LATEST NEWS
  తెలంగాణ రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు ఎప్పుడూ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఒక సాధారణ సినిమా ఫెయిల్ అయితే కేవలం ఆ సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్లకు మాత్రమే నష్టం వస్తుందని, కానీ ప్రస్తుతం తెలంగాణలో నడుస్తున్న 'రేవంత్ రెడ్డి' అనే సినిమా అట్టర్ ఫ్లాప్ కావడం వల్ల ఏకంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారని కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనను ఎండగడుతూ ఆయన సినిమా పరిభాషలో చేసిన ఈ పోలిక ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ అవుతోంది. ఈ 'రేవంత్ రెడ్డి' అనే సినిమాను చూస్తున్న ప్రేక్షకులు ఇప్పటికే తీవ్ర అసహనానికి గురవుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సినిమా ఫస్ట్ హాఫ్ ముగిసి, ఇంటర్వెల్ కాగానే థియేటర్లలో ఉన్న జనాలు తలలు పట్టుకుంటున్నారని, 'ఎప్పుడు పోతడు రా ఈ రేవంత్ రెడ్డి' అంటూ అందరూ తీవ్ర అసంతృప్తితో ఎదురుచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో ఉన్న అభివృద్ధి వేగం పూర్తిగా మందగించిందని, కేసీఆర్ హయాంలో రైతాంగానికి అండగా నిలిచిన రైతుబంధు వంటి పథకాలు అమలు కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అన్నపూర్ణలా విలసిల్లిన తెలంగాణను కాంగ్రెస్ సర్కార్ తన పాలనా వైఫల్యాలతో అనాథ తెలంగాణగా మారుస్తోందని మండిపడ్డారు. పాలన చేతగాని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1000 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ఈ ఆత్మహత్యలన్నీ ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం తన సొంత నియోజకవర్గమైన కోస్గి లాంటి ప్రాంతాల్లో కూడా శాంతిభద్రతలను కాపాడలేకపోతున్నారని, ఆలయాలపైకి బుల్డోజర్లు వెళ్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మెట్రో రైలు రెండో దశ విస్తరణ ప్రాజెక్టు సాధనలో కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ. 13 వేల 400 కోట్ల రుణాన్ని కేవలం 4 శాతం వడ్డీతో, 20 ఏళ్ల సుదీర్ఘ కాలపరిమితికి తీసుకునేలా అంతర్జాతీయ సంస్థలను ఒప్పించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని గుర్తు చేశారు. ఈ లోన్ బదిలీ ప్రక్రియ కోసం డాక్యుమెంట్ ఫీజు కింద రూ. 48 కోట్లు, ఈక్విటీ కింద రూ. 1400 కోట్లు కూడా అప్పట్లోనే చెల్లించామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇన్ని నిధులు సమకూర్చి, ప్రణాళికలు సిద్ధం చేసినా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అభివృద్ధిని గాలికొదిలేసి కేవలం రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి దాదాపు 71 సార్లు ఢిల్లీకి వెళ్లినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆయనను అస్సలు పట్టించుకోవడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించడంలో, కేంద్రం నుండి నిధులు రాబట్టడంలో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 71 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా రాష్ట్రానికి ఒక్క పైసా అదనపు ప్రయోజనం తీసుకురాలేకపోయారని విమర్శించారు. కేవలం కిషన్ రెడ్డి వంటి నేతలతో కలిసి బీఆర్ఎస్ పై బురదజల్లడమే రేవంత్ రెడ్డి పనిగా పెట్టుకున్నారని, ఈ రాజకీయ నాటకాల వల్ల 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.
సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక క్రిమినల్ కులం ఏంటి అంటూ  నేటి యువతను ప్రశ్నించిన తీరు   ఆలోచింపజేస్తోంది. గాదె సాయికృష్ణ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరగాళ్లను కుల కోణంలో చూడటం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టును ఆశ్రయించిందంటే, అది ఆ తల్లి ప్రాథమిక హక్కు అన్న ఆయన.. తన బిడ్డ బతికాడో లేదో తెలియని ఆవేదనలో ఉన్న ఆ తల్లి పోరాటంలో ఎక్కడా కులం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగం గానీ, దేశ క్రిమినల్ చట్టాలు గానీ నేరస్తుడి కులాన్ని, మతాన్ని లేదా ప్రాంతాన్ని చూసి శిక్షలు ఖరారు చేయవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో కేవలం క్రైమ్ జరిగిందా లేదా, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనే అంశాలు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో నేరస్తులను కూడా వారి కులాలను బట్టి వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా యువత ఈ కులాల పరిధి నుంచి బయటకు రావాలని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసేవాడికి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాడికి   కులం ఎందుకు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాడి గుర్తింపు కేవలం ఒక క్రిమినల్ మాత్రమేనని, అలాంటి నీచుడిని ఏ కులం వారైనా వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి  దౌర్భాగ్య  స్వభావాన్ని సూచిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని హెచ్చరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం అంటూ క్రిమినల్ గ్యాంగులు ఈరోజు తలపైకి ఎక్కి ఆడుతున్నాయంటే, ఆ బలం వాళ్ళది కాదు, సమాజంగా మనందరి కలెక్టివ్ బలహీనత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పౌరులను సాధికారత వైపు నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే   3 నెలల క్రితమే ఎస్పీ గారితో మాట్లాడి సివిల్ సిటిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ పరిధిలో ఉంటారని, మితిమీరి ప్రవర్తించరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలకు ఓటింగ్ పాటర్న్ ఉండొచ్చేమో కానీ, పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఎలాంటి కులాల ఓటింగ్ పాటర్న్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా నినదించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని, పాలకులు కూడా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టి వెనకేసుకొచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఆమడదూరంలో పెట్టకపోతే, అది సమాజ భవిష్యత్తుకే తీవ్ర భంగం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ కలెక్టర్ నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో బంగారం, నగదును గుర్తించారు. లాకర్లలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని చూసి అధికా రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది. అలాగే, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం కావడంతో నరహరి అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువనుఅంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో ఒకే అవినీతి కేసులో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు. నరహరికి సంబంధించిన స్థిర, చరా స్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వివరాలను ఏసీబీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న తాజా నిరసనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఈ ఉద్యమం తీరు,  నిరసనలు తెలిపే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై డోలేంద్ర ప్రసాద్‌తో సీనియర్ జర్నలిస్ట్ కె. రవిశంకర్  వాస్తవ వేదికలో విస్తృత చర్చ జరిపారు.  ఆ సందర్భంగా డోలేంద్ర ప్రసాద్..  ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీస రాజకీయ పరిణతి  లోపించిందన్నారు. జంతర్ మంతర్ వంటి చారిత్రాత్మక ధర్నా చౌక్‌లలో నిరసనలు తెలిపేటప్పుడు..  కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఉపన్యాసాల ద్వారా సమస్య తీవ్రతను వివరించాలనీ, కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు  మైకులు ఉపయోగించి తమ డిమాండ్లను బలంగా వినిపించాలనే కనీస అవగాహన కూడా    లేదని చెప్పారు.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్..  అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇలాంటి ధర్నాలు చేపడితే భారీగా మెన్ అండ్ మిషనరీని తరలిస్తుందని..  కానీ ఇది నిరుద్యోగులను కలుపుకోకుండా కేవలం స్టూడెంట్స్ కే పరిమితం కావడం వల్ల బలపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రామదేవ్ బాబా నిరసనలకు దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రాయబారాలు నడిపిన దాఖలాలు ఉన్నాయని డోలేంద్ర ప్రసాద్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వచ్చే ఇలాంటి పబ్లిక్ ఇష్యూలను హ్యాండిల్ చేయడంలో నాటి ప్రభుత్వాలకు భయం ఉండేదనీ..  కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని  వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయ నాయకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ప్రజా ఉద్యమాల భయం ఉంటుందని, అయితే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అని తేల్చిచెప్పారు. ప్రజల్లో కోరిక ఉన్నప్పటికీ, సరైన లీడర్‌షిప్ లేని కారణంగానే ఉద్యమం పాలపొంగులా వచ్చి చల్లారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తరుణంలో..  క్షేత్రస్థాయి ఉద్యమాలను సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ బలం యువతకు ఎంతైనా అవసరమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
 తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన సాయికృష్ణ కేసు తీవ్ర సంచలనంగా మారింది. కస్టడీలో ఉన్న యువకుడు సాయికృష్ణ అదృశ్యం కావడం లేదా మరణించి ఉంటాడనే అనుమానాల నేపథ్యంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీనిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, ఈ కేసులో  వైసీపీ చేస్తున్న విమర్శల వెనుక ఒక పెద్ద రాజకీయ వ్యూహం,  హిడెన్ అజెండా ఉందన్నారు   ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు, తెలుగుదేశం కూటమి అధికార ప్రతినిథి అప్పసాని రాజేష్.  తెలుగువన్ తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలను వెల్లడించారు.   కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో 23 ఏళ్ల సాయికృష్ణ అనే యువకుడిని విచారణ నిమిత్తం పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతని ఆచూకీ లభించకుండా పోయింది. ఈ ఉదంతంపై కృష్ణలంక సీఐ నాగరాజును ప్రభుత్వం ఇప్పటికే విఆర్  కు పంపి, ఆపై సస్పెండ్ చేసి, హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పోలీస్ కమిషనర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అయితే..  జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని  విశ్లేషించారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు నేతృత్వంలోనే  సిట్ విచారణ అత్యంత వేగంగా సాగుతోందని  గుర్తు చేశారు. ఇప్పటికే ఈ లిక్కర్ స్కామ్‌లో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుటుంబానికి నోటీసులు అందాయని, కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు అరెస్టు చేశారనీ.. త్వరలోనే ఈ విచారణ తీగ లాగితే డొంకంతా కదిలినట్లు..  జగన్మోహన్ రెడ్డి ఇటికి చేరే అవకాశం ఉందని అన్నారు.   ఈ మద్యం కుంభకోణం విచారణను పక్కదారి పట్టించడానికి, సిట్ దర్యాప్తునకు నేతృత్వం వహిస్తున్న సీపీ రాజశేఖర్ బాబు నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడానికే వైసీపీ  ఈ కేసును  రాజకీయ అస్త్రంగా వాడుకుంటోందని అప్పసాని  రాజేష్ అన్నారు. గతంలో  వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసును, డాక్టర్ సుధాకర్, చీరాల కిరణ్ ఉదంతాలను ప్రస్తావిస్తూ.. ఆనాడు పౌర హక్కుల ఉల్లంఘనలపై స్పందించని జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు హఠాత్తుగా మానవ హక్కుల నేతగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉందనీ, జూన్ 29వ తేదీ నాటికి పోలీసులు కోర్టుకు సమర్పించే నివేదికతో అసలు నిజాలు అధికారికంగా బయటకు వస్తాయని పేర్కొన్నారు. ప్రభుత్వం ఈ కేసులో ఎవరినీ కాపాడే ప్రయత్నం చేయడం లేదనీ..  తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్షార్హులేనని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతిని గుర్తు చేశారు.  సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాజమండ్రి ఎస్పీ నేతృత్వంలో నిష్పాక్షిక విచారణ కమిషన్ కూడా ఏర్పాటైందనీ..  బాధితులకు న్యాయం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఏది ఏమైనప్పటికీ, ఒక యువకుడి అదృశ్యం కేసును అడ్డుపెట్టుకుని వైసీపీ ఆడుతున్న పొలిటికల్  డ్రామాను ప్రజలు గమనిస్తున్నారనీ, విచారణ పూర్తయితే అసలు నిజాలు నిగ్గు తేలుతాయని అప్పసాని చెప్పారు. 
