LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో  కీలక పరిణామం చోటుచేసుకుంటోంది. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్  జనసేన గూటికి చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలలో క్రీయాశీలంగా ఉండకుండా మౌనం వహించిన ఆమంచి ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన తీర్ధం పుచ్చుకుంటారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.  సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న ఆమంచి కృష్ణమోహన్..  2014 అసెంబ్లీ ఎన్నికల్లో చీరాల నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా  రంగంలోకి దిగి విజయం సాధించారు. ఈ తరువాత ఆయన తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చారు. అయితే..  2019 ఎన్నికలకు ముందు  తెలుగుదేశం పార్టీని వీడి, వైసీపీ పంచన చేరారు.  2019 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై పోటీ చేసి  కరణం బలరాం చేతిలోపరాజయం పాలయ్యారు.  ఆ ఓటమి తరువాత  వైసీపీలో ఆమంచి కృష్ణమోహన్ ను ఇసుమంతైనా ప్రాధాన్యత దక్కలేదు.   దీంతో   2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహన్  వైసీపీని వీడి.. వైఎస్ షర్మిల సమక్షంలో కాంగ్రెస్  తీర్థం పుచ్చుకున్నారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి అధికారపగ్గాలు చేపట్టింది.  దీంతో ఆమంచి రాజకీయంగా ఇన్ యాక్టివ్ అయ్యారు. అయితే ఇటీవల కొంత కాలంగా ఆయన తన అనుచరులు, నియోజకవర్గ ముఖ్య నేతలతో వరుస భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. ఆ చర్చలలో చీరాలలో తన పట్టు నిలుపుకోవాలన్నా, రాజకీయంగామనుగడ సాగించాలన్న జనసేనలో చేరడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చారు.   ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో జనసేనను మరింత బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆపరేషన్ ఆకర్ష్ ఒక్కటే మార్గమని భవించిన.. ఆమంచి నేడో రేపు ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఆ దిశగా ఇప్పటికే  జనసేన ముఖ్యులతో ఆమంచి చర్చలు జరిపారనీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పాయింట్ మెంట్ ఖరారైన తరువాత ఆయన జనసేన చేరిక ప్రకనట చేసే అవకాశం ఉందనీ, జనసేన వర్గాల ద్వారా తెలుస్తోంది.   Amanchi Krishna Mohan, Janasena Party, Pawan Kalyan, Chirala Politics, Teluguone
  తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రజా జీవితంలో అరుదైన మైలురాయిని చేరుకున్నారు. కేవలం ఒక సాధారణ రాజకీయ నాయకుడిగా మొదలైన ఆయన ప్రయాణం, నేడు తెలంగాణ రాష్ట్రాన్ని శాసించే ముఖ్యమంత్రి స్థాయికి చేరి సరిగ్గా రెండు దశాబ్దాలు పూర్తి చేసుకుంది. ఈ 20 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఒక భావోద్వేగ భరితమైన పోస్ట్‌ను పంచుకున్నారు. రెండు దశాబ్దాల తన ప్రజా జీవితం మరుపురాని మధుర జ్ఞాపకం అని ఆయన కొనియాడారు. కేవలం రేవంత్ రెడ్డి అనే పేరుతో ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణాన్ని, ప్రజలు ఆదరించి 'రేవంతన్న'గా తమ గుండెల్లో నిలిపిన తీరును ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ సుదీర్ఘ ప్రయాణంలో మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం నుంచి ప్రారంభమైన తన తొలి రాజకీయ అడుగులను రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్థానిక సంస్థల ప్రతినిధిగా మిడ్జిల్ లో మొదలైన ప్రయాణమే తనను ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఈ 20 ఏళ్ల కాలంలో ఎన్నో సందర్భాలు, మరెన్నో రాజకీయ పరిణామాలు, తీవ్రమైన సంఘర్షణలను ఎదుర్కొన్నానని, అయితే ప్రతి కష్టకాలంలోనూ, ప్రతి మలుపులోనూ ప్రజలు తనకు అండగా నిలిచారని ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సుదీర్ఘ ప్రస్థానం తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన అధ్యాయమని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఇదే ప్రజాదరణ, స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలనేదే తన ఏకైక సంకల్పమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో తాను ఒక సామాన్య శ్రామికుడిగా నిరంతరం శ్రమిస్తానని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే ఒక నమ్మకమైన సేవకుడిగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. అధికార గర్వం లేకుండా, కేవలం ప్రజల మనిషిగా, అందరి 'రేవంతన్న'గా ప్రజా హృదయాల్లో మరింత ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకోవడమే తన ఆశయమని ఆయన ఈ మైలురాయి సందర్భంగా ఉద్ఘాటించారు. 2006 నుంచి 2026 వరకు సాగిన ఈ రెండు దశాబ్దాల ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఒంటరి పోరాటాలు చేసి, చివరకు ప్రజా బలంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన రేవంత్ రెడ్డి ప్రయాణం తెలుగు రాజకీయాల్లో ఒక సంచలనం.  
కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. ఆమె స్థాపించిన కొత్త పార్టీ తెలంగాణ రక్షణ సేన పేరుపై భారీ ఎత్తున అభ్యంతరాలు వచ్చిన కారణంగా పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు పార్టీకి అధికారిక సమాచారం ఇచ్చింది.  ఈసీ ఆదేశాల మేరకు   కవిత తన టీఆర్ఎస్ పార్టీ పేరుకు ప్రత్యామ్నాయంగా మూడు పేర్లను ఈసీకి పక్షం రోజుల్లోగా సమర్పించాల్సి ఉంటుంది. నిర్దేశిత గడువులోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సూచించకుంటే దరఖాస్తున్న మూసేస్తామని హెచ్చరించింది. అంతే కాకుండా టీఆర్ఎస్ పేరును కొనసాగించేందుకు అనుమతి ఉండదని విస్పష్టంగా పేర్కొంది.   తన పార్టీకి తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేర్కొంటూ..  రిజిస్ట్రేషన్ కోసం కవిత ఈసీకి దరఖాస్తు చేసుకున్న సంగతి విదితమే. అయితే..  ఈ పేరుపై  వెయ్యికి పైగా అభ్యంతరాలు వచ్చాయని అందువల్ల మూడు ప్రత్యామ్నాయ పేర్లను  కు సర్పించాలని ఈసీ  కవితకు లేఖ రాసింది.   కాగా ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలపై స్పందించిన కవిత..  ఈసీ కోరినట్లు ప్రత్యామ్నాయంగా కొత్త పేర్లు ఇచ్చే ప్రసక్తే లేదనీ..  ఈ విషయంలో న్యాయపోరాటం చేస్తామనీ తెలిపారు.  గత ఫిబ్రవరిలో తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజా శక్తి  పేర్లను సూచిస్తూ కవిత సీఈసీకి లేఖ రాశారు. ఈ క్రమంలో ఏప్రిల్ 25న మునీరాబాద్ లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో తమ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేనగా  ప్రకటించిన కవిత, అదే సభలో పార్టీ జెండాను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన మూడు రోజులకు కవిత కొత్త పార్టీ పేరును  తెలంగాణ రక్షణ సేన గా ఈసీ ప్రాథమికంగా గుర్తించింది.  తాజాగా ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ..  ప్రత్యామ్నాయ పేర్లు ఎంపిక చేసుకోవాలని సూచించడం తెలంగాణలో రాజకీయ సంచలనానికి తేరతీసింది.  ECI, Kalvakuntla, Kavitha, TRSname, Teluguone, Telangana Politics
