LATEST NEWS
జగన్ మావిగన్ సవాల్ కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. అసలు జగన్ చెబుతున్న మావిగన్ అంటే ఏమిటో భగవంతుడికే తెలియాలంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల.. వైసీపీ అదినేత జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఇటీవల ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. అమరావతి పనుల్లో  విపరీతమైన అవినీతి జరుగుతోందని ఆరోపణలు గుప్పించారు.. ఆ అవినీతికి విరుగుడుగా.. తాను అధికారంలోకి వస్తే మావిగన్ ను రాజధాని చేస్తానని ప్రకటించారు. అదే తన ఎన్నికల నినాదమని చెప్పారు. సహజ వనరులు, ముందే సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాల వల్ల మావిగన్  లాభదాయకమన్నారు.  జగన్ మావిగన్ ప్రకటనపై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు.  తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం ఓబులావారిపల్లెలో జరిగిన విక్సిత్ భారత్-గ్రామ్ స్కీమ్ ప్రారంభోత్సవంలో చంద్రబాబు జగన్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. అసలా మావిగన్ ఏమిటో  దేవుడికే తెలియాలని ఎద్దేవా చేశారు.  అసెంబ్లీలో ఒకప్పుడు అమరావతికి మద్దతు పలికిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులంటూ ఐదేళ్ల కాలం పాటు రాష్ట్రాన్ని రాజధాని లేని రాష్ట్రంగా మార్చారనీ,  ఇప్పుడు ఎన్నికల్లో ఘోర పరాజయంతో కేవలం 11 సీట్లకు పరిమితమైన తర్వాత, సరికొత్తగా మావిగన్  రాగం అందుకున్నారని విమర్శించారు.  రాజధాని నిర్మాణం కోసం అప్పట్లో 29 వేల మంది రైతులు  33వేల ఎకరాల భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా స్వచ్ఛందంగా అప్పగించారని గుర్తు చేసిన ఆయన అటువంటి  అమరావతిని గత ప్రభుత్వం శ్మశానంగా మార్చే ప్రయత్నం చేసిందన్నారు.  రాజకీయ స్వార్థం కోసం చెరుకు తోటలకు నిప్పు పెట్టి, ఆ నెపం ఇతరులపై నెట్టే కుట్రలు చేశారని గుర్తు చేశారు. తమిళనాడుకు చెన్నై, కర్ణాటకకు బెంగళూరు, తెలంగాణకు హైదరాబాద్ లాంటి శాశ్వత రాజధానులు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని ఏదో చెప్పలేని దుస్థితి గత ఐదేళ్లలో దాపురించిందన్న చంద్రబాబు..  2026లో పార్లమెంటు అమరావతిని ఏకైక రాజధానిగా గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టాన్ని ఆమోదించిందని, ఇది జూన్ 2024 నుండి పాత తేదీతో అమల్లోకి వచ్చిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్రం అందించిన ఈ చట్టబద్ధమైన రక్షణతో అమరావతి ఎదుగుదలను భూమిపై ఏ శక్తి కూడా ఆపలేదన్న చంద్రబాబు..  రాజకీయ నాయకుడు మాట మీద నిలబడాలని.. పూటకో మాట  మార్చే వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు హెచ్చరించారు. అమరావతిని 2028 నాటికి క్వాంటం వ్యాలీగా, నాలెడ్జ్ హబ్‌గా పూర్తిస్థాయిలో నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. 
వైసీపీకి పెట్టని కోటగా, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ కోట అయిన  కడప  ఇప్పుడు ఆయన చేజారిపోయిందా?  అంటే ఇటీవలి పరిణామాలను గమనించిన పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఒకప్పుడు వైఎస్ కుటుంబం కోసం జిల్లాలో..  కేడర్ నుంచి లీడర్ల వరకు అందరూ ఏకతాటిపైకి వచ్చేవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు.  ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే.. జగన్‌కు తన సొంత జిల్లాపైనే పట్టు సడలినట్లు కనిపిస్తోందన్న భావన రాజకీయవర్గాలలో బలంగా వ్యక్తం అవుతోంది.  అందుకు..   జగన్ కడప జిల్లాలో ఇటీవల జరిపిన మూడు రోజుల పర్యటన నిలువెత్తు నిదర్శనంగా  నిలుస్తోంది.  ఈ పర్యటనలో జగన్.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి తన పార్లమెంటు నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో  పాల్గొన్నారు. సాధారణంగా పార్టీ అధినేత జిల్లా పర్యటనకు వస్తున్నారంటే.. పార్టీ క్యాడర్ లో, లీడర్లలో ఉత్సాహం కనిపిస్తుంది. పార్టీలో పండుగ వాతావరణం నెలకొంటుంది.  కానీ జగన్ తాజా పర్యటనలో అటువంటివేవీ కనిపించలేదు. పైపెచ్చు..  జిల్లాకు చెందిన పలువురు ముఖ్య నాయకులు జగన్ పాల్గొన్న కార్యక్రమాలకు ముఖం చాటేశారు.  కొందరైతే తూతూమంతరంగా అలా వచ్చి, ఇలా వెళ్లిపోయారు.  అధినేత పట్ల, పార్టీ కార్యక్రమాల పట్ల వైసీపీ కడప జిల్లా నేతలలో నెలకొన్న నిర్లిప్తతకు, అసంతప్తికి పరిశీలకులు దీనినే కడప జగన్ చేజారిపోయిందనడానికి నిదర్శనంగా చూపుతున్నారు.   నిజానికి 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. జగన్ శ్రద్ధపెట్టి పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలి. మరీ ముఖ్యంగా.. పార్టీకి పెట్టని కోటలాంటి కడప, బలమైన పట్టు ఉన్న నెల్లూరులలోనే వైసీపీ పరిస్థితి ఇప్పుడు అత్యంత దారుణంగా తయారైంది.  అయితే పార్టీ వర్గాలు మాత్రం వైసీపీ కడప జిల్లాలో దయనీయంగా మారడానికి జగన్ స్వయంకృతాపరాథమే కారణమని అంతర్గత సంభాషణల్లో అంగీకరిస్తున్నారు. జగన్ తన ఏకపక్ష నిర్ణయాలతో లీడర్లను, క్యాడర్ ను దూరం చేసుకున్నారంటున్నారు.  గతంలో నాయకులను ఇష్టానుసారంగా మార్చడం, స్థానిక సమీకరణాలను పట్టించుకోకుండా, ఎవరికీ ఇష్టం లేకపోయినా కొత్త వారికి అవకాశాలు కల్పించడం వంటి చర్యలు సీనియర్లను నెమ్మదిగా పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనకుండా నివారించాయనీ, ఇక తొలి నుంచీ పార్టీని నమ్ముకున్న రెడ్డి సామాజిక వర్గానికి  ప్రాధాన్యత ఇవ్వలేదని వారిలో అప్పట్లో వ్యక్తమైన అసంతృప్తి ఇప్పటికీ అలానే ఉందనీ అంటున్నారు.    మరోవైపు  కీలకమైన జమ్మలమడుగు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ  క్రమంగా విస్తరిస్తుండగా,   కడపలో తెలుగుదేశం పార్టీ ఇప్పటికే బలమైన విజయాన్ని దక్కించుకుంది.  ఇంత జరుగుతున్నా పార్టీ పరంగా ఎలాంటి కార్యక్రమాలూ, కనీసం కేడర్‌కు భరోసా ఇచ్చే  చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ పరిస్థితి కడప జిల్లాలో నానాటికీ తీసికట్టు అన్న చందంగా మారిందని వైసీపీ నేతలే అంటున్నారు.  
