LATEST NEWS
తెలంగాణ వార్షిక బడ్జెట్ ను రాష్ట్ర విత్తమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఆయన తన బడ్జెట్ లో ఆరోగ్య శాఖకు సముచిత బడ్జెట్ కేటాయించారు. తెలంగాణ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ లో 13 వేల 679 కోట్ల రూపాయలు కేటాయించారు.  ఇక పోతే మల్లు భట్టి విక్రమార్క మొత్తం   3 లక్షల24 వేల234 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో  రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు, మూలధన వ్యయం రూ.47,267 కోట్లు కాగా, తలసరి ఆదాయం   రూ.4,18,931 కోట్లు, వృద్ధి రేటు వృద్ధి రేటు 10.2శాతంగా ప్రతిపాదించారు.  మల్లు తన బడ్జెట్ లో వివిధ రంగాలకు చేసిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.  - ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి రూ.4,000 కోట్లు - పంట బీమా పథకానికి రూ.1,886 కోట్లు - మూసి రివర్ ఫ్రంట్‌కు రూ.1,500 కోట్లు - ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు - ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకానికి  రూ.1,056 కోట్లు  - పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు - రోడ్లు భవనాల శాఖకు రూ.6,416 కోట్లు - యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి రూ.5,000 కోట్లు కేటాయించారు. అలాగే..  - ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు రూ.600 కోట్లు - పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు - బియ్యం సబ్సిడీ రూ.3,000 కోట్లు - హ్యామ్ రోడ్లకు రూ.3,053 కోట్లు - రీజనల్ రింగ్ రోడ్డుకు రూ1,525 కోట్లు - రాజీవ్ యువ వికాసానికి రూ.5,800 కోట్లు కేటాయించారు.  ఇక పోతే... - కల్యాణలక్ష్మి / షాది ముబారక్ రూ.3,683 కోట్లు - విద్యార్థుల డైట్ ఛార్జీలు రూ.2,170 కోట్లు - స్కాలర్‌షిప్‌లకు రూ.4,343 కోట్లు  - రైతు భరోసాకు రూ.18,000 కోట్లు - చేయూతకు రూ.14,861 కోట్లు - మహాలక్ష్మికి రూ.4,305 కోట్లు - సన్న వడ్ల బోనస్‌కు రూ.3,500 కోట్లు కేటాయించారు.   అలాగే..  - శాంతి భద్రతలు - రూ.11,907 కోట్లు - గోదావరి పుష్కరాలు - రూ.500 కోట్లు - పర్యాటక శాఖ - రూ.1,224 కోట్లు కేటాయించారు. 
పలమనేరు మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ చిన్న (టి.సి.) రాజన్ కన్నుమూశారు. ఆయన వయస్సు 108 ఏళ్లు.  కొంతకాలంగా వృద్ధాప్యంతో వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో పలమనేరులో విషాదం నెలకొంది. పలువురు రాజకీయ ప్రముఖులు రాజన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  టి.సి. రాజన్ 1967లో స్వతంత్ర పార్టీ తరపున పలమనేరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయన తన సుదీర్ఘ సేవలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.    దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన రాజన్..   గాంధీజీ, నేతాజీ సిద్ధాంతాలతో ప్రభావితుడయ్యారు. విలువలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు.   రాజకీయాల్లో ఉన్నప్పటికీ మాజీ ఎమ్మెల్యే ఠాణేదార్ రాజన్ నిరాడంబర జీవితాన్నే గడిపారు. ఎటువంటి ఆస్తులూ కూడబెట్టలేదు.  ఆయనకు సంత ఇల్లు లేదు.   ప్రభుత్వ పింఛన్‌తోనే ఆ  జీవనాన్ని కొనసాగించారు.  2025లో తన 108వ జన్మదినాన్ని జరుపుకున్నారు.   ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత, నిజాయితీ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని పలువురు తమ సంతాపసందేశంలో పేర్కొన్నారు.  
తెలంగాణ ప్రభుత్వం శాసనసభ, శాసనమండలిలో  సమన్వయం కోసం ప్రభుత్వ విప్‌లను   నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం తరఫున గొంతుక వినిపించేందుకు, ఎమ్మెల్యేల మధ్య సమన్వయం కోసమూ ముగ్గురు సీనియర్ శాసనసభ్యులను   విప్‌లుగా నియమించింది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు,  మహబూబ్‌నగర్ ఎమ్మెల్యేయెన్నం శ్రీనివాస్ రెడ్డి శాసనసభ విప్‌లుగా నియమితులయ్యారు. అలాగే శాసనమండలిలో   అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను విప్‌లుగా  నియమించింది.   ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికె.రామకృష్ణారావు గురువారం ( మార్చి 19) ఉత్తర్వులు జారీ చేశారు.  
  మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పేరును ఖరారు చేశారు. 'తెలంగాణ ప్రజా జాగృతి' (TPJ) పేరుతో కొత్త రాజకీయ పార్టీ పేరు రిజిస్ట్రేషన్ కోసం కవిత డిసెంబర్ 23న కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకున్నాట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని కోరుతూ ఆమె ఢిల్లీ హైకోర్టులో ఆశ్రయించారు. దరఖాస్తులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని ఈసీఐ కోర్టుకు తెలిపింది.ఇవాళ జరగనున్న తదుపరి విచారణలో పార్టీ రిజిస్ట్రేషన్ అంశంపై స్పష్టత రానుంది. బీఆర్ఎస్‌లో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు కవిత ఈ ఏడాది జనవరిలోనే ప్రకటించారు. ఉగాది నాటికి కొత్త పార్టీని అధికారికంగా ప్రకటిస్తానని కూడా తెలిపారు. అయితే ఆ దిశగా కసరత్తు జరిగినప్పటికీ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆలస్యం కారణంగా ప్రకటన వాయిదా పడినట్లు సమాచారం.ప్రస్తుతం ‘జాగృతి’ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతున్నా, అది రాజకీయ పార్టీ కాకపోవడంతో అందరి దృష్టి కవిత కొత్త పార్టీపై నిలిచింది. రిజిస్ట్రేషన్ పూర్తి అయ్యి అధికారిక ప్రకటన వెలువడితే, తెలంగాణ రాజకీయాల్లో కొత్త పార్టీ ఆవిర్భవించే అవకాశముంది. ఇదిలా ఉంటే, కవిత ఏర్పాటు చేయబోయే పార్టీ పేరులో ‘తెలంగాణ’ పదం ఉండేలా చూస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బీఆర్ఎస్‌ను టార్గెట్‌గా చేసుకుని ముందుకెళ్లే వ్యూహం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి (TRS)గా ఉన్న పార్టీ, తర్వాత భారత రాష్ట్ర సమితి (BRS)గా పేరు మార్చుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి తెలంగాణతో బీఆర్ఎస్‌కు అనుబంధం తగ్గిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో కవిత పార్టీ పేరులో ‘తెలంగాణ’కు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తుండటంతో, రాష్ట్ర రాజకీయాల్లో ఆమె కొత్త పార్టీపై ఆసక్తి మరింత పెరుగుతోంది.  
