LATEST NEWS
ఆంధ్రప్రదేశ్ లో  మే 13న పోలింగ్ జరగనుంది. శనివారం (మే 11) సాయంత్రంతో ప్రచారం ముగుస్తుంది.  ఎన్నికల ప్రచారంలో సినీ తళుకులు ఈ సారి పెద్దగా కనిపించలేదు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తెలుగుదేశం కూటమికి సామాజిక మాధ్యమం ద్వారా తెలుగుదేశం కూటమికి మద్దతు ప్రకటించారు. హిందూపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ పోటీలో ఉన్నారు. అలాగే పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. వీరిరువురికీ వారి అభిమానుల మద్దతు ఎటూ ఉంటుంది. అలాగే నందమూరి హీరోల మద్దతు బాలయ్యకు, మెగా హీరోల సపోర్టు పవన్ కల్యాణ్ కు  ఉంటుంది. పవన్ కల్యాణ్ తరఫున మెగా హీరోలు సాయిధర్మతేజ,  వైష్ణవ్ తేజ్, నాగబాబు వంటి వారు ప్రచారం చేశారు. మెగా స్టార్  చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కి, కూటమికి మద్దతు తెలుపుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా మద్దతు తెలిపింది. పవన్ కే తమ ఫుల్ సపోర్ట్ అని.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ప్రకటించారు.ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ కూడా జనసేన తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. అలాగే నందమూరి బాలకృష్ణ తరఫునా సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రచారం చేశారు. అన్నిటికీ మించి బాలకృష్ణ కూటమి తరఫున సీమ మెత్తం తిరిగి చేసిన ప్రచారానికి భారీ స్పందన  అభించింది. అదే విధంగా కూటమి భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ అభ్యర్థుల తరఫున హీరో విక్టరీ వెంకటేష్, రెబల్ స్టార్ కృష్ణం రాజు సతీమణి, ప్రభాస్ పెద్దమ్మ ప్రచారం చేశారు.   నందమూరి, మెగా, అల్లు, దగ్గుబాటి, రెబెల్ స్టార్ కుటుంబాలే కాకుండా  కూటమికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖుల జాబితా భారీగానే ఉంది. అలాగే  హీరోలు నాని, తేజ సజ్జ, నిఖిల్, నారా రోహిత్, రాజ్ తరుణ్, సీనియర్ నటులు నరేష్, సురేష్.. కమెడియన్స్ సప్తగిరి,  జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, కిరాక్ ఆర్పీ వంటి వారు కూటమికి మద్దతు ప్రకటించారు.  వీరే కాకుండా ఇంకా ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు తమ మద్దతు కూటమికే అని స్పష్టం చేశారు. టాలీవుడ్ విషయంలో జగన్ వ్యవహరించిన తీరు కారణంగా..  అధికార పార్టీపై సినీ పరిశ్రమ నుంచి పెద్ద ఎత్తున  వ్యతిరేకత వ్యక్తమవుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైసీపీ తరఫున ఈ సారి సినీ పరిశ్రమ నుంచి పెద్దగా ఎవరూ మద్దతు పలికిన దాఖలాలు లేవు. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రముఖ కమేడియన్ అలీ అసలు పార్టీ తరఫున ప్రచారానికి దూరంగా ఉన్నారు. అలాగే ఆ పార్టీ తరఫున పోసాని కృష్ణ మురళి మీడియా సమావేశాల్లో మాట్లాడడానికే పరిమితమయ్యారు.    
చంద్రబాబు నాయుడు అంటే కేసీఆర్‌కి విపరీతమైన ద్వేషం. ఎందుకంటే, ఆ రోజుల్లో కేసీఆర్ తోక కట్ చేసింది చంద్రబాబు. అలా తోక కట్ చేయడం వల్లే కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేశాడు. యువతరం ఆత్మబలిదానాల వల్ల తెలంగాణ వస్తే, దాన్ని తన గొప్పగా కలరింగ్ ఇచ్చి, పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఘోరమైన పాలన అందించాడు. తాను ముఖ్యమంత్రి అవడానికి పరోక్షంగా చంద్రబాబు కారణం అయినప్పటికీ కేసీఆర్‌కి చంద్రబాబు అంటే ద్వేషం. కేసీఆర్ అధికారంలో వున్న పదేళ్ళకాలంలో చంద్రబాబు మీద ఆయన చేయని కుట్ర లేదు.. పన్నని కుతంత్రం లేదు.. ఇప్పుడు తెలంగాణ ప్రజల చేత ఛీ కొట్టించుకుని, అధికారం కోల్పోయిన కేసీఆర్ ఇప్పటికీ చంద్రబాబు మీద విషం కక్కుతున్నాడు. ఏపీలో జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తాడని తన దగ్గర సమాచారం వుందని వీలైనచోటల్లా ఎవరూ అడక్కపోయినా చెబుతూ నోటి దురద తీర్చుకుంటున్నాడు.  చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి దెబ్బకి అధికారం కోల్పోయిన కేసీఆర్ లబోదిబో అంటున్నాడు. ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే కేసీఆర్ తట్టుకోగలడా.. అటు గురువు, ఇటు శిష్యుడు అధికారంలో వుంటే కేసీఆర్ కుళ్ళుకుని, క్రుంగి కృశించిపోతాడు. అందుకే చంద్రబాబు అధికారంలోకి రాడు అని విషప్రచారం చేయడానికి కేసీఆర్ వెనుకాడటం లేదు. మొన్నటి ఎన్నికలలో ఈయన గెలుస్తాడో, గెలవడో ఈయనకి తెలియదుగానీ, ఏపీ ఎలక్షన్ల గురించి ఈయన జోస్యం చెబుతున్నాడు. ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో 17 స్థానాలున్న తెలంగాణలో ఒక్క స్థానం కూడా బీఆర్‌ఎస్‌కి వచ్చే అవకాశాలు లేవని సర్వేలు చెబుతున్నాయి. తనకు గెలవటం చేతకాదుగానీ, చంద్రబాబు ఓడిపోతాడని ఈయన పనికిమాలిన జోస్యాలు చెబుతున్నాడు. కేసీఆర్ వ్యవహారం అలా వుంటే, కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతుకులు వెళ్ళదీస్తున్న ఆయన సొంతమీడియాలో పనిచేసే బానిసలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాడు అంటూ కథనాలు వండుతున్నారు. వాటిని సోషల్ మీడియాలో వ్యాప్తి చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు పొరుగు రాష్ట్రం గొడవలు మా రాష్ట్రంలో ఎందుకు అంటూ వదరుగా మాట్లాడిన కేటీఆర్ మనుషులు ఇప్పుడు పొరుగు రాష్ట్రం ఎన్నికల గురించి ఎక్కడలేని ఇంట్రస్టు చూపిస్తూ కథనాలు వ్యాప్తి చేస్తున్నారు.  బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలు ఇప్పటికే చెత్తకుండీలో వేసేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ పార్టీ డైరెక్ట్.గా డంపింగ్ యార్డుకు చేరుకుంటుంది. బీఆర్ఎస్ డంపింగ్ యార్డుకు చేరుకుంటే కేసీఆర్ మోచేతి నీళ్ళు తాగుతూ బతికే జనాలకు పోషణ వుండదు. అందుకే చంద్రబాబు మీద విష ప్రచారం చేస్తూ, తాము చేస్తున్న విష ప్రచారం నిజం కావాలని కోరుకుంటున్నారు. ప్రజలు మాత్రం వీళ్ళ ఆకతాయితనాన్ని గమనిస్తున్నారు. 
