LATEST NEWS
లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంపై బీజేపీ మండిపడుతోంది. దేశంలోని సగం జనాభా ప్రయోజనాలను విపక్షాలు కాలరాశాయని ఫైర్ అవుతోంది.  దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని  నిర్ణయించింది. చారిత్రాత్మకమైన ఈ బిల్లును అడ్డుకోవడం ద్వారా ప్రతిపక్షాలు తమ మహిళా వ్యతిరేక ధోరణిని బయటపెట్టుకున్నాయని విమర్శిస్తోంది.పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగినంత మెజారిటీ లభించకపోవడంతో అది వీగిపోయిన సంగతి తెలిసిందే. రాజ్యాంగ సవరణకు అవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓటింగ్‌లో పాల్గొన్న 528 మంది సభ్యులలో 298 మంది బిల్లుకు అనుకూలంగా ఓటు వేయగా, 230 మంది వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం పొందాలంటే కనీసం 352 ఓట్లు అవసరం.   ఈ పరిణామంపై స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విపక్షాల తీరును తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ వంటి పార్టీలు అడ్డుకున్నాయన్నారు. నారీ శక్తిని గౌరవించని విపక్షాలకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ ఓటమి కేవలం ప్రభుత్వానిది కాదని, దేశంలోని కోట్లాది మంది మహిళల ఆకాంక్షలకు తగిలిన దెబ్బగా బీజేపీ అభివర్ణించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో  ముడిపడి ఉన్న డీలిమిటేషన్ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. మహిళా రిజర్వేషన్ల అమలుకు పునర్విభజన ప్రక్రియ కీలకమని ప్రభుత్వం వాదించినప్పటికీ..  దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనతో విపక్షాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా 2011 జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు వాదించారు.   మహిళల హక్కులను అడ్డుకున్న విపక్షాల అసలు రంగును బయటపెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్  హెచ్చరించారు. గ్రామం నుంచి నగరం వరకు నిరసనలుతెలియజేయాలని బీజేపీ కార్యకర్తలకు ఆయన పిలుపునిచ్చారు.  ఇప్పటికే ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలతో సమావేశమైన బీజేపీ నేతలు.. రానున్న రోజుల్లో చేపట్టబోయే ఆందోళన కార్యక్రమాలపై  కార్యాచరణ  రూపొందించారు. పార్లమెంట్ ఆవరణలో కూడా ఎన్‌డీఏ మహిళా ఎంపీలు ప్లకార్డులతో నిరసన చేపట్టారు.  విపక్షాల మహిళా వ్యతిరేక ముఖం బయటపడిందంటూ నినాదాలు చేశారు. మహిళా రిజర్వేషన్ల విషయంలో గత కొన్ని దశాబ్దాలుగా ఉన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు మోదీ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని విపక్షాలు  రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డుకున్నాయని  విమర్శించారు.  ఒకవైపు ప్రభుత్వం తన ప్రయత్నాన్ని సమర్థించుకుంటుండగా, మరోవైపు విపక్షాలు డీలిమిటేషన్ సాకుతో బీజేపీ రాజకీయ ప్రయోజనాలను పొందేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పిలుపునిచ్చిన దేశవ్యాప్త నిరసనలు ఏ మేరకు ప్రభావం చూపుతాయో  చూడాలి.ఈ బిల్లు వీగిపోవడం వల్ల 2029 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. నియోజకవర్గాల పునర్విభజన లేకుండా మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది. ఈ రాజకీయ ప్రతిష్టంభన మధ్య మహిళా హక్కుల అంశం ఇప్పుడు వీధి పోరాటంగా మారనుంది.
కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసం చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. మహిళా సాధికారత వైపు భారత్‌ వేయాల్సిన చారిత్రాత్మక అడుగును కాంగ్రెస్ అడ్డుకుందని విమర్శించారు. సమానహక్కులు, సముచిత ప్రాతినిథ్యం కోరుతున్న కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ద్రోహం చేసిందంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కదన్న ఆయన కాంగ్రెస్ ద్రోహాన్ని దేశం ఎప్పటికీ మరిచిపోదని పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.  
  లోక్‌సభలో వీగిపోయిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు విపక్షాల ఐక్యతతో కేంద్రానికి చుక్కెదురు! మెజారిటీ లేక చతికిలబడ్డ కేంద్రం. భారత పార్లమెంటరీ చరిత్రలో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో వీగిపోయింది. నియోజకవర్గాల పునర్విభజన (డెలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా ప్రతిపాదించిన ఈ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లభించకపోవడంతో సభలో ఆమోదం పొందలేదు. విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి బిల్లును వ్యతిరేకించడంతో మోదీ ప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఓటింగ్ ప్రక్రియలో భాగంగా బిల్లుకు అనుకూలంగా 278 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 211 ఓట్లు పడ్డాయి. రాజ్యాంగ సవరణ జరగాలంటే కనీసం 362 మంది సభ్యుల మద్దతు అవసరం. అయితే, మిత్రపక్షాల సహకారం ఉన్నప్పటికీ, మేజిక్ ఫిగర్‌ను అందుకోవడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ బిల్లు ద్వారా లోక్‌సభ స్థానాల సంఖ్యను 850కి పెంచాలని, 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన పునర్విభజన చేపట్టాలని కేంద్రం భావించింది. ఈ చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రాతినిధ్యాన్ని కల్పించడమే ఈ బిల్లు ఉద్దేశమని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి అన్యాయం జరగదని, సీట్ల సంఖ్య పెరగడం వల్ల అన్ని ప్రాంతాలకు మేలు జరుగుతుందని భరోసా ఇచ్చారు. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలంటే ఈ సవరణలు తప్పనిసరని ఆయన పేర్కొన్నారు. అయితే, విపక్ష నేత రాహుల్ గాంధీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ఇది మహిళా రిజర్వేషన్ల కోసం కాదని, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేసే కుట్ర అని ఆరోపించారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించి, కొన్ని ప్రాంతాలకే ప్రాధాన్యత కల్పించేలా ఈ డెలిమిటేషన్ ప్రక్రియ ఉందని ఆయన విమర్శించారు. సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసే ఇలాంటి చర్యలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి గట్టి నిరసన వ్యక్తమవుతోంది. జనాభా నియంత్రణ పాటించినందుకు తమకు సీట్లు తగ్గించి శిక్ష వేస్తారా? అని తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విపక్ష ‘ఇండియా’ కూటమి సభ్యులు భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొని బిల్లును తిరస్కరించారు. బిల్లు వీగిపోవడంతో ఇప్పుడు మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వం మళ్లీ ఏ రూపంలో ఈ బిల్లును ముందుకు తెస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. రానున్న రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో మరిన్ని ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వం ఈ విషయంలో ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నిస్తుందా లేక ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతుందా అన్నది వేచి చూడాలి.  
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అత్యంత సమన్వయంతో సాగుతోంది. మరో పదిహేనేళ్ల పాటు కూటమి పటిష్ఠంగా ఉంటుందని జనసేనాని పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో అక్కడక్కడా తలెత్తుతున్న విభేదాలను భూతద్దంలో చూపుతూ ప్రత్యర్థి పార్టీ కూటమి విచ్ఛిన్నం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నది. కానీ కూటమి మధ్య అవగాహన రోజు రోజుకూ బలపడుతోందని తెలుగుదేశం జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ చెప్పారు.    ఆ విషయం చెబుతూ.. ఇటీవల తాను చేసిన ఒక వ్యాఖ్యను పవన్ కల్యాణ్ ఫోన్ చేసి మరీ సరిదిద్దిన విషయాన్ని వెల్లడించారు.     తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో   నారా లోకేష్ గురువారం (ఏప్రిల్ 16) ముఖాముఖీ నిర్వహించారు. ఆ సందర్భంగా  పవన్ కల్యాణ్ తనను ఎలా కరెక్ట్ చేశారో వివరించారు. అదేలా అంటే.. గతంలో   ఒక సదస్సులో   2029లో మళ్ళీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందా అన్న ప్రశ్నకు తాను క్షణం కూడా ఆలోచించకుండా నిస్సందేహంగ తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే 2029లో కూడా అధికారంలోకి వస్తుందని జవాబిచ్చినట్లు లోకేష్ చెప్పారు.   అయితే  మరుసటి రోజే తనకు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి 2029లో అధికారంలోకి వస్తుందని ఎందుకు చెప్పారు. మనం వరుసగా మూడుసార్ల అధికారంలో కొనసాగుతామని చెప్పాలి కదా అని కరెక్ట్ చేశారని లోకేష్ వివరించారు.  ఆ సంకల్పంతోనే మనం జనంలోకి వెళ్లాలని జనసేనాని చెప్పారని లోకేష్ వివరించారు.  ఈ విషయాన్ని లోకేష్ స్వయంగా చెప్పడం.. ఆ ఇరువురి నేతల మధ్య బంధాన్ని, పరస్పరం ఉన్న సోదర భావాన్ని తెలియజేస్తున్నదని పరిశీలకులు అంటున్నారు.  ఈ ఫోన్ కాల్  పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య ఉన్నఅనుబంధాన్ని, అలాగే కూటమి ఐక్యతనూ మరోసారి ప్రస్ఫుటం చేసిందన్న చర్చ రాజకీయవర్గాలలో సాగుతోంది.   తెలుగుదేశం కూటమి కేవలం పార్టీల మధ్య పొత్తుకే పరిమితం కాలేదనీ, ఆయా పార్టీల నేతల మధ్య కూడా  వ్యక్తిగత స్థాయిలో కూడా పటిష్ఠ మైన బంధంగా ఉందనీ తేటతెల్లమౌతోంది.    లోకేష్‌కు పవన్ స్వయంగా ఫోన్ చేసి సలహాలు ఇవ్వడం, పవన్‌ను లోకేష్ తన అన్నలా భావిస్తూ ఆ సూచనలను స్వీకరించడం రాజకీయాల్లో ఒక ఆరోగ్యకరమైన పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మిత్రధర్మానికి, పొత్తు ధర్మానికి సరైన మోడల్ గా అభివర్ణిస్తున్నారు.   అధికార కూటమి పార్టీలకు చెందిన కీలక, అగ్రనేతలు ఏకతాటిపై ఉండటం పాలనపై కూడా సానుకూల ప్రభావం చూపుతుందనీ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతోందనీ అంటున్నారు.   రానున్న రోజుల్లో కూటమిలోని పార్టీల మధ్య మరింత సమన్వయం పెరిగేలా ఈ ఇరువునూ ముందుకు సాగుతున్న తీరు పట్ల తెలుగుదేశం, జనసేన క్యాడర్ లో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి.  కూటమి ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తు కోసం నిర్దేశించుకున్న లక్ష్యాలు   తాత్కాలికం కావని, సుదీర్ఘ ప్రయాణానికి పునాదులని ఈ ఇరువురూ విస్పష్టంగా చాటుతున్నారు. 