తమిళనాడు రాజకీయాల్లో విలువల పతనం పతాక స్థాయికి చేరిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  రాజకీయ నేతలు అంశాల వారీ విమర్శలు కాకుండా హీరోయిన్లపై అనుచిత,  దిగజారుడు వ్యాఖ్యలూ చేస్తూ చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నారు.   ప్రముఖ హీరోయిన్లను వివాదాల్లోకి లాగుతూ,  వివాదాల్లోకి లాగుతూ వ్యక్తిగత విమర్శల దిగజారుతున్న తీరు తమిళనాట రాజకీయ ప్రతిష్ఠను దిగజారుస్తున్నది. సీనియర్ హీరోయిన్లు త్రిష, నయనతార లను ఉద్దేశించి తమిళ రాజకీయ నాయకులు కొందరు చేసిన వ్యాఖ్యల పట్ల తమిళనాటే కాకుండా దేశ వ్యప్తంగా నిరసన వ్యక్తం అవుతున్నది.   తాజాగా  ఏఐఏడీఎంకే ఎంపీ షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి.  తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇటీవల రాష్ట్ర ప్రజల కలల గురించి ప్రస్తావించగా.. ఎంపి షణ్ముగం షణ్ముగం మాట్లాడుతూ..  నాకు నయనతార కావాలి, నా కలను నెరవేరుస్తారా? అంటూ తీచౌకబారు వ్యాఖ్యలు చేశారు.   బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉన్న వ్యక్తి ఇలా  ఒక నటిని ఉద్దేశించి ఇంతటి అభ్యంతరకర రీతిలో వ్యాఖ్యానించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాగే మరో అగ్రనటి   త్రిషపై  తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజకీయనాయకుడిగా మారిన నటుడు విజయ్‌ను విమర్శించే క్రమంలో  ఆయన అసందర్బంగా, అనుచితంగా త్రిష పేరు  ప్రస్తావించారు. విజయ్ తన ఇంటి నుంచి బయటకు వచ్చి క్షేత్రస్థాయి పరిస్థితులు చూడాలంటూ త్రిషను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర విమర్శలకు గురయ్యాయి.  సినిమా రంగంలో తమకంటూ  గుర్తింపును, గౌరవాన్న, అశేష ప్రేక్షకాభిమానాన్నీ సంపాదించుకున్న నటీమణులపై ఇటువంటి అసభ్య, అసందర్భ వ్యాఖ్యలు చేయడంపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  రాజకీయ ప్రత్యర్థుల వారి విధానాలను ఎండగడుతూ విమర్శలు చేయాలి కానీ,   సంబంధం లేని మహిళల వ్యక్తిత్వాన్ని కించపరచడం  సరికాదని అంటున్నాయి.  కాగా ఎంపీ  షణ్ముగం నయనతారపై చేసిన వ్యాఖ్యలపై మహిళా కమిషన్   సీరియస్ అయింది. ప్రజాప్రతినిధులు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. త్వరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో  ప్రచార పర్వంలో ఇంకా ఎలాంటి విమర్శలు వినాల్సి వస్తుందోనన్న ఆందోళన వ్యక్తమౌతోంది. 
ALSO ON TELUGUONE N E W S
- గద్దర్ అవార్డు వేడుకలో రసాభాస..  - అలిగి వెళ్లిపోయిన విజయేంద్ర ప్రసాద్! - ముంబై ఈవెంట్ టీమ్ అత్యుత్సాహం..  - స్టార్ ప్రొడ్యూసర్లకు కూడా అవమానమేనా? - హెచ్.ఐ.సి.సి లో గద్దర్ అవార్డ్స్ హంగామా..  - అడుగడుగునా సమన్వయ లోపం!   తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన 'గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్' వేడుక అట్టహాసంగా ప్రారంభమైనప్పటికీ, నిర్వహణ లోపాలు వేడుక వెలుగును తగ్గించాయి. హైదరాబాద్‌లోని హెచ్.ఐ.సి.సి (HICC) వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అడుగడుగునా గందరగోళం నెలకొనడంతో సినీ ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన ఈ మొదటి అవార్డుల ఉత్సవంలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది. ముంబైకి చెందిన ఒక ఈవెంట్ మేనేజ్‌మెంట్ సంస్థకు ఈ వేడుక బాధ్యతలు అప్పగించడం ఈ సమస్యలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. అక్కడి సిబ్బందికి టాలీవుడ్ ప్రముఖుల గురించి కనీస అవగాహన లేకపోవడంతో రెడ్ కార్పెట్ వద్దే వింత పరిస్థితులు ఎదురయ్యాయి. ఆహ్వానితులైన అతిథులను, అవార్డు గ్రహీతలను కూడా గుర్తించలేక సెక్యూరిటీ సిబ్బంది వారిని గేట్ల వద్దే నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యులు విజయేంద్ర ప్రసాద్‌కు ఈ వేడుకలో చేదు అనుభవం ఎదురైంది. నిర్వాహకుల తీరుతో విసిగిపోయిన ఆయన, అవమాన భారంతో వేడుక మధ్యలోనే వెనుదిరిగినట్లు సమాచారం. కేవలం ఆయనే కాకుండా, టాలీవుడ్ దిగ్గజ నిర్మాతలు డి. సురేష్ బాబు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి వంటి వారిని కూడా నిర్వాహకులు వెనుక వరుసలకు పంపడం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ఆడిటోరియంలో సీటింగ్ ఏర్పాటు కూడా అస్తవ్యస్తంగా మారింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న బౌన్సర్లకు, దిల్ రాజు టీమ్‌కు మధ్య చిన్నపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది. స్టార్లందరూ ఒకేచోట చేరిన వేళ, వారికి సరైన గౌరవం దక్కకపోవడంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. స్థానిక పరిస్థితులపై అవగాహన లేని సంస్థలకు బాధ్యతలు ఇస్తే ఇలాగే ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గద్దర్ పేరుతో నిర్వహిస్తున్న ఈ అవార్డుల పట్ల సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నంది అవార్డుల స్థానంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వీటిని తీసుకొచ్చింది. అయితే, మొదటి ఏడాదే ఇలాంటి నిర్వహణ లోపాలు తలెత్తడం భవిష్యత్ వేడుకలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు.
-నిన్న థియేటర్స్ లోకి ఉస్తాద్  -ఫస్ట్ డే పరిస్థితి ఏంటి -సెకండ్ డే టాక్ ఎలా ఉంది ఈ సారి పెర్ ఫార్మెన్స్ బద్దలైపోయిద్ది అంటు పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)నిన్న 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో సెల్యులాయిడ్ పై ల్యాండ్ అయ్యాడు. అభిమానులు, మూవీ లవర్స్ అయితే థియేటర్స్ లోనే ఉగాది సెలబ్రేషన్స్ ని జరుపుకున్నారు. అంతలా ఉదయం ఐదు గంటల షో నుంచే ఉస్తాద్ అభిమానుల సందడి థియేటర్స్ లో ప్రత్యక్షమయింది. ఇక తొలి రోజు టాక్ పరంగా చూసుకుంటే  హిట్,పర్వాలేదనే టాక్ వచ్చింది. మరి ఈ నేపథ్యంలో రెండవ రోజు టాక్ ఎలా వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. మరి ఆ టాక్ ఎలా ఉందో చూద్దాం. ఇప్పటికే కొన్ని థియేటర్స్ లో షోలు కంప్లీట్ అయ్యాయి. థియేటర్ నుంచి బయటకి వచ్చిన వాళ్లంతా ఉస్తాద్ బాగుంది. ఎక్కడ బోర్ కొట్టలేదు. పవన్ తో పాటు శ్రీలీల క్యారెక్టర్స్ హైలెట్ గా నిలిచాయి. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ కూడా బాగున్నాయి. టోటల్ గా సినిమా బాగుందని అంటున్నారు. కొంత మంది దగ్గర నుంచి మాత్రం రెగ్యులర్ సినిమా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.  కలెక్షన్స్ పరంగా చూసుకుంటే మొదటి రోజు 52 కోట్ల గ్రాస్ రాబట్టినట్టుగా ట్రేడ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. Also read: Ram Gopal Varma: ఆ ఇద్దరు పతనం కావాలి.. రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్   మరి ఈ నేపథ్యంలో రెండవ రోజు సాధించే కలెక్షన్స్ పై సినిమా ఫలితం ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాన్ని కూడా వాళ్లంతా వ్యక్తం చేస్తున్నారు. 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కినట్టుగా చెప్తున్న ఉస్తాద్ లాంగ్ రన్ లో ఏ మేర కల్లెక్షన్స్ రాబడుతుంది. నిర్మాతలని,డిస్ట్రిబ్యూటర్స్ ని  లాభాల బాట పట్టిస్తుందా? అనే మాటలు సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దర్శకుడు హరీష్ శంకర్ తో పాటు మైత్రి మూవీ మేకర్స్ సినిమా విజయంతమైనదని చెప్పడం జరిగింది.       
