LATEST NEWS
సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారాయి. ఒక క్రిమినల్ కులం ఏంటి అంటూ  నేటి యువతను ప్రశ్నించిన తీరు   ఆలోచింపజేస్తోంది. గాదె సాయికృష్ణ ఘటనపై స్పందించిన పవన్ కళ్యాణ్, నేరగాళ్లను కుల కోణంలో చూడటం వల్లే వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయన్నారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదని కోర్టును ఆశ్రయించిందంటే, అది ఆ తల్లి ప్రాథమిక హక్కు అన్న ఆయన.. తన బిడ్డ బతికాడో లేదో తెలియని ఆవేదనలో ఉన్న ఆ తల్లి పోరాటంలో ఎక్కడా కులం లేదని, కేవలం న్యాయ పోరాటం మాత్రమే ఉందని గుర్తుచేశారు. రాజ్యాంగం గానీ, దేశ క్రిమినల్ చట్టాలు గానీ నేరస్తుడి కులాన్ని, మతాన్ని లేదా ప్రాంతాన్ని చూసి శిక్షలు ఖరారు చేయవని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చట్టం దృష్టిలో కేవలం క్రైమ్ జరిగిందా లేదా, ఎవరు ఎవరికి అన్యాయం చేశారు అనే అంశాలు మాత్రమే ప్రాధాన్యత సంతరించుకుంటాయి. కానీ దురదృష్టవశాత్తూ నేటి సమాజంలో నేరస్తులను కూడా వారి కులాలను బట్టి వెనకేసుకొచ్చే సంస్కృతి పెరిగిపోతోందని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా యువత ఈ కులాల పరిధి నుంచి బయటకు రావాలని, క్రిమినల్స్ ను క్రిమినల్స్ లాగే చూడాలని ఆయన పిలుపునిచ్చారు. తప్పు చేసేవాడికి, మహిళలపై అత్యాచారాలకు పాల్పడే వాడికి   కులం ఎందుకు ఉంటుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాడి గుర్తింపు కేవలం ఒక క్రిమినల్ మాత్రమేనని, అలాంటి నీచుడిని ఏ కులం వారైనా వెనకేసుకొస్తే అది ఆ వ్యక్తి  దౌర్భాగ్య  స్వభావాన్ని సూచిస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడపాలని చూడటం, అధికారులను భయభ్రాంతులకు గురిచేసి గుప్పిట్లో పెట్టుకోవాలని ప్రయత్నించడం ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతమని హెచ్చరించారు. భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం అంటూ క్రిమినల్ గ్యాంగులు ఈరోజు తలపైకి ఎక్కి ఆడుతున్నాయంటే, ఆ బలం వాళ్ళది కాదు, సమాజంగా మనందరి కలెక్టివ్ బలహీనత అని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. పౌరులను సాధికారత వైపు నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకే   3 నెలల క్రితమే ఎస్పీ గారితో మాట్లాడి సివిల్ సిటిజన్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని కోరినట్లు వెల్లడించారు. ప్రజల్లో చైతన్యం వస్తే రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ తమ పరిధిలో ఉంటారని, మితిమీరి ప్రవర్తించరని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలకు ఓటింగ్ పాటర్న్ ఉండొచ్చేమో కానీ, పౌర హక్కులకు, ప్రాథమిక హక్కులకు ఎలాంటి కులాల ఓటింగ్ పాటర్న్ ఉండదని ఆయన స్పష్టం చేశారు. మన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే ఏ ప్రభుత్వాన్ని కూడా మేము ఎన్నుకోబోమని ప్రజలు గట్టిగా నినదించినప్పుడే నిజమైన మార్పు వస్తుందని, పాలకులు కూడా మారుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. క్రిమినల్స్ కు కులాన్ని అంటగట్టి వెనకేసుకొచ్చే ఏ రాజకీయ నాయకుడినైనా సరే ఆమడదూరంలో పెట్టకపోతే, అది సమాజ భవిష్యత్తుకే తీవ్ర భంగం కలిగిస్తుందని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
అక్రమాస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్న ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ కలెక్టర్ నరహరికి చెందిన బ్యాంకు లాకర్లను తెరిచిన ఏసీబీ అధికారులు భారీ మొత్తంలో బంగారం, నగదును గుర్తించారు. లాకర్లలో ఉన్న ఆస్తుల పరిమాణాన్ని చూసి అధికా రులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. లాకర్లలో సుమారు రెండున్నర కిలోల బంగారు ఆభరణాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరో లాకర్‌లో సుమారు రూ.1.50 కోట్ల నగదు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నరహరి నివాసంలో నిర్వహించిన సోదాల్లో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ, ఇప్పుడు లాకర్ల నుంచి మరో రూ.1.50 కోట్ల నగదును స్వాధీనం చేసుకోవడంతో మొత్తం నగదు రూ.3 కోట్లకు పైగా చేరింది. అలాగే, రెండున్నర కిలోల బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం కావడంతో నరహరి అక్రమాస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం విలువనుఅంచనా వేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఏసీబీ చరిత్రలో ఒకే అవినీతి కేసులో రూ.3 కోట్లకు పైగా నగదును స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొంటున్నారు. నరహరికి సంబంధించిన స్థిర, చరా స్తులు, బ్యాంకు ఖాతాలు, పెట్టుబడులపై కూడా విచారణ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అధికారిక వివరాలను ఏసీబీ త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.