సోషల్ మీడియాలో కుమారి ఆంటీ పేరు అంతా కాదు. హైదరాబాద్ కుమారి ఆంటీ గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌త్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఓ వీడియోతో రాత్రికి రాత్రే సోషల్ మీడియా సెన్షేషన్ అయ్యారామె. ఏకంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిని ఆకర్షించారు. తాజాగా ఏపీ ఎన్నికల వేళ కుమారి ఆంటీ మరోసారి వార్త‌ల్లో నిలిచారు. ఆమె గుడివాడ టీడీపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు మద్దతుగా గుడివాడలోని 21, 24, 25, 31, 32 వార్డుల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వెనిగండ్ల రాముపై కుమారి ఆంటీ ప్రశంసలు కురిపించారు.  మహర్షి సినిమాలో మహేశ్‌ బాబు లాంటి మంచి మనసున్న వ్యక్తి అంటూ ప్రశంసించారు. ఆ సినిమాలో మహేశ్‌ బాబు ప్రజల కోసం సేవ చేస్తే, రియల్ లైఫ్ లో గుడివాడ‌లో రాము సేవ చేస్తున్నార‌ని కొనియాడారు. తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందన్నారు. ప్రజలందరి మంచి కోసమే తాను ప్రచారానికి వచ్చిన‌ట్లు పేర్కొన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి చెందుతుంద‌ని కుమారి ఆంటీ వ్యాఖ్యానించారు.  తన స్వస్థలమైన గుడివాడపై ప్రేమ, మమకారంతో ఇక్కడికి వచ్చానని.. ఇక్కడ అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రాముకు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. కొడాలి నాని హయాంలో అభివృద్ధి లేకపోగా, ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడలేదని దుయ్య‌బ‌ట్టారు.  వెనిగండ్ల రాము చ‌క్క‌టి విజన్ ఉన్న నేత అని.. కష్టపడేవారికి, విద్యావంతులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇప్ప‌టికే చర్యలు తీసుకున్నారని ఆమె గుర్తు చేశారు. రాము వంటి నేతలు అధికారంలో ఉంటే.. తమలాంటి వారికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎమ్మెల్యేగా వెనిగండ్ల రామును, గ్లాస్ గుర్తుకు ఓటు వేసి ఎంపీగా వల్లభనేని బాలశౌరిని గెలిపించి, ఎన్డీఏ కూటమికి మద్దతుగా నిలవాలని కుమారీ ఆంటీ కోరారు. ఇక ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వర్రావు, మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు , జనసేన ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ పట్టణ టీడీపీ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, 32, 31, 25, 21,24 వార్డుల టీడీపీ, జనసేన కమిటీల సభ్యులు పాల్గొన్నారు. అలాగే గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు, తెలుగు మహిళలు, తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ జనసేన అనుబంధ విభాగాల నేతలు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. గెలుపు ఓటములపై సర్వేలన్నీ వార్ వన్ సైడే అని చెబుతున్నాయి. అధికార పార్టీ నేతల తీరులో కానీ, స్వయంగా ఆ పార్టీ  అధినేతలో కూడా ఓటమి భయం ప్రస్ఫుటమౌతోంది. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరుగుతాయన్న నమ్మకం లేదని  స్వయంగా జగన్ ప్రకటించి కాడె పడేసినట్లు చెప్పేశారు. దీంతో వైసీపీ శ్రేణులలో నైరాశ్యం కానవస్తోంది. ఇవన్నీ ఆ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రతిఫలిస్తున్నాయి. ఇక ఉద్యోగులు, టీచర్లు నభూతో అన్న చందంగా పెద్ద ఎత్తున పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నతీరు కూడా వైసీపీ ఓటమి ఖాయమన్న సంకేతాన్నే ఇచ్చింది.  అయితే రాష్ట్ర మంతో ఒకెత్తు అయితే రాయలసీమది ఒక్కటీ ఒకెత్తు. మరీ ముఖ్యంగా కడప జిల్లా పరిస్థితే వేరు అని అంతా అంటుంటారు. కడప జిల్లాలో వైఎస్ ముద్ర అత్యంత బలంగా ఉంటుంది. ఆయన సీఎం కావడానికి ముందు నుంచీ కూడా కడప అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పుకున్నా.. ఆ జిల్లాలో కాంగ్రెస్ బలం మొత్తం వైఎస్ బలమేనన్నది తెలిసిందే. వైఎస్ మరణానంతరం వైఎస్ బలం, బలగం జగన్ కు బదలీ అయిపోయింది. 2014, 2019 ఎన్నికలలో ఇది స్పష్టంగా కనిపించింది. 2024 ఎన్నికలలోనూ అదే పరిస్థితి అని అంతా భావించారు. అయితే షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టి, కడప ఎంపీగా పోటీలోకి దిగడంతో కడపలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అలా అని వైఎస్ ను అభిమానించేవారంతా ప్లేటు ఫిరాయించి.. జగన్ కు దూరం జరిగి షర్మిల పంచకు వచ్చేసిన పరిస్థితీ లేదు. ఇప్పుడు ఏపీలో సార్వత్రిక ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దీంతో వైఎస్ అభిమానులంతా ఒక నిర్ణయానికి వచ్చేశారు. కడపలో ఒక ఓటు అటు, ఒక ఓటు ఇటు అని డిసైడైపోయారు. అంటే కడప లోక్ సభ స్థానంలో  ఒక  పార్టీ అభ్యర్థికి ఓటేస్తే, ఆ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ స్థానాలలో మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని కడప ఓటర్లు భావిస్తున్నారని పరిశీలకుల విశ్లేషణ. వారి విశ్లేషణ ప్రకారం అసెంబ్లీ ఎన్నికల వద్దకు వచ్చే సరికి వైఎస్ కుమారుడైన జగన్ పార్టీ వైసీపీ అభ్యర్థికి, కడప లోక్ సభ ఎన్నికలలో వైఎస్ కుమార్తె వైఎస్ షర్మిలకు ఓటు వేయాలని మెజారిటీ జనం భావిస్తున్నారు. అదే జరిగితే కడప లోక్ సభ వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి పనైపోయినట్లే అనడంలో సందేహం లేదు. కడప లోక్ సభ లో వైసీపీ ఓట్లను భారీగా షర్మిల తన ఖాతాలో వేసుకుంటారు. తెలుగుదేశం కూటమి ఓట్ల లో ఎటువంటి చీలికా ఉండదు. దీంతో అవినాష్ కు అంటే వైసీపీకి భారీ నష్టం వాటిల్లుతుంది. వైసీపీ ఓట్లలో భారీ చీలిక అనివార్యమని షర్మిల ప్రచారానికి వస్తున్న విశేష జనస్పందనే చెబుతోంది. దీంతో  కడప లోక్ సభ ఎన్నికలలో పోటీ కాంగ్రెస్, తెలుగుదేశం కూటమి మధ్యే అన్న వాతావరణం కనిపిస్తోంది.  వైసీపీ వీరభక్త హనుమాన్ వంటి కేడర్, నేతలూ కూడా వైఎస్ కుమార్తెకు ఓ ఓటు వేద్దాం అన్న అభిప్రాయాన్నే వ్యక్తం చేస్తున్నారు.  
ఒక తెలుగు మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీకి ఊడిపోయే ముఖ్యమంత్రి లాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చేసిన కామెంట్లు విని జనానికి మతిపోతోంది. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని, జనం భూమిని కబళించడానికి ఇన్ని ప్లాన్స్ వేస్తూ, పైకి మాత్రం జనానికి మేలు చేయడానికి మాత్రమే దేశంలో ఎక్కడా లేని ఈ చట్టాన్ని తెస్తున్నట్టుగా జగన్ మాట్లాడుతున్న తీరు చూసి ‘ముదురు టెంకెవే’ అని అని జనం అనుకుంటున్నారు.  ఎవరైనా సరే ఫలానా భూమి తమది అని ప్రభుత్వం దగ్గర ప్రూవ్ చేసుకోవాలి. ఒకవేళ వేరే ఎవరైనా ఆ భూమి తమదని ప్రభుత్వానికి క్లైమ్ చేసుకుంటే, ఆ విషయాన్ని సదరు అసలు ఓనరు గుర్తించి, నిర్ణీత వ్యవధిలో ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయాలి. లేకపోతే ఎవరైతే ముందు ఆ భూమి తమదని క్లెయిమ్ చేశారో వారికే ఆ భూమి చెందుతుంది. ఆ తర్వాత భూమి రియల్ ఓనర్ కోర్టుకు వెళ్ళే ఛాన్స్ కూడా వుండదు. మళ్ళీ వాళ్ళు ప్రభుత్వానికి మొర పెట్టుకుంటే, ప్రభుత్వమే జరిగిన పొరపాటును గ్రహిస్తుంది. నష్టపోయిన వ్యక్తికి ప్రభుత్వమే నష్టపరిహారం ఇస్తుంది. అంతే తప్ప, అక్రమంగా భూమిని కొట్టేసిన వ్యక్తిని ఏమీ అనదు. ఇక్కడ పెద్ద తిరకాసు ఏమిటంటే, ఏ భూమి అయినా గవర్నమెంట్ విలువ ఎకరానికి రెండు లక్షలు వుంటే, దాని విలువ మార్కెట్లో ఎన్ని కోట్లయినా వుండవచ్చు. ప్రభుత్వ ధరకు, అసలు ధరకు చాలా వ్యత్యాసం వుంటుంది. అంటే, జగన్ మనుషులే భూములు కబ్జా పెడతారు. భూమి సొంతదారు లబోదిబోమంటే, గవర్నమెంట్ పరిహారం ఇస్తుంది. అంటే, లక్షలు, కోట్ల విలువ చేసే భూమికి ప్రభుత్వ రేటు ఎంత వుందో అంత ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. భూమి విలువ ఎంత వుందో అంతే ఇచ్చాంగా.. ఇందులో మా తప్పేముంది అని అమాయకంగా మాట్లాడుతుంది. నీ భూమిని నువ్వు కాపాడుకోకుండా నిర్లక్ష్యం వహించావు, అందుకే అది అన్యాక్రాంతం అయింది. అయినా సరే, ప్రభుత్వం దయతలచి నీకు నష్టపరిహారం ఇచ్చింది అని దానకర్ణుడికి కజిన్ సిస్టర్లా మాట్లాడుతుంది. అప్పుడు భూమి యజమానికి ఏడవటం తప్ప చేసేదేం వుండదు.
