LATEST NEWS
రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి కొత్తపార్టీని అధికారికంగా ప్రకటించారు. తాను ఏర్పాటు చేసిన పార్టీ పెరును ఆయన ప్రకటించారు. విజయవాడ ఏ కన్నెన్షన్ వేదికగా బుధవారం (నవంబర్ 11) సరిగ్గా 11 గంటల 11నిముషాలకు ఆయన తన కొత్త పార్టీ పేరును ప్రకటించారు. తన  కొత్త పార్టీ పేరు పీఆర్పీ (పరివర్తన రాజనీతి పార్టీ)గా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. దీంతో ఏపీ రాజకీయాలలో మరో కొత్తపార్టీ ఆవిర్భవించింది.   గతంలో వైపీపీలో కీలక నేతగా చక్రం తిప్పిన విజయసాయి రెడ్డి, ఆ తరువాత ఆ పార్టీకీ, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన  రాజ్యసభ సభ్యత్వానికి  రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా సందర్భంగా ఇక రాజకీయాలకు దూరం, వ్యవసాయమే తన వ్యాపకం అని ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయం మార్చుకుని, యూటర్న తీసుకుని మళ్లీ రాజకీయ ప్రవేశం చేశారు.   తన కొత్త రాజకీయ పార్టీ పేరు ప్రకటించిన ఆయన ఈ  సందర్భంగా పార్టీ జెండా, ఎజెండాను  ఆవిష్కరించారు. రాష్ట్రంలో కుల, మత రాజకీయాలకు స్వస్తి పలకడంతో పాటు, రెండు కుటుంబాల ఆధిపత్య రాజకీయాలకు ముగింపు పలకడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు.  దేశభక్తి, ప్రజా సంక్షేమం,  ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా పీఆర్పీ  పనిచేస్తుందని విజయసాయిరెడ్డి చెప్పారు. ముఖ్యంగా యువతను భావి నాయకులుగా తీర్చిదిద్దే ఫ్యాక్టరీగా తమ పార్టీ పని చేస్తుందన్న విజయసాయిరెడ్డి,  రాష్ట్రంలో కరువు కాటకాలు, కరెంటు కోతలు లేని పరిస్థితులను సృష్టించడం, ప్రతి ఎకరానికి సాగునీరు అందించడం తమ ధ్యేయమన్నారు. ఇది కూడా చదవండి:  వైసీపీలో నన్ను బతకనివ్వలేదు.. 70కి పైగా అవమానాలు భరించా: విజయసాయి రెడ్డి ఇక ఎన్నికల హామీల విషయంలోనూ ఆయన కొన్ని కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందించడం, చదువుల భారాన్ని తగ్గించి వంద శాతం యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం, పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు,  విజయసాయిరెడ్డి నూతన పార్టీ ప్రకటన రాష్ట్ర రాజకీయాలలో ఏ మేరకు ప్రభావం చూపుతుందన్న చర్చ మొదలైంది.  ఇప్పటికే పలువురు అసంతృప్త నేతలు ఆయన బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు చెబుతున్నారు.  రానున్న రోజుల్లో ఈ కొత్త పార్టీ రాష్ట్ర రాజకీయాలపై చూపే ప్రభావంపై పొలిటికల్ సర్కిల్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేచింది.  మీకు నచ్చవచ్చు: విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే.!​ తెలుగుదేశం, వైసీపీ దొందూదొందే.. రాష్ట్రానికి చేసిందేమీ లేదు.. విజయసాయిరెడ్డి.! [Vijayasai Reddy New Party PRP, Parivarthana Rajaneethi Party, Andhra Pradesh Politics, Vijayawada Convention Center, Gen Z Leaders, Telugu One]
తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ తనదైన ముద్ర వేస్తూ తొలి ప్రయత్నంలోనే తన టీవీకే పార్టీని గెలిపించుకుని, తొలి ప్రయత్నంలోనే  ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి సుమారు 35 శాతానికి పైగా ఓటు బ్యాంకును సాధించారు. విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీవీకే పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఇటీవల కాలంలో టీవీకే ప్రభుత్వానికి చెందిన కొందరు నేతల వివాదాస్పద ప్రవర్తన పార్టీ ప్రతిష్ఠను మసకబారుస్తోంది. గతంలో ఒక మంత్రి డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో వివాదంలో చిక్కుకోగా, తాజాగా తమిళనాడు అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్,  సిట్టింగ్ ఎమ్మెల్యే రవిశంకర్ దురుసు ప్రవర్తన వివాదంగా మారింది. తిరుచిరాపల్లి జిల్లాలో తమ ప్రాంతంలోని తాగునీటి ఎద్దడి, చెత్తాచెదారం పేరుకుపోవడం వంటి సమస్యలపై ప్రశ్నించడానికి వెళ్లిన కార్తీక్ కుమార్ అనే  వ్యక్తిపై డిప్యూటీ స్పీకర్ రవిశంకర్ భౌతిక దాడికి దిగారు. ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధి తన వద్దకు వచ్చిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోవడం  దుమారానికి దారితీసింది. ఇది కూడా చదవండి: చంద్రబాబుతో భేటీ: విజయ్ విక్టరీ సింబల్.. దక్షిణాది పొలిటికల్ సినేరియో మార్పునకు సంకేతమా.? ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో టీవీకే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ప్రజా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తమిళనాడులో హింసాత్మక మరియు ఆధిపత్య రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించినప్పటికీ, క్షేత్రస్థాయిలో కొందరు ఎమ్మెల్యేల తీరు ఆయన ఆశయాలకు గండికొడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం కొద్ది నెలలు మాత్రమే అయినప్పటికీ, ఇలాంటి ఘటనలు పదే పదే పునరావృతం కావడం పార్టీకి నష్టం చేకూరుస్తుందని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో మార్పు తీసుకురావాలనే సంకల్పంతో ఉన్న ముఖ్యమంత్రి విజయ్, తప్పు చేసే ప్రజాప్రతినిధులపై కఠిన చర్యలు తీసుకుని గాడిన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. ముఖ్యమంత్రిగా విజయ్ పని తీరు, నిర్ణయాలు తీసుకోవడంలో చూపుతున్న వేగం, నిరాడంబరత ప్రజలను ఆకట్టుకుంటున్నప్పటికీ, టీవీకే ఎమ్మెల్యేల తీరు, వారిపై వెల్లువెత్తుతున్న విమర్శలు పార్టీకే కాదు, వ్యక్తిగతంగా విజయ్ కూడా నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. గీత దాటిన ఎమ్మెల్యేలపై విజయ్ కఠిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు.  మీకు నచ్చవచ్చు:  తమిళనాడు సీఎం విజయ్ పై ఎన్నికల కేసు: ఈ నెల 14న తీర్పు.! విడాకుల కేసు: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన తమిళనాడు సీఎం విజయ్ వైఫ్.! [TVK MLAS Crossing Line, Tamilnadu Government, CM Vijay, Deputy Speaker Ravi Shankar,  Controversy, Telugu One]
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లా పరిషత్ చైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందన్న అంశం ఇప్పుడు కూటమిలో ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ, బీజేపీ నేతలు ఈ పదవిని ఆశిస్తుండటంతో కూటమి పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కడప, అన్నమయ్య జిల్లాలకు చెందిన పలువురు పదవుల ఆశావహులు విజయవాడకు చేరుకున్నట్లు సమాచారం. కడప జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవులతో పాటు అన్నమయ్య జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలపై పార్టీ పెద్దలతో చర్చించేందుకు వారు వచ్చినట్లు తెలుస్తోంది. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, సీనియర్ నాయకుడు, వీరపునాయునిపల్లి జడ్పీటీసీ సభ్యుడు పుత్తా నరసింహారెడ్డి ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కూటమిలో భాగస్వామి అయిన బీజేపీ నుంచి జమ్మలమడుగు నేత, జడ్పీటీసీ సభ్యుడు సి. రాజేష్ రెడ్డి కూడా ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. దీంతో కడప జడ్పీ పీఠం టీడీపీకి దక్కుతుందా? బీజేపీకి కేటాయిస్తారా? అన్న చర్చ మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా పరిషత్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల పంపకాలు కూటమి పార్టీలకు కీలకంగా మారాయి. మొత్తం 28 జిల్లా పరిషత్‌లకు సంబంధించిన పదవుల కేటాయింపులో తమకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని భాగస్వామ్య పార్టీలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి నాయకత్వం చేసే కేటాయింపులపైనే కడప జడ్పీ చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందన్నది ఆధారపడి ఉంది. మరోవైపు జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆయన కుటుంబానికి చెందిన రాజేష్ రెడ్డిలకు మంత్రి పదవి లేదా జిల్లా పరిషత్ చైర్మన్ పదవుల్లో ఏదో ఒకటి దక్కే అవకాశం ఉందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే మంత్రి పదవి విషయానికి వస్తే రాయలసీమ ప్రాంతం నుంచి ఇప్పటికే సత్యకుమార్ యాదవ్ వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మరో మంత్రి పదవి సాధ్యమవుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ సొంత జిల్లాలో కూటమి బలాన్ని మరింత పెంచుకోవాలనే వ్యూహంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో సీనియర్ నాయకుడు పుత్తా నరసింహారెడ్డికి ప్రాధాన్యం ఇస్తారా? లేక బీజేపీకి చెందిన యువ నాయకుడు రాజేష్ రెడ్డికి అవకాశం కల్పిస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది. కూటమి పెద్దల నిర్ణయం కోసం ఆశావహులు ఎదురుచూస్తుండటంతో కడప జిల్లా రాజకీయాల్లో జడ్పీ పీఠం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది.       [ Kadapa ZP Chairman, Putta Narasimha Reddy, C Rajesh Reddy, Adinarayana Reddy, TDP BJP Alliance, CM Chandrababu, Naralokesh, TDP, Telugu One, Telugu News ]