తెలుగువన్ ఎక్స్ క్లూజివ్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న తాజా నిరసనలపై ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డోలేంద్ర ప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత చేపట్టిన ఈ ఉద్యమం తీరు,  నిరసనలు తెలిపే క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు, రాజకీయ పరిణామాలపై డోలేంద్ర ప్రసాద్‌తో సీనియర్ జర్నలిస్ట్ కె. రవిశంకర్  వాస్తవ వేదికలో విస్తృత చర్చ జరిపారు.  ఆ సందర్భంగా డోలేంద్ర ప్రసాద్..  ఈ ఉద్యమంలో పాల్గొన్న యువతకు కనీస రాజకీయ పరిణతి  లోపించిందన్నారు. జంతర్ మంతర్ వంటి చారిత్రాత్మక ధర్నా చౌక్‌లలో నిరసనలు తెలిపేటప్పుడు..  కేవలం నినాదాలకే పరిమితం కాకుండా, స్పష్టమైన ఉపన్యాసాల ద్వారా సమస్య తీవ్రతను వివరించాలనీ, కానీ కాక్రోచ్ జనతా పార్టీ నాయకులకు  మైకులు ఉపయోగించి తమ డిమాండ్లను బలంగా వినిపించాలనే కనీస అవగాహన కూడా    లేదని చెప్పారు.  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్..  అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. ఏదైనా ఒక ప్రాంతీయ పార్టీ ఇలాంటి ధర్నాలు చేపడితే భారీగా మెన్ అండ్ మిషనరీని తరలిస్తుందని..  కానీ ఇది నిరుద్యోగులను కలుపుకోకుండా కేవలం స్టూడెంట్స్ కే పరిమితం కావడం వల్ల బలపడటం లేదని స్పష్టం చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో రామదేవ్ బాబా నిరసనలకు దిగినప్పుడు ప్రణబ్ ముఖర్జీ వంటి అగ్రనేతలు స్వయంగా ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లి రాయబారాలు నడిపిన దాఖలాలు ఉన్నాయని డోలేంద్ర ప్రసాద్ గుర్తుచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థల్లో వచ్చే ఇలాంటి పబ్లిక్ ఇష్యూలను హ్యాండిల్ చేయడంలో నాటి ప్రభుత్వాలకు భయం ఉండేదనీ..  కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం దీన్ని  వ్యూహాత్మకంగా డీల్ చేస్తూ నిప్పును చల్లార్చే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజకీయ నాయకుల్లో ఎప్పుడూ ఒక రకమైన ప్రజా ఉద్యమాల భయం ఉంటుందని, అయితే ఈ నిరసనలకు సరైన నాయకత్వం లేకపోవడం పెద్ద మైనస్ అని తేల్చిచెప్పారు. ప్రజల్లో కోరిక ఉన్నప్పటికీ, సరైన లీడర్‌షిప్ లేని కారణంగానే ఉద్యమం పాలపొంగులా వచ్చి చల్లారిపోయే ప్రమాదం ఉందన్నారు. ప్రాంతీయ పార్టీల నేతలు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న తరుణంలో..  క్షేత్రస్థాయి ఉద్యమాలను సమర్థవంతంగా నడిపించగల నాయకత్వ బలం యువతకు ఎంతైనా అవసరమని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.