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. ఇటీవల బోడుప్పల్ పరిధిలోని ఉప్పల్ భగాయత్ వద్ద చోటు తెలంగాణ రక్షణ సమితి(టీఆర్ఎస్) నిరసన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల కేటాయింపు జరపాలంటూ సాగిన ఈ పోరాటంలో  టీఆర్ఎస్ అధినేత్రి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్టు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ పేరుతో కవితను మహిళా పోలీసులు అరెస్టు సమయంలో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయారు. ఆ తరువాత ఆమెను అరెస్టు చేసిన తీరుపై సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. కల్వకుంట్ల అరెస్టుకు సంబంధించిన విజువల్స్ లో   మహిళా పోలీసులు కవితను చుట్టుముట్టి లాక్కెళ్లేందుకు ప్రయత్నించడం, ఆ తీవ్ర తోపులాటలో కవితతో పాటు  మహిళా పోలీసులూ కిందపడిపోవడం స్పష్టంగా కనిపించింది.  ఆలా కిందపడిపోయిన పోలీసులు  ఆ తరువాత కల్వకుంట్ల కవితతో దురుసుగా వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.  కవితను పోలీసులు  పోలీస్ వాహనంలోకి దురుసుగా నెట్టేయడం సరికాదన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్నది. నెటిజనులైతే.. పోలీసులు వ్యవహరించిన తీరు అప్రజాస్వామికంగా, హింసాత్మకంగా ఉందని ఫైర్ అవుతున్నారు.   కవితను పోలీసులు అరెస్టు చేసిన తీరు పట్ల రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తున్నాయి. కేవలం టీఆర్ఎస్ శ్రేణులే కాదు.. జనసేన, బీఆర్ఎస్, బీజేపీ నేతలు కూడా  పోలీసుల తీరును తప్పుపడుతున్నారు.  జనసేన   తెలంగాణ జనరల్ సెక్రటరీ రామ్ తాళ్లూరి కవిత అరెస్టు సందర్భంగా పోలీసుల దురుసు వైఖరిని   తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, రాజకీయ వైరుధ్యాలు ఉండటం సహజమన్న ఆయన.. ఒక  మహిళా నేత పట్ల  ఇంత అగౌరవంగా, కనీస మర్యాద లేకుండా వ్యవహరించడం ఏ మాత్రం సరికాదని, ఇసుమంతైనా ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు.   మహిళా ప్రజాప్రతినిధుల పట్ల పోలీసులు  బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందన్నారు  
    ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎల్లప్పుడూ అత్యంత ఆసక్తికరమైన సంక్లిష్టమైన మలుపులకు వేదికగా నిలుస్తుంది. ఇటీవల ప్రసిద్ధ మీడియా ఛానల్ 'టాన్ న్యూస్' లో ప్రసారమైన 'వాస్తవ వేదిక'లో, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగు వన్ ఎండీ కంఠమనేని రవిశంకర్ మధ్య జరిగిన చర్చ ఏపీ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై, ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్తల ప్రభావం మరియు సోషల్ మీడియా ఎత్తుగడలపై ఒక లోతైన విశ్లేషణను అందించింది. ఈ విశ్లేషణాత్మక కథనంలో ఏపీ రాజకీయాల ప్రస్తుత స్థితి, వ్యూహాలు, రాబోయే రోజుల్లో వాటి ప్రభావం గురించి వివరంగా తెలుసుకుందాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితి: సానుభూతి వర్సెస్ ప్రజాకర్షక ప్రచారాలు..! ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల పబ్లిక్ రిలేషన్స్ వ్యూహాలు పతాక స్థాయికి చేరాయి. ముఖ్యమంత్రులు లేదా ప్రతిపక్ష నేతలు సామాన్య ప్రజలను కలవడం, తాటిచెట్లపాలెం వంటి ప్రాంతాల్లో మత్స్యకారులతో కలిసి భోజనం చేయడం వంటి సంఘటనలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం పొందుతున్నాయి. అయితే ఈ ప్రచారాలు కేవలం ఎన్నికల స్ట్రాటజీలలో భాగమేనని, క్షేత్రస్థాయిలో నాయకులు నిజంగా ప్రజలతో మమేకం కావడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మరోవైపు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారిపై ఉన్న ప్రజా సానుభూతి ఆయనకు ప్రధాన అర్హతగా బలంగా నిలిచింది. రాష్ట్ర విభజన తర్వాతి కాలంలో ఆ సానుభూతిని సమర్థవంతంగా వాడుకున్నప్పటికీ, కేవలం సానుభూతి కార్డు మాత్రమే ఎల్లప్పుడూ ఎన్నికల్లో విజయాన్ని ఖాయం చేయలేదని 2014 ఎన్నికల ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి. కేవలం సెంటిమెంట్లపై కాకుండా క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలపైనే గెలుపోటములు ఆధారపడి ఉంటాయని దీని ద్వారా స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహాలు మరియు వాటి అంతరార్థం..! ఆధునిక ఏపీ రాజకీయాలను శాసిస్తున్న మరో కీలక అంశం 'పొలిటికల్ స్ట్రాటజిస్టులు' (రాజకీయ వ్యూహకర్తలు) మరియు డేటా మేనేజ్‌మెంట్. ప్రశాంత్ కిషోర్ వంటి వ్యూహకర్తలు సమాజంలో కేవలం తాత్కాలిక ప్రయోజనాలను ఆశించే సంక్షేమ పథకాలను ప్రోత్సహిస్తూ, రాజకీయాలను మరింత వ్యాపారమయం చేశారనే తీవ్ర విమర్శలను ఈ ఇంటర్వ్యూలో లేవనెత్తారు. పెన్షన్ల పెంపుదల, అమ్మఒడి పథకం వంటి తాత్కాలిక లబ్ధి చేకూర్చే పథకాలు ఓటర్లను ఆకర్షించడానికి ఉపయోగపడుతున్నప్పటికీ, ఇవి రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యూహకర్తలు ప్రతి గ్రామంలోని కుల సమీకరణాలు, స్థానిక ఓటర్ల మనోభావాల డేటాను సేకరించి, దానికి అనుగుణంగా ఓటర్లను ప్రభావితం చేసే 'నెరేటివ్స్' (కృత్రిమ కథనాలు) సృష్టిస్తున్నారు. ఉదాహరణకు, గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై వచ్చిన  డైమండ్' వంటి ఆరోపణలు కేవలం ఒక రాజకీయ ప్రచారంలో భాగమేనని, వాటిలో ఎటువంటి వాస్తవం లేదని ఈ చర్చలో విశ్లేషించారు. 'మై టిడిపి' యాప్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో రేటింగ్ సిస్టమ్స్ పెట్టడం, కృత్రిమ డేటాతో సోషల్ మీడియా ప్రచారాలు నిర్వహించడం వంటి సరికొత్త పద్ధతుల ద్వారా సాంప్రదాయ ఎన్నికల విధానాన్ని మార్చేస్తున్నారు. ఓటర్ల విశ్వాసాన్ని నేరుగా గెలుచుకోలేమనే భావనతోనే ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. భవిష్యత్తు రాజకీయ ప్రభావం..! ఈ విధమైన డేటా ఆధారిత  సోషల్ మీడియా వ్యూహాలు రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను మరింత సంక్లిష్టంగా మార్చనున్నాయి. అయితే, ఓటర్లలో క్రమంగా పెరుగుతున్న రాజకీయ అవగాహన కారణంగా ఈ తాత్కాలిక వ్యూహాల మాయాజాలం ఎక్కువ కాలం సాగకపోవచ్చు. గతంలో ఎన్నికలకు సంబంధించి లోకేష్  చంద్రబాబులకు ముందే అంచనాలు అందించినట్లు, టిడిపికి అత్యధిక స్థానాలు వస్తాయని విశ్లేషకులు ముందే ఊహించిన తరుణంలో, క్షేత్రస్థాయిలో ప్రజల నిజమైన తీర్పు ఎలా ఉంటుందో స్పష్టమైంది. భవిష్యత్తులో కేవలం కృత్రిమ నెరేటివ్‌లు, సానుభూతి కార్డులు లేదా ఉచిత పథకాల హామీలతో ఎన్నికల్లో విజయం సాధించడం అసాధ్యం కానుంది. వ్యూహకర్తల కృత్రిమ రేటింగులు  అంచనాలను పక్కనబెట్టి, ప్రజలు నిజమైన నాయకత్వాన్ని, స్థిరమైన అభివృద్ధిని ఆశించే దిశగా అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో నిజమైన ప్రజా సమస్యల పరిష్కారం, పారదర్శక పాలన మాత్రమే ఏ రాజకీయ పార్టీకైనా భవిష్యత్తులో శాశ్వత మనుగడను అందిస్తాయి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
బోడుప్పల్‌లో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలు కోసం చేపట్టిన భూ పోరాటం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్ ) అధినేత్రి  కల్వకుంట్ల కవితతో పాటు వందలాది మంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారు లను పోలీసులు అరెస్టు చేసి  బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన కల్వకుంట్ల కవిత.. ఉప్పల్‌లో ఈ రోజు తెలంగాణ ఉద్యమకారులు, మహిళల రక్తం చిందిందని  ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు, ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీఛార్జ్ చేశారని ఆరోపించారు. "మేము కొత్త డిమాండ్లు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీలను  అమలు చేయాలని కోరాం. ఉద్యమకారులకు ఇస్తామని చెప్పిన 250 గజాల స్థలాన్ని వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశామని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయమని కోరితే రక్తం కళ్ల చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఉద్యమకారులు హామీలు అమలు చేయాలని అడిగినందుకే లాఠీఛార్జ్ చేసి రక్తం చిందేలా కొట్టడం అన్యాయమన్న కవిత..  కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ఉద్యమకారులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.  "కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ్టి నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభదన్నారు. ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రతి రోజూ ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూనే ఉంటామని హెచ్చరించారు. 
