LATEST NEWS
  ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో 2024 ఎన్నికల ఫలితాలు ఒక చారిత్రాత్మక మార్పును తీసుకువచ్చాయి. గత ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేకతను కూడగట్టి కూటమి అఖండ విజయాన్ని సాధించింది. ఈ విజయ పరంపరలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మళ్లీ అధికార పీఠాన్ని అధిరోహించింది. ఇటీవల అవనిగడ్డ నియోజకవర్గంలో జరిగిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రత్యేక చర్చకు దారితీశాయి.  "ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీరోచితంగా పోరాటం చేస్తాం, కానీ అధికారంలోకి రాగానే అందరం రిలాక్స్ అయిపోతాం" అని ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలోని అంతర్గత వాస్తవాలను, క్షేత్రస్థాయి గ్రౌండ్ రియాలిటీని ప్రతిబింబిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ వంటి టీడీపీ కంచుకోటల్లో సైతం కూటమి రాజకీయ సమీకరణాల వల్ల తమ్ముళ్లు ఒక విధమైన రాజకీయ అనిశ్చితిని, అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. వ్యూహాలు మరియు అంతర్గత సవాళ్లురాజకీయ పార్టీలకు అధికారం అనేది ఒక తాత్కాలిక నివాసం (కిరాయి ఇల్లు) లాంటిదని, పార్టీయే శాశ్వతమైన సొంత ఇల్లు అని లోకేష్ పేర్కొన్నారు.  టీడీపీ సిద్ధాంతం ప్రకారం ‘కార్యకర్తలే అధినేత’. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. గత ఐదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉంటూ ఎన్నో ఇబ్బందులు, పోలీస్ కేసులు ఎదుర్కొని, ఆస్తులను పణంగా పెట్టి పార్టీని గెలిపించిన కార్యకర్తలను అధికారంలోకి వచ్చాక నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన వ్యక్తమవుతోంది. కేవలం అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పెట్టుబడులు మాత్రమే ఎన్నికల్లో మళ్లీ మళ్లీ గెలిపించలేవని చరిత్ర నిరూపించింది. గతంలో తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు అద్భుతమైన అభివృద్ధి చేసినప్పటికీ ప్రజా బంధం, క్యాడర్ అనుసంధానం దెబ్బతినడం వల్ల ఓటమిని చవిచూశాయి.  టీడీపీ కూడా గతంలో 1989, 2004, 2019 లలో కేవలం రాజకీయ వ్యూహాత్మక లోపాలు, కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. నేడు అవనిగడ్డలో జనసేన ఎమ్మెల్యే ఉండటం, టీడీపీకి సరైన నియోజకవర్గ ఇంచార్జ్ లేకపోవడం వల్ల స్థానిక నాయకత్వాల మధ్య సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. భవిష్యత్తు రాజకీయ ప్రభావంటీడీపీ 3.0 వర్షన్‌లో భాగంగా పార్టీ భవిష్యత్తు పూర్తిగా క్షేత్రస్థాయి కార్యకర్తలతో నేరుగా మమేకమవ్వడంపైనే ఆధారపడి ఉంటుంది.  అధికారంలో ఉన్నప్పుడు కేవలం పరిపాలన, అధికారుల సెల్యూట్లకు పరిమితమై, రాజకీయాన్ని వదిలేస్తే వచ్చే ఎన్నికల్లో ఊహించని నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రజాక్షేమమే లక్ష్యంగా సాగుతూనే, స్థానిక తమ్ముళ్లకు సముచిత స్థానం మరియు గుర్తింపు ఇవ్వాల్సిన అత్యవసర పరిస్థితి అధిష్టానానికి ఉంది. లోకేష్ హెచ్చరించినట్లుగా, చిన్న చిన్న అసంతృప్తులతో కార్యకర్త అలిగి ఇంట్లో కూర్చుంటే, అది కేవలం పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు కూడా నష్టం కలిగిస్తుంది. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో అంతర్గత విభేదాలను రూపుమాపి, కొత్త ఇంచార్జ్ కమిటీలను నియమించి, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న క్యాడర్ ఆవేదనను ఆలకించకపోతే టీడీపీ మళ్లీ మళ్లీ గెలవాలనే కల కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉంది.  
  ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రం అత్యంత ఆసక్తికరమైన మరియు సంక్లిష్టమైన మలుపుల మధ్య సాగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం కేంద్రంలో ఎన్డీయే (NDA) కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడంలో తెలుగుదేశం పార్టీ (TDP) పోషించిన పాత్ర అత్యంత కీలకంగా మారింది. అయితే, ఈ అధికార సమీకరణాల వెనుక దాగి ఉన్న అసలు రాజకీయ వ్యూహాలు, ప్రాంతీయ పార్టీలపై జాతీయ పార్టీల అధిపత్య ధోరణులు మరియు భవిష్యత్తు పరిణామాలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశాలపై తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో విశ్లేషణాత్మకంగా చర్చ నిర్వహించారు. రాజకీయ పరిస్థితులు మరియు కేంద్ర సమీకరణాలు కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీకి (BJP) సొంతంగా పూర్తి మెజారిటీ రాకపోవడంతో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ సాధించిన 16 లోక్‌సభ స్థానాలు ప్రభుత్వ మనుగడకు అత్యంత ఆవశ్యకంగా మారాయి. ప్రారంభంలో చంద్రబాబు మద్దతు లేకుండా మోదీ ప్రభుత్వం ముందడుగు వేయలేని పరిస్థితి కనిపించినప్పటికీ, ఢిల్లీ రాజకీయాల్లో తెరవెనుక వ్యూహాలు వేగంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ (TMC) సహా ఇతర పక్షాల నుంచి సుమారు 20 మంది ఎంపీలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం మరియు జేడీయూ (JDU) పార్టీ అంతర్గత బలహీనతలు కేంద్రానికి కొత్త ప్రత్యామ్నాయాలను చూపుతున్నాయి. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీల అవసరం క్రమంగా తగ్గే అవకాశం ఉందనే విశ్లేషణలు రాజకీయ వర్గాల్లో ఊపందుకున్నాయి. రాజకీయ వ్యూహం మరియు అంతరార్థం గత చరిత్రను పరిశీలిస్తే, 2014-19 మధ్య కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు సజావుగా సాగలేదు. అమరావతి శంకుస్థాపన సమయంలో మోదీ ప్రవర్తించిన తీరుపై ఇప్పటికీ ఏపీ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు అవసరం ఉన్నందున అమరావతికి నిధులు, విశాఖపట్నంలో భారీ పరిశ్రమల ఏర్పాటు వంటి హామీలు లభిస్తున్నప్పటికీ, ఈ స్నేహం ఎంతకాలం నిలుస్తుందనేది ప్రశ్నార్థకమే. మరోవైపు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వ్యూహం భిన్నంగా ఉంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా జగన్ కేంద్ర పెద్దలతో ఘర్షణ వైఖరిని అవలంబించకుండా సున్నితమైన సంబంధాలను కొనసాగిస్తున్నారు. చట్టపరమైన కేసులు మరియు ఈడీ (ED) విచారణల వలయం నేపథ్యంలో, జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి పూర్తి అనుకూల సత్సంబంధాలను కొనసాగిస్తూ తన ఉనికిని కాపాడుకుంటున్నారు. అదే సమయంలో తన మైనారిటీ ఓటు బ్యాంకు దెబ్బతినకుండా ఉండేందుకు బిజెపితో ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోకుండా, బయటి నుంచే మద్దతు ఇచ్చే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఈ రకంగా ఏపీలోని ఇద్దరు ప్రధాన నేతలు ఒకరికొకరు తలపడుతూనే, కేంద్రం వద్ద తమ ప్రాధాన్యతను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. భవిష్యత్తు రాజకీయ ప్రభావం భవిష్యత్తులో ఏపీ రాజకీయం మరింత ఉత్కంఠభరితంగా మారనుంది. ఒకవేళ కేంద్రంలో బీజేపీ ఇతర పార్టీల మద్దతుతో పూర్తి స్థాయి స్థిరత్వాన్ని సాధిస్తే, చంద్రబాబు నాయుడిపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పార్టీ వైఎస్ షర్మిల ద్వారా ఏపీలో మళ్లీ పుంజుకోవాలని చూస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో ఆ పార్టీకి ఆశించిన బలం కనిపించడం లేదు. జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ ప్రతీకారం మరియు సిద్ధాంతాల పరంగా కాంగ్రెస్ లేదా టీడీపీలతో కలిసే ప్రసక్తే లేదని స్పష్టమవుతోంది.  అంతిమంగా, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు, జగన్ ఇద్దరూ బలమైన శక్తులుగా ఉంటూ పరస్పరం ఘర్షణ పడటమే కేంద్ర పెద్దల వ్యూహంగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కేంద్రం ఏపీ ప్రాంతీయ శక్తులను ఎలా నియంత్రిస్తుందనే దానిపైనే రాష్ట్ర భవిష్యత్తు మరియు అమరావతి రాజధాని నిర్మాణం ఆధారపడి ఉంటాయి. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
  సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసు...కూటమి ప్రభుత్వానికి రాజకీయ సవాల్.. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సాయికృష్ణ అనే వ్యక్తి కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలో మరణించడం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. కోర్టు జారీ చేసిన నాన్-బైలబుల్ వారెంట్ (NBW) అమలు చేయడం కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ సిబ్బంది మార్కాపురం నుంచి సాయికృష్ణను ప్రాణాలతో పట్టుకొచ్చి, స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు. అయితే, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో సాయికృష్ణ అనుమానాస్పద స్థితిలో మరణించాడు.  రిమాండ్ రిపోర్టులో దీనిని స్పష్టంగా 'కస్టోడియల్ డెత్' (లాకప్ డెత్) గా పేర్కొనడం మరియు బాధ్యుడైన సీఐ నాగరాజుపై ఐపీసీ సెక్షన్ 302 కింద హత్యానేరం నమోదు చేసి రాజమండ్రి జైలుకు తరలించడం సంచలనం సృష్టించింది. ఈ సున్నితమైన అంశంపై రాష్ట్ర హోంశాఖ మరియు హోంమంత్రి వంగలపూడి అనిత ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోవడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. ప్రభుత్వ మౌనం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ వడ్డే వెంకటేశ్వరరావు మరో సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ మధ్య ఆసక్తికర చర్చ టోన్‌ నిర్వహించింది. వ్యూహాలు మరియు అంతర్గత అంశాలు: ఈ కేసును గమనిస్తే తెరవెనుక అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. సాయికృష్ణ రియల్ ఎస్టేట్ వివాదాలు, డ్రగ్స్ లేదా గంజాయి మాఫియా పొలిటికల్ లింకులను బయటపెడతానని బెదిరించడం వల్లే ఉన్నతాధికారుల ఒత్తిడితో ఈ దారుణం జరిగిందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. నిందితుడైన సీఐ నాగరాజుకు వంద కోట్ల రూపాయలకు పైగా అక్రమ ఆస్తులు ఉన్నాయనే వార్తలు సోషల్ మీడియాలో రావడం, ఆయనకు ఉన్నత స్థాయి రాజకీయ లింకులు ఉన్నాయనే విషయాన్ని బలపరుస్తోంది.  మరోవైపు, సీఐ నాగరాజు స్వగ్రామంలో ఆయనకు మద్దతుగా ప్రదర్శనలు నిర్వహించడం వెనుక వ్యవస్థీకృత వ్యూహం ఉందనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనతో అధికార కూటమి ప్రభుత్వం (టీడీపీ-జనసేన-బీజేపీ) తీవ్ర రక్షణ శ్రేణిలోకి (డిఫెన్స్) వెళ్ళిపోయింది. నిరంతరం కూటమిని సమర్థించే న్యాయవాదులు, అనుకూల మీడియా సైతం ఈ లాకప్ డెత్ విషయంలో ప్రభుత్వాన్ని ఎలా వెనకేసుకురావాలో తెలియక ఇబ్బంది పడుతున్నారు. రాజకీయ ప్రభావం మరియు భవిష్యత్తు పరిణామాలు: విజయవాడలో శాంతిభద్రతల పరిస్థితి క్షీణించిందని చెప్పడానికి ఈ కేసుతో పాటు ఇటీవల జరిగిన పేర్పోగు వెంకటేశ్వర మాదిగ కుమారుడి కేసును కూడా ఉదాహరణగా చూపుతున్నారు. పోలీసుల్లో 'బుల్డోజింగ్ కల్చర్' పెరిగిపోవడం, తాము ఏం చేసినా ప్రభుత్వం చూసుకుంటుందనే మితిమీరిన విశ్వాసం ఏర్పడడం కూటమి ప్రభుత్వ ప్రతిష్టకు పెద్ద మచ్చగా మారే ప్రమాదం ఉంది. ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని గట్టిగా వాడుకుంటూ నేరుగా ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తోంది. రానున్న రోజుల్లో న్యాయస్థానాలు ఈ కేసుపై ఎలా స్పందిస్తాయనేది అత్యంత కీలకం. కోర్టు ఆదేశాల ప్రకారం టాస్క్ ఫోర్స్ అప్పగించిన నిందితుడు పోలీస్ కస్టడీలో ఎలా చనిపోతాడనే అంశంపై కోర్టు సీరియస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ కేసుపై సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్లు దాఖలయ్యాయి. న్యాయస్థానం కనుక కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే అది హోంశాఖ వైఫల్యంగా మారి, కూటమి ప్రభుత్వ పౌర హక్కుల రక్షణ తీరుపై ప్రజల్లో ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇలాంటి అంశాలపై  పూర్తి చర్చను టోన్ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో తప్పక వీక్షించండి.  
  ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ ను పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించుకున్నారా? కేవలం మార్పులు, చేర్పులే కాకుండా.. మోడీ కేబినెట్ ప్రక్షాళన చేయాలని భావిస్తున్నారా? అంటే ఎన్డీయే వర్గాల నుంచి ఔనన్న సమాధానమే వస్తున్నది. గత పదేళ్లుగా నరేంద్ర మోదీ  క్యాబినెట్ దాదాపు మార్పులు లేకుండానే కొనసాగుతోంది. ముఖ్యంగా కీలక శాఖల మంత్రులు సుదీర్ఘ కాలంగా అవే శాఖలలో కొనసాగుతున్నారు.  అయితే ఇప్పుడు ప్రధాని మోడీ కీలక శాఖల మంత్రులను మార్చాలని భావిస్తున్నట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. దీర్ఘకాలంగా కొనసాగుతున్న మంత్రులపై క్షేత్రస్థాయిలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత కారణంగానే మోడీ ఈ నిర్ణయానికి వచ్చారని అంటున్నారు.  మొత్తంగా ముచ్చటగా మూడో సారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన రెండేళ్ల తరువాత ప్రధాని మోడీ  తన కేబినెట్ ప్రక్షాళనకు నడుంబిగించారని  అంటున్నారు.  మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం కూడా ఖరారైందంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మోడీ సోమవారం (జూన్ 29)  క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారు.   కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రత్యేకంగా భేటీ కావడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ముర్ముతో భేటీలో   అమిత్ షా కేంద్ర క్యాబినెట్ మార్పుల గురించిన   సమాచారాన్నిఆమెకు వివరించినట్లు ఎన్డీయే వర్గాల ద్వారా తెలుస్తున్నది. అదలా ఉంటే..  ఈ కేబినెట్ ప్రక్షాళనలో విత్త, విద్యా శాఖ మంత్రులకు ఉద్వాసన లేదా స్థాన చలనం తప్పదన్న చర్చ జోరుగా సాగుతోంది.  వీరిలో నిర్మలాసీతారామన్ గత పదేళ్లుగా దేశ ఆర్థిక మంత్రిగా  కొనసాగుతున్నారు.  ఇక విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్రప్రదాన్ పై ఇటీవలి నీట్ పేపర్ లీక్ తరువాత దేశ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతోంది. కాక్రోచ్ జనతాపార్టీ అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనే ఏకైక ఎజెండా, డిమాండ్ తో దేశ వ్యాప్త ఆందోళనలు చేపట్టింది.  అదీ కాకుండా.. నీట్ పేపర్ లీక్   ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించడంతో.. ఆయనకు ఉద్వానస పలకాలని ప్రధాని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే విత్త మంత్రి నిర్మలా సీతారామన్ కు కేబినెట్ నుంచి ఉద్వాసన కాకుండా, ఆమె శాఖను మార్చే అవకాశాలున్నాయంటున్నారు. నిర్మలా సీతారామన్ కు మానవవనరులు లేదా మరో శాఖను అప్పగించే అవకాశాలున్నాయని ఎన్డీయే వర్గాల భోగట్టా.  వీరే కాకుండా మరి కొందరు మంత్రులకు కూడా శాఖల మార్పు లేదా ఉద్వాసన ఉండే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకూ మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కేంద్రం నురంచి ఎటువంటి అధికారిక సమాచారం లేదు.  
