LATEST NEWS
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల తలరాతలు మార్చేశాయి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ ప్రభుత్వాధినేత పినరయి విజయన్‌లు మాజీలుగా మిగిలిపోనున్నారు. మరోవైపు అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అస్సాం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిల్లో సిట్టింగ్ స్థానాలను నిలబెట్టుకుంది. అదనంగా పశ్చిమబెంగాల్‌లో ఎన్టీఏ హవా కొనసాగింది. కేరళలో కాంగ్రెస్ భాగస్వామిగా ఉన్న ఎల్‌డీఎఫ్ విజయకేతనం ఎగరవేసింది. తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల ఆధిపత్యానికి విజయ్ సారథ్యంలోని టీవీకే చెక్ పెట్టింది.  పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ..  2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి   ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.  ఇక తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కరుణానిధి తండ్రి కరుణానిధి మరణానంతరం పార్టీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఈ ఎన్నికల్లో డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిదే విజయమని అత్యధిక ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాలు నిజమై, విజయ్ సారథ్యంలోని టీవీకే తమిళనాట డీఎంకే, అన్నాడీఎంకేల అధిపత్యాన్ని తుడిచిపెట్టింది.  దాంతో పదేళ్ల తర్వాత డీఎంకేను తిరిగి అధికారంలోకి తెచ్చిన సీఎం స్టాలిన్ మాజీగా మిగిలిపోనున్నారు. కేరళ చరిత్రలో వరుసగా రెండు సార్లు సీఎం బాధ్యతలు నిర్వర్తించిన పినరయి విజయన్‌కు తాజా ఎన్నికల ఫలితాలతో షాక్ తప్పలేదు. ప్రతి ఎన్నికల్లో విలక్షణ తీర్పునిస్తూ ప్రభుత్వాన్ని మార్చేసే కేరళ ఓటర్లు సీపీఐ(ఎం)కు చెందిన విజయన్‌పై నమ్మకంతో వరుసగా రెండో సారి పట్టం కట్టారు.  2016 ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ కూటమి నుంచి గెలిచి మొదటి సారి సీఎం అయి, పూర్తి పదవీ కాలం పూర్తి చేసుకుని, తిరిగి 2021 ఎన్నికల్లో ఎన్నికైన కేరళ మొదటి ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఈ సారి కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి ఎల్‌డీఎఫ్‌ను చిత్తుగా ఓడించింది. ఆ క్రమంలో పినరన్ మాజీ సీఎంల జాబితాలో చేరనున్నారు. ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో అస్సాం, పుదుచ్చేరిల్లో వరుసగా రెండో సారి సీఎం బాధ్యతలు చేపట్టబోతున్న ఎన్డీఏ సీఎంలు  హిమంత బిశ్వ శర్మ, ఎన్.రంగస్వామిలు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా రెండోసారి గెలుపొందడం విశేషం.
తమిళనాడు రాజకీయాల్లో  నటుడు విజయ్ పార్టీ  తమిళగ వెట్రి కజగం  (టీవీకే) విజయం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఇటీవలే తెలంగాణలో సొంత పార్టీ టీఆర్ఎస్ ను ఏర్పాటు చేసిన కల్వకుంట్ల కవిత విజయం రాజకీయ ప్రభంజనంపై హర్షం వ్యక్తం చేశారు.  ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు. భ్రష్టుపట్టిపోయిన   రాజకీయ చరిత్రను తిరగ రాయడానికి కొత్త రాజకీయ శక్తులు అవసరమని తమిళ ప్రజలు తమ తీర్పు ద్వారా నిరూపించారని  ఎక్స్ వేదికగా పేర్కొన్న కవిత.. 
సంకోచాలు, సవాళ్లు, వ్యక్తిగత వివాదాలు ఇవేవీ విజయ్ ను నిలువరించలేకపోయాయి.   తమిళనాట  దళపతి రాజకీయ ప్రభంజనం సృష్టించారు. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ అనూహ్య విజయాన్ని అందుకోవడంతో  తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది.  తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ సినీ గ్లామర్‌తో పెనవేసుకుపోయి ఉంటాయి. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి హేమాహేమీల తర్వాత ఆ స్థాయిలో జనాకర్షణ ఉన్న నాయకుడు ఎవరనే ప్రశ్నకు విజయ్ సమాధానంగా నిలిచారు. తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది.  ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు. భార్యతో విడాకుల ప్రచారాలు, నటి త్రిషాతో ముడిపెట్టి చేసిన విమర్శలు ఓటర్లను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భాష్యాలు చెప్పారు. కానీ..  తమిళ ఓటర్లు వ్యక్తిగత విషయాల కంటే విజయ్ ఆశయాలకే పెద్దపీట వేశారు.  ప్రచార పర్వంలో జరిగిన ఒక బహిరంగ సభలో తొక్కిసలాట జరిగి పదుల సంఖ్యలో మరణాలు సంభవించడం పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. చివరికి సరైన అనుమతులు లేకపోవడంతో విజయ్ మలేషియాకు వెళ్లి అక్కడి నుండే డిజిటల్ ప్రచారం నిర్వహించాల్సి వచ్చింది. అయినప్పటికీ, ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలా తన పోరాటాన్ని కొనసాగించారు. జాతీయ స్థాయి విశ్లేషకులు టీవీకే పార్టీకి స్వల్ప స్థానాలే దక్కుతాయని అంచనా వేశారు. ఎగ్జిట్ పోల్స్ కూడా అదే తేల్చాయి. కానీ.. ఫలితాలు మాత్రం యావత్తు భారతదేశాన్ని ఆశ్చర్యపరిచాయి. ఏకంగా 100కి పైగా స్థానాల్లో విజయం సాధించి..  ముఖ్యమంత్రి కుర్చీని దక్కించుకునే  మ్యాజిక్ ఫిగర్ కు అతి చేరువకు చేరుకున్నారు.   దశాబ్దాలుగా కొనసాగుతున్న డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి సాంప్రదాయ పార్టీల ఆధిపత్యానికి ఆయన బ్రేక్ వేశారు.  విజయ్ సాధించిన ఈ విజయం కేవలం ఆయన సినిమా ఇమేజ్ వల్ల వచ్చింది కాదు. ప్రజల్లో ఆయనపై ఉన్నఅపార విశ్వాసానికి  నిదర్శనం. ఎంజీఆర్, జయలలిత వంటి చారిత్రాత్మక నాయకుల వారసత్వాన్ని విజయ్ నిలబెడతారని ప్రజలు విశ్వసిస్తున్నారు. అవినీతి రహిత, ప్రజాహిత పాలనను ఆయన అందిస్తారని సామాన్యులు ఆశిస్తున్నారు.  ఇక దళపతి ‘విజయ్ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముహూర్తం ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారు. 
