LATEST NEWS
తమిళనాడు రాజకీయాల్లో మహిళలపై జరుగుతున్న అసభ్య,  ద్వంద్వార్థ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీవీకే అధినేత విజయ్ సీరియస్ గా స్పందించారు. అసెంబ్లీ వేదికగా ‘ఆమె’పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కబడ్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు.  అసెంబ్లీలో పోలీసు శాఖ బడ్జెట్ డిమాండ్లపై చర్చ సందర్భంగా మాట్లాడిన విజయ్..  మహిళలను కించపరిచేలా మాట్లాడే వారిని  ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.   రాజకీయ విమర్శలు ఎంత తీవ్రంగానైనా ఉండవచ్చని..  కానీ భావప్రకటన స్వేచ్ఛ పేరుతో మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేయడం, వ్యక్తిగత దూషణలకు దిగడం క్షమించరాని నేరమన్నారు. ఇటీవల కాలంలో కొందరు రాజకీయ నాయకులు ఉద్దేశపూర్వకంగా  మహిళలను లక్ష్యంగా చేసుకుని డబుల్ మీనింగ్ డైలాగులు, అసభ్య  పదజాలం వాడటం  ప్రజలు అంతా గమనిస్తున్నారన్న విజయ్..  అటువంటి వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. కాగా అసెంబ్లీ వేదికగా విజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇందుకు కారణం డిఎంకె అగ్రనేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ గత నెలలో జరిగిన  కావేరి నిరసనల సమయంలో   నటి,  త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే కారణమని పరిశీలకలు అంటున్నారు.  త్రిషపై ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలపై గత  4న చెన్నైలోని ఆయన నివాసంలో ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, తంజావూరుకు తరలించి విచారించిన సంగతి తెలిసిందే.  ఆ తర్వాత ఆయన స్టేషన్ బెైల్‌పై విడుదలయ్యారనుకోండి అది వేరే సంగతి. ఈ నేపథ్యంలోనే  సీఎం విజయ్ మహిళలపై అనుచిత వ్యాఖ్యలపై నేరుగా అసెంబ్లీలో   ప్రస్తావించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.  రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు చేసేటప్పుడు సంయమనం పాటించాలని, రాజకీయ హద్దులు దాటి మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేసేలా మాట్లాడే ధోరణి ఇకపై చెల్లదని ఆయన అసెంబ్లీ సాక్షిగా వార్నింగ్ ఇచ్చారు.  [CM Vijay Mass Warning On Untoward Comments women, Trisha remarks row, Udhayanidhi Stalin, Tamil Nadu Assembly, Vijay on women safety, double meaning comments]
తెలంగాణ కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు బిగిస్తున్నారు.  ఇటీవల జరిగిన కీలక పరిణామాలు, ముఖ్యంగా మంత్రివర్గం నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడం ద్వారా అధిష్ఠానం వద్ద తన పలుకుబడి ఇసుమంతైనా తగ్గలేదని నిరూపించుకున్న రేవంత్ రెడ్డి, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కూడా గ్రిప్ సాధించారు, కొండా సురేఖ బర్త్ రఫ్ తరువాత.. పార్టీలో రేవంత్ వ్యతిరేకులలో, మరీ ముఖ్యంగా అసమ్మతి, అసంతృప్తి నేతల తీరులో, వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు గోచరిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కొండా సురేఖ బర్త్ రఫ్ అనంతరం పరిణామాలు చాలా వేగంగా మారాయి.  ఇప్పటివరకు మంత్రి పదవి దక్కలేదని బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడమే కాకుండా, రేవంత్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రిపదవి విషయంలో హైకమాండ్ నిర్ణయమే శిరోధార్యమని తాజాగా విస్పష్టంగా వెల్లడించి తనలో మార్పును తెలియజేశారు.  తనకు మంత్రిపదవి విషయంలో పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అంతే కాకుండా.. కొండా బర్త్ రఫ్ కు ముందు వరకూ.. రేవంత్ రెడ్డిపై తీవ్రమైన విమర్శలతో అనుచిత సంబోధనలతో విరుచుకుపడిన కొండా సుశ్మిత.. తన తల్లి కొండా సురేఖకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన తరువాత మీడియా ముందు భోరుమని విలపించారు. తాను చేసిన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సబబు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటువంటి నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షీ నటరాజన్  ఆ పదవి నుంచి తప్పుకోనున్నారు. తన లండన్ పర్యటన కారణంగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ పదవి నుంచి వైదొలగుతున్నట్లు ఆమె చెబుతున్నా.. రాష్ట్ర కాంగ్రెస్ లో అసమ్మతి జోరందుకోకుండా నివారించడంలో వైఫల్యం కారణంగా పార్టీ హైకమాండే ఆమెను తప్పించిందన్న చర్చ కాంగ్రెస్ వర్గాలలోనే జోరుగా సాగుతోంది. ఈ నెల 13న ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రత్యేక కోర్సు అభ్యసించేందుకు లండన్ బయలు దేరుతున్నారు. కనీసం ఆమె పది నెలల పాటు రాష్ట్ర వ్యవహారాలకు దూరంగా ఉంటారు. ఇప్పటి వరకూ ఆమె స్థానంలో మరో ఇన్ చార్జిని నియమిస్తున్నట్లు కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి ప్రకటనా చేయలేదు. అంటు ఆమె అందుబాటులో ఉండని ఈ పది నెలల కాలం.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలలో సీఎం రేవంత్ రెడ్డి సంపూర్ణ ఆధిపత్యం ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.   [Revanth Reddy Tightens grip On Party And Government, Telangana Congress, Konda Surekha, Komatireddy Rajagopal Reddy, Cabinet Expansion, Telangana Politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్  రాజకీయాలలో విజయసాయిరెడ్డి తీరు సంచలనంగా మారింది.  గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం నంబర్ 2గా ఓ వెలుగు వెలిగి, వైసీపీ అధినేతకు కుడిభుజంగా వ్యవహరించిన విజయసాయి.. ఆ తరువాత మారిన పరిణామంలో  వైసీపీని వీడి రాజకీయ సన్యాసం ప్రకటించారు. అలా రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి.. ఇప్పుడు సొంతంగా ఓ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు. తన రాజకీయ పార్టీ జెండా, అజెండా ప్రకటనకు సోమవారం (సెప్టెంబర్ 7) ముహూర్తం నిర్ణయించారు.  బెజవాడ వేదికగా ఆయన సోమవారం  మీడియా సమావేశంలో కొత్త పార్టీ జెండా, అజెండావి ప్రకటించనున్నారు.  వైసీపీతో విభేదించి బయటకు వచ్చిన తరువాత విజయసాయిరెడ్డి.. రాష్ట్ర రాజకీయాలపై తరచూ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం విషయంలో ఆయన కుండబద్దలు కొట్టినట్లుగా ఆ స్కామ్ కర్తా, కర్మా, క్రియా రాజ్ కేసిరెడ్డి అని వెల్లడించిన సంగతి తెలిసిందే. వైసీపీలో జరిగిన అరాచకాలు, అక్రమాలు, అవినీతిపై విజయసాయి దశల వారీగా వివరాలు వెల్లడిస్తూ.. ఆ పార్టీని డిఫెన్స్ లో పడేస్తున్నారు.  వైసీపీలో ప్రస్తుతం నంబర్ 2గా చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని ఇటీవల ప్రకటించి సంచలనం సృష్టించిన విజయసాయి.. ఇప్పుడు కొత్త రాజకీయ పార్టీ ప్రకటనతో మరిన్ని సంచలనాలకు తెరలేపుతారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (సెప్టెంబర్ 7) విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విజయసాయి కొత్త పార్టీ విధి విధానాలు, పేరు, జండా, అజెండా ప్రకటించే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   [Vijay Sai Reddy Vijayawada Pressmeet, AP Politics, Vijay Sai Reddy New Party, YCP Telugu Desham, AP Politics, Telugu One]
