
డిఫరెంట్ మూవీస్‌తో ప్రేక్షకుల హృదయాల్లో తనదైన గుర్తింపు సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ‘వంద దేవుళ్లు’. తమిళంలో ‘నూరు సామి’గా రిలీజైంది. జూన్ 19న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ప్రశంసలు అందుకుంది.
‘బిచ్చగాడు’(పిచ్చైకారణ్) సినిమా తర్వాత విజయ్ ఆంటోని, డైరెక్టర్ శశి కాంబోలో వచ్చిన సినిమా ఇది. భావోద్వేగ కుటుంబ కథా చిత్రంగా ఇది తెరకెక్కింది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ, ఫాతిమా విజయ్ ఆంటోని ఈ సినిమాను నిర్మించారు. ఆగస్టు 7 నుంచి ఈ చిత్రం Zee5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ కానుంది.
‘వంద దేవుళ్లు’లో విజయ్ ఆంటోని, స్వాసిక, అజయ్ ధిషన్, లిజోమోల్ జోస్, కరుణాస్, కావ్య అనిల్, బాలాజీ శక్తివేల్, అరుల్ దాస్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు.
నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన 'వంద దేవుళ్ళు' చిత్రం వింతతువు, ఆమె ఇద్దరి కొడుకుల చుట్టూ తిరుగుతుంది. మధ్య వయస్సుకి వచ్చిన అమ్మని మళ్లీ పెళ్లి చేయాలని కొడుకు అనుకోవడం, ఆ తల్లి సైతం తోడును వెతుక్కోవాలని ఆలోచించినప్పుడు, ఆమె నిర్ణయం బంధువులు, గ్రామస్తులు, మొత్తం సమాజం నుండి ప్రతిఘటనను ఎదుర్కొంటుంది.
తల్లి, కొడుకుల మధ్య ఉండే అందమైన బంధమే ఈ కథకు ప్రధాన ఆకర్షణ. ఒక తల్లి తన జీవితాంతం చేసే లెక్కలేనన్ని త్యాగాలను హైలైట్ చేస్తుంది ఈ చిత్రం. ఒక కొడుకు తన తల్లి కష్టాలను, త్యాగాలను చూసి, గుర్తించడమే కాకుండా, సామాజిక విమర్శలను ఎదుర్కొని కూడా తన సంతోషాన్ని తనే ఎంచుకునేలా ఆమెను ప్రోత్సహించడం ఈ మూవీలోని కోర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. తల్లీకొడుకుల అద్భుతమైన బంధాన్ని తెరపై అంతే అద్బుతంగా చూపించారు.

Vandha Devullu, OTT Release, Vijay Antony