నెల్లూరు జిల్లాలో చోటుచేసుకున్న ఒక అమానుష ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కేవలం ఐదు వందల రూపాయల ఆర్థిక లావాదేవీల నిమిత్తం చెలరేగిన చిన్న వివాదం ఒక ప్రాణాపాయ దాడికి దారితీసింది. అప్పు చెల్లించలేదన్న కోపంతో ఓ మహిళ విచక్షణ కోల్పోయి ఏకంగా సలసలకాగే నూనెను బాధితుడిపై పోయడంతో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు  స్థానికుల నుంచి అందిన సమాచారం ప్రకారం, నెల్లూరు రూరల్ పరిధిలోని మాదరాజు గూడూరు ప్రాంతానికి చెందిన శీనయ్య స్థానికంగా ఉంటున్నారు. ఆయన అదే ప్రాంతంలో నివసించే హసీనా అనే మహిళ వద్ద గతంలో వ్యక్తిగత అవసరాల నిమిత్తం రూ. 500 లు అప్పుగా తీసుకున్నారు. కొన్ని రోజుల తరువాత హసీనా తాను ఇచ్చిన ఐదు వందల రూపాయలను తిరిగి చెల్లించాలని శీనయ్యను కోరారు. దీనికి స్పందించిన శీనయ్య, తాను ఇప్పటికే ఆమె ఇంటి వద్ద పనులు చేసి ఆ అప్పును తీర్చేశానని బదులిచ్చారు. తాను చేసిన శ్రమకు అప్పు సరిపోయిందని ఆయన వాదించారు. ఈ విషయమై ఇద్దరి మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. క్రమంగా ఈ చిన్న గొడవ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఇరువర్గాల మధ్య కోపతాపాలు పెరిగిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటిపోయింది. ఆ ప్రాంతంలో అప్పట్లో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తున్న హసీనా ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మాటల మాట పెరగడంతో తీవ్ర ఆవేశానికి గురైన ఆమె, దుకాణంలో కాగుతున్న వేడివేడి నూనెను తీసుకుని శీనయ్యపైకి పోసింది. ఈ అకస్మాత్ దాడితో శీనయ్య శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయి. వేడి నూనె పడటంతో ఆయన నొప్పితో కేకలు వేశారు. ఇది గమనించిన చుట్టుపక్కల స్థానికులు వెంటనే అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు. బాధితుడి పరిస్థితి దయనీయంగా మారడంతో స్థానికులే తక్షణ స్పందనగా ఆయనను చికిత్స నిమిత్తం నెల్లూరులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యులు ఆయనకు ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఆసుపత్రికి వెళ్లి బాధితుడి పరిస్థితిని పరిశీలించి వివరాలు సేకరించారు. హసీనాపై తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. చిన్నపాటి ఆర్థిక విషయాలకు కూడా మనుషులు ఎంతటి దారుణాలకు ఒడిగడుతున్నారనేదానికి ఈ ఘటనే నిదర్శనమని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇలాంటి అమానుష చర్యలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ఇది కూడా చదవండి: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల.!   [ Nellore crime news, Woman attacked with hot oil, Nellore Rural district news, AP local crime updates, TeluguOne news latest updates, CM Chandrababu, Naralokesh, Telugu One, Telugu News]  
తెలంగాణ పోలీసు వ్యవస్థలోకి మరో కొత్త తరం అడుగుపెట్టింది. ఎన్నో అవరోధాలు, వివాదాలు, న్యాయపోరాటాలను అధిగమించి డీఎస్పీలుగా నియమితులైన 112 మంది అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ సంస్థలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. డీఎస్పీల నియామకాల ప్రక్రియ, టీజీపీఎస్సీ ప్రక్షాళన, పోలీసు అధికారుల బాధ్యతలు, మారుతున్న నేరాల స్వభావంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 30 ఏళ్ల తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పోలీసు అధికారుల పాత్ర అత్యంత కీలకమని స్పష్టం చేశారు. 13 ఏళ్ల నిరీక్షణకు తెర.. టీజీపీఎస్సీ ప్రక్షాళన.! తెలంగాణలో గ్రూప్-1 నియామకాలు 2011 తర్వాత దాదాపు 13 ఏళ్లపాటు జరగలేదని సీఎం గుర్తుచేశారు. కొన్ని నెలలు ఆలస్యమైనా జీవితంలో విలువైన సంవత్సరాలు కోల్పోయామనే బాధ అభ్యర్థుల్లో ఉంటుందని అన్నారు. గతంలో టీజీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చినా ప్రశ్నాపత్రాల లీకేజీలు, ఇతర వివాదాలతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే టీజీపీఎస్సీ ప్రక్షాళనకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. గతంలో టీజీపీఎస్సీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. కీలకమైన నియామక వ్యవస్థలో అనుభవం, అర్హత, అవగాహన ఉన్నవారిని నియమించాల్సి ఉండగా.. గతంలో అనుచిత నియామకాలు జరిగాయని వ్యాఖ్యానించారు. యూపీఎస్సీ విధానాలను అధ్యయనం చేసి, అదే తరహాలో టీజీపీఎస్సీని బలోపేతం చేశామని తెలిపారు. స్వయంగా యూపీఎస్సీకి వెళ్లి అక్కడి విధానాలను పరిశీలించినట్లు చెప్పారు. టీజీపీఎస్సీ తొలి ఛైర్మన్‌గా రిటైర్డ్ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించామని, ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి వెంకటేశంను ఛైర్మన్‌గా నియమించినట్లు వివరించారు. 112 మంది డీఎస్పీల నియామకం.. పారదర్శకతే ప్రామాణికం.! సంక్లిష్టమైన పరిస్థితుల్లో డీఎస్పీల నియామక ప్రక్రియను పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నోటిఫికేషన్ నుంచి నియామకాల వరకు ఈ ప్రభుత్వమే ప్రక్రియను పూర్తి చేసిందన్నారు. 563 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తే 562 మంది ఉద్యోగాల్లో చేరారని, 112 మంది డీఎస్పీల నియామకం కూడా ఎంతో కీలకమైన పరిణామమని పేర్కొన్నారు. ఈ నియామకాలపై కొందరు కావాలనే అవినీతి ఆరోపణలు చేశారని, కోట్ల రూపాయలు చేతులు మారాయంటూ ప్రచారం చేశారని విమర్శించారు. అయితే ప్రభుత్వం పూర్తి పారదర్శకతతో నియామకాలు చేపట్టిందని స్పష్టం చేశారు. ఉపాధి హామీ పథకంలో పనిచేసే వారి పిల్లలు కూడా ఈ నియామకాల్లో ఎంపికయ్యారంటే ప్రక్రియలో పారదర్శకత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. డీఎస్పీల నియామకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడిందని, నిష్ణాతులైన న్యాయవాదులతో వాదనలు వినిపించి నియామకాలను పూర్తి చేయగలిగామని తెలిపారు. మీ చేతుల్లోనే తెలంగాణ భవిష్యత్తు.! డీఎస్పీలుగా ఎంపికైన అధికారులు తమ గతాన్ని, నేపథ్యాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దని సీఎం సూచించారు. నాలెడ్జ్, చిత్తశుద్ధి, అంకితభావమే వారిని ఈ స్థాయికి తీసుకొచ్చాయని అన్నారు. ఏ లక్ష్యంతో పోలీసు శాఖలో చేరారో ఆ ఆశయాన్ని మర్చిపోవద్దని హితవు పలికారు. ఉద్యోగంలో చేరడం జీవితంలో మొదటి అధ్యాయమైతే.. ఇకపై ప్రారంభమయ్యేది రెండో అధ్యాయమని పేర్కొన్నారు. వచ్చే 30 ఏళ్లలో తెలంగాణ భవిష్యత్తు ఏ దిశగా పయనించాలనేది మీ చేతుల్లోనే ఉందని డీఎస్పీలకు స్పష్టం చేశారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు కలిగిన కీలక హోదాలో ఉన్నారని, వారి నిర్ణయాలు, పనితీరు ప్రభుత్వ ప్రతిష్ఠను ప్రభావితం చేస్తాయని అన్నారు. నిటారుగా నిలబడి నిజాయితీగా విధులు నిర్వహిస్తే పోలీసు వ్యవస్థపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుందని చెప్పారు. హోదాను దుర్వినియోగం చేయొద్దు.. బాధితులతో ప్రేమగా మాట్లాడండి.! ప్రజలకు ఏ సమస్య వచ్చినా మొదట గుర్తుకు వచ్చేది పోలీసు వ్యవస్థేనని సీఎం అన్నారు. తల్లిదండ్రుల కంటే ముందుగా పోలీసులనే ఆశ్రయించే పరిస్థితులు ఉంటాయని గుర్తుచేశారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ శాంతిభద్రతలను కాపాడుతున్న పోలీసు శాఖకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉందని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత కొత్త అధికారులపై ఉందన్నారు. తమ హోదాను ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఉపయోగించుకోవాలని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయవద్దని సూచించారు. సమస్యను పరిష్కరించాలంటే ముందుగా దాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలని చెప్పారు. బాధితులు పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు వారిని కూర్చోబెట్టి, ఓపికగా, ప్రేమపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. సమస్యను శ్రద్ధగా వింటే పరిష్కారం సులభమవుతుందని పేర్కొన్నారు. సమస్యల పరిష్కారంలో సమయం, వనరులు, సాంకేతిక పరిజ్ఞానం కీలకమని వివరించారు. సైబర్ క్రైమ్, డ్రగ్స్‌పై ప్రత్యేక దృష్టి.! ప్రస్తుతం నేరాల స్వభావం పూర్తిగా మారిపోయిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒకప్పుడు హత్యలు, అత్యాచారాలు, ఆహార కొరత వంటి సమస్యలు ప్రధానంగా ఉండేవని, ఆర్థిక సరళీకరణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా మారుతున్న నేరాల ప్రభావం మన దేశంపైనా పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్ నేరాలు తీవ్ర సవాలుగా మారాయని చెప్పారు. బాధితుడిని ప్రత్యక్షంగా కలవకుండానే, కనీసం చూడకుండానే అతడి సొమ్మును దోచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ సమస్యపై కూడా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్ వంటి రాష్ట్రాలు సైతం మాదకద్రవ్యాల సమస్యను ఎదుర్కొంటున్నాయని ప్రస్తావించారు. తెలంగాణలో డ్రగ్స్ నియంత్రణ కోసం ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి కఠినంగా వ్యవహరిస్తున్నామని వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియంత్రణ, డ్రగ్స్ నివారణ, సైబర్ క్రైమ్ వంటి విభాగాల్లో ప్రత్యేక వ్యవస్థలను తీసుకొచ్చామని వివరించారు. అవసరమైతే విదేశాలకు పంపిస్తాం.. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టండి.! మారుతున్న నేరాల స్వభావం, ఆధునిక పోలీసింగ్ విధానాలపై కొత్త డీఎస్పీలకు ప్రత్యేక శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. అవసరమైతే అధ్యయనం కోసం విదేశాలకు కూడా పంపిస్తామని చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను విద్యా ప్రమాణాల అధ్యయనం కోసం విదేశాలకు పంపిస్తున్నామని, పోలీసు అధికారులకూ అలాంటి అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. చివరగా డీఎస్పీలు తమ శారీరక దృఢత్వంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. వృత్తిపరమైన క్రమశిక్షణ, వ్యక్తిగత ఆరోగ్యం, మానసిక స్థైర్యం పోలీసు అధికారులకు ఎంతో అవసరమని చెప్పారు. మొత్తంగా కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న డీఎస్పీలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, నిజాయితీతో పనిచేసి తెలంగాణ పోలీసు వ్యవస్థ ప్రతిష్ఠను మరింత పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: రాజీవ్‌ గాంధీకు నో.. రాహుల్‌కు ఓకేనా? సోనియా ఆత్మకథలో ఆసక్తికర విషయాలు.!        [ New DSP Appointments MCR HRD Institute, CM Revanth Reddy, Telangana Police, TGPSC, DSP Appointments, MCR HRD Institute, Cyber Crime, Eagle Force, Telangana Government, DGP C.V. Anand, Telugu One, Telugu News ]  