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కొండా సురేఖ ఎపిసోడ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రేవంత్ తన కేబినెట్ నుంచి ఆమెను బర్త్ రఫ్ చేసిన తరువాత భవిష్యత్ కార్యాచరణపై ఎటూ తేల్చుకోలేక కొండా సురేఖ మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటు కాంగ్రెస్ పొమ్మంది, అటు బీఆర్ఎస్ వదిలించేసుకుంది. ఇక మిగిలినది కాషాయం పార్టీయే.. అనుకుంటే.. ఆ పార్టీలోకి కొండా సురేఖ ఎంట్రీ అంత తేలిక కాదనేలా పరిస్థితులున్నాయి. ఓ పక్క కొండా సురేఖను బీజేపీ పార్టీలోకి ఆహ్వానించిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంటే.. మరో పక్క కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.  వాస్తవానికి సీఎం రేవంత్ రెడ్డి తొలి నుంచీ కొండా సురేఖకు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన క్షణం నుంచీ ఆమె వ్యాఖ్యలు, వ్యవహార శైలీ వివాదాస్పదంగానే ఉన్నాయి. నటుడు నాగార్జున, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ లపై అనుచిత వ్యాఖ్యలు ఆమె దూకుడు ఎంత హద్దులు మీరేదో తేటతెల్లం చేస్తున్నాయి. అయినా కూడా అప్పట్లో ఆ వివాదం నుంచి సీఎం ఆమెను బయటపడేశారనే చెప్పుకోవాలి. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వివాదాలను ఆమె స్వయంగా ఆహ్వానించి ఇబ్బందులు కొనితెచ్చుకున్నారు.  ఇక తాజాగా కేబినెట్ నుంచి ఆమె ఉద్వాసనకు కారణం కూడా పట్టువిడుపులు లేకుండా వ్యవహరించిన ఆమె తీరే కారణమంటున్నారు.  ఇవన్నీ పక్కన పెడితే.. కొండా సురేఖ పొలిటికల్ జర్నీ డోలాయమానంలో పడటానికి ఆమె స్వయంకృతాపరాధమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాజకీయాలలో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అన్న నానుడి కొండా సురేఖకు అతికినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు.  కొండా సురేఖ కుమార్తె సుస్మిత  పార్టీ నాయకత్వంపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాబోయే ఎన్నికలలో పరకాల నియోజకవర్గ అభ్యర్థిత్వంపై సీఎం చేసిన ప్రకటనలను ఆమె  వ్యతిరేకించారు. ఆ స్థానం తనదేనంటూ ఏకపక్షంగా ప్రకటించేశారు. దీంతో వివాదం తారస్థాయికి చేరుకుంది.   పీసీసీ క్రమశిక్షణా కమిటీ కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలను కాదంటూ సురేఖ ఎదురు తిరిగారు అయినప్పటికీ  తన కుమార్తె వ్యాఖ్యలను ఆమె బహిరంగంగా ఖండించకపోవడంతో ఆమె పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్లుగానే కాంగ్రెస్ హైకమాండ్ భావించింది. తీరా పుట్టిమునగబోతోందని గ్రహించిన తరువాత నష్టనివారణ కోసం కొండా సురేఖ చేయని ప్రయత్నం లేదు. రాఖీ పండుగ సందర్భంగా రేవంత్ నివాసానికి వెళ్లి మరీ రాఖీ కట్టి వచ్చారు. ఆ తరువాత కొండా సురేఖ హస్తినకేగి మరీ తన పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తన ఉద్వాసన ప్రకటన వెలువడటానికి ముందే కొండా సురేఖ హస్తినలో మీడియా ఎదుట.. భట్టి విక్రమార్క్ సతీమణి, మంత్రి పొంగులేటిలపై విమర్శలు గుప్పించి, వారికి ఇవ్వని క్రమశిక్ష నోటీసులు తనకు మాత్రమే ఎందుకిచ్చారంటూ సీఎంను నిలదీశారు. మొత్తంగా చిన్న సర్దుబాట, ఒక ఖండనతో పరిష్కారమయ్యే సమస్యను ఆమె తన ఉద్వాసన వరకూ తెచ్చుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  [Konda Surekha Political Sucide, Revanth Reddy, Telangana Congress, Cabinet dismissal, political controversy, Telugu One]
రేవంత్ తన కేబినెట్ నుంచి కొండా సురేఖను బర్త్ రఫ్ చేయడంపై తొలి సారిగా స్పందించిన కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మిత మీడియా ముందు భోరు మన్నారు. తన తల్లి మంత్రి పదవి పోవడానికి తానే కారణమంటో విలపించారు. దీనిపై నెటిజనులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.  అందితే జుట్టు అందకుంటే కాళ్లు అన్న చందంగా   కొండా సురేఖ కుటుంబం తీరు ఉందనిఎద్దేవా చేస్తున్నారు.   కొద్ది రోజుల క్రితం సీఎం రేవంత్ రెడ్డి  విధానాలపై కొండా సురేఖ కుమార్తె కొండా సుశ్మీత   విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా ఆమె తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ సవాల్ విసిరారు. ఆమె వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించారు.  దీనిపై కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై ఏ చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని, కానీ  న తల్లిని టార్గెట్ చేయడం   బాధాకరమని సుస్మిత మీడియా ముందు కన్నీరు పెట్టుకున్నారు.  అయితే కిందపడ్డా నాదే పై చేయి అన్నచందంగా.. తాను చేసిన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాని చెప్పుకొచ్చారు. వాస్తవానికి సుశ్మీత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలను కొండా సురేఖ కనీసం ఖండిచకపోవడాన్ని మాత్రం సుశ్మీత ఈ సందర్భంగా విస్మరించారు. ఇక పోతే కొండా సుశ్మిత వ్యాఖ్యలు పార్టీని బహిరంగంగా సవాల్ చేశాయనీ, పార్టీలో అంతర్గత సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేయడం కాకుండా.. బహిరంగంగా నాయకత్వాన్ని సవాల్ చేయడమే కొండా సురేఖపై వేటుకు కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అటువంటి సుశ్మిత తన తల్లిపై చర్య తీసుకోవడం దారుణమంటూ ఇప్పుడు విలపించి ప్రయోజనం లేదని అంటున్నారు.      [Konda Susmitha Tears Bedore Media, Konda Surekha, Revanth Reddy, Telangana Congress, Cabinet dismissal, Telugu One]
ALSO ON TELUGUONE N E W S
జీవితంలో మనం అనుకునే దారులు ఒకటైతే, మన ప్రయాణం మనల్ని తీసుకెళ్లే గమ్యం ఇంకోటి అవుతుంది. కేవలం 21 ఏళ్ల వయసులోనే ఒక సాధారణ భారతీయ యువతి చిత్ర పరిశ్రమలో సృష్టించిన సంచలనం ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తూ, జీవితంలో కార్పొరేట్ ఉద్యోగం చేయాలని కలలు కనిన ఆ యువతి, అనుకోకుండా ఒక గ్లోబల్ విజేతగా రూపాంతరం చెందింది. యూకేలోని ప్రముఖ యూనివర్సిటీ ఆఫ్ బాత్‌లో ఎకనామిక్స్ చదివిన అనుప్రియ విజయగాథ వెనుక ఉన్న అసలు నిజాలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్రంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఉపాధి, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన అనుప్రియ, గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక స్విట్జర్లాండ్‌లో ఆర్ట్ ఇండస్ట్రీలో ఒక మంచి ఉద్యోగం చేయాలని ప్రణాళిక వేసుకుంది. అయితే ఆమె చదువు ఆఖరి సంవత్సరంలో టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించిన గొప్ప మహానుభావుల జీవితాలపై పరిశోధన చేయడం ప్రారంభించింది. ఈ అకడమిక్ రీసెర్చ్‌లోనే ఆమె యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ జీవిత చరిత్రను లోతుగా అధ్యయనం చేసింది. ఆ పరిశోధనలోనే స్టీవ్ జాబ్స్‌కు భారత్‌లోని నీమ్ కరోలీ బాబాతో ఉన్న ఆధ్యాత్మిక అనుబంధం, ఆయన ఉత్తరాఖండ్‌లోని కైంచి ధామ్ సందర్శించిన విచిత్రమైన విషయాలు బయటపడ్డాయి. ప్రపంచాన్ని మార్చిన ఒక విదేశీ దిగ్గజ టెక్ వ్యవస్థాపకుడికి, ఒక భారతీయ సాధువుకు మధ్య ఉన్న ఈ ఆసక్తికరమైన సంబంధం అనుప్రియను తీవ్ర ఆలోచనలో పడేసింది. ఒక విదేశీ దిగ్గజం ద్వారా మన భారతీయ ఆధ్యాత్మిక వేత్త గురించి తెలుసుకోవడం ఏమిటి అనే ప్రశ్న ఆమెను నిద్రాహారాలు మానకుండా బాబా జీవితంపై మరింత లోతుగా పరిశోధించేలా చేసింది. చదువు పూర్తయిన తర్వాత భారత్‌కు తిరిగి వచ్చిన అనుప్రియ నగర్‌కు అనుకోకుండా దర్శకుడు విశాల్ చతుర్వేదితో పరిచయం ఏర్పడింది. ఆయన అప్పటికే నీమ్ కరోలీ బాబా బాల్యం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన కథను ప్రపంచానికి చూపించాలనే తపనతో, అనుప్రియ తుది నిర్ణయం తీసుకుంది. యూకేలో విద్యార్థిగా ఉన్నప్పుడు పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి తను సొంతంగా దాచుకున్న కష్టార్జితాన్ని ఈ సినిమా ప్రాజెక్టులో పెట్టుబడిగా పెట్టడానికి ధైర్యం చేసింది. అలా లక్ష్మీ నారాయణ్ (నీమ్ కరోలీ బాబా అసలు పేరు) చిన్ననాటి జీవిత కథ ఆధారంగా ‘హనుమాన్ అంశ్’ అనే భక్తిరస చలనచిత్రం ప్రాణం పోసుకుంది. అత్యంత పరిమితమైన బడ్జెట్‌తో, కేవలం రూ. 