LATEST NEWS
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఏపీ రాజకీయాల్లో మళ్లీ  చర్చనీయాంశంగా మారారు. ఇటీవల రాజకీయాలకు కొంత దూరంగా ఉంటున్నట్లు సంకేతాలు ఇచ్చినప్పటికీ..  ఆయన అడుగులు మాత్రం రాజకీయంగా ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నయని అనిపిం చకతప్పదు.  దీనిపై ప్రముఖ విశ్లేషకుడు  భరద్వాజ తెలుగువన్ న్యూస్ చానల్ లో ప్రత్యేకంగా మాట్లాడుతూ..  హైదరాబాద్‌ ఫిలింనగర్ కేంద్రంగా కార్యాలయం ఏర్పాటు చేయడం, నూతన మీడియా సంస్థ స్థాపనకు యత్నాలు జరపడం ఆయన వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారన్న సంకేతాలేనన్నారు.  తాజాగా  భారత్ జన వికాస్  పేరిట ఆయన ఒక కొత్త జాతీయ పార్టీ ఆలోచన వెనుక వేరే వ్యూహం ఉందన్నారు. వైసీపీ అధినేత జగన్ పై ఒత్తిడి పెంచి, లేదా బ్లాక్ మెయిల్ చేసి పార్టీలో లేదా ఢిల్లీ నెట్‌వర్క్ బాధ్యతల్లో తిరిగి పట్టు సాధించేందుకు చేస్తున్న ప్రయత్నమా అన్న అనుమానాన్ని భరద్వాజ వ్యక్తం చేశారు.  ఢిల్లీ స్థాయిలో వైసీపీకి లైజనింగ్ బాధ్యతలు చూసే సరైన నేత అవసరం ఉన్నందున, జగన్ పిలుపు కోసం ఈ  సంకేతాలు పంపుతున్నారని విశ్లేషించారు.   కొత్త పార్టీ స్థాపన కాకుండా బిజెపి లేదా జనసేన వైపు విజయసాయి రెడ్డి అడుగులు వేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయన్న భరద్వాజ.. జనసేనాని పవన్ కళ్యాణ్‌తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా ఆ పార్టీలోకి వెళ్తారా లేక స్వతంత్రంగానే ఒక జాతీయ పార్టీకి నాయకత్వం వహిస్తారా అనేది చూడాల్సి ఉందన్నారు. మీడియా ఛానెల్ ఏర్పాటు ప్రక్రియ ద్వారా విజయసాయి, తనకంటూ ఒక వేదికను  సిద్ధం చేసుకుంటున్నారన్నది వాస్తవమన్నారు.    Vijayasai Reddy New Party, Bharat Jana Vikas, YSRCP AP Politics, Vijayasai Reddy News Channel, AP Politics, TeluguOne
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇటీవలవైసీపీ  చేపడుతున్న యువజన, విద్యార్థి ఆందోళనలు   చర్చనీయాంశంగా మారాయి. డీఎఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటా వివాదాలపై  వైసీపీ జెన్ జడ్ తరాన్ని అస్త్రంగా చేసుకుని సరికొత్త పోరాటానికి తెరలేపింది. ఈ క్రమంలో  జగన్   రాజకీయ వ్యూహం కూటమి ప్రభుత్వానికి అర్థమవుతోందా అనే అంశంపై ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఆంధ్రప్రదేశ్ మేధావుల వేదిక కన్వీనర్ చలసాని శ్రీనివాస్ తెలుగువన్ న్యూస్ చానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడారు.  వైసీపీ చేపట్టిన ఈ పోరాటం   అభ్యర్థుల సమస్య కాదని, దీని వెనుక పెద్ద రాజకీయ   వ్యూహం దాగి ఉందని అన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో, డీఎస్‌సీ,  ఇతర నియామక ప్రక్రియల్లో ఏ చిన్న లోపం ఉన్నా దానిని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకోవడంలో  వైసీపీ వ్యూహాత్మకంగా  ముందుకు సాగుతోందన్నారు.  డీఎస్‌సీ స్పోర్ట్స్ కోటా మరియు నియామక ప్రక్రియలో జరుగుతున్నాయంటున్న ఆరోపణలను పాలక పక్షం తేలిగ్గా తీసిపారేయడం సరైన పద్ధతి కాదన్న చలసాని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్,  ఉన్నతాధికారులు   సాంకేతిక వివరణలు ఇచ్చి ఊరుకోకుండా, ప్రజ లకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో పారదర్శక వివరణ ఇవ్వాలన్నారు. అలాగే..  ప్రతిపక్షం లేవనెత్తిన అనుమానాలను నివృత్తి చేసేందుకు అవసరమైతే స్వతంత్ర విచారణ కమిటీ,  లేదా ప్రజా సంఘాలతో కూడిన విచారణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం ఏ తప్పూ చేయనప్పుడు విచారణకు వెనుకడాల్సిన అవసరం లేదని, తద్వారా ప్రభుత్వానికే మరింత విశ్వసనీయత పెరుగుతుందని విశ్లేషించారు.   AP Politics, YSRCP Youth Strategy, Nara Lokesh,  DSC Recruitment, Chalasani Srinivas Analysis, TeluguOne
ఏపీ అసెంబ్లీ  వర్షాకాల సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో  వైసీపీ శాసనసభాపక్షం బుధవారం (ఆగస్టు 12)న భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  అసెంబ్లీ సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు సాధారణంగా ఏ పార్టీ అయినా శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేస్తుంది. దీంతో వైసీపీ శాసనసభా పక్ష సమావేశం అనగానే.. వైసీపీ అసెంబ్లీ బహిష్కరణకు స్వస్తి చెప్పి సభకు హాజరు కానుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అయ్యింది.  అయితే వైసీపీ శాసనసభాపక్ష సమావేశం మాత్రం అసెంబ్లీ బహిష్కరణను కొనసాగించాలన్న నిర్ణయం తీసుకుంది. ఇప్పుడూ ప్రతిపక్ష హోదాపై స్పష్టత రానందున సభను బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది.   2024 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ సంఖ్య సభ్యులతో సభలో ప్రతిపక్ష హోదా వచ్చే అవకావం ఇసుమంతైనా లేదు.  అయితే వైసీపీ మాత్రం నిబంధనలతో పని లేకుండా తమ పార్టీకి ప్రతిపక్ష హోదా, పార్టీ అధినేతకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది. ఆ డిమాండ్ తో నే అసెంబ్లీ బహిష్కరణ చేస్తున్నది.  శాసనసభ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పటికీ, శాసనమండలి   సమావేశాలకు మాత్రం పూర్తిస్థాయిలో హాజరుకావాలని వైసీపీ  నిర్ణయం తీసుకుంది. శాసనమండలిలో తమ పార్టీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో, అక్కడ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని యోచిస్తోంది.  ముఖ్యంగా  మెగా డీఎస్సీ నియామక ప్రక్రియలో  అక్రమాలు, అవకతవకలపై ప్రభుత్వాన్ని మండలిలో నిలదీయాలని వైసీపీ అధినేత జగన్ తమ పార్టీ శాసనమండలి సభ్యులకు దిశానిర్దేశం చేశారు.    AP Assembly,  Monsoon Sessions, YSRCP Boycott,  Jagan Leader of Opposition Status, AP Legislative Council,  TeluguOne
  తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మనవడు,  బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు టాలీవుడ్ ఎంట్రీపై ముహూర్తం ఖరారైపోయిందా? అంటే సోషల్ మీడియాతో పాటు సినీ వర్గాల నుంచీ ఔనన్న సమాధానమే వస్తోంది. కల్వకుంట్ల హిమాన్షు సినీ ఎంట్రీ ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది. కల్వకుంట్ల హిమాన్షు సంగీత ప్రతిభ తెలిసిందే. తన గానంతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందారు. కల్వకుంట్ల హిమాన్సు పాడిన గోల్డెన్ అవర్ సాంగ్ నెటిజనులను విశేషంగా ఆకట్టుకుంది. కేవలం గానం, సంగీతమే కాకుండా..సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ హిమాన్షు చురుగ్గా ఉంటారు.  బెహతర్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామిగా మారి  29 వేల 482 కిలోగ్రాముల రీసైకిల్ వ్యర్థాలను సేకరించి జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు.  అలాగే త గజ్వేల్ సమీపంలోని గౌలిదొడ్డి ప్రభుత్వ పాఠశాలను 90 లక్షల వ్యయంతో అధునాతన హంగులతో అభివృద్ధి చేసి  ప్రశంసలు అందుకున్నారు. ఇటీవలి కాలంలో హిమాన్షు రావు  తన  ఫిట్‌నెస్‌తో, సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన లుక్ కు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ లుక్కే హిమాన్షురావు త్వరలోనే హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న ప్రచారం జోరందుకునేలా చేసింది.  ఇప్పటికే కొందరు ప్రముఖ దర్శకులు ఆయన కోసం కథ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.   పొలిటికల్ ఫ్యామిలీ నుంచి  సినీ  ఎంట్రీ కొత్తేం కాదు... ఇప్పఇకే  మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా  హీరో' సినిమాతో కథానాయకుడిగా పరిచయమయ్యారు.   2024 లోక్‌సభ ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్న  యువకుడు హిమాన్షు రావు    పొలిటికల్ గ్లామర్, మాస్ ఫాలోయింగ్ కేసీఆర్ కుటుంబం నుంచి సినీరంగ ప్రవేశం చేయనున్నారన్న వార్త ఇప్పుడు తెగ వైరల్ గా మారింది.  KTR grand son tollywood entry, KTR son Himanshu, Himanshu Rao Cine debut, Kalvakuntla Himanshu Rao transformation, TeluguOne
