LATEST NEWS
తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు.  తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం (ఏప్రిల్ 29)న ఘనంగా జరిగింది.  మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో  పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో నూతనంగా ఎంపికైన నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.   యువతను పార్టీ వైపు ఆకర్షించడంలోనూ, క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలోనూ లోకేశ్ పోషించిన పాత్రకు గుర్తింపుగా ఆయనకు పార్టీలో జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రమోషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే.  లోకేష్ తో పాటుగా   కొత్తగా ఎంపికైన కమిటీ సభ్యులందరితో చంద్రబాబు స్వయంగా ప్రమాణం చేయించారు.  నూతన కార్యవర్గంలో మొత్తం 29 మందికి పొలిట్‌బ్యూరోలో స్థానం కల్పించగా, 18 మందికి జాతీయ ఉపాధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. వీరికి తోడుగా ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు, పార్టీ వాణిని బలంగా వినిపించేందుకు 10 మంది జాతీయ అధికార ప్రతినిధులను నియమించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనే ఈ ప్రమాణ స్వీకారం జరుగుతుండటంతో, కేడర్‌లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కేవలం పదవులు ఇవ్వడమే కాకుండా..  రాబోయే రోజుల్లో ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలనే దానిపై ఈ సందర్భంగా చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.    
  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో గత కొంతకాలంగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న రాజకీయ రణక్షేత్రం ఇప్పుడు తుది అంకానికి చేరుకుంది. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా, బుధవారం (ఏప్రిల్ 29)  రెండో, చివరి విడత పోలింగ్ ప్రారంభమైంది.  ఈ విడతలో   142 నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ బూత్ లకు భారీగా ఓటర్లు తరలివచ్చారు.  అధికార తృణమూల్ కాంగ్రెస్  తన  అధికారాన్ని నిలబెట్టుకోవాలని, ఈ సారి ఎలాగైనా బీహార్ లో అధికారాన్ని చేజిక్కించుకోవాలని టీఎంసీ, బీజేపీలు హోరాహోరీ పోరాడుతున్నాయి.  అదలా ఉంచితే బెంగాల్ ఎన్నికలలో తొలి విడతలో రికార్డు స్థాయిలో 93 శాతానికి పైగా పోలింగ్ జరగడంతో.. తుది విడతలోనూ అదే స్థాయిలో పోలింగ్ జరిగే అవకాశాలున్నాయంటున్నారు. రెండో విడతలో     దక్షిణ బెంగాల్ ప్రాంతంలో మమతా బెనర్జీకి కంచుకోట వంటి కోల్‌కతా, హౌరా, నాడియా, హూగ్లీ వంటి కీలక జిల్లాల్లో పోలింగ్ జరుగుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.  గత పదిహేనేళ్లుగా ఈ ప్రాంతం మమతా బెనర్జీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. అయితే, ఈసారి ఈ కోటను బద్దలు కొట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు ఇక్కడ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.   ఇక పోతే..  భవానీపూర్ స్థానంపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.   ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సువేందు అధికారి బరిలో నిలిచారు. గతంలో నందిగ్రామ్ వేదికగా మమతను ఓడించిన సువేందు, మరోసారి ఆమెను సొంత గడ్డపై సవాల్ చేస్తున్నారు. దీంతో ఈ పోరు కేవలం ఒక స్థానానికే పరిమితం కాకుండా, ఇద్దరు నేతల ప్రతిష్టకు సంబంధించిన విషయంగా మారింది.    ప్రభుత్వ వ్యతిరేకత,  అవినీతి అంశాలను ఈ సారి ఎన్నికలలో బీజేపీ ప్రచారాస్త్రాలుగా సంధిస్తే..  సంక్షేమ పథకాలు,  బెంగాలీ సెంటిమెంట్‌తో మమతాబెనర్జీ ప్రచారాన్ని హోరెత్తించారు.  వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు, ఫలితాలు మే 4న విడుదల అవుతాయి.
బ్యాంకింగ్ నిబంధనలు ప్రజలకు సాయపడాలి కానీ, వారిని క్షోభకు గురిచేయకూడదు. కానీ ఒడిశాలో ఓ బ్యాంకు అధికారుల మొండితనం ఒక వ్యక్తిని తన సోదరి సమాధిని తవ్వి ఆమె అస్థిపంజరాన్ని బ్యాంకు గడపకు తీసుకువచ్చేలా చేసింది.  అసలేం జరిగిందంటే.. ఒడిశాకు చెందిన ఒక నిరుపేద వ్యక్తి తన సోదరి మరణానంతరం ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న ఇరవై  వేల రూపాయలు విత్ డ్రా చేసుకోవడానికి బ్యాంకును సంప్రదించాడు. ఆ డబ్బుతో ఆమె అంత్యక్రియల తాలూకు ఖర్చులు లేదా ఇతర అవసరాలు తీర్చుకోవాలని చెప్పాడు. అయితే అందుకు అధికారులు అంగీకరించలేదు. బ్యాంకులో సొమ్ము విత్ డ్రా చేయాలంటే.. ఖాతాదారుడు స్వయంగా వచ్చి తీరాలన్నారు. అలా రాలేని పక్షంలో సంతకం, లేదా వేలిముద్రకావాలని చెప్పారు.  తన సోదరి చనిపోయిందని, ఆమె రాలేదని  ఆ వ్యక్తి బ్యాంకు అధికారుల కాళ్లావేళ్లా పడినా ఫలితం లేకపోయింది. డెత్ సర్టిఫికేట్ ఉందని చెప్పినా బ్యాంకు అధికారులు వినకపోవడంతో..  తీవ్ర మనస్తాపానికి గురైన ఆ వ్యక్తి సంచలన నిర్ణయం తీసుకుని అమలు చేశాడు. బ్యాంకు నుంచి నేరుగా తన సోదరిని పూడ్చిపెట్టిన సమాధి వద్దకు వెళ్లాడు. ఆమె సమాధిని తవ్వి ఆమె అవశేషాలను (అస్తిపంజరం) వెలికి తీసి..మోసుకుంటూ మూడు కిలోమీటర్లు నడిచి బ్యాంకుకు వచ్చాడు. బ్యాంకు అధికారులకు తన సోదరి అస్తిపంజరాన్ని చూపుతూ.. ఆమె వచ్చింది.. ఇప్పుడు డబ్బులు ఇవ్వండంటూ డిమాండ్ చేశాడు.   ఈ సంఘటన అందరి చేతా కన్నీళ్లు పెట్టించింది.  వివరాలిలా ఉన్నాయి.. కియోన్‌ఝర్‌ జిల్లాలోని దియానాలి గ్రామానికి చెందిన గిరిజనుడు జితు ముండా సోదరి కక్రా ముండా రెండు నెలల క్రితం మరణించింది. ఆమె భర్త, ఏకైక సంతానం కూడా ముందే చనిపోవడంతో జితు ఒక్కడే ఆమెకు దగ్గరి బంధువుగా మిగిలాడు. కక్రా పేరు మీద మల్లీపసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండగా, అందులో రూ.19,300 ఉన్నాయి. ఆ సొమ్ము తీసుకునేందుకు జితు ముండా బ్యాంకుకు వస్తే.. అధికారులు  నిబంధనల ప్రకారం అడ్డు చెప్పారు. ఈ ఘటనపై నెటిజనులు బ్యాంకు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగితాలకే విలువఇస్తూ మానవత్వాన్ని మరిచారని దుమ్మెత్తి పోస్తున్నారు. 