హిస్టరీ ఆఫ్ మహిళా బిల్లు.. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోంది? ఇప్పటి వరకూ జరిగిన మలుపులేంటి? ప్రస్తుత పరిస్థితేంటి? మహిళా బిల్లు వల్ల వచ్చే లాభాలేంటి? ప్రపంచంలో ఇప్పటి వరకూ ఉన్న రిజర్వేషన్లేంటి? ఈ బిల్లు ద్వారా రాబోయే మార్పు చేర్పులేంటి? అసలు ముప్పై మూడు శాతం ఎందుకు? అన్న విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.  మహిళా రిజర్వేషన్ బిల్లు-నారీ శక్తి వందన్ అధినియం అనేది భారత రాజకీయ చరిత్రలో ఒక మైలురాయి. దాదాపు మూడు దశాబ్దాల నిరీక్షణ తర్వాత ఇది చట్టంగా మారింది. ఎప్పటి నుంచి ఇది చట్టసభల్లో నలుగుతోందని చూస్తే.. మహిళా బిల్లు ప్రస్థానం నేటిది కాదు, దీని వెనుక ఏళ్ల  పోరాటం  ఉంది. ఈ దిశగా తొలి అడుగులు 1996లో పడ్డాయి. హెచ్.డి. దేవెగౌడ ప్రభుత్వం మొదటిసారిగా 81వ రాజ్యాంగ సవరణ బిల్లు రూపంలో దీనిని ప్రవేశపెట్టింది. కానీ లోక్‌సభ రద్దు కావడంతో అది వీగిపోయింది. ఆ తరువాత మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ల విషయంలో పదే పదే ప్రయత్నాలు జరిగాయి.     1998, 1999, 2002, 2003 సంవత్సరాల్లో వాజ్‌పేయి ప్రభుత్వం ఈ దిశగా ముందుకు సాగాలని ప్రయత్నించినా ఏకాభిప్రాయం కుదరక సాధ్యం కాలేదు.  మన్మోహన్ సింగ్ ప్రభుత్వ హయాంలో ఈ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది. కానీ లోక్‌సభలో ప్రవేశపెట్టేలోపే ప్రభుత్వం మారడం, ఇతర కారణాలతో మళ్లీ అటకెక్కింది.  సెప్టెంబర్ 2023లో ప్రధాని మోదీ ప్రభుత్వం నారీ శక్తి వందన్ అధినియం-106వ రాజ్యాంగ సవరణ పేరుతో దీనిని ప్రవేశపెట్టి, ఉభయ సభల్లోనూ భారీ మెజారిటీతో ఆమోదింపజేసింది. ఈ చట్టం అమలులోకి వస్తే భారత రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుందని అంటారు విశ్లేషకులు. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభలు, ఢిల్లీ అసెంబ్లీలో మహిళలకు మూడింట ఒక వంతు అంటే 33శాతం సీట్లు కేటాయించబడతాయి. ఇప్పటికే ఉన్న  ఎస్సీఎస్టీ రిజర్వేషన్లలో కూడా 33శాతం సీట్లు ఆయా వర్గాల మహిళలకే కేటాయిస్తారు. ప్రతి లోక్‌సభ ఎన్నికల తర్వాత మహిళలకు కేటాయించిన నియోజకవర్గాలు మారుతూ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ రిజర్వేషన్ 15 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంటు దీనిని పొడిగించవచ్చు. ఈ బిల్లు చట్టంగా మారినప్పటికీ, ఇది వెంటనే అమల్లోకి రాదు. దీనికి రెండు ప్రధాన అడ్డంకులు ఉన్నాయి. ఒకటి జనగణన. దేశవ్యాప్తంగా జనాభా గణన జరగాలి. రెండు నియోజకవర్గాల పునర్విభజన. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల సరిహద్దులను మార్చాలి.  2026 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తవుతుందని అంచనా. కాబట్టి, 2029 సాధారణ ఎన్నికల నుంచి ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. మహిళా బిల్లు వల్ల లాభాలేంటి? అని చూస్తే.. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగడం వల్ల మహిళా సమస్యలు, భద్రత మరియు విద్యపై మరింత సమర్థవంతమైన చట్టాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. లింగ సమానత్వం కూడా లభిస్తుంది. ప్రస్తుతం లోక్‌సభలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 15 శాతం లోపే ఉంది. ఇది 33 శాతం కి పెరిగితే రాజకీయాల్లో లింగ వివక్ష తగ్గుతుంది. ఇప్పటికే పంచాయతీల్లో ఉన్న  రిజర్వేషన్ల వల్ల గ్రామీణ స్థాయిలో మహిళా నాయకత్వం పెరిగింది. ఇప్పుడు అది జాతీయ స్థాయికి విస్తరిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి? అని పరిశీలిస్తే.. ప్రపంచవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యంలో భారత్ ప్రస్తుతం వెనుకబడి ఉంది. ఏకంగా 140వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అత్యధికంగా 61 శాతం పైగా మహిళా ఎంపీలు ఉన్న దేశం రువాండ. ఇక్కడ రాజ్యాంగబద్ధంగా మహిళలకు రిజర్వేషన్లు ఉన్నాయి. ఇక మెక్సికో,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్  దేశాల్లో యాభై శాతం మహిళా ప్రాతినిథ్యం కనిపిస్తోంది. ఇక స్వీడన్ నార్వే వంటి దేశాల్లో అధికారిక రిజర్వేషన్లు లేక పోయినా.. రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాయి. ఈ బిల్లు అమలు కావడంతో భారత్ లో కూడా ప్రపంచ దేశాల సరసన భారత్ సైతం అగ్రస్థానంలో నిలిచే అవకాశముంది. ఇంతకీ మహిళా రిజర్వేషన్లు 33 శాతం ఎందుకు? అంటే..  అందుకంటూ ఒక కారణమైతే లేదు. కానీ రాజ్యాంగపరమైన రాజకీయ సామాజిక సమీకరణాల కలయిక అయితే కనిపిస్తోంది. దీని వెనకున్న మెయిన్ రీజన్ ఏంటంటే.. ప్రస్తుతం భారతదేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు కలిపి దాదాపు 49.5శాతం వరకూ ఉన్నాయి. ఈ కోటాకు భంగం కలగకుండా ఉండాలంటే, మహిళలకు ప్రత్యేకంగా ఎక్కువ శాతం కేటాయించడం చట్టపరంగా ఇబ్బంది అవుతుందని భావించారు. అందుకే 33 శాతం అనేది ఒక మధ్యస్థమైన, ఆమోదయోగ్యమైన సంఖ్యగా నిర్ణయించారు. రాజకీయ పరిశీలకుల ప్రకారం..  ఒక సమూహం నిర్ణయాల్లో ప్రభావం చూపించాలంటే వారు కనీసం 30 నుంచి 33 శాతం ఉండాలి. దీనినే క్రిటికల్ మాస్ అంటారు. పది మంది ఉన్న చోట ఒక్క మహిళ ఉంటే ఆమె గొంతు నొక్కేసే అవకాశం ఉంటుంది. కానీ పది మందిలో ముగ్గురు ఉంటే, వారు ఒక బలమైన గొంతుకగా మారి చట్టాలను మార్చే శక్తిని పొందుతారు. అందుకే కనీస ప్రాతినిధ్యం కోసం ఈ శాతాన్ని ఎంచుకున్నారు. భారతదేశంలో 1993లో తెచ్చిన 73, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించారు. అక్కడ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో, అదే సూత్రాన్ని పార్లమెంటు మరియు అసెంబ్లీలకు కూడా వర్తింపజేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలు ఈ కోటాను 50 శాతానికి పెంచాయి, కానీ జాతీయ స్థాయిలో   33 శాతం తోనే ప్రారంభించారు. 1996 నుంచి వివిధ ప్రభుత్వాలు ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు, 33 శాతానికి మించి రిజర్వేషన్ ఇస్తే ఇతర వర్గాల నుంచి.. ముఖ్యంగా పురుష ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుందని భావించారు. అందరినీ ఒప్పించడానికి ఈ 33 శాతం అనేది ఒక ఫార్ములాగా మారింది. చాలామంది మహిళలు జనాభాలో 50 శాతం ఉన్నారు కదా, కోటా కూడా 50 శాతం ఉండాలి కదా? అని ప్రశ్నిస్తారు. అది న్యాయమైన వాదన అయినప్పటికీ, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, రాజ్యాంగ పరిమితుల దృష్ట్యా 33 శాతాన్ని మొదటి అడుగుగా వేస్తున్నారు. భవిష్యత్తులో మహిళా ప్రాతినిధ్యం పెరిగే కొద్దీ ఈ శాతాన్ని సవరించే అవకాశం కూడా ఉండవచ్చు.