ALSO ON TELUGUONE N E W S
తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీ సర్కిల్స్‌లో ఒక ఆసక్తికరమైన న్యూస్  హల్‌చల్ చేస్తోంది.. ఆ నిర్మాత తన రాబోయే భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ కోసం ఒక స్టార్  హీరోయిన్‌ని  సంప్రదించగా, సదరు హీరోయిన్ కి కథ నచ్చినప్పటికీ డేట్స్ సర్దుబాటు, రెమ్యునరేషన్ విషయంలో  తీవ్రమైన విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది.  దీంతో సదరు  సీనియర్,పేరున్న నిర్మాత, ప్రస్తుతం టాలీవుడ్‌లో క్రేజీ ఫాలోయింగ్‌తో దూసుకుపోతున్న ఒక టాప్ హీరోయిన్‌ని  టార్గెట్ చేశారనే టాక్ బలంగా వినిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమా సక్సెస్ రేట్ పెరిగినప్పుడు హీరోయిన్లు తమ రెమ్యునరేషన్‌ని పెంచడం సహజమే. కానీ, ఈ క్రేజీ బ్యూటీ ఏకంగా 40 శాతం నుండి 50 శాతం వరకు అదనపు పారితోషికాన్ని డిమాండ్ చేసిందని సమాచారం. దీనికి తోడు షూటింగ్ సమయంలో తన వ్యక్తిగత స్టాఫ్, క్యారవాన్ ఖర్చులు, లగ్జరీ వసతుల కోసం రోజుకు లక్షల రూపాయల అదనపు బడ్జెట్ భారాన్ని నిర్మాతపై మోపడానికి ప్రయత్నించిందట. గతంలో ఇదే నిర్మాతతో దాదాపు 2 సినిమాల్లో నటించిన అనుభవం ఉన్నప్పటికీ, ఇప్పుడు స్టార్‌డమ్ రాగానే ఇలాంటి కఠినమైన నిబంధనలు పెట్టడం సదరు నిర్మాతకి  తీవ్ర అసంతృప్తిని కలిగించింది. నిర్మాత ఎంత నచ్చజెప్పాలని చూసినా, హీరోయిన్ మేనేజర్ ద్వారా వచ్చిన స్పందన ఏమాత్రం సానుకూలంగా లేకపోవడంతో చర్చలు కాస్తా వివాదంగా మారాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, సదరు నిర్మాత ఇండస్ట్రీలోని తన సన్నిహిత నిర్మాతలతో కలిసి ఆ హీరోయిన్‌కు ఒక గట్టి గుణపాఠం చెప్పాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ టాక్. రాబోయే రోజుల్లో ఇతర పెద్ద నిర్మాణ సంస్థల సినిమాల్లో కూడా ఆమెకు అవకాశాలు రాకుండా తెరవెనుక గట్టిగానే చక్రం తిప్పుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 3 పెద్ద ప్రాజెక్టుల చర్చల దశలో ఉన్న ఆ హీరోయిన్ పేరుని పరిశీలన నుండి తొలగించేలా సదరు నిర్మాత ఒత్తిడి తెచ్చినట్లు ఇండస్ట్రీ వర్గాల అంచనా. కేవలం డబ్బు కోసమే కాకుండా, షూటింగ్ డేట్స్ విషయంలో కూడా ఆమె ప్రదర్శించిన అలసత్వం వల్ల దాదాపు 15 నుండి 20 రోజుల ప్రొడక్షన్ టైమ్ వృథా అయిందని, దీనివల్ల నిర్మాతకు దాదాపు 2 కోట్ల వరకు అదనపు నష్టం వాటిల్లిందని ఒక లెక్క ప్రచారంలో ఉంది. టాలీవుడ్‌లో ఇలాంటి 'ఈగో వార్స్' కొత్తేమీ కానప్పటికీ స్టార్ ప్రొడ్యూసర్ నేరుగా టాప్ హీరోయిన్‌ని  టార్గెట్ చేయడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ క్రేజీ హీరోయిన్ చేతిలో 2 పాన్-ఇండియా సినిమాలు  ఉన్నాయి. ఒకవేళ ఈ వివాదం మరింత ముదిరితే, ఆమె కెరీర్ గ్రాఫ్‌పై దీని ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. మరోవైపు హీరోయిన్ పీఆర్ టీమ్ మాత్రం ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వల్లే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నామని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ, గ్లామర్ ప్రపంచం వెనుక ఉండే ఇలాంటి పంతాలు, పట్టింపులు ఎటు దారితీస్తాయో రాబోయే రోజుల్లోనే స్పష్టత రానుంది.  
Samantha's new release Maa Inti Bangaram was initially conceived with a completely different flavour altogether. The project was said to be designed as a light-hearted comical family drama with Sai Pallavi in the lead role, banking heavily on her effortless screen presence, natural humour and emotional connect. Director Nandini Reddy revealed that the original version leaned more towards family interactions, situational comedy and a rooted emotional journey. However, things eventually changed after Sai Pallavi could not come on board for the film due to scheduling conflict. That led the producer Raj Nidimoru to revisit the screenplay and redesign portions of the narrative. With Samantha stepping into the project, Raj reworked the treatment and elevated the scale. Instead of remaining a simple comical family drama, Maa Inti Bangaram gradually transformed into a family entertainer with stronger action elements and a more dynamic character arc for the protagonist. The shift helped the film to attract audiences in a major fashion. Showcasing Samantha's box office pull the movie has collected Rs.14.56 crores gross in two days proving Sam as a true box office treasure as a leading lady coinciding with the title.    Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
