LATEST NEWS
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దక్షిణాది ప్రజల సాంస్కృతిక, మత గుర్తింపునకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి.  దేశ రాజధాని హస్తినలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రజల సాంస్కృతిక, మతపరమైన గుర్తింపుల గురించి చేసిన విశ్లేషణ రాజకీయదుమారాన్ని రేపింది. రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో విభజన తెచ్చేలా సీఎం రేవంత్ మాట్లాడారంటూ బీజేపీ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తోంది.   దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజల ఆరాధనా విధానాలు, దేవుళ్ల ప్రాధాన్యతను వివరిస్తూ.. రేవంత్ రెడ్డి ఆ మీడియా సమావేశంలో దక్షిణాది  వారు ద్రావిడులని, ఉత్తరాది వారులు  ఆర్యులని అన్నారు.   దక్షిణాది వారు శివభక్తులు, ఉత్తరాది వారు శ్రీరామ భక్తులుగా అభివర్ణించారు.  అక్కడితో ఆగకుండా  బీజేపీ నాయకులు ఎప్పుడూ  జై శ్రీరామ్ నినాదాలకే పరిమితమవుతారని,  హర హర మహాదేవ్'అని ఎందుకు అనరని నిలదీశారు. శివుడిని పేదల దేవుడిగా, రాముడిని ధనవంతుల దేవుడిగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పెను వివాదానికి హేతువయ్యాయి.   రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై  నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.  ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే హిందువులను ప్రాంతాల వారీగా, దేవుళ్ల పేరుతో విడగొట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శిస్తున్నారు. సోమనాథ్ ఆలయ నిర్మాణం మొదలుకొని అనేక ధార్మిక ప్రాజెక్టులను గతంలో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించిందని, ఇప్పుడు మళ్లీ అదే వైఖరిని ప్రదర్శిస్తోందని గుర్తు చేస్తున్నారు.  అంతేకాకుండా..  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  జై శ్రీరామ్'తో పాటు 'హర హర మహాదేవ్ అని కూడా నినదించే   అంటున్నారు. రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  హిందువుల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని దుయ్యబట్టారు.   [Revanth Reddy Comments, Lord Rama, Lord Shiva controversy, BJP,  Congress, North South India Identity, National politics, Telugu One]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్య సంచలనంగా మిగిలిన వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం మరోసారి రాజకీయ దుమారం  ఈ హత్య కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నాటి ఘటనకు సంబంధించి పలువురు ప్రముఖుల ప్రమేయం,   ఈ కేసులో కొందరికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ రాజకీయ లబ్ది చేకూరిందనే ఆరోపణలు సంచలనంగా మారాయి. . ఘటన జరిగిన నాటి నుంచి దర్యాప్తు సరళి, కేసు దారి మళ్లిన వైనంపై వివిధ రాజకీయ పక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గురైన సమయంలో స్థానిక పరిస్థితులు, తదనంతరం తెరపైకి వచ్చిన అంశాలు పలు అనుమానాలకు తావునిచ్చాయి. ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు. ఈ కేసు విషయంలో ఆమె అలుపెరుగని న్యాయపోరాటం చేశారు. చేస్తున్నారు.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ విచారణలో  హత్య జరిగిన రోజు ఉదయం నుంచి జరిగిన పరిణామాలు, టెలిఫోన్ సంభాషణలు, గూగుల్ టేకౌట్ వివరాలు నేరస్థలంలో లభించిన భౌతిక సాక్ష్యాలు, అనుమానితుల కదలికలతో పకడ్బందీగా ముందుకు సాగింది.   ఈ వ్యవహారంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతి రెడ్డి అలాగే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా ప్రస్తావనకు వస్తున్నాయి. హత్యకు గురైన తర్వాత  సమాచారం బయటకు పొక్కకుండా వారు వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వివేకా కుమార్తె వైఎస్ సునీత తన తండ్రి మృతిపై న్యాయం కోరుతూ సాగిస్తున్న సుదీర్ఘ పోరాటానికి పలు రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభిస్తోంది.    ఇక తాజాగా ఈ కేసులో ఏ2గా ఉన్న యాదటి సునీల్ యాదవ్  సంచలన విషయాలను వెల్లడించారు. వివేకా హత్య ద్వారా లబ్ధి పొందిన వారు మాజీ సీఎం వైఎస్ జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి అని కుండబద్దలు కొట్టారు. వైఎస్ వివేకా హత్యకు గురి కాకుండా ఉంటే ఆయన నిస్సందేహంగా కడప ఎంపీ అయి ఉండేవారన్న సునీల్ యాదవ్.. దీనిని బట్టే ఈ హత్య వల్ల లబ్ధి పొందినది ఎవరన్నది సులభంగా అవగతమౌతుందన్నారు. సోమవారం (సెప్టెంబర్ 28)  ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సునీల్ యాదవ్.. వైఎస్ వివేకా హత్య విషయంలో తెరముందు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ఉన్నా తెర వెనుక ఉన్నది కచ్చితంగా వైఎస్ జగన్, వైఎస్ భారతి అని విస్పష్టంగా చెప్పారు. వివేకాను హత్య చేయాల్సిన అవసరం తనకు ఇసుమంతైనా లేదన్న ఆయన.. వివేకా హత్యకు గురికాకుండా ఉండి ఉంటే.. ఆయన తనను యాదవ కార్పొరేషన్ చైర్మన్ ను చేసేవారని సునీల్ యాదవ్ చెప్పారు.  ఈ సందర్భంగా ఆయన తన ప్రాణానికి ముప్పు ఉందన్న ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్  నుంచి తనకు ముప్పు ఉందనీ, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఇప్పటికే తనపై మూడు సార్లు హత్య ప్రయత్నం జరిగిందని చెప్పిన సునీల్ యాదవ్.. ఈ కేసులో కీలక సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతిని గుర్తు చేస్తూ తనకు రక్షణ కల్పించాలని ఏపీ, తెలంగాణ సీఎంలకు విజ్ణప్తి చేశారు.  [YS Vivekananda Reddy Murder Case, YS Jagan Mohan Reddy, YS Bharathi, YS Avinash Reddy, AP Politics, A2 Sunil Ydaev, Sensational, Reveal, Telugu One]
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు కొలీజియం కీలక నిర్ణయం తీసుకుంది. వేర్వేరు హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్న ముగ్గురు ప్రముఖ సీనియర్ న్యాయమూర్తులను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ సిఫార్సుల ప్రకారం, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సునీతా అగర్వాల్, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, అలాగే తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్‌లను అత్యున్నత న్యాయస్థానానికి పదోన్నతి కల్పించాలని కొలీజియం నిర్ణయించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్న ఖాళీలను భర్తీ చేయడంలో భాగంగా ఈ పేర్లను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో వీరు తమ సుదీర్ఘ కాలపు న్యాయ సేవల ద్వారా విశేష అనుభవాన్ని గడించారు. విధి నిర్వహణలో వారు కనబరిచిన ప్రతిభ, సమర్థతను పరిగణనలోకి తీసుకునే కొలీజియం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. న్యాయ వ్యవస్థలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పదవులకు ఎంపికైన ఈ ముగ్గురు న్యాయమూర్తుల నేపథ్యం ఎంతో ఘనమైనది. వివిధ వివాదాలపై విచారణ జరుపుతూ రాజ్యాంగబద్ధమైన తీర్పులు వెలువరించడంలో వీరు ముందున్నారు. ముఖ్యంగా న్యాయవాద వృత్తి నుంచి మొదలుపెట్టి వివిధ స్థాయిల్లో జ్యుడీషియల్ బాధ్యతలు నిర్వర్తించిన వీరి అనుభవం సర్వోన్నత న్యాయస్థానానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సుప్రీంకోర్టు కొలీజియం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై న్యాయ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. అత్యున్నత న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి, అలాగే బెంచ్ సామర్థ్యాన్ని మరింత పటిష్టం చేయడానికి ఈ కొత్త నియామకాలు ఎంతో దోహదపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తదుపరి ప్రక్రియలో భాగంగా, కొలీజియం సిఫార్సు చేసిన ఈ ముగ్గురు న్యాయమూర్తుల పేర్లను కేంద్ర ప్రభుత్వం పరిశీలించనుంది. కేంద్రం ఆమోద ముద్ర వేసిన అనంతరం రాష్ట్రపతి కార్యాలయం నుంచి వీరికి సంబంధించిన అధికారిక నియామక ఉత్తర్వులు వెలువడనున్నాయి. త్వరలోనే వీరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.     [ Supreme Court Collegium, High Court Chief Justices, Apex Court Judges, Supreme Court News, Judicial Appointments India, Justice Sunita Agarwal, Justice Devendra Kumar, Telugu One, Telugu News ]
సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఓ మానసిక రోగి హల్‌చల్‌ చేయడంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆసుపత్రి వద్ద ఉన్న రేకుల షెడ్‌పైకి ఎక్కిన అతడు.. చేతిలో పదునైన రాళ్లు పట్టుకుని కింద ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. తన దగ్గరకు ఎవరైనా వస్తే రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.షెడ్‌పై నుంచి కిందకు చూస్తూ రాళ్లు చేతిలో పట్టుకుని హల్‌ చల్‌ చేయడంతో ఆసుపత్రి కి వచ్చిన రోగులు, వారి సహాయకులు, సెక్యూరిటీ సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అతడు ఎప్పుడు ఏం చేస్తాడోనన్న భయంతో సిబ్బంది అప్రమ త్తంగా వ్యవహరించారు. దాదాపు అరగంట పాటు షెడ్‌పైనే ఉంటూ కింద ఉన్నవారిపైకి రాళ్లు విసిరేస్తానంటూ బెదిరించ డంతో అక్కడ టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఈ ఘటనతో గాంధీ ఆసుపత్రి వద్ద కొంతసేపు రాకపోకలు, సాధారణ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడినట్లు సమాచారం. అతడిని కిందకు దింపేందుకు సెక్యూరిటీ సిబ్బంది ప్రయత్నించినప్పటికీ.. రాళ్లు విసిరేస్తానంటూ హెచ్చరించడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పరిస్థితి మరింత తీవ్రం కాకుండా సిబ్బంది దూరంగా ఉండి అతడిని గమనిస్తూ ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మానసిక రోగిని కిందకు దింపేందుకు పోలీసులు కూడా జాగ్రత్తగా వ్యవహరిం చారు. కొద్దిసేపటి పాటు కొనసాగిన ఈ హైడ్రామా అనంతరం ఎట్టకేలకు అతడిని పోలీసులకు అదుపులోకి తీసుకు న్నారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది, రోగులు, వారి బంధువులు ఊపిరి పీల్చు కున్నారు.దాదాపు గంటపాటు కొనసాగిన ఈ ఘటన గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో కలకలం రేపింది. రాళ్లతో హల్‌చల్‌ చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం తో పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చింది.       [ Gandhi Hospital, Secunderabad, Mental Health Patient, Hospital Incident, Stone Attack, Hospital Tension, Police Intervention, High Drama, Hospital Security, Telangana News, Hyderabad News, Patient Commotion, Gandhi Hospital Incident, Police Action, Security Alert ]  
దేశ రాజకీయాల్లో ప్రాంతీయ అసమానతలు, ఉత్తరాది ప్రాబల్యంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి తన గళాన్ని గట్టిగా వినిపించారు. ఇటీవల ఈశాన్య రాష్ట్రమైన అసోంలో జరిగిన ప్రముఖ పత్రికల జాతీయ సదస్సులో ఆయన పాల్గొని, దేశంలో నెలకొన్న కేంద్ర-రాష్ట్రాల సంబంధాలు, ఆర్థిక వివక్షపై నిర్భయంగా తన అభిప్రాయాలను వెల్లడించారు.ఈ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఉత్తరాది ఆధిపత్య ధోరణులు పెరుగుతున్నాయని పరోక్షంగా విమర్శించారు. దేశ రాజధానిలో కీలక పదవులన్నీ ఒకే ప్రాంతం వారి చేతుల్లో కేంద్రీకృతం కావడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రా నుంచి భారీగా పన్నులు వసూలు చేసుకుంటూ, కేవలం దిల్లీకి నమస్కరించే స్థాయిలోనే ప్రాంతాలు ఉండకూడదన్న ఆయన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. దేశాభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కూడా సీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాలకే పరిమితమైన అభివృద్ధితో దేశం మొత్తాన్ని సమగ్రంగా ముందుకు తీసుకెళ్లలేమని ఆయన స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థికంగా బలపడి దేశానికి వెన్నెముకగా నిలుస్తున్నప్పటికీ, వాటి హక్కులను మరియు వనరులను సరిగ్గా గౌరవించాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని ఆయన గుర్తుచేశారు. చిన్న గ్రామాలు, ఆదివాసీ గూడేల్లోనూ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికీ విద్య అందించేందుకు ప్రయత్నించారని అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 27 వేల పాఠశాలలు, 1.25 లక్షల మంది ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. ఆ తర్వాత ఆరోగ్య రంగంపైనా దృష్టి సారించారని, స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలో సగటు ఆయుర్దాయం 33 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం 73 ఏళ్లకు చేరిందని చెప్పారు. తెలంగాణలో విద్యాశాఖను తాను ఎంచుకున్నానని చెప్పారు. రెవెన్యూ, ఆర్థిక శాఖలపై చర్చ జరిగినా వాటిని తీసుకోకుండా విద్యాశాఖను తీసుకున్నానని తెలిపారు. భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చిన తర్వాత తెలంగాణలో 25 లక్షల ఎకరాలను దళితులు, ఆదివాసీలు, వెనుకబడిన, పేద కుటుంబాలకు పంచారని, ప్రస్తుతం పంచేందుకు రాష్ట్రంలో భూములు లేవని అన్నారు.గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్న సమయంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ గుజరాత్ అభివృద్ధికి సహకరించారని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణకు అంత స్థాయిలో కేంద్రం నుంచి సహకారం లభించడం లేదని అన్నారు. తెలంగాణకు మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్, జాతీయ రహదారుల విస్తరణ వంటి అంశాల్లో కేంద్రం నుంచి సహకారం అందడం లేదని ఆరోపించారు. 360 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్డుకు టెండర్లు పిలిచి రెండేళ్లు అవుతున్నా ఫైల్ ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉందని చెప్పారు.కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని అడిగినప్పుడల్లా ఫైల్ ప్రధానమంత్రి వద్ద ఉందని చెబుతున్నారని పేర్కొన్నారు.సత్య నాదెళ్ల, శంతను నారాయణ్, అజయ్ బంగా తదితరులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్నారని ప్రస్తావించారు. తెలంగాణలో ఐఎస్‌బీ, ఐఐటీ, నల్సార్ వంటి విద్యాసంస్థలు ఉన్నాయని, నిపుణులు ఉన్న చోటే కంపెనీలు వస్తాయని అన్నారు. ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాల్లోని అవకాశాలను ప్రోత్సహించాలని అన్నారు. గుజరాత్‌కు పోర్టు వంటి అవకాశాలు ఉంటే, తెలంగాణకు విమానాశ్రయం, నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉన్నాయని చెప్పారు.