ALSO ON TELUGUONE N E W S
   -మొన్న థియేటర్స్ లో అడుగుపెట్టిన పాపం ప్రతాప్ ' -అజయ్ ఘోష్ నా భర్తని చెప్పారు -నేను అనుకున్నది మాత్రం వేరు  -ఆసక్తిని కలిగిస్తున్న రాశి వ్యాఖ్యలు  రాశి(Raasi)కి ఉన్నసినీ క్యాపబాలిటీ గురించి తెలిసిందే. తన అందంతో, అంతకంటే అందమైన నటనతో సిల్వర్ స్క్రీన్ పై హీరోలని తన అభిమానులుగా మార్చుకుంది. మరి ఈ లెక్కన  అభిమానులు, ప్రేక్షకులు రాశితో ఎంతగా కనెక్ట్ అయ్యి ఉంటారో చెప్పక్కర్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో భాగంగా మొన్న 'పాపం ప్రతాప్ '(Papam Prathap)అనే చిత్రంతో హీరోకి మదర్ గా సెల్యులాయిడ్ పై అడుగుపెట్టింది. ఈ చిత్రం గురించి రాశి మాట్లాడుతు చెప్పిన ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. రాశి మాట్లాడుతు నేను హీరోయిన్ గా ఉన్నప్పుడు ఆర్టిసుల పేర్లు మొత్తం తెలుసు. కానీ ఇప్పుడు వాళ్ళ పేర్లు పెద్దగా తెలియవు. మనుషులని చూస్తే మాత్రం గుర్తుపడతాను. పాపం పసివాడులో నా భర్తగా అజయ్ ఘోష్ అని చెప్పారు. నేనేమో అజయ్(విక్రమార్కుడు విలన్)  అనుకున్నాను. సెట్ కి వెళ్తే అజయ్ ఘోష్ గారు కూర్చొని ఉన్నారు. నేనేమో అజయ్ కోసం వెతుకుతున్నాను. దాంతో ఒక అమ్మాయిని అడిగితే నా భర్త అజయ్ ఘోష్ అని చెప్పిందని రాశి చెప్పుకొచ్చింది. దీంతో అక్కడున్న వాళ్ళందరు నవ్వారు.  Also read: vd shouryuv: గ్లోబల్ టెక్నీషియన్స్ తో విజయ్ దేవరకొండ కొత్త మూవీ.. డైరెక్టర్ పేరు తెలిస్తే షాక్ అవుతారు ఆ తర్వాత అజయ్ ఘోష్(Ajay Ghosh)గురించి మాట్లాడుతు అజయ్ ఘోష్ గారు సింగల్ టేక్ ఆర్టిస్ట్ తో పాటు మంచి ప్రతిభావంతమైన ఆర్టిస్ట్  అని చెప్పుకొచ్చింది. ఇక పాపం ప్రతాప్ ' లో అజయ్ ఘోష్, రాశి ఫెయిర్ కి మంచి పేరు వస్తుంది. సినిమా చూసిన రాశి అభిమానులు అయితే మరిన్ని సినిమాలు చేసి తమని అలరించాలని కోరుతున్నారు.  
టాలీవుడ్ వెండితెరపై ఎప్పుడూ కొత్త అందాల అన్వేషణ జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా మాస్ మహారాజా రవితేజ సినిమాల ద్వారా పరిచయమైన హీరోయిన్లు స్టార్‌డమ్ తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అదే బాటలో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షిస్తోంది మహారాష్ట్ర సొగసరి భాగ్యశ్రీ బోర్సే. 'మిస్టర్ బచ్చన్' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ, సినిమా విడుదలకు ముందే తన గ్లామర్‌తో, డ్యాన్స్‌తో కుర్రకారును తన మాయలో పడేసింది. ఈ సినిమా త‌ర్వాత తెలుగులో కింగ్‌డ‌మ్‌, కాంత‌, ఆంధ్రాకింగ్ తాలూక వంటి సినిమాల‌తో ప్రేక్ష‌కులకు మ‌రింత ద‌గ్గ‌రైంది. ప్ర‌స్తుతం అఖిల్ హీరోగా రూపొందుతున్న లెనిన్ చిత్రంలో కూడా న‌టిస్తోంది. ఇదికాక త‌మిళ్‌లోనూ మంచి ఆఫ‌ర్స్ భాగ్య‌శ్రీ‌ని వ‌రిస్తున్నాయి.  సాధారణంగా హీరోయిన్లు అంటే భారీ మేకప్, కాస్ట్యూమ్స్‌తో మెరిసిపోతుంటారు. కానీ భాగ్యశ్రీ బోర్సే శైలి వేరు. ఆమెలో ఉన్న సహజమైన అందమే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆమె షేర్ చేసిన కొన్ని ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పెద్దగా హంగులు లేకపోయినా, కేవలం తన కళ్లతో, చిరునవ్వుతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఈ నేచురల్ లుక్ చూస్తుంటే, టాలీవుడ్‌లో మరో స్టార్ హీరోయిన్ రెడీ అయిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' చిత్రంలో భాగ్యశ్రీ నటనకు, ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు మంచి మార్కులు పడ్డాయి. 'సితార్' పాటలో ఆమె పలికించిన హావభావాలు, గ్రేస్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఒక పక్క క్లాసీ లుక్, మరోపక్క మాస్ ఆడియన్స్‌ను అలరించే ఎనర్జీ ఆమె సొంతం. దీంతో మొదటి సినిమాతోనే టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడిపోయింది ఈ ముద్దుగుమ్మ. భాగ్యశ్రీ బోర్సే కేవలం నటి మాత్రమే కాదు, మోడలింగ్ రంగంలోనూ మంచి అనుభవం ఉన్న బ్యూటీ. హిందీలో 'యారియాన్ 2' వంటి చిత్రాల్లో నటించినప్పటికీ, తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న ఆదరణ చూసి ఆమె ఉబ్బితబ్బిబ్బవుతోంది. రవితేజ వంటి ఎనర్జిటిక్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని, తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని ఆమె పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమెకు టాలీవుడ్ నుంచి భారీ ఆఫర్లు క్యూ కడుతున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో భాగ్యశ్రీకి ఉన్న ఫాలోయింగ్ రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో క్షణాల్లో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ ఆమెను "నేచురల్ క్వీన్" అని కామెంట్స్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా సందడి చేస్తున్నారు. ముఖ్యంగా కుర్రకారు ఈమె క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌కు ఫిదా అయిపోతున్నారు. గ్లామర్ డాల్‌గా మాత్రమే కాకుండా, పెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఉన్న పాత్రలు చేయాలని ఆమె భావిస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు భాగ్యశ్రీ డేట్స్ కోసం ప్రయత్నిస్తున్నాయని ఇండస్ట్రీ టాక్. మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులలో ఆమె పేరు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. తన అందం, అభినయంతో టాలీవుడ్‌లో లాంగ్ ఇన్నింగ్స్ ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే తన కొత్త సినిమాల గురించి భాగ్యశ్రీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఈ కొత్త మెరుపు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి!
ప్రపంచ సంగీత సామ్రాజ్యాన్ని తన వేళ్ళపై ఆడించిన ఏకైక ఛత్రపతి, డ్యాన్స్ అంటే 'మూన్ వాక్' అని లోకానికి పరిచయం చేసిన లెజెండ్ మైకేల్ జాక్సన్. ఆయన మరణించి దశాబ్ద కాలం దాటినా, నేటికీ ఆ పేరు వింటే పూనకాలు వచ్చే అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. ఇప్పుడు ఆ పాప్ కింగ్ జీవిత గాథ వెండితెరపై ఆవిష్కృతమవుతోంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మైకేల్ జాక్సన్ బయోపిక్ 'మైకేల్' విడుదలకు సర్వం సిద్ధమైంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండటానికి ప్రధాన కారణం మైకేల్ జాక్సన్ పాత్రను ఆయన స్వయానా మేనల్లుడు జాఫర్ జాక్సన్ పోషించడమే. విడుదలైన ప్రోమోలు, పోస్టర్లు చూస్తుంటే జాఫర్ అచ్చం మైకేల్ లాగే కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. బాడీ లాంగ్వేజ్ నుంచి డ్యాన్స్ మూమెంట్స్ వరకు జాఫర్ పడ్డ కష్టం తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. లెజెండరీ సింగర్ మేనల్లుడే ఈ పాత్ర చేస్తుండటంతో, జాక్సన్ వారసత్వాన్ని పక్కాగా ప్రతిబింబిస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ మూవీని ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రముఖ దర్శకుడు ఆంటోనీ ఫుక్వా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైకేల్ జాక్సన్ బాల్యం నుంచి, 'జాక్సన్ 5' బ్యాండ్‌తో ఆయన ప్రయాణం, సోలో సింగర్‌గా గ్లోబల్ ఐకాన్‌గా ఎదిగిన తీరును ఈ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు. కేవలం ఆయన విజయాలే కాకుండా, జీవితంలో ఎదుర్కొన్న వ్యక్తిగత ఒడిదుడుకులు, వివాదాలను కూడా నిజాయితీగా స్పృశించనున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్న ఈ సినిమాలో మ్యూజిక్ హైలైట్‌గా నిలవనుంది. జాక్సన్ పాడిన ఐకానిక్ సాంగ్స్‌ను మళ్ళీ వెండితెరపై ఆ స్థాయి సౌండ్ క్వాలిటీతో వినడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. షూటింగ్ కోసం దాదాపు రెండేళ్ల పాటు కసరత్తు చేసిన చిత్ర యూనిట్, ప్రతి ఫ్రేమ్ మైకేల్ అసలు జీవితానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. ఈ సినిమాలో మైకేల్ తండ్రి జో జాక్సన్ పాత్రలో ఆస్కార్ విజేత కోల్‌మన్ డొమింగో నటిస్తుండటం విశేషం. సోషల్ మీడియాలో ఇప్పటికే 'మైకేల్' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంజే ఆర్మీ ఈ సినిమా కోసం కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తోంది. ఒక శకాన్ని శాసించిన మనిషి కథను థియేటర్లో చూడటం అంటే అది కేవలం సినిమా కాదు, ఒక ఎమోషనల్ జర్నీ అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేయడం ఖాయంగా కనిపిస్తోంది.
