  బూడిద గుమ్మడి రసంతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా.! గుండె ఆరోగ్యంపై మెగ్నీషియం లోపం తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. గుండె కొట్టుకునే వేగం సాధారణంగా ఉండటానికి, రక్తపోటు అదుపులో ఉండటానికి ఈ ఖనిజం తోడ్పడుతుంది. మెగ్నీషియం లోపం తీవ్రంగా ఉన్నవారిలో గుండె స్పందనల్లో తేడాలు రావడం, రక్తపోటుపై ప్రభావం పడటం, అలాగే శరీరంలోని ఇతర ఖనిజాల సమతుల్యత దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. మెగ్నీషియం లోపాన్ని ఎలా భర్తీ చేసుకోవాలి.. రోజువారీ ఆహారంలో చిన్నచిన్న మార్పులు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.  ఇంట్లో దొరికే అనేక ఆహార పదార్థాల్లో మెగ్నీషియం బాగానే ఉంటుంది. బాదం, జీడిపప్పు, గుమ్మడి గింజలు, తృణధాన్యాలు, ఆకుకూరలు, పప్పుధాన్యాలు వీటిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల మెగ్నీషియం అందుతుంది. ఒకవేళ ఎవరికైనా ఈ లోపం చాలా ఎక్కువగా ఉంటే, వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్లు తీసుకోవాల్సిన అవసరం రావచ్చు. మొత్తానికి చిన్నదిగా కనిపించే ఈ ఖనిజం మన శరీరంలోని ఎన్నో ముఖ్యమైన పనులను నియంత్రిస్తుంది. అలసట, కండరాల నొప్పులు, నిద్రలేమి వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా, సమతుల్య ఆహారం తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా అనిపిస్తే లేదా దీర్ఘకాలంగా వేధిస్తుంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించడం మంచిది.                                                                                                                                                *రూపశ్రీ. మీకు నచ్చవచ్చు  మూత్రంలో ఈ మార్పులు కనిపిస్తే కిడ్నీ సమస్యలు ఉన్నట్టేనట..!                                 కిడ్నీ, లివర్ సమస్యలకు ముందే శరీరం ఇచ్చే సంకేతాలు ఇవే!