వైసీపీ సోషల్ మీడియా విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. సోషల్ మీడియా వేదికగా జరిగిన దాడులు, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న ఆర్థిక మూలాల గురించి పోలీసులు సజ్జల భార్గవ్‌రెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియా వేదికగా రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడుల కేసులో వైసీపీ సోషల్ మీడియా అప్పటి ఇన్‌ఛార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డిని పులివెందుల పోలీసులు విచారించారు. సుమారు 9 గంటల పాటు సాగిన ఈ విచారణలో పోలీసులు ఆయనపై దాదాపు 70 ప్రశ్నలను సంధించారు. ముఖ్యంగా ఈ కార్యకలాపాలకు నిధులు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ నెట్‌వర్క్‌ను నడపడానికి ఎవరెవరు సహకరించారు? అనే కోణంలో దర్యాప్తు సాగింది.  విచారణ సమయంలో పోలీసులు ముఖ్యంగా నిధుల వ్యవహారంపై ఆరా తీశారు. సోషల్ మీడియా వింగ్ నడపడానికి భారీ మొత్తంలో ఖర్చవుతుందని, ఆ నిధులను ఎవరు సమకూర్చారనేది ఇప్పుడు కేసులో కీలకంగా మారింది.  ఏ1 నిందితుడు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా భార్గవ్‌రెడ్డిని పోలీసులు ప్రశ్నించినట్లు తెలిసింది. అయితే విచారణకు సజ్జల భార్గవ్ రెడ్డి సహకరించలేదనీ, చాలా ప్రశ్నలకు ఆయన  తెలియదు, గుర్తులేదు' అని సమాధానమిచ్చినట్లు సమాచారం.ఈ కేసులో మరో ఆసక్తికర అంశం ఏమిటంటే..  నిందితులు వాడిన పరికరాల గురించి పోలీసులు అడిగిన ప్రశ్నలు. పోస్టులు పెట్టడానికి ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను అప్పగించాలని పోలీసులు కోరగా..  భార్గవ్‌రెడ్డి   నిరాకరించినట్లు తెలుస్తోంది. కోర్టు ఆదేశాలు ఉంటేనే వాటిని ఇస్తానని ఆయన స్పష్టం చేశారని అంటున్నారు. రాజకీయ నేతలను, ముఖ్యంగా మహిళా నేతలను లక్ష్యంగా చేసుకుని చేసిన అసభ్యకర పోస్టుల వెనుక ఎవరి ప్రోద్బలం ఉందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. షర్మిల, విజయమ్మ వంటి వారిపై జరిగిన వ్యక్తిగత దాడుల వెనుక ఉన్న అసలు సూత్రధారులను గుర్తించేందుకు పోలీసులు సాంకేతిక ఆధారాలను విశ్లేషిస్తున్నారు. ఈ పోస్టుల తయారీ మరియు వ్యాప్తి కోసం ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో అన్నమయ్య ప్రాజెక్ట్ వంటి సున్నితమైన అంశాలపై కూడా సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసుల దర్యాప్తు కేవలం పోస్టులకే పరిమితం కాకుండా, ఆ వ్యవస్థ వెనుక ఉన్న ఆర్థిక వనరులపై కూడా ఫోకస్ పెట్టింది. తదుపరి విచారణలో మరిన్ని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి భార్గవ్‌రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసిన పోలీసులు, తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఈ కేసులో మరికొంత మంది వైసీపీ నేతలకు కూడా నోటీసులు అందే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.  
  బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర స్థాయి కమిటీ మినహా అన్ని కమిటీలను పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ రద్దు చేశారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో కొత్త కమిటీలను నియమించాలని ఆదేశాలు జారీ చేశారు. కొత్తగా నియమించబోయే కమిటీలకు శిక్షణా తరగతులు కూడా నిర్వహించనున్నారు. పార్టీ పునర్వ్యవస్థీకరణ బాధ్యతలను వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు కేసీఆర్ అప్పగించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ అంతర్గత సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలంగాణపై అవమానకర వ్యాఖ్యలు చేసినప్పుడు… తెలంగాణకు చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనం పాటించారని విమర్శించారు. “వాళ్లు తెలంగాణలో పుట్టలేదా? తెలంగాణ పౌరుషం లేదా?” అని ప్రశ్నించారు.“ఒక్క బీఆర్ఎస్ ఎంపీ ఉన్నా… క్షమాపణ చెప్పించేవాళ్లం” అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు స్పందించకపోవడం పౌరుషం లేని వ్యవహారమని విమర్శించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో తెలంగాణను వ్యవసాయం సహా అన్ని రంగాల్లో ముందంజలో నిలబెట్టామని… ఇప్పుడు మాత్రం భూముల కబ్జాలు, కూల్చివేతల్లో నెంబర్ వన్‌గా మార్చే ప్రయత్నం జరుగుతోందన్నారు.ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం విఫలమైందని… రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల తీరు చూస్తే జాలి వేస్తోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో జీవన్ రెడ్డిని జనరల్ సెక్రటరీగా ప్రకటించి, కార్యవర్గానికి పరిచయం చేశారు కేసీఆర్.  
ALSO ON TELUGUONE N E W S
1. కొత్త మార్కెట్ పై వారణాసి గురి మహేష్ బాబు-రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం 'వారణాసి' అంతర్జాతీయ స్థాయిలో కొత్త మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటోంది. ఇప్పటికే నార్త్ అమెరికా, జపాన్ వంటి దేశాల్లో సత్తా చాటిన రాజమౌళి.. ఈ సినిమాతో సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా దేశాలపై ఫోకస్ చేస్తున్నట్లు సమాచారం. 2. మెగాస్టార్ కు అరుదైన గౌరవం మెగాస్టార్ చిరంజీవి నటించిన 'దొంగ' సినిమాలోని ఐకానిక్ 'గోలీమార్' సాంగ్ లుక్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈ గెటప్‌ను ప్రతిబింబించేలా అమెరికాలోని ఒక ప్రముఖ కంపెనీ 'యాక్షన్ ఫిగర్‌'ను మార్కెట్లోకి విడుదల చేసింది. హాలీవుడ్ సూపర్ హీరోల తరహాలో ఒక భారతీయ నటుడికి ఇలాంటి గుర్తింపు రావడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ యాక్షన్ ఫిగర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 3. చెప్పిన డేట్ కే 'లెనిన్'  అఖిల్ అక్కినేని 'లెనిన్' మూవీ వాయిదా వార్తలకు నాగార్జున చెక్ పెట్టారు. ఈ సినిమా జూన్ 26న విడుదల కానుందని స్పష్టం చేశారు. 'లెనిన్' ఫస్ట్ కట్ చూసిన నాగార్జున.. వెండితెరపై ప్రేక్షకులు సరికొత్త అఖిల్‌ను చూడబోతున్నారని నమ్మకం వ్యక్తం చేశారు. కంటెంట్ పై నమ్మకం ఉందని, జూన్ 26న థియేటర్లలో కలుద్దామని నాగ్ ట్వీట్ చేశారు. 4. 80 అడుగుల ఎత్తు నుంచి రష్మిక జంప్ రష్మిక మందన్న తన తాజా చిత్రం 'మైసా' కోసం డూప్ లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి రిస్కీ యాక్షన్ స్టంట్ చేసింది. సీన్ సహజంగా రావాలనే ఉద్దేశంతో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం చూసి.. మూవీ టీంతో పాటు అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ స్టంట్ సమయంలో ఆమెకు చిన్న గాయాలైనా లెక్కచేయకుండా షూటింగ్‌ను కొనసాగించడం ఆమె అంకితభావానికి నిదర్శనమని దర్శకుడు రవీంద్ర పుల్లె కొనియాడారు. 5. దర్శకుడు కన్నుమూత టాలీవుడ్ లో విషాదం చోటుచేసుకుంది. జర్నలిస్టు, దర్శకుడు రఘురామ్ మంగళవారం సాయంత్రం వాకింగ్ చేస్తూ గుండెపోటుతో కన్నుమూశారు. జగిత్యాలకు చెందిన ఆయన జర్నలిజంలో తనదైన ముద్ర వేశారు. అలాగే, 2004 లో వచ్చిన 'వరం' సినిమాతో దర్శకుడిగా మారారు. పలు సినిమాలకు రైటర్ గానూ పనిచేశారు.  6. మళ్ళీ వాయిదా పడిన 'టాక్సిక్' రాకింగ్ స్టార్ యశ్ తన తదుపరి సినిమా 'టాక్సిక్' వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో, గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ ప్లాన్‌తో విడుదల చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. భారతీయ సినిమా సత్తాను ప్రపంచానికి చాటిచెప్పేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నామని, అందుకే మరింత సమయం తీసుకుంటున్నామని యశ్ పేర్కొన్నారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. 7. టైగర్ తో బాలీవుడ్ ఎంట్రీ ప్రముఖ నిర్మాణ సంస్థ 'పీపుల్ మీడియా ఫ్యాక్టరీ'.. హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతోంది. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌ నటించబోతున్నట్లు సమాచారం. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 8. ఆ యాక్టర్ తో పూజా హెగ్డే డేటింగ్  ప్రముఖ నటి పూజా హెగ్డే డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె బాలీవుడ్ యాక్టర్ రోహన్ మెహ్రాతో ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ కలిసి పలు ప్రైవేట్ పార్టీల్లో కనిపిస్తుండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ విషయంపై పూజా హెగ్డే కానీ, ఆమె సన్నిహితులు కానీ ఇప్పటివరకు స్పందించలేదు. 9. నిత్యా మీనన్ బోల్డ్ స్టేట్‌మెంట్ పెళ్లి, మాతృత్వంపై నటి నిత్యా మీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సరైన వ్యక్తి దొరికినప్పుడే పెళ్లి చేసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. కేవలం వయసు అయిపోతుందనే కారణంతో పెళ్లి, పిల్లలు వద్దని స్పష్టం చేశారు. తల్లి కావాలనేది ఒక మహిళ వ్యక్తిగత నిర్ణయమని.. పెళ్లితో సంబంధం లేకుండా పిల్లల్ని కనే మార్గాలు ఉన్నాయని అన్నారు. భవిష్యత్తులో తనకు పెళ్లి కాకపోయినా.. పిల్లల కోసం దత్తత తీసుకునే ఆలోచన ఉందని నిత్య తెలిపారు. 10. శివాజీకి గాయత్రీ గుప్తా కౌంటర్ మహిళల డ్రెస్సింగ్ పై కామెంట్స్ చేసిన శివాజీకి తాజాగా నటి గాయత్రీ గుప్తా గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఒక మనిషి వ్యక్తిత్వాన్ని వాళ్ళు వేసుకునే బట్టలతో నిర్ణయించలేం" అని ఆమె కుండబద్దలు కొట్టారు. తనను జడ్జ్ చేసే అధికారం ఎవరికీ లేదని, ఏ బట్టలు వేసుకోవాలో అనేది మహిళల వ్యక్తిగత ఇష్టమని ఆమె స్పష్టం చేశారు. గాయత్రీ ఇచ్చిన ఈ రిప్లై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.  
