Latest News

మోడీ రూల్ @8932 డేస్!

posted on: Mar 23, 2026 2:20PM

ప్రధాని నరేంద్రమోడీ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డ్ చేరింది. భారత రాజకీయ చరిత్రలోనే గతంలో ఎవరికీ సాధ్యం కాని ఈ రికార్డును మోడీ సొంతం చేసుకున్నారు. అయన పీఎంగా  అత్యున్నత స్థానంలో  అత్యధిక రోజులు కొనసాగిన వ్యక్తిగా రికార్డు సాధించారు. ఇక నుంచి ఆయన అధికారంలో ఉన్న ప్రతి రోజూ ఒక కొత్త రికార్డు నమోదు అవుతూనే ఉంటుంది. అదెలా ఉంటే  నరేంద్రమోడీ గుజరాత్ సీఎంగా 2001 అక్టోబర్ 7న పదవీ బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు ఆయన గుజరాత్ సీఎంగా ఆ రాష్ట్రాన్ని పాలించారు.  దీంతో సోమవారం (మార్చి 23) నాటికి ఆయన పాలనా పగ్గాలు చేపట్టి  8932  రోజులైంది. అంటే అత్యధిక రోజుల పాటు  రోజుల పాటు ప్రభుత్వాధినేతగా బాధ్యతలు నిర్వహించి, దేశంలోనే సుదీర్ఘకాలం పనిచేసిన నేతగా  మోడీ కొత్త రికార్డు సృష్టించారు.   

వివరాల్లోకి వెడితే.. 2001 అక్టోబ‌ర్ 7న గుజ‌రాత్ సీఎంగా తొలిసారి గా బాధ్య‌త‌లు చేపట్టిన ఆయన సుమారు 13 ఏళ్ల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రిగా సేవ‌లందించారు.  అనంతరం.. 2014, మే 26న భార‌త ప్ర‌ధాన మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం  చేశారు. నాటి  నుంచి నేటి వ‌ర‌కూ ఆయ‌న భారత ప్రధానిగా సేవలందిస్తున్నారు. అంటే గుజరాత్ సీఎంగా నాలుగు సార్లు, ప్రధనిగా మూడు సార్లు వరుస ఎన్నికలలో విజయం సాధించడం ద్వారా మోడీ  సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని ప్ర‌భుత్వాధినేత‌గా   కొన‌సాగిస్తున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ మోడీ 2002, 2007, 2012 ఎన్నిక‌ల‌ను ముఖ్య‌మంత్రిగా విజ‌యం సాధించ‌డం మాత్ర‌మే కాదు.. 2014, 19, 24 ఎన్నిక‌ల‌ను ప్ర‌ధానిగా విజ‌యం సాధించ‌డం  కూడా ఒక రికార్డే. ప్ర‌ధానిగా వ‌రుస‌గా  మూడు ఎన్నిక‌ల విజ‌యం సాధించ‌డం ద్వారా భారత తొలి ప్రధాని జవహర్లాల్  నెహ్రూ రికార్డును బ‌ద్ధ‌లు కొట్టారు. అత్య‌ధిక కాలం  పీఎంగా ఉండి  మజీ ప్రధాని ఇందిరా  గాంధీ రికార్డును కూడా ఆయన బ్రేక్ చేశారు.  అత్య‌ధిక కాలం ప్ర‌ధానిగా ఉన్న రెండో పీఎం మోడీయే. అంతే కాదు ముఖ్య‌మంత్రిగా ఎక్కువ కాలం అనుభ‌వం ఉన్న ప్ర‌ధాని కూడా మోడీయే. కాగా మోడీ రికార్డులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు రాజకీయ ప్రముఖులు స్పందించి ప్రధానికి అభినందనలు తెలిపారు. మోడీ ప్రజాసేవ పట్ల ఉన్న నిబద్ధతకు, పాలనాదక్షతకు ఇది నిదర్శనమని ప్రస్తుతించారు.  24 ఏళ్లకు పైగా ఎక్కడా విరామం లేకుండా దేశానికి సేవ చేయడం ఒక అరుదైన ఘ‌న‌త‌గా కీర్తించారు. 

2029 లో కూడా మోడీయే ప్ర‌ధాని అయితే ఇది మ‌రో ఘ‌న‌త కూడా అవుతుంది.  నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి నాలుగు సార్లు ప్ర‌ధాని అయిన ఈ రికార్డును వ‌చ్చే రోజుల్లో మ‌రే నేత కూడా బ్రేక్ చేసే ఛాన్సే లేద‌ని అంచ‌నా వేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...