తమిళనాడు రాజకీయాలను  దశాబ్దాలుగా ఆ రాష్ట్రాన్ని శాసిస్తున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి  టీవీకే అధినేత,  దళపతి,  విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) గండి కొట్టింది. రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయపరిచే అద్భుత విజయాన్ని అందుకుంది.  తొలి ప్రయత్నంలోనే అగ్ర శ్రేణి పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి పార్టీలను వెనక్కి నెట్టి విజయ్ ప్రభంజనం సృష్టించడం   దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే.. సందట్లో సడేమియా అన్నట్లు విజయ విజయంలో తమకు కూడా భాగం ఉందంటూ వైసీపీ ఆ క్రెడిట్ ను చోరీ చేయడానికి (తమ ఖాతాలో వేసుకోవడానికి) ఆరాటపడుతోంది.  తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ..  వైసీపీ   సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది.  విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.  నిజానికి వైసీపీకి, తమిళనాడు రాజకీయాలకు మధ్య సంబంధం ఇప్పుడొక విచిత్రమైన మలుపు తిరిగింది. గతంలో వైసీపీ నాయకత్వం ప్రస్తుత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించింది. గత ఎన్నికల సమయంలో వైసీపీ సీనియర్ నేత..  మాజీ మంత్రి రోజా స్వయంగా తమిళనాడుకు వెళ్లి డీఎంకే తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. స్టాలిన్ పాలన జగన్ పాలన లాగే అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు రోజా.  డీఎంకే మళ్లీ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని నాడు ఆమె ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుత ఫలితాలతో   సీన్ రివర్స్ అయిందని గ్రహించిన వైసీపీ.. వెంటనే ప్లేటు ఫిరాయించింది.  నిన్నటి వరకు స్టాలిన్ జపం చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు అకస్మాత్తుగా విజయ్ భజన మొదలెట్టేశాయి. ఈ క్రెడిట్ పాలిటిక్స్ పై నెటిజనులు వైసీపీని తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో సొంత ప్రాబల్యాన్ని కోల్పోయి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని స్థితిలో ఉన్న వైసీపీ..  పొరుగు రాష్ట్రంలో ఒక కొత్త పార్టీ సాధించిన విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేస్తున్నారు. విజయ్ తన వ్యక్తిగత కరిష్మా, సుదీర్ఘ కాలంగా చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఈ స్థాయికి చేరుకున్నారని పేర్కొంటూ.. విజయం విజయంలో వైసీపీకి ఆవగింజలో పావువంతు కూడా సంబంధం లేదని ఏకిపారేస్తున్నారు.   మరోవైపు, విజయ్ అభిమానులు కూడా ఈ పరిణామాలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణాన్ని అత్యంత స్వతంత్రంగా, ఎవరి అండ లేకుండా ప్రారంభించారని..  ఈ విజయం పూర్తిగా ఆయన కష్టార్జితమనీ, ఈ విజయం క్రెడిట్ లో ఎవరికీ భాగం లేదనీ విస్పష్టంగా చెబుతున్నారు.   ఏది ఏమైనా, పొరుగు రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో కూడా తమ ఉనికిని చాటుకోవాలని వైసీపీ పడుతున్న తాపత్రేయం నవ్వులపాలౌతోంది.  
తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. గత కొన్నాళ్లుగా తిరుగులేని శక్తిగా కనిపించిన ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే   కూటమి ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య పరాజయాన్ని మూటగట్టుకుంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ, ప్రజలు మార్పు కోరుకుంటూ ఇచ్చిన తీర్పు  దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న స్టాలిన్ స్పీడుకు ఓటర్లు బ్రేకులు వేయడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో  విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది.   ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్టాలిన్ ప్రభుత్వం అమలు చేసిన కొన్ని పథకాలు ప్రజల్లోకి వెళ్లినప్పటికీ, శాంతి భద్రతల సమస్య,  అవినీతి ఆరోపణలు పాలక పక్షాన్ని చావుదెబ్బ తీశాయి. ఫలితాల సరళిని గమనిస్తే, యువత,  మహిళా ఓటర్లు ఈసారి భిన్నమైన తీర్పునిచ్చినట్లు స్పష్టమవుతోంది.    స్టాలిన్ హయాంలో తమిళనాడు ప్రగతి సాధారణమైనది కాదు. ముఖ్యంగా పారిశ్రామిక వృద్ధి విషయంలో స్టాలిన్ గణనీయమైన పురోగతి సాధించారు.   ఆయన హయాంలో సుమారు  రాష్ట్రం 9% జీడీపీతో   భారతదేశంలోనే రెండవ  స్థానంలో నిలిచింది. ఇక తమిళనాడులో ఐటీ రంగం, అలాగే ఆటోమొబైల్ తయారీ పరిశ్రమల విషయంలో కూడా గణనీయమైన అభివృద్ధి నమోదైంది. అయినప్పటికీ..  ఇవేవీ డీఎంకే పరాజయాన్ని నిలువరించలేకపోయాయి.    రాజకీయ వ్యూహకర్తలు అంచనా వేసిన దానికంటే భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఉన్నాయని ఈ ఫలితాలు నిరూపించాయి. స్టాలిన్ తన పరిపాలనలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయి కార్యకర్తల మధ్య ఉన్న విభేదాలు పార్టీకి నష్టం చేకూర్చాయి.  నిత్యావసర ధరల పెరుగుదల మరియు నిరుద్యోగ సమస్య కూడా డీఎంకే ఓటమిలో కీలక పాత్ర పోషించాయని తెలుస్తోంది. స్టాలిన్ వ్యక్తిగత ఇమేజ్ బాగున్నప్పటికీ, పార్టీలోని ఇతర నేతల వైఖరి పట్ల ప్రజల్లో అసహనం వ్యక్తమైంది. ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికలో జరిగిన పొరపాట్లు భారీ మూల్యాన్ని చెల్లించుకునేలా చేశాయి. గెలుపుపై ధీమాతో ఉన్న డీఎంకే శ్రేణులకు ఈ ఫలితాలు కోలుకోలేని దెబ్బ అని చెప్పవచ్చు.   గత ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన స్టాలిన్, ఈ ఐదేళ్ల కాలంలో తన పట్టును నిరూపించుకోవడానికి ప్రయత్నించారు. అయితే, వారసత్వ రాజకీయాలనే విమర్శలు, కుటుంబ సభ్యుల జోక్యం పెరిగిందనే ఆరోపణలు కూడా ఆయనపై ప్రతికూల ప్రభావం చూపాయి. తమిళ ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీకి వరుసగా అధికారాన్ని ఇవ్వరనే సాంప్రదాయాన్ని మరోసారి నిలబెట్టుకున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటిన చరణ్, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన దర్శకత్వంలో రాబోతున్న 'పెద్ది' చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ విషయంలో రామ్ చరణ్ అభిమానులు తాజాగా సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాను గ్లోబల్ స్థాయిలో ప్రమోట్ చేయాలని, మార్కెటింగ్ విషయంలో స్పీడ్ పెంచాలని మేకర్స్‌ను డిమాండ్ చేస్తున్నారు. రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక ఎమోషనల్ డ్రామా అని తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుని, షూటింగ్ దిశగా అడుగులు వేస్తోంది. అయితే, ఇతర అగ్ర హీరోల సినిమాలతో పోలిస్తే 'పెద్ది' ప్రమోషన్స్ చాలా నెమ్మదిగా ఉన్నాయని అభిమానులు భావిస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో రామ్ చరణ్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని, చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పెద్ద ఎత్తున పబ్లిసిటీ ప్లాన్ చేయాలని వారు కోరుతున్నారు. ట్విట్టర్ (X) లో #PeddiMarketingBoost మరియు #GlobalPromotionForRC16 వంటి హ్యాష్ ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. అభిమానుల వాదన ప్రకారం, కేవలం తెలుగు లేదా సౌత్ ఇండియాకు మాత్రమే పరిమితం కాకుండా, ఈ సినిమాను పాన్-వరల్డ్ స్థాయిలో ప్రొజెక్ట్ చేయాలి. 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ మార్కెట్ వాల్యూ విపరీతంగా పెరిగింది, కాబట్టి ప్రచార చిత్రాలు, అప్‌డేట్స్ మరియు గ్లోబల్ ఈవెంట్స్ విషయంలో నిర్మాతలు మరింత చురుగ్గా వ్యవహరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. సినిమా విజయంలో కంటెంట్ ఎంత ముఖ్యమో, దాన్ని ప్రేక్షకులకు చేరవేయడంలో ప్రమోషన్స్ కూడా అంతే కీలకం. రామ్ చరణ్ వంటి గ్లోబల్ స్టార్ సినిమాకు ప్రాపర్ మార్కెటింగ్ స్ట్రాటజీ అవసరమని చెప్పడంలో సందేహం లేదు. అభిమానుల ఈ ఆవేదనను గమనించి చిత్ర యూనిట్ రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రమోషనల్ ప్లాన్స్‌తో ముందుకు వస్తుందో చూడాలి. 'పెద్ది' ప్రమోషన్స్ గనుక ఊపందుకుంటే, మెగా ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపు అవ్వడం ఖాయం.