స్టార్ హీరోయిన్  సమంత,  నందిని రెడ్డి కలిసి మొన్న 19 న 'మా ఇంటి బంగారం' తో థియేటర్స్ లో లాండ్ అయిన విషయం తెలిసిందే. యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కగా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లని సాధిస్తోంది. సాధారణ గృహిణిగా చీరకట్టులో కనిపిస్తూనే, తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఆయుధం పట్టిన అస్సాసిన్ (హంతకురాలు)  గా  సమంత ప్రదర్శించిన పెర్ఫార్మ్ కి ఫ్యాన్స్, ప్రేక్షకులు  ఫిదా అవుతున్నారు.  మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు ఈ సినిమా కలెక్షన్లలో ఏకంగా 40.2 శాతంగ్రోత్ నమోదు కావడం ట్రేడ్ వర్గాలని సైతం ఆశ్చర్యపరుస్తోంది.  మొదటి రోజు శుక్రవారం నాడు ఇండియా వ్యాప్తంగా ఈ చిత్రం 5.35 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్లను సాధించగా, శనివారం నాటి రెండవ రోజున ఏకంగా 7.50 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను రాబట్టింది. దీనితో కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా మొత్తం ఇండియా నెట్ కలెక్షన్స్ 12.85 కోట్ల రూపాయలకు చేరుకోగా, దేశీయ గ్రాస్ కలెక్షన్స్ 14.90 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి తెలుగు రాష్ట్రాల నుంచే అత్యధికంగా వసూళ్లు వస్తున్నాయి.  Also read: Nandamuri mokshagna: నందమూరి మోక్షజ్ఞకి యాక్టింగ్‌ ఇంట్రస్ట్‌ లేదా? అసలు నిజం ఇదే! రెండవ రోజు వచ్చిన 7.50 కోట్ల నెట్ కలెక్షన్లలో కేవలం తెలుగు వెర్షన్ నుంచే 7.15 కోట్ల రూపాయలు రావడం విశేషం. మిగిలిన 35 లక్షల రూపాయలు తమిళ వెర్షన్ ద్వారా లభించాయి. శనివారం నాడు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2,023 షోలలో 51 శాతం అక్యుపెన్సీ నమోదు కావడం సమంత బాక్సాఫీస్ స్టామినాని  నిరూపిస్తోంది.  కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ (విదేశీ) మార్కెట్లలో కూడా "మా ఇంటి బంగారం" గట్టి పట్టు సాధించింది. శనివారం ఒక్క రోజే ఓవర్సీస్ లో 4.00 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు కాగా, రెండు రోజుల మొత్తంగా విదేశీ గ్రాస్ వసూళ్లు 10.60 కోట్ల రూపాయలకు చేరాయి. దీనితో ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లోనే 25.50 కోట్ల రూపాయల గ్రాస్ మార్కుని దాటి సునామీ సృష్టిస్తోంది. సమంత తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్', రాజ్ అండ్ డికె, హిమాంక్ రెడ్డి దువ్వురులతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. గుల్షన్ దేవయ్య విలనిజం, దిగంత్ మంచాలే, గౌతమి, శ్రీముఖి నటన సినిమాకు మరింత బలాన్ని చేకూర్చాయి. వీకెండ్ ముగిసే సమయానికి ఈ కలెక్షన్ల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.   
    తెలుగు సినిమా చరిత్రలో నందమూరి బ్రాండ్ కి ఉన్న పవర్ తెలిసిందే.  పెద్దాయన ఎన్టీఆర్ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ దాకా తమ హవా చాటుతూ వస్తున్నారు. తెలుగు సినిమా ఎదుగుదలకి కూడా ముఖ్య కారకాలు. దీంతో నందమూరికి చెందిన ప్రతి తరం తెలుగు సినిమాని ఏలుతూ ఉండాలని అభిమానులు, మూవీ లవర్స్ కోరుతూ వస్తున్నారు.   కానీ గత కొన్నేళ్లుగా వాళ్ళందర్నీ ఒకే ఒక ప్రశ్న వేధిస్తోంది. బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఎప్పుడు అని? సాధారణంగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల వారసులు 25 ఏళ్ల వయసు వచ్చేసరికే హీరోలుగా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తుంటారు. కానీ మోక్షజ్ఞ విషయానికి వస్తే కథ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీన ఆయన 30వ పుట్టినరోజు జరుపుకుని, ప్రస్తుతం 31వ పడిలోకి అడుగుపెట్టారు. అయినా కూడా ఇప్పటివరకు ఆయన  సినిమా సెట్స్ పైకి వెళ్లకపోవడంతో అసలు మోక్షజ్ఞకు యాక్టింగ్ పట్ల ఆసక్తి ఉందా లేదా అనే  అనుమానాలు ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ వర్గాల్లో ఒక్కసారిగా రేకెత్తాయి.  ఈ సుదీర్ఘ నిరీక్షణకు మరింత ఆజ్యం పోస్తూ గతంలో జరిగిన కొన్ని పరిణామాలు అభిమానులని  కలవరపెడుతున్నాయి. 'హనుమాన్' మూవీతో 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలనం సృష్టిoచిన  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ లాంచ్ కాబోతున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించారు. 'ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్' లో భాగంగా ఒక క్రేజీ మైథలాజికల్ ఫాంటసీ కథతో ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం కావాల్సిన సమయంలో ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ పరమైన మార్పులు లేదా క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా దాదాపు ఏడాది కాలంగా  పక్కన పడిపోయింది. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం కావాల్సిన ఈ మూవీ వాయిదా పడటంతో, అసలు ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందా లేక మోక్షజ్ఞకు సినిమాలంటేనే ఇంట్రెస్ట్ లేదా అనే రూమర్స్  వైరల్ అవుతున్నాయి. Also read: ప్రముఖ అగ్ర నిర్మాత కన్నుమూత అయితే ఈ ఆలస్యం వెనుక అసలు నిజం మోక్షజ్ఞకు ఆసక్తి లేకపోవడం కాదు, సరైన పక్కా స్క్రిప్ట్ కోసం జరుగుతున్న వెతుకులాట మాత్రమే అని సినీ విశ్లేషకులు చెప్తున్నారు. పెద్దాయన ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి ఇద్దరు లెజెండ్రీ నటుల వారసత్వాన్ని మోయడం అంటే సామాన్యమైన విషయం కాదు. దాదాపు మూడు తరాల అభిమానుల అంచనాలను అందుకోవాల్సి ఉంటుంది. అందుకే నందమూరి కుటుంబం ఎక్కడా తొందరపడకుండా అడుగులు వేస్తోంది. ఆ మధ్య నారా రోహిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మోక్షుకి ఒక మంచి లవ్ స్టోరీతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వాలని ఉందని హింట్ ఇచ్చారు. మరోవైపు బాలయ్య కూడా తన క్లాసిక్ హిట్ 'ఆదిత్య 369' కి సీక్వెల్ గా రాబోతున్న 'ఆదిత్య 999 మ్యాక్స్' ద్వారా తానే స్వయంగా మోక్షుని పరిచయం చేస్తానని హింట్ ఇచ్చారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నిన్న జూన్ 20న మోక్షజ్ఞ తిరుమల శ్రీవారిని దర్శించుకుని విఐపి విరామ సమయంలో ప్రత్యేక పూజలు చేయడం చూస్తుంటే, ఆయన సినీ ఎంట్రీ ముహూర్తం చాలా దగ్గరలోనే ఉందని మరియు త్వరలోనే ఒక సాలిడ్ అఫీషియల్ అప్డేట్ తో నందమూరి సింహం టాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతుందని స్పష్టమవుతోంది.  
  తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు రాజకీయ రంగంలోనూ తనదైన ముద్ర వేసిన ప్రముఖ సినీ నిర్మాత, తెలంగాణ ఉద్యమ నాయకుడు గొట్టిముక్కల పద్మారావు. ఆయన  ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్‌ కూకట్‌పల్లి వివేకానంద నగర్‌లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్య సమస్యలే మరణానికి కారణం. ఆయన మరణవార్త తెలియగానే టాలీవుడ్‌ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. దీంతో  సినీ ప్రముఖులు,రాజకీయ నేతలు ఆయన నివాసానికి చేరుకుని నివాళులర్పిస్తున్నారు. పద్మారావు మృతి చెందడం ఇండస్ట్రీకి తీరని లోటని పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు.  గొట్టిముక్కల పద్మారావు తెలుగు చిత్రసీమలో 'పద్మప్రియ ఆర్ట్స్' (Padma Priya Arts) అనే ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థని  స్థాపించి, వైవిధ్యమైన కథాంశాలతో సినిమాలను నిర్మించారు. సీనియర్ హీరో సుమన్‌తో ఆయన నిర్మించిన 'కంచు కవచం' అనే భారీ యాక్షన్ మూవీ అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత  కామెడీ జోనర్‌లోకి అడుగుపెట్టి నటకిరీటి రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన 'జోకర్' చిత్రంతో పాటు, నేటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే క్లాసిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'ఏప్రిల్ 1 విడుదల' వంటి ఎవర్గ్రీన్ సూపర్ హిట్ సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఘనత పద్మారావు గారిది.  సినీ రంగానికే పరిమితం కాకుండా, ఆయన ప్రజాసేవపై ఆసక్తితో రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కీలక భూమిక పోషించి తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) పార్టీలో చేరి  2014 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్‌పల్లి నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి, 56,688 ఓట్లను సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయనది ద్వితీయ స్థానం.  ప్రజా ప్రతినిధిగా, వ్యాపారవేత్తగా సమాజంలో ఎంతో మందికి సహాయం అందించి ఆదరణ పొందారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఇండస్ట్రీ వర్గాలు ప్రార్థిస్తున్నాయి. పద్మారావు గారి వయసు 77 సంవత్సరాలు   
సినీ రంగంలో హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ, పెళ్లి, బ్రేకప్ వార్తలు రావడం సర్వసాధారణం. అయితే తాజాగా కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్‌లోనూ ఒక షాకింగ్ గాసిప్ తీవ్ర కలకలం రేపుతోంది. వైవిధ్యమైన నటనతో మెప్పించే స్టార్ హీరో ధనుష్, అందాల భామ మృణాల్ ఠాకూర్ మధ్య నడుస్తోందని ప్రచారం జరిగిన ప్రేమాయణం ఇప్పుడు ముగిసిందంటూ నెట్టింట గుసగుసలు వినిపిస్తున్నాయి. కొన్ని నెలలుగా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో గట్టిగా వినిపించిన ఊహాగానాలకు ఇప్పుడు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ధనుష్, మృణాల్ తమ బంధానికి స్వస్తి చెప్పాలని డిసైడ్ అయ్యారట. ఎవరి కెరీర్‌పై వారు దృష్టి పెట్టేందుకు పరస్పర అంగీకారంతోనే ఈ క్రేజీ జంట సైలెంట్‌గా విడిపోయినట్లు ట్రెండ్ అవుతున్న వార్తల సారాంశం. అయితే అసలు వీరు ఎప్పుడు ప్రేమలో పడ్డారు, అప్పుడే విడిపోవడానికి దారితీసిన కారణాలు ఏంటనే విషయాలు మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నాయి. ఈ విడిపోవడం వెనుక ఉన్న అసలు కారణం తెలియక అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. కాగా, ఈ ప్రచారంపై అటు ధనుష్ కానీ, ఇటు మృణాల్ కానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. గతంలో మృణాల్ ఠాకూర్ నటించిన 'సన్ ఆఫ్ సర్దార్ 2' సినిమాకు సంబంధించిన ఒక ప్రత్యేక ఈవెంట్‌లో ధనుష్ సందడి చేయడంతో వీరి మధ్య ఏదో నడుస్తోందనే అనుమానాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరు తారలు పలుమార్లు కలిసి కనిపించడంతో ఆ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. ఇటీవల వీరిద్దరి పెళ్లి దుస్తుల ఏఐ ఫొటోలు కూడా సోషల్ మీడియాను షేక్ చేసిన సంగతి తెలిసిందే.