తెలంగాణ గద్దర్ సినిమా అవార్డ్స్ 2025 వేదికపై పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణమూర్తి ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తనదైన శైలిలో భావోద్వేగంగా మాట్లాడుతూ, ఓ వైపు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే, మరోవైపు ఏపీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ చేశారు. (Gaddar Awards) గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేడుకలో పాల్గొన్న ఆర్. నారాయణమూర్తి(R Narayana Murthy).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. 13 ఏళ్లు నంది అవార్డుల ఊసే లేదని, అటువంటిది సినిమా ఇండస్ట్రీ ఉనికిని గుర్తించి అవార్డులు ప్రకటించిన 'డేరింగ్ అండ్ డాషింగ్ సీఎం' రేవంత్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ప్రజా గాయకుడు గద్దర్ గురించి మాట్లాడుతూ.. అన్నమయ్య, భక్త రామదాసుల తర్వాత అంతటి స్థాయిలో ప్రజల గొంతుకైన వ్యక్తి గద్దర్ అని నారాయణమూర్తి అన్నారు. అస్సాంలో భూపేన్ హజారికాను అక్కడి ప్రభుత్వం ఎంతగా గౌరవిస్తుందో, అదే రీతిలో గద్దర్ పేరు మీద అవార్డులు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. ఇదే క్రమంలో తనకు దివంగత నటుడు కాంతారావు పేరు మీద అవార్డు రావడంపై నారాయణమూర్తి ఎమోషనల్ అయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ తర్వాత అంతటి ప్రజాదరణ పొందిన నటుడు, తెలంగాణ ముద్దుబిడ్డ కాంతారావు అని గుర్తు చేసుకున్నారు. కాంతారావు అవార్డు అందుకోవడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి నారాయణమూర్తి ఒక విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ దూసుకుపోతున్నారని, అదే విధంగా ఏపీలో కూడా నిలిచిపోయిన నంది అవార్డులను పునరుద్ధరించాలని కోరారు. ఇండస్ట్రీ ఉనికిని కాపాడటానికి, కళాకారులను ప్రోత్సహించడానికి ఏపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా, ఇదే వేదికపై చిరంజీవి(Chiranjeevi) కూడా చంద్రబాబుకి రిక్వెస్ట్ చేయడం విశేషం. తెలంగాణాలో గద్దర్ అవార్డ్స్ ఇస్తున్నట్టుగా, సినీ కళాకారులను ప్రోత్సహిస్తూ ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులు ఇవ్వాలని కోరారు. మొత్తానికి తెలంగాణ ప్రభుత్వ అవార్డుల వేడుకలో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో కూడా అవార్డులు ఇవ్వాలంటూ చంద్రబాబుకి సినీ ప్రముఖులు రిక్వెస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.   
- రూరల్ పొలిటికల్ డ్రామాగా 'గువ్వల చెరువు ఘాట్' - 'గువ్వల చెరువు ఘాట్' గ్లింప్స్ వైరల్ - అమెజాన్ ప్రైమ్ కోసం కిరణ్ అబ్బవరం వెబ్ సిరీస్ టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో కిరణ్ అబ్బవరం ఇప్పుడు తన రూటు మార్చారు. వెండితెరపై తనదైన శైలిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. కిరణ్ అబ్బవరం నటిస్తున్న తొలి వెబ్ సిరీస్ పేరును ప్రకటిస్తూ మేకర్స్ తాజాగా ఒక అదిరిపోయే గ్లింప్స్‌ను విడుదల చేశారు. 'గువ్వల చెరువు ఘాట్' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తాజాగా విడుదలైన గ్లింప్స్ చూస్తుంటే, ఇది ఒక రా అండ్ రస్టిక్ రూరల్ పొలిటికల్ డ్రామాగా ఉండబోతున్నట్లు అర్థమవుతోంది. కడప ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథలో కిరణ్ అబ్బవరం పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. వారసత్వం, అధికారం మరియు రాజకీయ చదరంగం చుట్టూ ఈ సిరీస్ కథాంశం తిరుగుతుందని గ్లింప్స్ ద్వారా స్పష్టమవుతోంది. 'డియర్ కామ్రేడ్' సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న భరత్ కమ్మ ఈ వెబ్ సిరీస్‌కు షోరన్నర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. ఈ భారీ ప్రాజెక్ట్‌లో కిరణ్ అబ్బవరం సరసన సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కలయికలో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే తిరువీర్, ఆడుకాలం నరేన్ వంటి అనుభవజ్ఞులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కిరణ్ అబ్బవరం గతంలో 'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కల్యాణమండపం', 'KA' వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా విభిన్నమైన కథలను ఎంచుకుంటూ మాస్ అండ్ క్లాస్ ప్రేక్షకులను అలరిస్తున్న కిరణ్, ఇప్పుడు వెబ్ సిరీస్ ప్రపంచంలోకి అడుగుపెట్టడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. తన కెరీర్‌లో ఇది ఒక కీలక మలుపు అవుతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు. ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కిరణ్ అబ్బవరం లుక్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నాయంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ ఏడాది విడుదల చేయబోతున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల జాబితాలో 'గువ్వల చెరువు ఘాట్' కూడా ఒకటిగా నిలిచింది. త్వరలోనే ఈ సిరీస్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
-నిన్న థియేటర్స్ లోకి ధురంధర్ 2  -పాజిటివ్ టాక్  -మరి రామ్ గోపాల్ వర్మకి వచ్చిన బాధ ఏంటి! భారతీయ సినిమాకి సరికొత్త కథ, కథనాన్ని,టేకింగ్ ని నేర్పిన మూవీ 'ధురంధర్'(Dhurandhar). ఆ మూడు విభాగాల్లో ఎంతో మంది అగ్ర శ్రేణి దర్శకులు, అప్ కమింగ్ దర్శకులకి ఒక లెసన్ లాంటిది అనే అభిప్రాయాన్ని కూడా పలువురు వ్యక్తం చేస్తుంటారు. దీంతో  ఇండియన్ సిల్వర్ స్క్రీన్ వద్ద ఆదిత్య దర్ ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని పొందటంతో పాటు పార్ట్ 2 కోసం అందరూ వెయిట్ చేసే పరిస్థితిని కల్పించాడు. ఇక ప్రీమియర్స్ దగ్గర్నుంచే  ధురంధర్ 2(Dhurandhar 2) థియేటర్స్ కి అభిమానులతో పాటు సినీ మేకర్స్,ప్రతినిధులు భారీగా పోటెత్తారు. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో పార్ట్ 2 ఉందని ముక్త కంఠంతో వాళ్లంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్ 2 రిలీజ్ కి  కొన్ని రోజుల ముందు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు మరోసారి వైరల్ గా నిలుస్తున్నాయి. ఇంతకీ ఆ మాటలేంటో చూద్దాం. రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma)ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ధురంధర్ తో ఆదిత్య ధర్ సెట్ చేసిన కొత్త స్టాండర్డ్స్ వల్ల మిగతా దర్శకులు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సి వస్తోంది. ఆదిత్య మార్క్ క్వాలిటీ కోసం సౌత్ ఇండస్ట్రీలో, ముఖ్యంగా టాలీవుడ్ లో కొన్ని భారీ బడ్జెట్ యాక్షన్ చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ ఆపేసి మరీ రీషూట్స్ జరుపుకుంటున్నాయి. దీనివల్ల నిర్మాతలపై కోట్ల రూపాయల అదనపు భారం పడుతుంది అందుకే వారంతా ఆదిత్యపై కోపంగా ఉండటంతో పాటు అసూయతో ఉన్నారు. కొంత మంది అయితే  ఆదిత్య దర్ తో పాటు ఆయన భార్య యామి గౌతమ్ పతనం కోసం ఎదురుచూస్తున్నారు. కాబట్టి వాళ్లిద్దరు చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలని వర్మ చెప్పుకొచ్చాడు.  Also read: Dhurandhar 2: ధురంధర్ 2 తొలి రోజు కలెక్షన్స్ ఇవే.. పుష్ప2కి ఎసరు పెడుతుందా! యామి గౌతమ్(Yami Gautam)తెలుగులో అల్లు శిరీష్ హీరోగా వచ్చిన గౌరవం మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ధురంధర్ తో పాటు ధురంధర్ 2 కి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో పాటు పార్ట్ 2 లో ఒక రోల్ లో కూడా కనిపించింది. ఆదిత్య ధర్ 2009 లో సినీ రంగ ప్రవేశం చేసి 2019 లో 'ఉరి ది సర్జికల్'స్ట్రైక్ ని తెరకెక్కించాడు. ధురంధర్ తన రెండవ సినిమా కాగా పార్ట్ 2 మూడవది.  రామ్ గోపాల్ వర్మ కూడా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి కొత్త కథ, కథనాన్ని, టేకింగ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే.  