ఏపీ పాలిటిక్స్ లో  ఆసక్తికరమైన  పరిణామం చోటుచేసుకోబోతోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) మనవడు, పురందేశ్వరి కుమారుడు   దగ్గుబాటి హితేష్ చెంచురాం త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  నందమూరి, దగ్గుబాటి, నారా కుటుంబాల మధ్య సంబంధాలు మళ్లీ బలపడుతున్న తరుణంలో..  హితేష్ చెంచురాం టిడిపి కండువా కప్పుకోనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  తెలుగుదేశం  ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీలో అత్యంత కీలక పాత్రలను పోషిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం అధినేతగా, ఆయన కుమారుడు, ఎన్టీఆర్ మనవడు నారా లోకేష్ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్ మరో కుమారుడు దివంగత హరికృష్ణ కుమార్తె సుహాసిని పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ఇప్పుడు తాజాగా దగ్గుబాటి పురందేశ్వరి కుమారుడు హితేష్ తెలుగుదేశం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలలోకి అడుగు పెట్టనున్నారు.   కుటుంబ బంధాలు,  రాజకీయ వేదికలు ఏకతాటిపైకి రావడం పార్టీలో నూతనోత్తేజాన్ని నింపుతుందని పరిశీలకులు అంటున్నారు.  లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. దగ్గుబాటి హితేష్   రాజకీయ ప్రవేశం వెనుక కుటుంబ పెద్దల సహకారం, పొత్తుల సమీకరణాలు   ఉన్నాయని అంటున్నారు. గతంలో జరిగిన కొన్ని రాజకీయ పరిణామాల కారణంగా దగ్గుబాటి కుటుంబం తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటూ వచ్చింది. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా  చంద్రబాబు నాయకత్వంలో  తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా పనిచేసేందుకు  హితేష్ ను తెలుగుదేశంలో చేర్చడం ద్వారా ఈ దూరం తగ్గుతుందని భావిస్తున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు పరిధిలో ఇటీవల జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హితేష్ క్రియాశీలకంగా పాల్గొన్నారు.  అలాగే స్థానిక ప్రజా సమస్యల పరిష్కారానికి సొంతంగా నిధులు కేటాయించడం వంటి అంశాలు ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2019 శాసనసభ ఎన్నికలకు ముందు దగ్గుబాటి వెంకటేశ్వరరావు,  ఆయన కుమారుడు హితేష్ చెంచురాం వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో పర్చూరు నియోజకవర్గం నుంచి హితేష్ పోటీ చేయాలని భావించినప్పటికీ,  సాంకేతిక సమస్యల కారణంగా ఆయన స్థానంలో తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. ఆ ఎన్నికల అనంతరం దగ్గుబాటి తండ్రీకొడుకులు వైసీపీకి,   రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాగా..  దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలోనే కొనసాగుతూ ప్రస్తుతం రాజమండ్రి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇటీవలి కాలంలో నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాల మధ్య సాన్నిహిత్యం  పెరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వయంగా చంద్రబాబు నివాసానికి వెళ్లడం, కుటుంబ వేడుకలు,  పుస్తకావిష్కరణల సందర్భంగా చంద్రబాబు, దగ్గుబాటి ఒకే వేదిక పంచుకోవడం వారి మధ్య దూరం తగ్గిపోయిందనడానికి సాక్ష్యంగా నిలిచాయి.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ఈ మూడు కుటుంబాల మధ్య  బంధం మరింత బలపడింది. ఈ సఖ్యతే హితేష్ చెంచురాం తెలుగుదేశం పార్టీలో చేరడానికి  మార్గం సుగమం చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   Hitesh Chenchuram TDP Entry, Daggubati Hitesh Chenchuram, NTR Grandson Political Entry, TDP New Political Developments,  Daggubati Family, TeluguOne
ALSO ON TELUGUONE N E W S
ఎన్టీఆర్‌ భుజానికి గాయమవ్వగా, తాజాగా KIMS హాస్పిటల్‌లో సర్జరీ విజయవంతంగా పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ కి గాయమైన సమయంలో కానీ, సర్జరీ పూర్తయిన తర్వాత కానీ.. అసలు ఆయన ఎలా ఉన్నారో తెలిపే అధికారిక ఫోటోలు బయటకు రాలేదు. దీంతో అఫీషియల్ ఫోటో కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోను షేర్ చేసి, కిమ్స్ డాక్టర్ సర్ప్రైజ్ చేశారు. ఎన్టీఆర్‌కి అర్త్రోస్కోపిక్ షోల్డర్ సర్జరీని డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి నేతృత్వంలోని నిపుణులైన మెడికల్ టీమ్ పర్ఫెక్ట్‌గా పూర్తి చేసింది. సర్జరీ సక్సెస్ అవ్వడమే కాకుండా, ఎన్టీఆర్ ప్రస్తుతం చాలా ఆరోగ్యంగా ఉన్నారని తెలుపుతూ.. డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు.  ఆ ఫొటోలో ఎన్టీఆర్.. సర్జరీ తర్వాత మెడికల్ టీమ్‌తో కలిసి చిరునవ్వులు చిందిస్తూ, థంబ్స్ అప్ సైన్ చూపిస్తూ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. ఆయన భుజానికి వేసిన ఆర్మ్ స్లింగ్ సపోర్ట్ చూస్తేనే అర్థమవుతోంది.. ఆయన ఎంత వేగంగా కోలుకోవడానికి సిద్ధంగా ఉన్నారో. డాక్టర్లు చెప్పిన వివరాల ప్రకారం.. ఎన్టీఆర్ ప్రస్తుతం మెడికల్ సూపర్ విజన్ కింద ప్రాపర్ రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నారు. ఆయన పూర్తిగా కోలుకుని, మళ్లీ సాధారణ జీవితంలోకి, తన సినిమాల షూటింగ్‌లలో పాల్గొనడానికి సుమారు 2 నుండి 3 నెలల సమయం పడుతుందని డాక్టర్స్ స్పష్టం చేశారు. https://www.instagram.com/reel/Db-Fxw7hqHp/     Jr NTR, Shoulder Surgery, KIMS Hospital  
