LATEST NEWS
ఆంధ్రప్రదేశ్  మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ  అధినేత  జగన్  నిర్వహిస్తున్న ఓదార్పు, పరామర్శ యాత్రలపై రాష్ట్ర ఆఱోగ్య శాఖ మంత్రి అనగాని సత్యకుమార్ ఓ రేంజ్ లో సెటైర్లు గుప్పించారు.  సాధారణంగా ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు బాధితులను పరామర్శించడం సంప్రదాయమేననీ, కానీ వైసీపీ అధినేత జగన్ మాత్రం బాధితులను వదిలేసి నిందితులను పరామర్శిస్తున్నారనీ, ఓదారుస్తున్నారనీ అన్నారు. నిజంగానే నిందితులను పరామర్శించి, ఓదార్చే ఓ విచిత్ర సంస్కృతికి జగన్ తెరలేపారని ఎద్దేవా చేశారు.    ధర్మవరంలో  నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో పాల్గొన్న  మంత్రి.. గత కొన్ని నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్న పరామర్శల తీరు అత్యంత  భిన్నంగా, విడ్డూరంగా ఉందటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏదైనా ప్రాంతంలో అన్యాయం లేదా హింస జరిగినప్పుడు ఆ ఘటనలో  నష్టపోయిన బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించడం, అండగా ఉంటానంటూ భరోసా ఇవ్వడం బాధ్యత కలిగిన నాయకులు చేసే పని అన్న మంత్రి సత్యకుమార్ యాదవ్..  అయితే  వైసీపీ అధినేత  జగన్ మాత్రం బాధితుల వేదనను,   కష్టాలను ఇసుమంతైనా పట్టించుకోకుండా, అక్రమాలకు పాల్పడిన నిందితుల వద్దకు వెళ్లి వారిని పరామర్శిస్తూ, ఓదార్చడం వింతగా విడ్డూరంగా ఉందన్నారు. అక్రమాలకు పాల్పడండి అండగా ఉంటానంటూ జగన్ నిందితులకు భరోసా ఇస్తున్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. మంత్రి సత్యకుమార్ జగన్ పరామర్శల తీరును ఎండగడుతూ సంధించిన వ్యంగ్యాస్త్రాలతో  సభా ప్రాంగణమంతా నవ్వులతో మార్మోగిపోయింది.   సత్యకుమార్ ప్రసంగం వీడియోలు సామాజిక మాధ్యమ వేదికలలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.   మొత్తానికి ధర్మవరం చేనేత దినోత్సవ సభ వేదికగా జగన్ పరామర్శల తీరుపై మంత్రి సత్యకుమార్ చేసిన సెటైర్లు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపాయి. ప్రజా సమస్యలు, నిజమైన బాధితుల వేదన కంటే రాజకీయం చేసేందుకు ప్రతిపక్షం ఆరాటపడుతోందనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఈ వ్యాఖ్యలు తోడ్పడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తులోనూ పరామర్శలు, రాజకీయ పర్యటనల చుట్టూ అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత శృతిమించే అవకాశం ఉంది. Satya Kumar Yadav, YS Jagan Mohan Reddy, Satya Kumar Comments on Jagan, Dharmavaram Handloom Day, AP Political News TeluguOne
తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతోంది. పార్టీ వ్యవహారాలపై చంద్రబాబు దృష్టి పెట్టడం లేదా? కొందరు పార్టీ విషయాలు చంద్రబాబు వరకూ చేరకుండా చక్రం తిప్పుతున్నారా అన్న అనుమానాలు వెల్లువెత్తున్నాయి. విజయా డెయిరీ ఎన్నికల్లో  చోటు చేసుకున్న పరిణామాలు తెలుగుదేశం పార్టీలో సంచలనానికి కారణమయ్యాయి.  ఈ పరిణామాల పట్ల పార్టీ శ్రేణుల్లోనూ తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం అవుతోంది. విషయమేంటంటే.. విజయా డెయిరీ  ఎన్నికలలో చైర్మన్‌గా చలసాని ఆంజనేయులు ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు. అయితే ఆ ఎన్నిక జరిగిన గంటల వ్యవధిలోనే  ఆయనపై రాజీనామా చేయాలంటూ తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి.  ఈ ఉదంతం  తెలుగుదేశం పార్టీలోనూ, పాడి రైతుల్లోనూ కూడా హాట్ టాపిక్ గా మారింది.  తాజాగా జరిగిన ఎన్నికలలో మొత్తం 15 మంది డైరెక్టర్లలో ఖాళీ అయిన మూడు స్థానాలకు చలసాని ఆంజనేయులు, పల్లాగాని రాంబాబు, గొంది నరేంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ వెంటనే నిర్వహించిన చైర్మన్ ఎన్నికలో డైరెక్టర్లందరూ కలిసి చలసాని ఆంజనేయులను విజయ డెయిరీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా  ఎన్నుకున్నారు. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.  అయితే..  ఎన్నిక ముగిసిన వెంటనే నాటకీయ పరిణామాలు మొదలయ్యాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి చలసాని ఆంజనేయులతో భేటీ అయి చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అధిష్టానం ఆదేశించినట్లు తెలిపారు. పార్టీయా,   చైర్మన్ పదవా తేల్చుకోవాలంటూ అల్టిమేటమ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ  పరిణామంలో  మనస్తాపానికి గురైన చలసాని ఆంజనేయులు  అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. అసలు ఆయనను రాజీనామా చేయాలంటూ తెలుగుదేశం హైకమాండ్ ఒత్తిడి తీసుకురావడానికి  గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సహా పలువురు తెలుగుదేశం నేతలు  చలసాని ఎన్నికను వ్యతిరేకించడమేనంటున్నారు.  విజయాడెయిరీ చైర్మన్ గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించిన వెంటనే.. ఆయనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే విధంగా ఎమ్మెల్యే ఆయన వర్గీయులు చేసిన ప్రయత్నాలను మెజారిటీ డైరక్టర్లు వ్యతిరేకించి..   ఏకగ్రీవంగా ఎన్నుకున్నరోజు నో కాన్ఫిడెన్స్ మోషన్ ఎమిటని నిలదీసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే.. పార్టీ హైకమాండ్ చలసాని రాజీనామాకు ఒత్తిడి చేయడం పార్టీలో సంచలనంగా మారింది.   దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో  క్రియాశీలంగా పనిచేస్తున్న  సీనియర్ నేత చలసానికి సొంత పార్టీ నుంచే ఈ స్థాయి ఒత్తిడి రావడం వెనుక కృష్ణా జిల్లా పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలే కారణమని పరిశీలకులు అంటున్నారు.  ఎన్టీఆర్ తెచ్చిన మాక్స్  చట్టం కింద స్వతంత్రంగా నడుస్తున్న ఈ డెయిరీలో ప్రభుత్వ జోక్యానికి తావు లేకపోయినా. . చలసానిపై ఈ స్థాయిలో రాజీనామాకు ఒత్తడి రావడం పట్ల పాడి రైతులు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  1200 కోట్ల రూపాయల  టర్నోవర్‌తో పాడి రైతులకు ఏటా మూడుసార్లు బోనస్ ఇస్తూ లాభాల్లో నడుస్తున్న విజయ డెయిరీలో   రాజకీయ వివాదాలు సంస్థ భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.  ప్రజాస్వామ్యంగా బద్ధంగా ఎన్నుకున్న చైర్మన్ ను ఒక్క రోజులోనే రాజానామాకు ఒత్తిడి రావడం కలకలం రేపుతోంది. ఈ వ్యవహారం తెలుగుదేశం వర్గీయులలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మూడు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా వ్యవహరిస్తున్న నేతకు ఈ స్థాయిలో అవమానాలు ఎదురౌతుండటంతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసే ఇదంతా జరుగుతున్నాయా అన్న అనుమానాలు పార్టీ నేతలు, శ్రేణుల్లోనే వ్యక్తం అవుతున్నాయి.   అదలా ఉంటే.. ఈ పరిస్థితుల్లోనూ చలసాని  పార్టీ హైకమాండ్ ఆదేశాలకు కట్టుబడి తన పదవికి రాజీనామా చేయడం.. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధతకు అద్దంపడుతోందని అంటున్నారు.   పార్టీ అధిష్ఠానం ఆదేశాలను శిరసావహిస్తూ తాను విజయడెయిరీ న ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన చలసాని   పదవుల కంటే పార్టీ ప్రయోజనాలు, క్రమశిక్షణ, పార్టీ నాయకత్వ ఆదేశాలను అమలు చేయడమే తనకు ముఖ్యమని చలసాని ఈ సందర్భంగా పేర్కొన్నారు.  మొత్తంగా ఈ వ్యవహారం తెలుగుదేశం శ్రేణులకే పార్టీ నాయకత్వం తీరుపట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేలా చేసిందని పరిశీలకులు అంటున్నారు.  Vijaya Dairy Chairman Election, Chalasani Anjaneyulu, Krishna Milk Union, Yarlagadda Venkata Rao, Kollu Ravindra Kolusu Parthasarathy, halasani Resigb
విజయవాడ సెంట్రల్ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు రాజకీయ ప్రయాణంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. ఇటీవల  ముద్రగడ పద్మనాభం సంతాప సభలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి వేదికను పంచుకోవడం తీవ్ర రాజకీయ చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో ఆయన  ఆత్మీయంగా మెలగడానికి సంబంధించిన  దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  దీంతో బోండా ఉమా పార్టీ మారుతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. బోండా ఉమా తీరును సీరియస్ గా పరిగణించిన తెలుగుదేశం అధిష్ఠానం కూడా ఆయనను వివరణ కోరింది.   అంతే కాకుండా.. తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, జాతీయ ప్రధాన కార్యదర్శి కిలారు రాజేష్, నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడులతో  కూడిన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరై తన వైఖరిని స్పష్టం చేయాలని బోండాకు నోటీసులు పంపింది.   అయితే తనపై వస్తున్న ప్రచారాన్ని, ఆరోపణలను బోండా ఉమా తీవ్రంగా ఖండించారు. తాను వైసీపీ  కార్యక్రమంలోనూ పాల్గొనలేదని, అది ఏ రాజకీయ పార్టీకీ సంబంధం లేని   కార్యక్రమని స్పష్టం చేశారు. గుంటూరులో జనసేన మాజీ  నాయకుడు దాసరి రాము ఏర్పాటు చేసిన సంతాప సభకు మాత్రమే తాను హాజరయ్యానని తెలిపారు. ఆ వేదికపై కాకతాళీయంగా  అంబటి రాంబాబు కలవడంతో   మర్యాదపూర్వకంగా  పలకరించి మాట్లాడానని ఆయన వివరణ ఇచ్చారు.     