  - నిఖిల్ కెరీర్‌లోనే భారీ పందెం! - ఈ రూల్ వ‌ల్ల రిస్క్ ఎవరికి? - నిఖిల్ సినిమాతో సరికొత్త ట్రెండ్! టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ‘స్వయంభు’తో బిజీగా ఉన్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, తాజాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్‌కు సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా కోసం ఒక వినూత్నమైన ‘పెర్ఫార్మెన్స్ బేస్డ్’ డీల్‌ను తెరపైకి తెచ్చినట్లు సమాచారం. సాధారణంగా ఏ సినిమాకైనా విడుదల ముందే ఓటీటీ హక్కులు ఒక భారీ రేటుకు అమ్ముడవు తుంటాయి. సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఒప్పందం ప్రకారం నిర్మాతలు ఆ మొత్తాన్ని అందుకుంటారు. కానీ, ‘స్వయంభు’ విషయంలో నెట్‌ఫ్లిక్స్ తన పంథాను మార్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా థియేటర్లలో సాధించే నెట్ కలెక్షన్లలో సుమారు 50 శాతం మొత్తాన్ని డిజిటల్ రైట్స్ కింద చెల్లించేలా ఈ కొత్త అగ్రిమెంట్ రూపొందినట్లు ఇండస్ట్రీ టాక్. అంటే సినిమా బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్ అయితే, ఓటీటీ ద్వారా నిర్మాతలకు అంత ఎక్కువ లాభం దక్కుతుందన్నమాట. నిజానికి ఇది ఒక రకమైన సాహసమనే చెప్పాలి. ఒకవేళ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లు సాధిస్తే, ఓటీటీ నుంచి వచ్చే ఆదాయం కూడా ఊహించని స్థాయిలో ఉంటుంది. ఒకవేళ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోతే మాత్రం ఓటీటీ రేటు కూడా తగ్గే ప్రమాదం ఉంటుంది. ఇటీవలి కాలంలో భారీ ధరలకు కొన్న సినిమాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ఆశించిన స్థాయిలో వ్యూస్ రాబట్టలేకపోతున్నాయి. ఈ రిస్క్‌ను తగ్గించుకోవడానికి నెట్‌ఫ్లిక్స్ ఈ కొత్త మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సినిమాలో నిఖిల్ సరసన సంయుక్త మీనన్ మరియు నభా నటేష్ కథానాయికలుగా నటిస్తున్నారు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతోంది. ‘కేజీఎఫ్’ చిత్రంతో తనదైన ముద్ర వేసిన రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన నిఖిల్ లుక్స్, పోస్టర్స్ సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేశాయి. ‘కార్తికేయ 2’ వంటి గ్లోబల్ హిట్ తర్వాత నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కావడంతో దేశవ్యాప్తంగా దీనిపై ఆసక్తి నెలకొంది. ఈ వినూత్న ఒప్పందంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మేకర్స్ తమ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఇలాంటి రిస్కీ డీల్‌కు ఓకే చెప్పి ఉంటారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్‌లో ఇలాంటి పద్ధతి మరిన్ని పెద్ద సినిమాలకు కూడా వర్తించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం, త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో థియేటర్లలోకి రానుంది. బాక్సాఫీస్ వద్ద నిఖిల్ ఏ రేంజ్ మ్యాజిక్ చేస్తారో చూడాలి!
  -రణబాలి, రౌడీ జనార్ధన తో బిజీ  -మరో క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ  -రాకా, వారణాసి స్థాయిలో నిర్మాణం జరుపుకోనుందా! హిట్, ప్లాప్ తో సంబంధం లేని అరుదైన హీరోల్లో విజయ్ దేవరకొండ(VIjay Deverakonda) ఒకడు. మరి ఏడేళ్ల నుంచి హిట్ లేకపోయినా క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు. అప్ కమింగ్ మూవీస్  రణబాలి, రౌడీ జనార్ధన నే ఉదాహరణ. ఇప్పుడు ముచ్చటగా మూడో ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసాడు. హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ డైరెక్టర్ అవ్వడం ఈ చిత్రం స్పెషాలిటీ. స్పెషాలిటీ నే కాదు. అలా అనౌన్స్ చేసారో లేదో ఇలా వైరల్ అయ్యి కూర్చుంది. ఆ క్రేజీ డీటెయిల్స్ చూద్దాం.    విజయ్,  శౌర్యువ్(Shouryuv)చిత్రాన్ని మేకర్స్ అధికారకంగా ప్రకటిస్తు కాసేపటి క్రితం రిలీజ్ చేసిన పోస్టర్ లో విజయ్ దేవరకొండ నాలుగు పెట్ డాగ్స్ ని తీసుకుని నడుచుకుంటూ వెళ్తుంటే    వెనక ఏడుగురు వ్యక్తులు వివిధ రకాల ఆయుధాలతో ఉన్నారు. ఇప్పుడు కనిపించే కోపమంతా ఒకప్పటి ప్రేమ' అనే  క్యాప్షన్ ని పోస్టర్ పై రాసారు.  మైథాలజికల్ యూనివర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందనుండగా  ఒక కొత్త ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నామని పోస్టర్ ద్వారా చెప్పినట్టయింది. aslo read: Regina Cassandra: రెజీనా సంచలన పోస్ట్.. లవ్ లో ఫెయిల్ అయ్యిందా! ఇండియన్ సినిమాని గ్లోబల్ స్థాయికి తీసుకెళ్ళబోతున్నారనే విషయం కూడా అర్ధమవుతుంది.  అంతలా ఇంటర్నేషల్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. హౌస్ ఆఫ్ ది డ్రాగన్, ఫాల్ ఔట్ వంటి హాలీవుడ్ చిత్రాలకి వర్క్ చేసిన అలెజాండ్రో మార్టినెజ్ డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గాడ్స్ ఆఫ్ ఈజిప్ట్, బ్యాట్ మ్యాన్ ఫరెవర్, స్నోపియర్సర్ చిత్రాల  వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎరిక్ డస్ట్ర్ పనిచేస్తున్నారు. యానిమల్, ఓం శాంతి ఓం వంటి చిత్రాలకు పనిచేసిన సురేష్ సెల్వరాజన్ ప్రొడక్షన్ డిజైనర్ గా, పలు సూపర్ హిట్ చిత్రాల కంపోజర్ హేషమ్ అబ్దుల్ వాహాబ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీన్ని బట్టి  ఇండియన్ సినిమాకి గ్లోబల్ స్థాయి క్రేజ్ తీసుకురావడంలో వారణాసి, రాకా చిత్రాల్లాగానే విజయ్, శౌర్యువ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లబోతుందని తెలుస్తుంది. హాయ్ నాన్నని నిర్మించిన  వైరా బ్యానర్ నే నిర్మాణ బాధ్యతలని నిర్వహిస్తుంది.    
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాత కాలపు వింటేజ్ కామెడీ సీన్స్ మామూలుగా హల్‌చల్ చేయడం లేదు. అందులోనూ జంద్యాల మార్క్ కామెడీ అంటే ఆ కిక్కే వేరు. తాజాగా 'చూపులు కలిసిన శుభవేళ' చిత్రంలోని కొన్ని కామెడీ బిట్స్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా మన బ్రహ్మానందం , కోట శ్రీ‌నివాస‌రావు కలిసి చేసే రచ్చ చూస్తుంటే ఎంతటి టెన్షన్‌లో ఉన్న వారైనా సరే ఇట్టే న‌వ్వాల్సిందే. ఈ వీడియో ఎందుకు అంతలా పేలుతోందో తెలిస్తే మీరు కూడా షాక్ అవుతారు! ముందుగా వీడియోలో హైలైట్ ఏంటంటే.. బ్రహ్మానందం ‘యూత్ ఫుల్’ పెర్ఫార్మెన్స్. ఆయన ఫేస్ కనిపిస్తే చాలు ఎవరికైనా కొట్టాలనిపిస్తుంది అంటూ సెల్ఫ్ సెటైర్లు వేసుకోవడం, దానికి తోడు కోట గ్రాంథిక భాషా ప్రయోగాలు నవ్వు తెప్పిస్తాయి. "నిసివర్ణోష్ణోదకము స్వీకరింతురా?" అంటూ ఆయన అడిగే డైలాగులకు, దానికి "కాఫీ తాగుతారా?" అని అర్థం చెప్పే సీన్ ఇప్పటికీ ఎవర్‌గ్రీన్. నేటి తరం కుర్రాళ్లు వాడే స్లాంగ్‌కు అప్పట్లోనే జంద్యాల గారు గట్టి కౌంటర్లు ఇచ్చారన్నమాట! ఇక ఈ వీడియోలో మరో కిరాక్ సీన్ ఏంటంటే.. పెళ్లి చూపుల్లో వంకాయ కూర మీద జరిగే చర్చ. వంకాయ కూరలో అల్లం పేస్ట్ వేస్తే బాగుంటుందా? లేక కొత్తిమీర కారం పెడితే బాగుంటుందా? అంటూ నాయికానాయికలు చేసే ఆ కూరల డిస్కషన్ చూస్తుంటే అబ్బో.. ఏమన్నా తిండి మీద పిచ్చా అనిపిస్తుంది. వంకాయ వేపుడు నుంచి పనసకాయ కూర వరకు వీరు పెట్టే లిస్ట్ వింటుంటే నోరూరడమే కాదు, వెనకాల నిలబడి తల పట్టుకునే ముసలాయన గోడు చూస్తే కడుపుబ్బ నవ్వు రావడం గ్యారెంటీ. ప్రేమ పెళ్లిళ్ల మీద నాగలింగం వింత సిద్ధాంతాలు, ఆయన వేసే మారువేషాలు ఈ వీడియోలో అల్టిమేట్ ఎంటర్టైన్మెంట్. "ప్రేమ అనేది పేడ లాంటిది.. గోడకు కొడితే పిడక అవుతుంది" అంటూ ఆయన చెప్పే లాజిక్కులు వింటే షేక్స్ పియర్ కూడా షాక్ అవ్వాల్సిందే. అల్లుడిని నమ్మించడానికి ఆయన పడే పాట్లు, క్లైమాక్స్‌లో జరిగే కన్ఫ్యూజన్ డ్రామా అంతా ఒక రేంజ్‌లో ఉంటుంది. ప్రస్తుతం ఈ వీడియో చూసిన నెటిజన్లు "అప్పట్లో కామెడీ అంటే ఇదీ భయ్యా.. క్లీన్ అండ్ గ్రీన్!" అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు. కొంతమంది "వంకాయ కూర లవర్స్ అందరూ ఇక్కడ ఒక లైక్ వేసుకోండి" అని ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పటి సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగుల మధ్య ఇలాంటి అచ్చమైన తెలుగు కామెడీ దొరకడం అదృష్టమే కదా! ఇలాంటి ఫ‌న్నీ వీడియోల కోసం మా Teluguone youtube channelను Subscribe చేసుకోండి.