ALSO ON TELUGUONE N E W S
ఇదే.. ఇదే.. తెలుగు ధనుష్ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటుంది ఇదే. రఘువరన్ బిటెక్ నుంచి వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు కూడా ఇదే. తమ అభిమాన హీరో మూవీ  తమిళంతో పాటు తెలుగులోను ఒకేసారి  అప్ డేట్ ఉండాలని. ఒకేసారి అప్ డేట్ ఇవ్వడమే కాదు  డబుల్ ఆనందాన్ని కూడా తెచ్చింది.  ధనుష్ నయా మూవీ  రాయన్.అచ్చమైన తెలుగు భాషలో  ఫుల్ మాస్  సాంగ్  రిలీజ్ అయ్యింది. తల వంచి ఎరగడే ,తల దించి నడవడే, తల పడితే వదలడే, తన పేరు విజయుడే ,ప్రాణం పోతున్నా వస్తున్నా, పొగరు వీడడు వీడే..దూరం జరగండి నిప్పై వచ్చాడు వీడే  అనే లిరిక్ తో  స్టార్ట్ అయ్యింది. ఆస్కార్ విన్నర్  చంద్రబోస్ సాహిత్యంలో వచ్చిన పాటలోని ప్రతి లిరిక్ కూడా ఎంతో అద్భుతంగా ఉంది. అలాగే హీరోయిజాన్ని ఎలివేట్ చెయ్యడంతో పాటు రాయన్ లోని ధనుష్ క్యారక్టర్ రేంజ్ ని కూడా చెప్తుంది. ఇప్పుడు ఈ సాంగ్  తెలుగు  ధనుష్ ఫ్యాన్స్ లో  నూతన ఉత్సాహాన్ని తెస్తుంది.   రేపు థియేటర్స్ లో  రచ్చ ఖాయం. హేమ చంద్ర, శరత్ సంతోష్ లు ఆలపించగా ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా కంపోస్జ్ చెయ్యడం విశేషం. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. దీంతో  మిగతా సాంగ్స్  కోసం కూడా  ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు  ఇక రాయన్ లో ఎన్నో విశేష అంశాలు ఉన్నాయి. ధనుష్ నే రచన దర్శకత్వం వహిస్తున్నాడు. ఆయన సోదరుడు ఎన్నో హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన సెల్వ రాఘవన్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. దుష్ర విజయన్,అపర్ణ బాలమురళి,ఎస్ జె సూర్య, సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు.సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తున్నాడు. రజనీకాంత్ జైలర్ కి కూడా ఈయనే నిర్మాత.  జూన్ 13 న  పాన్ ఇండియా లెవల్లో  విడుదల కానుంది. తెలుగులో సురేష్ ప్రొడక్షన్స్ అండ్  ఏషియన్ లు కలసి విడుదల చేస్తున్నాయి   
ఇళయ దళపతి విజయ్ తో ఆట సింహంతో వేట రెండు ఒకటే.. ఈ మాట విజయ్ కొత్త సినిమా  రిలీజ్ రోజున  ఫ్యాన్స్ చెప్తుంటారు. వాళ్ళు చెప్పినట్టుగానే టాక్ తో సంబంధం లేకుండా సదరు  మూవీ రికార్డు కలెక్షన్స్ ని సృష్టిస్తుంది. అంతవరకు బాగానే ఉంది. కానీ లేటెస్ట్ న్యూస్ ఒకటి వైరల్ గా మారింది. సాక్షాత్తు ఫ్యాన్సే షాక్ కి గురవుతున్నారు  విజయ్ అప్ కమింగ్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటుంది. విజయ్ పొలిటికల్ పార్టీ పెట్టిన నేపధ్యంలో మూవీపై  అందరిలోను భారీ అంచనాలే  ఉన్నాయి. ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అది కూడా రికార్డు స్థాయిలో. అలాగే  ఓటిటి డీల్ కూడా పూర్తయ్యింది. ప్రముఖ దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ 150 కోట్లకి దక్కించుకుంది. కొన్ని రోజుల క్రితం  ఈ న్యూస్ సంచలనం సృష్టించగా ఇప్పుడు ఇంకో సంచలన న్యూస్  బయటకి వచ్చింది. శాటిలైట్ హక్కులని జీ సంస్థ  93 కోట్ల రూపాయిల భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు తెలుస్తుంది. ఇది హయ్యెస్ట్ పెయిడ్ అమౌంట్ అని చెప్పవచ్చు  విజయ్ డ్యూయల్ రోల్ పోషిస్తుండగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా చేస్తుంది. ఏజిఎస్ ఎంటర్ టైన్మెంట్ పై కల్పతి ఎస్ అఘోరామ్, గణేష్, సురేష్ లు నిర్మిస్తున్నారు. హిట్ చిత్రాల దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వాన్ని వహిస్తున్నాడు.తమిళంలో ఇప్పటి వరకు  సుమారు పది చిత్రాల దాకా ఆయన నుంచి వచ్చాయి . గత సంవత్సరం తెలుగులో నాగ చైతన్య హీరోగా వచ్చిన కస్టడీ కి ప్రభునే దర్శకుడు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తున్నాడు.  సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కతున్న ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం  లో ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, జయరాం,మోహన్ తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.  విజయ్ కెరీర్ లో ఇది 68 వ చిత్రం  
సినిమా పేరు: ప్రతినిధి 2  తారాగణం: నారా రోహిత్, సిరి లెల్లా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, దినేష్ తేజ్, అజయ్ ఘోష్, ఇంద్రజ, సప్తగిరి, తనికెళ్ళ భరణి తదితరులు సంగీతం: మహతి స్వరసాగర్  డీఓపీ: నాని చమిడిశెట్టి  రచన, దర్శకత్వం: మూర్తి దేవగుప్తపు నిర్మాత: కుమార్ రాజా, ఆంజనేయులు, సురేంద్రనాథ్ బ్యానర్: వానరా ఎంటర్టైన్మెంట్స్, రానా ఆర్ట్స్ విడుదల తేదీ: మే 10, 2023 ఎన్నికల సీజన్ లో పొలిటికల్ సినిమాలకు ఉండే డిమాండే వేరు. అందుకే, నారా రోహిత్ హీరోగా మూర్తి దర్శకత్వంలో రూపొందిన 'ప్రతినిధి 2'.. విడుదలకు ముందు అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో 'ప్రతినిధి'తో మెప్పించిన నారా రోహిత్ ఇప్పుడు 'ప్రతినిధి 2'తో రావడం, పైగా ఈ చిత్రంతో జర్నలిస్ట్ మూర్తి దర్శకుడిగా మారడంతో.. ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. మరి 'ప్రతినిధి 2' ఎలా ఉంది? 'ప్రతినిధి' స్థాయిలో మెప్పించిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం. కథ: చేతన్(నారా రోహిత్) ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్. నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే నిజాయితీగల చేతన్ ను.. NNC అనే ఛానల్ ఏరికోరి సీఈఓగా నియమిస్తుంది. ఆ ఛానల్ ను వేదికగా చేసుకొని, రాజకీయ నాయకుల అక్రమాలను వెలుగులోకి తీసుకొస్తూ.. వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తాడు. అదే సమయంలో ముఖ్యమంత్రి ప్రజాపతి(సచిన్ ఖేడేకర్) బాంబు బ్లాస్ట్ లో మరణిస్తాడు. తండ్రి మరణంతో కొడుకు విశ్వ(దినేష్ తేజ్) సీఎంగా ప్రమాణస్వీకారానికి సిద్ధమవుతాడు. మరోవైపు బాంబు బ్లాస్ట్ వెనకున్న అసలు నిజాన్ని వెలికితీసే ప్రయత్నం చేతన్ చేస్తుండగా.. ఊహించని విధంగా అతనే అరెస్ట్ అవుతాడు. అసలు సీఎంని చంపాలనుకున్నది ఎవరు? బాంబు బ్లాస్ట్ కి, చేతన్ కి సంబంధం ఏంటి? చివరికి ఏం జరిగింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: నారా రోహిత్, జర్నలిస్ట్ మూర్తి కలిసి పొలిటికల్ మూవీ చేస్తున్నారని తెలిసినప్పుడు.. ఇది ఓ పార్టీకి అనుకూలంగానో, మరో పార్టీకి వ్యతిరేకంగానే ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు. కానీ సినిమా చూసాక ఆ అభిప్రాయం తప్పని తేలిపోతుంది. ఎందుకంటే ఈ సినిమా ఎవరినో టార్గెట్ చేసినట్టుగా లేదు. ఒక జర్నలిస్ట్ దేనికి లొంగకుండా నిజాయితీగా ఉంటే.. వ్యవస్థను ఎలా గాడిలో పెట్టవచ్చో, రాజకీయనాయకుల ఆటలను ఎలా అరికట్టవచ్చో చూపించారు. జర్నలిస్ట్ లలో ఆలోచన రేకెత్తించడంతో పాటు, ఓటర్లలో చైతన్యం కలిగించేలా ఉంది ఈ చిత్రం. ఇది పొలిటికల్ డ్రామా అయినప్పటికీ కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కాకుండా చూసుకున్నారు. పొలిటికల్ సినిమాలను ఇష్టపడే వారితో పాటు, మాస్ ప్రేక్షకులను కూడా ఈ సినిమా మెప్పించే అవకాశముంది. ఫైట్, సాంగ్ తో హీరో పాత్రని పాత్రని కమర్షియల్ హీరోలా పరిచయం చేశారు. ఆరంభ సన్నివేశాలు హీరో పాత్ర తీరుని తెలియజేసేలా ఉండగా.. NNC ఛానల్ సీఈఓగా అతను బాధ్యతలు తీసుకున్న తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల అరాచకాలు హీరో వెలుగులోకి తీసుకురావడం.. సీఎం క్యాంప్ ఆఫీస్ లో బాంబ్ బ్లాస్ట్, ఆ తర్వాత చోటుచేసుకునే అంశాలతో ప్రథమార్థం నడిచింది. విరామ సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సీఎం మర్డర్ మిస్టరీని ఛేదిస్తూ సెకండాఫ్ నడుస్తుంది. ఈ క్రమంలో వచ్చే మలుపులు మెప్పిస్తాయి. అదే సమయంలో హీరో ఫ్లాష్ బ్యాక్, ఫైట్లు, పాటలు మాత్రం రెగ్యులర్ కమర్షియల్ సినిమాని గుర్తు చేస్తాయి. సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఓవరాల్ గా మాత్రం సినిమా మెప్పించేలా ఉంది. దర్శకుడిగా తొలిప్రయత్నంతోనే జర్నలిస్ట్ మూర్తి ఆకట్టుకున్నాడు. జర్నలిస్ట్ తలచుకుంటే రాజకీయ వ్యవస్థను ఎలా మార్చవచ్చనే సందేశాత్మక కథను ఎంచుకున్న మూర్తి.. దానికి కమర్షియల్ హంగులు జోడించి ప్రేక్షకుల మెప్పు పొందేలా తెరమీదకు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు. ఆయన రాసిన డైలాగ్స్ కూడా ఎంతో పవర్ ఫుల్ గా ఉన్నాయి. నాని చమిడిశెట్టి కెమెరా పనితనం, మహతి స్వరసాగర్ నేపథ్యసంగీతం సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. రవితేజ గిరజాల ఎడిటింగ్ నీట్ గా ఉంది. అయితే సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే మరింత ఎఫెక్టివ్ గా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: నిజాయితీగల జర్నలిస్ట్ చేతన్ పాత్రలో నారా రోహిత్ చక్కగా రాణించాడు. తనదైన డైలాగ్ డెలివరీతో మరోసారి మెప్పించిన ఆయన.. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. సిరి లెల్లా, సచిన్ ఖేడేకర్, ఉదయ భాను, దినేష్ తేజ్, అజయ్ ఘోష్, ఇంద్రజ, సప్తగిరి, తనికెళ్ళ భరణి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. ఫైనల్ గా.. సందేశాత్మక కథకు కమర్షియల్ హంగులు జోడించి తీసిన ఈ పొలిటికల్ అండ్ మర్డర్ మిస్టరీ ఫిల్మ్ ఆకట్టుకుంది. రేటింగ్: 2.75/5 
తెలుగు సినిమాకి ఎంత వయసు ఉంటుందో.. తెలుగు సినిమా పాటకి కూడా అంతే వయసు ఉంటుంది. ఎందుకంటే సినిమాకి, పాటకి వున్న బంధం అలాంటిది. పాటలు లేకుండా.. సినిమాను ఊహించుకోలేడు తెలుగు ప్రేక్షకుడు. అందుకే దర్శకనిర్మాతలు కథ, కథనాలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో పాటలకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. ఒకప్పటి తెలుగు సినిమా పాటకు, ఇప్పటి పాటకు ఎంతో వ్యత్యాసం ఉంది. కాలం మారుతోంది, తరాలు మారుతున్నాయి, ప్రేక్షకుల అభిరుచిలో కూడా ఎంతో మార్పు వచ్చింది. దానికి తగ్గట్టుగానే తమ పాటల్ని మార్చుకుంటూ వస్తున్నారు గేయరచయితలు. పాత తరంలో ఎంతో మంది గొప్ప రచయితలు తెలుగు సినిమా పాటకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు. ఈ జనరేషన్‌లో వస్తున్న పాటల్లో సాహిత్యం కంటే సంగీతమే ఎక్కువగా వినిపిస్తోందన్న ఆరోపణ ఉంది. అయినా, అప్పుడప్పుడు సాహిత్యానికే ఎక్కువ ఇంపార్టెన్స్‌ ఇస్తూ కొన్ని పాటలకు స్వరాలు సమకూరుస్తున్నారు సంగీత దర్శకులు.  ఈ తరం రచయితల్లో సాహిత్యానికి, సామాజిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తన పాటలతో ఎంతో మంది గేయ రచయితలకు ఆదర్శంగా నిలుస్తున్నారు చంద్రబోస్‌. ‘తాజ్‌మహల్‌’ చిత్రంలోని ‘మంచుకొండల్లోన చంద్రమా..’ అనే పాటతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన చంద్రబోస్‌.. టాలీవుడ్‌లోని అందరు హీరోలకు పాటలు రాశారు. తెలుగు వారు ఆస్కార్‌ అవార్డు సాధించే ఆస్కారమే లేదు అన్న వారికి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు..’ పాటకి ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఆస్కార్‌ సాధించి తెలుగు జాతి కీర్తిని ప్రపంచ వ్యాపితం చేశారు చంద్రబోస్‌. 29 ఏళ్ళ సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో అద్భుతమైన పాటలు రాశారు చంద్రబోస్‌. వాటిలో యువతకు స్ఫూర్తినిచ్చే పాటలు, ప్రేమ జంటలు హాయిగా పాడుకునే పాటలు, స్నేహబంధాన్ని చాటి చెప్పే పాటలు, అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తెలియజేసే పాటలు.. ఇలా అన్ని తరహా పాటలు ఉన్నాయి. మే 10 చంద్రబోస్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయా పాటలకు సంబంధించిన కొన్ని విశేషాలను తెలుసుకుందాం.  మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ‘ఠాగూర్‌’ చిత్రంలోని ‘కొడితే కొట్టాలిరా.. సిక్స్‌ కొట్టాలి’ అనే పాట యువతలో స్ఫూర్తిని నింపి ఎవర్‌గ్రీన్‌గా నిలిచింది. అలాగే ‘చెన్నకేశవరెడ్డి’లోని ‘నవ్వే వాళ్ళను నవ్వనీ..’, ‘నేనున్నాను’ చిత్రంలోని ‘చీకటితో వెలుగే చెప్పెను నేనున్నానని..’ వంటి పాటలు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటూ అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. అంతేకాదు.. స్నేహబంధానికి వున్న విలువను చెప్పే పాటల్లో.. ‘ట్రెండు మారినా ఫ్రెండు మారడు’(ఉన్నది ఒకటే జిందగీ), ఎగిరే ఎగిరే (కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం) పాటలు ఎంతో పాపులర్‌ అయ్యాయి.  ఇక సెంటిమెంట్‌ సాంగ్స్‌ గురించి చెప్పాలంటే.. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ (నాని), లాలి లాలి జోలాలి (ఢమరుకం), కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా (మనం), మరుమల్లి జాబిల్లి (లక్ష్మీనరసింహా), అన్నయ్యా అన్నావంటే (అన్నవరం) వంటి పాటలు జనం మదిలో నిలిచిపోయాయి. ముఖ్యంగా 2018లో వచ్చిన రామ్‌చరణ్‌ సినిమా ‘రంగస్థలం’ చిత్రంలోని ‘ఓరయ్యో.. నా అయ్యా..’ అనే ఓ అద్భుతమైన పాటను రచించడమే కాకుండా స్వయంగా తానే గానం చేశారు చంద్రబోస్‌. ఈ పాటను విని కంటతడి పెట్టనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. అలాగే రవితేజ హీరోగా వచ్చిన ‘నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమెరీస్‌’ చిత్రంలోని ‘గుర్తుకొస్తున్నాయి..’ పాట ఇప్పటికీ జనం పాడుకుంటున్నారు.  ఇక చంద్రబోస్‌ రాసిన ప్రేమ పాటల గురించి చెప్పక్కర్లేదు. నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి (ఆది), కలలోనైన కలగనలేదే నువ్వొస్తావని (నువ్వొస్తావని), నువు చూడూ చూడకపో (ఒకటో నెంబర్‌ కుర్రాడు), నువ్వే నా శ్వాస (ఒకరికొకరు) వంటి పాటలు ప్రేమికుల హృదయాలను దోచుకున్నాయి. ఈ క్రమంలోనే 2021లో వచ్చిన ‘పుష్ప’ చిత్రంలోని ‘చూపే బంగారమాయెనే శ్రీవల్లీ..’ పాట ఒక ఊపు ఊపేసింది. ఇదీ అదీ అని కాకుండా.. ఏ తరహా పాటనైనా తన అందమైన మాటలతో అల్లుకుంటూ వెళ్ళే చంద్రబోస్‌ ఇంకా ఎన్నో అద్భుతమైన పాటలతో అలరించాలని ఆశిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది తెలుగువన్‌.
రెండు తెలుగు రాష్ట్రాల్లో కుమారి ఆంటీ అందరికీ తెలుసు. స్ట్రీట్ ఫుడ్ వెండర్ గా ఆమె అందరికీ పరిచయమే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆమె బిజినెస్ కి ఎలాంటి ప్రాబ్లమ్ రాకుండా ఫేవర్ చేశారు. అలాంటి కుమారి ఆంటీ చుట్టూ సీరియల్స్ అని బిగ్ బాస్ షోస్ అనే టాక్స్ కొంతకాలం క్రితం వరకు నడిచాయి. ఆమె స్వస్థలం గుడివాడ..అలాంటి ఈమె ఇప్పుడు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గుడివాడపై ప్రేమతో ఇక్కడికి వచ్చానని చెప్పింది. కూటమి తరపున గుడివాడ టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు కుమారి ఆంటీ మద్దతు తెలిపారు. ఆయన కోసం ప్రచారంలో పాల్గొన్నారు. గుడివాడ 15 ఏళ్ల క్రితం అభివృద్ధి లేకుండా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉందన్నారు. వెనిగండ్ల రాము గెలిస్తే గుడివాడ అభివృద్ధి జరుగుతుందని వ్యాఖ్యానించారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని, ఎన్డీఏకు అందరూ మద్దతు తెలపాలని కుమారీ ఆంటీ కోరారు. వెనిగండ్ల రాము ఎవరో కాదు మహర్షి మూవీలో మహేష్ బాబు లాంటి వ్యక్తి అని కితాబిచ్చారు. తన స్వస్థలమైన పెద్ద ఎరుకపాడులో ప్రచారం చేయడం ఎంతో గర్వంగా ఉందని చెప్పింది కుమారి ఆంటీ. గుడివాడలో ఉపాధి అవకాశాలు లేకపోవంతో తనలాంటి వారు పక్క రాష్ట్రాలకు వెళ్లి కష్టపడాల్సి వస్తుందన్నారు. గుడివాడలో వెనిగండ్ల రామును, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని గెలిపించాలని, ఎన్డీఏకు అందరూ మద్దతు తెలపాలని కుమారీ ఆంటీ కోరారు.  