  నేటికీ చిన్న పిల్లలు తమ తల్లిని సరదాగా భయపెట్టడానికి 'చంద్రముఖి' సినిమాలో రజినీకాంత్, జ్యోతిక పలికిన 'లక లక' అనే పదాన్ని ఉపయోగించడం ఆనవాయితీగా మారింది. అంతలా దక్షిణ భారతీయ సినీప్రేమికుల ఫేవరేట్ లిస్ట్ లో ఒకటిగా ఉంది. ఇప్పటికీ  ఈ సినిమా కథ,నటీనటుల క్యారక్టరయిజేషన్స్ గురించి మాట్లాడుకునే ఉంటారు. విజయవాడతో పాటు చాలా ఏరియాస్ లో కంటిన్యూగా వందరోజులు హౌస్ ఫుల్ తో ఆడిందంటే చంద్రముఖి సునామీని అర్ధం చేసుకోవచ్చు.  1985లో, మలయాళంలో కుంకుమం అనే పత్రికలో ‘అస్వాతి తిరునాళ్’ అనే కలం పేరుతో ప్రచురితమైన ‘విజనవీధి’ నిర్మానుష్యమైన వీథి) అనే కథ ఉంది.పాత కోట , కథానాయిక డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్, దెయ్యం ఆవహించినట్టు జనం భ్రమపడటం, చివరకు ఓ మానసిక వైద్యుడు ఎలా చికిత్స చేస్తాడనేది మూలకథ. దాని ఆధారంగానే 1993లో మలయాళంలో'‘మణిచిత్రతాళు’ అనే సినిమా రూపొందింది… కాకపోతే ఈ సినిమా కథను మేమే రాసుకున్నామని సీనిమా టీమ్ చెప్పుకుంది… కొన్నాళ్లు కాపీ వివాదం నడిచింది… ఫాజిల్ దర్శకత్వంలో మోహన్‌లాల్, శోభన, సురేష్ గోపి నటించిన ఈ ‘మణిచిత్రతాళు’ (Manichitrathazhu) చిత్రం భారతీయ సైకలాజికల్ హారర్ చిత్రాలలో ఒక మైలురాయి. కేరళలోని ఒక పురాతన తరవాడు (ఉమ్మడి కుటుంబం ఇల్లు) నేపథ్యంలో సాగే కథ. అక్కడ దెయ్యం ఉందని నమ్మే ఆచారాలు, మానసిక సమస్య (డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్) కారణంగా ఒక పాత్ర ప్రవర్తించే తీరును శాస్త్రీయంగా, మానసిక వైద్యం కోణంలో ముగించిన విధానం దీని ప్రత్యేకత. ఇందులో శోభన అభినయం జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ఇక 2005 లో తమిళంలో ఈ సినిమా ప్లాన్ చేశారు… రజినీకాంత్ హీరో… ఇక తను హీరో అనేసరికి రకరకాల వంకర్లు పోయింది కథ. అందులో రజినీకి తగ్గట్టుగా  కమర్షియల్ హంగులు వచ్చి చేరాయి… మరీ ప్రత్యేకంగా వడివేలుతో  కామెడీ ట్రాక్… ఫైట్లు, డాన్సులు, స్టెప్పులు, ఎలివేషన్లు, రజినీ మేనరిజమ్స్  ఎట్సెట్రా. మలయాళంలో మానసిక వైద్యుడైన డాక్టర్ సన్నీ (మోహన్‌లాల్) పాత్ర పరిమితంగా, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ తమిళంలో రజనీకాంత్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని ఆ పాత్రను చాలా పవర్ ఫుల్‌గా, మాస్ ఎలిమెంట్స్, ఫ్లాష్‌బ్యాక్ పోరాట ఘట్టాలతో భారీగా మార్చారు. 2007 లో  హిందీలో రీమేక్ చేశారు… అక్షయ్ కుమార్ హీరో, ప్రియదర్శన్ దర్శకత్వం… ‘భూల్ భులయ్యా’ (Bhool Bhulaiyaa)… మళ్లీ నార్త్ ఇండియన్ ఆడియెన్స్ టేస్ట్ పేరిట కామెడీకి ఇంకాస్త పెద్దపీట వేశారు… అక్షయ్ కుమార్ పోషించిన డాక్టర్ పాత్రలోని పిచ్చి సరదాలు, రాజ్‌పాల్ యాదవ్ కామెడీ సినిమా వాతావరణాన్ని సీరియస్ టోన్ నుంచి ఓ లైటర్ వీన్ సబ్జెక్టుగా మార్చేశాయి. Also Read: ఈ హీరోని చూసి సాక్షాత్తు #శ్రీరాముడే అన్నారు చంద్రముఖి సీక్వెల్, నాగవల్లి, భూల్ భులయ్యా 2, 3 చిత్రాలు పూర్తిగా వేరే కథలతో వచ్చిన సీక్వెల్స్ కావడం గమనార్హం. వాటి గురించిన ప్రస్తావనే ఇక్కడ అనర్హం… మాతృక మణిచిత్రతాళు ఒక సహజమైన, కళాత్మకమైన సైకలాజికల్ థ్రిల్లర్ అయితే చంద్రముఖి, భూల్ భులయ్యాలు వంకర్లు పోయిన రీమేకులు… అసలు నవలతో పోలిస్తే, అసలు ఇవి ఆ కథతో రూపొందినవేనా అనే సందేహం ఆవరిస్తుంది. ఏది ఏమైనా చంద్రముఖి  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 75 కోట్లకు పైగా వసూలు చేసి ఆ కాలంలో ఒక సంచలనం సృష్టించింది. ముఖ్యంగా తమిళనాడులోని శాంతి థియేటర్‌లో వరుసగా 890 రోజుల పాటు ప్రదర్శించబడి, అత్యధిక రోజులు ఆడిన తమిళ చిత్రంగా చరిత్రకెక్కింది. అయితే, వెండితెరపై మనం చూసిన ఈ భయంకరమైన కథ కేవలం ఒక దర్శకుని ఊహ మాత్రమేనా లేదా దీని వెనుక ఏదైనా నిజమైన సంఘటన ఉందా అనే ప్రశ్న చాలామంది మనస్సులలో మెదులుతూనే ఉంటుంది. Rajinikanth, Jyothika, Prabhu,  Chandramukhi
Dulquer Salmaan’s upcoming film I’m Game has been postponed from its earlier release date of August 20. The makers have now announced that the film will arrive worldwide on September 3, promising a much wider theatrical release across multiple markets. The announcement states that the additional time will allow I’m Game to expand its theatrical footprint and reach audiences beyond its original market. The film will simultaneously release in Malayalam, Tamil, Telugu, Hindi and Kannada, making it a pan-India theatrical release. The makers have positioned the delay as a strategic move to give the film the scale and theatrical platform it deserves rather than treating it as a simple postponement. With Dulquer Salmaan headlining the project, the decision indicates that the team is looking to maximise the film’s reach across languages. Directed by Nahas Hidhayath, I’m Game is expected to be one of Dulquer Salmaan’s major upcoming releases. The film’s new release date also gives the makers additional time to prepare the multilingual release and expand its promotional campaign. While the wait has been extended by a couple of weeks, the makers are confident that the game gets bigger with the wider release. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Anupama Parameswaran’s revelations about her toxic relationship have divided social media, with many supporting the actress for speaking about her experience, while others are questioning her decision to bring her private life into the public domain. Anupama revealed that she endured nearly two years of what she described as narcissistic abuse and controlling behaviour. She also spoke about how the relationship affected her career, including being stopped from promoting Dragon and facing pressure to quit acting. While several netizens are praising Anupama for walking away from a relationship that made her feel trapped, others feel that she should have continued keeping the matter private, especially since she had never publicly acknowledged the relationship in the first place. However, the biggest talking point is her Anniyan reference. Anupama reportedly described her former partner as “Remo” one day, “Anniyan” the next and “Ambi” while apologising. All three personalities were played by Vikram in the Shankar directorial. This has triggered speculation that Anupama may have indirectly hinted at Dhruv Vikram, with whom she was previously linked. Neither actor has officially confirmed their relationship, and Anupama did not name anyone in her latest revelations. Still, the Anniyan reference has given social media enough reason to connect the dots. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ప్రభాస్ బొమ్మ సెల్యులాయిడ్ పై పడితే చాలు పాన్ ఇండియా బాక్స్ ఆఫీస్ సలాం హుజూర్ అంటూ కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం ముస్తాబవుతున్న చిత్రాలు ఫౌజీ, స్పిరిట్, కల్కి 2898 ad కి ఆ విషయం తెలుసు కాబట్టే వడివడిగా ముస్తాబవుతున్నాయి. సాధారణంగా ఏ పెద్ద హీరో అయినా తన షూటింగ్ లేని రోజుల్లో విశ్రాంతి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తుంటాడు. కానీ ప్రభాస్ మాత్రం అందుకు భిన్నంగా 'ఫౌజీ'  షూటింగ్ షెడ్యూల్‌లో తన షాట్స్ లేదా సీన్లు లేకపోయినప్పటికీ నేరుగా షూటింగ్ సెట్స్‌కి చేరుకుని ప్రొడక్షన్ పనులు దగ్గరుండి పరిశీలిస్తున్నాడు. సెట్స్‌లోనే ఉంటూ ప్రొడక్షన్ వ్యవహారాలు, సన్నివేశాల చిత్రీకరణను క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుండటం వల్ల మేకర్స్, యూనిట్ సభ్యుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ పిరియాడిక్ యాక్షన్ డ్రామాలో ప్రభాస్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీకి చెందిన సైనికుడి క్యారక్టర్ లో  కనిపించబోతున్నాడు.  