    సింగర్  స్వాగత కృష్ణన్(Swagatha Krishnan)..తమిళ సినీ రంగంలో ఎన్నో అద్భుతమైన పాటలు ఆమె గళం నుంచి వచ్చాయి. ఎంతో భవిష్యత్తు ఉందనుకుంటున్న తరుణంలో హఠాత్తుగా సినీ రంగాన్ని వదిలి రిషికేష్ వెళ్లి వ్యాపార రంగంలో స్థిరపడింది. అందుకు కారణం ఒక సంగీత దర్శకుడు నాపై చేసిన లైంగిక దాడి కారణమని చెప్తుంది. ఇప్పుడు ఈ విషయం సౌత్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో స్వాగత కృష్ణన్ మాట్లాడుతు అప్పుడు నాది చిన్న వయసు. బ్రేక్ అప్ అయ్యి డిప్రెషన్ లో ఉన్న సమయంలో ఒక సంగీత దర్శకుడు నా లైఫ్ లోకి వచ్చాడు. నా పరిస్థితిని అనుకూలంగా చేసుకుని మాయమాటలు చెప్పి గురువుగా నటిస్తూ దగ్గరయ్యాడు. నా చేత పాటలు పాడించి రెమ్యునరేషన్ ఇవ్వలేదు.  పైగా  నా దగ్గరే భారీ మొత్తంలో డబ్బులు అప్పుగా తీసుకొని ఎగ్గొట్టాడు. స్టూడియోలో నాపై   బలవంతంగా లైంగిక దాడి చేసి అదంతా రికార్డు  చేసి నన్ను బెదరించాడు. ఆ తర్వాత నాపై దొంగతనం మోపడంతో పాటు లేనిపోనీ వదంతులు సృష్టించడంతో  మనోవేదన చెంది ఇండస్ట్రీ వదిలి వెళ్లానని చెప్పుకొచ్చింది.  Also read: Gayatri Gupta: శివాజీకి గాయత్రి గుప్తా సావేజ్ రిప్లై.. నీతులు చెప్పడం ఆపండి ఇంత కాలం ఈ విషయాన్ని ఎందుకు దాచారన్న ప్రశ్నకి స్పందిస్తు ఆ సమయంలో నాకు ధైర్యం సరిపోలేదు. సినీ పరిశ్రమలో ఎవరికి చెప్పాలో, ఎలా ఎదుర్కోవాలో తెలియలేదు. కానీ ఇటీవల ఒక యువతీని కూడా నాలాగే మోసం చేసాడు. ఆ అమ్మాయి నాతో ఆ బాధ చెప్పుకుంది. మరి కొంత మంది అమ్మాయిలు అతని మోసానికి గురయ్యారు. దీంతో మరెవరకి అన్యాయం జరగకూడదని న్యాయపరంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టుగా చెప్పింది. యెనో పెన్నే , కాదల్ కన్మణి లాంటి పాటలు స్వాగత కృష్ణన్ కి మంచి పేరు తీసుకొచ్చాయి. సంగీత దర్శకుడి పేరుని మాత్రం ఆమె వెల్లడి చెయ్యలేదు.     
  గాయత్రి గుప్తా(Gayatri Gupta)ఏంటి నన్ను పట్టించుకోవడంలేదని నెట్టిల్లు కొన్ని రోజుల నుంచి డల్ గా ఉంది. ఇప్పుడు ఆ డల్ ని పోగొట్టడానికి  గాయత్రి గుప్తా వచ్చేసింది. రావడం రావడమే శివాజీపై కౌంటర్ అటాక్ చేసి తనపై నమ్మకం పెట్టుకున్న నెట్టింటికి సరికొత్త జోష్ తీసుకొచ్చింది. రీసెంట్ గా  గాయత్రి గుప్తా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. కొన్ని రోజుల క్రితం నటుడు శివాజీ(SIvaji)మహిళల డ్రెస్సింగ్ స్టైల్‌పై చేసిన కామెంట్స్ గురించి మీ స్పందన ఏంటనే ప్రశ్న ఎదురయింది. అప్పుడు ఆమె మాట్లాడుతూ నేను ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలి అనేది నా వ్యక్తిగత ఇష్టం. ఎవరో శివాజీ గారు చెప్పారు కదా అని నేను చీర కట్టుకోను. "పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందన్నట్లు ఉంది ఆయన వ్యవహారం. చూసే చూపులో లోపం పెట్టుకుని ఎదుటివారిని విమర్శించడం సరికాదు. Also read: Faria Abdullah: బుర్ర పనిచేయకపోతే ఇలాగే ఉంటుంది ఫరియా.. షాక్ లో ఫ్యాన్స్ మహిళలు ఏం వేసుకోవాలో చెప్పే బదులు, పురుషులు తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోవాలని చెప్పాలని ఆమె హితవు పలికారు. గాయత్రి గుప్తా చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొందరు గాయత్రిని సమర్థిస్తూ డ్రెస్సింగ్ అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం, అందులో ఇతరుల జోక్యం అనవసరం" అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం శివాజీకి మద్దతుగా నిలుస్తూ 'శివాజీ గారు ఒక పెద్దన్నలా సలహా ఇచ్చారు తప్ప, విమర్శించలేదు  అని అభిప్రాయపడుతున్నారు.  
  టాలీవుడ్ 'చిట్టి'గా అభిమానుల చేత పిలిపించుకుంటున్న ఫరియా అబ్దుల్లా(Faria Abdullah)కి బుర్ర పని చేయలేదా. ఇప్పుడు టాలీవుడ్ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలోను ఇదే చర్చ. మరి ఆ వార్తలు నిజామా కాదా చూద్దాం. ఫరియా మే 1 న గాయపడ్డ సింహంతో మరో సారి సెల్యులాయిడ్ పై తన చరిష్మా చాటడానికి సిద్ధమవుతుంది. ఈ సందర్భంగా జరుగుతున్న ప్రమోషన్స్ లో  ఆమె మాట్లాడుతు తేజ సజ్జ, ప్రశాంత్ వర్మ ల బ్లాక్ బస్టర్ హనుమాన్(Hanuman)లో హీరోయిన్ ఆఫర్ మొదట నా దగ్గరకే వచ్చింది. కానీ అప్పట్లో నాకు బ్రెయిన్ లేదు. జాతి రత్నాలు హిట్ అయిన జోష్‌తో ఎలాంటి కథలు ఎంచుకోవాలో తెలియక కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. అందుకే 'హనుమాన్' స్టోరీ విన్నప్పుడు దాని రేంజ్‌ను అంచనా వేయలేకపోయాను. నా  కెరీర్‌లో చేసిన అతిపెద్ద తప్పు కూడా 'హనుమాన్' వదులుకోవడమే. ఆ సినిమా సాధించిన విజయం ఇప్పటికి నా కళ్ళ ముందు ఉంది. Also read: Ramyakrishna: తెల్లారితే పెళ్లి.. నైట్ 2 వరకు ఎన్టీఆర్ తోనే ఉన్నాను ఇప్పటికీ  తేజ, ప్రశాంత్ వర్మను కలిసినప్పుడు ఈ విషయం గుర్తొచ్చి బాధపడుతుంటాను. నా క్యారక్టర్ లో  అమృత అయ్యర్ చాలా బాగా చేసింది. కానీ, ఆ ఛాన్స్ నేను తీసుకుని ఉంటే నా కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేది" అని ఫరియా ఆవేదన వ్యక్తం చేసింది.      