ఈ మొత్తం వ్యవహారంతో వైసీపీ విజయవాడకు చెందిన కీలక నాయకుడు తమ గూటికి చేరడం ఖాయమన్న భావనకు వచ్చింది. ఆ నేపథ్యంలోనే   వైసీపీలోని కాపు సామాజికవర్గానికి చెందిన నేతలు  అంబటి రాంబాబు, పేర్ని నాని  మీడియా ముందుకొచ్చి బోండా ఉమా మద్దతుగా గళమెత్తారు. అయితే.. తాజాగా   వైసీపీ నిరసనలను ప్రశ్నిస్తూ ఆ పార్టీ నేతలను బోండా ఉమా గట్టిగా నిలదీయడంతో  వైసీపీ ఆశలు నీరుగారిపోయాయి. అంతకు ముందే బోండా ఉమా పార్టీ మారే ఉద్దేశం లేదంటూ స్పష్టత నిచ్చారు. తాజాగా విజయవాడలో  మెగా డీఎస్సీ లో అక్రమాలు అంటూ మల్లాది విష్ణు నేతృత్వంలో వైసీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష లో మంత్రి నారా లోకేష్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, లోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ వినిపించారు. దీనితో బోండా తన నియోజకవర్గం లో అధికారుల అనుమతి లేకుండా వైసీపీ చేస్తున్న ఈ నిరసన దీక్షలను నిలువరించే ప్రయత్నం చేశారు. అనుమతుల్లేని  అనధికారిక దీక్షల వల్ల   స్థానిక ప్రజలు ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కుంటున్నారని, వెంటనే వైసీపీ నేతలు తమ దీక్షలు విరమించాలని బోండా   వైసీపీ కి వ్యతిరేకంగా గట్టిగా గళం విప్పారు.  ఈ ఘటన తరువాత వైసీపీయుల స్వరం మారింది. అంతకు ముందు వరకూ బోండాకు మద్దతుగా గళమెత్తిన వైసీపీ... ఆ తరువాత.. బోండా ఉమా టార్గెట్ గా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పింింది. తాము శాంతియుతంగా  చేపట్టిన నిరాహారదీక్షను బోండా  భగ్నం చేసారంటూ   పేర్ని నాని విమర్శలు గుప్పించారు. ఒక విధంగా బోండా ఉమ   ప్రజాస్వామ్యం మీద  దాడి చేశారని దుయ్యబట్టారు. దీనితో బోండా ఉమా  విషయంలో వైసీపీ ఆశలు ఆవిరయ్యాయనీ, అందుకే ఆయన టార్గెట్ గా ఫ్యాన్ పార్టీ విమర్శలకు పదును పెట్టిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బోండా ఉమా ఫ్యాన్ గూటికి చేరుతున్నారంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా బోండా చెక్ పెట్టారని అంటున్నారు.   Bonda Uma, Vijayawada Central, TDP leadership, YSRCP, Ambati Rambabu
ప్రజా బలం ముందు ధన బలం తలవంచక తప్పదని మరోసారి రుజువైంది. 2024 ఎన్నికలలో వైసీపీ ధన బలంతో గెలిచేందుకు ప్రయత్నించి ఘోర పరాజయాన్ని మూటగట్టుకోగా,  ప్రజాబలంతో బరిలో నిలిచిన తెలుగుదేశం ఘన విజయం సాధించింది.  ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు, గణాంకాలను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన ఆర్థిక విశ్లేషణ నివేదిక ప్రస్ఫుటంగా తేల్చింది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల ఆదాయ, వ్యయాలకు సంబంధించిన వివరాలను ఏడీఆర్ నివేదిక బయటపెట్టింది.    ఏడీఆర్  నివేదిక మేరకు   దేశంలోని ప్రాంతీయ పార్టీల ఆదాయంలో తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఆర్థిక సంవత్సరానికి  తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఆదాయం  228.31 కోట్ల రూపాయలు.  ఇది   దేశవ్యాప్తంగా   36 ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయంలో దాదాపు 19 శాతం. తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆదాయంలో సభ్యత్వ రుసుములు, పార్టీ చందాలు,  బ్యాంక్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ ప్రధాన వనరులుగా నిలిచాయి. అయితే.. ఎన్నికల  ఖర్చుల విషయానికి వస్తే వైసీపీ దేశంలోనే అత్యధికంగా వ్యయం చేసిన ప్రాంతీయ పార్టీగా నిలిచింది. ఆ  ఆర్థిక సంవత్సరంలో వైసీపీ  ఆదాయం 140.4 కోట్ల రూపాయలు కాగా, చేసిన వ్యయం 340.2 కోట్ల రూపాయలు. తమ వార్షిక రాబడి కంటే 142 శాతం అదనంగా, అంటే  దాదాపు  199.8 కోట్ల మేర ఎక్కువ వ్యయం చేసింది. ఈ మొత్తం వ్యయంలో  ఆ పార్టీ  300 కోట్ల రూపాయలకు  పైగా కేవలం ఎన్నికల ప్రచారానికే కేటాయించింది.  దీనికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ  క్రమశిక్షణతో వ్యయం చేసింది. పార్టీకి వచ్చిన  228.31 కోట్లరూపాయల  ఆదాయంలో తెలుగుదేశం  61.33 కోట్ల రూపాయలు   ఖర్చు చేసింది. ఇందులో ఎన్నికల వ్యయం  31.73 కోట్ల రూపాయలు.   ఆదాయంలో ఏకంగా 73 శాతానికి పైగా..  అంటే  167 కోట్ల రూపాయలను  మిగులు నిధిగా భద్రపరుచుకుంది. ఇదే సమయంలో పొత్తులో ఉన్న జనసేన పార్టీ రూ.64.1 కోట్ల ఆదాయాన్ని, రూ.56.9 కోట్ల వ్యయాన్ని చూపించింది. ఏడీఆర్ నివేదికను ఉటంకిస్తూ.. కేవలం ప్రకటనలు, ప్రచార ఆర్భాటాలకు వందల కోట్లు గుమ్మరించినంత మాత్రాన ఓటర్లను ఆకట్టుకోవడం సాధ్యం కాదని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  వైఎస్సార్‌సీపీ  340 కోట్లకు పైగా వెచ్చించి భారీగా ఎన్నికలలో విజయం కోసం ఖర్చు చేసినప్పటికీ,  ఆ పార్టీ 2024 ఎన్నికలలో గెలిచినది కేవలం 11 స్థానాలలో మాత్రమే.  అదే సమయంలో పరిమిత వ్యయంతోనే   ప్రజాక్షేత్రంలోకి వెళ్లిన తెలుగుదేశం కూటమికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తెలుగుదేశం పార్టీ 2024 ఎన్నికలలో   135 స్థానాల్లో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.   మొత్తానికి  ధనబలం కంటే ప్రజాబలమే పార్టీల విజయానికి కీలకమని అని ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు,  ఏడీఆర్  నివేదిక కూడా ప్రస్ఫుటంగా తేల్చిచెప్పాయి.   ADR Report Andhra Pradesh, TDP Election Funds, YSRCP Campaign Expenditure, AP Assembly Elections 2024, Political Party Income, TeluguOne
లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించ తలపెట్టిన ఛాత్రోన్ కీ గూంజ్  (విద్యార్థుల గళం) సదస్సుకు లైన్ క్లియర్ అయ్యింది.  సభా వేదికకు సంబంధించి ఇచ్చిన అనుమతిని ఆ తరువాత అకస్మాత్తుగా ఉప సంహరించుకున్న  కాయస్థ పాఠశాల  ట్రస్ట్, దీనిపై సర్వత్రా నిరసనలు, విమర్శలు వెల్లువెత్తడంతో  అనివార్యంగా వెనక్కు తగ్గి అనుమతిని పునరుద్ధరిస్తూ గురువారం (ఆగస్టు 6) రాత్రి పొద్దుపోయిన తరువాత ప్రకటన విడుదల చేసింది. అయితే  కొన్ని షరతులు విధించింది.   దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను వేధిస్తున్న  ప్రశ్నాపత్రాల లీకేజీలు,  నిరుద్యోగం, యువత భవిష్యత్తుపై రాహుల్ గాంధీ ప్రత్యక్షంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించేందుకు ఉద్దేశించిన ఈ సదస్సు ఈనెల 8న. ప్రయాగ్‌రాజ్‌లోని ప్రసిద్ధ కేపీ కాలేజీ మైదానంలో నిర్వహించేందుకు కాంగ్రెస్ భారీ ఏర్పాట్లు చేసింది. ఇందుకు కేపీ ట్రస్ట్ అనుమతి కూడా ఇచ్చింది. అయితే.. అనూహ్యంగా.. కేపీ ట్రస్ట్ బుధవారం ( ఆగస్టు 5)     సభకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించరుకుంటున్నట్లు తెలిపింది.  రాహుల్ గాంధీ నేరుగా విద్యార్థుల సమస్యలపై గళమెత్తితే  ప్రభుత్వ  వైఫల్యాలు బయటపడతాయన్న భయంతోనే కేంద్రంలోని మోడీ సర్కార్, యూపీలోని బీజేపీ ప్రభుత్వం..   ట్రస్ట్ యాజమాన్యంపై   ఒత్తిడి తెచ్చి సభకు అనుమతి రద్దు చేయించాయన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. వేదిక అనుమతి రద్దయినా..  మైదానాలు మారినా రాహుల్ గాంధీ ప్రయాగ్‌రాజ్ పర్యటన  రద్దు కాదనీ, నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే  జరుగుతుందనీ కాంగ్రెస్ ప్రకటించింది.   రాహుల్ సభకు అనుమతి రద్దు చేస్తూ కేపీ ట్రస్ నిర్ణయం పట్ల సర్వత్రా ఆగ్రహం, విమర్శలు రావడంతో..  ఆ ట్రస్ట్ తాత్కాలిక అధ్యక్షుడు జితేంద్ర నాథ్ చౌదరి హైకోర్టు సీనియర్ న్యాయవాదులతో   సంప్రదింపులు జరిపి.. సభకు అనుమతిని పునరుద్ధరించారు. అయితే..   ఈ సభ వల్ల కాలేజీలో జరిగే  తరగతులకు ఎలాంటి ఆటంకం, భంగం కలగకూడదనీ,   ప్రయాగ్‌రాజ్ జిల్లా మేజిస్ట్రేట్  నుంచి కాంగ్రెస్ నాయకత్వం తప్పనిసరిగా చట్టబద్ధమైన   అనుమతి తీసుకోవాలని షరతులు విధించారు.   Rahul Gandhi Prayagraj Meeting, Chatron Ki Goonj, KP Ground Permission, Congress Student Rally, UP Politics News, Rahul Gandhi Student Interaction
ALSO ON TELUGUONE N E W S