Also read: ఏకైక విద్యార్ధినిగా రికార్డు: సుకుమార్ కూతురు సుకృతి వేణి సంచలనం   షూటింగ్ ఆఖరి దశకు చేరుకోగా, మిగిలివున్న 90 రోజుల చిత్రీకరణ షెడ్యూల్‌లో ప్రభాస్ ఏకంగా 60 రోజులకి పైగా కాల్షీట్లని  కేవలం ఈ ప్రాజెక్ట్ కోసమే కేటాయించారు.ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా నటిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వీరితో పాటు బాలీవుడ్ దిగ్గజ నటులు మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ మరియు జయప్రద ముఖ్య పాత్రల్లో నటిస్తుండటం సినిమా రేంజ్‌ను మరింత పెంచింది. మేకర్స్ ఈ సినిమాను డిసెంబర్ 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అభిమానులు అయితే 'ఫౌజీ' తో ఈ సారి కొన్నాళ్లపాటు ఎవరు క్రాస్ చెయ్యని రికార్డులు సృష్టించబోతున్నామనే నమ్మకంతో ఉన్నారు. షూరిటీ కింద ఇటీవల రిలీజైన ప్రభాస్ లుక్  చూపిస్తున్నారు. Prabhas, Fauji,  Hanu Raghavapudi, Imanvi  
  పుష్ప, పుష్ప-2 చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొంది. ఇటీవల జాతీయ అవార్డుల్లో ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితగా ఘనత పొందిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే సుకుమార్‌ బాటలోనే ఆయన తనయురాలు, ప్రముఖనటి సుకృతి వేణి  బండ్రెడ్డి కూడా విభిన్న బాటలో పయనిస్తోంది.. 2024 సంవత్సరానికి జాతీయ ఉత్తమ బాల నటిగా 'గాంధీ తాత చెట్టు' చిత్రానికి గాను అవార్డు సాధించిన సుకృతి వేణి ఇప్పుడు మరో అరుదైన ఘనతని  కైవసం చేసుకుంది. అమెరికాలోని బోస్టన్‌లో ఉండే అంతర్జాతీయ బర్క్‌లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌ స్కూల్‌లో సంగీత విభాగంలో ఎన్‌సెంబల్‌ ఎక్సెలన్స్‌ అవార్డుని  ఎంపికై ఫుల్‌ స్కాలర్‌షిప్‌ను సొంతం చేసుకుంది.  ఈ స్కాలర్ షిప్  కోసం మొత్తం 272 మంది పిల్లలు ఆడిషన్ ఇవ్వగా, కేవలం 14 మందికి మాత్రమే ఫుల్  స్కాలర్షిప్  వచ్చింది. అందులో కూడా సింగర్స్  విభాగంలో పూర్తి స్కాలర్ షిప్ పొందిన ఏకైక విద్యార్థిని సుకృతి వేణి కావడం విశేషం. Also read: అపరిచితుడు తెలుసుగా: రెండేళ్లు విషపూరితమైన వ్యక్తితో గడిపా..అనుపమ సంచలన వ్యాఖ్యలు  Sukumar, Sukriti Veni, Berklee College of Music
  తెలుగు నాట షార్ట్ పీరియడ్ లో క్రేజీ భామగా మారింది అనుపమ పరమేశ్వరన్. రీసెంట్ గా ఆమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు ;దాదాపు రెండు సంవత్సరాల  పాటు ఒక అత్యంత విషపూరితమైన 'టాక్సిక్ రిలేషన్‌షిప్' లో తీవ్ర నరకాన్ని అనుభవించాను. ఆ బంధంలో ఉన్నంత కాలం ప్రతి నిమిషం భయంతో, ఆందోళనతో, అభద్రతా భావంతో గడిపాను. బయటకు నవ్వుతూ కనిపించినా, లోపల శారీరకంగా, మానసికంగా పూర్తిగా నలిగిపోయాను .  నా మాజీ భాగస్వామి ప్రవర్తన 'అపరిచితుడు' సినిమాలోలా ఉండేది. ఒక రోజు 'రెమో'లాగా ఎంతో భయంకరమైన ప్రేమను కురిపిస్తూ, తనకంటే అదృష్టవంతురాలు ఎవరూ లేరనే భ్రమను కలిగిస్తాడు. కానీ మరుసటి రోజే అతడిలో 'అపరిచితుడు' బయటకు వచ్చి అత్యంత క్రూరంగా ప్రవర్తించేవాడు. ఎవరైనా వచ్చి నన్ను కత్తితో పొడిచినా పట్టించుకోని విధంగా ఉంటాడు. ఆ మరుసటి రోజే వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ, చిన్న పిల్లాడిలా ఏడుస్తూ క్షమాపణలు కోరేవాడు. ప్రతిసారీ అతడి మాటలు నమ్మి క్షమించడం, మళ్లీ అదే నరకం రిపీట్ కావడం ఒక అలవాటుగా మారిపోయింది. కేవలం 3 నెలల డేటింగ్ సమయంలోనే తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకి  పరిచయం చేశాడు. ఆ వెంటనే నిశ్చితార్థం కోసం ఒత్తిడి తెచ్చాడు. ఒకవేళ నేను ఆ రోజు ధైర్యం చేసి నిశ్చితార్థాన్ని వాయిదా వేయకపోతే లేదా ఆపకపోయి ఉంటే, అతడిని పెళ్లి చేసుకుని, చివరికి విడాకులు తీసుకోవాల్సి వచ్చేది. ఈ 2 ఏళ్ల కాలంలో తన జీవితంలో స్వేచ్ఛ పూర్తిగా కోల్పోయానని, ప్రతి చిన్న పని చేయడానికి లేదా మాట్లాడే ముందు 'ఎదుటి వ్యక్తి ఎలా స్పందిస్తారో' అని వందసార్లు మనసులోనే ప్రాక్టీస్ చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషపూరిత బంధం ప్రభావం నా వృత్తిపరమైన కెరీర్‌పై కూడా తీవ్రంగా పడింది. ఆమె కెరీర్‌లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచిన 'డ్రాగన్' సినిమా ప్రమోషన్లకి కూడా  హాజరు కాలేకపోవడానికి ఆ మానసిక వేధనే కారణం. అతడి మితిమీరిన నియంత్రణ వల్ల ఎన్నో మంచి ప్రాజెక్టులు, అవకాశాలని  వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. Also read: సుప్రీంకోర్టు కీలక తీర్పు: #దిల్ రాజు సేఫ్ జోన్ లో ఉన్నట్టేనా!    రోజురోజుకి  నా వ్యక్తిత్వం కుంచించుకుపోతూ వచ్చింది. కానీ ఆత్మహత్య బాట పట్టకుండా, నన్ను నేను కాపాడుకుని స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉన్నాను. నార్సిసిస్టిక్ అబ్యూజ్ అంటే ఏమిటో తెలియక, అలాంటి టాక్సిక్ రిలేషన్‌షిప్‌లో చిక్కుకుని బయటకు రాలేకపోతున్న వేలాది మందికి అవగాహన కల్పించడానికే ఈ విషయాలు బయటకు చెప్తున్నానని అనుపమ స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి. అనుపమ గతంలో విక్రమ్ తనయుడు ప్రముఖ హీరో ధృవ్ విక్రమ్ తో  డేటింగ్ లో ఉందనే వ్యాఖ్యలు వినిపించిన విషయం తెలిసిందే. Anupama Parameswaran, Tollywood
    హిట్ సినిమాలకి కేర్ ఆఫ్ అడ్రస్స్ దిల్ రాజు. బాలీవుడ్ లో కూడా తన విజయ పరంపర కొనసాగించాలని ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కిస్తున్నాడు. దిల్ రాజు గత చిత్రాల్లో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వచ్చిన  'మిస్టర్ పర్ఫెక్ట్' ఒకటి. 2011లో విడుదలవ్వగా దశరథ్ దర్శకత్వం వహించాడు . అయితే, సినిమా విడుదలైన దాదాపు 6 సంవత్సరాల తర్వాత మొదలైన కాపీరైట్ వివాదం గత కొన్నేళ్లుగా నిర్మాత దిల్ రాజును, దర్శకుడు దశరథ్‌ను న్యాయస్థానాల చుట్టూ తిప్పుతోంది. ఈ కేసులో తాజాగా భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో దిల్ రాజుకు ఊరట లభించే కీలక పరిణామం చోటుచేసుకుంది.   ప్రముఖ  రచయిత్రి ముమ్మిడి శ్యామలారాణి 2010 ఆగస్టులో 'నా మనసు కోరింది నిన్నే' అనే నవలని ప్రచురించారు. అయితే తన నవలలోని కథ, సన్నివేశాలు, ప్రధాన భావోద్వేగాలు, డైలాగులని నా అనుమతి లేకుండా కాపీ కొట్టి తీశారంటూ శ్యామలారాణి 2017 జులై 12న మియాపూర్ కోర్టుని ఆశ్రయించింది. కోర్టు ఆదేశాల మేరకు మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్, సంభాషణల రచయిత అబ్బూరి రవిపై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 120బి (కుట్ర), సెక్షన్ 420 (మోసం) తో పాటు కాపీరైట్ చట్టం సెక్షన్ 63 కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది.   