  అగ్ర హీరో విజయ్(VIjay)తమిళనాట తన టివికే పార్టీతో విజయ దుందుభి మోగించాడు. సింగిల్ గా మెజారిటీ రాకపోయినా కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని స్టార్ట్ చేస్తామని విజయ్ తండ్రి ప్రముఖ దర్శకుడు చంద్రశేఖర్ చెప్పుకొస్తున్నారు. నిజానికి విజయ్ పార్టీ ప్రాంభించిన దగ్గరనుంచి ఈ రోజు ఉదయం ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు విజయ్ విజయం సాధిస్తాడని ఎవరు ఊహించలేదు. కానీ తమిళ ప్రజలు విజయ్ కి పట్టం కట్టారు. ఇందుకు ప్రధాన కారణాలు ఇవే అనే చర్చ సోషల్ మీడియా వ్యాప్తంగా జరుగుతుంది. మరి ఆ వివరాలు చూద్దాం. సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)పొలిటికల్ పార్టీ స్థాపిస్తానని అనౌన్స్ చేసాడు. కానీ వయసు సహకరించదేమో అనే కారణం చెప్పి తప్పుకున్నాడు. కానీ ఆ ప్రకటనపై చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కొంత మంది ఓటర్లు సినిమాల నుంచి వచ్చే నాయకుడు తమ రాతని మారుస్తాడనే నమ్మకంతో ఉన్నారు.తమిళులకి సినిమా అన్నా, హీరోలు అన్నా అంత పిచ్చి. కానీ రజినీ వెనక్కి వెళ్లి విజయ్ రావడంతో వాళ్లంతా విజయ్ వైపు చూసారు. చూడమంటే కాదు రియల్ హీరో అని కూడా ఫిక్స్ అయిపోయారు. అలాగే విజయ్ గురించి ప్రకాష్ రాజ్ మాట్లాడుతు హీరో నచ్చితే సినిమా చూడచ్చు గాని ఓట్లు వేస్తామా అనే మాటలు మాట్లాడాడు. దీంతో విజయ్ ఫ్యాన్స్ తో పాటు యువత, ఒక వర్గం ప్రజలు విజయ్ కి ఓట్లు గుద్దడంలో రాజీ పడకూడదని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే  తమిళ రాజకీయాన్ని నడిపిస్తుందే సినిమా వాళ్ళు. ముఖ్యమంత్రిగా చేసుకుంటూ వస్తుందే సినిమా వాళ్ళని. ఈ చిన్న విషయాన్నీ ప్రకాష్ రాజ్ మర్చిపోయాడు. పైగా ప్రకాష్ రాజ్(Prakash Raj)పక్కా కన్నడ వ్యక్తి.. తమిళనాడు వ్యక్తికి తమిళ మీద ఉండే ప్రాంత, భాష పిచ్చి ప్రపంచంలో మరో ప్రాంతానికి ఉండవు.  ఎంత పిచ్చి అంటే తమిళ వ్యక్తి, ప్రాంతం తప్ప కులం, మతం పని చెయ్యవు. అందుకే మా తమిళుడుపై నువ్వెంటి మాట్లాడేది, సినిమా అంటే మాకు ఎంత  పిచ్చో తెలియదా అని ఓట్లు కుమ్మి పడేసారు. మరి వైపు డిఏంకే లో స్టాలిన్ తర్వాత తన కొడుకు ప్రముఖ హీరో ఉదయనిధి స్టాలిన్ మాత్రమే కనపడటం, మళ్ళీ స్టాలిన్ సిఏం అయితే ఉదయనిధిని సిఏం చేస్తాడనే న్యూస్ బాగా స్ప్రెడ్ కావడంతో ఒక వర్గం ప్రజలు ఛత్రపతి లోకి ప్రభాస్ డైలాగ్ 'వాడు పోతే వీడు, వీడు పోతే వీడమ్మా మొగుడు నా అని భావించి  విజయ్ కి కుమ్మి పడేసారు. also read: Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్  ముఖ్యంగా తమిళనాట కంటిన్యూగా రెండు సార్లు ఒకే రాజకీయ పార్టీ అధికారంలో ఉన్న సందర్భాలు చాలా చాలా తక్కువ. ప్రభుత్వ వ్యతిరేకత చాలా హై లెవల్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. మరో ప్రతిపక్ష పార్టీ అన్నాడిఎంకే పరిస్థితి గందర గోళం. డి ఏంకే కంటే ముందు అన్నాడిఎంకే అధికారంలో ఉంటే ఏం జరిగిందో చూసారు. పైగా ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ లో అందరి కంటే విజయ్ కి పేస్ వాల్యూ ఎక్కువ. దీంతో విజయ్ కి సపోర్ట్ చేసే వారి సంఖ్య పెరిగింది. అన్నిటికంటే ప్రధానంగా  తమిళనాట రాజకీయ పరంగా ఒక కొత్త శక్తికి స్పేస్ చాలా ఉంది.  ఈ స్పేస్ ఉన్నపుడు ఇమిడియెట్ గా ఓటరు చంక ఎక్కాలి.  ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అనే సామెత విజయ్ కి అర్ధమయ్యే ఓటరు చంక ఎక్కాడు. పైగా ఒట్టిగా ఎక్కలేదు. అదిరిపోయే మేనిఫెస్టోతో. నూతన వధువుకి 8 గ్రాముల బంగారం, ఖరీదైన చీర, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీతో  అందుకే  ఆశీర్వదించారానే చర్చలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.   