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్(Gaddar Awards) వేడుక గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా 'ఎన్టీఆర్ నేషనల్ అవార్డు'ను చిరంజీవి(Chiranjeevi) అందుకున్నారు. అవార్డు అందుకున్న అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించారు. కళాకారులను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇవ్వడం మంచి విషయమని కొనియాడారు.  అయితే చిరంజీవి తన స్పీచ్ లో ఎన్టీఆర్ గురించి మాట్లాడలేదు. దీంతో అభిమానులు నిరాశచెందారు. ఒక పెద్ద ఈవెంట్ లో మాట్లాడుతున్నప్పుడు.. మాట్లాడాలి అనుకున్నవన్నీ మాట్లాడలేకపోవడం లేదా అనుకోకుండా వేరేవి మాట్లాడటం సహజమే. గద్దర్ అవార్డ్స్ లో చిరంజీవి విషయంలోనూ అలాంటిది జరిగి ఉండొచ్చు. అందుకే ఎన్టీఆర్ పై తనకున్న గౌరవాన్ని తెలుపుతూ తాజాగా చిరంజీవి ట్వీట్ చేశారు. "చరిత్ర కర్తగా నిలిచిన నందమూరి తారక రామారావు గారు… తన పేరుతోనే లలిత కళలను ముందుకు తీసుకుని వెళ్లిన మహా కళాకారుడు. ఎన్టీఆర్ అంటే… N నాట్యం, T తాళం, R రాగం… కళల సమ్మేళనం. తెలుగు సినిమాకు ఉన్న కీర్తిని ఖండాంతరాలకు చేర్చిన మహానుభావుడు. దేవుడు ఎలా ఉంటాడో మనకు తెలియకపోయినా… ఆయన పోషించిన పాత్రల ద్వారా దేవుడిని మన కళ్ల ముందుంచిన అపూర్వ ప్రతిభ. రామారావు గారు జన్మించిందే సినిమాల కోసం అన్నట్టుగా, ఆయన లేని తెలుగు సినిమా ఊహించలేనిది. అలాంటి మహానుభావుని పేరుతో ఉన్న ‘ఎన్టీఆర్ నేషనల్ అవార్డు’ నాకు లభించడం, నా జీవితంలో గొప్ప గౌరవంగా భావిస్తున్నాను." అని చిరంజీవి రాసుకొచ్చారు. https://x.com/KChiruTweets/status/2034841137492762698
వెబ్ సిరీస్ : చిరైయా నటీనటులు: దివ్య దత్తా, సుకుమార్  భ్రమర్, ప్రసన్న బిస్త్, సిద్దార్థ్ షా,  ఫైజల్ రషీద్, టిన్ను ఆనంద్ తదితరులు రచన: దివ్య నిధి శర్మ ఎడిటింగ్: అసీమ్ సిన్హా సినిమాటోగ్రఫీ: శుభంకర్ భర్ మ్యూజిక్:  రాజా నారాయణ్ దేబ్ నిర్మాతలు:  శ్రీకాంత్ మెహ్త, మహేంద్ర సోని దర్శకత్వం: శశాంత్ షా ఓటీటీ: జియో హాట్ స్టార్ కొత్తదనంతో కూడిన బోల్డ్ కథలను అందించడంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఎప్పుడూ ముందుంటాయి. తాజాగా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న 'చిరైయా' (Chiraiya) వెబ్ సిరీస్ కథేంటో ఓసారి చూసేద్దాం. కథ: లక్నో సిటీలో సంజయ్ మిశ్రా( సుకుమార్ భ్రమర్) ది గొప్ప పేరున్న కుటుంబం. అతనికి ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు భార్య కమలేశ్(దివ్య దత్తా), చిన్న కొడుకు అరుణ్ కి పూజ(ప్రసన్న బిస్త్) తో వివాహం జరుగుతుంది. ‌మొదటి రాత్రి పూజకి ఇష్టం లేకున్నా అరుణ్ బలవంతం చేస్తాడు. మొదటి రాత్రి తర్వాత తను ఆ గిల్టీని భరించలేకపోతుంది. తనకి నచ్చినట్లు ఉండలేని ఉంట్లో ఉండలేక పుట్టింటికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళి తన బాధని చెప్పుకుంటే పూజ వాళ్ళ అమ్మ అర్థం చేసుకోకపోగా తిరిగి మామయ్య గారి ఇంటికి పంపించేస్తుంది. దాంతో పూజకి ఏం చేయాలో తెలియదు.‌ఇక మరోసారి పూజ పట్ల అరుణ్ విచక్షణారహితంగా బలవంతం చేస్తాడు. ఇక పూజ భరించలేకపోతుంది. ఇక అరుణ్ వాళ్ళ నాన్న అరుణ్, పూజలని హానీమూన్ కి పంపిస్తాడు. దాంతో పూజ పరిస్థితి మరీ దారుణంగా మారిపోతుంది. అరుణ్ చేతిలో కీలు బొమ్మలా మారిపోతుంది. తనకి ఏ మాత్రం ఇష్టం లేకున్నా, అసలు తన ఇష్టాలేవో తెలుసుకోకుండా అరుణ్ అలా చేయడం పూజకి ఇష్టం లేకుండా ఒక బ్లేడ్ తో తనని తాను గాయం చేసుకుంటుంది. ఇక పూజ తను అనుభవించిన బాధలని అరుణ్ నిజస్వరూపాన్ని అక్క కమలేశ్(దివ్య దత్తా)కు చెప్తుంది. మరి పూజకి న్యాయం జరిగిందా? కమలేశ్ ఏం చేసింది? అరుణ్ తన తప్పు తెలుసుకున్నాడా లేదా అనేది మిగతా కథ. పూజ , అరుణ్ ల వివాహం తర్వాత పూజకి ఇష్టం లేకున్నా అరుణ్ బలవంతం చేస్తాడు. మొదటి రాత్రి తర్వాత తను ఆ గిల్టీని భరించలేకపోతుంది. తనకి నచ్చినట్లు ఉండలేని ఉంట్లో ఉండలేక వెళ్ళిపోతుంది.  విశ్లేషణ: ఒక పక్షి తనకి నచ్చినట్లు స్వేచ్చగా ఎగురుతూ వెళ్తుంది. అది మిగతా వాటి గురించి ఆలోచించి ఎగిరిపోకుండా ఒకే చోట ఉండిపోదు. అలా అని దాని స్వేచ్చని నిలిపేస్తే అది చూస్తూ ఊరుకోదు. ఈ చిరైయా(chiraiya) వెబ్ సిరీస్ లో పూజ కూడా తనకి నచ్చినట్లు ఉండాలని అనుకుంటుంది. కానీ తన ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా తన భర్త చేసిన శారీరక హింసని ప్రతిఘటిస్తుంది. తన స్వేచ్ఛని కాపడుకునే ప్రయత్నంలో తనకి అండగా కమలేశ్ ఉంటుంది.  ఈ సిరీస్ లో మొత్తం ఆరు ఎపిసోడ్ లు ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ ముప్పై నిమిషాల వరకు ఉంటుంది. మొదటి ఎపిసోడ్ ముప్పై మూడు నిమిషాలు ఉంది. ఇందులో కమలేశ్, అరుణ్ , సంజయ్ మిశ్రా ఫ్యామిలీ క్యారెక్టర్స్ పరిచయం అవుతాయి. అలాగే పూజ, అరుణ్ ల వివాహం జరుగుతుంది.   రెండో ఎపిసోడ్ ఇరవై ఏడు నిమిషాలు ఉంది. పూజ తన పుట్టింటికి వెళితే వాళ్ళు తిరిగి అత్తామామయ్యల ఇంటికే పంపిస్తారు. మూడో ఎపిసోడ్ లో అరుణ్, పూజ హనీమూన్ కి వెళతారు. అక్కడ పూజ పడిన బాధలని చూపిస్తారు. నాలుగో ఎపిసోడ్ ఇరవై నాలుగు నిమిషాలు ఉంది. ఇందులో తన హాస్పిటల్ లో ఉంటే కమలేశ్ కి పూజ నిజం చెప్పడంతో తను పడిన బాధని కమలేశ్ గ్రహిస్తుంది. ఇక అయిదో ఎపిసోడ్ ఇరవై ఏడు నిమిషాలు ఉంది. ఇందులో అరుణ్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది కమలేశ్. దాంతో కమలేశ్ వాళ్ళ మామయ్య ఒప్పుకోడు. ఇక కమలేశ్ చేసేదేమీ లేక పూజని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. ఇక చివరిదైన ఆరో ఎపిసోడ్ ముప్పై తొమ్మిది నిమిషాలు ఉంటుంది. ఇందులో ఇద్దరు కోడళ్లు ఇంటికి వస్తారు. చివరగా వాళ్ళకి ఎలా న్యాయం జరిగిందనేది చూపిస్తారు. ఒక సున్నితమైన అంశాన్ని వాస్తవిక కోణంలో చూపించారు దర్శకుడు. సిరీస్ స్క్రీన్ ప్లే అండ్ రైటింగ్ చాలా బాగుంది. ఫ్యామిలీతో చూడకపోవడమే బెటర్. ఇది పూర్తిగా 18+ ఆడియన్స్ కు ఉద్దేశించిన కంటెంట్. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇస్తూ, ఎమోషనల్ గా కనెక్ట్ చేసే ఈ 'మస్ట్ వాచ్' సిరీస్ ఇది. ఈ సిరీస్ మెయిన్ గా పెళ్ళి అయిన ఆడవాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలపై ఉంటుంది. ఆడదాని ఇష్టం లేకుండా ఏ మగాడు తన మీద చేతిని కూడా వేయలేడు. అలాంటిది బలవంతం చేస్తే ఊరకోదు అని చెప్తూ తీసిన ఈ సిరీస్ ఒక మెసెజ్ ని ఇస్తుంది. ఆడవాళ్ళ హక్కుల కోసం తన స్వేచ్చని తిరిగి పొందడానికి పూజకి కమలేశ్ ఉంది. మరి నిత్యం సమాజంలో ఆడవాళ్ళు ఇంట్లో  , బయట అనుభవిస్తున్న వేదింపులకి ఎవరు నిలబడాతారు అంటూ చివరి ఎపిసోడ్ లో ఇచ్చే కన్ క్లూజన్ బాగుంది. కొన్ని అడల్ట్ సీన్లు ఉన్నాయి. పిల్లలతో కలిసి ఈ సిరీస్ ని చూడకపోవడమే బెటర్. శుభంకర్ భర్ సినిమాటోగ్రఫీ ఈ సిరీస్ మూడ్ ని పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది. మ్యూజిక్ ఒకే. ఎడిటింగ్ నీట్ గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.  నటీనటుల పనితీరు:  కమలేశ్ గా దివ్య దత్తా నటన సిరీస్ కి ఫ్రధాన బలంగా నిలిచింది. పూజగా ప్రసన్న బిస్త్ , సిద్దార్థ్ షా గా అరుణ్, సుకుమార్ భ్రమర్ తమ పాత్రలకి పూర్తి న్యాయం చేశారు.  ఫైనల్ గా : మస్ట్ వాచెబుల్ సిరీస్ .   రేటింగ్: 2.5 /5 ✍️. దాసరి  మల్లేశ్
  -పెయిడ్ ప్రీమియర్స్ తో టేక్ ఆఫ్ అయిన ధురంధర్ 2  -అన్ని ఏరియాస్ లో పాజిటివ్ టాక్  -ఆ సినిమా రికార్డులన్నీ గల్లంతు కాబోతున్నాయా! -తొలి రోజు ఎంత రాబట్టిందో చూద్దాం. ఎంటైర్ భారతావని అగస్ట్ 15 తో పాటు ఫెస్టివల్స్ ని ఎలా అయితే గుర్తుపెట్టుకుంటుందో, అదే విధంగా ఈ మధ్య కాలంలో ఒక సినిమా రిలీజ్ డేట్ ని గుర్తుపెట్టుకున్నారంటే 'ధురంధర్ 2 'అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతలా ధురంధర్ 2(Dhurandhar 2)భారతీయులతో మమేకమైంది. వాళ్ళు అనుకున్నట్టుగానే 18 సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడటంతో చలో టూ ధురంధర్ 2 అంటు థియేటర్స్ లోపలకి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ ముఖాల్లో ధురంధర్ 2 చుస్తున్నామన్న గర్వం కూడా చాలా స్పషంగా కనపడింది. మరి అంతటి క్రేజ్ ని అందుకున్న ధురంధర్ 2  ఫస్ట్ డే ఏ మేర కలెక్షన్స్ ని రాబట్టిందో చూద్దాం. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం వరల్డ్ వైడ్ గా 236 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇండియా వైడ్ గా చూసుకుంటే పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 75 కోట్ల గ్రాస్,  నిన్న 100 కోట్ల గ్రాస్ తో మొత్తం 175 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా చెప్తున్నారు . దీంతో బాలీవుడ్ హిస్టరీలోనే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన తొలి బాలీవుడ్ మూవీగా  నిలిచింది. ఈ విషయంలో ఇప్పటి వరకు ఆధిపత్యాన్ని చెలాయించిన షారుక్ ఖాన్ జవాన్ మూవీ ధురంధర్ 2 కి వెల్ కమ్ చెప్పి సైడ్ అవ్వాల్సిన పరిస్థితి.  Also read: UStaad Bhagat Singh: ఫస్ట్ డే రికార్డు కలెక్షన్స్!.. ధురంధర్ 2 అవుట్  ప్రెజెంట్ ధురంధర్ 2 అన్ని ఏరియాస్ లో పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. రణవీర్ సింగ్(Ranveersingh)వన్ మాన్ షో విశ్వరూపాన్ని ఆదిత్య దర్(Aditya Dhar)పర్ఫెక్ట్ గా ప్రెజెంట్ చెయ్యడమే పాజిటివ్ టాక్ కి కారణం. మరి ఈ లెక్కన తొలి రోజే 236 కోట్ల గ్రాస్ వసూలు చేసిందంటే లాంగ్ రన్ లో రికార్డు కలెక్షన్స్  సాధించడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మరి ఈ లెక్కన పుష్ప 2 టోటల్ కలెక్షన్స్ కి ధురంధర్ 2 ఎసరు పెట్టే అవకాశం ఉంటుందేమో అనే చర్చ సైతం ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతుంది. ధురంధర్ మొదటి భాగం 1300 కోట్ల దగ్గరే ఆగిపోగా, పుష్ప 2 పూర్తి రన్నింగ్ లో 1700 కోట్ల రూపాయిల వరకు రాబట్టింది.   
  -నిన్న సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అయిన ఉస్తాద్  -హిట్ అంటున్న ఫ్యాన్స్, మేకర్స్  -తొలి రోజు కల్లెక్షన్స్ ఇవేనా! నిన్న ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలోని థియేటర్స్ 'ఉస్తాద్ భగత్ సింగ్'(UStaad Bhagat Singh)రాకతో కళకళలాడాయి. దీంతో పవన్(Pawan Kalyan)అభిమానులు ఎవరో, మూవీ లవర్స్ ఎవరో తెలుసుకోలేని విధంగా జాతర వాతావరణం తలపించింది. ఉగాది రోజు బడా హీరో సినిమా రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత సందడి వాతావరణం నెలకొని ఉంటుందో ఎంటైర్ ఇండస్ట్రీకి ఉస్తాద్ తన రాకతో కూడా చెప్పినట్లయింది. దాదాపుగా నిన్న అన్ని స్క్రీన్స్ వరల్డ్ వైడ్ గా  ఫుల్ క్లౌడ్ మరి ఫస్ట్ డే ఏ మేర కలెక్షన్స్ సాధించిందో చూద్దాం. ఉస్తాద్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 52 కోట్ల గ్రాస్ ని రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇదే కనుక నిజమైతే పవన్ కెరీర్ లోనే మరోసారి ఉస్తాద్ తో  ఫస్ట్ డే కి సంబంధించి మరోసారి రికార్డు  కలెక్షన్స్ రాబట్టినట్టే. ఓజి కన్నా తక్కువే అయినా ఉస్తాద్ సాధారణ రేట్స్ కే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఓపెనింగ్స్ ని రాబట్టడం విశేషం. ధురంధర్ 2 ఫీవర్ తెలుగులో ఉన్నా కూడా ఉస్తాద్ ఫస్ట్ డే కలెక్షన్స్ ని ధురంధర్ 2 దాటలేకపోయింది. కాకపోతే ఉస్తాద్ ఫస్ట్ డే కల్లెక్షన్స్ గురించి మేకర్స్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. also read: Dhurandhar 2 review in telugu: ధురంధర్ 2 సినిమా రివ్యూ  టాక్ పరంగా చూసుకుంటే ఉస్తాద్ కి ప్రేక్షకుల తో పాటు మెజారిటీ రివ్యూస్ పర్వాలేదనే స్థాయిలో వస్తున్నాయి. అభిమానులు అయితే పవన్ వన్ మాన్ షో అని సినిమా హిట్ అంటున్నారు. మేకర్స్ నిన్న సక్సెస్ మీట్ ని నిర్వహించి అభిమానులకి, ప్రేక్షకులకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో వీకెండ్ తో పాటు లాంగ్ రన్ లో ఉస్తాద్ ఏ మేర కలెక్షన్స్ సాధిస్తుందనే ఆసక్తి అందరిలో ఏర్పడింది.  