టాలీవుడ్ సీనియర్ హీరో, ప్రముఖ నిర్మాత మురళీమోహన్ సమాజం పట్ల తనకున్న బాధ్యతను మరోసారి చాటుకున్నారు. ఎప్పుడూ ఆడంబరాలకు పోకుండా అర్థవంతంగా వేడుకలు జరుపుకునే ఆయన, తాజాగా తన 61వ వివాహ వార్షికోత్సవాన్ని ఎంతో ఆదర్శనీయంగా జరుపుకున్నారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో ఉన్న ప్రముఖ "దేవనార్ బ్లైండ్ స్కూల్" వేదికగా ఈ ప్రత్యేక వేడుకలు జరిగాయి. ప్రతి ఏటా తన పుట్టినరోజుతో పాటు కుటుంబ సభ్యుల వివాహ దినోత్సవాలను ఇక్కడి అంధ విద్యార్థుల మధ్యే సెలబ్రేట్ చేసుకోవడం మురళీమోహన్‌కు ఒక అలవాటు. ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ, ఈ ఏడాది కూడా ఆయన తన సతీమణితో కలిసి చూపులేని చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేసి, వారితో కాసేపు సరదాగా సమయాన్ని గడిపారు. ఈ వేడుకలో పాఠశాల చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుక సందర్భంగా స్కూలులో ఒక ప్రత్యేక సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మురళీమోహన్‌తో పాటు భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్, ప్రముఖ గాయకుడు గంగాధర శాస్త్రి, అలాగే దేవనార్ బ్లైండ్ స్కూల్ చైర్మన్ సాయిబాబా గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పాఠశాల విద్యార్థులు ఎంతో చక్కగా భగవద్గీత శ్లోకాలను ఆలపించడం అక్కడికి వచ్చిన వారందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ.. "నేను ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెందడం చూసి సంతోషిస్తున్నాను. అన్ని అవయవాలు బాగున్న మన పిల్లలనే మనం ఒక్కోసారి సరిగ్గా చూసుకోలేము, అలాంటిది చూపులేని ఈ చిన్నారులను ఎంతో బాధ్యతగా, ప్రేమగా పెంచుతున్న సాయిబాబా గౌడ్ గారి కృషి అభినందనీయం. ఈ పిల్లలు భగవద్గీతను నేర్చుకుని పాడుతుంటే ముచ్చటేసి, ప్రత్యేకంగా గంగాధర శాస్త్రి గారిని ఇక్కడికి ఆహ్వానించాను" అని ఎమోషనల్ అయ్యారు. నటుడిగా 'జయభేరి' సంస్థ ద్వారా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన మురళీమోహన్, కేవలం వెండితెరపైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం మరియు చిన్నారులతో పెళ్లి రోజు జరుపుకున్న తీరుపై టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు మురళీమోహన్ దంపతులకు 61వ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిరుపేదలు, అంధులకు ఆయన అందిస్తున్న సేవలు ఇలాగే కొనసాగాలని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. సినీ రంగానికి దూరంగా ఉన్నప్పటికీ, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే మురళీమోహన్, రాబోయే రోజుల్లో తన జయభేరి ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
కోలీవుడ్ విలక్షణ దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరో శింబు కాంబినేషన్‌లో ఒక భారీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘#Arasan’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మోస్ట్ అవేటెడ్ క్రేజీ యాక్షన్ డ్రామాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక సెన్సేషనల్ మైండ్ బ్లోయింగ్ అప్‌డేట్ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమా కథకు సంబంధించి ఒక ఆసక్తికరమైన లీక్ వెలుగులోకి వచ్చింది. దర్శకుడు వెట్రిమారన్ తన కెరీర్ ఆరంభంలో ధనుష్‌తో తెరకెక్కించిన 'పొల్లాదవన్' షూటింగ్ ప్రారంభం కాకముందే ఈ ‘అరసన్’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నారట. అప్పట్లోనే పూర్తి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినప్పటికీ, రకరకాల కారణాల వల్ల ఇన్నాళ్లకు ఈ పవర్‌ఫుల్ సబ్జెక్ట్ పట్టాలెక్కుతుండటంతో సినిమాపై హైప్ నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం పూర్తిగా నార్త్ చెన్నై రా అండ్ రస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని సమాచారం. తన ప్రతి సినిమాలో పాత్రల కోసం ఎంతో కష్టపడే హీరో శింబు, ఈ సినిమాలో సరికొత్త మేకోవర్‌తో నటనలో మరో విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నారు. ఈ కథలోని విభిన్న టైమ్‌లైన్స్‌కు అనుగుణంగా శింబు మూడు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించబోతున్నారని, ఇందుకోసం ఆయన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. గతంలో వెట్రిమారన్, ధనుష్ కాంబోలో వచ్చిన ‘పొల్లాదవన్’, ‘వడ చెన్నై’, ‘అసురన్’ లాంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. ఇప్పుడు శింబు ఇంటెన్స్ పవర్‌ఫుల్ మేకోవర్, దానికి తోడు వెట్రిమారన్ మార్క్ రా అండ్ రస్టిక్ స్క్రీన్‌ప్లే తోడవడంతో ‘అరసన్’ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ కాంబినేషన్ గురించిన చర్చలు ఊపందుకున్నాయి. ఇక ఈ భారీ యాక్షన్ డ్రామాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఒక కీలక పాత్రలో మెరిపించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత కలైపులి ఎస్. థాను ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్స్ మరియు అధికారిక వివరాలు వెలువడనున్నాయి.