ALSO ON TELUGUONE N E W S
  ఎదురుగా పంచ పరమాన్నాలు ఉంచినా కూడా పలానా సినిమా బాగుందని తెలిస్తే చాలు, పరమాన్నాలు సంగతి తర్వాత చూద్దాం, ముందు సినిమా చూడాలని థియేటర్స్ కి పరుగులు తీసేవాళ్ళు. వాళ్ళు అంతలా పరిగెత్తడానికి కారణం సినిమా బాగుందంటే కథ, కథనం తమని ఎంతగానో మెస్మరైజ్ చేస్తాయని. ఆ సినీ ఆనందాన్ని తనకి తెలిసిన వాళ్ళ కంటే ముందుగా తనే పొందాలని. కానీ ప్రస్తుతం కొంత మంది మేకర్స్  సినిమా అంటే కథ, కథనంకి ఇంపార్టెన్స్ ఇవ్వడం కంటే  విజువల్ కిఇంపార్టెన్స్ ఇస్తున్నారు. భారీ స్కేల్‌లో, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌తో . వందల కోట్ల బడ్జెట్ పెట్టి విజువల్స్ ఎఫెక్ట్స్ (VFX) వెంట పడుతున్నారు. అయితే, ఈ క్రమంలో అసలైన కథని నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు కరెక్ట్. కేవలం గ్రాఫిక్స్ నమ్ముకుని థియేటర్లకు వచ్చే ప్రేక్షకుడిని ఎంతసేపు బురిడీ కొట్టించగలరు ఈ ప్రశ్న ఇప్పుడు ఇండస్ట్రీలోనే కాదు, సగటు సినిమా అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. కథ బలంగా లేనప్పుడు ఎంతటి విజువల్స్ అయినా స్క్రీన్ మీద వెలవెలబోవడం ఖాయం. ఇటీవలి కాలంలో వచ్చిన కొన్ని పెద్ద సినిమాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. సినిమా మేకర్స్ దాదాపు 70% నుండి 80% బడ్జెట్‌ను విజువల్స్, భారీ సెట్టింగ్స్, మరియు స్టార్ కాస్టింగ్ కోసమే కేటాయిస్తున్నారు. కానీ స్క్రిప్ట్ వర్క్, క్యారెక్టర్ డెవలప్‌మెంట్ కోసం కేవలం 10% సమయం లేదా శ్రద్ధ కూడా పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా, థియేటర్‌లో మొదటి 30 నిమిషాలు విజువల్స్ చూసి మురిసిపోయే ప్రేక్షకుడు, ఆ తర్వాత కథలో బలం లేక, ఎమోషన్ కనెక్ట్ అవ్వక తీవ్ర నిరాశకు గురవుతున్నాడు. సినిమా అనేది చూసేది మాత్రమే కాదు, హృదయానికి హత్తుకునే ఒక అనుభూతి అనే విషయాన్ని కొందరు దర్శకులు మర్చిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఒకప్పుడు కథే సినిమాకి హీరో.  క్యారెక్టర్స్ మధ్య  సంఘర్షణ, బలమైన డైలాగులు, గుండెలని  పిండేసే సెంటిమెంట్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేవి. కానీ నేడు 100 కి పైగా కంప్యూటర్ గ్రాఫిక్స్ షాట్స్ ఉంటేనే అది పెద్ద సినిమా అనే భ్రమలో కొందరు మేకర్స్ ఉన్నారు. వాస్తవానికి, ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించిన ఏ సినిమాని  చూసినా అందులో బలమైన కథాంశం (Plot) ఉంటుంది. విజువల్స్ అనేవి ఆ కథను మరింత అందంగా చూపించడానికి ఉపయోగపడే ఒక సాధనం మాత్రమే, అదే సర్వస్వం కాకూడదు. పునాది బలహీనంగా ఉన్నప్పుడు ఎంత రంగుల మేడ కట్టినా అది కూలిపోక తప్పదు. also read: Nandini reddu: భర్తపై నందినిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు బాక్సాఫీస్ లెక్కలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. కేవలం విజువల్ గ్రాండియర్ నమ్ముకుని వచ్చిన 60% పైగా భారీ బడ్జెట్ చిత్రాలు కథలో పట్టులేక డిజాస్టర్లుగా మిగిలాయి. అదే సమయంలో, కేవలం 15 నుండి 20 కోట్ల పరిమిత బడ్జెట్‌తో, బలమైన కంటెంట్‌తో వచ్చిన చిన్న చిత్రాలు వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్నాయి. ప్రేక్షకులు కేవలం స్క్రీన్ మీది రంగులను చూడటానికి రావడం లేదు, ఒక మంచి కథలో లీనమవడానికి వస్తున్నారు. కాబట్టి, మూవీ మేకర్స్ విజువల్స్ వెంట పడటాన్ని తప్పుబట్టలేం కానీ, కథను విస్మరించడం ఖచ్చితంగా పెద్ద పొరపాటే అవుతుంది. కంటెంట్ ఈజ్ కింగ్  అనే సూత్రాన్ని నమ్మి, కథకి  మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఆ విజువల్స్ కూడా సార్థకమవుతాయి మరియు సినిమా అనేది చిరస్థాయిగా నిలిచిపోతుంది.  
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితంలో అత్యంత అందమైన, మధురమైన మాతృత్వపు క్షణాలను ఆస్వాదిస్తోంది. ఒకవైపు కెరీర్ పరంగా సంచలన విజయాలు అందుకుంటూనే, మరోవైపు తన జీవితంలోకి రాబోతున్న కొత్త అతిథి కోసం ఎంతో ఆనందంగా నిరీక్షిస్తోంది. గతేడాది డిసెంబర్ 1న బాలీవుడ్ ప్రముఖ క్రియేటివ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న ఆమె, ప్రస్తుతం గర్భవతి అన్న సంగతి తెలిసిందే.  ప్రస్తుతం ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగా అందరూ విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తుంటారు, కానీ మొదటి నుంచి ఫిట్‌నెస్ ఫ్రీక్ అయిన సమంత మాత్రం ఈ ప్రత్యేక సమయంలోనూ తన వ్యాయామ దినచర్యను అస్సలు విస్మరించడం లేదు. తాజాగా జూన్ నెలకు సంబంధించిన తన జ్ఞాపకాల ఫోటో డంప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సమంత, అందులో తను జిమ్‌లో చేస్తున్న కఠినమైన వ‌ర్క‌వుట్‌ వీడియోను కూడా జత చేసింది. ఈ వీడియోలో ఆమె అప్పర్ బాడీకి సంబంధించిన వ్యాయామాలు చేస్తూ కనిపించింది. ఒక రాడ్‌కు కట్టిన బలమైన తాడు సహాయంతో వ్యాయామం చేస్తున్న సామ్, ప్రతి సెట్ ముగిసిన తర్వాత కొద్దిసేపు అలసటగా విశ్రాంతి తీసుకుంటూ కనిపించింది. 39 ఏళ్ల వయసులో తన తొలి సంతానానికి జన్మనివ్వబోతున్న సమంతకు ఈ వీడియోలో బేబీ బంప్ స్పష్టంగా కనిపిస్తుండటంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వైద్య నిపుణుల ప్రకారం గర్భవతులు పొట్టపై ఒత్తిడి పడకుండా నిపుణుల పర్యవేక్షణలో తగిన వ్యాయామాలు చేయడం వల్ల ప్రెగ్నెన్సీ సమయంలో అనవసరమైన బరువు నియంత్రణలో ఉంటుంది. అంతేకాకుండా బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటంతో పాటు నడుము నొప్పి నుంచి ఉపశమనం లభించి, సుఖ ప్రసవానికి అవకాశాలు మెరుగవుతాయని వైద్యులు చెబుతుంటారు. సమంత చూపించిన ఈ అంకితభావానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో "లవ్ యూ సామ్.. మీ చిన్నారిని చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం" అంటూ నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతుండగా, మరికొందరు మాత్రం ఈ సమయంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, తగినంత విశ్రాంతి తీసుకోవాలని సలహాలు ఇస్తున్నారు. మరోవైపు సమంత వృత్తిపరంగా కూడా సరికొత్త చరిత్ర సృష్టించి బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగిస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించి, స్వయంగా నిర్మించిన 'మా ఇంటి బంగారం' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం అంతర్జాతీయంగా సుమారు రూ. 86.80 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్ల మైలురాయిని దాటి టాలీవుడ్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సోలో ఫీమేల్-లీడ్ చిత్రంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీని ద్వారా 17 ఏళ్ల క్రితం 'అరుంధతి' సినిమాతో అనుష్క క్రియేట్ చేసిన చారిత్రాత్మక రికార్డులను కూడా సమంత తిరగరాయడం విశేషం. ఈ సినిమా ఒక్క ఇండియాలోనే రూ. 53 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించగా, ఓవర్సీస్ మార్కెట్లో ఏకంగా రూ. 24 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. ఇలా అటు పర్సనల్ లైఫ్‌లో మాతృత్వపు ఆనందం, ఇటు ప్రొఫెషనల్ లైఫ్‌లో రూ. 86 కోట్లకు పైగా కలెక్షన్ల రికార్డులతో సమంత కెరీర్ పీక్ స్టేజ్‌లో దూసుకుపోతోంది.     Samantha pregnancy workout, Samantha baby bump video, Raj Nidimoru Samantha marriage, Maa Inti Bangaram box office collections, Samantha gym video viral, Samantha broke Arundhati record