కోవై సరళ అంటే తెలియని దక్షిణ భారతీయ చలన చిత్ర ప్రేక్షకుడు లేడు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కలిపి సుమారు 900 చిత్రాలకి పైగా చేసింది.హీరోయిన్ గాను కమల్ హాసన్ వంటి లెజండ్రీ యాక్టర్ తో  నటించింది. తాజాగా  ఆమె అల్లు అర్జున్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది క్షేమంగా వెళ్లి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, ఎవడి గోల వాడిది,పెళ్ళాం ఊరెళితే, కాంచన, బొమ్మనా బ్రదర్స్ చందన సిస్టర్స్, నేనింతే, దేశముదురు, మృగరాజు, సతీలీలావతి, శ్రీరామచంద్రులు ఇలా ఎన్నో తెలుగు  సినిమాల్లో నటించింది. ఎని మూవీని తీసుకున్నా తన క్యారక్టర్ కి ఉన్న ఇంపార్టెన్స్ మాత్రం ఒక లెవల్లో ఉంటుంది.స్క్రీన్ మీద ఆమె చెప్పే డైలాగ్ బాడీ లాంగ్వేజ్ ప్రేక్షకులకి నవ్వుల వానలో తడిసి ముద్దవడం ఖాయం. అసలు సినిమాలో ఉందని కోవై సరళ ఉందని వెళ్లే ప్రేక్షకులు  కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఒక టెలివిజన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఒక ఆసక్తి కర విషయాన్నీ  వెల్లడించింది.  ఇప్పుడున్న హీరోల్లో ఎవర్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అని యాంకర్  అడిగాడు. అప్పుడు ఆమె అల్లు అర్జున్ ని పెళ్లి చేసుకోవాలని ఉందని చెప్పింది. ఆయన గొంతు చాలా బాగుంటుంది. ప్రవర్తన కూడా చాలా బాగుంటుందని చెప్పింది. బన్నీ తో కలిసి  గంగోత్రి, దేశ ముదురులో చేసింది ఇక  కోవై సరళ ఇంత వరకు  పెళ్లి చేసుకోలేదు. పెళ్లి మీద తనకి ఇంట్రస్ట్ లేదని కూడా చెప్పింది, ఒంటరిగానే వచ్చాం ఒంటరిగానే పోతాం అని తాత్విక వేత్తల మాట్లాడుతుంది.తమిళ సినిమాల కంటే తెలుగు సినిమాలే ఎక్కువ ఇష్టమని చెప్తుంది. ఎందుకంటే తమిళ పరిశ్రమ నాకు పుట్టిల్లు అయితే తెలుగు మెట్టినిల్లు. అలాంటప్పుడు మెట్టినిల్లే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉండాలి కదా అని చెప్తుంది.  ప్రస్తుతం సినిమాలు అయితే  తగ్గుముఖం పట్టాయి  
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల తేదీ దగ్గరకు వచ్చింది. ప్రచారం చివరి దశకు చేరుకుంది. ఈ ఎన్నికల్లో కూటమికే మెజారిటీ సినీ ప్రముఖులు మద్దతు తెలుపుతున్నారు. ఈ దెబ్బకి ఏపీలో సంచలన ఫలితాలు రావడం ఖాయమనే అంచనాలున్నాయి. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. తెలుగుదేశం పార్టీ అంటే నందమూరి హీరోల సపోర్ట్ ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా హిందూపురం నుంచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలుస్తానని ధీమాగా ఉన్న నందమూరి బాలకృష్ణ.. కూటమి తరపున పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అధికార పార్టీకి కంచుకోటగా పేరున్న రాయలసీమలో.. బాలయ్యకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేనకు మెగా ఫ్యామిలీ సపోర్ట్ గట్టిగా ఉంది. వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ వంటి మెగా హీరోలు.. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం వెళ్లి ప్రచారం చేశారు. అలాగే చిరంజీవి.. తన తమ్ముడు పవన్ కి, కూటమికి మద్దతు తెలుపుతూ ప్రత్యేక వీడియోలు విడుదల చేశారు. రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా మద్దతు ప్రకటించాడు. అలాగే అల్లు ఫ్యామిలీ కూడా తమ మద్దతుని తెలిపింది. పవన్ కే తమ ఫుల్ సపోర్ట్ అని.. అల్లు అరవింద్, అల్లు అర్జున్ ప్రకటించారు. అలాగే, బీజేపీ అభ్యర్థుల తరపున దగ్గుబాటి వెంకటేష్, రెబెల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి శ్యామలా దేవి ప్రచారం నిర్వహించారు.  నందమూరి, మెగా, అల్లు, దగ్గుబాటి, రెబెల్ స్టార్ వంటి బడా ఫ్యామిలీలతో పాటు.. కూటమికి సపోర్ట్ చేస్తున్న సినీ ప్రముఖుల లిస్టు ఇంకా భారీగానే ఉంది. హీరోలు నాని, తేజ సజ్జ, నిఖిల్, నారా రోహిత్, రాజ్ తరుణ్.. సీనియర్ నటులు నరేష్, సురేష్.. కమెడియన్స్ సప్తగిరి, 30 ఇయర్స్ పృథ్వీ, రఘు.. జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్, కిరాక్ ఆర్పీ.. ఇలా ఎందరో కూటమికి మద్దతు తెలిపిన వారిలో ఉన్నారు. వీరితో పాటు ఇంకా ఎందరో నటీనటులు, దర్శకనిర్మాతలు తామంతా కూటమి వైపే అని స్పష్టం చేశారు. టికెట్ ధరలతో పాటు పలు కారణాల వల్ల.. అధికార పార్టీపై సినీ పరిశ్రమ నుంచి ఈ స్థాయి వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెలుస్తోంది. ఇప్పటికే సర్వేలన్నీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి. దానికి తోడు టాలీవుడ్ కి చెందిన పలు బడా ఫ్యామిలీలతో పాటు.. మెజారిటీ సినీ పరిశ్రమ అంతా కూటమి వైపే ఉంది. బడా స్టార్ ఫ్యామిలీల అభిమానులు, సినీ ప్రియుల ఓట్లు తోడై.. ఏపీలో కూటమి అంచనాలకు మించిన ఫలితాలతో సంచలనం సృష్టించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
జాక్వెలిన్ ఫెర్నాండేజ్..శ్రీలంక కి చెందిన ఈ ముద్దుగుమ్మ 2009 లో వచ్చిన అలాదిన్ తో హిందీ చిత్ర రంగ ప్రవేశం చేసింది. మొదటి సినిమాతోనే అమితాబ్ బచ్చన్ వంటి టాప్ స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకొని అందరి దృష్టి ఆకర్షించింది. ఆ తర్వాత హౌస్ ఫుల్ పార్ట్ 1 ,పార్ట్ 2 , రామయ్య వస్తావయ్యా, రాయ్,కిక్ ఏ జెంటిల్ మాన్, రేస్ 2 , హౌస్ ఫుల్ త్రీ, సర్కస్, సెల్ఫీ ఇలా  సుమారు  ముప్పై కి పైగా చిత్రాల్లో నటించింది. తాజాగా  ఒక కొత్త మూవీకి కమిట్ అయిందనే  వార్తలు వస్తున్నాయి.  2018 లో సంతోష్ శోభన్ ,రియా సుమన్ లు  జంటగా  వచ్చిన మూవీ పేపర్ బాయ్. జయశంకర్ దర్శకుడు. ప్రెజంట్ అరి అనే చిత్రానికి దర్శకత్వం వహించాడు.షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంది.  జూన్ లో విడుదల కాబోతుంది. ఇప్పుడు ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ మూవీని జాక్వెలిన్ తో చెయ్యబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి.  కంప్లీట్ లేడీ ఓరియెంటెడ్ సబ్జట్ తో తెరకెక్కబోతున్న  ఆ  మూవీ కథ జాక్వెలిన్ కి నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. గతంలో  నయనతార నటించబోతుందనే రూమర్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు  నయన్ ప్లేస్ లో జాక్వెలిన్  చేరిందనే మాటలు వినిపిస్తున్నాయి. కాకపోతే ఈ విషయం మీద ఎలాంటి అధికార ప్రకటన లేదు  ఇది ఎవరు  ఊహించని ఒక వెరైటీ కాంబో  అని చెప్పవచ్చు.పైగా  నార్త్ లో జాక్వెలిన్ కి మార్కెట్ ఉంది  కాబట్టి  పాన్ ఇండియా మూవీగా కూడా  మారవచ్చు.  రెబల్ స్టార్  ప్రభాస్ సాహో లో జాక్వెలిన్  ఒక ప్రత్యేక గీతంలో  మెరిసి తెలుగు ప్రేక్షకులని  తన అందంతో మెస్మరైజ్ చేసింది    
