LATEST NEWS
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ మరో వారం రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో.. రాష్ట్రంలో పొత్తుపొడుపులు కొలిక్కి వస్తున్నాయి.  ప్రతిపక్ష  అన్నాడీఎంకే నేతృత్వంలోని జాతీయ ఎన్డీయే మధ్య ఇంత కాలం కుదరని సీట్ల సర్దుబాటు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది.  సోమవారం (మార్చి 23) చెన్నైలో జరిగిన ఎన్డీయే భాగస్వామ్య పక్షాల  భేటీలో  పార్టీల  మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన కూటమి.. ఏయే పార్టీలు ఎన్నెన్ని స్థానాల్లో పోటీ చేస్తాయన్న విషయాన్ని వెల్లడించింది.   కూటమిలోని పార్టీలు పోటీ చేసే సీట్ల వివరాలను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమక్షంలో  వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్.. సీట్ల సర్దుబాటుపై తాము పూర్తి సంతృప్తితో ఉన్నామని తెలిపారు. ముఖ్యమంత్రి స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్న ఆయన  ఈ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు.   వాస్తవానికి ఈ కూటమి సీట్ల సర్దుబాటు ఇంత వరకూ ఓ కొలిక్కి రాకపోవడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ అని చెప్పాల్సి ఉంటుంది.  ఆ పార్టీతో పొత్తు కుదుర్చుకునేందుకు బీజేపీ చివరి నిముషం వరకూ ప్రయత్నించింది. ఒక దశలో టీవీకే, బీజేపీ మధ్య పొత్తుపొడిచిందన్న వార్తలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే టీవీకే అధినేత విజయ్ ఒంటరి పోరుకే మొగ్గు చూపడంతో ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో బీజేపీ అన్నాడీఎంకేను కలుపుకుని ఎన్నికలకు వెళ్లాల్సి వచ్చిందన్నది పరిశీలకుల విశ్లేషణ.   మొత్తానికి   ఎన్డీయే కూటమిలో సీట్ల సర్దుపాట్లు ముగిసి ఏకాభిప్రాయం సాధ్యమైంది. 234 అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో  అన్నాడీఎంకే సింహభాగం సీట్లను తన వద్దే ఉంచుకుంది.  ఆ పార్టీ  178 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించింది. ఇక కూటమిలోని మరో ప్రధాన భాగస్వామి అయిన భారతీయ జనతా పార్టీ 27 స్థానాలలో పోటీ చేస్తుంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే.. గత ఎన్నికలలో ఇదే పొత్తులో భాగంగా బీజేపీ కేవలం 20 స్థానాలలో మాత్రమే పోటీ చేసింది. ఈ సారి మరో ఏడు స్థానాలను అదనంగా దక్కించుకుంది.  ఇక కూటమిలోని ఇతర పార్టీలలో,  అన్బుమణి రామ్‌దాస్ నేతృత్వంలోని పీఎంకే  18 స్థానాల్లోనూ,  టీటీవీ దినకరన్ సారథ్యంలోని ఏఎంఎంకే11 స్థానాలలోనూ పోటీ చేస్తుంది.    అదలా ఉంటే పీఎంకేలో చీలిక వచ్చింది. ఆ పార్టీ అధినేత రామదాసు తన వర్గంతో కలిసి శశికళ కూటమితో చేతులు కలపడం ఆసక్తి కరంగా మారింది.  ఇక పోతే.. అధికార డీఎంకే కూటమిలో  సీట్ల సీట్ల సర్దు ‘పాట్లు’ ఇంకా కొనసాగుతున్నాయి.  ప్రస్తుతం తమిళట   డీఎంకే కూటమి, అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీయే, విజయ్ టీవీకే పార్టీ,   శశికళ కూటముల మధ్య చతుర్ముఖ పోటీ  ఉన్నప్పటికీ.. అందరి ఆస క్తీ టీవీకే  ఈ ఎన్నికలలో చూపే ప్రభావంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23న ఒకే విడతలో  జరుగుతాయి. మే 4న ఫలితాలు విడుదల  అవుతాయి. 
చంద్రబాబు వంటి దార్శనికుడు ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెడీ కుమారస్వామి అన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో భారీ ఉక్కుకర్మాగారం శంకుస్థాపన  ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్ డీ కుమారస్వామి అంతకు ముందు విశాఖలో మీడియాతో మాట్లాడారు.  దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్‌ విశాఖలో ఏర్పాటు కావడం వెనుక ఉన్నది చంద్రబాబు కృషీ చిత్తశుద్ధేనని అన్నారు. ఈ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఏపీ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు.  అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలో లక్సెంబర్గ్‌కు చెందిన ఆర్సెలార్ మిట్టల్, జపాన్‌కు చెందిన నిప్పన్ స్టీల్ కంపెనీలు సంయుక్తంగా ఈ భారీ ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం ఆ కంపెనీలు   రూ.1,47,162 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయి. రెండు దశల్లో ప్లాంట్ నిర్మాణం జరగనుండగా, 2029 నాటికి ఉత్పత్తి ప్రారంభించాలని లక్ష్యం. ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా  65 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డ్ చేరింది. భారత రాజకీయ చరిత్రలోనే గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. అయన పీఎంగా  అత్యున్నత స్థానంలో  అత్యధిక రోజులు కొనసాగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అదెలా ఉంటే  నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు.  దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి  8932  రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు  రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా  మోడీ కొత్త రికార్డు సృష్టించారు.    వివరాల్లోకి వెడితే.. 2001 అక్టోబ‌ర్ 7న గుజ‌రాత్ సీఎంగా తొలిసారి గా బాధ్య‌త‌లు చేపట్టిన ఆయన సుమారు 13 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.  అనంతరం.. 2014, మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం  చేశారు. నాటి  నుంచి నేటి వ‌ర‌కూ ఆయ‌న భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. అంటే గుజరాత్ సీఎంగా నాలుగు సార్లు, ప్రధనిగా మూడు సార్లు వరుస ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా మోడీ  సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్ర‌భుత్వాధినేత‌గా   కొన‌సాగిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కూ మోడీ 2002, 2007, 2012 ఎన్నిక‌ల‌ను ముఖ్య‌మంత్రిగా విజ‌యం సాధించ‌డం మాత్ర‌మే కాదు.. 2014, 19, 24 ఎన్నిక‌ల‌ను ప్ర‌ధానిగా విజ‌యం సాధించ‌డం  కూడా ఒక రికార్డే. ప్ర‌ధానిగా వ‌రుస‌గా  మూడు ఎన్నిక‌ల విజ‌యం సాధించ‌డం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్  నెహ్రూ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టారు. అత్య‌ధిక కాలం  పీఎంగా ఉండి  మజీ ప్రధాని ఇందిరా  గాంధీ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.  అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ఉన్న రెండో పీఎం మోడీయే. అంతే కాదు ముఖ్య‌మంత్రిగా ఎక్కువ కాలం అనుభ‌వం ఉన్న ప్ర‌ధాని కూడా మోడీయే. కాగా మోడీ రికార్డులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోడీ ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు, పాలనాదక్షతకు ఇది నిదర్శనమని ప్రస్తుతించారు.  24 ఏళ్లకు పైగా ఎక్కడా విరామం లేకుండా దేశానికి సేవ చేయడం ఒక అరుదైన ఘ‌న‌త‌గా కీర్తించారు.  2029 లో కూడా మోడీయే ప్ర‌ధాని అయితే ఇది మ‌రో ఘ‌న‌త కూడా అవుతుంది.  నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి నాలుగు సార్లు ప్ర‌ధాని అయిన ఈ రికార్డును వ‌చ్చే రోజుల్లో మ‌రే నేత కూడా బ్రేక్ చేసే ఛాన్సే లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.
ఉక్కుమహిళగా పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ తన హయాంలో తీసుకుని అమలు చేసిన నిర్ణయాలు ఓ సంచలనం. అంతర్జాతీయ రాజకీయాలలో ఆమెది అందె వేసిన చెయ్యి. యుద్ధ సమయాలలో ఆమె వేసిన అడుగులు విప్లవాత్మకం. ఇక పేదల పాలిట ఆమె పెన్నిది. జనం ఆప్యాయంగా ఆమెను ఇందిరమ్మా అని పిలుచుకున్నారు. గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు.  ఇందిరాగాంధీ.. ఈ పేరుకు పరిచయం అక్కర్లేదు. యావత్ ప్రపంచంలో ఈ పేరు తెలియని వారెవ్వరూ ఉండరు.   దేశ చరిత్రలో   ప్రధానిగా ఎన్నికైన ఏకైక మహిళ ఇందిరాగాంధీ. దాదాపు 16 ఏళ్ల సుదీర్ఘకాలం భారతదేశ ప్రధానిగా కొనసాగిన ఏకైక వనిత ఇందిరాగాంధీ.  గరీబీహఠావో అంటూ దేశంలో పేదరిక నిర్మూలనకు నడుంబిగించారు. బ్యాంకింగ్ రంగాన్ని పేదలకు అందుబాటులోకి తీసుకు వచ్చేలా వాటిని జాతీయం చేశారు.  బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్థాన్‌తో యుద్ధం చేసి విజయం సాధించారు. ఆ సందర్భంగా ఆమెను ప్రత్యర్థులు సైతం ప్రశంసలతో ముంచెత్తారు. వాజ్ పేయి అయితే ఇందిరాగాంధీని కాళికాదేవితో పోల్చి పొగడ్తల్లో ముంచెత్తారు.  అలాగే రాజభరణాలను రద్దు చేస్తూ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. పోఖ్రాన్ అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించి భారత్ అణుశక్తి దేశంగా అవతరించడానికి దోహదపడ్డారు. అలాగే ఖలిస్తాన్ వేర్పాటు వాదాన్ని సమూలంగా అణచివేయడానికి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించారు.   అయితే ఎంతటి మనిషికైనా జీవితంలో ఒడిదుడుకులు తప్పవు. దేశంలో ఎమెర్జెన్సీ తరువాత 1977లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఆ తరువాత ఆమె రాజకీయంగానే కాకుండా, ఆర్థికంగా కూడా ఇబ్బందుల్లో పడ్డారు. ప్రత్యర్థుల ఫిర్యాదులతో కేంద్ర ప్రభుత్వం అప్పట్లో ఆమె బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో కనీసం కోర్టు ఖర్చులకు కూడా చేతిలో డబ్బులోని పరిస్థితిని ఇందిరాగాంధీ ఎదుర్కొన్నారు.  దేశంలోనే తిరుగులేని నాయకురాలిగా ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా అని మన్ననలు అందుకున్న ఇందిరాగాంధీ తీవ్ర ఆర్థిక ఇబ్బందులలో పడి ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థిని ఎదుర్కొన్నారు.  ఆ సమయంలో  ఏదో పని మీద ఇందిరాగాంధీ గారిని  కలవడానికి వచ్చిన పి.వి.