  -పరిచయం అక్కర్లేని పేరు రెజీనా కసాండ్రా  -తెలుగుతో పాటు అన్ని భాషల్లో తన హవా  -రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా పోస్ట్  -లవ్ ఫెయిల్యర్ అని చెప్తుందా! సినీప్రియులు తమ సినీ ఆలోచనలని లాంగ్ చర్చల్లోకి తీసుకెళ్లిన మరు క్షణం వాళ్లందరికీ గుర్తొచ్చే పేరు రెజీనా కసాండ్రా(Regina Cassandra). తమిళ భామ అయినా కూడా ఆ మాట నమ్మనంతగా తెలుగు  ప్రేక్షకులకి దగ్గరయింది. ఒకానొక దశలో టాప్ హీరోయిన్ చైర్ లో కుర్చుంటుందని అనుకున్నారు. ప్రెజెంట్ మూడు పదుల వయసులో కూడా పలు బాషల చిత్రాలు, వెబ్ సిరీస్ చేస్తు బిజీగా ఉంది. రీసెంట్ గా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది. సదరు పోస్ట్  ఫ్యాన్స్, నెటిజన్స్ కి తన గురించి మాత్రమే ఆలోచించే పనిని కల్పించింది. ఆ వివరాలు చూద్దాం.    రెజీనా ఇన్ స్టాగ్రామ్ లో ఒక రోజు నేను ప్రేమకి సరెండర్ అయ్యాను. ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేది జరగకపోవడం అనేది ఆగదు. కాకపోతే ప్రేమ అనేది ప్రశాంతంతో కూడిన బలం. ప్రతి రోజు మీ కోసం మీరు నవ్వుతు ఉండాలి. ప్రేమ అందించడానికి అర్హులు అనే విషయం కూడా మీరు గుర్తించుకోవాలి. ప్రేమించడం, ప్రేమించబడటంలో ఉన్న సంతోషం ప్రేమని కోల్పోయాకే అర్థమవుతుంది. ఆ కోల్పోవడం అనేది ఒక వ్యక్తి కావచ్చు లేదా ఒక బంధం కావచ్చు. జీవితం నేర్పే పాఠాలు మనిషిని మరింత దృఢంగా మారుస్తాయని పోస్ట్ లో పేర్కొంది. పోస్ట్ చూస్తుంటే రెజీనా లవ్ లో ఏమైనా ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది.  Also read: Prakash Raj: ప్రొడ్యూసర్ జేబులో డబ్బు కాజేసిన ప్రకాష్ రాజ్.. అగ్ర రచయిత వ్యాఖ్యలు వైరల్  నెటిజన్స్, ఫ్యాన్స్ కూడా స్పందిస్తు పర్సన్ కంటే ప్రేమ గొప్పది. ఆ ప్రేమ ఎప్పుడు మీ కోసం ఎదురుచూస్తూనే ఉంటుంది. మీ కోసమే ఆలోచించే వ్యక్తి మీ కోసం ఉంటాడనే  కామెంట్స్ చేస్తున్నారు. రెజీనా అప్ కమింగ్ సినీ జర్నీని చూస్తే ఫ్లాష్ బ్యాక్, ముకుత్తి అమ్మన్ పార్ట్ 2 , ది వైవ్స్, సెక్షన్ 108 చిత్రాలు రెజీనా లిస్ట్ లో ఉన్నాయి.  రెజీనా స్టిల్ బ్యాచులర్ అనే విషయం తెలిసిందే.  
  -ప్రకాష్ రాజ్ చిట్టా మొత్తం నా దగ్గర ఉంది  -ప్రముఖ అగ్ర రచయిత సంచలన వ్యాఖ్యలు  -ప్రకాష్ రాజ్ రెండు రోజుల క్రితం రాముడిని విమర్శించిన విషయం తెలిసిందే  -పూర్తి మాటర్ ఏంటో చూద్దాం     స్టార్ యాక్టర్ ప్రకాష్ రాజ్(Prakash Raj)రెండు రోజుల క్రితం హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు గురించి మాట్లాడుతు 'రాముడు, లక్ష్మణుడు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలు. వారిద్దరూ దక్షిణ భారతానికి చెందిన రావణుడి పొలంలో పండ్లు దొంగిలించారు. శూర్పణఖ ఆ దొంగతనాన్ని చూసి జిఎస్టితో కలుపుకొని రెండు వేల డాలర్స్ కట్టాలని అడిగిందనే వ్యాఖ్యలు చేసాడు. దీంతో ప్రకాష్ రాజ్ పై హిందువులు భగ్గుమంటున్నారు. అనేక చోట్ల కేసులు కూడా నమోదయ్యాయి. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కి సంబంధించిన నిజాలు ఇవే అని స్టార్ రైటర్ మరుదూరి రాజా అంటున్నాడు. అవేంటో చూద్దాం. ప్రకాష్ రాజ్ గారూ..ఇంత దిగజారి పోతారనుకోలేదు.. రచయిత గా బాధగా ఉంది.. మీకు నా ముందస్తు సానుభూతి.. రంగ మార్తాండా. మొదట మీరో ఆఫీసు బాయ్. ప్రొడ్యూసర్ జేబులో డబ్బు కాజేసి చెన్నైచేరి గొప్ప ఆర్టిస్ట్ అయ్యారు. మీలాగే శ్రీ రాముడు అనుకుంటే ఎలా.? మీ కథ మొత్తం నా దగ్గరుంది అని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు. ఇప్పుడు ఈ పోస్ట్ చేరవలసిన వాళ్ల దగ్గరకే చేరుతుంది. అదేనండి రామ భక్తుల దగ్గరకి. దీంతో సోషల్ మీడియావేదికగా రామభక్తులందరు ప్రకాష్ రాజ్ రాజ్ ని ఒక ఆట ఆడుకుంటున్నారు. also read: Anchor Ravi: యాంకర్ రవి ఆవేదన.. మా కుల పెద్ద చిరంజీవి    మరుదూరి రాజా గురించి చెప్పుకోవాలంటే రచయితగా ఒక పెను ప్రభంజనాన్నే సృష్టించాడు. ఆయన మేధో ఫలకం నుంచి వచ్చిన ఎన్నో డైలాగ్స్  నేటికీ సినీ ప్రియుల నోళ్లల్లో ఆణిముత్యాలుగా నిత్య స్పర్శతో ఉంటాయి.  దాదాపుగా 350 సినిమాలు ఆయన లిస్ట్ లో ఉండగా ఆల్ జోనర్స్ కి తన మాయాజాలంతో మరింత వన్నె తెచ్చాడు.      
        -యాంకర్ రవి సంచలన స్పీచ్  -నన్ను ఎందుకు చూడటం లేదు  -టీవీ వాళ్ళు కూడా సినిమాల్లో సత్తా చాటగలరు  -ఈ సారి కొత్త రవిని చూస్తారు  -మా కుల పెద్ద చిరంజీవి  -పూర్తి డీటెయిల్స్ చూద్దాం యాంకర్ గా సుదీర్ఘ కాలం నుంచి తనకంటు ఒక ప్రత్యేకతతో దూసుకుపోతున్నాడు రవి(Anchor Ravi). తన వల్ల అదనపు క్రేజ్ తెచ్చుకున్న ప్రోగ్రామ్స్ కూడా అనేకం ఉన్నాయి. అంతలా తన యాంకరింగ్ తో మెస్మరైజ్ చెయ్యగలడు. సినిమాల్లో కూడా రాణించాలని వెండి తెర అరంగ్రేటమ్ చేసి   విషయం తెలిసిందే. 2017 లో 'ఇది మా ప్రేమ కథ' అనే మూవీతో వచ్చాడు. మరి రవి రీసెంట్ గా మాట్లాడుతు ప్రేక్షకులు  ఎందుకనో నన్ను ఆదరించడం లేదు. కానీ ఈ సారీ మాత్రం ఖచ్చితంగా ఆదరించాలి. మా కుల గురువు ఆయనే అనే క్రేజీ వ్యాఖ్యలు చేసాడు. మరి పూర్తి న్యూస్ ఏంటో చూద్దాం. యాంకర్ రవి అప్ కమింగ్ మూవీ క్యాస్ట్(Caste).. వరుణ్ సందేశ్, సత్యం రాజేష్, గగన్ కూడా హీరోలుగా చేస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి ఫస్ట్  గ్లింప్స్‌ రిలీజయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రవి మాట్లాడుతు నేను యాంకర్‌గా ఎన్నో షోలు చేశాను. కానీ సినిమాల్లోకి రావాలనేది నా చిన్ననాటి కల. మీ చేత యాంకర్ రవి అనిపించుకున్న నేను ఈ  మూవీతో యాక్టర్ రవి అనిపించుకోవాలని అనుకుంటున్నాను. నా ‘కులం’ సినిమా. నా కుల దేవుడు ఎన్టీఆర్. మా కుల పెద్ద మెగాస్టార్ చిరంజీవిగారు. అదొక్కటే నమ్ముకుని ముందుకు వెళ్తున్నాం. సినిమా,కెమెరా, మైక్ తప్ప ఏమీ తెలియదు నాకు.   . టీవీలో ప్రతిరోజూ కనిపించడం వల్ల ప్రేక్షకులకి దగ్గర అవుతున్నాం. కానీ అదే ఇమేజ్   సినిమాల్లో మాకు మైనస్‌గా మారుతుంది. టీవీ ఆర్టిస్ట్‌లు సినిమాలు చేస్తుంటే ఆడియన్స్ చూడటం లేదని చెప్పుకొచ్చాడు. అదే సమయంలో టీవీ ఆర్టిస్టులని ఇండస్ట్రీలో చూసే కోణంలో కూడా మార్పు రావాలని తన ఆవేదనని తెలియచేసాడు. మరి ఆ మాటలు కూడా చూద్దాం. also read: Bhagyashri Borse: భాగ్యశ్రీ బోర్సే స్పీడ్ తగ్గుతుందా!  వరుస ఫ్లాప్స్ కారణమా!  టీవీ ఆర్టిస్టులు అనగానే చాలామంది తక్కువ చేసి చూస్తారు. మాకు టాలెంట్ ఉన్నా, వెండితెరపై మాకు దక్కాల్సిన గౌరవం, అవకాశాలు రావడం లేదు. పెద్ద తెరపై కనిపిస్తేనే 'నటుడు' అనే ముద్ర పడుతుందనే ధోరణి మారాలి. సినిమా నటులతో పోలిస్తే టీవీ నుండి వచ్చిన వారికి ఇచ్చే రెమ్యూనరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఒక యాక్టర్ ఏ మాధ్యమం ద్వారా వచ్చాడనే దానికంటే, అతను ఎంత బాగా నటించగలడు అనేదే ముఖ్యం. ప్రస్తుతం డిజిటల్ విప్లవం వల్ల ఓటీటీలు, యూట్యూబ్ స్టార్స్ కూడా సినిమాల్లోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో టీవీ ఆర్టిస్టులని పక్కన పెట్టడం సరికాదు. క్యాస్ట్ మూవీ ద్వారా నాలోని కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు. నాలాంటి ఎందరో ప్రతిభావంతులకి  కూడా ఒక ప్రేరణగా క్యాస్ట్ మూవీ నిలుస్తుందని నటుడు రవి చెప్పుకొచ్చాడు.    