2 కోట్ల కంటే తక్కువ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మొదటి రోజు థియేటర్లలో అతి సాధారణ స్పందనతో ప్రారంభమైన ఈ చిత్రం, ఆ తర్వాత ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్‌తో అనూహ్యమైన ప్రభంజనాన్ని సృష్టించింది. కేవలం 31 రోజుల వ్యవధిలోనే ఈ సినిమా భారతదేశంలో ఏకంగా రూ. 122 కోట్లకు పైగా నెట్ వసూళ్లను సాధించి బాక్స్‌ఆఫీస్ రికార్డులను తిరగరాసింది. సాధారణంగా కళాఖండాలను సేకరించే సాంప్రదాయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అనుప్రియ నిర్ణయం చూసి మొదట్లో ఆమె కుటుంబ సభ్యులు విస్తుపోయినప్పటికీ, ఈ ఊహించని చారిత్రాత్మక విజయం తర్వాత ఆమెను చూసి ఎంతో గర్వపడ్డారు. ఈ చిత్రాన్ని కేవలం లాభాల కోసం వ్యాపార దృక్పథంతో తీయలేదని, నీమ్ కరోలీ బాబా దివ్యమైన కథలను మరియు ఆయన విశిష్ట బోధనలను నేటి యువతరానికి అందించడమే తన ప్రధాన లక్ష్యమని అనుప్రియ ఎంతో నమ్మకంగా వెల్లడించింది. విశాల్ చతుర్వేది రాసిన ఆధ్యాత్మిక జ్ఞాపకాల ఆధారంగా ఈ చిత్రాన్ని మొత్తం మూడు భాగాలుగా నిర్మించబోతుండగా, అందులో మొదటి భాగంగా వచ్చిన ‘హనుమాన్ అంశ్’ సినీ చరిత్రలోనే ఒక సంచలనాత్మక ఘట్టంగా నిలిచిపోయింది.     [Anupriya Nagar, Hanuman Ansh, Steve Jobs Inspiration, Neem Karoli Baba Movie, Hanuman Ansh Box Office, 122 Crore Success]
Bethlehem Kudumba Unit released to an unanimous positive reception with people enjoying the chemistry between leads Nivin Pauly, Mamitha Baiju. The movie's core comical characters like Glikson have clicked big time across the languages with the love story. Hence, it is set to become Malayalam's new Industry Hit.  The movie has collected Rs.265.71 crores gross worldwide and it is just 38-40 crores away from crossing last year's Onam IH, Lokah Part-1: Chandra. It is interesting to note that another Onam release is set to break the records of previous one. On Sunday, movie collected Rs.8.10 crores gross from India with Kerala contributing Rs.6.82 crores gross.  This is sensational trending for any Malayalam film as Bethlehem is continuously breaking every existing record in the book. Looking at the Monday bookings, the trade analysts are predicting the film to cross existing Kerala highest Vaazha II's Rs.129.23 crores gross, by this weekend as it is already at Rs.117.22 crores gross.  Directed by Girish AD, the movie has become a tremendous all-time blockbuster for Nivin Pauly post Premam, announcing his big comeback after Sarvam Maya. Mamitha Baiju has also proven to be a big box office sensation as her Vishwanath and Sons, Jana Nayagan have also collected big numbers at the box office.  The makers have released Telugu and Tamil dubbed versions last weekend and they are adding good value to the engine blowing on full throttle. Looks like the combination will be asked to be repeated very soon, looking at such incredible box office returns.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   
సుమంత్, ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పిరిచువల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సిద్దు జొన్నలగడ్డ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించారు. రాజశ్యామల ఎంటర్‌టైన్‌మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై కలిపు మధు, లక్ష్మణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఈ చిత్రం సెప్టెంబర్ 11న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో అఖిల్ అక్కినేని ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.  ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అఖిల్ అక్కినేని మాట్లాడుతూ.. "ఇలాంటి మంచి ప్రాజెక్ట్ నిర్మించిన లక్ష్మణ్ గారికి కంగ్రాచ్యులేషన్స్. ఈ రోజుల్లో ప్రేక్షకులు థియేటర్‌కు రావాలంటే అలాంటి కంటెంట్‌ను అందించగలగాలి. ఇప్పుడు టీజర్, ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా ఇది ప్రేక్షకులు థియేటర్‌లో చూడదగ్గ సినిమా అనిపిస్తుంది. ఇలాంటి నిర్మాతలు మన పరిశ్రమకు మరింతమంది కావాలి. నేను చిన్నప్పటి నుంచి సుమంత్ అన్న ఒడిలోనే పెరిగాను. నాకు ఏది కావాలన్నా ఎక్కువగా సుమంత్‌నే అడిగేవాడిని. ఒక్కరోజు కూడా ఆయన ఎప్పుడూ నాకు నో చెప్పలేదు. ఈరోజు ఆయన ఫంక్షన్‌కు వచ్చి మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా పాజిటివ్ ఫీలింగ్. అలాగే, సిద్దుకి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తున్నాయి. కానీ ఆయన వేరే సినిమా కోసం సపోర్ట్ చేస్తూ ఇందులో చేయడం నిజంగా అభినందనీయం. ఏదో ఒక రోజు ఆయన సినిమాలో నేను కూడా భాగం కావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ సంతోష్ గారు ఈ సినిమా కోసం తన ప్రాణం పెట్టి పనిచేశారు. ‘మహేంద్రగిరి వారాహి’లాంటి కంటెంట్ ఉన్న సినిమా తీసుకొస్తున్నారు. ఈ సినిమా ఆడబోతుంది. చాలా పెద్ద హిట్ అవ్వబోతుందని నమ్మకం ఉంది. ఇంత మంచి కంటెంట్ బేస్ ఉన్న సినిమాని ఇస్తున్నందుకు టీమ్‌కి కంగ్రాజులేషన్స్. సెప్టెంబర్ 11న అందరూ థియేటర్‌లో చూడండి. మంచి కంటెంట్ ఎంజాయ్ చేయండి." అన్నారు.  హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. "ముందుగా లెనిన్ తో బ్లాక్‌బస్టర్ కొట్టిన అఖిల్ గారికి కంగ్రాట్స్. ఆయన హార్డ్ వర్క్ స్క్రీన్ మీద కనిపించింది. చివరి 40 నిమిషాలు చూసి షాక్ అయ్యాను. అంత అద్భుతంగా చేశారు. ‘మహేంద్రగిరి వారాహి’ సినిమాలో నేను చేయడానికి ప్రధాన కారణం నిర్మాత మధుగారు. మేము గతంలో ఒక సినిమా చేయాలని ప్లాన్ చేశాము. కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. ఇప్పుడు ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. సుమంత్ గారు చాలా ఫ్రీడమ్ ఉన్న కెరీర్‌ను సెట్ చేసుకున్నారు.  ఆయన ప్రతి సినిమా డిఫరెంట్‌గా ఉంటుంది. ‘మహేంద్రగిరి వారాహి’ ద్వారా అద్భుతమైన సినిమా. మేమిద్దరం కలిసి చేసిన సీన్ చాలా  బావుంటుంది. తనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. దర్శకుడు  అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ చాలా బాగున్నాయి. అనుప్ రూబెన్స్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. సెప్టెంబర్ 11న సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా అందరూ థియేటర్‌లో చూడండి." అన్నారు.  హీరో సుమంత్ మాట్లాడుతూ.. "ఈ సినిమా జర్నీ మూడు సంవత్సరాల క్రితం మొదలైంది. కథ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద స్థాయిలో చేయాలి. అలాంటి స్థాయిలో నిర్మించే నిర్మాత కోసం చూశాం. అమ్మవారి ఆశీస్సులతో నిర్మాత మధుగారు ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. సినిమా ఒక లెవల్‌కు వచ్చింది. తర్వాత లక్ష్మణ్ గారు ఎంటర్ అయ్యారు. మరో లెవల్‌కు పెరిగింది. సినిమా ప్రమోషన్స్ కూడా చాలా విభిన్నంగా చేశాము. దాదాపు 150 థియేటర్స్ లో అమ్మవారి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈ సినిమా వెనుక ఏదో శక్తి ఉన్నట్టు మేము ఫీలయ్యాము. సెప్టెంబర్ 11న మా కష్టార్జితం మీరు తెరపై చూడబోతున్నారు. ఇందులో నేను, సిద్దు చేసిన ఒక సన్నివేశం సినిమా మొత్తానికి హైలైట్‌గా ఉంటుంది. డైరెక్టర్ సంతోష్ ఆ సన్నివేశాన్ని అద్భుతంగా డిజైన్ చేశారు. మా నిర్మాతలు ఈ సినిమా చూశారు. చూసిన తర్వాత వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ దుమ్ముదులిపేస్తుంది. సిద్దు వచ్చిన తర్వాత సినిమా మరో స్థాయికి వెళ్లింది. ఈ కథని ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. సినిమాలో ఆయన కొత్త రూపాన్ని చూస్తారు. ఈ సినిమాకి ఆయన బరువు పెంచారు. అలీ గారితో, బ్రహ్మానందం గారితో పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది. ఈ సినిమాలో బ్రహ్మానందం గారు చాలా కొత్తగా కనిపిస్తారు. పెద్ద మనవడుకి సపోర్ట్ అందించడానికి చిన్నమనవడు(అఖిల్) వచ్చాడు(నవ్వుతూ) వాడికి థాంక్స్ అని నేను చెప్పకూడదు. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి నా ఒడిలోనే పెరిగాడు. మొన్న ‘లెనిన్ తో బ్లాక్‌బస్టర్‌తో తన సత్తా ఏంటో చూపించాడు. ‘లెనిన్’ సినిమా చూస్తున్నప్పుడు యాక్టర్‌గా నేను గర్వపడ్డాను. అంత అద్భుతంగా చేశాడు. తన సక్సెస్‌లో ఎక్కువ సంతోషపడింది నేనే. తను ఈ వేడుకకు రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 11న అందరూ సినిమాని థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీద నేను చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. అందరం థియేటర్స్‌లో కలుద్దాం." అన్నారు.        [Mahendragiri Varahi, Pre Release Event, Hero Sumanth, Akhil Akkineni, Siddhu Jonnalagadda, Telugu Film News, Telugu News]  
Allari Naresh’s latest release Ramba Oorvasi Menaka has recorded a steady start at the box office, collecting more than Rs.4.40 crore gross worldwide in its first three days. The film marks his return to the comedy genre after a series of recent releases across different genres. Directed by Chandramohan Chintada, the fantasy entertainer is produced by Annapurna Studios and Hasya Movies. Rashi Singh and Surbhi play the female leads, while Vennela Kishore is also part of the principal cast. The film combines comedy with a family-oriented emotional track, with the second half placing greater emphasis on the relationship between a mother and her son. The response to these elements appears to be contributing to its performance in several centres. Trade trends indicate that the film has maintained its momentum beyond the opening day, with bookings continuing across various locations. The movie has also been appearing prominently on booking platforms, while individual centres are reporting a mix of advance and counter bookings. With word of mouth continuing to develop, the coming days will be important in determining whether Ramba Oorvasi Menaka can sustain its current pace and build on its opening weekend numbers. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
Nandamuri Balakrishna is stepping into a gangster-action world with his upcoming film Dada, directed by Gopichand Malineni. After creating buzz with the earlier birthday glimpse, the makers have now unveiled the title along with a high-energy glimpse. The title Dada immediately sets the tone, and the glimpse makes it clear that Balakrishna is playing a character built around attitude, aggression and mass appeal. His younger look, Hindi dialogues and trademark dialogue delivery give the character a different flavour, while the action blocks suggest a bloody gangster backdrop. Gopichand Malineni, who previously teamed up with Balakrishna for Veera Simha Reddy, appears to be going bigger with this outing. The visuals have a darker texture, with Balakrishna's body language and screen presence taking centre stage. S Thaman's background score adds considerable punch, particularly the Dada title track built around the "Nayak Nahin, Kal Nayak" hook. It fits the character's larger-than-life attitude and gives the glimpse its theatrical high. Produced by Venkata Satish Kilaru, the film stars Manchu Manoj and Kajal Aggarwal in prominent roles. Dada is slated for a worldwide release on December 24, targeting the Christmas holiday season.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ తేజ తెలుగు చిత్రసీమలో తన తొలి అడుగు వేయడానికి సిద్ధమయ్యారు. మోక్షజ్ఞ పుట్టినరోజు సందర్భంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న డెబ్యూ సినిమాను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. తన డెబ్యూ కోసం సరైన కథను ఎంచుకునేందుకు మోక్షజ్ఞ కావాల్సిన సమయం తీసుకున్నారు. పలు కథలను విన్న తర్వాత తనకు నచ్చిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ చేస్తున్న దర్శకుడు వశిష్ఠ ఈ కథను సిద్ధం చేశారు. ఈ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందులోనూ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించనుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. https://x.com/MythriOfficial/status/2096586804921037157 చిత్ర బృందం బాలకృష్ణ, మోక్షజ్ఞలను కలుసుకుని, యంగ్ లయన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్న కొన్ని స్టిల్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ స్టిల్స్ మోక్షజ్ఞ స్టైలిష్‌గా, ఫిట్‌గా, చాలా హ్యాండ్సమ్ కనిపించడం అందరినీ ఆకట్టుకుంది.   సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు మోక్షజ్ఞ ఇప్పటికే ఇంటెన్స్ గా ప్రిపేర్ అయ్యారు. కమర్షియల్ హీరోకు అన్ని అంశాల్లో శిక్షణ తీసుకుంటూ ఫిజికాలిటీ, పెర్ఫార్మెన్స్,  స్క్రీన్ ప్రెజెన్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.   మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇస్తుండటం, వశిష్ఠ దర్శకత్వం వహిస్తుండటం, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుండటంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మిగతా నటీనటులు, టెక్నికల్ టీం వివరాలని మేకర్స్ వెల్లడించనున్నారు.        [Nandamuri Mokshagna Teja, Nandamuri Balakrishna, Mallidi Vassishta, Mythri Movie Makers, Telugu Film News, Telugu News]  
గాడ్ అఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ #NBK111, బాలయ్య పుట్టినరోజున "ఎంట్రీ ఆఫ్ ఆన్ ఎరా" పేరుతో గ్లింప్స్ విడుదలైనప్పటి నుండి భారీ బజ్‌ను క్రియేట్ చేస్తోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్‌ను పోస్టర్, పవర్ ఫుల్ గ్లింప్స్ ద్వారా ప్రకటించారు. #NBK111కు ‘దాదా’ అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. బాలకృష్ణ పోషిస్తున్న పాత్ర స్వభావాన్ని ప్రజెంట్ చేసేలా ఈ టైటిల్‌ ఉంది. పోస్టర్‌లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్‌, లెదర్ జాకెట్‌, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన ఆయన.. భుజంపై వెపన్‌తో గ్యాంగ్‌స్టర్ తరహా వైబ్‌ను తీసుకొచ్చారు. ఆయన సీరియస్ ఎక్స్‌ప్రెషన్‌, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్ క్యారెక్టర్‌లోని పవర్‌ను మరింత ఎలివేట్ చేశాయి. టైటిల్ గ్లింప్స్‌ బాలకృష్ణ క్యారెక్టర్ పవర్‌, ఆరాను ప్రజెంట్ చేస్తూ, ఆయనను ‘షేర్’ (సింహం)గా సంబోధించే వాయిస్‌ఓవర్‌తో వీడియో ఓపెన్ అవుతుంది. పోలీస్ అధికారులు ఆయనను చుట్టుముట్టి ఛాతిలో కాల్చేస్తామని హెచ్చరిస్తారు. ‘నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్‌కి