  దర్శకురాలు నందిని రెడ్డి 'మా ఇంటి బంగారం'తో  లైమ్ లైట్ లోకి వచ్చింది. లైమ్ లైట్ లోకి రావడమే కాదు రేపో మాపో వంద కోట్ల క్లబ్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది.  దీంతో అభిమానులు సమంత తో హ్యాట్రిక్ మూవీ ఎప్పడు ఉంటుందనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా సంధిస్తున్నారు.  తాజాగా నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు 40  ఏళ్లు దాటినా, ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్‌గానే జీవితాన్ని గడుపుతున్నాను. జీవితంలో పెళ్లి అనేది ఒక 'డూ ఆర్ డై' నిబంధన లేదా కచ్చితంగా పాటించాల్సిన రూల్ ఏమీ కాదు. నా మనస్తత్వానికి సరిపోయే, మెంటాలిటీకి సింక్ అయ్యే సరైన వ్యక్తి దొరకలేదు.  నచ్చిన వాళ్లతో కూడా భావాలు కుదరకపోవడం వల్లే  వివాహ బంధానికి దూరంగా ఉన్నాను. ముఖ్యంగా ఈ విషయంలో నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ నాపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు. పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. జీవితం సంతోషంగా సాగాలి అంటే కేవలం మొగుడు, పెళ్లాం అనే ఒకే ఒక్క బంధం మాత్రమే ఉంటే సరిపోదు. మనిషి జీవితంలో ఎన్నో రకాల అనుబంధాలు ఉండాలి. మన కష్టసుఖాలని  పంచుకోవడానికి, మన బాధ్యతలను మోయడానికి, అండగా నిలవడానికి కేవలం భర్త మాత్రమే అవసరం లేదు; ఆ స్థానంలో మంచి స్నేహితులు, తోబుట్టువులు, తల్లిదండ్రులు వంటి వారు ఎందరో ఉంటారు. నా చుట్టూ నేను ఒక అద్భుతమైన, నమ్మకమైన రిలేషన్స్ ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. నా పక్కన లేనిది కేవలం ఒక మొగుడు మాత్రమే. మిగతా అన్ని రకాల బంధాలు, ఆనందాలు నా జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడూ ఒంటరిగా ఉన్నానని బాధపడలేదు, లోన్లీగా ఫీల్ అవ్వలేదు అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి. Also read: Rao Bahadur: రావు బహదూర్ ట్విట్టర్ రివ్యూ ఇదే! 2011లో నాని, నిత్యామీనన్ జంటగా వచ్చిన 'అలా మొదలైంది' చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకురాలిగా ప్రస్థానం ప్రారంభించిన నందినిరెడ్డి  మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.బెస్ట్ డెబ్యూ డైరెక్టర్‌గా ప్రతిష్టాత్మకమైన నంది అవార్డుని  సొంతం చేసుకున్న నందిని రెడ్డి ఖాతాలో 'కళ్యాణ వైభోగమే', 'ఓ బేబీ' వంటి చిత్రాలు ఉన్నాయి. Nandini reddy about on marriage, nandini reddy opens about on marriage and single life, Director Nandini Reddy Marriage  
    సత్యదేవ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు వెంకటేష్ మహా కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం 'రావు బహదూర్'(Rao Bahadur)సైకాలజికల్ డ్రామాగా తెరకెక్కగా ఈ రోజు  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాగా, సూపర్ స్టార్ మహేష్ బాబు తన సొంత బ్యానర్ GMB ఎంటర్‌టైన్‌మెంట్స్ ద్వారా సమర్పించడంతో అంచనాలు భారీగా పెరిగాయి. విడుదలకు ముందే ప్రైవేట్ స్క్రీనింగ్‌లో ఈ సినిమా చూసిన మహేష్ బాబు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. ఇక ఈ రోజు ఉదయం నుంచే ప్రీమియర్ షోలు, ఎర్లీ మార్నింగ్ షోలు చూసిన ప్రేక్షకులు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తమ అభిప్రాయాలని  పంచుకుంటున్నారు. అసలు ఈ 'రావు బహదూర్' కథేంటి, ట్విట్టర్ యూజర్లు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకున్నారో ఇప్పుడు చూద్దాం.   రామప్ప రావు బహదూర్ (సత్యదేవ్) అనే 60 ఏళ్ల వృద్ధుడు ఒక తీవ్రమైన శారీరక రుగ్మతతో బాధపడుతుంటాడు. వైద్యులు చెప్పిన గడువు దాటిపోయినా, తను అనుకున్న ఒక వ్యక్తిగత లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవిస్తుంటాడు. దాదాపు పక్షవాతం వచ్చిన స్థితిలో కూడా తన చుట్టూ ఉన్న వారి సహాయంతో తన  లక్ష్యాన్ని ఎలా పూర్తి చేశాడు అనేదే ప్రధాన కథాంశం. ఈ ప్రయాణంలో రేణుక (దీప థామస్)తో ప్రేమ, యువకుడిగా ఉన్నప్పటి జ్ఞాపకాలు, భావోద్వేగాలు ప్రేక్షకులని  కట్టిపడేస్తాయి. Also read: OG 2: ఓజి 2 స్టోరీ లీక్!  కుల వ్యవస్థ, చర్మం రంగు, రక్తసంబంధాలు, సామాజిక మూఢనమ్మకాలపై దర్శకుడు వెంకటేష్ మహా వేసిన సెటైర్లు, ఫిలాసఫికల్ టచ్ ప్రధాన బలంగా నిలిచాయి.  ట్విట్టర్ టాక్ ప్రకారం, సినిమా ఓపెనింగ్ 5 నిమిషాల నుంచే ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టిస్తుంది. మొదటి 30 నిమిషాలు రామప్ప రావు బహదూర్ ప్రపంచంలోకి, అతని భువనాలయంలోకి, అక్కడి యాసలోకి వెళ్లడానికి ప్రేక్షకులకి  కొంచెం సమయం పట్టినప్పటికీ, ఆ తర్వాత కథలో లీనమైపోతారు. ఫస్ట్ హాఫ్ అంతా నెమ్మదిగా పాత్రల పరిచయం, వరల్డ్ బిల్డింగ్‌తో సాగుతుంది. అయితే ఊహించని ఇంటర్వెల్ బ్యాంగ్ ప్రేక్షకులలో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తుంది. సెకండ్ హాఫ్ పూర్తిగా సత్యదేవ్ వన్ మ్యాన్ షో అని చెప్పాలి. సెకండ్ హాఫ్‌లో డ్రామా మరింత తీవ్రమవడమే కాకుండా, క్లైమాక్స్ ట్విస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్లబెడుతున్నారు. చివరి 25 శాతం సినిమా 'పీక్ సినిమా' అని, టాలీవుడ్‌లో మునుపెన్నడూ చూడని సరికొత్త ప్రయోగమని నెటిజన్లు కొనియాడుతున్నారు.    Rao Bahadur Twitter Review, Rao Bahadur Movie Review, Satyadev in rao Bahadur, Venkatesh Maha, Rao Bahadur Rating
  టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)సృష్టించే ప్రభంజనం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2025 సెప్టెంబర్ 25న విడుదలైన ‘దే కాల్ హిమ్ ఓజీ’ (They Call Him OG) చిత్రం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లతో పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్‌ని  షేక్ చేయడమే కాకుండా, పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓజీ అభిమానులకి  మరో భారీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘ఓజీ 2’ (OG 2) రాబోతోందంటూ అధికారికంగా ప్రకటన విడుదలైంది. కేవలం సీక్వెల్ మాత్రమే కాకుండా, దీనిని ఒక భారీ ‘ఓజీ యూనివర్స్’ (OG Universe) గా విస్తరిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించడంతో సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఓజీ మారుమోగిపోతోంది. ఈ సరికొత్త ప్రాజెక్టును పవన్ కల్యాణ్ తన స్వంత బ్యానర్ అయిన ‘పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ (PKCW) పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండటం విశేషం. దీనికి సంబంధించిన ఒక ప్రత్యేక వీడియోను మేకర్స్ విడుదల చేశారు. అందులో దర్శకుడు సుజీత్ ఈ కథకు సంబంధించిన కొన్ని కీలకమైన ఎలిమెంట్స్‌ను, ఐకానిక్ విజువల్స్ ఐడియాలను పవన్ కల్యాణ్‌కు వివరిస్తూ కనిపించారు. కథా చర్చల్లో భాగంగా సుజీత్ చెప్పిన కొన్ని పాయింట్స్ వింటుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. మంచు క్రమక్రమంగా రక్తంగా మారే ఒక అద్భుతమైన సీన్, అలాగే కథను మలుపు తిప్పే