  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నిన్న వరల్డ్ వైడ్ గా 'కొరియన్ కనకరాజు' గా ల్యాండ్ అయ్యాడు.ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకుల హడావిడి థియేటర్స్ దగ్గర బాగానే కనపడుతుంది. మరి ఈ చిత్రం మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ వివరాలు చూద్దాం.  చిత్రబృందం అందించిన అధికారిక సమాచారం ప్రకారం, 'కొరియన్ కనకరాజు' ప్రీమియర్స్ తో కలుపుకొని వరల్డ్ వైడ్ గా 18 కోట్ల గ్రాస్ వసూలు వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఇండియాలో  4.50 కోట్లు కాగా ఏపి, తెలంగాణ నుంచే అత్యధికంగా  4 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇక ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే, కర్ణాటకలో రూ. 43 లక్షలు, తమిళనాడులో 5 లక్షలు, ఇతర ప్రాంతాలలో మరో 2 లక్షలు సాధించింది. ; ఓవర్సీస్ విషయానికి వస్తే  తొలిరోజే 2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. వరుణ్ కెరీర్ లోనే ఇది హయ్యెస్ట్ అని చెప్పవచ్చు.  ఆక్యుపెన్సీ విషయానికి వస్తే  శుక్రవారం నాడు 41% ఆక్యుపెన్సీ నమోదవ్వగా, షో, షో కి గ్రాఫ్ గణనీయంగా పెరిగింది. ఉదయం షోలకి  27.83% నమోదు కాగా, మధ్యాహ్నం 38.25%, సాయంత్రం 38.33% ,నైట్ షోలకి  అత్యధికంగా 57.42% ఆక్యుపెన్సీ నమోదు కావడం విశేషం. వీకెండ్ కావడంతో వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులని తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు.  అనంతపురం జిల్లా పెనుగొండలో ఉండే కనకరాజుకి కొరియా దేశంలో చనిపోయిన గ్యాంగ్ స్టార్ ఆత్మకి మధ్య ఉండే సంబంధం ఏంటనేదే కొరియన్ కనకరాజు కథ.  రితిక నాయక్ హీరోయిన్ గా కనిపించగా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ,యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కి థియేటర్స్ దద్దరిల్లుతున్నాయి. మేర్లపాక గాంధీ దర్శకుడు. Korean Kanakaraju, varun Tej, Rithika Nayak
వర్టికల్ స్టోరీస్‌లో చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ ఓ ట్రెండ్ క్రియేట్ చేశారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ ట్రెండ్ అవుతోంది. ఈ సిరీస్ సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న తరుణంలో హీరో దొరసాయి తేజ తన జర్నీ గురించి కొన్ని విశేషాల్ని పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులేంటో ఓ సారి చూద్దాం. మీ సినీ జర్నీ గురించి చెప్పండి?  ప్రభాస్ గారి ‘అడవి రాముడు’ సినిమాలో హీరో చిన్నప్పటి చైల్డ్‌ కారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పాను. ‘కొత్తబంగారులోకం’, ‘హై స్కూల్’ అనే సిరీస్‌లో నటించాను. ‘అలా మొదలైంది’ సినిమాలోనూ ఓ చిన్న పాత్రను పోషించాను. 2016 నుంచి ఆర్జీవీ గారి అనుబంధం ఏర్పడింది. ‘శ్రీదేవీ’ అనే ఓ విడుదల కాని సినిమాలో నటించాను. అక్కడే నాకు సినిమా పరిచయమైంది. అలా 2018లో యూట్యూబ్ జర్నీ సీరియస్‌గా ప్రారంభమైంది. ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్‌తో మంచి గుర్తింపు వచ్చింది. అలా సిరీస్‌లు చేసుకుంటూ వచ్చాను. గత ఏడాది సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీ ప్రారంభించాను. రీసెంట్‌గా మళ్లీ ‘దందా’తో సక్సెస్ వచ్చింది. ఇంత చిన్న వయసులోనే వ్యాపారస్థుడిగా, నటుడిగా, కంటెంట్ క్రియేటర్‌గా సక్సెస్ సాధించడం ఎలా అనిపిస్తుంది?  నేను నిద్ర లేచిన క్షణం నుంచి ఒక కంటెంట్ క్రియేటర్‌గా, డైరెక్టర్‌గా, యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఆలోచిస్తూనే ఉంటాను. నన్ను నేను కొత్తగా పరిచయం చేసుకోడానికి ఇదొక మార్గం. అందుకే అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నాను. కంటెంట్ క్రియేషన్ అనేది నా బిజినెస్. సినిమా అనేది నా ప్యాషన్. రెండూ కలిపితే దొర సాయి తేజ. మీకు పార్టీలు చేసుకోవాలని, ఎంజాయ్ చేయాలని అనిపించదా?  ప్రతీ విషయాన్ని నేనే నేర్చుకోవాలి. నాకు నేనుగానే అన్నీ నేర్చుకుంటాను. పడిపోయినప్పుడు ఓ కొత్త గుణపాఠం నేర్చుకుంటాను. నేను ఎప్పుడూ నా వయసు కంటే ఓ ఐదేళ్లు పెద్దవాడిలానే ఆలోచిస్తా. రోజంతా నాకు పనులే ఉంటాయి. ఇతర పనులకు నాకు టైం ఉండదు. ప్రతీ రోజూ ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేయాలని ఆలోచిస్తుంటాను. సోషల్ మీడియాలో వచ్చే ప్రశంసలు, విమర్శల్ని ఎలా తీసుకుంటారు?  సోషల్ మీడియాలో అన్నీ ఉంటాయి. ప్రతీ వీడియోకి కొన్ని కొత్త ప్రశంసలు, కొన్ని తిట్లు వస్తుంటాయి. ఈ కంటెంట్ క్రియేషన్ అనే దాన్ని నేను ఒక బ్రిడ్జ్‌లా వాడతాను. ఇక్కడ నా కోసం ఉండే ఫాలోయింగ్‌ని సినిమా థియేటర్ వరకు తీసుకు రావాలని అనుకుంటున్నాను. అయితే కంటెంట్ క్రియేషన్స్‌లోనే మా రోజువారి ఖర్చులు తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ ఫ్లూయెన్సర్, కంటెంట్ క్రియేటర్ అనే మాట కంటే.. నటుడు అని పిలిపించుకోవాలని నాకు ఉంటుంది. సోషల్ మీడియా లైఫ్, ఈ క్రియేటర్ స్పేస్ గురించి కొత్తగా వచ్చేవాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏంటి?  కొద్దిగా ఫాలోవర్లు, లైకులు, షేర్లు కనిపించాయంటే చాలు, చూసే జనాలంతా అబ్బా 'లైఫ్ అంటే వీడిది రా' అనుకుంటారు. కానీ అది నిజం కాదు, వైకుంఠపాళీ లాగా నిచ్చెనెక్కిచ్చేది అదే, ఏదైనా తేడా కొడితే క్రింద పడేసేది అదే. చూడటానికి అందంగా ఫ్యాన్సీగా కనిపిస్తుంది, వ్యూస్ & రీచ్ కోసం ఒకటి చెప్తే ఇంకో టైటిల్ పెట్టి, తంబ్‌నెయిల్ మార్ఫ్ చేసి వాళ్ళ ప్రయోజనాల కోసం జీవితాలు నాశనం చేసే వాళ్ళూ ఉన్నారు. సో దీంట్లోకి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ప్రశంసకీ విమర్శకీ రెండింటికి సిద్ధంగా ఉండాలి. అలా అయితేనే ఈ స్పేస్‌లో సర్వైవ్ అవ్వగలరు. అరవింద్ పాత్రకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మిమ్మల్ని విమర్శించే వారు కూడా పొగిడేస్తున్నారు కదా?  కంటెంట్ క్రియేషన్స్‌లో ఒకే రకమైన పాత్రను పోషించగలను. కానీ సిరీస్, సినిమా వరకు వచ్చే సరికి రకరకాల పాత్రలను పోషించే అవకాశం వస్తుంది. నేను ‘దందా’లో అరవింద్‌గా మాత్రమే కనిపిస్తాను. ఇలాంటి ఛాలెంజింగ్ పాత్రలే రావాలని ఇన్నాళ్లు కోరుకున్నాను. ఇదంతా మా దర్శకుడి వల్లే సాధ్యమైంది. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి మీ గురించి ఎంతో గొప్పగా చెప్పారు?.. మీరు నిజంగానే సింగిల్ టేక్ ఆర్టిస్టా?  నాకు మానిటర్ చూసే అలవాటు ఉండదు. కెమెరామెన్‌ని చూస్తేనే విషయం తెలుస్తుంది. ఫస్ట్ టేక్‌లోనే సీన్‌ను పూర్తి చేయాలని అనుకుంటాను. అందుకే ఒక సీన్ ఉంటే.. దానికి ముందు, తర్వాత సీన్లు ఏంటన్నది కూడా చూసుకుంటాను. అందుకే దాదాపు అన్నీ కూడా సింగిల్ టేక్‌లోనే చేసేస్తాను. టేక్స్ ఎక్కువ అయితే ప్రొడక్షన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. సెట్‌లో ఉన్నంత సేపు నేను అరవింద్ పాత్రలోనే ఉండాలని నిర్ణయించుకున్నాను. అందుకే సింగిల్ టేక్‌లోనే చేసేశాను. ప్రస్తుతం ఉన్న మార్కెటింగ్ స్ట్రాటజీ గురించి మీ అభిప్రాయం ఏంటి?  కంటెంట్ ఎంత బాగున్నా.. మన దగ్గర ఉన్న కంటెంట్ గురించి జనాలకు చెప్పే మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోతే వృథానే. అందుకే ఇప్పుడు ప్రమోషన్స్, మార్కెటింగ్ అనేది ఎంతో ముఖ్యంగా మారాయి. ‘దందా’ కోసం నేను కూడా డిఫరెంట్‌గా ప్రమోట్ చేయాలని అనుకున్నాను. అందుకే నా రూ.15 లక్షలు పోయాయి అని మా సిరీస్ కంటెంట్ అర్థమయ్యేలా ఓ ప్రమోషనల్ వీడియో చేశాం. అది అర్థమైంది కాబట్టి.. మా ‘దందా’ని ఆడియెన్స్ బిగ్గెస్ట్ హిట్‌ చేశారు. సోషల్ మీడియాలో మీకోసం నిలబడే మీ ఫ్యాన్స్ గురించి చెప్పండి?  ఇదంతా ఒక్క రోజులో సంపాదించింది కాదు. నేను చేసిన కంటెంట్‌లో వాళ్లని వాళ్లు చూసుకున్నారు. అలా చూసుకుని కనెక్ట్ అయ్యారు. ఇదంతా జరగడానికి కొన్ని ఏళ్లు పడుతుంది. సోషల్ మీడియాలో పాజిటివిటీతో పాటుగా నెగెటివిటీ ఉంటుంది. మాట్లాడేవాళ్లు మాట్లాడుతూనే ఉంటారు. నిజం ఏంటన్నది నాకు తెలుసు. అందుకే నేను ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంటాను. సోషల్ ఇన్‌ఫ్లూయన్సర్ మీద ఎలాంటి బాధ్యత ఉంటుంది? మొన్న కామన్ వెల్త్ గేమ్స్‌లో సాక్షీ చౌదరీ బాక్సింగ్ కేటగిరిలో గోల్డ్ మెడల్ కొట్టేరు, అది ఎంతమందికి తెలుసు? కానీ మీరు ఫాలో అయ్యే ఇన్‌ఫ్లూయన్సర్ ఏం పోస్టు పెట్టేరు ఏం ట్వీట్ చేశారు అనేది మాత్రం ఖచ్చితంగా గుర్తుంటది. సో సెలబ్రిటీస్, స్పోర్ట్స్‌మేన్ కంటే ఎక్కువ జనాలు ఇన్‌ఫ్లూయన్సర్స్‌ని అడ్మైర్ చేస్తారు, వాళ్ళ లుక్స్ అండ్ స్టైల్‌ని బాగా గమనిస్తారు. కాబట్టి ఇన్‌ఫ్లూయన్సర్ ఏం చేసినా, మాట్లాడినా, బట్టలు వేసుకున్నా సరే అది చాలామంది పై ప్రభావం చూపిస్తుంది. సో వాళ్ళు చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి ఖాళీ టైంలో దొర సాయి తేజ ఎలా ఉంటాడు?  నేను కూడా అందరిలో ఒకడినే. కాకపోతే నాకంటూ ఓ దారి క్రియేట్ చేసుకున్నాను. అది నా ఆర్థిక పరిస్థితుల వల్ల కావొచ్చు, చిన్నప్పటి నుంచి నాకున్న ప్యాషన్ వల్ల కావొచ్చు. ఇక ముందు నన్ను అందరూ కొత్తగా చూస్తారు. థియేటర్, ఓటీటీ, సోషల్ మీడియాలో నన్ను చూసి అందరూ గర్వపడేలా చేస్తాను. ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సరే ఆగకుండా పరిగెత్తాలి, నా లక్ష్యాన్ని సాధించాలనే ఫోకస్‌తోనే ఉంటాను. ‘దందా’ టీం గురించి చెప్పండి?  ఆదిత్య గారు వంద శాతం సక్సెస్ అయ్యారు. పేపర్ మీద రాసుకున్నది అవుట్ పుట్‌గా తీసుకు రావడం అన్నది మామూలు విషయం కాదు. ఆ విషయంలో ఆదిత్య అన్నకు ప్రశంసలు వస్తున్నాయి. ‘దందా’ సిరీస్‌కు సంబంధించిన ప్రతీ విషయంలో ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయన విజన్ వల్లే ‘దందా’ యూనిక్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను ఏడు రోజుల్లో, 30 కాల్షీట్స్‌లో పూర్తి చేశాం. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా కష్టపడి పని చేశాం. అదే ‘దందా’కి హైలెట్. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్, మేం ఇలా అందరం సింక్‌లో ఉన్నాం. అందుకే ‘దందా’ అద్భుతంగా వచ్చింది. ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి?  ప్రతీ ఒక్క సాధారణ వ్యక్తి రిలేట్ అయ్యే కథల్ని థియేటర్‌లో చూపించాలని అనుకుంటున్నాను. జీరో టు హీరో అనే పాత్రలను పోషించాలని కోరుకుంటున్నాను. అందరిలోనూ స్పూర్తి నింపే కథల్ని, మంచి సందేశాన్ని ఇచ్చే ప్రాజెక్ట్‌ల్ని చేయాలని అనుకుంటున్నాను. మన చుట్టూ ఉండే కథల్ని, పాత్రల్ని ఎంచుకుంటాను. ప్రేక్షకులు నా కోసం ఖర్చు పెట్టే డబ్బులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను.     Chai Shots, Dhandha Series, Dora Sai Teja, Interview  