ఈ పిటిషన్ ఆధారంగా విచారణ ప్రారంభించిన ట్రయల్ కోర్టు (సిటీ సివిల్ కోర్టు), 2019లో దిల్ రాజు మరియు ఇతరులపై చర్యలు తీసుకోవడానికి నోటీసులు జారీ చేసింది. తమ ప్రతిష్టకు భంగం కలుగుతోందని, అసలు సినిమా విడుదలైన 6 సంవత్సరాల తర్వాత ఈ కేసు నమోదు చేయడం కాలపరిమితి (స్టాట్యూట్ ఆఫ్ లిమిటేషన్స్) దాటిపోయిందని పేర్కొంటూ దిల్ రాజు తెలంగాణ హైకోర్టుని ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన హైకోర్టు, ఐపీసీ సెక్షన్ 420 కింద ఉన్న చీటింగ్ ఆరోపణలను తొలగించి దిల్ రాజుకు కొంత ఊరటనిచ్చినప్పటికీ, కాపీరైట్ చట్టం సెక్షన్ 63 కింద ట్రయల్ కోర్టులో విచారణను కొనసాగించవచ్చని స్పష్టం చేసింది.   హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు దశరథ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీఆర్‌పీసీ సెక్షన్ 468 ప్రకారం కేసుకు సంబంధించిన కాలపరిమితి ముగిసినందున విచారణను కొట్టివేయాలని వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో గతంలో సుప్రీంకోర్టు ధర్మాసనం ట్రయల్ కోర్టు విచారణపై తాత్కాలిక స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ స్టేను ఎత్తివేసి విచారణ వేగవంతం అయ్యేలా చూడాలని పిటిషనర్ శ్యామలారాణి తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్టును కోరారు.  ఈ అభ్యర్థనపై విచారణ చేపట్టిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గతంలో స్టే ఇచ్చే ముందే ఇరుపక్షాల వాదనలు, కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలు, కాలపరిమితి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించామని స్పష్టం చేస్తూ, స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. దీంతో ట్రయల్ కోర్టు చర్యలపై విధించిన స్టే కొనసాగనుంది. 2011లో థియేటర్లలో విడుదలైన సినిమాకు సంబంధించి దాదాపు 15 సంవత్సరాల తర్వాత కూడా కాపీరైట్ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్లడం సినీ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తుండగా, సర్వోన్నత న్యాయస్థానం విధించిన స్టే కొనసాగడం దిల్ రాజుకు తాత్కాలికంగా పెద్ద ఊరటగా మారింది. Dil Raju, Prabhas, Dasaradh, Mister Perfect    
'డీసీ' చిత్రంలో ఒక కీలకమైన సహాయక పాత్రలో మెరిసిన నటుడు జవహర్ శక్తికి వామికా గబ్బి ఓ ఖరీదైన కానుకను అందించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆమె అతనికి అత్యంత విలువైన 'ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్' మొబైల్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఆశ్చర్యపరిచారు. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నటుడు జవహర్ శక్తి ఈ ఆసక్తికర విషయాన్ని స్వయంగా బయటపెట్టారు. సెట్స్‌లో వామికా ప్రవర్తన చాలా ఆత్మీయంగా ఉండేదని, ఆమె ఇచ్చిన ఈ ప్రత్యేక కానుకను ఎప్పటికీ మరిచిపోలేనని ఆనందం వ్యక్తం చేశారు. దీంతో ఈ లవ్లీ జెస్చర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కథానాయకుడిగా, అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వంలో రా అండ్ రస్టిక్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం 'డీసీ'. సన్ పిక్చర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ మూవీ మొదటి వీకెండ్‌లోనే రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా తమిళం కంటే తెలుగులోనే ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద విశేష ఆదరణ లభిస్తోంది. తెలుగులో 2015లో వచ్చిన 'భలే మంచి రోజు' సినిమాతో ఎంట్రీ ఇచ్చిన వామికా గబ్బికి 'డీసీ' హిట్ కొత్త ఊపునిచ్చింది. ప్రస్తుతం అడివి శేష్ మోస్ట్ అవేటెడ్ స్పై థ్రిల్లర్ 'గూఢచారి 2' (G2) లో వామికా కథానాయికగా నటిస్తున్నారు. దీంతో పాటు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా రాబోతున్న 'జై హనుమాన్' ప్రాజెక్ట్‌లోనూ ఈమె కీలక పాత్ర పోషించనున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. తోటి కళాకారుల పట్ల వామికా చూపిస్తున్న గౌరవం, ఉదార మనస్తత్వంపై సినీ అభిమానులు మరియు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినిమా సక్సెస్ సాధించడమే కాకుండా, తోటి నటీనటులకు ఇచ్చే ప్రాధాన్యత ఆమె వ్యక్తిత్వానికి అద్దం పడుతోందని కామెంట్స్ చేస్తున్నారు. 'డీసీ' సినిమా విజయంతో పాటు వరుసగా పెద్ద ప్రాజెక్టులు అందుకుంటున్న వామికా గబ్బి రాబోయే రోజుల్లో సౌత్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
త్రిష క్రిష్ణన్ షేర్ చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తీవ్ర కలకలం రేపుతోంది. సాధారణంగా సోషల్ మీడియాలో వ్యక్తిగత విషయాలకు దూరంగా ఉంటూ కేవలం తన సినిమాల ముచ్చట్లే పంచుకునే త్రిష, హఠాత్తుగా ఒక పరోక్షమైన పోస్ట్ పెట్టడం, ఆపై 24 గంటలు కూడా గడవకముందే దాన్ని హడావుడిగా తొలగించడం కోలీవుడ్ వర్గాల్లోను, అభిమానుల్లోను తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తమిళనాడు రాజకీయ రంగంలో చోటుచేసుకుంటున్న ఉత్కంఠ భరిత పరిణామాలు, మరోవైపు తమిళ దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం, కుటుంబంలో జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఈ వివాదం మరింత రాజేసింది. ఇటీవల దళపతి విజయ్, ఆయన భార్య సంగీత విడాకుల వ్యవహారం సోషల్ మీడియాలోను, ప్రధాన మీడియాలోను విశేషంగా ప్రచారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే విజయ్ భార్య సంగీత కోర్టులో దాఖలు చేసిన తన విడాకుల పిటిషన్‌ను ఉన్నపళంగా వెనక్కి తీసుకోవడం కోలీవుడ్‌లో ఆసక్తికర పరిణామంగా మారింది. విజయ్ కుటుంబసభ్యులు మరియు శ్రేయోభిలాషులు ఈ వివాదాన్ని రచ్చకెక్కించకుండా, కోర్టు బయటే సామరస్యంగా సెటిల్ చేసుకోవాలని భావించినట్లు వార్తలు వచ్చాయి. ఇందుకోసం భారీ మొత్తంలో భరణం ఇచ్చేందుకు విజయ్ వర్గం అంగీకరించిందని, కుటుంబ గౌరవాన్ని నిలబెట్టేందుకే సంగీత కూడా పిటిషన్ ఉపసంహరణకు సమ్మతించిందని పరిశ్రమలో పెద్ద ఎత్తున గుసగుసలు వినిపిస్తున్నాయి. సరిగ్గా ఈ సెటిల్మెంట్ వార్తలు బయటకు వచ్చిన సమయానికే, త్రిష తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ, "ఈ వయసులో ఇలాంటి డ్రామాలు ఆడటం నిజంగా సిగ్గుచేటు. వెళ్లి మీ కష్టార్జితంతో కొంత డబ్బు సంపాదించుకోండి, మనశ్శాంతిని వెతుక్కోండి. ఒకప్పుడు మీరు ఏ జీవితం కోసం ప్రార్థించారో, ఇప్పుడు అలాంటి జీవితమే మీకు లభించడం ఎంత అదృష్టమో గ్రహించండి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు బయటకు రాగానే నెటిజన్లు రకరకాల విశ్లేషణలు మొదలుపెట్టారు. కొందరు ఈ వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లోని డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) నేతల ఆరోపణలను ఉద్దేశించి చేసినవని భావించగా, మెజారిటీ నెటిజన్లు మాత్రం ఇది నేరుగా విజయ్ భార్య సంగీతను లక్ష్యంగా చేసుకుని చేసిన పరోక్ష కౌంటర్ అని బలంగా ప్రచారం చేస్తున్నారు. సంగీత తనకు కావలసిన భారీ భరణం, ఆర్థిక ప్రయోజనాలు సాధించడంతోనే విడాకుల పిటిషన్ వెనక్కి తీసుకుందని, అందుకే త్రిష 'డబ్బు సంపాదించుకుని ప్రశాంతంగా ఉండండి' అంటూ పరోక్షంగా ఎద్దేవా చేసిందని కోలీవుడ్ వర్గాల్లో నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విజయ్, త్రిష జంటగా పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించడం, వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే అనేక రూమర్లు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్రిష చేసిన ఈ పోస్ట్ వివాదాన్ని మరింత పెంచేలా మారిందని గ్రహించిన ఆమె, ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకూడదనే ముందస్తు జాగ్రత్తతో ఆ పోస్టును షేర్ చేసిన 24 గంటలలోపే డిలీట్ చేసింది. అయినప్పటికీ, ఆ పోస్ట్ స్క్రీన్ షాట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ కాంట్రవర్సీ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హాట్ టాపిక్‌గా మారింది.   Trisha Krishnan, Thalapathy Vijay, Vijay Sangeetha Divorce, Trisha Deleted Post, Kollywood News, Trisha Instagram Story