పాన్ ఇండియా లెవల్లో అత్యంత భారీ వ్యయంతో నిర్మాణం జరుపుకొంటున్న మూవీ రామాయణ. బాలీవుడ్ లో నిర్మాణం జరుపుకుంటున్నా కూడా రాముడు అందరి వాడు కాబట్టి మూవీపై అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.  ఎలాంటి అనౌన్సుమెంట్  లేకుండానే  షూటింగ్ ని  జరుపుకుంటుంది.ఇప్పుడు ఈ మూవీని ఆపండి అని నోటీసులు వెళ్లాయి అల్లు అరవింద్..తెలుగు చిత్ర సీమలో ఉన్న బడా నిర్మాతల్లో ఒకరు.  గీత ఆర్ట్స్ బ్యానర్ పై 1974 నుంచి సినిమాలు నిర్మించుకుంటు వస్తున్నారు. దాదాపుగా అన్ని కూడా విజయవంతమైన చిత్రాలే. బాలీవుడ్ లో కూడా అమీర్ ఖాన్ తో గజని ని నిర్మించాడు. ఇప్పుడు ఈయనే  రామాయణ కి నోటీసులు పంపించారు .సినిమా షూటింగ్ ముందుకు వెళ్లకూడదని నోటిసుల్లో స్పష్టంగా ఉంది. మధు వంతెన అనే ఒక పార్టనర్ తో కలిసి అరవింద్ రామాయణ ని గతంలో అనౌన్సుమెంట్  చేసారు. ఆ మేరకు స్క్రిప్ట్ ని  కూడా రెడీ చేయించారు.ప్రైమ్ టెక్నాలజీ అనే సంస్థ కూడా వారితో భాగస్వామ్యం అయ్యింది. అలాంటిది   ఆ ఇద్దరి  అనుమతి లేకుండా ప్రైమ్ టెక్నాలజీనే రామాయణ ని  తెరకెక్కిస్తోంది. అందుకే నోటీసులు పంపించారు. షూటింగ్ కి ముందుకు వెళ్తే  చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటామని కూడా నోటీసుల్లో పేర్కొన్నారు  ఇక రామాయణ లో బాలీవుడ్ అగ్ర నటుడు రణబీర్ కపూర్ రాముడు గా, సీతగా సాయి పల్లవి చేస్తుంది. దీంతో అందరిలోను మూవీ  మీద ఆసక్తి నెలకొని ఉంది. పైగా రావణుడుగా   కెజిఎఫ్ తో  యష్ చేస్తుండంతో మూవీ కి వెయ్యి టన్నుల బలం వచ్చినట్టయ్యింది.  మిగతా క్యారక్టర్ ల గురించి అధికార ప్రకటన అయితే రాలేదు గాని అన్ని  భాషలకి చెందిన భారీ నటులే ఇందులో నటిస్తున్నారు. నితీష్ తివారి,రవి ఉదయార్ లు కలిసి  దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల మూవీకి సంబంధించిన కొన్ని స్టిల్స్ కూడా బయటకి వచ్చాయి.కాకపోతే వాటిని  యూనిట్ మాత్రం రిలీజ్ చెయ్యలేదు  
మూవీ : ఆవేశం నటీనటులు: ఫహద్ ఫాజిల్, హిప్ స్టర్, మిథున్ జై శంకర్, రోషన్ షానవాస్, షాజిన్ గోపు, మన్సూర్ అలీఖాన్ తదితరులు ఎడిటింగ్: వివేక్ హర్షన్ మ్యూజిక్: శుసిన్ శ్యామ్ సినిమాటోగ్రఫీ: సమీర్ తాహిర్ నిర్మాతలు: నజ్రియా నాజిమ్, అన్వర్ రషీద్ రచన, దర్శకత్వం: జీతూ మాధవన్ ఓటీటీ : అమెజాన్ ప్రైమ్ వీడియో కథ : బెంగుళూరులోని ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకునేందుకు కేరళకి చెందిన బిబి (మిథున్ జెఎస్), శాంతన్(రోషన్ షానవాస్), అజు(యూట్యూబర్ హిప్ స్టర్) వస్తారు. ఈ ముగ్గురు ముందు తెలియకపోయినా అక్కడికి వెళ్ళాక కలిసిపోతారు. అయితే అదే కాలేజీలోని సీమియర్ బ్యాచ్ వారిని ర్యాగింగ్ పేరుతో తీవ్రంగా అవమానిస్తారు. అక్కడ వారికి సపోర్ట్ లేకపోవడంతో ఆ ముగ్గురు కలిసి లోకల్ గూండా రంగ(ఫహద్ ఫాజిల్) ని సంప్రదిస్తారు. రంగది డిఫరెంట్ క్యారెక్టర్. ప్రేమ, కోపం అన్నీ ఎక్కువగా ప్రదర్శిస్తుంటాడు. ర్యాగింగ్ విషయం తెలుసుకున్న రంగ ఆ సీనియర్ గ్యాంగ్ కి బుద్ధి చెప్తాడు. దాంతో అజు, బిబి, శంతనులపై రంగా మనుషులనే ముద్ర పడుతుంది. కాలేజీలోనూ వారి హావా సాగుతుంది. తర్వాత చదువు నిర్లక్ష్యం చేయడంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అవుతారు. దాంతో కాలేజ్ డైరెక్టర్ పిలిచి ఆఖరి అవకాశం ఇస్తాడు. ఇక ఆ ముగ్గురు రంగాకి దూరంగా వెళ్ళి చదువుకోవాలనుకుంటారు కానీ రంగా వారిని వదిలిపెట్టడు. మరి ఆ ముగ్గురు ఏం చేశారు? మొదట ఆ ముగ్గురికి సపోర్ట్ చేసిన రంగానే వారిని ఎందుకు చంపాలనుకున్నాడు? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే. విశ్లేషణ:  కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలలో ర్యాగింగ్ అనేది మాములుగా ఉంటుంది. అయితే కొంతమంది సీనియర్స్ చేసే ర్యాగింగ్ కి తట్టుకోలేక కొత్తగా వచ్చిన విద్యార్థులు తీవ్రంగా ప్రభావితం అవుతున్నారు. వారిలోని తిరుగుబాటు కొన్నిసార్లు వారి జీవితాలపై ప్రభావం చూపుతుంది. దానినే తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు. తమకి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ముగ్గురు కుర్రాళ్ళు కలిసి రంగా అనే రౌడీతో డీలింగ్ కుదుర్చుకోవడం.. అతను సీనియర్స్ కి బుద్ది చెప్పడం అంతా బాగుంటుంది.  రంగా పాత్రకు నెగెటివ్ షేడ్స్ తో పాటు కామెడీ, అతిగా స్పందించే తీరు అన్నీ కలిసి ప్రేక్షకుడికి నచ్చేస్తుంది. అతను నెక్స్ట్ ఎలా రియాక్ట్ అవుతాడో అనే ఉత్సుకత సీన్ మారే కొద్ది పెరిగిపోతుంది. ముగ్గురు కుర్రాళ్ళతో కలిసి రంగా చేసే సీన్లు సాధారణంగా ఉన్నా .. ఫహద్ ఫాజిల్ ఎనర్జీని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వన్ పర్సెంట్ కూడా తగ్గకివ్వకుండా చూసుకున్నాడు దర్శకుడు. గ్యాంగ్ స్టర్ గా రంగా ఎలా మారాడని తెలిపే సీన్లు కాస్త స్లోగా అనిపిస్తాయి.  సినిమా ప్రథమార్ధంలో మొదటి ముప్పై నిమిషాలు మాములుగా సాగుతుంది. ఎప్పుడైతే రంగా పాత్ర పరిచయం అవుతుందో అక్కడి నుండి కథ పరుగులు తీస్తుంది. మన తెలుగు సినిమాలలోని కొన్ని సీన్లని వాడుకున్నట్టుగా అనిపిస్తుంది. అవేంటనేది 'ఆవేశం' చూస్తేనే తెలుస్తుంది. కథ సెకండాఫ్ లో కాస్త స్లోగా సాగినా క్లైమాక్స్ ముగించిన తీరు కన్విన్సింగ్ గా ఉంటుంది. యాక్షన్ సీన్లకి కొదవలేదు. రంగా గ్యాంగ్ కి అతడి ప్రత్యర్థి గ్యాంగ్ కి మధ్య వచ్చే ఫైట్ సీన్లు మెప్పిస్తాయి. మదర్ సెంటిమెంట్ సినిమాకి అదనపు బలాన్ని చేకూర్చింది. అడల్ట్ సీన్లు లేవు. అసభ్య పదజాలం వాడలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. శుసిన్ శ్యామ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. సమీర్ తాహిర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ నీట్ గా ఉంది.  నటీనటుల పనితీరు: కాలేజ్ కుర్రాళ్ళుగా హిప్ స్టర్, మిథున్, రోషన్ చక్కగా నటించారు. గ్యాంగ్ స్టర్ రంగా పాత్రలో ఫహద్ ఫాజిల్ నటన మరో స్థాయిలో ఉంది. మొదటి ముప్పై నిమిషాల తర్వాత సినిమా మొత్తం రంగా పాత్రే కన్పిస్తుంది. ఇక మిగతా వారు వారి పాత్రల పరిధి మేర నటించారు. ఫైనల్ గా..   ఫహద్ ఫాజిల్ ఆవేశం ప్రేక్షకుడికి గూస్ బంప్స్ తెప్పిస్తుంది.  రేటింగ్ : 3.25/5 - దాసరి మల్లేశ్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగం సంపాదించడం కాస్త కష్టమైన పనే. చదివిన చదువుకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షించేవారు ప్రస్తుతం తక్కువే. పట్టణాలలో మంచి మంచి కంపెనీలలో గౌరవప్రదమైన వేతనంతో, హుందాగా ఉండే ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. చాలామంది ఆ ఉద్యోగాల విషయంలో కూడా గందరగోళానికి గురవుతూ ఉంటారు. కారణం ఇంటర్వ్యూ లో సక్సెస్ కాకపోవడం. ఎంతో బాగా చదివి, మంచి ర్యాంక్ లు సాధించిన వారు కూడా ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చేసరికి ఫెయిల్ అవుతూ ఉంటారు. మరి ఇంటర్వ్యూ లో సక్సెస్ కావాలంటే ఏమి చేయాలి??  ఎంపిక: కొంతమంది ఖాళీగా ఉన్నాం ఏదో ఒక జాబ్ తొందరగా చూసుకోవాలి, ఏదో ఒకటి క్లిక్ అవ్వకపోతుందా అనే ఆలోచనతో వరుసపెట్టి అన్నిటికి అప్లై చేసేస్తూ ఉంటారు. దీనివల్ల నెలకొనేదే పెద్ద గందరగోళం. కాన్ఫిడెంట్ లేకుండా పది కంపెనీలలో ఇంటర్వ్యూ కు వెళ్లడం కంటే కాన్ఫిడెంట్ తో ఒక్కదానికి అటెండ్ అవ్వడం మంచిదనే విషయం మర్చిపోకండి.  