బలుపు, గన్స్‌కి గట్స్ ఉండాలి' అని బాలయ్య చెప్పిన పవర్‌ఫుల్ డైలాగ్‌ అదిపోయింది, ఈ సీక్వెన్స్‌ అభిమానులను, మాస్ ఆడియన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేసేలా ఉంది. దర్శకుడు గోపీచంద్‌ మలినేని బాలకృష్ణను లార్జర్‌ దేన్ లైఫ్ మాస్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. ఎస్. థమన్ ఎలక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో గ్లింప్స్‌ ఇంపాక్ట్‌ను మరింత పెంచారు. బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించే ‘రాజా హూన్ మైన్’ ట్రాక్ సీక్వెన్స్‌కు మరింత ఎనర్జీ, ఇంటెన్సిటీని తీసుకొచ్చింది. మొత్తంగా గ్లింప్స్‌ నెక్స్ట్ లెవల్ మాస్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తూ, హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై అంచనాలు పెంచింది. మేకర్స్ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ‘దాదా’ డిసెంబరు 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్‌తో పాటు ముందస్తు న్యూ ఇయర్ ట్రీట్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘దాదా’లో మంచు మనోజ్‌, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా అరవింద్‌ ఎస్. కశ్యప్‌, మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎస్. థమన్ పనిచేస్తున్నారు. ఏఎస్. ప్రకాశ్‌ ప్రొడక్షన్ డిజైన్‌ బాధ్యతలు నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్‌ రాశారు. రామ్-లక్ష్మణ్‌, రవి వర్మ, వెంకట్‌ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.  బ్లాక్‌బస్టర్ ‘వీరసింహారెడ్డి’ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్‌ మలినేని మరోసారి కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ స్పెక్టకిల్ మాస్ ట్రీట్ ఇవ్వబోతుంది.        [NBK111 Movie, DADA Movie, Nandamuri BalaKrishna, Gopichand Malineni, Manchu Manoj, Telugu Film News, Telugu News]
Nandamuri Mokshagna Teja is finally making his much-awaited Telugu cinema debut, and the combination behind his launch has immediately caught attention. The son of Nandamuri Balakrishna, Mokshagna will be introduced under the direction of Vassishta, with Mythri Movie Makers backing the project. Mokshagna has taken his time before locking his debut vehicle, listening to several scripts before settling on Vassishta's story. The director, currently working on Chiranjeevi's Vishwambhara, has chosen a commercial setup that is expected to combine action, larger-than-life sequences and elements of fantasy. The interesting factor is the scale being planned for the debut. With Mythri Movie Makers involved, the film is expected to be mounted as a big-budget theatrical entertainer rather than a relatively safe launch vehicle. Vassishta's track record of handling ambitious concepts also makes the collaboration an interesting one.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
  టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్-ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ 'గూఢచారి 2' (G2) పై అంచనాలు రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతున్నాయి. 2018లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన 'గూఢచారి'కి సీక్వెల్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా రషెస్ చూసిన ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఇచ్చిన ఫస్ట్ రివ్యూ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, సినీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అడివి శేష్ తన సినిమాలకు సంబంధించిన కంటెంట్‌ను 90 శాతం షూటింగ్ పూర్తయ్యాకే సన్నిహితులకు చూపిస్తుంటారు. అయితే 'గూఢచారి 2' చిత్రం మాత్రం కేవలం 70 శాతం పూర్తయిన దశలోనే రాహుల్ రవీంద్రన్ ఎడిటింగ్ రూమ్‌లో చూసినట్లు తెలుస్తోంది. సినిమాలోని మైండ్ బ్లోయింగ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు, ఊహించని ట్విస్టులు వేరే లెవెల్‌లో ఉన్నాయని, ఇది అడివి శేష్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలవడమే కాకుండా ఇండియన్ స్పై థ్రిల్లర్ల ప్రమాణాలను మార్చేస్తుందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. మొదటి భాగంలో తండ్రి కోసం వెతికే కుర్రాడిగా కనిపించిన శేష్, ఈ పార్ట్‌లో ఏకంగా అంతర్జాతీయ ఉగ్రవాద నెట్‌వర్క్‌ను ఛేదించే పవర్‌ఫుల్ రా (RAW) ఏజెంట్‌గా కనిపించబోతున్నారు. దీనికోసం ఆయన ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ సీక్వెల్‌లో బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ కీలక పాత్ర పోషిస్తుండగా, వామిక గబ్బి కథానాయికగా నటిస్తున్నారు. వినయ్ కుమార్ సిరిగిరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ మరియు ఎకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగంతో పోలిస్తే భారీ బడ్జెట్‌తో గ్లోబల్ స్కేల్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు విడుదలకు ముందే రూ. 80 కోట్లకు పైగా థియేట్రికల్ మరియు డిజిటల్ బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం ఫిలిం నగర్ సర్కిల్స్‌లో 'గూఢచారి 2' గురించి నడుస్తున్న ఈ పాజిటివ్ బజ్ అడివి శేష్ అభిమానుల్లో భారీ ఆశలను రేకెత్తిస్తోంది. గ్రిప్పింగ్ కథనంతో అంతర్జాతీయ ప్రమాణాలతో వస్తున్న ఈ స్పై థ్రిల్లర్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడడానికి సినీ ప్రియులు ఉత్సాహంతో ఎదురుచూస్తున్నారు.     [Adivi Sesh, Goodachari 2, G2 Movie Update, Rahul Ravindran Review, Tollywood News]
'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని, 'ఉయ్యాల జంపాల' సినిమాతో టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న నటి అవికా గోర్. తాజాగా ఈ భామకు విమానాశ్రయంలో ఒక విచిత్రమైన, అదే సమయంలో ఎంతో మరపురాని అనుభవం ఎదురైంది. తన అభిమానులు చూపించిన ప్రేమను చూసి అక్కడున్న విదేశీయులు భావోద్వేగంతో దాడి చేస్తున్నారేమోనని భయపడిపోవడం విశేషం. ఈ ఆసక్తికర విషయాన్ని నటి అవికా గోర్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. విమానాశ్రయంలో ప్రయాణిస్తున్న సమయంలో ముగ్గురు యంగ్ గర్ల్స్ తన దగ్గరకు వచ్చి ఆత్మీయంగా పలకరించారని తెలిపారు. వారు కేవలం సెల్ఫీలు మాత్రమే తీసుకోకుండా, చిన్నతనం నుంచే తన నటనా ప్రయాణం తమ జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిందో ఎంతో గౌరవంగా వివరించారని అవికా పేర్కొన్నారు. అయితే, అభిమానులు ఎంతో ఉత్సాహంగా, గట్టిగా అరుస్తూ తన చుట్టూ చేరడంతో పక్కనే ఉన్న కొందరు యూరోపియన్ ప్రయాణికులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. ఎవరో నటిపై దాడి చేస్తున్నారేమోనని భావించి కొద్దిసేపు భయభ్రాంతులకు గురయ్యారు. అనంతరం వారు అభిమానులని, కేవలం ప్రేమను చూపిస్తున్నారని వారికి వివరించి చెప్పాల్సి వచ్చిందని అవికా సరదాగా రాసుకొచ్చారు. పదేళ్ల వయసు నుంచే నటిగా ప్రయాణం ప్రారంభించిన తనకు అభిమానుల నుంచి లభించే ఈ ఆదరణే ముందుకు నడిపించే ఇంధనమని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన కళను, కష్టాన్ని గుర్తించి ఇంతగా ప్రేమిస్తున్నందుకు ఆ అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తన నటనపై ఏనాడూ అనుమానం పెట్టుకోకుండా మరింత కష్టపడతానని ఆమె హామీ ఇచ్చారు. చిన్న తెరపై ప్రస్థానం ప్రారంభించి ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస హిట్లు సాధించిన అవికా గోర్, ఇటీవల ప్రసిద్ధ హిందీ రియాలిటీ షో 'ఖత్రోన్ కే ఖిలాడీ 15'లో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం వెండితెరపై విభిన్న తరహా కథాంశాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఈ సరదా సంఘటనను అవికా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ పోస్ట్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.     [Avika Gor, Avika Gor Airport Incident, Avika Gor Instagram Story, Balika Vadhu Avika Gor, Celebrity News]