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.  అయితే మనిషి మెదడు  ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో  సహాయపడటానికి..  మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే ,  చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా  మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం..  ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం  మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట.  ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను,  సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై  దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి  బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం  కోసం వెతుకుతూ ఉంటుందట.  ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి,  శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు.  ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ,  వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు.  దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట.  ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో  మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా,  మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా,  మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ  వారిని చాలా మంచోళ్లను,  అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది. ఎమోషనల్ లాజిక్.. ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం,  ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్  సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను  వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే  బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి.  అలా ఉంటేనే మంచిది.  లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది. సన్క్ కాస్ట్ పాలసీ.. ఇప్పటికే చాలా సమయం , శ్రమను  ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో  అందులో  అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు.  మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా  ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది.  ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి.  ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే  అత్యంత ముఖ్యం. నెగిటివ్  ప్రభావం.. ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది  రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు  త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది  ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి,  మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. స్పాట్ లైట్ ఎఫెక్ట్..  తప్పులను,  రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా  అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను  వదిలేయడం వల్ల,  రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో  ఉండటానికి సహాయపడుతుంది. పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.                                                                                                                                               *రూపశ్రీ.
 పిల్లలు సక్సెస్ కావాలంటే ఈ లక్షణాలు అలవాటు చెయ్యాలి..! "నేటి బాలలె రేపటి పౌరులు.." "విత్తనం మంచిదైతే పసిడి పంట పండుతుంది".  ఇలాంటి మాటలు తరచుగా వింటూనే ఉంటాం. ఇవన్నీ పిల్లల వ్యక్తిత్వాన్ని వారి నడవడికను తెలియజేయడానికి, పిల్లల భవిష్యత్తు గురించి చెప్పడానికి ఉపయోగిస్తారు.  ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు ఉన్నతంగా ఎదగాలని, మంచి పేరు తెచ్చుకోవాలని, తమకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటారు.  అయితే ఇవన్నీ జరగాలన్నా, పిల్లలు జీవితంలో సక్సెస్ కావాలన్నా.. పిల్లలకు కొన్ని లక్షణాలు అలవాటు చేయాలి.  దీని వల్ల పిల్లల భవిష్యత్తు బంగారం అవుతుంది.  తల్లిదండ్రులు పిల్లలకు అలవాటు చేయాల్సినవి ఏమిటో తెలుసుకుంటే.. జ్ఞానం, తెలివితేటలు.. జ్ఞానం , తెలివితేటలు  పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా బలాలుగా మారతాయి. నేర్చుకోవాలనే తపన, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఉన్న పిల్లలు జీవితంలో విజయ మార్గంలో సులభంగా పయనిస్తారు. అటువంటి పిల్లలు తమ వృత్తి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను మరింత సమర్థవంతంగా ఎదుర్కోగలరు. తెలివైన పిల్లలు తమ భవిష్యత్తును గొప్పగా మార్చుకోవడమే  చేసుకోవడమే కాకుండా వారి తల్లిదండ్రుల ప్రతిష్టను కూడా పెంచుతారు. అందుకే చిన్నతనం నుండే పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వాలి.   ప్రవర్తన.. మంచి ప్రవర్తన, నీతి, నిజాయితీ వంటి విలువలు గొప్ప ఆస్తిగా పరిగణించాలి. పెద్దల పట్ల గౌరవం, క్రమశిక్షణ, కుటుంబం పట్ల బాధ్యత కలిగిన పిల్లలు కుటుంబాన్ని ఒక్కటిగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తారు. అలాంటి పిల్లలు ఇంట్లో శాంతి, సంతోషాన్ని నెలకొల్పి, సమాజంలో కుటుంబానికి గౌరవాన్ని తెస్తారు. అందుకే పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి.  దీని వల్ల పిల్లల ప్రవర్తన కూడా ఉన్నతంగా మారుతుంది. నిజాయితీ.. అబద్ధాలు చెప్పడం, మోసం, వంచనలకు దూరంగా ఉండే పిల్లలు సమాజంలో మంచి పేరు తెచ్చుకోగలుగుతారు. పిల్లలు అయినా పెద్దలు అయినా.. వారి వ్యక్తిత్వాన్ని బలంగా ఉంచేది నిజాయితీనే..  ఇది  చుట్టూ ఉన్న వ్యక్తుల నమ్మకాన్ని పొందడంలో సహాయపడుతుంది. అటువంటి పిల్లలకు జీవితంలో విజయం సాధించడానికి గొప్ప అవకాశాలు ఉంటాయి. అందుకే వారి తల్లిదండ్రులు కూడా సమాజంలో గౌరవాన్ని పొందుతారు. దయ.. దయ కలిగి ఉండటం,  సహాయపడే గుణం ఉన్న పిల్లలు ఉంటే ఆ తల్లిదండ్రులు ఎంతో అదృష్టవంతులని చెప్పవచ్చు.  పేదలకు సహాయం చేస్తూ, ఇతరుల పట్ల సున్నితంగా ఉండే పిల్లలు సంతోషం, శాంతితో కూడిన జీవితాన్ని గడుపుతారు. అలాంటి పిల్లలకు  తల్లిదండ్రుల ఆశీర్వాదం, మద్దతు కూడా ఎప్పుడూ ఉంటుంది.   పిల్లలలో ఉండే ఈ దయ, జాలి, కరుణ, సహాయం చేసే గుణం వంటివి సమాజంలో గప్ప గౌరవాన్ని తెచ్చిపెడుతుంది.                                *రూపశ్రీ.  