నాట్ ఓన్లీ దట్: ఇంటర్వ్యూ కాల్ వచ్చినప్పటి నుండి అందరూ చేసే పని, తాము అప్లై చేసిన జాబ్ కు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా మననం చేసుకుంటూ వాటిని బట్టి పట్టడం. దీనివల్ల ఒనగూరేది ఏమి ఉండదు. ఎందుకంటే వాటిని మననం చేసుకుంటూ మిగిలిన వాటిని ఎంతో సులువుగా మర్చిపోయే అవకాశం ఉంటుంది. పైపెచ్చు ఇంటర్వ్యూ లో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది సంస్థకు సంబంధించిన వారి ఇష్టం. వారు పూర్తి జాబ్ కు సంబంధం లేని విషయం అయినా అడగవచ్చు. ఎందుకంటే వాళ్లకు కావలసింది పని చేయడం మాత్రమే కాదు అనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి వర్క్ కు సంబంధించిన విషయాలు ఒక అంశం మాత్రమే. మరింకేం కావాలి?? నమ్మకం ఇవ్వగలగాలి. బాధ్యతాయుతంగా ఉండగలరు అనే నమ్మకాన్ని ఇవ్వగలగాలి. చాలా సంస్థల్లో మొదట ప్రాధాన్యత ఇచ్చే విషయం కూడా ఇదే.  పని చేయబోయే సంస్థ  విషయంలో, చేయబోయే వృత్తి విషయంలో ఎంత బాధ్యతాయుతంగా ఉండగలరు అనే విషయం మీదనే ఎంపిక ఎక్కువగా జరుగుతుంది. అలాగే పని పట్ల నిబద్ధత ఎంతో అవసరం. పనికి ప్రాధాన్యత ఇచ్చేవారి వైపు కంపెనీ మొగ్గు చూపుతుంది. కాబట్టి పని విషయంలో భరోసా ఇవ్వగలగాలి. స్పృహ కలిగి ఉండాలి: ఇంటర్వ్యూకు వెళ్ళినప్పుడు కంపెనీ భవంతిలో అడుగుపెట్టినప్పటి నుండి చుట్టుపక్కల వాతావరణం ను గమనించుకుంటూ వెళ్ళాలి. కంపెనీలలో ప్రతిచోటా సీసీ కెమెరాల నిఘా ఉంటుందనే విషయం మరువకూడదు. మనిషి కదలిక నుండి ఆహార్యం వరకు ప్రతి విషయంలో ఒక నిజాయితీ కనిపించాలి. నటించాలని చూస్తే ఖాళీ చేతులతో బయటకు రావడం ఖాయం. తన పని మాత్రమే చూసుకుని పోయే వాళ్లకు ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. ఇంటర్వ్యూ రూమ్ దగ్గరకు వెళ్లే మార్గంలో ఉన్న క్యాబిన్ లలో ఎవరు లేకుండా ఉండి, ఫ్యాన్ లు, లైట్ లు వంటివి ఆన్ లో ఉంటే వాటిని ఆఫ్ చేయడం. నీటిని వృథా చేయకపోవడం, లిఫ్ట్ సౌకర్యం ఉన్నా మెట్లెక్కి వెళ్లడం. మంచినీళ్లు వంటివి ఇచ్చే బాయ్ ని నవ్వుతూ పలకరించడం, థాంక్స్ చెప్పడం. ముఖ్యంగా సంస్థ గూర్చి ఇంటర్వ్యూ కు వచ్చిన తోటి వ్యక్తులతో ఎలాంటి చర్చా చేయకుండా ఉండటం. సంస్థ గురించి ముందుగానే వివరంగా తెలుసుకోవడం. అంటే సంస్థ స్థాపన నుండి ప్రస్తుతం అధికారుల వరకు అన్నిటి గూర్చి వారి కృషి గురించి కూడా అధ్యయనం చేసి తెలుసుకోవడం. స్కిల్స్ ఎప్పుడు కిల్ చేయకూడదు: కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇంటర్వ్యూ లో అధికారులతో మాట్లాడేటపుడు కావాలని వారిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించకూడదు. లేకపోతే మీ స్కిల్స్ ను మీరే కిల్ చేసుకున్నట్టు అవుతుంది.  ముందుగా మరింత ఉత్సాహంగా: ఇక చివరగా చెప్పుకున్నా అన్నిటికంటే ముందు చేయవలసిన పని. ఇంటర్వ్యూ కు హడావిడిగా చివరి నిమిషంలో వెళ్లకుండా, వీలైనంత ముందుగా వెళ్లడం. దీనివల్ల కంపెనీని అక్కడి వాతావరణాన్ని, పని విధానాన్ని అంతో ఇంతో గమనించే వెసులుబాటు ఉంటుంది. తద్వారా సహజంగానే గందరగోళం తగ్గిపోతుంది.  ట్రస్ట్ యువర్ కాన్ఫిడెన్స్: మీ ఆత్మవిశ్వాసాన్ని మీరు నమ్మండి. ఎవరో ఏదో భయపెట్టేలా చెప్పే మాటలు, విషయాలు ఏవి పరిగణలోకి తీసుకోవలసిన అవసరం లేదు. మీరు ఖచ్చితంగా ఉన్నట్లయితే, మీ వ్యక్తిత్వం నుండి, పని విషయం వరకు మీ అభిప్రాయాలు నచ్చాయంటే ఏ కంపెనీ ఎం.డి కూడా మిమ్మల్ని వదులుకోడు.  సక్సెస్ మీ చేతుల్లోనే ఉంది సుమా!! ◆ వెంకటేష్ పువ్వాడ
ఎక్కువసేపు టీవీ చూస్తున్నారా? అయితే మిమ్మల్ని త్వరలోనే మతిమరుపు పలకరిస్తుంది అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు. రోజుకి గంటకన్నా తక్కువ సమయం మాత్రమే టీవీ చూస్తున్న వారికి మధ్య జ్ఞాపకశక్తి విషయంలో చాలా తేడా వుందని వీరి పరిశోధనలో తేలింది. కొన్ని వేలమందిపై రకరకాల పరీక్షలు నిర్వహించి తేల్చిన విషయమిది. చిన్న చిన్న విషయాలని కూడా టీవీని అతిగా చూసేవారు మర్చిపోతుండటం గమనించారట వీరు. ముఖ్యంగా పిల్లల జ్ఞాపకశక్తిపై టీవీ చాలా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు వీరు. స్కూలుకి వెళ్ళేముందు లేదా చదువుకోవటానికి కూర్చునే ముందు టీవీ చూస్తే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రభావం ఖాయమని గట్టిగా చెబుతున్నారు. మరి జ్ఞాపకశక్తి పెరగడానికి ఏం చేయమంటారు అని వీరిని అడిగితే అందుకు చాలా మార్గాలున్నాయ్. అయితే టీవీ చూడటం తగ్గించమంటున్నాం కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మిమ్మల్ని ఆహ్లాదపరిచే మరో మార్గం ఉంది. దానివల్ల మానసిక, శారీరక ఆరోగ్యం కూడా స్వంతమవుతుంది జ్ఞాపకశక్తి పెరగడంతోపాటు అంటున్నారు. ‘కాల్పనిక సాహిత్యం’ చదివితే మెదడు పదునెక్కుతుంది. జ్ఞాపకశక్తి పెరగుతుంది. మతిమరుపు తగ్గుతుంది. మానసిక ఉల్లాసం సొంతమవుతుంది. నమ్మకం లేకపోతే ఓ 20 రోజులపాటు మేం చెప్పింది పాటించి చూడండి అని చెబుతున్నారు ఈ ఆస్ట్రేలియా పరిశోధకులు. మరి టీవీ చూడటం తగ్గించి చదవటం మొదలుపెడదామా!? -రమ
ఫ్యాన్.. ప్రతి ఇంట్లో చాలా సాధారణంగా ఉండే ఎలక్ట్రిక్ పరికరం.  బయట నుండి ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకుని దాని కింద కూర్చుని రిలాక్స్  అవుతుంటాం. అయితే వేసవి కాలంలో ఫ్యాన్ వేగం తగ్గినట్టు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఫ్యాన్ వేసినా అసలు వేయనట్టే అనిపిస్తుంది. అందుకే చాలా మంది ధర ఎక్కువైనా ఏసీ వైపు మొగ్గు చూపుతారు. కానీ ఫ్యాన్ సెట్టింగ్ లో 5 మార్పులు చేయడం వల్ల ఫ్యాన్ స్పీడ్ గా తిరుగుతుంది. దాని వేగం.. అది ఇచ్చే చల్లదనం ముందు ఏసీ కూడా బలాదూర్ అంటున్నారు టెక్నాలజీ నిపుణులు. ఇంతకీ ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకుంటే.. కెపాసిటర్.. సీలింగ్ ఫ్యాన్‌లో అమర్చిన కెపాసిటర్ మోటార్‌కు అవసరమైన విద్యుత్‌ను అందించడానికి పనిచేస్తుంది. కెపాసిటర్ల పనితీరు మందగించినట్టైతే  90% కంటే ఎక్కువ సీలింగ్ ఫ్యాన్ సమస్యలు ఎదురవుతాయి. కెపాసిటర్ పని చేయడం ఆపివేసినప్పుడు మోటారుకు విద్యుత్ సరిగా అందదు.  దీంతో ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  70 నుండి 80 రూపాయల కెపాసిటర్‌ను తిరిగి అమర్చితే  ఫ్యాన్ వేగం పెరుగుతుంది.   బ్లేడ్.. కొన్ని సార్లు ఫ్యాన్ బ్లేడ్ వంగడం వల్ల కూడా ఫ్యాన్ వేగం తగ్గుతుంది. అలాంటి పరిస్థితిలో ఫ్యాన్ బ్లేడును మార్చాలి.  దీనివల్ల కూడా సీలింగ్ ఫ్యాన్ వేగం పెరుగుతుంది. బాల్ బేరింగ్ ఫెయిల్యూర్.. సీలింగ్ ఫ్యాన్లు కాలం గడిచేకొద్దీ వాటిలో బాల్ బేరింగ్స్ లో ధూళి పేరుకుపోతుంది. దీని కారణంగా సీలింగ్ ఫ్యాన్ వేగం తగ్గుతుంది.  దాన్ని మరమ్మత్తు చేయడం ద్వారా ఫ్యాన్ వేగం పెంచవచ్చు. స్క్రూలు.. ఫ్యాన్ లో స్క్రూలు వదులైతే ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తాయి. అందుకే ఫ్యాన్ స్క్రూలు సరిగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటూ ఉండాలి. సరళత. సరళత లేకపోవడం కూడా ఫ్యాన్ వేగాన్ని దెబ్బతీస్తుంది. దీన్ని కూడా రిపేర్ చేయించడం ద్వారా ఫ్యాన్ వేగాన్ని పెంచవచ్చు.                                                *రూపశ్రీ.