    కొన్ని సార్లు రావడం లేటు అవ్వచ్చేమో గాని రావడం మాత్రం పక్కా అనే రీతిలో ఈ రోజు టాలీవుడ్ ట్రెండింగ్ లో ఉన్న వార్తలు  సరికొత్తగా ముస్తాబై వచ్చాయి. మరి ఆ తాజా న్యూస్ ఏంటో చూసేద్దాం    1 . చంద్రబోస్ ఇంట్లో విషాదం గీత ర‌చ‌యిత చంద్రబోస్ ఇంట్లో  విషాదం నెల‌కొంది. ఆయ‌న సోద‌రుడు రాజేంద్ర ఎపిలోని క‌లిగిరిలో గుండెపోటుతో మ‌ర‌ణించారు. ఆదివారం ఉదయం స్వల్ప అస్వస్థతకి గురవ్వడంతో  సమీపంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స  కూడా తీసుకోవడం జరిగింది. అనంతరం సమీపంలోని హోటల్‌లో టిఫిన్ చేస్తుండగా ఒక్కసారిగా తీవ్రమైన గుండెపోటు రావడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి, కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. రాజేంద్ర మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు చంద్రబోస్‌కు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు. 2 .  త‌న సినిమాకి త‌నే డైరెక్ట‌ర్‌.. రామ్ కొత్త నిర్ణ‌యం! ఎన‌ర్జిటిక్ స్టార్‌గా యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ పోతినేనికి గ‌త కొంత‌కాలంగా స‌క్సెస్ అనేది లేకుండా పోయింది. దీంతో త‌న‌కు స‌రిపోయే క‌థ‌ను త‌నే సిద్ధం చేసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. త‌ను రెడీ చేసిన క‌థ‌తో మ‌రో ద‌ర్శ‌కుడితో సినిమా చెయ్యాల‌ని మొద‌ట అనుకున్న‌ప్ప‌టికీ త‌న విజ‌న్‌ని దృష్టిలో పెట్టుకొని త‌నే మెగా ఫోన్ ప‌ట్టుకోవాల‌ని డిసైడ్ అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమా త‌మ సొంత బేన‌ర్ అయిన స్ర‌వంతి మూవీస్‌లోనే చేయ‌బోతున్నార‌ని స‌మాచారం. మ‌రి డైరెక్ట‌ర్‌గా రామ్ స‌క్సెస్ అయి హీరోగా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. 3 .  వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్  వాటర్ బోర్డు! మ‌హేష్‌, రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న భారీ చిత్రం వార‌ణాసి చిత్రం కోసం గ‌గ‌న్ ప‌హాడ్ ఏరియాలో వేసిన సెట్‌లో మే 18 నుంచి నీటి అడుగున కొన్ని కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ప్లాన్ చేశారు. ఆ సన్నివేశాలకి శుద్ధి చేసే నీరు చాలా అవసరం అవుతుంది. సుమారు పదివేల లీటర్ల కావాలనేది అంచనా. దీంతో పదివేల లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని టీం హైదరాబాద్ వాటర్ బోర్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ  నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు నీటి కొరత కూడా ఉండటంతో వాటర్ బోర్డు వారణాసి టీం రిక్వెస్ట్ ని రద్దు చేసినట్టుగా సమాచారం. మరి ఊహించని ఈ సంఘటనతో షూట్ ని పోస్ట్ పోన్ చేస్తారా లేక వేరే మార్గాలతో స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి. 4 .  వామ్మో మ‌రీ అంత రేటా.. వ‌ర్క‌వుట్ అవుతుందా?  సూపర్ స్టార్ రజినీకాంత్ హిట్ మూవీ జైల‌ర్ కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న  జైలర్‌ 2 పై  తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పంపిణీ హ‌క్కుల కోసం గ‌ట్టి పోటీ నెల‌కొంది. జైల‌ర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల గ్రాస్ సాధించడంతో సీక్వెల్ రైట్స్‌కు 60 కోట్లు ధ‌ర నిర్ణ‌యించారు. అయితే జైలర్ తర్వాత వచ్చిన పరాజయాలతో   అంత రేటుతో సినిమా తీసుకుంటే వ‌ర్క‌వుట్ అవుతుందా అనే చ‌ర్చ‌లు మొద‌ల‌య్యాయి.  5 . జన నాయగన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. కట్స్ లేకుండానే రాబోతోందా! 'అప్పడి పోడు పోడు... అసతి పోడు పోడు కన్నాలే' అనే తన మాస్ సాంగ్  రీతిలోనే  ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ఎలక్షన్స్ లో మెజారిటీ సీట్స్ తో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్  కూడా ఉండటంతో విజయ్ అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. దీంతో సెన్సార్‌లో ఇరుక్కున్న విజ‌య్ లేటెస్ట్ మూవీ జ‌న‌నాయ‌గ‌న్  మ‌రో వారం రోజుల్లోనే థియేట‌ర్స్‌లోకి  రాబోతుందనే  న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొసమెరుపు ఏంటంటే ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండానే రిలీజ్ అవుతుంద‌ట‌.  6 . విజ‌యోత్సాహంలో విజ‌య్‌.. వెల్లువెత్తున్న ప్ర‌శంస‌లు! ఇళయ దళపతి విజయ్  తమిళనాడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ముఖ్యమంత్రిగా అధికార పీఠాన్ని ఎక్క‌బోతున్నార‌న్న వార్తతో  తెలుగు ఇండస్ట్రీలో సంతోష వాతావరణం నెలకొని ఉంది.  రామ్ పోతినేని, సాయి ధరమ్ తేజ్, శర్వానంద్, సందీప్ కిషన్, డాక్టర్ రాజశేఖర్, విజయ్ దేవరకొండతో పాటు మరికొంత మంది సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విజయ్ కి శుభాకాంక్షలు వ్యక్తం చేస్తున్నారు. 7 . నన్ను చంపెయ్యమని కోరానంటున్న సుప్రీత  ప్రముఖ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత మాట్లాడుతూ నేను బరువు తగ్గాలనే ఆరాటంలో ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నాను.పదిహేను గంటలు ఏమి తినకుండా ఉండేదాన్ని.. తినే ఒక్కపూట కూడా బిర్యాని వంటి హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతిన్నది. దీంతో తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉన్నాను. డైలీ పదిహేను సార్లు వాంతులు. వాటర్ తాగినా కూడా సేమ్ సిట్యువేషన్..ఒక దశలో నన్ను చంపేయమని కోరానని చెప్పుకొచ్చింది. 8 . వైరల్ గా మారిన సాయిపల్లవి   తెలుగు ప్రేక్షకుల అభిమాన హీరోయిన్ సాయి పల్లవి హిందీలో ఏక్ దిన్ తో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ హీరోగా చేశాడు. ఇప్పుడు ఈ మూవీ డివైడ్ టాక్ తో దూసుకుపోతుంది..సాయి పల్లవి రామాయణ చేస్తున్న వేళ ఏక్ దిన్ ఫలితం ఆసక్తికరంగా మారింది 9 .  రూటు మార్చిన శ్రీలీల           స్టార్ హీరోలందరితో గ్లామర్ రోల్స్ చేసి తన ప్రత్యేకతని చాటుకున్న శ్రీలీల ఇప్పుడు తన రూట్ మార్చుకుంటున్నంటుగ్ తెలుస్తుంది . ఇకపై నటనకి ప్రాధాన్యత ఉన్న చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ లో చేయాలని ఫిక్స్ అయినట్టుగా సమాచారం. 10 .విశ్వంభర నుంచి త్రిష పిక్  వైరల్  ఎట్టకేలకు విశ్వంభర నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ రోజు త్రిష పుట్టిన రోజు కావడంతో మేకర్స్ త్రిష లుక్ ని రివీల్ చేసారు. అవని గా విశ్వంభరలో చిరుతో సందడి చేయనుంది. దీపపు  కాంతుల  మధ్య  వెలిగిపోతున్న అవని లుక్ ఇప్పుడు  వైరల్ గా మారింది.   
  ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ఎన్నికల్లో విజయదుంధిబితో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్ కూడా ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు.  తాజాగా విజయ్ ఇంటికి త్రిష(Trisha)వెళ్లిన పిక్స్ సోషల్ మీడియాని బ్రేక్ డాన్స్ చేయిస్తున్నాయి. ఎన్నికలకి ముందు త్రిష, విజయ్ మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. స్వయంగా విజయ్ వైఫ్ కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత విజయ్ ఎంతో దైర్యంగా త్రిషని తీసుకొని ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. పైగా ఒకే కలర్ కోడ్ డ్రెస్ తో. దీంతో ప్రత్యర్డులు విజయ్ పని  రాజకీయంగా అవుట్ అనుకున్నారు. కానీ తమిళ ఓటర్లు ఇవేం పట్టించుకోలేదు. విజయ్ ని ముఖ్యమంత్రి పీఠం దగ్గరకి దగ్గరుండి మరి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉన్నారు.  Also read: Vijay: ఈ రోజు త్రిష పుట్టిన రోజు.. ఎన్నికల రిజల్ట్ విజయ్ ఇచ్చిన గిఫ్ట్ అనుకోవచ్చా!     పైగా ఈ రోజు త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో విజయ్ కి త్రిష ఇచ్చిన గిఫ్ట్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్రిష ఈ రోజు ఉదయం తిరుమల తిరుపతి ఏడుకొండలవాడిని దర్శించుకొని డైరెక్ట్ గా విజయ్ ఇంటికి వెళ్లినట్టుగా తెలుస్తుంది.     
  ఏంటప్ప మీ సర్వేలు.. తమిళనాడు(Thamilandu)ని కొట్టబోయేది నేనే అంటూ ఇళయ దళపతి విజయ్(vijay)విజిల్ మోత మోగిస్తున్నాడు. మోత మోగించడమే కాదు మ్యాజిక్  ఫిగర్ కి దగ్గరగా ఉండటంతో సిఎం అవ్వాలని అభిమానులు గుళ్ళల్లో, మసీదుల్లో, చర్చిల్లో ప్రార్థనలు స్టార్ట్ చేసారు. ఈ క్రమంలోనే ఒక క్రేజీ న్యూస్ ఆ అందరి మధ్య చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం  ఎన్నికలకి ముందు త్రిష(Trisha),విజయ్ మధ్య ఇల్లీగల్ రిలేషన్ ఉందని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. స్వయంగా విజయ్ వైఫ్ కూడా ఇదే కారణాన్ని చూపిస్తూ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కింది. ఆ తర్వాత విజయ్ ఎంతో దైర్యంగా త్రిషని తీసుకొని ఒక మ్యారేజ్ ఫంక్షన్ కి హాజరయ్యాడు. పైగా ఒకే కలర్ కోడ్ డ్రెస్ తో. దీంతో ప్రత్యర్డులు విజయ్ పని  రాజకీయంగా అవుట్ అనుకున్నారు. కానీ తమిళ ఓటర్లు ఇవేం పట్టించుకోలేదు. విజయ్ ని ముఖ్యమంత్రి పీఠం దగ్గరకి దగ్గరుండి మరి తీసుకెళ్లే పనిలో బిజీగా ఉన్నారు.  Also read: Jana nayagan: జన నాయగాన్ రిలీజ్ డేట్ వచ్చేసిందా.. పైగా కట్స్ లేకుండానే రాబోతోందా! పైగా ఈ రోజు త్రిష పుట్టిన రోజు కూడా కావడంతో విజయ్ కి త్రిష ఇచ్చిన గిఫ్ట్ అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. త్రిష ప్రస్తుతం తిరుమల తిరుపతి ఏడుకొండలవాడి సన్నిదిలో ఉంది.    
  'అప్పడి పోడు పోడు... అసతి పోడు పోడు కన్నాలే' అనే తన మాస్ సాంగ్  రీతిలోనే  ఇళయ దళపతి విజయ్(Vijay)తమిళనాడు ఎలక్షన్స్ లో మెజారిటీ సీట్స్ తో దూసుకుపోతున్నాడు. సిఎం అయ్యే ఛాన్స్  కూడా ఉండటంతో విజయ్ అభిమానుల ఆనందానికైతే అవధులు లేవు. తమిళనాడు మొత్తాన్ని బాణా సంచాలతో మోత మోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో జన నాయగాన్ మూవీకి సంబంధించిన తాజా న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. జన నాయగాన్ రిలీజ్ కి సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చెయ్యడంతో పొంగల్ కానుకగా రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదాపడిన విషయం తెలిసిందే. మరి ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం గాని అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకునే  కింగ్ మేకర్ గా నిలబడటం ఖాయమని తెలుస్తుంది. దీంతో వారం రోజుల్లోనే జన నాయగన్ థియేటర్స్ లోకి రాబోతుందనే  న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. కొసమెరుపు ఏంటంటే ఎలాంటి సెన్సార్ కట్స్ లేకుండానే రిలీజ్ కాబోతుందనే న్యూస్ కూడా స్ప్రెడ్ అవుతుంది. అధికారం అనేది గాడ్ కంటే పవర్ ఫుల్ అనే విషయం తెలిసిందే. Also read:  Peddi vs jailer 2: వామ్మో మరి అంత రేటా.. వర్క్ అవుట్ అవుతుందా!  