ALSO ON TELUGUONE N E W S
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘జైలర్ 2’ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోలీవుడ్‌లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. రూ.800 కోట్లకు పైగా గ్రాస్ తో ఆల్ టైం రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదల విషయంలో మాత్రం అభిమానులకు నిరాశ ఎదురయ్యేలా ఉంది. ‘జైలర్ 2’ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 12 నుంచి ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్‌కు రానుంది. అయితే థియేటర్లలో విడుదలైనప్పుడు నిడివి విషయంలో కొన్ని సన్నివేశాలను కట్ చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఓటీటీలో అయినా ఆ తొలగించిన సన్నివేశాలను జోడిస్తారని అభిమానులు ఆశించారు. ముఖ్యంగా సినిమాలో మిస్ అయిన కీలక ఫుటేజ్‌ను ఓటీటీ వెర్షన్‌లో చూడొచ్చని భావించారు. కానీ ఇప్పుడు బయటకు వస్తున్న సమాచారం అభిమానులకు షాక్ ఇచ్చేలా ఉంది. థియేటర్లలో ‘జైలర్ 2’ రన్‌టైమ్ 165 నిమిషాలుగా ఉండగా.. ఓటీటీ వెర్షన్ నిడివి 163 నిమిషాలుగా ఉన్నట్లు తెలుస్తోంది. అంటే థియేటర్లలో చూసిన దానికంటే ఓటీటీలో మరో రెండు నిమిషాలు తక్కువగా ఉండనుంది. అదనపు సన్నివేశాలు వస్తాయని ఎదురుచూసిన అభిమానులకు.. ఉన్న నిడివిలోనూ రెండు నిమిషాలు తగ్గించడం నిరాశ కలిగించే విషయమే. అయితే ఈ రెండు నిమిషాలు ఏ సన్నివేశాలకు సంబంధించినవి? ఓటీటీ వెర్షన్‌లో ఎలాంటి మార్పులు చేశారు? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇది కూడా చదవండి: 30 ఏళ్ల ‘భామనే సత్యభామనే’.. కమల్ హాసన్ మేకప్ వెనుక అసలు కథ తెలుసా.? రజినీకాంత్, నెల్సన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’కు సీక్వెల్ కావడంతో ‘జైలర్ 2’పై మొదటి నుంచీ భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం, రజినీ స్టైల్, యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సన్ పిక్చర్స్ ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మించింది. థియేటర్లలో మిస్ అయిన సీన్లను ఓటీటీలో చూడొచ్చని ఆశించిన అభిమానులకు ఇప్పుడు రన్‌టైమ్ సమాచారం నిరాశ కలిగిస్తోంది. మరి నవంబర్ 12న స్ట్రీమింగ్ మొదలైన తర్వాత ఈ మార్పులపై ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. మీకు నచ్చవచ్చు:  రామ్ చరణ్ ‘RC17’లో రిషికాంత్?.. పూజకు వెళ్లిన అసలు కారణం చెప్పేశాడు.! హారిక హాసినితో త్రివిక్రమ్‌ బంధం తెగిపోనుందా?.. గాడ్ ఆఫ్ వార్ పరిస్థితి ఏంటి.?       [Jailer 2 OTT Release, Jailer 2 OTT Runtime, Jailer 2 OTT Update, Rajinikanth Jailer 2, Jailer 2 Movie, Amazon Prime Video, Rajinikanth, Nelson Dilipkumar, Anirudh Ravichander]  
  మామూలుగానే కాలం పరిగెడుతుంది. నెలలు రోజులా అయిపోతున్నాయి. మరి సినీ ప్రేమికుల ముందు కాలం ఇంకెంత వేగంగా పరిగెడుతూ ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఆ సినీ ప్రేమికులు ఇప్పుడు ఇయర్ ఎండ్ లో వాళ్ళని షేక్ చేసే చిత్రాల గురించి అదే పనిగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా ఆ ఆలోచనలలో భాగస్వామ్యం అవుతారా! ఈ ఏడాది చివరి రెండు నెలలు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ చిత్రసీమలకు అసలైన పరీక్షా సమయంగా మారాయి. నవంబర్ మరియు డిసెంబర్ మాసాలలో ఏకంగా పదుల సంఖ్యలో భారీ బడ్జెట్ చిత్రాలు, క్రేజీ ప్రాజెక్ట్‌లు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటంతో సినీ ప్రియులకు నూతన వినోదాల విహారం ప్రారంభమైంది. సాధారణంగా ఈ సీజన్‌ను ‘అన్‌సీజన్’ అంటుండే టాలీవుడ్ వర్గాల అంచనాలను తలకిందులు చేస్తూ, ఎండాకాలం మరియు దసరా పండగలను మించిన పోటీ ఈసారి నెలకొంది. స్టార్ హీరోల నుండి కుర్ర హీరోల వరకు అందరూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వరుస కడుతుండటంతో థియేటర్ల వద్ద సందడి తారాస్థాయికి చేరింది. నవంబర్ 19న యూత్‌లో విపరీతమైన క్రేజ్ ఉన్న ‘ఈ నగరానికి ఏమైంది 2’ సీక్వెల్‌తో మాస్ కా దాస్ విశ్వక్‌సేన్ బాక్సాఫీస్ రయ్‌మనిపించేందుకు సిద్ధమవుతున్నారు.  మరుసటి రోజు నవంబర్ 20న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ సైతం ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ఇక డిసెంబర్ మాసానికి వచ్చేసరికి బాక్సాఫీస్ వద్ద పోటీ మరింత ముదురుతోంది. క్రిస్మస్ పండగను టార్గెట్ చేస్తూ డిసెంబర్ 24న నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దాదా ’ భారీ అంచనాల నడుమ విడుదలవుతోంది. డిసెంబర్ 13 నుంచే ఈ చిత్రానికి సంబంధించిన ‘డాడా ధమాకా’ ఫస్ట్ సింగిల్ మ్యూజిక్ లవర్స్‌ను ఊపేయడానికి సిద్ధమైంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: మూవీ ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం: అక్కడ ఇక బంద్!   ఇదే డిసెంబర్ 24న కింగ్ నాగార్జున ‘కింగ్ 100’ సినిమాతో పాటు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ చిత్రం కూడా బరిలో దిగుతుండటంతో బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోరు ఖాయంగా కనిపిస్తోంది.హాలీవుడ్ నుంచి ‘అవెంజర్స్: డూమ్‌డే’ (Avengers: Doomsday), ‘డూన్: పార్ట్ త్రీ’ (Dune: Part Three) మరియు ‘జుమాజి: ఓపెన్ వరల్డ్’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు డిసెంబర్ 18 మరియు 25 తేదీలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లను షేక్ చేయడానికి ముస్తాబవుతున్నాయి. ఈ విపరీతమైన పోటీలో ఏ సినిమాలు విజయతీరాలకు చేరతాయి, ఏ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయనేది వేచి చూడాలి.భోగి నవంబర్ 12 న వాయిదా పడినా కొత్త డేట్ ఈ ఏడాదే ఉంటుంది. ప్రస్తుతం రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నితేశ్‌ తివారీ తెరకెక్కించిన గ్లోబల్ లెవెల్ మైలాజికల్ డ్రామా ‘రామాయణం: పార్ట్ 1’ నవంబర్ 5న విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతూ ఉంది. సూర్య ‘సీన్ కూడా తగ్గేదెలే అనే విధంగా బాక్స్ ఆఫీస్ ని మెస్మరైజ్ చేసి పడేస్తుంది.   మీకు నచ్చవచ్చు : దాదా ధమాకా! మీకు నచ్చవచ్చు : స్టార్ హీరోయిన్ సంచలనం! [November And December 2026 Biggest Telugu Bollywood And Hollywood Releases, Tollywood upcoming movies, December 2026 releases, Balakrishna Dada, Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]  
Actress Priya Bhavani Shankar has tied the knot with her longtime boyfriend Rajvel Raj in a traditional wedding ceremony. The wedding video released captures beautiful moments of the couple and their family members witnessing their union. Rajvel looked very emotional hugging her and the couple looked super happy.  Priya and Rajvel have been in a relationship for more than a decade. Their love story reportedly began during their college days, and the couple stood by each other through the different phases of their personal and professional journeys. Unlike many celebrity couples, they largely kept their relationship away from the media spotlight. Priya occasionally shared glimpses of their togetherness, while their decision to build a home together in 2022 offered another glimpse into their long-term commitment. Priya began her career as a television newsreader before making her acting debut with Meyadha Maan. She gradually established herself in Tamil cinema with films such as Kadaikutty Singam, Monster and Thiruchitrambalam. Also Read: Rajinikanth and Stalin families fly to Greece for Anirudh and Kavya wedding She has also expanded her filmography with projects across different genres and industries. Her association with Telugu cinema includes Ravi Teja's Irumudi, while she continues to be an active presence in Tamil films. After more than a decade of togetherness, Priya and Rajvel have now begun a new chapter as husband and wife. Their wedding video has given fans a glimpse of their special day, with wishes pouring in for the newly married couple. Check Out: Salman invites more trolls with Maatrubhumi Trailer                      Ramayana enters the Oscar race independently   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో ఆయన నటిస్తున్న సినిమాల్లో ‘ఫౌజీ’ ఒకటి. ‘సీతారామం’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి. ఇటీవల ప్రభాస్ ఇటలీ పర్యటనకు వెళ్లి కొంతకాలం అక్కడ గడిపారు. ఆ వెకేషన్ ముగించుకొని హైదరాబాద్‌కు తిరిగివచ్చిన ఆయన.. మళ్లీ ‘ఫౌజీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా తాజా షెడ్యూల్ జరుగుతోంది. ఈ షెడ్యూల్‌లో భాగంగా ప్రభాస్, ఇమాన్వీలపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో భాగంగా చిత్ర బృందం ఓ ప్రత్యేకమైన పెళ్లి సెట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభాస్, ఇమాన్వీలపై పెళ్లి సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాలో ఈ పెళ్లి ఘట్టం చాలా కీలకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రభాస్‌ను పెళ్లికొడుకు గెటప్‌లో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హను రాఘవపూడి సినిమాల్లో ప్రేమకథలకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘ఫౌజీ’ కూడా పీరియాడిక్ నేపథ్యంలో సాగే కథ కావడంతో ఈ పెళ్లి సన్నివేశాలను ఎలా తెరకెక్కిస్తున్నారనే ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ సినిమాలో ప్రభాస్, ఇమాన్వీల జంటకు మంచి స్పందన వచ్చింది. ఇప్పుడు వీరిద్దరిపై పెళ్లి ఘట్టాన్ని చిత్రీకరిస్తుండటంతో తెరపై వీరి కెమిస్ట్రీ ఎలా ఉంటుందోనని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఇది కూడా చదవండి: పెళ్లయ్యాక అలాంటి పాత్రలు చేయకూడదా? కియారా విషయంలో సిద్ధార్థ్ ఏమన్నారంటే? ఈ పెళ్లి సన్నివేశాల చిత్రీకరణ పూర్తయిన తర్వాత ప్రభాస్‌పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను తెరకెక్కించేందుకు దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్‌ను రూపొందిస్తూ కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ తన పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో జయప్రద, మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను 2027 మార్చి 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. మరి వెండితెరపై ప్రభాస్, ఇమాన్వీల పెళ్లి సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాయో చూడాలి. మీకు నచ్చవచ్చు: ఎవరూ ఊహించని జోనర్‌లో సూర్య కొత్త మూవీ.. ఇంకో బ్లాక్ బస్టర్ ఖాయమేనా.?     [Prabhas Fauzi Movie, Fauzi Shooting Update, Prabhas Imanvi Wedding Scene, Prabhas Wedding Sequence, Imanvi Ismail, Hanu Raghavapudi, Fauzi Movie Latest News, Prabhas Upcoming Movies, Fauzi Release Date, Mythri Movie Makers]
నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మాణంలో జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తెలుగు ఎక్స్‌పరిమెంట్స్ సాయి కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.  ఈ ఈవెంట్‌లో తణికెళ్ల భరణి మాట్లాడుతూ .. ‘పిల్లలందరూ కలిసి చూసే ఓ మంచి సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు. పిల్లల కోసం మంచి సందేశం ఇచ్చేలా ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ మూవీని తెరకెక్కించారు. దివ్య గారు, ప్రవీణ్ గారు ఈ మూవీని గొప్పగా నిర్మించారు. జయంత్ అద్భుతమైన కుర్రాడు. పిల్లాడికి బంగారు భవిష్యత్తు ఉంది. రానున్న కాలంలో మంచి నటుడు అవుతాడని కచ్చితంగా చెప్పగలను. మంచి సందేశంతో నవీన్ ఈ మూవీని తెరకెక్కించారు. ఇలాంటి మంచి చిత్రం కచ్చితంగా విజయం అవ్వాలి.. కచ్చితంగా సక్సెస్ అవుతుంది’ అని అన్నారు. కేఎల్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ .. ‘పిల్లలతో చేసే మంచి చిత్రాలు ఎప్పుడూ సక్సెస్ అవుతాయి. ఈ సినిమాలో జయంత్ గొప్పగా నటించాడని అర్థం అవుతోంది. ప్రవీణ్ గారు మల్టీటాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. నవీన్ గారు ఈ మూవీని గొప్పగా తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు మన దగ్గర ఏడాదికి యాభైకి పైగా పిల్లల చిత్రాలు వస్తుండేవి. ఇలాంటి మంచి సినిమాల్ని అందరూ ఆదరించాలి’ అని అన్నారు. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ లాంటి చిత్రాన్ని నిర్మించడం గొప్ప విషయం. పిల్లల కోసం మంచి సందేశంతో సినిమాని నిర్మించిన ప్రవీణ్ గారికి ధన్యవాదాలు. నేను లెక్కల మాస్టారుగా పని చేశాను. ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇలాంటి మంచి మూవీని పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ ఇలా అందరూ చూడాలి. పిల్లల్లో ఉండే ప్రత్యేకమైన ప్రతిభను గుర్తించి వాటికి తగ్గట్టుగా మార్గదర్శకం చేయాలి. ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఎమోషనల్ స్టోరీ. ఇలాంటి మంచి చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయాలి. చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14న మా సినిమా రాబోతోంది’ అని అన్నారు. ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో ట్యూన్స్, డైలాగ్స్, పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టం. మాకు మంచి సంగీతాన్ని అందించిన మోహిత్ గారికి, మంచి విజువల్స్ ఇచ్చిన కెమెరామెన్ ఆండ్రూ గారికి థాంక్స్. మలయాళం నుంచి రీమేక్ రైట్స్ తీసుకుని.. ఈ సినిమాని ఇక్కడకు వరకు తీసుకు వచ్చే క్రమంలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఇదొక మంచి మ్యూజికల్, మెసెజ్ ఓరియెంటెడ్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నాను. మా సినిమాని రిలీజ్ చేస్తున్న ఏషియన్ సురేష్ గారికి థాంక్స్. బాలల దినోత్సవం సందర్భంగా మా మూవీ నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు. ఆశిష్ గాంధీ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో నేను ఒక డిఫరెంట్ పాత్రను పోషించాను. జయంత్‌కి మంచి భవిష్యత్ ఉంది. ఇందులో సాంగ్స్ ఎంతో ఫ్రెష్‌గా ఉంటాయి. బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న ఈ చిత్రం రాబోతోంది. హిందీలో ‘తారే జమీన్ పర్’ ఉంది.. తెలుగులో ఇకపై ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఉంటుంది. ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తుంటాయి. పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి ఈ సినిమాని చూడండి’ అని అన్నారు. ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయేందర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాలోని కొన్ని సీన్స్ చూశాను. ఆగస్ట్ 15కి ‘ఖడ్గం’ మూవీ ఎలా రిపీట్ అవుతుందో.. ఇకపై నవంబర్ 14కి ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ ఈ చిత్రం రిపీట్ అవుతుంది. జయంత్ అద్భుతంగా నటించాడు. కచ్చితంగా జయంత్ స్టార్ అవుతాడు. పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ ఈ మూవీని చూడండి’ అని అన్నారు. దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌లో దివ్య గారు, ప్రవీణ్ గారు ఎంతో సహకరించారు. ఈ మధ్య పిల్లలకు సంబంధించిన చిత్రాలు రావడం లేదు. జయంత్ గొప్ప ఆర్టిస్ట్. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే సింగిల్ టేక్‌లో చెప్పేస్తుంటాడు. డైలాగ్ డెలివరీ, డిక్షన్‌లోనూ వేరియేషన్స్ చూపిస్తుంటాడు. మోహిత్ మంచి మ్యూజిక్ అందించాడు. ఈ చిత్రంలో ప్రవీణ్ గారి సాహిత్యం, బాణీ, మాటలు గొప్పగా ఉంటాయి. సినిమాకి యాభై శాతం క్రెడిట్ నాది, మిగతా యాభై శాతం ప్రవీణ్ గారిదే. ఇలాంటి మంచి సినిమాల్ని ప్రోత్సహించడం మన అందరి సామాజిక బాధ్యత’ అని అన్నారు. మాస్టర్ జయంత్ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంతో నన్ను తెరపైకి తీసుకు వస్తున్న మా తల్లిదండ్రులకు థాంక్స్. ఇంత మంచి అవకాశం ఇచ్చిన నవీన్ అన్నకి థాంక్స్. ఈ సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. పిల్లలు, టీచర్స్, పేరెంట్స్ అందరూ తప్పకుండా ఈ సినిమాని చూడాలి. చిల్డ్రెన్స్ డే స్పెషల్‌గా నవంబర్ 14న మా మూవీని రిలీజ్ చేస్తున్నాం. అందరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. బేబీ ఊహ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రంలో అవకాశం ఇచ్చిన దివ్య గారు, ప్రవీణ్ గారికి థాంక్స్. మా సినిమా నవంబర్ 14న రాబోతోంది. అందరూ తప్పకుండా చూండి’ అని అన్నారు. సహ నిర్మాత షఫి మాట్లాడుతూ .. ‘మంచి సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రవీణ్ గారు ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమాని నిర్మించారు. పన్నెండేళ్ల నుంచి మా ప్రయాణం సాగుతోంది. ప్రవీణ్ తన కలను నెరవేర్చుకునేందుకు నమో జయం ప్రొడక్షన్స్‌ని ప్రారంభించారు. జయంత్‌లోని అద్భుతమైన ప్రతిభను ఈ చిత్రంలో అందరూ చూడబోతోన్నారు. నవంబర్ 14న రాబోతోన్న మా సినిమాని చూసి అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నటుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ .. ‘పోలీస్ ఆఫీసర్‌గా లాఠీ పట్టుకునే ప్రవీణ్ గారు కలం పట్టుకుని మాటలు రాశారు. దివ్య గారు, ప్రవీణ్ గారు తమ బిడ్డ జయంత్ కోసం ఎంతో కష్టపడ్డారు. నవీన్ గారు ఈ మూవీని గొప్పగా తెరకెక్కించారు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. నటుడు అశోక్ కుమార్ మాట్లాడుతూ .. ‘నవీన్ గారు నాకు మంచి పాత్రను ఇచ్చారు. ప్రవీణ్ గారు తన బిడ్డ జయంత్ కోసం సినిమా తీసినా.. ఓ గొప్ప చిత్రాన్ని నిర్మించారు. ఇందులోని కంటెంట్ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి మంచి చిత్రాల్ని ప్రేక్షకులు ఆదరించాలి. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. సత్యం రాజేష్ మాట్లాడుతూ .. ‘‘జయంత్ అండ్ ది జింగో పెన్’ చిత్రీకరణ ఎంతో సరదాగా సాగింది. జయంత్‌ని ఓ సీన్‌లో నిజంగానే కొట్టాను. బాధను భరించి జయంత్ గొప్పగా నటించాడు. నా కెరీర్‌లో ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుంది. ఈ మూవీని పిల్లలు, పేరెంట్స్ అందరూ కలిసి చూడాలి. ఇలాంటి మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలి’ అని అన్నారు.  