అంబేడ్కర్, మన్మోహన్‌సింగ్, అబ్దుల్ కలాం వంటి వారు చదువుకోవడం వల్లే గొప్ప స్థాయికి ఎదిగారని చెప్పారు. యువతకు నాణ్యమైన విద్య, నైపుణ్యాలు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ విద్యా విధానంలోని లోపాలను గుర్తించామని సీఎం తెలిపారు.  2006లో జ‌డ్పీటీసీ స‌భ్యునిగా,  2007లో ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్‌గా గెలిచా. ఆ రెండు సార్లు నేను  కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించా.. అక్క‌డ రెండు పార్టీలే ఉన్నాయి.. కాంగ్రెస్, తెలుగుదేశం. నాకు జిల్లాలో కాంగ్రెస్  నాయకులతో పెద్ద‌గా సంబంధాలు పెద్దగా లేవు.. ప్ర‌భుత్వంపై పోరాడాలంటే ప్ర‌తిప‌క్ష‌మే మేల‌ని భావించా.. అందుకే నేను తెలుగుదేశంలో చేరా..  ఆ పార్టీ నుంచి 2009, 2014లో ఎమ్మెల్యేగా గెలిచా. 2017లో కాంగ్రెస్‌లో చేరాను.  2019లో ఎంపీగా గెలిచాని రేవంత్ తెలిపారు.తెలంగాణ అసెంబ్లీకి వెళ్లిన దాని కంటే తాను ఎక్కువగా జైలుకే వెళ్లానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ తనను అనేకసార్లు జైలుకు పంపారని పేర్కొన్నారు దేశ సగటున 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉంటే, తెలంగాణలో 17 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. అయినప్పటికీ ప్రతి ఏడాది ప్రభుత్వ పాఠశాలల నుంచి 50 నుంచి 60 వేల మంది విద్యార్థులు ప్రైవేట్‌ వైపు వెళ్తున్నారని తెలిపారు. ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు.కమిషన్ సభ్యులు గ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారని, ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను ఎందుకు పంపడం లేదని అడిగితే.. ఇంగ్లీష్ మీడియం కావాలని తల్లిదండ్రులు కోరారని తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ నుంచే ఇంగ్లీష్ మీడియం ఉండగా.. ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి తరగతి నుంచే విద్య ప్రారంభమవుతోందని చెప్పారు. పదో తరగతి తర్వాత విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద ఏటా రూ.2,500 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. అయితే కొన్ని ప్రైవేట్ కాలేజీల్లో నాణ్యత లోపిస్తోందని, తగిన సంఖ్యలో లెక్చరర్లు, ప్రొఫెసర్లు ఉండటం లేదని పేర్కొన్నారు.కేంద్రంలో కీలకమైన పదవులు, విధాన నిర్ణయాల్లో అన్ని ప్రాంతాలకు సరైన ప్రాతినిధ్యం దక్కాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ సమగ్రతను కాపాడుకోవాలంటే సమాఖ్య స్ఫూర్తిని అక్షరాలా పాటించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. లేనిపక్షంలో ప్రాంతీయ అసంతృష్యాలు పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య  సామాజిక న్యాయ సూత్రాలను ఈ వేదికగా ఆయన మరోసారి సమర్థించారు. దేశంలో ప్రతి పౌరుడికి సమాన అవకాశాలు, సమాన హక్కులు దక్కాలని, ఏ ఒక్క రాష్ట్రమూ వివక్షకు గురికాకూడదన్నదే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.ఈ సదస్సులో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. పలు ప్రాంతీయ పార్టీల నేతలు, విశ్లేషకులు ఈ అంశంపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర-రాష్ట్రాల ఆర్థిక సంబంధాలు  సమాఖ్య విధానాలపై ఈ చర్చ మరింత జోరందుకునే అవకాశం కనిపిస్తోంది.       [ CM Revanth Reddy, Assam News Paper Conclave, Northern Dominance, Telangana Model, Regional Disparities India, Indian Politics 2026,Telugu One, Telugu News ]   
ALSO ON TELUGUONE N E W S
రొటీన్ సినిమాలు చూస్తే ఏం లాభం..చూస్తే ఇలాంటి సినిమా చూడాలి. చూసాక మీరు పొందే అనుభూతిని మీకే వదిలేస్తున్నాం. అంతలా మెస్మరైజ్ చేయడంలో ఏ మాత్రం నిరుత్సాహపరచదు. మరి ఆ మూవీ ఏంటో చూద్దాం. ఉడల్.. డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో పడి తమ కుటుంబాన్ని కొందరు మహిళలు ఎలా నాశనం చేసుకుంటున్నారు అనే పాయింట్ తో తెరకెక్కింది. గత మూడేళ్లుగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సంచలనం సృష్టిస్తూ, ప్రేక్షకుల గుండెల్లో గుబులు రేపుతున్న మలయాళ సైకో డార్క్ థ్రిల్లర్. 2022 మే 20న విడుదలై బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయ్యింది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాలలో టాప్ ట్రెండింగ్‌లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకే ఇంట్లో, కేవలం 2 గంటల వ్యవధిలో సాగే ఈ అరాచక కథనం ప్రేక్షకులకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా సమయం ఇవ్వకుండా రొమాన్స్, మోసం, క్రూరమైన హత్యలు, రక్తం చిందించే రివేంజ్ డ్రామాతో భయపెడుతుంది.  ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్: రామాయణ పార్ట్ 1 ప్రీ పోన్!      కథ విషయానికి వస్తే షైనీ (దుర్గా కృష్ణ), రెజీ (జూడ్ ఆంటోని జోసెఫ్) దంపతులు. వీరికి ఐదేళ్ల కొడుకు ఉంటాడు. రెజీ తన భార్య, పిల్లాడిని తన తల్లిదండ్రులతోపాటే వదిలేసి ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తాడు. అలాగే ఆమె అత్త మంచానికే పరిమితమై ఉంటుంది. దీంతో ఆమెకు సేవలు చేయడానికి రెజీ విసుక్కుంటుంది. మరోవైపు మామకు కన్ను సరిగ్గా కనిపించదు. అదే సమయంలో తన పాత కాలేజీ స్నేహితుడు (ధ్యాన్ శ్రీనివాసన్ ) తిరిగి పరిచయం కావడం.. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీస్తుంది. ఒక రోజు తన అత్తను ప్రియుడితో కలిసి చంపేస్తుంది. కానీ కోడలు చేసిన ఈ హత్యను తన మామ చూస్తాడు. తన భార్యను చంపిన తన కోడలిని, ఆమె ప్రియుడిని ఎలాగైనా అంతం చేయాలనుకుంటాడు. ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. సస్పెన్స్, థ్రిల్లర్ మధ్య ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుంది.  డబ్బు, వివాహేతర సంబంధాల మోజులో అమ్మాయిలు ఎలా పడతారో క్లియర్ గా చూపించారు. డోంట్ మిస్.    [Udal Malayalam Dark Thriller Ott Sensation, Udal Malayalam movie, Best suspense movies OTT,Amazon Prime Malayalam thrillers, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయ్యాయి. 