జీవితంలో మనం ఏదైనా సాధించాలనుకున్నప్పుడు లేదా ఒకరి సహాయం కోరినప్పుడు 'తిరస్కరణ' (Rejection) ఎదురవ్వడం చాలా సహజం. అది ఉద్యోగం కావచ్చు, ప్రేమ కావచ్చు లేదా ఏదైనా అవకాశం కావచ్చు. రిజెక్షన్ ఎదురవగానే చాలా మంది నిరాశలో కూరుకుపోతారు. కానీ, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తన 'పూరి మ్యూజింగ్స్' ద్వారా ఈ రిజెక్షన్‌ను ఎలా చూడాలో, దానిని విజయానికి మెట్టుగా ఎలా మార్చుకోవాలో తనదైన శైలిలో వివరించారు. రిజెక్షన్ మీ విలువను తగ్గించదు! ఎవరైనా మనల్ని వద్దన్నంత మాత్రాన మన టాలెంట్ తగ్గిపోదని పూరి స్పష్టం చేశారు. "ఎవరో మిమ్మల్ని కాదన్నంత మాత్రాన మీ విలువ పడిపోదు. నిజానికి రిజెక్షన్ అనేది ఒక కొత్త ప్రారంభం. అది మీకు అంతకంటే మంచి అవకాశం రాబోతోందని చెప్పే ఒక సంకేతం" అని ఆయన పేర్కొన్నారు. రిజెక్ట్ అయినప్పుడు బాధ కలగడం సహజమని, కానీ ఆ బాధ మనల్ని బలహీనపరచకూడదని ఆయన హితవు పలికారు. రిజెక్ట్ అయిన ప్రతిసారి మనలో కసి పెరగాలి తప్ప ఆత్మవిశ్వాసం తగ్గకూడదు అన్నారు. మహానుభావులందరూ రిజెక్ట్ అయినవారే! ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తుల జీవితాలను ఉదాహరణలుగా చూపిస్తూ పూరి స్ఫూర్తిని నింపారు. క్రియేటివిటీ లేదని న్యూస్ పేపర్ ఉద్యోగం నుంచి తీసేయబడిన కుర్రాడే 'వాల్ట్ డిస్నీ' అయ్యాడని, బాస్కెట్ బాల్ ఆడటం రాదని స్కూల్ టీమ్ నుండి పంపేయబడిన వ్యక్తి 'మైఖేల్ జోర్డాన్' అని గుర్తు చేశారు. అలాగే మాట్లాడటం రాదని టెలివిజన్‌కు పనికిరాదన్న అమ్మాయి 'ఓప్రా విన్‌ఫ్రే' గా మారిందని చెబుతూ.. మన పొటెన్షియల్ ఏంటో మనకే తెలియదు, అలాంటప్పుడు ఎదుటివాడు మనల్ని ఎలా అంచనా వేస్తాడని ప్రశ్నించారు. "ఒక తలుపు మూసుకుంటే వంద తలుపులు తెరుచుకుంటాయి" అనే సూత్రాన్ని నమ్మాలని పూరి సూచించారు. రిజెక్షన్ ఎదురైనప్పుడు మనల్ని మనం సరిదిద్దుకోవాలని, స్కిల్స్ పెంచుకోవాలని, నిరంతరం నేర్చుకుంటూ ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. మీరు 100 సార్లు రిజెక్ట్ అయినా సరే, కుంగిపోకుండా మీ గమ్యం వైపు సాగితే, ఆ తిరస్కరణలే మిమ్మల్ని శిఖరాగ్రానికి చేరుస్తాయని పూరి జగన్నాథ్ ఈ మ్యూజింగ్స్ ద్వారా సందేశాన్ని ఇచ్చారు.  
స్టార్ స్టేటస్ తో పాటు అభిమానుల, ప్రేక్షకుల హృదయంలో సుస్థిర స్థానం అల్లాటప్పాగా రాదు. అందుకు ఎంతో పెట్టి పుట్టాలనేది ఎంత నిజమో, ఎంతో కృషి ఉండాలి. కానీ స్టార్ స్టేటస్ పొందాక కూడా టైం అనేది చూసుకోకుండా కష్టపడితే అసలైన సిసలైన కళామతల్లి ముద్దు బిడ్డ అనాల్సిందే. రమ్యకృష్ణ(Ramyakrishna)చెప్పిన మాటలతో ఇప్పుడు అభిమానులతో పాటు నెటిజన్స్  అవే మాటలు అంటున్నారు. రమ్య కృష్ణ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు నా మ్యారేజ్ టైంలో  'సింహాద్రి'(Simhadri)షూటింగ్ జరుగుతోంది. రేపు ఉదయం నా పెళ్లి అనగా ముందు రోజు రాత్రి 2 గంటల వరకు ఎన్టీఆర్‌(Ntr)తో కలిసి ఆ పాట కోసం డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. ఆ పాట షూటింగ్ పూర్తి చేయాల్సిన డెడ్ లైన్ నా పెళ్లి ముహూర్తానికి చాలా దగ్గరగా ఉంది. దీంతో సాంగ్ కంప్లీట్ చేసి పెళ్ళికి వెళ్లానని చెప్పుకొచ్చింది. రమ్యకృష్ణ వివాహం జూన్ 12  2003 న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తో జరగగా, సింహాద్రి అదే సంవత్సరం జులై 9 న రిలీజై రికార్డులు సైతం బెదిరిపోయేలా సరికొత్త రికార్డుల సునామీని సృష్టించింది.    ఇక ఎన్టీఆర్, రమ్యకృష్ణ పై చిత్రీకరించిన చిన్నదమ్మే చీకులు కావాలా సాంగ్ లో ఎన్టీఆర్ , రమ్యకృష్ణ పోటాపోటీగా స్టెప్స్ చేసారు. సదరు స్టెప్స్ దెబ్బకి బాల్కనీ లో ఉన్న వాళ్లంతా స్క్రీన్ ముందుకు వచ్చి డాన్స్ చేయడమనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. రిపీట్ ఆడియెన్స్ కూడా వచ్చే అవకాశాన్ని కల్పించింది. ఇప్పటికీ ఏ ఫంక్షన్ జరిగినా 'చిన్నదమ్మే చీకులు' పాట మోగాల్సిందే. రాజమౌళి విజన్, కీరవాణి సంగీతం కూడా సాంగ్ ని  చార్ట్‌బస్టర్‌గా నిలబెట్టాయి.  also read: Dacoit: ఓటీటీలోకి డెకాయిట్..  డేట్ ఇదేనా! నటీనటులు తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఎంతో కష్టం, త్యాగం ఉంటుందని రమ్యకృష్ణ మాటలతో మరోసారి రుజువైంది. తన జీవితంలో అత్యంత కీలకమైన పెళ్లి రోజున కూడా వృత్తిని గౌరవించి, పని పూర్తి చేసిన ఆమె నిజంగా గ్రేట్ అని చెప్పాలి. అందుకే ఆమె ఇప్పటికీ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్‌గా కొనసాగుతున్నారు. ఎన్టీఆర్ పట్ల ఆమెకున్న గౌరవం, సినిమా పట్ల ఆమెకున్న ప్రేమ ఈ సంఘటన ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది. రమ్యకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి 'సింహాద్రి' సినిమా జ్ఞాపకాలను నెమరువేసుకునేలా చేస్తున్నాయి.    