కాపు సామాజికవర్గ అగ్రనేత, కాపు ఉద్యమ కారుడు ముద్రగడ పద్మనాభం   తీవ్ర అనారోగ్యంతో  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గత కొంత కాలంగా  అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి  విషమించడంతో, కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌లోని ఒక  ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వెంటిలేటర్‌పై ఉంచి  చికిత్స అందిస్తున్నారు.   అయితే ముద్రగడ పద్మనాభం 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడులపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా.. 2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ గెలవకపోతే తన పేరును  ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని అప్పట్లో శపథం చేశారు. ఆ ఎన్నికలలో  వైసిపి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో ముద్రగడ పద్మనాభం తన మాట నెరవేర్చుకుని తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకున్నారు.  2024 ఎన్నికల ఘోర పరాభవం తర్వాత కూడా ఆయన జగన్ వెంటే నిలిచారు.  జగన్ కోసం ముద్రగడ తన సొంత సామాజిక వర్గం వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. అటువంటి ముద్రగడ పద్మనాభం తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స పొందుతుంటే.. జగన్ కనీసం ఆయనను పరామర్శిండానికి కూడా రాకపోవడంపై రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది.  తన కోసం సర్వస్వం ఒడ్డిన నేతను చూడటానికి జగన్ స్వయంగా రాకుండా..  సజ్జల రామకృష్ణారెడ్డి పంపించడంపై వైసీపీయులలోనే ఆగ్రహం వ్యక్తం అవుతోంది.  ముద్రగడ పద్మనాభం కుమార్తె  క్రాంతి  జగన్ తీరుపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాపాయ స్థితిలో వెంటిలేటర్‌పై ఉన్న తన తండ్రిని చూడటానికి కూడా రాకుండా జగన్ ముఖం చాటేయడం దారుణమని విమర్శించారు.   గతంలో ముద్రగడ చేసిన సేవలను, వైసిపి కోసం ఆయన పడ్డ కష్టాన్ని జగన్  విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  నమ్మి వచ్చిన  నేతలను జగన్ ఇలాగే నట్టేట ముంచుతారంటూ జగన్ పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
ALSO ON TELUGUONE N E W S
యంగ్ హీరోయిన్ రాశి సింగ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'గాసిప్'. వైభవ్ కౌండిన్య రచన, దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను యతి నిర్మించారు. మహేష్ యడ్లవల్లి హీరోగా నటించగా.. విజయ్ ఆదిరాజు, రవి వర్మ, గురు చరణ్, 30 ఇయర్స్ పృథ్వీ ఇతర కీలక పాత్రలు పోషించారు. జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? (Gossip Movie Review) కథ:  తల్లి లేని అజంత (రాశి సింగ్)ను తండ్రి రమేష్ (విజయ్ ఆదిరాజు) ఎంతో గారాబంగా పెంచుతాడు. చదువు పూర్తైన తర్వాత స్నేహితులతో సరదాగా డైలీ టైమ్ స్పెండ్ చేయడం ఆమెకు అలవాటు. వీణ వాయిస్తుంది. అందులో ఉన్నత స్థాయికి వెళ్ళాలనేది ఆమె కల. అయితే, పనిపాట లేని కొందరు వ్యక్తులు టీ కొట్టు దగ్గర చేసే 'గాసిప్స్' వల్ల, దొంగ స్వామీజీ రోనీ (30 ఇయర్స్ పృథ్వీ) చెప్పిన జాతకం వల్ల మేనమామ (రవి వర్మ) ఆమె క్యారెక్టర్‌ను తప్పుగా అర్థం చేసుకుంటాడు.  తేజ (మహేష్ యడ్లవల్లి)ను ప్రేమించిన సంగతి తండ్రికి చెబుతామని అజంతా అనుకుంటుండగా.. ప్రవీణ్ (గురు చరణ్) సంబంధం ముందు పెడతాడు తండ్రి. ఆ ఇద్దరిలో ఎవరిని అజంతా పెళ్లి చేసుకుంది? ఒక్క రాత్రిలో ఆమె జీవితం ఊహించని మలుపు తిరగడం వెనుక కారణం ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమాలో దొరుకుతాయి. విశ్లేషణ:  సమాజంలో ఒకరి వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ మాట్లాడటం ఎంతటి ప్రమాదకరమో దర్శకుడు వైభవ్ కౌండిన్య చక్కగా చూపించారు. ఎక్కడా అసభ్యత లేకుండా కుటుంబ సమేతంగా చూడదగ్గ రీతిలో మంచి సందేశాన్ని అందించారు. గాసిప్ అనేది మూడు అక్షరాలు కావచ్చు. కానీ, సమాజంలో వాటి వల్ల కొన్నిసార్లు ఒకరి జీవితం ఎంత మారుతుందో చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. దర్శకుడు తన తొలి చిత్రానికే సామాజిక బాధ్యత ఉన్న కథను ఎంచుకోవడం ప్రశంసనీయం. కథలోని ప్రతి పాత్ర, ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆలోచింపజేసేలా సాగుతుంది. టీ కొట్టు దగ్గర కుర్రాళ్ళు నోటికి వచ్చింది వాగడం రెండు నిమిషాల వినోదం కావచ్చు. ఇష్టం వచ్చినట్టు రోనీ స్వామి జాతకం చెప్పడం అతడికి పబ్లిసిటీ కావచ్చు. కానీ వాళ్ళు మాట్లాడే అబద్ధాలు, గాసిప్స్ వల్ల మనుషుల జీవితాలు నాశనం అవుతాయనేది చక్కగా చూపించారు వైభవ్ కౌండిన్య. ఎలాంటి ఆధారాలు లేకుండా కొందరు చేసే పుకార్లు హీరోయిన్ జీవితాన్ని ఊహించని మలుపు తిప్పుతాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఆ గాసిప్‌లను నమ్మడంతో పరిస్థితులు మరింత క్లిష్టంగా మారతాయి. చివరకు నిజం ఎలా బయటపడింది? అనే అంశంతో సినిమా ముందుకు సాగుతుంది.  దర్శకుడు కథను మెలో డ్రామాగా మార్చలేదు. సహజమైన సంభాషణలతో చాలా సరళంగా సినిమాను ముందుకు నడిపించారు. ముఖ్యంగా టీ దుకాణాల వద్ద జరిగే గాసిప్ సంభాషణలను సమాజానికి అద్దం పట్టేలా చూపించారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చెప్పే జాతకాలు, నిరాధారమైన ప్రచారాలు ఎంత ప్రమాదకరమో స్పష్టంగా చూపించారు. అలాగే జాతకాల పేరుతో ప్రజలను మోసం చేసే నకిలీ స్వాములపై కూడా సెటైర్లు బాగా పేలాయి. అయితే నెమ్మదిగా సాగే కథనం, కొన్ని సాగదీత సన్నివేశాలు సినిమాకి కాస్త మైనస్ గా మారాయి.  శక్తికాంత్ కార్తీక్ సంగీతం కథ మూడ్‌కు తగ్గట్టు సాగుతుంది. సతీష్ సినిమాటోగ్రఫీ సహజత్వాన్ని నిలబెట్టగా, జై కుమార్ ఎడిటింగ్ కథను వేగంగా ముందుకు తీసుకెళ్లింది. నిర్మాణ విలువలు కూడా కథకు తగిన స్థాయిలో ఉన్నాయి. నటీనటుల పనితీరు: అందమైన, అమాయకమైన యువతిగా అజంతా పాత్రలో రాశి సింగ్ చక్కగా నటించారు. ఎటువంటి గ్లామర్ షో లేకుండా కథ మాత్రమే తెరపై కనిపించేలా రాశి సింగ్ నటన సాగింది. మహేష్ యడ్లపల్లి, గురు చరణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రవి వర్మ, విజయ్ ఆదిరాజు నటన కథకు బలాన్ని తీసుకొచ్చింది. ముఖ్యంగా రోనీ స్వామి పాత్రలో 30 ఇయర్స్ పృథ్వీరాజ్ వినోదాన్ని పంచారు. ఫైనల్ గా.. 'గాసిప్' వినోదం కోసం తీసిన సినిమా కాదు. మనం విన్నది నిజమని నమ్మే ముందు.. ఒక్కసారి ఆలోచించాలనే సందేశాన్ని అందించిన సినిమా. మంచి సందేశంతో కూడిన భావోద్వేగ కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. రేటింగ్‌: 2.5/5 Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.  