ALSO ON TELUGUONE N E W S
    'కుంకుమ పూల తోటలో కులికే ఓ కుమారి' అనే సాంగ్ తో పాటు ఎన్నో అపురూపమైన  హిట్ సాంగ్స్ తో అభిమానులు, ప్రేక్షకుల మనస్సులో భద్రంగా కొలువురు తేరిన నటి ప్రేమ. హీరోయిన్ గా  తెలుగుతో పాటు  తమిళ, కన్నడ భాషల్లో తన ట్రాక్ రికార్డు ఎంతో ఘనమైనది.  అయితే, కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో కన్నడ స్టార్ హీరో ఉపేంద్రతో ప్రేమకి లవ్ ఎఫైర్ ఉందంటూ పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి. చాలా కాలంగా చిత్ర పరిశ్రమకి  దూరంగా ఉంటున్న ప్రేమ, ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆ  గాసిప్స్‌పై, అలాగే ప్రస్తుతం తను సినిమాలని  ఎందుకు తిరస్కరిస్తుందో వెల్లడి చేసారు  ఆమె మాట్లాడుతు అసలు ఆ రూమర్స్ ఎవరు సృష్టించారో, ఎవరు రాశారో వాళ్లనే అడగాలి  ఒక హీరోయిన్‌గా కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలాంటి వదంతులు రావడం చాలా సహజం. కానీ ఆ వార్తలు రాసేముందు ఎవరూ నాతో మాట్లాడలేదు. ఈ విషయమై నేను  కానీ, హీరో ఉపేంద్ర కానీ ఎప్పుడూ కూర్చొని చర్చించుకోలేదు. నా దృష్టి, ఫోకస్ ఎప్పుడూ కేవలం నటన మీదే ఉండేది. గాసిప్‌లకి అస్సలు ప్రాధాన్యత ఇవ్వను. విజయం సాధించినప్పుడు విమర్శలు, వదంతులు రావడం కూడా సాధారణమే. వాటిని నేను  ఒక సవాలుగా తీసుకుంటాను. Also read: VIjay: ఈ రోజు విజయ్ పుట్టిన రోజు.. ఆ ఆలయంలో భారీ ఎత్తున పూజలు  అదే సమయంలో, ఉపేంద్ర దర్శకత్వంలో వచ్చిన 'ఓం', 'ఉపేంద్ర' వంటి సినిమాల్లో నటించడం ఎంతో పెద్ద సవాలుతో కూడుకున్నఅనుభవం. ఎందుకంటే  ఉపేంద్రతో కలిసి పని చేయడం చాలా కష్టతరమైన విషయం. ఒకానొక సీన్‌లో తనను ఇంట్లోంచి లాక్కెళ్లి పడేసే సమయంలో నిజంగానే ప్రాణం పోతుందేమోనని భయపడ్డాను. కానీ కెమెరా ఆన్ అయినప్పుడు, ప్రేక్షకులు చూస్తున్నారనే ఒకే ఒక్క భావనతో ధైర్యంగా ఆ సీన్ పూర్తి చేశానని చెప్పారు.     
ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా వినిపిస్తున్న క్రేజీ కాంబినేషన్లలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) కాంబో ఒకటి. వీరిద్దరి కలయికలో రాబోతున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ వర్కింగ్ టైటిల్ ‘NBK112’. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే నందమూరి అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాజిక అంశాలకు కమర్షియల్ హంగులు అద్ది అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించే కొరటాల శివ, మాస్ గాడ్ బాలకృష్ణను ఏ రేంజ్‌లో చూపించబోతున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. తాజాగా ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక అఫీషియల్ అప్‌డేట్ టాలీవుడ్‌ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ యొక్క గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తేదీ మరియు వేదిక ఖరారయ్యాయి. జూన్ 25న ఉదయం 9 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని వెంకటపాలెంలో ఉన్న ప్రసిద్ధ టీటీడీ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ సినిమా ప్రారంభోత్సవ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. ఒక పవర్‌ఫుల్ కాంబోకు ఒక అద్భుతమైన ఆరంభం లభించబోతోందని చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ పూజా కార్యక్రమాలతోనే సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక సినిమా ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున కీలక మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరుకానుండటం విశేషం. ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ మరియు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమానికి విచ్చేసి చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించనున్నారు. రాజకీయ, సినీ వర్గాల సమక్షంలో జరగబోయే ఈ గ్రాండ్ ఈవెంట్ ఇండస్ట్రీలోనే ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారబోతోంది. అమరావతి పరిధిలోని వెంకటపాలెంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానం దేవాలయం ఈ చారిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas), యువసుధ ఆర్ట్స్ (Yuvasudha Arts) పతాకాలపై సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. బాలయ్య కెరీర్‌లోనే అత్యధిక నిర్మాణ వ్యయంతో, సరికొత్త సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమా రూపొందబోతున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్, బాలకృష్ణ మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కలబోసి ఈ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు సమాచారం.    https://x.com/SLVCinemasOffl/status/2068938059765445039