మేకర్స్ తమ సినిమా ప్రమోషన్స్ కి అదనపు హంగులు, సొగసులు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఉంటారు. అందుకే ఈ మధ్య కాలంలో ప్రమోషన్స్ ని జెన్ జీ బ్యాచ్ కి చేరువ చెయ్యాలని కళాశాలల ప్రాంగణంలో ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై సినిమా ప్రమోషన్లు మరియు ప్రైవేట్ వాణిజ్య కార్యక్రమాల నిర్వహణపై ప్రభుత్వం అత్యంత కీలకమైన  నిర్ణయం తీసుకుంది. ఒక రకంగా సంచలనం అని చెప్పవచ్చు. విద్యాసంస్థల ప్రాంగణాలను కేవలం విద్య మరియు క్రీడా కార్యకలాపాలకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. ఇటీవల కాలంలో కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో జరిగిన వరుస ప్రమాదాలు, విద్యార్థుల భద్రతను గాలికొదిలేసి నిర్వహించిన ఈవెంట్లు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు మరియు చర్చకు దారితీశాయి. ముఖ్యంగా, నాదర్‌గూల్‌లోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో నిర్వహించిన 'దాండియా నైట్' (Dandiya Night) ఈవెంట్ సందర్భంగా 80 అడుగుల తాత్కాలిక లైటింగ్ స్ట్రక్చర్ కుప్పకూలిన ఘోర ప్రమాదంలో ఒక మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, కనీసం 14 మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. అంతేకాకుండా, అక్టోబర్ 23న మల్లారెడ్డి యూనివర్సిటీలో జరిగిన వెంకటేష్ నటించిన 'ఆదర్శ కుటుంబం' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సినిమా ప్రమోషన్ల జోరు పెరగడం, విద్యార్థులను అక్టోబర్ 30న సినిమా విడుదల రోజున థియేటర్లకు వెళ్లాలని కోరుతూ సెలవు ప్రకటనపై జరిగిన చర్చలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఇది కూడా చదవండి:ఎవరు ఊహించని జోనర్ లో సూర్య కొత్త మూవీ!  ఈ నేపథ్యంలో  యాజమాన్యాల తీరుపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. విద్యార్థుల భద్రతను అత్యున్నత ప్రాధాన్యతగా భావిస్తూ, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ బాలకిష్టారెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక ముసాయిదా నివేదికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది. త్వరలోనే అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉన్న ఈ కొత్త నిబంధనల ప్రకారం, కాలేజీలు మరియు స్కూళ్లలో ఎలాంటి సినిమా వేడుకలు, కమర్షియల్ ప్రమోషన్లకు పూర్తిస్థాయిలో బ్రేక్ పడనుంది. పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి చేయడంతో పాటు, అంచనా వేసిన హాజరు, స్టేజ్ ఏర్పాట్లు, క్రౌడ్ మేనేజ్‌మెంట్ మరియు ఫైర్ సేఫ్టీ ప్రమాతలను కచ్చితంగా పాటించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యా మందిరాలుగా ఉండాల్సిన క్యాంపస్‌లను కమర్షియల్ వ్యాపార వేదికలుగా మారుస్తున్న తీరుపై ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థుల తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవ్వడం ఖాయం.   మీకు నచ్చవచ్చు: రామాయణ ఆస్కార్ కొడుతుందా! మీకు నచ్చవచ్చు :తన అందంతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న క్రేజీ హీరోయిన్!   [Telangana Colleges Movie Promotions Ban, telangana schools colleges, movie promotions ban, educational institutions, student safety,Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]    
Nitesh Tiwari's ambitious mythological epic Ramayana has taken another significant step towards global recognition. The makers have reportedly submitted Ramayana: Part 1 for consideration at the 99th Academy Awards, putting the Ranbir Kapoor-starrer in the Oscar race. The development is particularly interesting as Marathi film Gondhal has already been selected as India's official entry in the Best International Feature Film category. However, that does not prevent other Indian films from independently submitting themselves for consideration in other Oscar categories. Under the Academy's eligibility rules, films can independently enter the general Oscar race if they fulfil the prescribed theatrical release requirements. These include a minimum seven-day consecutive theatrical run in one of the qualifying US metropolitan areas, followed by the required submission process. Directed by Nitesh Tiwari, Ramayana features Ranbir Kapoor as Lord Rama, Sai Pallavi as Sita and Yash as Ravana. The ambitious two-part adaptation also brings together an impressive ensemble cast and international technical talent. Also Read: Varanasi story leak: Is Reddit theory fake or real?  The reported Oscar submission comes after the film's grand theatrical launch and strong box-office performance. With its large-scale production, visual effects and international appeal, the makers are looking to take this Indian epic to a wider global audience. However, submission for consideration does not guarantee a nomination or an Oscar win. Whether Ramayana manages to secure a place among the Academy's nominees remains to be seen, but its entry into the awards conversation is a notable development for Indian cinema. Check Out: NBK's voice to make Dada real Dhamakhadar!                       Sukumar launches romantic entertainer with Siddhu  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
ఇప్పుడు హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అనే మూడు పదాలు సూర్య చుట్టూ నీ వెంటే నేను అన్నట్టుగా తిరుగుతున్నాయి. మరి హిట్ సినిమా ఎలా తియ్యాలో తెలియక సంవత్సరాలకి సంవత్సరాలే తీసుకుంటూ  కథలని ఫైనల్ చెయ్యని ఈ సినీ రోజుల్లో ఈ ఏడాది కరుప్పు( వీరభద్రుడు), విశ్వనాధ్ అండ్ సన్స్, సీన్ తో సెల్యులాయిడ్ ని మ్యాజిక్ చేసి పడేసాడు. మూడు చిత్రాలు కూడా డిఫరెంట్ జోనర్స్. ఈ కోవలోనే ఇప్పుడుసూర్య చేయబోతే మరో మూవీ జోనర్ ఆసక్తికరంగా మారింది.  సూర్య ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈమూవీ షూటింగ్ దశలో ఉండగానే, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌లకు సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు సినీ వర్గాలలో చక్కర్లు కొడుతున్నాయి.   టీజే జ్ఞానవేల్ సినిమా తర్వాత, టాలెంటెడ్ డైరెక్టర్ మతిమారన్‌ పుగళేంది దర్శకత్వంలో సూర్య మరో కొత్త సినిమాను పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఒక ముఖ్యమైన విశేషం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మతిమారన్‌ గతంలో తెరకెక్కించిన విమర్శకుల ప్రశంసలు పొందిన 'మండాడి' సినిమా మాదిరిగానే, ఈ తాజా చిత్రం కూడా పూర్తిగా సముద్ర నేపథ్యంలో సాగే ఒక పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. సముద్రపు అలల మధ్య జరిగే పోరాటాలు, నావికుల జీవితాలు, మరియు సముద్రపు మాఫియా నేపథ్యంలో ఈ కథ అత్యంత ఉత్కంఠభరితంగా సాగనుందని సినీ వర్గాలు అంటున్నాయి. మేకర్స్ ఒక పవర్ ఫుల్ టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  సముద్రం మరియు నావికుల నేపథ్యంలో సాగే ఈ కథకు సరిగ్గా సరిపోయేలా 'పడగోట్టి' (అంటే నావికుడు) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా సూర్య కెరీర్‌లో 49వ సినిమాగా (Suriya 49) అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటం విశేషం. ఇది కూడా చదవండి:ఆస్కార్ రేసులో రామాయణ పార్ట్ 1 : ఇండిపెండెంట్ ఎంట్రీ!    ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రముఖ టాలీవుడ్/కోలీవుడ్ నిర్మాణ సంస్థలలో ఒకరైన కలైపులి ఎస్‌. థాను నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సముద్రపు బ్యాక్‌డ్రాప్, సూర్య మార్క్ యాక్షన్ ఎలిమెంట్స్, మరియు బలమైన భావోద్వేగాలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వరుస హిట్‌లతో జోరుమీదున్న సూర్య నుంచి వస్తున్న ఈ మా్యరిటైమ్ యాక్షన్‌ డ్రామా ఆయన అభిమానులకి, ప్రేక్షకులకి మరపురాని సినీ అనుభూతిని పంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.   మీకు నచ్చవచ్చు: కోట శ్రీనివాసరావు గొప్ప యాక్టర్ ఎలా అయ్యారు! మీకు నచ్చవచ్చు: నయనతారకి షాక్: ఇదేం ట్విస్ట్ అంట!   [Suriya And Mathimaaran Pugazhendi Movie Update, Suriya Padagotti Updates, Suriya new movie, Padagotti movie, Suriya 49, Mathimaran Pugazhendi, Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]
Sukumar is backing his former direction department associate Mohan B, who is making his directorial debut with Siddhu Jonnalagadda. Tentatively titled Siddhu10, the film was launched with a grand pooja ceremony.  Mohan B has developed a unique romantic narrative that is expected to present Siddhu in a completely new avatar. Having worked closely with Sukumar, the filmmaker is now stepping into direction with this ambitious project. Sukumar attended the launch ceremony and sounded the first clap. The film is presented by his wife Thabhitha Sukumar and produced by Anmol Sharma, Bunny Vas and Ashok Bandreddi, on Sukumar Writings and Bunny Vas Works banners.  The makers also unveiled an artistic theme poster featuring a majestic waterfall, an illustrated tree and a suspended swing, hinting at the nostalgic backdrop of the story. Also Read: NBK's voice to make Dada real Dhamakhadar! Nayan Sarika plays the female lead opposite Siddhu, while GV Prakash Kumar will compose the music. The film's regular shoot is expected to commence soon, marking an interesting new collaboration between Siddhu, Mohan B and the Sukumar camp. Check Out: Mohanlal and Mammootty mourn cinematographer demise                     Renuu Desai has this shocking reaction on Pawan's divorce Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.