  మానవ మెదడు వికాసం టీనేజ్ పూర్తికాగానే ఆగిపోదని, యుక్తవయస్సు మరియు 20ల మధ్యకాలం వరకు నిరంతరం మారుతూనే ఉంటుందని శాస్త్రజ్ఞులకు ఇప్పటికే తెలుసు. అయితే ఈ సుదీర్ఘ ఎదుగుదల కాలంలో మన జ్ఞాపకశక్తి సర్క్యూట్లు ఎలా పరిపక్వత చెందుతాయో వివరిస్తూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు ఒక సంచలనాత్మక జీవశాస్త్ర ప్రక్రియను వెల్లడించారు. ప్లోస్ బయోలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనంలో, లేట్ అడోలెసెన్స్ లేదా లేట్ టీనేజ్ దాటాక మెదడులోని ఒక ముఖ్యమైన జ్ఞాపకశక్తి ప్రాంతం ఊహించని రీతిలో రీమోడలింగ్ లేదా పునర్నిర్మాణానికి గురవుతుందని గుర్తించారు. ఈ మార్పుల వల్ల చిన్నతనంలో లేదా టీనేజ్ ప్రారంభంలో ఏర్పడిన జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం తాత్కాలికంగా కష్టమవుతుందని, తరువాత కాలంలో అవి తిరిగి గుర్తుకొచ్చినా పూర్తి వివరాలతో కాకుండా కేవలం అనుభూతి ప్రాధాన్యతతో మాత్రమే గుర్తుంటాయని సైంటిస్టులు రుజువు చేశారు. ఈ పరిశోధన కోసం శాస్త్రవేత్తలు మెదడులోని  రెట్రోస్ప్లేనియల్ కార్టెక్స్  అనే కీలక ప్రాంతంపై దృష్టి సారించారు. సుదీర్ఘకాల జ్ఞాపకాలను భద్రపరచడంలో, వాటిని క్రమబద్ధీకరించడంలో ఈ ప్రాంతం అత్యంత ప్రాధాన్యమైన పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తి సర్క్యూట్‌లను స్థిరంగా ఉంచడానికి  పెరిన్యూరోనల్ నెట్స్  అని పిలిచే రక్షణ వలయం వంటి నిర్మాణాలు సహాయపడతాయి. అయితే లేట్ అడోలెసెన్స్ సమయంలో ఈ రక్షణ వలయాలు తాత్కాలికంగా క్షీణించి, ఆ తర్వాత అడల్ట్‌హుడ్ లేదా పూర్తి పెద్దవయస్సు వచ్చేసరికి తిరిగి పునర్నిర్మించబడతాయని పరిశోధనలో తేలింది. విశేషమేమిటంటే, ఈ మార్పులు కేవలం రెట్రోస్ప్లేనియల్ కార్టెక్స్‌లోనే సంభవించాయి తప్ప, నిమిషాల వ్యవధిలో జ్ఞాపకాలను ప్రాసెస్ చేసే హిప్పోకాంపస్‌లో నమోదు కాలేదు. ఈ జీవశాస్త్ర మార్పులు ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోవడానికి పరిశోధకులు ఎలుకలపై ప్రయోగాలు నిర్వహించారు. చిన్నతనంలో లేదా ప్రారంభ అడోలెసెన్స్‌లో నేర్చుకున్న అనుభవాలు, లేట్ అడోలెసెన్స్ సమయానికి వచ్చేసరికి సరిగ్గా గుర్తుకురాకపోవడాన్ని గమనించారు. అయితే పెద్దయిన తర్వాత అదే జ్ఞాపకాలు మళ్లీ బయటకు వచ్చినా, వాటిలోని పక్కా వివరాలు మాయమై కేవలం ఆ సంఘటన వెనుక ఉన్న భావోద్వేగం మాత్రమే మిగులుతుందని తేలింది. మానవులలో కనిపించే రెమినిసెన్స్ బంప్  అనే దృగ్విషయానికి ఈ జీవ ప్రక్రియే మూలకారణమని సైంటిస్టులు భావిస్తున్నారు. పెద్దయ్యాక మనకు టీనేజ్ అనుభవాలు ఎక్కువగా గుర్తుకురావడం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ ఆవిష్కరణ మానవ మెదడు వికాసంపై మనకున్న అవగాహనను పూర్తిగా మార్చివేస్తోంది. యుక్తవయస్సులో పాత జ్ఞాపకాలు తాత్కాలికంగా మసకబారడం వెనుక ఒక గొప్ప అంతర్లీన ప్రయోజనం ఉందనేది పరిశోధకుల అభిప్రాయం. చిన్ననాటి జ్ఞాపకాల కంటే, పెద్దయ్యే కొద్దీ ఎదురయ్యే కొత్త సవాళ్లు మరియు కొత్త జీవిత పరిస్థితులకు త్వరగా అలవాటు పడటానికి మెదడు పాత జ్ఞాపకాల యాక్సెస్‌ను తగ్గించి కొత్తవాటికి ప్రాధాన్యత ఇస్తుంది. మెదడు తను చేసే ఈ అద్భుతమైన వైరింగ్ సర్దుబాటు ద్వారానే మనుషులు వయస్సుతో పాటు కొత్త పరిజ్ఞానాన్ని, అనుభవాలను సులువుగా స్వీకరించగలుగుతున్నారు.       How brain maturation affects memory recall, Einstein study on adolescent brain memory changes.
    సిజోఫ్రెనియా వంటి తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు  క్లోజాపైన్  అనే యాంటీసైకోటిక్ ఔషధం ఒక అత్యంత శక్తివంతమైన సంజీవనిలా పనిచేస్తుంది. ఇతర మందులకు లొంగని కఠినమైన వ్యాధి లక్షణాలను సైతం నియంత్రించడంలో ఇది ఎంతో ప్రభావవంతమైనదని వైద్య ప్రపంచం కొనియాడుతుంది. అయితే ఈ అద్భుతమైన మందు వాడే రోగులలో విపరీతమైన ఆకలి పెరగడం, తీవ్రమైన బరువు పెరగడం, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ మరియు టైప్,2 డయాబెటిస్ వంటి జీవక్రియ సమస్యలు తలెత్తడం అత్యంత ప్రధానమైన లోపంగా మారింది. బరువు పెరుగుతామనే భయంతో లేదా శారీరక రుగ్మతల వల్ల చాలామంది రోగులు మధ్యలోనే ఈ మందును వాడటం ఆపివేసి, తిరిగి తీవ్రమైన మానసిక అనారోగ్యం బారిన పడుతున్నారు. దశాబ్దాలుగా వైద్యులను వేధిస్తున్న ఈ పెద్ద సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా అమెరికాలోని యుటి సౌత్‌వెస్టర్న్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు సంచలనాత్మక పరిశోధనా వివరాలను ప్రముఖ  నేచర్ కమ్యూనికేషన్స్  జర్నల్‌లో ప్రచురించారు. శాస్త్రవేత్తల బృందం చేపట్టిన ఈ ప్రీక్లినికల్ అధ్యయనం ప్రకారం, క్లోజాపైన్ ఔషధం మెదడులోని ఆకలిని నియంత్రించే కేంద్రాలపై ఎలా ప్రతికూల ప్రభావం చూపుతుందో స్పష్టమైన సైంటిఫిక్ ఆధారాలతో బహిర్గతం చేసింది. మన మెదడులోని హైపోథాలమస్ ప్రాంతంలో ఉండే  మెలనోకార్టిన్ 4 రిసెప్టర్  లేదా MC4R నైరూప్య నాడీ కణాలు శరీరంలో ఆకలిని అణచివేసి, కడుపు నిండిన భావనను కలిగిస్తాయి. అయితే ఈ న్యూరాన్లలో  Kir7.1  అనే పొటాషియం ఛానల్స్ బ్రేకింగ్ సిస్టమ్‌లా పనిచేస్తాయి. క్లోజాపైన్ మరియు రిస్పెరిడోన్ వంటి మందులను శరీరానికి అందించినప్పుడు, అవి MC4R మరియు Kir7.1 మధ్య ఉన్న సంబంధాన్ని మరింత బలపరిచి, ఆకలిని నివారించే నాడీ వ్యవస్థ కార్యకలాపాలను పూర్తిగా నిష్క్రియం చేస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. దీనివల్ల మెదడు ఆకలి సంకేతాలను ఆపలేక రోగులు ముఖ్యంగా రాత్రి వేళల్లో మితిమీరి ఆహారం తీసుకునేలా ప్రేరేపించబడుతున్నారు. ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాలలో, 12 వారాల పాటు క్లోజాపైన్ మందును అందించినప్పుడు ఎలుకలు విపరీతంగా ఆహారాన్ని తిని, కొవ్వు పెరిగి, ఫ్యాటీ లివర్ మరియు ఇన్సులిన్ నిరోధకతను సంతరించుకున్నాయి. మెదడులోని ఈ సంకేత వ్యవస్థను పునరుద్ధరించడానికి శాస్త్రవేత్తలు Setmelanotide మరియు ML418 అనే ప్రయోగాత్మక మందులను పరీక్షించారు. Kir7.1 పొటాషియం ఛానల్ బ్లాకర్ ఆధారిత చికిత్సను అందించినప్పుడు ఎలుకలలో ఆహార వినియోగం తగ్గి, బరువు గణనీయంగా నియంత్రణలోకి వచ్చింది. అత్యంత ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఈ ఆకలి అణచివేసే మార్గాన్ని బ్లాక్ చేయడం వల్ల క్లోజాపైన్ యొక్క అసలైన మానసిక చికిత్స సామర్థ్యం లేదా సైకోసిస్ నియంత్రణ శక్తి కొంచెం కూడా తగ్గకపోవడం గమనార్హం. ఈ నూతన పరిశోధన భవిష్యత్తులో మానసిక రోగుల సంరక్షణలో ఒక విప్లవాత్మక మార్పుకు నాంది పలకనుంది. క్లోజాపైన్ వాడే బాధితులు మానసికంగా కోలుకుంటూనే, శారీరక బరువు మరియు జీవక్రియ రుగ్మతల బారిన పడకుండా కాపాడే కొత్త కాంబినేషన్ ఔషధాల తయారీకి ఈ అధ్యయనం పునాది వేసింది. డాక్టర్ చెన్ ల్యూ నాయకత్వంలోని శాస్త్రవేత్తల బృందం వెల్లడించిన ఈ బ్రెయిన్ సిగ్నలింగ్ మెకానిజం, ప్రపంచవ్యాప్తంగా సిజోఫ్రెనియా రోగులకు మెరుగైన, సురక్షితమైన ఉజ్జ్వల భవిష్యత్తును ప్రసాదించబోతోంది. A southwestern study on clozapine side effects,brain pathway explains antipsychotic weight gain.
    ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను వేధిస్తున్న అత్యంత తీవ్రమైన ఊపిరితిత్తుల ఆరోగ్య సమస్యలలో క్రోనిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా సిఓపిడి ప్రధానమైనది. ఊపిరితిత్తులలో గాలి సరిగ్గా ఆడకపోవడం, నిరంతరం ఆయాసం రావడం, శ్వాస తీసుకోవడం అత్యంత కష్టంగా మారడం వల్ల రోగులు భౌతికంగానే కాకుండా మానసికంగా కూడా తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకూ గురవుతుంటారు. సాధారణంగా సిఓపిడితో బాధపడేవారు దీర్ఘకాలికంగా రకరకాల ఇన్హేలర్లు, యాంటీబయోటిక్స్ మరియు ఊపిరితిత్తుల వ్యాయామాలపై ఆధారపడుతుంటారు. అయితే, ఇటీవల వెలువడిన ఒక సరికొత్త అంతర్జాతీయ వైద్య పరిశోధన ప్రకారం, నవ్వు లేదా లాఫ్టర్ థెరపీ ద్వారా సిఓపిడి రోగులు ఎంతో సులువుగా ఊపిరి పీల్చుకోవచ్చని, వారి ఊపిరితిత్తుల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని శాస్త్రవేత్తలు రుజువు చేశారు. నిరంతరం మందులు వాడటమే కాకుండా, నవ్వును ఒక సహజమైన చికిత్సా మార్గంగా అనుసరించడం వల్ల శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారి జీవిత నాణ్యత ఆశ్చర్యకరంగా పెరుగుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. యురోపియన్ లంగ్ ఫౌండేషన్ మరియు సైంటిఫిక్ రీసెర్చ్ నివేదికల ప్రకారం, సిఓపిడి మరియు ఇతర దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్న 169 మంది రోగులపై చేపట్టిన 5 వేర్వేరు సమగ్ర పరిశోధనా అధ్యయనాల ఆధారంగా ఈ ఫలితాలను ప్రామాణీకరించారు. నవ్వడం వల్ల శరీరంలో డయాఫ్రమ్ మరియు ఛాతీ కండరాలు వేగంగా సంకోచించి విస్తరిస్తాయి, ఇది ఒక రకమైన సహజమైన వ్యాయామంగా పనిచేస్తుంది. ఉల్లాసంగా నవ్వినప్పుడు ఊపిరితిత్తులలో పేరుకుపోయిన పాత, నిలిచిపోయిన గాలి బయటకు వెళ్లి, పవిత్రమైన ప్రాణవాయువు లోపలికి చేరుతుంది. లాఫ్టర్ యోగా మరియు స్టిమ్యులేటెడ్ లాఫ్టర్ థెరపీ పొందిన 100 శాతం రోగులలోనూ మానసిక ఆందోళన, నిరాశ తగ్గడమే కాకుండా వారి శ్వాసక్రియలో సుమారు 15% నుండి 20% వరకు స్పష్టమైన పురోగతి కనిపించిందని డేటా స్పష్టం చేస్తోంది. నవ్వు అనేది కేవలం పెదవులపై విరిసే పువ్వు మాత్రమే కాక, ఊపిరితిత్తుల సాంద్రతను పెంచే దివ్యౌషధమని పరిశోధకులు పేర్కొన్నారు. నవ్వు అనేది మన నాడీ వ్యవస్థపై తక్షణమే సానుకూల ప్రభావం చూపుతుంది. సిఓపిడి రోగులు శ్వాస సరిగ్గా ఆడక తీవ్రమైన పానిక్ లేదా ఆందోళన స్థితికి వెళ్లినప్పుడు, లాఫ్టర్ థెరపీ వారి మెదడులో ఎండోర్ఫిన్లను విడుదల చేసి నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా 15 నుండి 20 నిమిషాల పాటు గ్రూప్ లాఫ్టర్ సెషన్స్ లేదా వినోదాత్మక లాఫ్టర్ ఎక్సర్‌సైజెస్‌లో పాల్గొన్న రోగులలో నిరాశ లక్షణాలు ఏకంగా 30% వరకు తగ్గాయని వైద్యులు గుర్తించారు. అంతేకాకుండా, వారి రోగనిరోధక వ్యవస్థ బలోపేతమై తరచూ వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల తీవ్రత దాదాపు 25% మేరకు తగ్గిందని గణాంకాలు సూచిస్తున్నాయి. శ్వాస సమస్యలతో కృంగిపోయే రోగులకు నవ్వు అనేది ఉచితంగా లభించే ఒక అద్భుతమైన సహజ సిద్ధమైన చికిత్సగా రూపాంతరం చెందింది.     How does laughter therapy help COPD lungs. Medicalxpress COPD laughter study benefits.
50 తర్వాత వృద్ధాప్యం ఎందుకు వేగంగా కనిపిస్తుంది? 30 నుంచి 50 ఏళ్ల మధ్య శరీరంలో, చర్మంలో జరిగే మార్పులకు అసలు కారణాలు ఏమిటి? కొల్లాజెన్, Vitamin D లోపం వృద్ధాప్యంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి? ఇవి ఆహారం ద్వారా మాత్రమే అందుకోవచ్చా? లేక supplements అవసరమా? ప్రముఖ బ్యూటీ ఎక్స్‌పర్ట్, Celebrity Medical Aesthetic Specialist డాక్టర్ శ్రీ సత్య జగదీష్ ఈ వీడియోలో వయసు పెరిగే కొద్దీ శరీరంలో వచ్చే ముఖ్యమైన మార్పుల గురించి వివరిస్తున్నారు. ముఖ్యంగా Hormonal Imbalance, Collagen తగ్గడం, Vitamin D, Zinc, Omega nutrients వంటి అంశాలు ఆరోగ్యం, చర్మం మరియు వృద్ధాప్య ప్రక్రియపై ఎలా ప్రభావం చూపుతాయో సులభంగా తెలియజేస్తున్నారు. 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఆరోగ్యం, చర్మ సౌందర్యం, పోషకాహారం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కొల్లాజెన్, Vitamin D వంటి పోషకాలు ఆహారం నుంచే సరిపోతాయా? Supplements ఎప్పుడు అవసరం కావచ్చు? ఈ ప్రశ్నలకు డాక్టర్ చెప్పిన ముఖ్యమైన సూచనలు ఈ వీడియోలో తెలుసుకోండి. వయసు పెరగడం సహజమే అయినా, సరైన ఆహారం, పోషకాలు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలితో శరీరంలో వచ్చే మార్పులను సమర్థంగా నిర్వహించుకోవచ్చు. పూర్తి వివరాల కోసం వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