తమిళనాడు రాజకీయాల్లో ఒక సరికొత్త శకానికి నాంది పలికిన సినీ దళపతి, ప్రస్తుత ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఈ రోజు తన 52వ పుట్టినరోజుని  జరుపుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విజయ్ జరుపుకుంటున్న మొదటి పుట్టినరోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో అభిమానుల్లో  ఉత్సాహం నెలకొంది.  విజయ్ కి కూడా స్పెషల్ పుట్టిన రోజు అని చెప్పవచ్చు. కేవలం ఒక సినిమా స్టార్‌గా కాకుండా, ఇప్పుడు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా నిలిచిన ఒక ప్రజా నాయకుడిగా ఆయన ఈ వేడుకలని జరుపుకుంటున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా ఒక నెల పూర్తి చేసుకున్న తరుణంలో వచ్చిన ఈ పుట్టినరోజు వేడుకలకి ఒక ప్రత్యేకత ఉండాలని పార్టీ శ్రేణులు భావించాయి. ఇందులో భాగంగానే శివకాశిలో నిన్న ఆదివారం రాత్రి గంటపాటు ఏకధాటిగా సాగిన కంటికింపైన బాణసంచా ప్రదర్శనతో వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. విజయ్ పెరంబూర్ నియోజకవర్గంలోని వ్యాసర్పాడిలో సరికొత్త సదుపాయాలతో కూడిన తన సొంత ఎమ్మెల్యే కార్యాలయాన్ని ప్రారంభించి, ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాలు, విద్యార్థులకు ఉచిత పుస్తకాల పంపిణీ మరియు పేదలకు సంక్షేమ సహాయం అందించేలా పార్టీ క్యాడర్ విస్తృతమైన సేవా కార్యక్రమాలని చేపట్టింది. also read: ఈ వారం ఓటీటీలో 21 మూవీస్.. సినీ కిక్కు ప్రాప్తిరస్తు   
  సినిమా ఇచ్చే కిక్కు ముందు ఏ కిక్కు పనికి రాదు. ఇప్పుడు ఆ కిక్కు థియేటర్ ని దాటి మీ ఇంట్లోకి కూడా వచ్చిన విషయం తెలిసిందే. అదేనండి ఓటిటి. ఇప్పుడు సినిమా ఓటి టి ప్రియులకి ఈ వారం సరికొత్త వినోదాన్ని పంచేందుకు సిద్ధమైంది. అలరించడం అంటే మాములుగా అలరించడం కాదు.  ఈ రోజు 22 నుండి 28 వరకు ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఏకంగా 21 కి పైగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు సరికొత్తగా అందుబాటులోకి వస్తున్నాయి.  పైగా యాక్షన్, హారర్, సైకలాజికల్ థ్రిల్లర్లతో పాటు వరల్డ్ క్లాస్ ఫాంటసీ డ్రామాలు. మరి ఈ పండుగకి ఏ పేరు పెట్టుకుంటారో మీ ఇష్టం. అర్జున్ బ్లాస్ట్ జోన్ - యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ 'బ్లాస్ట్ జోన్'. థియేటర్లలో మంచి టాక్ సొంతం చేసుకున్న మూవీ జూన్ 25 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళంతో పాటు మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. బాహుబలి ద టార్చ్ బేరర్ - బాహుబలి ఫ్రాంచైజీ బిహైండ్ ద స్టోరీని డాక్యుమెంటరీ రూపంలో ఓటీటీలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. జూన్ 26 నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో 'బాహుబలి ది టార్చ్ బేరర్' మూవీ అందుబాటులోకి రానుంది. మూవీకి సంబంధించి తెర వెనుక కథలతో పాటు ఏళ్ల పాటు బాహుబలి ప్రయాణం, యుద్ధ సన్నివేశాలు ఎలా తీశారో? ఈ సిరీస్‌లో చూపించనున్నారు. లింగం - కదిర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లింగం. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 26 నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో - హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - జూన్ 22), గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్ - జూన్ 23), అలియన్స్ (హిందీ సిరీస్ - జూన్ 26), మరీచిక, దృశ్యం 3, యువర్ ఫాల్ట్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ రొమాంటిక్ డ్రామా). Also read: Sreeleela: శ్రీలీలకి ఘోర అవమానం.. ముఖ్యమంత్రి భార్య అలా ప్రవర్తించడం తప్పే! నెట్ ఫ్లిక్స్ - ఇన్ ద హ్యాండ్ ఆఫ్ డంటే (ఇంగ్లిష్ మూవీ - జూన్ 24), అనదర్ లైఫ్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 24), బ్లాస్ట్ జోన్ (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 25), క్రిస్మ్ & మార్టినా (ఇంగ్లిష్ మూవీ - జూన్ 26), లిటిల్ బ్రదర్ (ఇంగ్లీష్ సినిమా - జూన్ 26), బాహుబలి ది టార్చ్ బేరర్ (తెలుగు డాక్యుమెంటరీ సిరీస్ - జూన్ 26), లాక్ అప్ సీజన్ 2 (హిందీ సిరీస్ - జూన్ 27). జియో హాట్ స్టార్ - ద ఏజెన్సీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్ - జూన్ 22), అవతార్ 3 (తెలుగు డబ్బింగ్ మూవీ - జూన్ 24), లింగం (తెలుగు డబ్బింగ్ సిరీస్ - జూన్ 26), కెనతా కానోమ్, సేవ్ ది టైగర్స్, అతిరథి (తెలుగు డబ్బింగ్ మూవీ). ZEE5 - ప్రేమలా కండిషన్స్ అప్లై (జూన్ 26), మమ్మటియాన్ స్టార్స్ (తమిళ సిరీస్ - జూన్ 26), ముతస్సీ (మలయాళ సిరీస్ - జూన్ 26). లయన్స్ గేట్ ప్లే - బ్లూ బాస్మిన్ (ఇంగ్లీష్ మూవీ - జూన్ 26), ద యెతి (జూన్ 26), దిస్ ఈజ్ నాట్ ఏ మర్డర్ మిస్టరీ (ఇంగ్లిష్ సిరీస్ - జూన్ 26). ఆహా - రేజర్, థాంక్యూ సుబ్బారావు, ధైర్యే సాహసే అమృత సోనీ లివ్ - పెర్ఫెక్ట్ ఫ్యామిలీ (హిందీ సిరీస్ - జూన్ 26), మనోరమ మ్యాక్స్ - కప్ (మలయాళ సినిమా - జూన్ 25).  