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth)కి ఉన్న స్టార్ డమ్ ఇంచు కూడా తగ్గలేదంటూ నిరూపించిన చిత్రం జైలర్(Jailer). రజినీ వరుస పరాజయాలకి కూడా భారీ సైజులోనే గుమ్మడి కాయ కొట్టింది. అలాంటి ఈ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన జైలర్ 2 పై అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు. తెలుగునాట కూడా అదే క్రేజ్. ఇప్పుడు తెలుగు బిజినెస్ కి సంబంధించిన ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాకి నూతనోత్సాహాన్ని తీసుకొస్తుంది. ఆ న్యూస్ ఏంటో చూద్దాం. రజినీ కాంత్ సినిమాలకి తెలుగులో మంచి మార్కెట్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల డబ్బింగ్ మరియు పంపిణీ హక్కుల కోసం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ మధ్య గట్టి పోటీ నెలకొంది. మేకర్స్ జైలర్  సీక్వెల్ తెలుగు  హక్కులని 60 కోట్లుగా నిర్ణయించారు. పార్ట్ 1  రెండు తెలుగు రాష్ట్రాల్లో 70 కోట్ల గ్రాస్ సాధించడంతోనే 60 కోట్లుగా నిర్ణయించారు. కానీ ఇక్కడ ఆసక్తికర విషయం ఏంటంటే జైలర్ తర్వాత వచ్చిన రజినీ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. కూలీ తెలుగు రైట్స్ మాత్రం  52 కోట్లకి అమ్మగా సుమారు 50 కోట్ల కలెక్షన్స్ దగ్గరే ఆగింది.  also read: Janhvi Kapoor: అచ్చాయమ్మా ఇచ్చిపడేసింది.. వ్యూస్ కోసం అలాంటివి రాస్తారా మరి ఇప్పుడు జైలర్ 2 తెలుగు హక్కులని 60 కోట్లకి తీసుకుంటే అంత వసూలు చేస్తుందా అనే చర్చలు మొదలైనట్టుగా టాక్ . పైగా  జూన్ 12 న థియేటర్స్ లోకి వచ్చే వారం ముందే చరణ్ జూన్ 4 న 'పెద్ది'తో వస్తున్నాడు. మరి పెద్దికి హిట్ టాక్ వస్తే జైలర్ 2 కి థియేటర్స్ దొరుకుతాయా అనే చర్చ కూడా మొదలైంది. సన్ పిక్చర్స్ పై కళానిధి మారన్ నిర్మిస్తుండగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకుడు అనే విషయం తెలిసిందే.   
  అతిలోక సుందరి తనయ జాన్వీకపూర్(Janhvi kapoor)జూన్ 4 న అచ్చాయమ్మాగా 'పెద్ది'(Peddi)ని ఎన్ని ముప్ప తిప్పలకి గురి చేసిందో తెలియబోతుంది. అభిమానులు అయితే పెద్దితో జాన్వీ అగ్ర హీరోయిన్ గా ఎదగడం పక్కా అనే నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా కొన్ని రోజుల క్రితం జాన్వీ కపూర్ మాట్లాడుతూ జీవితంలో జరిగిన ఒక బాధాకరమైన సంఘటన తర్వాత ఆల్కహాల్ కి బానిస అయ్యానని చెప్పిందనే మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పుడు ఈ విషయంపై జాన్వీ స్పందించింది. ఆ మాటలేంటో చూద్దాం. మద్యానికి సంబంధించిన వార్తలుని స్క్రీన్ షాట్ తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసి  'ఇలాంటి వార్తలు రాయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా. క్లిక్ బైట్స్ కోసం ఎంతటి అబద్ధాలనైనా ప్రచారం చేస్తారా. నేను ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తాను. ఫిట్‌నెస్ విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉంటాను. కేవలం వ్యూస్ కోసం ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరచడం సరైంది కాదు. కనీస వాస్తవాలని తెలుసుకోకుండా ఇలాంటి క్లిక్ బైట్ వార్తలు రాయడం మానుకోవాలని పేర్కొంది. Also Read: Varanasi: వారణాసికి షాక్ ఇచ్చిన హైదరాబాద్ వాటర్ బోర్డు అధికారులు.. రద్దు తప్పదా! సెలబ్రిటీల గురించి వార్తలు రాసేటప్పుడు బాధ్యతాయుతంగా ఉండాలని, కేవలం సంచలనం కోసం అబద్ధాలను ప్రచారం చేయకూడదని నెటిజన్లు కూడా జాన్వీకి మద్దతు తెలుపుతున్నారు.   
  మహేష్, రాజమౌళిలు వారణాసి(Varanasi)షూట్ కి ఇప్పుడు కొంచం గ్యాప్ ఇచ్చినా తిరిగి ఈ నెల 18 నుంచి హైదరాబాద్ లో స్టార్ట్ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆ  షూట్ జరిగే అవకాశాలు చాలా  తక్కువగా ఉన్నాయనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మేకర్స్ ఈ నెల 18 న హైదరాబాద్ గగన్ పహాడ్ ఏరియాలో వేసిన సెట్ లో నీటి అడుగున సన్నివేశాలు తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సదరు సన్నివేశాలకి శుద్ధి చేసే నీరు చాలా అవసరం అవుతుంది. సుమారు పదివేల లీటర్ల కావాలనేది అంచనా. దీంతో పదివేల లీటర్ల కెపాసిటీ ఉన్న 150 ట్యాంకర్ల నీరు కావాలని టీం హైదరాబాద్ వాటర్ బోర్డుకి దరఖాస్తు చేసుకుంది. కానీ  నగరంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాటు నీటి కొరత కూడా ఉండటంతో వాటర్ బోర్డు వారణాసి టీం రిక్వెస్ట్ ని రద్దు చేసినట్టుగా సమాచారం. మరి ఊహించని ఈ సంఘటనతో షూట్ ని పోస్ట్ పోన్ చేస్తారా లేక వేరే మార్గాలతో స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి. also read: Vijay: సినిమాకి ఉన్న పవర్ చూపిస్తూ 100 స్థానాల్లో విజయ్.. తిరుమల కొండపై త్రిష  మహేష్ అయితే ప్రెజెంట్ జర్మనీలోని అడవుల్లో వారణాసి కోసమే ట్రెక్కింగ్ కి వెళ్ళాడు. మరో రెండు రోజుల్లో అక్కడనుంచి రానున్నట్టుగా సమాచారం. ఇప్పటికే  కొంత భాగం షూటింగ్ ని పూర్తి చేసుకున్న వారణాసి వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే      
