Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...సవాళ్లతో హోదాలు రావు అంబటీ.!
posted on: Aug 14, 2026 4:24PM

పార్లమెంటులోనైనా, అసెంబ్లీలోనైనా ప్రతిపక్ష పార్టీ హోదా, ప్రతిపక్ష నేత హోదా అనేది అడుక్కుంటేనో, దబాయిస్తేనొ రాదు. ఆ హోదా కావాలంటే సభలో మొత్తం స్థానాలలో కనీసం పది శాతం స్థానాలు ఉండాలి. అంటే జనం మీకు ఆ అర్హత ఉందని ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో పార్టీని గెలిపించాలి.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ పార్టీకి అదేనండీ వైసీపీకి జనం కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా అర్హత లేదని 2024 ఎన్నికలలో విస్పష్ట తీర్పు ఇచ్చేశారు. అయినా నిస్సిగ్గుగా జగన్ కోర్టును విపక్ష హోదా కోసం ఆశ్రయించారు. నింబంధనల ప్రకారం విపక్ష నేతగా తనకు లేని, రాని హోదాను కల్పించాలంటూ కోర్టును ఆశ్రయించారు. అది పక్కన పెడితే.. విపక్ష హోదా ఇచ్చే వరకూ తాను కానీ, తన పార్టీ సభ్యులు కానీ అసెంబ్లీలో అడుగుపెట్టబోమంటూ శపథం చేశారు. ఇది చెరువుమీద కోపం వచ్చి ఏదో చేసినట్లుగా ఉందంటూ నెటిజనులు ఎద్దేవా చేస్తున్నారు. అది వేరే సంగతి. రాని హోదా కోసం అసెంబ్లీకి గైర్హాజరైతే నష్టం వైసీపీకే . సభకు గైర్హాజర్ ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఉన్న అవకాశాన్ని ఆ పార్టీ కోల్పోతోంది.
ఇక పోతే ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి ఇంకో అడుగు ముందుకు వేసి దమ్ముంటే జగన్ కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వండి అంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఈ సవాల్ విసిరి ఆయన మరో సారి రాజకీయ జోకర్ గా నవ్వుల పాలయ్యారు. ముందే చెప్పినట్లు ప్రతిపక్ష నేత హోదా అయినా, ప్రతిపక్ష పార్టీ హోదా అయినా అడుక్కుంటేనో, దబాయిస్తేనే రాదు. ఆ హోదా ప్రజలు ఇవ్వాలి. కానీ వైసీపీని ప్రజలు గత ఎన్నికలలో పూర్తిగా తిరస్కరించారు. విపక్ష స్థాయి కూడా లేదని పక్కన కూర్చోపెట్టారు. అలా కాకుండా సవాళ్లు విసిరో, బతిమలాడుకునో ప్రతిపక్ష హోదాయో మరోటో దక్కించుకునే అవకాశమే ఉంటే.. రాహుల్ గాంధీ దమ్ముంటే నాకు ప్రధాని హోదా ఇవ్వండి అంటూ మోడీకి సవాల్ విసిరి ఆ పదవిని దక్కించేసుకోవచ్చు కదా?
అంబటికి అర్ధంకానిదీ, అర్ధం చేసుకోవలసిందీ ఏమిటంటే.. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా అన్నది నిర్ణయించేది ప్రజలు, వారి తీర్పును కాదని ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. అలాగని ప్రతిపక్షంలోనూ కూర్చోలేదు. ప్రజలు ఏం నిర్ణయించాలో అది శిరసావహించడమే రాజకీయపార్టీలైనా, నాయకులైనా చేయాలి. పదవులు, హోదాలూ సవాళ్లతోనో, దేబిరింపులతోనో రావు. సవాళ్లు చేసినంత మాత్రాన, బతిమలాడుకున్నంత మాత్రానా రాజ్యాంగ నిబంధనలు మారవు.
ప్రజాస్వామ్యంలో ఏ పార్టీకి ఏ హోదా ఇవ్వాలనేది ఎదుటి ప్రత్యర్థి ప్రభుత్వం నిర్ణయించదు.. ఓట్లేసే ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజా తీర్పు ఆధారంగానే చట్టసభల్లో స్థానాలు, పదవులు నిర్ణయమవుతాయి తప్ప, వీధి పోరాటాల సవాళ్లతో రాజ్యాంగ నిబంధనలు మారవు.
Ambati Rambabu, Opposition Leader Status, hallange, YS Jagan, YCP, Andhra Pradesh Assembly, TeluguOne


.webp)