  స్టార్ హీరోయిన్ స్టేటస్ ని పొందిన శ్రీలీల(Sreleela)ముంబై వేదికగా జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించింది. ముంబైలోని వర్లీలో గల ఎస్‌వీపీ స్టేడియంలో 'దివ్యాజ్ ఫౌండేషన్' నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్, సీనియర్ నటుడు జాకీ ష్రాఫ్ వంటి ప్రముఖులతో పాటు శ్రీలీల కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఏడాది 'హెల్తీ ఏజింగ్ కోసం యోగా' అనే థీమ్‌తో జరిగిన ఈ మెగా ఈవెంట్‌లో సుమారు 1000 మందికి పైగా అనాథ పిల్లలు, అమరవీరులైన రైతుల పిల్లలు, మున్సిపల్ పాఠశాలల విద్యార్థులు పాల్గొని సరికొత్త రికార్డు సృష్టించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీలీల స్వయంగా యోగాసనాలు వేసి, ప్రస్తుత వేగవంతమైన మరియు ఒత్తిడితో కూడిన జీవనశైలిలో యోగా ప్రాధాన్యతను వివరించింది. ఆందోళన (యాంగ్జైటీ), మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ప్రతి ఒక్కరూ తమ జీవితంలో 100 శాతం యోగాను ఒక భాగం చేసుకోవాలని పిలుపునిచ్చింది. శ్రీలీల ప్రసంగం, ఆమె ఫిట్‌నెస్ మంత్రం అక్కడ ఉన్న వేలాది మందిని విశేషంగా ఆకట్టుకుంది. అయితే, ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత ఫోటో సెషన్‌లో జరిగిన ఒక ఊహించని పరిణామం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి దారితీసింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి, సామాజిక కార్యకర్త అమృతా ఫడ్నవీస్ ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫోటోల కోసం అందరూ ఒకే చోట నిలబడిన సమయంలో, అమృతా ఫడ్నవీస్ తన చేతి వేళ్లతో సైగ చేస్తూ శ్రీలీలను పక్కకు తప్పుకోవాలని చెప్పినట్టుగా  ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక టాలీవుడ్ అగ్ర కథానాయిక పట్ల అలా వేళ్లతో సైగ చేస్తూ పక్కకు వెళ్లమనడం సరైన పద్ధతి కాదని, ఇది శ్రీలీలని ఘోరంగా అవమానించడమేనని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. Also read: samantha: నా బిడ్డే నా ప్రపంచం.. తేల్చిపడేసిన సమంత  మరోవైపు, ఈ వివాదంపై భిన్నమైన అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అది కేవలం ఫోటో సెషన్‌లో కెమెరా యాంగిల్ కోసం జరిగిన సాధారణ సంఘటన మాత్రమేనని, కొందరు కావాలనే దానిని పెద్ద వివాదంగా మారుస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. గ్రూప్ ఫోటోలో అందరూ సరిగ్గా కనిపించాలనే ఉద్దేశంతోనే అలా సర్దుబాటు చేయమన్నారే తప్ప, అందులో ఎలాంటి అవమానకర ఉద్దేశం లేదని మరికొందరు సమర్థిస్తున్నారు. అయితే ఈ సున్నితమైన అంశంపై అటు నటి శ్రీలీల కానీ, ఇటు అమృతా ఫడ్నవీస్ కానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.    
  సమంత(Samantha)ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' చిత్రంతో  థియేటర్లలో సందడి చేస్తుంది. 19 న రిలీజైన ఈ మూవీ కేవలం మూడు రోజుల్లోనే  41 .79 కోట్ల గ్రాస్ వసూలు చేసిందనే సమంత కట్ అవుట్ కి ఉన్న రేంజ్ ని అర్ధం చేసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా  సమంత తల్లి కాబోతుందనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే అమ్మతనం గురించి సమంత గతంలో సమంత  చేసిన  కామెంట్స్,  ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. మాతృత్వంపై ఆమె మాట్లాడుతు నాకు ఒక బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డ మాత్రమే నా ప్రపంచం అవుతుంది. .వర్కింగ్ మదర్స్ అంటే నాకు ఎంతో గౌరవం. నా బాల్యం అంతగా కలర్‌ఫుల్‌గా సాగలేదు.చిన్నతనంలో నేను  అనుభవించని సంతోషాలని, వసతులని తమ పిల్లలకి అందించాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు అనుకుంటారు. నేను కూడా అదే భావిస్తున్నాను. సమంత ఎమోషనల్ అయ్యింది. అందుకే, బిడ్డ పుట్టిన తర్వాత మొదటి కొన్ని సంవత్సరాల పాటు నేను  సినిమాలకి  పూర్తిగా దూరంగా ఉండి, వంద శాతం సమయాన్ని ఆ బిడ్డ కోసమే కేటాయిస్తానని ఆమె స్పష్టం చేసింది. Also read: Rashmika mandanna: 4000 కోట్ల వసూళ్లతో దూసుకుపోతున్న రష్మిక  