  డెకాయిట్(Dacoit).. ఏ సమయంలో స్టార్ట్ అయ్యిందో గాని, లేక మేకర్స్, నటుల జాతకం బాగుందో కానీ, ఈ మధ్య కాలంలో నెగిటివ్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్స్ రాబట్టి సరికొత్త హిస్టరీని సృష్టించింది. మరి ఓవరాల్ గా 50 కోట్లకి పైగా రాబట్టడం అంటే మాములు విషయమా చెప్పండి. ఇప్పుడు ఈ మూవీ ఓటిటి  వేదికగా రాబోతుందన్న సంకేతాలు చాలా బలంగానే సోషల్ మీడియాలో ఇండిపెండెంట్ హోదాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ డేట్ ఏంటో చూద్దాం. డెకాయిట్  డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సదరు సంస్థ మే 8 నుంచి స్ట్రీమింగ్ కి తీసుకొస్తున్నట్టుగా టాక్ . ఈ మేరకు మేకర్స్, నెట్ ఫ్లిక్స్ నుంచి త్వరలోనే  అధికార ప్రకటన రానున్నట్టుగా తెలుస్తుంది  తెలుగు, హిందీతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ ఒకేసారి  స్ట్రీమింగ్ కానుందని సమాచారం. అడవి శేష్, మృణాల్ ఠాకూర్ నటన ఎంతగానో కట్టిపడేస్తుంది. మరి మే 8  న  డెకాయిట్ కి రెడీ  అయిపోండి. Also read: Nithya Menen: పెళ్లి, మాతృత్వంపై నిత్యా మీనన్ బోల్డ్ కామెంట్స్  అన్నపూర్ణ స్టూడియోస్, ఎస్ ఎస్ క్రియేషన్స్ సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లపై సుప్రియ యార్లగడ్డ, సునీల్‌ నారంగ్‌  సంయుక్తంగా డెకాయిట్  నిర్మించారు. ప్రకాశ్ రాజ్ ,సునీల్, అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల, జయన్ మేరీ ఖాన్, జరీనా వాహబ్  తదితరులు ముఖ్యమైన క్యారెక్టర్స్ . భీమ్స్ సిసిరీలియో మ్యూజిక్ కాగా షానీల్ డియో దర్శకుడు   
నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ నటిగా తనను తాను నిరూపించుకుంటోంది. ఈ క్రమంలో రష్మిక ప్రధాన పాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ యాక్షన్ థ్రిల్లర్ 'మైసా' (Mysaa). తాజాగా ఈ సినిమా షూటింగ్ సెట్స్‌లో రష్మిక చేసిన ఒక సాహసం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. నిజమైన సాహసం.. డూప్ లేకుండా! ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన యాక్షన్ సీన్ ను షూట్ చేస్తున్నప్పుడు రష్మిక ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకుంది. దాదాపు 80 అడుగుల ఎత్తు నుంచి దూకాల్సిన ఒక సీన్ కోసం దర్శకుడు రవీంద్ర పుల్లె డూప్‌ను ఏర్పాటు చేశాడు. అయితే, సీన్ సహజంగా రావాలనే ఉద్దేశంతో రష్మిక డూప్ లేకుండా తానే స్వయంగా ఆ స్టంట్ చేస్తానని ముందుకొచ్చింది. ఎటువంటి భయం లేకుండా 80 అడుగుల ఎత్తు నుంచి దూకి ఆ సన్నివేశాన్ని సింగిల్ టేక్‌లో పూర్తి చేసి యూనిట్ సభ్యులందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు ఈ సీన్ చేసే సమయంలో రష్మికకు చిన్న గాయాలైనా.. బ్రేక్ తీసుకోకుండా షూటింగ్ ను కంటిన్యూ చేయడం విశేషం. దర్శకుడు రవీంద్ర పుల్లె ప్రశంసలు రష్మిక డెడికేషన్ గురించి దర్శకుడు రవీంద్ర పుల్లె మాట్లాడుతూ.. "రష్మిక కేవలం స్టార్ హీరోయిన్ మాత్రమే కాదు, తన పని పట్ల అత్యంత నిబద్ధత కలిగిన నటి. 80 అడుగుల ఎత్తు నుంచి దూకడం అనేది సామాన్యం కాదు, కానీ ఆమె ఆ రిస్క్ తీసుకుని సినిమాపై తనకున్న ప్రేమను చాటుకుంది. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాలో హైలైట్‌గా నిలుస్తుంది" అని కొనియాడారు. రష్మిక చూపిస్తున్న ఈ తెగువ చూస్తుంటే 'మైసా'లో ఆమె మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో కనిపించబోతోందని అర్థమవుతోంది. స్టార్ హీరోయిన్లు సాధారణంగా రిస్కీ స్టంట్స్ చేయడానికి వెనుకాడతారు, కానీ రష్మిక మాత్రం నటన పట్ల తనకున్న మక్కువతో సాహసానికి సిద్ధపడింది. ఇప్పటికే 'మైసా' మూవీ గ్లింప్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా, తాజా వార్తతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. సినిమా కోసం రష్మిక పడుతున్న కష్టం చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఈమె మరోసారి మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.  
నాచురల్ పెర్ఫార్మ్ కి బ్రాండ్ అంబాసిడర్స్ లో నిత్య మీనన్(Nithya Menen) ఒకరు. అందుకే ఎంతో మంది అభిమానులని సంపాధించుకుంది. వివాదాలకు దూరంగా ఉంటూ, కేవలం నటనకి ప్రాధాన్యత గల క్యారెక్టర్స్ ని ఎంచుకునే నిత్య వ్యక్తిగత విషయాల గురించి చాలా అరుదుగా మాట్లాడుతుంటారు. అయితే, ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి  మాతృత్వం గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాకి రెస్ట్ లేకుండా చేస్తున్నాయి. మరి ఏం మాట్లాడిందో చూద్దాం.  ఆమె మాట్లాడుతు పెళ్లి అనేది ఒక సామాజిక బాధ్యతగా కాకుండా, ఇద్దరి వ్యక్తుల మధ్య ఉండే బలమైన అనుబంధంగా ఉండాలి. పెళ్లి చేసుకోవాలి కాబట్టి చేసుకోవడం నాకు నచ్చదు. సరైన వ్యక్తి తోడైనప్పుడు అది సహజంగా జరగాలి. పిల్లలు కావాలనుకోవడం కూడా ఒక మహిళ పూర్తి నిర్ణయం. దానికి పెళ్లితో సంబంధం లేదు. పెళ్లి చేసుకోకుండానే తల్లి అయ్యే మార్గాలు చాలా ఉన్నాయి.  నాకు పిల్లలంటే చాలా ఇష్టం. కానీ ఒక బిడ్డను లోకంలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద బాధ్యత. కేవలం వయస్సు అయిపోతుందనో లేదా సమాజం అడుగుతుందనో పిల్లలని కనకూడదు. నా శరీరం, నా జీవితం, నిర్ణయం నాదే అయ్యి ఉండాలి. Also read:  Varanasi: కొత్త మార్కెట్ పై వారణాసి గురి ఒకవేళ భవిష్యత్తులో నాకు వివాహం కాకపోయినా, బయోలాజికల్ క్లాక్ దాటిపోయినా.. పిల్లల కోసం దత్తత వంటి ఇతర ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. దేనికీ నేను  భయపడను. ప్రస్తుతం కెరీర్ తో పాటు వ్యక్తిగత ప్రశాంతతకి మాత్రమే  ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పుకొచ్చింది. మరి నిత్య మాట్లాడిన ఈ మాటలు ఏ రేంజ్ లో ప్రభావం చూపిస్తాయో చెప్పక్కర్లేదు. గత ఏడాది ధనుష్ తో కలిసి  ఇడ్లి కొట్టుతో వచ్చిన నిత్య నుంచి స్టిల్ ఎలాంటి కొత్త సినిమా ప్రకటన ఇంకా రాలేదు.  
2026 జూన్ నెలలో రిలీజ్ కానున్న భారీ చిత్రాల విడుదల తేదీల విషయంలో గత కొద్దిరోజులుగా నెలకొన్న సందిగ్ధతకు ఇప్పుడు ఒక స్పష్టత వచ్చింది. రామ్ చరణ్, అఖిల్ అక్కినేని, యశ్ సినిమాల మధ్య జరుగుతున్న ఈ రిలీజ్ డేట్ గేమ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. బుచ్చిబాబు ప్రకటనతో మొదలైన అలజడి ఇటీవల జరిగిన 'కర' మూవీ ఈవెంట్‌లో దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ.. రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది' (Peddi) సినిమాను జూన్ 25న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటనతో అక్కినేని అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఎందుకంటే, అఖిల్ అక్కినేని నటిస్తున్న 'లెనిన్' (LENIN) మూవీ జూన్ 26న విడుదల కావాల్సి ఉంది. చరణ్ సినిమాతో పోటీ పడటం ఎందుకని 'లెనిన్' వాయిదా పడుతుందనే ప్రచారం జోరుగా సాగింది. నాగార్జున క్లారిటీ.. తగ్గేదే లే! అయితే, ఈ పుకార్లకు కింగ్ నాగార్జున తనదైన శైలిలో ఫుల్ స్టాప్ పెట్టారు. సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందిస్తూ.. 'లెనిన్' ఫస్ట్ కట్ చూశానని, సినిమా అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. అంతేకాకుండా, ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ 26, 2026న 'లెనిన్' థియేటర్లలోకి వస్తుందని స్పష్టం చేశారు. దీంతో జూన్ ఆఖరి వారంలో రామ్ చరణ్ vs అఖిల్ పోరు ఖాయమనే అభిప్రాయం వ్యక్తమైంది. టాక్సిక్ వాయిదా.. పెద్దికి అడ్వాంటేజ్? మరోవైపు, జూన్ 4న విడుదల కావాల్సిన యశ్ 'టాక్సిక్' (Toxic) మూవీ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కారణాలతో వాయిదా పడింది. ఈ ఖాళీని భర్తీ చేసేందుకు 'పెద్ది' మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ 'పెద్ది' జూన్ 4కి వస్తే, అఖిల్ 'లెనిన్'కు సోలో రిలీజ్ దక్కుతుంది. కానీ బుచ్చిబాబు జూన్ 25 అని చెప్పడంతో ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. 'పెద్ది' రిలీజ్ డేట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి బుచ్చిబాబు చెప్పినట్టుగా జూన్ 25న వచ్చి 'లెనిన్'కి షాక్ ఇస్తుందో లేక 'టాక్సిక్' తప్పుకోవడంతో ఖాళీ అయిన జూన్ 4 కి వస్తుందో చూడాలి.  