నరసింహారావురావును.. “మిస్టర్ పీవీ నాకు కొంచెం డబ్బు అవసరం, సర్దగలరా? అని అడిగారు. దానికి పీవీ ఎంత మేడం అని అడిగితే.. ఇందిరాగాంధీ ఒక వేలు చూపించారట.. దానికి  పీవీ లక్షా అంత నా వద్ద లేదు ఓ ముప్ఫై వేలు ఉన్నాయి అన్నారట. అందుకు ఇందిరాగాంధీ పేలవంగా ఓ నవ్వు నవ్వి వేలూ లక్షలూ కాదు పీవీ కోటి రూపాయలు కావాలి అనడంతో.. పీవీ ప్రయత్నిస్తాను అని చెప్పి బయటకు వచ్చారట. ఆ తరువాత అప్పటి హిందూపురం ఎంపీ సోమశేఖర్ కు విషయం చెప్పి సర్దగలవా అని అడిగితే.. ఆయన తన వల్ల కాదు అని  ఎల్జీ బాలకృష్ణ పేరు సూచించారట. ఎల్జీ బాలకృష్ణ కోయంబత్తూరు కేందరంగా వ్యాపారాలు సాగించేవారు. ఆయనకు హిందూపురంలోనూ రెండు స్పిన్నింగ్ మిల్స్ ఉన్నాయి.   సోమ శేఖర్   బాలకృష్ణను కలిసి విషయం చెప్పగానే..  క్షణం ఆలోచించకుండా అంత గొప్ప నాయకురాలు అడిగితే కాదనడం ఏమిటి అంటూ వెంటనే రెండు ట్రంకు పెట్టేల్లో కోటి రూపాయలు నింపి ఇచ్చి పంపించారట. అప్పట్లో వందరూపాయల నోటే పెద్దది. అటువంటి వందరూపాయల నోట్లను కట్టలు కట్టి రెండు ట్రంక్ పెట్టెల్లో నింపి ఇద్దరు మనుషులను తోడిచ్చి మరీ ట్రైన్ ఎక్కించారట. ఆ సొమ్ము అలా పీవీ నరసింహరావు ద్వారా ఇందిరాగాంధీకి చేరింది. ఎవరిచ్చారు అని అడిగితే పీవీ ఎల్జీబాలకృష్ణ పేరు చెప్పారు. ఇందిరాగాంధీ ఆ పేరు నోట్ చేసుకున్నారట. సాధారణంగా అయితే ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగిపోతుంది. ఎందుకంటే ఇందిరాగాంధీ అంతటి గొప్ప వ్యక్తి అడిగితే ఇవ్వడం, ఆ తరువాత ఆ విషయం మరుగున పడిపోవడం జరుగుతుందిప. కానీ ఇందిరాగాంధీ వ్యక్తిత్వం అలాంటిది కాదు.     1980 ఎన్నికలలో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అద్భుత విజయం సాధించింది. ఆమె ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ ప్రమాణ స్వీకారానికి తనను కష్టకాలంలో ఆదుకున్న బాలకృష్ణను ప్రత్యేకంగా ఆహ్వానించారు. తన కారులో  ప్రమాణ స్వీకార వేదిక వద్దకు తీసుకువెళ్లారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో   ఎల్జీ బాలకృష్ణకుప్రత్యేక ఆసనం ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమం ముగిసిన తరువాత తన ఇంటికి తీసుకువెళ్లి ఆయనతో కలిసి భోజనం చేశారు.  ఇవేవి  మొక్కుబడికి చేసిన మర్యాదలు కావు.  దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి,  మనస్ఫూర్తిగా  చేసిన మర్యాదలు. మూడేళ్ల కిందట ఎల్జీ బాలకృష్ణ తనకు కష్ట కాలంలో చేసిన సాయాన్ని మరిచిపోకుండా ఆయనకు ఆత్మీయ సత్కారం చేశారు ఇందిరాగాంధీ. ప్రధాని హోదాలో ఉన్న ఇందిరా గాంధీ  ఆయనకు హాయ్  చెప్పి, షేక్ హ్యాండిచ్చి ఊరుకోవచ్చు.  కాదనేవారు ఎవరు? లేదా, వేరొకరికి  అప్పచెప్పి, ప్రమాణ స్వీకారంలో  ముందు వరుసలో సీటు కేటాయించి, ఓ ఫోటో దిగి వెళ్లిపోవచ్చు. అదే గొప్ప.  కాని.. ఇందిరాగాంధీ అలా చేయలేదు.   గతం గుర్తుంచుకొని  స్వయంగా ఆహ్వానించి, తమతోనే తీసు కెళ్ళి ఇంట్లో కలిసి భోం చేయడం, ఆమె ఔన్నత్యానికి ప్రతీక. చేసిన మేలును మరువని హృదయపూర్వక కృతజ్ఞత. అది ఒక గొప్ప జ్ఞాపిక.  ఉదయం సాయం చేసిన వారిని సాయంకాలానికే  మర్చిపోతున్న ఈ రోజుల్లో పొందిన ఉపకారాన్ని గుర్తుంచుకొని సరైన గుర్తింపు ఇచ్చే వారే నిజమైన నాయకులని నిరూపించిన వాస్తవ ఘటన. ఇందిర వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్నీ నేటి తరం  నాయకులు స్ఫూర్తిగా తీసుకోవాలని తెలుగువన్ ఆకాంక్షిస్తోంది.
  పార్టీ స్థాపించి దశాబ్ధం గడిచినా జనసేనకు బలమైన పునాదులు కనిపించడం లేదు. కేవలం డిప్యూటీ సీఎం పవన్ చరిష్మాతోనే పార్టీ నడుస్తోంది తప్ప.. సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కాలేదు. ఓ సారి అధికారంలోకి వచ్చి ఆర్థికంగా కుదుటపడితే, తర్వాత పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసేలా చర్యలు చేపడతారని జనసేనలోని చాలా మంది భావించారు. అయితే..డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్‌కళ్యాణ్ పూర్తిగా పాలనపైన దృష్టి పెట్టారని.. పార్టీ నిర్మాణాన్ని పక్కన పడేశారని జనసైనికుల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది. రాజకీయ విశ్లేషకుల విమర్శ కూడా అదే. కానీ పార్టీ పటిష్టత దిశగా పవన్ అడుగులు చూస్తే వ్యూహాత్మకంగానే కనిపిస్తున్నాయి.  జనసేనాని పవన్ కళ్యాణ్ తన సోదరుడు, పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు ద్వారా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నాగబాబు తరచూ ఉత్తరాంధ్రలో అందులోనూ శ్రీకాకుళంలో పర్యటిస్తూ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారంట. తరచూ సిక్కోలు టూర్స్ పై ఓ ఆసక్తికర ప్రచారం కూడా నడుస్తోంది. ఉత్తరాంధ్రలో తూర్పు కాపుల ప్రభావం చాలా ఎక్కువ. ఇక ఉమ్మడి శ్రీకాకుళంలో ఈ సామాజికవర్గం ఓటర్లే నిర్ణయాత్మకంగా ఉంటారు. అందుకే శ్రీకాకుళం నుంచే పవన్ తన వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది.  అక్కడ నుంచి ఉత్తరాంధ్ర మొత్తం పార్టీ రూట్స్ స్ట్రాంగ్ చేసుకోవాలని జనసేనాని స్కెచ్ గీస్తున్నారంట. వచ్చే ఎన్నికల్లో నాగబాబు శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా పొలిటికల్ సర్కిల్స్ లో పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే పార్టీ ఆవిర్బావ వేడుకలు కూడా నాగబాబు ఎచ్చర్లలోనే జరుపుకున్నారు. కాపు ప్రతినిధిగా నాగబాబుని పెట్టి ముందుకెళ్లాలన్నది జనసేనాని స్ట్రాటజీగా తెలుస్తోంది.  ప్రస్తుతానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో బలమైన తూర్పుకాపు నేత కరువైయ్యారు. దానికి తోడు తూర్పు కాపులకు రాజకీయంగా జిల్లాలో అన్యాయం జరుగుతోందని అభిప్రాయం కూడా ఉంది. గతసారి వైసీపీ, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జిల్లా నుంచి తూర్పుకాపులకు చెప్పుకోదగ్గ పదవులు లేవు. సిక్కోలు పొలిటికల్ వార్ మొత్తం వెలమ వర్సెస్ కళింగ గానే నడుస్తోంది. దీంతో కాపులకు తాను కాపుకాస్తానని చెప్పడమే పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. శ్రీకాకుళం మాత్రమే కాదు.. ఉత్తరాంధ్ర మొత్తం మీద వైసీపీలో బొత్స సత్యనారాయణ, టీడీపీలో కిమిడి కళావెంకట్రావు బలమైన తూర్పు కాపు నాయకులుగా ఉన్నారు. కిమిడికి దాదాపు మొన్నటి ఎన్నికలే చివరివి అంటున్నారు. ఇక బొత్సకి ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారనేది అనుమానమే. సో.. ఇప్పుడు టీడీపీ, వైసీపీలో కాపులను నడిపించే నాయకులు లేరు కాబట్టి.. జనసేన వారికి అండగా  ఉండేందుకు ప్రయత్నిస్తోందని పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ క్రమంలో జనసేనాని అన్న కోసం ఎచ్చర్లను ఎంచుకోవడంలో కూడా ఓ తెలివైన వ్యూహం ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో తూర్పుకాపులే ఎక్కువ. గడిచిన ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన ఈశ్వర్ రావుది కమ్మ సామాజిక వర్గం. కేవలం టీడీపీ బలంతోనే ఆయన గెలిచారు. టీడీపీకి ప్రస్తుతం అక్కడ ఇంచార్జ్ కూడా లేకపోవడంతో క్యాడర్ తలోదారి అన్నట్టు ఉంది. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేపై ప్రజల్లో సానుకూలత కూడా కనిపించడం లేదు. ఈ పరిస్థితిని వైసీపీ అయినా క్యాష్ చేసుకుంటుందా? అంటే ఆ పరిస్థితి కనిపించడం లేదు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే, కాపు నేత గొర్లె కిరణ్ అసలు రాజకీయాల్లో ఉన్నారా? లేరా అన్నట్టు వ్యవహరిస్తున్నారు.  సో.. ఈ పొలిటికల్ స్పేస్ ని నింపడానికి జనసేన ప్రయత్నిస్తోందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆలోచనలు అన్నీ బాగానే ఉంటాయి. దానికి తగ్గట్టుగా ఆచరణ ఉన్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందనేని చివరి వరకు సస్పెన్సే. మరి పవన్ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి.
ALSO ON TELUGUONE N E W S
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందిన మూవీ 'ది రాజా సాబ్'(The Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ ఫాంటసీ హారర్ కామెడీ ఫిల్మ్.. 2026 సంక్రాంతి కానుకగా విడుదలై నిరాశపరిచింది. అయితే తాజాగా ఈ సినిమాపై ఆర్ట్ డైరెక్టర్‌ రాజీవన్(Rajeevan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీవన్ ఆర్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న 'బైకర్' మూవీ ఏప్రిల్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా 'తెలుగువన్'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా 'రాజా సాబ్' సినిమా గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'రాజా సాబ్' సినిమాలో కీలకమైన 'ప్యాలెస్ సెట్' కోసం ఆయన ఏకంగా 50కి పైగా విభిన్నమైన డిజైన్లు చేశారట. ఒక భారీ బడ్జెట్ సినిమాకు ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ఎంత కీలకమో చెబుతూ.. సినిమా బడ్జెట్‌లో దాదాపు 15 నుంచి 18 శాతం వరకు ఖర్చు ఆర్ట్ వర్క్ కోసమే జరుగుతుందని ఆయన చెప్పారు. ఇక ప్రభాస్ లుక్ గురించి రాజీవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కోసం ప్రభాస్ గారు చాలా కష్టపడ్డారని, మొదట కొంత బరువు పెరిగినా.. కథా దృష్ట్యా మళ్ళీ బరువు తగ్గారని వెల్లడించారు. బైకర్ గురించి మాట్లాడుతూ.. ఇది బైక్ రేసింగ్ నేపథ్యంలో సాగే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ డ్రామా అని చెప్పారు. కేవలం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో కూడా కొన్ని కీలక సన్నివేశాలు, ముఖ్యంగా రేసింగ్ సీక్వెన్స్‌లను చిత్రీకరించినట్లు ఆయన వెల్లడించారు. మలేషియా వంటి దేశాల్లో షూటింగ్ చేయడం ఒక కొత్త అనుభవం అని రాజీవన్ గారు వివరించారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.  మరిన్ని ఆసక్తికర సినీ అప్‌డేట్స్, ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూల కోసం మా 'తెలుగువన్'(TeluguOne) యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.  