  రష్మిక మందన్నా(Rashmika mandanna).. పది సంవత్సరాల క్రితం రష్మిక అంటే ఒక మాములు హీరోయిన్. కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ తో పాటు పాన్ ఇండియాక్వీన్‌. అనతి కాలంలోనే అంతలా ఎదగడానికి కారణం ఆమె టాలెంట్.  ప్రతి చిత్రంలోని తన క్యారక్టర్ ద్వారా సినిమా రేంజ్ ని పెంచుతుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఎవరికీ సాధ్యం కాని 4,000 కోట్ల మైలురాయిని అధిగమించి ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరిచింది.  రష్మిక  సినిమాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి. కేవలం మూడు భారీ బ్లాక్ బస్టర్ చిత్రాల ద్వారా ఆమె ఏకంగా .3,300 కోట్లకి  పైగా గ్రాస్ వసూళ్లని  సాధించింది. పుష్ప  చిత్రం .400 కోట్లు.. వరిసు 300 కోట్లు, యానిమల్ 900 కోట్లు, పుష్ప 2 1800 కోట్లు ఛావా సినిమా రూ.800 కోట్లు వసూలు చేసింది. 'పుష్ప 2: ది రూల్' హిందీ మార్కెట్లోనే రికార్డు స్థాయిలో 812 కోట్ల నెట్ కలెక్షన్స్ ,'యానిమల్' 502.98 కోట్లు,  'చావా' .700 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోయాయి. ఈ వరుస విజయాల జోరుతో రష్మిక మొత్తం బాక్సాఫీస్ మార్కెట్ విలువ 4,000 కోట్ల మార్కును దాటేసింది. also read: రామ్ పోతినేని,భాగ్యశ్రీ బోర్సే ప్రేమలో ఉన్నారా.. పెళ్లి రూమర్స్‌కి ఊతమిచ్చిన కామెంట్స్! ఈ ఘనతతో బాలీవుడ్ అగ్ర హీరోయిన్లు  దీపికా పదుకొణె, ఆలియా భట్ వంటి స్టార్లను రష్మిక వెనక్కి నెట్టింది. ఒకప్పుడు బాలీవుడ్‌లో దీపికా, ఆలియా మధ్యే నంబర్ వన్ రేసు నడిచేది, కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని రష్మిక తన ఖాతాలో వేసుకుంది. 2023 నుండి దీపికా పదుకొణె నటించిన 5 పెద్ద చిత్రాలు దాదాపు 1,800 కోట్లు రాబట్టగా, ఆలియా భట్ సినిమాలు తక్కువ వసూళ్లకే పరిమితమయ్యాయి. కానీ రష్మిక మాత్రం కేవలం 3 సినిమాలతోనే 3,300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ సైతం రష్మిక సాధించిన ఈ బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్ బస్టర్స్ హ్యాట్రిక్‌ని అరుదైన విజయంగా ప్రశంసించారు. రష్మిక ప్రస్తుతం షాహిద్ కపూర్ తో కలిసి కాక్ టైల్ 2 తో సందడి చేస్తుంది.    
  ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram pothineni).. సిల్వర్ స్క్రీన్ పై రెండు దశాబ్దాల నుంచి తనదైన ఎనర్జీ తో దూసుకుపోతున్నాడు. భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హిట్ ఇంకా పలకరించకపోయినా వరుస క్రేజీ ఆఫర్స్ తో టాలీవుడ్ కి కాబోయే నెంబర్ వన్ హీరోయిన్ అనే టాగ్ లైన్ తో దూసుకుపోతూ ఉంది. ఈ ఇద్దరు ప్రేమలో ఉన్నారనే వార్తలు చాలా రోజుల నుంచి సోషల్ మీడియాకి అదనపు ఆకర్షణగా నిలిచి వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ వైరల్ స్థాయి తాజాగా  భాగ్యశ్రీ బోర్సే మాటలతో మరింత పెరిగింది.  ఇటీవల తన తాజా చిత్రం ‘లెనిన్’ ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ టాక్ షోలో భాగ్యశ్రీ మాట్లాడుతు నా మొదటి ఇల్లు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ అయితే, హైదరాబాద్ నా రెండో ఇల్లు. అది ఇప్పటికే ఫిక్స్ అయిపోయిందనే వ్యాఖ్యలు చేసింది. ఈ మాటలని  ఆధారంగా చేసుకుని పలువురు నెటిజన్లు, అభిమానులు భాగ్యశ్రీ త్వరలో తెలుగింటి కోడలిగా మారబోతుందా? అనే సందేహాలని  వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు అయితే రామ్‌తో ఆమె సంబంధం నిజమేనని సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేస్తున్నారు. అయితే గతంలో ఈ ప్రేమ వార్తలపై రామ్ పోతినేని ఇప్పటికే స్పందించారు. తమ మధ్య ఎలాంటి ప్రేమ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.. రామ్, భాగ్యశ్రీ   కలిసి 'ఆంధ్రాకింగ్’ చిత్రంలో జంటగా చేసారు.  ఆ మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, షూటింగ్ సమయంలోనే రామ్, భాగ్యశ్రీ మధ్య మంచి స్నేహం ఏర్పడిందని  ఆ స్నేహమే క్రమంగా ప్రేమగా మారిందనే వార్తలు సోషల్ మీడియాలో  చక్కర్లు కొడుతున్నాయి. కెరీర్ పరంగా చూసుకుంటే అఖిల్ తో చేస్తున్న లెనిన్ తో భాగశ్రీ  జులై 10 న థియేటర్స్ లో సందడి చేయనుంది. రామ్ తన కొత్త మూవీని స్టార్ చేసాడు. దర్శకుడు కూడా రామ్ నే .  