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025’ వేడుక హైదరాబాద్‌ లో వైభవంగా జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో ఈ ఏడాది 'ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు'ను మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) అందుకున్నారు. చిరంజీవికి ఈ అవార్డును రేవంత్ రెడ్డి ప్రధానం చేశారు. (Gaddar Awards) 'ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు' అందుకున్న అనంతరం చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎక్కడైతే కళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని అంటారు. దానిని రేవంత్ రెడ్డి గారు సరిగ్గా అర్థం చేసుకున్నారు. కొన్నేళ్లుగా నిర్లక్ష్యం చేయబడ్డ సినిమా అవార్డులను మళ్ళీ పునరుద్ధరించారు." అంటూ రేవంత్ పై ప్రశంసలు కురిపించారు. అదే సమయంలో ఏపీ సీఎం చంద్రబాబుకి చిరంజీవి ఓ విజ్ఞప్తి చేశారు. సినిమా అవార్డుల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని అభిప్రాయపడ్డారు. సినిమా వాళ్ళకు అతి దగ్గరగా ఉండే చంద్రబాబు గారు.. దీనిని స్ఫూర్తిగా తీసుకొని కళాకారులను ప్రోత్సహిస్తూ అవార్డులు ఇస్తే బాగుంటుందని చిరంజీవి రిక్వెస్ట్ చేశారు. అవార్డుల జాబితా: ఉత్తమ చిత్రం - రాజు వెడ్స్ రాంబాయి రెండవ ఉత్తమ చిత్రం -  దండోరా మూడవ ఉత్తమ చిత్రం -  ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్‌ షో ఉత్తమ పర్యావరణ చిత్రం  - ఇగ్వా ఉత్తమ డెబ్యూ ఫీచర్‌ ఫిల్మ్ - లిటిల్‌ హార్డ్స్ ఉత్తమ వినోదాత్మక చిత్రం  - సంక్రాంతికి వస్తున్నాం ఉత్తమ సోషల్‌ మెసేజ్‌ చిత్రం - కోర్టు ఉత్తమ స్పెషల్‌ ఎఫెక్ట్స్ మూవీ - మిరాయ్‌ ఉత్తమ బాలల చిత్రం  - అనగనగా ఉత్తమ నటుడు- నాగచైతన్య (తండేల్‌) ఉత్తమ నటి - రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్ ) ఉత్తమ దర్శకుడు - సాయిలు (రాజు వెడ్స్ రాంబాయి) ఉత్తమ సహాయ నటుడు - శివాజీ (దండోరా) ఉత్తమ సహాయ నటి - భూమిక (యుఫోరియా ) ఉత్తమ సంగీత దర్శకుడు-  మార్క్ కె. రాబిన్  (దండోరా) ఉత్తమ మేల్‌ సింగర్‌- అనురాగ్‌ కులకర్ణి (రాజు వెడ్స్‌ రాంబాయి) ఉత్తమ ఫిమేల్‌ సింగర్‌- సాహితి చాగంటి (కన్నప్ప) ఉత్తమ కమెడియన్ - శ్రీ కృష్ణ తేజ (జిగ్రిస్‌) ఉత్తమ బాలనటుడు - రోహన్‌ (ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో ) ఉత్తమ స్టోరీ రైటర్‌ - గుణశేఖర్‌ (యుఫోరియా ) ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌ - అనిల్‌ రావిపూడి ఉత్తమ గేయ రచయిత - నందకిశోర్‌ (కుబేర) ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ - కార్తిక్‌ ఘట్టమనేని (మిరాయ్‌) ఉత్తమ ఎడిటర్‌- శ్రీకర్‌ ప్రసాద్‌ (మిరాయ్‌) ఉత్తమ ఆడియోగ్రాఫర్‌ - ఎం.ఆర్‌ రాధాకృష్ణన్‌ (కిష్కిందపురి) ఉత్తమ కొరియోగ్రాఫర్‌ - గిర గిర గిర (ఛాంపియన్‌) ఉత్తమ ఆర్ట్ డైరక్టర్‌ - తోట తరణి (ఛాంపియన్‌) ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్ - గోవింద్‌ (అఖండ) ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ -  చంద్రకాంత్‌ (ఛాంపియన్‌) స్పెషల్‌ జ్యూరీ అవార్డులు.. శ్రీరాజ్ రాచకొండ (23 మూవీ) చైతు జొన్నలగడ్డ (రాజు వెడ్స్‌ రాంబాయి) రోషన్‌ మేక (ఛాంపియన్‌) అనంతిక సనీల్ కుమార్‌ (8 వసంతాలు) స్పెషల్‌ అవార్డులు.. ఎన్టీఆర్‌ నేషనల్ అవార్డు - చిరంజీవి పైడి జైరాజ్ అవార్డు - కమల్‌ హాసన్‌ బీఎన్‌రెడ్డి ఫిల్మ్‌ అవార్డు- సింగీతం శ్రీనివాసరావు నాగిరెడ్డి చక్రపాణి అవార్డు - అశ్వనీ దత్‌ కాంతారావు అవార్డు - ఆర్‌. నారాయణమూర్తి రఘుపతి వెంకయ్య ఫిల్మ్‌ అవార్డు - రమేష్ ప్రసాద్‌ సి.నారాయణరెడ్డి ఫిల్మ్‌ అవార్డు - సుద్దాల అశోక్‌ తేజ అక్కినేని నాగేశ్వరరావు ఫిల్మ్‌ అవార్డు - జయసుధ
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
నిజమే ఉగాది పండుగ మనదే. తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది తోనే ప్రారంభమవుతుంది.  మన కొత్త సంవత్సరం అంతా ఎంతో కళను నింపుకుని ఉంటుంది. సాంప్రదాయంగా ఉంటుంది. ముఖ్యంగా కృత్రిమత్వంలో పడిపోతున్న మనిషిని బయటకు తీసుకొచ్చి కాసింత ప్రకృతి మధ్య నిలబెడుతుంది. ఇంతకూ మన ఉగాది మనకు మాత్రమే తెలుసా!! మనకు తెలిసిన ఉగాది ఏంటి?? మనం రేపటి తరానికి ఉగాది గురించి చెబుతున్నది ఏంటి??  ఉగాది వెనుక కథ!! సోమకుడు అనేవాడు వేదాలను హరించాడు(దొంగిలించాడు). అలా వేదాలను దొంగిలించిన సోమకుడిని  మత్స్యవతారంలో ఉన్న  విష్ణువు వధించి(సంహరించి, చంపి) వేదాలను బ్రహ్మకు అప్పగించిన శుభదినంను పురస్కరించుకుని విష్ణువు ప్రీత్యర్ధం 'ఉగాది' ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.  