దశరథ రాముడు, అయోధ్య రాముడు, సీతా రాముడు బాక్స్ ఆఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇప్పటి వరకు ఉన్న అనేక చిత్రాల రికార్డ్స్ జై శ్రీరామ్ అంటూ సైడ్ అవుతున్నాయి. దీంతో రామాయణ పార్ట్ 1 సృష్టించబోయే  ఎండింగ్ రికార్డ్స్ ఎక్కడ ఆగుతాయో తెలియని పరిస్థితి. అలాంటి రామాయణ ఆస్కార్ అనే న్యూస్  తో అభిమానులు, భక్తుల ముఖాల్లో చిరు నవ్వులు చిందిస్తూ ఉంది.  99వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్ 2027) కోసం 'రామాయణ  చిత్రాన్ని స్వతంత్రంగా పరిశీలన నిమిత్తం సమర్పించినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిలిం కేటగిరీలో మరాఠీ చిత్రం 'గొంధల్' భారత్ తరఫున అధికారిక ఎంట్రీగా బరిలో నిలిచినప్పటికీ, ఆస్కార్ నిబంధనల ప్రకారం ఇతర చిత్రాలు కూడా ఇండిపెండెంట్‌గా అకాడమీ రేసులోకి ప్రవేశించే అవకాశం ఉంది. దీనికోసం అమెరికాలోని లాస్ ఏంజిల్స్ కౌంటీ, న్యూయార్క్ సిటీ, చికాగో వంటి ప్రముఖ నగరాల్లోని థియేటర్లలో నిర్దిష్ట నిబంధనలతో ప్రదర్శనలను విజయవంతంగా పూర్తి చేసుకుని, జనరల్ ఎంట్రీ కేటగిరీ కింద సినిమాను ఆస్కార్ బరిలో నిలిపారు.  ఇది కూడా చదవండి:తెలుగులో చేసింది ఒక్క సినిమానే: కుర్రాళ్లని ఆగం చేస్తున్న హీరోయిన్! ప్రపంచవ్యాప్తంగా 130కి పైగా దేశాల్లో, 17 డబ్బింగ్ భాషలలో సుమారు 10,000 స్క్రీన్లలో విడుదలైన రామాయణ ఇప్పుడు హాలీవుడ్ వేదికపై కూడా సంచలనం సృష్టించేందుకు సిద్ధమవుతోంది. రాముడి పవిత్ర గాథను అంతర్జాతీయ స్థాయి దృశ్య రూపంలోకి తీసుకురావడమే కాకుండా, బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ ఆస్కార్ రేసులో నిలవడం భారతీయ చలనచిత్ర పరిశ్రమకు గర్వకారణంగా మారింది. ఆల్రెడీ  ఆస్కార్ అవార్డు  విన్నర్స్  హన్స్ జిమ్మర్, ఏ.ఆర్. రెహమాన్ సంయుక్తంగా సంగీతం అందించడం మరో విశేషం.  రామాయణ వరల్డ్ వైడ్ గా ఇప్పటికి వరకు 800 కోట్లని రాబట్టింది. మీకు నచ్చవచ్చు :దాదా ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది: ఆ డేట్ స్పెషల్ ఇదే! మీకు నచ్చవచ్చు: Rc 17 పై రిషి కాంత్ కీలక వ్యాఖ్యలు!   [Ramayana Part 1 Oscar Submission, Ramayana Part 1, Ranbir Kapoor Ramayana, Yash Ravana, Ramayana Oscar submission, Ramayana box office collection, Telug cinema news, Telugu Cinema, Tollywood, Tollywood News]  
ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగడం మన సంప్రదాయంలో ఎప్పట్నుంచో ఉంది. అయితే దీని వెనుక దాగున్న శాస్త్రీయ కారణాలు మరియు ఆరోగ్య రహస్యాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సాధారణంగా పాలల్లో కాల్షియం, ఐరన్, ప్రొటీన్ వంటి శరీరానికి అత్యవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు అర చెంచా పసుపు చేర్చినప్పుడు ఈ పానీయం కాస్తా  గోల్డెన్ మిల్క్  లేదా అద్భుతమైన ఆరోగ్య అమృతంగా మారుతుంది. రాత్రి పూట ఈ పసుపు పాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఒత్తిడి, అలసట పూర్తిగా తొలగిపోయి ప్రశాంతమైన గాఢమైన నిద్ర సొంతమవుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పసుపులో అత్యంత శక్తివంతమైన  కర్కుమిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది శరీరంలో పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో మరియు ఫ్రీ రాడికల్స్ తో పోరాడడంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనివల్ల శరీరానికి సహజసిద్ధమైన యాంటీ క్యాన్సర్ ప్రభావం అందుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా, పసుపు పాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఈ మిశ్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచడంలో పసుపు పాలు గ్రేట్ రిజల్ట్ ఇస్తాయి. పసుపులోని యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు కాలానుగుణంగా వచ్చే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పిస్తాయి. ముఖ్యంగా రాత్రి వేళ దీన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇందులో కొద్దిగా తేనె లేదా అల్లం కలుపుకుంటే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. రోజూ ఒక గ్లాసు గోల్డెన్ మిల్క్ తీసుకోవడం వల్ల కాలేయం శుభ్రపడటంతో పాటు వైరల్ దాడి నుంచి రక్షణ లభిస్తుంది. జీర్ణవ్యవస్థను పటిష్టం చేయడంలో పసుపు పాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. పసుపు జీర్ణక్రియను ఉత్తేజపరిచి, అజీర్ణం, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతూ శరీరం తీసుకునే ఆహారంలోని పోషకాలను మెరుగ్గా గ్రహించేలా తోడ్పడుతుంది. క్రమం తప్పకుండా పసుపు పాలు తాగే వారిలో జీర్ణ సంబంధిత రుగ్మతలు చాలా వరకు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు ధృవీకరిస్తున్నారు. ఇది కూడా చదవండి:టైప్1 మరియు టైప్2 డయాబెటిస్‌కు, అద్భుతమైన ఇంటి చిట్కా! శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను, మెదడు పనితీరును మెరుగుపరచడంలో పసుపు పాలు ఎంతగానో సహాయపడతాయి. కుర్కుమిన్ జ్ఞాపకశక్తిని పెంపొందించడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పాలలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమ్మినో ఆమ్లం, పసుపు గుణాలు కలిసి మెదడు నరాలను రిలాక్స్ చేసి నిద్రలేమి సమస్యను తరిమికొడతాయి. చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడంలోనూ పసుపు పాలు అద్భుతంగా పనిచేస్తాయి. రక్తాన్ని శుద్ధి చేసి మొటిమలు, మచ్చలు, చర్మంపై ముడతలు రాకుండా నివారించడంలో ఇవి సహాయపడతాయి. వయసు పెరుగుతున్న ఛాయలను తగ్గించి చర్మానికి సహజమైన కాంతిని ఇస్తాయి. కాబట్టి ఆరోగ్యకరమైన, నిండు నూరేళ్ల జీవితం కోసం ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగే అలవాటును మీ దినచర్యలో భాగం చేసుకోండి. మీకు నచ్చవచ్చు:కంటి నీరు, కారడం వెనుక ఉన్న అసలు రహస్యం: వైద్యుల సలహాలు                         ఉదయం, లేవగానే నీరు తాగడం వల్ల కిడ్నీలు మరియు జీర్ణవ్యవస్థకు కలిగే లాభాలు!     Turmeric Milk Benefits, Haldi Doodh At Night, Golden Milk Science, Improve Sleep Naturally, Anti Inflammatory Drinks, Doctor Health Advice, Health Tips In Telugu.  
వర్షాకాలం లేదా చలికాలం వచ్చిందంటే చాలు, తేళ్లు, పాములు వంటి విషసృపాలు తడి నేలల నుంచి బయటికి వచ్చి ఇళ్లలోకి, చీకటి మూలల్లోకి చేరుతుంటాయి. అయితే, చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఒక్కోసారి మనం తేలు కాటుకు గురికావాల్సి వస్తుంది. తేలు కుట్టిన వెంటనే ఆ ప్రాంతంలో తీవ్రమైన మంట, భరించలేని నొప్పి, తిమ్మిర్లు కలుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,500 రకాల తేలు జాతులు ఉండగా, కేవలం కొన్ని మాత్రమే ప్రాణాంతకమైన విషాన్ని విడుదల చేయగలవు. అయినప్పటికీ, తేలు కుట్టిన వెంటనే భయపడిపోకుండా కొన్ని అత్యవసర ప్రథమ చికిత్స చర్యలు పాటించడం ద్వారా విషం ప్రభావాన్ని, తీవ్రమైన నొప్పిని గణనీయంగా తగ్గించవచ్చు. తేలు కుట్టిన వెంటనే చేయాల్సిన మొదటి పని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచడం. కుట్టిన భాగాన్ని గోరువెచ్చని నీరు మరియు యాంటీసెప్టిక్ సబ్బుతో శుభ్రంగా కడగాలి. ఇది ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. ఆ తర్వాత, ఐస్ క్యూబ్స్‌ను ఒక శుభ్రమైన గుడ్డలో చుట్టి తేలు కుట్టిన ప్రదేశంపై 10 నుంచి 15 నిమిషాల పాటు ఉంచాలి. ఇలా చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, విషం శరీరంలోకి వేగంగా పాకకుండా అడ్డుకోవచ్చు. ఒకవేళ చేయికి లేదా కాలికి కుట్టినట్లయితే, ఆ భాగాన్ని కదలకుండా కొద్దిగా ఎత్తులో ఉంచడం చాలా మంచిది. ఇక వంటింట్లో దొరికే కొన్ని సహజ సిద్ధమైన పదార్థాలతో కూడా తక్షణ ఉపశమనం పొందవచ్చు. పసుపులో ఉండే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు నొప్పిని మాయం చేస్తాయి. కొద్దిగా పసుపును ఆవ నూనెతో కలిపి పేస్ట్‌లా చేసి కుట్టిన చోట రాస్తే మంట త్వరగా తగ్గుతుంది. అలాగే బేకింగ్ సోడాలో కొద్దిగా నీరు కలిపి రాసినా చర్మానికి మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉండే ఉల్లిపాయ రుద్దడం లేదా నాటు వైద్యాలు వంటి శాస్త్రీయ ఆధారాలు లేని పద్ధతులను గుడ్డిగా నమ్మి కాలయాపన చేయడం ప్రాణాలకే ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 3,000 మంది తేలు కాటు కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో దాదాపు 80 శాతం మంది చిన్నపిల్లలే ఉండటం గమనార్హం. తేలు విషం పిల్లలపై, వృద్ధులపై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. బాధితుల్లో విపరీతమైన చెమటలు పట్టడం, తల తిరగడం, కండరాల నొప్పులు, శ్వాస తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి తరలించాలి. తీవ్రమైన సందర్భాల్లో వైద్యులు యాంటీ వినమ్ (Antivenom) మందులను అందించి ప్రాణాలు కాపాడుతారు. ఇది కూడా చదవండి:వైద్య రంగంలో సంచలనం: క్యాన్సర్ కణాల రహస్యాలను, బట్టబయలు చేసిన శాస్త్రవేత్తలు ఇంటి చుట్టూ తేళ్లు రాకుండా తగిన రక్షణ మరియు నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా ఈ ప్రమాదాలను ముందే అడ్డుకోవచ్చు. ఇళ్ల పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పనికిరాని వస్తువులు, చెత్తాచెదారం, ఎండిన చెట్ల పొదలను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇంట్లోని గోడల్లో ఉండే పగుళ్లను సిమెంట్ లేదా మట్టితో మూసివేయాలి. రాత్రి సమయాల్లో లేదా చీకటి ప్రదేశాల్లో తిరిగేటప్పుడు కాళ్లకు బూట్లు, చేతులకు రక్షణ గ్లౌజులు ధరించడం చాలా ముఖ్యం. అలాగే, ఎక్కడైనా బూట్లు లేదా దుస్తులు బయట ఉంచితే, వాటిని వేసుకునే ముందు ఒకసారి గట్టిగా జాడించి చూసుకోవడం మంచి అలవాటు. తేళ్లు సాధారణంగా చీకటి ప్రదేశాలు, బూట్ల లోపల, మంచాల కింద దాక్కుంటాయి. కొద్దిపాటి అప్రమత్తత, సరైన సమయంలో అందించే ప్రథమ చికిత్స తేలు కాటు విష ప్రభావాన్ని పూర్తిగా తగ్గించి ప్రాణాలను కాపాడుతాయి. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా నిపుణులైన వైద్యుల సలహా తీసుకోవడమే అత్యంత సురక్షితమైన మార్గం. మీకు నచ్చవచ్చు:గుండె వేగం, సాధారణంగా ఉన్నా పక్షవాతం రావచ్చా? వైద్యులు హెచ్చరిస్తున్న విషయాలివే!                పరగడుపున, టీ లేదా కాఫీ తాగుతున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!     Scorpion Sting First Aid, Scorpion Bite Remedies, Emergency Medical Tips, Insect Sting Treatment, First Aid Guide, Doctor Health Advice, Health Tips In Telugu.  