శరీరాన్ని ఆరోగ్యంగా ఉండటంలో నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. , ప్రతిఒక్కరూ  ప్రతిరోజూ పుష్కలంగా నీరు త్రాగాలని వైద్యుల నుండి ఆరోగ్యం మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరు చెబుతారు. ఎండాకాలంలో  సాదారణం కంటే నీరు మరింత ఎక్కువ అవసరం అవుతుంది. ఎండవేడిమి  కారణంగా, శరీరం నుండి చాలా నీరు చెమట రూపంలో బయటకు వస్తుంది. పెద్దలు రోజుకు 3-4 లీటర్ల నీటిని తాగడం చాలా అవసరం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మోతాదులో నీరు తీసుకోవడం వల్ల  డీహైడ్రేషన్ ప్రమాదం నుండి శరీరాన్ని కాపాడుకోవచ్చు. శరీరపనితీరు ఆరోగ్యంగా ఉండేలా చేసుకోవచ్చు.  రక్షించడంలో సహాయపడుతుంది మరియు శరీర అవయవాల పనితీరును సరిగ్గా ఉంచుతుంది. నీరు తక్కువ తీసుకోవడం  వల్ల డీహైడ్రేషన్,  కిడ్నీలో రాళ్లు, పొడి చర్మం, పొడి  కళ్ళు వంటి అనేక దుష్ప్రభావాలు ఏర్పడతాయి. అయితే ఆరోగ్యానికి మంచిదని చాలామంది ఎక్కువ నీరు తాగేస్తుంటారు. దీని వల్ల బోలెడు ఆరోగ్యమని అనుకుంటారు కానీ.. శరీరానికి ఇది చాలా హాని కలిగిస్తుందని మీకు తెలుసా?  నీరు ఎక్కువగా తాగితే, దాని వల్ల అనేక దుష్ప్రభావాలు కలుగుతాయి. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..  రోజుకు కచ్చితంగా ఇంత  నీరు త్రాగాలి అని నిర్ణయించడానికి ఎటువంటి సూత్రం లేదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. సాధారణంగా రోజుకు మూడు నుండి మూడు లీటర్ల నీరు శరీరానికి అవసరం అవుతుంది. అది కూడా  వాతావరణం, వ్యాయామం, ఆహారం, మొత్తం ఆరోగ్యం, మహిళలు  గర్భంతో ఉండటం  లేదా మహిళలు పిల్లలకు పాలు ఇవ్వడం  వంటి పరిస్థితులపై శరీరానికి కావలసిన  నీటి పరిమాణం ఆదారపడి ఉంటుంది. కానీ నీరు అధికంగా తీసుకుంటే ఈ క్రింది అనర్థాలు కచ్చితంగా జరుగుతాయి.  నీరు ఎక్కువగా తాగుతుంటే  వాటర్ పాయిజనింగ్ సంభవించే అవకాశం ఉంటుంది. ఎక్కువ నీరు తాగడం వల్ల  మూత్రపిండాల పనితీరును బాగా పెంచుతుంది, దీని ఫలితంగా  శరీరంలోని ఎలక్ట్రోలైట్లు కరిగిపోతాయి. ఉదాహరణకు, సోడియం (ఉప్పు) కరిగించినట్లయితే, హైపోనాట్రేమియా డవలప్ అవుతుంది. శరీరంలో చాలా తక్కువ సోడియం ఉంటే  కణాల లోపల నీరు చేరుతుంది.  ఇది శరీరం  వాపుకు దారితీస్తుంది. హైపోనాట్రేమియా  లక్షణాలు ఎలా ఉంటాయంటే.. హైపోనాట్రేమియా ను ఓవర్ హైడ్రేషన్ అని అంటారు. ఓవర్ హైడ్రేషన్ యొక్క లక్షణాలు ప్రారంభ దశల్లో గుర్తించడం కష్టం. అయితే, ఎక్కువ సార్లు  మూత్రవిసర్జన చేయాల్సి రావడం దీనికి ఒక సంకేతం. వాటర్ పాయిజన్ జరిగితే శరీరంలో ఈ క్రింది లక్షణాలు కనబడతాయి. వికారం మరియు వాంతులు. మెదడుపై ఒత్తిడి పెరిగి దాని కారణంగా తలనొప్పి. గందరగోళం లేదా దిక్కుతోచని స్థితి వంటి మానసిక స్థితిలో మార్పులు. కండరాల తిమ్మిరి. తరచుగా మూత్రవిసర్జన సమస్య. వాంతులు కావడం. మన శరీరంలో మూత్రపిండాలు  ఒక సమయంలో ఎంత నీటిని విసర్జించాలనే పరిమితి కలిగి ఉంటాయి.  దీని ప్రకారం గరిష్టంగా గంటకు 800 నుండి 1,000 ml మూత్రం విసర్జించాలి.   ఎక్కువ నీరు తాగడం ప్రారంభిస్తే, శరీరం నుండి అదనపు నీటిని తొలగించడం మూత్రపిండాలకు కష్టమవుతుంది, దీని కారణంగా  అపానవాయువు, వికారం వంటి  సమస్యలు ఎదురవుతాయి.                                                                               *నిశ్శబ్ద.
ఖర్జూరానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిన  ఖర్జూరాలు రుచికే కాదు..  ఆరోగ్యానికి కూడా బోలెడు ప్రయోజనాలు కలిగిస్తాయి. అయితే ఖర్జూరాలను రాత్రి పడుకునే ముందు తేనెతో కలిపి తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. తేనె, ఖర్జూరం కాంబినేషన్ కేవలం ఒకటని కాదు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిస్తుంది.  రాత్రి పడుకునే ముందు తేనె,  ఖర్జూరం లో ఉండే పోషకాలేంటో.. వాటిని కలిపి తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసుకుంటే.. తేనె పోషకాలు.. ఒక టేబుల్ స్పూన్ తేనెలో - కేలరీలు: 64, కొవ్వు: 0 గ్రా, సోడియం: 0 mg, పిండిపదార్థాలు: 17 గ్రా, ఫైబర్: 0 గ్రా, చక్కెరలు: 17 గ్రా, ప్రోటీన్: 0.1 గ్రా, పొటాషియం: 10.9 mg, ఇనుము: 0.1 mg, కాల్షియం: 1.3 mg ఉంటాయి. ఖర్జూరం పోషకాలు.. ఎండు ఖర్జూరంలో  కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెరలు, ఖనిజాలు (కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్ మొదలైనవి),  విటమిన్లు (B1, B2, C, మొదలైనవి) వంటి పోషకాలు ఉంటాయి. ఇది టానిన్లు, కెరోటినాయిడ్లు, పాలీఫెనాల్స్ మొదలైన వివిధ బయోయాక్టివ్ సమ్మేళనాలను కూడా కలిగి ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఖర్జూరాన్ని తేనెతో కలిపి తింటే.. రాత్రి పడుకునే ముందు ఈ రెండు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబయల్ గుణాలు వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి. తేనె, ఖర్జూరం రెండు తీసుకుంటే   శరీరంలో ఎలాంటి వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ రెండింటిని కలిపి తింటే ఆకలి కూడా పెరుగుతుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. తేనె, ఖర్జూరం కాంబినేషన్ జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ రెండూ వేడిగా ఉంటాయి కాబట్టి వేసవి కాలంలో వీటి వినియోగాన్ని తగ్గించాలి.                                                       *రూపశ్రీ.
వేసవిలో ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.  ఎందుకంటే ఈ సీజన్‌లో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఆహారంలో జీర్ణక్రియను ప్రేరేపించే ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల  జీర్ణక్రియ  ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే వేసవి కాలంలో లిక్విడ్ ఫుడ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వేసవి కాలంలో  ఎక్కువగా పండ్లు,  కూరగాయల రసాలను తాగుతారు. ఇది  మాత్రమే కాకుండా సత్తును త్రాగితే చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. యూట్యూబ్ పుణ్యమా అని  ఎన్నో రాష్ట్రాలు, దేశాల ఆహారాలు తెగ వైరల్ అవుతుంటాయి. అలాంటి వాటిలో సత్తు కూడా ఒకటి.  ఇది వేసవిలో సూపర్ ఫుడ్ గా పరిగణించబడుతుంది. దీన్ని పాలలో కలుపుకుని తాగితే పొట్ట చల్లగా ఉండడంతో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. సత్తులో పోషకాలు..  సత్తులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది కాకుండా  ఐరన్, కాల్షియం, మెగ్నీషియం,  పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. సత్తును  పాలతో కలిపి త్రాగితే ఇది పోషక లక్షణాలను పెంచుతుంది. వేసవి కాలంలో శరీరం  శక్తి స్థాయి కొద్దిగా నెమ్మదిగా ఉంటుంది. ఇలాంటి  పరిస్థితిలో సత్తును తీసుకుంటే శక్తివంతంగా ఉండవచ్చు. ఇది కాకుండా శరీరంలో రక్త హీనతతో బాధపడుతున్న వ్యక్తులు సత్తును తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వేసవిలో  జీర్ణవ్యవస్థ కొద్దిగా బలహీనపడుతుంది. ఇలాంటి సమయంలో సత్తును తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, లూజ్ మోషన్ మొదలైన కడుపు సంబంధిత సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ఇక పాలతో సత్తును తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు  దీన్నితమ డైట్ లో భాగంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. సత్తు కేవలం చల్లదనాన్ని, శరీరానికి పోషణను, జీర్ణ ఆరోగ్యాన్ని బాగు చెయ్యడమే కాదు.. ఎముకలకు బలాన్ని కూడా ఇస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అయితే.. దీన్ని రెగ్యులర్ గా డైట్ లో భాగం చేసుకునే ముందు  ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.                                                  *రూపశ్రీ.