వైసీపీ వచ్చే ఎన్నికలలోనూ ఓటమి ఖరారని ఇప్పుడే మానసికంగా ఫిక్సైపోయిదా? వచ్చే ఎన్నికలలో కూడా పరాజయం తప్పదన్న నిర్ణయానికి వచ్చేసిందా? అన్న ప్రశ్నలకు తాజాగాకేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో   చేపట్టిన ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియ (సర్) విషయంలో ఆ పార్టీ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, చేస్తున్న విమర్శలను ఎత్తి చూపుతూ పరిశీలకులు ఔననే అంటున్నారు.  కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షానికి కొమ్ముకాసేలా ఉన్నాయంటూ వైసీపీ విమర్శలు గుప్పిస్తోంది.   కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు (ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను సేకరించే ప్రక్రియను గత నెల 15 నుండి ప్రారంభించారు. ఈ సర్వేలో భాగంగా ప్రతి ఇంటికి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, ఓటర్ల పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. దీని ఆధారంగా జూలై 21న ఓటర్ల ప్రాథమిక ముసాయిదా  విడుదల కానుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, చేర్పులు, మార్పుల ప్రక్రియ ముగిశాక, సెప్టెంబర్ 22న తుది ఓటర్ల జాబితాను   ప్రకటిస్తారు. అయితే ఈ 3 నెలల సుదీర్ఘ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ విమర్శిస్తోంది.  ఆ పార్టీ ప్రధాన ఆరోపణ ఏంటంటే..  క్షేత్రస్థాయిలో  తెలుగుదేశం పార్టీ అనుకూల సిబ్బందితో అర్హులైన వైసీపీ  మద్దతుదారుల ఓట్లను ఉద్దేశపూర్వకంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని. గతంలో అంటే.. 2014 నుండి 2019 మధ్య కాలంలో కూడా ఇలాగే పెద్ద ఎత్తున దొంగ ఓట్లను చేర్చారని, ఇప్పుడు తమ పార్టీకి అండగా నిలిచే ఓటర్లను లక్ష్యంగా చేసుకుని జాబితా నుండి తొలగిస్తున్నారని వైసీపీ ఆరోపిస్తున్నది.    బూత్‌కు 50 చొప్పున తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను అధికార కూటమి ప్రభుత్వం తొలగిస్తోందనీ సర్ గడువు నెల రోజులు పెంచాలంటూ వైసీపీ  వినతిపత్రాలు ఇస్తోంది. ఇదే ఇప్పుడు వైసీపీ మూడేళ్ల తర్వాత జరిగే ఎన్నికలలో ఓటమికి ఇప్పటి నుంచే రెడీ అయిపోతోందా? అన్న అనుమానాలు కలిగేలా చేస్తున్నదంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. ఓటర్ల జాబితా పరిశీలన ప్రక్రియ ఎలా జరుగుతుందన్న విషయంలో రహస్యమేదీ ఉండదు.. రాజకీయ పార్టీలకే కాదు.. సామాన్య ప్రజలకు కూడా ఈ ప్రక్రియ పట్ల సంపూర్ణ అవగాహన ఉంటుంది.  కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో బూత్ లెవెల్ అధికారులు  ప్రతి ఇంటికీ వెళ్లి..  నివాసం ఉంటున్న వారినే ఓటర్లుగా గుర్తిస్తూ   పారదర్శకంగా వ్యవహరిస్తున్నారు. ఈ పరిశీలనలో  అర్హులైన ఏ  పౌరుడి ఓటు పోయే అవకాశమే ఉండదు.   పోతే గీతే..  ఒకే ఇంట్లో పదుల సంఖ్యలో చేర్చిన దొంగ ఓట్లు..  చనిపోయిన వారి పేరుతో ఉన్న బోగస్ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు, మూడు నియోజకవర్గాల్లో ఉన్న డూప్లికేట్ ఓట్లను మాత్రమే తొలగిస్తారు. ఇదే వైసీపీని భయపెడుతోంది. అలా తొలగిపోయే ఓట్లన్నీ తమవేనని చెప్పుకుంటోంది. అలా చెప్పుకోవడం ద్వారా.. ప్రతి బూత్ కూ తమవి దాదాపు 50 దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పకనే చెప్పుకుంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తమ విశ్లేషణకు రుజువుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో..    వైసీపీ నేతలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి బూత్‌లోనూ భారీగా  దొంగ ఓట్లను చేర్పించారన్న బలమైన ఆరోపణలను చూపిస్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ, క్షేత్రస్థాయి వెరిఫికేషన్ ద్వారా ఆ దొంగ ఓట్లు తొలగిపోతుండటంతో వైసీపీకి ఓటమి భయం పట్టుకుందంటున్నారు.     YSRCP Allegations on ECI, Voter Verification Process AP, Special Intensive Revision
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో  విజయసాయిరెడ్డి స్టైలే వేరు. ఆయన రూటే సెపరేటు. రాజకీయ సన్యాసం అని ప్రకటించి వ్యవసాయమే తన వ్యాపకమన్న చాటిన తరువాత కూడా విజయసాయి..   రాజకీయాలే మాట్లాడుతున్నారు. మనిషిగా ఆయన రాజకీయాలకు దూరం అని చెబుతున్నా.. ఆయన మనసు మాత్రం రాజకీయాలతోనే ఉందని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. పైకి వైసీపీతోనూ, జగన్ కోటరీతోనూ విసిగిపోయానని, అందుకే బయటకు వచ్చేశాననీ విజయసాయి చెబుతున్నా.. ఆయన మాటలూ చేతలూ అన్ని జగన్ కు ప్రయోజనం చేకూర్చడానికే అన్నట్లుగా ఉంటాయి. ఉంటున్నాయి.  ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతి ఖరారైన తరువాత కూడా జగన్ కు అనుకూలంగా.. విజయసాయిరెడ్డి తాజాగా రాజధాని విషయంలో చేసిన కొత్త ప్రతిపాదన ఈ విషయాన్ని నిర్ధారిస్తోంది.  నిన్నటి వరకు వైస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించిన ఆయన, ఇప్పుడు జగన్ మనసులోని ఆలోచనలను ప్రతిబింబించేలా, రాజధాని విషయంలో  కొత్త డిమాండ్‌ను తెరపైకి తీసుకువచ్చి.. జగన్ పై తనకున్న భక్తిని, అభిమానాన్నీ చాటుకున్నారు.  ఇటీవల జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికలకు తమ నినాదంమావిగన్' (మచిలీపట్నం - విజయవాడ - గుంటూరు)  అని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాబోయే ఎన్నికలు మావిగన్ వర్సెస్ అమరావతి అన్నట్టుగా సాగుతాయని కూడా జగన్ చెప్పారు. ఇక్కడే విజయసాయి రెడ్డి పైకి మావిగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు కనిపిస్తూనే..  జగన్ ప్రతిపాదించిన మూడు నగరాలకు అదనంగా  మంగళగిరిని కూడా చేర్చి, మచిలీపట్నాన్ని తొలగించి తెనాలి పేరును తీసుకువచ్చి విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి  (వీజీటీఎమ్) ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా అభివృద్ధి చేయాలన్నారు.  గతంలో శివరామకృష్ణ కమిషన్ కూడా ఈ వీజీటీఎం  ప్రాంతాన్ని రాజధానిగా  అభివృద్ధి చేయాలని సూచించిన విషయం తెలిసిందే. కేవలం ఒకే చోట అమరావతిని నిర్మించడం కంటే.. ఈ నాలుగు  నగరాలను సమగ్రంగా విస్తరిస్తూ కనెక్టివిటీని పెంచితే, అది ఆటోమేటిక్‌గా రాష్ట్రానికి ఒక అద్భుతమైన మెగా రాజధాని అయిపోతుందంటూ విజయసాయి సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. ఒకవైపు అమరావతిపై  విమర్శలు చేస్తూ, అక్కడ భారీగా అవినీతి జరిగిందని ఆరోపించడమే కాకుండా, ఈ వివాదంపై త్వరలోనే న్యాయస్థాన్ని ఆశ్రయిస్తానంటూ.. జగన్ చెప్పిన మాటలనే మరో డిక్షన్ తో విజయసాయి చెబుతున్నారు.   విజయసాయిరెడ్డి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 స్థానంలో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన సంగతి విదితమే.  అప్పట్లో అమరావతిని ఏకాభిప్రాయంతో రాజధానిగా నిర్ణయించినప్పుడు గానీ, ఆ తర్వాత జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చినప్పుడు గానీ ఆయన ఎన్నడూ వీజీటీఎం ప్రస్తావన తీసుకు రాలేదు. ఇప్పుడు.. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత...వీజీటీఎమ్ అంటూ మాట్లాడటం విజయసాయి అసలు ఉద్దేశాన్ని బయటపెడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  AP Capital Row, Amaravati Controversy, VGTM Proposal, Mavigan Concept
ALSO ON TELUGUONE N E W S
Narne Nithiin has officially begun work on his next film, tentatively titled #NN5, marking his first collaboration with producer Venkat K Narayana's KVN Productions. Directed by Radha Krishna Reddy, the film was launched on Sunday with a traditional pooja ceremony attended by members of the cast and crew. The project is being described as a youthful romantic entertainer with an emotional core. Narne Nithiin will be seen alongside Anikha Surendran and Megha Shetty, making for a fresh lead pairing. The film also marks another significant production for KVN Productions, a banner that has been expanding its presence across multiple film industries with big-budget ventures. The launch ceremony featured several prominent names from the industry. Producer Venkat K Narayana sounded the clapboard and handed over the script to the director, while acclaimed cinematographer Senthil Kumar switched on the camera. MAD director Kalyan Shankar directed the inaugural shot, officially setting the film in motion. On the technical front, the film has music by composer duo Vivek & Mervin. While the makers are yet to reveal more details about the storyline or the rest of the cast, the combination of Narne Nithiin, Radha Krishna Reddy and KVN Productions has already generated curiosity. With principal photography now underway, more updates about the film are expected in the coming weeks.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.     