పండ్లకు ప్రత్యేక స్థానం ఉంది. రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక పోషకాలను అందించడంలో ఇవి ముందుంటాయి. శీతాకాలంలో ఎదురయ్యే పలు ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టడంలో నారింజ పండ్లు అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి రోజువారీ ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చలికాలంలో చాలామందిని ఇబ్బందిపెట్టే ప్రధాన సమస్యలు దగ్గు, జలుబు మరియు వైరల్ ఇన్‌ఫెక్షన్లు. నారింజ పండ్లలో విటమిన్ సి మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసి, ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. ప్రతిరోజూ నారింజ తీసుకోవడం ద్వారా కాలానుగుణ వ్యాధుల బారిన పడకుండా సులభంగా రక్షణ పొందవచ్చు. అలాగే, చలికాలంలో చర్మం పొడిబారి నిర్జీవంగా మారుతుంది. నారింజలో లభించే విటమిన్ సి కొల్లాజెన్ ఉత్పత్తికి ఎంతగానో సహాయపడుతుంది, ఇది చర్మాన్ని మృదువుగా మరియు కాంతివంతంగా ఉంచడంలో కీలకమైనది. అంతేకాకుండా, ఇవి చర్మానికి ముడతలు రాకుండా కాపాడి, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించేలా సహజమైన మెరుపును అందిస్తాయి. మరోవైపు, నారింజలో డైటరీ ఫైబర్ సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను సక్రమంగా ఉంచడంలో, మలబద్ధకం సమస్యను నివారించడంలో ఎంతో సహాయపడుతుంది. తక్కువ కేలరీలు, ఎక్కువ ఫైబర్ ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది అద్భుతమైన ఆహార ఎంపికగా నిలుస్తుంది. ఇది కడుపు నిండిన భావనాన్ని కలిగించి అనవసరమైన ఆహారపు అలవాట్లను నియంత్రిస్తుంది. ఇది కూడా చదవండి:పండుగ, తిండి తిన్న వెంటనే ఈ తప్పులు చేస్తున్నారా? ఎసిడిటీ ముప్పు తప్పదు! ఇవే కాకుండా, నారింజలో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది. చలికాలంలో నీరు తక్కువగా తాగుతుంటారు కాబట్టి శరీరం డీహైడ్రేషన్ బారిన పడుతుంది. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో హైడ్రేషన్ లెవెల్స్ సమతుల్యంగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే విటమిన్ ఎ మరియు ఇతర పోషకాలు కంటి చూపును మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడతాయి. మొత్తంగా చూస్తే, శీతాకాలంలో ప్రకృతి మనకు అందించే ఒక ఆరోగ్యకరమైన వరం నారింజ పండ్లు. కేవలం రుచిలోనే కాకుండా, పోషకాల పరంగానూ ఇవి ఎంతో శ్రేష్టమైనవి. కాబట్టి ఈ చలికాలంలో మీ రోజువారీ ఆహారంలో నారింజను కచ్చితంగా భాగం చేసుకొని, సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవితాన్ని సొంతం చేసుకోండి. మీకు నచ్చవచ్చు:బిల్వ ఆకులతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎవరికి మేలు? ఎవరికి డేంజర్?                                లిపిడ్ ప్రొఫైల్, అంటే ఏమిటి? గుండెను కాపాడుకునే సులభమైన మార్గం!     Oranges In Winter, Cold And Cough Remedies, Immunity Boosting Foods, Vitamin C Health Benefits, Winter Health Tips, Doctor Health Advice, Health Tips In Telugu.
ప్రతిరోజూ ఉదయం గొంతుకు హాయిగా ఉండేలా వేడి వేడిగా టీ తాగి రోజును ప్రారంభించడం చాలా మందికి అలవాటు. అయితే ఆ రొటీన్ టీకి బదులుగా అప్పుడప్పుడు కొన్ని సుగంధ ద్రవ్యాలు , మూలికలను జోడించి తయారు చేసుకునే పానీయాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని హెర్బల్ టీలు అని అంటారు.   మన వంటింట్లో సులభంగా లభించే మసాలా దినుసులతోనే ఈ టీల  ను తయారు చేసుకుని తాగవచ్చు. అలా వంటిట్లో ఉండే మసాలా దినుసుల్లో అనాస పువ్వు కూడా ఒకటి. ఈ  అనాస పువ్వుతో తయారు చేసే టీ ఆరోగ్యానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ చిన్న పువ్వు కేవలం వంటకాలకు రుచిని ఇవ్వడమే కాకుండా, అనేక ఆరోగ్య సమస్యలకు సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది. ఈ టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుంటే.. అనాస పువ్వు టీ.. ప్రస్తుత కాలంలో మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్స్ , ఇతర ఇన్ఫెక్షన్లు త్వరగా వ్యాపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో శరీర రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం చాలా ముఖ్యం.  జ్వరం లేదా  ఏదైనా వైరస్  లేదా శ్వాసకోశ సమస్యలు తలెత్తినప్పుడు  ప్రకృతి మనకు ప్రసాదించిన అనాస పువ్వును ఉపయోగించి సులభంగా హెర్బల్ టీ తయారు చేసుకోవచ్చు. అనాస పువ్వును చిన్న ముక్కలుగా చేసి, నీటిలో మరిగించి టీలా తయారు చేసుకుని తాగడం వల్ల శరీరానికి మంచి ఉపశమనం లభిస్తుంది. ప్రయోజనాలు.. వైరల్ ఫీవర్..  శ్వాసకోశ సమస్యలు.. వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు, వైరస్ జ్వరాలు సర్వసాధారణం. అనాస పువ్వులో యాంటీ వైరల్ , యాంటీ మైక్రోబయల్  గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోకి ప్రవేశించే హానికారక వైరస్‌లతో పోరాడటానికి సహాయపడతాయి. శ్వాసనాళాల్లో చేరిన శ్లేష్మాన్ని కరిగించి, గొంతు నొప్పి , ఊపిరితిత్తుల ఇబ్బంది నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. జీర్ణక్రియ .. తిన్న ఆహారం సరిగా అరగకపోవడం, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ టీ చాలా బాగా పనిచేస్తుంది. అనాస పువ్వులోని పోషకాలు జీర్ణవ్యవస్థను ఉత్తేజపరిచి, జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి. భోజనం తర్వాత లేదా ఉదయం పూట ఈ టీ తాగడం వల్ల పొట్ట తేలికగా ఉంటుంది. ఇది కూడా చదవండి   షుగర్ పేషెంట్లు తప్పక తెలుసుకోవాలి ! ముఖ్యమైన డాక్టర్  సూచనలు రోగనిరోధక శక్తి పెంపు.. శరీరంలో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే చిన్నచిన్న అనారోగ్యాలు కూడా త్వరగా చుట్టుముడతాయి. అనాస పువ్వు టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. రోజూ దీన్ని తీసుకోవడం వల్ల శరీరం శక్తివంతంగా మారుతుంది , ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా రక్షణ లభిస్తుంది. కీళ్ల నొప్పులు,  వాపులు తగ్గించడం.. శరీరంలో ఎక్కడైనా వాపులు లేదా కీళ్ల నొప్పులు ఉన్నప్పుడు ఈ టీ సహజ నివారణగా పనిచేస్తుంది. దీనిలో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాలు శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. వయసు మళ్లిన వాళ్ళలో లేదా కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. మానసిక ప్రశాంతత , నిద్రలేమి నివారణ.. రోజంతా పడిన అలసట, ఒత్తిడి కారణంగా రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టకపోవడం జరుగుతుంది. అనాస పువ్వు టీలో ఉండే సువాసన , మృదువైన గుణాలు నాడీ వ్యవస్థను ప్రశాంతపరుస్తాయి. ఇది మనసును రిలాక్స్ చేసి చక్కగా నిద్ర పట్టేలా సహాయపడుతుంది. చర్మ సౌందర్యం.. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మొటిమలు, చర్మ సమస్యలు వస్తుంటాయి. ఈ హెర్బల్ టీ శరీరాన్ని శుభ్రపరిచి, రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. దీనివల్ల చర్మం కాంతివంతంగా మారడానికి దోహదపడుతుంది.                                                                                                                                                *రూపశ్రీ.   మీకు నచ్చవచ్చు    థైరాయిడ్ PCOS గట్ హెల్త్.. వీటి మధ్య సంబంధం ఏమిటి.!                                   మహిళలు అస్సలు నిర్లక్ష్యం చేయకూడని అండాశయ క్యాన్సర్ లక్షణాలివే!   What Happens to Your Body When You Drink Star Anise Tea,Amazing Benefits Revealed,Star Anise Tea,Amazing Benefits for Your Body