టాలీవుడ్ లో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సినిమా సక్సెస్ క్రెడిట్, వసూళ్లు, అలాగే భారీ రెమ్యునరేషన్లు కేవలం స్టార్ హీరోల ఖాతాకే పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. దర్శకులు క్రేజ్ పరంగానే కాకుండా రెమ్యునరేషన్ల విషయంలోనూ స్టార్ హీరోలతో నేరుగా పోటీ పడుతున్నారు. థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడంలో హీరోల ఇమేజ్ ఎంత ముఖ్యమో, సదరు దర్శకుడి బ్రాండ్ వాల్యూ కూడా అంతే కీలకమని నిర్మాతలు భావిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. డిమాండ్ అండ్ సప్లై సిద్ధాంతం ప్రకారం ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ కెప్టెన్ల రెమ్యునరేషన్లు వందల కోట్ల మార్కును తాకుతూ ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ రేసులో అందరికంటే ముందు వరుసలో నిలుస్తూ, దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నంబర్ వన్ దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) అవతరించాడు. జక్కన్న సినిమా అంటే అందులో ఏ హీరో ఉన్నాడనేది పక్కన పెట్టి, కేవలం ఆయన బ్రాండ్ చూసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కోట్లల్లో ఉన్నారు. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న అంతర్జాతీయ స్థాయి అడ్వెంచర్ డ్రామా 'వారణాసి' కోసం రాజమౌళి ఏకంగా రూ. 200 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే ఆయన కేవలం ఫ్లాట్ రెమ్యునరేషన్ కాకుండా, సినిమా సాధించే లాభాల్లో భారీ షేర్ కూడా తీసుకోకున్నారని వినికిడి. మరోవైపు కోలీవుడ్ నుంచి వచ్చి 'జవాన్' చిత్రంతో బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన స్టార్ డైరెక్టర్ అట్లీ (Atlee) మార్కెట్ వాల్యూ కూడా డబుల్ అయింది. వరుస కమర్షియల్ హిట్స్‌తో దూసుకుపోతున్న ఈ డైరెక్టర్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ 'రాక' చేస్తున్నారు. పుష్ప చిత్రంతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న బన్నీతో చేస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం అట్లీ ఏకంగా రూ. 100 కోట్ల భారీ రెమ్యునరేషన్‌ను చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  కేవలం స్క్రీన్ ప్లే, ఎలివేషన్లతోనే మాస్ ఆడియన్స్‌కు పూనకాలు తెప్పించే మరో సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel ) కూడా తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడు. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌తో తెరకెక్కించబోయే 'డ్రాగన్' మూవీ కోసం నీల్ ఏకంగా 50 శాతం ప్రాఫిట్ షేర్ అడిగినట్లు, దానికి మైత్రీ మూవీ మేకర్స్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఇక కమర్షియల్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లతో ఇప్పటివరకు కెరీర్‌లో ఒక్క ఫ్లాప్ కూడా ఎరుగని సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) సైతం తన రేంజ్‌ను పెంచుకున్నాడు. తన తదుపరి భారీ మల్టీస్టారర్ చిత్రం కోసం అనిల్ ఏకంగా రూ. 35 కోట్ల వరకు పారితోషికం పుచ్చుకుంటున్నట్లు సమాచారం.  అలాగే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)తో సౌత్ ఇండియాలోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన కోలీవుడ్ స్టార్ మేకర్ లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj), అల్లు అర్జున్‌తో చేయబోయే 'AA23' ప్రాజెక్ట్ కోసం దాదాపు రూ. 75 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నట్లు టాక్.  ఈ గణాంకాలను బట్టి చూస్తే కథలను, విజువల్స్ నమ్ముకుని బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల సామ్రాజ్యాన్ని శాసిస్తున్న ఈ దర్శకులు, రెమ్యునరేషన్లలో హీరోలకు ఏమాత్రం తగ్గకుండా సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్నారని చెప్పవచ్చు.  
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తన పవర్‌ప్యాక్డ్ లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ డ్రామా 'మా ఇంటి బంగారం' (Maa Inti Bangaaram) చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త ప్రభంజనం సృష్టిస్తోంది. జూన్ 19న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కనువిందు చేస్తూ, అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్, మొదటి వీకెండ్‌లోనే ఊహించని రీతిలో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఒక సాధారణ చీరకట్టు గృహిణి, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయుధం పట్టి వీరనారిగా ఎలా మారిందనే ఆసక్తికరమైన కథాంశంతో రూపకల్పన చేసిన ఈ సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు ఈ చిత్రానికి భారీ సంఖ్యలో తరలివస్తూ, బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులకు శ్రీకారం చుడుతున్నారు. కలెక్షన్ల విషయానికి వస్తే, 'మా ఇంటి బంగారం' మొదటి రోజు నుంచే తన ఉనికిని బలంగా చాటుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 2,658 షోలతో ప్రారంభమైన ఈ చిత్రం, మొదటి రోజు ఇండియాలో రూ. 5.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లు రూ. 12.80 కోట్లుగా నమోదయ్యాయి. ఇక రెండవ రోజైన శనివారం నాటికి ఈ చిత్రం ఏకంగా 40.2 శాతం వృద్ధిని కనబరిచి, రూ. 7.50 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. దీనితో కేవలం రెండు రోజుల్లోనే భారతదేశంలో రూ. 12.85 కోట్ల నెట్, అలాగే ప్రపంచవ్యాప్తంగా రూ. 25.67 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి, సౌత్ ఇండియాలోనే ఒక సోలో ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి లభించిన రెండవ అతిపెద్ద ఓపెనింగ్ వీకెండ్‌గా రికార్డు సృష్టించింది. గతంలో అనుష్క శెట్టి నటించిన 'భాగమతి' (రూ. 24.50 కోట్లు), 'రుద్రమదేవి' (రూ. 