The makers of director Anil Ravipudi's upcoming family entertainer unveiled Nandamuri Kalyan Ram's first look on the actor's birthday, offering audiences a glimpse of his character in the much-awaited film. The project marks the first on-screen collaboration between Victory Venkatesh and Kalyan Ram and is being planned as a Sankranthi release. The newly released poster presents Kalyan Ram in a festive avatar, dressed in a white pancha and kurta with a flower garland and sunglasses while striking a dance pose. Set against a vibrant backdrop resembling a wedding celebration, the poster hints at the colorful and family-oriented tone that Anil Ravipudi is known for. According to the makers, Kalyan Ram will be seen in a role unlike his previous outings, with Ravipudi designing a character that leans heavily into comedy while retaining the actor's trademark screen presence. Coinciding with the first-look launch, Kalyan Ram also made his Instagram debut by sharing the poster with fans. Produced by Sahu Garapati under the Shine Screens banner and presented by Suresh Productions and Zee Studios, the film stars Keerthy Suresh and Krithi Shetty as the female leads. Music is composed by GV Prakash Kumar, while filming is currently underway in Hyderabad. With Anil Ravipudi at the helm and two established stars coming together for the first time, the film is shaping up to be one of the notable releases lined up for the Sankranthi festival season.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
Satyadev and director Venkatesh Maha's Rao Bahadur is continuing to receive overwhelming appreciation from the Telugu film industry. After earning glowing words from Mahesh Babu and Sukumar, the film has now found two more high-profile admirers in Naga Chaitanya and Adivi Sesh, who praised its originality, performances and filmmaking. Naga Chaitanya personally met the Rao Bahadur team to congratulate them after watching the film. During his interaction with Satyadev and Venkatesh Maha, the actor discussed several scenes, shots and the subtext behind the narrative, appreciating the way the film was conceived and executed. Chaitanya also applauded Satyadev for fearlessly choosing unconventional characters and remarked that both the actor and director should conduct masterclasses on approaching and designing such complex roles. Encouraging audiences to experience the film firsthand, Chaitanya said people should not be influenced by reviews or opinions and instead watch it in theatres. Calling it a landmark achievement, he stated that Rao Bahadur would become "a reference point to Telugu Cinema." Adivi Sesh also shared his admiration for the film through social media, describing it as an "outrageous and inventive" cinematic experience. While acknowledging its psychological and magical realism elements, he felt the film's dark comedy stood out and admitted that it made him laugh on several occasions. Sesh praised Mahesh Babu, Namrata Shirodkar and the producers for backing such an original film, while hailing Satyadev's work as the performance of his career. He also applauded the supporting cast, technical departments and Venkatesh Maha's vision, calling Rao Bahadur one of the most original Telugu films in recent times and comparing it to a bold Jackson Pollock painting. With appreciation continuing to pour in from across the industry, Rao Bahadur is steadily strengthening its reputation as one of the year's most talked-about Telugu films.   Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరికీ నటులుగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలనే బలమైన కోరిక ఉంటుంది. అయితే, ఆ క్రమంలో వచ్చే అవకాశాల కోసం తమ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టవద్దని, వ్యక్తిగత హద్దులను ఎప్పుడూ దాటవద్దని ప్రముఖ సీనియర్ నటి కాజల్ అగర్వాల్ యువ నటీనటులకు ఎంతో విలువైన హితవు పలికారు. సినీ రంగంలో దాదాపు రెండు దశాబ్దాల పాటు అగ్ర నటిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న కాజల్, తన సుదీర్ఘ కెరీర్‌లోని ఎన్నో ఆసక్తికర అనుభవాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రతి విషయానికి 'యస్' చెప్పాల్సిన అవసరం అస్సలు లేదని ఆమె స్పష్టం చేశారు. మనకు నచ్చని లేదా మానసికంగా ఇబ్బంది కలిగించే ఏ విషయానికైనా ధైర్యంగా 'నో' చెప్పడం అలవాటు చేసుకోవాలని ఆమె నేటి తరం నటులకు సూచించారు. తన సరికొత్త చిత్రం 'ది ఇండియా స్టోరీ' ప్రమోషన్ల కార్యక్రమంలో భాగంగా ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో కాజల్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ ఆరంభం నుండి తాను పాటించిన సూత్రాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. కేవలం అవకాశాల కోసం మాత్రమే కాకుండా, తన వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవడానికే తాను ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇచ్చానని తెలిపారు. అందుకే తన సుదీర్ఘ సినీ ప్రస్థానంలో తనకు ఇబ్బందికరంగా అనిపించిన కొన్ని గ్లామరస్ బికినీ సన్నివేశాలను, అలాగే శృతిమించిన శృంగార దృశ్యాలను ఏమాత్రం సంకోచించకుండా తిరస్కరించానని ఆమె ధైర్యంగా వెల్లడించారు. కథలో ప్రాధాన్యత ఉన్నా లేకపోయినా, నటులుగా మన హద్దులను మనమే నిర్ణయించుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు.ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం విపరీతంగా పెరిగిపోయిందని, దీనివల్ల ముఖ్యంగా యువ నటీనటులపై ఎనలేని ఒత్తిడి ఉంటోందని కాజల్ ఆవేదన వ్యక్తం చేశారు.  ఇంటర్నెట్‌లో కనిపించే అవాస్తవిక సౌందర్య ప్రమాణాలను అందుకోవాలనే తాపత్రయంలో ఎంతోమంది యువతీ యువకులు మానసిక సంఘర్షణకు గురవుతున్నారని ఆమె పేర్కొన్నారు. గ్లామర్ ఇండస్ట్రీలో నిలబడాలనే కంగారులో వారు పడుతున్న ఈ మానసిక ఒత్తిళ్లను చూస్తుంటే తనకు చాలా బాధగా అనిపిస్తుందని అన్నారు. ఈ అవాస్తవిక ఒత్తిళ్లను ఎదుర్కొని, వాటిని తట్టుకుని సరికొత్తగా పరిశ్రమలో వారు తమదైన శైలిలో నిలదొక్కుకోవాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కాజల్ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. తన సినీ ప్రస్థానం మొదలైన రోజుల్లో కూడా బరువు పెరగడం, తగ్గడం వంటి శారీరక మార్పులపై కొందరు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారని కాజల్ గుర్తుచేసుకున్నారు. కానీ నాటి రోజులతో పోలిస్తే, ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న సోషల్ మీడియా ట్రోలింగ్స్ మరియు అంచనాల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని వివరించారు. ఇదే సమయంలో తన కొత్త చిత్రం 'ది ఇండియా స్టోరీ' గురించి మాట్లాడుతూ, ఈ సినిమా కోసం చేసిన విస్తృతమైన పరిశోధన వల్ల దేశంలోని ఆహార భద్రత వంటి తీవ్రమైన సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఏర్పడిందని తెలిపారు. ఆ సినిమా ఇచ్చిన ప్రేరణతోనే ప్రస్తుతం తన కుటుంబ జీవనశైలిలో మరియు ఆహార అలవాట్లలో కూడా ఎన్నో ఆరోగ్యకరమైన మార్పులు చేసుకున్నట్లు కాజల్ అగర్వాల్ సంతోషంగా పంచుకున్నారు.     Kajal Aggarwal, The India Story, Kajal Aggarwal Advice, Telugu Cinema News, Tollywood Updates, Social Media Pressure Actress