హైదరాబాద్ నగరంలో బోనాల వేడుకలు వైభవంగా కొనసాగుతున్న వేళ, సినీ నటి, నిర్మాత నిహారిక కొణిదెల పాతబస్తీ మీరాలం మండిలోని శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో అమ్మవారికి బంగారు బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆమెకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. వేదమంత్రాల నడుమ అమ్మవారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందిన అనంతరం ఆలయ అధికారులు ఆమెను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ గాజుల అంజయ్య నిహారికకు ఆలయ చరిత్రతో పాటు ఆలయ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాల విశిష్టత, సంప్రదాయాలను వివరించారు. అనంతరం నిహారిక మాట్లాడుతూ, ప్రధాన బోనాల రోజు షూటింగ్ ఉండటంతో ఆలయానికి రాలేకపోయానని, అందుకే అమ్మవారి దర్శనానికి వచ్చినట్లు తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగినప్పటికీ, బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని వెళ్లే దృశ్యాలు ఎప్పుడూ తనను ఎంతో ఆకట్టుకునేవని చెప్పారు. కొద్ది రోజుల క్రితమే "నన్ను కూడా ఎవరైనా బోనాలకు తీసుకెళ్తే బాగుండేది" అని సరదాగా అన్నానని, ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరడం అమ్మవారి అనుగ్రహమేనని పేర్కొన్నారు.  "అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత. ఈరోజు దర్శనం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా జరిగింది. అమ్మవారి విగ్రహం దివ్య కాంతులతో అలరించింది. మరోసారి కూడా అమ్మవారి దర్శనం చేసుకునే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను" అని నిహారిక అన్నారు. నిహారిక ఆలయానికి వచ్చిన విషయం తెలుసుకున్న భక్తులు ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపగా, ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.       Niharika Konidela, Bangaru Bonam, Hyderabad Bonalu  
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సెప్టెంబర్ నెల సరికొత్త సమీకరణాలకు వేదికగా మారబోతోంది. విజయ్ దేవరకొండ నటిస్తున్న భారీ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'రణబాలి' విడుదల వాయిదా పడటంతో సెప్టెంబర్ రేసు ఆసక్తికరంగా మారింది. అగ్ర హీరో చిత్రం రేసు నుంచి తప్పుకోవడంతో లభించిన ఆ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి పలు మీడియం రేంజ్ సినిమాలు, విభిన్న కథాంశాలు కలిగిన చిత్రాలు పోటీపడుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 10, 11 తేదీల వీకెండ్‌ను లక్ష్యంగా చేసుకుని ఏకంగా ఐదు చిత్రాలు ఒకేసారి థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. ఒకే వారాంతంలో ఇన్ని సినిమాలు బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో థియేటర్ల కేటాయింపు, పంపిణీ విషయంలో తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఈ భారీ రేసులో కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటించిన 'సర్దార్ 2' ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. తొలి భాగం సూపర్ హిట్ కావడంతో ఈ స్పై థ్రిల్లర్ సీక్వెల్‌పై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. దీంతోపాటు ప్రయోగాత్మక కథాంశంతో వస్తున్న 'మారెమ్మ', సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న 'ఎపిక్' సినిమాలు కూడా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వస్తున్నాయి. వీటితో పాటు పూర్తిస్థాయి వినోదాత్మకంగా తెరకెక్కిన 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' మరియు డివోషనల్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన 'మహేంద్రగిరి వారాహి' చిత్రాలు కూడా అదే వీకెండ్‌లో ప్రేక్షకులను అలరించేందుకు క్యూ కడుతున్నాయి. దీంతో ప్రేక్షకులు దేనికి మొదటి ప్రాధాన్యత ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. పెద్ద సినిమాలు లేని సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న ఈ చిన్న, మీడియం బడ్జెట్ చిత్రాలకు బలమైన ప్రమోషన్లు మాత్రమే బిగ్ ప్లస్ కానున్నాయి. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వీకెండ్‌లో మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉంటుంది కానీ, ఏమాత్రం తేడా కొట్టినా ఆ ప్రభావం కలెక్షన్లపై పడే ప్రమాదం కూడా ఉంది. సోషల్ మీడియాలోనూ ఈ ఐదు సినిమాల పోరుపై విపరీతమైన చర్చ నడుస్తోంది. అటు మల్టీప్లెక్స్‌లు, ఇటు సింగిల్ స్క్రీన్‌ల కేటాయింపులో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాలని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా సెప్టెంబర్ మధ్యలో జరగబోయే ఈ ఐదు చిత్రాల బాక్సాఫీస్ క్లాష్ సినీ ప్రియులకు మాత్రం మంచి ఎంటర్‌టైన్మెంట్ పంచడం ఖాయంగా కనిపిస్తోంది. మరి ఈ రసవత్తర పోరులో విజేతగా నిలిచి బాక్సాఫీస్ వద్ద ఎవరు నిలబడతారో వేచి చూడాల్సిందే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుజీత్ కాంబినేషన్ అనౌన్స్ అయినప్పటి నుంచే 'ఓజీ' పై ఇండస్ట్రీలో ఎనలేని హైప్ నెలకొంది. తొలి భాగం గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకోవడంతో, దానికి సంబంధించిన సీక్వెల్ 'ఓజీ 2' కోసం మెగా అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా సీక్వెల్‌కు సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్ టాలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ సుజీత్ 'ఓజీ 2' కథకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను ఇప్పటికే పూర్తిగా లాక్ చేశారట. మొదటి భాగాన్ని మించేలా భారీ యాక్షన్ సీన్స్, ఆకట్టుకునే ట్విస్టులతో సీక్వెల్ లైన్‌ను అత్యంత ఆసక్తికరంగా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ కథ విన్న పవన్ కళ్యాణ్ కూడా ఎంతో ఇంప్రెస్ అయ్యారని టాక్. అయితే ఇక్కడే అభిమానులకు ఒక చిన్న నిరాశ కలిగించే ట్విస్ట్ ఎదురైంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన ప్రజాసేవ, రాజకీయ బాధ్యతలతో పాటు ఇతర కమిట్‌మెంట్స్‌తో బిజీగా ఉన్నారు. ఈ కారణంతో 'ఓజీ 2' సెట్స్‌పైకి వెళ్లడానికి కాస్త సమయం పట్టేలా కనిపిస్తోంది. వచ్చే ఏడాది (2027) వేసవి తర్వాతే ఈ మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ చిత్రీకరణ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈలోగా దర్శకుడు సుజీత్ తన తదుపరి ప్రాజెక్ట్‌పై దృష్టి సారించనున్నారు. ప్రస్తుతం సుజీత్ నేచురల్ స్టార్ నాని కాంబినేషన్‌లో 'బ్లడీ రోమియో' అనే క్రేజీ ప్రాజెక్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ అందుబాటులోకి వచ్చేలోపే ఈ సినిమా షూటింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు. ఆ తర్వాతే పూర్తి స్థాయిలో పవర్ స్టార్ సీక్వెల్ షూట్‌లో అడుగుపెట్టనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబోలో రావాల్సిన సినిమాపై కూడా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం హోల్డ్‌లో పడినట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ సూచించిన మార్పుల ప్రకారం సురేందర్ రెడ్డి కథపై మళ్లీ కసరత్తులు చేస్తున్నారని, స్క్రిప్ట్ పూర్తిగా ఆమోదం పొందాకే ఆ సినిమాపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక 'ఓజీ 2' అప్‌డేట్ కోసం కళ్లు కాయలు కాచేలా చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ కోసం మేకర్స్ ఒక సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారట. వచ్చే సెప్టెంబర్‌లో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సీక్వెల్‌కు సంబంధించిన ఒక అధికారిక లేదా ప్రత్యేక ప్రకటన విడుదల చేసేందుకు సుజీత్ అండ్ టీమ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ గ్యాప్ కాస్త ఎక్కువగానే ఉన్నప్పటికీ, సుజీత్ విజన్ పై పవన్ అభిమానులకు గట్టి నమ్మకం ఉంది. స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమవడంతో బాక్సాఫీస్ వద్ద 'ఓజీ 2' సరికొత్త రికార్డులను తిరగరాయడం ఖాయమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. సెప్టెంబర్ బర్త్‌డే గిఫ్ట్‌తో మేకర్స్ ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తారో చూడాలి!
అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్'. థియేటర్లలో తన రన్ పూర్త చేసుకున్న ఈ సినిమా, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై అలరించేందుకు సిద్ధమైంది. అనుకున్నట్లుగానే ప్రముఖ ప్రముఖ ఓటీటీ సంస్థ ZEE5 లో ఈ చిత్రం ఈ రోజు నుండి అధికారికంగా స్ట్రీమింగ్ కావడం ప్రారంభమైంది. అయితే ఈ డిజిటల్ ప్రీమియర్ ప్రస్తుతం కేవలం తెలుగు భాషలో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ZEE5 సంస్థ గతంలోనే ఒక ఆసక్తికర ప్రకటన చేసింది. ఆగస్టు 7 నుండి 'లెనిన్' సినిమాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం వంటి నాలుగు ప్రధాన దక్షిణాది భాషలలో ఒకేసారి స్ట్రీమింగ్ చేస్తామని ప్రకటించి అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ పెంచింది. కానీ ఊహించని విధంగా స్ట్రీమింగ్ మొదలైన సమయానికి కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై ప్రసారమవుతోంది. తెలుగు వెర్షన్ మాత్రమే విడుదల కావడం, ఇతర భాషల వెర్షన్లు కనిపించకపోవడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటనే దానిపై ఇప్పటివరకు ZEE5 సంస్థ కానీ, 'లెనిన్' చిత్ర నిర్మాతలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. డబ్బింగ్ ఆలస్యం కారణం అయ్యుంటుంది అంటున్నారు. ఏది ఏమైనా తెలుగులో ఓటీటీ అందుబాటులోకి వచ్చిన లెనిన్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ.. ఓటీటీలోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేసేలా ఉంది.     Akhil Akkineni, Lenin Movie, OTT   
  మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, రితికా నాయక్, సత్య,ప్రస్తుతం ఇండో కొరియన్ హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు' తో థియేటర్స్ లో సందడి చేస్తున్నారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కగా మూవీ చుట్టూ  ఊహించని వివాదం ముసురుకుంది. సినిమాలో కమెడియన్ సత్య చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ ఓల్డ్ డైలాగ్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారానికి దారితీసింది. నందమూరి అభిమానులు ఈ సన్నివేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో, స్వయంగా కథానాయకుడు వరుణ్ తేజ్ ఈ అంశంపై మీడియా వేదికగా స్పందించి పూర్తి వివరణ ఇచ్చారు.  రీసెంట్ గా యువీ క్రియేషన్స్ ఆఫీస్‌లో జరిగిన సినిమా సక్సెస్ వేడుకలో వరుణ్ తేజ్ ఈ వివాదానికి చెక్ పెట్టారు. "మాకు సీనియర్ ఎన్టీఆర్ గారన్నా, నందమూరి కుటుంబమన్నా అత్యంత గౌరవం ఉంది. ఎవరినీ కించపరచాలనే ఆలోచన మాకు ఎప్పుడూ లేదు. సోషల్ మీడియాలో ట్రోల్స్ రాకముందే, అంటే దాదాపు 9 నెలల క్రితం 2025 నవంబర్‌లోనే మేము ఈ సన్నివేశాన్ని షూట్ చేసాం.ఇటీవల వైరల్ అయిన ట్రెండ్‌ను చూసి మేమేమీ కావాలని ప్లాన్ చేసి డిజైన్ చేసింది కాదు. కథాగమనంలో భాగంగా వినోదం కోసం మాత్రమే ఆ సీన్ రాసుకున్నాం. ఇది కేవలం సరదా ఇమిటేషన్ మాత్రమే తప్ప ట్రోలింగ్ కాదు. "ఇమిటేషన్‌కు, ట్రోలింగ్‌కు మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. గతంలో మేము పవన్ కళ్యాణ్ గారి 'వకీల్ సాబ్' రోల్‌ను, అలాగే కృష్ణ గారి మేనరిజమ్స్‌ను కూడా ప్రమోషన్లలో ఇమిటేట్ చేశాము. సినిమా రంగంలో గొప్ప నటుల ఐకానిక్ సీన్లను ఆరాధనతో అనుకరించడం వినోదంలో భాగం. నటుడు సత్య తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులు నవ్వుకుంటారని మాత్రమే ఆ సీన్ చేశాడు తప్ప ఎవరి మనోభావాలు దెబ్బతీయడం మా ఉద్దేశం కాదు" అని వ్యాఖ్యానించారు.  దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారి పట్ల తమకున్న అభిమానాన్ని పునరుద్ఘాటించారు. అభిమానులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని, ఈ వివాదానికి ఇక్కడితో స్వస్తి పలకాలని కోరారు. అలాగే ఈ సందర్భంగా తన వ్యక్తిగత ఆనందాన్ని పంచుకుంటూ, బాబు పుట్టిన తర్వాత తన జీవితం మరింత సంతోషంగా ఉందంటూ లావణ్య త్రిపాఠి సంతోషాన్ని, కుటుంబ విశేషాలను కూడా వరుణ్ తేజ్ పంచుకున్నారు. మొత్తానికి వరుణ్ తేజ్ సకాలంలో ఇచ్చిన స్పష్టమైన వివరణతో ఈ వివాదం సద్దుమణిగినట్లయింది. అసలు ఈ వివాదానికి మూలం 1978 లో విడుదలైన సీనియర్ ఎన్టీఆర్ నటనలోని ఆల్ టైమ్ హిట్ చిత్రం 'యుగపురుషుడు'. ఆ సినిమాలో ఎన్టీఆర్ చెప్పిన "మిస్టర్, మీ స్ట్రోక్స్ చాలా అమెచ్యూరిష్‌గా ఉన్నాయి... ఇదివరకు ఎప్పుడైనా ఫైట్ చేశారా?" అనే డైలాగ్ గత కొన్ని వారాలుగా సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో విపరీతంగా మీమ్స్‌గా వైరల్ అయింది. సరిగ్గా ఇదే సమయానికి విడుదలైన 'కొరియన్ కనకరాజు' చిత్రంలో నటుడు సత్య అదే డైలాగ్‌ను ఎన్టీఆర్ గారి మేనరిజంతో ఇమిటేట్ చేస్తూ చెప్పే సీన్ కనిపించింది. దీంతో నెటిజన్లు, నందమూరి ఫ్యాన్స్ తీవ్రంగా స్పందించారు. కావాలనే సోషల్ మీడియాలో మీమ్స్ ప్లాంట్ చేసి, సినిమాలో ఈ సీన్ పెట్టి ఎన్టీఆర్‌ను అవమానించారని ఆరోపించారు.        Ntr, Varun Tej, Korean kanakaraju
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటించిన ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ట్రైలర్ విడుదలైంది. తొలి ఫ్రేమ్ నుంచే ఆహ్లాదకరమైన, భావోద్వేగభరితమైన, హృదయాన్ని తాకే కుటుంబ కథా చిత్రంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ట్రైలర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. దర్శకుడు వెంకీ అట్లూరి తనదైన భావోద్వేగ కథనంతో రూపొందించిన ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ట్రైలర్‌లో సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను పరిచయం చేశారు. నలభై ఏళ్ల వయస్సు దాటినా తన కలలను వదలకుండా ముందుకు సాగే వ్యక్తిగా సూర్య కనిపించారు. స్టైల్, హాస్యం, ప్రేమ, భావోద్వేగాలను అద్భుతంగా మేళవిస్తూ ఆయన మరోసారి తన సహజ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. వెంకీ అట్లూరి హృదయానికి హత్తుకునే రచనతో కలిసి సూర్య కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఇది ఒకటిగా నిలుస్తుందనే నమ్మకాన్ని ట్రైలర్ కలిగిస్తోంది. "మనుషులు విడిపోయేది గొడవల వల్ల కాదు. ఒక గొడవ తర్వాత ఎలా మాట్లాడాలో తెలియక" వంటి డైలాగ్ లు ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. అలాగే ట్రైలర్ చివరిలో "ఇప్పుడెందుకు చంద్రముఖిలో జ్యోతికలా బిహేవ్ చేస్తున్నావ్" అంటూ సూర్యతో మమితా బైజు చెప్పే డైలాగ్ నవ్వులు పూయించింది. హీరోయిన్ మమితా బైజు తన సహజమైన నటనతో ఆకట్టుకోగా, రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ తో పాటు ఇతర ప్రముఖ నటీనటులు ఈ కుటుంబ కథకు మరింత బలం చేకూర్చారు.  జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన హృద్యమైన సంగీతం, నిమిష్ రవి అందించిన అద్భుతమైన ఛాయాగ్రహణం, వెంకీ అట్లూరి తనదైన శైలిలో చెప్పిన భావోద్వేగ కథనం ట్రైలర్‌ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాయి. ఇటీవల కోయంబత్తూరులో ఘనంగా నిర్వహించిన ఆడియో రిలీజ్ ఈవెంట్ లో చిత్రబృందం ఈ సినిమా భావోద్వేగాల పరంగా ప్రతి వయసు ప్రేక్షకుడిని అలరిస్తుందని ఎంతో నమ్మకంగా చెప్పింది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఆ నమ్మకాన్ని పూర్తిగా నిజం చేస్తూ, థియేటర్లలో ఓ అద్భుతమైన అనుభూతిని అందించబోతుందనే అంచనాలను మరింత పెంచింది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా, ఈ ఆగస్టు 14న థియేటర్లలో అడుగుపెట్టనుంది.     Vishwanath and Sons Trailer, Suriya, Venky Atluri, Mamitha Baiju  
The much-awaited trailer of Vishwanath & Sons, starring Suriya, is finally out and it promises a happy, emotional, pleasant and wholesome big-screen experience. Directed by Venky Atluri and produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya, the film is gearing up to be one of the biggest family entertainers of the year. The trailer opens the doors to the world of Sanjay Vishwanath, an international pistol shooter who continues to chase his dreams even in his 40s. Suriya effortlessly balances style, warmth, humour and emotion, delivering a performance that instantly strikes a chord. His charismatic screen presence, coupled with Venky Atluri’s heartfelt writing, promises one of his most endearing performances in recent years. Mamitha Baiju brings her signature charm to the screen, while Radhika Sarathkumar, Raveena Tandon and the stellar ensemble cast add depth to this emotional journey. G. V. Prakash Kumar’s soulful music, Nimish Ravi’s rich visuals and Venky Atluri’s signature storytelling further elevate the trailer. During the grand audio launch event in Coimbatore, the team confidently spoke about the film’s emotional strength and its ability to connect with audiences of all ages. The trailer now validates every bit of that confidence, leaving viewers with the promise of a memorable theatrical experience. Produced under Sithara Entertainments and Fortune Four Cinemas, and presented by Srikara Studios, Vishwanath & Sons is all set for a grand worldwide release on August 14, 2026, promising audiences a world of unforgettable emotions this Independence Day weekend. Disclaimer: This article is based on discussions and information shared across available sources, social media and publicly available news items. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