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
నేటికాలంలో మనిషి కష్టపడి డబ్బు సంపాదించేది ధనవంతుడు కావడానికే. ఎందుకంటే ధనవంతుడిగా ఉంటే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి.  కానీ చాలామంది ఆర్థికంగా ఎదగలేరు. ఈ కారణంగా మధ్యతరగతి, దిగువ తరగతి వారిగానే ఉండిపోతారు తప్ప, ధనవంతుల లిస్ట్ లోకి వెళ్లలేరు.  అయితే దీనంతటికి కారణం ఆ వ్యక్తులే అంటున్నారు ఆర్థిక నిపుణులు,  లైఫ్ స్టైల్ విశ్లేషకులు.  ఇంతకీ మనిషి చేసే తప్పులు మనిషిని ధనవంతుడు కాకుండా ఎలా  ఆపుతాయి.  ధనవంతుడు కావాలంటే ఏం చేయాలి? తెలుసుకుంటే.. మనిషి చేసే తప్పు.. శ్రమ మనిషికి నిజమైన సంపద, కానీ మనిషి చాలా సార్లు శ్రమిస్తాడు కానీ అతనికి సొంతంగా ఎదగడం తెలియదు.  గంధం తీయాలంటే గందపు చెక్కను అరగదీయాలి,  అలాగే ఒక మంచి పూల హారం కావాలంటే పూలను దారంలోకి జొప్పించి అల్లాలి.  ఇవన్నీ వ్యక్తిలో ఓపిక,  శ్రమకు చక్కని నిదర్శనాలు. అలాంటి శ్రమ, ఓపిక ఉన్నప్పుడే.. దేవుడి ముందు నిలబడి దేవుడిని తృప్తిగా ప్రార్థిస్తారు. ఆ భగవంతుడి అనుగ్రహం కూడా పొందగలుగుతారు. అదే విధంగానే.. మనిషి కష్టపడి పనిచేస్తేనే తనకు తాను ఫలితాన్ని పొందగలుగుతాడు. అంతేకానీ కష్టపడకుండా ఇతరుల మీద ఆధారపడి చివరిలో ఫలితం రావాలని అనుకుంటే అది ఆశాజనకంగా ఉండదు. సద్గుణాలు.. మనిషిలో సద్గుణాలు ఉంటే అతను ధనవంతుడు కావడానికి మార్గాలు పదే పదే కలిసి వస్తూనే ఉంటాయి.  పేదరికంలో ఉన్న వ్యక్తికి ఓర్పు ఉంటే గొప్ప అవకాశాలు చూపిస్తుంది.  మాసిపోయిన బట్టలు మంచి నీటితో ఉతికితేనే అవి తెల్లగా మెరుస్తాయి. అలాగే వ్యక్తి మొదట సద్గుణాలు అలవర్చుకున్నప్పుడు అతను  అతను ఆకర్షిస్తాడు.  అతని వ్యక్తిత్వంలో మంచి, చెడు బయటకు ప్రకాశిస్తాయి.  ధనవంతులు కావడం అంటే చెడు గుణాలు కలిగి ఉండటమా లేదా అనేది కాదని కొందరు అనుకుంటారు. కానీ నిజం ఏమిటంటే.. చెడు దారిలో కలిగే ధనం ఎప్పటికీ మనిషిని ఉన్నతంగా ఉంచదు. నిజమైన ధనవంతుడు.. పేదరికంలో ఉన్న వ్యక్తి అసలు పేదవాడిగా  పరిగణించకూడదని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఎందుకంటే నిజమైన పేదవాడు డబ్బు లేని వాడు.. జ్ఞానం,  వ్యక్తిత్వం లేనివాడే నిజమైన పేదవాడు అంటాడు ఆచార్య చాణక్యుడు. జ్ఞానం లేని వ్యక్తికి ఎంత సంపద ఉన్నా అతను వ్యర్థ్యం అంటాడు. అవకాశాలు.. మనిషి జీవితంలో అవకాశాలు రావడం లేదని వాపోతుంటాడు. కానీ నిజానికి అవకాశాలను సృష్టించుకునే వాడే ఆర్థికంగా ఎదగగలడని అంటారు. ఎడారిలో అయినా ఇసుకను లోతుగా తవ్వితేనే నీటి చెలమ లభించే అవకాశం ఉంటుంది. అలాగే అవకాశాలే లేవు అనుకున్నప్పుడు వాటిని సృష్టించుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడే ఫలితం దక్కుతుంది. అపాత్ర దానం.. దానం చేయడం చాలా గొప్ప గుణం. కానీ దానం చేస్తే పుణ్యం వస్తుందనే కారణంతో చేతిలో ఉన్నది అనవసరమైన వ్యక్తులకు దానం చేయడం పేదరికాన్ని కొనితెచ్చుకున్నట్టే. దానం చేయడం ఎంత మంచి కార్యమో.. అర్హత లేని వారికి దానం చేయడం వల్ల ఎలాంటి పుణ్యం లభించకపోగా, ఆర్థికంగా దిగజారిపోతారు.   పొదుపు.. చాలామందికి పొదుపు చేయడం అంటే అవసరాలు మాని మరీ దాచిపెట్టడం అనుకుంటారు. కానీ అవసరాలు మానుకుని దాచిపెట్టే డబ్బే పేదరికానికి కారణం అవుతుంది.                                   *రూపశ్రీ.