ఒక ‘అవుట్‌సైడర్’ క్యారక్టర్  గురించి, మొదటి భాగంలో పవన్ కల్యాణ్‌తో పాటు కనిపించిన పెంపుడు కుక్క ప్రాధాన్యత గురించి సుజీత్ ఈ వీడియోలో వివరించారు. ఈ కథా చర్చల్లో పవన్ కల్యాణ్ ఎంతో ఆసక్తిగా పాల్గొంటూ, సుజీత్ విజన్‌కు ఫిదా అయ్యారు. ఒకానొక సందర్భంలో ‘ఈ సీన్ మాత్రం స్క్రీన్‌పై అత్యంత ఐకానిక్ విజువల్ కాబోతోంది’ అని పవన్ కల్యాణ్ ప్రశంసించడం విశేషం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్నప్పటికీ, పవన్ కల్యాణ్ ఈ ప్రాజెక్ట్ పట్ల పూర్తి నిబద్ధతతో ఉన్నారు. దర్శకుడు సుజీత్‌తో మాట్లాడుతూ, ‘నీకు నా వైపు నుండి ఏం కావాలన్నా నేను సిద్ధంగా ఉన్నాను’ అని పవన్ కల్యాణ్ హామీ ఇవ్వడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ చిత్రానికి ఎస్. థమన్ మరోసారి అద్భుతమైన సంగీతాన్ని అందించబోతున్నారు. ఓజీ మొదటి భాగంలో థమన్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా విజయానికి ప్రధాన బలమన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు రాబోయే ఓజీ యూనివర్స్‌లో ఓజాస్ గంభీర గతానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను, ముఖ్యంగా జపాన్‌తో అతనికి ఉన్న కనెక్షన్‌ని  మరింత లోతుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. జపనీస్ ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ కొత్త అప్‌డేట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. పవన్ కల్యాణ్ సరికొత్త రగ్గడ్ లుక్ కూడా నెట్టింట వైరల్ అవుతూ రికార్డు వ్యూస్ సాధిస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఓజీ తుఫాన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సరికొత్త రికార్డులని   సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.       
సూపర్‌స్టార్ రజినీకాంత్ మాస్ రచ్చకు థియేటర్లు మళ్లీ ముస్తాబవుతున్నాయి. గతేడాది ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తూ, ఏకంగా 650 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన 'జైలర్' చిత్రానికి సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. ఆ నిరీక్షణకు తెరదించుతూ ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ గురువారం ఒక అధికారిక ప్రకటనతో సినీ ప్రియుల్లో భారీ జోష్ నింపింది. మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ 'జైలర్2' విడుదల తేదీ ఖరారైంది. ఈ ఏడాది అక్టోబర్ 15వ తేదీన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు మేకర్స్ వెల్లడించారు. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్‌తో పాటు సన్ పిక్చర్స్ వదిలిన సరికొత్త టీజర్ సామాజిక మాధ్యమాలను షేక్ చేస్తోంది. ఈ గ్లింప్స్‌లో మొదటి భాగంలో విలన్‌గా అలరించిన వినాయకన్ పలికిన డైలాగులు నెక్స్ట్ లెవెల్ ఉత్కంఠను రేపుతున్నాయి. "నన్ను చంపి నువ్వు ప్రశాంతంగా ఉండలేవు జైలర్.. నా వెనుక చాలా పెద్ద నెట్‌వర్క్ ఉంది, ఎవరు ఎప్పుడు ఎలా వస్తారో నీకు తెలియదు.. నీ జీవితం నరకమే" అంటూ విలన్ హెచ్చరించే సీన్ గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఆ వెను వెంటనే మన తలైవా రజినీకాంత్ తనదైన ట్రేడ్‌మార్క్ స్టైలిష్ స్వాగ్‌తో ఎంట్రీ ఇవ్వడం చూస్తుంటే థియేటర్లలో పూనకాలు గ్యారెంటీ అనిపిస్తోంది. దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ సీక్వెల్‌ను మొదటి భాగానికి మించి, మరింత పవర్‌ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో అద్భుతంగా తెరకెక్కించినట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ భారీ ప్రాజెక్టులో ఉన్న మరో విశేషం ఏమిటంటే, కేవలం రజినీకాంత్ మాత్రమే కాదు.. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, అలాగే టాలెంటెడ్ యాక్టర్ విజయ్ సేతుపతి కూడా అత్యంత కీలకమైన పాత్రలలో కనిపించబోతున్నారు. మల్టీస్టారర్ లైనప్‌తో ఈ సినిమా రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. రమ్యకృష్ణ, మిర్ణా మీనన్ తదితరులు తమ పాత్రలతో మెప్పించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రక్రియ మొత్తం పూర్తికాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొదటి భాగానికి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో థియేటర్లను ఊపేసిన రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ సీక్వెల్‌కు కూడా అదిరిపోయే స్వరాలను అందిస్తున్నారు. అక్టోబర్ 15న రాబోతున్న ఈ బాక్సాఫీస్ సునామీ సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.     Rajinikanth Jailer 2, Jailer 2 Release Date Fixed, Jailer 2 Teaser, Sun Pictures Jailer 2, Anirudh Ravichander, Jailer 2 Movie Cast
  అఖిల్ అక్కినేని(Akhil Akkineni)ఈ సారి ఎలాగైనా హిట్ అందుకోవాలనే పట్టుదలతో లెనిన్ తో ఈ నెల 10 న వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ లో ల్యాండ్ అవుతున్నాడు. దీంతో ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సదరు ప్రమోషన్స్ లో సమంత వన్ వుమన్ షో 'మా ఇంటి బంగారం'పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు.    అఖిల్ మాట్లాడుతు  ‘లెనిన్’(lenin)ప్రమోషన్స్ వల్ల బిజీగా ఉండి  'మా ఇంటి బంగారం' ఇంకా చూడలేదు. కానీ ట్రైలర్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. మూవీ వైబ్స్ ,పాజిటివ్ ఎనర్జీ అద్భుతంగా అనిపించడంతో పాటు ఖచ్చితంగా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ కొడుతుందని అనుకున్నాను. ఒక సాధారణ మహిళగా కనిపిస్తూనే, చీర కట్టుకుని సమంత చేసిన యాక్షన్ సీన్స్, ఫైట్స్ చేయడం అంత మామూలు విషయం కాదు. సామ్ నిజంగా అద్భుతమైన ప్రదర్శన ఇచ్చింది" అంటూ అఖిల్ కొనియాడారు. ఇప్పుడు అఖిల్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచాయి. 'మా ఇంటి బంగారం' ప్రస్తుతం  80 కోట్ల రూపాయలని క్రాస్ చేసి 100 కోట్లు అందుకోవడానికి ఉత్సాహంగా ఉంది. Also read: Nagabandham: నాగబంధం మూవీలో ఉన్న హైలెట్స్ ఇవే! akhil akkineni about maa inti bangaram, maa inti bangaram collections, samantha about akhil akkineni, lenin movie cast    