సినీ పరిశ్రమలో కంటెంట్‌ను నమ్ముకుంటే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందో, ఎలాంటి అద్భుతాలు సృష్టించవచ్చో లేటెస్ట్ మూవీ 'దీవాన' (Deewana) నిరూపించింది. సినిమా ఇండస్ట్రీలో ఒక సామెత ఉంది.. నమ్మకమే పెట్టుబడి అని. ఆ నమ్మకాన్ని, తమ సినిమాలోని కంటెంట్‌ను మాత్రమే నమ్ముకున్న దీవాన చిత్ర నిర్మాతలు మొదట కొన్ని ఇబ్బందులు పడినప్పటికీ, ఇప్పుడు ఏకంగా ఊహించని రేంజ్‌లో భారీ జాక్ పాట్ కొట్టారు.  సాధారణంగా ఒక చిన్న లేదా మీడియం బడ్జెట్ సినిమా రూపొందుతున్నప్పుడు, నిర్మాతలు సేఫ్ జోన్‌లోకి వెళ్లడం కోసం సినిమా విడుదలకు ముందే నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్మేసుకోవడానికి తెగ ఆరాటపడుతుంటారు. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ రికవరీ అయిపోయి, థియేట్రికల్ రిలీజ్ టైమ్‌కి టెన్షన్ తగ్గుతుందని భావిస్తారు. కానీ, దీవాన చిత్ర నిర్మాతలు మాత్రం ఇందుకు భిన్నంగా వెళ్లారు. తమ సినిమా అవుట్‌పుట్ పై ఉన్న నమ్మకంతో విడుదలకు ముందు తక్కువ రేట్లకు అడిగిన ఆఫర్లను వారు సున్నితంగా తిరస్కరించారు. కంటెంట్ పక్కాగా ఉంటే థియేటర్లలో రెస్పాన్స్ చూశాక అదే డిమాండ్ వస్తుందనే మొండి ధైర్యంతో నాన్-థియేట్రికల్ రైట్స్‌ను అస్సలు అమ్మకుండా హోల్డ్‌లో పెట్టేశారు. ఇప్పుడు వారి నమ్మకం నిజమైంది.  ఈ సినిమా పాజిటివ్ రివ్యూల ఇంపాక్ట్ ఇప్పుడు నాన్-థియేట్రికల్ మార్కెట్‌పై గట్టిగా పడింది. విడుదలకు ముందు ఈ హక్కుల కోసం పెద్దగా ఆసక్తి చూపని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లు, శాటిలైట్ ఛానెళ్లు ఇప్పుడు దీవాన రైట్స్ కోసం పోటీ పడటం విశేషం. ఈ క్రమంలోనే నిర్మాతలు ఆశించిన దానికంటే ఎక్కువగా, ఏకంగా రూ. 7 కోట్లకు పైగా భారీ ధర పలికి దీవాన నాన్-థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయాయి. ఒక చిన్న చిత్రానికి ఈ స్థాయి బిజినెస్ జరగడం ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. రిస్క్ చేసి కంటెంట్‌ను నమ్ముకున్నందుకు నిర్మాతలకు ఒక జాక్ పాట్‌లా మారి లాభాల పంట పండిస్తోంది.      Deewana Movie, Non Theatrical Rights, OTT Deal, TeluguOne  
సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్‌(Telegram)కు భారత ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. టెలిగ్రామ్ వేదికగా సాగుతున్న అక్రమ కంటెంట్ వ్యాప్తిపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ (I&B Ministry) అత్యంత కఠినమైన నిర్ణయం తీసుకుంది. టెలిగ్రామ్‌లో పైరేటెడ్ సినిమాలు, ఓటీటీ కంటెంట్ మరియు ఇతర ఆడియో-విజువల్ మెటీరియల్‌ను అక్రమంగా హోస్ట్ చేస్తున్న లేదా షేర్ చేస్తున్న అన్ని గ్రూపులు, ఛానెళ్లను తక్షణమే తొలగించాలని కేంద్రం ఆదేశించింది.  ఈ పైరసీ కంటెంట్‌ను తొలగించడానికి టెలిగ్రామ్ యాజమాన్యానికి కేవలం 15 రోజుల గడువును విధించింది. ఒకవేళ ఈ 15 రోజుల వ్యవధిలో సదరు అక్రమ కంటెంట్, గ్రూపులను తొలగించడంలో విఫలమైతే, టెలిగ్రామ్ సంస్థపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు ఐ అండ్ బీ మినిస్ట్రీ ఒక సమగ్రమైన నోటీసును టెలిగ్రామ్‌కు జారీ చేసింది. తాము తీసుకున్న చర్యలపై రాబోయే 15 రోజుల్లోగా సమగ్రమైన 'యాక్షన్ టేకెన్ రిపోర్ట్' (ATR) సమర్పించాలని కోరింది. గతంలో కేవలం కొన్ని నిర్దిష్ట లింక్‌లను మాత్రమే బ్లాక్ చేసే విధానం ఉండేదని, అయితే ఇప్పుడు ఆ పద్ధతిని మార్చి నేరుగా ప్లాట్‌ఫార్మ్ జవాబుదారీతనంపై దృష్టి పెట్టినట్లు ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.  దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్రియేటర్ ఎకానమీని, చలనచిత్ర పరిశ్రమను, బ్రాడ్‌కాస్టర్లను, ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లను, నిర్మాతలు, పంపిణీదారులను పైరసీ మహమ్మారి నుండి రక్షించేందుకే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వివిధ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌ల నుండి, కంటెంట్ ఓనర్ల నుండి వచ్చిన లెక్కలేనన్ని ఫిర్యాదుల ఆధారంగా ప్రభుత్వం దర్యాప్తు చేపట్టి, పైరసీకి అడ్డాగా మారిన సుమారు 3,142 టెలిగ్రామ్ ఛానెళ్లను ప్రాథమికంగా గుర్తించడం గమనార్హం. భారతీయ చట్టాల ప్రకారం కాపీరైట్ ఉల్లంఘన అనేది కేవలం సివిల్ వివాదం మాత్రమే కాదని, అది కాపీరైట్ యాక్ట్ 1957 & సినిమాటోగ్రాఫ్ యాక్ట్ 1952 కింద శిక్షార్హమైన క్రిమినల్ నేరమని కేంద్రం గుర్తుచేసింది. ఐటీ యాక్ట్ 2000, ఐటీ రూల్స్ 2021 నిబంధనల ప్రకారం టెలిగ్రామ్ ఒక మధ్యవర్తి ప్లాట్‌ఫార్మ్ అయినందున, తన నెట్‌వర్క్‌లో ఎలాంటి చట్టవిరుద్ధమైన కంటెంట్ షేర్ కాకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత సదరు సంస్థదే అని పేర్కొంది. ప్రభుత్వం లేదా కంటెంట్ ఓనర్లు వచ్చి ప్రతీ లింక్‌ను చూపించే వరకు వేచి చూడకుండా, టెలిగ్రామ్ తన అంతర్గత వ్యవస్థలను బలోపేతం చేసుకుని అక్రమ కంటెంట్‌ను ప్రోయాక్టివ్‌గా గుర్తించి తొలగించాలని ఆదేశించింది.  ఇప్పటికే ఎగ్జామ్ పేపర్ లీకేజీల వ్యవహారంలో గత నెలలోనే టెలిగ్రామ్ యాక్సెస్‌పై తాత్కాలిక ఆంక్షలు విధించిన కేంద్రం, ఇప్పుడు పైరసీ విషయంలో మళ్లీ నోటీసులు ఇవ్వడం డిజిటల్ రంగంలో సంచలనంగా మారింది.     Telegram, Piracy, Central Government, Notice, TeluguOne