సినిమా అనే మూడు అక్షరాల వర్డ్ కి ఉన్న కెపాసిటీని తెలియచేస్తు ఇళయ దళపతి విజయ్ తమిళనాడు ఎన్నికల్లో తన పేరుకి తగ్గట్టుగానే విజయ పరపంపరని కొనసాగిస్తున్నాడు. సుమారు 100 స్థానాల్లో తన సత్తా  చాటుతు ఎగ్జిట్ పోల్స్ చెప్పిన లెక్కలన్నీ తారుమారు అని పాలిటిక్స్ లో కూడా హీరోనే అంటూ సింగిల్ సింహం అని ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాడు  ఇక విజయ్ ఎన్నికల్లో దూసుకుపోతుండటంతో త్రిష తిరుమల తిరుపతి ఏడుకొండల వాడి దర్శనం చేసుకోవడానికి వెళ్ళింది. విజయ్ సిఎంగా గెలిచాకే తిరుపతి నుంచి త్రిష బయలు దేరుతుందని సమాచారం. ఇక విజయ్ ముందంజలో ఉండటంతో అభిమానులతో పాటు సినీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. మరి విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అందుకుంటాడేమో చూడాలి. Also read:  Chandrabose: చంద్రబోస్ ఇంట్లో విషాదం.. ప్రముఖుల నివాళి   
భారతీయుల ఇళ్లలో చాలా వరకు కరివేపాకు మొక్క పెంచుతూ ఉంటారు. ఇంటి బయట ఏ మాత్రం కాస్త స్థలం ఉన్నా సరే.. మొదటగా కరివేపాకు మొక్కనే పెంచుతూ ఉంటారు. కరివేపాకు మొక్క ఎదుగుదలకు కూడా భారతీయ వాతావరణం చాలా చక్కగా సహకరిస్తుంది. అయితే వేసవి కాలం మాత్రం కరివేపాకు మొక్కలకు కష్టకాలం అని చెప్పవచ్చు. వేసవిలో ఉండే తీవ్రమైన ఎండ కారణంగా కరివేపాకు మొక్క బాగా వాడిపోవడం,  ఎదుగుదల మందగించడం జరుగుతుంది.  అయితే మొక్క తిరిగి తాజాగా మారాలన్నా,  ఆరోగ్యంగా పెరగాలన్నా కేవలం నీరు పోస్తే సరిపోదు. ఇందుకోసం ఇంట్లోనే ఉండే ఒక పానీయం చక్కగా సహాయపడుతుంది.   అదేంటో తెలుసుకుంటే.. మజ్జిగ.. భారతీయుల చాలా ఇళ్లలో కరివేపాకు మొక్క ఉన్నట్టే.. వేసవి కాలంలో ప్రతి ఇంట్లో పెరుగు, మజ్జిగ ఖచ్చితంగా ఉంటుంది.  కలివేపాకు మొక్కకు మజ్జిగను ఉపయోగించడం వల్ల వాడిన మొక్క తిరిగి తాజాగా మారడమే కాకుండా మొక్క ఆరోగ్యంగా కూడా పెరుగుతుంది. మజ్జిగ ఎందుకు సహాయపడుతుంది? కరివేపాకు మొక్కల పెరుగుదలకు ఆమ్ల నేల అవసరం. మజ్జిగలో ఆమ్లం ఉంటుంది. కరివేపాకు మొక్క పాదులో  మజ్జిగను పోసినప్పుడు నేల  pH స్థాయి సమతుల్యంగా ఉంటుంది, ఇది మొక్క నేల నుండి పోషకాలను గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. నత్రజని ఇస్తుంది.. కరివేపాకు పచ్చగా, దట్టంగా ఉండటానికి నత్రజని చాలా అవసరం. మజ్జిగలో కూడా నత్రజని ఉంటుంది, ఇది మొక్కల పెరుగుదలకు ఎంతో మేలు చేస్తుంది. మజ్జిగలోని పోషకాలు ఆకులను మరింత ముదురుగా, పచ్చగా మారడానికి సహాయపడతాయి. మజ్జిగను వాడటం కొత్త చిగుళ్ల పెరుగుదలను ప్రేరేపిస్తుంది. కీటకాల నుండి రక్షణ.. కరివేపాకు మొక్కలకు తరచుగా తెల్లటి బూజు లేదా కీటకాలు పడతాయి. మజ్జిగ ఒక సహజ శిలీంధ్రనాశకం. దానిలో ఉండే లాక్టిక్ ఆమ్లం ఈ బ్యాక్టీరియా , శిలీంధ్రాలను చంపి, మొక్క పెరగడానికి సహాయపడుతుంది. పోషకాలు.. మజ్జిగలో కాల్షియం మాత్రమే కాకుండా ఫాస్ఫరస్ , ప్రోబయోటిక్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఈ బ్యాక్టీరియా నేలను సారవంతం చేస్తుంది. కరివేపాకు మొక్కలు బాగా ఏపుగా పెరగడానికి  మజ్జిగను ఉపయోగించవచ్చు.                               *రూపశ్రీ.
వేసవి కాలం వచ్చిందంటే ప్రతి ఇంట్లో కూలర్ల దుమ్ము దులిపి వాడటానికి సిద్దం చేస్తుంటారు.  అయితే చాలా మంది ఇబ్బంది పడే సమస్య కూలర్ నుండి దుర్వాసన రావడం.  కూలర్ ను శుభ్రం చేసి వాడటానికి సిద్దం చేసినా సరే.. కూలర్ ఉపయోగించేటప్పుడు కూలర్ లో నీరు చేపల వాసన వస్తూ ఉంటుంది. కొందరు కూలర్ నుండి వాసన వస్తూ ఉందనే కారణంతో దాన్ని ఆఫ్ చేస్తారు. అయితే కూలర్ ను వాడకుండా ఉండటం పరిష్కారం కాదు.  కూలర్ ట్యాంక్ లోని పాత నీరు,  నాచు, తేమ కారణంగా కూలర్ లో చేపల వాసన లాగా వస్తూ ఉంటుంది. ఈ సమస్యకు చాలా సులువుగా చెక్ పెట్టవచ్చు.  అందుకోసం అనుసరించాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కూలర్ నుండి చేపల వాసన ఎందుకు వస్తుంది? కూలర్‌లో చేపల వాసన రావడానికి అత్యంత సాధారణ కారణం ట్యాంక్‌లో పేరుకుపోయిన బయోఫిల్మ్ , బ్యాక్టీరియా. ట్యాంక్‌లో నీరు ఎక్కువ సేపు నిలిచి ఉన్నప్పుడు, సూక్ష్మజీవులు వృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. నిలిచిపోయిన నీరు బయోఫిల్మ్‌ను ఏర్పరుస్తుంది, ఇది వాసనకు కారణమవుతుంది.  అది మాత్రమే కాకుండా కూలర్‌లోని మురికి, దుమ్ము , తేమ కూడా ఈ వాసనకు కారణం అవుతాయి. వాసన ఎలా తొలగించాలంటే.. కూలర్ నుండి దుర్వాసనను తొలగించడానికి  వైట్  వెనిగర్‌ను ఉపయోగించవచ్చు. వైట్  వెనిగర్‌ను ఉపయోగించడం వల్ల కూలర్ నీటి నుండి వచ్చే చేపల వాసనను తొలగిపోతుంది. ఒకవేళ వైట్ వెనిగర్ లేకపోతే దానికి  ప్రత్యామ్నాయంగా బేకింగ్ సోడాను కూడా ఉపయోగించవచ్చు. వెనిగర్ అనేది దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపే ఒక సహజ క్రిమిసంహారకం. మొదటగా  కూలర్ ట్యాంక్‌ను ఖాళీ చేయాలి. ఆ తర్వాత, ట్యాంక్‌లో వెనిగర్ పోసి కాసేపు అలానే ఉంచాలి. తర్వాత, ట్యాంక్‌ను శుభ్రంగా రుద్దాలి. ఆ తర్వాత 2 నుండి 3 టీస్పూన్ల బేకింగ్ సోడా కలపాలి. ట్యాంక్ శుభ్రం చేయాలి. దీని తర్వాత ట్యాంక్‌ను నీటితో నింపాలి. దీనివల్ల కూలర్‌లోని దుర్వాసన పోతుంది. ఎసెంటియల్ ఆయిల్స్.. ట్యాంక్‌ను శుభ్రం చేసిన తర్వాత నీటిని నింపి ఆ  నీటిలో ఎసెంటియల్ ఆయిల్స్  ఉపయోగించవచ్చు. కూలర్ నీటిలో 2 నుండి 3 చుక్కల టీ ట్రీ ఆయిల్ లేదా లెమన్‌గ్రాస్ ఆయిల్ కలపాలి. ఇది కూలర్ నుండి స్వచ్ఛమైన గాలి ప్రవహించడానికి సహాయపడుతుంది. కూలర్‌లోని నీటిని ప్రతి 2 నుండి 3 రోజులకు మార్చితే కూలర్ నుండి దుర్వాసన రాదు. చాలా మంది కూలర్ లో  నీటి మట్టం తగ్గగానే ప్రతిరోజూ నీటిని అయితే నింపుతూ ఉంటారు. కానీ.. పూర్తీగా కూలర్ ట్యాంక్ ను క్లీన్ చేసి కొత్త నీటిని నింపుతూ ఉంటే కూలర్ నుండి వాసన అనేది రాదు.                                 *రూపశ్రీ.