  -ఎక్కడరా ఆ విలన్  -అసలు ఎందుకు రావడం లేదు  -హిట్ స్టేటస్ ఎంత  తెలుగు సినిమా(Telugu Cinema)ఎవడి సొత్తు కాదనే మాట అక్షరాలా ఎంత నిజమో.. తెలుగు సినిమా కథాంశం హీరో సొత్తు మాత్రమే కాదు విలన్ ది కూడా. ఎంతలా అంటే విలన్ రోల్ హీరో రోల్ ని డామినేషన్ చేసేంతలా. హీరో అభిమానులు కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. బలమైన విలనిజం వల్లే చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. ఈ విషయం తెలుగు సినిమా పుట్టిన దగ్గరనుంచి సినీ సాక్ష్యాలతో సహా  నిరూపితమవుతూ వస్తుంది. అందుకు ఉదాహరణలు చూపించని సినీ మనిషంటూ ఉండడు. మరి అందులో కొంతమందిని మచ్చుకైనా మరోసారి గుర్తు చేసుకోవడం సినిమాలని ప్రదర్శించే సైట్ గా మన ధర్మం. మరి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం. లేడీస్ ఫస్ట్ అనే సూత్రం ఒకటి పుట్టింది కాబట్టి లేడీ విలనిజం దగ్గరకి వస్తే సూర్యకాంతం, ఛాయాదేవి అద్భుతమైన విలనిజాన్ని ప్రదర్శించి, హీరో, హీరోయిన్ ల కోసమే రిపీట్ ఆడియన్స్ రారు మా కోసం కూడా వస్తారని చాటి చెప్పారు. ఆ తర్వాత ఆ స్థాయిలో లెగసిని కంటిన్యూ చేసే భాగ్యం 'నరసింహ' మూవీ ద్వారా రమ్యకృష్ణకి వచ్చింది.    రజనీకాంత్ కి ధీటుగా  నీలాంబరి క్యారక్టర్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సినిమా విజయం రేంజ్ ని పెంచడంతో పాటు నీలాంబరిగా తన హావభావాలు, రూపురేఖలు ప్రేక్షకుల మస్తిష్కాల్లో శాశ్వతం అని నిరూపించింది. ఆ తర్వాత సినీ అభిమానులకి ఎలాంటి దిష్టి తగిలిందో ఏమో గాని తన క్యారక్టర్ తోనే సినిమా హిట్ రేంజ్ ని పెంచేంత లేడీ సినీ విలన్ రాలేదు. రావుగోపాలరావు, సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు కంటిన్యూ చేసి తెలుగు సినిమా, ప్రేక్షకుల ఆరాధ్య సినీ నాయకుల్లా మారారు.    మళ్ళీ చాలా ఏళ్ళకి ఇప్పుడు హీరోగా దూకుడు ప్రదర్శిస్తున్న  గోపీచంద్ 'జయం', 'నిజం', 'వర్షం' చిత్రాల్లో అదిరిపోయే విలనిజాన్ని ప్రదర్శించి మనోడ్ని బీట్ చేసాడురా బాబు అని హీరో ఫ్యాన్స్ అనుకునేలా చేసాడు. నిజం తప్ప మిగతా రెండు సూపర్ హిట్స్ గా నిలిపాడు. సోనూసూద్ 'అరుంధతి'లో పోషించిన 'పశుపతి' గురించి ఎంత చెప్పినా తక్కువే. తన పెర్ఫార్మ్ తో ప్రేక్షకుల వెన్నులో వణుకు పుట్టించాడు. అరుంధతి భారీ విజయంలో పశుపతి క్యారక్టర్ సింహభాగంతో పాటు నేటికీ పశుపతి కోసం అరుంధతిని చూసే వాళ్ళ సంఖ్య రికార్డు స్థాయిలో ఉంటుంది. also read: Mohanlal: ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన మోహన్ లాల్.. ఎక్స్ వేదికగా కీలక ప్రకటన బాహుబలి సినిమాలో భల్లాలదేవుడిగా రానా చూపించిన శారీరక దారుఢ్యం, కుతంత్రాలు ప్రభాస్ పాత్రకు సరైన జోడీగా నిలిచాయి. ఒక్కడులో ప్రకాష్ రాజ్ పండించిన విలనిజం ఇప్పటికీ మీమ్స్ రూపంలో ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇక గత కొంత కాలం నుంచి హీరోని బీట్ చేసిన సినిమాలు గాని, విలన్ వల్లనే హిట్ అయిన సినిమాలు గాని రాలేదు. ఆ రోజులు మళ్ళీ వచ్చి అసలైన సినీ మజా సెల్యులాయిడ్ పై సాక్షాత్కారం అయితే మాత్రం ప్రేక్షకుడు నయా పుణ్యం చేసుకున్నట్లే.  
- హిట్ మ్యాన్ పాత్రలో శర్వా?  - వైరల్ అవుతున్న ‘బైకర్’ ట్రైలర్ లాంచ్ కామెంట్స్! - రోహిత్ శర్మ బయోపిక్ పై నోరు విప్పిన శర్వానంద్.. ఆసక్తికరంగా రాజశేఖర్ కౌంటర్! - స్పోర్ట్స్ డ్రామాపై క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్. టాలీవుడ్ మోస్ట్ వెర్సటైల్ హీరోల్లో శర్వానంద్ ఒకరు. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శర్వా, ప్రస్తుతం తన తాజా చిత్రం ‘బైకర్’ (Biker) విడుదలకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో శర్వానంద్ చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్, హిట్ మ్యాన్ రోహిత్ శర్మ బయోపిక్ గురించి ఆయన ఇచ్చిన క్లారిటీ ఫ్యాన్స్‌ను ఖుషీ చేస్తోంది. హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన ‘బైకర్’ ట్రైలర్ విడుదల వేడుకలో మీడియా ప్రతినిధులు శర్వాను ఒక ఆసక్తికర ప్రశ్న అడిగారు. శర్వానంద్ బాడీ లాంగ్వేజ్, ఫిజిక్ చూస్తుంటే రోహిత్ శర్మకు చాలా దగ్గరగా ఉంటారని, భవిష్యత్తులో ఆయన బయోపిక్ తీస్తే శర్వానంద్ అయితేనే కరెక్ట్ అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారని గుర్తు చేశారు. దీనిపై శర్వా స్పందిస్తూ.. "రోహిత్ శర్మ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఆయన బయోపిక్ వస్తుందో లేదో నాకు తెలియదు కానీ, ఒకవేళ ఆ పాత్ర చేసే అవకాశం నా దగ్గరకు వస్తే మాత్రం కచ్చితంగా చేస్తాను" అని మనసులో మాట బయటపెట్టారు. ఈ సందర్భంగా స్టేజ్ పైన ఉన్న సీనియర్ హీరో డాక్టర్ రాజశేఖర్ తనదైన శైలిలో జోక్ పేల్చారు. "శర్వానంద్ రోహిత్ శర్మ అయితే.. నేను ధోనీ పాత్ర చేస్తాను" అని అనడంతో ప్రాంగణమంతా నవ్వులు విరిశాయి. ఈ సినిమాలో రాజశేఖర్ ఒక కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘బైకర్’ సినిమాతో శర్వానంద్ మరోసారి తన నటనతో మాయ చేయబోతున్నాడని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. నిజానికి శర్వానంద్ గత ఏడాది ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ‘బైకర్’ సినిమాలో ప్రొఫెషనల్ బైక్ రేసర్‌గా కనిపించబోతున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాళవిక నాయర్ కథానాయికగా నటించింది. యూవీ క్రియేషన్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఇక రోహిత్ శర్మ బయోపిక్ గురించి గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. క్రికెట్ నేపథ్యంలో వచ్చే సినిమాలకు ఆదరణ బాగుండటంతో, హిట్ మ్యాన్ కథను వెండితెరపై చూడాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇప్పుడు స్వయంగా శర్వానంద్ ఆ పాత్ర పట్ల సుముఖత వ్యక్తం చేయడంతో టాలీవుడ్ సర్కిల్స్‌లో కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో కూడా శర్వా ఫోటోలను, రోహిత్ శర్మ ఫోటోలతో పోలుస్తూ మీమ్స్, పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ‘బైకర్’ సినిమా ప్రమోషన్స్ లో రోహిత్ శర్మ టాపిక్ రావడం సినిమాకు కూడా మంచి హైప్ తీసుకొచ్చింది. మరి ఏప్రిల్ 3న విడుదలయ్యే ఈ రేసింగ్ డ్రామా శర్వానంద్ కెరీర్ లో ఎలాంటి మైలురాయిగా నిలుస్తుందో చూడాలి. ఒకవేళ రోహిత్ శర్మ బయోపిక్ కనుక కార్యరూపం దాల్చితే శర్వానంద్ కటౌట్ ఆ పాత్రకు పక్కాగా సరిపోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
    -దృశ్యం 3 తో సందడి చేయనున్న మోహన్ లాల్  -ఏప్రిల్ 2 కోసం అందరు వెయిటింగ్  -మరి ఎందుకు ఇలా చేసారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని అన్నగారు చెప్పినట్టుగా సినిమానే దేవాలయం, అభిమానులే దేవుళ్ళుగా కూడా వర్ణించుకోవచ్చు. నడుస్తున్న సినీ యుగమే ఉదాహరణ. ఇప్పుడు ఆ అభిమానులు మోహన్ లాల్ వలన బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. దృశ్యం(Drushyam).. మలయాళ బొమ్మ అయినా కూడా పాన్ ఇండియా స్థాయిలో రీమేక్ అయ్యిందంటే దృశ్యం సృష్టించిన అభిమాన, ప్రేక్షక ప్రభంజనాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికే రెండు పార్టులాగా వచ్చినా కూడా వాళ్ళందరి దృశ్య దాహం తీరలేదు. దీంతో మూడో పార్ట్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా పార్ట్ 3 యొక్క మలయాళ ఒరిజినల్ దృశ్యం యొక్క సోల్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో ఉంది. ఈ నేపథ్యంలో మోహన్ లాల్(Mohanlal)ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేసాడు. సదరు పోస్ట్ లో 'గతం ఎప్పుడు నిశ్శబ్దంగా ఉండదు. వేచి చూస్తూ ఉంటుంది. జార్జ్ కుట్టి మే 21 ,2026 న వస్తున్నాడనే పోస్ట్ చేసాడు. Also read: Koratala siva: కొరటాలకి స్టార్ హీరోలు నో చెప్తున్నారా! దేవర 2కి కాలం కలిసి రావడం లేదా!   దీంతో అభిమానులు షాక్ కి గురవుతున్నారు. వాళ్ళు కూడా సోషల్ మీడియా వేదికగా  స్పందిస్తు ఎంత పని చేసావు బాసు. ఏప్రిల్ 2 కోసం ఎంతో వెయిట్ చేస్తున్నాం కదా అనే కామెంట్స్ తో తమ అభిమాన చిరు కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. ఏప్రిల్ 2 రిలీజ్ డేట్ అనే ప్రకటన ఆల్రెడీ వచ్చిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా మే 21 న జార్జ్ కుట్టి ఈ సారి ఎలాంటి కేసు నుంచి తన సినీ తెలివిని ఉపయోగించి బయటపడతాడో చూడాలి.  హిందీ వెర్షన్ షూట్ లో ఉండగా అక్టోబర్ 2 న రిలీజ్ కానుంది. అజయ్ దేవగన్ హీరో, తెలుగు వెర్షన్ మాత్రం వెంకటేష్ చేయడంలేదు. తెలుగులో కూడా మోహన్ లాల్, మీనాలే సందడి చేయనున్నారు.    