టాలీవుడ్‌లో మైథలాజికల్ అడ్వెంచర్ సినిమాలకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఈ కోవలోనే భారీ అంచనాలతో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లేటెస్ట్ విజువల్ వండర్ చిత్రం 'నాగబంధం' (Nagabandham). విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సోషియో మైథలాజికల్ ఫాంటసీ డ్రామాను దర్శకుడు అభిషేక్ నామా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఏకంగా 100 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో ఎన్‌ఐకే స్టూడియోస్, అభిషేక్ పిక్చర్స్ బ్యానర్లపై కిషోర్ అన్నపురెడ్డి, నిషిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, జూలై 3న థియేటర్లలోకి అడుగుపెట్టిన ఈ సినిమాకు ప్రేక్షకులతో పాటు సినీ విమర్శకుల నుండి విభిన్నమైన స్పందన లభించింది. సినిమాలోని గ్రాండియర్, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయినప్పటికీ, థియేటర్లలో ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వ్యక్తం చేసిన ప్రధానమైన ఫిర్యాదు ఒక్కటే. అది ఈ సినిమా నిడివి. నాగబంధం సినిమాను మొదట ఏకంగా 185 నిమిషాల (3 గంటల 5 నిమిషాలు) సుదీర్ఘమైన రన్‌టైమ్‌తో థియేటర్లలో రిలీజ్ చేశారు. సినిమాలోని కొన్ని సాగదీత సీన్లు, నెమ్మదించిన కథనం కారణంగా ప్రేక్షకులు కొంత అసహనానికి గురయ్యారు. ఈ ఫీడ్‌బ్యాక్‌ను గమనించిన మేకర్స్, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. సినిమాకు వస్తున్న ప్రేక్షకుల రివ్యూలను గౌరవిస్తూ, సినిమాలోని రన్‌టైమ్‌ను ఏకంగా 20 నిమిషాల పాటు తగ్గించారు. ఈ ట్రిమ్మింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, నాగబంధం సరికొత్త నిడివి ఇప్పుడు 2 గంటల 45 నిమిషాలు (165 నిమిషాలు) మాత్రమే. ఈ 20 నిమిషాల అనవసరమైన సాగదీత సీన్లను తొలగించడం వల్ల సినిమా కథనం ఇప్పుడు మరింత వేగంగా, ఆసక్తికరంగా మారిందని ఇండస్ట్రీ టాక్. ఈ మార్పుల తర్వాత బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా సినిమా మరింత పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ హీరోగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'రావు బహదూర్' (Rao Bahadur) ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ సాధించిన విజయానందాన్ని పంచుకోవడానికి చిత్ర యూనిట్ శనివారం ఒక సక్సెస్ మీట్ ను నిర్వహించింది. అయితే, ఈ సక్సెస్ మీట్‌లో ఒక ఎమోషనల్ సంఘటన చోటుచేసుకుంది. ఈ చిత్రంలో కథానాయికగా నటించిన మలయాళ బ్యూటీ దీపా థామస్ (Deepa Thomas) వేదికపై మాట్లాడుతున్న సమయంలో ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. దర్శకుడు వెంకటేష్ మహా తన సుదీర్ఘమైన 5 ఏళ్ల కెరీర్ శ్రమను ధారపోసి ఈ వినూత్నమైన కథను సిద్ధం చేశారు. కేవలం కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా, 169 నిమిషాల నిడివితో సమాజంలోని వర్ణవివక్ష, వంశపారపర్య అహంకారం, మానసిక ఘర్షణలను అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సూపర్ స్టార్ మహేష్ బాబు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. ఇంతటి భారీ ప్రాజెక్ట్‌లో ఒక మలయాళ అమ్మాయికి ఇంతటి బలమైన, ఎమోషనల్ ప్రాధాన్యత ఉన్న రేణుక పాత్రను ఇవ్వడంపై దీపా థామస్ సక్సెస్ ఈవెంట్‌లో తన మనసు విప్పింది. ఒక తెలుగు సినిమాలో తనకు దక్కిన గుర్తింపును చూసి, ప్రేక్షకులు తన నటనను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పెడుతున్న కామెంట్లను ప్రస్తావిస్తూ ఆమె ఆనందబాష్పాలు రాల్చింది. సక్సెస్ మీట్ వేదికపై దీపా థామస్ మాట్లాడుతూ.. "మహేష్ బాబు గారి GMB ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో, వెంకటేష్ మహా గారి దర్శకత్వంలో నటించడం నా లైఫ్ చేంజింగ్ మూమెంట్. ఒక పరభాషా నటినైనా తెలుగు ప్రేక్షకులు నన్ను తమ సొంత అమ్మాయిలా ఆదరిస్తున్నారు. థియేటర్ల నుండి వస్తున్న స్పందన చూస్తుంటే నా కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి" అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. దీపా థామస్ ఎమోషనల్ స్పీచ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.   Rao Bahadur, Satyadev, Deepa Thomas, Venkatesh Maha, Mahesh Babu  
తెలుగు సినీ పరిశ్రమలో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకి సరికొత్త నిర్వచనం చెబుతూ, బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది స్టార్ హీరోయిన్ సమంత నటించిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం'. నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తొలి రోజు నుంచే అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. టాలీవుడ్‌లో గత 17 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ఒక భారీ రికార్డును ఈ సినిమా బద్దలు కొట్టడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. కేవలం సమంత వన్-ఉమెన్ షోతోనే థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం విశేషం. విడుదలైన మొదటి రోజే ఈ చిత్రం దేశీయంగా  5.35 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. అదేవిధంగా ఇండియా గ్రాస్ కలెక్షన్స్ రూ. 6.20 కోట్లు, మరియు ఓవర్సీస్ మార్కెట్లలో రూ. 4.50 కోట్ల గ్రాస్ సాధించి, ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే ఏకంగా రూ. 10.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లతో డబుల్ డిజిట్ మార్కును దాటి సంచలనం సృష్టించింది. ఈ ఓపెనింగ్స్ చూశాక సమంత స్టార్ పవర్ ఏంటో మరోసారి స్పష్టమైంది. కేవలం ఒకే ఒక్క వారంలోనే ఈ చిత్రం . 35 కోట్ల నెట్ కలెక్షన్లు దాటి లాంగ్ రన్‌లో తిరుగులేని విధంగా నిలిచింది. విడుదలైన 14 రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా  92 కోట్ల భారీ వసూళ్లను సాధించి, 100 కోట్ల క్లబ్‌కు అత్యంత చేరువలో నిలిచింది. దీంతో టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూళ్లు సాధించిన ‘ఫీమేల్ లీడ్’ (మహిళా ప్రధాన) చిత్రంగా ‘మా ఇంటి బంగారం’ సరికొత్త రికార్డును లిఖించింది. 2009లో అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుంధతి’ చిత్రం సాధించిన రూ. 70 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ రికార్డును సమంత 17 ఏళ్ల తర్వాత క్లీన్ స్వీప్ చేసింది. మహానటి, రుద్రమదేవి వంటి చిత్రాలు ఉన్నప్పటికీ, వాటిలో భారీ తారాగణం మద్దతు ఉంది. కానీ పూర్తి సోలో ఫీమేల్ లీడ్‌గా సమంత సాధించిన ఈ ఘనత టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర. Also read: Tollywood: రిస్కీ ప్రాజెక్ట్స్ తో టెన్షల్ లో టాలీవుడ్ హీరోలు       స్వర్ణ/ఝాన్సీగా సమంత నటన, యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించాయి. సంతోష్ నారాయణన్ అందించిన ఎలెక్ట్రిఫైయింగ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ చిత్రంలో గుల్షన్ దేవయ్య, దిగంత్, గౌతమి మరియు శ్రీముఖి కీలక పాత్రల్లో నటించగా, సమంత స్వయంగా తన సొంత బ్యానర్ 'ట్రలాలా మూవింగ్ పిక్చర్స్' పై ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. గర్భవతిగా ఉన్న సమయంలోనే సమంత ఈ చిత్రంలోని కొన్ని యాక్షన్ బ్లాక్స్ షూట్ చేశారనే విషయం తెలిసి అభిమానులు ఆమె డెడికేషన్‌కు హ్యాట్సాఫ్ చెప్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకి  బ్రహ్మరథం పడుతుండటంతో ఈ సినిమా వసూళ్లు ఇంకా కొనసాగుతున్నాయి.