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
స్ట్రెస్, ఆందోళన, బీపీ వంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. రోజువారీ జీవితంలో ఒత్తిడి పెరగడంతో మనసుతో పాటు శరీరంపై కూడా ప్రభావం పడుతుంది. ఇలాంటి సమయంలో శ్వాసపై దృష్టి పెట్టే ప్రాణాయామాలు కొంతమందికి రిలాక్సేషన్‌కు సహాయపడవచ్చు. అనులోమ విలోమ ప్రాణాయామం శ్వాసను నియంత్రిస్తూ చేసే ఒక సాధారణ యోగాభ్యాసం. దీన్ని సరైన పద్ధతిలో, సరైన సమయంలో చేయడం ముఖ్యమని యోగా నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ ఒకే విధంగా ప్రాణాయామం చేయడం సరికాదు. వయసు, ఆరోగ్య పరిస్థితి, ప్రస్తుతం ఉన్న సమస్యలను బట్టి విధానం మారవచ్చు. ఈ వీడియోలో సీనియర్ యోగా థెరపిస్ట్, ఆయుర్వేద డైటీషియన్ శ్రావంతి రఘు అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలి? ఎప్పుడు చేయాలి? ఎవరు చేయవచ్చు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను సులభంగా వివరిస్తున్నారు. అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలి? వీడియోలో అనులోమ విలోమాన్ని స్టెప్ బై స్టెప్‌గా ఎలా చేయాలో చూపించారు. శ్వాసను నెమ్మదిగా, నియంత్రణతో తీసుకోవడం, వదలడం వంటి అంశాలను సరైన పద్ధతిలో పాటించడం గురించి వివరించారు. ప్రాణాయామం చేసేటప్పుడు శరీరాన్ని రిలాక్స్‌గా ఉంచడం, తొందరపడకుండా శ్వాసపై దృష్టి పెట్టడం ముఖ్యమైన అంశాలు. మొదటిసారి ప్రయత్నించేవారు నిపుణుల సూచనతో ప్రారంభించడం మంచిది. BP ఉన్నవారు చేయవచ్చా? అధిక రక్తపోటు ఉన్నవారు కూడా కొన్ని శ్వాసాభ్యాసాలను తగిన జాగ్రత్తలతో చేయవచ్చు. అయితే అధిక బీపీ ఉన్న ప్రతి వ్యక్తికి ఒకే విధమైన ప్రాణాయామ పద్ధతి సరిపోదు. ముఖ్యంగా శ్వాసను బిగపట్టడం వంటి పద్ధతులను స్వయంగా ప్రయత్నించకుండా, నిపుణుల సూచనలు పాటించడం మంచిది. డయాబెటిస్ ఉన్నవారు చేయవచ్చా? డయాబెటిస్ ఉన్నవారు కూడా అనులోమ విలోమ ప్రాణాయామం గురించి నిపుణుల సలహా తీసుకుని సాధన చేయవచ్చు. అయితే ప్రాణాయామం ఏదైనా వ్యాధికి మందులకు ప్రత్యామ్నాయం కాదు. వైద్యులు సూచించిన మందులు, ఆహారం, వ్యాయామాన్ని కొనసాగిస్తూ మాత్రమే యోగాభ్యాసాన్ని జీవనశైలిలో భాగంగా చేసుకోవాలి. సైనసైటిస్ ఉన్నవారు? సైనసైటిస్ లేదా ముక్కు సంబంధిత సమస్యలు ఉన్నవారు ప్రాణాయామం చేసే ముందు తమ ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకోవాలి. ముక్కు పూర్తిగా బ్లాక్‌గా ఉన్నప్పుడు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నప్పుడు బలవంతంగా శ్వాసాభ్యాసం చేయకూడదు. అవసరమైతే యోగా థెరపిస్ట్ లేదా వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి. రోజూ 10 నిమిషాలు చేస్తే స్ట్రెస్, BP శాశ్వతంగా పోతాయా? ప్రాణాయామం వల్ల రిలాక్సేషన్, శ్వాస నియంత్రణ, మానసిక ప్రశాంతతకు సహాయం లభించవచ్చు. అయితే రోజూ 10 నిమిషాలు అనులోమ విలోమం చేస్తే స్ట్రెస్ లేదా బీపీ శాశ్వతంగా పూర్తిగా నయమవుతాయని చెప్పడం సరైనది కాదు. ముఖ్యంగా అధిక రక్తపోటు ఒక వైద్య పరిస్థితి. దాని కోసం వైద్యుల సూచనలు, మందులు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం అవసరం. ఈ వీడియోలో అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎవరు చేయవచ్చు? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? సరైన పద్ధతి ఏమిటి? వంటి ముఖ్యమైన విషయాలను సీనియర్ యోగా థెరపిస్ట్ శ్రావంతి రఘు వివరిస్తున్నారు. గమనిక: ఈ సమాచారం ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు బీపీ, డయాబెటిస్, సైనసైటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే ప్రాణాయామం ప్రారంభించే ముందు మీ వైద్యుడు లేదా అర్హత కలిగిన యోగా థెరపిస్ట్‌ను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)    
మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అవసరమైన ముఖ్యమైన ఖనిజాల్లో పొటాషియం (Potassium) ఒకటి. శరీరంలో పొటాషియం స్థాయి సరైన మోతాదులో ఉండటం చాలా ముఖ్యం. అయితే రక్తంలో పొటాషియం స్థాయి ఎక్కువగా ఉన్నా (Hyperkalemia), తక్కువగా ఉన్నా (Hypokalemia) ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అసలు పొటాషియం అంటే ఏమిటి? రక్తంలో పొటాషియం ఎందుకు పెరుగుతుంది? పొటాషియం తగ్గడానికి కారణాలు ఏమిటి? పొటాషియం ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఈ సమస్యను నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేయాలి? వంటి ముఖ్యమైన విషయాలను ఈ వీడియోలో ప్రముఖ వైద్యులు డా. N. Papa Rao సులభంగా వివరిస్తున్నారు. పొటాషియం ఎక్కువైతే ఏమవుతుంది? రక్తంలో పొటాషియం సాధారణ స్థాయికి మించి ఉండటాన్ని Hyperkalemia అంటారు. కొన్ని సందర్భాల్లో కిడ్నీల పనితీరు సరిగా లేకపోవడం, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా కొన్ని మందుల కారణంగా పొటాషియం స్థాయి పెరగవచ్చు. పొటాషియం ఎక్కువగా ఉన్నప్పుడు కండరాల బలహీనత, అలసట, గుండె కొట్టుకునే విధానంలో మార్పులు వంటి సమస్యలు కనిపించవచ్చు. ముఖ్యంగా గుండె పనితీరుపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు. పొటాషియం తగ్గితే? రక్తంలో పొటాషియం స్థాయి తక్కువగా ఉండటాన్ని Hypokalemia అంటారు. వాంతులు, విరేచనాలు, అధికంగా చెమట పట్టడం, కొన్ని మందుల వాడకం వంటి కారణాలతో శరీరంలో పొటాషియం తగ్గే అవకాశం ఉంటుంది. పొటాషియం తక్కువగా ఉన్నప్పుడు నీరసం, కండరాల బలహీనత, కండరాలు పట్టేయడం, గుండె దడ వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి? పొటాషియం స్థాయి ఎక్కువగా ఉందా లేదా తక్కువగా ఉందా అనేది కేవలం లక్షణాల ఆధారంగా నిర్ణయించలేం. అవసరమైతే వైద్యుల సూచనతో రక్త పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు ఉన్నవారు లేదా కొన్ని మందులు క్రమం తప్పకుండా ఉపయోగించేవారు వైద్యుల సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. పొటాషియం ఎక్కువగా ఉందని లేదా తక్కువగా ఉందని అనుమానం వచ్చినప్పుడు సొంతంగా మందులు తీసుకోవడం, పొటాషియం సప్లిమెంట్లు వాడటం లేదా ఆహారంలో పెద్ద మార్పులు చేయడం చేయకండి. వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. పొటాషియం ఎక్కువైనా ప్రమాదమే.. తక్కువైనా సమస్యే. కాబట్టి శరీరంలో పొటాషియం స్థాయి ఎందుకు మారుతుంది, దాని వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి అనే విషయాలపై పూర్తి అవగాహన కోసం ఈ వీడియోను చూడండి. గమనిక: ఈ వీడియోలోని సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్యుల వ్యక్తిగత సలహాకు ప్రత్యామ్నాయం కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు లేదా అనుమానాలు ఉంటే అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)  
సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని అంటారు. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటే జీవితం చాలా వరకు దిగులు లేకుండా ఉంటుంది.   కంటికి ఏదైనా సమస్య వస్తే.. దాని ప్రభావం జీవితం మీద చాలా ప్రస్పుటంగా కనిపిస్తుంది. కంటి సమస్యలు అంటే చాలామంది కంటి శుక్లాలు రావడం,  కంటికి ఏదైనా దెబ్బ తగలడం... వీటి గురించి చెబుతుంటారు. కానీ వర్షాకాలంలో పిలవని అతిథి గా వచ్చేది కంటి ఇన్ఫెక్షన్ల సమస్య. కంటి ఇన్ఫెక్షన్లు వస్తే కన్ను ఎర్రబడటం,  కంటి నుండి నీరు కారడం, కళ్లు మసకగా మారడం, కళ్ల మంటలు వంటి సమస్యలు వస్తాయి. వర్షాకాలంలో వచ్చే ఈ కంటి ఇన్ఫెక్షన్ల సమస్య.. ఒకరి నుండి మరొకరికి వ్యాపిస్తుంది కూడా. అసలు కంటి ఇన్పెక్షన్ సమస్యలు ఎందుకు వస్తాయి? కారణాలు ఏంటి?  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  కంటి ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు చికిత్స ఏంటి?  తెలుసుకుంటే.. వర్షాకాలంలో కంటి ఇన్ఫెక్షన్లు ఎందుకు వస్తాయి? వర్షపు నీరు నేరుగా కంటి ఇన్ఫెక్షన్లకు కారణం కాదు.. అయినప్పటికీ ఈ కాలంలో బ్యాక్టీరియా , వైరస్‌లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లడం, మురికి చేతులతో కళ్లను తాకడం, ఇన్ఫెక్షన్ సోకిన వ్యక్తి వాడిన టవల్ లేదా చేతి రుమాలును ఇతరులు వాడటం, కాంటాక్ట్ లెన్స్‌లను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వంటివి ఇన్ఫెక్షన్ ప్రమాదాన్ని పెంచుతాయి. ఇన్ఫెక్షన్ సోకిన కంటిని తాకిన తర్వాత  డోర్‌నాబ్, మొబైల్ ఫోన్, టేబుల్ లేదా ఇతర వస్తువులను తాకితే, అక్కడ ఉన్న వైరస్‌లు లేదా బ్యాక్టీరియా ఇతరులకు వ్యాప్తి చెందవచ్చు. కంటి ఇన్పెక్షన్ లక్షణాలు.. కళ్లు ఎర్రబడటం, ఆగకుండా నీరు కారడం,  దురద లేదా మంట.  కళ్ల నుండి జిగటగా లేదా పసుపు-తెలుపు రంగులో స్రావం రావడం. కనురెప్పలు వాపు. కళ్లలో ఇసుక గుచ్చుతున్నట్లు అనిపించడం. ఉదయం నిద్రలేచినప్పుడు కనురెప్పలు జిగటగా ఉండటం.. వంటివి కంటి ఇన్పెక్షన్ లక్షణాలు. కన్ను ఎర్రబడితే ఇన్పెక్షన్ వచ్చినట్టా? వర్షాకాలంలో అలర్జీలు, దుమ్ము, కాలుష్యం లేదా ఎక్కువసేపు స్క్రీన్ చూడటం వల్ల తరచుగా కళ్ళు ఎర్రబడవచ్చు. అందువల్ల,  కన్ను ఎర్రబడగానే అది  కంటి ఇన్పెక్షన్ అనుకోవడం పొరపాటు.   కొందరు ఇలా సందేహం రాగానే  సొంతంగా యాంటీబయాటిక్ కంటి డ్రాప్స్ వంటివి   వాడతారు,  ఇలా చేయడం మంచిది కాదు.  నొప్పి తీవ్రంగా ఉంటే, దృష్టి మసకబారితే, లేదా లైటింగ్ కు కళ్లు చాలా ఇబ్బంది పడుతూ ఉంటే  వెంటనే కంటి వైద్య నిపుణుడిని సంప్రదించాలి. వీళ్లకు ఎక్కువ జాగ్రత్త అవసరం.. కాంటాక్ట్ లెన్స్ వాడేవారు,  చిన్న పిల్లలు,  వృద్ధులు కంటి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మాత్రమే కాకుండా.. మధుమేహ వ్యాధిగ్రస్తులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, ఈ మధ్యనే  కంటి శస్త్రచికిత్స చేయించుకున్న వారు కంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాకాలంలో కళ్లను ఎలా కాపాడుకోవాలి? చేతులను సబ్బు ,  నీటితో బాగా కడుక్కోవాలి. మురికి చేతులతో  కళ్ళను తాకకూడదు. బయటి నుండి వచ్చిన తర్వాత  ముఖాన్ని, చేతులను బాగా శుభ్రం చేసుకోవాలి.  కళ్ళలోకి దుమ్ము లేదా మురికి నీరు వెళితే, వాటిని శుభ్రమైన నీటితో కడగాలి. తువ్వాళ్లు, చేతి రుమాళ్లు లేదా దిండులను సెల్ఫ్ గా ఉంచుకోవడం, సెల్ఫ్ గా వాడుకోవడం మంచిది. ఇతరులకు ఇవ్వడం లేదా ఇతరులవి వాడటం మంచిది కాదు. కంటి అలంకరణ వస్తువులైన కాటుక,  ఐ లాషెస్,  ఐ లైనర్ వంటివి ఇతరులకు ఇవ్వడం, ఇతరులవి తీసుకోవడం మంచిది కాదు.  ఇన్ఫెక్షన్ సోకినట్లయితే కళ్లను అలంకరించుకోవడం మానెయ్యాలి. కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు.. వర్షాకాలంలో కాంటాక్ట్ లెన్స్ ధరించేవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వాటిని పెట్టుకునే ముందు  చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లెన్స్‌లను గానీ, వాటి కేస్‌ను గానీ కుళాయి నీటితో ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. కళ్ళు ఎర్రబడటం, నొప్పి లేదా చీము కారడం వంటివి కనిపిస్తే, వెంటనే  లెన్స్‌లను తీసివేసి, వైద్యుడిని సంప్రదించాలి. ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు లెన్స్‌లు ధరించడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రమవుతుంది. కంటి ఇన్ఫెక్షన్ వస్తే ఏం చేయాలి?  కళ్ళు ఎర్రబడినా లేదా నీరు కారుతున్నా, మొదటగా  వాటిని పదేపదే రుద్దడం ఆపాలి. శుభ్రమైన దూదితో లేదా మెత్తని గుడ్డతో వాటిని శుభ్రం చేసుకోవాలి. తక్కువ మంట లేదా వాపు ఉంటే చల్లటి కాపడం ఉపశమనాన్ని ఇస్తుంది.  డాక్టర్ రికమెండ్  చేస్తే కృత్రిమ ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా డాక్టర్‌ను సంప్రదించకుండా యాంటీబయాటిక్ లేదా స్టెరాయిడ్ కంటి చుక్కలను ఉపయోగించకూడదు. అన్ని రకాల ఇన్ఫెక్షన్లకు చికిత్స ఒకేలా ఉండదు. కానీ సొంత ప్రయోగాలు చేయకుండా వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం.                                *రూపశ్రీ.