- అమెజాన్ ప్రైమ్ వీడియోలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'మెర్సీ' - 90 నిమిషాల్లో ప్రాణాలు కాపాడుకోవాలి..  - ఏఐ జడ్జిగా రెబెక్కా ఫెర్గూసన్ అదరగొట్టే పెర్‌ఫార్మెన్స్‌ - భార్యను చంపిన నేరం.. తనే సృష్టించిన ఏఐతోనే యుద్ధం హాలీవుడ్ స్టార్ హీరో క్రిస్ ప్రాట్ నటించిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'మెర్సీ' (Mercy) ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో విడుదలైన కొద్ది కాలానికే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. టెక్నాలజీ పెరుగుతున్న వేగంతో భవిష్యత్తులో న్యాయవ్యవస్థ ఎలా ఉంటుందనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కథ అంతా 2029వ సంవత్సరం నాటి లాస్ ఏంజిల్స్ నేపథ్యంలో సాగుతుంది. నేరాలు పెరిగిపోతున్న తరుణంలో, మనుషుల కంటే వేగంగా న్యాయం చేసేందుకు 'మెర్సీ క్యాపిటల్ కోర్ట్' అనే వ్యవస్థను రూపొందిస్తారు. ఇందులో మనుషులు కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జడ్జిలు తీర్పునిస్తారు. క్రిస్ రావెన్ (క్రిస్ ప్రాట్) అనే డిటెక్టివ్ ఈ ఏఐ వ్యవస్థను బలంగా నమ్ముతాడు. అయితే విధి వైపరీత్యం వల్ల తన భార్యనే హత్య చేశాడనే ఆరోపణతో క్రిస్ అదే ఏఐ కోర్టులో బోనులో నిలబడాల్సి వస్తుంది. తను సృష్టించిన వ్యవస్థలోనే తను నేరస్తుడిగా మారిన క్రిస్, 90 నిమిషాల్లో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. లేదంటే అతనికి మరణశిక్ష ఖాయం. ఆ 90 నిమిషాల గడువులో అతను తన తెలివితేటలతో ఏఐ జడ్జిని ఎలా ఒప్పించాడు? అసలు తన భార్యను చంపిందెవరు? అనే ఉత్కంఠభరితమైన అంశాలతో సినిమా సాగుతుంది. మార్వెల్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిస్ ప్రాట్, ఈ సినిమాలో ఎమోషనల్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ రోల్‌లో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఏఐ జడ్జి 'మ్యాడాక్స్' పాత్రలో రెబెక్కా ఫెర్గూసన్ తన నటనతో మెప్పించింది. ఒక మెషీన్ లాంటి పాత్రలో ఉంటూనే ఆమె పలికించిన హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. 'వాంటెడ్' వంటి సూపర్ హిట్ సినిమాలను అందించిన తిమూర్ బెక్మాంబెతోవ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మేకింగ్ స్టైల్ చాలా భిన్నంగా ఉంటుంది. దర్శకుడు దీన్ని 'స్క్రీన్ లైఫ్' (Screenlife) టెక్నాలజీతో రూపొందించారు. అంటే కథ అంతా కంప్యూటర్ స్క్రీన్స్, సీసీటీవీ ఫుటేజ్ మరియు డిజిటల్ పరికరాల ద్వారానే సాగుతుంది. ఇది ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని ఇస్తుంది. గతంలో 'సర్చింగ్', 'అన్‌ఫ్రెండెడ్' వంటి సినిమాలు ఇదే తరహాలో వచ్చి సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమాపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏఐ జడ్జి అనే కాన్సెప్ట్ కొత్తగా ఉన్నప్పటికీ, క్లైమాక్స్ మరికొంత ఎఫెక్టివ్ గా ఉండాల్సిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ సైన్స్ ఫిక్షన్ సినిమాలను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో 'మెర్సీ' ఒక మంచి ఛాయిస్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సినిమా అందుబాటులో ఉంది. థ్రిల్లర్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన చిత్రమిది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వారం ఓటీటీలో ఒక కొత్త థ్రిల్లర్ అనుభూతిని పొందాలనుకుంటే 'మెర్సీ'ని వాచ్ లిస్ట్‌లో చేర్చేసుకోండి!
టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. తూలికా తనిస్క్ క్రియేషన్స్ పతాకంపై 'పోలీస్ వారి  హెచ్చరిక' చిత్రాన్ని నిర్మించడం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన నిర్మాత బెల్లి జనార్ధన్ (Belli Janardhan), స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ ప్రమాదవశాత్తు కన్నుమూశారు. ఉగాది పండుగ జరుపుకోవడం కోసం అత్తగారి ఊరైన కట్టంగూరుకు తన కుటుంబసభ్యులతో కలిసి వెళ్ళిన బెల్లి జనార్ధన్.. మార్చి 22న ఆ గ్రామంలో గల  స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు నీటి అడుగుకు బలంగా తల తగిలి తీవ్రంగా గాయమవడంతో అక్కడికక్కడే తుదిశ్వాస విడిచారు.  బెల్లి జనార్ధన్ మాజీ సైనికుడు కావడంతో.. మార్చి 23న ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలంలోని పాలెం గ్రామంలో సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి.  నిర్మాత బెల్లి జనార్ధన్ ఆకస్మిక మరణం పట్ల 'పోలీస్ వారి హెచ్చరిక' చిత్ర దర్శకుడు బాబ్జీ సంతాపాన్ని తెలిపారు. "పోలీస్ వారి హెచ్చరిక సినిమా యూనిట్ తరుపున, వ్యక్తిగతంగా నా తరుపున నిర్మాత  బెల్లి జనార్ధన్  గారి ఆకస్మిక మరణం పట్ల తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తపరుస్తూ వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలుపుకుంటున్నాము" దర్శకుడు బాబ్జీ పేర్కొన్నారు.
  -వరుస హిట్స్ తో బాక్స్ ఆఫీస్ షేక్ చేసాడు  -ఇప్పుడు ఎందుకు ఈ పరిస్థితి  -ఆ వార్తలు నిజమేనా! కొరటాల శివ(Koratala Siva).. రైటర్ గా ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ని కలెక్షన్స్ వర్షంతో తడిసి ముద్దయ్యేలా చేసిన దర్శకశిఖరం. కమర్షియల్ ఫార్మేట్ కి  సామాజిక స్పృహతో కూడిన టచ్ ని ఇచ్చి సూపర్ హిట్ చేయవచ్చనే సూత్రానికి కూడా ఆద్యుడు. మెగాస్టార్, మెగాపవర్ స్టార్ తో ఆచార్య చేసాక ఆ సినిమా ఫలితం కొరటాలతో పాటు అభిమానులని షాక్ కి గురి చేసింది. కానీ కొరటాల శక్తీ ఏంటో తెలిసిన ఎన్టీఆర్(Ntr)దేవరతో అవకాశం ఇస్తే మళ్ళీ తన సత్తా ఏమిటో బలంగా చెప్పాడు. మరి అలాంటి   కొరటాల గురించి ఒక ఆసక్తికర న్యూస్ ఫిలింసర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.        దేవర పార్ట్ 2(Devara 2)ఉంటుందని ఎన్టీఆర్ స్వయంగా చెప్పిన విషయం తెలిసిందే. కానీ ఎప్పుడు మొదలవుతుందో అనే విషయంలో క్లారిటీ లేదు. ఎన్టీఆర్ అప్ కమింగ్ లైనప్ ఆ విధంగా ఉంది మరి. ఈ లోపు కొరటాల మరో మూవీతో  సిల్వర్ స్క్రీన్ పై ల్యాండ్ అవ్వాలని బాలకృష్ణ, పవన్ కళ్యాణ్,నాగచైతన్యతో పాటు మరికొంత మంది బడా హీరోలని కలిసి స్టోరీ చెప్పినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ వాళ్ళ నుంచి స్పష్టమైన హామీ రాలేదనేది టాక్. సదరు హీరోలు తమ అప్ కమింగ్ లైన్స్ ని సెట్ చేసి ఉంచుకోవడమనే మరో టాక్ కూడా ఉంది. మరి అప్ కమింగ్ హీరోలతో కానీ లేక ఒక మోస్తరు హీరోలతో చేద్దామని అన్నా, అందుకు కొరటాల సిద్ధంగా లేడని తన స్టయిల్లోనే బడా హీరోతో, బడా బడ్జెట్ సినిమానే చేయాలనే పట్టుదలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందుకు చాలా గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని అంటున్నారు. Also read: Aishwarya lekshmi: ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ్ తో చేస్తుంది సదరు వార్తలపై అభిమానులు స్పందిస్తు  కొరటాల శివ పెన్నుకి ఉన్న పవర్ ఏంటో సెల్యులాయిడ్ కి బాగా తెలుసు. కాబట్టి కొరటాల కోసమే హీరోలు వెయిట్ చేసే పరిస్థితి వస్తుంది. దేవర 450 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన విషయం మర్చిపోకండని అంటున్నారు. ఏది ఏమైనా  హిట్ లు ఇచ్చిన దర్శకులకి వెంట వెంటనే సినిమాలు రావడం లేదనేది పచ్చి సినీ నిజం. మరి కొరటాల ఎన్టీఆర్ కంటే ముందే మరో హీరోతో వస్తాడేమో చూద్దాం.      
పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు ఇవేనా?  పవన్ కళ్యాణ్ క్రియేటివ్ సంచలన ప్రకటన! ఓజీ 2 అప్‌డేట్ ఎప్పుడు? పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ప్రస్తుతం అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే, తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసేందుకు కష్టపడుతున్నారు.  అయితే గత కొద్ది రోజులుగా పవన్ కొత్త ప్రాజెక్టుల గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు షికారు చేస్తున్నాయి. దేవ కట్టా సహా పలువురు దర్శకులతో ఆయన సినిమాలు కమిట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సొంత నిర్మాణ సంస్థ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' (PKCW) స్పందిస్తూ అఫీషియల్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది. రూమర్లకు చెక్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలకు సంబంధించి వస్తున్న వార్తలను నిర్మాణ సంస్థ కొట్టిపారేసింది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు సైన్ చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలు మాత్రమేనని, వాటిలో వాస్తవం లేదని తెలిపింది. దీంతో పవన్ కొత్త సినిమాలు చేయబోతున్నారంటూ వస్తున్న రూమర్లకు ఒక్కసారిగా తెరపడింది. ‘ఓజీ 2’ గురించి కీలక అప్‌డేట్ అంతేకాకుండా, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ 2' (They Call Him OG Sequel) గురించి కూడా పీకే క్రియేటివ్ వర్క్స్ స్పష్టత ఇచ్చింది. దీనికి సంబంధించిన ఏ అప్‌డేట్ అయినా పవన్ స్వయంగా సరైన సమయంలో ప్రకటిస్తారని తెలిపింది. 'ఓజీ' సీక్వెల్ కోసం పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజా ప్రకటనను బట్టి చూస్తే.. ఇప్పటికిప్పుడు కాకపోయినా, రాబోయే రోజుల్లో 'ఓజీ 2' చేయడానికి పవన్ రెడీగా ఉన్నారని అర్థమవుతోంది. పెండింగ్ ప్రాజెక్టు పరిస్థితి ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh)తో ప్రేక్షకులను పలకరించిన పవన్ కళ్యాణ్.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఈ సినిమా పవన్ ఎప్పుడో కమిట్ అయ్యారు. కానీ, ఆయన ఇతర కమిట్మెంట్స్ కారణంగా పట్టాలెక్కలేదు. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ సినిమా విషయంలో ఇటీవల కదలిక వచ్చింది. ఈ ఏడాది పట్టాలెక్కే అవకాశముంది. ఇందులో పవన్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నారని సమాచారం.  ఫ్యాన్స్ రియాక్షన్ పవన్ కళ్యాణ్ నిర్మాణ సంస్థ ఇచ్చిన ఈ క్లారిటీతో అభిమానులు కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. అసత్య ప్రచారాలను నమ్మవద్దని సంస్థ కోరడంతో, అధికారిక ప్రకటనల కోసమే వేచి చూడాలని ఫ్యాన్స్ డిసైడ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక ప్రాజెక్ట్ చేస్తారని కూడా వార్తలు వినిపించినప్పటికీ, ప్రస్తుతానికి ఏదీ కన్ఫర్మ్ కాలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించి ఏదైనా కొత్త అప్‌డేట్ ఉంటే.. అది నేరుగా పవన్ నుంచే వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురుచూస్తున్నారు. https://x.com/PKCWoffl/status/2036062844010234093
  -వైరల్ గా మారిన ఐశ్వర్య లక్ష్మి వ్యాఖ్యలు  -సంబరాల యేటి గట్టుతో బిజీ  -లివింగ్ రిలేషన్ బెస్ట్ అంట  పెళ్లంటే పందిళ్లు చప్పట్లు తాళాలు, మేళాలు తలంబ్రాలు, మూడే ముళ్ళు ఏడే అడుగులు.. కల్యాణ వైభోగమే శ్రీ సీతారాముల కళ్యాణమే మన మాంగళ్య ధారణ శుభ లగ్నమే... శ్రీరస్తు శుభమస్తు  శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చనుంది కొత్త జీవితం.. ఈ సాంగ్స్ వింటుంటే పెళ్ళి కాని వాళ్ళు అర్జంటుగా పెళ్లి చేసుకోవాలని, పెళ్లి అయిన వాళ్ళు ఆ అద్భుత ఘట్టాన్ని తలుచుకుని ఆ రోజులు మళ్ళీ వస్తే ఎంత బాగుండని అనుకుంటూ ఉంటారు. పెళ్లికి భారతీయ సంప్రదాయంలో అంతటి ప్రాధాన్యత ఉంది. కానీ ఐశ్వర్య లక్ష్మి(Aishwarya Lekshmi)మాత్రం పెళ్లి అవసరమా అంటుంది. మరి  ఆ ముద్దుగుమ్మ ఒపీనియన్ ఏంటో చూద్దాం. ఐశ్వర్య లక్ష్మి..లెజండ్రీ డైరెక్టర్ మణిరత్నం(Manirathnam)నుంచి వచ్చిన పొన్నియన్ సెల్వం, థగ్ లైఫ్ తో ఫుల్ పాపులారిటీని పొందింది. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు గత ముప్పై ఏళ్ళ నా జీవితంలో పెళ్లి చేసుకున్న జంటలని ఎంతో మందిని చూసా. వాళ్ళల్లో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్ళు చాలా తక్కువ మంది. పెళ్లి తర్వాత భాగస్వామి జీవితంలో ఆటంకాలు కలగడం నన్ను ఆలోచింప చేసాయి. ఇద్దరు వ్యక్తుల మధ్య మనశ్శాంతి, తృప్తి ఉండాలి. అది పెళ్లితోనే సాధ్యం కాదని అర్థమైంది. నాకు కూడా తోడుగా ఉండే బాగస్వామి కావాలి. అయితే అది పెళ్ళితోనే సాధ్యం కాదు. ఇద్దరి మధ్య మంచి అవగాహన, గౌరవం ఉంటే సహజీవనం బెటర్ అని చెప్పుకొచ్చింది. also read:  dhurandhar 2:బాలీవుడ్ దండయాత్ర.. టాలీవుడ్ కి ముప్పు  ఐశ్వర్య లక్ష్మి సోషల్ మీడియాకి బ్రాండ్ అంబాసిడర్ ని అనే స్థాయిలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. దీంతో ఆమె వ్యాఖ్యలతో సోషల్ మీడియా కలకలలాడుతూ ఉంది. మరి స్వతంత్ర భారతావనిలో డిఫరెంట్ మైండ్ సెట్స్ మనుషులు ఉంటారు కాబట్టి కొంత మంది ఆమె మాటలని ఏకీభవిస్తుంటే మరికొంత మంది వ్యతిరేకరిస్తున్నారు. ఆల్రెడీ సహజీవనం చేసిన చేస్తున్న వాళ్లైతే  అన్ని రిలేషన్స్ లోను మనస్పర్ధలు వస్తుంటాయనే  కామెంట్స్ చేస్తున్నారు. తన సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్(Sai dhurga Tej)తో  'సంబరాల ఏటిగట్టు'చేస్తుంది. తెలుగులో తనకి సెకండ్ మూవీ. 2017 నుంచి సౌత్ లో సినిమాలు చేసుకుంటూ వస్తున్న ఐశ్వర్య లక్షి పక్కా మలయాళీ. ఎనీ క్యారక్టర్ తీసుకోండి. క్యారక్టర్ తప్ప తను కనపడదు. అంతలా మెస్మరైజ్ చెయ్యడం ఐశ్వర్య లక్ష్మికి కళ ఇచ్చిన గొప్ప వరం.    
‘నారి నారి నడుమ మురారి’ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మెప్పించిన శర్వానంద్, ఇప్పుడు ‘బైకర్’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. ఇది భార‌త‌దేశ‌పు మొట్ట‌మొద‌టి మోటారు మూవీ.. ఇది ప‌రిశ్ర‌మ‌లో వినిపిస్తున్న టాక్‌. అభిలాష్‌రెడ్డి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు.  సినిమా కాన్సెప్ట్, శర్వానంద్ పాత్ర చిత్రణ, సినిమాటోగ్రఫీ ఇలా అన్నీసినిమాపై అంచనాలను భారీగా పెంచేస్తున్నాయి. మరోవైపు, నిన్న విడుదలైన ‘బైకర్’ ట్రైలర్ సంచలనాలకు తెరలేపింది. విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే 15 మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకుపోవడం చూస్తుంటే, సినిమాపై ప్రేక్షకులకు ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రతిఒక్కరూ ట్రైలర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సైతం ఈ ట్రైలర్‌పై తన ప్రశంసలు కురిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రభాస్ స్వయంగా ఈ ట్రైలర్‌ను చూసి, “చాలా ఆసక్తికరంగా ఉంది” అంటూ చిత్ర బృందాన్ని అభినందించారట. ప్రభాస్ లాంటి స్టార్ హీరో ప్రశంసలు దక్కించుకోవడం అంటే, అది మామూలు విషయం కాదు. చిత్ర బృందానికి, ముఖ్యంగా శర్వానంద్‌కి ఇది నిజంగానే ఒక పెద్ద ప్రోత్సాహం. శర్వానంద్ కెరీర్ విషయానికొస్తే, ఈ మధ్యకాలంలో అతను సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. ‘మహానుభావుడు’, ‘శ్రీకారం’ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో హిట్స్ అందుకోలేకపోయాడు. అందుకే, ‘బైకర్’ విడుదల కాకముందే, ఇది శర్వానంద్ కెరీర్‌కు చాలా కీలకం. ఈ సినిమా కనుక విజయం సాధిస్తే, శర్వానంద్ మళ్ళీ ఫామ్‌లోకి వచ్చినట్టే. అంతేకాకుండా, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న సినిమా కావడంతో, యువతను ఇది ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ట్రైలర్ చూస్తుంటే, యాక్షన్ సీక్వెన్సులు అదిరిపోయాయి. శర్వానంద్ చాలా కొత్తగా కనిపించాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే, మోటారు క్రాస్ నేపథ్యంలో సాగే ఒక యువకుడి కథ ఇది. అందులో శర్వానంద్ ఎలా నటించాడో చూడాలి. ఒకవేళ సినిమా హిట్ అయితే, శర్వానంద్ మార్కెట్ మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో అతను మరింత బిజీగా మారవచ్చు. నిర్మాతలు కూడా అతనితో కొత్త ప్రాజెక్ట్‌లు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇది శర్వానంద్ కెరీర్‌కు ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందా లేదా అనేది చూడాలి.
వేసవి కాలం ప్రారంభమైంది, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కూడా పెరుగుతుంది. చాలామంది నీటి శాతం అధికంగా ఉన్న పండ్లు, కూరగాయలు తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాటిలో దోసకాయలు కూడా ముఖ్యమైనవి.  దోసకాయను జ్యూస్ గా అయినా తీసుకుంటారు, సలాడ్ లో ఉపయోగిస్తారు,  కొంతమంది నేరుగా దోసకాయలు ముక్కలు చేసుకుని తింటారు.  ఎలా తిన్నా దోసకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.  మార్కెట్లలో దోసకాయలకు డిమాండ్  కూడా పెరిగే కాలం ఇది.  అయితే దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే చేదు దోసకాయలను ఎంపిక చేస్తుంటారు.   చేదు దోసకాయలు  అటు తినలేము, ఇటు డబ్బు కూడా వృధా అవుతుంది.  అలా కాకుండా మార్కెట్లో దోసకాయలు కొనుగోలు చేసేటప్పుడు చేదు దోసకాయలు కాకుండా అన్నీ మంచి దోసకాయలు ఎంచుకోవాలి అంటే కొన్ని టిప్స్ పాటించాలి.  ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే.. చేదు దోసకాయలు అవాయిడ్ చేసి మంచి దోసకాయలు ఎంచుకునే టిప్స్.. రంగు,  ఆకారం..  దోసకాయల రంగు,  ఆకారం ను  బట్టి చేదు దోసకాయను సులభంగా గుర్తించవచ్చు. దోసకాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే, అది తాజాగా ఉన్నట్లు. అది లేత పసుపు, తెలుపు రంగులో లేదా మచ్చలతో ఉంటే, అది పండిందని అర్థం, అలాగే  లోపల చేదుగా ఉండే అవకాశం ఉంటుంది. నొక్కడం.. దోసకాయ గట్టిగా, దృఢంగా ఉంటే ఫర్వాలేదు, అదే అది మెత్తగా లేదా స్పాంజిలాగా అనిపిస్తే అది చెడిపోయినది,  చేదుగా కూడా ఉండవచ్చు. దోసకాయ నొక్కినప్పుడు అది గట్టిగా ఉండాలి. ఆకారం.. దోసకాయ ఆకారాన్ని చూసి  సులభంగా అది చేదు దోసకాయ లేదా మంచి దోసకాయ అనేది చెప్పవచ్చు. మందంగా లేదా పసుపు రంగులో ఉండే దోసకాయలు చేదుగా ఉండే అవకాశం ఉంది. ముదురు ఆకుపచ్చ రంగులో, గట్టిగా ఉండే దోసకాయలను మంచిగా ఉంటాయి. వాసన.. వాసనను బట్టి సులభంగా దోసకాయ చేదు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు.   దోసకాయ  తాజాగా ఉంటే లోపల కూడా తాజాగా ఉంటుంది.  దాని వాసన వింతగా లేదా ఘాటుగా ఉంటే, అది  లోపల చేదుగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాండం.. దోసకాయ కొనుగోలు చేసినప్పుడు దోసకాయ కాండం దగ్గర కట్ చేయాలి. ఆ కాండం భాగాన్ని  దోసకాయ మిగిలిన భాగంలో రుద్దితే తెల్లని నరుకు వస్తే దోసకాయ చేదు ఉండే అవకాశం ఉంటుంది.  ఈ నుగురు బాగా బయటకు వెళ్లిపోతే దోసకాయలో చేదు తగ్గిపోతుందని చెబుతారు. అందుకే చాలామంది దోసకాయను కట్ చేసేటప్పుడు మొదట కాండం దగ్గర కట్ చేసి  రుద్దుతారు.  దీని వల్ల దోసకాయలో ఉండే చేదు పోతుందని చెబుతారు.                                 *రూపశ్రీ.