షుగర్ రావడానికి ముందు కనిపించే చివరి వార్నింగ్ సిగ్నల్ ఇదే.. మన శరీరంలో ఎన్నో మార్పులు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్నిసార్లు చిన్నచిన్న సంకేతాలను మనం పెద్దగా పట్టించుకోం. కానీ ఆ చిన్న సంకేతాలే భవిష్యత్తులో మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే పెద్ద ముప్పునకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధుమేహం లేదా షుగర్ వ్యాధి బారిన పడటానికి ముందు మన శరీరం కొన్ని ప్రత్యేకమైన హెచ్చరికలను జారీ చేస్తుంది. ఆ సంకేతాలను ముందే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆ మహమ్మారికి పూర్తిగా దూరంగా ఉండవచ్చు. అవేంటో తెలుసుకుంటే.. ​మన దేశంలో దాదాపు పద్నాలుగు కోట్ల మందికి పైగా ప్రజలు ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నారని పలు ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి. అయితే దురదృష్టవశాత్తు చాలా మందికి తమకు ఈ సమస్య ఉందనే విషయం కూడా అసలు తెలియదు. అసలు ప్రీ డయాబెటిస్ అంటే ఏమిటి? డయాబెటిస్  కు ముందు శరీరం ఇచ్చే సిగ్నల్స్ ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. ప్రీ డయాబెటిస్.. రక్తంలో షుగర్ స్థాయిలు కొద్దిగా పెరిగి ఉంటాయి కానీ పూర్తిగా డయాబెటిస్ అని నిర్ధారించేంత స్థాయిలో ఉండవు. వైద్యపరంగా చూస్తే హెచ్‌బీఏ1సీ పరీక్షలో మూడు నెలల యావరేజ్ 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నా , లేదా ఖాళీ కడుపుతో చేసే ఫాస్టింగ్ షుగర్ వంద నుంచి నూట ఇరవై ఐదు మిగ్రాముల మధ్యలో ఉన్నా దానిని ప్రీ డయాబెటిస్ దశగా పరిగణిస్తారు. ​ఈ దశలోనే మన శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ప్రారంభమవుతుంది.  డయాబెటిస్ రావడానికి ముందు సంకేతాలు.. కేవలం షుగర్ మాత్రమే కాకుండా గుండె జబ్బులు, బీపీ, ఫ్యాటీ లివర్ వంటి ఇతర అనారోగ్య సమస్యల ప్రమాదం కూడా సరిగ్గా ఇదే సమయం నుంచి పెరుగుతుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంటే.. శరీరంలో పైన చెప్పుకున్న సమస్యలు ఏవైనా ఉన్నట్టయితే.. డయాబెటిస్ రావడానికి కూడా అవకాశం ఉన్నట్టే..  అయితే దీనిని చూసి ఎవరూ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదని, ఇదొక చక్కటి సువర్ణావకాశం లాంటిదని నిపుణులు సూచిస్తున్నారు. ​ప్రపంచ ప్రఖ్యాత డయాబెటిస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ అధ్యయనం ప్రకారం, శరీర బరువులో కేవలం ఏడు శాతం వరకు తగ్గడం , వారానికి నూట యాభై నిమిషాలు వేగంగా నడవడం ద్వారా టైప్ టూ డయాబెటిస్ వచ్చే ప్రమాదాన్ని యాభై ఎనిమిది శాతం వరకు సులభంగా తగ్గించుకోవచ్చు. అందుకే ఈ ప్రీ డయాబెటిస్ దశను జీవక్రియ సంబంధిత వ్యాధుల చివరి రివర్సిబుల్ దశగా పిలుస్తుంటారు. ​ఇంటి గోడకు చిన్న పగులు కనిపించినప్పుడే దానిని సరిచేసుకోవడం చాలా సులభం, కానీ గోడ పూర్తిగా దెబ్బ తిన్న తర్వాత   బాగు చేయడం కష్టం. సరిగ్గా అలాగే ఆరోగ్యం పూర్తిగా క్షీణించే ముందే అప్రమత్తమవడం చాలా ముఖ్యం. అందుకోసం శరీర బరువును అయిదు నుంచి ఏడు శాతం వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి. ఇది కూడా చదవండి  ఆరోగ్యానికి  శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే  సూత్రాలివి..! ప్రతిరోజూ కనీసం ముప్పై నిమిషాల పాటు వేగంగా నడవడం అలవాటు చేసుకోవాలి. మైదా వంటి రిఫైన్డ్ కార్బోహైడ్రేట్లు , కూల్ డ్రింక్స్, షుగర్ పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలి. అలాగే ఎప్పటికప్పుడు హెచ్‌బీఏ1సి పరీక్షను చేయించుకుంటూ ఆరోగ్యాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి.  డయాబెటిస్ వచ్చిన తర్వాత రకరకాల మందులతో దానిని నియంత్రించడం కంటే, అది రాకముందే ప్రీ డయాబెటిస్ దశలో ఉన్నప్పుడే దానిని అడ్డుకోవడం ఎంతో మేలు. ఇది ఆరోగ్యానికి ఎంతో సులువైన మార్గం కూడా. కాబట్టి శరీరం ఇచ్చే హెచ్చరికలను ఎప్పుడూ తేలికగా తీసుకోకూడదు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుని సంతోషంగా జీవించడమే మంచి మార్గం.                                                                                                                                               *రూపశ్రీ.​మీకు నచ్చవచ్చు  మొండి కఫాన్ని కూడా తరిమికొట్టే పానీయం.. ఇది తాగితే ఎంత రిలీఫ్ ఇస్తుందో!
ఆరోగ్యానికి  శ్రీరామ రక్ష.. గుండె జబ్బులను ఆమడ దూరం ఉంటే  సూత్రాలివి..!   నేటి ఆధునిక కాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగిపోయి రకరకాల వ్యాయామాలు, డైట్లు చేయడం సర్వసాధారణమైంది. అయితే సరైన అవగాహన లేకుండా చేసే కొన్ని పద్ధతులు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బదులు హాని కలిగించే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలామంది ప్రాణాలను బలిగొంటున్న సమస్య గుండె జబ్బులు.. అయితే దీనికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ రోజువారీ జీవితంలో చేసే చిన్న తప్పులే గుండె సమస్యలకు కూడా కారణం అవుతాయి. అవేంటో,  వైద్యులు వాటి గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుంటే.. నీరు.. రోజూ ఎంత నీరు తాగాలి అనే విషయంలో చాలా మందిలో రకరకాల అపోహలు ఉన్నాయి. రోజుకు ఐదు లీటర్లు లేదా అంతకంటే ఎక్కువ నీరు తాగాలని కొందరు ప్రచారం చేస్తుంటారు. కానీ వైద్యపరంగా ఇది సరైన పద్ధతి కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అవసరానికి మించి విపరీతంగా నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం , పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బతింటుంది. దీనివల్ల హైపోనేట్రిమియా వంటి అనారోగ్య సమస్యలు వచ్చే ముప్పు ఉంది. కేవలం ఒకటి రెండు లీటర్లకే నీటిని తాగడం  పరిమితం కాకుండా, ఎవరి శారీరక శ్రమ , వాతావరణ పరిస్థితులను బట్టి నీటి మోతాదు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మనం తాగే కేవలం మంచినీళ్లే కాకుండా, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సూప్స్, టీ, కాఫీ , ఇతర పానీయాలన్నీ కూడా శరీరానికి అందే ద్రవాల జాబితాలోనే లెక్కలోకి వస్తాయి. శరీరం హైడ్రేటెడ్ గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి మన మూత్రం రంగు చక్కటి సూచికగా పనిచేస్తుంది. మూత్రం మరీ తెలుపుగా లేదా ముదురు పసుపు రంగులో కాకుండా, లేత పసుపు రంగులో ఉంటే శరీరం సరైన హైడ్రేషన్ స్థితిలో ఉన్నట్లు భావించవచ్చు. కిడ్నీ లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్యుల సలహా మేరకే నీటి పరిమాణాన్ని పాటించాలి. ఆహారం.. ఇక ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, మనం రోజూ తీసుకునే బ్రేక్ ఫాస్ట్ , ఇతర ఆహార పదార్థాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఉదయం పూట తినే చాకోస్ లేదా రెడీమేడ్ సీరిల్స్ పాలలో కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం అనుకుంటాం. కానీ వాటిలో కార్బోహైడ్రేట్లు, చక్కెర శాతం ఎక్కువగా ఉండి, శరీరానికి అవసరమైన ప్రొటీన్ మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. వీటిని తిన్న కొద్దిసేపటికే మళ్లీ ఆకలి వేస్తుండటం వల్ల అనారోగ్యకరమైన ఆహారం వైపు మనసు మళ్లుతుంది. దానికి బదులుగా ఉడికించిన గుడ్లు, మల్టిగ్రెయిన్ ఆహారాలు, ఇడ్లీ వంటి ప్రొటీన్తో కూడిన అల్పాహారం ఎంచుకోవడం ఎంతో శ్రేయస్కరం.  ఇది కూడా చదవండి మనసుపై ఒత్తిడి.. గుండెకు ప్రమాదం! అసలు నిజం ఇదే! అలాగే మనం ఇష్టపడి తినే బిర్యానీ, ఫ్రైస్ , బయట దొరికే టిఫిన్లు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో కొవ్వు పదార్థాలు పెరిగిపోతాయి. ఏ ఆహారాన్ని అయినా ఇంట్లో తక్కువ నూనెతో, సహజమైన పద్ధతిలో వండుకుంటే అది ఆరోగ్యకరమైనదే అవుతుంది. హోటళ్లలో లేదా బయట లభించే తినుబండారాలు త్వరగా తయారవ్వడం కోసం ఎక్కువగా నూనెను వాడతారు. వీటిని అప్పుడప్పుడు రుచి కోసం తీసుకోవడంలో తప్పు లేదు కానీ, రోజూ  అలవాటుగా మార్చుకోవడం మంచిది కాదు. అన్నం తినే విషయంలో కూడా వండే పద్ధతిని మార్చుకోవడం ద్వారా గ్లైసమిక్ ఇండెక్స్ ను తగ్గించవచ్చు. అన్నం వండేటప్పుడు గంజి వార్చడం మన పూర్వీకుల కాలం నుంచి ఉన్న పద్ధతి. దీని వల్ల అన్నంలో గ్లైసమిక్ ఇండెక్స్ తగ్గుతుందట. ఇది షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరగకుండా సహాయపడుతుందట. వ్యాయామం.. ఫిట్నెస్ , మారథాన్ల పేరుతో విపరీతంగా శ్రమించడం, అలాగే రోజూ గంటల తరబడి ఒకే పొజిషన్ లో  కదలకుండా కూర్చోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మందగించి రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుందని వైద్యులు తెలిపారు. కాబట్టి ఆఫీసుల్లో పని చేసేవారు లేదా సుదూర ప్రయాణాలు చేసేవారు ప్రతి గంటకు ఒకసారి లేచి కాస్త నడవడం మంచిది. ఆరోగ్యం విషయంలో ఎవరి సలహాలనో గుడ్డిగా అనుసరించకుండా, మన శరీరం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ సరైన జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.   మీకు నచ్చవచ్చు   ఆహారం తినేటప్పుడు.. మీకు ఈ జబ్బు ఉందేమో చెక్ చేస్కోండి..!                                                                                                                                            *రూపశ్రీ.