2001 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. ఈ చిత్రంలో ‘సత్య’ అనే పాత్రలో నటించిన రాజీవ్ కనకాల.. పాతికేళ్ల తర్వాత ఆ సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన సినీ కెరీర్‌లో ‘స్టూడెంట్ నంబర్ 1’కు ప్రత్యేకమైన స్థానం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘స్టూడెంట్ నంబర్ 1’ తన జీవితంలో, సినీ ప్రయాణంలో మరచిపోలేని అధ్యాయమని రాజీవ్ కనకాల తెలిపారు. ఈ సినిమాలో పోషించిన ‘సత్య’ పాత్ర తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిందని.. ఇప్పటికీ ప్రేక్షకులు తనను ఆ పాత్ర పేరుతో గుర్తుపట్టడం ఆనందంగా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా విజయవంతమైన తర్వాతే నటనను పూర్తిస్థాయి వృత్తిగా ఎంచుకుని సినిమాల్లో కొనసాగానని ఆయన గుర్తుచేసుకున్నారు. తొలినాళ్లలో సినిమాపై కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ.. చివరకు 42 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై విజయాన్ని అందుకుందని తెలిపారు. ఈ సందర్భంగా తనకు అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి, హీరో ఎన్టీఆర్‌తో పాటు చిత్రబృందానికి రాజీవ్ కనకాల కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమా తనకు అందించిన విలువైన బహుమతి స్నేహమని ఆయన పేర్కొన్నారు. షూటింగ్ సమయంలో ఎన్టీఆర్‌తో ఏర్పడిన స్నేహం ఆ తర్వాత కూడా కొనసాగిందని, జీవితాంతం గుర్తుండిపోయే అనుబంధం తనకు లభించిందని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు. ఇక ‘స్టూడెంట్ నంబర్ 1’ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనూ, రాజమౌళి దర్శకుడిగా ప్రయాణంలోనూ కీలకమైన ప్రారంభ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాతోనే రాజమౌళి దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘సింహాద్రి’, ‘ఛత్రపతి’, ‘మగధీర’, ‘ఈగ’, ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ వంటి చిత్రాలతో ఆయన తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్ల క్రితం వచ్చిన ‘స్టూడెంట్ నంబర్ 1’ను గుర్తుచేసుకుంటూ రాజీవ్ కనకాల చేసిన పోస్ట్ ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.       [Student No 1 25 Years, Rajeev Kanakala, Jr NTR Student No 1, SS Rajamouli Student No 1, Rajeev Kanakala Emotional Post, Student No 1 Anniversary, Rajeev Kanakala NTR Friendship]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ చేస్తుండగా.. ఆ తర్వాత తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించారు. ‘AA23’ వర్కింగ్ టైటిల్‌తో పిలుస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాలో అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారనే ప్రచారం మొదలైంది. ఇప్పటివరకు బన్నీ ఫుల్ లెంగ్త్ సీరియస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించలేదు. ‘రేసుగుర్రం’లో మాత్రం కొంతసేపు పోలీస్ గెటప్‌లో కనిపించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు లోకేష్ సినిమాలో బన్నీని పవర్‌ఫుల్ కాప్‌గా చూపించబోతున్నారనే టాక్ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. లోకేష్ కనగరాజ్ సినిమాలంటే సాధారణంగా డ్రగ్స్, గ్యాంగ్‌స్టర్స్, మాఫియా, యాక్షన్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. అయితే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయాలనే తన ఆసక్తిని లోకేష్ గతంలో వ్యక్తంపరిచారు. దీంతో లోకేష్.. అల్లు అర్జున్ కాంబినేషన్‌లోనే అలాంటి పోలీస్ స్టోరీ చేయబోతున్నాడా? అనే చర్చ మొదలైంది. ఇది కూడా చదవండి: ఏమో ఏమో ఇది.. సరికొత్త లవ్ ఆంథమ్‌ వచ్చేసింది.!       [Allu Arjun Cop Role, Allu Arjun Police Role, Allu Arjun Role In AA23, AA23 Movie, Allu Arjun, Lokesh Kanagaraj, Anirudh Ravichander, Raaka Movie, Telugu Film News, Telugu News]  
భారతీయ  సినీ ప్రేమికులతో పాటు, రామభక్తులందరు కళ్లల్లో వత్తులు వేసుకొని మరి రామాయణ కోసం చూస్తున్నారు. ప్రచారచిత్రాలతో రామాయణ ఎలా ఉండబోతోందనే ఆలోచన కూడా వాళ్ళ మస్తిష్కాల్లో ఉంది. ఈ విజువల్ వండర్ గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. నవంబర్ 8న దీపావళి కానుకగా రామాయణ విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఓవర్ సీస్ మాత్రం 6 న విడుదల కానుంది. కానీ ఇప్పుడు  ఓవర్సీస్ అండ్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు భారీ స్థాయిలో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేసేందుకు వీలుగా, మేకర్స్ నవంబర్ 5నే థియేటర్లలోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారట. అంటే, అనుకున్న సమయం కంటే 3 రోజుల ముందే ఈ పౌరాణిక దృశ్యకావ్యం మన ముందుకు రాబోతుందని బాలీవుడ్ లో న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇది కూడా చదవండి: మేడారం సమ్మక్క,సారలమ్మ దగ్గర నాని: సమర్పించిన మొక్కు వివరాలు ఇవే!   ఇందుకు కారణం కూడా లేకపోలేదు. పండగ రోజు రిలీజ్ చేసే పూజలు, టపాసులు పనిలో ప్రేక్షకులు హడావిడిగా ఉంటారని మేకర్స్ బావిస్తున్నారంట.   [Ramayana Part 1 Preponed Release Date, ,Ramayana Part 1 , Yash Ravana Ramayana, Sai Pallavi Sita, Ramayana November 5 release, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
ఒకప్పుడు తెలుగు సినిమా అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఇండస్ట్రీగా ఉండేది. కానీ ‘బాహుబలి’ తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. టాలీవుడ్ సినిమాలు దేశవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించడంతో పాటు.. మన హీరోలకు ఇతర భాషల్లోనూ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పడింది. ఇప్పుడు బాలీవుడ్‌తో పాటు ఇతర దక్షిణాది పరిశ్రమల నుంచి కూడా తెలుగు హీరోలతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి భవిష్యత్తులో ఇండియన్ సినిమా నంబర్‌-1 స్టార్‌గా ఎవరు ఎదుగుతారనే చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ చర్చలో ప్రభాస్ పేరు ముందుగా వినిపిస్తోంది. ‘బాహుబలి’ రెండు భాగాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్.. ఆ తర్వాత ‘సలార్’, ‘కల్కి 2898 ఏడీ’ వంటి సినిమాలతోనూ తన మార్కెట్‌ను మరింత విస్తరించారు. మరోవైపు ‘పుష్ప 2’తో అల్లు అర్జున్ కూడా దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింద‌ని పేర్కొన్నారు. దీంతో వీరిద్దరి పేర్లు ఈ చర్చలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా స్థాయిలో తమ మార్కెట్‌ను పెంచుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఇద్దరికీ దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో.. భవిష్యత్తు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు మహేశ్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ సినిమా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో రూపొందుతుండటంతో.. సినిమా సాధించే ఫలితాలు మహేశ్ బాబు పాన్ ఇండియా మార్కెట్‌పై ప్రభావం చూపే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. అయితే ఈ సినిమా రూ.3,000 కోట్ల వసూళ్లు సాధిస్తుందన్నది ప్రస్తుతం అంచనా మాత్రమే. అయితే ఒక‌టి రెండు సినిమాల విజయాలతోనే ఇండియాలో నంబర్‌-1 స్టార్ అనే స్థానం దక్కదనే అభిప్రాయం కూడా ఉంది. వరుసగా విజయాలు సాధించడం, బాక్సాఫీస్ వద్ద రికార్డులు నమోదు చేయడం, దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడం వంటి అంశాలు కీలకంగా మారతాయి. అలాగే నటనతో పాటు డ్యాన్స్, యాక్షన్ వంటి విభిన్న అంశాల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకునే సామర్థ్యం అవసరం. అందుకే ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు.. వీరిలో భవిష్యత్తులో ఎవరి స్టార్‌డమ్ ఏ స్థాయికి వెళ్తుందో తెలుసుకోవాలంటే రాబోయే కొన్ని సంవత్సరాల సినిమాల ఫలితాలను చూడాల్సిందే. [Tollywood Number One Star, Indian Cinema Number One Hero, Prabhas, Allu Arjun, Mahesh Babu, Ram Charan, Jr NTR, Tollywood Pan India Stars, Top Telugu Heroes, Indian Cinema Stars]