భారతీయుల ఆహారంలో బెల్లం ప్రధాన పదార్థం. తీపి పదార్థాల తయారీ నుండి కూరలలో కూడా రుచి కోసం బెల్లం వాడుతూ ఉంటారు.  అయితే వేసవి కాలంలో బెల్లం విషయంలో పెద్ద సమస్య ఎదురవుతుంది. అదే బెల్లం జిగటగా మారడం.  గాలిలోని వేడి, తేమ కారణంగా బెల్లం తరచుగా కరిగి జిగటగా మారుతుంది. అంతేకాకుండా, కొన్నిసార్లు దానికి బూజు కూడా పడుతుంది. వేసవిలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం వల్ల వేసవి కాలంలో కూడా బెల్లం తాజాగా, పొడిగా ఉండేలా చేయవచ్చు. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ఎయిర్ టైట్ కంటైనర్.. బెల్లానికి గాలి, తేమ అనేవి అతిపెద్ద శత్రువులు. అందువల్ల బెల్లాన్ని నిల్వ చేయడానికి ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల ఎయిర్ టైట్ కంటైనర్ ను  ఉపయోగించాలి. వీలైతే గాజు లేదా స్టీల్‌తో చేసిన పాత్రను ఎంచుకోవాలి. ప్లాస్టిక్ పాత్రలలోకి తరచుగా తేమ చేరి, బెల్లం కరిగిపోతుంది. చిన్న ముక్కలు.. మార్కెట్  నుండి తెచ్చిన బెల్లం ముద్ద మొత్తాన్ని ఒకేసారి డబ్బాలో వేస్తుంటారు. అయితే ఈ పద్ధతిని మానుకోవాలి. బెల్లాన్ని నిల్వ చేసే ముందు చిన్న చిన్న ముక్కలుగా చేయాలి. దీనివల్ల  అవసరమైనంత మాత్రమే బయటకు తీయడం వీలవుతుంది. బెల్లం మొత్తం పదేపదే బయటి గాలికి గురికాకుండా సురక్షితంగా ఉంటుంది. అంతేకాదు.. అవసరైమనప్పుడల్లా  బెల్లాన్ని బయటకు తీసి దాన్ని ఏదైనా రాయి లేదా రాడ్ లాంటి దానితో కొట్టి చిన్న ముక్క తీసుకుని,  తిరిగి దాన్ని మళ్లీ కంటైనర్ లో పెట్టడం లాంటివి చేస్తుంటే బెల్లం తొందరగా మెత్తబడి జిగటగా మారుతుంది. నీరు, తడి చేతులకు దూరం.. ఇది చాలా చిన్న విషయమే అయినా చాలా ముఖ్యమైనది. హడావిడిలో బెల్లం తీయడానికి తడి చేతులను గానీ, తడి చెంచాను గానీ ఎప్పుడూ ఉపయోగించకూడదు. చిన్న నీటి చుక్క కూడా  బెల్లం డబ్బా మొత్తాన్ని జిగటగా మార్చి, దానిని పాడుచేస్తుంది. బెల్లం తీసేటప్పుడు ఎల్లప్పుడూ పూర్తిగా పొడి చెంచాను  లేదా పొడి చేతులను మాత్రమే వాడాలి. బియ్యం చిట్కా.. బియ్యం చిట్కా మన అమ్మమ్మల కాలం నుండి వస్తున్న ఒక పాత చిట్కా.. కానీ ఇది చాలా ప్రభావవంతమైన చిట్కా. కొద్దిగా  బియ్యాన్ని ఒక శుభ్రమైన పత్తి లేదా మస్లిన్ గుడ్డలో కట్టి,  బెల్లం నిల్వ చేసే పాత్ర అడుగున ఉంచాలి. ఆ బియ్యం పాత్రలోని అదనపు తేమను పీల్చుకుంటుంది, దీనివల్ల  బెల్లం పూర్తిగా పొడిగా ఉంటుంది. ఫ్రిజ్ లో నిల్వ.. వేసవిలో  విపరీతమైన వేడి, తేమ ఉంటే , బెల్లాన్ని బయట కాకుండా ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. అయితే, దానిని నేరుగా డబ్బాలో ఉంచి నిల్వ చేయకూడదు. బెల్లం ముక్కలను జిప్-లాక్ బ్యాగ్‌లో లేదా శుభ్రమైన కాగితంలో గట్టిగా చుట్టి, ఆ తర్వాత వాటిని ఫ్రిజ్‌లోని ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయాలి. ఇలా చేస్తే బెల్లం జిగటగా మారడం, కరగడం వంటివి జరగవు.                      *రూపశ్రీ.
ఒక్కసారి ఆలోచించండి.. ఉదయం నిద్రలేవగానే మీరు చూసే మొదటి ముఖం ఎవరిది? మీ భాగస్వామిదా లేక మీ మొబైల్ ఫోన్ స్క్రీనా? ఒకప్పుడు పక్కపక్కనే కూర్చుని మనసు విప్పి మాట్లాడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు పక్కనే ఉన్నా ఎవరి ఫోన్లలో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. నేటి కాలంలో మొబైల్ ఫోన్ మన అందరికీ "మొదటి లైఫ్ పార్ట్నర్" (First Life Partner) గా మారిపోయింది. ఈ డిజిటల్ వ్యసనం వల్ల మన మధ్య ఉండాల్సిన క్వాలిటీ టైమ్ మాయమైపోతోంది. ఈ పరిస్థితిని మార్చుకుని, మళ్ళీ మన బంధాలను ఎలా చిగురింపజేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొబైల్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి? (Why Should We?) మొబైల్ పక్కన పెట్టి మనుషులతో గడపడం ఎందుకు ముఖ్యం అంటే: సరైన నిర్ణయాలు తీసుకోవడానికి: ముఖాముఖి మాట్లాడుకున్నప్పుడే ఒక విషయంపై చర్చించి సరైన నిర్ణయం (Decision making) తీసుకోగలం. గౌరవం ఇవ్వడం: ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఫోన్ చూసుకోకుండా ఉండటం కనీస గౌరవం. బంధం బలపడటానికి: వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య లేదా ఫ్యామిలీ మధ్య క్వాలిటీ టైమ్ గడపడం వల్ల అనుబంధం పెరుగుతుంది. ఏమి చేయకూడదు? (What Not To Do?) మనకు తెలియకుండానే చేసే ఈ తప్పులు బంధాలను దూరం చేస్తున్నాయి: మొదటి ప్రాధాన్యత ఇవ్వకండి: ఫోన్ కంటే ముందు మనిషికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఫోన్ ఫస్ట్ లైఫ్ పార్ట్నర్ కాకూడదు. మధ్యలో మాట్లాడకండి: ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో అకస్మాత్తుగా ఫోన్ కాల్ వస్తే అక్కడి నుండి వెళ్ళిపోవడం లేదా గట్టిగా మాట్లాడటం చేయకూడదు. దీనివల్ల అవతలి వాళ్ళు చిన్నబుచ్చుకుంటారు. ముఖ్యమైన సందర్భాల్లో వాడొద్దు: పెళ్లి చూపులు వంటి ముఖ్యమైన చర్చల్లో పాల్గొన్నప్పుడు మొబైల్స్ చూస్తూ కూర్చోవడం వల్ల వచ్చిన అసలు ఉద్దేశమే మర్చిపోయే ప్రమాదం ఉంది. ముందుకు వెళ్ళే మార్గం - చిట్కాలు (How-To Points): మొబైల్ వ్యసనం నుండి బయటపడటానికి ఈ చిన్న మార్పులు చేయండి: సెల్ఫ్ డిసిప్లిన్ (Self-discipline): మొబైల్ వాడకం విషయంలో మనకు మనమే ఒక క్రమశిక్షణ విధించుకోవాలి. సైలెంట్ మోడ్‌లో పెట్టండి: ఎవరితోనైనా క్వాలిటీ టైమ్ గడుపుతున్నప్పుడు లేదా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఫోన్‌ను సైలెంట్ మోడ్‌లో పెట్టి దూరంగా ఉంచండి. ముందే చెప్పండి: ఎవరైనా ఇంపార్టెంట్ వ్యక్తులు ఉంటే, వారికి "నేను ఒక గంట పాటు బిజీగా ఉంటాను, తర్వాత కాల్ చేస్తాను" అని మెసేజ్ పెట్టి మీ క్వాలిటీ టైమ్‌ను ఆస్వాదించండి. పరస్పర అంగీకారం: భార్యాభర్తలు ఇద్దరూ కలిసి "మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్స్ వాడొద్దు" అని ఒక రూల్ పెట్టుకోవాలి. ఎవరైనా వాడితే రెండో వ్యక్తి నిర్మొహమాటంగా గుర్తు చేయాలి. ప్రశ్నలు - సమాధానాలు (Q&A): ప్రశ్న: బోర్ కొట్టినప్పుడు మొబైల్ చూడటం తప్పా? సమాధానం: బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడటం సహజమే, కానీ ఎదురుగా ఒక మనిషి ఉన్నప్పుడు వారిని వదిలేసి ఫోన్ చూస్తూ కూర్చోవడం సరైన పద్ధతి కాదు. ఇది గౌరవం మరియు కామన్ సెన్స్ (Common sense) కి సంబంధించిన విషయం. ప్రశ్న: ఫోన్ వాడొద్దు అని చెబితే అవతలి వారు కోప్పడితే ఏం చేయాలి? సమాధానం: ఇది కోప్పడాల్సిన విషయం కాదు. "మనం ఈ సమయాన్ని సరదాగా గడపడానికి వచ్చాం, కాసేపు ఫోన్ పక్కన పెడదాం" అని సున్నితంగా చెప్పడం అలవాటు చేసుకోవాలి. మొబైల్ ఫోన్ అనేది మన అవసరానికి మాత్రమే, మన జీవితం అవ్వకూడదు. మన కళ్ళ ముందు ఉన్న మనుషుల కంటే, ఆ స్క్రీన్ లో కనిపించే ప్రపంచం ముఖ్యం కాదు. కాబట్టి, నేటి నుండే మీ మొబైల్‌ను కాసేపు పక్కన పెట్టి మీ ప్రియమైన వారితో ఆనందంగా గడపండి. అది మీ సెల్ఫ్ డిసిప్లిన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా Naveena Column యూట్యూబ్ ఛానెల్‌ని సందర్శించండి! సబ్స్క్రైబ్ చేసుకోండి.