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
  వేసవి అంటే మండే ఎండలు, వేడి గాలులు,  చెమటలు పట్టించే వాతావరణం.. ఇవన్నీ ఉంటాయి.  ఇలాంటి రోజుల్లో  రోడ్డు పక్కన అమ్మే చెరకు రసం తాగితే ఎంతో హాయిగా ఉంటుంది. నిమ్మరసం, నల్ల ఉప్పు, పుదీనా కలపడం వల్ల చెరకు రసం  రుచి మరింత ఇనుమడిస్తుంది.  పైగా మార్కెట్ లో అమ్మే కూల్ డ్రింకులతో పోలిస్తే.. చెరకు రసం చాలా సహజమైన పానీయం.  అందుకే వేసవిలో చాలామంది చెరకు రసం తాగడానికి చాలా ఇష్టపడతారు.  కానీ ఎంతో  ఆరోగ్యకరమైనదని, తక్షణ చల్లదనాన్ని ఇచ్చేదాని అనుకునే  చెరకు రసం  తాగడం నిజంగా సురక్షితమేనా? ఈ విషయం నేటి కాలంలో చాలా సందేహమైన ప్రశ్నగా మారుతోంది.  వేసవి కాలంలో చెరకు తాగడం ఆరోగ్యానికి ఎంత వరకు మంచిది? దీని గురించి వైద్యులు ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. చెరకు రసం మంచిదే.. కానీ ఎక్కువగా తాగితే.. వేసవిలో చెరకు రసం చాలా ఎక్కువగా తాగుతుంటారు.  చెరకు రసం  శరీరానికి తేమను అందించి, తక్షణ శక్తిని ఇస్తుంది.  చెరకు రసంలోని  సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని అందించి, అలసట , డీహైడ్రేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. అందుకే మండుటెండలలో   ఉపశమనం కోసం చాలామంది చెరకు రసం తాగుతారు. చెరకు సహజంగానే తీపిగా ఉన్నప్పటికీ, రసంగా తీసుకున్నప్పుడు దానిలోని చక్కెర శాతం మరింత ఎక్కువగా మారుతుంది. రసం తీయడం వల్ల ఫైబర్ దాదాపు పూర్తిగా తొలగిపోతుంది, ఇది సాధారణంగా శరీరం చక్కెరను గ్రహించడాన్ని నెమ్మదింపజేస్తుంది. అందువల్ల, చెరకు రసం తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.  చెరకు రసం మధుమేహ వ్యాధిగ్రస్తులకు  మంచిది కాదని చెబుతారు. అంతేకాకుండా, ఫ్యాటీ లివర్, ఊబకాయం లేదా జీవక్రియ సమస్యలు ఉన్నవారు చెరకు రసం తాగడాన్ని చాలా తగ్గించాలని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ చక్కెర శరీరంలో కొవ్వు పేరుకుపోవడానికి కారణమై ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. చెరకు రసం పరిశుభ్రత.. చెరకు రసం విషయంలో ఉన్న మరొక  ప్రమాదం దాని పరిశుభ్రత. తరచుగా చెరకు  రసాన్ని ఆరుబయట తయారు చేస్తారు, చెరకు పైన ఉండే తెల్లని పొడిని శుభ్రపరచకుండా చెరకు నుండి రసం తీస్తుంటారు.  పైగా చెరకు రసం తీసే చోట  యంత్రాలు, ఐస్, నీరు , గ్లాసులు సరైన పరిశుభ్రతతో ఉండవు. వైద్యుల ప్రకారం, రసం తయారీలో ఉపయోగించే యంత్రాలు లేదా ఐస్  శుభ్రంగా లేకపోతే, బ్యాక్టీరియా , వైరస్‌లు సులువుగా అటాక్ అవుతాయి. దీనివల్ల టైఫాయిడ్, కలరా , హెపటైటిస్ వంటి నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. చెరకు రసం విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలంటే.. చెరకు రసం తాగే విషయంలో కొందరు చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.  ముఖ్యంగా మధుమేహం, ఊబకాయం, లేదా ఫ్యాటీ లివర్ ఉన్నవారు,  రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతున్నవారు చెరకు రసం తాగే ముందు జాగ్రత్త వహించాలి. చెరకు రసాన్ని ఎల్లప్పుడూ శుభ్రమైన , పరిశుభ్రమైన ప్రదేశం నుండే కొనుగోలు చేయాలి.                                *రూపశ్రీ.
సాధారణంగా తాంబూలం వేసుకోవడం అనేది మన సంప్రదాయంలో ఒక భాగం. కానీ, ఆ తాంబూలానికి కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద మూలికలను జత చేస్తే, అది గుండెను రక్షించే ఒక అద్భుతమైన ఔషధంగా మారుతుందని మీకు తెలుసా? హార్ట్ ఎటాక్ ప్రమాదాన్ని తగ్గించడంలో ఈ 'ఆయుర్వేద పాన్' అద్భుతంగా పనిచేస్తుంది. గుండె రక్తనాళాల్లో అడ్డంకులను (Blockages) తొలగించి, గుండెపోటు రాకుండా కాపాడే ప్రత్యేక ఆయుర్వేద పాన్/తాంబూలం తయారీ విధానం మరియు దాని ప్రయోజనాలు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే హార్ట్ స్పెషల్ తాంబూలం తయారీని వివరించారు: ఈ ఆయుర్వేద తాంబూలానికి కావలసినవి: తమలపాకు: ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు ఔషధ గుణాలను రక్తంలోకి త్వరగా చేరుస్తుంది. అర్జున చెట్టు బెరడు చూర్ణం: గుండె పనితీరును మెరుగుపరచడంలో ఇది అగ్రగామి. వెల్లుల్లి: రక్త నాళాల్లో పేరుకుపోయిన కొవ్వును (Cholesterol) కరిగించి, అడ్డంకులను తొలగిస్తుంది. అల్లం లేదా సొంఠి: రక్త ప్రసరణను సాఫీగా చేస్తుంది. దాల్చిన చెక్క: రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఎలా తీసుకోవాలి? వీడియోలో చూపిన విధంగా, తమలపాకులో ఈ మూలికలను సరైన మోతాదులో ఉంచి, తాంబూలంలా చప్పరిస్తూ తీసుకోవాలి. ఇది రక్తాన్ని పల్చగా ఉంచి, గడ్డకట్టకుండా (Blood Clots) చేయడంలో సహాయపడుతుంది. ప్రయోజనాలు: గుండె రక్తనాళాల్లో బ్లాకేజీలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె కండరాలను దృఢంగా మారుస్తుంది. అధిక రక్తపోటు (BP) సమస్యను అదుపులో ఉంచుతుంది. శరీరంలోని వ్యర్థాలను తొలగించి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.   మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి! సూచన: ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. తీవ్రమైన గుండె సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే వీటిని ప్రయత్నించాలి.
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.