Rao Bahadur starring Satyadev and directed by Venkatesh Maha has been one of those rare attempts in Telugu Cinema that excited many cinephiles and general audiences. The movie being presented by Mahesh Babu added to the buzz and anticipation of the film. Now, the movie released worldwide on 3rd July and let's look at initial reactions.  The movie is receiving very mixed reviews from audiences on X. Whatever the critics and reviewers have to say, such films demand major attention from general audiences as it lands in an experimental zone. Claims of it being a new-age psychological drama from makers further cement the need to look at audiences perspective.  Currently though, the movie seems to be attracting major reactions but they have been polarising. While some are appreciating the attempt and Venkatesh Maha's guts to write such characters, they are also criticising his choice to be over indulgent. Major complain has been that the movie is too slow in its first hour.  Even the second hour has been not so interesting but Satyadev's performance shoulders the film and climax does make it all interesting. Yet, some are complaining that Maha went over the top at places as well. Overall, from initial reactions we can state that Rao Bahadur is slow in pacing but bold as an attempt for Telugu Cinema.  Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నిర్మాత, దర్శకుడు అభిషేక్ నామ మధ్య నెలకొన్న వివాదం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ వివాదం వెనుక ఉన్న అసలు కారణాలు, ఆర్థిక నష్టాల గురించి వస్తున్న వార్తలు సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తాజాగా తన కొత్త చిత్రం 'నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్' ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అభిషేక్ నామ వెల్లడించిన విషయాలు, టాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. గతంలో విజయ్ దేవరకొండ నటించిన 'వరల్డ్ ఫేమస్ లవర్' చిత్రంపై నిర్మాత అభిషేక్ నామ చేసిన వ్యాఖ్యలు అత్యంత కీలకంగా మారాయి. ఈ చిత్రానికి ఆయన ఆంధ్రప్రదేశ్ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. సినిమా విడుదలైన సమయంలో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లను సాధించకపోవడంతో, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు వాటిల్లాయని ఆయన పేర్కొన్నారు. ఈ నష్టాల తీవ్రత ఎంత ఉందంటే, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే, ఈ సందర్భంగా అభిషేక్ నామ స్పష్టం చేసిన ఒక విషయం అందరినీ ఆశ్చర్యపరిచింది. "ఆ సినిమా వల్ల మాకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినప్పటికీ... మేము విజయ్ దేవరకొండను ఒక్క రూపాయి కూడా తిరిగి అడగలేదు. కానీ, ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు మా బ్యానర్‌లో ఆయన మరో సినిమా చేస్తారని మేము ఆశించాం," అని ఆయన తన ఆవేదనను బయటపెట్టారు. కేవలం ఆశించడమే కాకుండా, ఆయన నుండి సానుకూల స్పందన కోసం ఏకంగా మూడేళ్ల పాటు వేచి చూశామని అభిషేక్ నామ వాపోయారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో కె.ఎస్. రామారావు నిర్మించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్ థ్రెసా వంటి స్టార్ హీరోయిన్లు నటించినప్పటికీ, ఫలితం మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు ఊరటనివ్వలేదు. మూడేళ్లు గడిచినా, హీరో నుండి ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడం వల్లే తాను ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సి వచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమా ఫలితం ఆశించిన స్థాయిలో లేకపోవడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇప్పుడు నిర్మాతలు మరియు హీరోల మధ్య ఉండే అవగాహనలను మరోసారి తెరపైకి తెచ్చాయి. ప్రస్తుతానికి ఈ వివాదంపై విజయ్ దేవరకొండ స్పందిస్తారా లేదా అన్నది వేచి చూడాలి. ఏది ఏమైనా, టాలీవుడ్ బడ్జెట్ మరియు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్స్‌లో ఇలాంటి సంఘటనలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి. ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు కూడా ఈ అంశంపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.     Vijay Deverakonda, Abhishek Nama, World Famous Lover, Tollywood controversy, Producer comments, Telugu cinema news
టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే ముందెన్నడూ లేనంత అత్యంత హాట్ సీజన్ గా ఈ ఏడాది డిసెంబర్ నెల మారబోతోంది. ఇద్దరు అగ్ర హీరోలు, ఇద్దరు టాలీవుడ్ మాస్ పల్స్ తెలిసిన స్టార్స్ కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే తమ భారీ చిత్రాలతో థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతుండటంతో సినీ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రెబెల్ స్టార్ ప్రభాస్, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణల మధ్య జరగబోయే ఈ టగ్ ఆఫ్ వార్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఇద్దరు మాస్ హీరోల చిత్రాలు డిసెంబర్ మొదటి వారంలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'ఫౌజీ'. హను రాఘవపూడి దర్శకత్వంలో అద్భుతమైన విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అత్యంత గ్రాండ్‌గా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. యుద్ధ నేపథ్యం, భావోద్వేగాల కలయికతో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లను షేక్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రభాస్ కటౌట్‌కు హను రాఘవపూడి మేకింగ్ తోడైతే బాక్సాఫీస్ రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే రెబెల్ స్టార్ రాకతో థియేటర్లు హీటెక్కిన మరుసటి రోజే, నటసింహం నందమూరి బాలకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించడానికి థియేటర్ల‌లోకి అడుగుపెడుతున్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 'NBK111'. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'వీరసింహారెడ్డి' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో మాస్ ఆడియన్స్‌లో దీనిపై అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామాను డిసెంబర్ 4వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ రెండు భారీ చిత్రాలు బాక్సాఫీస్ బరిలోకి దిగడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి ఈ రెండు రిలీజ్ డేట్ల‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, ఫిలిం నగర్ సర్కిల్స్‌లో మాత్రం ఈ డిసెంబర్ వార్ దాదాపు ఖాయమనే ప్రచారం సాగుతోంది. రెండు సినిమాలు కూడా అత్యంత భారీ బడ్జెట్‌తో, హై-ఎండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపుదిద్దుకుంటుండటంతో థియేటర్ల కేటాయింపు మరియు వసూళ్ల పరంగా గట్టి పోటీ నెలకొననుంది. ఒకరు పాన్ ఇండియా స్టార్, మరొకరు నైజాం నుండి సీడెడ్ వరకు తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ఉన్న లెజెండ్. ఈ ఇద్దరి స్టార్స్ మధ్య జరగబోయే క్రేజీ క్లాష్‌ను థియేటర్ల యజమానులు, డిస్ట్రిబ్యూటర్లు మరియు మేకర్స్ ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో, ఈ టగ్ ఆఫ్ వార్‌లో ఎవరు బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడతారో చూడాలి.           Prabhas Fauji Movie, Balakrishna NBK111 Release Date, Prabhas vs Balakrishna Clash, Tollywood December Releases, Hanu Raghavapudi, Gopichand Malineni