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలలో 'ఫ్రోజెన్ షోల్డర్' (Frozen Shoulder) ఒకటి. వైద్య పరిభాషలో 'అడెసివ్ క్యాప్సులైటిస్' అని పిలిచే ఈ సమస్య వల్ల భుజం కీలు బిగుసుకుపోయి, కనీసం చేయి పైకి ఎత్తడానికి కూడా వీలు లేని పరిస్థితి ఏర్పడి దైనందిన జీవితం స్తంభించిపోతుంది. దీనిని కేవలం సాధారణ నొప్పి అని సరిపెట్టుకొని నిర్లక్ష్యం చేస్తే మున్ముందు కదలికలు మరింత కష్టతరంగా మారుతాయి. ఆధునిక వైద్యంలోని పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుండగా, ఆయుర్వేదం ఈ వ్యాధిని మూలాల నుండి నయం చేసే అద్భుతమైన మార్గాలను చూపుతోంది. ఈ క్రమంలో ఫ్రోజెన్ షోల్డర్ లక్షణాలు, కారణాలు మరియు దీనిని శాశ్వతంగా నయం చేసే ఆయుర్వేద చికిత్సా పద్ధతుల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రోజెన్ షోల్డర్ అంటే ఏమిటి? మన భుజంలోని కీలు చుట్టూ ఉండే కణజాలం (Capsule) వాపునకు గురై, మందంగా మారడం వల్ల భుజం కదలికలు తగ్గిపోతాయి. దీనివల్ల తీవ్రమైన నొప్పి మరియు బిగుతుగా ఉన్న భావన కలుగుతుంది. ప్రధాన కారణాలు: మధుమేహం (Diabetes): షుగర్ వ్యాధి ఉన్నవారిలో ఈ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  గాయాలు: భుజానికి తగిలిన పాత గాయాలు లేదా శస్త్రచికిత్సల వల్ల.  థైరాయిడ్ సమస్యలు: హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా భుజం కండరాలు దెబ్బతినవచ్చు.  కదలిక లేకపోవడం: ఎక్కువ కాలం చేతికి పని చెప్పకపోవడం వల్ల కీళ్లు బిగుసుకుపోతాయి. ఆయుర్వేద చికిత్స - సహజ సిద్ధమైన పరిష్కారం: ఆయుర్వేదం ప్రకారం, శరీరంలో 'వాత దోషం' పెరగడం వల్ల కీళ్లలో ద్రవాలు తగ్గి ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. ఆయుర్వేదంలో ఫ్రోజెన్ షోల్డర్‌ను 'అవబాహుక' అని అంటారు. దీనికి అందుబాటులో ఉన్న కొన్ని అద్భుతమైన చికిత్సలు: అభ్యంగనం (Abhyangam): వేడి చేసిన ఆయుర్వేద తైలాలతో (మహానారాయణ తైలం వంటివి) మర్దన చేయడం వల్ల రక్త ప్రసరణ పెరిగి నొప్పి తగ్గుతుంది.   స్వేదనం (Swedanam): మూలికల ఆవిరి పట్టడం ద్వారా బిగుసుకుపోయిన కండరాలు వదులవుతాయి.   గ్రీవ వస్తి / పీచు: నొప్పి ఉన్న భాగంలో ప్రత్యేకమైన నూనెను నిల్వ ఉంచే ప్రక్రియ.   పౌష్టిక ఆహారం: వాతాన్ని తగ్గించే ఆహార పదార్థాలను తీసుకోవడం మరియు శొంఠి, గుగ్గులు వంటి మూలికలను వాడటం. ఫ్రోజెన్ షోల్డర్ సమస్యను ప్రారంభ దశలోనే గుర్తిస్తే ఫిజియోథెరపీ మరియు ఆయుర్వేద చికిత్సలతో సులభంగా నయం చేసుకోవచ్చు. నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో చేతి కదలికలు పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. సరైన ఆహారం, క్రమం తప్పని వ్యాయామం మరియు ఆయుర్వేద జీవనశైలితో మీ భుజం ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
వేసవి వాతావరణం శరీరాన్ని అలసటకు గురి చేయడమే కాకుండా, జీర్ణక్రియ , శక్తి పై కూడా ప్రభావం చూపుతుంది. ఆయుర్వేదం ప్రకారం, ఆరోగ్యకరమైన శరీరం , మనస్సును కాపాడుకోవడానికి వేసవి కాలంలో ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. ఎందుకంటే వేసవిలో పిత్త తత్వం మరింత చురుకుగా ఉంటుంది, ఇది కడుపులో మంట, జీర్ణ సమస్యలు , అలసటకు దారితీస్తుంది. అందువల్ల, ఆయుర్వేదం కొన్ని రకాల ఆహారాలను తినమని , మరికొన్నింటిని తినకుండా ఉండమని సిఫార్సు చేస్తుంది. ఆయుర్వేదం చెప్పిన తినాల్సిన, తినకూడని ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. వేసవిలో ఏం తినాలి? వేసవిలో శరీరం బాగా వేడెక్కి, పిత్త దోషం పెరుగుతుంది. అందువల్ల, తేలికైన, చల్లని ఆహారాలు తినడం చాలా అవసరం. కర్బూజా, పుచ్చకాయ, మామిడి వంటి తాజా పండ్లు శరీరాన్ని చల్లబరిచి, కోల్పోయిన నీటిని తిరిగి అందిస్తాయి. చల్లని పాలు , పెరుగు శరీరాన్ని చల్లబరుస్తాయి. జీర్ణ వ్యవస్థను సమతుల్యం చేస్తాయి. పీచుపదార్థాలు అధికంగా ఉండే సలాడ్‌లు , తేలికపాటి కూరగాయలు జీర్ణక్రియను సులభతరం చేసి, కడుపులో వేడి అసమతుల్యతను నివారిస్తాయి. చల్లని జ్యూస్‌లు , కొబ్బరి నీరు సహజ ఎలక్ట్రోలైట్‌లను అందించి, శరీరాన్ని తేమగా ఉంచుతాయి. వేసవిలో ఏం తినకూడదు? వేసవిలో వేయించిన , బరువైన ఆహారాలకు దూరంగా ఉండాలి,  అవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, కడుపులో వేడిని పెంచుతాయి. అందుకే ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి. అధిక మసాలాలు గల వంటకాలతో పాటు, కాఫీ , టీ వంటి కెఫిన్ పానీయాలు,  అధిక నూనె లేదా తీపి పదార్థాలు పిత్త దోషాన్ని పెంచి, శరీరాన్ని అసమతుల్యం చేస్తాయి. వేసవిలో కెఫిన్‌కు వీలైనంత దూరంగా ఉండాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. రోజులో ఎక్కువసార్లు కొద్దికొద్దిగా ఆహారం తీసుకోవడం జీర్ణక్రియకు సహాయపడి, శక్తిని నిలుపుతుంది.   శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉండాలంటే, తేలికైన, నీరు అధికంగా ఉండే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి.   చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల పైత్యరసం అదుపులో ఉండి, వేసవిలో అలసట , చికాకును నివారిస్తుంది.                                *రూపశ్రీ.  