ఇక ఈ మూవీ తొలుత సాయి పల్లవి చేయాల్సింది. కానీ సాయిపల్లవి బిజీగా ఉండటంతో సమంత చేసింది. ఈ విషయాన్నీ సమంత నే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన మన స్టార్ హీరోల మార్కెట్, ఇప్పుడు గ్లోబల్ స్థాయికి విస్తరించింది. అయితే భారీ క్రేజ్‌తో పాటే బాక్సాఫీస్ వద్ద రిస్క్ కూడా అంతకంతకు పెరుగుతోంది. సాధారణ కమర్షియల్ ఫార్ములా సినిమాలని పక్కనబెట్టి, మన ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్‌తో పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్, సోషియో ఫ్యాంటసీ వంటి అత్యంత రిస్కీ ప్రాజెక్టులు చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ బాక్సాఫీస్ సమీకరణాలు ఎలా మారుతున్నాయి, ఏయే హీరోలు ఎంతెంత బడ్జెట్‌తో రిస్క్ చేస్తున్నారనే విశ్లేషణ ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ రిస్కీ గేమ్ లో అందరికంటే ముందు వరుసలో నిలుస్తున్నారు పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్. కల్కి లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న 'ఫౌజీ' ఇప్పుడు ఇండస్ట్రీలో భారీ అంచనాలని  మోస్తోంది. దాదాపు 600 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'సీతారామం' లాంటి క్లాసిక్ లవ్ స్టోరీతో మెప్పించిన హను రాఘవపూడి, ఇంతటి భారీ పాన్ ఇండియా యాక్షన్ వార్ డ్రామాను హ్యాండిల్ చేయడం ఇదే మొదటిసారి. 1930 - 1940 కాలం నాటి బ్రిటిష్ ఇండియా, ప్రీ, ఇండిపెండెన్స్ యుద్ధం నేపథ్యంతో ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ పీరియడ్ ఎలిమెంట్స్ నేటి మాస్ ఆడియన్స్‌కి ఎంతవరకు కనెక్ట్ అవుతాయి, భారీ బడ్జెట్ రికవరీ ఎలా సాధ్యమవుతుంది అనేది ఇండస్ట్రీ ముందున్న అతిపెద్ద ప్రశ్న. హిట్ మాత్రమే సరిపోదు, ఏకంగా 1000 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేస్తేనే ఈ ప్రాజెక్ట్ సేఫ్ జోన్‌లోకి వస్తుంది. మరోవైపు, మెగాస్టార్ చిరంజీవి కూడా తన కెరీర్‌లో ఎన్నడూ లేనంత పెద్ద సోషియో ఫ్యాంటసీ రిస్క్‌కి  సిద్ధమయ్యారు. అప్ కమింగ్ మూవీ 'విశ్వంభర' పై భారీ అంచనాలే  ఉన్నాయి. ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా భారీ వీఎఫ్ఎక్స్ (VFX) వర్క్  కారణంగా పలుమార్లు వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సహజంగానే సినిమా మేకింగ్ కాస్ట్ పెరిగి, బడ్జెట్ దాదాపు 350 కోట్ల నుంచి 400 కోట్ల రూపాయల రేంజ్‌కు చేరుకుందనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి గత లేటెస్ట్ సినిమాల మార్కెట్ మరియు బాక్సాఫీస్ రికార్డులను గమనిస్తే, ఇంత భారీ మొత్తాన్ని రికవరీ చేయడం సాధారణ విషయం కాదు. కేవలం తెలుగు మార్కెట్ పైనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ చిత్రం అద్భుతాలు సృష్టిస్తేనే బయ్యర్లు లాభాల బాట పడతారు. Also read: fauzi: ఫౌజీ సెట్స్‌లో మరోసారి ఘోర ప్రమాదం.. వరుస ప్రమాదాలకి ఇదే కారణమా!  టాలీవుడ్‌లో కేవలం ఈ ఇద్దరే కాదు, రాబోయే సెకండాఫ్‌లో విజయ్ దేవరకొండ తన రణబలి మూవీతో, నిఖిల్ స్వయంభు మూవీతో తమ మార్కెట్ ని మించిన బడ్జెట్ తో వస్తున్నారు. ఇలా మొత్తం 6 పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటి మొత్తం బడ్జెట్ దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు ఉండడం గమనార్హం. పీరియాడిక్ సినిమాలకు భారీ విజువల్స్, ఎక్కువ రన్‌టైమ్, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలు అవసరమవుతాయి. దీంతో ఒక్కో ప్రాజెక్ట్ పై నిర్మాతలకు, బయ్యర్లకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏ మాత్రం టాక్ తేడా వచ్చినా వందల కోట్ల నష్టాలు తప్పవు. అయితే, కంటెంట్ బలంగా ఉండి, ప్రేక్షకులకి  కొత్త అనుభూతిని ఇస్తే టాలీవుడ్ మార్కెట్ స్థాయికి 2000 కోట్లు పెద్ద విషయం కాదని గత రికార్డులు నిరూపించాయి. మరి మన స్టార్ హీరోలు, స్టార్ హీరో స్టేటస్ రేసులో ఉన్న వాళ్ళు తీసుకున్న ఈ భారీ రిస్క్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో, టాలీవుడ్‌ని  ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి.   
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం,  ఈర్ష్య,  అసూయ,  ఓర్చుకోలేని తత్వం ఇలాంటివన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. అలాంటి వారిని చెడ్డవాళ్లుగా చెబుతూ ఉంటారు.  చాలా వరకు మనుషులు తాము మంచి వాళ్లని, చెడ్డ వాళ్లని బయటకు చెప్పుకోరు.  వారి ప్రవర్తనలో ఇది బయటపడుతూ ఉంటుంది.  ముఖ్యంగా కొందరు వ్యక్తులు మంచి వాళ్ల చుట్టూ చేరి తీయని మాటలతో మోసం చేయాలని చూస్తుంటారు.  వారు ఇలా మోసం చేస్తారని తెలుసుకోలేని పరిస్థితిలో కొందరు ఉంటారు.  తీయని మాటలతో అందరినీ మోసం చేయగల వ్యక్తులు ఎలా ఉంటారు? వారిని కనిపెట్టడం ఎలా?  తెలుసుకుంటే.. ప్రసంశలు.. ఎవరైనా  కలిసిన వెంటనే మితిమీరి పొగడటం మొదలుపెట్టినా లేదా రాత్రికి రాత్రే మిమ్మల్ని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రకటించినా, జాగ్రత్తగా ఉండాలి. మోసం చేసే వ్యక్తులు  వారిని గుడ్డిగా నమ్ముతారనే ఆశతో, మొదట్లో  ప్రేమను, పొగడ్తలను కురిపిస్తారు. మీకు వాళ్ల మీద  నమ్మకం ఏర్పడిన తర్వాత, వారి నిజ స్వరూపం బయటపడుతుంది. తప్పు ఒకరిది, అవమానం మరొకరిది.. తీయని మాటలతో మోసం చేసే వ్యక్తుల ముఖ్య లక్షణం ఏమిటంటే, వారు తమ తప్పులను ఎన్నడూ ఒప్పుకోరు . ఒకవేళ మీరు వారు తప్పు చేయడం మీరు గమనించినా, వారు ఆ పరిస్థితిని ఎంత చాకచక్యంగా వాడుకుంటారంటే, చివరికి మీకే అపరాధభావం కలుగుతుంది. మీరు తప్పు చేశారని మీకు అనిపించేలా  చేస్తారు. తమని తాము అనుమానించుకునేలా.. "నేను అలా ఎప్పుడూ అనలేదు," అనడం లేదా..  "నీకే పిచ్చి, అది అసలు ఎప్పుడు జరిగింది, అలాంటిదేం  జరగలేదు." వంటి  మాటలు ఎవరినుండైనా ఎదురవుతూ ఉంటే..  జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఇతరులను తమ చెప్పుచేతల్లో ఉంచుకునేవారు తరచుగా మీకు ఎంత నమ్మకంగా అబద్ధాలు చెబుతారంటే, మీరు మీ జ్ఞాపకశక్తిని, నిజాయితీని మీరే అనుమానించడం మొదలుపెడతారు. ఇది మనసును నియంత్రించడంలో చాలా ప్రమాదకరమైన పద్ధతి. అయ్యో పాపం అనుకునేలా చేయడం.. పరిస్థితులు ఎలా ఉన్నా, తప్పు ఎవరిదైనా సరే, తియ్యని మాటలతో మోసం చేసే  వ్యక్తులు తామే ప్రపంచంలో చాలా బాధలో ఉన్నవారమన్నట్లుగా కథను చెబుతారు. వారు మీ సానుభూతిని పొందాలని చూస్తారు, తద్వారా మీరు వారి పట్ల జాలిపడి, వారు చెప్పే ప్రతిదానితో ఏకీభవించి వారి గురించి పాపం అనుకునేలా చేస్తారు. ఇష్టమైన వారి నుండి వేరు చేయడం.. మిమ్మల్ని లొంగదీసుకోవాలనుకునే వ్యక్తి, మొదట మిమ్మల్ని మీ నిజమైన స్నేహితులు , కుటుంబ సభ్యుల నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తారు. "మీ కుటుంబం మిమ్మల్ని అర్థం చేసుకోదు" లేదా "మీకు ఉన్నది నేను ఒక్కడినే" అనే ఆలోచనలను  మనసులో నాటుతారు. మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారని, వారిపై ఆధారపడి ఉన్నారని భావించేలా చేయడానికి వారు ఇలా చేస్తారు. అవసరం.. అవసరానికి మాత్రమే మాట్లాడేవారు, మిగతా సమయాలలో తప్పించుకోవడం లేదా కారణాలు, సాకులు చెప్పి దూరంగా ఉండటం చేసేవారు మోసం చేసే స్వభావం కలిగినవారని అర్థం.  ఇలాంటి వారు తమకు అవసరం వచ్చినప్పుడు  చాలా మంచివారిలా ఉంటారు, కానీ వారి పని పూర్తయిన వెంటనే, మిమ్మల్ని మళ్లీ పట్టించుకోవడం మానేస్తారు . తియ్యగా మాట్లాడేవారిని గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తరచుగా చాలా బాగా నటిస్తారు. కానీ ఎప్పుడూ మీ అంతరాత్మ చెప్పేది వినాలి. ఒక సంబంధం మీకు సంతోషానికి బదులుగా ఎప్పుడూ మానసిక గందరగోళాన్ని, ఒత్తిడిని కలిగిస్తుంటే, హద్దులు పెట్టుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అర్థం.                                    *రూపశ్రీ.