Veteran filmmaker, actor and writer K. Bhagyaraj, widely regarded as one of Tamil cinema's greatest storytellers, passed away on Saturday following a cardiac arrest. He was 73. Reports suggest he was rushed to a private hospital in Chennai after collapsing at his residence, where doctors declared him dead. His sudden demise has left the South Indian film industry and millions of cinema lovers in mourning. Bhagyaraj began his career as an assistant to legendary filmmaker Bharathiraja before making a remarkable mark as a director, writer and actor. Fondly called the "Screenplay King," he revolutionized commercial cinema with his intelligent screenplays, relatable middle-class stories and unique blend of humour and emotion. His films continue to be studied by aspiring filmmakers for their innovative storytelling. During his illustrious career spanning nearly five decades, Bhagyaraj directed over 25 films and acted in more than 75 movies. Besides filmmaking, he was also a producer, composer, novelist and magazine editor. Several of his blockbuster Tamil films were remade in Telugu and Hindi, making him a celebrated name across Indian cinema. Bhagyaraj remained active in films even in recent years, appearing in character roles and mentoring young talent. His passing marks the end of an era, with the film fraternity paying heartfelt tributes to a filmmaker whose legacy will continue to inspire generations of writers and directors. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
  ప్రముఖ హీరో, లెజండ్రీ దర్శకుడు, లెజండ్రీ రచయిత 'భాగ్యరాజ్'(Bhagyaraj)గారు నిన్న రాత్రి గుండెపోతో మరణించారు. తెలుగు పేక్షకులకి 'భాగ్యరాజాగా నాలుగుదశాబ్దాల నుంచే పరిచయస్తులు. తెలుగు నాట ఎంతో మంది దర్శకులు 'భాగ్యరాజా'కి వీరాభిమానులు.  దక్షిణాది సినిమా ప్రపంచంలో స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా, కథల రారాజుగా  ఆయన సృష్టించిన ప్రభంజనం సామాన్యమైనది కాదు. కేవలం 16 ఏళ్ల వయసులోనే సినీ రంగంలోకి అడుగుపెట్టి, భారతీరాజా వంటి దిగ్గజ దర్శకుల వద్ద శిష్యరికం చేసి, ఆపై తానే ఒక  బ్రాండ్‌గా ఎదిగారు. ముఖ్యంగా 1980  90ల కాలంలో ఆయన అందించిన సున్నితమైన కుటుంబ కథలు, సామాజిక అంశాలు, హాస్యం కలబోసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద 100 శాతానికి పైగా విజయాలని  నమోదు చేశాయి. తమిళంలో ఆయన కథ రాసినా, దర్శకత్వం వహించినా ఆ సినిమాలు తెలుగు ప్రేక్షకుల హృదయాలను కూడా కొల్లగొట్టాయి. అందుకే టాలీవుడ్ అగ్ర హీరోలు, దర్శకులు ఆయన సినిమాలను తెలుగులోకి రీమేక్ చేయడానికి అమితమైన ఆసక్తి చూపించారు. అలా తెలుగు చిత్రసీమలో రీమేక్ అయి ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన భాగ్యరాజ్ చిత్రాల వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. భాగ్యరాజ్ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచిన క్లాసిక్ చిత్రం 'అంతే 7 నాట్కల్' (Andha 7 Naatkal). ఒక ప్రేమికుడు తన ప్రియురాలి పెళ్లి వేరొకరితో అయిపోయినప్పుడు, ఆమె పసుపు కుంకుమల కోసం త్యాగం చేసే భావోద్వేగ భరితమైన కథ ఇది. ఈ చిత్రాన్ని తెలుగులో విశ్వవిఖ్యాత దర్శకుడు బాపు 'రాధా కళ్యాణం' (1981) పేరుతో రీమేక్ చేశారు. చంద్రమోహన్, రాధిక ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా తెలుగులో 175 రోజులకు పైగా ఆడి క్లాసిక్ హిట్ స్టేటస్ అందుకుంది. ఇదే సినిమాని  హిందీలో అనిల్ కపూర్ హీరోగా 'వో సాత్ దిన్'గా రీమేక్ చేయగా అక్కడ కూడా భారీ విజయాన్ని సాధించడం విశేషం. భాగ్యరాజ్ మార్క్ ఎమోషన్ ఎంత పవర్‌ఫుల్ అనేదానికి ఈ ఒక్క సినిమానే నిలువెత్తు సాక్ష్యం. గ్రామీణ నేపథ్యంలో పెళ్లి, మొగుడు పెళ్లాల మధ్య వచ్చే చిన్నపాటి అపార్థాలను హాస్యస్ఫోరకంగా చూపిస్తూ భాగ్యరాజ్ రూపొందించిన 'తూరల్ నిన్ను పోచ్చు' (Thooral Ninnu Pochchu) చిత్రం తమిళంలో కనకవర్షం కురిపించింది. ఈ సినిమాను తెలుగులో సీనియర్ నటుడు శోభన్ బాబు హీరోగా, సుహాసిని హీరోయిన్‌గా 'పెళ్లి చూపులు' (1983) అనే పేరుతో రీమేక్ చేశారు. మధ్యతరగతి కుటుంబాల భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి వినోదాత్మక అనుభూతిని పంచింది. కేవలం ఇవే కాకుండా, భాగ్యరాజ్ దర్శకత్వం వహించిన 'సువరిల్లాద చిత్రంగళ్' తెలుగులో 'పేదల బ్రతుకులు'గా, 'ఒరు కై ఓసై' చిత్రం 'ప్రణయ గీతం'గా రీమేక్ అయ్యాయి. అలాగే ఆయన కథ అందించిన ఎన్నో చిత్రాలు తెలుగులోకి అనువాదమై, రీమేక్ అయి 80 శాతం కంటే ఎక్కువ సక్సెస్ రేటును సాధించాయి. అలాగే, ఉపాధ్యాయుడు మరియు విద్యార్థిని మధ్య సాగే సున్నితమైన ప్రేమకథతో భాగ్యరాజ్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ హిట్ 'సుందర కాండమ్' (Sundara Kandam). ఈ చిత్రం తమిళనాట మహిళా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని సరికొత్త రికార్డులను సృష్టించింది.  ఈ అద్భుత కథని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా, కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 'సుందరకాండ' (1992) పేరుతో రీమేక్ చేశారు. కాలేజీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ మ్యూజికల్ ఫ్యామిలీ డ్రామా తెలుగులో 100కు పైగా థియేటర్లలో నేరుగా 50 రోజులు, అనేక కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుని వెంకటేష్ కెరీర్‌లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీగా నిలిచింది. ఇందులోని పాటలు, కామెడీ ట్రాక్ ఇప్పటికీ బుల్లితెరపై విశేషమైన రేటింగ్‌లను సొంతం చేసుకుంటున్నాయి. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో వెంకటేష్, మీనా జంటగా వచ్చి సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన అబ్బాయి గారు కూడా తమిళంలో  భాగ్యరాజ్ హీరోగా, దర్శకుడిగా చేసిన 'ఎంగా చిన్న రాసా' మూవీనే. మోహన్ బాబు, ఈవివి కాంబోలోనే వచ్చిన 'అదిరింది అల్లుడు' మూవీ  కూడా భాగ్యరాజా చేసిన మూవీనే.ఇవే కాదు ఇలా ఎన్నో సినిమాలు, కథలు భాగ్యరాజా ప్రేరణతోనే తెరకెక్కి ఘన విజయాన్ని అందుకున్నాయి. ఈ విధంగా ఆయన  రాసుకునే  స్క్రీన్‌ప్లే లోని మ్యాజిక్, సామాన్యుడిని సైతం కట్టిపడేసే కథన శైలి టాలీవుడ్‌పై చెరపని ముద్ర వేసింది. నటుడుగా కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించారు.   