కొందరు చాలా లోతుగా ఆలోచిస్తారు.  ఈ కారణంగా చాలా విషయాలు వారిలో సందేహాలుగానో,  నిర్ణయాలుగానో, అబిప్రాయాలుగానో ఉంటాయి.  వాటిని బయటకు చెప్పాలంటే ఏదో సంకోచం ఉంటుంది.  ఎదుటి వారు ఏమనుకుంటారో అనే సందిగ్ధం కూడా ఉంటుంది.  దీని వల్ల వారు చాలా విషయాలు బయటకు చెప్పలేక నిశ్శబ్దంగా ఉండిపోతుంటారు.  కానీ ఇలా నిశ్శబ్దంగా ఉండటం వల్ల  తరువాత చాలా బాధపడతారు కూడా.  అప్పుడు అలా చెప్పి ఉంటే బాగుండు, అలా చేసి ఉంటే బాగుండు అని అనుకునేవారు చాలా అధికంగా ఉంటారు. కానీ మనసులో మాటను ధైర్యంగా చెప్పడం వల్ల చాలా రకాల లాభాలు ఉన్నాయని అంటున్నారు మనస్తత్వ విశ్లేషకులు. ఇంతకూ మనసులో మాటను ధైర్యంగా బయటకు చెప్పడం వల్ల కలిగే లాభాలు ఏంటి తెలుసుకుంటే.. నమ్మకం, సాన్నిహిత్యం.. ప్రతి బలమైన సంబంధానికి ఓపెన్ కమ్యూనికేషన్ పునాది అవుతుంది. మనం మన భావాలను నిజాయితీగా వ్యక్తపరిచి, ఇతరుల మాటలను విన్నప్పుడు అపార్థాలు తొలగిపోతాయి.  నమ్మకం మరింత పెరుగుతుంది. మనసు విప్పి మాట్లాడగల  వ్యక్తులు పారదర్శకత,  పరస్పర గౌరవం కలిగి ఉంటారు. ఇది బందం దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండటంలో సహాయపడుతుంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం.. మనసులో ఉన్న ఆలోచనలను భయం లేదా సంకోచం లేకుండా వ్యక్తం చేసినప్పుడు..  చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేశాం అనే ఒక శాటిస్పాక్షన్ ఫీలింగ్ ఏర్పడుతుంది. ఇది  ఆత్మగౌరవాన్ని పెంచుతుంది,  క్రమంగా ఇలాంటి ప్రవర్తన వల్ల ఆత్మవిశ్వాసం కూడా మెరుగవుతుంది. ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలో అయినా తన మనసులో ఉన్నది చెప్పడానికి ఎలాంటి భయం ఉండదు. తేడాలు, పరిష్కారాలు.. జీవితంలో ప్రతి ఒక్కచోట విభేదాలు ఉండనే ఉంటాయి. అవి స్నేహం అయినా, కుటుంబం అయినా,  ప్రేమ అయినా, ఉద్యోగం చేసే చోట అయినా.. ఎక్కడైనా సరే.. విభేదాలు గొడవలుగా మారకుండా పరిష్కరించుకోవడానికి  సహాయపడుతుంది. అభిప్రాయాలను స్పష్టంగా , సంకోచం లేకుండా వ్యక్తపరిచినప్పుడు అవతలి వ్యక్తులు కూడా వినడానికి ఆసక్తి చూపిస్తారు.  ఇలా మాట్లాడటం అనేది సమస్యకు పరిష్కారాన్ని చూపిస్తుంది. ఆత్మవిమర్శ.. ఏదైనా విషయాన్ని స్పష్టంగా చెప్పే అలవాటు ఉండటం వల్ల కేవలం ఇతరులతో ఏదైనా చెప్పడమే కాదు.. తమతో తాము స్పష్టంగా మాట్లాడుకోగలుగుతారు. ఇది వ్యక్తులను కన్ప్యూజన్ లేకుండా చేస్తుంది. బలాలు, బలహీనతలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది వ్యక్తిగత అభివృద్దికి మొదటి అడుగు అవుతుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన.. భావోద్వేగాలను అణిచివేసినప్పుడు అవి లోపల ఒత్తిడి కలిగిస్తాయి. కానీ వాటిని సరైన విధంగా బయటకు వ్యక్తం చేసినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది. ఇది మానసిక ఒత్తిడి,  ఆందోళన సమస్యలు పెరగకుండా ఉండటానికి కారణం అవుతుంది. శారీరక ఆరోగ్యం.. స్పష్టంగా ఏదైనా విషయాన్ని బయటకు చెప్పడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఒత్తిడి తక్కువగా ఉండటం మంచి నిద్ర, రక్తపోటు సాధారణంగా ఉంటాయి. ఇది గుండెజబ్బు, తలనొప్పి, నిద్రలేమి వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. సక్సెస్ కోసం.. స్పష్టంగా, మంచిగా కమ్యూనికేషన్ చేయడంలో వ్యక్తి విజయం ఆధారపడి ఉంటుంది. ఉద్యోగంలో అయినా, రాజకీయంలో అయినా,  కుటుంబంలో అయినా,  బంధంలో అయినా స్పష్టంగా మాట్లాడటం వల్ల అవతలి వ్యక్తులు అర్థం చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.  ఇది అన్ని చోట్ల విజయాన్ని,  గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. స్పష్టంగా మాట్లాడటం అంటే ఇతరుల పైన ఆధిపత్యం చెలాయించడం కాదు. భావాలను గౌరవంగా, పద్దతిలో వ్యక్తపరచడం. ఇతరులు ఏమనుకుంటారో అనుకోకుండా మనసులో ఉన్నది  చెప్పడం, మనసులో ఉన్నది తొక్కి పెట్టి మౌనంగా ఉండకుండా బయటకు వ్యక్తం చేయడం వల్ల మానసికంగా బలంగా ఉండటమే కాకుండా ఇతరుల ముందు సరైన విధంగా మాట్లాడటం ఎలాగో కూడా అర్థం  అవుతుంది.  కాబట్టి ఇతరుల గురించి ఆలోచించి మనసులో ఉన్నది దాచిపెట్టాల్సిన అవసరం లేదు.                          *రూపశ్రీ.
పరాభవం.. తెలుగు జానపద చిత్రాలు,  జానపద నవలలు చదివితే.. అందులో అవమానం జరిగిందనడానికి బదులుగా పరాభవం ఎదురైంది అనే పదం వాడటం చూస్తూనే ఉంటాము.  పరాభవం అంటే అగౌరవం,  అవమానం, కించపరచడం.. ఇలా చాలా సందర్బాలలో వాడుతూ ఉంటారు. అయితే తెలుగు పంచాంగంలో.. తెలుగు సంవత్సరాలలో 40వ తెలుగు సంపత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం.  ఈ సంవత్సరం పేరు వినగానే చాలామంది భయపడుతున్నారు.  రెండేళ్ల క్రితం వచ్చిన క్రోథ నామ సంవత్సరం అప్పుడు ఇలాగే భయపడ్డారు. కానీ కాలంతో ప్రయాణం తప్పదు.  అయితే ప్రజలలో పరాభవనామ సంవత్సరం అనే పేరు వినగానే ఎక్కడలేని భయం పుట్టుకొస్తోంది. ఈ కొత్త ఏడాదిలో అవమానాలు, అగౌరవాలు తప్పవా అని ముందే తమ భవిష్యత్తు గురించి మనసులో బోలెడు భవిష్యవాణి ఊహించుకుంటున్నారు. కానీ పరాభవ నామ సంవత్సరం పేరు వెనుక ఉన్న అర్థం,  అందులో పరమార్థం వేరని, ఈ విషయం తెలిస్తే అందరూ ఎంతో ఊరట చెందుతారని అంటున్నారు పండితులు. ఇంతకూ పండితులు ఈ పరాభవ నామ సంవత్సరం గురించి, దాని పేరులో ఉన్న అర్థం గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. తెలుగు పంచాంగం ప్రకారం 60 తెలుగు సంవత్సరాలు  ఉంటాయి.  వాటిలో విశ్వావసు నామ సంవత్సరం 39వది కాగా.. పరాభవ నామ సంవత్సరం 40వది.  చైత్ర మాసంలో ఉగాది పర్వదినం సందర్బంగా కొత్త తెలుగు సంవత్సరం అయిన పరాభవ సంవత్సరం మొదలు కాబోతోంది. పరాభవ అనే పేరు వినగానే పరాభవాలే ఎదురవుతాయేమో అనుకుంటారు చాలా మంది. కానీ పరాభవ నామ సంవత్సరం అంటే వేరే అర్థాలు ఉన్నాయి.  పరాభవలో పరా అంటే పరాభట్టారికా దేవి.. లిలితా దేవినే పరాభట్టారికా దేవి అని అంటారు.  భవ అని భవుడు అని పరమేశ్వరుడిని సంభోధిస్తారు.  దీని ప్రకారంగా చూస్తే శక్తి స్వరూపమైన ఆ పార్వతీదేవి,  లయకారుడు అయిన పరమేశ్వరుడి కలయికగా వచ్చినదే తెలుగు సంవత్సరమని,  ఈ పరాభవ నామ సంవత్సరం మీద పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం పుష్కలంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు.   చాలా వరకు ప్రజలు ఎందులో అయినా ముందు చెడునే గుర్తిస్తారు, చెడునే తలుస్తారు.  ఈ స్వభావం కారణంగానే పరాభవ నామ సంవత్సరం గురించి పలు ఊహాగానాలు వస్తున్నాయని పండితులు చెబుతున్నారు. మరొక విధంగా చూస్తే.. పర అంటే పరదేవత.. ఆ పరదేవతే లలితా పరమేశ్వరి దేవి,  భవ అంటే అంటే కూడా పరమేశ్వరుడు.. ఎలా చూసినా ఇందులో ఎంతో ఆధ్యాత్మికత,  భక్తి మేళవింపు కనిపిస్తుంది.  ఇంతటి గొప్ప నామం వెనుక పిచ్చి అనుమానాలు, భయాలతో కొత్త ఏడాదిని మొదలుపెట్టడం మంచిది కాదని,  ప్రతి ఒక్కరూ సానుకూల ఆలోచన కలిగి ఉండాలని పండితులు చెబుతున్నారు. పరాభవ నామ సంవత్సరాన్ని అత్యున్నతమైన ఏడాది అని జ్యోతిష్యం చెబుతోంది. పరా అంటే గొప్పది, అత్యున్నతమైనది,  భవ అంటే పుట్టుక లేదా ఉద్భవించేది.  ఉన్నతంగా ఉద్భవించేది పరాభవ.. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సం కూడా ఉన్నతంగా ఉంటుందని చెబుతున్నారు. మనిషి తన కర్తవ్యాన్ని తాను ధర్మం తప్పకుండా నెరవేరుస్తుంటే.. ప్రతి ఏడాదిలో వారికి సానుకూలంగా సాగిపోతుందని ఆధ్యాత్మిక వేత్తలు కూడా చెబుతున్నారు. చెడులోనూ మంచి చూసే గుణం,  సానుకూల ఆలోచనలు ఉండటం ప్రధానం. కాబట్టి ఈ పరాభవ నామ సంవత్సరం రోజు సంతోషంతో ఉగాది పండుగను జరుపుకోవడం ద్వారా అందరూ సుఖ సంతోషాలు పొందాలని కోరుకుంటూ.. అందరికీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు..                                   *రూపశ్రీ.