పిల్లలు మొబైల్ ఫోన్, ట్యాబ్ లేదా కంప్యూటర్ ఎక్కువగా వాడితే కళ్ళు దెబ్బతింటాయనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే నిజంగా కళ్ళకు హాని కలిగించేది స్క్రీన్ కాదు, దాన్ని ఉపయోగించే విధానమని ప్రముఖ నేత్ర వైద్య నిపుణుడు డా. కాసు ప్రసాద్ రెడ్డి వివరిస్తున్నారు. ఈ వీడియోలో పిల్లల కంటి ఆరోగ్యాన్ని కాపాడేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, కంటి అలసటను తగ్గించే సులభమైన ఐ ఎక్సర్‌సైజులు, తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను వివరించారు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఆహారంలో రకరకాల కూరగాయలు ఉండేలా చూసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అని వైద్యులు చెబుతారు.  ముఖ్యంగా ఆహారంలో అన్నం, చపాతీకి సమానంగా లేక అంతకంటే ఎక్కువ మొత్తంలో కూరగాయలు ఉండాలని ఆహార నిపుణులు కూడా చెబుతారు. అయితే ఫాస్ట్ ఫుడ్, ఇన్స్టంట్ ఫుడ్ వినియోగం పెరగడం వల్ల నేటికాలంలో కూరగాయల వినియోగం కూడా తగ్గింది.   కూరగాయలు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, పీచుపదార్థం , యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి, ఇవి అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా కూరగాయలను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి బలపడుతుంది , బరువును అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. అయితే 5 రకాల కూరగాయలు ఉన్నాయి.  ఈ కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.  ఈ విషయం చాలా మందికి తెలియదు కూడా.  ఆ కూరగాయలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర.. పాలకూరను పోషకాల నిధిగా పరిగణిస్తారు. దీనిలో ఐరన్ , కాల్షియం, పీచుపదార్థం, విటమిన్లు ఎ, సి , కె సమృద్ధిగా ఉంటాయి. పాలకూర తినడం వల్ల శరీరంలోని రక్తహీనతను తగ్గించి, ఎముకలను బలపరిచి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. బ్రోకలి.. బ్రోకలీలో విటమిన్ సి, ఫైబర్ , యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలోనూ సహాయపడుతుంది.  బ్రోకలీని క్రమం తప్పకుండా తినడం వల్ల శరీరానికి అనేక అవసరమైన పోషకాలు లభిస్తాయి. క్యారెట్లు.. క్యారెట్లలో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది, ఇది శరీరంలో విటమిన్ A గా మార్చబడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి , రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. క్యారెట్లను సలాడ్‌గా, జ్యూస్‌గా లేదా కూరగాయగా తినవచ్చు. క్యాప్సికమ్.. క్యాప్సికమ్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు , అనేక ముఖ్యమైన పోషకాలు లభిస్తాయి. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి , ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి శరీరాన్ని రక్షించడానికి సహాయపడుతుంది. సొరకాయ.. సొరకాయలో నీరు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరాన్ని తేమగా ఉంచి, జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడతాయి. వేసవి కాలంలో సొరకాయను తినడం వల్ల శరీరం చల్లబడటమే కాకుండా బరువు అదుపులో ఉంటుందని కూడా చెబుతారు.                              *రూపశ్రీ