యంగ్ హీరో రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఏమో ఏమో ఇది’. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. చిత్ర ప్రకటన సమయంలో విడుదల చేసిన ‘ది ఫస్ట్ బ్రీజ్ ఆఫ్ #EmoEmoIdi’ వీడియోకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియోతో సినిమాలోని ఆహ్లాదకరమైన ప్రేమకథా ప్రపంచాన్ని పరిచయం చేసిన మేకర్స్.. ఇప్పుడు మరింత అందమైన అనుభూతిని పంచేందుకు ‘ఏమో ఏమో ఇది’ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. సున్నితమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే సాహిత్యంతో రూపొందిన ఈ పాట ఆద్యంతం ఆహ్లాదకరమైన ప్రేమానుభూతిని పంచుతుంది. రోషన్ మేకా, ప్రీతి ముకుందన్ మధ్య అందమైన కెమిస్ట్రీ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, అద్భుతమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో తెరకెక్కించిన విజువల్స్ పాటకు డ్రీమీ రొమాంటిక్ ఫీల్‌ను అందిస్తున్నాయి. ఈ పాటకు హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించగా.. కార్తీక్, రమ్య బెహరా తమ మధురమైన గాత్రాలతో ఆలపించారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించారు. అందమైన మెలోడీ, హృదయాన్ని హత్తుకునే గానం, కనువిందు చేసే విజువల్స్ కలగలిసి ‘ఎమో ఎమో ఇది’ టైటిల్ సాంగ్‌ను ఈ సీజన్‌లోని సరికొత్త లవ్ ఆంథమ్‌గా నిలిపాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నా ఈ చిత్రం అక్టోబర్ 30, 2026న విడుదల కానుంది. ఇది కూడా చదవండి: మనవరాలికి గ్రాండ్ వెల్‌కమ్.. టాలీవుడ్ విలన్ ఇంట పండగ వాతావరణం.!       [Emo Emo Idi Title Song, Emo Emo Idi Movie, Sailesh Kolanu, Roshan Meka, Hesham Abdul Wahab, Telugu Love Songs, Telugu Songs 2026, Telugu Film News]  
'ది ప్యారడైజ్' ప్రస్తుతం టాక్ కి విరుద్ధంగా 155 కోట్ల క్లబ్ లో చేరింది . ఈ గొప్ప సక్సెస్ ఇచ్చిన సంతోషంలో దేవుళ్లకు ఇచ్చిన మొక్కులు తీర్చుకునేందుకు 'ది ప్యారడైజ్' టీమ్ తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా  తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన మేడారంలోని శ్రీ సమ్మక్క-సారలమ్మ వనదేవతలని  దర్శించుకున్నారు.  మేడారానికి బయలుదేరే మార్గంలో భాగంగా చిత్ర బృందం మొదట ములుగు జిల్లాలోని ప్రసిద్ధ గట్టమ్మ అమ్మవారిని దర్శించుకుంది. గట్టమ్మ ఆలయంలో  నాని, నటుడు సంపూర్ణేష్ బాబు ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ అర్చకులు వారికి సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందజేశారు. నేచురల్ స్టార్ వస్తున్నాడనే వార్త తెలుసుకున్న అభిమానులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘనస్వాగతం పలికారు. ఇది కూడా చదవండి: పిచ్చోడి చేతిలో రాయి: అనుభవం లేని దర్శకుల చేతిలో భారీ ప్రాజెక్టులు దెబ్బతింటున్నాయా!   గట్టమ్మ దర్శనం అనంతరం 'ది ప్యారడైజ్' బృందం నేరుగా వనదేవతల నిలయమైన మేడారం సమ్మక్క-సారలమ్మల ఆలయానికి చేరుకుంది. శ్రీకాంత్ ఓదెల, నానిల కలయికలో సినిమా ప్రారంభమైనప్పుడే మేడారం అమ్మవార్ల ఆశీస్సులు పొంది, చిత్రం ఘనవిజయం సాధిస్తే మొక్కులు చెల్లిస్తామని వేడుకున్నారు. అందులో భాగంగానే తమ మొక్కును తీర్చుకునేందుకు అమ్మవార్ల సన్నిధిలో తమ శరీర బరువుకు సమానమైన నిలువెత్తు 'బంగారాన్ని' (బెల్లం) తులభారంగా సమర్పించారు. మేడారంలో అమ్మవార్లకు బెల్లాన్ని బంగారం అని పిలవడం మరియు శరీరం బరువుతో తులభారం వేసి సమర్పించడం ఎంతో పవిత్రమైన సాంప్రదాయం. ఈ భక్తిపూర్వక మొక్కుతో నాని, శ్రీకాంత్ ఓదెల ఇద్దరూ తమ నిష్టను చాటుకున్నారు. ప్యారడైజ్ లో నాని తల్లి క్యారక్టర్ పేరు సమ్మక్క . అసలు సినిమాపేరే సమ్మక్క అని పెడదామని అనుకున్నారు.   [Hero Nani At The Paradise, The Paradise Team At Medaram, Nani And Srikanth Odela In Sammakka And saralamma, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
టాలీవుడ్ ప్రముఖ నటుడు, విలన్ 'టార్జాన్' లక్ష్మీనారాయణ ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసాయి. ఆయన ఇంట్లోకి మహాలక్ష్మి లాంటి మనవరాలు అడుగుపెట్టింది. ఆ చిన్నారి రాకను ఆయన సెలెబ్రేట్ చేసుకున్న తీరు చూస్తే ఎవరికైనా ముచ్చటేయాల్సిందే. హాస్పిటల్ నుంచి పాపను ఇంటికి తీసుకొచ్చే సమయంలో ఇల్లంతా కలర్‌ఫుల్ బెలూన్లు, పూల డెకరేషన్‌తో నింపేశారు. పూల వాన కురిపిస్తూ, బాణసంచా కాలుస్తూ స్వాగతం పలికారు. ఆ చిన్నారికి దిష్టి తీసి లోపలికి తీసుకెళ్లిన దృశ్యాలు చూస్తుంటే.. "తాత మనసులో మనవరాలికి ఎంతటి ప్రాధాన్యత ఉందో" ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది. ఈ వేడుకకు సంబంధించిన ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది క్షణాల్లో వైరల్ అయిపోయింది. నెటిజన్లు, టాలీవుడ్ అభిమానులు ఈ వీడియో చూసి మైమరిచిపోతున్నారు. లక్ష్మీనారాయణ గారు పాపను ఎంతో ఆప్యాయంగా ఎత్తుకుని మురిసిపోతుంటే.. ఆయన కళ్లల్లో కనిపించిన ఆనందం, ఆ తృప్తి వెలకట్టలేనివి. ఒక నటుడిగా ఎన్నో పాత్రలు వేసినా.. "తాత" అనే ఈ కొత్త పాత్రాయనకు అత్యంత ప్రియమైనదిగా మారిపోయిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అప్పుడు దేవర.. ఇప్పుడు ప్యారడైజ్.. https://www.instagram.com/reel/Dd1porehprw/       [Tarzan Grand Child Welcome Video, Villain Tarzan Laxminarayana, Tarzan Instagram, Tarzan Laxminarayan, Telugu Viral Video, Telugu Film News, Telugu News]  
      సినిమా.. సినిమా.. సినిమా.. ఇది ఇచ్చే ఆనందం ముల్లోకాల్లో కూడా ఎందెందు వెతికినా దొరకదు. అంతలా ప్రేక్షకుల సమస్త బాధలని పోగొట్టి 'నేనుండగా నీకు దిగులేలా'! అనే భరోసా, ధైర్యాన్ని ఇస్తుంది. అంతటి శక్తీ సినిమాకి మాత్రమే సొంతం.  కానీ  చిత్రపరిశ్రమలో నేడు ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. బడ్జెట్లు వందల కోట్లకు చేరాయి. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, భారీ తారగణం, పాన్-ఇండియా స్థాయి ప్రచారం... ఇలా ప్రతీదీ అద్భుతంగానే కనిపిస్తుంది. కానీ, థియేటర్లలో సినిమా విడుదలయ్యాక సగటు ప్రేక్షకుడు పొందే అనుభవం మాత్రం దానికి పూర్తి భిన్నంగా ఉంటోంది. భారీ ఆశలతో, టికెట్ కోసం 300 నుండి రూ. 500 వరకు వెచ్చించి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులకు తరచుగా నిరాశే ఎదురవుతోంది. వందల కోట్ల భారీ బడ్జెట్ సినిమాలను సరైన అనుభవం, సరైన అవగాహన లేని దర్శకుల చేతిలో పెట్టడమే దీనికి ప్రధాన కారణమా అనే ప్రశ్న ఇప్పుడు టాలీవుడ్ మరియు భారతీయ సినీ వర్గాల్లో తీవ్రంగా నడుస్తోంది. ఒకప్పుడు దర్శకుడు చిన్న బడ్జెట్ సినిమాలతో ప్రయాణం ప్రారంభించి, వరుస విజయాలతో తన ప్రతిభను నిరూపించుకున్న తర్వాతే భారీ ప్రాజెక్టుల వైపు వెళ్లేవారు. కానీ నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కేవలం ఒకటి లేదా రెండు సినిమాలు తీసిన అనుభవం ఉన్న దర్శకులకు ఏకంగా 200 కోట్లు లేదా. 