వేసవి కాలం రాగానే చాలామంది లైఫ్ స్టైల్ మారుతుంది. ముఖ్యంగా ఆహారం విషయంలో, పానీయాల విషయంలో చాలా మార్పులు వచ్చేస్తాయి. బీహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల పేమస్ పానీయం ఇది. అయితే దీని ప్రయోజనాల దృష్ట్యా దేశ వ్యాప్తంగా ఇష్టంగా ఉపయోగిస్తారు.  వేసవి వచ్చిందంటే సత్తు పానీయం చాలా ఎక్కువగా తీసుకుంటారు.  ఇది శరీరాన్ని కూల్ గా ఉంచడమే కాకుండా శరీరానికి కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది.  కాల్చిన శనగలతో తయారు చేసే సత్తు పౌడర్ ను సత్తు పానీయం కోసం ఉపయోగిస్తారు. అయితే.. సత్తు పొడితో కేవలం సత్తు పానీయమే కాకుండా.. చాలా రకాల పదార్థాలు తయారు చేసుకుంటారు.  వేసవిలో అటు శరీరాన్ని కూల్ గా ఉంచుతూ, ఇటు శరీరానికి బోలెడు పోషకాలు అందించే సత్తు పొడితో ఏమేం వంటకాలు బాగుంటాయో తెలుసుకుంటే.. సత్తు పేడ.. వేసవిలో  నీరసంగా అనిపిస్తే సత్తు పేడను తయారు చేసుకుని తినవచ్చు.. ఇది  ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. దీనిని తిన్న తర్వాత  శరీరం పూర్తి చురుకుగా ఉంటుంది. సత్తు పిండిని నెయ్యి వేసి బాగా వేయించి అందులో పంచదార పొడి వేసి సన్న మంట మీద గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయిస్తే సత్తు పేడ రెఢీ.. ఇది చాలా రుచిగా ఉంటుంది. సత్తు మజ్జిగ.. వేసవి కాలంలో సత్తుతో మజ్జిగ తయారు చేసుకుని తాగవచ్చు. ఇది  శరీరాన్ని తేమగా ఉంచుతుంది.  పిల్లల నుండి పెద్దల వరకు అందరూ దీనిని ఇష్టపడతారు. దీనిని ప్రతిరోజూ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. సత్తు లడ్డు.. సత్తు లడ్డూలను సత్తు పొడితో ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. సత్తు లడ్డులు తినడం వల్ల  శరీరం బలపడుతుంది. సత్తు లడ్డులో డ్రై ప్రూట్స్, నట్స్, నెయ్యి వేసి తయారు చేసుకుని తినవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. సత్తు షార్డ్ బ్రెడ్.. వేసవిలో కూడా కారంగా తినాలని అనుకునే వారు చాలామంది ఉంటారు.  అలాంటి వారికి సత్తు షార్ట్ బ్రెడ్ చాలా మంచి ఫుడ్. సత్తు పిండిని వేయించి అందులో బంగాళదుంప,  బఠాణీ వంటి కూరగాయలు వేసి ముద్దగా చేసుకుని దీన్ని తడి చేసిన బ్రెడ్ మధ్యలో ఉంచి బ్రెడ్ ను బోండా లాగా రౌండ్ చేసి నూనెలో డీప్ ప్రై చేయాలి.  చాలా రుచిగా ఉంటాయి. సత్తు లిట్టి చోఖా.. లిట్టి చోఖా అనేది బీహార్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలలో చాలా ఫేమస్ ఫుడ్.  వేయించిన శనగపిండిని గోధుమ పిండిలో స్టఫ్ చేసి వాటిని కాలుస్తారు.  వీటిని లిట్టి అంటారు.  వీటిని నెయ్యితోనూ,  వంకాయ, టమాటా,  బంగాళాదుంపతో చేసిన చోఖా అనే వంటకంతో కలిపి వడ్డిస్తారు. ఈ పూర్తీ కాంబోను లిట్టీ చోఖా అంటారు.  ఇది చాలా రుచిగా ఉంటుంది.  చోఖా లేకపోయినా లిట్టిని వివిధ రకాల చట్నీలతో కూడా తింటారు.                                       *రూపశ్రీ.
ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ నేటి కాలంలో మారిన జీవనశైలి కారణంగా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఏదో ఒక దీర్ఘకాలిక (Chronic) ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని మందులు వాడినా సమస్య తాత్కాలికంగా తగ్గుతుందే తప్ప, పూర్తిగా నయం కావడం లేదని చాలా మంది ఆవేదన చెందుతుంటారు. అలాంటి వారికి హోమియోపతీ ఒక గొప్ప వరప్రసాదం. కేవలం లక్షణాలను అణచివేయడం కాకుండా, వ్యాధిని మూలాల నుండి తొలగించే అద్భుత శక్తి హోమియోపతీకి ఉంది.  Renowned Homeopathy expert Dr Praveen Kumar చెప్పిన మరిన్ని విషయాలు ఈ  TeluguOne Health Video Link క్లిక్ చేసి తెలుసుకుందాం. మనం హోమియోపతీని ఎందుకు ఎంచుకోవాలి? (Why Homeopathy?) దీర్ఘకాలిక వ్యాధులలో తిరుగులేని చికిత్స: హోమియోపతీ యొక్క అసలు బలమే దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం. బ్రాంకియల్ ఆస్తమా వంటి జెనెటిక్ డిజార్డర్లను కూడా సమూలంగా తొలగించడానికి హోమియోపతీలో మార్గం ఉంది. సంపూర్ణ ఆరోగ్య దృక్పథం (Holistic Approach): ఇతర వైద్య విధానాలు కేవలం వ్యాధి మీద దృష్టి పెడితే, హోమియోపతీ 'రోగి' (Patient) మీద దృష్టి పెడుతుంది. అంటే మీ వేలికి నొప్పి ఉంటే కేవలం వేలిని మాత్రమే కాకుండా, మీ శరీరాన్ని ఒక యూనిట్‌గా పరిగణించి చికిత్స అందిస్తుంది. శాస్త్రీయమైనది: ఒకప్పుడు హోమియోపతీ కేవలం ప్లాసిబో (Placebo) అని విమర్శలు ఉండేవి. కానీ నేడు IIT ముంబై మరియు IISc బెంగళూరు వంటి సంస్థలు చేసిన పరిశోధనల్లో హోమియోపతీ మందులలో 'నానో పార్టికల్స్' (Nano Particles) ఉంటాయని నిరూపితమైంది. దుష్ప్రభావాలు లేని వైద్యం: ఇది సహజ సిద్ధమైన పద్ధతిలో పనిచేస్తుంది కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ భయం ఉండదు. చికిత్స ప్రక్రియ ఎలా ఉంటుంది? (How it works?) హోమియోపతీలో చికిత్స అనేది చాలా లోతుగా సాగుతుంది. దీనిని 'కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్' అంటారు. కేస్ టేకింగ్: డాక్టర్ మీతో దాదాపు గంట సేపు మాట్లాడుతారు. మీ అలవాట్లు, మీ ఇష్టాయిష్టాలు, మీకు ఎప్పుడు కోపం వస్తుంది, మీ గత చరిత్ర (Past history) వంటి అంశాలన్నింటినీ అడిగి తెలుసుకుంటారు. ఇది మీ 'జర్నీ ఆఫ్ లైఫ్'ను అర్థం చేసుకునే ప్రక్రియ. మయాజమ్స్ (Miasms): ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ దోషాలు ఉన్నట్లే, హోమియోపతీలో సోరా, సిఫిలిస్, సైకోసిస్ అనే మూడు మయాజమ్స్ ఉంటాయి. వీటి ఆధారంగానే మీ వ్యాధి తీవ్రతను అంచనా వేస్తారు. పొటెంటైజేషన్: మందులను డైల్యూట్ చేసే ప్రక్రియను 'డైనమైజేషన్' అంటారు. ఇందులో మందు పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ, దాని శక్తి (Power) చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం చేయకూడదు? (What Not to Do?) సమాచారాన్ని దాచకండి: డాక్టరుకు మీ శారీరక, మానసిక లక్షణాలను స్పష్టంగా చెప్పాలి. ఏదైనా విషయాన్ని దాచడం వల్ల సరైన మందును ఎంపిక చేయడం కష్టమవుతుంది. స్వయం వైద్యం వద్దు: హోమియోపతీ మందులు తీపి మాత్రల్లా కనిపిస్తాయి కదా అని సొంతంగా వాడకూడదు. వ్యాధి తీవ్రతను బట్టి డాక్టర్ ఇచ్చే పొటెన్సీ (30CH, 200CH లేదా 1M) మారుతూ ఉంటుంది. అపోహలు నమ్మకండి: హోమియోపతీ ఆలస్యంగా పనిచేస్తుందనేది ఒక అపోహ మాత్రమే. సరైన మందు పడితే అక్యూట్ కండిషన్స్ (జ్వరం, జలుబు) కూడా చాలా వేగంగా తగ్గుతాయి. తరచుగా అడిగే ప్రశ్నలు (Q&A) ప్ర: 30CH అంటే ఏమిటి? జ: ఇది హోమియోపతీలో ఒక రకమైన పొటెన్సీ (శక్తి). ఒక భాగం మందును 99 భాగాల వెహికల్ (ఆల్కహాల్ లేదా షుగర్ ఆఫ్ మిల్క్)తో కలిపి చేసే ప్రక్రియ ద్వారా 30CH తయారవుతుంది. ఇది అద్భుతమైన శక్తిని కలిగి ఉంటుంది. ప్ర: హోమియోపతీ మందులు ఘాటుగా ఎందుకు ఉంటాయి?  జ: మందులను పిల్స్ (మాత్రలు) మీద వేయడానికి ఆల్కహాల్‌ను వెహికల్‌గా ఉపయోగిస్తారు. ఆ ఆల్కహాల్ వల్ల ప్రారంభంలో కొంచెం ఘాటుగా అనిపించవచ్చు, కానీ ఆ మాత్రలు తియ్యగానే ఉంటాయి. ప్ర: మానసిక సమస్యలకు హోమియోపతీ పనిచేస్తుందా?  జ: అవును. హోమియోపతీలో మనిషి యొక్క సైకీ (Psyche) లేదా మానసిక స్థితిని బట్టి హైయర్ పొటెన్సీ మందులు ఇవ్వడం జరుగుతుంది, ఇవి మానసిక ఆరోగ్యంపై అద్భుతంగా పనిచేస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులతో పోరాడుతున్న వారికి హోమియోపతీ ఒక ఆశాకిరణం. ఇది కేవలం వ్యాధిని తగ్గించడమే కాకుండా, మీ రోగనిరోధక శక్తిని పెంచి మిమ్మల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతుంది. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య విషయాలు మరియు నిపుణుల సలహాల కోసం ఇప్పుడే మా TeluguOne Health యూట్యూబ్ ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి
డా ..చిరు మావిళ్ళ మురళీ మనోహర్.. ఉగాది అంటే ఉగాది పచ్చడి మాత్రమే అని అనుకుంటారు. కానీ ఉగాది పచ్చడిలో ఉన్న ఆయుర్వేద ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసా?ఇప్పుడు చైత్ర మాసం లో వసంత రుతువు లో ఉన్నాం ఆకు రాలిన తరువాత కొత్త కొత్త గా రేకు విచ్చినట్లు చిగుర్లు తోడుగుతాయి. ఆప్రాంతం అంతా పచ్చటి తివాచి పరిచినట్లు పచ్చగా విరబూస్తాయి. పువ్వులు పరిమళాలు.మావిడి పూత సువాసనలు, మామిడి చెట్లపై కొత్తగా చిగురులు తొడిగిన మామిడి పూత గుత్తులు,మామిడి పిందెలు ఆ వసంత శోభ అప్పుడే వచ్చిందా అనిపిస్తుంది మది పులక రిస్తుంది. కొత్త కొత్త పూతని ఆస్వాదించాలని అనిపిస్తూ ఉండడం సహజం.ప్రకృతి లో మార్పు వచ్చింది శీతకాలం నుండి ఎండా కాలానికి వాతావరణం మారుతుంది ఇక ఎండవేడి ని తట్టుకోవ దానికి మన శరీరం సన్నద్ధం కావాలి.వాతావరణం లో మార్పులకు తగ్గట్టుగా శరీరంలో వేడిమి ని,తట్టుకోవడం. శరీరం దానంతట అదే చల్లబడే సహజ లక్షణాన్ని వృద్ది   చేయడంకీలకం.ముఖ్యంగా ఎండాకాలం లో వేడికి శరీరం నీర సించి పోవడం.ఒక్కో సారి అతిసారం బారిన పడడం. ముఖ్యంగా డయాబెటీస్, గుండె సంబధిత సమస్యలు ఉన్న రోగులలో వచ్చే హార్ట్ బీట్ లో మార్పులు.లేదా శరీరంలో రక్త ప్రసరణలో సమస్యలు వస్తూ ఉంటాయని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు  డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ విశ్లేషించారు.ఈ క్రమం లో మనం ఉగాది రోజున తీసుకున్నే ఆరు రకాల లో ఉన్న ఆరోగ్య రహస్యాలు, వాటిలో  ఉండే పోషక విలువల గురించి తెలుగు వన్ హెల్త్ కు  వివరించారు. మనం పండగ పూట లేదా కొన్ని సందర్భాలాలో తీసుకున్న ఆహారం శరీరంలో తామస ,రజో గుణాలు పెంచు తాయని  శరీరంలో వేడి వల్ల వచ్చే సమస్యల ను అధిగమించాలి సత్వ ప్రాధాన మైనగుణాన్ని అలవారచుకోవాలాంటే ఉగాది పచ్చడి ఉపయోగ పడుతుందని ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్ పేర్కొన్నారు. వేసవి రాగానే శరీరం లో కొన్ని రకాల రసాయన చర్యల వల్ల శరీరం లో సమతౌల్యం లోపిస్తుందని సమ తౌల్యాన్ని నియంత్రించే శక్తి ఉగాది పచ్చడి సమతుల పోషకాలు అందిస్తయాని అన్నారు డాక్టర్ చిరుమావిళ్ళ మురళీ మనోహార్. సాంప్రదాయ పద్దతిలో ఉగాది పచ్చడి కావాల్సిన పదార్ధాలు... **మట్టి పాత్ర,లేదా కుండ. **వేప పూత ఒక భాగం. **మామిడి పిందెలు  ముక్కలు రెండు భాగాలు.  . **చింత పండు,పా తది. నాలుగు భాగాలు. **ఉప్పు 5 భాగాలు. **బెల్లం ఆరు భాగాలు .ఇంకా అరిటి పండు ముక్కలు  అన్నీ కలిపి నీరు పోయాలి. పైన పేర్కొన్న కావాల్సిన పదార్ధాలలో  మధురం-తీపి  ఆమ్లం-పులుపు. లవణం-ఉప్పు . తి త్తం -చేదు. వగరు వంటి లక్షణాలు ఉంటాయి.ఇలా తయారు చేసిన వేప పచ్చడిని నింబ కుసుమ భక్షణం అని అంటారు.నింబ కుసుమము అంటే వేప పూత అని అర్ధం. మామిడి ముక్కలు,బెల్లము,పులుపు,చేదు వంటివి చింత పండు అరటి పండు,మిరియాలపొడి,ఉప్పు వంటివి వేసిన నింబ కుసుమ భక్షణం అంటే తింటే మరెన్నో లాభాలు ఔషద గుణాలు ఉన్నాయి.అని డాక్టర్ మురళీ మనోహర్ తెలుగు వన్ హెల్త్ కు వివరించారు. షడ్రసో పేతం ఉగాది పచ్చడి... ఉగాది పచ్చడిలో ఆరు రకాల రుచులు ఉంటాయని వాటిని షట్ రుచులుగా పేర్కొన్నారు.ఎందుకంటే జీవితానికి ఉగాదికి మానసిక సంబంధమైన సంబంధం ఉందని అంటారు చిరు మావిళ్ళ.అవును మనజీవితం లో తెలుగు వారికి తెలుగు సంవత్సరాది యుగ ఆది అంటే మరో యుగం నికి ఆది అంటే తొలి అడుగు. ఈ సమయం లో మనం ఎదుర్కునే ఎన్నోరకాల సమస్యలు ఒక్కో రుచిని సూచిస్తాయి. అన్ని సమపాళ్ళలో ఉంటె పచ్చడిని ఎలా అస్వాదిస్తామో.కస్టాలు,కడ గళ్ళు,ఆనందం,ఉత్సాహం, కష్టం,నష్టం, వచ్చినా మానసికంగా ఎదుర్కోడానికి మనల్ని సిద్ధం చేసేది ఉగాది అని అంటారు పండితులు.ఉగాది పచ్చడి ఔషద గుణాలు...వేప పువ్వు ,దీనిని బద్ర అని నింబ అని కూడా పిలుస్తారు. నిచిన, నిచినిండిన్ మార్గోసిన్ అనే పదార్ధాలు ఉంటాయని. వేప యాంటి ఫంగల్,యాంటి బ్యాక్టీరియాగా పని చేస్తుందని వేప  వల్ల వివిదరకాల జబ్బులను తగ్గించే గుణం వేపాకు ఉందని స్పష్టం చేసారు చిరుమవిళ్ళ మురళీ మనోహర్.వేపాలో తిత్త రసం ఉందని అంటే చెడు గుణం ఉన్నందున శరీరంలో వచ్చే కఫ,పిత్త దోషాన్ని తొలగించి ఆకలి పెంచుతుందని విశ్లేషించారు.వేపను తీసుకోవడం వల్ల ముఖ్యంగా డయాబెటీస్ ను నియంత్రించే గుణం వేపకు ఉందని వీటితో పాటు కామెర్లు,చర్మ సంబంధిత వ్యాధులను నివారిస్తుంది.పిల్లలకు వేపను తినిపించడం వల్ల కడుపులో ఉండే నులి పురుగులు చచ్చిపోతాయని కాబట్టి పిల్లకు మేలు చేస్తుందని.పేర్కొన్నారు. బెల్లం... ఉగాది పచ్చడికి కీలకమైన ఇంగ్రీడియంట్. బెల్లానికి తీపిగుణం ఉంటుంది. బెల్లానికి కఫం పెంచే గుణం ఉంది. బెల్లం ఉగాది నుంచి వాడితే కఫ దోషాన్ని తగ్గిస్తుంది. ఎండాకాలం లో వచ్చే ఎందవేదిమిని తట్టుకోడానికి ఎండబారిన పడ్డ వారికి నీ రసం  తగ్గించితక్షణ శక్తి నిచ్చేది గ్లుకోజ్ గా బెల్లం పనిచేస్తుంది.బెల్లం ఒక సువాసన,శ్రమ నీరసం తగ్గించి వడ దెబ్బ నుండి కాపాడే శక్తినిచ్చి ప్రోటీన్లను అందించేది బెల్లమే  అయితే బెల్లము అరిటి పండు కలిపి తీసుకుంటే మంచిదని అంటారు చిరుమామిళ్ళ. మామిడి ... ఉగాదిపచ్చడికి ఎన్ని ఉన్న మామిడి ముక్క పుల్లగా తగలనిదే పచ్చడికి రుచి ఉండదు. అని పెద్దలు అంటూ ఉంటారు.ముఖ్యంగా వేసవి కాలం లో చాలామంది కడుపు నొప్పి తో బాధ పడుతూఉంటారు.మామిదిపండులో ఉండే విటమిన్ సి మనలో ఇమ్యునిటీ పెంచుతుంది. మామిడి కాయ వల్ల గుండెజబ్బులు, డయాబెటిస్ రాకుండా నియంత్రిస్తుంది.  చింత పండు... దీనిని తెమరందన్ ఇండియా భారత దేశం లో అతి పురాతన మైన విటమిన్లు,పిండి పదార్ధాలు ఉంటాయి. చింతపండులో ముఖ్యంగా పాత చింత పండు ఉష్ణం తగ్గిస్తుంది. వాతాన్ని, బడలిక, జీర్ణ ప్రక్రియను సరి చేస్తుంది. శరీరంలో వచ్చే వేడి తగ్గించి చల్ల దానాన్ని ఇస్తుంది.ముఖ్యంగా చింత అంటే చింతలు తీర్చేది చింత రసం త్వరగా శక్తి నిస్తుంది.మూత్ర విసర్జన సాఫీగా సాగేట్లు సహకరిస్తుంది చింత రసం. అందుకు చింత పండు రసం వేసవి కాలం లో తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఉప్పు... ఉగాది పచ్చడి రుచిని పెంచేది చవి లేదా లవణం,ఉప్పు మన శరీర అవసరాలకు జీవన శక్తి నిచ్చేది లవణం. ఆహారం లో వేసే ఉప్పు ఆ వంటకు మంచి రుచిని ఇస్తుంది.ఉప్పు త్రిదోషాల ను హరిస్తుంది. అరటి పండు... అరటి పండు లో పోషక విలువలు పొటాషియం, యాంటి ఫంగల్, కూడా అరటి పండు పనిచేస్తుంది.అతిసారం నుండి రక్షించే సంజీవనిగా పేర్కొన్నారు వైద్యులు. అరటి పండు అధిక రక్త పోటు, కిడ్నీ సమస్యలు, రసాయనం గా పనిచేస్తుంది. ఇవి ఉగాది ఔషదం అధ్బుత ఫలితాలు ఉగాది పచ్చడి ఉగాది రోజే తీసుకోవాలా అప్పుడప్పుడూ తీసుకోవచ్చు అంటున్నారు. ముఖ్యంగా ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు ఎప్పుడైనా తీసుకుంటే వేసవి కాలం లో ఎన్ని సార్లు తీస్జుకున్న తప్పులేదు. వ్యక్తిలో ఉండే త్రి దోషాల నుండి ముక్తి నిచ్చేది ఉగాది పచ్చడి.