    -అందానికి సరికొత్త పేరు భాగ్యశ్రీ బోర్సే -ప్రస్తుతం అఖిల్ తో లెనిన్  -మరి నెక్స్ట్ ఏంటి  -ప్రెజెంట్ సోషల్ మీడియాలో పిక్స్ వైరల్  అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు అందంలో గాని, పెర్ఫార్మ్ విషయంలో గాని 'భాగ్యశ్రీ బోర్సే'(Bhagyashri Borse)నెంబర్ వన్. కానీ ఎందుకనో హిట్ అనేది ఆమెని కనీసం చుట్టపు చూపుగా అయినా పలరించడం లేదు. అందుకుపైన చెప్పుకున్న అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఎన్నో కారణాలు. కానీ ప్లాప్స్ లో కూడా రష్మిక లాగా నేషనల్ క్రష్ అనే టాగ్ లైన్ ని సొంతం చేసుకుంది. దీన్ని బట్టి  అభిమానుల్లో భాగ్యశ్రీకి ఎంతటి చరిష్మా ఉందో అర్ధం చేసుకోవచ్చు.  కళ్ళతోనే తన క్యారక్టర్ తాలూకు భావాన్ని మొత్తం చెప్పేయగలదు. కాంత మూవీనే ఒక ఉదాహరణ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అఖిల్ అక్కినేని(Akhil Akkineni)తో చేస్తున్న లెనిన్(Lenin)ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. మురళీ కిషోర్(Murali Kishor)దర్శకత్వంలో రూరల్ డ్రామాగా తెరకెక్కుతుండగా'భారతి' అనే పల్లెటూరి అమ్మాయి క్యారక్టర్ లో భాగ్యశ్రీ  కనిపిస్తోంది. ఇటీవల విడుదలైన 'యెట్టా యెట్టా' సాంగ్ ప్రొమోలో అఖిల్‌తో భాగ్యశ్రీ  కెమిస్ట్రీ చూస్తుంటే, ఈసారి బాక్సాఫీస్ వద్ద గట్టిగానే కొట్టేలా కనిపిస్తోంది. లెనిన్ తప్ప మరో అప్ కమింగ్ మూవీ ఆమె లిస్ట్ లో లేదు. దీంతో ఈ సారి లెనిన్ తో  భాగ్యశ్రీ  హిట్ ని అందుకొని మరిన్ని సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నారు.    అన్నట్టు భాగ్యశ్రీ రీసెంట్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని పిక్స్  షేర్ చేసింది. అందమైన డిజైన్ తో చేసిన శారీ ధరించి నీతోనే ఏదో ఊసులాడాలనే విధంగా ఆమె చూపులు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఈ పిక్స్ వైరల్ గా మారడంతో తమ జన్మధన్యమైనట్టుగా ఫ్యాన్స్ బావిస్తున్నారు. aslo read: jacqueline fernandez: ప్రియుడు సుఖేష్ కి  జాక్వెలిన్ వెన్నుపోటు..  అప్రూవర్‌గా మారింది భయ్యా యారియాన్ 2' అనే బాలీవుడ్ మూవీతో కెరీర్ ప్రారంభించిన భాగ్యశ్రీ, రవితేజతో చేసిన   'మిస్టర్ బచ్చన్' తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా,తన అందం, అభినయానికి అందరు ఫిదా అయ్యారు. రామ్ పోతినేనితో చేసిన ఆంధ్ర కింగ్ తాలూకా, దుల్కర్ సల్మాన్‌తో చేసిన 'కాంత' కూడా నిరాశపరిచాయి. మరి 'లెనిన్' ఆడాలని కోరుకుందాం   
ఈ రోజుల్లో ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలు చదువులో బాగా రాణించాలని, ఆత్మవిశ్వాసంతో ఉండాలని, జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కంటారు. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంత ఖర్చు పెడితే.. పిల్లలు అంత గొప్పగా ఎదుగుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా తప్పు.. కేవలం పిల్లల కోసం డబ్బు ఖర్చు చేస్తే పిల్లలు తెలివైన వారుగా,  మంచి విద్యార్థులుగా,  మేధావులుగా ఎదుగుతారు అనుకోవడం మూర్ఖత్వం. రోజువారీ తల్లిదండ్రులు చేసే  చిన్న మార్పులు  పిల్లల ఆలోచన, ప్రవర్తన , భవిష్యత్తుపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి.  దైనందిన జీవితంలో కొన్ని సాధారణ అలవాట్లను అలవర్చుకోవడం వల్ల  పిల్లలు చదువులో రాణించడమే కాకుండా, వారు తెలివైనవారుగా, సృజనాత్మకంగా , తమకు తామే ప్రేరణ ఇచ్చుకుంటూ ముందుకు సాగుతారు. పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలంటే.. తల్లిదండ్రులు అనుసరించాల్సిన ఐదు మార్గాలు ఉన్నాయి.  అవేంటో తెలుసుకుంటే.. మాట్లాడటం.. నేటి తీరికలేని జీవితాలలో తల్లిదండ్రులు తరచుగా  పిల్లలతో కూర్చొని మాట్లాడటాన్ని మరచిపోతుంటారు, కానీ ఈ చిన్న అలవాటు పెద్ద మార్పును తీసుకురాగలదు. ప్రతిరోజూ 10-15 నిమిషాలు  పిల్లలతో మనసు విప్పి మాట్లాడాలి. వారి రోజు ఎలా గడిచిందో, పాఠశాలలో ఏమి జరిగిందో, వారి స్నేహితులు ఎలా ఉన్నారో అడగాలి. ఇది పిల్లలు తమ విషయాలను స్వేచ్ఛగా పంచుకోవడానికి ప్రోత్సహిస్తుంది.  వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అంతేకాకుండా, ఇది వారి ఆలోచనా విధానం, మాట్లాడే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ప్రశ్నలకు సమాధానాలు.. పిల్లలు ప్రతిదీ తెలుసుకోవాలనుకుంటారు. కొన్నిసార్లు, వారి ప్రశ్నలతో తల్లిదండ్రులు  విసుగు చెంది, వారిని మౌనంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు, ఇది తప్పు. పిల్లలు ప్రశ్న అడిగినప్పుడు, శ్రద్ధగా విని, వివరించడానికి ప్రయత్నించాలి. ఒకవేళ తల్లిదండ్రులకు  సమాధానం తెలియకపోతే, ఇద్దరూ కలిసి దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఇది పిల్లల ఆలోచనా సామర్థ్యాన్ని, తర్కాన్ని , సృజనాత్మకతను వేగంగా మెరుగుపరుస్తుంది. స్క్రీన్ టైం.. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్లు, టీవీలు, టాబ్లెట్లు పిల్లల జీవితంలో ఒక భాగమైపోయాయి. కానీ, స్క్రీన్ ముందు ఎక్కువ సేపు గడపడం వారి మెదడుకు, ఆరోగ్యానికి హానికరం.  పిల్లల స్క్రీన్ సమయాన్ని పరిమితం చేయడానికి ప్రయత్నించాలి. దానికి బదులుగా, పుస్తకాలు చదవమని, బొమ్మలు గీయమని, ఆటలు ఆడమని లేదా పజిల్స్ పరిష్కరించమని వారిని ప్రోత్సహించాలి. ఇది వారి ఏకాగ్రతను, ఊహాశక్తిని బలపరుస్తుంది. పిల్లలు ఇవన్నీ ఇష్టంతో చేయాలంటే.. తల్లిదండ్రులు కూడా పిల్లలతో పాటు స్క్రీన్ టైం తగ్గించి వారికి సహకరించాలి. ఎంకరేజ్.. ప్రతి పిల్లవాడు తమ పనికి ప్రశంసలు పొందాలని కోరుకుంటారు. చిన్న చిన్న విజయాలను సైతం ప్రశంసించడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ ప్రశంస హృదయపూర్వకంగా, నిజాయితీగా ఉండేలా చూసుకోవాలి. గద్దించడానికి బదులుగా, ప్రేమతో చెప్పాలి. ఇది పిల్లలు భయపడకుండా నేర్చుకోవడానికి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ప్రోత్సాహం అందిస్తుంది. తమ పని తాము చేసుకోవడం.. పిల్లలకు వారి బ్యాగ్  వారే సర్దుకోవడం, పుస్తకాలు పెట్టుకోవడం లేదా వారి గదిని శుభ్రం చేసుకోవడం వంటి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించడం ముఖ్యం. ఇది వారిలో క్రమశిక్షణ, బాధ్యతను పెంపొందిస్తుంది. క్రమంగా, వారు తమ సొంత నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకుంటారు, ఇది వారి భవిష్యత్తుకు చాలా కీలకం. పైన చెప్పుకున్నవన్నీ పిల్లల జీవితంలో భాగం చేయగలిగితే.. ఆ పిల్లలు భవిష్యత్తులో మేధావులుగా మారడాన్ని ఎవరూ ఆపలేరు.                                         *రూపశ్రీ.