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు వాడమని చెబుతారు.  అయితే.. తన దగ్గరకు వచ్చిన రోగులకు జాగ్రత్తలు  చెప్పడానికి ముందు వైద్యులు కూడా చాలా జాగ్రత్తలు, మంచి అలవాట్లు ఫాలో అవ్వాలి. అలా అయినప్పుడే వారి మానసిక, శారీరక ఆరోగ్యం దృఢంగా ఉంటుంది. మంచి ఆరోగ్యం అనేది తొందరగా లభించేది కాదు.. అది రోజువారీ మంచి అలవాట్ల ద్వారా నిదానంగా సొంతమవుతుంది.  వైద్యులు తమ రోజువారీ జీవితంలో పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్లు ఉన్నాయి.  వీటిని అందరూ పాటించవచ్చు.  ఇందులో వచ్చే నష్టం ఏమీ ఉండదు. దీని వల్ల వైద్యుల లాగే ఓర్పు, సహనం వంటివి పెరుగుతాయి. ప్రతి ఏడాది డాక్టర్స్ దినోత్సవాన్ని జూలై 1 వ తేదీన జరుపుకుంటారు.  ఈ సందర్బంగా వైద్యులు పాటించే కొన్ని ఆరోగ్య అలవాట్ల గురించి తెలుసుకుంటే.. నిద్ర.. ప్రతిఒక్కరికి కనీసం ఎనిమిది గంటల నాణ్యమైన నిద్ర అవసరం. "సమయానికి నిద్రపోవడం ద్వారా శరీరానికి, మనసుకు తగినంత విశ్రాంతి లభిస్తుంది.  దీని వల్ల ఒత్తిడి  తగ్గుతుంది,  రోగనిరోధక శక్తి మెరుగవుతుంది.  మంచి ఆరోగ్యంగా ఉండగలుగుతారు.   బ్లూ లైట్.. నిద్ర నాణ్యతను మెరుగుపరచడానికి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్‌లు, కంప్యూటర్‌లు , ఇతర ఎలక్ట్రానిక్స్ స్క్రీన్‌ల నుండి వెలువడే నీలి కాంతిని నివారించాలి. ఆహారం..  కొవ్వు తక్కువగా ఉండే ప్రోటీన్ వనరులు, ఆరోగ్యకరమైన కొవ్వులు , అధిక ఫైబర్ ఉన్న ఆహారాలను తీసుకోవడం ద్వారా తక్కువ కార్బోహైడ్రేట్లు, అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లను తగ్గించడం ద్వారా రోజంతా స్థిరమైన శక్తిని నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుంది. డిన్నర్ టైం.. రాత్రి భోజనాన్ని త్వరగా తినడం ఎంతో మంచిది.  రాత్రి 7 గంటల లోపు భోజనం ముగించడం వల్ల శరీరానికి రాత్రంతా విశ్రాంతి లభిస్తుంది. దీని వల్ల  జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ప్రాసెస్ ఆహారాలు.. ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెరతో నిండిన డెజర్ట్‌ల విషయంలో చాలా మంది కంట్రోల్ గా ఉండలేరు. కానీ వాటిని నివారించడానికి  తీపి తినాలని అనిపించినప్పుడు, చక్కెరతో నిండిన ప్రాసెస్ చేసిన డెజర్ట్‌ల వైపు వెళ్లకుండా ఆయా కాలాల్లో లభించే తాజా పండ్లు తినడం, ఖర్జూరం,  డ్రై ప్రూట్స్ వంటి తినడం వల్ల తీపి తిన్న ఫీల్ వస్తుంది. ఆరోగ్యానికి పోషకాలు కూడా అందుతాయి. భోజనం ట్రిక్.. భోజనం తినే ముందు  కూరగాయలతో తయారు చేసిన సలాడ్‌ తినడం వల్ల, ఎక్కువ ఆహారం తినకుండానే కడుపు నిండుతుంది.  దీనివల్ల ఆహారం అతిగా తినడం నివారించవచ్చు.  భోజనానికి కనీసం 20 నిమిషాల ముందు సలాడ్‌ తినడం చాలా మంచిది. చురుగ్గా ఉండాలి.. లైఫ్ స్టైల్ చురుగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం.  క్రమం తప్పకుండా కార్డియోవాస్కులర్ వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది.  అలాగే వ్యాయామం వల్ల ఓర్పు కూడా పెరుగుతుంది.   స్ట్రెంత్ ట్రైనింగ్.. క్రమం తప్పకుండా శరీరాన్ని బలంగా మార్చుకోవడం చాలా ముఖ్యం. ఫుషప్స్,  బైసెప్స్ తో పాటు ఇతర స్ట్రెంట వ్యాయామాలు కూడా శరీరం బలంగా మారడానికి సహాయపడుతుంది.  ఇవి కండరాలు బలంగా మారడానికి సహాయపడతాయి. మానసిక ఆరోగ్యం.. వైద్యులకు మానసిక ఆరోగ్యం ఎంతో అవసరం. శారీరక దృఢత్వం మానసిక ఆరోగ్యంతో ముడిపడి ఉంటుంది. ప్రతిరోజూ యోగా, ధ్యానం,యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు, ప్రాణాయామం వంటివి చేస్తారు.   రిలేషన్స్.. వైద్యులు కేవలం సమాజం కోసం మాత్రమే కాదు.. తమ కోసం తాము కూడా బ్రతకాలి.  వారికి ఒక కుటుంబం ఉంటుంది. కుటుంబంతో సమయం గడపడం,  సంబంధాలను మెరుగ్గా ఉంచుకోవడం వంటివి వారు వృత్తిలో రాణించడానికి సహాయపడతాయి. కనీసం రోజుకు గంట సేపు అయినా కుటుంబంతో సంతోషంగా గడపడం చాలా ముఖ్యం. పైన చెప్పుకున్నవన్న ఎంతో మందివైద్యులు తప్పకుండా తమ జీవితంలో రోజూ పాటించే అలవాట్లు. ఇవి సాధారణ వ్యక్తులు కూడా పాటించవచ్చు. దీనివల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు, కుటుంబ బంధాలు కూడా బలంగా ఉంటాయి. అప్పుడే వారు వృత్తికి సరైన న్యాయం చేయగలరు.                                       *రూపశ్రీ.
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది  మనుషులను దగ్గర చేస్తుంది. కానీ కొన్నిసార్లు  తెలియకుండానే అవతలి వ్యక్తికి అసౌకర్యం కలిగించే ప్రశ్నలు అడుగుతుంటారు. అడిగేవారి  ఉద్దేశాలు తప్పు కాకపోయినా, కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు ఇతరులకు నచ్చకపోవచ్చు , పైగా ఇలాంటి ప్రశ్నలు అడగడం వల్ల ఎదుటివారు బాధపడతారు కూడా.  నేటికాలంలో  గతంలో కంటే తమ వ్యక్తిగత జీవితాల పట్ల చాలా మందికి ఎక్కువ శ్రద్ధ ఉంటోంది. అయితే  ప్రతి వ్యక్తికి వారి స్వంత హద్దులు , వ్యక్తిగత గోప్యత ఉంటాయి, వాటిని గౌరవించాలి. కొన్నిసార్లు, మనం కేవలం కుతూహలంతో ప్రశ్నలు అడుగుతాము, కానీ అవతలి వ్యక్తి దానిని తమ పర్సనల్  విషయాల్లోకి చొరబడినట్లుగా భావించే అవకాశం ఉంటుంది. ఇది సంబంధాలు చెడిపోయే అవకాశాన్ని పెంచుతుంది. ఎవరినీ అడగకూడని నాలుగు ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలు ఏంటో తెలుసుకుంటే.. ఎవరినీ నొప్పించకుండా ఉండగలం. అవేంటంటే.. జీతం.. ఒకరి ఆదాయం లేదా జీతం గురించి అడగడం చాలా సున్నితమైన ప్రశ్నలలో ఒకటిగా పరిగణించబడుతుంది. చాలా మంది తమ ఆర్థిక పరిస్థితిని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడతారు.  ఈ ప్రశ్న ఎదుటి వ్యక్తికి అసౌకర్యాన్ని కలిగించవచ్చు.  ఇలాంటి ప్రశ్న వేయడం  వల్ల ఇతరులతో  తనను పోలుస్తున్నారని లేదా అంచనా వేస్తున్నారని ఎదుటివారికి  అనిపించవచ్చు. అందుకే ఎవరి సంపాదన గురించి ఎప్పుడూ అడగకూడదు. పెళ్ళెప్పుడు.. పెళ్లెప్పుడు అనే ప్రశ్నను భారతీయులు చాలా  తరచుగా అడుగుతుంటారు, కానీ ప్రతి వ్యక్తి పరిస్థితులు భిన్నంగా ఉంటాయి.  కొందరు తమ వృత్తిపై దృష్టి పెడుతుండగా, మరికొందరు వ్యక్తిగత కారణాల వల్ల పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు.  ఈ ప్రశ్నను పదేపదే అడగడం వల్ల ఎదుటి  వ్యక్తిపై అనవసరమైన ఒత్తిడి పడవచ్చు. వయసు.. వయస్సు అడగడం సాధారణంగా అనిపించినప్పటికీ, చాలా మంది దానిని వ్యక్తిగత సమాచారంగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే చోట  లేదా మొదటి సారి ఎవరితోనైనా కలిసినప్పుడు ఇలాంటి ప్రశ్న వేస్తే అది ఎదుటి వారిని   ఇబ్బందికి గురిచేస్తుంది. అవసరం ఉంటే తప్ప  వయస్సుకు సంబంధించిన ప్రశ్నలు అడగకపోవడమే మంచిది. పిల్లలు.. భారతదేశంలో పెళ్లైన చాలా మంది మహిళలు ఎదుర్కునే  ప్రశ్న ఇంకా పిల్లలు పుట్టలేదు ఎందుకు ఏమిటి అని.  ఇది  చాలా  భావోద్వేగపరమైన,  సున్నితమైనదిగా  ప్రశ్న. కొంతమందికి వారు మాట్లాడటానికి ఇష్టపడని వ్యక్తిగత నిర్ణయాలు, ఆరోగ్య కారణాలు లేదా కుటుంబ పరిస్థితులు ఉండవచ్చు. అందువల్ల, ఇలాంటి ప్రశ్నలు సంబంధాలలో దూరాన్ని సృష్టించే అవకాశం ఉంటుంది. అందుకే ఏ ఆడపిల్లను  ఎవరు ఈ ప్రశ్న అడగకూడదు.                                 *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