దక్షిణాది చిత్రపరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తనదైన విలక్షణమైన కథనాలు, అద్భుతమైన హాస్యం, గుండెకు హత్తుకునే కుటుంబ భావోద్వేగాలతో దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రేక్షకులను అలరించిన దిగ్గజ దర్శకుడు, నటుడు, స్క్రీన్‌ప్లే రచయిత కె. భాగ్యరాజ్ (K Bhagyaraj) ఇకలేరు. శనివారం (జూన్ 27, 2026) ఉదయం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 73 సంవత్సరాల వయసున్న భాగ్యరాజ్ తీవ్రమైన గుండెపోటు (కార్డియాక్ అరెస్ట్) రావడంతో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.  ఈ హఠాన్మరణ వార్త తెలియగానే కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమైంది. కేవలం కొన్ని రోజుల క్రితమే (జూన్ 10, 2026) ఆయన గురువు, లెజెండరీ దర్శకుడు భారతీరాజా మరణించిన సంగతి మరువక ముందే, ఇప్పుడు భాగ్యరాజ్ కూడా అనంత లోకాలకు వెళ్లిపోవడం చిత్రసీమను కోలుకోలేని దెబ్బ తీసింది. గురుశిష్యులిద్దరూ ఒకే నెలలో కన్నుమూయడం అభిమానులను కలచివేస్తోంది. భారతీయ చలనచిత్ర రంగంలో ముఖ్యంగా తమిళ చిత్రసీమలో భాగ్యరాజ్‌ను ‘స్క్రీన్‌ప్లే మన్నన్’ (చిత్రకథా చక్రవర్తి) అని పిలుచుకుంటారు. సినిమా కథనం ఎలా ఉండాలి, ప్రేక్షకుడిని ఎలా కట్టిపడేయాలనే విషయంలో ఆయన ఒక కొత్త ట్రెండ్‌ను సెట్ చేశారు. మధ్యతరగతి కుటుంబాల జీవన విధానం, నిత్యజీవితంలో ఎదురయ్యే సాధారణ సంఘటనలను సైతం అత్యంత ఆసక్తికరంగా వెండితెరపై ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత.  1979లో వచ్చిన ‘సువరిల్లాద చిత్రంగళ్’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన భాగ్యరాజ్, ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆయన అందించిన ‘మౌన గీతాలు’, ‘అంత 7 నాట్కల్’ (తెలుగులో రాధాకల్యాణం), ‘ముంధానై ముడిచ్చు’ (తెలుగులో మూడు ముళ్లు) వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా ఎవర్గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా లోపాలున్నప్పటికీ అందరికీ నచ్చేలా ఉండే విభిన్నమైన కథానాయకుడి పాత్రలను పోషించి నటుడిగానూ భారీ క్రేజ్ సంపాదించుకున్నారు. కె. భాగ్యరాజ్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే, ఆయనకు భార్య, ప్రముఖ నటి పూర్ణిమ జయరామ్ ఉన్నారు. అలాగే వీరికి ఇద్దరు సంతానం కాగా, కుమారుడు శాంతను భాగ్యరాజ్ ప్రస్తుతం కోలీవుడ్‌లో నటుడిగా కొనసాగుతున్నారు, కుమార్తె శరణ్య భాగ్యరాజ్ కూడా సినిమాల్లో నటించారు.   
ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ (Baahubali) సిరీస్ మరోసారి ప్రపంచవ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు సినిమా ఖ్యాతిని, మార్కెట్ పరిధిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలో అమరేంద్ర బాహుబలిగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), దేవసేనగా లేడీ సూపర్ స్టార్ అనుష్క శెట్టి (Anushka Shetty) చూపించిన నటన, వెండితెరపై వారి మధ్య పండిన అద్భుతమైన కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ సినిమా విడుదలై 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో, మేకర్స్ ‘బాహుబలి: ది టార్చ్‌బేరర్’ అనే పేరుతో ఒక క్రేజీ డాక్యుమెంటరీని రూపొందించారు. ప్రస్తుతం ఈ డాక్యుమెంటరీకి సంబంధించిన విజువల్స్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. ఈ డాక్యుమెంటరీలో బాహుబలి సినిమా మేకింగ్‌ వెనుక ఉన్న ఎన్నో తెలియని రహస్యాలు, ఆసక్తికరమైన సంఘటనలతో పాటు, నటీనటులు షూటింగ్ సమయంలో పంచుకున్న ఎమోషనల్ జర్నీని కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, నిర్మాత శోభు యార్లగడ్డ ఇలా చిత్ర బృందమంతా తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చెప్పిన విషయాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అయితే, ఈ డాక్యుమెంటరీ మొత్తంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను, ముఖ్యంగా ప్రభాస్-అనుష్క అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రధానాంశం ఒకటుంది. చాలా కాలం తర్వాత ప్రభాస్, అనుష్క మళ్లీ ఒకే ఫ్రేమ్‌లో పక్కపక్కనే కనిపించడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. గత కొన్ని ఏళ్లుగా ప్రభాస్, అనుష్కల వివాహం గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ, తామిద్దరం కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని వారిద్దరూ పలు సందర్భాల్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ, వీరిద్దరినీ ఒకే స్క్రీన్‌పై చూడాలని కోట్లాది మంది ఫ్యాన్స్ ఎల్లప్పుడూ ఆశపడుతుంటారు. తాజాగా విడుదలైన విజువల్స్‌లో అనుష్క ట్రెడిషనల్ గ్రీన్ కలర్ దుస్తుల్లో ఎంతో అందంగా మెరిసిపోగా, ప్రభాస్ స్టైలిష్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో రాయల్ లుక్‌తో అలరించాడు. చాన్నాళ్ల తర్వాత ఈ టాలీవుడ్ మోస్ట్ ఫేవరెట్ జోడీ ఒకే చోట కూర్చొని కెమెరా ముందుకు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అరుదైన దృశ్యాలను చూసిన అభిమానులు సోషల్ మీడియా వేదికగా విపరీతంగా షేర్లు చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. "దయచేసి మా అన్నా వదినలకి ఎవరైనా దిష్టి తీయండి", "ఇద్దరినీ ఇలా ఒకే ఫ్రేమ్‌లో చూస్తుంటే కళ్లు చెదురుతున్నాయి", "మా ఆల్‌టైమ్ ఫేవరెట్ జంట మళ్లీ కలిసింది" అంటూ నెటిజన్లు ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు.  ప్రస్తుతం వీరిద్దరి కెరీర్ విషయానికి వస్తే, అనుష్క శెట్టి సినిమాల వేగాన్ని కాస్త తగ్గించగా, ప్రభాస్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా దూసుకుపోతున్నాడు. ప్రభాస్ నటిస్తున్న 'ఫౌజీ', 'స్పిరిట్', 'కల్కి2' సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి.  
స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లేటెస్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో ఘన విజయం సాధించింది. రిలీజైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 50 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ గ్రాండ్ సక్సెస్‌తో చిత్ర యూనిట్ ఎంతో సంతోషంలో మునిగిపోయింది. తాజాగా వైజాగ్ లో నిర్వహించిన ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మూవీ టీమ్ అంతా సందడి చేసింది. ఈ వేడుకలో సమంత భర్త, ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరు ‘మా ఇంటి బంగారం’ సీక్వెల్‌పై అఫీషియల్ క్లారిటీ ఇచ్చి అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. వైజాగ్ సక్సెస్ మీట్ వేదికగా రాజ్ నిడిమోరు మాట్లాడుతూ ‘మా ఇంటి బంగారం’ సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందని, అందుకే ఈ కథకు సీక్వెల్ చేయాలని నిర్ణయించుకున్నామని ప్రకటించారు. తాను, డీకే తెలుగులో ఎప్పటి నుంచో సినిమా చేయాలని హైదరాబాద్ వచ్చామని, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని గుర్తు చేసుకున్నారు. ఫైనల్‌గా తెలుగులో సినిమా చేసే ఛాన్స్ వచ్చిందని, మొదటి సినిమాకే తెలుగు ప్రేక్షకులు ఇంతటి భారీ విజయాన్ని అందిస్తారని అసలు ఊహించలేదని ఆనందం వ్యక్తం చేశారు. ‘మా ఇంటి బంగారం 2’కి సంబంధించిన మెయిన్ ఐడియా ఇప్పటికే లాక్ అయిందని, రాబోయే రెండేళ్లలో ఈ క్రేజీ సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ సెకండ్ పార్ట్‌ను కూడా సేమ్ టీమ్‌తోనే ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే వేదికపై సమంత మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. ప్రేక్షకులు ఈ సక్సెస్‌తో తనకు జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గిఫ్ట్ ఇచ్చారని అన్నారు. సినిమా రిలీజ్‌కు ముందు థియేటర్లలో కనీసం ఒక్క టికెట్ అయినా తెగుతుందా అనే తీవ్రమైన భయం తనను వెంటాడిందని ఓపెన్ అయ్యారు. ఎందుకంటే వెండితెరపై తన సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు కావడంతో, ప్రేక్షకులు తనను గుర్తు పెట్టుకుంటారా లేదా అనే సందేహం కలిగిందని చెప్పారు. అసలు ఈ ప్రాజెక్ట్ చేయడం తన వల్ల కాదని రాజ్ నిడిమోరుతో అన్నానని, కానీ ఆయన ‘నువ్వు ఒక్క సినిమా చెయ్’ అంటూ తనను ఎంతగానో కన్విన్స్ చేసి, వెన్నుతట్టి ప్రోత్సహించారని సమంత చెప్పుకొచ్చారు. ఇంతటి భారీ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకులందరి సినిమా అని కొనియాడారు. దర్శకురాలు నందిని రెడ్డి మాట్లాడుతూ ఈ సినిమా కేవలం రివ్యూస్ వల్ల కాకుండా, థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు చూసి సోషల్ మీడియాలో పెట్టిన పాజిటివ్ పోస్టులు, మౌత్ టాక్ వల్లే ఇంతలా నిలబడిందని సంతోషాన్ని పంచుకున్నారు.  ‘మా ఇంటి బంగారం’ చిత్రంలో సమంత నటనకు ఆడియన్స్ ఫిదా అవ్వడమే కాకుండా విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని ఎమోషనల్ సీన్లు, హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులు సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచాయి. ఈ చిత్రంలో సమంతతో పాటు దిగంత్, మంజుషా, గుల్షన్ దేవయ్య, గౌతమి, శ్రీముఖి, సీనియర్ నటి లక్ష్మి కీలక పాత్రలు పోషించగా, ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ సినిమా సక్సెస్‌లో కీలక పాత్ర పోషించింది.  
  మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన ల ‘పెద్ది' (peddi)బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల వేట కొనసాగిస్తోంది. జూన్ 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం కేవలం 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల క్లబ్‌లో చేరి టాలీవుడ్‌లో సరికొత్త చరిత్ర సృష్టించిందని చెప్పవచ్చు . దాదాపు 250 కోట్ల నుండి 350 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ క్రీడా నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే, గత కొన్ని రోజులుగా ఈ సినిమా వసూళ్లు తగ్గాయంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని నెగిటివ్ రూమర్స్, దుష్ప్రచారం ప్రచారంలోకి వచ్చాయి. ఈ బాక్సాఫీస్ నెగిటివ్ రూమర్లపై టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ తీవ్రంగా స్పందించారు. ‘పెద్ది’ చిత్రం కలెక్షన్లపై వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అబద్ధాలు.  పరిశ్రమలో కొంతమంది కావాలనే పెద్దిపై విషప్రచారం చేస్తున్నారు.  కొంతకాలంగా టాలీవుడ్‌లో సరైన పెద్ద సినిమాలు లేక, థియేటర్ల రన్నింగ్ సరిగా సాగక ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడి, థియేటర్లన్నీ వెలవెలబోయిన తరుణంలో ‘పెద్ది’ ఊపిరి పోసింది. ఈ చిత్రం సాధిస్తున్న అసాధారణ విజయాలు ఎగ్జిబిటర్లలో సరికొత్త జోష్ నింపాయి రామ్ చరణ్ తన రెజ్లర్ రోల్ కోసం ఎంతో కష్టపడటమే కాదు, క్యారక్టర్ కి పూర్తి స్థాయిలో జీవం పోశారని ఆయన కొనియాడారు. ఇదే ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మునుపటి చిత్రం ‘గేమ్ ఛేంజర్’ పరాజయంపై కూడా నట్టి కుమార్ నిజాయతీగా మాట్లాడారు. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడానికి తప్పుడు రిలీజ్ డేట్, పబ్లిసిటీ లోపమే కారణం. గేమ్ ఛేంజర్’ కోసం కూడా రామ్ చరణ్ తన ప్రాణం పెట్టాడు. కానీ మేకర్స్ సరైన పబ్లిసిటీ చేయకుండా అన్యాయం చేసారు. అలాంటి తప్పులు ‘పెద్ది’ విషయంలో జరగలేదని, అందుకే జనాలు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు సన మేకింగ్ స్టైల్, ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతం ఈ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. జాన్వీ కపూర్ గ్లామర్, శివ రాజ్‌కుమార్, జగపతి బాబు కూడా తమ పెర్ఫార్మ్ తో  ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 400 కోట్ల మార్కుని  దాటి దూసుకుపోతున్న పెద్ది కలెక్షన్లని తక్కువ చేసి చూపించడానికి చిత్ర పరిశ్రమలోని కొందరు ఇండస్ట్రీ పెద్దలు ఇండైరెక్ట్‌గా కుట్రలు చేస్తున్నారని నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బాక్సాఫీస్ వద్ద నిజమైన వసూళ్లు అద్భుతంగా ఉన్నాయని, థియేటర్ల యాజమాన్యాలు ఈ సినిమా తెచ్చిన లాభాలతో సంతోషంగా ఉన్నాయని చెబుతూ, మెగా అభిమానులు ఇలాంటి ఫేక్ రూమర్లని నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.    
Ram Pothineni has spoken out against the growing menace of drug abuse, urging youngsters not to mistake substance use for a symbol of confidence or a modern lifestyle. Addressing students at a recent awareness programme, the actor backed the Telangana Government's Anti-Drug Eagle Force initiative and stressed that overcoming addiction begins with individual responsibility. Ram shared a conversation he once had with a recovering drug addict abroad, recalling how the person admitted that living with addiction had become more frightening than death itself. The incident, he said, changed his perspective on the devastating impact drugs can have on a person's life. Drawing a parallel with his role in Jagadam, Ram said the film reflected how difficult it is to escape the cycle of addiction once someone gets trapped. He cautioned students against experimenting with drugs, saying that a single wrong decision could have long-lasting consequences. In a lighter yet meaningful moment, Ram gave a new interpretation to the popular phrase "YOLO." Instead of "You Only Live Once" being an excuse for reckless choices, he encouraged students to use it as a reason to reject drugs, reminding them that life should be valued and lived in a healthy way. The actor also emphasized that while initiatives like the Anti-Drug Eagle Force can provide support, lasting change is only possible when individuals make a conscious decision to stay away from addiction and help those around them do the same. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.
Adivi Sesh has offered fans a glimpse into his preparations for G2, the much-awaited sequel to the 2018 spy thriller Goodachari. The actor shared a series of behind-the-scenes pictures on social media, revealing a clean-shaven makeover as he gets ready to begin the film's next major shooting schedule in July. The new look has already caught the attention of fans, with Sesh appearing noticeably leaner as he continues physical training for his role. The pictures also show him participating in script discussions and rehearsals with members of the cast, indicating that pre-production is in full swing ahead of the extensive schedule. Sharing the images, Sesh captioned them, "The calm before the Storm... before #G2 shoot in July," hinting that the team is gearing up for one of the film's biggest phases. Directed by Vinay Kumar Sirigineedi, G2 is being mounted as a pan-Indian spy action thriller. The film stars Wamiqa Gabbi as the female lead, while Emraan Hashmi plays a key role.  Produced by TG Vishwa Prasad under PMF Studios in association with Abhishek Agarwal, G2 remains one of the most anticipated Telugu films currently under production. With filming set to resume next month, fans are now eager to see more updates from the ambitious spy thriller. Disclaimer: This article is based on discussions and information shared across publicly available sources and social media. Interpretations remain those of the users involved. Readers are encouraged to exercise discretion before drawing conclusions.   https://www.instagram.com/p/DaDLWtbCc3A  
  సమంత(Samantha).. ఈ పేరుకి తెలుగు సినిమా ప్రేక్షకులకి ఉన్న అనుబంధం యొక్క వయసు దశాబ్దంన్నర పైనే. సమంత మలయాళీ కదా అన్నా కూడా అభిమానులు, ప్రేక్షకులు తెలుగు అమ్మాయే అని గొడవపడే పరిస్థితి. అంతలా తెలుగుతనం ఉట్టి పడే పెర్ఫార్మ్ తో  దూసుకుపోతూ వస్తుంది. ప్రెజెంట్ 'మా ఇంటి బంగారం' తో సందడి చేస్తూ రికార్డు కలెక్షన్స్ ని రాబట్టి తన స్టామినా ఏ పాటిదో సెల్యులాయిడ్ కి మరో సారి చాటి చెప్తుంది. రీసెంట్ గా సమంత భర్త ప్రముఖ దర్శకుడు రాజ్ డికే  ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు సమంత సినిమాలు చేయనని చెప్పింది. కానీ నేనే ఒప్పించి 'మా ఇంటి బంగారం' చేయించాను అని చెప్పాడు. దీంతో సమంత చివరి మూవీ 'మా ఇంటి బంగారం' అని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పాటు నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. సమంత ఆల్రెడీ ప్రెగెన్సీ అనే విషయం తెలిసిందే. Also read: Nandamuri: నందమూరి ఫ్యాన్స్ కి షాక్! ఈ ఏడాది మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనా!    