గత కొన్ని నెలలుగా కోలీవుడ్ మీడియాలోనే కాకుండా, సౌత్ ఇండియా పాలిటిక్స్‌లోనూ హాట్ టాపిక్‌గా మారిన ఆ బిగ్గెస్ట్ కాంట్రవర్సీకి ఈరోజుతో ఫుల్ స్టాప్ పడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, తమిళనాడు సీఎం దళపతి విజయ్ విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ఆయన భార్య సంగీత గతంలో చెన్నై కుటుంబ న్యాయస్థానంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. దీంతో న్యాయమూర్తి ఈ కేసును క్లోజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్ పొలిటికల్ కెరీర్‌కు, ఆయన అభిమానులకు ఇది ఎంతో ఊరటనిచ్చే అంశంగా మారింది. విజయ్, సంగీత 1999 లో వివాహబంధంతో ఒకటయ్యారు. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కోలీవుడ్ ఆదర్శ దంపతులుగా పేరుతెచ్చుకున్న ఈ జోడీ మధ్య గత కొంతకాలంగా మనస్పర్థలు వచ్చాయనే వార్తలు జోరుగా వినిపించాయి. ప్రత్యేకించి విజయ్ పూర్తిస్థాయి రాజకీయంలోకి అడుగుపెట్టి 'తమిళగ వెట్రి కళగం' పార్టీని స్థాపించిన తర్వాత, వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు అభిమానులను తీవ్రంగా కలిచివేశాయి. ఆ తర్వాత చెన్నైలోని ఫ్యామిలీ కోర్టులో సంగీత విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేయడం, అది మీడియాలో వైరల్ కావడం అందరికీ తెలిసిందే.     Thalapathy Vijay, Divorce Case, Sangeetha  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు భారతీయ రైల్వే ద్వారా ప్రయాణిస్తారు. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే వారు అయితే.. రాత్రంతా రైళ్లలోనే ఉండాల్సి వస్తుంది.  అయితే రైళ్లలో ప్రయాణం చేసేటప్పుడు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది.  పక్కన ప్రయాణికుల నుండి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. రైల్వే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ప్రత్యేక "నైట్ జర్నీ కండీషన్స్" అమలు చేసింది. ప్రతి రైలు ప్రయాణికుడు ఈ నియమాల గురించి తెలుసుకోవాలి. లేకపోతే రైలు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకుంటే.. శబ్దం చేయకూడదు.. రాత్రి 10 గంటల తర్వాత రైలులో నిశ్శబ్ద వాతావరణాన్ని పాటించడం ప్రధాన నియమం. ఈ సమయంలో మొబైల్ ఫోన్‌లో బిగ్గరగా మాట్లాడకూడదు, లేదా ఇయర్‌ఫోన్‌లు లేకుండా స్పీకర్‌లపై వీడియోలు లేదా సంగీతాన్ని ప్లే చేయకూడదు. ఇతర ప్రయాణికుల నిద్రకు భంగం కలగకుండా ఉండేందుకు, స్నేహితులతో గుంపులుగా బిగ్గరగా నవ్వడం , జోకులు వేయడం కూడా నిషేధించబడింది. లైట్స్ ఆఫ్.. కొన్నిసార్లు ప్రయాణికులు ఎవరైనా రాత్రి పొద్దుపోయే వరకు  ఏదో ఒక కారణంతో మెయిన్ లైటును ఆన్ చేసి ఉంచుతారు. దీనివల్ల ఇతర ప్రయాణికులు నిద్రపోలేరు. పక్క వారి నిద్రకు ఇబ్బంది అవుతుంది.  రైల్వే నిబంధనల ప్రకారం, రాత్రి 10 గంటల తర్వాత ప్రధాన కోచ్‌లోని లైట్లన్నీ తప్పనిసరిగా ఆపివేయాలి. రాత్రిపూట కేవలం నైట్‌లైట్ బల్బులు మాత్రమే ఆన్ చేసి ఉండవచ్చు. ఎవరైనా  అవసరం అనిపిస్తే వారు  తమ సీటులోని పర్సనల్ రీడింగ్ లైటును ఉపయోగించుకోవచ్చు. మధ్య బెర్త్ లకు రైల్వే నియమాలు.. లోయర్ బెర్త్  , మధ్య బెర్త్ ప్రయాణీకుల మధ్య సీట్ల తగాదాలను నివారించడానికి, రైల్వే ఒక స్పష్టమైన నియమాన్ని పెట్టింది. మధ్య బెర్త్ ప్రయాణీకుడు రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల మధ్య మాత్రమే తన సీటును విప్పి నిద్రపోవచ్చు. ఉదయం 6 గంటల తర్వాత, ఇతరులు దిగువ బెర్త్‌లో కూర్చోవడానికి వీలుగా  మధ్య బెర్త్‌ను దించాలి. అదేవిధంగా, రాత్రి 10 గంటల తర్వాత, లోయర్ బెర్త్ ప్రయాణీకుడు తన సీట్ లో ఎవరినీ కూర్చోబెట్టుకోకూడదు. వారు తమ పక్కన కూర్చోమని ఎవరినీ బలవంతం చేయలేరు. టికెట్ చెకింగ్.. ప్రయాణికుల నిద్రను దృష్టిలో ఉంచుకుని, రైల్వే తన టికెట్ చెకింగ్ సిబ్బందికి సూచనలు జారీ చేసింది. రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల మధ్య  టికెట్‌ను తనిఖీ చేయడానికి ఏ టిటిఇ మిమ్మల్ని నిద్రలేపకూడదు. వారు రాత్రి 10:00 గంటల లోపు తమ పనిని పూర్తి చేసుకోవాలి. అయితే, రాత్రి 10:00 గంటల తర్వాత రైలు ఎక్కిన ప్రయాణికులు ఈ సమయంలో తమ టికెట్లను తనిఖీ చేయించుకోవచ్చు. ఇది కాకుండా రాత్రి 10 గంటల తర్వాత రైలులో వీధి వ్యాపారులు లేదా విక్రయదారులు గట్టిగా అరుస్తూ ఎలాంటి వస్తువులను అమ్మకూడదు.  కానీ ఎవరైనా ఈ-క్యాటరింగ్ ద్వారా ఆహారాన్ని ముందుగానే బుక్ చేసుకుని ఉంటే, అది ఖచ్చితంగా వారి సీటుకే తెచ్చిస్తారు. నియమాలు ఉల్లింఘిస్తే.. రాత్రి 10 గంటల తర్వాత ప్రయాణికుడు ఈ నియమాలను ఉల్లంఘిస్తే, వారితో వాదించాల్సిన అవసరం లేదు.  వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), TTE, లేదా రైలులోని కోచ్ అటెండెంట్‌కు ఫిర్యాదు చేయవచ్చు.  రైల్వే అధికారిక యాప్ 'రైల్‌మదాద్' లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్ ద్వారా కూడా సహాయం పొందవచ్చు. నియమాలను ఉల్లంఘించిన వారిపై రైల్వే జరిమానాలు కూడా విధించవచ్చు. కాబట్టి రైలు ప్రయాణం చేసేటప్పుడు పై నియమాలు గుర్తుంచుకుని,  వాటిని అనుసరిస్తూ ప్రయాణించడం మంచిది.                                      *రూపశ్రీ.  
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు.  వీటి కారణంగానే ఆ తరువాత చాలా బాధపడతారు కూడా. ఈ తప్పుల వల్ల బంధాలు చెడిపోవడం, విచ్చిన్నం కావడం, ఆఖరుకు ఆ బంధం ముగిసిపోవడం వంటివి కూడా జరిగే అవకాశం ఉంటుంది. రిలేషన్ లో ఉన్న ఎంతో మంది అమ్మాయిలు చేసే తప్పులు ఏంటో తెలుసుకుంటే.. అది కొంతమందికి అయినా ఆలోచించే అవకాశాన్ని,  తప్పు జరగకుండా జాగ్రత్త పడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతుంది.  రిలేషన్ లో ఉండే అమ్మాయిలు చేసే తప్పులు ఏమిటో తెలుసుకుంటే.. తొందరపాటు.. ప్రేమ, సహజీవనం,  పెళ్లి.. ఇలా ఏ బంధంలో అయినా  మహిళలు ఒక కొత్త బంధానికి త్వరగా కట్టుబడిపోతారు. ఏ సంబంధమైనా బలంగా అభివృద్ధి చెందడానికి సమయం పడుతుంది. కానీ మహిళలు మాత్రం చాలా తొందరగా ఆ బంధానికి స్టిక్ అయిపోతారు.  అవగాహన లేకుండా జరిగే ఈ తొందరపాటు వల్ల  భవిష్యత్తులో  చాలా సమస్యలు వస్తాయి.  మొదట్లో తాము అనుకున్నట్టు, తరువాత లేదని అనుకోవడం,  పరిస్థితులు విభిన్నంగా మారడం.. ఇలా చాలా విషయాలు ఆ తరువాత బంధాన్ని విచ్చిన్నం చేసే దిశగా సాగుతాయి.  ప్రాధాన్యత.. మహిళలు ఏ సంబంధంలోనైనా చాలా భావోద్వేగంగా ఉంటారు.  తరచుగా తమ అవసరాల కంటే తమ భాగస్వామి అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఈ అలవాటు కారణంగా, సంబంధంలో తమకు తాము ప్రియారిటీ ఇచ్చుకోవడం కూడా మరిచిపోతారు.  ఇధి ఇలాగే కొనసాగితే.. బంధంలో భాగస్వామి తప్ప వారు ఎప్పటికీ కనిపించరు.  సింపుల్ గా చెప్పాలంటే తమను తాము కోల్పోతారు. ఇదే తర్వాత వారి బాధకు కారణం అవుతుంది. ఎమోషనల్ డిపెండింగ్.. చాలా మంది మహిళలు ఎప్పుడూ భావోద్వేగపరంగా తమ  భాగస్వామి మీద ఆధారపడతారు, తమ సంతోషాన్ని, తమకు కావలసిన ఓదార్పును,  తన ఇష్టాలను అన్నింటిని తమ భాగస్వామి ద్వారానే పొందుతారు.  ఇందులో తప్పు లేదు. భాగస్వామి కూడా భావోద్వేగపరంగా అంతే అనుభూతి చెందించే పర్లేదు.. కానీ  భావోద్వేగ మద్దతు కోసం పూర్తిగా  భాగస్వామిపై ఆధారపడటం  తప్పు. ఈ అలవాటు  భాగస్వామిపై ఒత్తిడిని కలిగించి సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు. ఎంపిక.. చాలా వరకు మహిళలు సంబంధాలలో తమ సొంత ఇష్టాలను పక్కన పెడతారు. తమ భాగస్వామికి అవి నచ్చవనే కారణంతో వారు తమ అభిరుచులను, అవసరాలను నిర్లక్ష్యం చేస్తారు. అలా చేయడం  సంబంధానికి మంచిది కాదు. అది సంబంధం విచ్ఛిన్నం కావడానికి దారితీయవచ్చు.  ఎవరి కోసమూ  అభిరుచులను, ఇష్టాలను వదులుకోకూడదు. లేకపోతే రేపటి రోజు చెప్పుకోవడానికి ఇష్టం,  చేయడానికి అభిరుచి వంటివి ఏమీ లేకుండా చుట్టూ శూన్యం ఉన్నట్టు అనిపిస్తుంది.                                              *రూపశ్రీ.