పెళ్లయ్యాక ప్రతి భార్యాభర్త పిల్లలను కనడంపై శ్రద్ద పెడతారు. పిల్లలను కనడం,  అమ్మ నాన్న అనిపించుకోవడం జీవితంలో ఒక మధురమైన అనుభూతిగా భావిస్తారు. అయితే నేటికాలంలో ఆడవారు మాత్రమే కాకుండా మగవారు కూడా పిల్లలను కనడంలో ఇబ్బందులు ఎదుర్కుంటూ ఉంటారు. ఆడవారిలో గర్బం నిలవకపోవడం లాగానే.. మగవారిలో వీర్యకణాల సమస్య వంటివి పిల్లలు పుట్టడంలో ఆటంకాలు కలిగిస్తాయి. కొందరికి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండటం, మరికొందరికి వీర్యం సరిగా ఉత్పత్తి కాకపోవడం లాంటి చాలా సమస్యలు కూడా ఉంటాయి. అయితే మగవారిలో కొన్ని  అలవాట్లు వారిలో సంతాన అవకాశాలు తగ్గించేస్తాయని వైద్యులు చెబుతున్నారు.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. వేడి అసలు కారణం.. జీవశాస్త్రపరమైన కారణం వల్ల వృషణాలు శరీరం వెలుపల ఉంటాయని వైద్యులు చెబుతారు. వీర్య కణాల ఉత్పత్తి ఉత్తమంగా జరగాలంటే , వృషణాల ఉష్ణోగ్రత శరీర అంతర్గత ఉష్ణోగ్రత కంటే సుమారు 2 నుండి 4°C తక్కువగా ఉండాలట. ఆ ఉష్ణోగ్రత వ్యత్యాసం కొద్దిగా తగ్గినా కూడా, అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. వృషణాల ఉష్ణోగ్రత పెరగడం వల్ల, వీర్య కణాలను ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం జరుగుతుందట. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగి, వీర్యకణాల DNA దెబ్బతింటుందట. భారతీయ పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గడానికి వేడికి గురికావడం, బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వంటి రోజువారీ అలవాట్లు ముఖ్య కారణాలని చెబుతున్నారు. ఒడిలో ల్యాప్టాప్.. చాలా మంది మగవాళ్లు ల్యాప్‌టాప్‌ను నేరుగా తమ తొడలపై ఉంచుకుని గంటల తరబడి పనిచేస్తుంటారు. దీనివల్ల ఉత్పన్నమయ్యే వేడి, కాలక్రమేణా వృషణాల ఉష్ణోగ్రతను గణనీయంగా పెంచడానికి దారితీస్తుంది. కానీ వేడి ఒక్కటే సమస్య కాదు, ల్యాప్‌టాప్‌ను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం , ఫోన్‌ను ప్యాంటు జేబులో ఉంచుకోవడం వల్ల విద్యుదయస్కాంత వికిరణానికి గురై పిల్లలు పుట్టడంలో సమస్యలు   పెరగవచ్చట. లోదుస్తులు, జీన్స్..  బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించే పురుషులతో పోలిస్తే, వదులుగా ఉండే బాక్సర్ షార్ట్స్ ధరించే పురుషులలో మొత్తం వీర్య కణాల సంఖ్య 17% ఎక్కువగా , చురుకుగా ప్రయాణించే వీర్య కణాలు 33% ఎక్కువగా ఉంటాయని పరిశోధనలు తేల్చాయి. స్కిన్నీ లేదా బిగుతుగా ఉండే జీన్స్ పరిస్థితిని మరింత దిగజార్చుతాయని ఆయన ఇంకా తెలిపారు. అవి రోజంతా వృషణ ప్రాంతాన్ని శరీరానికి దగ్గరగా నొక్కి ఉంచుతాయి, దీనివల్ల వేడి లోపలే నిలిచిపోయి, శరీరం  ఉష్ణోగ్రత నియంత్రణకు అవకాశం లేకుండా పోతుంది. ఎప్పుడూ అవే ధరించడం వల్ల, కాలక్రమేణా ఈ ప్రభావం పెరిగి సంతానలేమి సమస్యలకు దారితీస్తుంది. సహాయపడే మార్పులు.. వదులుగా ఉండే బాక్సర్ షార్ట్‌లకు మారడం,  ఫోన్‌ను ప్యాంటు జేబులో పెట్టుకోవడాన్ని అవాయిడ్ చేయడం మంచిది.  ల్యాప్‌టాప్‌ను  ఒడిలో కాకుండా బల్లపై ఉంచుకోవడం మంచిది. వేడి ప్రాంతాలలో ఎక్కువ సేపు గడపకుండా ఉండటం కూడా మేలు చేస్తుంది.                            *రూపశ్రీ.
 నేటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అందువల్ల, వైద్యులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయమని చెబుతుంటారు.   గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి  చాలామంది జిమ్ చేస్తుంటారు, మరికొందరు యోగా చేస్తుంటారు. గుండె ఆరోగ్యం కోసం కొత్తగా వ్యాయామం  మొదలు పెట్టాలని అనుకునేవారు జిమ్ చేయాలా, యోగా చేయాలా అని గందరగోళానికి గురవుతూ ఉంటారు.    కొంతమంది జిమ్‌లో వ్యాయామం చేయడానికి ఇష్టపడితే, మరికొందరు యోగానే ఉత్తమ పద్ధతిగా భావిస్తారు. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం జిమ్ లేదా యోగా..  ఈ రెండింటిలో  గుండె ఆరోగ్యానికి ఏది బాగుంటుంది?  తెలుసుకుంటే.. జిమ్ లేదా యోగా ఏది మంచిది? గుండెను కాపాడుకోవడానికి జిమ్ , యోగా రెండూ అవసరమైనవే. అయితే, అవి పనిచేసే పద్ధతులు భిన్నంగా ఉంటాయి. ఒకదానిని మించి మరొకటి ఎంచుకోవడం కంటే, రెండింటినీ  ఫిట్‌నెస్ లైఫ్ స్టైల్ లో  చేర్చుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వ్యాయామం వల్ల గుండెకు కలిగే ప్రయోజనాలు.. వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్, రోయింగ్ , స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి జిమ్ వ్యాయామాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా చేసే  వ్యాయామం గుండెను బలపరుస్తుంది , శరీరమంతటా రక్తాన్ని ప్రసరింపజేయడంలో సహాయపడుతుంది.  జిమ్ వర్కౌట్లు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి , కొలెస్ట్రాల్‌ను సమతుల్యం చేస్తాయి. అవి బరువును అదుపులో ఉంచడంలో కూడా సహాయపడతాయి.  తద్వారా గుండె జబ్బులు , పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అవి స్టామినాను బాలెన్స్ ను  కూడా పెంచుతాయి. క్రమం తప్పకుండా  కార్డియో వ్యాయామాలు చేస్తే  గుండెను బలపరుస్తాయని , శరీరమంతటా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని పంప్ చేసే ప్రక్రియను సులభతరం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. యోగా ఎందుకు ముఖ్యం..? యోగా శరీర సౌలభ్యాన్ని మెరుగుపరచడం, సరైన శ్వాస, బాలెన్స్ ను  కాపాడుకోవడం , మానసిక ప్రశాంతతపై దృష్టి పెడుతుంది. కార్డియో వ్యాయామాల మాదిరిగానే  యోగా ఏరోబిక్ ఫిట్‌నెస్‌ను అందిస్తుంది.  అయితే యోగా  గుండె ఆరోగ్యానికి ఇంకా అనేక  విధాలుగా కూడా  ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. యోగా ఒత్తిడి , ఆందోళనను తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా  ఒత్తిడి హార్మోన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది శరీర సౌలభ్యాన్ని , శరీరాకృతిని  మెరుగుపరుస్తుంది, శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది , మంచి నిద్రను ప్రోత్సహిస్తుంది. గుండె జబ్బులకు ఒత్తిడి ఒక ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. యోగా మనస్సును , నాడీ వ్యవస్థను ప్రశాంతపరచడం ద్వారా ఈ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం యోగాతో గుండె ఆరోగ్యం బాగుంటుందా? యోగా వల్ల అనేక శారీరక, మానసిక ప్రయోజనాలు ఉన్నప్పటికీ, గుండె సామర్థ్యాన్ని గణనీయంగా మెరుగుపరచడానికి అవసరమైన ఏరోబిక్ వ్యాయామాన్ని కేవలం యోగా మాత్రమే శరీరానికి అందించలేదు.  ఈ విషయాన్ని ఆరోగ్య  నిపుణులే చెబుతున్నారు.  ఆరోగ్య  నిపుణుల ప్రకారం, ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతి వారానికి  కనీసం 150 నిమిషాల పాటు వేగంగా నడవడం, జాగింగ్ లేదా సైక్లింగ్ వంటి మధ్యస్థం నుండి  తీవ్రత గల వ్యాయామం చేయాలి. మెరుగైన ఫిట్‌నెస్ , గుండె ఆరోగ్యం కోసం యోగాను ఇతర శారీరక కార్యకలాపాలతో కలిపి చేయడం మంచిది. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి వ్యాయామం చేయాలి? జిమ్ , యోగాలో ఒకదాన్ని ఎంచుకోవాల్సిన అవసరం లేదని  గుండె ఆరోగ్య  నిపుణులు చెబుతున్నారు.  ఫిట్‌నెస్ దినచర్యలో రెండింటినీ చేర్చుకోవడం మంచిదట. ఒక బాలెన్స్డ్  ఫిట్‌నెస్ ప్రణాళికలో వేగంగా నడవడం, జాగింగ్, సైక్లింగ్ లేదా ఈత వంటి ఏరోబిక్ వ్యాయామాలు, వారానికి కనీసం రెండు రోజులు స్ట్రెం్ ట్రైనింగ్,  కోలుకోవడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా ఉంటాయి. ప్రతిరోజూ స్ట్రెచింగ్ , శ్వాస వ్యాయామాలను కూడా చేర్చుకోవాలి. ఈ దినచర్య గుండె ఆరోగ్యాన్ని, కండరాల ఆరోగ్యాన్ని ,  మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడుతుంది.                                       *రూపశ్రీ.