  మానవ శరీరానికి సంక్రమించే జబ్బులలో చాలా రకాలు ఉంటాయి. వాటిలో హిమోఫిలియా జబ్బు కూడా ఒకటి. చాలా మందికి హీమోఫిలియా అనే జబ్బు ఒకటుందని కూడా తెలియదు. హీమోఫిలియా అనేది శరీరం రక్తం గడ్డకట్టే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే ఒక ఆరోగ్య పరిస్థితి. శరీరంలో రక్తం గడ్డకట్టే కారకాలు లోపించడం వల్ల, చిన్న గాయాలు కూడా ఎక్కువసేపు రక్తస్రావానికి కారణమవుతాయి. ఇది తరచుగా కుటుంబాలలో వంశపారంపర్యంగా వచ్చే ఒక జన్యుపరమైన వ్యాధి. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన ప్రపంచ  హీమోఫిలియా  దినోత్సవాన్ని జరుపుకుంటారు.  ఈ జబ్బు గురించి,  ఈ జబ్బు లక్షణాల గురించి,  ఈ జబ్బుకు గల కారణాల గురించి వివరంగా తెలుసుకుంటే.. హీమోఫిలియా లక్షణాలు.. గాయం తర్వాత ఎక్కువసేపు రక్తస్రావం కావడం,  కీళ్లలో వాపు , నొప్పి, ఎటువంటి కారణం లేకుండా ముక్కు నుండి రక్తస్రావం కావడం, చిన్న గాయాలు కూడా మానడంలో ఆలస్యం కావడం, శరీరంపై నీలి గుర్తులు ఏర్పడటం హీమోఫిలియా వ్యాధి లక్షణాలు. ఏప్రిల్ 17 వ తేదీన ఎందుకు జరుపుకుంటారు? ప్రపంచ హిమోఫిలియా దినోత్సవాన్ని 1989లో ప్రపంచ హిమోఫిలియా సమాఖ్య (World Federation for Hemophilia) మొదటిసారిగా స్థాపించింది. WFH వ్యవస్థాపకుడైన ఫ్రాంక్ ష్నాబెల్ పుట్టినరోజుతో ఏకీభవించేలా ఈ రోజును ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధిపై అవగాహన పెంచడం,  రోగులకు మెరుగైన చికిత్స అందించడం దీని ఉద్దేశ్యం. థీమ్ ఇదే.. వ్యాధి నిర్థారణే.. సంరక్షణకు మొదటి మెట్టు అనేది ఈ ఏడాది ప్రపంచ హీమోఫిలియా వ్యాధి దినోత్సవానికి థీమ్ గా ఎంపిక చేశారు. ఈ వ్యాధికి చికిత్స,  సంరక్షణ మొదలైనవి.. కేవలం వ్యాధి నిర్థారించడంతోనే సాధ్యమవుతుందని, చికిత్సను సులువు చేస్తుందని దీని అర్థం. హీమోఫిలియా.. శరీరంలో ఏ చిన్న గాయం అయినా.. రక్తం గడ్డకట్టడం ద్వారా రక్తస్రావం ఎక్కువ జరగకుండా ఉండటానికి శరీరంలో కొన్ని కారకాలు ఉంటాయి. ఇవి లోపిస్తే.. హీమోఫిలియా వ్యాధి వస్తుంది.  రక్తస్రావం ఆగకుండా ఉండటం వల్ల శరీరంలో రక్తం కోల్పోయి అతి చాలా ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీస్తుంది. ఈ సమస్యను ఎంత తొందరగా గుర్తించి,  నిర్థారించగలిగితే.. మనిషి ప్రాణాన్ని అంత తొందరగా సంరక్షించుకునే అవకాశాలు ఎక్కుువగా ఉంటాయి. ఈ వ్యాధి మీద అవగాహన పెంచడానికి,  ప్రజలను అప్రమత్తం చేయడానికి,  లక్షణాలను గమనించేలా ప్రజలను సన్నద్ధం చేయడానికి ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాధి గురించి అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం,  జబ్బు పట్ల ప్రజలలో అపోహలు తొలగించడం,  ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం వంటివి ఈ ప్రపంచ హీమోఫిలియా దినోత్సవం సందర్బంగా నిర్వహిస్తారు.                                  *రూపశ్రీ.
పెళ్లి అనేది ప్రతి అమ్మాయి  జీవితాన్ని మరొక దశలోకి తీసుకుని వెళుతుంది.  ఎన్నో ఆశలతో ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త ఇంట్లో అడుగుపెడతారు అమ్మాయిలు.  కానీ చాలామంది అమ్మాయిలు చెప్పే మాట.. అత్తగారు సరిగా చూసుకోవడం లేదని, అత్తగారు సరిగా మాట్లాడటం లేదని.  ప్రతి ఇంట్లో అత్తాకోడళ్ల సంబంధం ఎప్పుడూ ఏదో ఒక గొడవలో మునిగి తేలుతూ ఉంటుంది. అత్తగారు సంతోషంగా , లేకపోతే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. అందుకే అత్తాకోడళ్ల బంధం అంటే.. గొడవలు, పోట్లాటలు, వాదించుకోవడాలతో నిండి ఉంటుంది అనుకుంటారు.  అయితే అత్తాకోడళ్లు  ఒకరినొకరు అర్థం చేసుకుని, అవగాహన, గౌరవం , ఆప్యాయతతో ఉంటేనే అత్తాకోడోళ్ల  బంధం బాగుంటుంది.  ప్రతి అమ్మాయి అత్తగారు తనతో బాగుండాలని కోరుకుంటుంది.  అత్తగారు తన కోడలిని మెచ్చుకోవాలంటే.. కోడలిలో కొన్ని లక్షణాలు ఉండాలని రిలేషన్షిప్ నిపుణులు చెబుతున్నారు.  ఆ లక్షణాలు ఏంటో తెలుసుకుంటే.. మద్దతు.. అత్తమామలకు అండగా నిలబడి, వారికి పూర్తిగా మద్దతు ఇస్తే.. ఆ కోడలిని అత్తగారు ఎంతో ఇష్టపడతారు.  అలా కాకుండా అదే పనిగా గొడవలు చేసుకుని పుట్టింటికి వెళుతూ ఉంటే..  ఏ అత్తగారు కూడాతన కోడలిని ఇష్టపడరట. గొడవలు జరిగినా సరే.. వారి మధ్య మాత్రమే గొడవలు ఉండి, నలుగురిలో అత్తమామలను, భర్తను గౌరవించే కోడలిని అత్తగారు ఎప్పుడూ వదులుకోరు. గౌరవం, మర్యాద..  అత్తమామలకు ఇష్టమైన కోడలిగా ఉండాలనుకుంటే,  గౌరవప్రదంగా ఉండాలి. నలుగురు మెచ్చుకునేలా,  నలుగురిలో హుందాగా, కుటుంబాన్ని నలుగురిలో గొప్పగా చూపించేలా ఉండాలి. ఇది అత్తాకోడళ్ల బంధాన్ని బలంగా మారుస్తుంది. బాధ్యత.. ప్రతి అత్తగారు తన కోడలు ఇంటికి రాగానే అన్ని బాధ్యతలూ తీసుకోవాలని కోరుకుంటుంది.  ఇంటి పనుల పట్ల ఆసక్తి చూపించి,  బాధ్యతలన్నింటినీ చక్కగా నిర్వర్తిస్తే మంచి కోడలు అనిపించుకోగలరట. ప్రేమ, అనుబంధం.. అత్తగారి పట్ల ఒక తల్లిలా ప్రేమ, ఆప్యాయత చూపించాలి. అలా చేయడం వల్ల, ఆమె కోడలిని  మనస్ఫూర్తిగా ఆదరిస్తుంది,  తెలియకుండానే కోడలి పట్ల  ఆమెకు  చాలా ఇష్టం ఏర్పడుతుంది. మనసు విప్పి మాట్లాడటం..  ఏవైనా విషయాల గురించి బాధగా అనిపిస్తే, ఆ సంబంధాన్ని దీర్ఘకాలం పాటు నిలబెట్టుకోవడానికి ఆ క్షణంలోనే మనసు విప్పి మాట్లాడటం  ద్వారా అన్నింటినీ పరిష్కరించుకోవాలి. ఏ సమస్యనైనా మనసులో పెట్టుకోకుండా, సరైన సమయంలో దాన్ని పరిష్కరించుకోవాలి. ఇలా చేస్తే అత్తగారు కూడా కోడలిని బాధపెట్టకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. పైన చెప్పుకున్నవన్నీ పాటించే కోడళ్లు కూడా ఉంటారు. అయినా సరే.. అత్తగారు కోడలిని ఇష్టపడరు. కొందరు అత్తగార్లు.. తమ కోడలిని బాధపెట్టడం, ఏడిపించడం, చులకన చేసి మాట్లాడటం.. ఇవన్నీ తన హక్కుగా భావిస్తూ.. వాటికే అంటిపెట్టుకుని ఉంటారు. ఇలాంటి అత్తగార్ల దగ్గర ఎంత మంచి ప్రవర్తనతో మెలిగినా.. దున్నపోతు మీద వర్షం కురినట్టే అవుతుంది.  కాబట్టి అలాంటి వ్యక్తుల విషయంలో  అత్తగార్లదే తప్పు అవుతుంది కానీ.. కోడళ్లది అసలు తప్పు ఉండదు. మంచి కోడలు అనిపించుకోవడానికి అతిగా బాధలు అనుభవించడం మానితేనే కోడళ్లకు కూడా మంచిది.                                    *రూపశ్రీ.