భార్యాభర్తల బంధం విచ్చిన్నం కాకుండా కాపాడే బంగారు సూత్రం! నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం. ఇవి ప్రస్తుతం చాలామంది  ఎదుర్కొంటున్న అతిపెద్ద ఛాలెంజ్ లు. ముఖ్యంగా బార్యాభర్తల బంధం ఈ కాలంలో చాలా బలహీనంగా మారింది.  బంధాలను కాపాడుకోవడం,  మనఃశాంతిగా ఉండటం.. ఈ రెండింటిని ఎలా సమతుల్యం చేసుకోవాలనేదే అతిపెద్ద గందరగోళం. అయితే ఈ విషయానికి సమాధానం లేదా అంటే.. ఖచ్చితంగా ఉంది. బంధాలు నిలబెట్టుకోవడానికి బంగారు సూత్రం ఉంది. అదేంటో తెలుసుకుంటే.. బంధాలకు బంగారు సూత్రం.. నేటి వివాహాలు, సంబంధాలలో ఉన్న అతిపెద్ద బలహీనతను  ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోకపోవడమే.  బంధం బాగుండాలంటే బంధం ముడిపడేవరకు  కళ్ళు తెరిచి ఉండాలి, కానీ బంధం ముడిపడిన తర్వాత కళ్లు మూసుకుని ఉండాలట. ఈ విషయాన్ని  స్వయానా సినీ నటుడు, రచయిత, ఆధ్యాత్మిక వేత్త అయిన అశుతోష్ రాణా చెప్పుకొచ్చారు.  ఈయన తెలుగులో కూడా చాలా సినిమాలలో నటించారు.   ఒకరితో సంబంధంలోకి వచ్చాక, కళ్ళు మూసుకోవాలని ఆయన అంటున్నారు. దీని అర్థం ఏమిటంటే, ఒక సంబంధం ఏర్పడిన తర్వాత, ప్రతి చిన్న లోపాన్ని పట్టుకుని విమర్శించడం లేదా ఫిర్యాదు చేయడం కంటే, కొన్ని విషయాలను పట్టించుకోకుండా ఉండటం ముఖ్యమని అర్థం. ఈ ప్రపంచంలో ఏ మనిషి అన్ని విషయాలలోనూ పర్పెక్ట్ గా ఉండరు.  ప్రతి ఒక్కరిలోనూ కొన్ని చెడు అలవాట్లు, తప్పు చేసే స్వబావం, కొన్ని లోపాలు ఉంటాయి.   భగవద్గీతలోని పద్దెనిమిదవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు, అగ్ని ఎల్లప్పుడూ పొగతో కప్పబడి ఉన్నట్లే, ప్రతి మనిషిలోనూ, ప్రతి చర్యలోనూ ఏదో ఒక లోపం లేదా దోషం ఉంటుందని పేర్కొన్నాడు. వివాహం విషయానికి వస్తే..  సీతాదేవి , శ్రీరాముని జీవితంలో కనిపించేది  సమతుల్యత. అక్కడ వివాహానికి ముందు రాముడి  యోగ్యతను పరీక్షించినప్పటికీ, వివాహం తర్వాత వారిద్దరూ ఒకరి పరిమితులను మరొకరు అంగీకరించి, ప్రేమ , కర్తవ్యానికి మాత్రమే ఎక్కువ  ప్రాధాన్యతనిచ్చారు. ఈ రోజుల్లో పెళ్లి తర్వాత చాలామంది తమ భాగస్వాములను మార్చుకోవాలని ప్రయత్నించడం వల్ల సంబంధాలు త్వరగా నాశనం అవుతున్నాయనేది చాలా మంది అర్థం చేసుకోరు, అయితే సగం కళ్ళు మూసుకోవడం అంటే ఉదాసీనత కాదు, అది ఎదుటి వ్యక్తిలోని లోపాలను అంగీకరించే పరిణతి. ప్రతి వ్యక్తకి తమ సమస్యలకు పరిష్కారాలు తమలోనే ఉంటాయి. కానీ వచ్చిన చిక్కల్లా తమని తాము విమర్శ చేసుకోలేక పోవడం, అలాగే..  తమకు నచ్చిన విధంగానే పరిష్కారం జరగాలని అనుకోవడం. ఇదే చాలామంది సమస్యలు పెద్దవి అవడానికి,  మనఃశాంతి లేకపోవడానికి దారి తీస్తుంది.  బందం బలంగా ఉండాలంటే చిన్న విషయాలను పట్టించుకోవడం మానెయ్యాలి. అదే బంగారు సూత్రం.                                           *రూపశ్రీ.  
ప్రపంచంలో ఈ దేశాలు ఎంతో స్పెషల్.. జిమ్ లేకుండానే వందేళ్ళ ఆయుష్షు వారి సొంతం..! ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు. అయితే ేటి వేగవంతమైన కాలంలో ఇది సాధ్యం కాదని అనిపిస్తుంది.   కాలం గడిచేకొద్దీ అనారోగ్యాలు చుట్టుముడతాయి,   లేదా శరీరం  బలహీనపడతుంది, చురుగ్గా ఉండలేకపోతాము, ఈ ప్రపంచంలో 100 ఏళ్లు దాటిన తర్వాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉంటూ, ఎలాంటి సమస్యలు లేకుండా తమ పనులన్నీ చేసుకుంటున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే ఇలాంటి వారు ఈ ప్రపంచంలో చాలా అరుదుగా కొన్నిదేశాలలోనే ఎక్కువగా ఉన్నారు.  ఆ దేశాలు ఏంటి? ఆ దేశాలలో ప్రజలు ఎందుకు 100ఏళ్లు బ్రతకగలుగుతున్నారు? తెలుసుకుంటే.. బ్లూ జోన్స్.. ప్రపంచవ్యాప్తంగా సాధారణ జనాభా కంటే ఎక్కువ మంది 100 సంవత్సరాలు జీవించే ప్రాంతాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ ప్రాంతాలను "బ్లూ జోన్స్" అని పిలుస్తారు. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సర్డీనియా, గ్రీస్‌లోని ఇకేరియా, కోస్టారికాలోని నికోయా , యునైటెడ్ స్టేట్స్‌లోని లోమా లిండా ప్రాంతాలలో నివసించే ప్రజలకు విభిన్న సంస్కృతులు ఉన్నప్పటికీ, వారి జీవనశైలిలో అలవాట్లు,  వారి జీవనవిధానం చాలా దగ్గరగా ఉంటుంది. వృద్ధాప్యానికి గురించిన రహస్యాలను విజ్ఞానశాస్త్రం ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. ప్రతి ఏటా కొత్త విషయాలు వెలుగు చూస్తూనే  ఉన్నాయి. కానీ ఇప్పటివరకు ఉన్న ఆధారాలన్నీ ఒకే విషయాన్ని వెల్లడిస్తున్నాయి.  దీర్ఘాయువు కోసం ఒక్క అద్భుత సూత్రం అంటూ ఏదీ లేదు.  కొన్నిరోజులు, నెలలు, ఏళ్ల పాటు పాటించిన అలవాట్లు, తీసుకున్న జాగ్రత్తలు,  జీవనవిధానం మీద ఇది ఆధారపడి ఉందని అంటున్నారు.                             *రూపశ్రీ.  