మలబద్ధకం (Constipation) సమస్యకు ప్రధాన కారణాలు, లక్షణాలు మరియు సులభమైన ఆయుర్వేద గృహ చిట్కాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకోండి. నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం (Constipation). దీనినే తెలుగులో 'మలబద్ధకం' అని కూడా అంటారు. ఇది కేవలం ఒక సమస్య మాత్రమే కాదు, సకాలంలో దీనిని నివారించకపోతే ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఈ వీడియోలో మలబద్ధకం గురించి పూర్తి సమాచారాన్ని నిపుణులు వివరించారు: మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు: ఆహారంలో పీచు పదార్థం (Fiber) తక్కువగా ఉండటం. శరీరానికి సరిపడా నీరు తాగకపోవడం. సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం.  శారీరక శ్రమ లేకపోవడం లేదా రోజంతా కూర్చుని పనిచేయడం. మానసిక ఒత్తిడి మరియు నిద్రలేమి. లక్షణాలు: వారానికి మూడు సార్లు కంటే తక్కువ మలవిసర్జన జరగడం. కడుపు ఉబ్బరంగా ఉండటం మరియు గ్యాస్ సమస్యలు. మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి లేదా ఇబ్బంది కలగడం. ఆకలి మందగించడం. ఆయుర్వేద గృహ చిట్కాలు (Home Remedies): మలబద్ధకాన్ని వదిలించుకోవడానికి ఆయుర్వేదంలో అద్భుతమైన మార్గాలు ఉన్నాయి. ఈ వీడియోలో సూచించిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు: త్రిఫల చూర్ణం: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో త్రిఫల చూర్ణం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఆముదం (Castor Oil): తక్కువ మోతాదులో ఆముదాన్ని పాలలో కలిపి తీసుకోవడం వల్ల విరేచనం సాఫీగా అవుతుంది.  పండ్లు మరియు కూరగాయలు: పీచు పదార్థం ఎక్కువగా ఉండే ఆకుకూరలు, బొప్పాయి మరియు అరటిపండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి.  నీరు: రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటుంది.  మలబద్ధకం సమస్య నుండి శాశ్వత ఉపశమనం పొందడానికి మరియు ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను పెంపొందించుకోవడానికి ఈ వీడియోలో చెప్పిన సూచనలను తప్పక పాటించండి. మరిన్ని ఆరోగ్య సూచనలు మరియు పరిష్కారాల కోసం మా యూట్యూబ్ ఛానెల్ "TeluguOne Health" ను సందర్శించి సబ్‌స్క్రైబ్ చేయండి!
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్, మధుమేహం, PCOD వంటి సమస్యలు మన జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. మందులు వాడుతున్నా పూర్తి ఉపశమనం లభించడం లేదా? అయితే మీకు 'థెరప్యూటిక్ యోగా' ఒక అద్భుతమైన మార్గం. ఇది కేవలం శరీరాన్ని కదిలించడం మాత్రమే కాదు, మీ మనస్సును మరియు ఆత్మను పునరుజ్జీవింపజేసే ఒక దివ్యౌషధం. మనం థెరప్యూటిక్ యోగాను ఎందుకు ఎంచుకోవాలి? (Why Should We?) రోజంతా ఉత్సాహం: మీరు రోజుకు కేవలం గంటన్నర సమయం యోగాకు కేటాయిస్తే, మిగిలిన 22.5 గంటల సమయం ఎంతో శక్తివంతంగా మరియు ఆనందంగా గడుస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి విముక్తి: థైరాయిడ్ సమస్య ఉన్నవారు కేవలం 3 నెలల్లో మార్పును గమనించవచ్చు, అలాగే PCOD సమస్యలు 4 నుండి 5 నెలల్లో నయమయ్యే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత: ఈ ప్రపంచంలో మానసిక సమస్యలను సమూలంగా నయం చేసే శక్తి కేవలం యోగాకు మాత్రమే ఉంది. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచి, బద్ధకాన్ని వదిలిస్తుంది. అంతర్గత మార్పు: యోగా మిమ్మల్ని లోపలి నుండి మారుస్తుంది. అది ఒక చిన్న పిల్లవాడి నవ్వులో ఉండే స్వచ్ఛతను మీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఏం చేయకూడదు? (What Not to Do) నియమాలను విస్మరించవద్దు: మధుమేహం లేదా రక్తపోటు ఉన్నవారు యోగా చేస్తున్నాం కదా అని ఆహార నియమాలను పూర్తిగా వదిలేయకూడదు. వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తక్షణ ఫలితాల కోసం ఆరాటపడవద్దు: యోగా అనేది ఏటీఎం మిషన్ నుండి డబ్బులు వచ్చినట్లు తక్షణమే రాదు, కానీ సాధన మొదలుపెట్టిన కొద్దిసేపటికే మీరు ఆ మార్పును అనుభూతి చెందుతారు. ఆనందాన్ని వదులుకోవద్దు: జీవితంలో దేనికైనా రాజీ పడండి కానీ మీ సంతోషం విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడకండి. ప్రారంభించడం ఎలా? (How to Start) శ్వాసపై ధ్యాస: మన శ్వాస మరియు మనస్సు భార్యాభర్తల వంటివి. శ్వాస దీర్ఘంగా, ప్రశాంతంగా ఉంటే మనస్సు కూడా అంతే ప్రశాంతంగా మారుతుంది. సరైన భంగిమలు: 'సుప్త ఆసనం' (Subtasana) వంటి భంగిమలు కేవలం 10 నిమిషాల్లోనే మిమ్మల్ని ఎంతో రిలాక్స్‌గా మరియు శక్తివంతంగా మారుస్తాయి. ఆధారాలతో సాధన (Props): శారీరక ఇబ్బందుల వల్ల ఆసనాలు వేయలేకపోయేవారు రకరకాల ప్రాప్స్ (Props) సహాయంతో సులభంగా యోగా చేయవచ్చు. ఇది క్యాన్సర్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నవారికి కూడా ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశ్నలు - సమాధానాలు (Q&A) ప్ర: థైరాయిడ్ సమస్య యోగాతో నయమవుతుందా?  జ: అవును, క్రమం తప్పకుండా థెరప్యూటిక్ యోగా చేయడం ద్వారా 3 నెలల్లో థైరాయిడ్ మందుల మోతాదును తగ్గించుకోవచ్చు. ప్ర: క్యాన్సర్ రోగులకు యోగా ఎలా సహాయపడుతుంది?  జ: యోగా క్యాన్సర్‌ను పూర్తిగా నయం చేయకపోవచ్చు, కానీ రోగిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు శరీరంలో ప్రాణవాయువును (Oxygenation) పెంచి మనశ్శాంతిని చేకూరుస్తుంది. ప్ర: వ్యాయామం చేయడానికి సమయం లేని వారి పరిస్థితి ఏంటి?  జ: మీ శరీరం కోసం మీరు రోజుకు కనీసం గంటన్నర కేటాయించలేకపోతే, అనారోగ్యం పాలైనప్పుడు అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆసుపత్రుల్లో గడపాల్సి వస్తుందని గుర్తుంచుకోండి. మీరు అందంగా, ఆకర్షణీయంగా కనిపించాలన్నా, ఆత్మవిశ్వాసంతో మెరవాలన్నా యోగా ఒక్కటే మార్గం. మాటల కంటే సాధన ద్వారానే మీరు ఆ వ్యత్యాసాన్ని గమనించగలరు. ఆరోగ్యం అనేది మన చేతుల్లోనే ఉంది, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. మరిన్ని ఆసక్తికరమైన ఆరోగ్య చిట్కాలు మరియు యోగా ప్రాక్టికల్ వీడియోల కోసం మా యూట్యూబ్ (YouTube) ఛానెల్‌ని సందర్శించండి! ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి మరియు ఆరోగ్యవంతులుగా మారండి.