వెన్నునొప్పి తర్వాత మానవులలో అత్యంత సాధారణంగా కనిపించే సమస్య మోకాళ్ల నొప్పులు. వయస్సు పైబడటం వల్ల లేదా మోకాలిలోని కార్టిలేజ్ , సాఫ్ట్ టిష్యూలకు గాయాలవడం వల్ల ఈ నొప్పి ఏ వయస్సు వారికైనా రావచ్చు. దీర్ఘకాలం పాటు వేధించే ఈ మోకాళ్ల నొప్పి మనుషులను శారీరకంగా, ఆర్థికంగా , మానసికంగా ఎంతో కుంగదీస్తుంది. అయితే ఈ నొప్పి రాగానే నేరుగా సర్జరీ అవసరం పడుతుందని భయపడాల్సిన పనిలేదు. శస్త్రచికిత్స కంటే ముందే అసలు ఈ మోకాళ్ల నొప్పి ఏ కారణం వల్ల వస్తుందో మరియు దానిని ఎలా అధిగమించవచ్చో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. వీటి గురించి వివరంగా తెలుసుకుంటే.. మోకాళ్ల నొప్పికి ప్రధాన కారణాలు, వాటి లక్షణాలు.. సాధారణంగా 55 నుండి 60 సంవత్సరాల వయస్సు దాటిన వారిలో మోకాళ్ల నొప్పి రావడానికి ఆస్టియోఆర్థరైటిస్ ప్రధాన కారణం. ఇందులో మోకాలి జోళ్లలోని కార్టిలేజ్ అరిగిపోయి, బరువును మోసే సామర్థ్యం తగ్గిపోతుంది. దీనివల్ల మోకాళ్లలో వాపు, తీవ్రమైన నొప్పి ఏర్పడి రోజువారీ పనులు చేసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. ఈ రకమైన నొప్పి మోకాలి కింద లేదా ఇరువైపులా రావచ్చు. ఆస్టియోఆర్థరైటిస్ ఉన్నవారికి ఉదయం పూట మోకాళ్లు బిగుసుకుపోయినట్లు అనిపిస్తాయి. మరొకవైపు, శారీరక శ్రమ మరియు వ్యాయామం ఎక్కువగా చేసే యువత లేదా క్రీడాకారులలో మోకాళ్ల నొప్పి గాయాల వల్ల వస్తుంది. ఎక్కువగా రన్నింగ్ లేదా వర్కౌట్లు చేయడం వల్ల ఐటీ బ్యాండ్ సిండ్రోమ్ రావచ్చు.  తొడ కండరాలు బలహీనంగా ఉండటం, మోకాలి నిర్మాణం సరిగ్గా లేకపోవడం వల్ల పాటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ లేదా రన్నర్స్ నీ అనే సమస్య వస్తుంది. దీనివల్ల మోకాలిచిప్ప కింద నొప్పి అనిపిస్తుంది. మోకాళ్ల నొప్పులు హఠాత్తుగా ఎందుకు వస్తాయి? కొన్నిసార్లు మోకాళ్ల నొప్పి కింద పడటం, ప్రమాదాలు జరగడం, ఆటలు ఆడేటప్పుడు లేదా వంగి పనులు చేసేటప్పుడు అకస్మాత్తుగా రావచ్చు.  మోకాలికి అయ్యే గాయాల్లో మెనిస్కస్ చిరగడం చాలా సాధారణం. ఇది మోకాలిని స్థిరంగా ఉంచే ఒక అర్ధచంద్రాకార కార్టిలేజ్. కాళ్లు అనుకోకుండా మెలిక తిరిగినప్పుడు ఇది చిరిగిపోయి తీవ్రమైన నొప్పి, వాపుకు కారణమవుతుంది. మోకాలిని అనుసంధానించే లిగమెంట్లు అతిగా సాగడం లేదా చిరగడం వల్ల కూడా నొప్పి వస్తుంది. ప్రత్యేకించి ఎమ్‌సిఎల్ , ఏసిఎల్ అనే లిగమెంట్లు గాయపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ నొప్పి నివారణ , సంరక్షణ మార్గాలు.. నొప్పి నెమ్మదిగా ప్రారంభమై పెరుగుతున్నట్లయితే ఫిజియోథెరపిస్ట్ లేదా వైద్యుడిని సంప్రదించాలి. నడక తీరులో లోపాలు, నడుము భాగం బలహీనంగా ఉండటం వల్ల కూడా మోకాళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్ నొప్పి తగ్గుతుంది. ఇది నొప్పి నివారణ మందుల కంటే బాగా పనిచేస్తుంది. నొప్పి ఎక్కువగా ఉన్నవారు సైక్లింగ్, ఈత కొట్టడం లేదా ఎలిప్టికల్ మెషిన్ వాడటం వంటి తక్కువ ఒత్తిడి ఇచ్చే వ్యాయామాలు చేయాలి. మంచి సపోర్ట్ ఇచ్చే బూట్లు ధరించడం వల్ల కూడా నొప్పి తగ్గుతుంది. వైద్య చికిత్సలు , జాగ్రత్తలు.. జీవనశైలి మార్పులు , సాధారణ మందులతో ఉపశమనం లభించనప్పుడు వైద్యులు స్టెరాయిడ్ ఇంజెక్షన్లను సూచిస్తారు. అయితే వీటిని పదే పదే వాడకూడదు. ప్రారంభ దశలోని ఆస్టియోఆర్థరైటిస్ రోగులకు హైలురోనిక్ యాసిడ్ లేదా ప్లేట్‌లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్లు కొంతవరకు సహాయపడవచ్చు. ఏ చికిత్స పనిచేయనప్పుడు చివరి ఛాయిస్ గా మోకాలి మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. మోకాళ్ల గాయాల నివారణకు ప్రథమ చికిత్స .. వ్యాయామం లేదా పనులు చేసేటప్పుడు గాయం వల్ల నొప్పి వస్తే ఆ పనిని వెంటనే ఆపేయాలి. మోకాలి చుట్టూ మంచు గడ్డలతో ఐస్ ప్యాక్ పెట్టడం వల్ల వాపు, నొప్పి తగ్గుతాయి. మెనిస్కస్ లేదా ఏసిఎల్ చిరిగిన సందర్భాలలో వైద్యుడి సలహా మేరకు శస్త్రచికిత్స అవసరం కావచ్చు. మోకాలు పట్టు కోల్పోయినట్లు అనిపించినా, నిలబడటం లేదా మెట్లు ఎక్కడం కష్టంగా మారినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకునే మార్గాలు.. వయస్సు లేదా జన్యుపరమైన అంశాలను మార్చలేము కానీ శరీర బరువును అదుపులో ఉంచుకోవడం ద్వారా మోకాళ్లపై పడే భార తీవ్రతను తగ్గించవచ్చు. వ్యాయామం చేయడం వల్ల మోకాళ్లు పాడవుతాయనేది అపోహ మాత్రమే. శారీరక శ్రమ లేకపోతే కండరాలు బలహీనపడి ఆస్టియోఆర్థరైటిస్ ప్రమాదం మరింత పెరుగుతుంది. సరైన పౌష్టికాహారం తీసుకోవడం, కండరాలను బలంగా ఉంచుకోవడం , తగినంత విశ్రాంతి తీసుకోవడం ద్వారా మోకాళ్ల ఆరోగ్యాన్ని రక్షించుకోవడం  సాధ్యమవుతుంది.                *రూపశ్రీ.
బరువు తగ్గాలని అన్నం మానేశారు… అయినా బరువు తగ్గడం లేదా? రోజూ డైట్ చేసినా వెయిట్ పెరుగుతుందా? అయితే మీ బరువు పెరగడానికి కేవలం ఎక్కువగా తినడమే కారణమా? లేక థైరాయిడ్, PCOS, హార్మోన్ల మార్పులు, ఇన్ఫ్లమేషన్ వంటి ఇతర కారణాలు కూడా ఉన్నాయా? 100 కిలోల బరువు ఉన్నవారు ఒక్క నెలలోనే మొత్తం బరువు తగ్గడం సాధ్యమేనా? కొబ్బరి నూనె తాగడం, ఫ్యాట్ బర్నర్ ట్యాబ్లెట్లు వాడటం నిజంగా ఉపయోగపడతాయా? Mounjaro, Ozempic వంటి బరువు తగ్గించే ఇంజెక్షన్లు ఎంతవరకు సురక్షితం? Bariatric Surgery చేయించుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రవి కుమార్ చింత ఊబకాయం (Obesity) గురించి ముఖ్యమైన విషయాలను సులభంగా వివరిస్తున్నారు. బరువు పెరగడానికి అసలు కారణాలు ఏమిటి? ఆరోగ్యకరంగా బరువు తగ్గాలంటే ఏం చేయాలి? డైట్ విషయంలో ఎలాంటి అపోహలకు దూరంగా ఉండాలి? వంటి విషయాలను తెలుసుకోవచ్చు. మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నారా? థైరాయిడ్ లేదా PCOS వల్ల బరువు పెరుగుతోందని అనుమానం ఉందా? అయితే ఈ వీడియో మీకు ఉపయోగకరమైన సమాచారాన్ని అందిస్తుంది. గమనిక: ఈ వీడియోలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా చికిత్స లేదా బరువు తగ్గించే విధానాన్ని ఎంచుకునే ముందు వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)