సిబ్లింగ్ థెరపీ..  తోబుట్టువుల మధ్య వచ్చే మనస్పర్థలు సులువుగా తొలగించే భలే మార్గం..! అన్నా తమ్ముడు, అక్కా చెల్లి, అన్నా చెల్లెళ్లు,  అక్కా తమ్ముళ్లు.. ఇలా తోబుట్టువుల బంధాలు చాలా గొప్పవి. ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టిన వారి మధ్య బంధం ఎంతో అపురూపమైనది.  చిన్నతనంలో తోబుట్టువులు కొట్టుకున్నా, తిట్టుకున్నా, గొడవ పడినా అది జరిగిన తర్వాత కొన్ని నిమిషాలు లేదా గంటల్లోనే తిరిగి కలిసిపోతారు.  ఒక్కటిగా పెరుగుతారు.  కానీ పెద్దయ్యాకే సమస్యలు వస్తాయి.  చాలామందికి అపార్థాలు చోటుచేసుకుంటాయి. మనస్పర్థలు వస్తాయి. వీటి వల్ల కేవలం ఆ మనిషి మాత్రమే కాకుండా కుటుంబం అంతా కలత చెందుతుంది.  పైగా ఇలాంటి మనస్పర్థలు,  అపార్థాల వల్ల దూరం కూడా పెరుగుతుంది. ఇలాంటి దూరాలను తగ్గించి, మనస్పర్థలు పోగొట్టి తిరిగి తోబుట్టువులను ఒక్కటిగా ఉంచే మార్గమే సిబ్లింగ్ థెరపీ.. అసలు సిబ్లింగ్ థెరపీ అంటే ఏంటి? దీని ప్రయోజనం ఏంటి? ఇదెలా సహాయపడుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. సిబ్లింగ్ థెరపీ అంటే.. సిబ్లింగ్ థెరపీ అనేది కుటుంబ చికిత్సలో ఒక భాగం. తోబుట్టువుల మధ్య మాట్లాడుకునే విధానాన్ని  మెరుగుపరచడం, గత విభేదాలను పరిష్కరించడం,  సంబంధంలో నమ్మకాన్ని తిరిగి వచ్చేలా చేయడం  దీని లక్ష్యం. ఈ చికిత్సలో బాగా ట్రైనింగ్ అయిన వ్యక్తి మనస్పర్థలు ఉన్న ఇద్దరు వ్యక్తులను  స్వేచ్ఛగా తమ భావాలను వ్యక్తపరచనవు చెబుతారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడానికి గల కారణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడతారు. తోబుట్టువుల మధ్య తరచుగా  జరిగే గొడవలు, ఇద్దరి మధ్య మాటలు లేకపోవడం, సవతి కుటుంబ సమస్యల కారణంగా సంబంధాలు దెబ్బతినడం, లేదా  పెద్దవయలు అయిపోయిన తల్లిదండ్రులను చూసుకోవడం.. ఇలా చాలా కారణాల వల్ల తోబుట్టువుల మధ్య విబేధాలు ఏర్పడితే వాటికి సరైన సొల్యుషన్ చెప్పి తోబుట్టువులను తిరిగి కలుపుతారు. ప్రయోజనం... సిబ్లింగ్ థెరపీ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, అది వారి మధ్య కమ్యునికేషన్ ను  మెరుగుపరుస్తుంది. థెరపీ సమయంలో, తోబుట్టువులు శ్రద్ధగా వినడం, తమ భావాలను సరైన విధంగా  వ్యక్తపరచడం,  అవతలి వ్యక్తి కోణాన్ని అర్థం చేసుకోవడం నేర్చుకుంటారు. దీనివల్ల క్రమంగా అపార్థాలు తగ్గుతాయి. ఒకవేళ చిన్ననాటి అనుభవం లేదా గతంలోని వివాదం వారి సంబంధంలో సమస్యకు కారణమైతే, ఈ సమస్యలను బహిరంగంగా చర్చించడానికి థెరపీ ఒక మంచ వాతావరణాన్ని అందిస్తుంది. కొన్నిసార్లు, పక్షపాతం, పగ, లేదా చెప్పుడు మాటలు వంటివి సంవత్సరాల తరబడి ఆ సంబంధాన్ని ప్రభావితం చేస్తూనే ఉంటాయి.  థెరపిస్ట్ సహాయంతో ఈ సమస్యలను చర్చించి పరిష్కరించడం జరుగుతుంది, తద్వారా ఆ సంబంధం సాఫీగా  సాగడానికి వీలవుతుంది. ఎమోషనల్ సపోర్ట్.. సిబ్లింగ్ థెరపీ  రిలేషన్స్ ను ఎమోషన్ పరంగా బలంగా మారుస్తుంది.  తోబుట్టువులకు ఒకరి మీద ఒకరికి నమ్మకం పెరుగుతుంది. కష్ట సమయాల్లో  కలసికట్టుగా ఉండటం, ఒకరి సంతోషాన్ని మరొకరు పంచుకోవడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడుగా ఉండటం.. ఇలా   మొత్తం కుటుంబంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇంట్లో ఒత్తిడి తగ్గుతుంది , ఇతర కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడటం ప్రారంభిస్తాయి. తోబుట్టువుల మధ్య ఎప్పుడూ గొడవలు ఉంటే,  లేదా పూర్తీగా మాటలు ఆగిపోయి ఉంటే.. కుటుంబంలో పెద్ద మార్పు తర్వాత సంబంధాలు క్షీణిస్తే, లేదా కుటుంబ నిర్ణయాలపై తరచుగా వివాదాలు అవుతూ ఉంటే, సిబ్లింగ్ థెరపీని తీసుకోవడం చాలా మంచిది.                              *రూపశ్రీ.  
ఐస్ క్రీమ్.. చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. చాలామంది వర్షాకాలంలో కూడా ఐస్ క్రీమ్ తింటే ఆ కిక్కే వేరు అంటారు.  కాలం ఏదైనా ఐస్ క్రీమ్ పట్ల చాలా ఇష్టం ఉంటుంది. అయితే నేటి కాలంలో ఐస్ క్రీమ్ మాత్రమే కాకుండా ఫ్రోజెన్ డెజర్ట్ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంటుంది.  షాప్ కు వెళ్ళినప్పుడు ఐస్ క్రీమ్ ఏదో,  ప్రోజెన్ డెజర్ట్ ఏదో అర్థం కాకుండా చాలా మంది పొరపాటుగా ఐస్ క్రీమ్ కు బదులు ఫ్రోజెన్ డెజర్ట్ ఎంచుకుంటారు. ఆ తర్వాత ఇది ఐస్ క్రీమ్ కాదని నాలుక కరుచుకుంటారు. అందుకే ఐస్ క్రీమ్ కు,  ఫ్రోజెన్ డెజర్ట్ కు మధ్య తేడా ఎలా తెలుసుకోవాలి? తెలుసుకుంటే.. ఫ్రోజెన్ డెజర్ట్‌లు ఐస్ క్రీమ్‌కు చాలా భిన్నంగా ఉంటాయి, కానీ  చాలామంది అవి  రెండూ ఒకటే అని పొరబడతారు. ఈ రెండూ చూడటానికి, రుచిలో ఒకేలా కనిపించినప్పటికీ, వాటి మధ్య చాలా తేడా ఉంటుంది. పదార్థాలు.. ఐస్ క్రీమ్ , ఫ్రోజెన్ డెజర్ట్‌ల మధ్య ఉన్న అతిపెద్ద తేడా వాటి తయారీలో ఉపయోగించే కొవ్వు పదార్థం. ఐస్ క్రీమ్‌ను పాలు, క్రీమ్ , పాల ఫ్యాట్ తో తయారు చేస్తారు. అందువల్ల, ఐస్ క్రీమ్‌గా పరిగణించబడాలంటే, ఏ ఫ్రోజెన్ డెజర్ట్‌లోనైనా కనీసం 10% పాల కొవ్వు ఉండాలి. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లలో పాలకు బదులుగా పామాయిల్ లేదా పామ్ కెర్నల్ ఆయిల్ వంటి వెజిటెబుల్ నూనె లేదా వెజిటెబుల్ ఫ్యాట్ ను ఉపయోగిస్తారు. పాల ఘనపదార్థాలను కలుపుతారు, కానీ పాల కొవ్వును ఉపయోగించరు. రుచి, టెక్చర్.. పాల కొవ్వును ఉపయోగించడం వల్ల ఐస్ క్రీమ్ మరింత క్రీమీగా, రుచికరంగా , మృదువుగా తయారవుతుంది. ఐస్ క్రీమ్ నోటిలో సులభంగా కరిగిపోతుంది. మరోవైపు, ఫ్రోజెన్ డెజర్ట్‌లు కొద్దిగా జిగటగా లేదా నూనెగా ఉంటాయి. అంతేకాకుండా, పాల కొవ్వుతో పోలిస్తే వెజిటబుల్  కొవ్వుకు కరికే గుణం కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ప్యాకెట్ల పై లేబులింగ్.. చాలామంది ఐస్ క్రీమ్ అనుకుని  ఫ్రోజెన్ డెజర్ట్ లు కొనుగోలు చేసి తరువాత బాధపడుతూ ఉంటారు. అందుకే.. ఉత్పత్తి ఐస్ క్రీమా లేక ఫ్రోజెన్ డెజర్టా అనేది కంపెనీలు ప్యాకేజింగ్‌పై స్పష్టంగా పేర్కొనాలి. ఉత్పత్తిలో 0.5% కంటే ఎక్కువ వెజిటేబుల్ ఆయిల్  ఉంటే, దానిని ఐస్ క్రీమ్‌గా కాకుండా, కేవలం ఫ్రోజెన్ డెజర్ట్‌గా మాత్రమే అమ్మాలని FSSAI నిబంధనలు విధించింది. ధర తేడా.. పాల కొవ్వు కంటే వెజిటేబుల్ ఆయిల్  చాలా చౌకగా ఉంటుంది. అందువల్ల ప్రోజెన్ డెజర్ట్‌లు కంపెనీలకు మరింత పొదుపుగా ఉంటాయి . తక్కువ ధరకే లభిస్తాయి. మరోవైపు, ఐస్ క్రీమ్‌లో పాల కొవ్వును ఉపయోగిస్తారు, అందుకే దీని ధర ప్రోజెన్  డెజర్ట్‌ల కంటే ఎక్కువగా ఉంటుంది. కొనుగోలు చేసేముందు ఇవి గుర్తుంచుకోవాలి..  ప్యాక్ చేసిన డెజర్ట్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా, ప్యాకేజీ ముందు లేదా వెనుక ఉన్న పదార్థాల జాబితాను జాగ్రత్తగా చదవాలి. ఆ పదార్థాలలో పామాయిల్ లేదా కూరగాయల నూనె ఉంటే, అది ఫ్రోజెన్ డెజర్ట్,  అందులో పాల కొవ్వు ఉంటే, అది ఐస్ క్రీమ్. ఇవన్నీ ప్యాకెట్ పైన కూడా మెన్షన్ చేసి ఉండాలి.                                    *రూపశ్రీ  
చండీపురా వైరస్ (Chandipura Virus) ప్రస్తుతం ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్న వైరస్‌లలో ఒకటి. ముఖ్యంగా 15 సంవత్సరాల లోపు పిల్లల్లో ఈ వైరస్ తీవ్రమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. వర్షాకాలంలో దీని ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ వైరస్ ప్రధానంగా సాండ్ ఫ్లై (Sand Fly) అనే చిన్న ఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా ఒకరి నుంచి మరొకరికి నేరుగా వ్యాపించదు. అయితే వైరస్ సోకిన పిల్లల్లో చాలా వేగంగా ఆరోగ్య పరిస్థితి క్షీణించే అవకాశం ఉండటంతో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చండీపురా వైరస్ సోకినప్పుడు మొదట జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి సాధారణ లక్షణాలు కనిపించవచ్చు. కొంతమందిలో మూర్ఛలు, స్పృహ కోల్పోవడం, మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తవచ్చు. తీవ్రమైన పరిస్థితుల్లో 24 నుంచి 36 గంటల్లోనే ఆరోగ్యం విషమించే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఈ వైరస్‌కు ప్రత్యేకమైన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట చికిత్స అందుబాటులో లేదు. అందువల్ల లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. సరైన సమయంలో చికిత్స ప్రారంభిస్తే ప్రాణాపాయం తగ్గించే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణుడు డా. హరిచరణ్ మోడమ్ చండీపురా వైరస్ ఎలా వ్యాపిస్తుంది, ఎవరికి ఎక్కువ ప్రమాదం ఉంది, ప్రారంభ లక్షణాలు ఏమిటి, ఏ రాష్ట్రాల్లో ఎక్కువ కేసులు నమోదయ్యాయి, ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి వంటి ముఖ్యమైన విషయాలను సులభంగా వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే ముఖ్యాంశాలు: చండీపురా వైరస్ అంటే ఏమిటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? పిల్లల్లో కనిపించే ప్రారంభ లక్షణాలు ప్రమాదకర లక్షణాలను ఎలా గుర్తించాలి? ఎవరికి ఎక్కువ రిస్క్? వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సాండ్ ఫ్లై కాట్ల నుంచి ఎలా రక్షించుకోవాలి? వైద్యులను ఎప్పుడు సంప్రదించాలి? తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు పిల్లల సంరక్షణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సమాచారాన్ని తప్పకుండా తెలుసుకోవాలి. అవగాహన, పరిశుభ్రత మరియు త్వరితగతిన వైద్య సహాయం తీసుకోవడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు. గమనిక: ఈ వీడియోలోని సమాచారం ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచడం కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యలు లేదా లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యులను సంప్రదించండి. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health (సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!)