300 కోట్ల బడ్జెట్లను ఇచ్చి ప్రాజెక్టులను అప్పగిస్తున్నారు. పెద్ద విజయాన్ని సాధించారనో, లేదా ఒక మంచి ఐడియా చెప్పారనో ఆధారపడి నిర్మాత భారీగా పెట్టుబడి పెడుతున్నారు. అయితే, ఒక చిన్న లేదా మధ్యస్థాయి సినిమాను హ్యాండిల్ చేయడానికి, వందల కోట్ల భారీ గ్రాఫిక్స్, వేలమంది జనం ఉండే లొకేషన్లు, పదుల సంఖ్యలో ఉన్న సాంకేతిక నిపుణులను నడిపించడానికి నడుమ కొండంత వ్యత్యాసం ఉంది. ఇది కూడా చదవండి: విరాట్ కోహ్లీ నా బావ.. షాకింగ్ విషయం చెప్పిన టాలీవుడ్ హీరోయిన్! ఇటీవలి కాలంలో మనం చూసిన కొన్ని భారీ ప్రాజెక్టులలో దాదాపు 60% నుండి 70% బడ్జెట్ కేవలం నటీనటుల పారితోషికాలు, సుదీర్ఘమైన విజువల్ ఎఫెక్ట్స్ (VFX) పనులకే సరిపోతోంది. కథనం మరియు స్క్రీన్‌ప్లేపై పెట్టాల్సిన శ్రద్ధ తగ్గిపోతోంది. దాదాపు 80% గ్రాఫిక్స్ పైనే ఆధారపడే భారీ పీరియాడిక్ లేదా సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో సన్నివేశాల అనుసంధానం దెబ్బతింటోంది. అనుభవం లేని దర్శకులు గ్రాఫిక్స్ షాట్లను ఎలా సరిగ్గా ప్లాన్ చేయాలో తెలియక, చిత్రీకరణ సమయాన్ని దాదాపు 40% పైగా పొడిగిస్తున్నారు. దీనివల్ల ప్రొడక్షన్ ఖర్చులు పెరిగిపోవడమే కాకుండా, సినిమా ఆత్మ వంటి ఎమోషన్ మరియు డ్రామా పూర్తిగా తుడిచిపెట్టుకుపోతున్నాయి. ప్రేక్షకుడు థియేటర్‌కు వచ్చేది కేవలం గ్రాఫిక్స్ చూడటానికి కాదు, ఆ గ్రాఫిక్స్ వెనుక ఉన్న కథలోని భావోద్వేగానికి కనెక్ట్ అవ్వడానికి. కానీ విజన్ లోపించినప్పుడు, కేవలం విజువల్స్ మాత్రమే మిగిలి కథ లోపిస్తుంది. మొదటి వారంలోనే 50% పైగా డ్రాప్ పొందే సినిమాలు నేడు పెరిగిపోయాయి. భారీ బడ్జెట్ పెట్టినంత మాత్రాన లేదా అద్భుతమైన విజువల్స్ చూపించినంత మాత్రాన సినిమా ఆకట్టుకోదు. ప్రణాళికాబద్ధమైన చిత్రీకరణ, నటీనటుల నుండి సరైన నటనను రాబట్టుకోవడం, సెట్స్‌లో క్లిష్టమైన నిర్ణయాలను సెకన్లలో తీసుకోవడం వంటి నైపుణ్యాలు సంవత్సరాల తరబడి అనుభవం ఉన్న దర్శకుడికే లభిస్తాయి. పరిశ్రమ మనుగడకు కొత్త ఆలోచనలు ఎంత ముఖ్యమో, వందల కోట్ల పెట్టుబడులను సురక్షితంగా నిలబెట్టే అనుభవం కూడా అంతే ముఖ్యం. నిర్మాతలు కేవలం గ్లామర్, భారీతనం వెనుక పరిగెత్తకుండా, విజన్‌తో పాటు సినిమాని నడిపించే సత్తా ఉన్న దర్శకులకే బాధ్యతలు అప్పగించినప్పుడే ప్రేక్షకుడికి నిజమైన భారీ సినిమా అనుభవం దక్కుతుంది. దయచేసి 'పిచ్చోడి చేతిలో రాయి'ని చేయకండని సినీ ప్రేమికులు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.        [Big Budget Movies Inexperienced Directors,Big Budget Movie Failures,indian cinema vfx issuesTelugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]   
  మన చుట్టూ ఉండే వాళ్ళకి సంబంధించిన కొంత మంది మనుషుల మధ్య ఉండే బంధాలని మనం పసిగట్టలేం. అసలు కొంచం కూడా అనుమానం రాకుండా మెయిన్ టైన్ చేస్తారు. కానీ ఆ తర్వాత తెలిసాక 'అవునా' అని షాక్ అవ్వడంతో పాటు కనీసం మన ఊహకి కూడా రాలేదు కదా అనుకుంటాం. దాన్నే సినీ భాషలో 'అచ్చులో బొమ్మ' అంటారు. రుహానీ శర్మ. 2018లో విడుదలైన 'చిలసౌ' సినిమాతో కథానాయికగా టాలీవుడ్ అరంగేట్రం చేసిన రుహానీ, తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత 'హిట్', 'డర్టీ హరి', '101 జిల్లాల అందగాడు' వంటి విలక్షణమైన సినిమాల్లో నటించి మెప్పించింది. విక్టరీ వెంకటేష్ నటించిన ప్రతిష్టాత్మక 75వ చిత్రం 'సైంధవ్'లోనూ కనిపించి మెప్పించింది. ఇది కూడా చదవండి: సత్య vs యోగి బాబు: గోల్డెన్ భాగ్యం ఎవరు!   రుహానీ శర్మకి  టీమిండియా స్టార్ క్రికెటర్, రికార్డుల వీరుడు విరాట్ కోహ్లీ బావ అవుతాడు. ఎలా అంటే రుహానికి అనుష్క శర్మ కజిన్ సిస్టర్ అవుతుంది. ఆ వరుస ప్రకారం విరాట్ కోహ్లీ బావ అవుతాడు. చాలా మందికి ఈ సీక్రెట్ తెలియదు.        [Ruhani Sharma Reveals Relation With Virat Kohli, Ruhani Sharma Virat Kohli relation, Anushka Sharma cousin sister, Telugu Cinema, Telugu Cinema News, Tollywood, Tollywood News]
హైదరాబాద్‌లోని యువతను ఇప్పుడు తీవ్రంగా కలవరపెడుతున్న అంశం ఏదైనా ఉందంటే అది అకాల బట్టతలే! ఒకప్పుడు 45 నుండి 50 సంవత్సరాలు దాటిన తర్వాత కనిపించే బట్టతల సమస్య, ఇప్పుడు 20 నుండి 29 ఏళ్ల చిన్న వయస్సులోనే అత్యంత వేగంగా ముసురుకుంటోంది. ఐటీ కారిడార్లు, స్టార్టప్‌లు, కార్పొరేట్ కంపెనీలలో పనిచేస్తున్న యువతీయువకులలో చాలామంది ఈ సమస్యతో నిత్యం మానసిక వేదనను అనుభవిస్తున్నారు. కేవలం 29 ఏళ్లకే తలపై జుట్టు విపరీతంగా పల్చబడిపోవడం, నుదుటి భాగం వెనక్కి వెళ్లడం వంటి లక్షణాలు కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల వెలువడిన ఆరోగ్య అధ్యయన నివేదికల ప్రకారం, తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో నగరంలో ప్రతి 10 మంది పురుషులలో దాదాపు 6 నుండి 7 మంది ఏదో ఒక స్థాయి జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. తెలంగాణా వ్యాప్తంగా జరిపిన ఆరోగ్య సర్వేలలో కేవలం ఒక్క ఏడాదలోనే ఉత్తమ జీర్ణ ఆరోగ్య శాతంలో 4.10 శాతం భారీ క్షీణత నమోదైంది. గతంలో 19.13 శాతంగా ఉన్న ఆరోగ్య సూచిక 15.03 శాతానికి పడిపోవడం, దేశంలోనే అత్యంత ఆందోళనకరమైన మార్పుగా వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. యువతలో బట్టతల వేగంగా రావడానికి ప్రధానంగా జీవనశైలి మార్పులే కారణమని చర్మ మరియు జుట్టు సంరక్షణ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పెరిగిన పని ఒత్తిడి, నైట్ షిఫ్ట్‌లు, వేళకాని వేళల్లో ఆహారం తినడం, నిద్రలేమి, రోజుకు 7 నుండి 8 గంటల నిద్ర కూడా సరిగ్గా లేకపోవడం జుట్టు కుదుళ్లను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన విటమిన్ బి12, ఐరన్, జింక్, ప్రొటీన్ల లోపం ఏర్పడి జుట్టు రాలడం వేగవంతమవుతోంది. హైదరాబాద్‌లో లభించే నీటిలోని కఠినత్వం, కాలుష్యం మరియు ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అనే జన్యుపరమైన అండ్రోజెన్ హార్మోన్ల వ్యత్యాసం కూడా ఈ సమస్యకు మరిన్ని వినాశకరమైన రెక్కలు తొడుగుతోంది. రోజూ సాధారణంగా 50 నుండి 100 వెంట్రుకలు రాలడం సహజమే అయినప్పటికీ, నిత్యం 150కి పైగా వెంట్రుకలు రాలుతుంటే దానిని తీవ్రమైన సంకేతంగా భావించాలి. ఈ భయంతో చాలామంది యువకులు రాత్రికి రాత్రే జుట్టు వస్తుందని చెప్పే ఫేక్ నూనెలు, సైన్స్ ప్రామాణికత లేని లోషన్లు వాడి ముఖాలు వాచిపోవడం, చర్మ వ్యాధులు కొనితెచ్చుకోవడం వంటి మోసాల బారిన పడుతున్నారు. అకాల బట్టతలను నివారించాలంటే ప్రాథమిక స్థాయిలోనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలోనే డాక్టర్లను సంప్రదించి ఫినాస్టరైడ్, మినాక్సిడిల్ లేదా పీఆర్‌పీ (PRP) చికిత్సల ద్వారా 80 శాతానికి పైగా జుట్టును కాపాడుకోవచ్చు. నిత్యం సమతుల్య ఆహారం తీసుకోవడం, యోగా లేదా ధ్యానంతో ఒత్తిడి తగ్గించుకోవడం, కనీసం 7 గంటల ప్రశాంతమైన నిద్రపోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.     [ Hyderabad, Telangana, Hair Loss, Premature Baldness, Hair Fall, Androgenetic Alopecia, Hair Health, Vitamin B12 Deficiency, Iron Deficiency, Hair Care ]  
పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు.! పిల్లల పెంపకం అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, అది ఒక నిరంతర ప్రయాణం. పిల్లలు తల్లిదండ్రులు  చెప్పే మాటల కంటే వాళ్లు  చేసే పనులనే ఎక్కువగా గమనిస్తారు, అనుకరిస్తారు. ఇంట్లో తల్లిదండ్రుల ప్రవర్తనే పిల్లల భవిష్యత్తుకు, వారి వ్యక్తిత్వానికి పునాది అవుతుంది. ఇంట్లో ఆత్మీయత, అనురాగం ఉన్నప్పుడే పిల్లలు శారీరకంగా, మానసికంగా బలంగా ఎదుగుతారు. అందుకే వారి ముందు తల్లిదండ్రులు  ఎలా ప్రవర్తిస్తున్నారనేది చాలా ముఖ్యం. పిల్లల ఎదుట తల్లిదండ్రులు ఎలా ఉండాలి, ఎలాంటి పనులు చేయకూడదో వివరంగా తెలుసుకుంటే.. పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలా ఉండాలి ఆప్యాయత, గౌరవంతో మాట్లాడాలి.. ఇంట్లో తల్లిదండ్రులు ఒకరినొకరు గౌరవించుకుంటూ, ప్రేమగా మాట్లాడుకోవడం చూసినప్పుడు పిల్లల్లో నేర్చుకునే తత్వం, నమ్మకం పెరుగుతాయి. వారు కూడా ఇతరులతో అలాగే మర్యాదగా మాట్లాడటం అలవాటు చేసుకుంటారు. చెప్పేది వినే ఓపిక ఉండాలి.. పిల్లలు స్కూల్ నుండి రాగానే లేదా ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారి మాటలను శ్రద్ధగా వినాలి. తల్లిదండ్రులకు ఎంత పని ఉన్నా, వారి మాటలకు విలువ ఇస్తే తమ సమస్యలను తల్లిదండ్రుల దగ్గర  దాచకుండా పంచుకుంటారు.  జీవనం.. తల్లిదండ్రులు  పిల్లలకు ఎలాంటి మంచి అలవాట్లు ఉండాలని కోరుకుంటారో, మొదట తల్లిదండ్రులు కూడా  వాటిని పాటించి చూపాలి. సమయపాలన, నిజాయితీ, తోటివారికి సహాయం చేయడం వంటి గుణాలను తల్లిదండ్రులను చూసే పిల్లలు నేర్చుకుంటారు. ప్రోత్సాహం అందించాలి.. పిల్లలు ఏ చిన్న మంచి పని చేసినా లేదా ఆటల్లో, చదువులో ప్రయత్నించినా మెచ్చుకోవాలి. ఓడిపోయినప్పుడు నిరాశపడకుండా, మళ్లీ ప్రయత్నించేలా ధైర్యం చెప్పాలి. శాంతంగా, సహనంతో ఉండాలి.. పరిస్థితులు ఎలా ఉన్నా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి. తల్లిదండ్రులు  కోపంగా కాకుండా సహనంతో నిర్ణయాలు తీసుకోవడం చూస్తే, పిల్లలు కూడా ఒత్తిడిని ఎలా తట్టుకోవాలో నేర్చుకుంటారు. పిల్లల ముందు తల్లిదండ్రులు ఇలా ఉండకూడదు.. గొడవలు పడకూడదు.. తల్లిదండ్రులు పిల్లల ఎదుట అరుచుకోవడం, పెద్దగా గొడవపడటం అసలు చేయకూడదు. ఇది వారిని తీవ్ర భయానికి, ఆందోళనకు గురిచేస్తుంది. వారి మనస్సులో అభద్రతా భావం ఏర్పడుతుంది. ఇతరులతో పోల్చకూడదు.. పక్కింటి పిల్లలతోనో లేదా తోబుట్టువులతోనో పోల్చి మాట్లాడకూడదు. నువ్వు దేనికి పనికిరావు అని తక్కువ చేసి మాట్లాడితే వారిలో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. ఎప్పుడూ ఫోన్లకే పరిమితం కాకూడదు.. పిల్లల ముందు తల్లిదండ్రులు గంటల తరబడి మొబైల్ ఫోన్లు వాడటం, టీవీలు చూడటం తగ్గించాలి. తల్లిదండ్రులే  ఫోన్ పట్టుకుని కూర్చుంటే, పిల్లలకు దూరంగా ఉండమని చెప్పే హక్కు తల్లిదండ్రులు  కోల్పోతారు. అబద్ధాలు చెప్పడం లేదా ఇతరులను దూషించడం.. తల్లిదండ్రులు తమకు  తెలియకుండానే పిల్లల ముందు చిన్న చిన్న అబద్ధాలు చెప్పడం లేదా ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం చేయకూడదు. అది చూసి పిల్లలు కూడా అబద్ధాలు చెప్పడం సహజమేనని అనుకుంటారు. అతిగా కోప్పడటం లేదా కొట్టడం.. చిన్న చిన్న పొరపాట్లకు పిల్లలపై విరుచుకుపడటం, కొట్టడం చేయకూడదు. అలా చేస్తే వారిలో మొండితనం పెరుగుతుంది తప్ప మార్పు రాదు. పిల్లలకు తల్లిదండ్రులు  ఇచ్చే అతిపెద్ద బహుమతి డబ్బు,  ఆస్తులు కాదు, ఒక మంచి, సురక్షితమైన వాతావరణం. ప్రేమ, సహనం, ఆప్యాయతలతో కూడిన పెంపకమే వారిని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది.                                                                                                                                                *రూపశ్రీ.
మన భారతీయుల నిత్య జీవితంలో అన్నం లేని ఆహారాన్ని ఊహించుకోవడం కూడా కష్టమే. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి అని తేడా లేకుండా ప్రతిరోజూ ప్లేట్ నిండా తెల్లటి పాలిష్ చేసిన బియ్యాన్ని తినడానికి అలవాటుపడిపోయాం. అయితే, రుచికి ఎంతో బాగుండే ఈ పాలిష్డ్ తెల్ల బియ్యం మన ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో అని తెలిస్తే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ధాన్యం నుంచి లభించే పోషకాలను, పీచు పదార్థాన్ని పాలిషింగ్ ప్రక్రియ ద్వారా పూర్తిగా తొలగించి కేవలం పిండి పదార్థాన్ని మాత్రమే మిగిల్చే తెల్ల బియ్యం కంటే, తృణధాన్యాల వర్గానికి చెందిన  బ్రౌన్ రైస్  (తవుడు తీయని బియ్యం) రోజూ తీసుకోవడం వల్ల అపారమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని పోషకాహార నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకునే వారికి, ముఖ్యంగా ఆధునిక జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్న వారికి బ్రౌన్ రైస్ ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది. తెల్ల బియ్యంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో విటమిన్ బి1, విటమిన్ బి3, విటమిన్ బి6 వంటి అత్యవసర విటమిన్లు, అలాగే మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, ఇనుము మరియు జింక్ వంటి ఖనిజ లవణాలు సమృద్ధిగా లభిస్తాయి. వీటన్నింటికీ మించి బ్రౌన్ రైస్‌లో లభించే అధిక పీచు పదార్థం (ఫైబర్) జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కడుపులో ఉండి నెమ్మదిగా అరుగుతుంది. కాబట్టి కొద్దిగా తిన్నా సరే కడుపు త్వరగా నిండిన భావన కలుగుతుంది. ఫలితంగా అతిగా తినే అలవాటు తగ్గి, బరువు తగ్గాలనుకునే వారికి మరియు ఊబకాయంతో బాధపడేవారికి బ్రౌన్ రైస్ ఒక అద్భుతమైన ఆహార ఎంపికగా మారుతుంది. ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మధుమేహం లేదా టైప్ 2 డయాబెటిస్. తెల్లటి బియ్యం తిన్నప్పుడు అందులోని పిండి పదార్థం వేగంగా రక్తంలో గ్లూకోజ్‌గా మారి షుగర్ లెవెల్స్‌ను ఒక్కసారిగా పెంచేస్తుంది. కానీ బ్రౌన్ రైస్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ (GI) చాలా తక్కువగా ఉంటుంది. దీనిని ఆహారంగా తీసుకున్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు ఒకేసారి పెరగకుండా చాలా నెమ్మదిగా విడుదలవుతాయి. అందువల్ల డయాబెటిస్ బాధితులు బ్రౌన్ రైస్‌ను తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా రక్తంలో షుగర్ స్థాయిలను చాలా సులభంగా అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారికి మరియు గుండె ఆరోగ్యాన్ని పటిష్టం చేసుకోవాలనుకునే వారికి బ్రౌన్ రైస్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో లభించే పీచు పదార్థం, మాంగనీస్ మరియు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో దోహదపడతాయి. ఇది రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా కాపాడి, రక్తపోటును (బిపి) అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, పక్షవాతం వంటి తీవ్రమైన ముప్పుల నుంచి రక్షణ లభిస్తుంది. శరీరానికి అవసరమైన తక్షణ శక్తిని అందిస్తూ, మెదడు నాడీ వ్యవస్థను వేగవంతం చేయడంలో బ్రౌన్ రైస్ సహాయపడుతుంది. ప్రతిరోజూ ఒక పూట తెల్ల బియ్యానికి బదులుగా బ్రౌన్ రైస్‌ను అలవాటు చేసుకోవడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని సొంతం చేసుకోవచ్చు.     [ Brown Rice, White Rice, Whole Grains, Dietary Fiber, Diabetes, Blood Sugar, Low Glycemic Index, Weight Management, Heart Health, Cholesterol ]
 గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి డాక్టర్లు చెప్పిన సలహాలు..! గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక్క రోజులో జరిగే  పని కాదు. నేటి ఆధునిక జీవనశైలి, సరైన పోషకాహారం లేకపోవడం, శారీరక శ్రమ తగ్గడం వంటి అనేక కారణాల వల్ల చిన్న వయసులోనే గుండె సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి. నివేదికల ప్రకారం మన దేశంలో సంభవిస్తున్న మరణాలలో ఎక్కువ భాగం గుండె జబ్బుల వల్లే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం సమస్య వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకోవడం కంటే, ముందే మన లైఫ్ స్టైల్ లో  కొన్ని చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చని ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే.. చురుగ్గా ఉండటం.. బాగా  వర్కవుట్లు చేయలేకపోయినా, రోజూ కొంత సమయం నడవడాన్ని అలవాటు చేసుకోవాలి. రోజంతా ఒకే చోట కూర్చుని పనిచేసే వారు మధ్యమధ్యలో లేచి కాసేపు అటుఇటు తిరగడం వల్ల శరీరంలో రక్తం సరఫరా మెరుగ్గా ఉంటుంది. ఆహారం..  బరువు తగ్గడం కోసమే కాకుండా, శరీర జీవక్రియలను క్రమబద్ధీకరించే పౌష్టికాహారాన్ని ఎంచుకోవాలి. మనం ప్రతిరోజూ తీసుకునే ఆహారం ఎంత పరిమాణంలో ఉందో, అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయో గమనించడం చాలా అవసరం. దీర్ఘకాలంలో గుండెకు మేలు చేసే బాలెన్స్డ్  ఆహారాన్ని అలవాటు చేసుకోవడం మంచిది. కండరాలను బలంగా ఉంచే వ్యాయామాలు..  వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కండరాల సాంద్రత తగ్గుతుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ లేదా కండరాలను దృఢపరిచే వ్యాయామాలు చేయడం ద్వారా రక్తపోటు అదుపులో ఉంటుందని, ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తుందని వైద్యులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం.. ఇప్పటి వేగవంతమైన జీవితంలో ఒత్తిడి చాలా సాధారణమైపోయింది. ఒత్తిడి గుండెపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందుకే మనస్సును, నాడీ వ్యవస్థను ప్రశాంతంగా ఉంచడానికి సంగీతం వినడం, ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం వంటివి చేయాలి. రోజులో కొంత సమయాన్ని మనస్సును తేలికపరిచే కార్యకలాపాల కోసం కేటాయించడం చాలా ఉపయోగకరం. గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఏవేవో  ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. మన రోజువారీ అలవాట్లలో నడకను భాగం చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ఒత్తిడిని దూరం చేసుకోవడం వంటి చిన్న చిన్న మార్పుల ద్వారానే ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.                                  *రూపశ్రీ.  
అన్నానికి ప్రత్యామ్నాయంగా ఈమధ్య చాలామంది చూపు క్వినోవా వైపు మళ్లుతోంది. బరువు తగ్గాలనుకునే వారు, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలనుకునే వారు ప్రతిరోజూ తినే తెల్ల అన్నాన్ని పక్కన పెట్టి క్వినోవాను ఎంచుకుంటున్నారు. ఇది చూడటానికి చిన్న చిన్న గింజల్లా అనిపించినా, దీనివల్ల శరీరానికి అందే పోషకాలు మాత్రం చాలా ఎక్కువ. మన చిరు ధాన్యాల మాదిరిగానే క్వినోవా కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ అన్నం స్థానంలో క్వినోవాను ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి  మార్పులు వస్తాయో తెలుసుకుంటే.. ఎక్కువ పోషకాలు.. అన్నంలో పిండి పదార్థాలు ఎక్కువ. దీనివల్ల అన్నం తిన్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు త్వరగా పెరుగుతాయి. కానీ క్వినోవాలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెరను నెమ్మదిగా విడుదల చేస్తాయి. దీనివల్ల డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా మంచి ప్రత్యామ్నాయం. అలాగే, ఇది తిన్న తర్వాత చాలా సేపటి వరకు కడుపు నిండిన భావన ఉంటుంది. పదే పదే ఆకలి వేయకపోవడం వల్ల ఆటోమేటిక్‌గా ఆహారం తక్కువగా తింటారు. ఫలితంగా శరీరంలో అనవసరమైన కొవ్వు కరిగి బరువు తగ్గడం చాలా తేలికవుతుంది. తొమ్మిది రకాల అమైనో ఆమ్లాలు.. శాకాహారులకు క్వినోవా ఒక గొప్ప వరమని చెప్పవచ్చు. సాధారణంగా మొక్కల సంబంధిత ఆహారాల్లో అన్ని రకాల అమైనో ఆసిడ్లు లభించడం కష్టం. కానీ క్వినోవాలో శరీరానికి అవసరమైన తొమ్మిది రకాల అవసరమైన అమైనో ఆసిడ్లు ఉన్నాయి. దీనివల్ల శరీరానికి కావలసిన సంపూర్ణ ప్రొటీన్ అందుతుంది. ఇది కండరాల నిర్మాణానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండటం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండటానికి అవసరమైన శక్తి లభిస్తుంది. మలబద్దకానికి చెక్.. ఈ రోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం , జీర్ణక్రియ లోపాలు. క్వినోవాలో ఉన్న అధిక పీచు పదార్థం జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వ్యర్థాలు తేలికగా బయటకు వెళ్లేలా చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి.  గుండె ఆరోగ్యం కూడా.. క్వినోవా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్వినోవాలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. గ్లూటెన్ ఫ్రీ.. గ్లూటెన్ అలర్జీ ఉన్నవారికి క్వినోవా ఒక అద్భుతమైన ఆహారం. ఇందులో గ్లూటెన్ ఉండదు. కాబట్టి గోధుమలు, ఇతర ధాన్యాలు పడనివారు కూడా దీనిని నిరభ్యంతరంగా తినవచ్చు. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి  ముఖ్యమైన ఖనిజాలు కూడా ఉన్నాయి. ఐరన్ శరీరంలో రక్తం కొరత రాకుండా చూస్తే, మెగ్నీషియం నరాలు , కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. వండుకోవడం కూడా తేలిక.. క్వినోవాను వండుకోవడం కూడా చాలా తేలిక. బియ్యాన్ని ఏ విధంగా వండుకుంటామో, అదే విధంగా రెండుసార్లు నీటితో శుభ్రంగా కడిగి ఉడికించుకోవచ్చు. దీనిని ఉడికించిన తర్వాత కూరలతో కలిపి తినవచ్చు లేదా రకరకాల కూరగాయలు చేర్చి ఉప్మా, పులావ్, సలాడ్స్ రూపంలో కూడా తయారుచేసుకోవచ్చు.  రోజువారీ ఆహారంలో తెల్ల అన్నం స్థానంలో క్వినోవాను చేర్చుకోవడం ద్వారా మెరుగైన ఆరోగ్యాన్ని, చక్కటి ఫిట్‌నెస్‌ను  సొంతం చేసుకోవచ్చు.                     *రూపశ్రీ.
మన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి, ఆందోళన, సమస్యలకు బయట పరిస్థితులే కారణమా? లేక మనలోని ఆలోచనలు, భావాలు, నిర్ణయాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయా? ఈ వీడియోలో Inner Engineering అంటే ఏమిటి? మనలోని ఆలోచనా విధానం మారితే మన ప్రవర్తన, నిర్ణయాలు, జీవన విధానంలో ఎలాంటి మార్పులు వస్తాయి? అనే విషయాలను డాక్టర్ శారదా దేవి, Professor of Human Development and Family Studies వివరిస్తున్నారు. మనల్ని మనం అర్థం చేసుకోవడం, Self-Awareness పెంచుకోవడం, మన ఆలోచనలు మరియు ప్రవర్తనను గమనించడం ద్వారా జీవితంలో సానుకూల మార్పులు ఎలా తీసుకురావచ్చో ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. Stress Relief, Mental Well-being, Self-Awareness, Motivation వంటి అంశాలపై ఉపయోగకరమైన విషయాలను తెలుసుకోవడానికి ఈ పూర్తి వీడియోను చూడండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)