పురుషుల ఆరోగ్యం విషయంలో చాలామంది నిర్లక్ష్యం చేసే సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. ప్రారంభ దశలోనే గుర్తిస్తే చాలా రకాల క్యాన్సర్లను విజయవంతంగా చికిత్స చేయవచ్చు. అయితే లక్షణాలను నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యాధి ముదిరే ప్రమాదం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ యూరాలజిస్టు, ఆండ్రాలజిస్టు డా. ఏవి రవి కుమార్ పురుషుల్లో ఎక్కువగా కనిపించే ఐదు ప్రధాన క్యాన్సర్ల గురించి సులభంగా వివరించారు. ముఖ్యంగా ప్రోస్టేట్ క్యాన్సర్, మూత్రాశయ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, వృషణాల క్యాన్సర్, పురుషాంగ క్యాన్సర్ వంటి వ్యాధుల లక్షణాలు, ప్రమాద కారకాలు, ఎప్పుడు వైద్యుడిని సంప్రదించాలి అనే అంశాలను తెలియజేశారు.  అలాగే చాలామందికి ఉండే సందేహమైన యూరాలజీ (Urology) మరియు ఆండ్రాలజీ (Andrology) మధ్య ఉన్న తేడాను కూడా స్పష్టంగా వివరించారు. మూత్ర సంబంధిత వ్యాధులు, పురుషుల లైంగిక ఆరోగ్యం, సంతానలేమి సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు వంటి సందర్భాల్లో ఏ నిపుణుడిని సంప్రదించాలో ఈ ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు.  పురుషులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు? క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు ఎందుకు అవసరం? వంటి ఎన్నో ఉపయోగకరమైన విషయాలను ఈ వీడియోలో డా. ఏవి రవి కుమార్ వివరించారు.  ప్రతి పురుషుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన ఆరోగ్య సమాచారం కోసం ఈ వీడియోను పూర్తిగా వీక్షించండి.   మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
భారతదేశంలో టీ కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక అలవాటుగా , రోజును మొదలుపెట్టడానికి మంచి ఎనర్జీ డ్రింక్ గా కూడా భావిస్తారు. ఉదయం లేవగానే టీ తాగడం, పనిలో బ్రేక్  సమయంలో టీ తాగడం, సాయంత్రం స్నేహితులతో కలిసి టీని ఎంజాయ్ చేయడం.. ఇలా దాదాపు ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్ లో టీ  ఒక భాగం. కొందరు టీ తాగనిది ఏ పని చేయలేరు.. టీ తాగడం అనేది ఒక పెద్ద బలహీనతగా మారినవాళ్లు ఉంటారు. కానీ  ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే  శరీరంలో జరిగే మార్పుల గురించి చాలా మందికి తెలియదు.  కనీసం ఒక నెలరోజుల పాటు టీ తాగడం మానేస్తే అద్భుతాలు జరుగుతాయని  ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..  నిద్ర నాణ్యత.. టీలోని కెఫీన్ ఒక ఉత్ప్రేరకంగా పనిచేసి, మెదడును చురుకుగా ఉంచుతూ, నిద్ర పట్టే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. టీ తాగడం మానేసినప్పుడు, శరీరంలో కెఫీన్ ప్రభావం క్రమంగా తగ్గుతుంది. ఇది త్వరగా నిద్రపోవడానికి సహాయపడటమే కాకుండా, నిద్ర గాఢతను కూడా మెరుగుపరుస్తుంది.  టీ మానేసిన తర్వాత రాత్రిపూట తరచుగా వచ్చే నిద్రలేమి సమస్య కూడా తగ్గుతుందని చాలా మంది చెబుతారు. ఎసిడిటి, గ్యాస్.. ఎక్కువగా టీ తాగడం వల్ల కడుపులో ఆమ్లం ఉత్పత్తి పెరిగి, అసిడిటీ, గుండెల్లో మంట, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.  ముఖ్యంగా ఖాళీ కడుపుతో టీ తాగడం జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది.   టీ మానేయడం వల్ల, కడుపులోని ఆమ్లం బ్యాలెన్స్ మెరుగుపడి, జీర్ణక్రియ క్రమంగా సాధారణ స్థితికి వస్తుంది. దీనివల్ల కడుపు తేలికగా, సౌకర్యవంతంగా అనిపిస్తుంది. దంత ఆరోగ్యం.. టీలోని టానిన్లు దంతాలు మరకలు పడటానికి . పసుపు రంగులోకి మారడానికి కారణమవుతాయి. ఎక్కువ కాలం పాటు అధికంగా టీ తాగడం వల్ల దంతాల మెరుపు తగ్గుతుంది. టీ మానేయడం వల్ల దంతాలపై కొత్తగా మరకలు ఏర్పడటం తగ్గి, నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.  క్రమం తప్పకుండా బ్రష్ చేయడం వల్ల దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా కనిపిస్తాయి. ఒత్తిడి, ఆందోళన.. అధిక మోతాదులో కెఫిన్ తీసుకోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్లు పెరిగి, ఆందోళన, చంచలత్వం , భయం వంటి సమస్యలు ఏర్పడతాయి. టీ మానేసిన తర్వాత మనసు మరింత ప్రశాంతంగా ఉంటుంది, అలాగే మూడ్ స్వింగ్స్ కూడా తగ్గుతాయి. ఇది మానసిక స్థిరత్వాన్ని, ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది. చర్మం..  టీకి బదులుగా నీరు , ఆరోగ్యకరమైన పానీయాలు తీసుకోవడం  వల్ల, టీ మానేయడం వల్ల  శరీరం మరింత హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది.  తేమ పెరగడం వల్ల చర్మం మరింత కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. శరీరంలోని విషపదార్థాలను తగ్గించడం వల్ల పొడిబారడం, కాంతిహీనత వంటి చర్మ సమస్యలను కూడా నయం అయ్యి,  చర్మం మెరుపు పెరుగుతుంది. గుండె ఆరోగ్యం.. అధికంగా కెఫిన్ తీసుకోవడం కొంతమందిలో రక్తపోటు , హృదయ స్పందన రేటుపై ప్రభావం చూపుతుంది. టీ తాగడాన్ని తగ్గించడం లేదా పూర్తిగా మానేయడం వల్ల గుండెపై ఒత్తిడి తగ్గి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతారు.                                     *రూపశ్రీ.
కుక్కర్‌లో ప్రతి ఫుడ్‌ని ఉడికించేస్తున్నారా? అయితే ఈ విషయం తప్పకుండా తెలుసుకోవాలి మనం తినే ఆహారాన్ని ఎంత ఎక్కువగా ఉడికిస్తే అంత మంచిదని చాలామంది భావిస్తుంటారు. కానీ అధికంగా ఉడికించడం వల్ల కొన్ని పోషకాలు తగ్గిపోయే అవకాశం ఉంటుందని ప్రముఖ సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్, హోలిస్టిక్ లైఫ్‌స్టైల్ నిపుణురాలు శ్రీదేవి జాస్తి ఈ ఇంటర్వ్యూలో వివరించారు. ప్రతిరోజూ తినే ఆహారంలో కొంత భాగమైనా రా ఫుడ్‌కు కేటాయించాలని ఆమె సూచిస్తున్నారు. ముఖ్యంగా మొలకలు (Sprouts), తాజా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటి సహజ ఆహారాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు మరింత సహజ రూపంలో అందుతాయని ఆమె చెబుతున్నారు. అలాగే ప్రతి ఆహార పదార్థాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఎక్కువసేపు ఉడికించడం అలవాటుగా మార్చుకోవద్దని, ఏ ఆహారాన్ని ఎలా తీసుకుంటే శరీరానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుందో తెలుసుకుని ఆ విధంగా వంట చేయాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, సహజ ఆహారం, సరైన వంట విధానాలు, రోజువారీ డైట్‌లో రా ఫుడ్ ప్రాముఖ్యత గురించి తెలుసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)