మనిషి  మెదడు చాలా శక్తివంతమైనది.  మనిషి మనుగడ సాగుతున్నది మెదడు పనితీరు మీదనే.. మెదడు ఎంత ఆరోగ్యంగా ఉంటే మనిషి జీవితం అంత బాగుంటుంది.  కానీ మెదడు పనితీరు సరిగా లేకపోతే చాలా సమస్యలు వస్తాయి.  అయితే మనిషి మెదడు  ఎల్లప్పుడూ నిష్పక్షపాతంగా ఉండదని అంటున్నారు నిపుణులు. సమాచారాన్ని వేగంగా గ్రహించడంలో  సహాయపడటానికి..  మనస్సు కాగ్నిటివ్ బయాసెస్ అని పిలువబడే మానసిక పరిస్థితి పై ఆధారపడుతుంది. ఈ మార్గాలు సమయాన్ని ఆదా చేయగలిగినప్పటికీ, అవి ఆలోచించే, నిర్ణయాలు తీసుకునే ,  చుట్టూ ఉన్న వ్యక్తులను అర్థం చేసుకునే విధానాన్ని కూడా వక్రీకరించగలవని అంటున్నారు. దీని ఫలితంగా  మెదడు ఒక విషయాన్ని వేరేగా అన్వయించుకుంటుంది, అందుకే అదే నిజమని నమ్మే అవకాశం ఉంటుంది.  దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. నిర్థారణలో పక్షపాతం..  ఇప్పటికే నమ్ముతున్న విషయాలను బలపరిచే సమాచారం కోసం  మెదడు సహజంగానే వెతుకుతూ ఉంటుందట.  ఎవరితోనైనా విభేదిస్తే, వారితో విభేధించడానికి గల అభిప్రాయానికి గల కారణాలను,  సాక్ష్యాలను విస్మరించి, వారు తప్పు అని చెప్పడానికి గల ప్రతి కారణంపై  దృష్టి పెడతారట. నిజాన్ని తెలుసుకోవడానికి  బదులుగా, మనస్సు తరచుగా తను అనుకున్నదే కరెక్ట్ అనే విషయాన్ని నిరూపించడం  కోసం వెతుకుతూ ఉంటుందట.  ఇలా నిజాలు తెలుసుకునే విషయంలో మెదడు పక్షపాతం వహిస్తుందట. హెలో ఎఫెక్ట్.. చాలామంది చక్కగా దుస్తులు ధరించి,  శుభ్రంగా ఉంటూ, చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటుంటారు.  ఇలాంటి వారి విషయంలో చాలామంది పాజిటివ్ గానూ,  వాళ్లదిమంచి వ్యక్తిత్వం అని అనుకుంటారు.  దీని కారణం మెదడే.. ఇలాంటి వాళ్లు మంచోళ్లు అని మెదడు అనుకుంటుందట.  ఇలాంటి ప్రభావాన్ని హెలో ఎఫెక్ట్ అని అంటారు. ఒక వ్యక్తిలో  మంచి గుణాన్ని గమనించినప్పుడు, ఎటువంటి నిజమైన ఆధారం లేకపోయినా,  మెదడు వారికి ఇతర మంచి లక్షణాలు కూడా ఉన్నాయని దానంతట అదే ఊహించుకుంటుంది. వాస్తవాల ఆధారంగా ఒకరిని అంచనా వేయడానికి బదులుగా,  మనస్సు దానికి నచ్చినట్టు మంచి మంచి స్టోరీస్ ను ఊహించుకుని మరీ  వారిని చాలా మంచోళ్లను,  అన్నీ మంచి గుణాలే ఉన్నోళ్లుగా భావిస్తుంది. ఎమోషనల్ లాజిక్.. ఎమోషన్స్ అనేవి వాస్తవాన్ని చూసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. ఎప్పుడైనా ఆందోళనగా అనిపిస్తే, ఆ పరిస్థితి ప్రమాదకరమైనదని అనుకోవడం,  ఎందులో అయినా ఫెయిల్యూర్ ఎదురైతే నిజంగానే పూర్తీగా విఫలమయ్యారని అనుకోవడం జరుగుతుంది. మనిషిలో ఉండే ఫీలింగ్స్  సరైనవే అయినప్పటికీ, అవి ఎల్లప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండవు. ఎమోషన్స్ ను  వాస్తవాల నుండి వేరు చేయడానికి కొంత సమయం తీసుకోవాలి, యాంత్రికంగా రియాక్ట్ అయ్యే  బదులు మరింత ఆలోచనాత్మకంగా స్పందించాలి.  అలా ఉంటేనే మంచిది.  లేకపోతే మెదడు చేతిలో మోసపోవాల్సి వస్తుంది. సన్క్ కాస్ట్ పాలసీ.. ఇప్పటికే చాలా సమయం , శ్రమను  ఒక పని కోసం వెచ్చించారు అనే కారణంతో  అందులో  అలాగే కొనసాగుతూ ఉంటే దాన్ని 'సన్క్ కాస్ట్ ఫాలసీ' (sunk cost fallacy) అంటారు.  మెదడు తరచుగా గత పెట్టుబడిని భవిష్యత్ విలువతో గందరగోళానికి గురిచేస్తుంది. దీనివల్ల ఏదైనా  ఇకపై ఉపయోగపడకపోయినా దాని నుండి బయటపడటం కష్టమవుతుంది.  ఇప్పటికే గడిపిన సమయాన్ని తిరిగి పొందలేరని గుర్తుంచుకోవాలి.  ఎలా ముందుకు సాగాలని నిర్ణయించుకుంటారో అదే  అత్యంత ముఖ్యం. నెగిటివ్  ప్రభావం.. ఎవరైనా విమర్మించినప్పుడు, తిట్టినప్పుడు, బాధపెట్టినప్పుడు.. అది  రోజుల తరబడి మనసులో నిలిచిపోతుంది, కానీ ఎన్నో మంచి విషయాలు, సంతోషకరమైన విషయాలు  త్వరగా మర్చిపోతారు. ఇలా జరగడానికి కారణం, మెదడు సహజంగానే సానుకూల అనుభవాల కంటే ప్రతికూల అనుభవాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం. ఇది  ఒకప్పుడు, ప్రమాదం పట్ల అప్రమత్తంగా ఉండటానికి,  మానవులు మనుగడ సాగించడానికి సహాయపడింది. అయితే ఈ రోజుల్లో, ఇది రోజువారీ ఎదురుదెబ్బలను అవి నిజంగా ఉన్నదానికంటే చాలా పెద్దవిగా అనిపించేలా చేస్తుంది. నెగిటివ్ కంటే పాజిటివ్ ను మెదడులో ఇముడ్చుకోవాలి. అప్పుడే మెదడు పనితీరు ఆరోగ్యకరంగా ఉన్నట్టు. స్పాట్ లైట్ ఎఫెక్ట్..  తప్పులను,  రూపాన్ని, లేదా ఒక ఇబ్బందికరమైన క్షణాన్ని అందరూ గమనిస్తారని నమ్మడం చాలా సులభం. వాస్తవానికి, చాలా మంది తమ సొంత జీవితాలు , విషయాలపైనే దృష్టి పెడతారు. ఈ స్పాట్‌లైట్ ఎఫెక్ట్ వల్ల అందరూ తమను నిరంతరం గమనిస్తున్నారనే భావన కలుగుతుంది. కానీ నిజానికి అలా జరగకపోయినా  అదేలా భావిస్తుంటారు. ఈ ఆలోచనను  వదిలేయడం వల్ల,  రోజువారీ జీవితంలో మరింత ఆత్మవిశ్వాసంతో, తక్కువ భయంతో  ఉండటానికి సహాయపడుతుంది. పైన చెప్పుకున్నవిధంగా.. వివిధ కారణాల వల్ల చాలామందికి తమ మెదడే శత్రువులా మారి మోసం చేస్తుంది.                                     *రూపశ్రీ.