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు,  ఫ్రూట్ మిల్క్ షేక్ లు తాగడానికే ఇష్టపడతారు. ప్రూట్ జ్యూస్ లు, ఫ్రూట్ షేక్ లు తాగినప్పుడు శరీరానికి చాలా స్వాంతన లభిస్తుంది. అయితే.. కొన్ని రకాల పండ్లతో ప్రూట్ మిల్క్ షేక్ తయారు చేసుకుని తాగడం అస్సలు మంచిది కాదట.  ఏ పండ్లతో మిల్క్ షేక్ లు తయారు చేసుకుని తాగకూడదు?  దీనికి గల కారణాలు ఏంటి? మిల్క్ షేక్ అంటే తెగ ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకోవాలి.. సిట్రస్ ఫ్రూట్స్.. నారింజ, నిమ్మకాయ వంటి సిట్రస్ ప్రూట్స్ ను పాలతో కలిపి మిల్క్ షేక్ లు తయారుచేసుకుని తాగడమే కాదు.. అసలు పాలతో కలిపి తీసుకోకూడదు కూడా. వీటిలోని సిట్రిక్ యాసిడ్ పాలతో చర్య జరపడం వల్ల అది హానికరంగా మారుతుంది.  ఇలా తీసుకున్నప్పుడు ఎసిడిటీ,  కడుపునొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. పైనాపిల్.. పైనాపిల్ లో ఉండే ఎంజైమ్ లు పాలతో చర్య జరపడం వల్ల కడుపు సమస్యలు చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే పైనాపిల్ ను పాలతో తీసుకోకూడదు,  పైనాపిల్ మిల్క్ షేక్ తాగకూడదు. జామకాయ.. జామకాయను పాలతో కలిపి తీసుకోకూడదట.  ఎందుకంటే జామకాయ మిల్క్ షేక్ కడుపునొప్పికి కారణం కావచ్చు, అంతేకాకుండా.. కడుపు బరువుగా, ఉబ్బరంగా మారే అవకాశం ఉంటుంది. సిట్రస్ పండ్లు+ అరటిపండ్లు మిల్క్ షేక్.. సిట్రస్ పండ్ల షేక్ తాగడమే ఆరోగ్యానికి మంచిది కాదు..అలాంటిది కొందరు సిట్రస్ షేక్ ను అరటిపండ్లతో కలిపి తాగుతుంటారు. ఇది అస్సలు మంచిది కాదు.. ఈ కాంబినేషన్ జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. జీర్ణక్రియను దెబ్బతీస్తుంది. బొప్పాయి.. బొప్పాయి పండును మిల్క్ షేక్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఇది చర్మానికి, జీర్ణక్రియకు అస్సలు మంచిది కాదు. నిమ్మజాతి పండ్లు +మామిడి పండ్లు.. నిమ్మజాతి పండ్లు అయిన నారింజ, నిమ్మ,  బత్తాయి మొదలైన పండ్లను మామిడి పండ్లతో కలిపి తినకూడదట. ఈ కాంబినేషన్ శరీర వేడిని పెంచి కడుపు సమస్యలను పెంచుతుంది.                                  *రూపశ్రీ.
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు (Kidney Issues). కిడ్నీల పనితీరు మందగించినప్పుడు మనం తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతో ముఖ్యం. సరైన డైట్ పాటించడం వల్ల కిడ్నీలపై ఒత్తిడి తగ్గడమే కాకుండా, వ్యాధి తీవ్రతను కూడా నియంత్రించవచ్చు. ప్రముఖ వైద్యులు డాక్టర్ బి. అరవింద్ రెడ్డి (Dr. B Aravind Reddy) ఈ వీడియోలో కిడ్నీ రోగులు పాటించాల్సిన ఆహార నియమాల గురించి సవివరంగా వివరించారు. ఈ వీడియోలోని ముఖ్య అంశాలు: తినవలసిన ఆహారం: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండటానికి ఎలాంటి పోషకాహారం తీసుకోవాలి? నియంత్రించాల్సిన పదార్థాలు: ఉప్పు, పొటాషియం మరియు ఫాస్పరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎందుకు తగ్గించాలి? నీటి వినియోగం: కిడ్నీ రోగులు రోజుకు ఎంత పరిమాణంలో నీరు తాగాలి? పిల్లల కోసం ప్రత్యేక జాగ్రత్తలు: చిన్న పిల్లల్లో కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన డైట్ జాగ్రత్తలు. నిత్య జీవిత మార్పులు: ఆహారంతో పాటు జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులేమిటి? మీ కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరియు డయాలసిస్ వంటి పరిస్థితుల నుండి దూరంగా ఉండటానికి డాక్టర్ గారు చెప్పిన ఈ సూచనలను తప్పక పాటించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 [TeluguOne Health] (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా ఉన్న ఆహారం తీసుకోవడానికి ఇష్టపడతారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నేటికాలంలో బాగా కారంగా ఉన్న ఆహారం తినడానికి చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు.  ఎండు మిరపకాయల చట్నీ మొదలుకొని,  ఆహారంలో కారం బాగా ఎక్కువ వేసుకుని తిడం చాలా మందికి ఇష్టంగా ఉంటోంది దాని రుచి వారికి బాగా నచ్చిందని చెబుతూ ఉంటారు. కారం తినడం చాలా గొప్ప అని చెప్పుకుంటూ కూడా ఉంటారు. కానీ నిజానికి కారం ఎక్కువ తినడం గొప్ప అనడానికి బదులుగా.. దాని వల్ల కలిగే నష్టాల గురించి ఆలోచించమంటున్నారు వైద్యులు, ఆహార నిపుణులు. ఎక్కువ కారం తినడం వల్ల కడుపులో సమస్యలు మాత్రమే కాకుండా.. శరీరంలోని ఇతర భాగాల పై కూడా చాలా ప్రబావం చూపిస్తుందని అంటున్నారు. గుండెల్లో మంట, ఎసిడిటీ.. కారం ఎక్కువ తినడం అంటే కేవలం కారం ఎక్కువ తినడం కాదు.. అందులో మసాలాలు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదమే.. మసాలాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తిన్నప్పుడు,  కడుపులో ఆమ్ల స్థాయి పెరుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, త్రేనుపులు , గ్యాస్ రావచ్చు. ఇలాంటి ఆహారాన్ని ఎక్కువ కాలం పాటు తినడం  వల్ల ఎసిడిటీ ఒక దీర్ఘకాలిక సమస్యగా మారి రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణవ్యవస్థ.. అతిగా మసాలా, కారం  ఉండే ఆహారాలు జీర్ణవ్యవస్థకు చికాకు కలిగిస్తాయి. దీనివల్ల పేగుల్లో చికాకు, అజీర్ణం, కడుపు నొప్పి, కొన్నిసార్లు విరేచనాలు కూడా కలగవచ్చు. ఇప్పటికే బలహీనమైన జీర్ణశక్తి ఉన్నవారికి ఇది మరింత హానికరం కావచ్చు. నోరు, గొంతు సమస్యలు.. అతిగా మసాలా ఉండే ఆహారాలు నాలుక, చిగుళ్ళు , గొంతు లోపలి పొరను చికాకు పెడతాయి. దీనివల్ల చికాకు, బొబ్బలు , పుండ్లు, వాపు రావచ్చు. ఈ ఆహారాలను ఎప్పుడూ తీసుకోవడం వల్ల  టేస్ట్ బడ్స్ బలహీనపడతాయి. అల్సర్ల ప్రమాదం.. క్రమం తప్పకుండా మసాలా,  ఘాటైన ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కడుపు లోపలి పొర దెబ్బతిని, గ్యాస్ట్రిక్ అల్సర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీని లక్షణాలలో తీవ్రమైన నొప్పి, వాంతులు, , కొన్నిసార్లు రక్తస్రావం కూడా ఉండవచ్చు, ఇది ఒక తీవ్రమైన పరిస్థితిగా మారే అవకాశం ఉంటుంది. చర్మ సమస్యలు.. మసాలా ఆహారాన్ని ఎక్కువగా తినడం వల్ల శరీర వేడి పెరిగి, ముఖంపై మొటిమలు, మచ్చలు మరియు ఎరుపుదనం ఏర్పడవచ్చు. ఈ సమస్య ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారిలో సర్వసాధారణం. పైల్స్.. మసాలా పదార్థాలు తినడం వల్ల మలవిసర్జన సమయంలో మంట ,  నొప్పి పెరగవచ్చు. దీనివల్ల పాయువులో వాపు వచ్చి, మొలలు మరింత తీవ్రమవుతాయి. ముందు నుంచే మొలలు ఉన్న రోగులు ముఖ్యంగా మసాలా, కారం  పదార్థాలకు దూరంగా ఉండాలి. నిద్ర.. రాత్రిపూట మసాలాలు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి, చికాకు పెరుగుతాయి. దీనివల్ల నిద్ర పట్టడం కష్టమవుతుంది. తరచుగా మెలకువలు రావచ్చు. సరిగ్గా నిద్రపోకపోవడం  మానసిక , శారీరక ఆరోగ్యం రెండింటినీ ప్రభావితం చేస్తుంది. మసాలా ఆహారాలు తినకూడదా? మసాలా ఆహారం మంచిదే, కానీ దాని పరిమాణం పరిమితంగా ఉండాలి. సమతుల్య ఆహారం పాటించడం ద్వారా మాత్రమే  కడుపు, చర్మం ,  మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.                              *రూపశ్రీ.