అయితే చైత్రశుక్లపాడ్యమినాడు ఈ విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కాబట్టి, సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుపబడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్రశుక్లపాడ్యమినాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా మారిన కారణంతో ఆ యోధుడిని స్మరించుకుంటూ ఉగాది జరుపుకుంటారని చారిత్రక వృత్తాంతం. ఇలా కారణాలు ఎన్ని ఉన్నా ఉగాది అనేది ఓ కొత్తదనానికి సూచిక.  ఆశను మొలిపించే తరుణం!! మనిషి తరతరాలుగా ఓ నమ్మకంతో ఉన్నాడు. అదే కొత్తదనంలో జీవితం కొత్తగా మారుతుందని. అది చాలా మంచి ఆశావహదృక్పథం కలిగి ఉంటుంది. ఆకురాల్చు కాలంలో చెట్ల ఆకులు అన్నీ పోయాక, మోడువారి ఏమీలేనితనంతో ఉన్నప్పుడు, వసంతం వస్తుంది, మెల్లిగా చివురులు తొడుగుతాయి చెట్లు. అవన్నీ పచ్చని ఆశల చివురులు, ఉగాదిలో దాగున్నది అదే అంటారు అందరూ. షడ్రుచులు-జీవితసారం!! ఉగాది రోజు అందరి ఇళ్లలో ఉండే ప్రత్యేక విందు ఉగాది పచ్చడి. నిజానికి జీవితమంతా ఆ పచ్చడిలోనే ఉందని చెబుతారు పెద్దలు. కష్టాలు, సుఖాలు, బాధలు, ఇబ్బందులు, ప్రేమలు, పొట్లాటలు ఇలా అన్నీ ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచులలో కలిసిపోయి ఉంటాయని చెబుతారు. అందుకే ఉగాది రోజు ఉగాది పచ్చడికి నత ప్రత్యేకత వచ్చి పడింది. అలాగే మరొక విషయం కూడా. ఉగాది సమయంలోనే కొత్త బెల్లం దొరుకుతుంది, మామిడికాయల గురించి ప్రత్యేకంగా చెప్పాలా?? ఈ సమయానికి కాస్త చిన్న చిన్నగా ఉన్న వగరుతో ఉన్న కాయలు వస్తాయి. ఇంకా ఎంతో గొప్ప ఔషధ మూలాలు కలిగిన వేపచెట్లకు పువ్వులు పూస్తాయి, కొత్త చింతపండు ఎర్రెర్రగా నిగానిగలాడుతూ అందరి ముందుకూ వస్తుంది.  వీటన్నింటి కలయిక అయిన వేపపచ్చడి ఆరు రుచులతో కనువిందు చేస్తుంది. సంప్రదాయపు గీతిక!! ఉగాది రోజు మగవాళ్ళు అందరూ పంచెకట్టులోనూ, ఆడవాళ్లు పట్టుచీరల్లోనూ, పిల్లలు కొత్త బట్టల్లోనూ మెరిసిపోతూ ఉంటారు. ఆ వస్త్రధారణలో అసలైన తెలుగుదనం ఉట్టిపడుతూ ఉంటుంది. నగరాలలో కృత్రిమత్వంలో మునిగిపోయిన యువత ఎంతో అందంగా, పద్దతిగా, బుద్దిగా ఇలా తయారైతే ఇంటిల్లిపాదికీ ఎంత సంతోషమో!! ఇంకా పంచాంగ శ్రవణం మరొక వేడుక, పిండి వంటల సంబరం మరొక ఎత్తు. ఇలా అన్ని విధాలుగా ఉగాది మనిషి జీవితంతో ముడిపడి ఉంటుంది. మనిషి జీవితానికి అసలైన నిర్వచనాన్ని ఉగాది చెబుతుంది. అభివృద్ధి వేగంలో మనిషి మర్చిపోతున్న అసలైన నడవడికను మన ఉగాది మనకు తిరిగి అందిస్తుంది. అందుకే ఇది మన తెలుగుసంవత్సరం అని గొప్పగా జరుపుకోవాలి.                                    ◆ వెంకటేష్ పువ్వాడ.
హిందువులకు తులసి మొక్క దైవంతో సమానం. తులసి మొక్క పచ్చగా కళకళలాడుతూ ఉంటే ా ఇంట్లో ఎంతో సానుకూల శక్తి,  మరెంతో సంతోషం ఉంటాయని చెబుతారు. అయితే వేసవి కాలం వచ్చేసింది. తులసి మొక్కతో సహా చాలా రకాల మొక్కలు వేసవి ఎండల కారణంగా వాడిపోయి ఎండిపోతుంటాయి. కానీ పవిత్రమైన తులసి మొక్క పచ్చగా ఉంటేనే మంచిది.  ఇది ఇంటికి అందాన్నే కాకుండా సానుకూల శక్తిని కూడా నిలిపి ఉంచుతుంది.  వేసవి ఎండలు ఎంత ఉన్నా తులసి మొక్క అందంగా,  పచ్చగా ఉండాలంటే  కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. తులసి మొక్క ఔషధ గుణాలతో సమృద్ధిగా ఉంటుంది. వేసవి కాలం కదా అని చాలామంది తులసి మొక్కకు ఎక్కువ నీరు పెడుతూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు.  ఎక్కువ నీరు పెట్టడం వల్ల మొక్క దెబ్బతింటుంది. నేల తేమగా  ఉండేందుకు తగినంత మాత్రమే మొక్కకు నీరు పెట్టాలి. మొక్క నీటిలో మునిగినట్టు ఉంటే ఆ మొక్కకు హాని కలుగుతుంది. తులసి మొక్క గురించి నిర్లక్ష్యంగా ఉండకూడదు.  కొన్నిసార్లు, మొక్కను సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది కుళ్ళిపోతుంది.  కొన్ని ఇళ్లలో వర్షాకాలంలో కూడా తులసి మొక్క పచ్చగా కనిపించదు. అలాంటి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కలను కుండీలలో పెంచుతూ ఉంటారు.  వీటికి కొన్నిసార్లు,  పోషకాహార లోపం కూడా  ఎదురవుతుంది.  మొక్కల ఎదుగుదలకు  అవసరమైన పోషకాలు అందించడం చాలా ముఖ్యం. తులసి మొక్కను పచ్చగా ఉంచడానికి,  ఎరువులు వేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎరువులు వేస్తూ ఉంటే కొన్ని రోజులకే మొక్క పచ్చగా మారుతుంది. తులసి మొక్క ఎండిపోయినట్టు ఉంటే మొక్క  మట్టికి ఆవాల కేక్ వేయవచ్చు. ఆవాల కేక్ వేయడం వల్ల మొక్క వేగంగా పెరుగుతుంది.  ఆవాల నూనె తీసిన తర్వాత వచ్చే పిప్పిని ఆవాల కేక్ అని అంటారు.  ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఒక స్పూన్ ఆవాలను బాగా గ్రైండ్ చేసి ఆ పొడిని నేరుగా మట్టిలో మిక్స్ చేయవచ్చు. లేదంటే ఆవాల పొడిని నీటిలో వేసి ఒక రోజంతా అలాగే ఉంచి,  ఆ తరువాత  ఆ నీటిని మొక్కకు పోయవచ్చు. మొక్క బలంగా పచ్చగా పెరుగుతుంది. తులసి మొక్క ఎండిపోతూ ఉంటే.. ఎండిపోయిన కొమ్మలను తొలగించి,  ఆవాల పొడిని వేయడం వల్ల మొక్క తిరిగి కొన్ని రోజులకే పచ్చగా మారుతుంది.                                          *రూపశ్రీ.
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.   
  ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఊరికే అనలేదు. కానీ నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి వల్ల మనలో చాలా మంది మలబద్ధకం (Constipation) మరియు మధుమేహం (Diabetes) వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. ప్రతిరోజూ మాత్రలు మింగడం, ఇన్సులిన్ తీసుకోవడం మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. మీ ఇంట్లోనే, మీ వంటింట్లో ఉండే పదార్థాలతో ఈ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తే ఎంత బాగుంటుంది కదా? ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు సూచించిన ఒక అద్భుతమైన "డబుల్ ధమాకా" చిట్కా గురించి ఈ Video Link క్లిక్ చేసిన మనం వివరంగా తెలుసుకుందాం. మనం ఈ మార్పు ఎందుకు చేసుకోవాలి? (Why Should We?) సాధారణంగా మనం తినే రోటీలు కేవలం ఆకలిని తీరుస్తాయి. కానీ వాటికి కొన్ని ప్రత్యేక పదార్థాలను జత చేయడం వల్ల అవి ఔషధాలుగా మారుతాయి: • సహజసిద్ధమైన పరిష్కారం: ఎటువంటి రసాయనిక మందులు లేకుండానే ఉదయం పూట సాఫీగా విరేచనం అయ్యేలా చేస్తుంది. • పోషకాల గని: చియా సీడ్స్ వల్ల శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం మరియు ఫైబర్ అందుతాయి. • దీర్ఘకాలిక ప్రయోజనాలు: కేవలం షుగర్ కంట్రోల్ చేయడమే కాకుండా, భవిష్యత్తులో బరువు పెరగకుండా, హార్మోన్ల అసమతుల్యత కలగకుండా కాపాడుతుంది. • మెదడు ఆరోగ్యం: వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు (అల్జీమర్స్), పార్కిన్సన్స్ వంటి సమస్యలు రాకుండా ఈ పదార్థాలు రక్షణనిస్తాయి. • మందుల వాడకం తగ్గుతుంది: సరైన ఆహార నియమాలు పాటిస్తూ ఈ రోటీలు తీసుకోవడం వల్ల మీరు వాడే షుగర్ మాత్రల డోస్, ఇన్సులిన్ అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఎలా తయారు చేసుకోవాలి? (How-to Guide) మీరు రోజూ తినే రెండు పుల్కాలు లేదా రోటీల పిండిలో ఈ క్రింది విధంగా కలపండి: 1. మలబద్ధకం సమస్య ఉన్నవారి కోసం: • చియా సీడ్స్: 2 నుండి 3 టీస్పూన్ల చియా సీడ్స్‌ను 15 నిమిషాల పాటు నీటిలో నానబెట్టాలి. • సబ్జా గింజలు: 1 నుండి 1.5 టీస్పూన్ల సబ్జా గింజలను కూడా నానబెట్టుకోవాలి. • ఈ నానబెట్టిన గింజలను నీటితో సహా పిండిలో కలిపేసి రొట్టెలు చేసుకోవాలి. 2. షుగర్ (డయాబెటిస్) నియంత్రణ కోసం: • పచ్చి పనసకాయ పొడి: 2 నుండి 3 టీస్పూన్ల పచ్చి పనసకాయల పొడిని పిండిలో కలపాలి (ఇది ఆన్‌లైన్ లేదా మెడికల్ షాపుల్లో దొరుకుతుంది). • మెంతి పొడి: ఒక టీస్పూన్ వేయించిన మెంతుల పొడిని కలపాలి. • ఈ మిశ్రమంతో రోటీలు చేసుకుంటే మెంతి పొడి వల్ల వచ్చే చేదు కూడా వేడి చేయడం వల్ల తగ్గుతుంది, రుచిగా ఉంటుంది. ఏమి చేయకూడదు? (What Not to Do) • నానబెట్టకుండా వాడకండి: చియా సీడ్స్ లేదా సబ్జా గింజలను నేరుగా పిండిలో కలపకూడదు, కచ్చితంగా నానబెట్టాలి. • పనస పండు వద్దు: షుగర్ ఉన్నవారు పనస పండు తినకూడదు (గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువ), కేవలం 'పచ్చి పనసకాయ పొడి' మాత్రమే వాడాలి. • మందులు ఆపకండి: ఈ చిట్కాలు పాటిస్తూనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడుతూ, షుగర్ లెవల్స్ తగ్గుతున్న కొద్దీ డాక్టర్ సలహాతోనే డోస్ తగ్గించుకోవాలి. • అతిగా వద్దు: ఆరోగ్యానికి మంచిది కదా అని మితిమీరిన పరిమాణంలో పదార్థాలను వాడకండి, పైన చెప్పిన కొలతలు పాటించండి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: ఈ రోటీలను పిల్లలకు ఇవ్వవచ్చా? జ: తప్పకుండా ఇవ్వవచ్చు. చిన్న పిల్లలకు ఇచ్చేటప్పుడు పదార్థాల పరిమాణం (డోస్) కాస్త తగ్గిస్తే సరిపోతుంది. ఇది వారి జీర్ణక్రియకు చాలా మంచిది. ప్ర: గింజలను విడిగా నీటిలో కలుపుకొని తాగితే సరిపోదా? రోటీలోనే ఎందుకు కలపాలి?  జ: రోటీలో కలిపి వేడి చేయడం వల్ల అవి సులభంగా జీర్ణమవుతాయి. అలాగే, ఔషధంలా విడిగా తీసుకోకుండా ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మానసికంగా కూడా బాగుంటుంది మరియు రుచిగా ఉంటుంది. ప్ర: ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఇవి తీసుకోవచ్చా?  జ: అవును, ఎటువంటి సమస్యలు లేని వారు కూడా వీటిని తీసుకోవడం వల్ల భవిష్యత్తులో షుగర్, బరువు పెరగడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలి మన చేతుల్లోనే ఉంది. చిన్న చిన్న మార్పులతో పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ చిట్కాలను పాటించి మీ అనుభవాలను మాతో పంచుకోండి. మరిన్ని ఆసక్తికరమైన మరియు ఆరోగ్యకరమైన చిట్కాల కోసం, ప్రత్యక్ష నిపుణుల సలహాల కోసం మా యూట్యూబ్ ఛానల్  క్లిక్ చేయండి  👉 [www.youtube.com/@Naveenacolumn] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
  డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి.  చాలమంది డ్రై ఫ్రూట్స్ ను నేరుగా తినడం కంటే వాటిని నానబెట్టుకుని తినడం చాలా మంచిదని చెబుతారు. ఇలా నానబెట్టుకుని తినే డ్రై ప్రూట్స్ లో బాదం,  జీడిపప్పు, ఎండు ద్రాక్ష,  ఖర్జూరం మొదలైనవాటితో పాటు వాల్నట్స్ కూడా ఉంటాయి.  వీటిని నానబెట్టుకుని తినడం వల్ల పోషకాలు లభిస్తాయి. శరీరానికి ప్రోటీన్ లభిస్తుంది.  అలాగే సాధారణంగా ఉన్న డ్రై ఫ్రూట్స్ ను తినడం కంటే.. నానబెట్టిన వాటిని తినడం వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయి.  అయితే నానబెట్టిన వాల్నట్స్ ను సాధారణంగా రాత్రి నానబెట్టి,  ఉదయాన్నే  తింటుంటారు.  కానీ.. ఇలా నానబెట్టిన వాల్నట్స్ ను ఉదయం కాకుండా వేరే సమయంలో తినడం వల్ల ఫలితాలు బాగుంటాయట.  శరీరానికి మంచి బెనిఫిట్ చేకూరుతుందట.  ఇంతకీ నానబెట్టిన వాల్నట్స్ ను ఏ సమయంలో తినాలి? ఏ సమయంలో తినడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి? తెలుసుకుంటే.. సాయంత్రం.. నానబెట్టిన వాల్నట్స్ ను సాయంత్రం సమయంలో తినడం చాలా మంచిదని వైద్యులు, ఆహార నిపుణులు అంటున్నారు. వాల్నట్స్ లో ఉండే పోషకాలలో ప్రముఖమైనది ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు.  అలాగే మెలటోనిన్ కూడా పుష్కలంగా ఉంటుంది.  అందుకే వీటిని సాయంత్రం సమయంలో తినడం మంచిదని అంటారు. వాల్నట్స్ లో ఉండే ఒమేగా-3 మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మెదడు పని తీరుకు చాలా సహాయపడుతుంది.  అలాగే వాల్నట్స్ లో ఉండే మెలటోనిన్ కూడా శరీరానికి చాలా అవసరం. ఇది నిద్రను మెరుగ్గా ఉంచడంలో, నిద్రను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వాల్నట్స్ లో ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెలటోనిన్ మాత్రమే కాకుండా పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను, అభ్యాసన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. వాల్నట్స్ లో ఉండే ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వుల జాబితాకు చెందినవి. ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో సహాయపడుతుంది. అట్లాగే చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ ను డీల్ చేయడం ద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. నానబెట్టిన వాల్నట్స్ తింటే జీర్ణవ్యవస్థ కూడా బలపడుతుంది. ఎందుకంటే వాల్నట్స్ నానడం ద్వారా ఫైబర్ మెరుగవుతుంది.  ఈ ఫైబర్ జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ఇది మలబద్దకం సమస్యను నివారిస్తుంది. నానబెట్టిన వాల్నట్స్ తింటే ఎక్కువ సేపు కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఇది ఆహారం ఎక్కువ తీసుకోవడాన్ని నివారిస్తుంది. తద్వారా బరువు అదుపులో ఉంచడం లేదా బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.                                         *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...