22 కోట్లు) చిత్రాల రెండు రోజుల రికార్డులను సమంత బ్రేక్ చేయడం విశేషం. ఇక మూడవ రోజైన ఆదివారం నాడు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరింత రౌద్రరూపం దాల్చింది. ఆదివారం వసూళ్లలో దాదాపు 30 శాతం అద్భుతమైన గ్రోత్ కనిపిస్తూ, సింగిల్ డేలోనే రూ. 10.10 కోట్ల నెట్ వసూళ్లను కొల్లగొట్టింది. దీనితో కేవలం మూడు రోజుల్లోనే అంటే మొదటి వీకెండ్ ముగిసే సమయానికి భారతదేశంలోనే రూ. 26 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. కేవలం దేశీయ మార్కెట్లోనే కాకుండా, ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా సామ్ మ్యాజిక్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం లాంచ్ అయిన మొదటి రోజు నుంచే భారీ రెస్పాన్స్ అందుకుని, మూడు రోజుల్లో 1.25 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 15.10 కోట్లు) మార్కును దాటేసింది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మూడు రోజుల్లోనే రూ. 41 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి సరికొత్త సంచలనం సృష్టించింది. ట్రాలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సమంత నటన, సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, గుల్షన్ దేవయ్య విలనిజం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. థియేట్రికల్ ఓపెనింగ్స్ కేవలం హీరోల చిత్రాలకే వస్తాయనే అపోహను చెరిపేస్తూ, ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీ ఈ స్థాయి వసూళ్లను సాధించడం సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప పరిణామంగా ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ
ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు లేదా  ఖాళీ సమయంలో..  చాలామంది  చిప్స్, నామ్కీన్, బిస్కెట్లు , ఇతర జంక్ ఫుడ్‌ను తింటుంటారు. అయితే, ఈ అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, జీర్ణ సమస్యలకు , అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, అనారోగ్యకరమైన చిరుతిళ్లకు బదులుగా ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఎంచుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన చిరుతిళ్లు  ఆకలిని తీర్చడమే కాకుండా,  శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తాయి. వీటిలో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు , ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి, ఇవి ఎనర్జీగా ఉండటానికి , అతిగా తినడాన్ని నివారించడానికి సహాయపడతాయి.  ఎలాంటి చింత లేకుండా  ఆహారంలో చేర్చుకోగల కొన్ని ఆరోగ్యకరమైన చిరుతిళ్ల గురించి తెలుసుకుంటే.. వేయించిన శనగలు.. వేయించిన శనగలు ఆరోగ్యకరమైన చిరుతిళ్లలో మొదటి  స్థానంలో ఉంటాయి. ఇందులో ప్రోటీన్, ఫైబర్, ఐరన్ , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.  వీటిని  తీసుకోవడం వల్ల కడుపు చాలా సేపటి వరకు నిండుగా ఉంటుంది, దీని కారణంగా పదేపదే ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారికి వేయించిన శనగలు స్నాక్స్ కోసం మంచి ఆప్షన్.   అంతేకాకుండా, ఇవి శరీరానికి శక్తిని అందించడంలో కూడా సహాయపడతాయి. మఖానా.. మఖానా తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగిన చిరుతిండి, ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. మఖానాలో  కాల్షియం, మెగ్నీషియం , యాంటీఆక్సిడెంట్ల వంటి పోషకాలు లభిస్తాయి.  లేతగా వేయించిన మఖానా తినడం వల్ల ఆకలిని నియంత్రించుకోవచ్చు , అనారోగ్యకరమైన చిరుతిళ్లు తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి , బరువు అదుపులో ఉంచుకోవడానికి కూడా చాలా మంచిది. తాజా పండ్లు.. పండ్లు సహజంగానే పోషకాల నిధి. ఆపిల్, అరటిపండు, జామ, బొప్పాయి , నారింజ వంటి పండ్లలో విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.  వాటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందడమే కాకుండా, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో కూడా సహాయపడుతాయి. పండ్లు తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది , శరీరం చాలా సేపటి వరకు తాజాగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్.. బాదం, వాల్‌నట్స్, పిస్తా , జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్స్ లలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్ , అనేక విటమిన్లు ఉంటాయి. డ్రై ఫ్రూట్స్ ను పరిమిత పరిమాణంలో తీసుకోవడం శరీరానికి శక్తిని అందించి, ఆకలిని కూడా నియంత్రిస్తుంది.  వాల్‌నట్‌లు , బాదం పప్పులు ముఖ్యంగా మెదడు , గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.  వీటిని చిరుతిండిగా తినడం ద్వారా జంక్ ఫుడ్ తినే అలవాటును తగ్గించుకోవచ్చు. మొలకలు.. మొలకెత్తిన పెసలు, శనగలు , ఇతర పప్పుధాన్యాలలో ప్రోటీన్, పీచుపదార్థం , విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. మొలకెత్తిన తర్వాత వాటిలోని పోషకాల పరిమాణం పెరగడం వల్ల అవి ఆరోగ్యానికి మరింత మేలు చేస్తాయి.  మొలకలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, శరీరానికి శక్తిని అందిస్తుంది , కండరాల అభివృద్ధికి కూడా సహాయపడుతుంది.  శరీరం ఫిట్ గా ఉండాలని అనుకునే వారికి మొలకలు చాలా మంచివి. వేరుశనగలు.. వేరుశెనగలను పేదల బాదం అని కూడా పిలుస్తారు, ఎందుకంటే వాటిలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు , అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. వేరుశెనగలను పరిమితంగా తినడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి ఎక్కువసేపు శక్తి లభిస్తుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి , శరీరానికి కావాల్సిన పోషకాలను అందించడంలో సహాయపడుతుంది.                              *రూపశ్రీ.