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
  మనిషి జీవితం చాలా విచిత్రంగా ఉంటంది. కొన్ని విషయాలు దాచుకోవాలి అనుకుంటాం, కొన్ని విషయాలు అందరితో చెప్పుకోవాలి అనుకుంటాం,  మరికొన్ని విషయాలు ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పకూడదు అనే సందిగ్ధంలో పడిపోతుంటాం.  అయితే ప్రతి మనిషి తన జీవితంలో కొన్ని విషయాలను ఎవరికీ చెప్పకూడదు అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.  మనిషి జీవితంలో ఏ విషయాలు ఇతరులకు చెప్పకూడదు? ఎందుకు చెప్పకూడదు? తెలుసుకుంటే.. ఆర్థిక పరిస్థితి గురించి  ఆదాయం, బ్యాంకు బ్యాలెన్స్, పెట్టుబడులు లేదా ఏ రకమైన లోన్ గురించైనా సమాచారాన్ని ఎవరితోనైనా పంచుకోవడం ప్రమాదకరం కావచ్చు.  కొన్నిసార్లు ఇలాంటి  సమాచారాన్ని చాలా మంది పుకారు అని వ్యక్తిత్వాన్ని చిన్నతనం చేయడం, లేదా సమాచారాన్ని అనుసరించి తప్పుడు పనులకు పాల్పడటం జరిగే అవకాశం ఉంటుంది.  ఉదాహరణకు.. ఏదైనా పెద్ద ఆస్తిని కొనుగోలు చేశారని లేదా ఏదైనా పెద్ద వస్తువు లేదా బంగారం లాంటివి కొనుగోలు చేశారని  ఎవరికైనా చెబితే..అది కాస్తా అందరికీ తెలుస్తూ చివరికి  దొంగతనం లేదా మోసపోవడానికి  దారితీయవచ్చు. అందువల్ల, ఆర్థిక విషయాలలో గోప్యతను పాటించడం ఎల్లప్పుడూ సురక్షితం. ఆరోగ్యం, వైద్య సమాచారం.. ఆరోగ్యం,  మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమాచారం చాలా సున్నితమైనది.  తీవ్రమైన అనారోగ్యాలు, మందుల అవసరాలు లేదా మానసిక ఆరోగ్య సమస్యలను నమ్మకమైన వ్యక్తికి లేదా వైద్యుడికి మాత్రమే చెప్పడం మంచిది.   ఉదాహరణకు..  దీర్ఘకాలిక అనారోగ్యం ఉందని ఎవరికైనా చెబితే.. ఆ విషయం తప్పుడు వ్యక్తుల చేతికి వెళితే సామాజికంగా లేదా వృత్తిపరంగా నష్టం చేకూరే స్థితికి దారితీయవచ్చు. ఇష్టమైన, ఇష్టం లేని విషయాలు.. మన వ్యక్తిగత ఇష్టాయిష్టాలు కూడా కొన్నిసార్లు ఇతరుల నుండి వ్యంగ్యానికి లేదా విమర్శకు మూలంగా మారవచ్చు.  వ్యక్తిగత ఇష్టాఇష్టాలను ఇతరులకు చెప్పినప్పుడు వాటిని ఇతరులు తప్పుగా అర్థం చేసుకుంటే  ఎగతాళి చేయవచ్చు. కాబట్టి,  ఇష్టాయిష్టాలను నమ్మకమైన స్నేహితులకు మాత్రమే తెలియజేయండి. రిలేషన్స్, పర్సనల్ లైఫ్.. రిలేషన్స్ గురించి,  వ్యక్తిగత విషయాల గురించి బహిరంగపరచడం  గోప్యతకు భంగం కలిగించవచ్చు.  ఉదాహరణకు.. ఒక వివాదాన్ని లేదా కుటుంబ సమస్యను సోషల్ మీడియాలో లేదా మూడవ వ్యక్తితో పంచుకోవడం  ప్రతిష్టను దెబ్బతీస్తుంది. అలాగే  ఆత్మగౌరవానికి భంగం కలిగేలా చేస్తుంది.  అంతేకాదు..  బంధాల మధ్య దూరాన్ని కూడా పెంచుతుంది.                                 *రూపశ్రీ.
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి ఎక్కువుగా  కుళ్ళిపోతాయి.  ఇది చాలా మంది ఎదుర్కునే  సాధారణ సమస్య. వాటిని సరిగ్గా నిల్వ చేయడం ద్వారా పాడవకుండా నివారించవచ్చు. అందుకోసం టమాటాలను ఎలా నిల్వ చేయాలి తెలుసుకుంటే.. పచ్చి టమాటాలు.. టమాటా పూర్తిగా పండకపోయినా, ఇంకా కొంచెం గట్టిగా ఉంటే, దానిని గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసుకోవచ్చు. పండని టమాటాలను డైరెక్ట్ సన్ లైట్ కు  దూరంగా ఉంచాలి. పచ్చి గా ఉన్నవి, పూర్తీగా  పండని టమాటాలను ఫ్రిజ్‌లో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి  రుచిని కోల్పోయి, సరిగ్గా పండకుండా ఉంటాయి. పండిన టమోటాలు.. టమోటాలు పూర్తిగా పండి, ఎర్రగా ఉంటే, అవి గట్టిగా ఉంటే..  వాటిని గది ఉష్ణోగ్రత వద్ద కౌంటర్‌పై నిల్వ చేయాలి.  ఈ టమోటాలను 1 నుండి 2 రోజుల వరకు ఉపయోగించవచ్చు. టమోటాలను కాడ భాగం కిందికి ఉండేలా నిల్వ చేయాలి. దీనివల్ల కాడ చుట్టూ ఉన్న తేమ బయటకు పోతుంది , అవి త్వరగా వాడిపోకుండా  ఉంటాయి. టమోటాలను ఒకదాని మీద ఒకటి కాకుండా అన్నింటికి పక్కన పక్కన ఉంచి నిల్వ చేయాలి. బాగా పండిన టమోటాలు.. టమోటాలు బాగా పండితే పాడైపోతాయని చాలామంది భయపడతారు. వాటిని రిఫ్రిజిరేటర్‌లోని చల్లదనంలో ఉంచడం వల్ల పండే ప్రక్రియ నెమ్మదిస్తుంది. రిఫ్రిజిరేటర్ నుండి తీసిన వెంటనే టమోటాలను తినకూడదు. అవి గది ఉష్ణోగ్రతకు వచ్చినప్పుడు మాత్రమే తినాలి. ఇవి గుర్తుంచుకోవాలి.. టమోటాలను కడగకుండా, ఆరబెట్టకుండా ప్లాస్టిక్ సంచులలో నిల్వ చేయకూడదు. దీనివల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలు పండినప్పుడు, అవి ఇథిలీన్ వాయువును విడుదల చేస్తాయి. అందువల్ల, బాగా పండిన టమోటాలను ఎక్కువగా ఒకేచోట నిల్వ చేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. టమోటాలను అతి చల్లని ఉష్ణోగ్రతలలో నిల్వ చేయడం వాటి రుచిని పాడు చేస్తుంది. దీనివల్ల వాటి తొక్క బలహీనపడి, మరింత త్వరగా పాడైపోతాయి.                                         *రూపశ్రీ.
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా అనుకోవచ్చు. కానీ  కొందరు ప్రేమలో పదేపదే మోసపోతుంటారు. ఇలా పదే పదే  జరిగే మోసాలు దురదృష్టం వల్ల కాకుండా మనిషి చేసే  పొరపాటు వల్ల జరుగుతాయి. కొన్నిసార్లు, మనం తెలియకుండానే చేసే పొరపాట్లు పదేపదే మోసాలకు దారితీయవచ్చు. ప్రేమలో పదే పదే మోసపోయే వారు చేసే పొరపాట్లు ఏమిటో.. ఎందుకు జరుగుతాయో.. వివరంగా తెలుసుకుంటే.. హెచ్చరికలు.. ప్రేమలో మోసపోతున్నారని చెప్పడానికి కొన్ని వార్నింగ్ సిగ్నల్స్ తెలుస్తూ ఉంటాయి.  అబద్దాలు చెప్పడం, వింతగా ప్రవర్తించడం,  విషయాలు దాచడం,కేవలం మాటలు చెప్పడం,  చేతల్లో ఏమీ ఉండకపోవడం వంటివి ప్రేమలో మోసపోవడానికి హెచ్చరికలు. ఇవన్నీ చేసే వ్యక్తి ఏదో ఒకరోజు మోసం చేసే అవకాశం ఉంటుంది. ప్రాధాన్యత.. భాగస్వామిని సంతోషపెట్టాలనే కోరికలతో ఆత్మగౌరవాన్ని వదిలి  తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటే, అవతలి వ్యక్తి  తేలికగా తీసుకుంటారు. అందుకే తమను తాము ఎప్పుడూ  ప్రేమించుకుని, గౌరవించుకోవాలి. అది జరగనంత వరకు  అవతలి వ్యక్తి  విలువ ఇవ్వరు.  భాగస్వామి  విలువ ఇవ్వనప్పుడు,  ఎప్పుడైనా మోసం చేయగలరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ చాలా కీలకం. తొందరపాటు నిర్ణయాలు.. చాలాసార్లు, గతంలో  విడిపోవడం వల్ల కలిగిన బాధను తగ్గించుకోవడానికి లేదా తుడిచివేయడానికి,  ఆలోచించకుండా కొత్త సంబంధాలను వెతుక్కుంటారు.  సంబంధంలోకి వెళ్లడానికి  ఎప్పుడూ తొందరపడకూడదు, ఎందుకంటే ఇది  అవతలి వ్యక్తిపై మానసికంగా ఆధారపడేలా చేస్తుంది. గుడ్డి నమ్మకం..  భాగస్వామిని గుడ్డిగా నమ్మడం సరికాదు. ఒక సంబంధంలో ఓపెన్ గా మాట్లాడుకోవడం చాలా అవసరం.  భాగస్వామిని గుడ్డిగా కాకుండా, తార్కికంగా నమ్మాలి. ఏ సంబంధంలోనైనా నమ్మకం కాలక్రమేణా ఏర్పడుతుంది. భాగస్వామిని గుడ్డిగా నమ్మితే, మోసపోవచ్చు.                                     *రూపశ్రీ.
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న జీవనశైలి వ్యాధుల్లో డయాబెటిస్ ఒకటి. చాలా మంది రక్తంలో చక్కెర స్థాయిలను మాత్రమే నియంత్రిస్తే సరిపోతుందని భావిస్తారు. అయితే డయాబెటిస్ వల్ల గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు వంటి ముఖ్యమైన అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వీడియోలో ప్రముఖ వైద్య నిపుణుడు డా. హరిచరణ్ డయాబెటిస్‌కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను వివరించారు. ఈ వీడియోలో తెలుసుకునే విషయాలు: ✔ నార్మల్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎంత ఉండాలి? ✔ భోజనం తర్వాత షుగర్ స్థాయిలు ఎంత వరకు సాధారణంగా పరిగణిస్తారు? ✔ HbA1c అంటే ఏమిటి? ✔ HbA1c విలువల ఆధారంగా ప్రీ-డయాబెటిస్ మరియు డయాబెటిస్‌ను ఎలా గుర్తిస్తారు? ✔ ప్రీ-డయాబెటిస్ ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ✔ డయాబెటిస్ వల్ల గుండె జబ్బులు ఎందుకు వస్తాయి? ✔ సైలెంట్ హార్ట్ ఎటాక్ అంటే ఏమిటి? ✔ షుగర్ ఉన్నవారిలో హార్ట్ ఎటాక్ లక్షణాలు ఎందుకు స్పష్టంగా కనిపించకపోవచ్చు? ✔ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం? డయాబెటిస్ ఎక్కువ కాలం నియంత్రణలో లేకపోతే నరాల దెబ్బతినడం వల్ల కొంతమందిలో హార్ట్ ఎటాక్ వచ్చినా సాధారణ ఛాతినొప్పి కనిపించకపోవచ్చు. దీనినే "సైలెంట్ హార్ట్ ఎటాక్" అంటారు. అందుకే షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, HbA1c స్థాయిలను పర్యవేక్షించడం మరియు గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం. డయాబెటిస్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సరైన ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సూచనలతో నియంత్రిస్తే అనేక సమస్యలను నివారించవచ్చు. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!
ఈ రోజుల్లో, ఫిట్‌గా , ఆరోగ్యంగా ఉండటానికి చాలా మంది జిమ్‌కు వెళ్తున్నారు.  శరీరాకృతి మెరుగ్గా కనిపించాలని,  ఫిట్‌నెస్ కోసం చేసే ఈ ప్రయత్నంలో, చాలా మందికి తెలియకుండానే కొన్ని తప్పులు జరుగుతాయి. అవి వారి ఆరోగ్యం పై చాలా తీవ్రమైన ప్రభావం చూపుతాయి.  తెలియకుండా చేసే కొన్ని తప్పులు  కొన్ని సార్లు చాలా డేంజర్ గా మారతాయి.  ఫిట్‌నెస్ నిపుణుల ప్రకారం జిమ్ లో చేసే  ఒక పొరపాటు ప్రాణానికి ప్రమాదాన్ని కూడా తెచ్చిపెడుతుంది.  అలాంటి తప్పులేంటో తెలుసుకుంటే.. జిమ్ కు వెళ్ళినప్పుడు ఆ తప్పులు చేయకుండా జాగ్రత్త పడవచ్చు. పళ్లు బిగించడం.. జిమ్‌లో వ్యాయామం చేసేటప్పుడు చాలా మంది తెలియకుండానే పళ్ళు బిగిస్తారు లేదా కొరుకుతారు. బరువైన వెయిట్ లిఫ్టింగ్, పుష్-అప్స్, ప్లాంక్స్, డెడ్‌లిఫ్ట్స్ లేదా ఇతర శ్రమతో కూడిన వ్యాయామాలు చేసేటప్పుడు ఈ అలవాటు ప్రత్యేకంగా సాధారణం.   సమస్య.. ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, వ్యాయామం చేసేటప్పుడు  పళ్ళు బిగిస్తే, దవడ కండరాలు నిరంతరం ఒత్తిడికి గురవుతాయి. ఈ ఒత్తిడి క్రమంగా తలకు ఇరువైపులా ఉండే కణతల కండరాలకు , మెడ కండరాలకు వ్యాపిస్తుంది. దీని ఫలితంగా, వ్యాయామం తర్వాత తల బరువుగా అనిపించడం, ఒత్తిడి తలనొప్పులు , మెడ పట్టేయడం వంటివి జరుగుతాయి. దవడ , మెడ కండరాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. పళ్ళు బిగపట్టడం వల్ల  మెడ కండరాలు కూడా అనవసరంగా బిగుసుకుపోతాయి. దీనివల్ల మరుసటి రోజు మెడ బిగుసుకుపోవడం, నొప్పి , మెడను కదపడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు. ఈ సమస్య ఎవరికి వస్తుంది? బరువులు ఎత్తే వ్యక్తులు, కొత్తగా జిమ్‌కు వెళ్లేవారికి,  ఒత్తిడి లేదా ఆందోళన ఉన్న వ్యక్తులకు,  వ్యాయామం చేసేటప్పుడు తమ శరీరాన్ని అతిగా బిగుతుగా ఉంచుకునేవారికి ఇది వస్తుంది. వ్యాయామం తర్వాత మీకు తరచుగా తలనొప్పి, దవడ నొప్పి, చెవుల చుట్టూ ఒత్తిడి లేదా మెడ బిగుసుకుపోవడం వంటివి ఎదురైతే, అది కేవలం అలసట వల్ల మాత్రమే కాకుండా, వ్యాయామం చేసేటప్పుడు పళ్ళు కొరికే అలవాటు వల్ల కూడా కావచ్చు అనే  విషయాన్ని గుర్తుంచుకోవాలని ఫిట్‌నెస్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ చిన్న తప్పును సరిదిద్దుకోవడం చాలా మంచిది.                                      *రూపశ్రీ.
ప్రస్తుత జీవనశైలిలో అధిక బరువు మరియు బెల్లీ ఫ్యాట్ సమస్యలు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నాయి. ఎంత డైట్ చేసినా, ఎంత వ్యాయామం చేసినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో చాలామంది నిరుత్సాహానికి గురవుతున్నారు. అలాంటి వారికి ఉపయోగపడే కొన్ని సహజమైన ఆయుర్వేద చిట్కాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణుడు డా. చిట్టిబొట్ల మధుసూదన శర్మ ఈ వీడియోలో వివరించారు.  శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గించడానికి ఆహారపు అలవాట్లు, జీవనశైలి, జీర్ణవ్యవస్థ పనితీరు వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆయన చెబుతున్నారు.  అలాగే బరువు తగ్గాలంటే కేవలం మందులు లేదా ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా, సరైన ఆహారం, క్రమం తప్పని శారీరక వ్యాయామం, తగినంత నిద్ర కూడా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు సహజమైన ఆయుర్వేద పద్ధతులను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని ఈ వీడియోలో తెలుసుకోవచ్చు.  బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవాలని, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలని కోరుకునే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన ఆరోగ్య అవగాహన వీడియో ఇది. మీ ఆరోగ్య సమస్య ఏదైనా... మా హెల్త్ యూట్యూబ్ ఛానల్‌లో సీనియర్ డాక్టర్స్ చెప్పిన సలహాలు... సూచనలు ఉన్నాయి. మా యూట్యూబ్ ఛానల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 👉 TeluguOne Health సబ్‌స్క్రైబ్ చేయడం మర్చిపోకండి!